Campus Drive
-
జాబ్ వచ్చేసినట్టేనని ఆనందపడ్డ విద్యార్థులకు షాకిస్తున్న ఐటీ కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఐటీ కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగాల అంశం కలవరపెడుతోంది. క్యాంపస్ నియామకాల్లో ఎంపికై ఆఫర్ లెటర్లు వచ్చినా.. ఉద్యోగాల్లో చేరడానికి ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. చిన్న సంస్థల నుంచి ఐటీ దిగ్గజాల దాకా ఇలాగే వ్యవహరిస్తుండటం.. ఆఫర్ లెటర్లు ఇచ్చి ఏడాది దాటిపోతున్నా ఉద్యోగాల్లో చేర్చుకోకపోవడం తీవ్ర ఆందోళన రేపుతోంది. పారిశ్రామిక వర్గాల లెక్కల ప్రకారం.. గత ఏడాది ఆగస్టులో తెలంగాణలో బహుళజాతి సంస్థలు, అంకుర సంస్థలు, చిన్న ఐటీ కంపెనీలు కలిపి 24,500 మందిని క్యాంపస్ నియామకాల ద్వారా ఎంపిక చేసుకున్నాయి. కానీ ఇందులో ఇప్పటివరకు 2,300 మందికి మాత్రమే నియామక ఉత్తర్వులు వచ్చినట్టు అంచనా. రాష్ట్రంలోని టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగిన నియామకాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉద్యోగం వచ్చేసినట్టేనని ఆనందపడ్డ విద్యార్థులు.. క్రమంగా ధైర్యం కోల్పోతున్నారు. గత ఏడాది ఆగస్టులో సాఫ్ట్వేర్ కంపెనీలు దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టాయని.. పలురకాల పరీక్షల తర్వాత ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయని, ఆ తర్వాత మరే స్పందనా లేదని ఎంపికైన విద్యార్థులు వాపోతున్నారు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు నన్ను బీటెక్ 4వ సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోనే ఓ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపిక చేసింది. రెండో సెమిస్టర్ కాగానే అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందని.. అప్పట్నుంచే శిక్షణ మొదలవుతుందని, వేతనం కూడా ఇస్తామని చెప్పారు. కానీ 10 నెలలు గడిచింది. ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. – ప్రవీణ్ వర్మ, హైదరాబాద్, క్యాంపస్ రిక్రూటీ చిన్న కంపెనీలు తీసుకుంటున్నా.. అంకుర సంస్థలు, చిన్న కంపెనీలు మాత్రం క్యాంపస్ నియామకాల్లో ఎంపిక చేసుకున్నవారిని ఉద్యోగాల్లోకి ఆహా్వనిస్తున్నాయి. కానీ అవసరమైన మేర తక్కువ సంఖ్యలోనే సిబ్బందిని తీసుకుంటున్నాయి. కోవిడ్ తర్వాత ఆశించిన మేర ప్రాజెక్టులు రావడం లేదని.. అందుకే ఆఫర్ లెటర్ ఇచ్చినా ఉద్యోగాల్లోకి పిలవలేక పోతున్నామని కొన్ని కంపెనీల నిర్వాహకులు చెప్తున్నారు. మరికొన్ని కంపెనీలు కొత్తగా నియామకాలను నిలిపేయడమేగాక.. ఉన్న ఉద్యోగుల వేతనాలు తగ్గించుకుంటున్నాయని అంటున్నారు. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా 570 కంపెనీలు 1.70 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్టు లేఆఫ్స్ ఎఫ్‌వైఐ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. మాంద్యం ప్రభావంతోనే! ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మంద గమనం కొనసాగుతోంది. దీనితో ఐటీ కంపెనీలు కొత్త నియామకాల విషయంలో వెనుకాడుతున్నాయి. అమెరికాలో అత్యధిక ద్రవోల్బణం, స్థిరాస్తి, బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో.. అక్కడ ఆర్థిక వ్యవస్థ గాడిన పడటానికి కనీసం రెండేళ్లు పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూరప్ దేశాలు, జపాన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు కూడా ఇటీవల ఉద్యోగులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కొత్త నియామకాలు వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లే. మాది వరంగల్. ఓ ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. చివరి సెమిస్టర్లో ఉండగా.. మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగానికి ఆఫర్ లెటర్ ఇచ్చింది. ఇప్పటికీ అపాయింట్మెంట్ రాలేదు. ఎన్ని మెయిల్స్ చేసినా స్పందన లేదు. బంధువులకు ముఖం చూపించలేక.. హైదరాబాద్‌లోనే ఉండి కోర్సులు నేర్చుకుంటున్నాను. – అఖిలేశ్ గౌడ్, క్యాంపస్ రిక్రూటీ, హైదరాబాద్ స్పెషల్ స్కిల్స్ ముఖ్యం ఇంకో ఏడాది పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ నియామకాలపై ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికే నియామకాలు జరగలేదు. ఏఐ, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్, మెషీన్ లెరి్నంగ్, డేటా అనలిటిక్స్ వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్న వారికి మాత్రం మార్కెట్ బాగానే ఉంటోంది. – మిత్రాసేథ్, ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగి -
ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు, రూ.40వేల వరకు జీతం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, ప్రముఖ దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్లు సంయుక్తంగా విశాఖ పట్నంలోని ఇన్‌స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఆగస్ట్ 3న రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నాయి. ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్, ప్లేస్మెంట్ డ్రైవ్‌లో టెన్త్ క్లాస్, ఇంటర్, డిప్లమో, డిగ్రీ పూర్తి చేసిన వారు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. 71 పోస్ట్‌లకు నిర్వహించే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో అర్హులైన అభ్యర్ధులు విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో పనిచేసే అవకాశం లభించనుంది. జీతం రూ.20వేల నుంచి రూ.40వేల వరకు ఉంటుందని డ్రైవ్ నిర్వాహాకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఏపీఎస్ఎస్డీసీ.ఇన్ వెబ్ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుందని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. -
రేపు ఎస్‌ఆర్‌ఐటీలో క్యాంపస్ డ్రైవ్
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కశాలలో ఈ నెల 5వ తేదీ షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ వారు క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు టీపీఓ రంజిత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్‌కు ఈఈఈ, మెకానికల్ విభాగాల్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించిన పాలిటెక్నికల్ విద్యార్థులు అర్హులన్నారు. పాల్గొనదలచినవారు తమ రెజూం, మార్కుల జాబితాలు తీసుకుని ఉదయం 9 గంటలకు ఎస్ఆర్ఐటీ కళాశాలకు రావాలన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ఏడాదికి రూ.1.20 - 1.50 లక్షలు వేతనం ఉంటుందన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు వైఎస్సార్ జిల్లాలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 95052 83026, 95052 83037 నెంబర్లలో సంప్రదించి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
క్యాంపస్ డ్రైవ్‌లో 189 మంది ఎస్ఆర్కేఆర్ విద్యార్థులు ఎంపిక
భీమవరం : భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో కళాశాలకు చెందిన 189 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో 92 మంది మహిళలు, 92 మంది పురుషులు ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారధివర్మ చెప్పారు. కళాశాల సెమినార్హాలు టీసీఎస్ ప్రతినిధి కార్తీక ఎంపికైన వారి వివరాలను వెల్లడించారు. ఈనెల 7 నుంచి ఇంటర్యూ్వలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ సాగి విఠల్‌రాజు మాట్లాడుతూ తమ కళాశాలలో ఫైనలియర్ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం క్యాంపస్ సెలక్షన్స్ల్లో వారికి ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల్లో ఈసీఈ విద్యార్థులు 60 మంది, సీఎస్ఈ విద్యార్థులు 48, ఈఈఈ విద్యార్థులు 26, మెకానికల్ విద్యార్థులు 20, సివిల్ విద్యార్థులు 15, ఐటీ విద్యార్థులు 15, పీజీ కోర్సుల విద్యార్థులు ఐదుగురు ఎంపికయ్యారని కళాశాల ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఇన్చార్జ్ డాక్టర్ కె.సురేష్‌బాబు చెప్పారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు సాగి ప్రసాదరాజు, సాగి అచ్యుతరామరాజు, చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, ప్రిన్సిపాల్ పార్థసారధివర్మ అభినందించారు. -
13న ప్రభుత్వ మహిళా కళాశాలలో క్యాంపస్ డ్రైవ్
డాబాగార్డెన్స్: విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ నెల 13న కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ), క్యాడ్బరీ ఇండియా సంయుక్తంగా క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.సుధాకరరావు ప్రకటనలో తెలిపారు. అసోసియేట్ మెంబర్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై 18–21 ఏళ్లలోపు మహిళా అభ్యర్థులు, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల జేకేసీ కో–ఆర్డినేటర్ సీహెచ్ శాంతిదేవి కోరారు. మరిన్ని వివరాలకు 7396473173 నంబరులో సంప్రదించవచ్చు. -
కొలువుల సీజన్..
ముందు చదువు పూర్తి చేయడం.. ఆనక పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయడం, రాయడం, ఫలితాల కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడటం.. ఇదంతా గతం.. మారుతున్న కాలంతోపాటు నియామకాల ప్రక్రియ కొత్త పుంతలు తొక్కింది. విద్యాభ్యాస సమయంలోనే కొలువు సంపాదించే అద్భుత అవకాశాన్ని.. అదీ తరగతి గది వద్దే కల్పిస్తోంది. ఈ ప్రక్రియనే క్యాంపస్ డ్రైవ్ అంటున్నారు. ఇందులోనూ ఇటీవలి కాలం వరకు సాఫ్ట్వేర్, ఇతర వృత్తివిద్యా కోర్సులు చేసిన వారికే క్యాంపస్ ఎంపికలు పరిమతమయ్యాయి. ఇప్పుడా పరిమితులు తొలగిపోయాయి. ప్రొఫెషనల్ కోర్సులతో పాటు సంప్రదాయ డిగ్రీ, పీజీలు చేసిన వారికి బహుళజాతి, దేశీయ కార్పొరేట్ సంస్థలు క్యాంపస్ నియామకాల్లో మంచి అవకాశాలనే కల్పిస్తున్నాయి. వార్షిక పరీక్షలకు ముందు నవంబర్ నుంచి మార్చి నెలలను క్యాంపస్ డ్రైవ్‌ల నెలలుగా అభివర్ణించవచ్చు. ఇంతటి అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం.. భవిష్యత్తుకు బంగారుబాట వేసుకోవడం విద్యార్థుల చేతుల్లోనే ఉంది. మళ్లీ కొలువుల సీజన్ వచ్చిన నేపథ్యంలో గత విజేతలు, నిపుణుల సలహాలు.. ఎచ్చెర్ల: ఇప్పుడిప్పుడే సాఫ్ట్వేర్ రంగం పుంజుకుంటోంది. పలు కంపెనీలు ఉద్యోగాల నియూమకాలకు తలుపులు తెరుస్తున్నారుు. మరికొన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల నిర్వహణలో బిజీ ఆయ్యూరుు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు ఉద్యోగాల భర్తీ కాలం. ఇది నిరుద్యోగ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. అరుుతే, కష్టపడి చదివిన వారికే కొలువులు దక్కుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. అందుకు తగ్గ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. ఉపాధి అవకాశాలు ఇలా... జిల్లాలో సీఏస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్ బ్రాంచిలు ఉన్నాయి. సీఏస్ఈ విద్యార్థులకు సాప్టువేర్ రంగంలో, ఈసీఈ విద్యార్థులకు నెట్వర్క్, కమ్యూనికేషన్ రంగంలో, త్రిపుల్ఈకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, విద్యుత్ రంగంలో, మెకానికల్ విద్యార్థులకు రవాణా, మోటార్ ఫీల్డులోను, సివిల్ బ్రాంచ్ విద్యార్థులకు కనస్ట్రక్షన్ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తారుు. ఎంసీఏ విద్యార్థులు సాఫ్ట్వేర్ కంపెనీలకు, ఎంబీఏ విద్యార్థులకు వ్యాపార రంగంలోను, బి-ఫార్మసీ విద్యార్థులకు హాస్పటాలిటీ, మందుల కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తారుు. రాతపరీక్ష, బృందచర్చల్లో ప్రతిభ చూపిన వారికే... జిల్లాలో ఏటా టీసీఏస్, విప్రో, ఇన్ఫోసిస్, ఐబీఏం, ఐహేచ్సీ, మహేంద్రా సత్యం, హనీవెల్, కేబ్జిమిని తదితర కంపెనీలు ఇంజినీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారుు. తమకు కావాల్సిన సిబ్బందిని నియమిస్తున్నారుు. కంపెనీ ప్రతినిధులే నేరుగా కళాశాలకు వచ్చి రాత పరీక్ష, బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఉద్యోగ హామీపత్రాలను అందజేస్తున్నారు. అరుుతే, ఈ కంపెనీలు విద్యార్థిని అన్ని కోణాల్లోనూ పరీక్షించి తమ అవసరాలకు ఉపయోగపడేవారినే ఎంపిక చేసుకుంటారుు. విద్యార్థులు ముందుగానే కంపెనీల అవసరాలు గుర్తించి సిద్ధంకావాలి. ఇప్పటికే ఆయూ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న సీనియర్ విద్యార్థుల సూచనలు, సలహాలు స్వీకరించాలి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇవి తప్పనిసరి... క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విజేతగా నిలవాలంటే విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ, సాంకేతిక పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం, నైపుణ్యం, గణితంపై పట్టు, అనుకూల దృక్పథం ఉండాలి. అలాగే, ఆంగ్లభాషా పరిజ్ఞానం, సమస్యపై స్పందించే గుణం, తక్షణ పరిష్కారం చూపే నైపుణ్యం పెంపొందించుకోవాలి. తడబాటు ఇక్కడే... జిల్లా విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కేవలం 30 శాతం మందే అర్హత సాధిస్తున్నారు. అదీ నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల లోపు జీతం ఇచ్చే ఉద్యోగాలకే అర్హత సాధిస్తున్నారు. దీనికి ఆంగ్లభాషపై పట్టులేకపోవం, అనుకూల దృక్పథం లేకపోవడం, సబ్జెక్టుపై పరిజ్ఞానం ఉన్నా భావాన్ని వ్యక్తికరించలేకపోవడం, సాంకేతిక మార్పులు గమనించలేకపోవడమే ప్రధాన లోపాలుగా మారారుు. వీటిపై సాధన చేస్తే జిల్లా విద్యార్థులు సైతం నెలకు రూ.80వేల నుంచి రూ.లక్షా 50వేల జీతాలు ఇచ్చే కంపెనీలు, ఉద్యోగాలకు ఎంపికవుతారని విద్యానిపుణులు చెబుతున్నారు. ఇంటర్వ్యూల కాలంలో లోపాలను అధిగమించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. అనుకూల దృక్పథంతో సాగాలి విద్యార్థిలో ముందుగా అనుకూల దృక్పథం ఉండాలి. ఇదే విజయంవైపు పయనించేలా చేస్తుంది. ఏ అంశం నేర్చుకోవాలన్నా ముందు విద్యార్థి తనలోని భయం విడనాడాలి. పట్టుదలే లక్ష్యసాధనన్న విషయం గుర్తించాలి. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించాలి. అవసరమైతే మహనీయుల ఆత్మ కథలు చదవాలి. వాటి నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ముందు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవడం అలవర్చుకోవాలి. -ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నైపుణ్యాలు కీలకం విద్యార్థి ఇంజినీరింగ్‌లో చేరిన వెంటనే రిలీవ్లోపు ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం నిర్దేశించుకోవాలి. లోపాలు గుర్తించి అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. విద్యాబోధన ఆంగ్లంలో సాగుతుంది. అందుకే తరగతి గదిలో ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. దీనివల్ల కమ్యునికేషన్ స్కిల్స్ వృద్ధి చెందుతారుు. తరగతులకు రోజూ హాజరైతే విషయ పరిజ్ఞానానికి డోకా ఉండదు. -డాక్టర్ బుడుమూరు శ్రీరాంమూర్తి, డెరైక్టర్, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల