
తాడితోట (రాజమహేంద్రవరం): ఈ నెల 14న జియో సంస్థ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు రాజీవ్‌గాంధీ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్‌జేడబ్ల్యూ కెనడీ తెలిపారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017–18 సంవత్సరాలలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. రాజీవ్‌గాంధీ కళాశాలతో పాటు ఇతర కళాశాలల్లో డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చునని తెలిపారు. ఆన్‌లైన్ పరీక్ష, మౌఖిక ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారని వివరించారు. సమావేశంలో జియో హెచ్‌ఆర్ ధామస్, లోకల్ మేనేజర్ మహ్మద్ నాజిర్, ఫైనాన్స్ పీఎస్‌ఎం శ్రీనివాసరావు, రాజీవ్‌గాంధీ కళాశాల సిబ్బంది జోన్స్, రమేష్, శైలజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment