Campus placements
-
ఐఐటీ ప్లేస్మెంట్లలో క్షీణత
సాక్షి, అమరావతి: దేశంలో ఇంజనీరింగ్ విద్యకు అత్యుత్తమ విద్యా సంస్థలుగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల క్యాంపస్ ప్లేస్మెంట్లలో క్షీణత కనిపిస్తోంది. సాంకేతిక రంగంలో మారుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, జాబ్ మార్కెట్లో పోటీ పడుతున్న ఐఐటీ గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దేశంలోని తొలి తరం ఐఐటీల్లో 2018–19 నుంచి 2023–24 వరకు ప్లేస్మెంట్ డేటాను విశ్లేషిస్తే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లలో ఉద్యోగ ఆఫర్లు పొందుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ ఐఐటీల్లో ఏకంగా 5 నుంచి 16 శాతం ప్లేస్మెంట్లు తగ్గాయి. ఐఐటీ ఢిల్లీ ఒక్కటే ప్లేస్మెంట్ల కల్పనలో నిలకడగా ఉంది. ఐఐటీల్లో చదువుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది ఉద్యోగాలను పొందుతున్నారు. కేవలం 1.6 శాతం మంది మాత్రమే స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారు. దాదాపు 10 శాతం మంది ఉన్నత చదువుల కోసం, 5 శాతం మంది సివిల్ సర్వీసుల వైపు వెళుతున్నట్లు ఐఐటీ గౌహతి నిపుణులు వెల్లడించారు. ప్యాకేజీల్లోనూ తగ్గుదల... ఐఐటీ క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు పొందినవారికి ఇచ్చే ప్యాకేజీల్లో తగ్గుదల కూడా విద్యార్థులను కలవరపెడుతోంది. ఐఐటీ కాన్పూర్‌లో సగటు వార్షిక జీతం 2020–21లో రూ.22.10 లక్షల నుంచి 2022–23లో రూ.25.90 లక్షలకి పెరిగింది. అయితే 2023–24లో రూ.23.70 లక్షలకు తగ్గింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2020–21లో వార్షిక సగటు వేతనం రూ.14 లక్షల నుంచి 2022–23లో రూ.18 లక్షలకు పెరిగింది. అయితే, 2023–24లో మళ్లీ రూ.17 లక్షలకు తగ్గింది. అదే ఐఐటీ బాంబేలో 2021–22లో రూ.21.50 లక్షలు నుంచి 2022–23లో రూ. 21.82 లక్షలకు పెరిగింది. -
ప్యాకేజీలో తగ్గేదేలే!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆకర్షణీయ వేతనాలతో కొలువులు సాధిస్తున్న విద్యార్థులకు వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (ఎన్ఐటీ) అడ్డా గా మారింది. నిట్ వరంగల్‌లో సీటు వచి్చందంటే ఉద్యోగంతోనే బయటకి అడుగుపెడుతామన్న భరోసా విద్యార్థుల్లో కనిపిస్తోంది. ఇక్కడి విద్యార్థి అన్ని రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తారనే భావనతో ప్రభుత్వ రంగం సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఎన్ఐటీలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేందుకు, రిక్రూట్మెంట్ చేసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. క్యాంపస్ సెలక్షన్స్‌లో‘నిట్’ విద్యార్థుల జోరు ∙నిట్ వరంగల్‌లోని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ప్రతీ ఏడాది జోరు కొనసాగిస్తున్నారు. » ఈ ఏడాది బీటెక్‌లో 82 శాతం, ఎంటెక్ 62.3 శాతం, ఎంసీఏ 82.6 శాతం, ఎమ్మెస్సీ 80 శాతం, ఎంబీఏలో 76 శాతం విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. » మొత్తంగా 1,483 మంది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో 1,128 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయి. » నాలుగేళ్లలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌ను పరిశీలీస్తే ఏటేటా కొలువులు పొందుతున్న సంఖ్య పెరుగుతోంది. » 2020–21లో క్యాంపస్ సెలక్షన్స్ కోసం 186 కంపెనీలు పాల్గొంటే.. 815 మంది విద్యార్థులు ఎంపిక కాగా, అత్యధికంగా రూ.52లక్షల ప్యాకేజీ వచ్చింది. » 2021–22లో 1,108, 2022–23లో 1,404 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. ఈ ఏడాది 1,128 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. అత్యధికంగా రూ.88 లక్షల ప్యాకేజీ లభించింది.ప్లేస్‌మెంట్స్,ప్యాకేజీలలోతగ్గేదేలే..ప్రస్తుత తరుణంలో ఐటీ రంగం సంక్షోభంలో కూరుకుపోయి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండగా సంక్షోభాన్ని తలదన్ని తమ ప్రత్యేకతను చాటుకుని క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు నిట్ విద్యార్థులు. గతేడాది సీఎస్ఈ విభాగానికి చెందిన ఆదిత్య సింగ్ రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీని అత్యధికంగా సాధించగా, ఈ ఏడాది ఈసీఈ విద్యార్థి రవీషా తన సత్తాను చాటి రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీ ఆనవాయితీని కొనసాగించాడు. అదే విధంగా 12 మంది రూ.68 లక్షల వార్షిక ప్యాకేజీ, తక్కువలో తక్కువగా రూ.15.6 లక్షల వార్షిక ప్యాకేజీని మిగతా విద్యార్థులు సాధించారు.గతేడాది 250..ఇప్పుడు 278..నిట్ క్యాంపస్‌లో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేందుకు గతేడాది 250కి పైగా కంపెనీలు రాగా ఈ ఏడాది 278 ప్రైవేట్‌తోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేందుకు ఆసక్తి కనబరిచాయి. ఇక్కడి విద్యార్థులను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ప్రాడక్ట్స్ అనాలిసిస్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, కన్సల్టెంట్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఎంపిక చేశారు.ఉత్తమ బోధనతోనే.. నిట్ వరంగల్‌లోని అధ్యాపకుల అత్యుత్తమ బోధనతోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో యూఎస్‌కు చెందిన సోర్బ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీనిసాధించా. మాది పంజాబ్‌లోని లూథియానా.. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి నిట్ వరంగల్‌లో సీటు సాధించి, ఉన్నత ఉద్యోగానికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. - రవిషా, ఈసీఈ, రూ.88 లక్షల ప్యాకేజీఎంటర్ప్రెన్యూర్గాఉద్యోగావకాశాలు కల్పిస్తా..మాది మహారాష్ట్ర. వరంగల్‌లో నిట్‌లో సీటు వచ్చినప్పుడు ఎంతో భయంగా ఉండేది. ఇక్కడి అధ్యాపకుల ప్రోత్సాహం, విద్యార్థుల సహకారంతో బీటెక్‌లో ఈసీఈ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్స్‌లో హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.64లక్షల వార్షిక ప్యాకేజీ సాధించాను. ఎంబీఏ చేసి ఎంటర్పెన్యూర్గా ఓ పరిశ్రమను స్ధాపించి నా తోటి వారికి ఉద్యోగావకాశాలు కల్పించడమే నా లక్ష్యం. – మీత్ పోపాట్, ఈసీఈ, రూ.64లక్షల ప్యాకేజీ -
రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం! ఏ రంగంలో తెలుసా..
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఒకటి. ఇందులో చదివితే మంచి ప్యాకేజీతో ఉన్నత సంస్థలో కొలువు సాధించవచ్చనే భావన ఉంది. అనుకున్నట్టుగానే తాజాగా ఇందోర్ ఐఐఎంలో ఓ విద్యార్థి ఏకంగా రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు. ఐఐఎం ఇందోర్‌లో ఈ-కామర్స్ సంస్థలు ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థి ఈ ఆఫర్‌ను సాధించారు. ఈ ఏడాది చివరి దశ ప్లేస్మెంట్లలో ఇదే అత్యధిక ప్యాకేజీ. ఇందుకు సంబంధించిన వివరాలను ఐఐఎం-ఇందోర్ అధికారి పీటీఐతో పంచుకున్నారు. ఐఐఎం ఇందోర్‌లో నిర్వహించిన చివరి విడుత ప్లేస్‌మెంట్స్‌లో 150 కంపెనీలు 594 మంది విద్యార్థులకు ఆఫర్లు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూల్లో రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం) విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులకు లభించిన ఆఫర్ సగటున రూ.25.68 లక్షల వేతనం అని ఐఐటీ ఇండోర్ తెలిపింది. గరిష్ఠంగా ఓ విద్యార్థికి ఏకంగా ఏటా రూ.కోటి వార్షిక వేతనంతో ఆఫర్ వచ్చిందని చెప్పింది. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఈ విద్యార్థికి ఉద్యోగం లభించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..! ప్రస్తుతం ఉద్యోగాల మార్కెట్లో సవాళ్లు ఎదురవుతున్నా ఐఐఎం ఇందోర్ తన పేరు నిలుపుకోవడంతోపాటు అతిపెద్ద కంపెనీలను ఆకర్షించగలిగింది. ఈ ఏడాది కొత్తగా 50కి పైగా కంపెనీలు తమ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహించాయని ఐఐఎం ఇందోర్ డైరెక్టర్ హిమాంశురాయ్ తెలిపారు. -
బహుళజాతి కంపెనీల ‘డిగ్రీ’ రూట్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు తిరిగి మంచి రోజులొస్తున్నాయి. బహుళజాతి కంపెనీలు కూడా డిగ్రీ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలకు ఆసక్తి చూపుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల తరహాలోనే ఇక్కడా నిపుణులైన వారికి మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) గత ఏడాది నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. గత ఏడాది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారిలో కంప్యూటర్ కాంబినేషన్ ఉన్న డిగ్రీ కోర్సులు చేసిన వారు 43శాతం ఉన్నట్టు గుర్తించారు. విప్రో, అమెజాన్, టీసీఎస్, యాక్సెంచర్ వంటి మల్టీ నేషనల్ కంపెనీల్లో గరిష్టంగా రూ.16 లక్షలు, కనిష్టంగా రూ.4 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్టు తేలింది. తెలంగాణలోనూ 45వేల మంది బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి ఈ ట్రెండ్ ఐదేళ్ల క్రితమే మొదలైందని.. గత ఏడాది నుంచి ఊపు వచ్చిదని నిపుణులు చెప్తున్నారు. డిగ్రీ స్వరూప స్వభావం మారుతోందని, అందుకే ఇప్పుడు వీటిని నాన్–ఇంజనీరింగ్ కోర్సులుగా పిలుస్తున్నారని ఉన్నత విద్య వర్గాలు అంటున్నాయి. టెక్నాలజీ ఆధారిత కోర్సులతో.. తెలంగాణవ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు డిగ్రీ సీట్లున్నాయి. ఏటా 2.25 లక్షల సీట్ల వరకూ భర్తీ అవుతున్నాయి. ఇందులో చాలా మంది కంప్యూటర్ సాంకేతికత కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. సాధారణ కోర్సుతోపాటు ఏదైనా డిమాండ్ ఉన్న కాంబినేషన్ సబ్జెక్టులను ఎంచుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు బహుళజాతి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో బీకాం కంప్యూటర్స్ చేసిన వారికి ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత అన్ని విభాగాల్లో యాంత్రీకరణ ప్రభావం కనిపిస్తోంది. అన్ని కంపెనీలు ఆన్లైన్ మార్కెటింగ్ విధానాలను అభివృద్ధి చేసుకున్నాయి. డేటా ఎనాలసిస్, మార్కెటింగ్ ట్రెండ్స్, ఆడిట్ కోసం సాంకేతిక నిపుణులు అవసరం. బీకాం చేసినవారికి ఆడిట్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటున్నాయి. పెద్ద ఆడిటర్ల కన్నా బీకాం పూర్తిచేసే ఆడిటర్లను అసిస్టెంట్లుగా కంపెనీలు నియమించుకుంటున్నాయి. మూడో వంతు మందికి.. తెలంగాణవ్యాప్తంగా గత ఏడాది 76వేల మంది కామర్స్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వచ్చారు. వారిలో 24వేల మంది వరకు అసిస్టెంట్ ఆడిటర్లు, అనలిస్టులుగా బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. గత సంవత్సరం బీఏ నేపథ్యంతోపాటు కంప్యూటర్స్ ఆప్షన్‌తో ఉత్తీర్ణులైన విద్యార్థులు 18 వేల మంది మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు పొందినట్టు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యం ఉండటం, వారిని తక్కువ వేతనంతో తీసుకున్నా వీలైనంత త్వరగా శిక్షణ ఇచ్చి అనుకూలంగా మార్చుకోవచ్చని కంపెనీలు భావిస్తుండటమే దీనికి కారణం. విద్యార్థులు కూడా మొదట్లో తక్కువ వేతనాలకే చేరుతున్నా.. నైపుణ్యం పెరిగితే మంచి వేతనం వస్తుందని ఆశిస్తున్నారు. రాజధానికే పరిమితం... ఇప్పటికీ నాణ్యమైన డిగ్రీ విద్య కేవలం హైదరాబాద్, పరిసర ప్రాంతాలకే పరిమితమైంది. మంచి వేతనంతో ఉద్యోగం పొందుతున్నవారిలో ఇక్కడి కాలేజీల్లో చదివినవారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని 83 కాలేజీల నుంచి డిగ్రీ విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో మంచి ఉద్యోగాలు పొందారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని డిగ్రీ కాలేజీల్లో నాణ్యత పెరగడం లేదు. క్యాంపస్ సెలక్షన్‌కు వెళ్ల కంపెనీలు కూడా హైదరాబాద్ ప్రాంత డిగ్రీ కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నాయి. డిగ్రీలో విద్యార్థుల్లో 43శాతం హైదరాబాద్, పరిసరాల్లోకి కాలేజీల్లోనే చేరుతున్నారు. ఇక్కడ డిగ్రీ చేస్తూనే పార్ట్‌టైం జాబ్ చేసుకోవచ్చనే ఆలోచన, చదువుకునే సమయంలో ఇతర కోర్సులు చేయడానికీ హైదరాబాద్ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశమే దీనికి కారణం. విద్యార్థుల చేరిక ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఉండే వివిధ కాంబినేషన్ల కోర్సులను హైదరాబాద్‌లోని డిగ్రీ కాలేజీలు ప్రవేశపెట్టగలుతున్నాయి. ఇలా డేటాసైన్స్, ఆనర్స్ వంటి కోర్సులు హైదరాబాద్ పరిధిలోనే విజయవంతంగా కొనసాగుతున్నట్టు ఉన్నత విద్యా మండలి వర్గాలు కూడా చెప్తున్నాయి. భవిష్యత్‌లో అన్ని జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లోని కోర్సుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నాయి. నైపుణ్యమే డిగ్రీ విద్యార్థులకు నజరానా డిగ్రీ విద్యార్థులను నియమించుకునేందుకు పెద్ద కంపెనీలు ఇష్టపడుతున్నాయి. వీరిలో ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానమైన నైపుణ్యం ఉంటుందని భావిస్తున్నాయి. వారిని తేలికగా తమ కంపెనీ అవసరాలకు తగినట్టుగా మలుచుకోవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. డిగ్రీలో వస్తున్న కాంబినేషన్ కోర్సుల వల్ల నైపుణ్యం పెరిగింది. తక్కువ వేతనాలతో ఉద్యోగులను తీసుకునే కంపెనీలు కూడా డిగ్రీ విద్యార్థులను ఇష్టపడుతున్నాయి. వారు అంత తేలికగా కంపెనీ మారరనే భావన ఉంది. ఇవన్నీ డిగ్రీ విద్యార్థులకు కలసి వచ్చే అంశాలే. – బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి -
డిగ్రీ చేస్తే జాక్‌పాట్.. ఐటీ కంపెనీల క్యూ...
సాక్షి, హైదరాబాద్: డిగ్రీనా... అనే చులకన భావం ఇక నుంచి ఉండదంతే. దేశవ్యాప్తంగా డిగ్రీ కోర్సులకు భవిష్యత్‌లో డిమాండ్ పెరగబోతోంది. ఇంతకాలం కొనసాగిన సంప్రదాయ కోర్సుల్లో అనేక మార్పులు తెస్తున్నారు. సాంకేతిక విద్యకు తీసిపోని రీతిలో సాన పడుతున్నారు. దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలుండేలా తీర్చి దిద్దుతున్నారు. అనేక కొత్త కోర్సుల మేళవింపు, కంప్యూటర్ అప్లికేషన్ల గుభాళింపు డిగ్రీ కోర్సుల తీరు తెన్నులనే మార్చబోతోంది. హానర్స్ కోర్సులకు ప్రాధాన్యం తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ హానర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపొందించింది. ఈ ఏడాది నుంచే తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (హానర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు హానర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. నాలుగేళ్ళు చదివితే హానర్స్ డిగ్రీ ఇస్తారు. మూడేళ్ళకే మానుకుంటే సాధారణ డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో పాటు ఏ తరహా డిగ్రీ చేసినా, ఇష్టమైన ఓ సబ్జెక్టును చేసే సరికొత్త విధానం అందుబాటులోకి తెచ్చారు. అంటే బీఏ కోర్సు చేస్తున్న విద్యార్థి కూడా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఓ సబ్జెక్టు చేసే వీలుంది. వాణిజ్య విప్లవంలో డిగ్రీకి ప్రాధాన్యత గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ–కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అకౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్ళల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. దీంతో బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, హానర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్‌ను తీసుకొచ్చారు. బీమా, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ తీసుకురావడంతో టాక్స్ నిపుణుల అవసరం రెట్టింపయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ–కామర్స్, రిటైల్ సంస్థల పెరుగుదల కూడా కలిసివచ్చింది. పెరుగుతున్న క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కేవలం ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళే ఐటీ కంపెనీలు ఇప్పుడు నాణ్యమైన విద్యను అందించే డిగ్రీ కాలేజీల్లోనూ నియామకాలు చేపడుతున్నాయి. నాన్–ఇంజనీరింగ్‌గా పిలిచే డిగ్రీ విద్యార్థులను గత రెండేళ్ళుగా పెద్ద ఎత్తున తమ కంపెనీల్లో చేర్చుకుంటున్నాయి. రాష్ట్రంలో 110 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోనే దాదాపు 300 కాలేజీలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు వంద కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. ఫార్మా, బ్యాంకింగ్, రిటైల్, మార్కెటింగ్ కంపెనీలతో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, సీజీఎల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం వస్తున్నాయి. ప్రతీ ఏటా ఈ కంపెనీలు 10 నుంచి 20 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ వార్షిక వేతనం ఇస్తున్నాయి. -
విదేశీ వర్సిటీలకు మరింత స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: విదేశీ విశ్వవిద్యాలయాలకు భారత ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. తొలిసారిగా అవి భారత్‌లో సొంతంగా క్యాంపస్‌లు నెలకొల్పేందుకు, అడ్మిషన్ల విధానం, ఫీజుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. నిధులను సొంత దేశాలకు బదిలీచేసేందుకు తదితర నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ప్రతిని యూజీసీ విడుదలచేసింది. అయితే ఆ వర్సిటీలో భారతీయ క్యాంపస్‌లలో కోర్సులకు సంబంధించి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలి. ఆన్లైన్, దూర విద్యా కోర్సులకు అనుమతి ఇవ్వబోమని యూజీసీ చైర్పర్సన్ జగదీశ్ చెప్పారు. విదేశీ వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థ(హెచ్ఈఐ)లు ఇక్కడ క్యాంపస్‌ల ఏర్పాటు అనుమతులను యూజీసీ నుంచి తీసుకోవాలి. సంబంధిత వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాక ఈ నెల చివరికల్లా తుది నిబంధనలను రూపొందిస్తారు. ముసాయిదా ప్రకారం విదేశీ వర్సిటీలు తమ కోర్సుల్లో విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులపై స్వీయనియంత్రణ కల్గిఉంటాయి. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా.. ‘నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నట్లు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయి విద్యాబోధన భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. విదేశీ వర్సిటీలతో అనువైన ఫీజుల్లోనే అంతర్జాతీయ విద్యార్హతలు మన విద్యార్థులకు దఖలుపడతాయి. వర్సిటీలు స్వదేశానికి పంపే నిధులకు ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్(ఫెమా) చట్టం,1999 వర్తిస్తుంది. ఇవి తమ వార్షిక ఆడిట్ యూజీసీకి సమర్పిస్తారు’ అని జగదీశ్ అన్నారు. ర్యాంక్‌లు పొందిన వాటికే.. అత్యున్నత ర్యాంక్ పొందిన వర్సిటీలకే భారత్‌లో క్యాంపస్‌ల ఏర్పాటుకు అవకాశమిస్తారు. అంటే ప్రపంచం మొత్తంలో 500 లోపు ర్యాంక్ లేదా సబ్జెక్ట్ వారీగా ర్యాంక్ లేదా స్వదేశంలో దిగ్గజ వర్సిటీలకే భారత్‌లో అవకాశం దక్కనుంది. తర్వాత వాటి దరఖాస్తుల పరిశీలనకు యూజీసీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేయనుంది. దేశంలో న్యాక్ గ్రేడ్ పొందిన దేశీ వర్శిటీల సమన్వయంతో ఈ వర్సిటీలు పనిచేసే వీలుంది. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. కమిషన్ సూచించిన సమయంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజులు తదితర వివరాలను ప్రవేశాలకు 60 రోజుల ముందే వెల్లడించాలి. సరైన సంస్కరణలతో దేశీయ వర్సిటీలను బలోపేతం చేయాల్సిందిపోయి విదేశీ వర్సిటీలు తేవడం ఏంటని కొందరు విద్యావేత్తలు పెదవివిరిచారు. ‘ప్రభుత్వ నూతన విద్యా విధానం ప్రకారం యూజీసీకే చరమగీతం పాడనున్నారు. అలాంటి యూజీసీ నేతృత్వంలో సంస్కరణలు తేవడం ఏంటి ?. గతంలో విదేశీ వర్సిటీల బిల్లును 2012–13 కాలంలో యూపీఏ సర్కార్ తెచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆనాడు దీనిని బీజేపీ, వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభ స్థాయీ సంఘం కూడా తప్పుబట్టింది. ఇప్పుడు అదే బీజేపీ ఇప్పుడు ఇలా విరుద్ధంగా వ్యవహరిస్తోంది’ అని విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ అభా దేవ్ అన్నారు. -
వేల సంఖ్యలో ఉద్యోగాల కోత.. అక్కడ మాత్రం జాబ్ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయ్!
టెక్నికల్ విద్య, బోధన విషయంలో ఐఐటీలు, ఎన్ఐటీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. వాస్తవ ధృక్పథంతో ఈ విద్యాసంస్థలు పాటించే ప్రమాణాలు, విద్యార్థులకు అందించే నైపుణ్యాలు, జాబ్ రెడీ స్కిల్స్ విద్యార్థుల కెరీర్‌కు సోపానాలుగా మారుతున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఈ ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు సంస్థలకు హాట్ ఫేవరెట్స్‌గా నిలుస్తున్నారు. భారీగా ప్యాకేజ్ ► ఐఐటీలు, ఎన్ఐటీ క్యాంపస్ డ్రైవ్స్‌లో ఈ ఏడాది రూ.కోటికిపైగా వార్షిక ప్యాకేజ్‌తో ఆఫర్లు ఖరారు కావడం విశేషం. ముఖ్యంగా ఫస్ట్ జనరేషన్ ఇన్స్టిట్యూట్లుగా గుర్తింపు ΄పొందిన ఐఐటీ–ఖరగ్‌పూర్,ఢిల్లీ, ముంబై, కాన్పూర్, చెన్నై వంటి క్యాంపస్‌ల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ► ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2023 బ్యాచ్‌కు సంబంధించి ప్లేస్మెంట్ ప్రక్రియ తొలి దశలో అత్యధిక వార్షిక వేతనం రూ.2.68 కోట్లుగా నమోదైంది. ఈ క్యాంపస్‌లో తొలి దశ డ్రైవ్స్‌లో 1600 మందికి ఆఫర్లు లభించాయి. రూ.50 లక్షలు కనిష్ట వార్షిక వేతనంగా నమోదైంది. 16 మందికి అంతర్జాతీయ ఆఫర్లు అందాయి. ► ఐఐటీ కాన్పూర్‌లో రూ.1.9 కోట్ల వార్షిక ప్యాకేజ్‌తో ఆఫర్ లభించింది. ఇలా మొత్తం 33 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా ΄్యాకేజ్ ఖరారైంది. మొత్తంగా చూస్తే 947మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారు కాగా, వాటిలో 74 ఇంటర్నేషనల్ ఆఫర్లు ఉండడం గమనార్హం. ► ఐఐటీ ఢిల్లీలో 1300కు పైగా ఆఫర్లు ఖరారవగా, 50 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా వార్షిక ΄్యాకేజ్ లభించింది. ఈ క్యాంపస్‌లో గరిష్ట వేతనం ఏకంగా రూ.నాలుగు కోట్లుగా నమోదవడం విశేషం. అదే విధంగా 30 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ఆఫర్లు లభించాయి. గత ఏడాదితో ΄ోల్చితే ఈ ఏడాది ఆఫర్లలో 20 శాతం పెరుగుదల కనిపించింది. ► ఐఐటీ చెన్నైలో రిక్రూట్మెంట్ డ్రైవ్ తొలి రోజే 445 మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారవగా.. వారిలో 25 మందికి రూ.కోటికి పైగా వార్షిక వేతనం లభించింది. అంతేకాకుండా మొత్తం 15 మంది విద్యార్థులకు నాలుగు సంస్థల నుంచి ఇంటర్నేషనల్ ఆఫర్స్ దక్కినట్లు ఐఐటీ చెన్నై క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు తెలి΄ాయి. ► ఐఐటీ–ముంబై క్యాంపస్ డ్రైవ్స్‌లో ఇప్పటి వరకు 1500 మందికి ఆఫర్లు ఖరారయ్యాయి. వీటిలో 71 ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఉండగా.. 63 మంది వీటికి సమ్మతి తెలి΄ారు. అదే విధంగా 25 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా వార్షిక వేతనం ఖరారైంది. ఈ క్యాంపస్ తొలి దశ డ్రైవ్స్ ముగిసే సమయానికి అత్యధిక వార్షిక వేతనం రూ.4 కోట్లుగా నమోదైంది. ► ఐఐటీ–రూర్కీలో గరిష్ట వార్షిక వేతనం రూ.1.06 కోట్లుగా నమోదు కాగా, పది మంది విద్యార్థులకు రూ.80 లక్షలకు పైగా వేతనం లభించినట్లు రూర్కీ ప్లేస్‌మెంట్స్æ సెల్ వర్గాలు తెలి΄ాయి. ► ఐఐటీ హైదరాబాద్‌లో తొలి దశ ప్లేస్‌మెంట్స్‌లో 474 మంది విద్యార్థులకు 508 ఆఫర్లు లభించాయి. గరిష్ట వేతనం రూ.63.78 లక్షలుగా నమోదైంది. 54 ఇంటర్నేషనల్ ఆఫర్లు ఉన్నాయి. ఐఐటీ–హైదరాబాద్‌లో ఏఐ బ్రాంచ్ తొలి బ్యాచ్‌లో 82 శాతం మందికి ఆఫర్లు దక్కాయి. ఈ క్యాంపస్‌లో సగటు వార్షిక వేతనం రూ.19.49 లక్షలుగా నమోదైంది. ► ఐఐటీ–గువహటిలో సైతం తొలి దశ క్యాంపస్ డ్రైవ్స్‌లో గరిష్టంగా రూ.2.46 కోట్లతో ఇంటర్నేషనల్ ఆఫర్, రూ.1.1 కోటితో డొమెస్టిక్ ఆఫర్ ఖరారైంది. ఎన్ఐటీలదీ అదే బాట ► ఐఐటీల తర్వాత దేశంలో ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌గా పేరొందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) క్యాంపస్‌లలో సైతం ఈ ఏడాది భారీగా ఆఫర్స్ లభించాయి. ► తెలుగు రాష్ట్రాల్లోని ఎన్ఐటీ–వరంగల్‌లో రూ.88 లక్షల గరిష్ట వేతనంతో ఆఫర్ లభించింది. ఈ క్యాంపస్‌లో మొత్తం వేయి మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారు కాగా.. సగటు వార్షిక వేతనం రూ.19.9 లక్షలుగా నమోదైంది. ► ఎన్ఐటీ హమీర్‌పూర్‌లో గతేడాది కంటే 39 శాతం అధికంగా సగటు వార్షిక వేతనం లభించింది. సగటు వార్షిక వేతనం రూ.12.84 లక్షలుగా, గరిష్ట వార్షిక వేతనం రూ. 52 లక్షలుగా నిలిచింది. ► ఎన్ఐటీ జంషెడ్‌పూర్‌లో అయిదుగురు విద్యార్థులకు రూ.80 లక్షల వార్షిక వేతనంతో ఇంటర్నేషనల్ ఆఫర్స్ లభించాయి. ► ఎన్ఐటీ కాలికట్లో సగటు వార్షిక వేతనం రూ.23 లక్షలుగా ఉంది. ► ఎన్ఐటీ పాట్నా క్యాంపస్‌లోనూ గరిష్ట వేతనం రూ.52 లక్షలుగా, సగటు వేతనం రూ.16.51 లక్షలుగా నమోదైంది. ► ఇతర ఎన్ఐటీల్లోనూ ఇదే తరహాలో గతేడాది కంటే పది నుంచి 20 శాతం అధికంగా ఆఫర్లు లభించడంతో΄పాటు, వేతనాల్లోనూ పది శాతానికిపైగా పెరుగుదల నమోదైంది. టాప్ రిక్రూటర్స్ వీరే ఐఐటీలు, ఎన్ఐటీల్లో టాప్ రిక్రూటింగ్ సంస్థలను పరిగణనలోకి తీసుకుంటే.. క్వాల్ కామ్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, గూగుల్, బార్క్లేస్, ఎస్ఏపీ ల్యాబ్స్, సిటీ బ్యాంక్, వెల్ ఫార్గో, మైక్రోసాఫ్ట్, బీసీజీ, బెయిన్ అండ్ కో సంస్థలు ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఇవ్వడంలో ముందంజలో ఉన్నాయి. డొమెస్టిక్ ఆఫర్స్ పరంగా ఉబెర్, హనీవెల్, మైక్రాన్ టెక్నాలజీ, ఓఎన్జీసీ, ఫ్లిప్‌కార్ట్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎస్టీఎం మైక్రోఎలక్ట్రికల్స్ వంటి సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. డిమాండింగ్ జాబ్ ప్రొఫైల్స్ కోర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ ్ర΄ోగ్రామర్స్, డేటా అనలిస్ట్స్, యుఎక్స్ డిజైనర్, ్ర΄÷డక్ట్ డిజైనర్, ఫుల్‌స్టాక్ ఇంజనీర్ జాబ్ ్ర΄÷ఫైల్స్‌లో అధిక సంఖ్యలో నియామకాలు జరిగాయి. డేటా అనలిస్ట్ జోరు ► ఈసారి ఐఐటీ, ఎన్ఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో డేటా అనలిస్ట్ ప్రొఫైల్ జోరు కొనసాగింది. ముఖ్యంగా కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సెక్టార్‌లోని సంస్థలు ఈ నియామకాలు చేపట్టాయి. బీఎఫ్ఎస్ఐ, కన్సల్టింగ్ సంస్థలు క్లయింట్స్, వినియోగదారులను పెంచుకునే వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. దీంతో డేటా అనలిస్ట్ జాబ్స్‌కు డిమాండ్ కనిపించింది. ► ఐటీ మొదలు ఆన్లైన్ టెక్నాలజీస్ ఆధారంగా సేవలందిస్తున్న అన్ని రంగాల్లోని సంస్థలు సాఫ్ట్వేర్స్ ్ర΄ోగ్రామింగ్, డిజైనింగ్‌కు ్ర΄ాధాన్యమిస్తుండడంతో.. కోడింగ్ విభాగంలో జాబ్ ప్రొఫైల్స్‌కు కూడా డిమాండ్ కనిపించింది. ఎస్పీఓల్లోనూ వృద్ధి ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఈ ఏడాది సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్‌లోనూ వృద్ధి కనిపించింది. దాదాపు అన్ని క్యాంపస్‌లలో నూటికి 80 శాతం మందికి సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్ లభించాయి. గరిష్టంగా రెండు నెలల కాలానికి ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఇచ్చే సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్‌లో స్టయిఫండ్ మొత్తాలు కూడా ఆకర్షణీయంగా నమోదయ్యాయి. కనిష్టంగా రూ.50 లక్షలు, గరిష్టంగా రూ.80 లక్షలు, సగటున రూ.30 లక్షల స్టయిఫండ్‌తో పలు సంస్థలు విద్యార్థులకు ఇంటర్న్ ట్రైనీగా పని చేసేందుకు సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్లు ఖరారు చేశాయి. రెండు, మూడు రౌండ్లలో ఎంపిక ఐఐటీలు, ఎన్ఐటీల్లో క్యాంపస్ డ్రైవ్స్‌లో పాల్గొన్న సంస్థలు రెండు, మూడు రౌండ్లలో ఎంపిక ప్రక్రియ నిర్వహించాయి. తొలుత రిటెన్ టెస్ట్, ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్, చివరగా టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూలు చేపట్టి.. ప్రతిభ ఆధారంగా ఆఫర్లు ఖరారు చేశాయి. కోడింగ్‌కే ప్రాధాన్యం సంస్థలు విద్యార్థుల్లోని కోడింగ్ నైపుణ్యాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. కంపెనీలు రిటెన్ టెస్ట్‌లు, టెక్నికల్ రౌండ్స్‌లో కోడింగ్ సంబంధిత నైపుణ్యాలను ఎక్కువగా పరిశీలించినట్లు ఆయా క్యాంపస్‌ల ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొన్నాయి. కోర్ ఇంజనీరింగ్, సర్క్యూట్ బ్రాంచ్‌లకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌పై విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలి΄ారు. మార్చి నాటికి నూరుశాతం క్యాంపస్ డ్రైవ్స్ ప్రతి ఏటా డిసెంబర్లో ్ర΄ారంభమై.. మరుసటి ఏడాది మార్చి వరకు కొనసాగుతాయి. ప్రస్తుతం అన్ని క్యాంపస్‌లలో తొలి దశ ముగిసింది. ఇందులో దాదాపు 80 శాతం మందికి ఆఫర్లు లభించాయి. మార్చి నాటికి నూటికి నూరు శాతం మందికి ఆఫర్లు లభిస్తాయని ఐఐటీల క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్వీయ అన్వేషణ దిశగా ఇప్పటికే పలు సంస్థలు లే అఫ్లు కొనసాగిస్తున్నప్పటికీ.. వాటి కార్యకలా΄ాల నిర్వహణకు మానవ వనరుల అవసరం ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఫ్రెషర్స్‌ను నియమించుకుని తమ విధానాలు, సాంకేతికతలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చే అవకాశముందంటున్నారు. టైర్–2 ఇన్‌స్టిట్యూట్స్‌కు చెందిన విద్యార్థులు మాత్రం ఉద్యోగ సాధనలో క్యాంపస్ డ్రైవ్స్పైనే ఆశలు పెట్టుకోకుండా.. స్వీయ అన్వేషణ దిశగానూ అడుగులు వేయాలని సూచిస్తున్నారు. సంస్థలు కోరుకుంటున్న కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ వంటి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుని.. జాబ్ మార్కెట్లో ΄ోటీకి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. ముఖ్యాంశాలు ► ఐఐటీలు, నిట్‌ల్లో 2023 బ్యాచ్‌కు ముగిసిన తొలి దశ క్యాంపస్ డ్రైవ్స్. ► ఐఐటీ–ఢిల్లీలో రూ.4 కోట్ల గరిష్ట వార్షిక వేతనంతో ఆఫర్. ప్రతి క్యాంపస్‌లోనూ గరిష్టంగా రూ.కోటికి పైగా వేతనం నమోదు. ► సగటు వార్షిక వేతనం రూ.36 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నమోదు. ► గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 15 నుంచి 20 శాతం పెరుగుదల. ► కోడింగ్, ఏఐ–ఎంఎల్, ఐఓటీ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్న సంస్థలు. -
NIT Tadepalligudem: క్యాంపస్ ప్లేస్మెంట్లో నిట్ విద్యార్థుల సత్తా
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): క్యాంపస్ ప్లేస్మెంట్లలో నిట్ 2018–22 బ్యాచ్ విద్యార్థుల్లో 97.19 శాతం మంది ఉద్యోగాలు సాధించారు. సీఎస్ఈ విద్యార్థిని సూరపరాజు సాయి కీర్తన అమెజాన్‌లో రూ. 47.3 లక్షల వేతనం పొందగా.. ఈఈఈ విద్యార్థిని ఊర్వశి డాంగ్ అమెజాన్‌లో రూ. 47.3 లక్షల వేతనం అందుకోనున్నారు. సీఎస్ఈ విద్యార్థి కేతన్ బన్సాల్ స్కైలార్క్ ల్యాబ్స్‌లో రూ. 37.8 లక్షల వేతనం, అదే గ్రూపునకు చెందిన గాదె అశ్రితరెడ్డి అమెజాన్‌లో రూ.37 లక్షల వేతనంతో ఉద్యోగం పొందారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ప్రత్యేక కృషితో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించారు. దేశంలోని 31 నిట్‌లలో క్యాంపస్ ప్లేస్మెంట్ విషయంలో ఏపీ నిట్ సత్తా చాటింది. ఈ బ్యాచ్‌లో 511 మంది 262 కంపెనీలు జరిపిన ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు పొందారు. (క్లిక్ చేయండి: ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే..) -
జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), బాంబే హవా కొనసాగుతోంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్–2022లో టాప్–100 ర్యాంకర్లలో 93 మంది ఐఐటీ బాంబేను మొదటి ప్రాథామ్యంగా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 69 మంది బాంబే ఐఐటీలో సీటు సాధించారు. ఇందులో 68 మంది మొదటి విడత కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సును ప్రథమ ప్రాథామ్యంగా ఎంపిక చేసుకోగా ఒక్కరు ఇంజినీరింగ్ ఫిజిక్స్‌ను తీసుకున్నారు. టాప్–100 ర్యాంకర్లలో 28 మంది ఐఐటీ ఢిల్లీలోనూ ముగ్గురు ఐఐటీ మద్రాస్‌లోనూ జాయినయ్యారు. జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ ఈ వివరాలను అందించింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2020లో 58 ఐఐటీ బాంబేలో ప్రవేశం పొందగా 2019లో టాప్–100 ర్యాంకర్లలో 62 మంది, 2018లో 59 మంది ఇక్కడే సీటు సాధించారు. టాప్–500 ర్యాంకర్లకూ బాంబే ఐఐటీనే మొదటి ప్రాథామ్యంగా ఉంది. టాప్–500 ర్యాంకర్లలో 173 మంది ఇక్కడ, 127 మంది ఢిల్లీ ఐఐటీలో స్థానం సంపాదించారు. టాప్–500 ర్యాంకర్లలో మద్రాస్, ఖరగ్‌పూర్, కాన్పూర్ ఐఐటీల్లో సీట్లు సాధించిన వారి సంఖ్య 50 మంది లోపే. -
ఒక మంచి ఆలోచన సమాజాన్ని మారుస్తుంది
కాలేజ్‌లో సీటు, పరీక్షల్లో మంచి పర్సంటేజీలు తెచ్చుకున్నంత సులువు కాదు ఉద్యోగం సాధించడం. ఈ ఘట్టాన్ని సులభతరం చేయడానికి అనేక విద్యాసంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంటాయి. కానీ, నిరుద్యోగిత లెక్కలు మాత్రం ప్లేస్మెంట్ ప్రయత్నాలు సరిపోవడం లేదనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు యోగి వేమన యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సూర్య కళావతి. అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగంతో కలిసి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ‘‘మా యూనివర్సిటీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ), ఇండియా విభాగం గత కొన్ని నెలలుగా జాబ్‌మేళాలు నిర్వహిస్తోంది. ఈ సంగతి తెలిసిన తరవాత మా జిల్లా విద్యార్థులకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మే నెల రెండవ తేదీన మా యూనివర్సిటీ క్యాంపస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఏటీఏ ఇండియా చాప్టర్ సమన్వయం కుదిర్చిన అనేక పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఈ జాబ్‌మేళా టార్గెట్ ఆరువేల ఉద్యోగాలు. టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు అందరికీ ఇది అనువైన వేదిక. గార్మెంట్ మేకింగ్ యూనిట్ల నుంచి మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కూడా వస్తున్నాయి. టెక్నికల్ – నాన్ టెక్నికల్, ఐటీ, బీపీవో వరకు అన్ని రకాల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. మంచి సహకారం మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే... పదిమంది తలా ఒక చెయ్యి వేసి విజయవంతం చేస్తారని అంటారు. అదేవిధంగా మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి చాలామంది సహకారం అందిస్తున్నారు. ఆ రోజున వచ్చే వేలాదిమందికి ఆహారపానీయాలను సమకూర్చడానికి శ్రీ సంపద గ్రూప్ కంపెనీ, జీఎస్ఆర్ ఫౌండేషన్లు ముందుకు వచ్చాయి. ఏటీఏ చాలా శ్రద్ధగా మంచి కంపెనీలను అనుసంధానం చేసుకుంది. వాళ్లు ఉద్యోగులకు ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. వాళ్లిస్తున్న శాలరీ ప్యాకేజ్‌లు ఏడాదికి లక్షా పాతిక వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్నాయి. ఇది మా యూనివర్సిటీకి మాత్రమే కాదు, జిల్లాలో అందరికీ ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చిన్న పట్టణాల్లో చదివే వాళ్లకు పెద్ద భరోసా’’ అన్నారు సూర్య కళావతి. ప్రభుత్వం స్థాపించిన విద్యాసంస్థలు సామాజిక బాధ్యతను మరింతగా చేపట్టి ఇలాంటి కార్యక్రమాలకు వేదికలవుతుంటే యువతరం ఆలోచనలు కూడా ఆదర్శవంతంగా సాగుతాయి. మరోతరానికి స్నేహహస్తాలుగా మారుతాయి. వేలాది ఉద్యోగాలకు వేదిక! మా అమ్మది కడప జిల్లా బలపనూరు. నేను పుట్టింది అనంతపురం జిల్లా కదిరి. ఇంటర్ వరకు అక్కడే చదివాను. బీటెక్ కడపలోని కేఎస్ఆర్ఎమ్లో. ఎంటెక్ ఎస్వీయూ, పీహెచ్డీ జేఎన్టీయూ హైదరాబాద్, పోస్ట్ డాక్టరేట్ పిట్స్బెర్గ్లోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో. నా ఉద్యోగ జీవితం కడపలో నేను చదువుకున్న కేఎస్ఆర్ఎమ్ కాలేజ్తోనే మొదలైంది. వీసీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు మా యూనివర్సిటీ విద్యార్థుల కోసమే ఈ ప్లేస్ మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. ఇప్పుడు జిల్లా అంతటికీ ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ‘చదువుకున్నాను, కానీ ఇంకా ఉద్యోగం రాలేదు’ అని ఎవరూ ఆందోళన చెందకూడదనేది నా అభిలాష. అందుకే ఏటీఏ గురించి తెలిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. – మునగాల సూర్యకళావతి, వైస్ చాన్స్‌లర్, యోగి వేమన యూనివర్సిటీ, కడప. అనూహ్యమైన స్పందన! అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం ఈ ఏడాది జాబ్‌మేళా కాన్సెప్ట్ తీసుకుంది. ఇప్పటివరకు కుప్పం, పుంగనూరు, తిరుపతి నగరాల్లో నిర్వహించాం. ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ కేంద్రంగా ఉద్యోగాలుంటాయి. మా ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. మా టీమ్‌లో ఉన్న కిరణ్ రాయల్ అయితే ఉద్యోగాల్లో ఉండే సవాళ్ల గురించి ఓరియెంటేషన్ ఇస్తుంటారు. ఈ సోషల్ కాజ్లో అందరం ఉత్సాహంగా పని చేస్తున్నాం. యోగి వేమన యూనివర్సిటీ మెగా జాబ్ మేళా తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, పుట్టపర్తి, కదిరి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూడా జాబ్ మేళా నిర్వహించడానికి క్యాలెండర్ సిద్ధమవుతోంది. – జి. సూర్యచంద్రారెడ్డి, కో ఆర్డినేటర్, అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం – వాకా మంజులారెడ్డి -
ఐఎస్బీ విద్యార్థులకు భలే బొనాంజా
సాక్షి, హైదరాబాద్: మేనేజ్మెంట్ విద్యకు నగరంలో క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. నగరంలో ఈ విద్యకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ కోర్సు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అత్యధిక వేతనాలతో పలు బహుళజాతి కంపెనీల్లో కొలువులు దక్కినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. తాజాగా ఓ విద్యార్థికి రూ.34 లక్షల వార్షిక వేతనం దక్కినట్లు పేర్కొన్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు మొహాలీలో ఉన్న తమ విద్యాసంస్థకు ఈ ఏడాది సుమారు 270 కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపాయి. ఆయా కంపెనీలు 2,066 ఉద్యోగాలను ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాయి. వీటిలో దేశ, విదేశాలకు చెందిన పలు కార్పొరేట్, బహుళజాతి కంపెనీలుండడం విశేషం. వర్చువల్ విధానంలో చేపట్టిన నియామకాల్లో పలువురు విద్యార్థినీ విద్యార్థులు అత్యధిక వేతనంతో కొలువులు సాధించినట్లు ప్రకటించాయి. గతేడాది సరాసరిన అత్యధికంగా లభించిన వేతన ప్యాకేజీ రూ.28.21 లక్షలు కాగా.. ఈసారి రూ.34 లక్షలకు పెరగడం విశేషం. కొలువులు.. ప్యాకేజీల జాతర.. ► ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మేనేజ్మెంట్ విద్యలో పీజీ చేస్తున్న వారిలో 39 శాతం మంది మహిళలే ఉండడం విశేషం. అత్యధిక వేతనాలు దక్కించుకున్న వారిలోనూ 41 శాతం మంది అతివలే ఉన్నట్లు వర్సిటీ ప్రకటించింది. తమ సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విద్యనభ్యసిస్తున్న వారు సుమారు 929 మంది ఉన్నట్లు తెలిపింది. పలు రంగాల్లో అగ్రభాగాన ఉన్న కంపెనీలు తమ విద్యార్థులకు కొలువులు ఆఫర్ చేసినట్లు ప్రకటించింది. మేనేజ్మెంట్, సాంకేతికత, కన్సల్టింగ్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఐటీ,అనుబంధ రంగాలకు చెందిన కంపెనీలు సైతం 26 శాతం కొలువులను తమ విద్యార్థులకు ఆఫర్ చేసినట్లు ఐఎస్బీ ప్రకటించింది. ► బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థలు సుమారు 10 శాతం కొలువులిచ్చాయట. కార్పొరేట్ ఫైనాన్స్, ట్రెజరీ, ప్రైవేట్– బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, మేనేజ్మెంట్, ఎఫ్ఎంసీజీ, రిటెయిల్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లోనూ 5 శాతం చొప్పున తమ విద్యార్థులు జాబ్స్ దక్కించుకున్నట్లు వెల్లడించింది. ఈ– కామర్స్ రంగంలో 8 శాతం మంది జాబ్స్ లభించినట్లు తెలిపింది. (క్లిక్: ఐఐటీ హైదరాబాద్ అద్భుత ఆవిష్కరణ..) -
ఐఐటీ హైదరాబాద్.. నియామకాల్లో జోరు
క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. డిసెంబరు 1 నుంచి ప్రారంభమైన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇక్కడి విద్యార్థులు అంతర్జాతీయ కంపెనీల నుంచి నియామక పత్రాలు అందుకున్నారు. ఐఐటీ, హైదరాబాద్‌లో డిసెంబరు 1 నుంచి ఫేస్ 1 క్యాంపస్ రిక్రూట్మెంట్లు ప్రారంభమయ్యాయి. బిటెక్, ఎంటెక్‌లలో వివిధ విభాగాల నుంచి మొత్తం 668 మంది విద్యార్థులు ఈ రిక్రూట్మెంట్కి రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు 225 మందికి నియామక పతత్రాలు అందాయి. ఇప్పటి వరు జరిగిన నియామకాల్లో ఓ విద్యార్థికి అత్యధికంగా రూ.65.45 లక్షల వార్షిక వేతనం ఖరారు అయ్యింది. త్వరలోనే రెండో ఫేస్ నియమకాలు కూడా చేపట్టబోతున్నారు. కోవిడ్ ఎఫెక్ట్ మధ్య గతేడాది ఫేజ్ 1, ఫేజ్ 2లకు కలిపి మొత్తం 195 కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లో పాల్గొనగా ఈ సారి ఒక్క ఫేజ్ 1లోనే 210 కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఐఐటీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వల్ల చాలా కంపెనీలు క్యాంపస్ నియామకాలకు ఇక్కడికి వస్తున్నాయి. ఫేజ్ 1లో పాల్గొన్న సంస్థల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, గోల్డ్‌మాన్ శాక్స్, జేపీ మోర్గాన్, అమెజాన్, యాక్సెంచర్, ఇండీడ్, ఆప్టమ్, ఫ్లిప్‌కార్ట్, జాగ్వర్‌లతో పాటు అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి. -
గేటు దాటకుండానే ఆఫర్ లెటర్లు.. అమెజాన్‌లో ముగ్గురికి రూ.32 లక్షల జీతం
సాక్షి, తాడేపల్లిగూడెం: నిట్ విద్యార్థులు జాక్‌పాట్ కొట్టారు. మల్టీ నేషనల్ కంపెనీల్లో లక్షల్లో వేతనాలతో లక్కీచాన్స్ కొట్టేశారు. ఇంకా నిట్ గేటు దాటకుండానే ఆఫర్లు లెటర్లు అరచేతిలోకి వస్తున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలు(ఎంఎన్సీ) ఏపీ నిట్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి క్యూ కడుతున్నాయి. 2018–22 బ్యాచ్‌లో అప్పుడే 170 మందికి ఆఫర్ లెటర్లు వచ్చాయి. ఏడాది వేతనం కనిష్టగా 7.8 లక్షలు కాగా.. గరిష్టంగా రూ.26 లక్షలు పొందారు. 2017–21 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ. 32 లక్షల ప్యాకేజీతో అదుర్స్ అనిపించారు. దీంతో ఆరేళ్ల క్రితం నిట్ ఏర్పాటైప్పుడు ఎంఎన్సీలకు నిట్‌పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. కొత్త నిట్‌లో ల్యాబ్‌లు సరిగా ఉండవు, విద్యా బోధన ఎలా ఉంటుందో అన్న అనుమానంతో క్యాంపస్ ఇంటర్వూ్యలపై వెనకడుగు వేశారు. అయితే ఏపి నిట్ విద్యార్థులు తమ టాలెంట్‌తో ఆ సందిగ్ధతకు చెక్ పెట్టారు. 80 శాతానికి పైగా విద్యార్థులకు ఆఫర్ లెటర్లు ఏడాది వేతనంగా కనీసం రూ.3.5 లక్షలు, గరిష్టంగా రూ.6 లక్షల ప్యాకేజ్ పొందడమంటే జాక్‌పాట్‌గా విద్యార్థులు భావించేవారు. ఇప్పుడు భారీ వేతనాల తో ఆఫర్లు రావడంతో నిట్‌లో చదివేందుకు క్రేజ్ పెరగుతోంది. నిట్‌లో ప్లేస్‌మెంటు, ట్రైనింగ్ సెల్ శిక్షణ ఫలవంతమైంది. నిట్ డైరెక్టర్ అండ్ టీమ్ కృషి ఫలి తాలనిస్తుంది. బయటకు వచ్చే బ్యాచ్‌ల్లోని విద్యార్థుల్లో అర్హత సాధించిన వారిలో దాదాపు 80 శాతానికి పైగా విద్యార్థులకు ఆఫర్ లెటర్లు వస్తున్నాయి. వేతనాలు కూడా ఊహించని రీతిలో ఉన్నాయి. నిట్ నుంచి ఇంతవరకూ మూడు బ్యాచ్‌ల విద్యార్థులు బయటకు వచ్చారు. వారిలో 895 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2015–21 విద్యా సంవత్సరం వరకు మూడు బ్యాచ్‌లు బయటకు వచ్చాయి. చదవండి: (Rakesh Jhunjhunwala: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..) క్యూ కడుతున్న కంపెనీలు తాడేపల్లిగూడెం నిట్‌లో క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించేందుకు ఎంఎన్సీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్, అడట్రాన్, ఫానాటిక్స్, ఫ్యాక్ట్‌సెట్, టీసీఎస్, ఎల్అండ్టీ, మోడక్ ఎనలిటిక్స్, ఇన్ఫో ఎడ్జ్, కిక్ డ్రమ్, కాగ్నిజెంట్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్నాయి. ►2015–19 బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు –282 ►2016–20 బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు –303 ►2017–21– బ్యాచ్‌లో ఉద్యోగాలు పొందినవారు –310 ►2018–22 బ్యాచ్‌లో 170 మందికి ఇంతవరకూ ఆఫర్ లెటర్లు వచ్చాయి. -
వరంగల్‌లో క్యాంపస్ సెలక్షన్స్
వరంగల్ : నగరంలోని న్యూసైన్స్ కాలేజీలో 2021 అక్టోబరు 1న మెగా క్యాంపస్ సెలక్షన్స్ జరగనున్నాయని కాలేజీ డైరెక్టర్లు కే రవీందర్‌రెడ్డి, జే శ్రీధర్‌రావులు తెలిపారు. ఈ క్యాంపస్ సెలక్షన్స్‌లో టెక్ మహీంద్రా, ఎయిర్టెల్, పేటీఎం, శామ్సంగ్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర 25 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నట్టు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ ఫైనలియర్ పాసై విద్యార్థులు ఈ క్యాంపస్ సెలక్షన్స్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. అయితే విద్యార్థులు వయస్సు 28 ఏళ్లు మించరాదని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. -
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. వార్షిక వేతనాల్లో కోత
క్యాంపస్ ప్లేస్మెంట్లకు అడ్డా అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. ఒకప్పుడు రికార్డు స్థాయిలో వార్షిక వేతనాలు దక్కించుకున్న విద్యార్థులకు నేడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ దేశంలో నైపుణ్యం, ప్రతిభ కలిగిన విద్యార్థులందరూ వచ్చి చేరే క్యాంపస్‌లలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి. ప్రపంచ స్థాయి కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఇక్కడికి వస్తుంటాయి. విద్యార్థులు ఫైనల్ ఇయర్లో ఉండగానే లక్షల జీతాలు చెల్లించి తమ సంస్థలో చేర్చుకుంటామంటూ ఆఫర్ లెటర్లు ఇస్తుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఈ ఏడాది ఇదే అధికం ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంటెక్ విద్యార్థి సోమ్నాథ్పాల్ అత్యధిక వార్షిక వేతనం దక్కించుకున్న విద్యార్థిగా నిలిచారు, ఒక మల్టీ నేషనల్ కంపెనీ రూ. 17 లక్షల వార్షిక వేతనం చెల్లించే ఒప్పందం మీద సోమ్‌నాథ్‌కి అవకాశం పొందారు. అంతకు ముందు ఏడాది అత్యధిక వార్షిక వేతనం రూ. 43 లక్షలు ఉండగా కోవిడ్‌కి ముందు ఏడాది ఈ మొత్తం రూ. 45 లక్షలుగా నమోదు అయ్యింది. రూ. 20 లక్షల తేడా కోవిడ్ కారణంగా కంపెనీలు ఎక్కువ వేతనం చెల్లించేందుకు సిద్ధంగా లేవు. దీంతో ఏడాది వ్యవధిలోనే ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి చోట అత్యధిక వార్షిక వేతనాల్లో ఏకంగా 20 లక్షల వరకు తగ్గిపోయింది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్మెంట్ సగటు వేతనం రూ. 8 నుంచి 10 లక్షల మధ్య ఉంటుండగా ఇప్పుడు అది రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పడిపోయిందని వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రేరణ తెలిపారు. ఈ కోర్సులకే ప్రాముఖ్యత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం వస్తున్న కంపెనీలు ఎక్కువగా డేటా ఎనలటిక్స్, బిజినెస్ ఎనలటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు పొందారు. చదవండి : రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్ సరికొత్త ఆవిష్కరణ! -
టీసీఎస్‌లో భారీగా ఫ్రెషర్ల నియామకాలు
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ స్థాయిలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టనుంది. సుమారు 40 వేల మంది పైచిలుకు ఫ్రెషర్స్‌ను తీసుకోనుంది. కంపెనీ గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ విభాగం చీఫ్ మిలింద్ లక్కడ్ శుక్రవారం ఈ విషయాలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపరమైన ఆంక్షల కారణంగా హైరింగ్‌లో ఎలాంటి సమస్యలూ ఉండవని, గతేడాది 3.60 లక్షల మంది ఫ్రెషర్లు వర్చువల్‌గా ఎంట్రన్స్ టెస్టులో పాల్గొన్నారని ఆయన వివరించారు. ‘దేశీయంగా క్యాంపస్‌ల నుంచి గతేడాది 40,000 మందిని రిక్రూట్ చేసుకున్నాం. ఈసారి కూడా అదే స్థాయిలో లేదా అంతకు మించి నియామకాలు చేపడతాం‘ అని మిలింద్ వివరించారు. క్యాంపస్ రిక్రూట్మెంట్తో పాటు ఇతరత్రా నియామకాలు కూడా భారీగానే ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది అప్పటికప్పుడు చేపట్టేది కాదని, దీని వెనుక చాన్నాళ్ల ప్రణాళిక ఉంటుందన్నారు. ప్రస్తుతం అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) అత్యంత కనిష్టంగా 8 శాతంగా ఉన్నప్పటికీ.. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇది మళ్లీ సాధారణ స్థాయి అయిన 11–12 శాతానికి పెరిగే అవకాశం ఉందని మిలింద్ చెప్పారు. అయితే, అట్రిషన్ పెరిగినా కూడా విధులు, మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడని విధంగా సంస్థ నిర్వహణ విధానం ఉంటుందన్నారు. టీసీఎస్‌లో ప్రస్తుతం 5 లక్షల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను టీసీఎస్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ట్విన్ బ్రదర్స్... ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు
అమరావతి : ఏపీలో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో రికార్డు స్థాయిలో వేతనం పొందారు ఎస్ఆర్ఎం కాలేజీ విద్యార్థులు. ఎస్ఆర్ఎం కాలేజీకి చెందిన కవల సోదరులు సప్తర్షి మంజుదార్, రాజర్షి మజుందార్లను గూగూల్ జపాన్ సంస్థ ఎంపిక చేసుకుంది. ఇద్దరికి చెరో రూ. 50 లక్షల వంతున వార్షిక వేతనం ఇచ్చేందుకు అంగీకరించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో గడ్డ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇదే అత్యధికం. అంతేకాదు ఒకేసారి ఇద్దరు కవలలు సమాన వేతనం పొందడం కూడా ఇదే మొదటిసారి. రూ. 50 లక్షల వేతనం ఇటీవల ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం-ఏపీ కాలేజీ క్యాంపస్‌లో తొలి బ్యాచ్ బయటకు వస్తోంది. దీంతో కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో విద్యార్థులు పొందిన వేతనం సగటు రూ. 7 లక్షలుగా నమోదు అయ్యింది. కాగా మంజుదార్ కవల సోదరులు వేర్వేరుగా రూ. 50 లక్షల వార్షిక వేతనం పొందారు. దీంతో ఇటీవల కాలేజీ యాజమాన్యం సత్కరించి రూ. 2 లక్షల రివార్డు అందించింది. ఊహించలేదు - సప్తర్షి మంజుదార్ ‘ఈ స్థాయిలో వేతనం పొందుతామని మేము ఎప్పుడు అనుకోలేదు. స్కూలింగ్ నుంచి కాలేజీ వరకు కలిసే చదువుకున్నాం. ఒకే సంస్థలో ప్లేస్మెంట్ పొందాలని అనుకునే వాళ్లం. ఆ కల ఇంత గొప్పగా నెరవేరుతుందని అనుకోలేదు’ అని సప్తర్షి మంజుదార్ అన్నారు. చదవండి : యూకే పోటీలో రూ. 4.9 కోట్లు గెలిచిన హైదరాబాదీ -
ఇన్ఫీ లాభం రూ. 5,076 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ గతేడాది చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17.5 శాతం పెరిగి రూ. 5,076 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 13 శాతంపైగా ఎగసి రూ. 26,311 కోట్లకు చేరింది. గత క్యూ4లో రూ. 23,267 కోట్ల టర్నోవర్ సాధించింది. డాలర్ల రూపేణా ఆదాయం 13 శాతం వృద్ధితో 361.3 కోట్ల డాలర్లుగా నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 15 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21)లో ఇన్ఫోసిస్ నికర లాభం 16.6 శాతం పురోగమించి రూ. 19,351 కోట్లకు చేరింది. ఇక మొత్తం ఆదాయం దాదాపు 11 శాతం పుంజుకుని రూ. 1,00,472 కోట్లను తాకింది. కాగా.. ఇప్పటికే చెల్లించిన రూ. 12తో కలిపి గతేడాదికి 54 శాతం అధికంగా రూ. 27 డివిడెండ్‌ను చెల్లించినట్లయ్యింది. బైబ్యాక్‌కు రెడీ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలుకి ఇన్ఫోసిస్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో షేరుకీ రూ. 1,750 ధర మించకుండా 5.25 కోట్లకుపైగా షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు వెల్లడించింది. 1.23 శాతం వాటాకు సమానమైన వీటి కొనుగోలుకి రూ. 9,200 కోట్ల వరకూ వెచ్చించనుంది. ఫలితాలపై అంచనాల నేపథ్యంలో మంగళవారం ఇన్ఫోసిస్ షేరు ఎన్ఎస్ఈలో 1.6% క్షీణించి రూ. 1,403 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే బైబ్యాక్‌కు 25 శాతం ప్రీమియంను ప్రకటించడం గమనార్హం! ఇన్ఫీ అంతక్రితం 2019 ఆగస్ట్‌లో 11.05 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకు రూ. 8,260 కోట్లు వెచ్చించింది. 2017 డిసెంబర్లో తొలిసారి షేరుకి రూ. 1,150 ధరలో బైబ్యాక్‌ను చేపట్టింది. తద్వారా 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. గైడెన్స్ భేష్..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయం 12–14 శాతం స్థాయిలో బలపడే వీలున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా అంచనా వేసింది. ఇది స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఇచ్చిన గైడెన్స్‌కాగా.. డివిడెండ్(రూ. 6,400 కోట్లు), బైబ్యాక్‌తో కలిపి వాటాదారులకు రూ. 15,600 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు తెలియజేసింది. తద్వారా వాటాదారులకు క్యాష్‌ఫ్లోలలో 85 శాతం వరకూ చెల్లించే విధానాలను పాటిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ వివరించారు. ఆర్డర్ బుక్ రికార్డు 2020–21లో భారీ డీల్స్ ఆర్డర్ల విలువ 57 శాతం జంప్‌చేసి 14.1 బిలియన్ డాలర్లను తాకినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. వీటిలో 66 శాతం డీల్స్‌ను కొత్తగా కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డిసెంబర్లో కొత్త రికార్డును నెలకొల్పుతూ దైమ్లర్ ఏజీ నుంచి 3.2 బిలియన్ డాలర్ల(అంచనా) ఆర్డర్‌ను పొందింది. గతేడాది ఆగస్ట్‌లో వ్యాన్‌గార్డ్ నుంచి సంపాదించిన 1.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్టుతో పోలిస్తే ఇది రెట్టింపు విలువకావడం విశేషం! క్యూ4లో సైతం 2.1 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు కుదుర్చుకుంది. 25,000 మంది ఫ్రెషర్స్‌కు చాన్స్ గతేడాదిలో 36,500 మందిని ఇన్ఫోసిస్ కొత్తగా నియమించు కుంది. వీరిలో క్యాంపస్ నియామకాల ద్వారా 21,000 మందికి ఉపాధి కల్పించినట్లు సీవోవో యూబీ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25,000 మంది ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. వీరిలో 1,000 మందిని విదేశీ క్యాంపస్‌ల ద్వారా నియమించుకోనున్నట్లు వివరించారు. క్యూ3లో 10.1 శాతంగా నమోదైన ఉద్యోగ వలస రేటు క్యూ4లో 15.2 శాతానికి ఎగసింది. మార్చికల్లా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,59,619కు చేరింది. రూ. లక్ష కోట్లకు.. గతేడాది ఆదాయంలో రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాం. క్లయింట్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. కోబాల్ట్ టీఎం తదితర నైపుణ్యాల ద్వారా డిజిటల్ పోర్ట్‌ఫోలియోను పెంచుకుంటున్నాం. ఉద్యోగులకు అధికారాలు ఇవ్వడం ద్వారా గ్లోబల్ స్థాయిలో క్లయింట్లను ఆకట్టుకుంటున్నాం. భాగస్వామి ఎంపికలో క్లయింట్ల నుంచి ప్రాధాన్యతను సాధిస్తున్నాం. – ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ -
ఐఐఎంల్లో ఈ–కామర్స్, స్టార్టప్స్ ఆఫర్స్!
ఈ–కామర్స్, స్టార్టప్స్.. గత కొంత కాలంగా నియామకాల్లో ముందంజలో నిలుస్తున్న రంగాలు. ముఖ్యంగా ఐఐఎంల్లో ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్‌లో ఇది మరింతగా స్పష్టమైంది. ఐఐఎంల్లో 2021లో పీజీపీఎం కోర్సులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు ఇటీవల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ముగిశాయి. వీరికి ఈ–కామర్స్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఆఫర్లు ఇచ్చాయి. కోవిడ్ కారణంగా గత ఏడాది ఈ రంగాల్లోని సంస్థల ఆఫర్లు తగ్గాయి. ఈ సంవత్సరం మాత్రం మార్కెట్లు పుంజుకోవడంతో ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. అన్ని ఐఐఎంల్లోనూ అదే ట్రెండ్ ► తొలి తరం ఐఐఎంలు మొదలు నూతన ఐఐఎంల వరకూ.. దాదాపు అన్ని ఐఐఎం క్యాంపస్‌లలోనూ ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. ఆయా ఐఐఎంల్లో కనిష్టంగా పది శాతం.. గరిష్టంగా 80 శాతం మేరకు ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్లు పెరగాయి. ► ఐఐఎం–ఇండోర్‌లో.. ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్స్‌లో గరిష్టంగా 80 శాతం మేర పెరుగుదల కనిపించింది. ఐఐఎం–బెంగళూరులో 53 శాతం; ఐఐఎం–లక్నోలో 24.5 శాతం; ఐఐఎం–కోజికోడ్‌లో 25 శాతం; ఐఐఎం–అహ్మదాబాద్‌లో 10 శాతం వృద్ధి నమోదైంది. ► తెలుగు రాష్ట్రాల్లోని ఐఐఎం–విశాఖపట్నంలోనూ ఈ–కామర్స్ ఆఫర్లు గతేడాది కంటే పది శాతం మేరకు పెరిగి.. మొత్తం 120 మంది విద్యార్థుల్లో.. దాదాపు 30 మందికి ఈ–కామర్స్ సంస్థల్లో ఆఫర్లు లభించాయి. (ఇక్కడ చదవండి: కాస్త శ్రద్ధ పెడితే కేంద్ర కొలువు మీ సొంతం!) ఈ–కామర్స్ దిగ్గజాల హవా ఈ–కామర్స్ దిగ్గజాలుగా పేరొందిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం, ఫోన్‌పే, రేజర్‌పే సంస్థలు ఆఫర్స్ ఇవ్వడంలో ముందంజలో నిలిచాయి. ఈ రంగంలో లభించిన మొత్తం ఆఫర్లలో యాభై శాతం ఈ సంస్థల నుంచే ఉండటం విశేషం. అంతేకాకుండా వేతనాలు కూడా సగటున రూ.12లక్షల నుంచి రూ.30లక్షల వరకు అందించాయి. గతేడాది కంటే 30శాతం అదనంగా ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటామని ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ.. అందుకు తగినట్లుగానే క్యాంపస్ డ్రైవ్స్‌లో భారీగా నియామకాలు చేపట్టింది. అదే విధంగా అమెజాన్, పేటీఎం కూడా ఈ ఏడాది టెక్, మేనేజ్మెంట్ ప్రొఫైల్స్‌లో భారీగా నియామకాలు చేపడతామని పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఈ సంస్థలు ఫ్రెషర్స్ నియామకాలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. స్టార్టప్స్ హవా గత రెండేళ్లుగా వెనుకంజలో ఉన్న స్టార్టప్ కంపెనీల ఆఫర్లు ఈసారి భారీగా పెరిగాయి. ప్రధానంగా ఎడ్టెక్, ఫిన్‌టెక్ సంస్థలు ముందంజలో నిలిచాయి. బ్లాక్‌బర్గ్, ఇంటర్వ్యూబిట్, టర్టిల్‌మింట్ వంటి సంస్థలు స్టార్టప్ ఆఫర్స్ భారీగా ఇచ్చాయి. ఐఐఎంల విద్యార్థులు కూడా ఈ స్టార్టప్ ఆఫర్స్‌కు ఆమోదం తెలపడం విశేషం. దీనికి స్టార్టప్ సంస్థల్లో చేరితే తమ కెరీర్ ప్రగతికి పునాదులు వేసుకోవచ్చనే భావనే ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా తమ నైపుణ్యాలను నేరుగా వ్యక్తీకరించి, ఆచరణలో పెట్టే అవకాశం స్టార్టప్ సంస్థల్లోనే ఎక్కువగా ఉంటుందనే అభి ప్రాయంతోనే విద్యార్థులు ఈ ఆఫర్స్‌కు అంగీకరించారని ఆయా ఐఐఎంల క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫండింగ్ పెరగడమే కారణమా! స్టార్టప్ సంస్థలు భారీ సంఖ్యలో ఆఫర్లు ఇవ్వడానికి వాటికి గతేడాది ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి ఫండింగ్ రావడం మరో కారణం అనే వాదన వినిపిస్తోంది. హెక్స్జన్ సంస్థ సర్వే ప్రకారం–గతేడాది భారత్‌లోని స్టార్టప్ సంస్థలు దాదాపు నాలుగు వందల మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నాయి. వీటిలో యాభై శాతానికి పైగా టెక్ స్టార్టప్స్, ఎడ్టెక్ స్టార్టప్స్ ఉన్నాయని సదరు సర్వే పేర్కొంది. అంతేకాకుండా ప్రముఖ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కో నివేదిక ప్రకారం–2020లో జాతీయ స్థాయిలో ఏడు వేలకు పైగా స్టార్టప్ సంస్థలకు పది బిలియన్ డాలర్ల నిధులను వెంచర్ క్యాపిటలిస్ట్‌లు సమకూర్చారు. వీటిలో మూడొంతులు.. ఫిన్‌టెక్, ఈ–కామర్స్ అనుబంధ టెక్ స్టార్టప్‌లే ఉన్నాయి. ఇలా భారీగా నిధులు సమకూర్చు కున్న స్టార్టప్‌లు.. వ్యాపార ఉన్నతికి, విస్తరణకు అవసరమైన మానవ వనరుల కోసం క్యాంపస్ డ్రైవ్స్ బాట పట్టాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కీలకమైన ప్రొఫైల్స్ ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు కీలక విభాగాల్లో అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. డిజైన్ నుంచి మార్కెటింగ్ వరకు పలు ముఖ్య విభాగాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే హోదాల్లో ఆఫర్లు ఇచ్చాయి. ప్రస్తుత డిజిటలైజేషన్, ఆన్లైన్ కార్యకలాపాల్లో పెరుగుదలే దీనికి ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. అంతేకాకుండా వ్యాపార విస్తరణ వ్యూహాలు సమర్థవంతంగా రూపొందించే నైపుణ్యాలున్న అభ్యర్థులకు ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్కెటింగ్, డేటా అనలిటిక్స్ ప్రస్తుతం ఈ–కామర్స్ లావాదేవీలు విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ వ్యాపారాలను మరింత వ్యూహాత్మకంగా విస్తరించాలనే ఉద్దేశంతో కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అను గుణంగా సేవలందించడం, కస్టమర్స్ మెచ్చే ప్రొడక్ట్‌లను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకోసం మార్కెటింగ్, డేటాఅనలిటిక్స్ విభాగాల్లో నియా మకాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. స్టార్టప్ సంస్థల్లో.. ఈ ప్రొఫైల్స్ స్టార్టప్ సంస్థలు ప్రధానంగా ప్రొడక్ట్ డిజైన్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్‌లో ఎక్కువగా నియామకాలు చేపట్టాయి. దీనికి కారణం.. సదరు స్టార్టప్ సంస్థలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రొడక్ట్‌లు రూపొందించి.. వాటికి మార్కెట్లో ఆదరణ లభించేలా వ్యవహరిస్తున్నాయి. మేనేజ్మెంట్ విద్యార్థులకు ఈ నైపుణ్యాలుంటాయనే ఉద్దేశంతో బి–స్కూల్స్‌లో ప్లేస్‌మెంట్స్ చేపట్టాయి. ఈ స్కిల్స్ ఉంటేనే ఈ–కామర్స్, స్టార్టప్ సంస్థలు.. అభ్యర్థుల్లోని కోర్ నైపుణ్యాలే కాకుండా.. వ్యాపా రాభివృద్ధికి దోహదపడే స్కిల్స్‌కూ ప్రాధాన్యం ఇచ్చాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్, కొలాబరేషన్, ఇన్నోవేషన్ నైపుణ్యాలున్న విద్యార్థులకు ఎక్కువగా ఆఫర్స్ ఇచ్చాయి. ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కరించి.. వ్యాపార కార్యకలాపాలకు అవరోధం కలగకుండా వ్యవహరించొచ్చనే ఉద్దేశమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొనొచ్చు. మిగతా సెక్టార్స్ సంగతి ప్రస్తుత పరిస్థితుల్లో బీఎఫ్ఎస్ఐ, ఎడ్యుకేషన్ సెగ్మెంట్స్‌లో టెక్ ఆధారిత సేవలు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. గతేడాది ఈ టెక్ స్టార్టప్‌లే నిధుల సమీకరణలో ముందంజలో నిలిచాయి. దాంతో ఫిన్‌టెక్, ఎడ్టెక్ వంటి టెక్ స్టార్టప్స్‌లో ఆఫర్లు పెరిగాయి. మరోవైపు ఎప్పటి మాదిరిగానే కన్సల్టింగ్ సంస్థలు, బీఎఫ్ఎస్ఐ సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడంలో ముందు వరుసలో నిలిచాయి. అదే విధంగా మాన్యుఫ్యాక్చరింగ్ విభాగంలోనూ నియామకాలు ఆశాజనకంగానే కనిపించాయి. వీటిలోనూ అధిక శాతం జాబ్ ప్రొఫైల్స్ డేటా అనాలిసిస్, బిగ్ డేటా, మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగాల్లోనే లభించాయి. సానుకూల సంకేతాలు ► ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈకామర్స్, స్టార్టప్ సంస్థలు.. టైర్–2,టైర్–3ల్లోనూ క్యాంపస్ నియామకాలు చేపట్టేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. ప్రధానంగా మెట్రో నగరాల్లోని ఇన్స్టిట్యూట్లలో ఈ రిక్రూట్మెంట్స్ ఉండొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, సీఆర్ఎం, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలకు టైర్–2, టైర్–3 ఇన్‌స్టిట్యూట్‌లవైపు చూసే అవకాశాలు న్నాయని ఆయా క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ► మొత్తంగా చూస్తే గతేడాది కోవిడ్ కారణంగా కొంత వెనుకంజలో ఉన్న బి–స్కూల్స్ ప్లేస్‌మెంట్స్.. తిరిగి పుంజుకోవడంతో మేనేజ్మెంట్ విద్యార్థులకు భవిష్యత్తు ఆశాజనకం అనే భావన ఏర్పడుతోంది. మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థులు రానున్న రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐఐఎం ప్లేస్‌మెంట్స్ ముఖ్యాంశాలు ► 2021లో ఈ–కామర్స్, స్టార్టప్ ఆఫర్స్‌లో భారీగా పెరుగుదల. ► సగటున రూ. 12 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తున్న వైనం. ► మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, సీఆర్ఎం విభాగాల్లో నియామకాలు. ► స్టార్టప్ ఆఫర్స్‌లో టెక్ స్టార్టప్స్ హవా. ► రానున్న రోజుల్లో ఇతర బి–స్కూల్స్‌లోనూ నియామకాలు ఆశాజనకంగా ఉంటాయంటున్న నిపుణులు. డిజిటలైజేషనే ప్రధాన కారణం ఈ–కామర్స్ సంస్థలు భారీగా నియామకాలు చేపట్టడానికి ప్రధాన కారణం డిజిటలైజేషనే అని చెప్పొచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వినియోగదారులు డిజిటల్ కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ–కామర్స్ మార్కెట్ విస్తృతమవుతోంది. దానికి అనుగుణంగా సంస్థలు నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం అన్వేషిస్తున్నాయి. – ప్రొఫెసర్ యు.దినేశ్ కుమార్, చైర్ పర్సన్, సీడీఎస్, ఐఐఎం–బెంగళూరు -
23,000 క్యాంపస్ ఉద్యోగాలకు రెడీ
ముంబై, సాక్షి: వచ్చే ఏడాది అంటే 2021లో 23,000 మందిని క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తెలియజేసింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అధిక శాతం భారత్‌కే అవకాశముంటుందని కాగ్నిజెంట్ ఇండియా ఎండీ రాజేష్ నంబియార్ తాజాగా పేర్కొన్నారు. అక్టోబర్‌లో కాగ్నిజెంట్ బోర్డు సభ్యులైన నంబియార్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ నిర్దేశనలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా సుమారు 17,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు నంబియార్ తెలియజేశారు. 2016 నుంచీ చూస్తే ఇవి అత్యధికంకాగా.. వీటిలో సింహభాగం భారత్ నుంచే ఎంపికలు జరిగినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చదవండి: (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) పలు బాధ్యతలు కాగ్నిజెంట్ తరఫున దేశీయంగా 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ కమిటీకి సైతం నంబియార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. దేశీ ప్రభుత్వ ఏజెన్సీలు, పాలసీ సంస్థలతో కాగ్నిజెంట్‌కున్న ఒప్పందాలను మరింత మెరుగు పరచవలసిన బాధ్యత నంబియార్‌పై ఉన్నట్లు పరిశ్రమ నిపుణులు ఈ సందర్భంగా తెలియజేశారు. దేశీయంగా కంపెనీ కార్యకలాపాలను మరింత పటిష్టపరచడం, నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా యూనివర్శిటీలతో భాగస్వామ్యలు ఏర్పాటు చేసుకోవడం వంటి లక్ష్యాలను నంబియార్ సాధించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బాటలో ప్రభుత్వ ఏజెన్సీలతోపాటు, నాస్కామ్, చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర పరిశ్రమ సంబంధిత సంస్థలతోనూ కలసి పనిచేయవలసి ఉంటుందని సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వివరించారు. -
ఐటీ నియామకాలలో సరికొత్త వ్యూహ్యాలు
ముంబై: కరోనా ఉదృతి నేపథ్యంలో మెజారిటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ పూర్తయిన ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలపై సందిగ్ధత నెలకొంది. అయితే కంపెనీలు మాత్రం ఫ్రేషర్స్ బయపడాల్సిన అవసరం లేదని, నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం కంపెనీలు నిర్వహించనున్న క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) సాంకేతికతను ఉపయోగించనున్నారు. కాగా ప్రస్తుతం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించే సందర్భంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా విద్యార్థి వ్యక్తిత్వాన్ని పసిగట్టనున్నారు. టీమ్‌తో కలిసి పనిచేసే నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అక్టోబర్‌లో నియామకాలు చేపట్టాలని మెజారిటీ ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలైన ఐబీఎమ్, క్యాప్‌జెమినీలు ఎంపిక విధానంలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకు 60,000 మంది విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించినట్లు క్యాప్‌జెమినీ ఉన్నతాధికారి అనిల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. -
నా పరిస్థితి ఏమిటి?
సాక్షి, హైదరాబాద్ : క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా కొలువులకు ఎంపిౖకైన 14 వేల మంది ఇంజనీరింగ్ కాలేజీల ఫైనలియర్ విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీరుతో ఉసూరు మంటున్నారు. కరోనా మహ మ్మారి విజృంభణతో ఓవైపు లక్ష లాది మంది ఉపాధి కోల్పోతున్న వేళ అందివచ్చిన ఉద్యోగాల్లో చేరేందుకు డిగ్రీ పట్టా లేకపోవ డం అడ్డంకిగా మారడంతో ఆవే దన చెందుతున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, బిట్స్ పిలానీ, డీమ్డ్ వర్సిటీల్లో చదివి క్యాంపస్ కొలువులకు ఎంపికైన బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి పోగా యూజీసీ పరిధిలోని ఇంజ నీరింగ్ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు మాత్రం క్యాంపస్ ప్లేస్మెంట్లు పొందినా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. డిగ్రీ సర్టిఫికెట్లు సమర్పించా లంటూ ఉద్యోగాలిచ్చిన కంపెనీలు పంపుతున్న లేఖలకు బదులివ్వలేక తలపట్టుకుంటున్నారు. యూజీసీకి ఎందుకీ మొండిపట్టు.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, డీమ్డ్ వర్సిటీలు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థులకు సర్టిఫి కెట్లు ఇచ్చేశాయి. కొన్ని కాలేజీలు అయితే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చి విద్యా ర్థులను ప్రమోట్ చేసి పాస్ సర్టిఫికెట్లు ఇచ్చేశాయి. మరోవైపు కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధి లోని ఇంజనీరింగ్ కాలేజీల ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజీసీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే యూజీసీ వైఖరిని తప్పుపడుతూ పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభు త్వానికి లేఖలు రాశాయి. యూజీసీ నిర్ణయం అసం బద్ధమంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఏపీ, తెలంగాణ ప్రభు త్వాలు మాత్రం వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వ హిస్తామని ప్రకటిం చాయి. కానీ కరోనా ఉధృతమైతే పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని, తమకు వచ్చిన ఉద్యోగాలు పోతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. స్పష్టత కరువు... రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ఇంటర్నల్ మార్కులు లేదా ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తే వారు ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిపోయేవారని, యూజీసీ మొండి పట్టుదల కారణంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఓ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ వ్యాఖ్యానించారు. ‘ఎన్ఐటీలు నామమాత్రంగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాయి. డీమ్డ్ వర్సిటీలు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేశాయి. వాళ్లకు లేని నిబంధన ఇంజనీరింగ్ కాలేజీలకు ఎందుకు? ఒకవేళ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై స్పష్టత లేదు. కరోనా తగ్గుముఖం పడితే గానీ సాధ్యం కాదు. పరీక్షలు నిర్వహించాక వ్యాల్యుయేషన్, ట్యాబులేషన్ వంటి వాటికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా విద్యార్థుల ఉద్యోగాలకు యూజీసీ గ్యారంటీ ఇస్తుందా? అని ఆ ప్రిన్సిపల్ ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ, విద్యా సంవత్సరం కేలండర్ విషయంలో యూజీసీ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ‘ఫైనలియర్ విద్యార్థులకు మూడు సబ్జెక్టులే ఉంటాయి. అప్పటికే వారు ఏడు సెమిస్టర్లలో 35–40 సబ్జెకుŠట్లు చదివి పాసైన వారే. నా ఉద్దేశంలో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా వారిని పాస్ చేయవచ్చు’ అని మాజీ వైస్ చాన్స్‌లర్ అభిప్రాయపడ్డారు. నా పరిస్థితి ఏమిటి? ‘నన్ను ఓ కార్పొరేట్ కంపెనీ రూ. 28 లక్షల వార్షిక వేతనానికి నియమించుకుంది. డిగ్రీ సర్టిఫికెట్ కాపీలు పంపాలని ఇప్పటికే పలుమార్లు మెయిల్ పంపింది. తాజాగా అక్టోబర్ 31 వరకు డెడ్‌లైన్ పెట్టింది. అప్పటికీ నా చేతికి సర్టిఫికెట్ రాకపోతే నేను మళ్లీ ఆ ఉద్యోగం సాధిస్తానా? కరోనా నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు నిద్రపట్టట్లేదు’ అని ఓ ప్రతిష్టాత్మక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఫైనలియర్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. యీజీసీ ఇప్పటికైనా పరీక్షల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలివేయాలని లేకుంటే పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యమై విద్యార్థులు నస్టపోతారని ఓ ప్రైవేట్ కాలేజీ ప్లేస్మెంట్ డైరెక్టర్ పేర్కొన్నారు. -
ఊరట : జనవరి నుంచి కొలువుల సందడి
బెంగళూర్ : కోవిడ్-19 ప్రభావంతో కుదేలైన నియామకాల ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి నుంచి ఊపందుకుంటుందని రిక్రూట్మెంట్ సంస్థ కెరీర్‌నెట్ కన్సల్టింగ్ సంస్థ పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తితో క్యాంపస్ నియామకాలూ నిలిచిపోయాయని, హైరింగ్ ప్రక్రియ వేగవంతం కావడానికి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపింది. కరోనా కారణంగా నియామకాలను నిలిపివేసిన కంపెనీలు కూడా ఆరు నెలల తర్వాత చురుకుగా హైరింగ్ చేపడతామని పేర్కొన్నాయి. తమ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 43 శాతం కంపెనీలు వచ్చే ఏడాది జనవరిలో నియామకాలకు వెళతామని వెల్లడించాయని కెరీర్‌నెట్ పేర్కొంది. 2021 ఏప్రిల్ నాటికి కోవిడ్-19కు ముందున్న పరిస్థితి నెలకొంటుందని కెరీర్‌నెట్ సహవ్యవస్ధాపకులు అన్షుమన్ దాస్ అంచనా వేశారు. మరోవైపు క్యాంపస్ నియామకాలు కొంతమేర తగ్గే అవకాశాలున్నాయని వెల్లడైంది. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు వెళ్లే ఆలోచనలేదని 27 శాతం కంపెనీలు పేర్కొనగా, 39 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. కెరీర్‌నెట్ నివేదిక ప్రకారం కేవలం 30 శాతం కంపెనీలే ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు వెళతామని వెల్లడించాయి. ఈ ఏడాది ఇప్పటికే క్యాంపస్ హైరింగ్ వాయిదా పడిందని, ఆర్థిక వ్యవస్థ గాడినపడితే కంపెనీలు తమ హైరింగ్ ప్రణాళికలను ముమ్మరం చేస్తాయని దాస్ పేర్కొన్నారు. స్టార్టప్‌లపై కోవిడ్-19 ప్రభావం చూపుతుండగా, ఐటీ కంపెనీల్లో మాత్రం వేచిచూసే ధోరణి కనిపిస్తోంది. దిగ్గజ ఐటీ కంపెనీల్లో నాలుగింట మూడు సంస్ధలు గతంలో తాము ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉంటామని తెలిపాయని ఈ సర్వే పేర్కొంది. చదవండి : కోవిడ్ 19 : ఎంఐటీ సర్వేలో షాకింగ్ వివరాలు -
క్యాంపస్ ఎంపికలను రద్దు చేయకండి
న్యూఢిల్లీ: వివిధ ప్రైవేట్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లలో భాగంగా చేసిన ఎంపికలను లాక్డౌన్ కారణంగా రద్దు చేయరాదని కేంద్రం కోరింది. లాక్డౌన్ కారణంగా దేశంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎంపికయిన అభ్యర్థుల్లో ఉన్న ఆందోళనను తొలగించాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆయా సంస్థలకు సూచించింది. ఎంపికయిన అభ్యర్థులను యథా ప్రకారం ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పేర్కొంది. లాక్డౌన్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ కాలం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం క్యాంపస్ ఎంపికలపై పడకుండా చూసుకోవాలని గతవారం 23 ఐఐటీల డైరెక్టర్లను మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో క్యాంపస్ ఎంపికలను రద్దు చేసుకోవద్దని రిక్రూటర్లను కోరినట్టు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రాంగోపాల్‌రావు తెలిపారు. -
సత్తా చాటిన ఏపీ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యా ర్థులు చండీగఢ్ వర్సిటీ ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పంజాబ్‌లోని చండీగఢ్ వర్సిటీలో జరిగిన ప్రాంగణ నియామకాలు– 2020 ఫేజ్–1లో 4 వేల మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపిక కాగా.. వారిలో 64 మంది ఏపీ విద్యార్థులేనని వర్సిటీ వీసీ ఆర్.ఎస్.బావా తెలిపారు. ఇందులోనూ 36 మంది ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందుకున్నవారేనని తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన గగన్ చాటు ఐబీఎం, కాగ్నిజెంట్, పెర్సిస్టెంట్, వర్చ్యూసా సిస్టమ్స్ అనే 4 కంపెనీల నుంచి, విశాఖపట్టణానికి చెందిన గొంటిన ఉదయ్ కుమార్‌కు విప్రో, కాగ్నిజెంట్, సార్టప్ ఫామ్ వంటి మూడు కంపెనీల నుంచి జాబ్ ఆఫర్లు వచ్చినట్లు వర్సిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
నారాయణమ్మ విద్యార్థినికి బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లొ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఎం.లోహితా రెడ్డి అడోబ్ ఐఎన్‌సీ సంస్థలో రూ.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించింది. ఇటీవల కళాశాలలో అడోబ్, అమేజాన్, జేపీ మోర్గాన్, డెలాయిట్ తదితర సంస్థలు విద్యార్థునులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయని కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (హెచ్‌సీయూ విద్యార్థినికి భారీ ప్యాకేజీ) కళాశాలకు చెందిన 440 మంది విద్యార్థులు పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. సుమారు రెండు వందల మంది రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. ఇంజినీరింగ్ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న సుమారు 100 మంది విద్యార్థినులకు పలు కంపెనీలు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాయి. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను కళాశాల చైర్మన్ పి.సుబ్బారెడ్డి, కార్యదర్శి విద్యారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
హెచ్‌సీయూ విద్యార్థినికి భారీ ప్యాకేజీ
సాక్షి, రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినికి క్యాంపస్ ప్లేస్మెంట్లో భారీ ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లోని ఎంసీఏ విద్యార్థిని వి. నందిని సోని క్యాంపస్ ప్లేస్మెంట్లో అడోబ్ సిస్టమ్స్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. హెచ్‌సీయూలోని ప్లేస్మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో సమన్వయంతో ఈ ప్లేస్‌మెంట్‌ను నిర్వహించారు. రూ.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి నందినిని అడోబ్ సిస్టమ్స్ కంపెనీ ఎంపిక చేసింది. దీంతో హెచ్‌సీయూలో చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న విద్యార్థినిగా నందిని సోనీ నిలిచారు. నందిని తన పాఠశాలను విద్యను మహారాష్ట్రలోని బోయిసర్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో పూర్తి చేశారు. అహ్మదాబాద్‌లోని సెయింట్ జేవీయర్స్ కళాశాలలో బీసీఏ చదివారు. కాగా, ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్లో 200 మందిపైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని హెచ్‌సీయూ ప్లేస్మెంట్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ బ్యూరో చైర్మన్ రాజీవ్ వాంకర్ తెలిపారు. ఇంజినీరింగ్ వదిలేశా: నందిని మొదట ఇంజినీరింగ్ కోర్సులు చేయాలనుకున్నా కానీ ఆ తరువాత కంప్యూటర్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలని.. నైపుణ్యం కలిగిన సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఉండాలన్న లక్ష్యంతో ఎంసీఏలో చేరినట్టు నందిని సోని తెలిపారు. స్మార్ట్ ఇండియా హాకథాన్– 2019లో తన బృందంతో కలిసి విజేతగా నిలిచినట్టు వెల్లడించారు. అత్యధిక ప్యాకేజీతో అడోబ్ సిస్టమ్స్‌లో ఉద్యోగం రావడం సంతోషంగా ఉందన్నారు. (ఐసెట్–2020 నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నల్లగొండ కుర్రాడికి మైక్రోసాఫ్ట్ ఆఫర్
రామగిరి (నల్లగొండ): బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న నల్లగొండ కుర్రాడు చింతరెడ్డి సాయి చరిత్రెడ్డికి సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చక్కని ఆఫర్ ఇచ్చింది. ఆఖరి సంవత్సరం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా చరిత్‌రెడ్డి రూ.1.54 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన చరిత్‌రెడ్డి 8వ తరగతి వరకు నల్లగొండలోని స్థానిక సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లో, తరవాత ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 51వ ర్యాంకు సాధించి ఐఐటీ సీటు దక్కించుకున్నాడు. చరిత్ రెడ్డి తల్లిదండ్రుల స్వస్థలం మాడ్గులపల్లి మండలం ధర్మాపురం. తండ్రి సైదిరెడ్డి ఎంపీటీసీగా, తల్లి నాగసీత సర్పంచ్‌గా గతంలో పనిచేశారు. ప్రస్తుతం నల్లగొండలో ఉంటున్నారు. విశేషమేంటంటే తండ్రి సైదిరెడ్డి కూడా బీటెక్ చేశారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం బాట పట్టారు. తనయుల్లో పెద్దవాడైన సాయి చరిత్... తండ్రి ఆశయాలకు అనుగుణంగా చదివి మైక్రోసాఫ్ట్ ఆఫర్ దక్కించుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికయిన నేపథ్యంలో బుధవారం చరిత్‌రెడ్డి నల్లగొండకు చేరుకున్నాడు. తాజా ప్లేస్‌మెంట్స్‌లో మైక్రోసాఫ్ట్‌కు ఎంపికయిన ముగ్గురిలో దక్షిణాదికి చెందినది చరిత్‌రెడ్డి ఒక్కడే. క్యాంపస్‌లో ఓటీపీగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేయడం, తద్వారా దాని ప్రాజెక్టుల్లో మంచి ప్రతిభ కనపర్చడం కూడా చరిత్‌కు ఆ సంస్థ నుంచి భారీ ఆఫర్ రావటానికి కారణమైంది. వాషింగ్టన్‌లోని రెడ్మండ్ క్యాంపస్‌లో జూలైలో విధుల్లో చేరాల్సి ఉందని ఈ సందర్భంగా చరిత్ చెప్పాడు. ‘‘నా సంతోషాన్ని మా అమ్మానాన్నలతో పంచుకుంటున్నా. నాకు చిన్నప్పటి నుంచీ కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం దానికి తగ్గట్టే టీచర్ల మార్గదర్శకత్వంలో పక్కా ప్రణాళికతో చదివాను. అమ్మ సహకారం చాలా ఎక్కువ’’ అని వ్యాఖ్యానించాడు. చరిత్ తమ్ముడు అజిత్ రెడ్డి ప్రస్తుతం చైన్నె ఐఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చాలా ఆనందంగా ఉంది: సైదిరెడ్డి, నాగసీత పిల్లలిద్దరూ చదువుల్లో చిన్నప్పటి నుంచీ ఫస్టే. ఇద్దరూ ఐఐటీ స్టూడెంట్స్ కావడం, పెద్ద కుమారుడు భారీ వేతన ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బాంబే ఐఐటీలో సీటు వచ్చినప్పుడే మంచి భవిష్యత్ ఉంటుందని ఊహించాం. -
ఒక్క స్లాట్‌లోనే 53 మందికి ప్లేస్‌మెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్‌లో మొదటి విడత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు. మొదటిరోజు ఒక్క స్లాట్‌లోనే 53 మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభించాయి. 2019–20 విద్యా సంవత్సరానికి గానూ ఐఐటీ హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు తొలి విడతలో మొదటి స్లాట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు అవి పూర్తయ్యాయి. ఆ తర్వాత చేపట్టిన మరో రెండు స్లాట్లలో ప్లేస్‌మెంట్స్ సెలెక్షన్ ఆదివారం రాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. పాల్గొన్న 15 కంపెనీలు: తొలి స్లాట్‌లో మొత్తం 15 కంపెనీలు పాల్గొనగా అందులో టీఎస్ఎంసీ, ఎస్ఎంఎస్, డేటాటెక్ అండ్ ఎన్టీటీ–ఏటీ సంస్థ లు ఆరుగురు విద్యార్థులకు విదేశాల్లో ప్లేస్‌మెంట్స్ ఇచ్చాయి. బుక్‌మైషో, స్ప్రింక్లర్, జాగ్వార్, బజాజ్ ఆటో, బెన్‌వై మెల్లన్, డామినో డాటా ల్యాబ్స్, కాగోపోర్ట్ వంటి కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో తొలి సారి పాల్గొనడం విశేషం. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మ్యాన్ సాక్స్, సేల్స్‌ఫోర్స్, ఇంటెల్, క్వాల్కామ్, ఒరాకిల్ వంటి సంస్థలు ఐఐటీహెచ్‌కు వచ్చాయి. అందులో అత్యధికంగా మైక్రోసాఫ్ట్ 17 మందికి ఆఫర్లను ఇచ్చిందని, వారిలో ఐదుగురు అమ్మాయిలున్నట్లు ఐఐటీ ప్లేస్‌మెంట్స్ ఇన్చార్జి ప్రదీప్ తెలిపారు. ఇక గోల్డ్ మ్యాన్ సాక్స్ ముగ్గురు విద్యార్థులకు ఆఫర్ ఇవ్వగా అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. రిజిస్టర్ చేసుకున్న 477 మంది విద్యార్థులు గతేడాది తొలిరోజు 3 స్లాట్లలో చేపట్టిన ప్లేస్‌మెంట్స్‌లో 56 మందికే ఉద్యోగాలు లభించగా, ఈసారి తొలిరోజు ఫస్ట్ స్లాట్‌లోనే 53 మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. తొలివిడత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఈనెల 12 వరకు కొనసాగనుండగా, రెండో విడత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చే జనవరి నుంచి ఏప్రిల్ మధ్య నిర్వహించనుంది. ఈ ఏడాది మొదటి విడత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం 477 మంది రిజిస్టర్ చేసుకోగా, 224 కంపెనీలు విద్యార్థులకు అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చాయి. అదే గతేడాది మొదటి విడతలో విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పించేందుకు మొత్తంగా 150 కంపెనీలే వచ్చాయి. -
తెలంగాణ విద్యార్థికి భారీ ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్ : క్యాంపస్ సెలక్షన్లో తెలంగాణ విద్యార్థిని భారీ ఆఫర్ వరించింది. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న అంకరిగారి బోడ రోహన్.. ఏడాదికి రూ.41.6 లక్షల వేతనం గల ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన రోహన్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. అతని తండ్రి శ్రీనివాస్ వ్యాపార రంగంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగం పొందడం ఆనందంగా ఉందని రోహన్ అన్నాడు. -
ఐఐటీ మేటి!
సాక్షి, హైదరాబాద్ : క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఐఐటీ–హైదరాబాద్ సత్తాచాటింది. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులకు ఈ సంవత్సరం అధిక సంఖ్యలో క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించాయి. వివిధ కంపెనీల నుంచి మొత్తంగా 261 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్ ఆఫర్లను పొందగా, అం దులో 22 మంది అంత ర్జాతీయ కంపెనీల నుంచి భారీ ఆఫర్లను దక్కించు కున్నారు. పరిశోధన లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ తనదైన శైలిలో పురోగతి సాధి స్తున్న ఐఐటీ హైదరాబాద్ ఈసారి ఆర్టిíఫీషియల్ ఇంటలీజెన్స్ కోర్సును బీటెక్‌లో ప్రవేశ పెట్టిన మొదటి ఐఐటీగా నిలి చింది. దీంతోపాటుగా ఎంటెక్‌లోనూ డేటా సైన్స్ మొదట ప్రవేశ పెట్టిన ఐఐటీగా ఘనతను సొంతం చేసుకుంది. 107 కంపెనీల ద్వారా ప్లేస్మెంట్లు ఐఐటీ హైదరాబాద్‌లో క్యాంపస్ ప్లేస్మెంట్లను నిర్వహిం చేందుకు 252 కంపెనీలు నమోదు చేసుకున్నాయి. అందులో ఇప్పటివరకు 107 కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లను నిర్వహించాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మెర్కారీ, టయోటా రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ అండ్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్, వర్క్స్ అప్లికేషన్ అండ్ ఎస్ఎంఎస్ డేటా టెక్ వంటి సంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లను చేపట్టాయి. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌లో 16 విభాగాల్లో దాదాపు 2,855 మంది విద్యార్థులు ఉండగా, ఇంజనీరింగ్, సైన్స్, లిబరల్ ఆర్ట్స్ అండ్ డిజైన్ వంటి విభాగాల్లో 10 బీటెక్ ప్రోగ్రాంలు, 16 ఎంటెక్ ప్రోగ్రాంలు, మూడు ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లు, ఎంఏ ప్రోగ్రాం, పీహెచ్డీ వంటి ప్రోగ్రాం లను నిర్వ హిస్తోంది. వాటిల్లో పరిశోధనలకు పెద్దపీట వేస్తూ క్యాంపస్ ప్లేస్ మెంట్లను పెంచేం దుకు, ఇక్కడి విద్యా ర్థులకు ఉన్నత విద్యావ కాశాలను కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంది. అందులో ఎక్కువ శాతం జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, తైవాన్‌లో ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఐ–టిక్, సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్ ప్రెన్యూర్షిప్, ఫ్యాబ్లెస్ చిప్ డిజైన్ ఇంక్యుబేటర్ అనే మూడు టెక్నాలజీ ఇంక్యుబేటర్లను కూడా మన ఐఐటీ ఏర్పాటు చేసింది. గతేడాది ఈ సంస్థ విద్యార్థికి గూగుల్ సంస్థ రూ.1.2 కోట్ల ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
క్యాంపస్ ఉద్యోగాల పేరిట పని చేయించుకొని..
సాక్షి, ఆటోనగర్(విజయవాడ): అందరూ గ్రామీణ ప్రాంత వాసులే. సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపికయ్యారు. విద్యార్థులు ఎగిరి గంతేశారు. ఎంతో సంతోషంతో ఉద్యోగం చెరిపోయారు. ఉద్యోగం వచ్చిన సంతోషంలో సంస్థ యాజమాన్యం అడగ్గానే రూ.5 వేలు చెల్లించారు. నెలన్నరకే సంస్థ ఎత్తేశారు. ఈ ఘటన ఆటోనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జవహర్ ఆటోనగర్ ఇండస్ట్రీయల్ మూడో రోడ్డులో ప్రో సాఫ్ట్ సొల్యూషన్స్ పేరుతో సంస్థను నడుపుతున్నారు. తిరువూరులోని శ్రీవాణి ఇనిస్టూట్యూట్ ఆఫ్ సైన్స్టెక్నాలజి వీరందరికి మార్చి 25న ఈ సంస్థ సభ్యులు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అందులో నైపుణ్యత ఉన్నవారిని కొందరిని ఎంపిక చేసుకున్నట్లు సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. ఆ తరువాత వీరందరూ ఎంపిక అయినట్లు కాల్ లేటర్లు ఇచ్చారు. దీంతో జూన్ 1 నుంచి ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఈ విధంగా జూన్ 1 నుంచి ఈ నెల 15 వరకు పని చేయించుకున్నారు. గత నెల జీతం ఇవ్వమని ఆ సంస్థను అడిగితే అదిగో ఇస్తాం... ఇదిగో ఇస్తాం... అంటూ తీరా ఇప్పుడు సంస్థను మూసేస్తున్నామని చెప్పినట్లు ఇంజినీరింగ్ విద్యార్థులు వాపోతున్నారు. నెలన్నర నుంచి హాస్టల్లో.. నెలన్నర నుంచి హాస్టల్లో ఉంటూ సంస్థలో పనిచేస్తున్నారు. ఇప్పటికి హాస్టల్‌కు గాను రూ.10,000 ఖర్చు చేశారు. ఈ సంస్థలో కంప్యూటర్లు లేవు. వీరి వద్ద ఉన్న సెల్ ఫోన్‌ద్వారానే ప్రాజెక్ట్ వర్కు చేసినట్లు వాపోతున్నారు. మేము చెల్లించిన రూ.5 వేలు ఇవ్వాలని సంస్థను కోరామని, అయితే అందుకు సంస్థ నిరాకరించినట్లు బాధితులు లక్ష్మీతిరుపతమ్మ, లక్ష్మి చెప్పారు. వీరంతా జగ్గయ్యపేట, గంపలగూడెం, తిరువూరు నుంచి వచ్చిన వారే అధికం. ఈ విషయమై ఆ సంస్థ ప్రతినిధికి ‘సాక్షి’ ఫోన్ చేయగా ఆయన తల్లి లిఫ్ట్ చేసి మా అబ్బాయిపై రెండు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారని సమాధానం చెప్పారు. -
తెలుగు విద్యార్థికి ఏడాదికి కోటి జీతం
నూజివీడు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించాలనే ఆశయంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీల లక్ష్యం నెరవేరుతోంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2008–14 సంవత్సరాల మధ్య చదివిన మొదటి బ్యాచ్ విద్యార్థి ఆడారి మణికుమార్ అమెరికాలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా ఏడాదికి రూ.కోటికి పైగా వేతనంతో ఉద్యోగాన్ని సాధించారు. విశాఖ జిల్లా మారుమూల గ్రామం నుంచి అమెరికాలో ఆకర్షణీయ ఉద్యోగం వరకు సాగిన మణికుమార్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. విశాఖ జిల్లా చింతలగ్రహారం గ్రామానికి చెందిన ఆడారి రాము, మీనాక్షి దంపతుల ఏకైక కుమారుడు మణికుమార్. ఇతనికి ఇద్దరు తోబుట్టువులు. అదే గ్రామంలోని హైస్కూల్లో 2008లో పదో తరగతిలో 600కు గాను 548 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు దక్కించుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే ప్రముఖ ప్రోగ్రామింగ్ వెబ్సైట్లను అనుసరిస్తూ అల్గారిథమ్ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే నైపుణ్యాన్ని సంపాదించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించారు. మణికుమార్ బీటెక్ మూడో సంవత్సరంలో ఉండగానే అమెజాన్ మిషన్ లెర్నింగ్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇష్టమే నడిపించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆసక్తి ఏర్పడటంతో మణికుమార్ అదే రంగంలో ఉద్యోగం చేయాలనుకున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్కు వచ్చిన కంపెనీల్లో ఉద్యోగం నచ్చకపోవడంతో ఇంటర్వ్యూలకు హాజరు కాలేదు. బీటెక్ పూర్తయిన తర్వాత ఒక స్టార్టప్ కంపెనీలో ఏడాదికి రూ.8 లక్షల వేతనానికి చేరారు. దాన్ని స్నాప్‌డీల్ సంస్థ కొనుగోలు చేసింది. కొద్దికాలం అందులో పనిచేసిన అతనికి 2015లో అమెజాన్ సంస్థలో అవకాశం వచ్చింది. అమెజాన్‌కు ఇండియాలో రెండేళ్లు పనిచేశారు. అప్పట్లో ఏడాదికి రూ.18 లక్షల వేతనం అందుకునేవారు. తర్వాత ప్రమోషన్‌తోపాటు అదే కంపెనీకి అమెరికాలో పనిచేసే అవకాశం వచ్చింది. అమెరికాలో ఏడాదికి రూ.40 లక్షల వేతనంతో ఉద్యోగంలో చేరారు. రెండేళ్లు పనిచేశాక.. ప్రస్తుత వేతనం రూ.కోటి దాటింది. నిరుపేద కుటుంబం నుంచి.. మణికుమార్ తండ్రి ఆడారి రాము గ్రామంలో ఎలక్ట్రీషియన్ కాగా.. తల్లి వ్యవసాయ పనులకు వెళ్తుండేది. తనతోపాటు ఇద్దరు అక్కలను చదివించడానికి తల్లిదండ్రులు నిరంతరం శ్రమించడాన్ని చిన్నతనం నుంచే గమనిస్తూ వారి నుంచే ప్రేరణ పొందానని మణికుమార్ పేర్కొన్నారు. -
డిగ్రీ ఫైనలియర్‌లోనే ఐదు ఉద్యోగాలు!
సాక్షి, జమ్మలమడుగు: పెద్ద పెద్ద చదువులు చదివి ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకునే వారికి ఈ పేదింటి బిడ్డ ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగం పొందడానికి మరీ ఉన్నత చదువులే అక్కరలేదని నిరూపించి శభాష్ అనిపించుకుందీ అమ్మాయి. ఈమె ప్రతిభకు ఉద్యోగావకాశాలు దాసోహామయ్యాయి. ఒకటా రెండా ఏకంగా అయిదు సంస్థల్లో ఉద్యోగాలు ఈమె తలుపు తట్టాయి. చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదివి రాణించడమే ఇందుకు కారణం. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం వేపరాలలో చేనేత కుటుంబానికి చెందిన బడిగించల క్రిష్టమూర్తి, రుణ్మికీల కుమార్తె భాగ్యలక్ష్మి. 10వ తరగతి వరకు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. జమ్మలమడుగులోని ఎస్పీ జూనియర్, డీగ్రీకాలేజీలో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో 9.5 శాతం, రెండో సంవత్సరంలో 9.3 శాతం మార్కులు సాధించింది. ప్రస్తుతం మూడో సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తోంది. చదువు సాగిస్తూనే తల్లితండ్రులకు ఆసరాగా ఉండాలని ఇంట్లో దుస్తులు కుడుతోంది. బాల్యం నుంచి పట్టుదల మెండుగా ఉన్న భాగ్యలక్ష్మి ప్రణాళికాబద్ధంగా చదువుకోవడం అలవాటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి తిరుపతిలో విప్రో, టీసీఎస్.. కాకినాడలో క్యాప్ జెమినీ, హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీలు సెలెక్షన్లు నిర్వహించాయి. రాసిన ప్రతి పరీక్షలోనూ ఈమెను విజయం వరించింది. ఉద్యోగవకాశాలు తలుపు తట్టాయి. కంపెనీలు ఆఫర్ లెటర్లు పంపాయి. ఏకంగా ఐదు ఉద్యోగాలకు అర్హత సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. భాగ్యలక్ష్మి ప్రతిభకు వేపరాల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ ఫలితాలు వచ్చాక ఇందులో మంచి ఆఫర్‌ను ఎంపిక చేసుకుని చేరతానని భాగ్యలక్ష్మి ‘సాక్షి’తో చెప్పింది. చదువుతోపాటే భవిష్యత్‌కు బాటవేసుకోవాలని... ప్రతిభను చాటుకుంటే కచ్చితంగా ఉద్యోగావకాశాలు వస్తాయని జమ్మలమడుగుకు చెందిన విద్యావేత్త పి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. -
హైదరాబాద్ హబ్‌లోనే డీబీఎస్ టెక్నాలజీ అభివృద్ధి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సింగపూర్‌కు చెందిన డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) గ్రూప్ సాంకేతికత, అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతుంది. 2016లో నగరంలో 2 లక్షల చ.అ.ల్లో డీబీఎస్ ఏషియా హబ్ 2ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సింగపూర్ తర్వాత రెండో అతిపెద్ద టెక్నాలజీ హబ్ ఇదే. ఈ సెంటర్లో అతిపెద్ద బ్యాంకింగ్ అప్లికేషన్స్ ప్రొగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఫ్లాట్‌ఫామ్స్ (ఏపీఐఎస్), ఇంటిగ్రేటెడ్ ఈ–బ్యాంకింగ్ సొల్యూషన్స్, అకౌంటింగ్ అండ్ ఈఆర్పీ ఫ్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి జరుగుతుందని డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) సీఈఓ సురోజిత్ షోమీ తెలిపారు. మన దేశంతో పాటూ చైనా, తైవాన్, సింగపూర్, హాంగ్‌కాంగ్ మార్కెట్లలో 350కి పైగా ఏపీఐఎస్ సేవలందిస్తున్నామని చెప్పారు. మంగళవారమిక్కడ డీబీఐఎల్ తొలి బ్యాంక్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం నానక్‌రాంగూడలోని వేవ్‌రాక్‌లో 2 లక్షల చ.అ.ల్లో డీబీఎస్ హబ్–2 ఉంది. ఇందులో 2 వేల మంది ఇంజనీర్లు, డెవలపర్లు పనిచేస్తున్నారు. త్వరలోనే రూ.260 కోట్ల పెట్టుబడులతో రాయదుర్గంలోని ఆర్ఎంజెడ్ స్కైవ్యూలో మరొక 2 లక్షల చ.అ.ల్లో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించనున్నాం. ఏడాదిలో వెయ్యి మంది ఇంజనీరింగ్, టెక్నాలజీ నిపుణులను నియమించుకుంటామని’’ ఆయన వివరించారు. 25 నగరాలు, 100 బ్రాంచీలు.. ఇప్పటివరకు డీబీఎస్ గ్రూప్ ఇండియాలో రూ.7,700 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వచ్చే 12–18 నెలల్లో దేశంలో 25 నగరాల్లో 100 బ్రాంచ్‌లు, కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని లకి‡్ష్యంచాం. ఇందుకోసం రూ.125–150 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాం. ఈ నెల ముగింపు నాటికి అహ్మదాబాద్, కోయంబత్తూరు, వడోదర, ఇండోర్, లుథియానాలో 9 బ్రాంచీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నాం. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, నాసిక్, సూరత్, కొల్హాపూర్, సాలీం, కుద్దాలూర్, ముర్దాబాద్ నగరాల్లో 12 బ్రాంచ్‌లున్నాయి. మూడేళ్లలో 1.50 లక్షల కోట్ల వ్యాపారం.. ప్రస్తుతం డీబీఐఎల్‌కు డిపాజిట్లు రూ.30 వేల కోట్లుగా ఉన్నాయి. ఇందులో సీఏఎస్ఏ 15–18%గా ఉంది. వచ్చే ఐదేళ్లలో 25 శాతం సీఏఎస్ఏ వృద్ధిని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం రూ.50 వేల కోట్ల బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యాపారాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఇప్పటివరకు కార్పొరేట్ రుణాల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. ఇక నుంచి ఎస్ఎంఈ, రిటైల్ రుణాల మీద ఫోకస్ చేస్తాం. మొత్తం మొత్తం రుణాల్లో కార్పొరేట్ రూ.20 వేల కోట్ల వరకుంటాయి. 18 దేశాలు 280 బ్రాంచీలు.. ఇప్పటివరకు డీబీఎస్‌కు 18 దేశాల్లో 280 బ్రాంచీలు, 1200 ఏటీఎం సెంటర్లున్నాయి. 25 వేల మంది ఉద్యోగులున్నారు. ఏటా 11% వృద్ధి రేటుతో 13.2 సింగపూర్ బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. గత ఆర్ధిక సంవత్సరంలో 28% వృద్ధితో 5.6 సింగపూర్ బిలియన్ డాలర్ల లాభాన్ని మూటగట్టుకుంది. హ్యాక్‌థాన్ ద్వారా ఉద్యోగుల నియామకం క్యాంపస్ రిక్రూట్మెంట్, ఇంటర్వ్యూ వంటివి కాకుండా డీబీఎస్ బ్యాంక్ ఉద్యోగుల నియామకాలను హ్యాక్‌థాన్ ద్వారా నిర్వహిస్తుంది. డీబీఎస్ బ్యాంక్ మొత్తం నియామకాల్లో 30–40 శాతం హ్యాక్‌థాన్ ద్వారానే ఎంపిక చేస్తుంది. హ్యాక్ 2 హైర్ ప్రోగ్రామ్ ద్వారా ఆన్లైన్ చాలెంజ్ నిర్వహించి.. ఎంపికైన అభ్యర్థులు 24 గంటల రియల్ లైఫ్ బిజినెస్ ప్రొబ్లమ్స్ను పరిష్కరించాల్సి ఉంటుందని డీబీఎస్ ఆసియా హబ్ 2 హెడ్ మోహిత్ కపూర్ తెలిపారు. ఒక్కో హ్యాక్ 2 హైర్లో 13 వేలకు పైగా అభ్యర్థులు పాల్గొంటున్నారని.. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా విభాగాల్లో సుమారు వంద మంది నిపుణులను నియమించుకుంటామని తెలిపారు. త్వరలోనే 6వ ఎడిషన్‌ను ప్రారంభిచనున్నట్లు ఆయన చెప్పారు. నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. పాతికేళ్ల క్రితం ముంబైలో తొలి బ్రాంచ్ ప్రారంభించిన డీబీఎస్ బ్యాంక్ 2015లో పూర్తి సొంత అనుబంధ సంస్థ (డబ్ల్యూఓఎస్) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి దరఖాస్తు చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత అంటే ఈ ఏడాది మార్చి 1న ఆర్బీఐ అనుమతినిచ్చింది. దీంతో ప్రస్తుతం దేశంలోని 12 డీబీఎస్ బ్రాంచీలు కూడా డీబీఐఎల్‌లోకి మారాయి. ప్రస్తుతం మన దేశంలో 45 విదేశీ బ్యాంక్‌లున్నాయి. స్టాండర్డ్ చార్డెర్డ్కు 100 బ్రాంచీలు, సిటీ బ్యాంక్‌కు 35, హెచ్ఎస్బీసీకీ 26 బ్రాంచీలున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌కు 4 బ్రాంచీలున్నాయి. విదేశీ బ్యాంక్ నుంచి డబ్యూఓఎస్ బ్యాంక్‌గా మారిన తొలి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. ఇది గతేడాది డిసెంబర్లో ఆర్బీఐ అనుమతి పొందింది. -
జేఎన్టీయూలో క్యాంపస్ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ సెల్లో కోర్ అండ్ డ్రీమ్ స్టేటస్ క్యాంపస్ నియామకాలు ఈ నెల 17, 18 తేదీల్లో జరిగాయి. అందులో మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ అత్యధికంగా ఓ విద్యార్థికి ఏడాదికి రూ.36 లక్షల వేతనాన్ని, మరో విద్యార్థికి రూ.24 లక్షల వేతనాన్ని ఆఫర్ చేసింది. మ్యాథ్ వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరో ముగ్గురు ఎంటెక్ విద్యార్థులకు రూ.17 లక్షల చొప్పున వేతనంతో నియమించుకుంది. రూ.14.5 లక్షల చొప్పున వేతనంతో ఏడుగురు బీటెక్ విద్యార్థులను ఎంపిక చేసుకుంది. మరో 10 మంది విద్యార్థులకు జోహో కంపెనీ రూ.6.6 లక్షల ప్యాకేజీ చొప్పున ఇచ్చింది. టెరడాట కంపె నీ రూ.8.28 లక్షల చొప్పున వేతనంతో పలువురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. -
ఐఐటీ.. కొలువుల్లో మేటి!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: ఈ ఏడాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థుల పంట పండింది. వారిని నియమించుకునేందుకు కంపెనీలు క్యూ కట్టాయి. మునుపెన్నడూ లేని రీతిలో జూలై మొదటి వారం పూర్తయ్యే సరికి పాత ఐఐటీల్లో 99 శాతం, హైదరాబాద్, గాంధీనగర్, మండి, భువనేశ్వర్, రూపార్ వంటి పదేళ్ల క్రితం మొదలైన ఐఐటీల్లో 90 శాతం మేర విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. మామూలుగా ఐఐటీల్లో ఆగస్టులో క్యాంపస్ నియామకాలు మొదలై సెప్టెంబర్ దాకా జరుగుతాయి. కానీ కంపెనీలు ఈసారి జూన్ చివరి వారం నుంచే నియామకాల ప్రక్రియను ప్రారంభించాయి. సాధారణంగా టాప్ రేటెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి విద్యార్థులను నియమించుకునే ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు ఈసారి ఐఐటీయన్ల కోసం పోటీ పడ్డాయి. టాప్ రేటెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు ఏడాదికి రూ.3.30 లక్షల వేతనం మాత్రమే ఆఫర్ చేస్తున్న ఈ కంపెనీలు ఐఐటీయన్ల వద్దకు వచ్చేసరికి రూ.7.5 లక్షల నుంచి రూ.12 లక్షల దాకా ఆఫర్ చేశాయి. డెలాయెట్, పబ్లిషైజ్, సాపినెట్, మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలు పాత కాలేజీల కంటే కొత్త కాలేజీల్లో నియామకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. చెన్నై, ఖరగ్‌పూర్, ముంబై, ఢిల్లీ, కాన్పూర్, గౌహతి వంటి ఐఐటీల్లో క్యాంపస్ నియామకాల్లో పాల్గొన్న 99 శాతం మంది విద్యార్థులకు రెండు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు లభించాయి. అయితే ఈ క్యాంపస్‌లలో నియామకాలకు హాజరైన విద్యార్థుల సంఖ్య 60 నుంచి 70 శాతం లోపే కావడం విశేషం. మిగిలిన విద్యార్థులు స్టార్టప్ కంపెనీలు స్థాపించడమో లేదా ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడమో వంటి వాటికి ప్లాన్ చేస్తున్నారని మైక్రోసాఫ్ట్ కంపెనీ సీనియర్ టాలెంట్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. హైదరాబాద్ ఐఐటీయన్లకు భారీ వేతనాలు హైదరాబాద్, భువనేశ్వర్, గాంధీనగర్, రూపార్ ఐఐటీల్లో విద్యార్థులకు అమెజాన్, గోల్డ్‌మ్యాన్ శాక్స్, రిలయన్స్ జియో, మారుతి సుజుకీ భారీ వేతనాలు ఆఫర్ చేశాయి. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు ఇప్పటివరకు 100 కంపెనీల నుంచి 268 ఉద్యోగ ఆఫర్లు పొందారు. ఇది గడచిన ఆరేడేళ్లలో రికార్డు. గతంలో మాదిరి కంపెనీలు విద్యార్థులకు ఆఫర్ చేస్తున్న మొత్తాలను బయటకు వెల్లడించకూడదని ఐఐటీ ప్లేస్మెంట్ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గోల్డ్‌మ్యాన్ శాక్స్ హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఒకరికి ఏడాదికి రూ.1.25 కోట్లు, అమెజాన్ కంపెనీ గాంధీనగర్ విద్యార్థికి రూ.1.05 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిసింది. గోల్డ్‌మ్యాన్ శాక్స్ జూలై పదో తేదీ నాటికి 65 మంది ఐఐటీయన్లకు ఆఫర్ లెటర్లు ఇవ్వగా వారిలో కనిష్ట వేతనం రూ.65 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. ‘‘పాత ఐఐటీల్లో నియామకాలకు కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ రద్దీ తీవ్రంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అంతే సమానమైన టాలెంట్ ఉన్న నూతన ఐఐటీల్లో నియామకాలు చేపట్టాం’’అని డెలాయెట్ చీఫ్ టాలెంట్ ఆఫీసర్ ఎన్.వి.నాథన్ చెప్పారు. మహేంద్ర అండ్ మహేంద్ర తాను తీసుకుంటున్న కొత్త ఇంజనీర్లలో 40 శాతం మందిని కొత్త ఐఐటీల నుంచే తీసుకుంటోంది. ఇంతకుముందు సంవత్సరాలలో ఈ కంపెనీ టాప్ రేటెడ్ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 85 శాతం, ఐఐటీల నుంచి 15 శాతం మాత్రమే తీసుకునేది. ‘‘మేం పాత ఐఐటీల నుంచి నియామకాలు బాగా తగ్గించాం. ఎందుకంటే వారు సంస్థలో చేరిన వెంటనే ఇతర కంపెనీలకు వలస పోతున్నారు. అందువల్ల కొత్త ఐఐటీయన్లపై దృష్టి సారించాం’’అని ఈ కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాజేశ్వర్ త్రిపాఠి వ్యాఖ్యానించారు. గతేడాది కంటే 18 శాతం ఎక్కువ వేతనం హైదరాబాద్, గాంధీనగర్, మండీ, భువనేశ్వర్ ఐఐటీల్లోని విద్యార్థులకు కంపెనీలు బేసిక్ వేతనం గత ఏడాది కంటే 18 శాతం ఎక్కువగా ఆఫర్ చేశాయి. హైదరాబాద్, గాంధీనగర్ ఐఐటీల్లో ఈ ఏడాది ఇద్దరు విద్యార్థులకు ఇంటర్నేషనల్ కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేశాయి. గాంధీనగర్‌లో గత సంవత్సరం ఏ ఒక్క విద్యార్థికి ఈ అవకాశం దక్కలేదు. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం శ్యామ్‌సంగ్ ఈ ఏడాది ఇప్పటికే 60 మంది ఐఐటీ విద్యార్థులకు భారీ వేతనాలు ఆఫర్ చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన 24 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్నెట్ అప్ థింగ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా, బయోమెట్రిక్స్ వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐఐటీ విద్యార్థులకు శ్యామ్‌సంగ్ ఉద్యోగాలు ఆఫర్ చేసింది. -
14న జియో క్యాంపస్ ఇంటర్వ్యూలు
తాడితోట (రాజమహేంద్రవరం): ఈ నెల 14న జియో సంస్థ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు రాజీవ్‌గాంధీ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్‌జేడబ్ల్యూ కెనడీ తెలిపారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017–18 సంవత్సరాలలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. రాజీవ్‌గాంధీ కళాశాలతో పాటు ఇతర కళాశాలల్లో డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చునని తెలిపారు. ఆన్లైన్ పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారని వివరించారు. సమావేశంలో జియో హెచ్ఆర్ ధామస్, లోకల్ మేనేజర్ మహ్మద్ నాజిర్, ఫైనాన్స్ పీఎస్ఎం శ్రీనివాసరావు, రాజీవ్‌గాంధీ కళాశాల సిబ్బంది జోన్స్, రమేష్, శైలజ పాల్గొన్నారు. -
ఐటీ సంస్థల చలో క్యాంపస్!
బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల్లో మళ్లీ ఫ్రెషర్స్ నియామకాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్య స్థాయి కంపెనీలైన మైండ్‌ట్రీ, జెన్సర్, హెక్సావేర్ తదితర సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఒక్కో సంస్థ సుమారు వెయ్యి మంది దాకా ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నాయి. మైండ్‌ట్రీ గత ఆర్థిక సంవత్సరంలో 1,285 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. ఈ సారి సంఖ్య అంతకు మించి ఉండగలదని మైండ్‌ట్రీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. గతేడాది 1,000 మంది దాకా ఫ్రెషర్స్‌ను తీసుకున్న జెన్సర్.. ఈ ఏడాది అదే స్థాయిలో లేదా అంతకు మించి రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోంది. తామూ క్యాంపస్ నియామకాలను పెంచుకుంటున్నట్లు, ఇప్పటికే 500 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు హెక్సావేర్ వర్గాలు తెలిపాయి. పెద్ద కంపెనీలు మాత్రం అంతగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ వైపు చూడటం లేదు. అవసరానికి తగ్గట్లుగా వివిధ విభాగాల్లో అల్లుకుపోగలిగే చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలే ఫ్రెషర్స్‌పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. దీంతో గతంలో అంత కాకపోయినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మళ్లీ ఫ్రెషర్స్ నియామకాలు ఉంటున్నాయని మైండ్‌ట్రీ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ ఖన్నా తెలిపారు. 2014–15 స్థాయితో పోలిస్తే 60–70% హైరింగ్ ఉంటోందని చెప్పారు. డిజిటల్ నైపుణ్యాలపై దృష్టి ... మధ్య స్థాయి ఐటీ కంపెనీల ఆదాయాల్లో సగటున 40 శాతం వాటా డిజిటల్ వ్యాపారం నుంచే ఉంటోంది. దీంతో అవిæప్రధానంగా డిజిటల్ నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర డిజిటల్ కోర్సుల్లో సర్టిఫికేషన్ ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇది గుర్తించిన కాలే జీలు.. డిజిటల్ నైపుణ్యాలపై పట్టు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నివేదిక ప్రకారం మధ్య స్థాయి ఐటీ సంస్థల్లో 33–35 శాతం సిబ్బంది డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందిన వారు ఉంటున్నారు. అదే చిన్న స్థాయి కంపెనీల్లోనైతే ఇది 38 శాతంగా ఉంటోంది. మరోవైపు, ఐటీ కంపెనీలు సిబ్బంది వినియోగ స్థాయిని కూడా క్రమంగా పెంచుకుంటున్నాయి. దీంతో బెంచ్ సిబ్బంది సంఖ్య 18 శాతానికి తగ్గింది. వనరుల వినియోగం అయిదు శాతం మేర పెరిగింది. దేశీ ఐటీ–బీపీఎం పరిశ్రమ విలువ 167 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7–9 % వృద్ధి చెందగలదని అంచనా. ఇది 10–12% ఉంటుందని 2016–17లో నాస్కామ్ అంచనా వేసినప్పటికీ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో వాటిని సవరించక తప్పలేదు. ఐటీ రంగంలో సుమారు 4,00,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. కొన్నాళ్లుగా ఉద్యోగాల కల్పన వృద్ధి మాత్రం మందగించింది. గతేడాది ఐటీ లో నికరంగా లక్ష మంది సిబ్బంది తోడైనట్లు అంచనా. -
తగ్గిన క్యాంపస్ జాబ్స్.. 101 కాలేజీల మూసివేత
న్యూఢిల్లీ : ప్రాంగణ నియమాకాలు తగ్గడం, కళాశాలల్లో సీట్ల మిగులు పెరగడంతో 2017-18 సంవత్సరానికి గాను స్వచ్ఛంద మూసివేతకు అనుమతి ఇవ్వాల్సిందిగా దేశ వ్యాప్తంగా దాదాపు 100 మేనేజ్మెంట్ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నట్లు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) తెలిపింది. జాతీయ సాంకేతిక విద్య సమాఖ్య(ఏఐసీటీఈ) వివరాల ప్రకారం మేనేజ్మెంట్ కోర్సులైన ఎంబీఏ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ కోర్సును అందించే ఈ 101 బిజినెస్ స్కూల్స్‌లో అత్యధిక భాగం ఉత్తరప్రదేశ్ (37)కు చెందినవి కాగా తరువాతి స్థానాల్లో కర్ణాటక (10), మహారాష్ట్ర (10) నిలిచాయి. ఈ దరఖాస్తుల్లో ఎక్కువ శాతం కళాశాలలు మూసివేతకు అనుమతి పొందుతాయని అధికారులు తెలిపారు. ఏఐసీటీఈ నివేదికి ప్రకారం 2015-16 సంవత్సరంలో 66 కళాశాలలు, 2016-17లో 76 మేనేజ్మెంట్ సంస్థలు మూతపడినట్లు వెల్లడించారు. కారణాలు ఇవే... ‘కొన్నాళ్ల కిందట మేనేజ్మెంట్ విద్య ఐఐఎమ్‌ల్లో, కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ మార్కెట్లో మేనేజ్మెంట్ కోర్సులు చదివిన విద్యార్థులకు డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో మేనేజ్మెంట్ కళాశాలను ఏర్పాటు చేసింది. కానీ సరైన వసతులు, ప్రావీణ్యం కల అధ్యాపకులను నియమించడంలో వెనకబడింది. దాంతో ప్రాంగణ నియమాకలు తగ్గాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 3వేల సాంకేతిక, మేనేజ్మెంట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో చాలా కళాశాలలు కనీస నిబంధనలను కూడా పాటించడం లేదు. విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించడంలో విఫలమవుతున్నాయి. దాంతో ఏటా ప్రాంగణ నియమాకాలు తగ్గిపోతున్నాయి. 2016-17 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 1.50 లక్షల మంది ఎంబీఏ పట్టభద్రులు మాత్రమే ప్రాంగణ నియమాకాల ద్వారా ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం మూతపడనున్న 101 కాలేజీల వల్ల 10 వేల సీట్లు తొలగించబడతాయి. ఇవేకాక మరికొన్ని సంస్థలు కేవలం మేనేజ్మెంట్ కోర్సులను మాత్రమే రద్దు చేయాల్సిందిగా ఏఐసీటీఈని కోరాయి. ఫలితంగా మరో 11 వేల సీట్లు తొలగించబడతాయ’ని ఏఐసీటీఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ స్పందన... ప్రాంగణ నియామకాలు లేకపోవడమే కళాశాలల మూసివేతకు ప్రధాన కారణమని ఏఐసీటీఈ చైర్మన్ ఎస్ఎస్ మంథ తెలిపారు. కళాశాలల మూసివేతను ప్రభుత్వం పెద్ద సమస్యగా భావించడం లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్ సుబ్రమణ్యం అన్నారు. ‘నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాలలు స్వచ్ఛందగా మూతబడటం మంచి విషయమే. ఎందుకంటే ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించాలనుకుంటుంది. దానికి నంబర్లతో పనిలేదు. విద్యాప్రమాణాలను పెంచడం కోసం ప్రభుత్వం నూతన విధానాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా కళాశాలల గుర్తింపు కోసం మెనటర్‌షిప్ విధానాన్ని, విద్యార్థుల కోసం ఇండక్షన్ కార్యక్రమాలను రూపొందించింది. విద్యార్థులకు, పరిశ్రమకు మధ్య వారధి నిర్మించి అర్హులైన వారి ఉపాధి కల్పనకు ప్రభుత్వ కృషి చేస్తుంద’ని చెప్పారు. -
రూ.52 లక్షల వార్షిక వేతనం!
కోజికోడ్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–కోజికోడ్ (ఐఐఎం–కే) విద్యార్థులను భారీ ఆఫర్స్ వరించాయి. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఓ విద్యార్థికి అత్యధికంగా ఏడాదికి రూ.52లక్షల వేతనం ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు రాగా మొత్తం విద్యార్థుల సరాసరి వేతనం రూ.17.76 లక్షలుగా ఉందని ఐఐఎం(కే) ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది 382 మంది విద్యార్థుల బ్యాచ్‌లో అత్యధికంగా 367 మందిని డెలాయిట్, బీసీజీ, ఈవై, గోల్డ్‌మన్ సాక్స్, పీడబ్ల్యూసీ, ఆర్థర్ డీ లిటిల్, జేపీ మోర్గాన్ చేజ్ వంటి ప్రముఖ సంస్థలు ఎంపిక చేసుకున్నాయని తెలిపింది. మిగతా వారిలో 11 మంది ప్లేస్మెంట్ ప్రక్రియలో పాల్గొనలేదనీ, నలుగురు మాత్రం ఎంపిక కాలేదని వెల్లడించింది. ఈ ఏడాది క్యాంపస్ ఎంపికలకు అత్యధికంగా 178 కంపెనీలు పాల్గొన్నాయనీ, ఇది గత ఏడాది కంటే 58శాతం ఎక్కువని ఐఐటీ–కే తెలిపింది. -
విద్యార్థి చెంతకే ఉద్యోగం
కామారెడ్డి టౌన్ : ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది యువతను చూస్తున్నాం. ఉద్యోగం కోసం వివిధ రాష్ట్రాలలో ఇంటర్వూ్యలకు వెళ్లిన జాబ్‌లు రానివారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రస్తుతం ప్రాంగణ నియామకాలతో డిగ్రీ చేస్తుండగానే చాలా మంది యువత ఉద్యోగం సాధిస్తున్నారు. కళాశాలలకే ప్రముఖ కంపెనీలు వచ్చి ఉద్యోగ అవకాశాలను డిగ్రీ విద్యార్థులకు కల్పిస్తున్నారు. కళాశాలకు చెంతకే వచ్చి ఇంటర్వూ్యలు నిర్వహించి జాబ్లకు ఎంపికచేసుకుంటున్నారు. కామారెడ్డిలోని సాందీపని డిగ్రీ కళాశాలలో మూడేళ్లుగా 220 మంది వరకు ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాలు సాధించారు. డిగ్రీ చేస్తుండగానే జాబ్ డిగ్రీ ఫైనలియర్ చేస్తుండగానే చాలా మంది యువత జాబ్‌లను కొట్టేస్తున్నారు. ఇన్ఫోసిస్, హిందూజా గ్రూప్, ఎలికో హెల్త్‌కేర్, జెన్‌ప్యాక్ట్, స్మార్ట్‌నెట్ ఐటీ సొల్యూషన్స్, ఐకేఎస్, హెల్త్‌కేర్, ఈ–ప్రాంటస్, టెక్ మహీంద్ర లాంటి ప్రముఖ కంపెనీల డైరెక్టర్లు, ప్రతినిధులు నేరుగా కళాశాలలకు వచ్చి ఇంటర్వూ్యలను నిర్వహించారు. ఇప్పటివరకు డి గ్రీ ఫైనలియర్ చేస్తున్న 2 వేలకు పైగా డిగ్రీ విద్యార్థులకు సాందీపని కళాశాలలో ఇంటర్వూ్యలు నిర్వహించి వీరిలో 220 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. భాషా నైపుణ్యం, స్కిల్స్, కం ప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వందల మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు హాజరవు తూ ఉద్యోగాలను సాధించుకుంటున్నారు. చిన్న వయస్సుల్లోనే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల చుట్టూ తిరగకుండానే ఉద్యోగం డిగ్రీ ఫైన్లియర్ చేస్తున్నాను. డిగ్రీ పూర్తికాగానే ఉద్యో గం వస్తుందో రా దోనని భయపడేదాన్ని. కానీ కళాశాల ప్రాంగణ నియామకాలతో చదువుతుండగానే ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. – దివ్య, బీఎస్సీ బీజెడ్సీ, లింగన్నపేట, సిరిసిల్ల జిల్లా సద్వినియోగం చేసుకోవాలి ప్రాంగణ నియామకాలతో డిగ్రీ ఫైనలియర్ చేస్తుండగానే ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఆ యా రాష్ట్రాల నుంచి ప్రముఖ కంపెనీ లు వచ్చి ఇంటర్వూ్యలు చేసి ఉద్యోగా లు ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – బాలాజీరావు, సాందీపని కళాశాల డైరెక్టర్, కామారెడ్డి చాలా సంతోషంగా ఉంది నాకు టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర్ టెక్సీషియన్గా ఉద్యోగం వచ్చింది. కంపెనీవారు కళాశాలకే వచ్చి ఇంటర్వూ్యలో ప్రతిభను గుర్తించి ఉద్యోగాలిస్తున్నారు. డిగ్రీలోనే ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు. –పి.సింధు, ఎంఎస్‌టీసీఎస్, కామారెడ్డి డిగ్రీలోనే ఉద్యోగం సాందీపనిలో డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ ఫైనలియర్ ఉండగానే ప్రాంగణ నియామకాల్లో టెక్ మహేంద్రలో కంపెనీలో ఉద్యోగం వచ్చింది. డిగ్రీలోనే ఉద్యోగం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. – జాకీర్, బీకాం సీఏ, రామాయంపేట -
ఉజ్వల భవిష్యత్‌కు భరోసా
కాజీపేట అర్బన్: వరంగల్ నిట్ క్యాంపస్ నుంచే చక్కని ఉద్యోగావకాశాలను సొంతం చేసుకునేందుకు ఓ విద్యార్థి నడుంబగించాడు. ఉన్నత విద్య, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు నిష్ణాతులచే సలహాలు సూచనలు అం దించేందుకు సరికొత్తగా నిట్ వరంగల్ కెరీర్ సెల్ ను ఏర్పాటు చేసి ఔరా అన్పించుకున్నాడు. నిట్‌లోని కెమికల్ వి భాగంలో మూడో సంవత్సరం చదువుతున్న ప్రశాంత్ రాంశెట్టి స్టూడెంట్ కౌన్సిల్ సౌజన్యంతో నిట్ వరంగల్ కెరీర్ సెల్‌ను ప్రారంభించాడు. కౌన్సిల్ ప్రధాన కార్యదర్శిగా విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు పరిష్కరిస్తూ బాసటగా నిలుస్తున్నాడు. జనవరి 18న కెరీర్ సెల్ ప్రారంభమై విద్యార్థుల సేవలో దూసుకుపోతోంది. ఎస్ఎంపీతో అవగాహన సదస్సు... స్టూడెంట్ మెంటర్షిప్ ప్రోగ్రాం పేరిట వివిధ కళాశాల్లో ఉన్నత విద్య, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు గాను సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. క్యాంపస్ ఇంటరŠూయ్వల ద్వారా ఎంపికైన వారితో సందేశాలు ఇప్పిస్తున్నాడు. ప్రపంచంలోనే ప్రాచుర్యం పొందిన గ్లాస్ మార్ట్ కంపెనీ సెయింట్ గోబెన్కు ఎంపికైన అక్షిత, మయంక్ నిట్‌లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. మన్హతన్ రివ్యూ పేరిట జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్లో విజయం సాధించి పీజీ, పీహెచ్డీ, ఎంబీఏలో అవకాశం సాధించేందుకు నినిపుణులచే సలహాలు ఇప్పిస్తున్నాడు. స్టూడెంట్ సపోర్ట్ సర్వీస్ వరంగల్ నిట్‌లో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి స్టూడెంట్ సపోర్ట్ సర్వీస్‌ను రూపొందించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు సీనియర్లచే బోధిస్తున్నారు. రీసెర్చ్ మెథడాలజీ పేరిట నూతన పరిశోధనలపై మెళకువలను నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు పవర్‌పాయింట్ ప్రెజ ంటేషన్ ఇస్తున్నారు. కెరీర్ సెల్ ద్వారా ‘ఇండిస్పెన్సెబుల్ రీసెర్చ్ టూల్స్’ పేరిట నిట్ పూర్వవిద్యార్థి డాక్టర్ కోటేశ్వర్‌రెడ్డి ఆన్లైన్లో సలహాలు అందిస్తున్నారు.. దుబాయ్ నుంచి స్కైప్ యాప్ సాయంతో ఆధునిక యంత్రాలపై అవగాహన కల్పించారు. అవకాశాలు కల్పిస్తాం.. నిట్ వరంగల్స్ కెరీర్ సెల్ ద్వారా విద్యార్థులకు వివిధ రంగాల్లో అవకాశాలు అందించేందుకు కృషి చేస్తున్నా. వేసవి సెలవుల్లో ఐఐటీ ముంబాయి, ఢిల్లీకి వెళ్లాను. అక్కడ కెరీర్ సెల్, ఎస్‌ఎంపీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సేవలందిస్తున్నారు. వరంగల్ నిట్‌లో సైతం అటువంటి వేదికను రూపొందించా. ఆన్లైన్లో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తున్నా. ఉన్నత విద్య, ఐఏఎస్, యూపీఎస్సీలపై అవగాహన అందించేందుకు కెరీర్ సెల్ తోడ్పడుతుంది. సాయంత్రం వేళ్లల్లో నిట్ డైరెక్టర్, స్టూడెంట్ కౌన్సిల్ ప్రోత్సాహంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. – ప్రశాంత్ రాంశెట్టి, నిట్ విద్యార్థి,ఎస్ఎంపీ, కెరీర్ సెల్ వ్యవస్థాపకుడు -
ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు తగ్గాయి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు గతేడాది 4.94 శాతం తగ్గాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 17 ఐఐటీల్లో 2014–15లో ప్లేస్మెంట్ల శాతం 72.82 అని, ఇది 2015–16లో 75.79కి పెరగ్గా 2016–17లో 70.85 శాతానికి తగ్గిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ గురువారం పార్లమెంట్లో వెల్లడించారు. ‘ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు పెరగడం, తగ్గడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు; విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యమివ్వడం; ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్‌ల వైపు దృష్టి సారించడం వంటి కారణాలతో ఈ పరిస్థితి నెలకొంది’ అని రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉండగా వాటిలో ఆరు ఐఐటీలు 2014–15, 2015–16 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో మిగిలిన 17 ఐఐటీల్లో మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్లు జరుగుతున్నాయి. -
ఐఐటీ పాట్నా విద్యార్థికి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబయి: ఐఐటీల్లో ప్లేస్మెంట్లు ఊపందుకోవడంతో నూతనంగా ఏర్పాటైన ఐఐటీలకూ ఆఫర్లు, భారీ వేతన ప్యాకేజ్లతో రిక్రూటర్లు ముందుకొస్తున్నారు.గత ఏడాదితో పోలిస్తే నూతన ఐఐటీల్లోనూ అభ్యర్థులకు కంపెనీలు ఆఫర్ చేస్తున్న సగటు వేతనాలు భారీగా పెరిగాయి. నూతన ఐఐటీల్లో సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్ ఇప్పటివరకూ అత్యధికంగా రూ 39.13 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసింది. ఐఐటీ పాట్నాకు చెందిన విద్యార్థి ఈ భారీ వేతన ప్యాకేజ్‌ను అందుకున్నాడు. 2008-2009లో ఇండోర్, గాంధీనగర్, పాట్నా, మండీల్లో ప్రారంభమైన నూతన ఐఐటీలు ఈ ఏడాది మరికొన్ని దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నాయి. దీంతో గత ఏడాదికి మించి ఎక్కువ మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్లు దక్కనున్నాయి. సగటు వేతనాల్లోనూ 6నుంచి 17 శాతం వరకూ వృద్ధి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది తాము ప్లేస్‌మెంట్స్ కోసం మరిన్ని కంపెనీలను సంప్రదిస్తున్నామని, గతేడాది 47 కంపెనీలు క్యాంపస్‌ను సందర్శిస్తాయని ఐఐటీ పాట్నా ట్రైనింగ్, ప్లేస్మెంట్ సెల్ ఇన్చార్జ్ అమర్నాథ్ హెగ్డే చెప్పారు.ఐఐటీ పాట్నా ఇప్పటికే తన బ్యాచ్‌లోని 65 శాతం మందికి పైగా అభ్యర్థులకు 117 ఆఫర్లను దక్కించుకుంది. ఐఐటీ మండీలో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల్లో 70 శాతం మందికి కొలువులు లభించాయని తెలిపారు. ఐఐటీ గాంధీనగర్ క్యాంపస్‌ను ఇప్పటి వరకూ గతేడాదితో పోలిస్తే 50 శాతం అధికంగా కంపెనీలు విజిట్ చేశాయని, జాబ్ ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని కెరీర్ డెవలప్మెంట్ హెడ్ అభయ్ రాజ్ గౌతమ్ చెప్పారు. గతేడాది రూ ఏడు లక్షల సగటు వేతనం నుంచి ప్రస్తుతం రూ 7.45 లక్షలకు సగటు వేతనం పెరిగిందని తెలిపారు. ఐఐటీ ఇండోర్‌లోనూ రూ 17 లక్షల సగటు వార్షిక వేతనంతో ఇప్పటికే 74 ఆఫర్లు వచ్చాయి. తొలి దశలో నమోదు చేసుకున్న విద్యార్థులందరికీ ప్లేస్మెంట్ లభించిందని ఐఐటీ ఇండోర్ ప్రతినిధి నిర్మలా మీనన్ చెప్పారు. -
విద్యార్థుల ’సాఫ్ట్వేర్’ ఆశలు ఆవిరి
-
ఐటీ 'కల'కలం
సాక్షి, హైదరాబాద్ : ఎంతో ఆశతో ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థుల ‘ఐటీ’ కలలు కల్లలవుతున్నాయి. చదువు పూర్తికాగానే ఉద్యోగం, మంచి వేతనం వస్తుందన్న ఆశలు కళ్ల ముందే కుప్పకూలుతున్నాయి. ఐటీ కంపెనీలు కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు తగ్గించేయడం, కొన్ని సంస్థలు అసలు నియామకాల ఊసే ఎత్తకపోతుండటంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. గతేడాది దాకా క్యాంపస్ నియామకాల్లో పెద్ద సంఖ్యలోనే విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, ఒరాకిల్, డెలాయిట్, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు ఈ ఏడాది ఒక్కో కాలేజీలో ఐదారుగురికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాయి. ప్రముఖ అమెరికన్ కంపెనీ కాగ్నిజెంట్ అయితే ఈ ఏడాది దేశంలో ఒక్క విద్యార్థికి కూడా ఉద్యోగం ఇవ్వకపోవడం గమనార్హం. మరో అమెరికన్ కంపెనీ యాక్సెంచర్ గతేడాదితో పోలిస్తే ఈసారి 50 శాతం మేర నియామకాలు తగ్గించుకుంది. దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు అదే దారిలో పయనిస్తున్నాయి. విప్రో, క్యాప్‌జెమినీ కంపెనీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వెయ్యి మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు ఇచ్చాయి. పాతిక కాలేజీల్లోనే క్యాంపస్ నియామకాలు! ఐటీ కంపెనీలు ఏటా రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం, తిరుపతిలలో ఉన్న సుమారు వంద కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు జరుపుతుంటాయి. కానీ ఈ ఏడాది కేవలం 25 కాలేజీల్లోనే క్యాంపస్ నియామకాలు చేపట్టాయి. ఇన్ఫోసిస్ కేవలం 15 కాలేజీలకే పరిమితంకాగా.. టీసీఎస్ 22 కాలేజీలు, విప్రో, క్యాప్‌జెమినీ కంపెనీలు హైదరాబాద్‌లోని పది కాలేజీలతో సరిపెట్టాయి. ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీయూ, సీబీఐటీ, వాసవి తదితర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా నియామకాలు చేపట్టే మైక్రోసాఫ్ట్ కంపెనీ.. ఈ ఏడాది వాటి జోలికే పోలేదు. కేవలం హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ నిట్లకు చెందిన పది మంది విద్యార్థులకు మత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. సీబీఐటీ, వాసవి కాలేజీల్లో అత్యంత ప్రతిభావంతులైన నలుగురైదుగురు విద్యార్థులను, అది కూడా ఇంటర్న్‌షిప్ కింద ఎంపిక చేసుకుంది. ఏటా 50 నుంచి వంద మంది విద్యార్థులను ఎంపిక చేసుకునే డెలాయిట్ సంస్థ కూడా ఈసారి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇక దేశీయ కంపెనీలు గతేడాదితో పోలిస్తే 60 శాతం మేర నియామకాలు తగ్గించుకున్నాయి. ఆందోళనలో విద్యార్థులు ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మంది.. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లోనే చేరారు. కానీ ఐటీ కంపెనీలు పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటుడటంతో వారు ఆందోళనలో మునిగిపోయారు. సీబీఐటీలో గతేడాది 1,350 మందికి వివిధ కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేయగా.. ఈసారి ఆ సంఖ్య 750కి లోపేకావడం గమనార్హం. వాసవి, ఎంవీఎస్ఆర్, విజ్ఞానజ్యోతి, నారాయణమ్మ, శ్రీనిధి వంటి టాప్ కాలేజీల్లోనూ ఈ ఏడాది నియామకాలు 60 శాతం మేర తగ్గాయి. గతేడాది హైదరాబాద్‌లో 40–50 కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్ తదితర సంస్థలు ఈ ఏడాది కేవలం పది కాలేజీలకు పరిమితమయ్యాయి. ఉన్న ఉద్యోగులకే ఉద్వాసన! వివిధ ఐటీ సంస్థలు ఈ ఏడాది దాదాపు 56 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా.. వచ్చే ఆర్నెల్లలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్స్‌పెరీస్ ఐటీ–మ్యాన్‌పవర్‌గ్రూప్ ఇండియా’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అటు సీనియర్ ఉద్యోగుల తొలగింపుతోపాటు కొత్త ఉద్యోగాల కల్పన ప్రక్రియలో క్షీణత నమోదవుతున్నట్లు తేలింది. ఐటీ పరిశ్రమలోని ఈ మందగమనంతో.. స్టార్టప్‌లు, ఐటీ ఉత్పత్తులు, సర్వీస్ సంస్థలపై ప్రభావం పడుతుందని సర్వే నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దేశంలోని ఐటీ ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోకపోవడం ఉద్యోగాల తొలగింపునకు కారణమవుతోంది. అదే నైపుణ్యమున్న ఉద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సాఫ్ట్వేర్ నైపుణ్యాలు కలిగిన వారికి 29 శాతం, బిగ్ డేటా అండ్ అనలిస్ట్‌లకు 22 శాతం, మెషీన్ లెర్నింగ్, మొబిలిటీలకు 12 శాతం చొప్పున, గ్లోబల్ కంటెంట్ సొల్యూషన్లలో నైపుణ్యం ఉన్న వారికి 10 శాతం మేర అదనంగా అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నైపుణ్యం పెంచుకోవాల్సిందే.. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్లుగా నైపుణ్యాలను పెంపొందించుకుంటే... అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని ఎక్స్‌పెరీస్ సంస్థ అధ్యక్షుడు మన్మీత్సింగ్ పేర్కొన్నారు. ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రపంచం ‘డిజిటల్ వరల్డ్’గా పరివర్తన చెందుతున్న దశలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అత్యంత ఆవశ్యకమని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ ఏజీ రావు అభిప్రాయపడ్డారు. ‘నాస్కామ్’ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు. ఆటోమేషనే ప్రధాన కారణం.. ఐటీ కంపెనీలు ఆటోమేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఉద్యోగులను సైతం ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నాయి. దానికితోడు కోడింగ్ బాగా వచ్చిన వారికే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు కేవలం కంప్యూటర్ సైన్స్, ఐటీ విద్యార్థులను మాత్రమే క్యాంపస్ నియామక పరీక్షలకు అనుమతిస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ విద్యార్థులు కోడింగ్‌పై దృష్టి సారిస్తేనే మంచి ఉద్యోగాలు పొందగలుగుతారు. – ఎన్ఎల్ఎన్ రెడ్డి, సీబీఐటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ హైదరాబాద్‌లో గత ఐదేళ్ల క్యాంపస్ నియామకాలు తీరు సంవత్సరం సంస్థలు కాలేజీలు ఉద్యోగాలు 2013 73 79 24,500 2014 69 82 26,300 2015 63 63 19,700 2016 71 55 21,200 2017 56 43 16,700 2018 17 51 3,800 (డిసెంబర్ నాటికి) -
2018లో ఉద్యోగార్ధులు ఖుషీ
సాక్షి,న్యూఢిల్లీ: క్యాంపస్ ప్లేస్మెంట్లు ఊపందుకుంటుడటంతో 2018లో నియామకాల ప్రక్రియ జోరందుకుని జాబ్ మార్కెట్ మునుపటి కళ సంతరించుకుంటుందనే అంచనాలు వెల్లడయ్యాయి.జాబ్ ఆఫర్లు పెరగడంతో పాటు వేతన స్ధాయిలు, భిన్న రిక్రూటర్లు, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ల వంటి అన్ని విభాగాల్లోనూ మెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. అన్ని క్యాంపస్‌లలో జాబ్ ఆఫర్ల ఊపు కొనసాగుతుండటం సానుకూల సంకేతాలు పంపుతోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నియామకాల కోసం 90 ఇంజనీరింగ్ కాలేజ్‌లు, బిజినెస్ స్కూల్స్‌ను ఎంపిక చేసుకుంది. ఐఐటీ బాంబేలో అంతర్జాతీయ ఆఫర్లు 2016లో 50 నుంచి ఈ ఏడాది 60కి పెరగడం గమనార్హం. మరోవైపు అమెరికాకు చెందిన క్లౌడ్ డేటా కంపెనీ రుబ్రిక్, ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు చెందిన ఆప్టివర్, బ్రిటన్ కంపెనీ హల్మా తదితర సంస్థలు తొలిసారిగా భారత్ క్యాంపస్‌లలో నియామకాలు చేపడుతున్నాయి. అమెరికా, యూరప్‌కు చెందిన బహుళజాతి సంస్థలతో పాటు జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్ల నుంచి ఆసియా కంపెనీలు భారత ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ పలు సంస్థలతో కలిసి నిర్వహించన అథ్యయనంలోనూ జాబ్ మార్కెట్లో స్ధబ్థత వీడి ఉత్తేజం నెలకొన్నట్టు వెల్లడైంది. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్స్, కన్సల్టింగ్ రంగాల్లో నియామకాలు ఊపందుకోగా, కాగ్నిజెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, డెలాయిట్, క్యాప్‌జెమిని, విప్రో, అమెజాన్, ఈవై, హెచ్‌సీ టెక్, యాక్సెంచర్, కేపీఎంజీలు టాప్ రిక్రూటర్స్‌గా ఉన్నాయి.మరోవైపు స్టార్టప్‌లు కూడా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్కు దిగుతుండటంతో 2018లో కొలువుల మార్కెట్ కళకళలాడుతుందని భావిస్తున్నారు. -
టెకీలకు గుడ్‌న్యూస్
సాక్షి,చెన్నై: క్యాంపస్ రిక్రూట్మెంట్లతో ఉన్నత విద్యా సంస్థలు కళకళలాడనున్నాయి. ఆర్థిక మందగమనం క్రమంగా తొలగిపోతుండటంతో దిగ్గజ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లతో తాజా నైపుణ్యాలను సమీకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. డిసెంబర్ 1నుంచి ప్రారంభమయ్యే ఐఐటీ మద్రాస్ వార్షిక ప్లేస్‌మెంట్స్‌లో తొలిసారిగా యాపిల్, యూఐడీఏఐ వంటి సంస్థలు పాల్గొననున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న కంపెనీల్లో దాదాపు 15 శాతం సంస్థలు తొలిసారి ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో యూబీఎస్ ఏజీ, నాస్డాక్ స్టాక్ మార్కెట్, అల్వారెజ్,మర్సాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీ గార్డెన్,హల్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సెకిసూ కెమికల్ వంటి దిగ్గజ కంపెనీలున్నాయి. మొత్తం 400 జాబ్ ప్రొఫైల్స్‌తో 270 కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేయించుకున్నాయి. గత ఏడాది ప్లేస్‌మెంట్స్‌లో 250 కంపెనీలు పాల్గొన్నాయి. ఇక ఈ ఏడాది పార్టిసిపెంట్స్‌లో 43 శాతం రిక్రూటర్స్ ఇంజనీరింగ్, ఆర్అండ్డీ నుంచి, 25 శాతం ఫైనాన్స్ రంగం, 32 శాతం కంపెనీలు ఐటీ రంగం నుంచి పాల్గొంటున్నాయి. 2017-18 క్యాంపస్ రిక్రూట్మెంట్ తొలిదశ డిసెంబర్ 1 నుంచి 10 వరకూ జరుగుతుందని ఐఐటీ మద్రాస్ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ 50 స్టార్టప్‌లకు శ్రీకారం చుట్టనుంది. -
ఐఐఐటీ-హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్
ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. తొలిసారి కూపర్టినోకి చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ ఇంక్ భారత్‌లో క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుపడానికి వస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌ను ఐఐఐటీ-హైదరాబాద్‌లో చేపట్టనుంది. ఇప్పటికే బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఎస్సీ(రీసెర్చ్)లో పలు విభాగాలకు చెందిన 350 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ డ్రైవ్‌లో తమ పేర్లను నమోదుచేసుకున్నారు. డిసెంబర్లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. ఆపిల్‌తో పాటు పలు గ్లోబల్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్‌లు కూడా ఈ ప్లేస్మెంట్ డ్రైవ్‌లో పాల్గొననున్నాయి. '' ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్లకు ఆపిల్ రావడం తెలిసి మేము చాలా సంతోషించాం. అయితే ఎలాంటి ప్రొఫైల్స్‌ను కంపెనీ ఆఫర్ చేయనుందో ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది అద్భుత అవకాశం'' అని ఐఐఐటీ-హైదరాబాద్ ప్లేస్మెంట్ల అధినేత టీవీ దేవీ ప్రసాద్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సు, ఆటోమేషన్‌లకు నియామకాలు జరుపుకోవడానికి ఈసారి కంపెనీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఇటీవల భారత్‌కు విచ్చేసిన ఆపిల్ సీఈవో టిమ్ కుక్, భారత్‌లో పెట్టుబడులు పెంచనున్నట్టు తెలిపారు. అంతేకాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సు, ఆటోమేషన్‌లో నియామకాలను ఎక్కువగా చేపట్టనున్నట్టు వెల్లడించారు. -
9న క్యాంపస్ ఇంటర్వ్యూలు
అనంతపురం రూరల్ : పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 9న ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అసెంచర్ క్యాంపస్ ఇంటర్వ్యూలు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. బీటెక్, డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. ఇతర కళాశాలల విద్యార్థులు కూడా హాజరుకావచ్చునని పేర్కొన్నారు. -
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఐదుగురు ఎంపిక
జేఎన్టీయూ : అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రమేష్‌బాబు తెలిపారు. అమెరికన్ స్టాఫింగ్ కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించిందని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అనంతరాముడు, డైరెక్టర్ ఎం.రమేష్ నాయుడు అభినందనలు తెలిపారు. -
రేపు బాలాజీ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ సెలక్షన్స్
హిందూపురం అర్బన్ : పట్టణంలోని పైప్‌లైన్ రోడ్డులో ఉన్న బాలాజీ కళాశాలలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలతో సోమవారం క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీరభద్రప్ప తెలిపారు. సెలక్షన్లో సాఫ్ట్వేర్ డెవలప్ కంపెనీలు ఇంటర్సోగ్ ఆటోమెటిక్ టెస్టీంగ్ గ్రూప్, పీర్ జంక్షన్ సొల్యూషన్స్, డేమర్ రీసర్చ్ అండ్ కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు చేపడుతారని వివరించారు. బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఎ, ఎమ్మెస్సీ, ఎంకాం, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ, బీబీఎం తదితర డిగ్రీలు ఉన్న వారు హాజరు కావాలన్నారు. ఇంటర్వ్యూలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారని చెప్పారు. వివరాలకు 73967 11803, 99592 48359, 94413 81867 నంబర్లు సంప్రదించాలని సూచించారు. -
క్యాంపస్ ఇంటర్వ్యూలో 8 మంది ఎంపిక
జేఎన్టీయూ : అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో స్పందన స్ఫూర్తి ఫైనాన్సియల్ సర్వీసెస్ శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 8 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అనంతరాముడు, డైరెక్టర్ ఎం.రమేష్ నాయుడు అభినందించారు. -
నేడు క్యాంపస్ ఇంటర్వ్యూలు
జేఎన్టీయూ : అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్‌బాబు తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. రేస్టర్ టెక్నాలజీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందన్నారు. -
క్యాంపస్ ఇంటర్వూ్యల్లో 13 మంది ఎంపిక
గుత్తి : పట్టణంలోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో లక్నోకు చెందిన సీ – కోర్ ఇండియా టెక్నో సొల్యూష¯Œ్స సాఫ్ట్వేర్ కంపెనీ శుక్రవారం ఎంబీఏ, బీటెక్ ఫైనలియర్ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వూ్యలు నిర్వహించింది. 13 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఇందులో ఎంబీఏ విద్యార్థులు ముగ్గురు, బీటెక్ విద్యార్థులు 10 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కంపెనీ హెచ్ఆర్ ప్రదీప్వర్మ మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపిౖకెన ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి రూ.2.4 లక్షల వేతనం ఇస్తామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను గేట్స్ కరస్పాండెంట్ వీకే సుధీర్‌రెడ్డి, డైరెక్టర్లు వీకే పద్మావతి, వీకే వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమల్లేశ్వరరావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రతాప్‌రెడ్డి, పీడీ జోయెల్ అభినందించారు. -
13 రోజుల్లోనే వేయి ఉద్యోగాలు
కోల్‌కతా: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జరుగుతున్న తొలిదశ ప్రాంగణ నియామకాల్లో కేవలం 13 రోజుల్లోనే వేయి మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. 44 ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు సహా దేశవిదేశాల నుంచి సుమారు 175 కంపెనీలు ఈసారి క్యాంపస్ రిక్రూట్మెంట్లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ఏడు పీఎస్‌యూలు 44 మందిని నియమించుకున్నాయి. కోల్ఇండియా అత్యధికంగా 26 మందిని ఎంపికచేసుకుంది. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, స్ప్రింక్లర్, డెల్టాలాంటి అంతర్జాతీయ కంపెనీలు 24 మందికి ఉద్యోగాలిచ్చాయి. ఈ ఏడాది కోర్ ఇంజినీరింగ్ విభాగంలో ఎక్కువ మంది ఎంపికయ్యారని ఐఐటీ కెరీర్ డెవలప్మెంట్ కేంద్రం చైర్మన్ ప్రొ.దేవశిశ్ దేవ్ చెప్పారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఈ రంగంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 20 శాతం పెరిగిందని, మొత్తంగా శాంసంగ్ అత్యధికంగా 47 మందిని తీసుకుందని తెలిపారు. -
ఐఐటీలో చదివినా.. ఆఫర్లు రావట్లేదు!
ఈసారి క్యాంపస్ రిక్రూట్మెంట్ల కోసం చాలా కంపెనీలు ఐఐటీలకు వెళ్లాయి. కానీ, గత సంవత్సరంతో పోలిస్తే ఆ కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు మాత్రం చాలా తగ్గిపోయాయి. ఐఐటీ బాంబేలో గోల్డ్‌మన్ సాక్స్ కంపెనీ గత సంవత్సరం 16 మందిని తీసుకోగా, ఈసారి 13 మందినే తీసుకుంది. అలాగే బీసీజీ అనే కన్సల్టింగ్ సంస్థ గత సంవత్సరం తొమ్మిది మందికి అవకాశం ఇస్తే, ఈసారి నలుగురినే ఎంచుకుంది. ఈసారి ఎనలిటిక్స్ రంగం నుంచి ఎక్కువ ఆఫర్లు వచ్చాయంటున్నారు. గోల్డ్‌మన్ సాక్స్, జేపీ మోర్గాన్ లాంటి కంపెనీలు సాధారణంగా కోర్ ఫైనాన్స్ ప్రొఫైల్స్ నుంచే ఎక్కువ మందిని తీసుకుంటాయి. కానీ, ఈసారి వాళ్లు కూడా ఎనలిటిక్స్‌లోకే ఎక్కువగా తీసుకున్నారు. డచ్ బ్యాంక్, ఫ్లో ట్రేడర్స్ లాంటి కంపెనీలు మాత్రమే కోర్ ఫైనాన్స్ ఉద్యోగాలు ఆఫర్ చేశాయని, మిగిలినవి తీసుకున్నవే తక్కువైనా, అవి కూడా ఎనలిటిక్స్‌లోకే తీసుకున్నాయని ఓ విద్యార్థి చెప్పాడు. ఈ తరహా కంపెనీలకు ఎక్కువగా ఫైనాన్స్ ఉద్యోగాల కోసమే వెళ్తారని, కానీ వాళ్లు కూడా సాఫ్ట్వేర్, కోడింగ్ విద్యార్థులను అడుగుతున్నారని మరో విద్యార్థి తెలిపాడు. ఏఎన్‌జడ్, యాక్సిస్, సిటీఫైనాన్స్ లాంటి బ్యాంకులు కూడా తమకు ఎక్కువగా ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు అక్కర్లేదు గానీ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, స్టాటస్టికల్ మోడలింగ్ వచ్చినవాళ్లు కావాలంటున్నాయి. ఒక్కసారిగా ఆఫర్లు తగ్గిపోవడంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థులు నీరసించిపోయారు. ఇక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కూడా బిగ్ డేటా ఎనలిటిక్స్ రంగంలో 10 శాతం వృద్ధి కనిపించింది. ఈ రోజుల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే ఎక్కువగా డేటా ఎనలిటిక్స్ మీదే ఆధారపడుతున్నారని, నిర్ణయాలన్నింటికీ డేటాయే ఆధారమని ఓ ప్లేస్మెంట్ రిప్రజెంటేటివ్ తెలిపారు. ఇప్పుడు ఈ రంగంలో రిక్రూట్మెంట్లు బాగా పెరిగాయని, ఇంతకుముందు సాధారణ బిజినెస్ ఎనలిటిక్స్ రంగంలో మాత్రమే తీసుకునే సంస్థలు కూడా ఇప్పుడు డేటా ఎనలిటిక్స్ నిపుణుల కోసం చూస్తున్నాయన్నారు. దాంతోపాటు కోడింగ్ కూడా వచ్చి ఉంటే బంపర్ చాన్సులు వస్తున్నాయట. సాధారణంగా జేపీ మోర్గాన్ సంస్థ ఇన్నాళ్లూ కేవలం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలోనే ఉద్యోగాలు ఇచ్చేది గానీ, ఇప్పుడు మాత్రం అది కేవలం డేటా రోల్స్‌లోకి మాత్రమే తీసుకుంటోంది. చాలా కంపెనీలు ఇప్పుడు డేటా ఎనలిటిక్స్ ప్రొఫైల్స్ కావాలనే అడుగుతున్నాయని, అందువల్ల విద్యార్థులు ఈ రంగంలో ఎక్కువగా దృష్టిపెట్టాలని ఐఐటీ మద్రాస్‌లో ప్లేస్మెంట్ ఇన్చార్జి అయిన ప్రొఫెసర్ మను సంతానం తెలిపారు. కంపెనీలు డేటా ఎనలిటిక్స్ రోల్స్ అడుగుతున్నాయని, కానీ విద్యార్థులకు దాని గురించే తెలియపోవడంతో రిక్రూట్మెంట్లు తగ్గాయని వివరించారు. ఐఐటీ రూర్కీలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా రిక్రూట్మెంట్లు బాగా తగ్గిపోయాయి. వస్తున్న కంపెనీల సంఖ్య బాగానే పెరిగింది గానీ, వాళ్లు తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య మాత్రం బాగా తగ్గిందని అక్కడి ప్లేస్మెంట్ ఇన్చార్జి ప్రొఫెసర్ ఎన్పీ పాదీ చెప్పారు. -
అక్కడ.. క్యాంపస్ నియామకాల జోరు
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అమెరికా వీసా విధానం మరింత బిగుసుకునే ప్రమాదం కనిపిస్తుండటంతో.. భారత ఐటీ కంపెనీలు అక్కడ క్యాంపస్ నియామకాల జోరు పెంచాయి. దాంతోపాటు అమెరికాలో ఉన్న చిన్న చిన్న ఐటీ కంపెనీలను కొనేస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు చాలా కాలంగా ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు హెచ్1-బి వీసాలు ఇప్పించి వాళ్లను అమెరికా, ఇతర దేశాలలోని క్లయింట్ లొకేషన్లకు తాత్కాలికంగా పంపుతున్నాయి. 2005-14 సంవత్సరాల మధ్య కేవలం ఈ మూడు కంపెనీల నుంచే హెచ్1-బి వీసాలు తీసుకున్నవాళ్లు దాదాపు 86వేల మంది ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ అధికారం చేపడుతుండటంతో.. చాలా కాలం నుంచి ఆయన చెబుతున్న మాట ఐటీ కంపెనీల్లో గుబులు పుట్టిస్తోంది. చాలా కాలంగా వీసా విధానాన్ని విమర్శిస్తున్న సెనెటర్ జెఫ్ సెషన్స్‌ను అటార్నీ జనరల్‌గా కూడా ఆయన ఎంచుకున్నారు. దాంతో అమెరికా వీసాల విషయంలో రక్షణాత్మక విధానాన్ని అవలంబిస్తుందని భావిస్తున్నారు. అయితే.. ఇక్కడివాళ్లు అనవసరంగా ఇమ్మిగ్రేషన్ విషయంలో బాగా నిపుణులైన తాత్కాలిక ఉద్యోగుల గురించి భయపడుతున్నారని, ఎందుకంటే తాము కేవలం కొన్నాళ్ల పాటు మాత్రమే ఇక్కడ ఉండి పనిచేస్తామని ఇన్ఫోసిస్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న ప్రవీణ్ రావు తెలిపారు. ఇప్పుడు హెచ్1-బి వీసాలను నియంత్రించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతో.. అమెరికాలోనే క్యాంపస్ నియామకాల ద్వారా స్థానికులను పెద్ద ఎత్తున తమ కంపెనీలలో చేర్చుకోవాలని ఐటీ దిగ్గజాలు భావిస్తున్నాయి. దానివల్ల అక్కడివారికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు అవ్వడంతో పాటు.. తమ కంపెనీల విషయంలో కాస్త చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తారనే ఆలోచన కూడా వస్తున్నట్లు సమాచారం. దాంతోపాటు అమెరికా, ఇతర దేశాల్లో ఉన్న చిన్నపాటి ఐటీ కంపెనీలను కొనేయడానికి కూడా ఈ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దానివల్ల తమ కంపెనీలలో పనిచేసే స్థానికుల సంఖ్య పెరుగుతుందని, పాతవాళ్లను పంపాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నాయి. -
బ్లాక్‌లిస్టులో మరో ఎనిమిది స్టార్టప్‌లు!
కోల్కత్తా : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో కంపెనీల బ్లాక్లిస్టుల జాబితా పెరుగుతోంది. తాజాగా ఐఐటీ ఖరగ్‌పూర్, తమ క్యాంపస్‌లో రిక్రూట్మెంట్ జరుపకుండా ఎనిమిది స్టార్టప్‌లపై నిషేధం విధించింది. ఉద్యోగ ఆఫర్లు ఇచ్చి అనంతరం వెనక్కి తగ్గేసిన నేపథ్యంలో ఈ స్టార్టప్‌లను ఖరగ్‌పూర్ బ్లాక్ లిస్టులో పెడుతున్నట్టు ప్రకటించింది. గతేడాది తమ విద్యార్థులకు ఈ స్టార్టప్‌లు ఆఫర్ లెటర్లు ఇచ్చారని, అనంతరం ఆ లెటర్లను ఉపసంహరించుకున్నారని ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్ చైర్మన్ దేవాసిస్ దేవ్ తెలిపారు. దీంతో ఆ స్టార్టప్‌లను క్యాంపస్‌లోకి ఈ ఏడాది అడుగుపెట్టే వీలులేకుండా నిషేధం విధించినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది 10 నుంచి 12 స్టార్టప్‌లకు క్యాంపస్‌లో ప్లేస్మెంట్లకు అనుమతిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు మొత్తం 31 స్టార్టప్‌లపై నిషేధం విధించాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చి, అనంతరం ఉద్యోగంలో జాయిన్ చేసుకోకుండా జాప్యం చేయడం, లేదా ఆ ఆఫర్లను వెనక్కి తీసుకోవడం వంటి కారణాలతో ఆ కంపెనీలపై ఐఐటీలు వేటు వేస్తున్నాయి. -
ట్రిపుల్ ఐటీలో క్యాంపస్ ఇంటర్వూ ్యలు
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గురువారం ప్రముఖ బహుళ జాతి సంస్థలలో ఒకటైన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 21 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. తొలి దశలో 450 మందికి ఆన్లైన్ పరీక్ష నిర్వహించగా.. ఇందులో 117 మంది టెక్నికల్ ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరికి ఎస్ఆర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో 21 మంది విద్యార్థులు తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించారు. ఈసీఈ 13 మంది, సీఎస్ఈ 5 మంది, మెకానికల్ 2, సివిల్ ఒకరు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు రూ. 3.40 లక్షల వార్షిక వేతనం లభించనుందని అధికారులు తెలిపారు. ఈ ఎంపిక పట్ల డైరెక్టర్ భగవన్నారాయణ, పరిపాలనాధికారి అమరేంద్ర కుమార్, అధికారులు కేఎల్ఎన్రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, అమరనాథరెడ్డి, ప్లేస్‌మెంటు అధికారులు అశోక్ సుందర్ హర్షం వ్యక్తం చేశారు. -
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 16 మందికి ఉద్యోగాలు
అనంతపురం న్యూసిటీ : పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం టీబీఎస్ఎస్, ఐకేఎస్, ఎస్ఈఐఎస్, నోవా సొల్యూషన్స్, సిగ్నల్ వైర్ టెలికాం కంపెనీల ప్రతినిధులు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. మౌఖిక, రాత విభాగాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన 16 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారని కళాశాల ప్రిన్సిపల్ సంతోష్‌కుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్లు పి. సుగుణ, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాంపస్ సెలక్షన్స్‌లో శ్రీవిష్ణు విద్యార్థులు 502 మంది ఎంపిక
భీమవరం: భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాల్గవ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు వివిధ బహుళ జాతీయ సంస్థలు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్యూల్లో 502 మందికిపైగా ఎంపిక కావడంతో కళాశాలలో శనివారం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. గత మూణెళ్లుగా రాత, ఆన్లైన్ పరీక్షలు, గ్రూప్ డిస్కషన్స్, సాంకేతిక, మానసిక పరీక్షల అనంతరం అర్హులైన విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో ఐబిఎం సంస్థకు 179 మంది, క్యాప్ జెమినీ 167, ఇన్ఫోసిస్ 54, టెక్ మహీంద్రా 82, జాన్‌డీర్ 7, కోని ల్యాబ్స్ 6, టాలెంట్ స్ప్రింట్ 3, థర్మాక్స్ 2, ఎన్‌టిటి డేటా ఇరువురు ఉగ్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, అధ్యాపకులు క్యాంపస్ ఇంటర్యూల శిక్షణా బందంతో కలిసి భారీ కేక్ కట్ చేసి విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటి చైర్మన్ కెవి విష్ణురాజు మాట్లాడుతూ క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపికైన వారిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు కావడం అభినందనీయమని విద్య పట్ల గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ కుటుంబాలకు అమితాసక్తి కనబరుస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపిక కావడం పట్ల తమ మనోభావాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సొసైటి వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ జి.సుబ్బరాజు పాల్గొన్నారు. -
క్యాంపస్ బేజారు!
-
క్యాంపస్ బేజారు!
⇒ ఈ ఏడాది క్యాంపస్ నియామకాలకు కష్టకాలమే ⇒ కిందటేడాదితో పోలిస్తే 50 శాతం మేర తగ్గనున్న రిక్రూట్మెంట్లు! ⇒ నియామకాల్లో భారీగా కోత విధించుకున్న ఐటీ కంపెనీలు ⇒ ద్వితీయ, తృతీయ శ్రేణి కాలేజీల్లో రిక్రూట్మెంట్లు ఉండవన్న టీసీఎస్ ⇒ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 25కుపైగా కాలేజీలకు సమాచారం ⇒ ఎంజీఐటీ, వర్ధమాన్, గోకరాజు, సీవీఆర్ కాలేజీలకు లేఖ ⇒ టాప్ కాలేజీలకే పరిమితంకానున్న ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో ⇒ అమెరికా ఎన్నికలు, బ్రెగ్జిట్ పరిణామాలే ప్రధాన కారణం ⇒ ఐటీ ఆర్డర్లు వస్తే నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలకు బ్రేక్ పడింది! కిందటేడాది వరకు కాలేజీల ముందు క్యూ కట్టిన ఐటీ కంపెనీలన్నీ డీలా పడ్డాయి. అమెరికాలో రాజకీయ అనిశ్చితి.. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ విడిపోవడం.. వంటి పరిణామాల నేపథ్యంలో దేశీయ, విదేశీ ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లను భారీగా తగ్గించుకుంటున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు.. ద్వితీయ శ్రేణి కాలేజీల్లో ఈ ఏడాది నియామకాలు చేపట్టడం లేదు. ఇవేకాదు.. కాగ్నిజెంట్, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సైతం టాప్ కాలేజీల వరకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నాయి. మొత్తమ్మీద ఈ ఏడాది 30 నుంచి 40 శాతం మేర క్యాంపస్ నియామకాలను తగ్గించుకుంటున్నట్లు కంపెనీలు సూచనప్రాయంగా వెల్లడిం చాయి. ఐటీ పరిశ్రమ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం.. గతేడాదితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈసారి క్యాంపస్ రిక్రూట్మెంట్లు 50 శాతం మేర తగ్గిపోనున్నాయి. ఈసారి క్యాంపస్ నియామకాలు చేపట్టబోమంటూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 ఇంజనీరింగ్ కాలేజీలకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కంపెనీ సెప్టెంబర్ మొదటివారంలోనే తెలియజేసింది. ఈ మేరకు కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్ విభాగాలకు లేఖలు రాసింది. ఇలా లేఖలు అందుకున్న ప్రముఖ కాలేజీల్లో ఎంజీఐటీ, గోకరాజు రంగరాజు, వర్ధమాన్, సీవీఆర్ వంటివి ఉన్నాయి. ఇన్ఫోసిస్‌కు బ్రెగ్జిట్ దెబ్బ ఏటా దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 15 నుంచి 20 వేల మందికి క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్న ఇన్ఫోసిస్ ఈసారి ఆ సంఖ్యను 10 వేలకు తగ్గించుకున్నట్లు సమాచారం. బ్రెగ్జిట్తో భారీ ఆర్డర్ కోల్పోయిన ఇన్ఫోసిస్.. ఈ ఏడాది అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో చేపట్టబోయే రిక్రూట్మెంట్లను 20 శాతం మేర తగ్గించుకోనుంది. ఇక ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో రిక్రూట్మెంట్లు చేపట్టాలా వద్దా అన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ‘‘పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో ఎన్నికలు, రాజకీయ అనిశ్చితి కారణంగా ఐటీ ఆర్డర్లలో మాంద్యం కనిపిస్తోంది. ప్రతి పదేళ్లలో ఒకట్రెండు సార్లు ఇది సహజమే’’ అని బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ అధికారి ఒకరు వెల్లడించారు. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 శాతం తక్కువగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఉంటాయంటూ ఈ సంస్థ కాలేజీలకు సమాచారం అందించింది. ‘‘మాకు ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం గతేడాది కంటే 20 నుంచి 25 శాతం తక్కువగా నియామకాలు ఉండొచ్చు. అమెరికా ఎన్నికలు, బ్రెగ్జిట్ వంటి పరిణామాలే ప్రస్తుత ఐటీ మాంద్యానికి కారణం’’ అని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్ అధికారి ఎన్ఎల్ఎన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఏడాది నాటికి పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గడచిన రెండు దశాబ్దాల్లో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, అమెరికా ఆర్థిక సంక్షోభంలో పడినప్పుడు కూడా కంపెనీలు నియామకాలు భారీగా తగ్గించుకున్నాయని, మళ్లీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తోందని ఆయన వివరించారు. బ్యాంకుల ఎన్‌పీఏలూ కారణమే.. ఏటేటా నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)లు పెరిగిపోతుండడంతో బ్యాంకులు కూడా ఐటీకి సంబంధించిన కార్యకలాపాలను, వాటిపై పెట్టుబడులను గణనీయంగా తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ కంపెనీలకు బ్యాంకుల నుంచి ఆ మేరకు ఆర్డర్లు తగ్గిపోతున్నాయి. ఐటీ కంపెనీలు రిక్రూట్మెంట్లు తగ్గించుకోవడానికి ఇది కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. 5 వేల మందికి కూడా కష్టమే గతేడాది తెలంగాణ, ఏపీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాల ద్వారా 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. అయితే ఈ ఏడాది నియామకాలు సగానికంటే తగ్గుతాయని ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి కంపెనీలు ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఏడాది నియామకాలు చేపట్టకపోవడమే ఇందుకు కారణం. గతేడాది హైదరాబాద్‌లోని 12 కాలేజీల నుంచి 2,300 మందికి ఉద్యోగాలిచ్చిన యాక్సెంచర్ ఈసారి ఆ సంఖ్యను 1,300కు పరిమితం చేసుకోవాలని భావిస్తోంది. రాజధానితోపాటు రంగారెడ్డి జిల్లాలో కాలేజీల నుంచి 1,900 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కాగ్నిజెంట్ ఈసారి 750కు పరిమితం చేసుకుంటోంది. టీసీఎస్ అయితే భారీ ఎత్తున కోత విధించుకుంది. అమెరికాలో రాజకీయ సుస్థిరత ఏర్పడి ఆర్డర్లు భారీగా ద్వితీయార్థంలో నియామకాలు చేపడుతామని టీసీఎస్ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాలేజీ యాజమాన్యాల్లో గుబులు ఈ ఏడాది క్యాంపస్ నియామకాలు లేకుంటే ఆ ప్రభావం వచ్చే ఏడాది అడ్మిషన్లపై ఉంటుందని ద్వితీయ శ్రేణి ఇంజనీరింగ్ కాలేజీలు ఆందోళన చెందుతున్నాయి. గడచిన కొద్ది సంవత్సరాలుగా క్యాంపస్ నియామకాలతో అడ్మిషన్లకు డిమాండ్ పెంచుకున్న ఈ కాలేజీలు ఈ ఏడాది రిక్రూట్మెంట్లు లేవని తెలిసి కంగుతిన్నాయి. కొన్ని కాలేజీలు అయితే చిన్నా చితకా కంపెనీలను కలిసి క్యాంపస్ నియామకాలు చేపట్టాలని కోరుతున్నాయి. కనీసం పది నుంచి 20 శాతం విద్యార్థులకు ఉద్యోగాలు లభించినా పర్వాలేదన్నట్లు ఈ యాజమాన్యాలు ఉన్నాయి. -
కొనసాగిన క్యాంపస్ ఇంటర్వ్యూలు
బాలాజీచెరువు (కాకినాడ) : టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) జేఎన్టీయూకేలో నిర్వహిస్తున్న క్యాంపస్ ఇంటర్వ్యూల్లో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష శుక్రవారంతో ముగిసింది. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్‌ఐటీ, ఐఎస్టీ విభాగాలకు చెందిన 620 మంది విద్యార్థులు అన్లైన్ పరీక్షల్లో పాల్గొన్నారని, శనివారం ఉదయం ఫలితాలు వెల్లడిస్తామని జేన్‌టీయూకే ప్లేస్మెంట్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. అన్లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సెప్టెంబర్ 6,7,8 తేదీల్లో టెక్నికల్, హెచ్ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తామన్నారు. -
రేపు పి.బి.సిద్ధార్థలో క్యాంపస్ రిక్రూట్మెంట్
మొగల్రాజపురం: బెంగుళూరుకు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ ఎస్.ఎల్.కె. ‘సాప్‌్టవేర్ టెస్టింగ్ ఎగ్జిక్యూటివ్స్’ పోస్టుల భర్తీ కోసం ఆదివారం (ఈ నెల 28 తేది) తమ కళాశాల ఆవరణలో క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తుందని పి.బి.సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ ప్రకటనలో తెలిపారు. 2015–16 సంవత్సరాల్లో బి.యస్సీ (మా«థ్స్), బి.సి.ఎ, బి.కాం. పూర్తి చేసిన విద్యార్థులెవరైనా ఇందులో పాల్గొనవచ్చునన్నారు. ఔత్సాహికులు బయేడేటాతో ఆదివారం ఉదయం 10 గంటలకు మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో హజరు కావాలని తెలిపారు. విద్యార్ధులకు ఆన్లైన్ పరీక్ష ద్వారా నిర్వహించి అందులో ఉత్తీరుణలైన వారికి కంపెనీ ప్రతినిధులు ఇంటర్వూ నిర్వహిస్తారని చెప్పారు. -
ఇన్ఫోసిస్, విప్రోలలో నియామకాలకు బ్రేక్?
మళ్లీ రెసిషన్ నాటి రోజులు వస్తాయా.. అమెరికాలో అప్పట్లో వచ్చిన మాంద్యం ప్రభావం భారతీయ మార్కెట్లపైన, ఐటీ పరిశ్రమ ఉద్యోగాలపైన ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. అలాంటిది ఇప్పుడు మళ్లీ దాదాపు అలాంటి పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. భారత దేశ ఐటీ పరిశ్రమ చరిత్రలోనే ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని రీతిలో వృద్ధి రేటు పడిపోవడంతో.. ఆ ప్రభావం సాఫ్ట్వేర్ రంగంలో నియామకాలపై పడుతోంది. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలు ఇక మీదట భారీస్థాయిలో ఫ్రెషర్లను నియమించుకునే పద్ధతికి కొన్నాళ్ల పాటు తాత్కాలికంగా స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు దశాబ్దాలుగా చాలావరకు ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల ద్వారా పెద్ద ఎత్తున ఫ్రెషర్లను నియమించుకుంటున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కటే ఏడాదికి సుమారు 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటుంది. అలాంటి కంపెనీ కూడా ఫ్రెషర్ల నియామకాలు ఆపేస్తే.. సాఫ్ట్వేర్ రంగాన్ని మాత్రమే నమ్ముకున్న వాళ్లకు కొన్నాళ్ల పాటు ఇబ్బందులు తప్పవు. నియామకాలలో నాణ్యతను పెంచడానికి మార్గాలేంటో చూస్తున్నామని, ఇంతకుముందు కాలేజీల నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎక్కువ మందిని తీసుకుని, వాళ్లలో బాగా చేసేవాళ్లను వివిధ కేంద్రాలకు పంపేవాళ్లమని.. ఈసారి అలాంటి క్యాంపస్ ఇంటర్వ్యూలు తగ్గుతాయని ఇన్ఫోసిస్‌లో క్వాలిటీ యూనిట్, ప్రభుత్వ సంబంధాల విభాగ అధిపతి రంగడోర్ తెలిపారు. ఇక మీదట జాబ్ మార్కెట్ కాస్త ఇబ్బందిగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బాగా తెలివైన, అత్యుత్తమ విద్యార్థులు ఎవరన్న విషయాన్ని తాము చూస్తామని, అలాంటి వాళ్లకు మాత్రం ఢోకా ఉండదని చెప్పారు. ఇంటర్వ్యూలలో కఠినమైన ప్రశ్నలు అడగడం, ఆ కాలేజీల నుంచి గతంలో వచ్చిన విద్యార్థుల పనితీరును బట్టి కాలేజి పనితీరు అంచనా వేయడం లాంటి ప్రక్రియలు ఉంటాయని తెలిపారు. దాన్నిబట్టి చూస్తే రాబోయే సంవత్సరాల్లో క్యాంపస్ సెలక్షన్ల ద్వారా ఉద్యోగాలు రావడం కష్టం అవ్వడమే కాదు.. ప్రారంభంలోనే భారీ జీతాలతో ఉద్యోగాలు మొదలుపెట్టడం కూడా ఇక మీదట అంత ఈజీ కాదని తేలిపోతోంది. -
18న ‘కిట్స్’లో క్యాంపస్ ఇంటర్వూలు
ఎ.అగ్రహారం: మండలంలోని అంబికపల్లి అగ్రహారంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 18న కాకినాడ ‘వికాస’ ఆధ్వర్యాన ఆఫ్ క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.రామాంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెన్పాక్ట్, హిందుజా, గ్లోబల్ సొల్యూషన్స్ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయన్నారు. గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఈ ఇంటర్వూలకు 2014, 2015, 2016 సంవత్సరాల్లో బీటెక్, ఎంబీఏ, బీఫార్మశీ, డిప్లమో, డిగ్రీ పాసైన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఎంపికైనవారికి రూ. 1.5 లక్షల నుంచి, రూ.5 లక్షల వరకూ వార్షిక వేతనం ఉంటుందన్నారు. ఎంపికైనవారు వారంలోగా హైదరాబాద్‌లో ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధపడాలన్నారు. ఇంటర్వూ్యలకు హాజరయ్యేవారు 2 బయోడేటాలు, 2 పాస్‌పోర్టు ఫోటోలు, ఐడీ ప్రూఫ్, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు. వివరాలకు 96765 53839, 77299 96999 సెల్ నంబర్లలో సంప్రదించాలని రామాంజనేయులు సూచించారు. -
6న ఎస్వీ సెట్లో ఉద్యోగమేళా
చిత్తూరు (గిరింపేట): చిత్తూరు నగరం సరిహద్దులోని శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(ఎస్వీసెట్)లో ఈనెల 6న ఏపీఎస్ఎస్డీసీ ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్‌మేళా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. వివిధ రంగాలకు చెందిన మహేంద్ర ఫైనాన్స్, అమరాన్ బ్యాటరీస్, సాఫ్ట్బూట్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఎల్అండ్టీ టెక్నాలజీ, యాక్సెస్ బ్యాంకు, ఏడీఈసీసీవో, ఫ్లిప్‌కార్ట్, అపోలో, శ్రీవారి ఎంటర్ప్రైజెస్ మొబైల్ కంపెనీ, ఇతర కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొంటాయన్నారు. జిల్లాలోని పదో తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. జాబ్‌మేళాలో ఎంపికైన వారికి నెలకు రూ.9,500 నుంచి రూ.35 వేల వరకు జీతం వస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ్చpటటఛీఛి.జీn వెబ్సైట్లోకి వెళ్లి అ్కSSఈఇ అనే దానిపై క్లిక్‌చేసి పూర్తి వివరాలను ఈ నెల 5వ తేదీ లోపు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఏపీఎస్ఎస్డీసీ అసోసియేట్ ప్రాజెక్టు మేనేజర్, చిత్తూరు అనే చిరునామాలో గాని, టోల్‌ఫ్రీ నంబర్లు 18004252422, 18004522429, ఫోన్ నెంబర్లు 9885114834, 7702020490లో సంప్రదించాలన్నారు. -
ఆ వర్సిటీ విద్యార్థులకు ఉద్యోగాలు ఏవీ!
సెమిస్టర్ ముగిసిపోతున్నా చేతిలో ఉద్యోగాల ఆఫర్లు ఏమీ లేకపోవడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాతి పరిణామాల నేపథ్యంలో క్యాంపస్ నియామకాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆందోళనల కారణంగా యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతిందని, అందుకే కంపెనీలు ఏవీ రావట్లేదని అంటున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి కనీసం పది కంపెనీలు కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ శాఖకు వచ్చాయని, కానీ ఈసారి ఒకే ఒక్క కంపెనీ వచ్చిందని, కనీసం 60 శాతం మంది విద్యార్థులకు చేతిలో ఉద్యోగాలు లేవని ఆ శాఖకు చెందిన ఓ విద్యార్థి చెప్పారు. 2015 ఆగస్టు - డిసెంబర్ నెలల మధ్యలో 42 కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వచ్చాయి. కానీ, 2016లో ఇప్పటివరకు కేవలం 15 కంపెనీలు మాత్రమే వచ్చాయి. జనవరి నెలలోనే నియామకాలు చాలావరకు తగ్గిపోయాయని, యూనివర్సిటీ పేరు ప్రతిష్ఠలు దారుణంగా దెబ్బతినడంతో కంపెనీలు ఇటువైపు చూడటం మానేస్తున్నాయని స్టూడెంట్ ప్లేస్మెంట్ సమన్వయకర్త ఒకరు అన్నారు. ఒకటీ ఆరా కంపెనీలు వచ్చినా, ఇంటర్వ్యూలలో కూడా అసలు ఈ గొడవ ఏంటి, దాని పరిణామాలేంటనే అడుగుతున్నారట. ఈ పరిస్థితిని చక్కదిద్ది, విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏప్రిల్ 9 నుంచి జాబ్ ఫెయిర్ ఒకటి నిర్వహించనున్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల విషయంలో మంచి గుర్తింపు పొందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు చెబితే ఇప్పుడు నిరసనలే గుర్తుకొస్తున్నాయి. క్యాంపస్ నియామకాలు తగ్గితే కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య కూడా పడిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దాలని ఇటు ఆందోళనకారులతో పాటు యూనివర్సిటీ వర్గాలను కూడా విద్యార్థులు కోరుతున్నారు. -
వీసీ రేస్.. క్లైమాక్స్!
► నేడు హైదరాబాద్‌లో సెర్చ్ కమిటీ సమావేశం ► పైరవీలు ముమ్మరం చేసిన ఆశావహులు ► రంగంలోకి కొత్త ముఖాలు ► ఎంపిక అనూహ్యమే అంటున్న క్యాంపస్ వర్గాలు సామాజిక సమీకరణలా.. రాజకీయ పైరవీలా.. వాస్తవ అర్హతలా?.. ఏయూ వీసీ ఎంపికలో ఏ అంశం పైచేయి సాధిస్తుంది. అంతిమంగా ఎవరి మాట చెల్లుతుంది.. ఎవరి ప్రయత్నం ఫలిస్తుందన్నది ఇప్పుడు క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మరికొన్ని గంటల్లో సెర్చ్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం పోటీలో ఉన్నవారితోపాటు అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకి రావడంతో వీసీ రేస్ క్లైమాక్స్‌కు చేరింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాల యం వైస్ చాన్సలర్ పదవి కోసం ఇదే క్యాంపస్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు బహిరంగంగా వీసీ పదవే లక్ష్యంగా ఆధిపత్య పోరు సాగిస్తుండగా.. మరికొందరు చాపకింద నీరులా పావులు కదుపుతూ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో ఏముందో ఇప్పటికీ అంతు చిక్కని పరిస్థితుల్లో రేస్‌లోకి మరికొందరు రంగప్రవేశం చేయడంతో పోటీ రసకందాయంలో పడింది. సుమిత్రా దావ్రా నోట సీఎం మాట! కొత్త వీసీ ఎంపికకు నియమించిన సెర్చ్ కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం కానుంది. ఏయూ నామినీగా ఆనందకృష్ణన్( అన్నా విశ్వవిద్యాలయం మాజీ వీసీ), యూజీసీ నామినీగా రాజ్‌పాల్ సింగ్( పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ), గవర్నర్ నామినీ సుమిత్రా దావ్రా( ఉన్నత విద్యా శా ఖ ముఖ్య కార్యదర్శి) ఈ కమిటీలో సభ్యులుగా ఉ న్నారు. వీసీ పదవికి అందిన దరఖాస్తులను ఈ కమి టీ పరిశీలించి ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఇది పైకి కనిపించే తంతు మాత్రమే. కానీ సీఎం చంద్రబాబు ఎవర్ని వీసీగా నియమించాలని భావిస్తున్నారో ఆ పేరును గ వర్నర్ నామినీగా ఉన్న సుమిత్రా దావ్రా సూచిస్తారు. అదే పేరు సెర్చ్ కమిటీ ప్రభుత్వానికి నివేదించే జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది. దాంతో ఆమె సూచించే పేరు ఎవరిదన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. రేసు ఆసక్తికరం క్యాంపస్ నుంచి ఇన్చార్జి వీసీ నారాయణ, రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు వీసీ పదవి కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాగా హఠాత్తుగా మరికొందరు ఈ రేసులో ముందంజ వేయడం గమనార్హం. గతసారి విఫలయత్నం చేసిన ఇన్చార్జి వీసీ నారాయణ ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన పూర్తిగా మంత్రి గంటా శ్రీనివాసరావునే నమ్ముకున్నారు. తనను ఎంపిక చేస్తే కాపు సామాజిక వర్గానికి గుర్తింపునిచ్చినట్లు అవుతుందని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. మంత్రి గంటా కూడా నారాయణ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. విద్యా శాఖ మంత్రిగా తన జిల్లాలో వీసీ ఎంపికలోనైనా తన మాట చెల్లుబాటు కావాలి కదా అని ఆయన వాదిస్తున్నారు. కానీ ఆయన వాదనకు సీఎం చంద్రబాబు నుంచి సానుకూల స్పందన లభించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రధానంగా సామాజికవర్గ సమీకరణను ప్రస్తావిస్తూ పైరవీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. సీఎం పేషీ స్థాయిలో పైరవీలతోపాటు తమ సామాజికవర్గ పెద్దలతో సీఎంకు సిఫార్సు చేయించేందుకు యత్నిస్తున్నారు. ఆయనపట్ల చంద్రబాబు వైఖరి ఏమిటన్నది స్పష్టం కావడం లేదు. ఇటీవల క్యాంపస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలు, పీహెచ్‌డీల ప్రవేశాల్లో రిజిస్ట్రార్‌గా ఆయన బాధ్యత కూడా ఉందన్న వాదన బలంగా వినిపిస్తుండటం ఉమామహేశ్వరరావు ప్రతికూలంగా మారుతోంది. రంగంలోకి ఇతర వర్సిటీల వారు కాగా చడీచప్పుడు కాకుండా మరికొందరు రేసులో ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. ఏయూ చరిత్ర విభాగానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణకుమారి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో ఆమె ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కూడా చేశారు. ఆమె అభ్యర్థిత్వం పట్ల హైదరాబాద్ స్థాయిలో సానుకూలత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. సామాజికవర్గ సమీకరణపరంగా కూడా ఆమె ఎంపిక రెట్టింపు ప్రయోజనాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. తిరుపతి ఎస్వీయూకు చెందిన ఓ ప్రొఫెసర్ కూడా సీఎం చంద్రబాబును కలసి తనకు అవకాశం ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాబు మనసులో మాట ఏమిటన్నది శుక్రవారం సెర్చ్ కమిటీ సమావేశంలో సమిత్రా దావ్రా వెల్లడించనున్నారు. సెర్చ్ కమిటీ నివేదికకు గవర్నర్ ఆమోదం తరువాతే కొత్త వీసీ ఎవరన్న ఉత్కంఠతకు తెరపడుతుంది. -
క్యాంపస్ నుంచే స్టార్టప్..
క్యాంపస్ ప్లేస్మెంట్! అంటే సదరు కాలేజీలో చదువు పూర్తవుతున్నపుడే... అక్కడి నుంచే ఏదో ఒక కంపెనీకి సెలక్ట్ కావటం. నిన్నమొన్నటిదాకా ఒక విద్యా సంస్థ ఎంత గొప్పదో చెప్పటానికి ఇదే గీటురాయి. అక్కడ ఎంతమందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు వచ్చాయి? ఎలాంటి కంపెనీల్లో వచ్చాయి? ఎంత జీతంతో వచ్చాయి? ఇవన్నీ దాని ప్రమాణాలు. ఇప్పుడైతే ఈ కొలతలు మారిపోయాయి. ఆ విద్యా సంస్థ నుంచి ఎన్ని స్టార్టప్‌లు వచ్చాయి? ఎన్ని సక్సెస్ అయ్యాయి? అక్కడ స్టార్టప్స్‌ను ప్రోత్సహించే వ్యవస్థ ఎలా ఉంది? ఇవీ తాజా ప్రమాణాలు. అందుకే ఐఐటీలు, ఐఐఎంలు సైతం తమ క్యాంపస్‌లలోనే... తమ విద్యార్థులతోనే స్టార్టప్‌లు పెట్టిస్తున్నాయి. వాటికి పెట్టుబడి కూడా పెడుతున్నాయి. యువశక్తే ఇండియా బలం. టెక్నాలజీ అండతో ఆ యువత స్టార్టప్‌ల వెంట పడుతోందిప్పుడు. కాస్త ప్రోత్సహించి, పెట్టుబడి పెడితే... ఆ కంపెనీల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే... ఇపుడు ఇండియా అంటే స్టార్టప్‌ల రాజధాని. ఇండియాకు ఈ హోదా ఇచ్చిన 2015... వచ్చే ఏడాది పరిణామాలను ముందే కళ్లకు కడుతోంది. ఆ కథల సమాహారమే ఈ రౌండప్! బిలియన్ డాలర్ల స్టార్టప్‌లు11 మన దేశంలోనే * ఈ ఏడాది 764 కంపెనీల్లోకి రూ.55 వేల కోట్ల పెట్టుబడులు * మహిళల వాటా 24 శాతం; వారికోసం ప్రత్యేక ఫండ్ * 20కి పైగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన రతన్ టాటా * 2016లో ఈ-కామర్స్ మినహా ఇతర రంగాల హవా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిలియన్ డాలర్ల క్లబ్!! టర్నోవర్ పరంగా కావచ్చు... విలువ పరంగా కావచ్చు... ఈ క్లబ్లో చేరటమనేది కంపెనీల కల. సంప్రదాయ పరిశ్రమలు కొన్ని దశాబ్దాల పాటు శ్రమించి ఈ హోదా పొందితే... స్టార్టప్‌లు రెండు మూడేళ్లలోనే ఆ విలువను దాటేస్తున్నాయి. అదీ స్టార్టప్‌ల సత్తా. ఈ ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ డాలర్ల విలువ దాటిన స్టార్టప్‌లు 68 వరకూ ఉండగా... వాటిలో 16 శాతం... అంటే 11 సంస్థలు ఇండియాలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 30 వేల నుంచి 35వేల వరకూ స్టార్టప్ కంపెనీలుండగా వీటిలో 3,000 వరకు భారీ పెట్టుబడులతో స్థిరపడ్డాయి. 2014లో మొత్తం 3,314 స్టార్టప్‌లు రాగా వాటిలో కేవలం 263 కంపెనీలకే పెట్టుబడులు వచ్చాయి. అప్పట్లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులు రాగా... వీటిలో ఫ్లిప్‌కార్ట్ వంటి భారీ పెట్టుబడులూ ఉన్నాయి. ఈ ఏడాదిలో మాత్రం 3,931 స్టార్టప్ కంపెనీల్లో... 764 సంస్థల్లోకి దాదాపు 55 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మరో 1000 కంపెనీలు నిధుల సమీకరణలో ఉన్నాయని, వచ్చే ఏడాది ఆ ప్రక్రియ పూర్తి కావచ్చని లెమన్ ఐడియాస్ ఇన్నోవేషన్ సంస్థ చీఫ్ ఐడియా ఫార్మర్ దీపక్ మొనారియా తెలియజేశారు. ఈ-కామర్స్ నుంచి ఇతర రంగాలకు... ఈ ఏడాది వచ్చిన స్టార్టప్స్‌లో అధికభాగం ఈ కామర్స్వే. 25-30 శాతం ఈ విభాగానివే కాగా... సర్వీసుల రంగంలో 22 శాతం, టెక్నాలజీ విభాగంలో 20 శాతం, విద్యా రంగంలో 18 శాతం, వైద్య రంగంలో 10-15 శాతం సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2016లో మాత్రం ఈ-కామర్స్ కాకుండా కొత్త రంగాల్లో స్టార్టప్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు లీడ్ ఏంజిల్స్ నెట్వర్క్ దక్షిణాది వైస్ ప్రెసిడెంట్ వినుత రాళ్లపల్లి చెప్పారు. ‘‘ఇప్పటికే ఈ-కామర్స్‌లో పెద్ద కంపెనీలు పాతుకుపోయాయి. విలువ విషయంలోనూ దిద్దుబాటు జరుగుతోంది. దీంతో వ్యవసాయం, ఆహారం, విద్యా, వైద్య రంగాల్లో పెద్ద సంఖ్యలో స్టార్టప్స్ వస్తున్నాయి’’ అని ఆమె వివరించారు. ఈ ఏడాది ఆన్లైన్ రిటైల్ రంగంలో 431 స్టార్టప్స్ వస్తే, విద్యా రంగంలో 385, వైద్య రంగంలో 237, ఆహార రంగంలో 351 కంపెనీలొచ్చాయి. ‘‘ఏ రంగమైనా, ఏ కంపెనీ అయినా! పెట్టుబడి పెట్టడానికి సంస్థ పనితీరు, ప్రమాణాలే గీటురాయి కావాలి’’ అన్నారామె. చుక్కలు చూసిన స్టార్టప్స్ కూడా... ఆరంభంలో ఆకాశాన్ని తాకి.. కొద్ది కాలానికే నేలకొరిగిన స్టార్టప్స్ ఈ ఏడాదిలోనూ వచ్చాయి. జొమాటో, టైనీ ఔల్, హౌజింగ్.కామ్ లాంటివి ఇందుకు ఉదాహరణ. ఇవి కొన్ని నగరాల్లో కార్యకలాపాలను నిలిపేశాయి కూడా. జొమాటో 300 మందిని, టైనీ ఔల్ 200 మందిని, హౌజింగ్.కామ్ అయితే ఏకంగా 800 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. స్టాక్ మార్కెట్లో స్టార్టప్‌ల లిస్టింగ్‌కు వీలుగా సెబీ కొన్ని నిబంధనలు సడలించినప్పటికీ ఈ ఏడాది ఒక్కటీ లిస్ట్ కాలేదు. ఇన్ఫీబీమ్, మాట్రిమోనీ వంటి కంపెనీలు మాత్రం పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేశాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇవి లిస్టయ్యే అవకాశముంది. వ్యక్తిగతంగా... గ్రూప్‌లుగా పెట్టుబడులు స్టార్టప్‌ల విషయానికొచ్చేసరికి పెట్టుబడుల తీరు మారుతోంది. 2014 నుంచి స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతున్న రతన్ టాటా... ఈ ఏడాది హోలా షెఫ్, అర్బన్ ల్యాడర్, కార్దేఖో, స్నాప్‌డీల్, బ్లూస్టోన్, ఓలా క్యాబ్స్ వంటి 20కి పైగా స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టారు. ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్ రాజన్ ఆనందన్ 29 కంపెనీల్లో, సునిల్ కర్లా 16, అనుపమ్ మిట్టల్ 15, రాజేష్ సాహ్ని 13, అరిహంత్ పట్ని 12, కునాల్ బహల్ 12, రోహిత్ కుమార్ బన్సాల్ 12 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. గ్రూప్ పెట్టుబడుల విషయానికొస్తే.. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి సొంతంగా వెంచర్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రేమ్ జీ కొడుకు రిషద్ సారథ్యంలో ‘ప్రేమ్ జీ ఇన్వెస్ట్’ పేరిట మిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేశారు. ‘కాటమరాన్ వెంచర్స్’ పేరుతో నారాయణమూర్తి కూడా భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు. రూ.100 కోట్ల నిధితో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వెంచర్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన టాలెంట్ స్ప్రింట్ చైర్మన్ జేఏ చౌదరి, కొందరు పారిశ్రామికవేత్తలు కలిసి రూ.30 కోట్లతో స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఏంజెల్స్‌లో బీవీఆర్ మోహన్‌రెడ్డి, జేఏ చౌదరి, శ్రీని కొప్పోలు, వంటి ఐటీ నిపుణులతో పాటుగా డీ సురేష్ బాబు, హరీష్ చంద్ర ప్రసాద్, శ్రీనిరాజు వంటి సుమారు 65 మంది ప్రముఖులూ సభ్యులుగా ఉన్నారు. పారిశ్రామికవేత్తలు బీవీఆర్ మోహన్‌రెడ్డి, జేఏ చౌదరి, శ్రీని కొప్పోలు, హరీష్చంద్ర ప్రసాద్, శ్రీనిరాజుతో సహా సినీ ప్రముఖుడు డి.సురేష్‌బాబు వంటి 65 మంది కలసి ‘హైదరాబాద్ ఏంజెల్స్’ను ఏర్పాటు చేశారు. 2012లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకు 12 సంస్థల్లో రూ.15 కోట్ల పెట్టుబడి పెట్టింది. స్టార్టప్‌లలో మహిళలూ ముందుంటున్నారు. దేశీ స్టార్టప్స్‌లో 25 శాతం మహిళలవేనని, ఇది 2011లో 15 శాతం మాత్రమేనని ‘స్టార్టప్ మస్టర్-2015’ నివేదిక పేర్కొంది. మహిళ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దేశంలో తొలిసారిగా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటైంది కూడా ఈ ఏడాదే. సాహా ఫండ్ పేరిట రూ.100 కోట్ల నిధితో కొందరు పారిశ్రామికవేత్తలు జట్టుకట్టారు. ఇందులో యాక్సెంచర్ ఇండియా మాజీ సీఎండీ అంకితా వశిష్ట, ఆమె తండ్రి అవినాష్ వశిష్ట, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టీవీ మోహన్ దాస్, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షాలు సభ్యులు. ⇒ 2015లో టాప్ విలీనాలు, కొనుగోళ్లు.. ⇒ 200 మిలియన్ డాలర్లతో టాక్సీఫర్‌ష్యూర్‌ను ఓలా కొనుగోలు చేసింది ⇒ ఫ్రీచార్జ్‌ను 400 మిలియన్ డాలర్లతో స్నాప్‌డీల్ కైవసం చేసుకుంది ⇒ కార్‌ట్రేడ్ సంస్థ 90 మిలియన్ డాలర్లతో కార్వాలాను కొనుగోలు చేసింది హైదరాబాద్ హవా.. దేశానికి ఐటీ రాజధాని లాంటి హైదరాబాద్... స్టార్టప్‌లకూ హబ్‌గా మారింది. బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాలు స్టార్టప్‌లకు స్వర్గధామంగా నిలుస్తుండగా.. ఆ రెండింటికన్నా కూడా హైదరాబాద్ చాలా విషయాల్లో ముందుంది. ‘‘వ్యయం పరంగానే కాక నిపుణులు, మౌలిక సదుపాయాల పరంగానూ స్టార్టప్‌లకు హైదరాబాదే సానుకూలం’’ అని సాక్షాత్తూ రతన్ టాటాయే చెప్పారుకూడా. సోమవారం టీ-హబ్‌ను సందర్శించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాట కూడా ఇదే. ఈ మాటలు నిజం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా అధునాతన సౌకర్యాలతో స్టార్టప్స్ కోసం టీ-హబ్‌ను నిర్మించింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ-హైదరాబాద్), బిట్స్ పిలానీ, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా), ద ఇండస్ ఎంటర్ప్రైజెస్ (టై), హైదరాబాద్ ఏంజిల్స్, స్పార్క్ 10.. వంటివి ఇక్కడి స్టార్టప్‌లకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి కూడా. ‘సాక్షి స్టార్టప్ డైరీ’ భాగస్వామే.. స్టార్టప్ డైరీ ద్వారా సాక్షి ఇప్పటిదాకా 46 కంపెనీల సమాచారాన్ని అందించింది. ఇందులో విద్య, వైద్యం, షాపింగ్, మొబైల్స్... ఇలా అన్ని రంగాలవీ ఉన్నాయి. వీటితో పాటు స్టార్టప్‌లకు నిధులందిస్తున్న నె ట్వర్క్ల సమాచారాన్నీ అందించింది. ప్రచారానికి పెద్దగా ఖర్చుపెట్టలేని తమ స్టార్టప్‌కు ‘సాక్షి’ అండతో క్లయింట్లు పెరిగారని కొందరు, నిధుల సమీకరణకు ఉపకరించిందని కొందరు... ఇలా పెద్ద సంఖ్యలో వచ్చిన ఈ-మెయిళ్లే స్టార్టప్ డైరీకి తదుపరి ఇంధనం. స్టార్టప్ బూమ్‌తో జరిగిన మరో మేలేంటంటే ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన యువత స్వదేశానికి తిరిగిరావటం. మరీ ముఖ్యంగా హైద రాబాదీ యువత. హలోకర్రీ వ్యవస్థాకుల్లో ఒకరైన రాజు భూపతి... డుకెర్ టెక్నాలజీస్‌ను(లే చల్) ఏర్పాటు చేసిన క్రిస్పి లారెన్స్... ఈ-కిన్‌కేర్ వ్యవస్థాపకుడు కిరణ్ కలకుంట్ల, క్రియా లెర్నింగ్ అధిపతి హరివర్మ... అంతా ఈ కోవలోని వారే. -
ఐఐటీ విద్యార్థులపై వేతన ఒత్తిళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలో సీటు వచ్చిందంటే చాలు.. నాలుగేళ్లు గడిస్తే రూ.కోట్లలో వేతనాలు.. సంతోషకరమైన జీవితం.. ఇవీ ఐఐటీల్లో సీట్లు పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు.. ఆకాంక్షలు. కానీ భారీ వేతనాలు ఇచ్చి ప్రముఖ కంపెనీలు తీసుకెళ్లేది కొద్దిమంది విద్యార్థులనే. ఐఐటీల్లో వేల సంఖ్యలో చదివే విద్యార్థులందరికీ వచ్చేది భారీ మొత్తంలో కాదు. ఎక్కువ శాతం మందికి సాధారణ, తక్కువ వేతనాలే. ఏదో కొద్ది మంది విద్యార్థులకు వచ్చే భారీ వేతనాలను చూసి తల్లిదండ్రులు ఇతర పిల్లలపై తీవ్ర ఒత్తిడి చేస్తుండటం ఆందోళనకరంగా మారింది. దీంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని పలు ఐఐటీలు గుర్తించాయి. అందుకే ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్ వంటి సంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లలో కంపెనీలు విద్యార్థులకు ఆఫర్ చేసే వేతనాలను, ఆ విద్యార్థుల వివరాలను వెల్లడించవద్దని నిర్ణయించాయి. ఈ నెలలోనే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఈ నెలలో క్యాంపస్ ప్లేస్మెంట్లు ప్రారంభం అవుతుండటంతో ఐఐటీలు ఈ నిర్ణయానికి వచ్చాయి. అంతేకాదు ఇటీవల గౌహతి ఐఐటీలో జరిగిన ఆల్ ఐఐటీస్ ప్లేస్మెంట్ కమిటీ సమావేశంలో అన్ని ఐఐటీల్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థులకు కంపెనీలు ఇచ్చే వేతనాల వివరాలను, ఆ విద్యార్థుల వివరాలను కూడా బయటకు వెల్లడించవద్దని నిర్ణయించాయి. 2009లోనే వేతన వివరాలను బయటకు వెల్లడించవద్దన్న నిర్ణయం తీసుకున్నా అమలుకు నోచుకోలేదు. కాని ఇపుడు మాత్రం కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు ఖరగ్‌పూర్ ఐఐటీ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ చైర్మన్ ప్రొఫెసర్ సుధీర్‌కుమార్ బరాయ్ వెల్లడించారు. ‘కంపెనీలు నియామకాల్లో భాగంగా చేసుకునే ఉద్యోగ ఒప్పందంలో రెమ్యునరేషన్‌ను బయటకు వెల్లడించవద్దన్న నిబంధన ఉంది. దీన్ని ఉల్లంఘిస్తే కంపెనీలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. భారీ వేతనాల ఆఫర్ వచ్చిన విద్యార్థులు, వారి కుటుంబాల భద్రత సమస్యగా మారుతోంది. అందుకే వేతన వివరాలు, విద్యార్థుల వివరాలను బయట పెట్టవద్దని నిర్ణయించాం..’ అని ఒక ఐఐటీకి చెందిన ప్లేస్మెంట్ సెల్ ఇన్చార్జి పేర్కొన్నారు. -
క్యాంపస్ కొలువులు డీలా!
గతంతో పోలిస్తే ఈసారి సగానికి తగ్గిన ఐటీ కంపెనీల నియామకాలు * 2012-13లో 23 వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు * ఈ ఏడాది కేవలం 11 వేల మంది విద్యార్థులకే కొలువులు * ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్య అందకపోవడమే కారణం * ఆఫ్ క్యాంపస్ నియామకాలవైపు విద్యార్థుల పరుగులు (సాక్షి ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో గత మూడేళ్లుగా జోరుగా సాగిన క్యాంపస్ కొలువులు ఈ ఏడాది డీలాపడ్డాయి. ఐటీ కంపెనీలు ఆశించిన స్థాయిలో విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు కనిపించకపోవడంతో ఈసారి నియామకాలు సగానికి సగం తగ్గాయి. 2012-13, 2013-14, 2014-15 సంవత్సరాల్లో వరుసగా 23 వేలు, 21 వేలు, 18 వేల మంది విద్యార్థులు క్యాంపస్ కొలువులు చేజిక్కించుకోగా ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నాటికి క్యాంపస్ నియామకాల ద్వారా కేవలం 11 వేల మందికి (బ్యాచ్ 2015-16) మాత్రమే ఉద్యోగాలు లభించాయి. గతేడాది స్థానిక అగ్రశేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో నియామకాలు చేపట్టిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఈ ఏడాది ఐఐటీ, ఎన్‌ఐటీలకే పరిమితమవగా గత సంవత్సరం దాకా హైదరాబాద్‌లోని ద్వితీయశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టిన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, యాక్సెంచర్, టెక్ మహేంద్ర వంటి ఐటీ కంపెనీలు ఈసారి అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో నియామకాలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగానే ఈ ఏడాది క్యాంపస్ నియామకాల సంఖ్య భారీగా తగ్గిందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఏటా అక్టోబర్ చివరి నాటికే 95 శాతం క్యాంపస్ నియామకాల ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తరువాత వచ్చే కంపెనీలు చేపట్టే నియామకాలు ఐదు శాతానికి మించవని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ లెక్కన ఇంకో వెయ్యి మంది విద్యార్థులకు మించి అవకాశం ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాణ్యత లేకపోవడమే... రాజధాని హైదరాబాద్‌తోపాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోవడం వల్లే ఆయా కాలేజీల్లో నియామకాల ప్రక్రియకు ఐటీ కంపెనీలు ముందుకు రావట్లేదని తెలుస్తోంది. గత మూడేళ్లలో సగటున 56 ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టిన ఐటీ కంపెనీలు ఈ ఏడాది సగానికిపైగా తగ్గించి కేవలం 26 కాలేజీలకే పరిమితమయ్యాయి. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ మొత్తం విద్యార్థుల్లో 63 నుంచి 75 శాతం మందికే క్యాంపస్ నియామకాల ద్వారా ఉద్యోగాలు లభించాయి. అందులోనూ కొంత మంది విద్యార్థులకు నాలుగు నుంచి ఐదు కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా, జెఎన్టీయూహెచ్ సహా టాప్ ఐదు కాలేజీల్లో సగటున 23 శాతం మంది విద్యార్థులు నాలుగైదు కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. ‘క్యాంపస్ నియామకాల కోసం విద్యార్థుల ప్రతిభను పరీక్షించేందుకు కఠినమైన ప్రశ్నపత్రం ఉంటుంది. అందువల్ల తెలివైన విద్యార్థులు మాత్రమే రాత పరీక్ష పాసవుతున్నారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఆంగ్ల భాషలో పరిజ్ఞానం లేకుంటే వెనక్కి వెళ్లక తప్పదు’ అని అనేక ఐటీ కంపెనీలకు ఆన్లైన్ క్యాంపస్ పరీక్ష నిర్వహించే అమ్క్యాట్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఐటీ కంపెనీలను బతిమాలుతున్న కాలేజీలు... టాప్ ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వస్తే అడ్మిషన్లు పెరుగుతాయని భావిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఇందుకోసం ఐటీ కంపెనీల హెచ్ఆర్ విభాగాలను బతిమాలుతున్నాయి. కాలేజీల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని ప్రతి 10, 15 కాలేజీలకు కలిపి ఒకేచోట పరీక్షలు నిర్వహించి రెండంకెలకు మించకుండా విద్యార్థులకు ఐటీ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ‘మేము గతేడాది ఎక్కువ కాలేజీలకు వెళ్లి నియామకాలు చేపట్టినా ఎంపికైన వారిని ఇప్పటికీ శిక్షణకు పిలువలేకపోయాం. అందువల్ల ఈ ఏడాది కొంత మేర క్యాంపస్ నియామకాలు తగ్గించుకున్నాం’ అని విప్రో హెచ్ఆర్ విభాగం ప్రతినిధి చెప్పారు. ‘క్యాంపస్ నియామకాలకు ఆహ్వానిస్తూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 128 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి మాకు వినతులు వచ్చాయి. కానీ మేము 18 కాలేజీల్లోనే నియామకాల ప్రక్రియ చేపట్టాం’ అని యాక్సెంచర్ ఐటీ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు ఆన్ క్యాంపస్ అవకాశాలు తగ్గిపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆప్ క్యాంపస్ నియామకాలకు పరుగులు పెడుతున్నారు. ఐటీ కంపెనీలకు పరీక్షలు నిర్వహించే ఔట్సోర్సింగ్ సంస్థలు దీనిని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని ఓ సంస్థ ఈ ఏడాది ఇప్పటివరకూ 8 వేల మందికి పరీక్షలు నిర్వహించి ఫీజు రూపేణ దాదాపు రూ. 91 లక్షలు వసూలు చేసింది. కానీ ఆ సంస్థ ద్వారా పరీక్షలో పాసైన వారిలో 10 నుంచి 12 శాతం మందికే ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేయడం గమనార్హం. -
ఒకే రోజు 6,064 ప్లేస్మెంట్లు
హైదరాబాద్: ఒకే రోజు 4 టాప్ ఐటీ కంపెనీల్లో 6,064 మంది ఎస్ఆర్ఎం వర్సిటీ విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించి రికార్డు సృష్టించారని వర్సిటీ వ్యవస్థాపక చాన్స్‌లర్ పారివేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విప్రో 1,641 మందికి, టీసీఎస్ 1,611 మందికి, కాగ్నిజెంట్ 1,506 మందికి, ఇన్ఫోసిస్ 1,306 మందికి ఆఫర్లు ఇచ్చాయని.. తద్వారా ఎస్ఆర్ఎం వర్సిటీ తన నంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. తమ వర్సిటీపై, విద్యార్థులపై నమ్మకంతో కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయని.. ఇండస్ట్రీ ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధన చేయడమే దీనికి కారణమని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రబీర్ బాగ్చి పేర్కొన్నారు. -
క్యాంపస్ సెలక్షన్స్‌లో ఓయూ విద్యార్థికి భారీ ఆఫర్
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న సతీష్‌రెడ్డి ఏడాదికి రూ.20 లక్షల వేతనం గల ఉద్యోగానికి ఎంపికైనట్లు ప్లేస్మెంట్ సెల్ డెరైక్టర్ ప్రొ.ఉమామహేశ్వర్ తెలిపారు. అంతర్జాతీయంగా పేరొందిన డీఈ షో కంపెనీలో మన దేశంలోనే ఉద్యోగం చేసేందుకు ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూ లలో సతీష్‌రెడ్డిని ఎంపిక చేశారు. ఇంటర్వ్యూలో నలుగురు విద్యార్థులు హాజరుకాగా సతీష్‌రెడ్డి ఒక్కరు మాత్రమే ఉద్యోగం పొందినట్లు డైరెక్టర్ ఉమామహేశ్వర్ చెప్పారు. -
మృత్యువులోనూ వీడని బంధం
♦ రోడ్డుప్రమాదంలో అక్కాతమ్ముడు మృతి ♦ ఉద్యోగంలో చేరకముందే అనంతలోకాలకు.. ♦ కుటుంబంలో అలుముకున్న విషాద చాయలు ♦ దొన్కల్‌లో నేడు అంత్యక్రియలు జక్రాన్‌పల్లి/మోర్తాడ్ : ఇంజనీరింగ్ పూర్తయింది.. క్యాంపస్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయింది.. ఉద్యోగం రావడానికి మరికొన్ని రోజుల సమయం ఉంది.. ఈ లోగా కుటుంబసభ్యులతో హాయిగా గడుపుదామనుకుంది. ఇదే విషయూన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఆనంధానికి అవధుల్లేవు. హైదరాబాద్‌లో ఉన్న కూతురును తీసుకొచ్చేందుకు బంధువులతో మాట్లాడి కారు ఏర్పాటుచేశారు. అయితే వచ్చేప్పుడు అక్కకు తోడుగా ఉంటాడని తమ కుమారుడిని కూడా పం పించారు. కానీ.. అవే తమ పిల్లలకు చివరి క్షణాలను వారు ఊహించలేకపోయూరు. తిరుగు ప్రయూణంలో జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద జరిగిన ప్రమాదం ఆ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత విషాదాన్ని నింపింది. వివరాలిలా ఉన్నాయి.. మో ర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన తీగెల రాజేందర్, అంజమ్మలకు కూతురు సుశ్మిత(22), కుమారుడు శరత్‌చంద్రారెడ్డి(19) ఉన్నారు. సుశ్మిత హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసింది. ఇటీవలే క్యాం పస్ ఇంటర్వ్యూలో సెలక్ట్ అయింది. అయితే ఉద్యోగంలో చేరేందుకు కొంత గడువు ఉండడంతో ఈలో గా ఇంటికి వస్తానని కబురు చేసింది. దీంతో ఉత్సాహం పట్టలేని తల్లిదండ్రులు కూతురును తీసుకొచ్చేందుకు బంధువుల కారును ఏర్పాటుచేశారు. వచ్చేప్పుడు తోడు ఉండేందుకు తమ కుమారుడు శరత్‌ను కూడా పంపించారు. తమ్ముడిని చూడగానే సంతోషించిన సుశ్మిత ఇంటికి వచ్చేందుకు ఉత్సాహంగా కారులో బయలుదేరింది. ఈ క్రమంలో కారు సికింద్రాపూర్ వద్దకు రాగానే కుక్క అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శరత్‌చంద్రారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సుశ్మిత హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కారు డ్రైవర్ సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గంటలో ఇంటికి వస్తారనగా... మరో గంటలో కూతురు, కొడుకు ఇంటికి చేరుకుంటారని భావించిన తల్లిదండ్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రమాదవార్త తెలియగానే వారినోట మాట రాలేదు. ఎంతో కష్టపడి పంటలు పండించి.. ఇద్దరు పిల్లలను ఇంజనీరింగ్ చదివించారు. ఇక తమ కష్టాలు తీరినట్టేనని భావిస్తున్న తరుణంలో వారి జీవితంలో ఈ ఘోరం జరిగింది. వారు విలపిస్తున్న తీరు చూసి, గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. సుశ్మిత మృతదేహం హైదరాబాద్ నుంచి రావాల్సి ఉన్నందున శరత్‌కు కూడా అంత్యక్రియలు నిర్వహించలేదు. ఆదివారం ఇరువురి మృతదేహాలకు ఒకేసారి దహన సంస్కారాలు చేయనున్నారు. -
సెల్కాన్ కొత్త స్మార్ట్‌ఫోన్ క్యాంపస్ ఏ518
ధర రూ.4,500 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ సెల్కాన్.. క్యాంపస్ సిరీస్‌లో పెద్ద స్క్రీన్‌తో రూపొందిన ఏ518 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అన్ని రకాల ఆదాయ వర్గాల ప్రజలను ఆకర్షించేలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. ధర రూ.4,500. ఆధునిక ఫీచర్లతో మరిన్ని మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని సంస్థ సీఎండీ వై.గురు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 అంగుళాల కెపాసిటివ్ టచ్ డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 1 గిగా హెట్జ్ ప్రాసెసర్, కిట్‌క్యాట్ ఓఎస్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3జీ వీడియో కాలింగ్, ఫ్లాష్‌తో కూడిన 3.2 మెగాపిక్సెల్ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వైఫై వంటి ఫీచర్లున్నాయి. 32జీబీ వరకు మెమరీని విస్తరించుకోవచ్చు. వైట్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కవర్, స్క్రీన్గార్డ్ ఉచితం. -
ఆంధ్ర యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన
విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్శిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఇంటిగ్రేటెడ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో, ఆఫ్ లైన్ ఇంటర్వ్యూల్లో అర్హత లేదంటూ కార్పొరేట్ కంపెనీలు తమను తిరస్కరిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరో వారం రోజుల్లో కోర్సు కాలం పూర్తవుతున్న నేపథ్యంలో దాన్ని మరో యేడాది పొడిగిస్తూ యూనివర్శిటీ ప్రకటన చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు.