APSSDC
-
'స్కిల్' దొంగ బాబే
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో చంద్రబాబే అవినీతి తిమింగళం అని మరోసారి నిగ్గు తేలింది. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఆయన గారు సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కయ్యింది. అసలు జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్‌ను కాగితాలపై సృష్టించడం.. రూ.370 కోట్ల ప్రాజెక్ట్ వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచడం.. సీమెన్స్ కంపెనీ పేరున జీవో జారీ చేసి, తన బినామీ కంపెనీ డిజైన్ టెక్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం.. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు రూ.271 కోట్లు విడుదల చేయడం.. షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులు తన నివాసానికే చేర్చడం.. పైగా అంతా పద్దతి ప్రకారం చేశామంటూ అడ్డగోలుగా వాదించడం.. మరోమారు చర్చకు వచ్చింది. సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్ వంటి ఎన్నో కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన అక్రమ నిధుల తరలింపు కోసం ఏర్పాటు చేసుకున్న అవినీతి నెట్వర్క్ గుట్టును సీఐడీ ఛేదించడం.. స్కిల్ స్కామ్‌లో ఏసీబీ కోర్టు బాబుకు రిమాండ్ విధించడం.. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉండటంతో ఏసీబీ కోర్టు తీర్పులో, విచారణలో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పడం చూస్తుంటే చంద్రబాబే అసలు దొంగ అని మరోసారి ఎలుగెత్తి చాటినట్లయింది. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ప్రాజెక్ట్‌ను రూపొందించిందీ ఆయనేనని, అక్రమంగా మళ్లించిన నిధులు చేరింది ఆయన నివాసానికే అన్నది సీఐడీ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. దాంతో సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసింది. కీలక ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్‌షీట్ నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కార్మీక శాఖ మంత్రిగా వ్యవహరించిన కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆయనకు జ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఖైదీ నంబర్ 7691గా ఆయన అక్కడ 52 రోజులు జ్యుడిíÙయల్ రిమాండ్‌లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత అనారోగ్య కారణాలను చూపిస్తూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజనరీగా వేసుకున్న ముసుగు తొలగి చంద్రబాబు ఏ–1 అన్న నిజం ప్రపంచానికి తెలిసింది. స్కిల్ స్కామ్ ఎలా సాగిందంటే.. సీమెన్స్ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టు ► డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్యాల శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ఆ కంపెనీకి ఏమాత్రం తెలియకుండానే ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కని్వల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ► విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు జీవో జారీ చేశారు. కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేశారు. తద్వారా సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. ► ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావును ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు. ► ఉన్నత విద్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించడానికి కుతంత్రం పన్నారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్‌భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి వ్యతిరేకమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ► సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు ► డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. టీడీపీ ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ► మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. అమెరికాకు శ్రీనివాస్.. దుబాయ్‌కి మనోజ్ ► అక్రమ నిధుల తరలింపు పాత్రధారులు చంద్రబాబు ఆదేశాలతో విదేశాలకు పరారయ్యారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని దుబాయ్‌కు ఉడాయించారు. టీడీపీ హయాంలోనే 2017లోనే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. ► కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ప్రాజెక్ట్ గురించి తెలియదన్న సీమెన్స్ ► సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్ బోస్‌ను పదవి నుంచి తొలగించింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్ స్కామ్‌లో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ► తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని.. కేవలం ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) స్పష్టం చేసింది. సీఐటీడీ నివేదిక ఇవ్వక మునుపే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది. ► ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. షెల్ కంపెనీల లావాదేవీల విషయాన్ని గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ శుక్రవారం జప్తు చేసింది. మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని ఇప్పటికే విచారించింది. పలువురిని అరెస్టు చేసింది. ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని కాగ్ కూడా నిగ్గు తేలి్చంది. ఈ వాస్తవాల కారణంగానే.. ఈ కేసు 2017లో నమోదైనందున చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు కూడా చెప్పడం గమనార్హం. న్యాయ నిపుణులు కూడా పాత కేసులకు పాత చట్టమే వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. నో రూల్స్.. రూ.371 కోట్లు ఇచ్చేయండి ► సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అయినా ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించేశారు. ► అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని పీవీ రమేశ్ తన నోట్ ఫైల్లో పొందుపరిచారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా ఒప్పుకోలేదు. అయినప్పటికీ చంద్రబాబు.. గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. ► దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. అప్పటి సీఎం ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం 13 నోట్ ఫైళ్లలో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంతకాలు చేశారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు 5 చోట్ల సంతకాలు చేశారు. -
నేరాలకు దూరంగా... ఉపాధికి దగ్గరగా..!
ఆరిలోవ(విశాఖ తూర్పు): వివిధ కేసుల్లో శిక్ష పడి జైలులో ఉన్న ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఖైదీలకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పించి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తోంది. తాజాగా ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతోపాటు జైలు నుంచి విడుదలయ్యాక నేర ప్రవృత్తిని విడనాడి అందరిలాగే పనిచేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల విశాఖ కేంద్ర కారాగారంలో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో వివిధ విభాగాలకు చెందిన సోషల్ వర్కర్లను సభ్యులుగా నియమిస్తారు. దీనికోసం ఈ నెల 5న సోషల్ కౌన్సెలర్, ఎన్జీవోలు, సోషల్ వర్కర్లు, సైకాలజిస్ట్‌లు, వెల్ఫేర్ ఆఫీసర్లు, బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేంద్ర కారాగారంలో సమావేశం నిర్వహించారు. వారిలో ఐదుగురిని ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు. సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏం చేస్తారంటే... ► ఖైదీలకు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి ప్రవర్తనలో మంచి మార్పు తీసుకువస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కృషి చేస్తారు. ► ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రతినిధులు వచ్చి ఖైదీలకు వివిధ చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయినవారికి సర్టీఫికెట్ అందజేస్తారు. ► ఈ శిక్షణ వల్ల ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత సమాజంలో పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ► ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన సర్టిఫికెట్ ఉన్న ఖైదీలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ► ఈ చర్యల వల్ల ఖైదీల్లో నేరప్రవృత్తి తగ్గుతుందని, ఆర్థికంగా ఎదిగి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
‘స్కిల్’ శిక్షకులకు ఆహ్వానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన 192 స్కిల్ హబ్స్, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేసిన మరో 26 స్కిల్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ఔత్సాహికుల నుంచి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతి జాబ్ రోల్‌కు ఒక సర్టిఫైడ్ ట్రైనర్ చొప్పున మొత్తం 2,000 మంది శిక్షకులు అవసరమవుతారని ఏపీఎస్ఎస్డీసీ అంచనా వేసింది. అర్హత కలిగిన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ తరగతులపై ట్రైనింగ్ ఇచ్చి శిక్షకులుగా ఎంపిక చేస్తామని, ఇందుకు సంబంధించిన నిర్వహణ విధివిధానాలు (ఎస్వోపీ)ని రూపొందించినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ సీఈవో వినోద్‌కుమార్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఆసక్తిగలవారికి కేంద్ర నైపుణ్య శిక్షణ ఎన్ఎస్క్యూఎఫ్ ప్రమాణాల ప్రకారం నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత శిక్షకులుగా సర్టిఫికెట్ జారీచేసి ఏపీఎస్ఎస్డీసీ ఎంపానల్మెంట్లో నమోదు చేస్తామని చెప్పారు. మొత్తం 20 రంగాలకు చెందిన 44 జాబ్ రోల్స్‌లో శిక్షకులను నియమించనున్నట్లు వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ పోర్టల్ https://skilluniverse.apssdc.in/ user®istration లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకుని ఎంపికైన అభ్యర్థులను ఏపీ స్కిల్ యూనివర్సల్ పోర్టల్ లేదా యాప్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఆయా కోర్సుల్లో శిక్షణ అవసరమైనప్పుడు వీరు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని, శిక్షణా వ్యయంలో సుమారు 13 శాతం వరకు శిక్షకులకు పారితోషికంగా ఇస్తామని, కోర్సును బట్టి వీటి ఫీజులు మారుతుంటాయని వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం తీసుకురావడమే కాకుండా దానికి అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి పిరమిడ్ ఆకృతిలో ఒక ఎకో సిస్టమ్‌ను రూపొందించారు. ఇంటర్మీడియెట్లోపు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ హబ్స్, ఆపైన విద్యార్థులకు స్కిల్ కాలేజీలు, హైఎండ్ స్కిల్ శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
తెలీదు.. గుర్తులేదు అంటూ సీఐడీకి సహకరించని చంద్రబాబు
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తొలిరోజు శనివారం విచారించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ని రెండ్రోజుల సీఐడీ కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు అధికారి ధనుంజయ నేతృత్వంలో సిట్ బృందం చంద్రబాబును సెంట్రల్ జైలులోనే కస్టడీలోకి తీసుకుని విచారించింది. న్యాయస్థానం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఆయన్ను విచారించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గతంలో సిట్ కార్యాలయంలో జరిగిన విచారణలో చెప్పినట్లుగానే ‘నాకు తెలీదు.. గుర్తులేదు’.. అంటూ సమాధానాలు దాటవేసేందుకే చంద్రబాబు ప్రయత్నించినట్లు తెలిసింది. పక్కా పన్నాగంతో తొలిరోజు విచారణలో ఆయన దాదాపు సగం సమయం వృథా అయ్యేటట్లు చేయగలిగారు. దాంతోపాటు సిట్ అధికారుల ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకే ఆయన ప్రాధాన్యమిచ్చారు. రెండ్రోజుల కస్టడీ సమయాన్ని వీలైనంత వరకు వృథా చేయాలన్నదే చంద్రబాబు ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ సిట్ అధికారులు పూర్తి సంయమనం, ఓపికతో వ్యవహరించి తొలిరోజు విచారణ ప్రక్రియను పూర్తిచేశారు. సమీపం నుంచి పరిశీలించేందుకు చంద్రబాబు న్యాయవాదులను అనుమతించారు. విచారణ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు కాలహరణం.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాక్‌కు సమీపంలోని కాన్ఫరెన్స్ హాలులో సిట్ అధికారులు చంద్రబాబును విచారించారు. అందుకోసం ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతోపాటు మొత్తం 12 మందితో కూడిన సిట్ బృందం శనివారం ఉ.9.30 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకుంది. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విచారణ ప్రక్రియను ప్రారంభించారు. అంతకుముందు.. తనను కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల కాపీ కావాలని చంద్రబాబు అడిగారు. 20 పేజీల ఆ కాపీని అధికారులు ఆయనకిచ్చారు. దానిని చదివే నెపంతో చంద్రబాబు చాలాసేపు కాలహరణం చేశారు. అయినప్పటికీ సిట్ అధికారులు ఓపిగ్గా వేచి చూసి ఆయన సరే అన్నాకే విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ప్రశ్నావళిలో 30 శాతమే తొలిరోజు.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో వెల్లడైన కీలక ఆధారాల ప్రాతిపదికగా రూపొందించిన ప్రశ్నావళిని అనుసరించి సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో సిట్ కార్యాలయంలో జరిగిన విచారణలో చెప్పినట్టుగానే ‘నాకు తెలీదు.. గుర్తులేదు’.. అంటూ సమాధానాలు దాటవేసేందుకే చంద్రబాబు ప్రయత్నించారు. కొన్ని ప్రశ్నలకు అవి సంబంధిత అధికారులను అడగాలిగానీ తనను కాదని వ్యాఖ్యానించారని సమాచారం. కీలక పత్రాలను ఆయన ముందుంచి మరీ వాటిపై ప్రశ్నించినా సరే ఆయన సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. విచారణకు చంద్రబాబు ఏమాత్రం సహకరించకపోవడంతో ప్రశ్నావళిలోని 30 శాతం ప్రశ్నలను కూడా సీఐడీ అధికారులు అడగలేకపోయారు. రెండ్రోజుల కస్టడీ సమయాన్ని వీలైనంత వరకు వృథా చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశమన్నది స్పష్టమైంది. అయినప్పటికీ అధికారులు పూర్తి సహనంతో వ్యవహరించి తమ ప్రశ్నలను కొనసాగించారు. ప్రతి గంటకూ ఐదు నిముషాల పాటు విరామం ఇవ్వడంతోపాటు చంద్రబాబు కోరిన అదనపు సమయాల్లోనూ విచారణ ప్రక్రియను నిలుపుదల చేశారు. గంటసేపు మధ్యాహ్న భోజన విరామం ఇచ్చారు. అలా తొలిరోజు నాలుగు దశల్లో విచారించారు. అనంతరం.. చంద్రబాబు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావుల సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని స్నేహబ్లాక్‌కు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత.. చంద్రబాబు కస్టడీ విచారణ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. జైలు లోపల, బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 మంది ఆక్టోపస్, సివిల్ పోలీసు బృందాలను మొహరించారు. తొలిరోజు విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందం ఫైళ్లు, వీడియో రికార్డింగ్ సామగ్రి మొత్తం తీసుకుని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకుంది. మీడియాపై బాలకృష్ణ చిందులు.. మరోవైపు.. నందమూరి బాలకృష్ణ తన నైజాన్ని ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లపై చిందులు తొక్కారు. రాజమహేంద్రవరం విద్యానగర్‌లోని లోకేశ్ క్యాంప్ ఆఫీసు వద్ద శనివారం పార్టీ నేతలతో మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న విలేకరులు, ఫొటోగ్రాఫర్లపై ఆయన మండిపడ్డారు. క్యాంప్ వద్ద ఉన్న ఈనాడు ఫొటోగ్రాఫర్‌పై ఆయన తీవ్రస్థాయిలో చిందులు తొక్కారు. తాను ఈనాడు ఫొటోగ్రాఫర్‌నని ఆయన చెబితే.. ‘అయితే ఏంటి బొక్కా..’ అంటూ బాలకృష్ణ అసభ్యకరంగా మాట్లాడటం అందరినీ విస్మయపరిచింది. -
స్కిల్‌స్కామ్‌లో యెల్లో బ్యాచ్‌కు చెంపపెట్టు సమాధానం ఇది
ప్రతిష్ట్మాతక కేంద్ర సంస్థ CITD (Central institute of Tool Design) కన్నా, ప్రైవేట్ సంస్థే ముద్దా? అంటూ టీడీపీ, దాని అనుకూల మీడియా గగ్గోలు పెడతోంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మదింపులో సీఐడీటీ నివేదికను పరిగణలోకి తీసుకోరా? ఒక్కో క్లస్టర్‌కు రూ.559 కోట్లుగా సీఐటీడీ నివేదికను ఎందుకు పట్టించుకోలేదంటున్న వారి ప్రశ్నల నేపథ్యంలో వాస్తవాలేంటో ఒకసారి పరిశీలిద్దాం.! స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమల్లో CITDని తమ పథకానికి అనుగుణంగా చంద్రబాబు, వారి మనుషులు వాడుకున్నారు. వాస్తవంగా ప్రాజెక్టు ప్రారంభానికి ఇలాంటి సంస్థలతో వాల్యూషన్ చేయించడం అన్నది నిబంధనల ప్రకారం జరిగే ప్రక్రియ. కాని విచిత్రంగా జీవో విడుదల చేశాక, దానికి విరుద్ధంగా MOU చేసుకున్నాక, ప్రాజెక్టులో నిర్ణయించుకున్న ప్రకారం రూ.371 కోట్లలో 90శాతం డబ్బంతా విడుదల చేసిన తర్వాత CIDT ఇండిపెండెంట్‌గా మదింపు చేయని, ప్రిలిమినరీ రిపోర్టును వాల్యూయేషన్గా చూపించే ప్రయత్నాన్ని టీడీపీ, ఎల్లోమీడియా చేస్తోంది. ఈ వ్యవహారంలో వాస్తవాలేంటో సీఐటీడీయే దర్యాప్తు అధికారుల ముందు వెల్లడించింది. ప్రాజెక్టుపై మదింపు నివేదిక ఇవ్వాలంటూ APSSDC అధికారులు, డిజైన్ టెక్ ప్రతినిధులు 2015 డిసెంబర్ 18న సీఐడీటీని కోరారు. 2016 మార్చి 22న సీఐటీడీ వీరు అడిగిన మేరకు ఒక ప్రాథమిక రిపోర్టు ఇచ్చింది. వాస్తవంగా అప్పటికే 90శాతం డబ్బును చంద్రబాబునాయుడు తాను అనుకున్నట్టుగా డిజైన్ టెక్కు విడుదలచేశారు. సీఐటీడీని నివేదిక కోరడానికి రెండువారాల ముందే ♦ 2015 డిసెంబర్ 5నే రూ.185 కోట్లు, ♦ 2016 జనవరి 29న రూ.85 కోట్లు, ♦ 2016మార్చి 11న రూ.67 కోట్లు విడుదల చేశారు. ♦ 2016 మార్చి 22న సీఐటీడీ ప్రిలిమినరీ రిపోర్టు వచ్చేలోగానే ♦ రూ.337 కోట్లు అంటే 90శాతం సొమ్ము డిజైన్ టెక్ కంపెనీకి ఇచ్చేశారు. ఇది జరిగిన మరో 9 రోజులకు అంటే 2016 మార్చి 31న మిగిలిన రూ.34 కోట్లు కూడా విడుదల చేశారు. 90శాతం డబ్బులు ఇచ్చేశాక నివేదిక తీసుకోవడం ఏంటి? ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? అలాగే APSSDC ప్రాజెక్ట్‌పై తాము ఇండిపెండెంట్‌గా మందింపు చేయలేదని CITD స్పష్టం చేసింది. అప్పటి సీమెన్స్ ఇండియా ఎండీ సుమన్‌బోస్ నుంచి వచ్చిన వివరాల ప్రాతిపదికనే ప్రిలిమనరీ రిపోర్టు ఇచ్చామని స్పష్టం చేసింది. వారిచ్చిన ఇ-మెయిల్స్‌ను ఆధారంగా చేసిన ఈ రిపోర్టు ఇచ్చామని CITD వెల్లడించింది. సాఫ్ట్వేర్ విలువను మదింపు చేసే సామర్థ్యం తమకు లేదని కూడా చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ క్లస్టర్లను స్వయంగా పరిశీలించి అక్కడి సాఫ్ట్వేర్, మౌలిక వసతులను పరిశీలించి ప్రాజెక్ట్ వ్యయాన్ని అంచనా వేయాల్సి ఉంటుందని, కానీ తమను ఆ విధంగా మదింపు నివేదిక ఇవ్వాలని అసలు APSSDC కోరనే లేదని CITD విచారణలో వెల్లడించింది. 2.13 లక్షలమంది శిక్షణ పొందారని, 80వేల మందికి ఉద్యోగాలు వచ్చాయంటున్న TDP, దాని అనుకూల మీడియా.. విద్యార్థులు, యువతలో నైపుణ్యాభివృద్ధికోసం ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తూనే ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకూ, సీమెన్స్ కోసం విడుదలచేసిన రూ.371 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.745.66 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరాల్లోకూడా అనేక రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా తాము తెచ్చామంటున్న రూ.3300 కోట్ల ప్రాజెక్టు కిందే చేపట్టామన్న తప్పుడు ప్రచారాన్ని లోకేష్, టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తున్నారు. అసలు 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రాజెక్టు తమ వద్ద లేదని, ఏపీ స్కిల్‌డెవల్‌మెంట్ ప్రాజెక్టులో తాములేమని సీమెన్స్ స్వయంగా చేసిన ఇంటర్నెల్ ఆడిట్ నివేదికలోనూ, దర్యాప్తు అధికారులతోనూ చెప్పింది. 164 CRPC కింద కూడా స్పష్టం చేసింది. మరి సీమెన్స్ లేనప్పుడు ఆ ప్రాజెక్టు కింద ఇన్ని లక్షలమంది శిక్షణ పొందారని ఎలా చెప్తారు? అలాగే ఆ ప్రాజెక్టు లేని సమయంలో కూడా వివిధ సంవత్సరాల్లో నైపుణ్యాభివృద్ధికోసం బడ్జెట్‌ద్వారా ఖర్చు చేసి, ఆ కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులను, చంద్రబాబు ఫేక్ ప్రాజెక్టులో భాగంగా ఎలా చూపిస్తారు? -
స్కిల్ కుంభకోణం సూత్రధారి చంద్రబాబే
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం ప్రధాన సూత్రధారి అని నిర్ధారణ అయినందునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశామని సీఐడీ అదనపు డీజీ సంజయ్ స్పష్టం చేశారు. సీమెన్స్ అనే కంపెనీ ఉదారంగా రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పడంతోపాటు అలానే జీవోలు జారీ చేసి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల వ్యవధిలో రూ.371 కోట్లు ప్రాజెక్టు నిమిత్తం హడావుడిగా విడుదల చేసి అవినీతికి పాల్పడ్డారని వెల్లడించారు. ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమెన్స్ కంపెనీ ద్వారా ఏపీలో ఆరు క్లస్టర్లుగా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. జీవోలో నిధుల వెచ్చింపు 90ః10 నిష్పత్తిగా చెప్పిన్పటికీ ఒప్పందంలో మాత్రం ఆ ప్రస్తావనే లేదని చెప్పారు. అయితే వాస్తవంగా సీమెన్స్ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ గురించే తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా కింద రూ.371 కోట్లు విడుదల చేసి, 2015–16లో అందులోంచి రూ.271 కోట్లు ఇతర సంస్థలకు అక్రమంగా నిధులు మళ్లించారని చెప్పారు. సీమెన్స్ కంపెనీకి తెలియదు సీమెన్స్ కంపెనీకే తెలియకుండా ఆ కంపెనీ మాజీ ఎండీ సుమన్‌బోస్ ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారని సంజయ్ తెలిపారు. ఆ విషయాన్ని సీమెన్స్ కంపెనీ కూడా గుర్తించిందన్నారు. నిందితుల్లో ఒకరైన సుమన్ బోస్.. ఒప్పందం కుదిరిన రోజున విద్యుత్తు లేనందున కొవ్వొత్తుల వెలుగులో సంతకాలు చేశామని.. కాబట్టి అందులో వివరాలు సరిగా చూడలేదని చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ విద్యుత్తు రాలేదా అని ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రైవేటు వ్యక్తి అయిన గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టి, ప్రభుత్వ అధికారులపై పెత్తనం అప్పగించడం.. ఆయన చెప్పినట్టే నిధులు విడుదల చేయాలని చెప్పడం ఏమిటని నిలదీశారు. నిధులు విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు సమావేశం మినిట్స్ రికార్డులను గంటా సుబ్బారావు చూపించినట్టు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారన్నారు. త్వరలో మరో ఏడుగురి అరెస్ట్ కుంభకోణం తాలూకు ఫైళ్లలో చంద్రబాబు 13 డిజిటల్ సంతకాలు చేశారని సంజయ్ తెలిపారు. మొత్తం కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఆధారాలతోసహా బయట పడటంతోనే ఆయన్ను అరెస్ట్ చేశామని, ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించిందన్నారు. ఈ కేసులో మరో ఏడుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు. స్కిల్ కుంభకోణంపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తూ ఇప్పటికే సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ ఖని్వల్కర్, స్కిల్లర్ ప్రైవేట్ లిమిలెడ్ మాజీ ఆర్థిక సలహాదారు ముకుల్ చంద్ర అగర్వాల్, సీఏ సురేష్ గోయెల్లను అరెస్ట్ చేసిందన్నారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ లక్షల డాలర్లు లాటరీ తగలిందని చెప్పి అందులో పది శాతం కడితేనే మొత్తం ఇస్తాననే రీతిలో ఈ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. తేదీ, లెటర్ నంబరు లేకుండా ఒప్పందం చేసుకోవడం ఎక్కడన్నా జరుగుతుందా.. అని ప్రశ్నించారు. ఈ కేసులో ముద్దాయిలు సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. -
Fact Check: మదింపు బూటకం.. నివేదిక నాటకం
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు సరైనవేనని నిర్థారిస్తూ పది గంటలపాటు విచారించిన అనంతరం న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. ఎల్లో మీడియా మాత్రం దీనికి విరుద్ధంగా సొంత తీర్పులు ఇచ్చేస్తూ పతాక శీర్షికల్లో కథనాలను ప్రచురించడం విస్మయపరుస్తోంది. టీడీపీ హయాంలో తెరపైకి తెచ్చిన ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ సరైందేనంటూ ‘సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) థర్డ్ పార్టీగా మదింపు జరిపి నివేదిక సమర్పించిందంటూ వక్రీకరించి ప్రజల్ని నమ్మించేందుకు రామోజీ నానా పాట్లు పడ్డారు. అయితే తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని... అది కేవలం ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని ‘సీఐటీడీ’ స్పష్టం చేయడం గమనార్హం. మదింపు నివేదిక ఇవ్వాలంటే ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. కానీ తాము అసలు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌ను పరిశీలించనే లేదని సీఐటీడీ తేల్చి చెప్పింది. పోనీ ఈనాడు చెబుతున్నట్టుగా సీఐటీడీ మదింపు నివేదిక ఇచ్చిందని భావించినా సరే.. అంతకంటే కంటే ముందుగానే నిబంధనలకు విరుద్ధంగా డిజైన్ టెక్ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ఈ ప్రాజెక్ట్‌లో అవినీతిని రుజువు చేస్తోంది. అది కేవలం పత్రాల పరిశీలనే ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌పై తాము ఎలాంటి మదింపు నివేదిక ఇవ్వలేదని సీఐటీడీ స్పష్టం చేసింది. మదింపు నివేదిక ఇవ్వాలంటే తమ బృందం స్కిల్ డెవలప్మెంట్ క్లస్టర్లను స్వయంగా పరిశీలించి అక్కడి సాఫ్ట్వేర్, మౌలిక వసతులను పరిశీలించి ప్రాజెక్ట్ వ్యయాన్ని అంచనా వేయాల్సి ఉంటుందని, కానీ తమను ఆ విధంగా మదింపు నివేదిక ఇవ్వాలని అసలు ఏపీఎస్ఎస్డీసీ కోరనే లేదని సీఐటీడీ తెలిపింది. ఏపీఎస్ఎస్డీసీ అధికారులు, డిజైన్ టెక్ ప్రతినిధులు తమ వద్దకు వచ్చి ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పత్రాలను మాత్రమే అందించి పరిశీలించాలని కోరినట్లు పేర్కొంది. అంటే ఏపీఎస్ఎస్డీసీ జీవోలో పేర్కొన్నట్టుగా సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లో 90 శాతం నిధులను వెచ్చించాయో లేదో కూడా సీఐటీడీకి తెలియదు. ప్రభుత్వ వాటా రూ.370 కోట్లు విడుదల చేయవచ్చో లేదో కూడా ఆ సంస్థకు అవగాహనే లేదు. కేవలం ఏపీఎస్ఎస్డీసీ అధికారులు ఇచ్చిన పత్రాల్లో ఉన్నవాటిని చూసి తాము నివేదిక ఇచ్చామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ రూ.3,330 కోట్లు విలువ చేస్తుందని తాము నిర్ధారించినట్టు కాదని, రూ.371 కోట్లు ప్రభుత్వ వాటా విడుదల చేసేందుకు సమ్మతించినట్లూ కాదని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌ను భౌతికంగా పరిశీలించకుండా మదింపు నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పింది. ఈమేరకు సీఐటీడీ ఉన్నతాధికారులు సీఐడీ విచారణలో స్పష్టమైన వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముందే నిధుల విడుదల పత్రాల పరిశీలనే మూడో పార్టీ నివేదిక అని బుకాయించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. పత్రాలన్నీ పరిశీలించి సీఐడీటీ నివేదిక ఇచ్చిన తరువాతే నిధులు విడుదల చేయాలి. టీడీపీ సర్కారు దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఏపీఎస్ఎస్డీసీ అధికారులు, డిజైన్ టెక్ ప్రతినిధులు కొన్ని పత్రాలు సమర్పించి నివేదిక ఇవ్వాలని సీఐటీడీని 2015 డిసెంబర్ 5న కోరారు. ఆ సంస్థ తన నివేదికను 2016 మార్చి 31న ఇచ్చింది. కానీ ఆ నివేదికతో నిమిత్తం లేకుండానే, అంతకంటే ముందే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది. 2015 డిసెంబర్ 5న రూ.185 కోట్లు, 2016 జనవరి 29న రూ.85 కోట్లు, మార్చి 11న రూ.67 కోట్లు విడుదల చేశారు. మూడు విడతల్లో రూ.337 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి ఇచ్చేశారు. చివరగా 2016 మార్చి 31న మిగిలిన రూ.34 కోట్లు కూడా విడుదల చేశారు. అంటే సీఐటీడీ తన మదింపు నివేదికలో ఏం చెప్పిందో పరిశీలించకుండానే, సమీక్షించకుండానే నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు అవినీతికి అదే నిదర్శనం. -
మా పేరుతో.. పచ్చి మోసం
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) పేరుతో చంద్రబాబు సర్కారు సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలతో కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంలో కుతంత్రం బట్టబయలైంది. తమ పేరుతో కుదుర్చుకున్నట్లు చెబుతున్న ఒప్పందం గురించి తమకు ఏమాత్రం సంబంధం లేదని, అసలు ఆ ఒప్పందం గురించే తమకు తెలియదని సీమెన్స్ కంపెనీ వెల్లడించింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద తాము 90 శాతం నిధులను సమకూరుస్తామని చెప్పలేదని స్పష్టం చేసింది. మోసపూరితంగా తమ కంపెనీ పేరును వాడుకుంటూ దీన్ని రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా చూపారని తెలిపింది. ఈమేరకు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఏపీఎస్ఎస్డీసీకి పంపిన ఈ–మెయిల్‌తో వాస్తవాలు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని బుకాయించేందుకు ఓ పత్రికా ప్రకటన జారీ చేసిన టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.370 కోట్లలో రూ.70 కోట్లతో సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని అందులో పేర్కొంది. మరి మిగిలిన రూ.300 కోట్లు ఏమయ్యాయో వెల్లడించకపోవడం ద్వారా ఆ నిధులు కొల్లగొట్టినట్లు పరోక్షంగా అంగీకరించింది. ప్రభుత్వ వాటాగా 10 శాతం నిధులను విడుదల చేశామని పేర్కొన్న టీడీపీ మరి 90 శాతం కింద సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలు నిధులు ఎందుకు సమకూర్చలేదనే విషయాన్ని మాత్రం దాటవేయడం గమనార్హం. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు సర్కారు నిధులు కొల్లగొట్టిన విషయాన్ని సీఐడీతోపాటు ఈడీ కూడా నిర్ధారించిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు టీడీపీ చేసిన యత్నాలు ఫలించలేదు. 90 శాతం నిధులా..? వంద శాతం మోసమే మాజీ సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా సీమెన్స్ కంపెనీ ముసుగులో ఒప్పందం పేరిట భారీ అవినీతికి పాల్పడినట్లు ఆ కంపెనీ పంపిన ఈ – మెయిల్‌తో స్పష్టమైంది. ఏపీఎస్ఎస్డీసీకి పంపిన ఈ – మెయిల్లో సీమెన్స్ ఇంకా ఏం చెప్పిందంటే.. ఆ ఒప్పందంలో మేం భాగస్వాములం కాదు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు ఒప్పందం గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. అందుకు మేం బాధ్యత వహించం. ఆ ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూరుస్తామని మేం ఎక్కడా చెప్పలేదు. మా కంపెనీ పేరుతో సుమన్ బోస్‌తోపాటు జీవీఎస్ భాస్కర్, భావనా గుప్తా, ప్రతాప్ బొంతా, రాహుల్ సెహ్గల్, ఆశీష్ శర్మ, సతీశ్ కురుప్ తదితరులు ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. 90 శాతం నిధులను సమకూరుస్తామని వారు ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి సీమెన్స్ కంపెనీ బాధ్యత వహించదు. డిజైన్ టెక్ కంపెనీతో కలసి సుమన్ బోస్ దురుద్దేశపూరితంగా వ్యవహరించారు. మోసపూరితంగా రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా పేర్కొన్నారు. సీమెన్స్ కంపెనీ 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తుందని సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ, ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం పూర్తిగా మోసపూరితం. ఆ ఒప్పందంలో మేం భాగస్వాములం కాము. మాకు సంబంధం లేదు.’ గంటా సుబ్బారావు దరఖాస్తే చేయలేదు ఏపీఎస్ఎస్డీసీ ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం మా కంపెనీకి ఎలాంటి దరఖాస్తూ చేయలేదు. సీమెన్స్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఎస్‌ఐఎస్‌డబ్లూ భారత్‌లో మా సాఫ్ట్ట్వేర్ విక్రయాలను పర్యవేక్షిస్తుంది. కానీ ఆ కంపెనీ భారత్‌లో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం లేదు. కాబట్టి మేం 90 శాతం నిధులు సమకూరుస్తామనే ఒప్పందం పూర్తిగా బోగస్. సుమన్ బోస్ చాటింగ్, ఈ మెయిల్స్ ఇవిగో.. మా కంపెనీ ముసుగులో సుమన్ బోస్, ఇతరులు డిజైన్ టెక్‌తో జరిపిన ఈమెయిల్స్, వాట్సాప్ చాటింగ్, బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేశారు. వాటిని మేం రిట్రీవ్ చేసి నాలుగు డ్రైవ్‌లలో మీకు అందిస్తున్నాం. మా కంపెనీ ముసుగులో చేసిన మోసం కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాం. అయితే మాత్రం అరెస్టులా..? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎలాంటి అవినీతి జరగలేదని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. “ఔను నిధులు కొల్లగొట్టాం.. అయితే మాత్రం కేసు పెడతారా..? అరెస్ట్‌లు చేస్తారా..? అలాగైతే అది వేధించడమే...!’ అనే తరహాలో వితండవాదం చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. అంశాలవారీగా టీడీపీ వాదనలో డొల్లతనం ఇదీ... రూ.300 కోట్లు లూటీని ఒప్పుకున్న టీడీపీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.3,300 కోట్లతో సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నామని, అందులో 90 శాతం నిధులను సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు ఇవ్వాలని, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాలన్నది ఒప్పందమని టీడీపీ పేర్కొంది. గత ప్రభుత్వం తన వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లు విడుదల చేసినట్లు కూడా అంగీకరించింది. అందులో సీమెన్స్ కంపెనీ నుంచి డిజైన్ టెక్ కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ కోసం రూ.70 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. ( వాస్తవానికి డిజైన్ టెక్ రూ.56 కోట్లే చెల్లించింది. ఆ విషయాన్ని సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్లో వెల్లడించింది. టీడీపీ వాదనను పరిగణలోకి తీసుకుని రూ.70 కోట్లు చెల్లించారని భావించినా మిగిలిన రూ.300 కోట్లు ఏం చేశారన్న దానిపై మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేయడం గమనార్హం. అంటే ఆ రూ.300 కోట్లను కొల్లగొట్టినట్లు ఆ పార్టీనే పరోక్షంగా ఒప్పుకుంది. 90 శాతం నిధులతో సాఫ్ట్వేర్ ఎక్కడ? సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90 శాతం నిధులు సమకూరుస్తాయన్నది ఒప్పందం అని టీడీపీ పేర్కొంది. మరి ఆ మొత్తాన్ని సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు వెచ్చించాయా? లేదా? అన్న విషయాన్ని మాత్రం టీడీపీ వెల్లడించ లేదు. 90 శాతం రాయితీతో సాఫ్ట్‌వేర్‌ను సీమెన్స్ సంస్థ రూ.70 కోట్లకు సమకూర్చిందని చెబుతోంది. మరి అలాంటప్పుడు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లుగా ఎందుకు చూపినట్లు..? అందులో ప్రభుత్వ వాటా కింద 10 శాతాన్ని జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు ఎందుకు చెల్లించినట్లు? నిధులు కొల్లగొట్టేందుకే రూ.70 కోట్ల ప్రాజెక్ట్‌ను ఏకంగా రూ.3,300 కోట్లుగా కాగితాలపై చూపించి అడ్డగోలుగా ప్రజాధనాన్ని కాజేసినట్లు టీడీపీ ప్రకటనే చెబుతోంది. బాబు ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా నిధులు స్కిల్ స్కామ్‌లో నిధుల విడుదలకు అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రులది బాధ్యత కాదని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉంది. అప్పటి ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా నాటి సీఎం చంద్రబాబు ఆదేశించడంతోనే నిధులను విడుదల చేస్తున్నట్లు నోట్ ఫైళ్లలో స్పష్టంగా ఉంది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతతోపాటు పలువురు అధికారులు, ఇతరులను విచారించిన అనంతరం సీఐడీ వాస్తవాలను నిగ్గు తేల్చింది. సీఐడీతోపాటు ఈడీ కూడా నిర్ధారించింది.. అసలు నిధులను ఎక్కడ మళ్లించారని టీడీపీ ప్రశ్నిస్తోంది. షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించారని సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్త సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆధారాలతో సహా నిర్ధారించాయి. షెల్ కంపెనీలు ఏసీఐ, నాలెడ్జ్ పోడియమ్, ఈటా, పాట్రిక్స్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్, ఇన్‌వెబ్, పోలారీస్, కాడెన్స్ పార్టనర్స్ ద్వారా నిధులను తరలించినట్లు నిగ్గు తేల్చాయి. ఈ కేసులో సీఐడీ ఇప్పటివరకు చంద్రబాబుతోసహా 9 మందిని అరెస్ట్ చేసింది. వారిలో నలుగురిని ఈడీ అరెస్ట్ చేయడంతోపాటు ఆ షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసింది. ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) సైతం నిర్ధారించింది. విదేశాలకు పరారయ్యారు కదా... ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇవ్వగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు నిధులు తరలింపులో పాత్రధారిగా వ్యవహరించిన మనోజ్ పార్థసాని రాత్రికి రాత్రే విదేశాలకు పరారయ్యారు. దీనిపై స్పందించకుండా వారికి ఇప్పుడు నోటీసులు జారీ చేయడం ఏమిటని టీడీపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ లభించిన ఆధారాలను బట్టి విచారణ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ కేసులో సీఐడీ కూడా అదే చేసింది. చంద్రబాబు ఆదేశాలతోనే వారు విదేశాలకు పరారైనట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. చంద్రబాబు ఏ స్థాయిలో సాక్షులను ప్రభావితం చేయగలరో, దర్యాప్తును పక్కదారి పట్టించగలరో ఈ ఉదంతమే రుజువు చేస్తోంది. ఈ క్రమంలో సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. దర్యాప్తు సాగేకొద్దీ సూత్రధారులు తెరపైకి.. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ పేరిట ఏర్పాటైన కొత్త శాఖలో అన్ని వ్యవహారాలు అధికారులే చూశారని, అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు కేవలం పర్యవేక్షించారని టీడీపీ పేర్కొంది. ఈ కేసులో అచ్చెన్నాయుడును ఇరికించేందుకు సీఐడీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కానీ కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ లభిస్తున్న ఆధారాలతో ఈ కుంభకోణం అసలు సూత్రధారులు ఎవరన్నది బయటపడుతోంది. ఆ ఆధారాలతోనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఈ కుంభకోణంలో కీలక భూమిక పోషించారని వెల్లడైంది. నోట్ ఫైళ్లు మాయమైనా అధికారులు అందుబాటులో ఉన్నారని, వారిని విచారించాలని టీడీపీ వాదిస్తోంది. అంటే నోట్ ఫైళ్లను మాయం చేశామని ఆ పార్టీ అంగీకరించినట్లే కదా! అందుబాటులో ఉన్న అధికారులను విచారించి, ఇతర అంశాలను నిగ్గు తేల్చి పూర్తి ఆధారాలతోనే సీఐడీ కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తెచ్చింది. అన్నిటికి సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, రాజధాని మాస్టర్ ప్లాన్ కుంభకోణాల్లో చంద్రబాబు పాత్రను వెలుగులోకి తేవటాన్ని చూసి టీడీపీ బెంబేలెత్తుతోంది. ఇప్పటికే ఈ మూడు కేసుల్లో సీఐడీ కీలక ఆధారాలను సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను మూడు సార్లు మార్చిన వైనం, ఆ అలైన్‌మెంట్‌ను ఆనుకుని వందలాది ఎకరాలను ఎలా సేకరించారు?.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి బినామీల ద్వారా అసైన్డ్ భూములు ఎలా కొల్లగొట్టారు? లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రోకోకు ఎలా పాల్పడ్డారు.. తదితరాలన్నీ బట్టబయలయ్యాయి. ఆ కేసుల్లో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్‌పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. తమ అవినీతి బాగోతం సాక్షాధారాలతో రుజువు కావడంతో ఎల్లో మీడియా సహకారంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. అవినీతి నెట్వర్క్ గుట్టు రట్టు స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో చంద్రబాబు ఖజానా నుంచి విడుదల చేసిన రూ.371 కోట్లు ఎక్కడకు వెళ్లాయన్నది ఈ కేసులో కీలకంగా మారింది. ఆ నిధులన్నీ షెల్ కంపెనీల ద్వారా చివరకు చంద్రబాబుకే చేరినట్లు సీఐడీ దర్యాప్తులో ఆధారాలతోసహా వెల్లడైంది. షెల్ కంపెనీల కమీషన్లు పోనూ రూ.241 కోట్లను అవినీతి నెట్వర్క్ ద్వారా చంద్రబాబు నివాసానికి చేరినట్లు గుర్తించారు. మరోవైపు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల ప్రాజెక్ట్‌ల కాంట్రాక్టు కేటాయింపులలోనూ చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు. షెల్ కంపెనీల ద్వారా బాబుకు డబ్బులు చేరాయిలా.. ► టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ► పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు, నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు, ఈటా: రూ.14.1 కోట్లు, పాట్రిక్స్: రూ.3.13 కోట్లు, ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు, భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు, ఇన్‌వెబ్: రూ.1.56 కోట్లు, పోలారీస్: రూ.2.2 కోట్లు, కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ► మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించాడు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పాడు. అంటే ఆ రూ.140.53 కోట్లను చివరకు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా రూ.241 కోట్లు గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు చేరిపోయాయి. -
‘షెల్’ మింగిన ‘స్కిల్’
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా మాజీ సీఎం చంద్రబాబేనని రుజువైంది. అడ్డగోలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సీమెన్స్ కంపెనీకి తెలియకుండా, ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టును రూపొందించారు. అందుకోసం రూ.370 కోట్ల ప్రాజెక్ట్‌ను చంద్రబాబే స్వయంగా ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేయడం గమనార్హం. అనంతరం తన బినామీ ముఠాతో కథ నడిపించి షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన 90 శాతం వాటాలో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోయినా 10 శాతం ప్రభుత్వ వాటా కింద రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేలా చంద్రబాబే ఆదేశించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు వారించి ఏకంగా నోట్ ఫైళ్లలోనే అభ్యంతరం తెలిపినా బేఖాతర్ చేస్తూ షెల్ కంపెనీలకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. అనంతరం ఆ నిధులు వివిధ షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్‌లోని చంద్రబాబు బంగ్లాకే చేరిపోయాయి. ఈ మొత్తం అవినీతి బాగోతంలో చంద్రబాబు సర్వం తానై వ్యవహరించినట్లు నిర్ధారణ అయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నిప్పులా బతికానంటూ తరచూ చెప్పుకునే చంద్రబాబు అవినీతి వ్యవహారాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. విద్యా శాఖ స్థానంలో ఏపీఎస్ఎస్డీసీ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టటాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్యాల శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్‌టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమేరకు జీవో జారీ చేశారు. అయితే అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టడానికి కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ)ని ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి.. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాల ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. బాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూ పొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చు కున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులిచ్చారు. అంతా బాబు ముఠానే.. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులే అంతా తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కే. లక్ష్మీనారాయణ, ఎండీ గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా నాలుగు పోస్టులను కట్టబెట్టారు. తద్వారా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికు ఎలాంటి పాత్ర లేకుండా గంటా సుబ్బారావుతో నేరుగా నిధులు మంజూరు ప్రక్రియ కొనసాగించేలా పథకం రచించారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. ఇది పరస్పర ప్రయోజనాల విరుద్ధ చట్టానికి విరుద్ధమైనా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. నో రూల్స్... ‘ఏఐ’.. రూ.371 కోట్లు ఇచ్చేయండి ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్ఎస్డీసీ తరపున నిధులు ఎలా మంజూరు చేస్తామని పీవీ రమేశ్ తన నోట్ ఫైల్లో పొందుపరిచారు. సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా ప్రభుత్వం తన వాటా రూ.371 కోట్లు ఎందుకు చెల్లించాలని సునీత లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలిపారు. ఇంత పెద్ద ప్రాజెక్టును ముందు ఏదో ఒక జిల్లాలో పైలట్‌గా అమలుచేసి తరువాత నిర్ణయం తీసుకోవాలన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, నిధులు విడుదల చేసిన తరువాత ఆ ఫైల్‌ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని పీవీ రమేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతకు తెలియచేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లను మంజూరు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాక సింగపూర్‌కు ఎలా వెళ్లాయి..? తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు వచ్చాయనే విషయాన్ని గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లను హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ ఇటీవల జప్తు చేసింది. చంద్రబాబు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఇప్పటికే సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్(చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. కడిగిపారేసిన కాగ్ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్( కాగ్) కూడా బాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని పేర్కొంది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులను విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్ల వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది. నాడే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం టీడీపీ హయాంలోనే 2018లో ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ.. ► గత ప్రభుత్వం పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ► డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ► పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్‌వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ► మొత్తం రూ. 140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ► ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. ఉప్పందించిన పుణె సామాజిక కార్యకర్త 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ క్రమంలో జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్ బోస్‌ను పదవి నుంచి తొలగించింది. ఎండీ, డైరెక్టర్ల పేర్లు, హోదాలు ఒప్పంద పత్రాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించడం గమనార్హం. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. ఆ కంపెనీల బ్యాంకు ఖాతాలు, నగదు బదిలీ వ్యవహారాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లింపులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని నోట్ ఫైళ్ల ద్వారా నిర్ధారించారు. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. నిధుల తరలింపులో నారా లోకేశ్ కీలక భూమిక పోషించినట్లు కూడా వెల్లడైంది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. మొదటి ఎఫ్ఐఆర్లో లేనప్పటికీ అందుకే తుది చార్జ్‌షీట్‌లో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ సిట్ కేసును పకడ్బందీగా నమోదు చేసింది. చంద్రబాబుతోసహా ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసింది. -
ఏ–1 చంద్రబాబు అరెస్ట్
14 ఏళ్లు ముఖ్యమంత్రి.. మరో 14 ఏళ్లు ప్రతిపక్షనేత.. మొత్తంగా 40 ఏళ్ల రాజకీయ జీవితం... కనుసన్నలతో రాజకీయాలను, రాజ్యాంగ వ్యవస్థలను శాసించగలరని సన్నిహితులు కీర్తించే నాయకుడు.. మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు. ఏలేరు కుంభకోణం మొదలు ఎన్నో అవినీతి ఆరోపణలు.. రెండెకరాల నుంచి రూ.రెండు లక్షల కోట్లకు ఆస్తులు పెరిగాయన్న విమర్శలు.. ఎన్నో కేసులు.. స్టేలు.. ఎన్నడూ కోర్టుమెట్లెక్కిందే లేదు.... అరదండాలు ఆయన అరచేతులను తాకలేదు... కానీ చట్టం ఎవరికీ చుట్టం కాదు.. అది తన పని తాను చేసుకుపోతుంది. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క చిన్న గాలివానకే కూలిపోయినట్లు.. సప్త సముద్రాలను ఈదిన గజ ఈతగాడు చిన్న గుంతలో పడి ప్రాణాలొదిలినట్లు.. ఓ చిన్న స్కామ్‌లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఎదుర్కొన్న ఆరోపణలతో పోలిస్తే ఇది సముద్రంలో ఇసుకరేణువంత... ఆయన ఆస్తులలో 0.0000001 శాతం కూడా లేనంత.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణమిది. అధికారులు వారిస్తున్నా కాదని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు షెల్ కంపెనీలకు తరలించారు. కమీషన్లు పోను తిరిగి రూ.241 కోట్లు చంద్రబాబుకు చేరాయి. స్పష్టమైన ఆధారాలు దొరకడంతో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మాజీ సీఎం కావడంతో పటిష్టమైన భద్రత మధ్య హెలికాఫ్టర్‌లో నంద్యాల నుంచి విజయవాడకు తీసుకురావాలని అధికారులు భావించినా రోడ్డుమార్గంలో.. అదీ తన కాన్వాయ్‌లో వస్తానని చంద్రబాబు పట్టుబట్టారు. అదేం విచిత్రమో.. వలయంలా నిలబడి తనకు రక్షణ కల్పిస్తారని భావించిన ప్రజలు, నిరసనలతో దారిపొడవునా బోలెడంత ప్రచారానికి పనికివస్తారనుకున్న పార్టీ శ్రేణులు ముఖం చాటేయడం అరెస్టును మించిన షాక్‌కు బాబును గురిచేసింది. విజయవాడ చేరుకున్న అనంతరం సీఐడీ కార్యాలయంలో బాబును అధికారులు విచారిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో నిందితులు ఏ–1 చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ–2 కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ–3 గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో ఏ–4 కె.లక్ష్మీ నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్, ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు ఏ–5 నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఓఎస్డీ, ఏపీఎస్ఎస్డీసీ ఏ–6 అపర్ణ ఉపాధ్యాయుల, ఐఏఎస్, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవో ఏ–7 ప్రతాప్ కుమార్ కర్, టీడీపీ ప్రభుత్వంలో ఫైనాన్సియల్ ఆఫీసర్, ఏపీఎస్ఎస్డీసీ ఏ–8 సుమన్ బోస్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ ఏ–9 జీవీఎస్ భాస్కర్ ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ ఏ–10 వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్‌టెక్ ఎండీ వీరితోపాటు మొత్తం 40మందిని నిందితులుగా పేర్కొన్నారు. సాక్షి, అమరావతి /నంద్యాల/ నెట్వర్క్: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ–1) అయిన నారా చంద్రబాబు నాయుడును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం నంద్యాలలో అరెస్టు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదుర్చుకుని, ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయించి.. అందులో రూ.241 కోట్లను కొల్లగొట్టిన చంద్రబాబు అవినీతి బండారం ఆధారాలతోసహా బట్టబయలైంది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా ఆయనే అని సిట్ నిర్ధారించింది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ బయటపడిన కీలక ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జిషీట్ నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. కాగా, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కూడా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారన్నది తాజాగా బయటపడటం గమనార్హం. దాంతో ఈ కేసులో లోకేశ్‌ను కూడా విచారించాలని సిట్నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబుతోసహా సిట్ ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసినట్లయింది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు చంద్రబాబు విఫలయత్నం ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తన అవినీతి బండారం బయట పడటంతో దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు యత్నించారు. ఈ కేసులో షెల్ కంపెనీల ద్వారా నిధులు తరలించిన తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ– పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ యాదవ్‌లకు సిట్ నోటీసులు జారీ చేయడంతో బెంబేలెత్తిన ఆయన సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించారు. ఆయన బెదిరింపులతోనే పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, మనోజ్ పార్థసాని దుబాయ్‌కి పరారయ్యారు. దాంతో సిట్ వెంటనే అప్రమత్తమైంది. చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే సాక్షులు, ఇతరులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేసి కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని గుర్తించారు. అప్పటికే ఆయన అవినీతి ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేయాలని నిర్ణయించారు. నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ సిట్ అధికారులు శుక్రవారం రాత్రి కార్యాచరణకు దిగారు. సిట్ ఇన్చార్జి కె.రఘురామిరెడ్డి, దర్యాప్తు అధికారి ధనుంజయ నేతృత్వంలో సిట్ బృందం నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు వద్దకు బయలుదేరింది. తనను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని అప్పటికే చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఆదేశించారు. దాంతో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాలు వద్ద మోహరించారు. సిట్ ఇన్చార్జి కె.రఘురామిరెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, సిట్ దర్యాప్తు అధికారి ధనుంజయ తదితరులు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. ఆ ఫంక్షన్ హాల్‌కు వెళ్లే రహదారిలో వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డంగా నిలిపిన వాహనాల మధ్య నుంచి అక్కడకు వెళ్లారు. సిట్ అధికారులు చంద్రబాబును కలవనివ్వకుండా టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డిలు సిట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు చంద్రబాబు బస చేసిన బస్సు తలుపులు తట్టినా ఆయన బయటకు రాలేదు. మరోవైపు టీడీపీ నాయకులు ఎంతగా రెచ్చిపోతున్నా పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తూ వారికి ఓపికగా సమాధానం ఇస్తూ.. చంద్రబాబు బయటకు వచ్చేంత వరకు వేచి చూశారు. 2.30 గంటలపాటు నచ్చజెప్పి.. చంద్రబాబు వద్దకు వెళ్లడానికి అడ్డుగా ఉంచిన వాహనాలను ఎంత సేపటికీ తొలగించకపోవడంతో పోలీసులు వాటికి తాడు కట్టి బుల్డొజర్ సాయంతో పక్కకు జరిపారు. ఆ విధంగా సిట్ అధికారులు శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి 5.30 గంటల వరకు టీడీపీ నేతలు, న్యాయవాదులతో మాట్లాడుతూ నచ్చజెప్పేందుకు యత్నించారు. పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య చర్చలు, వాగ్వాదం జరుగుతుండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయం 5.30 గంటలకు బస్సు నుంచి కిందకు దిగారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి తమకు సహకరించాలని పోలీసు అధికారులు ఆయన్ను కోరారు. ‘ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు.. అందులో నా పేరు ఉందా.. నా పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేయడానికి వచ్చారు?’ అని బాబు ప్రశ్నించారు. రెండేళ్ల క్రితమే ఎఫ్ఐఆర్ వేశామని, అందులో మీ పేరు ఉందని వారు తెలుపగా, కేసుకు సంబంధించిన మొత్తం వివరాలు ఇవ్వాలని బాబు పోలీసులను కోరారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో పూర్తి వివరాలు ఇస్తామని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ ఎలా అరెస్ట్ చేస్తారని న్యాయవాదులు, చంద్రబాబు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అన్ని వివరాలు అప్పుడే ఇస్తామని చెబుతూ పోలీసులు చంద్రబాబుతో సంతకం తీసుకొని, వైద్య పరీక్షలు నిర్వహించి, ఉదయం 6 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వస్తున్న చంద్రబాబు వాహనానికి కొందరు టీడీపీ కార్యకర్తలు అడ్డం పడుకోవడానికి వెళ్లగా పోలీసులు వారిని పక్కకు తప్పించారు. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు హెలికాఫ్టర్‌లో విజయవాడకు తీసుకెళ్తామని సిట్ అధికారులు చంద్రబాబుతో చెప్పారు. అందుకు ఆయన తిరస్కరించారు. తాను తన వాహనంలో రోడ్డు మార్గంలోనే వస్తానన్నారు. అందుకు సిట్ అధికారులు సమ్మతించి ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించారు. మధ్యలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడక్కడ తప్ప ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడ లేదు. బాపట్ల జిల్లా జే.పంగలూరు మండలం ముప్పవరం గ్రామం సమీపంలో టీడీపీ నేతలు జాతీయ రహదారిపై టైర్లు తగలబెట్టి చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేసి కాన్వాయిని ముందుకు పంపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు ముందస్తు ప్రణాళికతో కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులను దుర్భాషలాడుతూ, తోసివేస్తూ దూసుకువచ్చారు. కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. ఎన్ఆర్టీ సెంటర్లో రోడ్డుపై తెలుగు తమ్ముళ్లు టైర్లు కాల్చి, చేతిలో పెట్రోల్ బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. దాంతో జాతీయ రహదారిపై చంద్రబాబు కాన్వాయ్ అరగంటకుపైగా నిలిచిపోయింది. టీడీపీ కార్యకర్తలు సాధారణ ప్రజలను కూడా దూషిస్తూ వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పెషల్ పార్టీ పోలీసులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ వారి అంతు చూస్తామని హెచ్చరిస్తూ జెండా కర్రలతో దాడికి ప్రయత్నించారు. పోలీసులు అతి కష్టం మీద అల్లరి మూకలను చెదరగొట్టి కాన్వాయ్‌ని ముందుకు పోనిచ్చారు. గుంటూరు శివారులోని లాల్పురం వై.జంక్షన్ టీడీపీ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సిట్ అధికారులు చంద్రబాబును గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. బాబుపై ప్రశ్నల వర్షం సిట్ విచారణకు చంద్రబాబు ఏమాత్రం సహకరించ లేదు. అధికారులు ఏ ప్రశ్నలు వేసినా సరే తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయాను.. అంటూ సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యత్నించారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత చంద్రబాబు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు అధికారులు అనుమతించారు. రాత్రి 7 గంటల అనంతరం సిట్ అధికారులు విచారణ ప్రక్రియ మొదలు పెట్టారు. చంద్రబాబు లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకు ఆయన న్యాయవాదులను లోపలికి అనుమతించారు. అనంతరం ఓ గదిలో చంద్రబాబును కూర్చోబెట్టి, సిట్ దర్యాప్తు అధికారి ధనుంజయ, ఇతర అధికారులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. సీమెన్స్ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకున్న విధానంపై సిట్ అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. కేవలం ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఈ ప్రాజెక్ట్‌పై ఒప్పందం కుదుర్చుకోవడంలో సర్వం తానై చంద్రబాబు వ్యవహరించారనడానికి ఆధారాలను ఆయన ముందు ఉంచి ఒక్కొక్కటిగా ప్రశ్నించారు. అసలు సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ కుదుర్చుకోవడం ఏమిటి? డిజైన్‌టెక్ కంపెనీని ఎందుకు తెరపైకి తెచ్చారు? అసలు ప్రాజెక్ట్ వ్యయం రూ.3,300 కోట్లుగా ఎలా నిర్ధారించారు? ముఖ్య కార్యదర్శిని పక్కనబెట్టి మరీ ఏపీఎస్ఎస్డీసీ ఎండీ గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పోస్టులు ఎందుకు కట్టబెట్టారు? ఒప్పందం ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతం నిధులు సమకూర్చకుండా ప్రభుత్వ వాటా 10 శాతం కింద రూ.371 కోట్లు ఎందుకు విడుదల చేశారు? అందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు నోట్‌ఫైల్‌లో లిఖిత పూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను ఎందుకు బేఖాతరు చేశారు? షెల్ కంపెనీల ద్వారా ఆయనకు చేరిన నిధుల విషయం ఏమిటి.. ఇలా పలు ప్రశ్నలను ఒక్కొక్కటిగా అడిగారు. చంద్రబాబుతో కుటుంబ సభ్యుల భేటీ సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారిస్తుండగానే ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ అక్కడకు చేరుకున్నారు. తాము చంద్రబాబును కలవాలని అధికారులతో చెప్పారు. దాంతో చంద్రబాబు విచారణకు కాసేపు విరామం ఇచ్చి కుటుంబ సభ్యులను కలిసేందుకు అధికారులు అనుమతించారు. సిట్ కార్యాలయంలో ఓ గదిలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. అరగంటకుపైగా మాట్లాడారు. అనంతరం సిట్ అధికారులు మరోసారి విచారణను కొనసాగించారు. ఈ విధంగా శనివారం అర్ధరాత్రి వరకు.. అంటే 6 గంటలకు పైగా విచారించారు. అనంతరం ఆయన నిద్రించేందుకు అవకాశం కల్పించారు. ఆదివారం తెల్లవారుజామున న్యాయస్థానంలో హాజరు పరుస్తారని భావిస్తున్నారు. నడిరోడ్డుపై ప్రజాస్వామ్యం హత్య: చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. తనను అరెస్ట్ చేయడంపై నంద్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను ఏం తప్పు చేశానో చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. తప్పు చేసుంటే నిరూపించి కేసు పెట్టాలన్నారు. ఏదేమైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారు.. ► నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి ► గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ► సుమన్ బోస్, అప్పట్లో సీమెన్స్ ఎండీ ► వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్ టెక్ ఎండీ ► ముకుల్‌చంద్ర అగర్వాల్, స్కిల్లర్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ► శిరీష్ చంద్రకాంత్ షా, డైరెక్టర్ ఏసీఐఎల్ కంపెనీ ► విపిన్‌కుమార్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ ► నీలమ్ శర్మ (విపిన్‌కుమార్ శర్మ భార్య) ► జీవీఎస్ భాస్కర్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారు.. ► నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి ► గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ► సుమన్ బోస్, అప్పట్లో సీమెన్స్ ఎండీ ► వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్ టెక్ ఎండీ ► ముకుల్‌చంద్ర అగర్వాల్, స్కిల్లర్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ► శిరీష్ చంద్రకాంత్ షా, డైరెక్టర్ ఏసీఐఎల్ కంపెనీ ► విపిన్‌కుమార్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ ► నీలమ్ శర్మ (విపిన్‌కుమార్ శర్మ భార్య) ► జీవీఎస్ భాస్కర్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ -
బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే
సాక్షి, అమరావతి: తీగ లాగితే డొంకంతా కదులుతోంది! ముడుపుల చిట్టాలన్నీ చంద్రబాబు బంగ్లాకే దారి తీస్తున్నాయి!! అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల కాంట్రాక్టుల్లో ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యవహారంలో ఆదాయపన్ను (ఐటీ) శాఖ తీగ లాగితే... చంద్రబాబు కనుసన్నల్లో సాగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం పునాది బయటపడుతోంది. కుంభకోణాలు వేర్వేరైనా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించడంలో పాత్రధారులు మాత్రం వారే. ఆ అక్రమార్జన అంతా చివరకు చేరింది సూత్రధారి చంద్రబాబు చెంతకే అన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో భవన నిర్మాణ ప్రాజెక్టుల కాంట్రాక్టులను కట్టబెట్టడంలో అక్రమార్జనకు సంబంధించి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆ కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని, చంద్రబాబు పీఏస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తా ఏపీఎస్ఎస్డీసీ అవినీతి బాగోతంలోనూ కీలకంగా వ్యవహరించారని వెల్లడైంది. ఇప్పటికే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక ప్రగతి సాధించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజా పరిణామాలతో తక్షణం రంగంలోకి దిగింది. ముడుపుల తరలింపులో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్‌లను విచారించాలని నిర్ణయించింది. ఈమేరకు వారికి నోటీసులు జారీ చేసి దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. బాబు అవినీతి ‘స్కిల్’... టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం జరిగినట్లు ‘సిట్’ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు ఆధారాలతో సహా నిరూపించింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందని బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. అలా నిధులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతోపాటు మరో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వారించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఏకపక్షంగా రూ.371 కోట్లను సీమెన్స్ భాగస్వామ కంపెనీగా ఒప్పందంలో చూపించిన డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేశారు. అందులో రూ.241 కోట్లను పలు షెల్ కంపెనీలను సృష్టించి హవాలా మార్గంలో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేత కొల్లగొట్టారు. ఈ కేసులో సిట్ అధికారులు 8 మందిని అరెస్టు చేశారు. హవాలా మార్గంలో నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చినందున కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారించి ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయడంతోపాటు డిజైన్ టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్లను అటాచ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. షెల్ కంపెనీలు.. బోగస్ ఇన్వాయిస్లు టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల కాంట్రాక్టులను కట్టబెట్టిన కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్నవారే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలోనూ కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. షాపూర్జీ– పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా, చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్.. ఈ ముగ్గురూ అమరావతి భవన నిర్మాణాల కాంట్రాక్టు అవినీతి సొమ్మును చంద్రబాబుకు చేర్చడంతో కీలకంగా వ్యవహరించారన్నది ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. రూ.8 వేల కోట్ల విలువైన నిర్మాణాల కాంట్రాక్టుల్లో భారీ అవినీతికి పాల్పడి ఆ నల్లధనాన్ని మనోజ్ వాసుదేవ్ పార్థసాని షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. అందుకోసం షెల్ కంపెనీలను సృష్టించడంలో యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించారు. ఆయన నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. మరోవైపు ఆ షెల్ కంపెనీల పేరుతో మళ్లించిన నిధులను డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నగదు రూపంలో చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో అందించారు. ఆ విధంగా చంద్రబాబుకు చేరిన అక్రమార్జనలో రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బాబుకు ముడుపులు చేరాయిలా... అమరావతిలో తాత్కాలిక నిర్మాణ కాంట్రాక్టుల అవినీతి దందాలో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్ ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించిన తీరు ఇదీ.. ► ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టేందుకు యోగేశ్ గుప్తా పలు షెల్ కంపెనీలను సృష్టించాడు. ముంబై, పుణే కేంద్రాలుగా సృష్టించిన షెల్ కంపెనీల పేరిట నకిలీ ఇన్వాయిస్లను సమర్పించారు. ఆ ఇన్వాయిస్ల ఆధారంగా షెల్ కంపెనీలకు ఏపీఎస్ఎస్డీసీ రూ.371 కోట్లను విడుదల చేసింది. దీనిపై ఆధారాలు సేకరించిన అనంతరం సిట్ అధికారులు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో కేసులో యోగేశ్ గుప్తాను ఏ–22గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ► నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా షెల్ కంపెనీలకు చేరిన రూ.371 కోట్లను యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ పార్థసానికి అందించాడు. ఆయన అందులో రూ.241 కోట్లను ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలించాడు. రూ.241 కోట్ల నగదు మొత్తాన్ని హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించాడు. ► ఆ రూ.241 కోట్ల నగదు మొత్తం పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చివరకు హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఆ ముగ్గురికీ సిట్ నోటీసులు ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టడంతో పాత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్‌లకు సిట్ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. విజయవాడలో సిట్ అధికారుల ఎదుట వచ్చే సోమవారం విచారణకు హాజరు కావాలని యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసానికి నోటీసులిచ్చారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఈనెల 14న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. -
నల్లధనం చేర్చింది ఆ నలుగురే.. సింగపూర్ రూటులో ‘స్కిల్’ లూటీ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) నిధులను టీడీపీ పెద్దలు షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టినట్లు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిగ్గు తేల్చింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు పాత్ర ఉన్నట్లు దాదాపుగా నిర్థారణకు వచ్చింది. టీడీపీ హయాంలో “ముఖ్య’నేత నలుగురు వ్యక్తుల ద్వారా నల్లధనాన్ని సింగపూర్‌కు తరలించినట్లు ఆధారాలతో గుర్తించింది. సీమెన్స్‌కు సంబంధం లేకపోయినా ఆ సంస్థ పేరిట కాగితాలపై రూ.3,300 కోట్ల ప్రాజెక్టును చూపించి... రూ.370 కోట్లను కాజేసినట్లు తేల్చింది. ఈ అక్రమాలను ఇప్పటికే సీఐడీ అధికారులు నిగ్గు తేల్చారు. ఈడీ కూడా సీమెన్స్లో పని చేసి మానేసిన సుమన్‌బోస్... ఈ వ్యవహారంలో చంద్రబాబుకు కుడిభుజంగా వ్యవహరించినట్లు తేల్చింది. నల్లధనం సింగపూర్‌కు చేర్చింది ఆ నలుగురే... స్కామ్‌లో కాజేసిన సొమ్మును ఈ నలుగురి ద్వారా సింగపూర్‌కు తరలించినట్లు ఈడీ గుర్తించింది. నిందితులు నలుగురికీ అప్పటికే డస్సల్డ్ సిస్టమ్స్ అనే షెల్ కంపెనీతో అనుబంధం ఉంది. సుమన్ బోస్‌ను టీడీపీ పెద్దలు ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా చేసుకున్నారు. సీమెన్స్ ఇండియా మాజీ హెడ్ కావటంతో... బోస్ జర్మనీలోని తమ ప్రధాన కార్యాలయానికి తెలీకుండానే ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. టీడీపీ పెద్దలు కాగితాలపై సృష్టించిన రూ.3,300 కోట్ల ప్రాజెక్టుపై తనే సంతకం చేసేశాడు. డిజైన్టెక్తోపాటు అలైడ్ కంప్యూటర్స్, ఇన్‌వెబ్ సర్వీసెస్, ప్యాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్, ప్రొవెస్ట్మెంట్ సర్వీసెస్, భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా అనే షెల్ కంపెనీలను ఆ ప్రాజెక్టులో భాగస్వాములుగా చూపిస్తూ కథ నడిపించారు. ఒప్పందం ప్రకారం సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలు పెట్టుబడి పెట్టాల్సిన 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా పెట్టకుండానే... ప్రభుత్వ వాటా 10 శాతం కింద రూ.370 కోట్లను డిజైన్‌టెక్‌కు టీడీపీ సర్కారు చెల్లించింది. ఏపీఎస్ఎస్డీసీలో కీలక స్థానాల్లో ఉన్న చంద్రబాబు సన్నిహితులు కె.లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, అపర్ణ ఛటోపాధ్యాయ అందుకు సహకరించారు. అనంతరం వికాస్ కన్వేల్కర్, ముకుల్ అగర్వాల్, సురేశ్ గోయల్ సహకారంతో సుమన్ బోస్ రూ.241 కోట్లను సింగపూర్‌లోని ఓ బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. అవి హవాలా మార్గంలో రాష్ట్రంలోని టీడీపీ పెద్దలకు చేరినట్లు ఈడీ భావిస్తోంది. అందుకే నిందితులు నలుగురినీ మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది. తద్వారా ఈ కేసును కొలిక్కితెచ్చి.. తదుపరి అరెస్టులు చేయాలని భావిస్తోంది. కస్టడీ కోరిన ఈడీ చంద్రబాబు కనుసన్నల్లో సాగిన స్కిల్ కుంభకోణంలో నలుగురు షెల్ కంపెనీల ప్రతినిధులను ఈ నెల 4న ఈడీ అరెస్టు చేసి విశాఖలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో హాజరు పరచడం తెలిసిందే. సౌమ్యాద్రి శేఖర్‌బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ)తో పాటు వికాస్ కన్విల్కర్ (డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ), ముకుల్ చంద్ర అగర్వాల్ (పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ సీఈవో), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) నలుగురూ విచారణకు ఏమాత్రం సహకరించలేదని, క్షుణ్నంగా ప్రశ్నించేందుకు కస్టడీకి అప్పగించాలని శుక్రవారం ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. వీరిని విచారించాక ఈ కేసులో కీలక సూత్రధారులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘స్కిల్’ కుంభకోణంలో కీలక వ్యక్తి అరెస్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆయన నివాసంలో బుధవారం అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆయన్ని కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువస్తున్నారు. ఆయన్ని విజయవాడలోని కోర్టులో హాజరుపరుస్తారు. జీవీఎస్ భాస్కర్‌తో సహా ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ 8 మందిని అరెస్టు చేసింది. ప్రాజెక్టు వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. రూ. 371 కోట్ల ప్రజాధానాన్ని చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టడంలో జీవీఎస్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషించారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వం సీమెన్స్ కంపెనీ ముసుగులో షెల్ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రూపకల్పనలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. (అసలు ఆ ప్రాజెక్టు గురించి తమకేమీ తెలియదని, తమ కంపెనీ అసలు ఆ ఒప్పందం కుదుర్చుకోలేదని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం తరువాత ప్రకటించడం గమనార్హం). సీమెన్స్ ఇండియా లిమిటెడ్‌కు అప్పట్లో ఎండీగా ఉన్న సుమన్ బోస్‌తో కుమ్మక్కై టీడీపీ పెద్దలు ఈ ఎంవోయూ కథ నడిపారు. అందులో భాస్కర్ కీలకంగా వ్యవహరించారు. అంచనాలను పెంచేసి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లుగా చూపించారు. అందులో 10 శాతం వాటాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.371 కోట్లు సమకూర్చాలని లెక్క తేల్చారు. సీమెన్స్ కంపెనీ కేవలం రూ.58 కోట్లు విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే సమకూర్చింది. కేవలం అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే భాస్కర్ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు.. ఆ ప్రాజెక్టు వ్యయాన్ని మూడో పార్టీ ద్వారా పరిశీలించేందుకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ (సీఐటీడీ)కు నివేదించగా అక్కడ కూడా భాస్కరే కథ నడిపారు. ఇతర నిందితులతో కలిసి అనుకూలంగా నివేదిక వచ్చేలా మేనేజ్ చేశారు. అంతేకాకుండా నిధులు కొల్లగొట్టడానికి అనుకూలంగా అవగాహన ఒప్పందం (ఎంవోయూ)ను తయారు చేశారు. ఒప్పందం రూ.3,300 కోట్లకు చేశారు. కానీ ప్రభుత్వం తన వాటాగా రూ.371 కోట్లు చెల్లించాలనే దగ్గరకు వచ్చేసరికి పక్కా కుతంత్రానికి పాల్పడ్డారు. ఈ ప్రాజెక్టులో టెక్నాలజీ పార్ట్‌నర్స్‌గా ఉన్న సీమెన్స్, డిజైన్ టెక్‌లకు కేవలం రూ.371 కోట్ల వర్క్ ఆర్డర్ ఇస్తున్నట్టుగా రాశారు. దాంతో వర్క్ ఆర్డర్ విలువ మేరకే సీమెన్స్, డిజైన్‌టెక్ కంపెనీలకు చెల్లించాలనే భావన కలిగించారు. కానీ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో సీమెన్స్ కంపెనీ 90 శాతం ముందు సమకూర్చాలన్న ఒప్పందంలోని ప్రధాన అంశాన్ని.. ఆ తరువాత పేరాల్లో లేకుండా చేశారు. ఇలా కేవలం రూ.371 కోట్ల వర్క్ ఆర్డర్ మేరకే బిల్లులు చెల్లిస్తున్నట్టు భ్రాంతి కలిగించారు. ఇదంతా టీడీపీ ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై చేశారని సీఐడీ దర్యాప్తులో ఆధారాలతో సహా నిరూపితమైంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఎంవోయూ కుదిరిన తరువాత భాస్కర్ తన సతీమణి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీలో డిప్యూటీ సీఈవోగా పోస్టింగు వచ్చేలా కథ నడిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీఎస్ఎస్డీసీ అప్పటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావుతో భాస్కర్ కుమ్మక్కయ్యారు. దాంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అపర్ణను రాష్ట్రానికి డెప్యుటేషన్‌పై తీసుకువచ్చారు. అనంతరం ఆమెకు ఏపీఎస్ఎస్డీసీలో డిప్యూటీ సీఈవోగా పోస్టింగు ఇచ్చారు. సీమెన్స్ కంపెనీలో భాస్కర్ కీలకంగా ఉండగా.. ఆయన భార్య ఏపీఎస్ఎస్డీసీలో డిప్యూటీ సీఈవోగా ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి మరీ కుంభకోణానికి రంగం సిద్ధం చేశారు. షెల్ కంపెనీలతోనూ బంధం ఈ ప్రాజెక్టు పేరుతో నిధుల మళ్లింపునకు సాధనంగా ఉన్న షెల్ కంపెనీల్లోనూ జీవీఎస్ భాస్కర్ కీలకంగా వ్యవహరించారు. ఎస్‌ఐఎస్‌డబ్లూ కంపెనీకి చెందిన అప్టస్ హెల్త్‌కేర్ ఒక షెల్ కంపెనీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకు చెల్లించిన రూ.371 కోట్లను ఈ షెల్ కంపెనీ ద్వారానే విదేశీ ఖాతాలకు మళ్లించారు. ఆ షెల్ కంపెనీతో భాస్కర్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టుగా సీఐడీ గుర్తించింది. -
‘స్కిల్’ లూటీ కేసులో బాబు సన్నిహితుడి విచారణ
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు హయాంలో చోటు చేసుకున్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ కె.లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో సోమవారం విచారించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీమెన్స్ కంపెనీతో ఒప్పందం ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన తీరుపై ఆయన్ను ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. దాదాపు రూ.3,300 కోట్ల విలువైన ప్రాజెక్టులో ఒప్పందం ప్రకారం 90 శాతం ఖర్చు చేయాల్సిన సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండానే టీడీపీ సర్కారు రూ.371 కోట్ల బిల్లులను చెల్లించింది. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ముసుగులో టీడీపీ పెద్దల ఖాతాల్లోకి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా సీమెన్స్ కంపెనీ పేరిట బిల్లులు ఎలా చెల్లించారని ఈడీ అధికారులు లక్ష్మీనారాయణను నిశితంగా విచారించినట్లు సమాచారం. షెల్ కంపెనీల పేరిట మనీ ల్యాండరింగ్‌కు పాల్పడటంపై కూడా ఈడీ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. పెదబాబు, చినబాబే సూత్రధారులుగా.. కాగితాలపై ప్రాజెక్టును చూపించి టీడీపీ ప్రభుత్వ పెద్దలు రూ.241 కోట్లు కాజేయడంపై ఈడీ దర్యాప్తు జోరందుకుంది. సీమెన్స్ కంపెనీతో రూ.3,300 కోట్ల విలువైన ప్రాజెక్టు పేరిట కథ నడిపించి రూపాయి కూడా పెట్టుబడి రాకుండా, అసలు ప్రాజెక్టే లేకుండా రూ.241 కోట్ల బిల్లులు చెల్లించేశారు. ఏపీఎస్ఎస్డీసీకి అప్పటి సీఎం చంద్రబాబు చైర్మన్‌గా ఉండగా నాటి ఐటీ శాఖ మంత్రిగా లోకేశ్ ఉండటం గమనార్హం. దీన్నిబట్టి ఈ కుంభకోణం వెనుక ఎవరి పాత్ర ఉందన్నది స్పష్టమవుతోంది. ప్రభుత్వం పది శాతం నిధులను సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు 90 శాతం పెట్టుబడి పెడతాయని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు గురించి సీమెన్స్ కంపెనీకి అసలు తెలియదు. భారత్‌లో గతంలో కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్‌బోస్ అలియాస్ సౌమ్యాద్రి శేఖర్‌బోస్‌తోపాటు టీడీపీ పెద్దలు డిజైన్‌టెక్‌తో కలిసి కథ నడిపించారు. సీమెన్స్ సంస్థ ఒక్క రూపాయి ఖర్చు చేయకపోయినా చంద్రబాబు ఆదేశాలతో అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఎస్ఎస్డీసీ’కి అప్పట్లో ఎండీగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న గంటా సుబ్బారావు ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. సాఫ్ట్వేర్, పరికరాల కోసం సీమెన్స్ కంపెనీకి రూ.130 కోట్లు చెల్లించి మిగిలిన రూ.241 కోట్లను నకిలీ ఇన్వాయిస్తో పలు షెల్ కంపెనీల ద్వారా విదేశాల్లోని ఖాతాల్లోకి మళ్లించారు. తద్వారా చంద్రబాబు సన్నిహితులు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన కె.లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కె.ప్రతాప్‌కుమార్, షెల్ కంపెనీల ప్రతినిధులతో సహా మొత్తం 26 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీచేసింది. షెల్ కంపెనీల ప్రతినిధులను ఈడీ అధికారులు ఇటీవల విచారించారు. తాజాగా లక్ష్మీ నారాయణను పలు కోణాల్లో విచారించడం ద్వారా ఈ కేసును ఈడీ ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో స్పష్టమవుతోంది. ఈ కేసులో ఈడీ మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. -
ఈడీ విచారణ: ఆ ‘స్కిల్’ ఎవరిది?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ‘ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)’ కుంభకోణంలో సూత్రధారులెవరన్న విషయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లోతుగా విచారణ మొదలు పెట్టింది. ఈ కేసులో నిందితులైన అప్పటి సీఎం చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నకిలీ ఇన్వాయిస్లతో ఏపీఎస్ఎస్డీసీ నిధులు రూ. 241 కోట్లు కొల్లగొట్టడంలో కీలకంగా వ్యవహరించిన షెల్ కంపెనీల ప్రతినిధులను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో సోమవారం విచారించారు. సీమెన్స్ కంపెనీ డిజైన్‌టెక్, స్కిల్లర్ తదితర షెల్ కంపెనీల ప్రతినిధులను అధికారులు వివిధ కోణాల్లో విచారించినట్టు తెలిసింది. అసలు ప్రాజెక్టు మొదలు పెట్టకుండానే సీమెన్స్ కంపెనీ పేరిట నిధులు విడుదల చేయడం, వాటిని కొన్ని షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి సింగపూర్‌లోని మరో కంపెనీకి తరలించడంపై లోతుగా ప్రశ్నించినట్టు సమాచారం. సింగపూర్ కంపెనీ నుంచి భారత్‌లో ఎవరి ఖాతాకు నిధులు బదిలీ చేశారనే గుట్టును ఛేదించేందుకు ఈడీ అధికారులు ప్రాధాన్యమిచ్చినట్టు తెలుస్తోంది. నిధులు ఏఏ ఖాతాల్లోంచి సింగపూర్‌కు వెళ్లాయి, తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయంపై విచారణలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో పాత్రధారులైన అప్పటి ఎండీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు, ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకటకృష్ణప్రసాద్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కె.ప్రతాప్‌కుమార్ తదితరులు ఈడీ విచారణకు హాజరుకాలేదు. -
‘స్కిల్’ స్కాంపై ఈడీ కొరడా
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో యథేచ్ఛగా సాగిన అవినీతి కుంభకోణాల బండారాలు జాతీయస్థాయిలో బట్టబయలవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ పెద్దలు ‘ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో నిధులను అడ్డగోలుగా కొల్లగొట్టిన అవినీతి బాగోతంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. టీడీపీ హయాంలో సీమెన్స్ కంపెనీతో రూ.3,300 కోట్ల ప్రాజెక్టు పేరిట కథ నడిపించి.. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాకుండానే.. అసలు ప్రాజెక్టు లేకుండానే రూ.241కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ అవినీతి దందాలో సూత్రధారులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కాగా.. చంద్రబాబు సన్నిహితులు, బినామీలు పాత్రధారులుగా వ్యవహరించారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన వారికి ఆదివారం ఈడీ నోటీసులు జారీచేసింది. చంద్రబాబు స్నేహితుడు, ఏపీఎస్ఎస్డీసీ ఎండీగా చేసిన కే లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు, ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కే ప్రతాప్కుమార్లతోపాటు ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన షెల్ కంపెనీల ప్రతినిధులతో సహా మొత్తం 26మందికి నోటీసులు జారీచేశారు. ఆ జాబితాలో డిజైన్ టెక్, స్కిల్లర్, ఇన్‌వెబ్ సర్వీసెస్, అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్మేషనల్, ప్రతీక్ ఇన్ఫో సర్వీసెస్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్, నాలెడ్జ్ పోడియం, ట్యాలెంట్ ఎడ్జ్ మొదలైన షెల్ కంపెనీలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ కీలక ఆధారాలు సేకరించి ఎనిమిది మందిని అరెస్టుచేశారు. మరోవైపు.. ఈడీ కూడా నాలుగైదు నెలలుగా ఈ కుంభకోణంపై గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేసి కీలక ఆధారాలను సేకరించింది. ప్రధానంగా షెల్ కంపెనీల పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టి సింగపూర్ కంపెనీలకు తరలించి.. తిరిగి తమ ఖాతాల్లో వేసుకున్న వైనాన్ని ఈడీ పూర్తి ఆధారాలతో గుర్తించింది. తద్వారా చంద్రబాబు సన్నిహితులు మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించింది. అనంతరమే ఈ కేసులో వారిని విచారించేందుకు నిర్ణయించి నోటీసులు జారీచేసింది. మరోవైపు.. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు సోమవారం హాజరుకావాలని వారిని ఆదేశించింది. కాగితాలపై ప్రాజెక్టు.. బాబు బినామీల ఖాతాల్లో రూ.241 కోట్లు ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దలు జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో ఓ ప్రాజెక్టు అంటూ కేవలం కాగితాలపై చూపించి ఏకంగా రూ.241 కోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పిస్తామని చెప్పి పన్నాగం పన్నారు. అందుకోసం చంద్రబాబు కనుసన్నల్లోనే ఎలాంటి శాస్త్రీయ మదింపు లేకుండానే ఏకంగా రూ.3,300 కోట్లతో ప్రాజెక్టును రూపొందించారు. ఆ పన్నాగంలో భాగంగానే 2014–15లో అప్పటి సీఎం చంద్రబాబును సీమెన్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ కన్విల్కర్ కలిశారు. ప్రభుత్వం 10శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలు 90శాతం నిధులు పెట్టుబడి పెడతాయని ఒప్పందం కుదుర్చుకున్నారు. నిజానికి.. అసలు సీమెన్స్ కంపెనీకి ఈ ఒప్పందం గురించే తెలీదు. భారత్‌లో గతంలో ఆ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ అలియాస్ సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తోపాటు టీడీపీ పెద్దలు డిజైన్ టెక్‌తో కలిసి కథ నడిపించారు. చంద్రబాబు ఆదేశాలతో అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కుంభకోణంలో ఏపీఎస్ఎస్డీసీ’కి అప్పట్లో ఎండీగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ఇక ఏపీఎస్ఎస్డీసీ సీఈఓగా డిప్యూటీ ఐఏఎస్ అధికారి అపర్ణ ఉపాధ్యాయను నియమించారు. ఈమె సీమెన్స్ కంపెనీ కమిటీలో సభ్యుడైన జీవీఎస్ భాస్కర్ సతీమణి. ఈ విధంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. కనీసం ఆ రెండు సంస్థల నుంచి బ్యాంకు గ్యారంటీ కూడా తీసుకోలేదు. ఇక ప్రాజెక్టు పనులు మొదలు పెట్టకుండానే ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలుపుకుని రూ.371 కోట్లను ఆ సంస్థలకు చెల్లించేశారు. ఇందులో సీమెన్స్ కంపెనీ సరఫరా చేసిన రూ.56 కోట్ల సాఫ్ట్వేర్, మరికొన్నింటికి చెల్లింపులు చేసి కథ ముగించారు. మిగిలిన రూ.241 కోట్లను నకిలీ ఇన్వాయిస్తో పలు షెల్ కంపెనీలు, బినామీ కంపెనీ డిజైన్‌టెక్ ఖాతాలోకి మళ్లించారు. ఇక ఢిల్లీలోని ఇన్‌వెబ్ సర్వీసెస్, పూణేకు చెందిన స్కిల్లర్ అనే షెల్ కంపెనీలకు నిధులు మళ్లించి ఆ నిధులను సింగపూర్‌లోని కంపెనీలకు తరలించి అక్కడి నుంచి టీడీపీ పెద్దల ఖాతాల్లోకి బదిలీ చేశారు. అందుకుగాను షెల్ కంపెనీలకు కేవలం కమీషన్లు చెల్లించి టీడీపీ పెద్దలు రూ.241కోట్లు కొల్లగొట్టారు. కీలక ఫైళ్లు గల్లంతు.. వాస్తవానికి ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణాన్ని 2018లోనే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పూణేలో కొన్ని సంస్థలపై నిర్వహించిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్లు వెలుగు చూశాయి. అవి ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టుకు సంబంధించినవిగా గుర్తించి ఆ సమాచారాన్ని ఏపీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి తెలిపాయి. దాంతో ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేయాల్సి ఉంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఇందుకు అనుమతించలేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చింది. అంతేకాదు.. వెంటనే సీమెన్స్ కంపెనీతో ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్ఎస్డీసీలో కీలకమైన ఫైళ్లను మాయం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర జీఎస్టీ అధికారులు ఏసీబీ దృష్టికి తీసుకువచ్చిన విషయం వెలుగుచూసింది. దీంతో టీడీపీ పెద్దలు లేని ప్రాజెక్టు ముసుగులో రూ.241 కోట్లు దోచుకున్న అవినీతి బాగోతం బట్టబయలైంది. -
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భారీ స్కామ్.. నోటీసులు జారీచేసిన ఈడీ
-
గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణంపై ఈడీ నోటీసులు
-
3 నెలల్లో 15,032 మందికి ఉపాధి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాలకు మంచి స్పందన వస్తోంది. ఈ జాబ్ మేళాల ద్వారా కేవలం మూడు నెలల్లోనే 15,032 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. కరోనా కారణంగా గత రెండేళ్లు ఆన్లైన్ జాబ్ మేళాలకు మాత్రమే పరిమితమైన ఏపీఎస్ఎస్డీసీ... ఇప్పుడు నేరుగా కళాశాలల్లోనే జాబ్ మేళాలను నిర్వస్తోంది. ఈ విద్యా సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 142కు పైగా జబ్మేళాలను నిర్వహించగా, 37,879 మంది విద్యార్థులు హాజరైనట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ఎస్.సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ జాబ్ మేళాల్లో 146కు పైగా ప్రఖ్యాత కంపెనీలు పాల్గొన్నాయని పేర్కొన్నారు. గత మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 15,032 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు వివరించారు. వారికి అర్హతల ప్రకారం రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు నెలవారీ వేతనం ఇవ్వడానికి కంపెనీలు సిద్ధమయ్యాయని తెలిపారు. గత మూడు నెలల్లోనే ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 2,000 మందికిపైగా విద్యార్థులను ఎంపిక చేసుకోగా, డైకిన్ వంటి పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకులు, హాస్పిటల్స్ వంటి సంస్థలు అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోపు జాబ్ మేళాల ద్వారా 45,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. కంపెనీలకు అవసరమైన నిపుణుల కోసం స్కిల్ హబ్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీల్లో స్థానికులకే ఉపాధి కల్పించాలి. ఈ క్రమంలో కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించే విధంగా ఏపీఎస్ఎస్డీసీ చర్యలు చేపట్టిందని సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్థానిక కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను అందించే విధంగా ఈ స్కిల్ హబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తొలి దశలో 66 స్కిల్ హబ్స్‌ను సిద్ధం చేశామని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఏటా 42,000 మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఈ స్కిల్ హబ్స్‌ను రూపొందించినట్లు చెప్పారు. శిక్షణ అనంతరం అదే కంపెనీలో ఉద్యోగం ఇచ్చే విధంగా పలు సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందాలు చేసుకుంటోంది. -
‘స్కిల్’ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితుల అరెస్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో జరిగిన కుంభకోణానికి సంబంధించి ఇద్దరు కీలక నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ విపిన్ కుమార్ శర్మ, ఆయన భార్య నీలం శర్మను సీఐడీ అధికారులు అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు. వారిని విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) న్యాయస్థానంలో బుధవారం రాత్రి హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ అధికారులు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామంటూ షెల్ కంపెనీల ముసుగులో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు రూ.241 కోట్ల నిధులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. నకిలీ ఇన్వాయిస్లతో బురిడీ.. రూ.241 కోట్ల ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలకు అడ్డదారిలో నిధులు మళ్లించడంలో ఢిల్లీకి చెందిన విపిన్ శర్మ, నీలం శర్మ దంపతులు కీలకంగా వ్యవహరించారు. వారిద్దరూ ఢిల్లీలో ‘ఇన్ వెబ్ సర్వీసెస్’ అనే ఓ షెల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఏపీఎస్ఎస్డీసీ నిబంధనలకు విరుద్ధంగా సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలకు నిధులు చెల్లించింది. ఈ నిధులను సీమెన్స్, డిజైన్ టెక్.. వివిధ షెల్ కంపెనీల రూపంలో దారి మళ్లించాయి. ఈ క్రమంలో పూణేకు చెందిన స్కిల్లర్ అనే షెల్ కంపెనీ ద్వారా నకిలీ ఇన్వాయిస్లతో నిధులు కొల్లగొట్టిన విషయం గతంలోనే వెలుగు చూసింది. ఆ నిధులను సింగపూర్‌లోని సంస్థలకు తరలించి.. అక్కడి నుంచి టీడీపీ ప్రభుత్వ పెద్దలకు చేర్చారు. అదే రీతిలో విపిన్ శర్మ, నీలం శర్మలకు చెందిన ఇన్ వెబ్ సర్వీసెస్ కంపెనీ నుంచి నకిలీ ఇన్వాయిస్లు తీసుకుని ఆ కంపెనీకి రూ.8.50 కోట్లు చెల్లించారు. అందులో తమ కమీషన్‌గా రూ.7.5 లక్షలు తీసుకుని మిగిలిన మొత్తాన్ని మళ్లీ టీడీపీ ప్రభుత్వ పెద్దల ఖాతాల్లోకి ఆ కంపెనీ చేర్చింది. సీఐడీ దర్యాప్తులో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. దీంతో డిజైన్ టెక్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లోని రూ.23 కోట్లను ఇటీవల సీఐడీ అధికారులు జప్తు చేశారు. చంద్రబాబు ఆదేశాలతో రూ.371 కోట్లు చెల్లింపు ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకుండానే చంద్రబాబు ఆదేశాలతో అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ప్రభుత్వం తరఫున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలుపుకుని రూ.371 కోట్ల నిధులను సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్‌లకు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కుంభకోణంలో ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ఇక ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా ఐఏఎస్ అధికారి అపర్ణ ఉపాధ్యాయను నియమించారు. ఈ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్న సీమెన్స్ కంపెనీ కమిటీలో సభ్యుడైన జీవీఎస్ భాస్కర్ భార్య ఈమె. ఈ విధంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. కనీసం సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ల నుంచి బ్యాంకు గ్యారంటీ కూడా తీసుకోలేదు. ఇందులో సీమెన్స్ కంపెనీ సరఫరా చేసిన రూ.56 కోట్ల సాఫ్ట్వేర్, మరికొన్నింటికి చెల్లింపులు చేసి కథ ముగించారు. మిగతా రూ.241 కోట్లను నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీలు, బినామీ కంపెనీ డిజైన్ టెక్ ఖాతాలోకి మళ్లించారు. అక్కడి నుంచి టీడీపీ పెద్దల ఖాతాల్లోకి రూ.241 కోట్లు చేరాయి. తనిఖీల్లో వెలుగుచూసిన నకిలీ ఇన్వాయిస్లు.. కాగా కేంద్ర జీఎస్టీ అధికారులు 2018లో పూణేలో కొన్ని సంస్థలపై నిర్వహించిన తనిఖీల్లో నకిలీ ఇన్వాయిస్లు వెలుగు చూశాయి. అవి ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టుకు సంబంధించినవని గుర్తించి ఆ విషయాన్ని ఏపీ ఏసీబీ విభాగానికి తెలిపారు. కానీ అప్పటి టీడీపీ పెద్దలు ఈ విషయాన్ని కప్పిపుచ్చారు. పైగా ఏపీఎస్ఎస్డీసీలో కీలకమైన ఫైళ్లను మాయం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర జీఎస్టీ అధికారులు ఏసీబీ దృష్టికి తెచ్చిన విషయం బయటపడింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో సీఐడీ దర్యాప్తు చేపట్టింది. టీడీపీ హయాంలో ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం చేసుకున్న సుమన్ బోస్ అలియాస్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ వ్యవహారాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ స్పష్టం చేస్తూ ఏపీఎస్ఎస్డీసీకి ఓ లేఖ రాసింది. తాము అందించిన లైసెన్స్డ్ సాఫ్ట్వేర్కుగాను తమకు రూ.56 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించింది. అంతేగానీ వేల కోట్ల ప్రాజెక్టుకు తమ బాధ్యత లేదని సీమెన్స్ స్పష్టం చేసింది. దీంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు పేరుతో టీడీపీ పెద్దలు అడ్డగోలుగా రూ.241 కోట్లు ప్రజాధనాన్ని దోపిడీ చేసినట్టు తేలింది. కుంభకోణం కథ ఇదీ.. 2014–15 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు రూ.3,556 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే కేవలం కాగితాలపైనే ఓ ప్రాజెక్టును చూపించి ప్రజాధనాన్ని టీడీపీ ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టారు. ఇందులో భాగంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును సీమెన్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ కాన్విల్కర్ కలిశారు. మొత్తం రూ.3,556 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు 90 శాతం నిధులు పెట్టుబడి పెడతాయని ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలు ఆ ప్రాజెక్టు వ్యయం రూ.3,556 కోట్లుగా ఎలా నిర్ధారించారని శాస్త్రీయంగా మదింపు చేయనే లేదు. అసలు సీమెన్స్ కంపెనీకి ఈ ఒప్పందం గురించే తెలియదు. భారత్‌లో గతంలో ఆ కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ అలియాస్ సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తోపాటు టీడీపీ పెద్దలు డిజైన్ టెక్‌తో కలిసి కథ నడిపించారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు, రూ.40వేల వరకు జీతం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, ప్రముఖ దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్లు సంయుక్తంగా విశాఖ పట్నంలోని ఇన్‌స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఆగస్ట్ 3న రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నాయి. ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్, ప్లేస్మెంట్ డ్రైవ్‌లో టెన్త్ క్లాస్, ఇంటర్, డిప్లమో, డిగ్రీ పూర్తి చేసిన వారు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. 71 పోస్ట్‌లకు నిర్వహించే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో అర్హులైన అభ్యర్ధులు విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో పనిచేసే అవకాశం లభించనుంది. జీతం రూ.20వేల నుంచి రూ.40వేల వరకు ఉంటుందని డ్రైవ్ నిర్వాహాకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఏపీఎస్ఎస్డీసీ.ఇన్ వెబ్ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుందని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. -
ఈ ఏడాది 312 జాబ్ మేళాలు
సాక్షి, అమరావతి: స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే 12 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 312 జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రకటించింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లాలో కనీసం ఒక జాబ్ మేళా నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఏపీఎస్ఎస్డీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, చైర్మన్ అజయ్‌రెడ్డి, జాబ్ మేళా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, ఏపీఎస్ఎస్డీసీ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించే విధంగా ప్రతి మంగళవారం ప్లేస్మెంట్ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించే విధంగా 262 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ, గడిచిన మూడేళ్లలో 14 లక్షల మందికి ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గం పరిధిలో స్కిల్హబ్స్ ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా తొలి విడతలో 66 హబ్స్‌ను ఆగస్టు 15న అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎస్ఎస్డీసీ చైర్మన్ అజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం: అది సామాజిక ఆర్థిక నేరం
సాక్షి, అమరావతి: ఆర్థిక నేరాల్లో ముందస్తు బెయిల్ ఇస్తే అది దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్ మంజూరు వల్ల నిందితులను విచారించడం, కీలక ఆధారాల సేకరణ వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థను నిరాశపరచడమే అవుతుందని చిదంబరం కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో జరిగిన రూ.371 కోట్ల కుంభకోణం సామాజిక–ఆర్థిక నేరమని తెలిపింది. ఈ కేసుకున్న తీవ్రత దృష్ట్యా ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్, ఈ కుంభకోణంలో నిందితుడైన విపిన్ శర్మ ముందస్తు బెయిల్‌కు అర్హుడు కాదని తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు. ఇదీ కుంభకోణం.. 2014–19 మధ్య కాలంలో చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్రంలో 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థలు 90 శాతం నిధులు, ప్రభుత్వం 10 శాతం సమకూర్చాలి. ఇందులో ప్రభుత్వం తన వాటా రూ.371 కోట్లను సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు ఇచ్చేసింది. ఆ తరువాత హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సరఫరా పేరుతో నిధులను కొల్లగొట్టేందుకు పలు షెల్ కంపెనీలను సృష్టించారు. వాటిద్వారా రూ.వందల కోట్లను దారి మళ్లించారు. దీనిపై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు గత ఏడాది డిసెంబర్ 9న కేసు నమోదు చేశారు. విపిన్ శర్మతోపాటు పలువురు అధికారులు, కంపెనీల ప్రతినిధులను నిందితులుగా చేర్చారు. పిటిషనర్‌ది న్యాయపూరిత కుట్ర: సీఐడీ ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ విపిన్ శర్మ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి విచారణ జరిపారు. శర్మ తరఫు న్యాయవాది ఏసీఎస్ బోస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ చార్టెడ్ అకౌంటెంట్ అని, పలువురు క్లయింట్లకు సేవలందిస్తుంటారని తెలిపారు. ఈ కుంభకోణంతో పిటిషనర్‌కు సంబంధం లేదన్నారు. సీఐడీ తరఫు న్యాయవాది టీఎంకే చైతన్య వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ నియంత్రణలో ఉన్న కొన్ని షెల్ కంపెనీల ద్వారా తప్పుడు ఇన్వాయిస్లు ఇచ్చారని తెలిపారు. ఈ షెల్ కంపెనీల ద్వారా సులభంగా డబ్బు సంపాదించడమే పిటిషనర్ లక్ష్యమన్నారు. వాటి ద్వారా రూ.8.5 కోట్లు పొంది, వాటిని తిరిగి వివిధ కంపెనీలకు మళ్లించారని తెలిపారు. మిగిలిన నిందితులతో కలిసి పిటిషనర్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్నారు. ఈ కుంభకోణంలో కీలక విషయాలు ఆయనకు తెలుసునని, అందువల్ల ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని వివరించారు. సీఐడీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. పిటిషనర్ మూడు షెల్ కంపెనీలను కొన్నారని, ఈ విషయాన్ని ఆయన భార్య కూడా నిర్ధారించారని న్యాయమూర్తి తెలిపారు. రెండు కంపెనీల్లో ఆమె కూడా డైరెక్టర్‌గా ఉన్నారని చెప్పారు. వాస్తవానికి పిటిషనర్ దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాల్సి ఉన్నా, హాజరు కాలేదన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా పిటిషనర్ ముందస్తు బెయిల్‌కు అర్హుడు కాదని తెలిపారు. -
నైపుణ్య శిక్షణను పంచుకునేందుకు ‘క్యాట్స్’ ఆసక్తి : ఏపీఎస్ఎస్డీసీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కిల్ కాలేజీలకు నైపుణ్య శిక్షణ విధానాన్ని అందించేందుకు అమెరికాలోని నార్త్ కొరోలినాలోని కెరీర్ అకాడమీ అండ్ టెక్నికల్ స్కూల్(క్యాట్స్) ఆసక్తి కనబరిచింది. అమెరికా పర్యటనలో భాగంగా క్యాట్స్ కేంద్రాన్ని ఏపీ నైపుణ్యాభివృద్థి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి సందర్శించారు. అక్కడ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. ఆటోమోటివ్ టెక్, వెల్డింగ్, అత్యవసర వైద్య చికిత్స, అగ్ని మాపక అకాడమీ, నర్సింగ్, క్యూలినరీ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్ వంటి విభాగాల్లో శిక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాట్స్ ప్రిన్సిపాల్ లర్రీ ఈ రోగర్స్, ప్రోగ్రామ్ క్యాంప్స్ డైరెక్టర్ డెబ్రాలెస్టర్, ఇతర టెక్నికల్ సిబ్బందిని కలిశారు. అక్కడ అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణ విధానాన్ని మనతో పంచుకునేందుకు ఆసక్తి కనబరిచారని ఏపీఎస్ఎస్డీసీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. (క్లిక్: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 25న హెచ్‌సీఎల్ ‘వాక్ ఇన్ డ్రైవ్’) -
APSSDC: ఏపీఎస్ఎస్డీసీకి జాతీయ గుర్తింపు.. ఎందుకంటే?
సాక్షి, అమరావతి: నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) అమలు చేస్తోన్న కొత్త విధానాలకు జాతీయ గుర్తింపు లభించింది. కర్ణాటకలో జరుగుతున్న 2వ ఇండిగ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న నూతన స్కిల్ విధానాలను అభినందిస్తూ అవార్డు వచ్చినట్లు ఏపీఎస్ఎస్డీసీ సోమవారం ప్రకటన విడుదల చేసింది. చదవండి: AP: ఎస్ఎల్బీసీ నివేదిక.. వారికి భారీగా రుణాలు 5 రాష్ట్రాలకు చెందిన 20కిపైగా యూనివర్సిటీ విద్యార్థులు, 20 రంగాలకు చెందిన పరిశ్రమలు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో న్యూ ఆక్టివిటీస్ అండ్ క్యాస్కేడింగ్ స్కిల్ సిస్టమ్ గురించి ఏపీఎస్ఎస్డీసీ ప్రెజెంటేషన్ ఇచ్చింది. దానికి అవార్డు లభించడంపై ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ఎస్ సత్యనారాయణ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.