రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త సంవత్సరం సందర్భంగా నూతన ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేకమైన ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ 2025’ గడువు డిసెంబర్ 11, 2024 నుంచి జనవరి 11, 2025 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో రీఛార్జ్ ప్లాన్‌తోపాటు కూపన్లను కూడా అందించనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ.2025తో రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..
ప్లాన్ వివరాలు
- 200 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్‌నెట్ యాక్సెస్.
- 500 జీబీ 4జీ డేటా (రోజుకు 2.5 GB).
- అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ సదుపాయం.
- పార్టనర్ కూపన్ల రూపంలో రూ.2150 విలువైన అదనపు ప్రయోజనాలు.
- రూ.500 అజియో కూపన్. రూ.2500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే ఈ కూపన్ ఉపయోగించవచ్చు.
- స్విగ్గీపై రూ.150 తగ్గింపు. కనిష్ట ఆర్డర్ రూ.499 పై వర్తిస్తుంది.
- ఈజ్ మై ట్రిప్ పై రూ.1500 తగ్గింపు: మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫ్లైట్ బుక్ చేస్తే ఈ కూపన్ వినియోగించుకోవచ్చు.
- ఈ ప్లాన్ నెలవారీ రూ.349 ప్యాకేజీతో పోలిస్తే మొత్తంగా రూ.468 సేవింగ్స్‌ను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment