
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, ప్రముఖ దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్‌లు సంయుక్తంగా విశాఖ పట్నంలోని ఇన్‌స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఆగస్ట్ 3న రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నాయి.
ఇండస్ట్రీ కస్టమైజ్‌డ్ స్కిల్ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో టెన్త్ క్లాస్, ఇంటర్, డిప‍్లమో, డిగ్రీ పూర్తి చేసిన వారు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. 71 పోస్ట్‌లకు నిర్వహించే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో అర్హులైన అభ్యర్ధులు విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో పనిచేసే అవకాశం లభించనుంది. జీతం రూ.20వేల నుంచి రూ.40వేల వరకు ఉంటుందని డ్రైవ్ నిర్వాహాకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ.ఇన్ వెబ్ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుందని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment