skill development
-
కేంద్ర సంప్రదింపుల కమిటీల్లో ఎంపీలకు చోటు
సాక్షి, న్యూఢిల్లీ/కాజీపేట రూరల్: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు లభించింది. టెక్స్టైల్స్ శాఖ కమిటీలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో మల్లు రవి, కడియం కావ్యలకు అవకాశం కల్పిస్తూ ఆయా మంత్రిత్వ శాఖలు గురువారం ఉత్తర్వులు జారీ చేశాయి. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీకి చైర్మన్‌గా ఆ శాఖ మంత్రి గిరిరాజు సింగ్ వ్యవహరించనుండగా, సభ్యునిగా చామలకు అవకాశం దక్కింది.ఈ కమిటీలో సహాయ మంత్రి పవిత్రతో పాటు ఎనిమిది మంది లోక్‌సభ, నలుగురు రాజ్యసభ, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి.. మొత్తం 14 మంది సభ్యులుగా ఉన్నారు. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్ సంప్రదింపుల కమిటీలో ఎంపీలు మల్లు రవి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్యలకు చోటు దక్కింది. కమిటీకి కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి ఏడుగురు చొప్పున 14 మంది, ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 16 మంది సభ్యులతో ఈ కమిటీ పని చేయ నున్నట్లు ఆయా మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి. స్కిల్ డెవలప్మెంట్కు కృషి సికింద్రాబాద్ రైల్ నిలయంలో గురువారం దక్షిణ మ«ధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎ.కె.జైన్‌తో తెలంగాణ, కర్ణాటక ఎంపీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. -
కొత్తగా 60 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం భివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని యువతకు స్కిల్‌కోర్సులు అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థ)లను ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)లుగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఏటీసీలు పరిమిత సంఖ్యలో ఉండగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి చొప్పున ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏటీసీలు లేని సెగ్మెంట్లను గుర్తిస్తూ... అక్కడ కొత్తగా వాటి ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో 65 ఏటీసీలున్నాయి.ఒకట్రెండు చోట్ల రెండేసి ఏటీసీలు ఉండగా, 60 నియోజకవర్గాల్లో మాత్రం వీటి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ఏటీసీలు లేని చోట కొత్తగా నెలకొల్పేందుకు కారి్మక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్థల లభ్యత, ఇతర వసతులను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రస్తుతం వరంగల్ రీజియన్ పరిధిలో 35, హైదరాబాద్ రీజియన్ పరిధిలో 30 ఏటీసీలు ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్‌లో ఉన్న వాటిల్లో అత్యాధునిక ట్రేడ్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ జిల్లాలోని ఆరు ఏటీసీలను ఇప్పటికే మారుతి, హ్యుందాయ్, ఏషియన్ పెయింట్స్ లాంటి సంస్థలు దత్తత తీసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లోని ట్రేడ్లలో చేరేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.తాజాగా అన్ని చోట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రేడ్లను అందుబాటులోకి తేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం... 2వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఐటీఐ ట్రేడ్లకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇప్పటికే 20కి పైగా కొత్త ఏటీసీల ఏర్పాటు కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు రూపొందించగా, అవి కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ విభాగానికి చేరాయి. అతి త్వరలో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. -
పక్కా పన్నాగంతోనే స్కిల్ స్కామ్.. బాబు కనుసన్నల్లోనే కుంభకోణం
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు పక్కా కుట్రతోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్ ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 2014–15లో ముఖ్యమంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ కుట్రపూరితంగా షేల్ కంపెనీలు సృష్టించి ఫేక్ ఇన్వాయిస్లు అవినీతికి పాల్పడ్డారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట రూ.3,300కోట్ల ప్రాజెక్టును కేవలం కాగితాలపై సృష్టించడం... ప్రాజెక్టు చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371కోట్లు విడుదల చేయడం... షెల్ కంపెనీల ద్వారా తరలించడం...ఇలా కుట్ర అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది.ప్రజాధనం కొల్లగొట్టాలనే పక్కా పన్నాగంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ సృష్టికర్త... ఆ కుంభకోణంతో అక్రమంగా నిధులు పొందిన లబ్ధిదారూ రెండూ చంద్రబాబే’అని సీఐడీ సిట్ దర్యాప్తులో ఆధారాలతోసహా వెల్లడైంది. కుంభకోణం కుట్రదారు...అంతిమలబ్ధిదారుడు చంద్రబాబేనని నిగ్గు తేలి్చంది. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు రూపొందించారు. టీడీపీ నేత ఇల్లెందుల రమేశ్ ద్వారా డిజైన్‌టెక్, ఎస్‌ఐఎస్‌డబ్ల్యూ సంస్థలు ఆయన్ని సంప్రదించాయి. దాంతో రాష్ట్ర కేబినేట్ ఆమోదం లేకుండానే ఏపీఎస్ఎస్డీసీని ఏర్పాటు చేశారు.ఆ సంస్థకు డైరెక్టర్‌గా తన సన్నిహితుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా గంటా సుబ్బారావును నియమించారు. ఏపీఎస్ఎస్డీసీని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎంటర్ ప్రైజస్, ఇన్నోవేషన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి సర్వే లేకుండానే కేవలం డిజైన్‌టెక్ కంపెనీ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఆధారంగా ఆ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో డిజైన్‌టెక్ భాగస్వామిగా ప్రాజెక్ట్‌ను ఖరారు చేశారు. రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్‌ను ఆమోదించి... అందులో సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలు 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం నిధులు సమకూరుస్తాయని ఒప్పందంలో పేర్కొన్నారు.చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ...⇒ టీడీపీ ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించింది.. రూ 371 కోట్లు⇒ డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ. 238.29 కోట్లు, ⇒ ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు.అంతా బాబు ముఠానే..ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే. లక్ష్మీనారాయణ, ఎండీ గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులను కట్టబెట్టారు.తద్వారా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికు ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించేలా పథకం రచించారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి విరుద్ధమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. మావాళ్లే.. అడ్డగోలుగా నిధులు ఇచ్చేయండి ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ వాటా 10శాతం కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. అందుకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆరి్థక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత నోట్‌ఫైళ్లపై లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సీమెన్స్ కంపెనీకి రూ.371కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆరి్థక శాఖ అధికారులు ఆ నోట్‌ఫైళ్లలో స్పష్టం చేస్తూ ఆ నిధులు విడుదల చేశారు. నిధులు కొల్లగొట్టేందుకు గ్రీన్ చానల్ ఇక ఆ ప్రాజెక్ట్ నిధులను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. విద్యా శాఖతో నిమిత్తం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ నుంచి నేరుగా ఇంటర్ప్రైజస్– ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైళ్లు పంపాలని ఆదేశించారు. ఆ మేరకు డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లను వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించారు. పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది...ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లుఇన్వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లుమొత్తం రూ. 140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. -
చంద్రబాబు మళ్ళీ జైలుకే...? రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
స్కిల్ స్కామ్ అంటే ఏంటి? అందులో చంద్రబాబు అవినీతి ఎంత
-
కేఐఏడీబీకి భూమిని తిరిగిచ్చేసిన రాహుల్ ఖర్గే
బెంగళూరు/శివాజీనగర: కర్ణాటకలో ముడా స్కాం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్ ‘మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్’ఏర్పాటుకు బెంగళూరులో ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలనే అభ్యర్థనను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 20న కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధి బోర్డు (కేఐఏడీబీ)కు రాసిన లేఖలో రాహుల్ ఖర్గే పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎమర్జింగ్ టెక్నాలజీలో మరిన్ని ఉద్యోగావకాశాలు కలి్పంచడమే సిద్ధార్థ విహార్ ట్రస్ట్ లక్ష్యమన్నారు. కళాశాల విద్యను అభ్యసించలేని విద్యార్థులకు సహాయం చేయడానికి కూడా దీనిని రూపొందించామని పేర్కొన్నా రు. పరిశ్రమలకు దగ్గరగా ఉండటం వల్ల యువతకు అవకాశాలు పెరుగుతాయనే కేఐఏడీబీ ఇండ్రస్టియల్ ఏరియాను ఎంచుకున్నామని లేఖలో స్పష్టం చేశారు. ఆ లేఖ కాపీలను కర్ణాటక మంత్రిగా ఉన్న మల్లికార్జున ఖర్గే చిన్న కుమారుడు ప్రియాంక్ ఖర్గే తన ‘ఎక్స్’హ్యాండిల్లో పంచుకున్నారు. సిద్ధార్థ విహార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థలన్నీ లాభాపేక్ష లేని సంస్థలేనని, సీఏ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, పొందడానికి ట్రస్టుకు పూర్తి అర్హత ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే.. దురుద్దేశంతో కూడి న, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను నిరంతరం ఎదుర్కొంటూ ఏ విద్యాసంస్థా సమర్థవంతంగా పనిచేయదని, సామాజిక సేవే లక్ష్యంగా నడుస్తు న్న ట్రస్టును వివాదాల్లోకి నెట్టడం ఇష్టం లేకే ప్రతి పాదనను ఉపసంహరించుకుంటున్నట్లు కేఐఏడీబీకి ట్రస్టు లేఖ రాసిందని మంత్రి తెలిపారు. ఇటీవల అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన తనయుడు రాహుల్ ఖర్గేలకు చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల భూమిని మంజూరు చేసింది. కాగా, సిద్ధార్థ విహార్ ట్రస్టుకు భూమి కేటాయించడాన్ని బీజేపీ ఐటీ విభాగం ఇంచార్జ్ అమిత్ మాలవీయ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లహర్‌సింగ్ సిరోయాలు ఎక్స్‌లో వేదికగా ప్రశ్నించారు. ఇది కచ్చితంగా అధికార దురి్వనియోగం, బంధుప్రీతితో వ్యవహరించడమేనని పేర్కొన్నారు. కేఐఏడీబీ భూమి పొందడానికి ఖర్గే కుటుంబ సభ్యులు ఏరోస్పేస్ పారిశ్రామిక వేత్తలుగా ఎప్పడు మారారని ఎద్దేవా చేశారు. ముడా ప్లాట్ల కేటాయింపుల విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో 14 సైట్లను మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆమె తిరిగి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. -
Mahima Mehra: స్వచ్ఛందాల మహిమాలయం
హిమాలయాలు అంటే మంచు అందాలు గుర్తు రావచ్చు. ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరియవచ్చు. మరోవైపు చూస్తే... అందమైన హిమాలయప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలలో పేదరికరం ఉంది. నిరక్షరాస్యత ఉంది. నిరుద్యోగం ఉంది. వ్యసనాలు ఉన్నాయి. చుట్టపు చూపుగా హిమాలయాలకు వెళ్లాలనుకోలేదు మహిమ మెహ్ర.వారిలో ఒకరిగా బతకాలనుకుంది. వారి బతుకు బండికి కొత్త దారి చూపాలనుకుంది.పుణె, దుబాయ్‌లలో బోధన రంగంలో దశాబ్దకాలం పనిచేసింది మహిమ మెహ్ర. పుణెలోని ‘స్పెక్ట్రమ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులు, నిరుపేద ప్రజల కోసం పనిచేసిన మహిమ తన సేవాకార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్, పర్యావరణ స్పృహకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భిన్నమైన సంస్కృతి, భిన్నమైన వాతావరణం మధ్య పనిచేయాలనే ఆసక్తి మహిమను లద్దాఖ్‌కు తీసుకువెళ్లింది. ఈ హిమాలయప్రాంతానికి రావడంతో ఆమె జీవితమే మారి΄ోయింది.‘ఇది నా జీవితాన్ని మార్చిన ప్రయాణం. ఇక్కడ నేను అవసరమైన వారికి అవసరమైన సహకారం అందిస్తున్నాను’ అంటుంది మహిమ. సేవాకార్యక్రమాలు చేయడానికి పట్టణాలు లేదా పల్లెలను ఎంపిక చేసుకుంటారు. హిమాలయప్రాంతం మారుమూలలో నివసిస్తున్న వారిపై తక్కువమంది దృష్టి పడుతుంది. వీరి గురించి తెలుసుకున్న తరువాత మార్పు తీసుకురావాలనే తపన మహిమలో మొదలైంది. ఆ తపనే వందలాది మంది జీవితాల్లో వెలుగు తీసుకువచ్చింది.‘నగరానికి చెందిన వారు గ్రామీణ్రపాంత ప్రజలతో కలిసి పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటారు. గ్రామీణ ప్రజలు తమలోని సామర్థ్యాన్ని గుర్తించడం ఆ మార్పులో ఒకటి’ అంటుంది మహిమ మెహ్ర.హిమాలయప్రాంతంలో నివసిస్తున్న ప్రజలతో పనిచేయాలనుకున్నప్పుడు వారి గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంది మహిమ. ఒక ఆన్లైన్ సెషన్లో మహిమకు పంకీ సూద్ పరిచయం అయ్యాడు. సూద్ ద్వారా హిమాలయప్రాంత ప్రజల గురించి మహిమకు కొంత అవగాహన వచ్చింది.‘కులు లోయలోని పిల్లల కోసం మీరు కొన్ని వర్క్‌షాప్‌లు నిర్వహిస్తే బాగుంటుంది’ అని సూచించాడు సూద్. వెంటనే అక్కడికి వెళ్లి వర్క్‌షాప్‌లు మొదలు పెట్టింది. ఈ వర్క్‌షాప్‌లకు 30 నుంచి 40 మంది వరకు పిల్లలు వచ్చేవాళ్లు. ఆ తరువాత ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ను మొదలుపెట్టింది. ఈ సెంటర్ కోసం ఉపాధ్యాయుల సహకారం అవసరం కావడంతో ఫేస్బుక్ పేజీ ్రపారంభించింది.వాలంటీర్లను ఆహ్వానించింది. మొదట్లో 10 ఆ తరువాత... 15...ఆ తరువాత 50 నుంచి 500 వరకు వాలెంటీర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ‘సన్‌షైన్ లెర్నింగ్’ తరఫున పనిచేయడానికి 24,500 పైగా వాలెంటీర్లు ఉన్నారు.ఈ అనూహ్యమైన స్పందనే ‘హిమాలయన్ వాలంటీర్ టూరిజం’ ఏర్పాటుకు దారి తీసింది. హిమాలయప్రాంతంలో విద్య, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ స్పృహ, కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేవి హిమాలయన్ వాలంటీర్ టూరిజం(హెచ్విటీ) లక్ష్యాలు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు లోయలో ‘హెచ్విటీ’ మొదటి ్రపాజెక్ట్ మొదలైంది. నాలుగు గ్రామాల నుంచి ఎంతోమంది ‘హెచ్విటీ’ వర్క్‌షాప్‌లకు హాజరయ్యారు. లెర్నింగ్ యాక్టివిటీస్‌లో భాగం అయ్యారు.డిగ్రీ చేసిన అమ్మాయిలు ‘సన్‌షైన్ లెర్నింగ్ సెంటర్’ ద్వారా ఒక సంవత్సరం పాటు శిక్షణ తీసుకొని నామమాత్రం వేతనంతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ‘హెచ్విటీ’ హిమాలయాలలోని ఎన్నోప్రాంతాలలో స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 50 పాఠశాలలతో కలిసి పనిచేస్తుంది. పది టాయ్ లైబ్రరీలను, 35కి పైగా పుస్తక లైబ్రరీలను ఏర్పాటు చేసింది. విద్యకు సంబంధించిన వర్క్‌షాప్‌లు మాత్రమే కాకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తోంది. మాదకద్రవ్యాల బారిన పడిన వారిని ఆ వ్యసనం నుంచి బయటికి తీసుకురావడానికి, వృత్తి విద్యకు సంబంధించిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు హిమాలయప్రాంతంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చాయి.అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేపడుతున్నారు. చదువుపైనే కాదు రివర్స్ మైగ్రేషన్, ఆర్థిక స్థిరత్వం, రెవెన్యూ జెనరేషన్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. హిమాలయప్రాంతాల్లో పనిచేయాలనే తన ఆలోచన విన్న కొందరు.... ‘అంత దూరం వెళతావా!’ అని ఆశ్చర్య΄ోయారు. అలా ఆశ్చర్య΄ోయిన వారే ఇప్పుడు ‘ఇంత మార్పు తీసుకువచ్చావా’ అని మహిమ మెహ్రను అభినందిస్తున్నారు. -
మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం
-
పెరుగుతున్న ఈఎంఐ కల్చర్!
రాజు నెల వేతనం రూ.20 వేలు. ఇంటిఅద్దె రూ.తొమ్మిది వేలు చెల్లిస్తాడు. పిల్లల స్కూల్ ఫీజు ఏటా రూ.40 వేలు అంచనా వేసినా నెలకు రూ.3,500 అవుతుంది. కరెంటు బిల్లు, వైద్యం, రెస్టారెంట్, సినిమా, పార్టీలు, ఫంక్షన్లు, ప్రయాణాలు, సేవింగ్స్ కోసం రూ.నాలుగు వేలు ఖర్చు చేశాడని అనుకుందాం. ఈక్రమంలో నెలవారీ ఇంటి ఖర్చులు రూ.3,500 దాటాయంటే ఈఎంఐ తప్పదు. దీని ప్రభావం వచ్చేనెల ఖర్చులపై ఉంటుంది.దేశంలోని చాలామంది తమ ఆర్థిక స్థోమతకు తగినట్లుగా ఖర్చు చేస్తుంటారు. కొందరు అవసరాలకు మాత్రమే అప్పు చేస్తుంటే.. ఇంకొందరు వివిధ కారణాల వల్ల అప్పు వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో సరిపడా ఆదాయంలేని వారు ఏ చిన్న వస్తువు కొన్నాలన్నా ఈఎంఐ తప్పడంలేదు. ఇండియాలో ఈఎంఐ కల్చర్ ఎలా ఉందనే అంశాలను తెలియజేస్తూ ఇటీవల కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అందులో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.దేశంలో దాదాపు 70 శాతం మంది ఐఫోన్ వినియోగదారులు ఈఎంఐ ద్వారానే వాటిని కొనుగోలు చేస్తున్నారని తేలింది. 80 శాతం కారు విక్రయదారులు ఈఎంఐలోనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. 60 శాతానికిపైగా ఇళ్లు హోంలోన్ ద్వారానే కొంటున్నారు. అయితే నెలవారీ సంపాదనలో మొత్తం ఈఎంఐలు 30 శాతం లోపే ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసి ఈఎంఐ పెట్టాలనుకుంటే మాత్రం సంపాదన పెంచుకోవాలని చెబుతున్నారు. నైపుణ్యాలు పెంచుకుని ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని, సంపాదన పెరిగితే ఈఎంఐ అవసరం లేకుండానే వస్తువులు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ 13 రూ.11కే..?దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొబైళ్లు, దుస్తులు, గ్యాడ్జెట్లు, ఇతర వస్తువులు అత్యవసరం అయితే తప్పా కొనుగోలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. సమాజం మన్ననలు పొందేందుకు ఆర్బాటాలకు పోయి అప్పు చేసి ఈఎంఐ ద్వారా వస్తువులు కొంటే చివరకు వాటిని చెల్లించడంలో ఇబ్బందులు పడుతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆర్థిక స్థోమతకు తగినట్లుగా, ప్రణాళికబద్దంగా అత్యవసరమైతేనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. -
స్కిల్స్ వర్సిటీలో భాగస్వాములు కండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలతో పాటు పారిశ్రామికవేత్తలు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. సీఎం గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, బోర్డు సభ్యులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు, కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్కిల్స్ యూనివర్సిటీకి బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారనే నమ్మకం ఉందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని తెలిపారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి, 2028 ఒలింపిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణ అందిస్తుందని చెప్పారు. పట్టాలు ముఖ్యం కాదు.. నైపుణ్యం కావాలి డిగ్రీ, పీజీ పట్టాలు ఉంటే సరిపోదని, ఏటేటా లక్షలాది మంది యువకులు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నప్పటికీ, అందరూ ఉద్యోగాలు సాధించలేక పోతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన లక్షలాది మంది యువకులు ఒక ఉద్యోగం ఇప్పించమని తన వద్దకు వస్తున్నారంటూ తనకు ఎదురైన కొన్ని అనుభవాలను వివరించారు. ఇదే సమయంలో పరిశ్రమలు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఈ అంతరాన్ని తొలిగించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పాలని, తద్వారా యువత ఉపాధికి ఢోకా ఉండదని భావించినట్లు తెలిపారు. ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్: శ్రీధర్‌బాబు స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి పలు కీలక అంశాలను మంత్రి శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందని అన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పుతోందని, ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి స్వీయ ఆలోచనతో త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ లో కొత్త కోర్సులు ప్రారంభమవటం ఆనందంగా ఉందన్నారు. సీఎం ఆలోచనలో దార్శినికత ఉంది ఆనంద్ మహీంద్రా తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయమైన పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని భావించడంలో దార్శనికత ఉందని అన్నారు. అతి పెద్ద యూఎస్ కాన్సులేట్ తెలంగాణలో ఉందని, ఇక్కడి నుంచే అమెరికాకు ఎక్కువ మంది వెళుతున్నారని తెలిపారు. కాగా యూనివర్సిటీలో వచ్చే నెల దసరా పండుగ తర్వాత కోర్సులు ప్రారంభించనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ సమావేశంలో బోర్డు కో చైర్మన్ శ్రీని రాజు, సభ్యులు పి.దేవయ్య, సుచిత్రా ఎల్లా, సతీష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బోర్డు సభ్యులు మనీష్ సభర్వాల్, సంజీవ్ బిక్చందానీ, ఎంఎం మురుగప్పన్, డాక్టర్ కేపీ కృష్ణన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. -
భారత్‌లోనూ ‘సింగపూర్లు’ సృష్టిస్తాం
సింగపూర్: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక మోడల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సింగపూర్ ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారత్‌లోనూ ‘సింగపూర్లు’ సృష్టించాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేర్చాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. సింగపూర్‌ను పరిపాలిస్తున్న నాలుగో తరం నాయకత్వంలో దేశం మరింత వేగంగా అభివృద్ధికి పథంలో దూసుకెళ్తుందన్న విశ్వాసం ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సింగపూర్ కేవలం ఒక భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సింగపూర్ భాగస్వామ్యంతో భారత్‌లోనూ సింగపూర్లు సృష్టిస్తామన్నారు. నాలుగు నెలల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లారెన్స్ వాంగ్‌కు మోదీ అభినందనలు తెలియజేశారు. వేగం పుంజుకున్న పరస్పర సహకారం భారతదేశ ‘తూర్పు కార్యాచరణ విధానం’లో సింగపూర్ పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ(ఏఐ), అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో సింగపూర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చామన్నారు. తాము నమ్ముతున్న ప్రజాస్వామ్య విలువలు భారత్, సింగపూర్‌ను అనుసంధానిస్తున్నాయని వివరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం గత పదేళ్లలో రెండు రెట్లకుపైగా పెరిగిందన్నారు. భారత్‌లో సింగపూర్ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి, 160 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య యూపీఐ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి వచి్చందని తెలిపారు. త్వరలో తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రం భారత్–సింగపూర్ మధ్య సంబంధాలకు 2025లో 60 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ వేడుకలను రెండు దేశాలు కలిసి నిర్వహించుకోవాలని, ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని మోదీ సూచించారు. మొట్టమొదటి తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాన్ని త్వరలో సింగపూర్‌లో ప్రారంభించబోతున్నామని చెప్పారు. భారత్‌లో పర్యటించాలని లారెన్స్ వాంగ్‌ను మోదీ ఆహా్వనించారు. 4 అవగాహనా ఒప్పందాలు సెమీ కండక్టర్ల తయారీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, సింగపూర్ తీర్మానించుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ సమీక్షించారు. సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్, సింగపూర్ నాలుగు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి ప్రధాని మోదీ గురువారం ప్రఖ్యాత సింగపూర్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. తమ దేశంలో వైమానిక, ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ, నైపుణ్యాభివృద్ధితోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపార అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని సూచించారు. సెమీ కండక్టర్ కంపెనీ సందర్శన సింగపూర్‌లో ప్రఖ్యాతిగాంచిన సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‌ను నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ కలిసి సందర్శించారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాల్లో సెమీ కండక్టర్లు, టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యం ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం పెను ముప్పుప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా మారిందని భారత్, సింగపూర్ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ మేరకు ఇరు దేశాలు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా సరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నాయి. ఇందుకోసం అన్ని దేశాలు అంకితభావంతో కృషి చేయాలని సూచించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో నౌకలు, గగనతలంలో విమానాల స్వేచ్ఛా విహారానికి అవకాశం ఉండాలని ఇరుదేశాలు ఉద్ఘాటించాయి. -
యువతకు ఫ్లిప్‌కార్ట్ నైపుణ్య శిక్షణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ, యువకులకు ఫ్లిప్‌కార్ట్ సప్లయ్ చైన్ ఆపరేషన్స్ అకాడమీ (ఎస్సీఓఏ) నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు గాను కేంద్ర నైపుణ్యాభివృద్ధి కల్పన శాఖతో అవగాహన ఒప్పందం చేసుకుంది.ఈ-కామర్స్, సరఫరా వ్యవస్థ తదితర విభాగాల్లో ఉద్యోగ నైపుణ్యాలపై ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద శిక్షణ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. కళాకారులు, చేనేతలు, స్వయం ఉపాధి సంఘాల మహిళలు, మహిళలు, గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సాధికారత దిశగా ఐదేళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఒక కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా అవగాహన ఒప్పందంపై ఫ్లిప్‌కార్ట్ ఎస్సీఓఏ, నైపుణ్య శిక్షణాభివృద్ధి శాఖ అధికారులు సంతకాలు చేశారు. 250 మంది వరకు పారిశ్రామికవేత్తలు, కళాకారులు, విక్రయదారులు, చేనేత కార్మికులు, స్వయం స్వహాయక మహిళలు ఈ కార్యక్రమానికి హాజరైనట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. -
భాగస్వామ్యానికి సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు తాము సంసిద్ధమని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఈ మేరకు పలు అంశాలపై ఆసక్తి చూపింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై గంట పాటు చర్చించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో ప్రపంచ బ్యాంకుతో భాగస్వామ్యానికి సంబంధించి ఈ భేటీలో సంప్రదింపులు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులపై సంయుక్తంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తదితర అంశాలపైనా వారు చర్చించారు.యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తాం: రేవంత్తమ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉందని.. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వాటిని యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పాటిస్తామని చెప్పారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై నిపుణుల బృందం ఏర్పాటు ఆలోచనను ప్రపంచ బ్యాంకు బృందంతో సీఎం పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ అనుసరిస్తున్న సమతుల దృక్పథం సానుకూల ఫలితాలు ఇస్తుందని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు. గతంలో భారత్‌లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేశారు.అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ఇదే తొలిసారి!ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కలసి పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ తదితరాలపై సీఎం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారని.. ఈ ప్రాజెక్టులకు, భవిష్యత్తు వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు మరింత ఊతమిస్తుందని అంటున్నాయి. ఈ భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కొత్త ఆవిష్కరణల కోసం కార్నింగ్‌తో ఒప్పందంతెలంగాణలో నైపుణ్యాభివృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు లక్ష్యంగా దిగ్గజ సంస్థ కార్నింగ్ ఇన్ కార్పొరేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు అడ్వాన్స్డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కార్నింగ్ సంస్థ సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి తోడ్పడుతుంది. ఫార్మా, కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణతోపాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలోనూ సహకారం అందించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం స్థాపనపైనా చర్చ జరిగింది. 2025లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై కార్నింగ్ ప్రతినిధులు సంతకాలు చేశారు.జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్లతో ‘వివింట్’ విస్తరణవివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడితో నేరుగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉన్న వివింట్ సంస్థ తాజాగా సీఎం రేవంత్‌తో చర్చల అనంతరం విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలకు సంబంధించి నాణ్యమైన ఇంజెక్టబుల్స్, ఔషధాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 17 కోర్సులతో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ
-
నైపుణ్యాలు మెరుగయ్యేనా?
కేంద్ర బడ్జెట్లో.. యువతకు పెద్ద పీట వేశారా? మిలీనియల్స్(1981–1996 మధ్య పుట్టిన వారు)కు.. విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకున్నారా? ఇండస్ట్రీ, అకడమిక్ గ్యాప్ తగ్గించి తద్వారా ఇండస్ట్రీ రెడీగా యువతను తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారా? అంటే.. ఇండస్ట్రీ, అకడమిక్ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణం తాజా బడ్జెట్లో యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోణంలో పలు ప్రోత్సాహకాలు, ప్రతిపాదనలు ప్రకటించినా.. ఉద్యోగ కల్పన, జాబ్ మార్కెట్ డిమాండ్ పెంచే ప్రోత్సాహకాలు లేవని కొందరు అంటుంటే... ఐటీఐ నుంచి ప్రొఫెషనల్ డిగ్రీల వరకు అన్ని స్థాయిల్లో యువతకు నైపుణ్యాలు లభించేలా పలు పథకాలు ప్రకటించడం హర్షణీయ మని మరికొందరు పేర్కొంటున్నారు. సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కోణంలో.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా.. రానున్న అయిదేళ్లలో దేశ వ్యాప్తంగా పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు (ఐటీఐ)లను విస్తరించనున్నారు. ఈ క్రమంలో వేయి ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్‌ను అందించేలా చర్యలు తీసుకోనున్నారు. దీని ద్వారా రానున్న అయిదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఆయా ట్రేడ్స్‌లో శిక్షణ ఇవ్వడమే కాకుండా.. వారు సంబంధిత విభాగంలో ఉద్యోగ సాధనలో ముందంజలో నిలిచేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎంఎస్డీఈ గణాంకాల ప్రకారం.. 135 ఐటీఐ ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్ అనుబంధ ట్రేడ్లు (ఎలక్ట్రిíÙయన్, ఫిట్టర్ తదితర) 60 ఉంటే.. మిగిలివని నాన్–టెక్నికల్ (ఫ్యాషన్ డిజైన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌తదితర) ట్రేడ్లు. తాజా స్కీమ్ ప్రకారం.. ప్రస్తుతమున్న ట్రేడ్లతోపాటు నూతన ట్రేడ్లను అదే విధంగా స్వల్పకాలిక శిక్షణను అందించే విధంగానూ చర్యలు తీసుకోనున్నారు. మోడల్ స్కిల్ లోన్ స్కీమ్యువతకు ఉపాధి కల్పించే విషయంలో ఐటీఐలను విస్తరించడమే కాకుండా.. వృత్తి విద్య కోర్సులు చదివే వారికి రుణ సదుపాయం అందించే విధంగా.. మోడల్ స్కిల్ లోన్ స్కీమ్‌ను కూడా ప్రవేశ పెట్టారు. ఈ స్కీమ్ విధానాల ప్రకారం.. వృత్తి విద్య, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు రూ. 7.5 లక్షల వరకు రుణం అందిస్తారు. దీని ద్వారా ఏడాదికి 25 వేల మంది లబ్ధి పొందుతారని అంచనా వేశారు. వాస్తవానికి 2015లోనే స్కిల్ లోన్ స్కీమ్ పేరుతో ఒక పథకాన్ని రూపొందించారు. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం వృత్తి విద్యకు సంబంధించి సరి్టఫికెట్, డిప్లొమా, డిగ్రీ చదువుతున్న వారికి వీటిని అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మొత్తం రూ. 1.5 లక్షలే ఉండగా.. తాజాగా ప్రతిపాదించిన మోడల్ స్కిల్ లోన్ స్కీమ్‌లో ఈ మొత్తాన్ని రూ. 7.5 లక్షలకు పెంచారు. ప్రాక్టికల్ నైపుణ్యాలుస్కిల్ డెవలప్మెంట్ కోణంలో కొత్త పథకాన్ని రూపొందించడం, రుణ సదుపాయం, ఇంటర్న్íÙప్ సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవడాన్ని.. విద్యార్థులకు, యువతకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్న్‌షిప్ పథకం విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. గ్రామీణ స్థాయి నుంచే స్కిల్ డెవలప్మెంట్స్కీమ్ ఫర్ స్కిల్లింగ్.. ప్రధాన ఉద్దేశం గ్రామీణ స్థాయి నుంచే విద్యార్థులు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ కల్పించడం. ఇందుకోసం హబ్ అండ్ స్పోక్ విధానంలో ఐటీఐలు శిక్షణ కార్యక్రమాలు అందించనున్నాయి. అంటే.. ఐటీఐలు లేని ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తమకు సమీపంలోని ఐటీఐలలో తమకు నచ్చిన ట్రేడ్/వృత్తులలో శిక్షణ పొందొచ్చు. వాటిలో నైపుణ్యం పొంది భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవడం, అదే విధంగా స్వయం ఉపాధి కోణంలోనూ ముందంజలో నిలిచే ఆస్కారం లభించనుంది. బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ ముఖ్యాంశాలు » 20 లక్షల మంది యువత లక్ష్యంగా స్కిల్ స్కీమ్ » అయిదేళ్లలో వేయి ఐటీఐల ఏర్పాటు » ఇంటర్న్‌షిప్ ఔత్సాహికులకు ఏడాదికి రూ. 60 వేల ప్రోత్సాహకం » అయిదేళ్లలో కోటి మందికి ఇంటర్న్‌షిప్ ప్రోత్సాహకాలు » ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు ‘స్కిల్స్ సరే.. ఉద్యోగాలు ఎక్కడ? ప్రభుత్వం ప్రకటించిన స్కిల్ డెవలప్మెంట్ పథకాలు, ప్రోత్సాహకాలు పూర్తిగా సప్లయ్ (ఉద్యోగార్థులు) కోణంలోనే ఉన్నాయి. కానీ జాబ్ మార్కెట్ డిమాండ్ పెరిగేలా, సంస్థలు కొత్త ఉద్యోగాలు కల్పించేలా చర్యలు, ప్రోత్సాహకాలు అందించాలి. కొత్త ఉద్యోగాల కల్పన అనేది సంస్థలకు నూతన మార్కెట్ అవకాశాలు లభించినప్పుడు, దాని ద్వారా డిమాండ్ పెరిగనప్పుడే సాధ్యమవుతుంది. స్కిల్లింగ్, అప్రెంటీస్íÙప్స్, ఇంటర్న్షిప్స్ వంటి ప్రోత్సాహకాలతో ఉద్యోగార్థులు నైపుణ్యాలు పొందినా.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందే అవకాశం లేదు. ఇది సాధ్యం కావాలంటే డిమాండ్ వైపు.. నూతన ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాలి. – టి. మురళీధరన్, చైర్మన్, టీఎంఐ గ్రూప్ ఐటీలోనూ నైపుణ్యాలకు మార్గం స్కీమ్ ఫర్ స్కిలింగ్ పేరుతో ప్రారంభించనున్న నూతన స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఫలితంగా.. వృత్తి విద్య కోర్సులతోపాటు ఐటీ రంగానికి సంబంధించిన నైపుణ్యాలు కూడా పొందే ఆస్కారం లభిస్తుంది. ప్రస్తుతం ఎన్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఐటీ సహా.. 36 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్.. శిక్షణనినస్తున్నాయి. ఐటీఐలలోనూ ఐటీ అనుబంధ ట్రేడ్లలో శిక్షణ లభిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే.. నూతన పథకం ఫలితంగా విద్యార్థులు.. ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ సొంతం చేసుకుంటారనడంలో సందేహం లేదు. – ఎం. సతీశ్ కుమార్, చీఫ్ సపోరి్టంగ్ ఆఫీసర్, నాస్కామ్ –ఎన్ఎస్డీసీ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కాలేజ్‌లు చొరవ చూపాలి స్కీమ్ ఫర్ స్కిల్లింగ్, ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లు సమర్థవంతంగా అమలయ్యేలా ఇన్స్టిట్యూట్స్ చొరవ చూపాలి. బీటెక్ స్థాయిలో మేము ఇంటర్న్‌షిప్ అవకాశాలు తెలియక ఇబ్బంది పడుతున్నాం. దీనికి పరిష్కారంగా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ తరహాలో ఇంటర్న్‌షిప్ డ్రైవ్స్ నిర్వహిస్తే బాగుటుంది. అదే విధంగా కంపెనీల ప్రతినిధులు, కళాశాలల యాజమాన్యాలు ఉమ్మడి వేదికగా ఇంటర్న్ అవకాశాలు, ట్రైనీ వివరాలు పొందుపరిచే విధంగా చర్యలు తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. – టి. నిఖిల్ భరద్వాజ్, ఎంటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి -
నైపుణ్య యువతరం..ఉద్యోగ భారతం
న్యూఢిల్లీ: దేశంలో భారీగా కొత్త ఉద్యోగాల కల్పన, అందుకు వీలు కల్పించేలా యువతకు నైపుణ్య శిక్షణ లక్ష్యంతో మోదీ 3.0 సర్కారు అడుగులు వేసింది. తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్య అంశాల్లో ‘ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ’ఒకటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా, రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను చేపడతామని ప్రకటించారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు, కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రయోజనాలను కల్పిస్తామని ప్రకటించారు. ఈపీఎఫ్ఓ డేటా ఆధారంగా..కొత్త ఉద్యోగాల కల్పన పథకాలను..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో నమోదయ్యే వివరాల ఆధారంగా అమలు చేస్తామని నిర్మల తెలిపారు. మొత్తంగా ప్రస్తుత 2024–25 కేంద్ర బడ్జెట్లో విద్య, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కోసం రూ.1.48 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు 23 వేల కోట్లు, జాబ్ క్రియేషన్ ఇన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్‌కు రూ.52 వేల కోట్లు, సపోర్ట్ టుఎంప్లాయర్స్ స్కీమ్‌కు రూ.32 వేల కోట్లు కలిపి రూ.1.07 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు వివరించారు.నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు..కార్కుల నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, తగిన నైపుణ్యమున్న కార్మకులతో కూడిన డేటాబేస్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఈ–శ్రమ్, శ్రమ్ సువిధ, సమాధాన్ వంటి పోర్టల్స్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. దీనితో స్కిల్ ప్రొవైడర్స్, ఎంప్లాయర్స్‌కు.. ఉద్యోగాలు కోరుకునే యువతకు మధ్య అనుసంధానంకుదురుతుందని వెల్లడించారు. ఐదేళ్లలో కోటి మందికిఇంటర్న్షిప్ దేశంలో యువత సులభంగా ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పించేలా, ఉద్యోగంలో చేరే ముందే తగిన అనుభవం సాధించేలా.. విస్తృతస్థాయిలో ఇంటర్న్íÙప్ పథకాన్ని అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 500 టాప్ కంపెనీల్లో మొత్తంగా కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశం కలి్పస్తామని తెలిపారు. ఇంటర్న్íÙప్లో చేరేప్పుడు ఒకసారి రూ.6 వేలు అందిస్తామని, తర్వాత ప్రతినెలా రూ.5 వేలు ఇంటర్న్సిప్ అలవెన్స్ అందుతుందని వెల్లడించారు. ఏడాదిపాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో సంబంధిత ఉద్యోగం, పని వాతావరణంపై యువతకు అవగాహన ఏర్పడుతుందని.. దీనితో మంచి ఉద్యోగం పొందేందుకు అవకాశం వస్తుందని వివరించారు. ఈ ఇంటర్న్‌షిప్ పథకానికి ఎంపికయ్యే యువతకు శిక్షణ ఇచ్చేందుకయ్యే వ్యయాన్ని, ఇంటర్న్íÙప్ అలవెన్స్‌లో పది శాతాన్ని కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి భరిస్తాయని తెలిపారు.స్కిల్స్పెరిగితే.. ఉద్యోగాలూ పెరుగుతాయి! బడ్జెట్లో దేశ యువతలో నైపుణ్యాల పెంపు, ఉద్యోగ కల్పనకు ప్రోత్సాహకాలు అందించే స్కీమ్‌లను ప్రకటించడంపై హ్యూమన్స్ రీసోర్స్, ఎడ్ టెక్ రంగాల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘వికసిత్ భారత్’లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయం తీసుకుందని ప్రశంసిస్తున్నారు. యువతలో నైపుణ్యాలు పెరిగితే ఉద్యోగ అవకాశాలు విస్తృతం అవుతాయని అంటున్నారు. ‘‘మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు తోడ్పడతాయి. పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు అందేందుకు నైపుణ్య శిక్షణ బాట వేస్తుంది. ఈ దిశగా ప్రభుత్వ నిర్ణయాలు బాగున్నాయి..’’అని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్íÙప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. ‘‘నైపుణ్య శిక్షణ మాత్రమేగాకుండా.. ఉద్యోగులు, ఉద్యోగాలను కలి్పంచే కంపెనీలకూ ప్రోత్సాహకాలు ఇవ్వడం స్వాగతించదగిన విషయమని క్వెస్ కార్ప్ సీఈవో గురుప్రసాద్ శ్రీనివాసన్ చెప్పారు.‘‘20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ, కోటి మందికి ఇంటర్న్‌షిప్ అవకాశాలు వంటివి రాబోయే తరం సాధికారతకు తోడ్పడతాయి. దేశంలోని యువతలో నైపుణ్యాల లోటును పూడ్చవచ్చు..’’అని పియర్సన్ ఇండియా కంట్రీ హెడ్ వినయ్‌కుమార్ స్వామి పేర్కొన్నారు. ..: ఉద్యోగాల కల్పన కోసం :.. 1 ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ : వ్యవస్థీకృత రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకంగా ఒక నెల వేతనం చెల్లింపు. మూడు వాయిదాల్లో.. గరిష్టంగా రూ.15 వేల వరకు అందిస్తారు. దీనితో వచ్చే ఐదేళ్లలో 2.1 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని అంచనా. 2 జాబ్ క్రియేషన్ ఇన్‌మాన్యుఫాక్చరింగ్ స్కీమ్: కొత్తగా ఉద్యోగంలో చేరేవారు,కొత్తగా ఉద్యోగాలిచ్చే సంస్థలు చెల్లించేఈపీఎఫ్‌ఓ చందాలపై తొలి నాలుగేళ్లపాటు ప్రోత్సాహకాలు. సుమారు 30 లక్షల మంది యువతకు ప్రయోజనం కలుగుతుందనిఅంచనా.3 సపోర్ట్ టుఎంప్లాయర్స్ స్కీమ్:కంపెనీలు కొత్తగా/అదనంగా ఇచ్చే ఉద్యోగాలకు సంబంధించి యాజమాన్య వాటాగా చెల్లించే ఈపీఎఫ్ చందాల రీయింబర్స్మెంట్. ఒక్కో ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు. దీనితో కొత్తగా 50 లక్షల ఉద్యోగాల కల్పనజరుగుతుందని అంచనా. (ఈ మూడు స్కీమ్‌లనుగరిష్టంగా నెలకు రూ.లక్ష వేతనంఇచ్చే ఉద్యోగాలు/ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేస్తారు.)..: నైపుణ్యాల శిక్షణ కోసం :..1 వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం. రాష్ట్రాలు, పరిశ్రమలు, కంపెనీలతో కలసి దీనిని అమలు చేస్తారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత విధానంలో 1,000 పారిశ్రామిక శిక్షణ ఇన్స్టిట్యూట్ల (ఐటీఐ) అప్‌గ్రెడేషన్. 2 వచ్చే ఐదేళ్లలో కోటి మందికి 500 టాప్ కంపెనీల్లో ఇంటర్న్íÙప్ అందించే మరో పథకం అమలు.3 పరిశ్రమలు, కంపెనీల అవసరాలకుతగినట్టుగా ఉండేలా కోర్సులు,పాఠ్యాంశాల రూపకల్పన.4 నైపుణ్య శిక్షణ కోసం ‘మోడల్ స్కిల్ లోన్ స్కీమ్’కింద ఏటా 25 వేల మంది యువతకు రూ.7.5 లక్షల వరకు రుణాలు.5 మహిళలకే ప్రత్యేకించిన నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలు. ఉద్యోగాల్లో మహిళల భాగ స్వామ్యం పెరగడం కోసం.. పరిశ్రమలు, కంపెనీల సహకారంతో వర్కింగ్ విమెన్ హాస్టళ్లు, చిన్న పిల్లల సంరక్షణను చూసుకునే క్రెచ్‌ల ఏర్పాటుకు నిర్ణయం.ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణకు రూ.309.74 కోట్లుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బడ్జెట్లో రూ.309.74 కోట్లను కేటాయించారు. ఇందులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్,లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.103.05 కోట్లు. వివిధ శిక్షణ స్కీమ్‌లకు రూ.120.56 కోట్లు, మిషన్ కర్మయోగికి రూ.86.13 కోట్లు ఇచ్చారు. వీటితో ఉద్యోగులకు వివిధ నైపుణ్యాలపై రిఫ్రెషర్ కోర్సులు, మిడ్ కెరీర్ శిక్షణ ఇస్తారు. -
ఆటోమోటివ్ రంగంలో 4,000 మందికి శిక్షణ!
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్, నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్)లోని 4,000 మంది విద్యార్థులకు ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు అందిస్తున్నట్లు పేర్కొంది. ‘జాతీయ విద్యా విధానం 2020’కి అనుగుణంగా మెరుగైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరునలను తయారు చేయడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌వీఎస్‌ల్లో 25 ‘ఆటోమోటివ్ స్కిల్ ల్యాబ్స్’ ప్రారంభించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పింది.టాటా మోటార్స్ సీఎస్ఆర్ హెడ్ వినోద్ కులకర్ణి మాట్లాడుతూ..‘విద్యార్థులకు ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 25 ఆటోమోటివ్ స్కిల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వీటిని సిద్ధం చేసి శిక్షణ ఇస్తున్నాం. స్కిల్ ల్యాబ్‌ల్లో ఏటా 4,000 మందికి ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు అందిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్‌లో దాదాపు 30% మంది బాలికలు ఉండడం విశేషం. ప్రాక్టికల్ ఆటోమోటివ్ స్కిల్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు కోసం తగిన విధంగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు’ అని తెలిపారు.‘ఆటోమోటివ్ స్కిల్ ల్యాబ్‌లో నైపుణ్యాల పెంపునకు అవసరమైన అన్ని సాధనాలు ఏర్పాటు చేశాం. సెకండరీ, సీనియర్ సెకండరీ విద్యార్థులకు (9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) లోతైన విషయ పరిజ్ఞానానికి ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. క్లాస్‌రూం ట్రెయినింగ్తో పాటు టాటా మోటార్స్ ప్లాంట్లను సందర్శించడం, సర్వీస్, డీలర్షిప్ నిపుణులతో చర్చించడం, వారి ఉపన్యాసాలు వినడం వల్ల మరింత ఎక్కువ సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న విద్యార్థులకు టాటా మోటార్స్, ఎన్వీఎస్ నుంచి జాయింట్ సర్టిఫికేట్లను అందిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్‌లో ప్రతిభ చూపిన వారికి టాటా మోటార్స్ పూర్తి స్టైపెండ్ అందించి ఉద్యోగ శిక్షణతో కూడిన డిప్లొమా ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీని అభ్యసించే అవకాశం కల్పిస్తోంది. డిప్లొమా పూర్తయిన తర్వాత టాటా మోటార్స్‌లో విద్యను కొనసాగించాలనుకునేవారు ఇంజినీరింగ్ సంస్థలతో కలిసి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా బీటెక్ పట్టా పొందే వీలుంది. అనంతరం ప్రతిభ ఆధారంగా సంస్థలో ఉద్యోగం కూడా పొందవచ్చు’ అని వివరించారు.ఇదీ చదవండి: అంబానీ ఆస్తులు కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా..?2023లో ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఏఎస్‌డీసీ) నిర్వహించిన ‘నేషనల్ ఆటోమొబైల్ ఒలింపియాడ్’లో ఈ ప్రోగ్రామ్ నుంచి 1,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 17 మంది పోటీలో రెండో దశ వరకు చేరుకున్నారు. పుణెలోని స్కిల్ ల్యాబ్‌లో విద్యార్థులు ప్రయోగాత్మక శిక్షణలో భాగంగా ఇ-రిక్షాను కూడా ఆవిష్కరించారు. -
వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!
భారతదేశ సాంకేతిక రంగంలో రానున్న 2-3 ఏళ్లకుగాను 10 లక్షల మంది టెక్నాలజీ ఇంజినీర్ల అవసరం ఉందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అంచనా వేశారు. విద్యార్థుల్లో కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంచితే తప్పా ఈ డిమాండ్‌ను పూడ్చలేమని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సంగీతా గుప్తా మాట్లాడుతూ..‘రాబోయే 2-3 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర రంగాల్లో అధునాతన నైపుణ్యాలు కలిగిన దాదాపు 10 లక్షల మంది టెక్ ఇంజినీర్ల అవసరం ఉంది. దురదృష్టవశాత్తు కళాశాలలు విద్యార్థులకు తగినంత ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించడం లేదు. దేశవ్యాప్తంగా నెలకొనే ఇంజినీర్ల కొరతను తీర్చాలంటే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం శిక్షణ అందించాలి. ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్-సెక్యూరిటీ వంటి రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఆయా రంగాల్లో పని చేస్తున్నవారు కూడా అధునాతన నైపుణ్యాలు పెంచుకోవాలి. వేగంగా మారుతున్న డిజిటల్ టెక్నాలజీలో కొలువులు సాధించాలంటే నిత్యం కొత్త సాంకేతికతనే నేర్చుకోవాల్సిందే’నని చెప్పారు.కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్ల 80,000 ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయామని గత నెలలో టీసీఎస్ తెలిపింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏఐపై శిక్షణ పొందిన ఉద్యోగుల సంఖ్యను కూడా రెట్టింపు చేసినట్లు చెప్పింది. ప్రముఖ ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థగా పేరున్న లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ జూన్‌లో తమ ఐటీ, ఐటీ ఆధారిత సేవల యూనిట్లో 20,000 ఇంజినీర్ల కొరత ఉందని పేర్కొంది. 2028లో డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించిన డిమాండ్ సరఫరా అంతరం 25 శాతం నుంచి 29 శాతానికి పెరుగుతుందని నాస్కామ్ అంచనా వేసింది. మార్కెట్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేక కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: అసౌకర్యంగా ఉండేందుకు ఎవరూ లగ్జరీ కార్లు కొనరుదేశ టెక్నాలజీ రంగ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ల డాలర్లు(సుమారు రూ.20 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రంగంలో దాదాపు 5.4 మిలియన్ల(54 లక్షల) మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో టెక్నాలజీ సేవలు 7.5 శాతంగా నమోదవుతున్నాయి. -
‘48 వేలమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తాం..’
ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఐసీటీ అకాడమీ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి 48 వేలమంది విద్యార్థులకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ(సీఎస్ఆర్)లో భాగంగా నిర్వహించే ఈ శిక్షణకు రూ.33 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.ఈ సందర్భంగా కంపెనీ వర్గాలు మాట్లాడుతూ..‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్, తమిళనాడులోని ఐసీటీ స్వచ్ఛంద సంస్థతో కలిసి రానున్న మూడేళ్లలో 48 వేలమంది విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయనున్నాం. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రిటైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తాం. ఇందుకోసం రూ.33 కోట్లు కేటాయించాం. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులను అభ్యసించే విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాల పెంపునకు ఇది సహకరిస్తుంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: యూఏఈలోనూ యూపీఐ చెల్లింపులు!‘దేశంలోని 450కి పైగా కళాశాలల్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఉమెన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు కేంద్రంగా పనిచేస్తుంది. విద్యార్థులకు కోర్ స్కిల్స్‌లో 80 గంటల శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్‌లో 20 గంటల శిక్షణ, సర్టిఫికేషన్ పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్ సౌకర్యం, యూత్ ఎంపవర్మెంట్ సమ్మిట్లు, రియల్‌టైమ్ కోడింగ్ ప్రాక్టీస్ వంటివి ఏర్పాటు చేస్తాం. ‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్’, ‘ఇన్ఫోసిస్ ఫ్లాగ్షిప్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్’ను ఉపయోగించుకోవడం ద్వారా విద్యార్థులకు మరిన్ని నైపుణ్యాలు అందుబాటులోకి రానున్నాయి’ అని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రకటనలో పేర్కొంది. -
‘లౌడ్ లర్నింగ్’.. స్కిల్స్ నేర్చుకునేందుకు ఇదే మంత్రం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రొఫెషనల్స్ తమ కెరీర్లో ముందుకు వెళ్లాలంటే కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకరం. అయితే అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారా.. ఇందులో ఎదురవుతున్న అడ్డంకులు ఏంటి.. అన్నదానిపై ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఓ పరిశోధన చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.భారత్‌లో 80 శాతం మంది నిపుణులు తమ సంస్థ అభ్యసన సంస్కృతిని పెంపొందించడానికి తగినంత కృషి చేస్తోందని చెప్పారు. అయితే 10లో 9 మందికి పైగా (94%) పని, కుటుంబ కట్టుబాట్ల కారణంగా నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం కష్టపడున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. కుటుంబ బాధ్యతలు లేదా ఇతర వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా సమయం లేకపోవడం (34 శాతం), బిజీ వర్క్ షెడ్యూల్స్ (29 శాతం), అభ్యాస వనరులు అందుబాటులో లేవపోవడం (26 శాతం) వంటి ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయి.ఏంటీ 'లౌడ్ లెర్నింగ్'? అప్ స్కిల్లింగ్ కు అడ్డంకులను అధిగమించడానికి ప్రొఫెషనల్స్ లౌడ్ లర్నింగ్ అనే మంత్రాన్నిపాటిస్తున్నారు. పని చేసే చోట అభ్యసన ఆకాంక్షల గురించి బయటకు చెప్పడమే 'లౌడ్ లెర్నింగ్'. అప్ స్కిల్లింగ్ అడ్డంకులకు ఒక ఆశాజనక పరిష్కారంగా ఉద్భవించింది. భారత్‌లో 10లో 8 మంది (81 శాతం) ప్రొఫెషనల్స్ ఈ అభ్యాసం వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయాన్ని కేటాయించడానికి సహాయపడుతుందని చెప్పారు.'లౌడ్ లెర్నింగ్'లో మూడు ప్రధాన మార్గాలను భారత్‌లోని ప్రొఫెషనల్స్ పాటిస్తున్నారు. తమ అభ్యసనలను సహచరులతో పంచుకోవడం (40 శాతం), అభ్యసన ప్రయాణం లేదా విజయాలను లింక్డ్ఇన్లో షేర్ చేయడం (40శాతం), తమ లర్నింగ్ టైమ్ బ్లాక్‌ల గురించి వారి టీమ్ సభ్యులకు తెలియజేయడం (35శాతం) ఇందులో ఉన్నాయి. భారత్ లో ఇప్పటికే 64 శాతం మంది ప్రొఫెషనల్స్ ఈ 'లౌడ్ లెర్నింగ్ 'లో నిమగ్నమయ్యారు. -
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎందుకిన్ని మోసాలు? బతుకంతా అబద్ధాలేనా? మేనిఫెస్టో సరే.. అఫిడవిట్లో కూడా అబద్ధాలేనా? తరచి చూస్తే తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు... లోకేశ్ నాయుడు ఇద్దరూ ఇప్పుడే కాదు... 2019లోనూ అబద్ధాల అఫిడవిట్లే వేశారు. 2019లో హెరిటేజ్ షేర్ విలువ రూ.260.81 ఉండగా... అఫిడవిట్లో మాత్రం ఏకంగా రూ.511.90 ఉన్నట్టుగా చూపించారు. పైపెచ్చు వీళ్లకు ఉన్నవి ఒకటీరెండూ షేర్లు కాదు. 2019లో చంద్రబాబుకు 1,06,61,652 షేర్లు... లోకేశ్ నాయుడికి 4,73,800 షేర్లు ఉన్నాయి. అప్పట్లో వీటి వాస్తవ విలువ చంద్రబాబుది రూ.278 కోట్ల పైచిలుకు కాగా... లోకేశ్‌ది రూ.12.40 కోట్లు. కానీ చంద్రబాబు తన షేర్ల విలువను ఏకంగా రూ.545 కోట్లుగా చూపించారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లు లోకేశ్ కూడా తన షేర్ల విలువను రూ.24.25 కోట్లుగా చూపించారు. అంటే ఇద్దరూ కలిసి తమ హెరిటేజ్ షేర్ల విలువను దాదాపు రూ.279 కోట్లు ఎక్కువగా చూపించారు. ఇదంతా ఎందుకో తెలుసా?ఐటీ కళ్లు కప్పడానికి ముసుగు...నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సహా పలు కుంభకోణాలకు తెరతీశారు. ఈ స్కాముల్లో చాలా నిధులు రకరకాల మార్గాల్లో మళ్లీ తన దగ్గరికే రప్పించుకున్నారు. ఈ సొమ్ముతో ఆస్తులు పెంచుకున్నా... అవేవీ రికార్డుల్లో కనపడకుండా జాగ్రత్త పడ్డారు. చాలా ఆస్తుల్ని బినామీల పేరిట పెట్టారు. అయితే షాపుర్జీ పల్లోంజీ సహా కొన్ని కంపెనీల నుంచి తీసుకున్న డబ్బులు నేరుగా చంద్రబాబు ఖాతాల్లోకే రావటంతో దానికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.ఆ నోటీసులకు జవాబిచ్చేటపుడు కూడా... నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ బుకాయించడం... అదే కారణంతో కోర్టులో సవాల్ చేయటం తప్ప ఆదాయానికి సంబంధించిన సమాధానాలేవీ ఇవ్వలేదు. అయితే ఆ డబ్బులు పెరిగిన ఆస్తుల్లో, తన బ్యాంకు ఖాతాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వాటికి ఈ హెరిటేజ్ ముసుగు వేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అధికారికంగా అన్ని ఆస్తులు ఎలా పెరిగాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి... హెరిటేజ్ షేర్లకు అంత విలువ లేకపోయినా వాటి పేరిట చూపిస్తే సరిపోతుందని ఈ పన్నాగం పన్నినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ సారి అఫిడవిట్లో షేర్ల సంఖ్య పెంచేసి మరో అక్రమం...ఇలాంటి తప్పుల్ని, మోసాల్ని సహించలేమంటూ 2019 ఎన్నికల్లో జనం బాబుకు బుద్ధి చెప్పి ఓడించటం అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో మునుపటిలాగే షేరు విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారో ఏమో... షేర్ల సంఖ్యను పెంచి చూపించారు. అప్పట్లో ఉన్న షేర్ల సంఖ్య 1,06,61,652 కాగా... ఇపుడా షేర్ల సంఖ్య ఏకంగా 2,26,11,525కు పెరిగినట్లు చంద్రబాబు చూపించారు.అంటే రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. అప్పట్లో వీటి మొత్తం విలువను రూ.545 కోట్లుగా చూపించిన చంద్రబాబు... ఇప్పుడు 2,26,11,525 షేర్లను ఒక్కొక్కటీ రూ.337.85గా చూపిస్తూ... హెరిటేజ్‌లోని తన షేర్ల విలువ రూ.. 767.44 కోట్లుగా పేర్కొన్నారు. లోకేశ్ కూడా తన షేర్లు 4,73,800 నుంచి 1,00,37,453కు పెరిగినట్లుగా... వాటి విలువ రూ.337.85 చొప్పున రూ.339 కోట్లుగా చూపించారు.బోనస్, స్ప్లిట్.. ఏమీ లేకుండానేనిజానికి 2019 తరువాత హెరిటేజ్ షేర్ల విభజన జరగలేదు. అంటే ఒక షేరును విభజించి రెండుగా చేయటమో ఏదో జరిగితే తప్ప చంద్రబాబు నాయుడి షేర్లు అలా రెట్టింపయ్యే అవకాశం లేదు. పోనీ బోనస్ షేర్లను జారీ చేశారా అంటే... అది కూడా లేదు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యలో చంద్రబాబు ఎవరి వద్దనుంచైనా హెరిటేజ్ షేర్లను కొనుగోలు చేశారా అంటే... అది కూడా లేదు. మరి ఎలా పెరిగాయి? 2019లో హెరిటేజ్ షేర్లకు లేని విలువను ఉన్నట్టుగా చూపించి వాటిని ఏకంగా రూ.545 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు... ఇప్పుడు వాటి విలువ రూ.337 ప్రకారం కోటి షేర్లుగా చూపిస్తే మొత్తం విలువను రూ.337 కోట్లుగా చూపించాలి. అంటే ఐదేళ్లలో హెరిటేజ్ షేర్ల విలువను తగ్గినట్లు చూపించాలి. ఇది కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చని, తన 2019 అఫిడవిట్ బాగోతం బయటపడే అవకాశం ఉందని భావించి... ఈ సారి కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా తన షేర్ల సంఖ్యను అమాంతం పెంచేసి... 4 లక్షల షేర్లను కోటి షేర్లుగా చూపించారని, ఇదంతా అవినీతి సొమ్ముకు అధికారిక ముసుగు వేయటానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మరి వాటా పెరగకుండా షేర్ల సంఖ్య పెరగటం ఎలా సాధ్యం? నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడం చట్టరీత్యా నేరం. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే.... సెక్షన్ 125 ఏ ప్రకారం... అభ్యర్థిపై విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో కోర్టులు స్పష్టంగా తీర్పునిచ్చాయి కూడా. -
65 ఐటీఐల్లో స్కిల్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో అధికారులు ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉపాధి శిక్షణ శాఖ స్పెషల్ సీఎస్ రాణి కుముదిని, టాటా టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పవన్ భగేరియాతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విస్తరిస్తున్న పరిశ్రమల అవసరాలకు, ఇప్పుడున్న కోర్సులకు మధ్య భారీ అంతరముందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంతరాన్ని తగ్గించి యువతకు ఉపాధి అవకాశాలను అందించే కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు. రూ.2,700 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల ఖర్చుతో ఐటీఐలలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అవసరమైన వర్కషాప్ల నిర్మాణం, యంత్రపరికరాల సామగ్రితో పాటు శిక్షణను అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా టెక్నాలజీస్ చేపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా ఐటీఐలలో కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశపెడతారు. అన్ని రంగాల్లో యువత ఉపాధి అవకాశాలందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను ఎంపిక చేశారు. ప్రతి ఏడాదీ వీటితో 9000 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. దాదాపు లక్ష మందికి షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా శిక్షణను అందిస్తారు. ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుంచి మొదలయ్యే అకడమిక్ సెషన్‌కు వర్క్ షాప్‌లను అందుబాటులో ఉంచాలని, సరిపడేంత మంది ట్యూటర్లను నియమించాలని ముఖ్యమంత్రి టాటా టెక్నాలజీ ప్రతినిధులకు సూచించారు. కేవలం శిక్షణనివ్వటమే కాకుండా యువతకు ఉపాధి కల్పించేందుకు క్యాంపస్ ప్లేస్మెంట్లపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక ప్లేస్‌మెంట్‌సెల్ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్ సూచించారు. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు హైదరాబాద్‌ను స్కిల్ డెవెలప్మెంట్హబ్గా తయారు చేసేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించేందుకు త్వరలోనే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. -
నైపుణ్యాల అభివృద్ధిలో మునుముందుకు
యువత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా వారికి మంచి అవకాశాలను అంది పుచ్చుకునే వీలు కల్పించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ పేరుతో కోట్లాది రూపాయలను మింగేయడం మాత్రం క్షంతవ్యం కాదు. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ‘స్కిల్ డెవలప్మెంట్ సంస్థ’ ముసుగులో చేసిన నిర్వాకం నిధుల భక్షణే అనేది ఆయన అరెస్ట్‌తో తేలిపోయింది. అసలు స్కిల్ డెవెలప్మెంట్ అంటే ఏమిటి? వ్యక్తుల నైపుణ్యాన్ని పెంచడంతో పాటు, వారికి తగిన ఉపాధి కలిగేలా చూడడం కదా. తిరుపతి సమీపంలో ఉన్న ‘శ్రీ సిటీ’లో జరుగుతున్నది ఇదే. అలాగే అందుబాటులో ఉన్న సహజ వనరులను రాష్ట్ర అభివృద్ధికి ఎలా నైపుణ్యంగా ఉపయోగించుకోవాలో దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతలదే. కానీ ఈ విషయంలో చంద్రబాబు విఫలమయ్యారనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమారమి వెయ్యి కి.మీ. సముద్ర తీరం ఉంది. ఇక్కడ గోవాలో మాదిరిగా టెంట్స్ వేద్దామా, క్యాసినోలు పెడ దామా, పర్యాటకులకు వినోదం పంచుదామా అనే దగ్గరే ఆయన ఆలోచనలు ఆగిపోయాయి. అంటే సముద్ర తీరాన్ని ఒక జూద కేంద్రంగా, వ్యసనపరుల క్షేత్రంగా మార్చాలని చూశారు. అదృష్టవశాత్తు ఆయన కిందటి ఎన్నికల్లో ఓడి పోవడంతో ఆ ఆలోచనకు బ్రేక్ పడింది. అయితే అదే సముద్ర తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా, మెరైన్ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ఇప్పటి ముఖ్య మంత్రి జగన్ చేశారు. ఒక ‘స్కిల్ యూనివర్స్’ పోర్టల్తను నెలకొల్పడానికి చేసిన కృషిఫలిస్తోంది. ఇప్పటికే ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐ శిక్షణ కేంద్రాలను ఉపయోగించుకుని యువతలో నైపు ణ్యాన్ని పెంపొందించడం, కొత్త స్కిల్ కాలేజీలూ, యూనివర్సిటీలను పెట్టడం ద్వారా యువత ఈ పోటీ ప్రçపంచంలో ముందుకు దూసుకు పోవ డానికి జగన్ చర్యలు చేపడుతున్నారు. 2019 వరకూ ఏపీలో అక్రిడిటేషన్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజి ఒకటే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 33 పాలిటెక్నిక్‌లు గుర్తింపు పొందాయి. ఐటీఐలను అభివృద్ధి చేశారు. ‘నాడు నేడు’ వంటి కార్యక్రమాలతో బడు లను బాగు చేశారు. ఆంగ్ల మాధ్యమాన్ని దిగువ తరగతికి చేరువ చేశారు. ప్రభుత్వ బడులలో కార్పొరేటుకు ధీటుగా విద్యాభ్యాసం జరిగేలా చూశారు. ఈ తరహా పాఠశాల విద్యతో విద్యా ర్థులకు సహజంగానే నైపుణ్య స్థాయి పెరుగుతుందనడంలో సందేహం లేదు. పరిశ్రమలకు అను గుణంగా కోర్సులను ప్రవేశపెడుతూ, వాటితోటై అప్ పెట్టకొని యువతకు ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలను పొందేలా చేసే ‘భవిత’ కార్యక్రమం, సముద్ర తీరంలో ‘మెరైన్ రీసెర్చ్‌సెంటర్’ ఏర్పాటు, తిరుపతిలో ‘స్కిల్ యూని వర్సిటీ’ ఏర్పాటు చేయాలనుకోవడం వంటివి జగన్ విజన్‌కు కొన్ని నిదర్శనాలు మాత్రమే. విశాఖలో జగన్ ప్రసంగం రాష్ట్ర యువత నైపు ణ్యాలు ఎలా పెరగబోతున్నాయో ఆవిష్కరింప చేసింది. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ హబ్, జిల్లా కేంద్రంలో స్కిల్ కాలేజ్, ఇందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు నెలకొల్పు తామంటూ జగన్ చేసిన ప్రకటన యువత నైపుణ్యాల అభివృద్ధి పట్ల ఆయన ఎంత కృత నిశ్చయంతో ఉన్నదీ తేటతెల్లం చేసింది. చదువు పూర్తవ్వగానే ఉపాధి కూడా కలిగేలా చేయాల న్నది ఆయన ఆశయం. అంతేగానీ చంద్రబాబు హయాంలో మాదిరిగా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తామని బీరాలు పలకడం, ఆ తరవాత వదిలె య్యడం తన పద్ధతి కాదని జగన్ చెప్పకనే చెప్పారు.స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయని బాబుకు అనుమానం రావచ్చు. ఆ అనుమానాలను పటాపంచలు చేయ గలిగేలా ఎంపీ లాడ్స్ నిధులలో కొంత శాతాన్ని ఇందుకోసం ఉపయోగించవచ్చని సీఎం జగన్ అంటున్నారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, రాజ్య సభ సభ్యులకు ఏటా వచ్చే ఈ నిధులు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు అక్కరకు వస్తాయన డంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలను మోసగించాలనుకునే వారి ఆలో చనలు ఎప్పడూ తిన్నగా ఉండవు. సదుద్దేశంతో పాండవులు నిర్మించుకున్న మయసభలో దుర్యోధనుడు ఏ విధంగా భంగపడ్డాడో మనందరికీ తెలుసు. ఎంత నగుబాటు పాలయ్యాడో భారత కథ చెబుతుంది. అనంతర పరిణామాలు అతని నాశనానికి దారితీశాయి. ఇప్పుడు చంద్ర బాబు విషయంలో కూడా అదే జరగబోతుందనడంలో సందేహం లేదు. జగన్ నిర్మించిన స్కిల్ సౌధం చంద్రబాబుకు రాజకీయ సమాధిని కట్టడం ఖాయం.ఇదీ బాబు నైపుణ్యానికీ జగన్ సామర్థ్యానికీ మధ్య తేడా. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు ,మొబైల్ : 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాశ్ -
యువతరానికి దిక్సూచి ‘భవిత’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు పారిశ్రామికవేత్తలు ఫిదా అయ్యారు. ‘భవిత’ పేరుతో ప్రారంభించిన స్కిల్ కాస్కేడింగ్ కార్యక్రమం.. యువత భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ దొరుకుతోందని.. ఇక్కడ విద్యార్థుల్ని సానబెడితే అన్ని రంగాల్లోనూ రాణించగల సత్తా ఉందని సూచించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం.. తమలాంటి ఎందరో యువతీ యువకుల జీవన స్థితిగతుల్ని మార్చేసిందని ఉద్యోగాలు పొందిన యువత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నేను కోరుకున్న ఫీల్డ్‌లో స్థిరపడ్డాను మాది విశాఖపట్నం పెదగంట్యాడ. మా నాన్న లిఫ్ట్ ఆపరేటర్, అమ్మ గృహిణి, నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్‌లో స్ధిరప డాలని సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్‌లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు గురించి తెలుసుకొని రిజిస్టర్ చేసుకొని ట్రైనింగ్ తీసుకున్నాను. మాకు టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్‌కు ఎంపికయ్యాను. చెన్నైలోని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో 4 రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. – దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై స్కిల్లింగ్ ఎకో సిస్టమ్‌ని అభివృద్ధి చేసిన ఏపీ.. ఏపీలో యంగ్ సీఎం ఉన్నారు. అందుకే యువతకి అవకాశాలు ఎక్కువగా కల్పించాలన్న ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు. సింగపూర్‌లో స్కిల్లింగ్కి ఏజ్ బార్ లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. దేశంలో స్కిల్లింగ్ ఎకోసిస్టమ్‌ని అభివృద్ధి చేసిన రాష్ట్రం ఆంధప్రదేశ్ మాత్రమే. పదిస్థాయిల్లో శిక్షణ అందించేలా స్కిల్ పిరమిడ్‌ను కూడా సీఎం జగన్ రూపొందించారు. యువతకి నైపుణ్యాన్ని పెంపొందించే ప్రోగ్రామ్ని కూడా తయారు చేశారు. పరిశ్రమలతో అనుసంధానం చేయడంతో వారికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. – బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ఆర్థిక, స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖ మంత్రి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం మా సంస్థని, పెట్టుబడుల్ని ఎంతగానో ప్రోత్సహి స్తోంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రావాలని ఆశిస్తున్నాం. స్కిల్ సెక్టార్ కు ఇది గొప్ప అడుగు. స్కిల్ ఎకో సిస్టమ్‌ని అభివృద్ధి చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం చర్యలకు నిజంగా అభినందనలు. కియా మోటార్స్ ఇండియా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ద్వారా అద్భుత అవకాశాలు ఏపీలో ఉన్న యువతకు అందుతున్నాయి. –కె.గ్వాంగ్లీ, కియా మోటర్స్ ఎండీ కమిట్మెంట్ ఉన్న సీఎం జగన్ దేశంలో ఇప్పటి వరకూ చాలా స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు హాజరయ్యాను. ఇలాంటి కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదు. యువత ముందే పారిశ్రామికవేత్తల్ని కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పడం అద్భుతం. మా సంస్థ విమానాలు తయారు చేస్తుంది. భవిష్యత్తులో విమానయానంలో ఎన్నోరకాల ఉపాధి అవకాశాలున్నాయి. లెర్నింగ్ వింగ్స్ ఫౌండేషన్ అనే స్కిల్లింగ్ భాగస్వామితో పని చేస్తున్నాం. మా సంస్థ సామర్థ్యం మేరకు స్కిల్ ఎకో సిస్టమ్‌కు మద్దతు అందిస్తాం. – ప్రవీణ యజ్ఞంభట్, బోయింగ్ ఇండియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ కెమికల్ ఇంజినీర్స్ అవసరం చాలా ఉంది ఏపీ సెజ్ అచ్యుతాపురంలో మా సంస్థని ఏర్పాటు చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆటమిక్ రీసెర్చ్ ఉత్పత్తుల్లో ఎంతో ఉన్నతి సాధించాం. కెమికల్ ప్రాసెసింగ్ వైపు కూడా మా సంస్థ అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో మాకు కెమికల్ ఇంజినీర్స్ అవసరం ఎంతో ఉంది. నేరుగా నియామకం చేసుకోవాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థులకు మాకు అవసరమైన రీతిలో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల్ని అందించడంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషి అనిర్వచనీయం. – కొయిచీ సాటో, టొయేట్సు రేర్ ఎర్త్ ప్రై.లి., ఎండీ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూలకు హాజరై ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ. 5 లక్షల ప్యాకేజ్‌లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌గా ఏడాదికి రూ. 7.2 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరాగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎంకు నా కృతజ్ఞతలు. – భార్గవ్, విశాఖపట్నం మానవవనరుల్లో మనమే ముందంజ.. అత్యధికంగా నైపుణ్యంతో కూడిన మానవ వనరులున్న రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దడంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరసలో ఉంది. స్కిల్ ట్రైనింగ్ అనేది కేవలం ఉపాధి అవకాశాల్ని అందిస్తోంది. ఐదేళ్లలో 15 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వగా.. 3.8 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇంకొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. సీఎం జగన్ 27 స్కిల్ కాలేజీలు, 192 స్కిల్ హబ్స్, 55 స్కిల్ స్కోప్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. భవిత పేరుతో శిక్షణని అప్‌గ్రేడ్ చేస్తున్నాం. – సురేష్‌కుమార్, ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
రోల్‌మోడల్ స్టేట్‌గా ఏపీ.. జగనన్నకు థ్యాంక్స్
సాక్షి, విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ‘భవిత’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థులతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన యువత ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మధ్య తరగతి కుటుంబం నుంచి.. అందరికీ నమస్కారం.. మాది విశాఖపట్నం పెదగంట్యాడ.. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను.. మా నాన్న ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. అమ్మ గృహిణి. నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్ రంగంలో స్ధిరపడాలని భావించాను. సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్‌లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు నేర్చుకున్నాను. మాకు అక్కడ మంచి శిక్షణ ఇచ్చారు. మాకు టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్‌కు ఎన్నికయ్యాను. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. మా బ్యాచ్‌లో అనేకమంది వివిధ కంపెనీలకు సెలక్ట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, ఏపీ ప్రభుత్వానికి, స్కిల్ డెవలప్మెంట్కు సీడాప్కు అందరికీ కృతజ్ఞతలు. -దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నా.. అందరికీ నమస్కారం.. నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను.. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. ఆ శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాప్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. ఆ తర్వాత 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూకు హాజరయ్యాను, అందులో నేను ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ.5 లక్షల ప్యాకేజ్‌లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ వన్‌గా ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎం గారికి నా కృతజ్ఞతలు. ఏపీ రోల్‌మోడల్ స్టేట్‌గా ఉందని నేను నమ్ముతున్నాను. నాలాగా మరింత మంది యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ -భార్గవ్, విశాఖపట్నం ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్‌కు గూస్ బంప్స్