ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఎస్‌పీఐ కీలక ఒప్పందం | Singapore Polytechnic International Partner With APSSDC To Launch Skill Development | Sakshi
Sakshi News home page

ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఎస్‌పీఐ కీలక ఒప్పందం

Published Thu, Nov 12 2020 9:30 PM | Last Updated on Thu, Nov 12 2020 9:33 PM

Singapore Polytechnic International Partner With APSSDC To Launch Skill Development - Sakshi

సాక్షి అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న నైపుణ్య కళాశాలల్లో భాగస్వామ్యం అవడానికి ప్రముఖ ఐటి సంస్థ ఐబీఎం, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్( ఎస్‌పీఐ), ఎల్వీప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు రావడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎపీఎస్‌ఎస్‌డీసీ కార్యాలయంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము సమక్షంలో ఆన్ లైన్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఎపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఐబీఎం ఇండియా డైరెక్టర్ జగదీశభట్, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేనల్ (ఎస్.పి.ఐ) సంస్థ డైరెక్టర్ జార్జినా ఫువా, ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) ఎండీ జి.కమలవర్థన్ రావు, ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ డైరెక్టర్ ఎ.సాయిప్రసాద్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఐబీఎం ఇండియా
ఐటీ రంగంలో ఏర్పాటు చేయబోయే “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”లో ఐటి రంగంలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలు అందించే సాప్ట్ వేర్ కోర్సుల సంబంధించిన కోర్సులకు అయ్యే ఖర్చులను ఐబీఎం భరిస్తుంది. ఒప్పందంలో భాగంగా కోర్సులు, పాఠ్యాంశాలు, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గెస్ట్ లెక్చర్స్, ఐటి డొమైన్ లై హైఎండ్ ట్రైనింగ్స్, కోడింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్, డేటా సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్, బిగ్ డేటా మరియు ఫుల్ స్టాక్ విభాగాల్లో శిక్షణ ఇస్తుంది. 

ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ
విశాఖపట్నంలో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీ.ఓ.ఈ)ని ఏర్పాటు చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ ముందుకు వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా కోర్సులు మరియు పాఠ్యాంశాలను రూపకల్పన చేస్తారు. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, 2డీ యానిమేషన్ బేసిక్ ట్రైనింగ్, డిజిటల్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ లో బేసిక్స్, వీఎఫ్ఎక్స్ అండ్ డిజిటల్ రిస్టోరేషన్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గెస్ట్ లెక్చర్స్, నేషనల్ అప్రెంటీస్ షిప్ ప్రోగ్రామ్ (న్యాప్స్) కింద అప్రెంటీస్ సపోర్ట్ ఇస్తారు. 

సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేనల్ (ఎస్.పి.ఐ)
అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ఇన్నోవేషన్ & ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ విభాగాల్లో అంతర్జాతీయస్థాయి పరిశ్రమల నేతృత్వంలోని కోర్సులను నైపుణ్య కళాశాలల్లో అందించడానికి అవసరమైన సాంకేతిక సహకారం, నిర్వహణకు సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (ఎస్.పి.ఐ) ముందుకు వచ్చింది. ఈ మేరకు   వారు పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా ల్యాబ్స్, కోర్సులను అభివృద్ధి చేయడం, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్స్, ప్రతిపాదించిన కోర్సుల్లో ఎపిఎస్‌ఎస్‌డిసితో కలిసి సర్టిఫికేషన్, అక్రిడేషన్ ఇవ్వడం, టీచింగ్, లెర్నింగ్ మాడ్యూల్స్ ఫ్రేమ్‌వర్క్‌ను మరింత అభివృద్ధి చేస్తారు.

ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)
హాస్పిటాలిటీ సెక్టార్‌లో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటు చేయబోయే “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”కు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా హాస్పిటాలిటీ రంగంలో కోర్సులు మరియు పాఠ్యాంశాలు, అధ్యయన అంశాలను ఐటిడిసి రూపొందిస్తుంది. హాస్పటాలిటీ ట్రేడ్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బేవరేజ్ ఆపరేషన్స్, ఎంట్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ లో ఎపిఎస్‌ఎస్‌డిసి ద్వారా నమోదు చేసుకున్న విద్యార్థులు / నిరుద్యోగ యువతకు ఐటిడిసి శిక్షణ ఇస్తుంది.

నైపుణ్య శిక్షణ మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగాల్లో రాష్ట్రాన్ని అత్యుత్తమస్థాయిలో ఉన్నత ప్రమాణాలను పెంపొందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న స్కిల్‌ కాలేజీల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటి వరకు 13 సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద తీరప్రాంతం మన రాష్ట్రానికి ఉంది. ఇక్కడ టూరిజం, హాస్పటాలిటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి. 
- చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్కిల్ కాలేజీల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలతో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉంది.
-జి. అనంతరాము, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement