కొలువుల సీజన్.. | campus recruitment time | Sakshi
Sakshi News home page

కొలువుల సీజన్..

Published Sat, Nov 15 2014 2:17 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

కొలువుల సీజన్.. - Sakshi

కొలువుల సీజన్..

ముందు చదువు పూర్తి చేయడం..
ఆనక పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయడం, రాయడం, ఫలితాల కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడటం.. ఇదంతా గతం.. మారుతున్న కాలంతోపాటు నియామకాల ప్రక్రియ కొత్త పుంతలు తొక్కింది. విద్యాభ్యాస సమయంలోనే కొలువు సంపాదించే అద్భుత అవకాశాన్ని.. అదీ తరగతి గది వద్దే కల్పిస్తోంది. ఈ ప్రక్రియనే క్యాంపస్ డ్రైవ్ అంటున్నారు. ఇందులోనూ ఇటీవలి కాలం వరకు సాఫ్ట్‌వేర్, ఇతర వృత్తివిద్యా కోర్సులు చేసిన వారికే క్యాంపస్ ఎంపికలు పరిమతమయ్యాయి.

ఇప్పుడా పరిమితులు తొలగిపోయాయి. ప్రొఫెషనల్ కోర్సులతో పాటు సంప్రదాయ డిగ్రీ, పీజీలు చేసిన వారికి బహుళజాతి, దేశీయ కార్పొరేట్ సంస్థలు క్యాంపస్ నియామకాల్లో మంచి అవకాశాలనే కల్పిస్తున్నాయి. వార్షిక పరీక్షలకు ముందు నవంబర్ నుంచి మార్చి నెలలను క్యాంపస్ డ్రైవ్‌ల నెలలుగా అభివర్ణించవచ్చు. ఇంతటి అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం.. భవిష్యత్తుకు బంగారుబాట వేసుకోవడం విద్యార్థుల చేతుల్లోనే ఉంది. మళ్లీ కొలువుల సీజన్  వచ్చిన నేపథ్యంలో గత విజేతలు, నిపుణుల సలహాలు..
 
ఎచ్చెర్ల: ఇప్పుడిప్పుడే సాఫ్ట్‌వేర్ రంగం పుంజుకుంటోంది. పలు కంపెనీలు ఉద్యోగాల నియూమకాలకు తలుపులు తెరుస్తున్నారుు. మరికొన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల నిర్వహణలో బిజీ ఆయ్యూరుు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు ఉద్యోగాల భర్తీ కాలం. ఇది నిరుద్యోగ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. అరుుతే, కష్టపడి చదివిన వారికే కొలువులు దక్కుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. అందుకు తగ్గ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు.
 
ఉపాధి అవకాశాలు ఇలా...
జిల్లాలో సీఏస్‌ఈ, ఈసీఈ, ట్రిపుల్‌ఈ, మెకానికల్, సివిల్ బ్రాంచిలు ఉన్నాయి. సీఏస్‌ఈ విద్యార్థులకు సాప్టువేర్ రంగంలో, ఈసీఈ విద్యార్థులకు నెట్‌వర్క్, కమ్యూనికేషన్ రంగంలో, త్రిపుల్‌ఈకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, విద్యుత్ రంగంలో, మెకానికల్ విద్యార్థులకు రవాణా, మోటార్ ఫీల్డులోను, సివిల్ బ్రాంచ్ విద్యార్థులకు కనస్ట్రక్షన్ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తారుు. ఎంసీఏ విద్యార్థులు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు, ఎంబీఏ విద్యార్థులకు వ్యాపార రంగంలోను, బి-ఫార్మసీ విద్యార్థులకు హాస్పటాలిటీ, మందుల కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తారుు.

రాతపరీక్ష, బృందచర్చల్లో ప్రతిభ చూపిన వారికే...
జిల్లాలో ఏటా టీసీఏస్, విప్రో, ఇన్ఫోసిస్, ఐబీఏం, ఐహేచ్‌సీ, మహేంద్రా సత్యం, హనీవెల్, కేబ్‌జిమిని తదితర కంపెనీలు ఇంజినీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారుు. తమకు కావాల్సిన సిబ్బందిని నియమిస్తున్నారుు. కంపెనీ ప్రతినిధులే నేరుగా కళాశాలకు వచ్చి రాత పరీక్ష, బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఉద్యోగ హామీపత్రాలను అందజేస్తున్నారు. అరుుతే, ఈ కంపెనీలు విద్యార్థిని అన్ని కోణాల్లోనూ పరీక్షించి తమ అవసరాలకు ఉపయోగపడేవారినే ఎంపిక చేసుకుంటారుు. విద్యార్థులు ముందుగానే కంపెనీల అవసరాలు గుర్తించి సిద్ధంకావాలి. ఇప్పటికే ఆయూ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న సీనియర్ విద్యార్థుల సూచనలు, సలహాలు స్వీకరించాలి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోవాలి.
 
ఇవి తప్పనిసరి...
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విజేతగా నిలవాలంటే విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ, సాంకేతిక పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం, నైపుణ్యం, గణితంపై పట్టు, అనుకూల దృక్పథం ఉండాలి. అలాగే, ఆంగ్లభాషా పరిజ్ఞానం, సమస్యపై స్పందించే గుణం, తక్షణ పరిష్కారం చూపే నైపుణ్యం పెంపొందించుకోవాలి.
 
తడబాటు ఇక్కడే...
జిల్లా విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కేవలం 30 శాతం మందే అర్హత సాధిస్తున్నారు. అదీ నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల లోపు జీతం ఇచ్చే ఉద్యోగాలకే అర్హత సాధిస్తున్నారు. దీనికి ఆంగ్లభాషపై పట్టులేకపోవం, అనుకూల దృక్పథం లేకపోవడం, సబ్జెక్టుపై పరిజ్ఞానం ఉన్నా భావాన్ని వ్యక్తికరించలేకపోవడం, సాంకేతిక మార్పులు గమనించలేకపోవడమే ప్రధాన లోపాలుగా మారారుు. వీటిపై సాధన చేస్తే జిల్లా విద్యార్థులు సైతం నెలకు రూ.80వేల నుంచి రూ.లక్షా 50వేల జీతాలు ఇచ్చే కంపెనీలు, ఉద్యోగాలకు ఎంపికవుతారని విద్యానిపుణులు చెబుతున్నారు. ఇంటర్వ్యూల కాలంలో లోపాలను అధిగమించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
 
అనుకూల దృక్పథంతో సాగాలి
విద్యార్థిలో ముందుగా అనుకూల దృక్పథం ఉండాలి. ఇదే విజయంవైపు పయనించేలా చేస్తుంది. ఏ అంశం నేర్చుకోవాలన్నా ముందు విద్యార్థి తనలోని భయం విడనాడాలి. పట్టుదలే లక్ష్యసాధనన్న విషయం గుర్తించాలి. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించాలి. అవసరమైతే మహనీయుల ఆత్మ కథలు చదవాలి. వాటి నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ముందు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవడం అలవర్చుకోవాలి.
-ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ
 
నైపుణ్యాలు కీలకం
విద్యార్థి ఇంజినీరింగ్‌లో చేరిన వెంటనే రిలీవ్‌లోపు ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం నిర్దేశించుకోవాలి. లోపాలు గుర్తించి అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. విద్యాబోధన ఆంగ్లంలో సాగుతుంది. అందుకే తరగతి గదిలో ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. దీనివల్ల కమ్యునికేషన్ స్కిల్స్ వృద్ధి చెందుతారుు. తరగతులకు రోజూ హాజరైతే విషయ పరిజ్ఞానానికి డోకా ఉండదు.
-డాక్టర్ బుడుమూరు శ్రీరాంమూర్తి, డెరైక్టర్, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement