13న ప్రభుత్వ మహిళా కళాశాలలో క్యాంపస్ డ్రైవ్
Published Thu, Aug 11 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
డాబాగార్డెన్స్: విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ నెల 13న కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ), క్యాడ్‌బరీ ఇండియా సంయుక్తంగా క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.సుధాకరరావు ప్రకటనలో తెలిపారు. అసోసియేట్ మెంబర్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై 18–21 ఏళ్లలోపు మహిళా అభ్యర్థులు, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల జేకేసీ కో–ఆర్డినేటర్ సీహెచ్ శాంతిదేవి కోరారు. మరిన్ని వివరాలకు 7396473173 నంబరులో సంప్రదించవచ్చు.
Advertisement
Advertisement