jio
-
మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా?
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు మరోసారి చార్జీలు పెంచే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లతో ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కువ డేటాను వినియోగించే టెలికం చందాదారులు పరిశ్రమకు సహేతుక రాబడిని అందించడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని చేర్చడానికి మరింత చెల్లించాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.కొత్త టెక్నాలజీ వినియోగానికి, డేటా వృద్ధికి తోడ్పడటానికి భారీ పెట్టుబడులు అవసరమని, అదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని అందించడానికి టారిఫ్‌లు అందుబాటు ధరలో కొనసాగించాలని ఆయన అన్నారు. పెట్టుబడిపై సహేతుక రాబడిని అందుకోవడానికి పరిశ్రమకు వీలు కల్పించేందుకు డేటాను మరింత ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు ఎక్కువ చెల్లించినప్పుడు ఇది సాధ్యమవుతుందని వివరించారు.ఇదీ చదవండి: Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటాపరిశ్రమ తన మూలధన వ్యయాన్ని తిరిగి పొందేందుకు టారిఫ్‌ల హేతుబద్ధీకరణ అవసరం అని నొక్కి చెప్పారు. టారిఫ్ పెంపు ఫలితంగా కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన కస్టమర్లను కోల్పోయినప్పటికీ.. మరొకసారి టారిఫ్‌ల పెంపు అవసరమని సూచించారు. టారిఫ్‌ల సవరణ కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా భారీగా చందాదార్లను కోల్పోయాయి. అత్యధికులు బీఎస్ఎన్ఎల్కు మారారు. ‘సెప్టెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ ప్రభావం ఉంది. ఆగస్ట్ నుండి క్రమంగా నవంబర్ వరకు ఆ ప్రభావం చాలా త్వరగా తగ్గుతోంది’ అని మూంద్రా అన్నారు. -
Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటా
రిలయన్స్ జియో తన డేటా-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను అప్డేట్ చేసింది. కొత్త చవక డేటా ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ 10జీబీ డేటాను అందిస్తుంది. పూర్తి యాక్టివ్ ప్లాన్ అవసరం లేకుండా తక్షణ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది.కొత్త డేటా ప్లాన్జియో పరిచయం చేసిన కొత్త చవక డేటా ప్లాన్ ధర రూ. 11. ఈ ప్లాన్ ఒక గంట చెల్లుబాటుతో 10జీబీ డేటాను అందిస్తుంది. ఈ "డేటా-ఓన్లీ" యాడ్-ఆన్లు జియో ప్రామాణిక బూస్టర్ ప్యాక్‌ల నుండి విభిన్నంగా ఉంటాయి. ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రిప్షన్‌తో సంబంధం లేకుండా వినియోగదారుల కోసం స్వతంత్రంగా పనిచేస్తాయి. అయితే వాయిస్ కాల్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లేకపోయినప్పటికీ, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లతో ఈ పరిమితి పెద్దగా ప్రభావం చూపదు.జియోలో ప్రస్తుత డేటా ప్లాన్లు ఇవే..» రూ. 11 ప్లాన్: 10జీబీ డేటా, 1 గంట వ్యాలిడిటీ.» రూ. 49 ప్లాన్: 25జీబీ డేటా, 1 రోజు చెల్లుబాటు.» రూ. 175 ప్లాన్: 10జీబీ డేటా, 28 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే జియోసినిమా ప్రీమియం, సోనీ లివ్‌తో సహా 10 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్.» రూ. 219 ప్లాన్: 30జీబీ డేటా, 30 రోజుల చెల్లుబాటు.» రూ. 289 ప్లాన్: 40జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ.ఇదీ చదవండి: రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్ -
వేలం వేస్తేనే పోటీ.. ట్రాయ్‌కి జియో లేఖ
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్‌కి ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేస్తేనే విదేశీ దిగ్గజాలతో దేశీ టెల్కోలు పోటీపడేందుకు అవకాశాలు లభిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి రాసిన లేఖలో రిలయన్స్ జియో పేర్కొంది. దేశీయంగా మూడు టెల్కోలు అనేక సంవత్సరాలుగా నిర్మించుకున్న సామర్థ్యాల కన్నా స్టార్‌లింక్, క్విపర్ శాట్‌కామ్ బ్యాండ్‌విడ్త్ అధికమని తెలిపింది.శాట్‌కామ్ సంస్థలు కేవలం టెరెస్ట్రియల్ కవరేజీ లేని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తాయి కాబట్టి వాటికి ప్రాధాన్యతనిస్తామనడం సరికాదని జియో వ్యాఖ్యానించింది. స్టార్‌లింక్, క్విపర్, ఇతరత్రా శాట్‌కామ్ దిగ్గజాలు తాము పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా అందించేందుకు పోటీపడతామని ఇప్పటికే వెల్లడించినట్లు తెలిపింది.ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్‌లకు లైసెన్స్.. ఫీజు కూడా!ఈ నేపథ్యంలో స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించిన పక్షంలో వాటితో పోటీపడేందుకు దేశీ సంస్థలకు సమాన అవకాశాలు దొరకవని పేర్కొంది. అంతర్జాతీయ విధానాలకు తగ్గట్లుగా శాట్‌కామ్ స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంతో జియో లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
రూ.11తో 10 జీబీ డేటా!
రిలయన్స్ జియో వినియోగదారులకు కొత్తగా బూస్టర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువగా డేటా వాడుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. ఈమేరకు ప్లాన్ వివరాలు వెల్లడించింది.కేవలం రూ.11తో 10 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు.ఈ ఆఫర్ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది.రీఛార్జ్ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.ఈ ఆఫర్ కేవలం ఇంటర్నెట్ సర్వీసుకే పరిమతం. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులను ఇది అందించదు.నిర్ణీత సమయంపాటు హైస్పీడ్ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది.లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్లు, డౌన్లోడ్ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది.ఇదీ చదవండి: సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు? -
జియో దీపావళి ధమాకా ఆఫర్.. 90 రోజులు అన్లిమిటెడ్
దేశంలో అగ్రగామి టెలికం సంస్థ రిలయన్స్ జియో పరిమిత-కాల దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. మొత్తం 200GB డేటా, అపరిమిత కాల్స్, రూ. 3,350 వరకు విలువైన కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందించే ఈ ప్లాన్ కస్టమర్లకు నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది.ప్రయోజనాలు ఇవే..జియో రూ. 899 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రీపెయిడ్ ప్యాకేజీలో 2GB రోజువారీ డేటాతో పాటు 20GB అదనపు డేటాతో మొత్తం 200GB హై-స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. అలాగే రోజుకు 100 SMS, అపరిమిత కాలింగ్‌ను కూడా కవర్ చేస్తుంది. మీది 5G ఫోన్ అయితే, మీ ప్రాంతంలో 5G నెట్వర్క్ అందుబాటులో ఉంటే ఉచిత అపరిమిత 5Gని కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!అదనపు బెనిఫిట్స్ అజియోలో రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లకు ఫ్లాట్ రూ. 200 తగ్గింపు లభిస్తుంది. ఈజీట్రిప్ ద్వారా చేసిన విమానాలు, హోటల్ బుకింగ్ చేస్తే రూ. 3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. స్విగ్గిలో రూ. 399 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్ చేసినప్పుడు రూ. 150 ఆదా చేయవచ్చు. -
మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో
న్యూఢిల్లీ: మొబైల్ డేటా ట్రాఫిక్‌లో వరుసగా మూడవ త్రైమాసికంలో ప్రపంచ అగ్రగామిగా రిలయన్స్ జియో కొనసాగుతోందని కన్సల్టింగ్, రిసర్చ్ కంపెనీ టెఫిషంట్ తెలిపింది. ప్రపంచ ప్రత్యర్థులను జియో మించిపోయిందంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించింది.జియో, చైనా మొబైల్, ఎయిర్టెల్, చైనా యునికామ్తోపాటు వొడాఫోన్ ఐడియా తదితర ఆపరేటర్ల మొబైల్ డేటా ట్రాఫిక్‌ను పోలుస్తూ ఒక పత్రాన్ని పంచుకుంది. ‘చైనా మొబైల్ కేవలం 2 శాతం వార్షిక వృద్ధి సాధించింది.జియో, చైనా టెలికాం 24 శాతం, ఎయిర్టెల్ 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. చైనా మొబైల్లో ఏం జరుగుతోంది? అంటూ టెఫిషంట్ ప్రశ్నించింది. సెప్టెంబర్ చివరినాటికి జియో మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 47.88 కోట్లుంది. -
బీఎస్ఎన్ఎల్ దూకుడు! మరో మైలురాయికి చేరువలో,,
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది జూలైలో తమ టారిఫ్ ధరలను పెంచినప్పటి నుండి బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తోంది. ప్రైవేట్ సంస్థల ప్లాన్ల కంటే చౌకగా ఉండే వివిధ రీఛార్జ్ ప్లాన్లను కూడా ప్రారంభించింది.ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ స్వదేశీ 4జీ సైట్లను దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో విజయవంతంగా ఏర్పాటు చేసిందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 29 వరకు ఇన్స్టాల్ చేసిన 50,000 సైట్లలో 41,000 సైట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయని తెలిపింది.దేశంలో లక్ష కొత్త టెలికాం టవర్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.24,500 కోట్లు కేటాయించింది. ఇందు కోసం 4జీ పరికరాలను అందించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేతృత్వంలోని కన్సార్టియం సహకారంతో ఆత్మ నిర్భర్ భారత్ చొరవ కింద గతేడాది మేలో ఒప్పందం చేసుకుంది.వీటిలో దాదాపు 36,747 సైట్లు ఫేజ్ 9.2 కింద, 5,000 సైట్లు డిజిటల్ భారత్ నిధి ఫండ్ ద్వారా 4జీ శాచురేషన్ ప్రాజెక్ట్ కింద స్థాపితమయ్యాయి. "ఈ ప్రయత్నాలు 1,00,000 పైగా 4జీ సైట్లను విస్తరించాలనే బీఎస్ఎన్ఎల్ లక్ష్యాన్ని బలపరుస్తున్నాయి. ఇది దాని వేగవంతమైన విస్తరణకు నిదర్శనం" అని సమాచార శాఖ తెలిపింది. -
రిలయన్స్ దీపావళి గిఫ్ట్ చూశారా?
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్‌ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్‌లు ఇస్తూంటాయి. భారత్‌లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్‌బాక్స్ అన్‌బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్‌ను అన్‌బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్‌ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్మిస్) ఉన్నాయి. View this post on Instagram A post shared by sumanasri😍 (@itlu_me_suma)ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది. -
జియోకు కస్టమర్లు షాక్.. కోటి మంది గుడ్ బై..!
-
తక్కువ రీచార్జ్‌తో ఉచితంగా ఓటీటీలు
వెబ్ సిరీస్‌ల నుండి సినిమాల వరకు అన్నింటినీ చూడటానికి ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మంచి ఎంపికగా మారాయి. అయితే వీటిని వీక్షించాలంటే ప్రత్యేక సభ్యత్వం తీసుకోవాలి. అలాంటి అవసరం లేకుండా మొబైల్‌కి రీఛార్జ్ చేసుకుంటే చాలు కొన్ని ఓటీటీలను ఉచితంగా చూసేయచ్చు.దేశంలో అతిపెద్ద యూజర్ బేస్ కలిగిన టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. వీటి ఖర్చు కూడా చాలా తక్కువే. రూ. 500 కంటే తక్కువ ధరకే ఎంపిక చేసిన ప్లాన్లతో మీరు ఈ కాంప్లిమెంటరీ ప్రయోజనాలను పొందవచ్చు.రూ. 448 ప్లాన్జియోటీవీ ప్రీమియం ప్లాన్లలో భాగమైన ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 2జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. ఇందులో సోనీలివ్, జీ5 వంటి డజను ఓటీటీ సేవలు ఉన్నాయి. అంతే కాకుండా జియో యాప్‌లకు యాక్సెస్ కూడా పొందవచ్చు.రూ. 175 ప్లాన్ఇది జియోలో చౌకైన డేటా ప్లాన్. 28 రోజుల చెల్లుబాటుతో 10జీబీ అదనపు డేటాను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఓటీటీల విషయానికి వస్తే సోనీలివ్, జీ5తో సహా 10 ఓటీటీ సేవలను ఉచితంగా ఆనందించవచ్చు.రూ.329 ప్లాన్కొంతమందికి మ్యూజిక్ వినడం ఇష్టంగా ఉంటుంది. యాప్ ద్వారా మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రకటనలు చికాకు పెడతాయి. రూ. 329 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుసుకుంటే ప్రకటన రహితంగా సంగీతాన్ని ఆనందించవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 1.5జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. దీంతో జియోసావన్ ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. -
దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్
రిలయన్స్ జియో.. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 999 రూపాయల వద్ద లభిస్తున్న 4జీ ఫోన్లను కేవలం రూ. 699లకు అందిస్తోంది. ఈ అవకాశం కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2జీ ఫీచర్ ఫోన్స్ నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం.రూ.123 నెలవారీ సబ్స్క్రిప్షన్ & ప్రయోజనాలుపండుగ సీజన్ ఆఫర్ జియో భారత్ ప్లాన్‌తో వినియోగదారులు రూ. 123 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ని ఆస్వాదించవచ్చు. ⋆అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్⋆నెలకు 14 జీబీ డేటా⋆455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు⋆సినిమా ప్రీమియర్లు & కొత్త సినిమాలు⋆వీడియో షోలు⋆లైవ్ స్పోర్ట్స్⋆జియో సినిమాలో హైలెట్స్⋆క్యూఆర్ కోడ్ స్కాన్లతో కూడా డిజిటల్ ట్రాన్సక్షన్⋆జియోపే ద్వారా అందుకున్న చెల్లింపులకు సౌండ్ అలర్ట్‌లను స్వీకరించడం⋆గ్రూప్ చాట్లు⋆జియో చాట్‌లో వీడియోలు, ఫోటోలు, మెసేజింగ్ వంటివి షేర్ చేయడంఇతర ఆపరేటర్లు అందిస్తున్న అతి తక్కువ ఫీచర్ ఫోన్ ప్లాన్‌తో (నెలకు రూ. 199) పోలిస్తే.. జియో భారత్ ప్లాన్ (నెలకు రూ. 123) దాదాపు 40 శాతం చౌకగా ఉంటుంది. దీంతో యూజర్ ప్రతినెలా రూ. 76 ఆదా చేయవచ్చు. ఇలా ఆదా చేస్తే మీరు తొమ్మిది నెలల్లో ఫోన్ కొన్న డబ్బును తిరిగి పొందినట్లే అవుతుంది. ఇది కేవలం ఫోన్ కంటే కూడా మీకు ఇష్టమైనవారికి ఇచ్చే గిఫ్ట్‌గా కూడా పనికొస్తుంది. దీనిని జియోమార్ట్ లేదా అమెజాన్ వంటి వాటిలో కొనుగోలు చేయవచ్చు. -
జియో దీపావళి ఆఫర్స్: రూ.3,350 విలువైన బెనిఫిట్స్
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో 'దీపావళి ధమాకా' పేరుతో కొత్త ఆఫర్స్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ ఈ వినియోగదారుల కోసం ఈ ఆఫర్స్ తీసుకువచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..రిలయన్స్ జియో ప్రకటించిన ఈ ఆఫర్స్ ద్వారా సుమారు రూ. 3,350 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. నవంబర్ 5లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ బెనిఫీట్స్ లభిస్తాయి. రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ.899 రీఛార్జ్ ప్లాన్ మీద, రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ మీద అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.రూ.899 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్స్ 90 రోజుల వరకు అన్లిమిటెడ్ 5జీ సేవలను పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. రూ. 3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ (365 రోజులు) ద్వారా రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు.ప్రయోజనాలుఈజీ మై ట్రిప్ వోచర్: రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 3,000 విలువైన ఈజీ మై ట్రిప్ వోచర్ పొందవచ్చు. దీనిని విమాన ప్రయాణాలను, హోటల్ బుకింగ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.అజియో కూపన్: రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్ళపైన రూ. 200 అజియో డిస్కౌంట్ లభిస్తుంది.స్విగ్గీ వోచర్: ఫుడ్ డెలివరీ కోసం రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్ లభిస్తుంది.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంకూపన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..రిలయన్స్ జియా దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా పొందిన కూపన్లను మై జియో యాప్ సాయంతో క్లెయిమ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.➜మై జియో యాప్ ఓపెన్ చేసి ఆఫర్స్ విభాగంలోకి వెళ్ళాలి➜అక్కడ కనిపించే మై విన్నింగ్స్ మీద క్లిక్ చేసి కూపన్ ఎంచుకోవాలి➜కూపన్ కోడ్ కాపీ చేసి.. ఎక్కడ ఉపయోగించాలనుకుంటున్నారో ఆ వెబ్‌సైట్‌కు వెళ్లి కూపన్ కోడ్ అప్లై చేసుకోవచ్చు. -
JioHotstar: కోటి రూపాయలు ఇచ్చారంటే..: అంబానీకే ఆఫర్ ఇచ్చిన విద్యార్థి
ఢిల్లీ : ఓ విద్యార్థి తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో విఫలమయ్యేవాడు. కానీ ఈసారి గురి తప్పలేదు. యూ ఆర్ వెల్కమ్ అంటూ కేంబ్రిడ్జీ నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే విద్యార్థి ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అందుకే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి ఓ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? విద్యార్థి ఇచ్చిన ఆఫర్‌ను ముఖేష్ అంబానీ స్వీకరిస్తారా? లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఆ కథా కమామిషు ఏంటో ఏంటో తెలుసుకుందాం పదండి.రిలయన్స్,డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రిలయన్స్, డిస్నీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానంతరం డిస్నీప్లస్,హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని, రెండు సంస్థలను కలిసి జియో హాట్‌స్టార్‌గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.జియోహాట్‌స్టార్ పేరుతో ఈ తరుణంలో ఢిల్లీకి చెందిన ఓ డెవలపర్ జియోహాట్‌స్టార్ పేరుతో డొమైన్ బుక్ చేశాడు. ఆదే జియోహాట్‌స్టార్ పేరు మీద వ్యపారావ్యవహారాలు కొనసాగించాలనుకున్న రిలయన్స్‌కు సదరు డెవలపర్ ఆఫర్ ఇచ్చాడు. జియోహాట్‌స్టార్ డొమైన్ పేరును బుక్ చేసుకుంది తానేనని, అది మీకు కావాలంటే ఇస్తాను. ఇందుకోసం మీరు నాకు రూ.కోటి ఇవ్వాలని రిలయన్స్ సంస్థకు లేఖ రాశాడు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ఆ లేఖలో.. నేను 2021లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ యాక్సిలరేట్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన డెవలపర్‌ని. ఐఐటీ పూర్తి చేయలేకపోయాను. అయినప్పటికీ నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మొగ్గుచూపుతుంటాను. టైర్-2 కాలేజీ నుంచి వచ్చిన తనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగంలో పూర్తి స్థాయి డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. కానీ ఆ డిగ్రీలో చేరాలంటే ఖరీదైన వ్యవహారం. నేను భరించలేను. కోటి ఇవ్వాలంటూఅందుకే జియోహాట్‌స్టార్ విలీనం చివరి దశలోకి వచ్చిందని తెలిసింది. వెంటనే జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్‌ను నేను కొనుగోలు చేశారు. విలీనం అనంతరం జియోహాట్‌స్టార్‌గా మీరు వినియోగదారులకు సేవలందించాలంటే నేను కొనుగోలు చేసిన డొమైన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను అడిగినంత మీరు ఇస్తే నా కలను సాకారం చేసినవారవుతారు. ఈ మొత్తం రిలయన్స్ ఖర్చుగా భావిస్తుందేమో కానీ ఇది నాకు జీవితాన్ని మార్చే అవకాశం’అని పేర్కొన్నాడు.మరి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విద్యార్థి అడిగిన మొత్తం ఇస్తారా? లేదంటే సదరు విద్యార్థిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
ఓటీటీలో యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రం 'ప్యూరియోసా ఎ మ్యాడ్ మ్యాక్స్' చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సుమారు ఆరు నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ప్యూరి రోడ్ చిత్ర ప్రాంచైజీలో భాగంగా ఐదో చిత్రంగా తెరకెక్కింది. గత చిత్రాల దర్శకుడు జార్జ్ మిల్లర్నే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే వాటికంటే భారీగా అదే సమయంలో ఒరిజినల్ కథతో రూపొందించారు.'ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా' ఓటీటీ విడుదల ప్రకటన రావడంతో ఫ్యాన్స్ జోష్‌లో ఉన్నారు. అక్టోబర్ 23నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు జియో సినిమా వెల్లడించింది. తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ,కన్నడ, తమిళం,బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని జియో పేర్కొంది. ఇందులో అన్యటైలర్ జాయ్ ఒక యువ మహిళా యోధుని పాత్రలో నటించారు. నటుడు క్రిస్ హేమ్స్ వర్త్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థతో కలిసి మిల్లర్ ఆయన చిరకాల భాగస్వామి, ఆస్కార్ నామినేటెడ్ నిర్మాత డౌగ్ మిథ్చల్ ఆ్రస్టేలియా బేస్డ్ కెన్నడీ మిల్లర్ మిచ్చల్ పతాకంపై నిర్మించారు. -
జియోకి షాక్.. కోటి మంది టాటా!
కొన్ని రోజుల క్రితం రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్‌ను పెంచిన తర్వాత యూజర్లు షాక్ ఇచ్చారు. నివేదికల ప్రకారం పెరిగిన టారిఫ్‌ల ప్రభావం దాని వినియోగదారు బేస్‌పై ప్రతిబింబించింది. రెండవ త్రైమాసికంలో దాదాపు 1.09 కోట్ల మంది వినియోగదారులు జియో నుండి వెళ్లిపోయారు.అదే సమయంలో జియో 5G సబ్‌స్క్రైబర్ బేస్ మాత్రం 17 మిలియన్లు పెరిగినట్లు మొత్తం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో యూజర్ బేస్ 130 మిలియన్లు ఉండగా ఇప్పుడు 147 మిలియన్లకు చేరుకుంది. ఇక ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ. 181.7 నుండి రూ.195.1కి పెరిగింది. అయితే మొత్తంగా జియో సబ్‌స్క్రైబర్ బేస్ క్షీణించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2Dతన యూజర్ బేస్‌కు సంబంధించిన పరిస్థితి గురించి తమకు తెలుసునని, లాభాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపదని జియో తెలిపింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను అందించడంపైనే తమ దృష్టి ఉందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులను కోల్పోవడం తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయదని, అయితే ఇతర టెలికాం ఆపరేటర్లకు ఇది అవకాశం కల్పిస్తుందని జియో అంగీకరించింది. -
Jio నుంచి కొత్త టెక్నాలజీ కంప్యూటర్లుగా మారనున్న టీవీలు
-
Jio నుంచి కొత్త టెక్నాలజీ కంప్యూటర్లుగా మారనున్న టీవీలు
-
5జీ నెట్‌వర్క్‌లో నెంబర్ వన్: తెలుగు రాష్ట్రాల్లో జియో హవా..
5జీ నెట్వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో రిలయన్స్ జియో నెంబర్ వన్‌గా అవతరించింది. 5జీ నెట్వర్క్ కవరేజ్‌లో మాత్రమే కాకుండా , లభ్యతలో కూడా జియో అద్భుతమైన పనితీరును ప్రదర్శిచింది. తాజాగా ఓపెన్ సిగ్నల్ విడుదల చేసిన నివేదికలో.. ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణ) జియో అసాధారణమైన పనితీరును కనపరిచినట్లు వెల్లడించింది.ఓపెన్ సిగ్నల్ నివేదిక ప్రకారం.. జియో 5జీ కవరేజ్ టవర్లు 66.7 శాతం నెట్వర్క్ లభ్యత స్కోర్‌తో దాని ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని జియో వినియోగదారులు మూడింట రెండు వంతులు 5జీ సేవలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద విస్తృతమైన, స్థిరమైన 5జీ కనెక్టివిటీని అందించడంలో జియో ముందంజలో ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.5జీ కవరేజ్ ఎక్స్‌పీరియన్స్‌లో జియో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలలో ముందుంది. 10 పాయింట్ల స్కేల్‌పై జియో 9.0 పాయింట్ల స్కోర్‌తో.. దాని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్టెల్ (7.1 స్కోర్) కంటే ముందు వరసలో ఉంది. జియో ఎప్పటికప్పుడు నిరంతరాయ సేవలను అందిస్తూ ముందుకు సాగుతుండటంతో వినియోగదారులు ఈ సర్వీస్ ఎక్కువగా ఉపయోగించడానికి సుముఖత చూపుతున్నారు.జియో, ఎయిర్టెల్ తరువాత వోడాఫోన్ ఐడియా 3.7 పాయింట్ల స్కోర్, బీఎస్ఎన్ఎల్ 1.2 పాయింట్ల స్కోర్స్ సాధించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో 5G కవరేజీని విస్తరించడంలో బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియాకు సవాలుగా మారింది. అయితే ప్రస్తుతం వినియోగదారులు జియో 5జీ ద్వారా స్పీడ్ డౌన్లోడ్ పొందుతూ మెరుగైన నెట్వర్క్ అనుభవం పొందుతున్నారని సమాచారం. -
జియో స్పీడ్ ఎక్కువే: ఓపెన్ సిగ్నల్!
వేగంగా నెట్వర్క్ సేవలందించడంలో జియో దూసుకుపోతుంది. నెట్వర్క్ స్పీడ్, కవరేజ్, స్థిరమైన సర్వీసులు అందించడంలో జియో మరింత మెరుగుపడిందని ఓపెన్ సిగ్నల్ నివేదించింది. దేశంలోని టెలికాం కంపెనీలతో పోలిస్తే జియో అధికంగా 89.5 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్‌వర్క్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. ‘ఇండియా మొబైల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత టెలికాం నెట్వర్క్ కంపెనీల సేవలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.నివేదికలోని వివరాల ప్రకారం..రిలయన్స్ జియో గరిష్ఠంగా 89.5 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్ కలిగిన నెట్‌వర్క్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ 44.2 ఎంబీపీఎస్, వొడాఫోన్ ఐడియా 16.9 ఎంబీపీఎస్‌తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. జియో నెట్వర్క్ స్పీడ్ ఎయిర్టెల్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ఇది స్ట్రీమింగ్, గేమింగ్, ఇతర డేటా సేవలను మరింత మెరుగ్గా అందించే అవకాశం ఉంది. జియో నెట్వర్క్ సేవలు చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించాయి. ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..దేశీయంగా టెలికాం నెట్వర్క్ సేవలకు సంబంధించి కస్టమర్ల అంచనాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్ గేమ్‌లు, వీడియో స్ట్రీమింగ్, ఇతర డేటా అవసరాల కోసం వేగంగా నెట్వర్క్ ఉండాలనుకుంటున్నారు. అదే సమయంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరుతుతోంది. దాంతో సంస్థలు మెరుగైన సర్వీసులు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలో జియోతోపాటు ఇతర కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దాంతో కస్టమర్ల అట్రిషన్ రేటు(నెట్వర్క్ మారడం) పెరగడంతో జియో విభిన్న మార్గాలు అనుసరిస్తోంది. టారిఫ్ రేట్లను పెంచినప్పటి నుంచి నెట్వర్క్ స్పీడ్ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. కాబట్టి క్రమంగా నెట్వర్క్ స్పీడ్ పెంచుతున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. -
టీవీలు కంప్యూటర్లుగా మారిపోతే.. జియో కొత్త టెక్నాలజీ
రిలయన్స్ జియో మరో కొత్త టెక్నాలజీకి నాంది పలుకుతోంది. ఇంట్లోని స్మార్ట్ టీవీలను తక్కువ ఖర్చుతో సులభంగా కంప్యూటర్లుగా మార్చే సాంకేతికతను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో ప్రదర్శించింది. జియో క్లౌడ్ పీసీ (Jio Cloud PC) అని పిలిచే ఈ టెక్నాలజీ కేవలం కొన్ని వందల రూపాయలకే టీవీని కంప్యూటర్‌గా మారుస్తుంది.ఇందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ టీవీ, టైపింగ్ కీబోర్డ్, మౌస్, జియో క్లౌడ్ పీసీ యాప్ మాత్రం ఉంటే చాలు. స్మార్ట్ టీవీలే కాకుండా సాధారణ టీవీలను సైతం జియోఫైబర్ లేదా జియోఎయిర్‌ఫైబర్‌తో వచ్చే సెట్-టాప్ బాక్స్ ద్వారా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చు. జియో క్లౌడ్ పీసీ అనేది ఇంటర్నెట్ ద్వారా ఏదైనా టీవీని క్లౌడ్ కంప్యూటింగ్‌కు కనెక్ట్ చేసే సాంకేతికత.జియో క్లౌడ్ పీసీ టెక్నాలజీని ఉపయోగించడం చాలా సులభం. యూజర్ యాప్‌లోకి లాగిన్ అయితే చాలు. క్లౌడ్‌లో స్టోర్ అయిన డేటా మొత్తం టీవీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సాధారణంగా కంప్యూటర్లో చేసే ఈమెయిల్, మెసేజింగ్, సోషల్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ సర్ఫింగ్, స్కూల్ ప్రాజెక్ట్‌లు, ఆఫీసు ప్రెజెంటేషన్ల వంటి పనులన్నింటినీ ఇప్పుడు టీవీలో చేయవచ్చు.ఖరీదైన కంప్యూటర్లను కొనుక్కోలేని దేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిది. క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు కాబట్టి, సాధారణ కంప్యూటర్‌తో పోలిస్తే ఇది సురక్షితంగా ఉండటమే కాకుండా డేటా రికవరీని చాలా సులభతరం చేస్తుంది. ఇది టీవీలతో పాటు మొబైల్ పరికరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌కు సంబంధించిన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, రాబోయే నెలల్లో దీనిని మార్కెట్లో విడుదల చేయవచ్చు. -
‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లు ఎందుకు?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్‌గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఫీచర్ ఫోన్లకు ఆదరణ మాత్రం తగ్గడంలేదు. అయితే వివిధ కారణాలతో చాలామంది ఇంకా ఫీచర్ ఫోన్లవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రాథమిక కమ్యునికేషన్ కోసం ఈ ఫీచర్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.స్మార్ట్ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైఫ్ అధికంగా ఉంటుంది.కేవలం కాల్స్, టెక్ట్స్ మెసేజ్‌లు చేయడానికి వీలుగా దీన్ని అధికంగా వాడుతున్నారు.కొన్ని ఆఫీసుల్లో వివిధ కారణాల వల్ల స్మార్ట్ఫోన్లను అనుమతించడం లేదు. దాంతో చాలామంది ఉద్యోగులు తప్పక ఈ ఫీచర్ ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు.స్మార్ట్‌ఫోన్ ఉన్నా కూడా నిత్యం దూర ప్రయాణాలు చేసేవారు బ్యాకప్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు.ఫోన్లకు సంబంధించి సింప్లిసిటీని ఇష్టపడేవారు వీటిని కొనుగోలు చేస్తున్నారు.ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఫీచర్ ఫోన్లను తీసుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ఫోన్ కావాలని మారాం చేసి తీసుకుని కిందపడేసినా పెద్దగా నష్టం ఉండదు.వృద్ధులు, కంటి చూపు సరిగా లేనివారు ఈ ఫీచర్ ఫోన్లను సులువుగా వినియోగించవచ్చు.ఆర్థిక స్థోమత సరిగాలేని వారు ఈ ఫీచర్ ఫోన్లను ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఫోన్ మార్కెట్ 2018-2030 మధ్య కాలంలో ఏటా 3.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారత్‌లో 2023 రెండో త్రైమాసికం లెక్కల ప్రకారం అంతకుముందు ఏడాది అదే త్రైమాసికంతో పోలిస్తే తొమ్మిది శాతం ఈ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి.ఇదీ చదవండి: ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలంఇటీవల రిలయన్స్ జియో కంపెనీ 4జీ నెట్వర్క్ సదుపాయం కలిగిన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 సమావేశంలో భాగంగా ఈ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ధర రూ.1,099గా నిర్ణయించారు. అయితే రిటైలరనుబట్టి ఈ ధరలో మార్పులుంటాయని గమనించాలి. -
జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!
రిలయన్స్ జియో.. ఎట్టకేలకు జియోభారత్ సిరీస్‌లో వీ3, వీ4 ఫోన్లను ఆవిష్కరించింది. 2జీ ఫీచర్ ఫోన్స్ ఉపయోగించే వినియోగదారులను 4జీ డిజిటల్ ప్రపంచంవైపు తీసుకెళ్లడానికి కంపెనీ ఈ మొబైల్స్ రూపొందించింది. ఇవి చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.ధరజియోభారత్ సిరీస్ మొబైల్ ఫోన్స్ ధర కేవలం రూ.1099 మాత్రమే కావడం గమనార్హం. వీ3, వీ4 రెండు మోడల్స్ త్వరలో ఫిజికల్ మొబైల్ సెల్లింగ్ అవుట్లెట్లలో మాత్రమే కాకుండా జియో మార్ట్, అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. దీని ధర దాని ప్రత్యర్థుల కంటే కూడా 40 శాతం తక్కువ. జియో భారత్ సిరీస్ ఫోన్ కేవలం రూ.123 రీఛార్జ్ ప్లాన్‌తో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14 జీబీ వరకు డేట్ లభిస్తుంది.బ్యాటరీ & స్టోరేజ్జియోభారత్ సిరీస్ వీ3, వీ4 ఫోన్స్ 1000 mAh బ్యాటరీ పొందుతాయి. 125 జీబీ వరకు స్టోరేజిని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్స్ 23 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తాయి.వీ3, వీ4 రెండు మోడల్‌ల ద్వారా యూజర్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందవవచ్చు. జియో టీవీ వినియోగదారులు ఈ మొబైల్స్ ద్వారా తమకు ఇష్టమైన షోలు, వార్తలు లేదా గేమ్స్ వంటి వాటిని వీక్షించడానికి 455 కంటే ఎక్కువ లైవ్ ఛానెల్ యాక్సెస్ పొందుతారు.ఇదీ చదవండి: లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లుజియోపే, యూపీఐ ఇంటిగ్రేషన్, ఇంటర్నల్ సౌండ్ బాక్స్‌తో, డిజిటల్ పేమెంట్లు సులభంగా చేసుకోవడానికి కూడా ఈ మొబైల్స్ ఉపయోగపడతాయి. జియోచాట్ యూజర్లు అన్లిమిటెడ్ మెసేజింగ్, ఫొటో షేరింగ్, గ్రూప్ చాట్ వంటి ఆప్షన్స్ పొందుతారు. తద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈజీగా కనెక్ట్ ఈ ఫోన్స్ అనుమతిస్తాయి. -
బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’
దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ మొబైల్ టారిఫ్‌లను 15 శాతం వరకు పెంచాయి. ఈ ధరల పెంపు చాలా మంది వినియోగదారులను బీఎస్ఎన్ఎల్కి మారడానికి ప్రేరేపించింది. పెరుగుతున్న ఈ ఆసక్తికి అనుగుణంగా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ తన 4జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించే ప్రైవేటు టెలికాం కంపెనీలకు పోటీగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను కూడా మెరుగుపరుస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల తన చవకైన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై స్పీడ్ లిమిట్స్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కంపెనీ తన రూ.249, రూ.299, రూ.329 ప్లాన్లలో వేగాన్ని పెంచింది.రూ. 249 ప్లాన్ఈ ప్లాన్‌లో గతంలో 10 Mbps వేగంతో నెట్ వచ్చేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద 10 GB నెట్‌ను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. దీని తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కొత్త సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్.. 105 రోజులు అన్లిమిటెడ్రూ. 299 ప్లాన్ఇందులోనూ నెట్ స్పీడ్ 10 Mbps నుండి 25 Mbpsకి పెరిగింది. పరిమితిని చేరుకున్న తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కూడా ఫెయిర్ యూసేజ్ పాలసీ 20జీబీ నెట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ కొత్త వినియోగదారులకు మాత్రమే.రూ. 329 ప్లాన్ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో మామూలుగా 20 Mbps నెట్ స్పీడ్ ఉండేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఇక 1000 జీబీ గణనీయమైన ఎఫ్‌యూపీని అందిస్తుంది. ఆ తర్వాత వేగం 4 Mbpsకి తగ్గుతుంది. ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. -
జియో కొత్త ఐఎస్డీ ప్లాన్లు.. రూ.39కే!
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఐఎస్డీ రీఛార్జ్ ప్లాన్లను పునరుద్ధరించింద. కొత్త ప్లాన్లు కేవలం రూ.39 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త ప్లాన్లతో 7 రోజులపాటు ఐఎస్డీ కాల్స్ చేసుకోవచ్చని, అత్యంత తక్కువ ధరలకు ఐఎస్డీ మినిట్స్ అందిస్తున్నట్లు జియో పేర్కొంది.జియో బంగ్లాదేశ్, యూకే, సౌదీ అరేబియా, నేపాల్, చైనా, జర్మనీ, నైజీరియా, పాకిస్తాన్, ఖతార్, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇండోనేషియా కోసం ఐఎస్డీ రీఛార్జ్ ప్లాన్ రేట్లను సవరించింది.యూఎస్, కెనడా కోసం జియో ఐఎస్డీ ప్లాన్ రూ.39 నుండి ప్రారంభమవుతుంది. 7 రోజుల చెల్లుబాటుతో 30 నిమిషాల టాక్ టైమ్‌ని అందిస్తోంది. అదే విధంగా బంగ్లాదేశ్‌కు రూ.49 ప్లాన్ 20 నిమిషాల టాక్ టైమ్, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్‌లకు రూ.59 ప్లాన్ 15 నిమిషాల టాక్ టైమ్‌ని అందిస్తోంది.ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు 15 నిమిషాల టాక్ టైమ్‌తో రూ.69 రీఛార్జ్ ప్లాన్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లకు 10 నిమిషాల టాక్ టైమ్‌తో రూ.79 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
ఆకర్షణీయమైన బెనిఫిట్లతో జియో కొత్త రీచార్జ్ ప్లాన్లు
రిలయన్స్ జియో (Jio) తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఇటీవల సగటున 15 శాతం పెంచింది. దీనిపై కస్టమర్ల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అప్డేట్లో భాగంగా కంపెనీ ఇప్పటికే ఉన్న ప్లాన్లపై కొన్ని ప్రయోజనాలను జియో సవరించింది.వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణగా జియో కొత్త ఆప్షన్లను రూపొందించింది. కొత్త ఆఫర్లలో రూ. 1,028, రూ. 1,029 రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ రెండూ వినియోగదారులకు సమగ్ర ప్రయోజనాలను అందించేలా రూపొందించారు. ఏ ప్లాన్ ఏయే బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.రూ. 1,028 ప్లాన్జియో రూ. 1,028 ప్లాన్ 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. అదనంగా సబ్స్క్రైబర్లు 2జీబీ రోజువారీ డేటాను అందుకుంటారు. ప్లాన్ వ్యవధిలో మొత్తం 168జీబీ లభిస్తుంది. జియో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.రూ. 1,028 ప్లాన్‌లో స్విగ్గీ వన్ లైట్ మెంబర్షిప్ ఉంది. తరచుగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ఇది సరైనది. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ సేవలకు కూడా యాక్సెస్‌ను పొందుతారు.రూ. 1,029 ప్లాన్జియో రూ. 1,029 ప్లాన్ విషయానికి వస్తే అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు 84 రోజులపాటు ఆనందించవచ్చు. రోజూ 2జీబీ 4జీ డేటా, అందుబాటులో ఉన్న చోట అపరిమిత 5జీ డేటా వినియోగించుకోవచ్చు. స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించే వినియోగదారులకు ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనాలను అందిస్తుంది. దీంతోపాటు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్కి యాక్సెస్ ఉంటుంది.