భారతీయ టెలికమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ జియో తన కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన ఈ ప్లాన్స్ జులై 3నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లతో పోలిస్తే కొత్తగా అమలులోకి వచ్చే ప్లాన్స్ ధరలు 20శాతం ఎక్కువ.
కంపెనీ వెల్లడించిన డేటా ప్రకారం.. జులై 3నుంచి 155 రూపాయల ప్లాన్ 189 రూపాయలకు, 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలకు చేరుతుంది. రూ. 2999 యాన్యువల్ ప్లాన్.. త్వరలో 3599 రూపాయలకు చేరుతుంది. దీనికి సంబంధించిన వివరాలను జియో అధికారికంగా వెల్లడించింది.
జియో మొత్తం మీద 2 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ల ధరలు, 17 ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను ఒక్కసారిగా పెంచుతూ ప్రకటించింది. జియో ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ నేతృత్వంలో ఉంది. కొత్త రీఛార్జ్ ధరలు తప్పకుండా యూజర్ల మీద భారం చూపిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Reliance Jio introduces new unlimited 5G plans to be available from 3rd July pic.twitter.com/TsDMAG682r
— ANI (@ANI) June 27, 2024
Comments
Please login to add a commentAdd a comment