Plans
-
అక్కినేని వారి మరో పెళ్లి సందడి.. శోభిత- నాగచైతన్యకే ఆ బాధ్యతలు..! (ఫోటోలు)
-
క్రిప్టో కరెన్సీకి జాతీయ ప్రాధాన్యత.. ట్రంప్ యోచన!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలిచాక క్రిప్టో కరెన్సీకి (cryptocurrency) కొత్త ఊపు వచ్చింది. ట్రంప్ మొదటి నుంచి కూడా క్రిప్టో కరెన్సీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా జాతీయ ప్రాధాన్యత అంశంగా క్రిప్టో కరెన్సీని మార్చేందుకు ఉత్తర్వులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది.ఈ చర్య అమెరికా విధాన మార్పును సూచిస్తుందని, ప్రభుత్వ నిర్ణయాలను రూపొందించడంలో క్రిప్టో పరిశ్రమకు మరింత ప్రాముఖ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. నివేదికలో పేర్కొన్న మూలాల ప్రకారం.. ఈ ఉత్తర్వులు క్రిప్టోకరెన్సీని జాతీయ ఆవశ్యకతగా నిర్దేశిస్తాయి. క్రిప్టో పరిశ్రమకు ప్రభుత్వ ఏజెన్సీలు సైతం సహకారం అందిస్తాయి. అంతేకాకుండా పరిశ్రమ విధాన అవసరాల కోసం క్రిప్టోకరెన్సీ సలహా మండలిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కాయిన్‌బేస్, రిపుల్ వంటి ప్రముఖ సంస్థల నుండి విరాళాలతో సహా క్రిప్టోకరెన్సీ పరిశ్రమ నుండి గణనీయమైన మద్దతును పొందారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో రానున్న కొత్త ప్రభుత్వంతో తమ బంధాన్ని సూచించేలా వాషింగ్టన్లో క్రిప్టో పరిశ్రమ వేడుకలకు సిద్ధమైందిజాతీయ బిట్‌కాయిన్ నిధియూఎస్లో జాతీయ బిట్‌కాయిన్ (Bitcoin) నిధిని సృష్టించడం పరిశీలనలో ఉన్న మరో కీలక అంశంగా నివేదిక పేర్కొంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్‌ను కలిగి ఉంది. నవంబర్ ఎన్నికల నుండి బిట్‌కాయిన్ ధర దాదాపు 50% పెరిగింది. భవిష్యత్తులో క్రిప్టో నిల్వలు పెరుగుతాయన్న ఊహాగానాల కారణంగా బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు చేరుకుంది.ప్రతిపాదిత నిధి ప్రభుత్వం బిట్కాయిన్లను కలిగి ఉండటాన్ని లాంఛనప్రాయంగా మారుస్తుంది. క్రిప్టోకరెన్సీ పట్ల ప్రభుత్వ వైఖరిలో వ్యూహాత్మక మార్పును ప్రతిబింబిస్తుంది. బిట్‌కాయిన్ 2024లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. దాని విలువ సంవత్సరంలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది.బైడెన్ పాలనలో ఒడుదొడుకులుఅధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో అనేక నియంత్రణ సవాళ్లను ఎదుర్కొన్న క్రిప్టో రంగానికి ఈ చొరవ భారీ మార్పును సూచిస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)తో సహా ఫెడరల్ ఏజెన్సీలు ఇటీవలి సంవత్సరాలలో క్రిప్టో కంపెనీలకు వ్యతిరేకంగా 100 కుపైగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాయి. -
ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండి
గతంలో రీఛార్జ్ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ అయినా వచ్చేవి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. కాబట్టి రీఛార్జ్ ముగిసిన తరువాత తప్పకుండా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అయితే కొందరు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాలంటే కొంత కష్టమనుకుంటారు, అలాంటి వారు ఆరు నెలలకు లేదా ఏడాదికి రీఛార్జ్ చేసుకుంటారు. ఈ కథనంలో 84 రోజుల ప్లాన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..జియో (Jio)రిలయన్స్ జియో అందిస్తున్న అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.799 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా (మొత్తం 126 జీబీ), రోజులు 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్స్ వంటివి లభిస్తాయి. రోజువారీ డేటా పూర్తయిన తరువాత 64 kbps వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. జియో టీవీ, జిఓ సినిమా, జిఓ క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.బీఎస్ఎన్ఎల్ (BSNL)బీఎస్ఎన్ఎల్ 84 రోజుల ప్లాన్ ధర రూ. 628 మాత్రమే. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 40 kbpsకు తగ్గుతుంది.ఎయిర్టెల్ (Airtel)ఎయిర్టెల్ 84 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 509. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారుడు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా (84 రోజులకు) లభిస్తుంది. ఈ డేటా పూర్తయిపోతే.. ఒక ఎంబీకి 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారు.. అన్లిమిటెడ్ 5జీ డేటాకు అనర్హులు. ఇందులో ఫ్రీ హలోట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్, అపోలో 24/7, స్పామ్ కాల్స్ వంటివి ఉన్నాయి.వీఐ (వొడాఫోన్ ఐడియా)వొడాఫోన్ ఐడియా అందించే అతి చౌకైన ప్లాన్‌లో రూ. 509 కూడా ఒకటి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీనిని రీఛార్జ్ చేసుకున్న యూజర్లు అన్లిమిటెడ్ కాల్స్, 1000 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా వంటివి పొందుతారు. ఎస్ఎమ్ఎస్లు, డేటా అనేది మొత్తం ప్యాక్‌కు అని గుర్తుంచుకోవాలి. కాబట్టి అది ఖాళీ అయితే మళ్ళీ వాటి కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర అదనపు ప్రయోజనాలు కూడా ఏమీ లభించవు. -
‘అన్లిమిటెడ్’ ప్లాన్లు ఉంటాయా? కంపెనీల వైఖరి ఇదే..
టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ప్రతిపాదనలతో అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమ ప్రియమైన అన్లిమిటెడ్ మొబైల్ రీచార్జ్ ప్యాకేజీలు ఆగిపోతాయేమోనని కోట్లాది మంది టెలికాం యూజర్లు ఆందోళన చెందుతున్నారు.అవసరం లేకపోయినా అన్ని కలిపి అందించే అన్లిమిటెడ్ ప్యాక్‌లు కాకుండా గతంలో మాదిరి కాలింగ్, ఎస్ఎంఎస్లకు విడివిడిగా ప్యాక్‌లు అందించే విషయంపై టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ఇటీవల టెలికాం కంపెనీల స్పందన కోరింది. దీనికి ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా తమ వైఖరిని తెలియజేశాయి. తమ రీఛార్జ్ ప్లాన్ల ప్రస్తుత నిర్మాణాన్ని సమర్థించుకున్నాయి.ఎయిర్టెల్ ఏం చెప్పిందంటే.. ఎయిర్టెల్ ట్రాయ్‌కి ఇచ్చిన స్టేట్మెంట్లో తమ ప్రస్తుత ప్లాన్లు సూటిగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయని పేర్కొంది. ఈ ప్లాన్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను కలిపి అందిస్తున్నాయని చెప్పింది. ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్యాక్‌ల మోడల్‌కి తిరిగి వెళ్లడం పరిశ్రమను కాలం చెల్లిన సిస్టమ్‌గా మారుస్తుందని, విడివిడి రీఛార్జ్‌లతో వినియోగదారులకూ భారం పడుతుందని బదులిచ్చింది.జియోదీ అదే వైఖరిఎయిర్టెల్ వైఖరికి సమర్థిస్తూ జియో కూడా తమ సర్వే డేటాను సమర్పించింది. 91 శాతం మంది వినియోగరులు ప్రస్తుత టెలికాం ప్లాన్లను మోస్ట్ అఫర్డబుల్‌గా భావిస్తున్నారని, 93 శాతం తమకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తున్నాయని నమ్ముతున్నారని పేర్కొంది. ఈ గణాంకాలు వినియోగదారులలో అపరిమిత మోడల్ విస్తృత ఆమోదాన్ని తెలియజేస్తున్నాయని జియో వివరించింది.ఆధునిక టెలికాం సేవలలో డేటా ప్రధాన అంశంగా మారిందని, అపరిమిత డేటా, కాలింగ్ మోడల్‌ను పే-యాజ్-యు-గో ప్రత్యామ్నాయం కంటే మెరుగైనదిగా టెలికాం కంపెనీలు నొక్కిచెప్పాయి. ఈ ప్లాన్లలో మార్పులు ప్రస్తుత వినియోగదారు అనుభవానికి అంతరాయం కలిగించవచ్చని పరిశ్రమ ఏకీకృత వైఖరి తెలియజేస్తోంది. ఇక దీనిపై ట్రాయ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
యూజర్లకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్
భారతీయ టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ జియో తన కొత్త అన్లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన ఈ ప్లాన్స్ జులై 3నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాన్లతో పోలిస్తే కొత్తగా అమలులోకి వచ్చే ప్లాన్స్ ధరలు 20శాతం ఎక్కువ.కంపెనీ వెల్లడించిన డేటా ప్రకారం.. జులై 3నుంచి 155 రూపాయల ప్లాన్ 189 రూపాయలకు, 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలకు చేరుతుంది. రూ. 2999 యాన్యువల్ ప్లాన్.. త్వరలో 3599 రూపాయలకు చేరుతుంది. దీనికి సంబంధించిన వివరాలను జియో అధికారికంగా వెల్లడించింది.జియో మొత్తం మీద 2 పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు, 17 ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఒక్కసారిగా పెంచుతూ ప్రకటించింది. జియో ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ నేతృత్వంలో ఉంది. కొత్త రీఛార్జ్ ధరలు తప్పకుండా యూజర్ల మీద భారం చూపిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.Reliance Jio introduces new unlimited 5G plans to be available from 3rd July pic.twitter.com/TsDMAG682r— ANI (@ANI) June 27, 2024 -
ఒకే ప్లాన్‌తో టీవీ చానళ్లు, ఓటీటీ యాప్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకే ప్లాన్‌తో ఇటు టీవీ చానళ్లు, అటు ఓటీటీ యాప్స్‌ను కూడా పొందే విధంగా డిష్ టీవీ కొత్తగా స్మార్ట్‌ప్లస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాన్ కిందే వీటిని పొందవచ్చని సంస్థ సీఈవో మనోజ్ దోభల్ తెలిపారు.రూ. 200 ప్యాక్ నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. పాత, కొత్త కస్టమర్లు.. స్మార్ట్‌ప్లస్ కింద సదరు ప్లాన్‌లోని టీవీ ఛానళ్లతో పాటు డిఫాల్టుగా లభించే హంగామా వంటి అయిదు ఓటీటీ యాప్‌లతో పాటు జీ5, డిస్నీప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్ తదితర యాప్‌ల నుంచి ఒకటి ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే మూడు రోజుల తర్వాత మరో యాప్‌నకు మారవచ్చు.పూర్తిగా 16 యాప్‌లు పొందాలంటే నెలకు రూ. 179 చార్జీ ఉంటుంది. కొత్త సర్వీసులతో మార్కెట్ వాటా 3–4 శాతం మేర పెంచుకోగలమని ఆశిస్తున్నట్లు మనోజ్ తెలిపారు. ప్రస్తుతం తమకు డీటీహెచ్ మార్కెట్లో 21 శాతం వాటా ఉందని వివరించారు. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో ఆండ్రాయిడ్ 4కే బాక్స్, క్లౌడ్ టీవీ వంటి ఉత్పత్తులు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. -
అదిరిపోయే లాభాలు ఇస్తున్న మ్యూచువల్ ఫండ్
-
ఫ్లైట్ ఎక్కుతున్నారా? అయితే ఈ రీచార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి..
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితంలో భాగమైపోయాయి. వీటిని వినియోగించకుండా నిమిషాలు కూడా ఉండలేని పరిస్థతి. విమాన ప్రయాణంలో సాధారణ రీచార్జ్ ప్లాన్లు పనిచేయవని మనందరికీ తెలుసు. ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లు ఉంటేనే ఫ్లైట్‌లో ఉన్నంత సేపూ కాలింగ్ కానీ, ఇంటర్నెట్ కానీ వినియోగించుకునేందుకు వీలుంటుంది. టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, రిలయన్స్ జియో కొన్ని ఇన్-ఫ్లైట్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి ఫ్లైట్‌లో ఉన్నప్పుడు యూజర్లు కనెక్ట్ అయి ఉండేందుకు వీలు కల్పిస్తాయి. ఈ ప్లాన్లు డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలను అందిస్తాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అందిస్తున్న ఇన్-ఫ్లైట్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. జియో రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు -
కొత్త సంవత్సరంలో సీమా హైదర్ ప్లానేమిటి?
2023 ముగిసింది. 2024 నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. అందరూ తమ ఆశలు, అంచనాలతో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్నారు. 2023లో వార్తల్లో కనిపించిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్ కూడా కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించారు. 2023 తనకు ఎంతో మంచి చేసిందని సీమా హైదర్ మీడియాకు తెలిపారు. 2024లో తన సమస్యలన్నీ తొలగిపోతాయని, కుటుంబంతో కలిసి భారతదేశంలో స్వేచ్ఛగా జీవితాన్ని గడిపే అవకాశం దక్కుతుందని ఆశ పడుతున్నానని ఆమె పేర్కొన్నారు. మే 2023లో నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో సహా యూపీ చేరుకున్న సీమా హైదర్ ప్రస్తుతం రబుపురా గ్రామంలోని తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లో ఉంటున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలనే నిబంధన ఉందని, అందుకే ఇంటిలోనే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నానని సీమా తెలిపారు. తనకు బయటకు వెళ్లే అవకాశం దొరికినప్పుడు దేశమంతా పర్యటించాలని కోరుకుంటున్నానని, తన భర్త, పిల్లలు ఇంటి బయట నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. అయితే తన నలుగురు పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ దొరకని పరిస్థితి ఉందని, అందుకే వారు ట్యూషన్‌కు వెళుతున్నారని ఆమె తెలిపారు. అయితే 2024లో తన పిల్లలను బడికి పంపించే అవకాశం దక్కుతుందనుకుంటున్నానని సీమ పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ తన పిల్లలతో కలిసి 2023, మే 13న నేపాల్ మీదుగా భారత్‌కు తరలివచ్చారు. తరువాత రబుపురా గ్రామం చేరుకుని తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లో ఉంటున్నారు. కాగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమాపై గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను, సచిన్, సచిన్ తండ్రిని అరెస్ట్ చేశారు. ముగ్గురినీ గత జూలై 4న అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురికీ బెయిల్ మంజూరైంది. ఇది కూడా చదవండి: వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు -
టాప్-5 డైట్ ప్లాన్స్... 2023లో ఇలా బరువు తగ్గారట!
2023లో కొన్ని డైట్ ప్లాన్లు వార్తల్లో నిలిచాయి. వీటిలో వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనకరంగా ఉండే డైట్ ప్లాన్ కూడా ఉంది. ఆ వివరాలతో పాటు 2023లో చర్చకు వచ్చిన టాప్-5 డైట్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెడిటేరియన్ డైట్ 2023లో మెడిటేరియన్ డైట్ అధికంగా చర్చల్లోకి వచ్చింది. చాలా మంది దీనిని అనుసరించారు. ఈ డైట్ ప్లాన్‌లో వారానికోసారి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. చక్కెర, కొవ్వు పదారార్థాలు తీసుకోకూడదు. గుండెపోటు, స్ట్రోక్, టైప్ -2 డయాబెటిస్ బాధితులు వైద్యుల సూచనల మేరకు ఈ ప్లాన్ అనుసరించారు. 2. వెయిట్ వాచర్స్ రెసిపీ డైట్ వెయిట్ వాచర్స్ రెసిపీలో వేగంగా బరువు తగ్గడంలో సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో సహాయపడే ఆహార ప్రణాళిక దీనిలో ఉంది. దీనిలో రెండు ఫార్ములాలు ఉన్నాయి. మొదటి ఫార్ములాలో ఆహారంలో నూనె పదార్థాలకు దూరంగా ఉండటం. రెండవ ఫార్ములా.. అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం. అలాగే కార్బోహైడ్రేట్లు వీలైనంత తక్కువగా తీసుకోవడం. 3. కీటో డైట్ కీటో డైట్లో తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు పదార్ధాల వినియోగంపై దృష్టి పెట్టాలి. కీటో డైట్ ద్వారా కొన్ని వారాల్లోనే వేగంగా బరువు తగ్గవచ్చు. వైద్యులు పర్యవేక్షణలో ఈ డైట్‌ని ఎంచుకోవాలి. ఎందుకంటే దీనిని దీర్ఘకాలం పాటు ఫాలో చేస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. 4. డాష్ డైట్ డాష్ డైట్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెబుతారు. డాష్ అంటే హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడానికి ఉపయోగపడే డైట్ ప్లాన్. ఇది అధిక రక్తపోటు నియంత్రణకు రూపొందించిన ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక. హృద్రోగులు దీనిని పాటిస్తుంటారు. 5. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అడపాదడపా ఉపవాసం. ప్రతిరోజూ కొంత సమయం లేదా వారంలో ఒకరోజు ఏమీ తినకుండా ఉండటం. అడపాదడపా ఉపవాసంలో ప్రతిరోజూ కొన్ని గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. లేదా వారంలో ఒక రోజు ఉపవాసం చేసి, మరుసటి రోజు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. ఈ ఐదు డైట్ ప్లాన్లు 2023లో అత్యంత ఆదరణ పొందాయి. ఇది కూడా చదవండి: గ్యాస్ చాంబర్‌గా రాజధాని.. కనిపించని సూర్యుడు! -
కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా.. రెండు టాపప్ ప్లాన్లు తీసుకోవచ్చా?
నేను స్వయం ఉపాధిపై ఆధారపడి ఉన్నాను. రూ.4 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. అదే బీమా సంస్థ నుంచి రూ.6 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కూడా ఉంది. అంటే నా ముగ్గురు సభ్యుల కుటుంబానికి మొత్తం రూ.10 లక్షల కవరేజీ ప్రస్తుతానికి ఉంది. రూ.10 లక్షల డిడక్టబుల్‌తో రూ.40 లక్షల సూపర్ టాపప్ ప్లాన్‌ను మరో బీమా సంస్థ ఆఫర్ చేస్తోంది. దాని ప్రీమియం చాలా తక్కువ. ఇప్పుడు రూ.40 లక్షలకు సూపర్ టాపప్ తీసుకుంటే మొత్తం కవరేజీ రూ.50 లక్షలకు పెరుగుతుందా? నేను రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండొచ్చా? – తన్మోయ్ పంజా టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది డిడక్టబుల్కు పైన ఉన్న మొత్తానికి బీమా కవరేజీని ఇస్తుంది. డిడక్టబుల్ అంటే, అంత మొత్తాన్ని పాలసీదారు భరించాల్సి ఉంటుంది. అంతకు మించిన మొత్తానికి సూపర్ టాపప్ కవరేజీ అమల్లోకి వస్తుంది. సూపర్ టాపప్ ప్లాన్ తీసుకునేందుకు బేసిక్ కవరేజీ ఉండాలనేమీ లేదు. బేసిక్ టాపప్ ప్లాన్‌లో డిడక్టబుల్ అనేది హాస్పిటల్లో చేరిన ప్రతి సందర్భంలోనూ అమలవుతుంది. కానీ, సూపర్ టాపప్ ప్లాన్‌లో ఒక ఏడాది మొత్తం మీద అయిన హాస్పిటల్ ఖర్చులకు డిడక్టబుల్ అమలవుతుంది. కనుక టాపప్ ప్లాన్లతో పోలిస్తే సూపర్ టాపప్ ప్లాన్ మరింత ప్రయోజనకరం అని చెప్పుకోవాలి. ఒకే సమయంలో రెండు సూపర్ టాపప్ ప్లాన్లను కలిగి ఉండే విషయంలో ఎలాంటి నియంత్రణలు లేవు. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లో లేని మెరుగైన సదుపాయాలను కొత్త సూపర్ టాపప్ ప్లాన్ ఆఫర్ చేస్తుంటే నిస్సందేహంగా తీసుకోవచ్చు. బేసిక్ పాలసీలో లేని రక్షణను సూపర్ టాపప్ ప్లాన్ ఇస్తుంటే తీసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ రూ.2 లక్షల కవరేజీని ఇస్తుంటే, రూ.2 లక్షల డిడక్టబుల్‌తో రూ.5 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ ఉంటే.. ఇప్పుడు రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.10 లక్షలకు మరో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటే తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఆస్పత్రి బిల్లు రూ.18 లక్షలు అయిందనుకోండి. అప్పుడు బేసిక్ పాలసీ నుంచి రూ.2 లక్షలు, మొదటి సూపర్ టాపప్ నుంచి రూ.5 లక్షలు చెల్లింపులు లభిస్తాయి. అప్పుడు మరో రూ.11 లక్షలు మిగిలి ఉంటుంది. రెండో సూపర్ టాపప్ ప్లాన్ నుంచి రూ.10 లక్షలు చెల్లింపులు వస్తాయి. మిగిలిన రూ.లక్షను పాలసీదారుడు భరించాల్సి ఉంటుంది. అయితే, ఎక్కువ సూపర్ టాపప్ ప్లాన్లు ఉంటే బీమా ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది. బేసిక్ పాలసీకి అదనంగా ఒక సూపర్ టాపప్ ప్లాన్‌ను కలిగి ఉండడం సూచనీయం. మూడు బీ మా సంస్థల వద్ద క్లెయిమ్ కోసం చేయాల్సిన పేపర్ పని ప్రతిబంధకంగా మారుతుంది. కనుక కవరేజీని సాధ్యమైనంత సులభంగా ఉంచుకోవాలి. నేను 1994లో మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. అందుకు సంబంధించి భౌతిక సర్టిఫికెట్ నా వద్ద ఉంది. ఈ మొత్తాన్ని ఎలా ఉపసంహరించుకోవాలి? వీటి విలువ ఎంత? – వచన్ 2014లో మోర్గాన్ స్టాన్లీ భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయింది. మోర్గాన్ స్టాన్లీ నిర్వహణలోని ఎనిమిది మ్యూచువల్ ఫండ్ పథకాలను హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్ హెచ్డీఎఫ్సీ లార్జ్‌క్యాప్ ఫండ్‌లో విలీనం అయింది. హెచ్డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్ 2009 వరకు హెచ్డీఎఫ్సీ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌గా కొనసాగింది. 15 ఏళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన అనంతరం ఇది ఓపెన్ ఎండెడ్ పథకంగా మార్పు చెందింది. ఇప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే, హెచ్డీఎఫ్సీ అస్సె ట్ మేనేజ్మెంట్ కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. మోర్గాన్ స్టాన్లీ గ్రోత్ ఫండ్‌లో మీ పెట్టుబడులకు సంబంధించి ఆధారాలను సమరి్పంచాలి. అ ప్పుడు మీ పెట్టుబడులను వెనక్కి తీసుకునే విషయమైన వారి నుంచి తగిన సహకారం లభిస్తుంది. సమాధానాలు ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..! కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి ఉచిత వైద్యం అందేలా నూతన విధానాన్ని రూపొందించింది. మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. “ప్రమాదంలో గాయపడిన బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స అందించడం మోటారు వాహన చట్టం 2019 సవరణలో భాగం. కొన్ని రాష్ట్రాలు దీనిని ఇప్పటికే అమలు చేశాయి. అయితే ఇప్పుడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి రోడ్ల మంత్రిత్వ శాఖ దీనిని దేశవ్యాప్తంగా పూర్తిగా అమలు చేయనుంది” అని రోడ్డు రవాణా, హైవేస్ సెక్రటరీ అనురాగ్ జైన్ చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే దీని ఉద్దేశమని అనురాగ్ జైన్ తెలిపారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేస్తామన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఇది అందుబాటులోకి రానుందన్నారు. ఇదీ చదవండి: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖరారు!? -
పుల్ అండ్ పుష్ ట్రైన్ అంటే ఏమిటి? ఎక్కడ నడవనుంది?
భారతదేశంలో ప్రస్తుతం రవాణా రంగంలో నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు, నిర్మాణాలు జరుగుతున్నాయి. సాధారణ రైళ్లను ఆధునీకరిస్తున్నారు. సెమీ హైస్పీడ్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. ర్యాపిడ్ రైలు ప్రారంభం కానుంది. బుల్లెట్ రైళ్లకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ భారత్ పుల్ అండ్ పుష్ రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. పుల్ అండ్ పుష్ రైళ్ల నిర్వహణకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయంలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. భారతదేశపు మొట్టమొదటి పుల్-పుష్ రైలును నవంబర్ నెలలో బీహార్ రాజధాని పాట్నా, మహారాష్ట్ర రాజధాని ముంబై మధ్య నడపనున్నారని సమాచారం. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో రైళ్ల వేగంతో పాటు సామర్థ్యాన్ని పెంచడమే రైల్వేల లక్ష్యం. ఈ నేపధ్యంలో పుల్ అండ్ పుష్ రైళ్లను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం పుల్ అండ్ పుష్ రైళ్ల కోచ్‌లు ఈ నెలలోనే సిద్ధం కానున్నాయి. కాగా ఈ రైళ్లను ఎప్పుడు, ఎక్కడి నుంచి నడపాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ రైళ్ల గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు. ఈ రైలుకు రెండు ఇంజన్లు అమర్చడం విశేషం. ఈ రైలుకు ముందు ఒక ఇంజన్, వెనుక ఒక ఇంజన్ ఉంటుంది. రైలులో జనరల్, స్లీపర్ క్లాస్‌ల చొప్పున మొత్తం 22 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభంలో ఈ రైలు నాన్-ఏసీగా నిర్వహించనున్నారు. ఈ రైలు కోసం పశ్చిమ బెంగాల్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో ప్రత్యేక కోచ్‌లను సిద్ధం చేశారు. ఈ డబుల్ ఇంజిన్ రైలులో ఒకసారి ఒక ఇంజిన్ మాత్రమే నడుస్తుంది. పుల్ అండ్ పుష్ టెక్నాలజీని ఉపయోగించడం వలన రైలు వేగాన్నిపెంచవచ్చు . అలానే తగ్గించవచ్చు. ఈ టెక్నాలజీ కారణంగా రైళ్ల సగటు వేగం 10 నుంచి 15 శాతం పెరుగుతుందని రైల్వేశాఖ చెబుతోంది. కొన్ని మార్గాల్లో ఈ రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా నడవనుందని తెలుస్తోంది. ఈ రైలుకు ‘వందే జనసాధారణ’ అని పేరు పెట్టవచ్చని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: దేశంలో ఎవరికి అత్యధిక రిజర్వేషన్లు? మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? -
అతి తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్స్.. నెలంతా అన్లిమిటెడ్!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, ఎయిర్ టెల్ వంటి బడా కంపెనీలకు పోటీగా తమ వినియోగదారులకు తక్కువ ధరలోనే డేటా, కాల్స్, ఎస్ఎంఎస్లను అందిస్తోంది. నెలంతా కేవలం రూ. 200 కంటే తక్కువ ధరలతో రీఛార్జ్ ప్లాన్స్ బీఎస్ఎన్ఎల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్పెషల్ ప్లాన్స్ వివరాలేంటో తెలుసుకుందాం.. రూ. 184 ప్లాన్ బీఎస్ఎన్ఎల్ రూ . 184 ప్లాన్ కింద కస్టమర్లకు నెలంతా అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు 1జీబీ రోజువారీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. తక్కువ సంఖ్యలో నెట్ వినియోగించే కస్టమర్లకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. రూ. 185 ప్లాన్ రూ.184 ప్లాన్ ప్రయోజనాలనే రూ. 185 ప్లాన్ కూడా అందిస్తోంది. రోజూ 1జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలు ఉంటాయి. అయితే రోజువారీ డేటా ఉపయోగించిన తర్వాత ఈ ప్లాన్ కింద కస్టమర్లకు 40Kbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. రూ. 186 ప్లాన్ రోజూ ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి ఈ రూ. 186 ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 1జీబీ రోజువారీ డేటా, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. ఇదీ చదవండి: GST On X: ట్విటర్ నుంచి డబ్బులు వస్తున్నాయా? జీఎస్టీ తప్పదు! -
JioBharat phone: సక్సెస్‌ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే..
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్ జియో బ్రాండ్ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్‌కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్ వీ2 (JioBharat V2) ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్ ఇదే. మరిన్ని ఫోన్ల ఉత్పత్తి.. ట్రయల్ దశలో రూ.99 కోట్ల విలువైన 10 లక్షల ఫోన్లను మాత్రమే రిలయన్స్ జియో విక్రయానికి ఉంచింది. ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత మరిన్ని జియో భారత్‌వీ2 ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రిలయన్స్ జియో ‘జియో భారత్’ ఫోన్ల అమ్మకాల్లో పురోగతిని గమనించిందని, 10 లక్షల ఫోన్ల విక్రయాల ట్రయల్ పూర్తవ్వగానే ఈ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధమైందని బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ ఓ నివేదికలో పేర్కొంది. జియో భారత్ వీ2 ఫోన్లలో 1.77 అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత మ్యూజిక్ యాప్ జియో సావన్, జియో ప్లే వంటివి కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! ప్రస్తుతానికి కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో జియో భారత్ వీ2 ఫోన్లను రిలయన్స్ జియో ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ రిలయన్స్ జియోతో జత కలిసే అవకాశం ఉంది. అతి తక్కువ ధరతోపాటు ఈ ఫోన్ కోసం రిలయన్స్ సరసమైన డేటా ప్లాన్లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అసోం హై అలర్ట్.. భూటాన్ చేసిన పనితో..
అసోం: వరదలతో ఉత్తరాది వణికిపోతున్న వేళ.. అసోం సహా పలు రాష్ట్రాలకు కొత్తగా మరో ముప్పు పొంచి ఉంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అసోంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. దాదాపు 4000 మంది వరకు ప్రజలు వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బిశ్వనాథ్, బొంగైగాన్, ఛిరంజ్, ధేమాజీ, దిబ్రుగర్హ్, కోక్రజార్హ్, నల్బరి, టిన్సుకియా ప్రాంతాలు ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. అయితే.. తూర్పు భూటాన్‌లోని కురిచ్చు ప్రాజెక్టును డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(డీజీపీసీ) నిర్వహిస్తోంది. కాగా.. ఈ రిజర్వాయర్ నుంచి వరద నీటిను విడుదల చేయనున్నట్లు జులై 13 అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. నియంత్రిత పద్దతిలో కనీసం 9 గంటలపాటు నీటిని విడుదల చేయనున్నామని స్పష్టం చేసింది. దీంతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అప్రమత్తమయ్యారు. ఆయా ముంపుకు గురయ్యే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. జాగ్రత్తగా పరిస్థితులను గమనించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కురిచ్చు రిజర్వాయర్ వరదతో భేకీ, మనాస్ నదులు విజృంభించే అవకాశం ఉందని చెప్పారు. The Royal Government of Bhutan has informed us that tonight there will be an excess release of water from the Kurichu Dam. We have alerted our district administrations to remain vigilant and assist the people in every possible way in case the water breaches the Beki and Manas… — Himanta Biswa Sarma (@himantabiswa) July 13, 2023 అసోంలోని బ్రహ్మపుత్ర, భేకీ, డిసాంగ్ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 179 జిల్లాలు, 19 రెవెన్యూ సర్కిళ్లు, ముంపులో ఉన్నాయి. 2211.99 హెక్టార్ల పంట నష్టం జరిగింది. ధేమాజీ, ఛిరంగ్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అసోం విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రస్తుతం భూటాన్ ప్రాజెక్టు నుంచి విడుదల అయ్యే నీటితో ఇంకా ఎంత నష్టం జరగనుందో అని ప్రజలు ఆందోళనలో చెందుతున్నారు. ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
షావోమి కూడా రంగంలోకి: ఆందోళనలో ఉద్యోగులు
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి కూడా ఉద్యోగాల తీసివేత దిశలో మరింతగా అడుగులు వేస్తోంది. ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వ ఏజెన్సీల నుంచి పెరిగిన ఒత్తిడి, మార్కెట్ వాటా క్షీణత తదితర కారణాల నేపథ్యంలో ఉద్యోగులను, తద్వారా తగ్గించుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే షావోమి ఇండియా మరికొంత మందికి ఉద్వాసన పలకనుంది. తద్వారా మొత్తం సిబ్బంది సంఖ్యను దాదాపు వెయ్యికి తగ్గించుకోవాలని చూస్తోందట. దీంతో ఎపుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని ఆందోళనలో ఉద్యోగులున్నారు. అయితే ఎంతమందిని, ఏయే విభాగాల్లో తొలగింనుందని అనేది స్పష్టత లేదు. (ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు) ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం షావోమి ఇండియా 2023 ప్రారంభంలో సుమారు 1400-1,500 మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ ఇటీవల దాదాపు 30 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే నెలల్లో మరింత మందిని తొలగించాలని భావిస్తోంది. సంస్థాగత నిర్మాణాన్ని క్రమబద్ధీకరణ, వనరుల కేటాయింపును ఆప్టిమైజ్ చేసే వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) ఇదీ చదవండి: తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా? -
విస్తరణ బాటలో డన్జో4బిజినెస్
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ డెలివరీ సేవల సంస్థ డన్జోలో లాజిస్టిక్స్ విభాగమైన డన్జో4బిజినెస్ (డీ4బీ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే 12–18 నెలల్లో 10–15 నగరాల్లో ప్రవేశించనున్నట్లు డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి తెలిపారు. ప్రస్తుతం తాము 10 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డన్జో ద్వారా నిత్యావసరాల డెలివరీలకు వచ్చే ఆర్డర్లతో పాటు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్‌ఫాంపై వచ్చే ఆర్డర్లను కూడా అందిస్తున్నట్లు సూరి చెప్పారు. చివరి అంచె వరకు ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఓఎన్డీసీ యూజర్లకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నుంచి అత్యధికంగా ఆర్డర్లు వస్తున్నాయని సూరి చెప్పారు. 70,000 మంది డెలివరీ పార్ట్నర్లతో కలిసి డీ4బీ పనిచేస్తోంది. యూజర్లు ఎక్కువగా నిత్యావసరాలు, ఆహార ఉత్పత్తులు, ఔషధాలకు ఆర్డరు ఇస్తున్నారని సూరి చెప్పారు. సగటున ఆర్డరు పరిమాణం రూ. 200–4,000 వరకు ఉంటోందని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై రవాణా చేయగలిగే అన్ని రకాల ఉత్పత్తులను డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. -
వీసా,మాస్టర్‌కార్డ్‌తో సమానంగా రూపే కార్డు: మోదీ సర్కార్ సరికొత్త ప్లాన్
న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులకు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యతను మరింతగా పెంచడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) దృష్టి పెడుతోంది. వీసా, మాస్టర్ కార్డ్‌లను ఉపయోగించే వారితో సమానంగా రూపే కార్డుదారులకు కూడా ప్రయోజనాలు ఉండేలా చూసేందుకు ఎన్పీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించాయి. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) ప్రస్తుతం అమెరికాకు చెందిన డిస్కవర్, డైనర్స్ క్లబ్.. జపాన్‌కు చెందిన జేసీబీ, పల్స్.. చైనాకు చెందిన యూనియన్ పే సంస్థలకు సంబంధించిన పాయింట్స్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా రూపే కార్డులతో లావాదేవీలు నిర్వహించ డానికి వీలుంటోంది. రూపే జేసీబీ గ్లోబల్ కార్డును జేసీబీ కార్డు చెల్లుబాటయ్యే ఇతర దేశాల్లోని పీవోఎస్‌లు, ఏటీఎంలలోనూ ఉపయోగించవచ్చు. రూపే డెబిట్ కార్డులు, చిన్న మొత్తాల్లో లావాదేవీలకు ఉపయోగపడే ఏకీకృత చెల్లింపుల విధానం.. భీమ్-యూపీఐని ప్రోత్సహించేందుకు కేంద్రం రూ. 2,600 కోట్లతో ప్రత్యేక స్కీమును ఈ మధ్యే ఆమోదించింది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) -
అదానీ నిధుల సమీకరణ బాట రూ. 21,000 కోట్లపై కన్ను
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ నిధుల సమీకరణపై కన్నేసింది. గ్రూప్‌లోని రెండు కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా 2.5 బిలియన్ డాలర్లు(రూ. 21,000 కోట్లు) సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 12,500 కోట్లు, అదానీ ట్రాన్స్మిషన్ రూ. 8,500 కోట్లు చొప్పున సమీకరించ నున్నట్లు స్టాక్ ఎక్స్ఛేజీలకు సమాచారమిచ్చాయి. ఈ బాటలో అదానీ గ్రీన్ ఎనర్జీ సైతం శనివారం బోర్డు సమావేశాన్ని నిర్వహించ తలపెట్టినప్పటికీ ఈ నెల 24కు వాయిదా పడింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయాన్ని చేపట్టనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మధ్యప్రాచ్యం, యూరప్ నుంచి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక వెలువరించడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ చేపట్టిన రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవోను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినప్పటికీ కంపెనీ ఇన్వెస్టర్లకు సొమ్మును వాపసు చేసింది. ఇది జరిగిన మూడు నెలల తదుపరి తిరిగి గ్రూప్ కంపెనీలు వాటా విక్రయం ద్వారా నిధుల సమీకరణకు తెరతీయడం గమనార్హం! (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) -
జియో సినిమా షాకిచ్చిందిగా: ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ షురూ
సాక్షి, ముంబై: జియో సినిమా వినియోగదారులకు షాకిచ్చింది. ఊహించినట్టుగానే ఇప్పటిదాకా వినియోగదారులకు ఉచిత సబ్స్క్రిప్షన్లను అందిస్తున్న జియో సినిమా తాజాగా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది, దేశీయ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ , డిస్నీ వంటి ప్రపంచ ప్రత్యర్థులతో పోరాడేందుకు ఉచిత కంటెంట్ మోడల్ నుండి వైదొలిగింది. (మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: నిబంధనలు మారాయి) దీని ప్రకారం జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ సంవత్సరానికి రూ. 999గా ఉంది. ఇది ఏకకాలంలో నాలుగు పరికరాల్లో కూడా పని చేస్తుంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేవల ద్వారా HBO, మ్యాక్స్ ఒరిజినల్, Warner Bros ప్రత్యేకమైన కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఏడాది ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంది . త్వరలోనే నెలవారీ ప్లాన్లు ప్రారంభించనుందని తెలుస్తోంది. జియో సినిమా, ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని ప్లాట్‌పాం జియోసినిమా పేరుతో ఓటీటీలో కూడా దూసుకొచ్చింది.మొదట్లో టెలికాం సేవలను ఉచితంగా అందించిన జియో, ఆ తరువాత పెయిడ్ సేవలను మొదలు పెట్టింది. అచ్చంగా ఆలాగే జియో సినిమా మొదట తన సేవలను ఉచితంగానే కస్టమర్లకు అందించింది. ముఖ్యంగా FIFA వరల్డ్ కప్ , IPL 2023ని ఉచితంగా స్ట్రీమింగ్‌తో మరింత ఆదరణ పొందింది. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్) కాగా జియో దెబ్బకు డిస్నీ ఏకంగా 84 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌లో 2శాతం క్షీణతను నమోదు చేసింది. మరోవైపు ప్రత్యర్థులతో ధీటుగా కంటెంట్ అందించేందకు జియో సినిమా a వివిధ ప్రొడక్షన్ స్టూడియోలతో చర్చలు జరుపుతోందనీ, రాబోయే నెలల్లో డజన్ల కొద్దీ టీవీ షోలు, మూవీలను హిందీ , తదితర భాషలలో పరిచయం చేయాలని యోచిస్తోందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. -
తెరపైకి ‘ప్రాజెక్ట్ సంజయ్’
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక డిజిటల్ యుద్ద క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ప్రాజెక్ట్ సంజయ్’పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి. దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్‌లైన్ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇందులోభాగంగా, పర్వత ప్రాంతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ ‘ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్వర్కింగ్’కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి. ప్రాజెక్ట్ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్(ఆర్టిలరీ కంబాట్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టం) కింద వ్యవస్థల అప్‌గ్రేడ్ చేపట్టారు. దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్ సంజయ్‌తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
సూడాన్‌లోని భారతీయుల పరిస్థితిపై మోదీ అత్యవసర సమీక్ష!
సూడాన్‌లో సైన్యం, పారామిలటరీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రోజు రోజుకి హింసాత్మకంగా మారుతున్న సంగతి తెలసిందే. ఇప్పటి వరకు ఈ పోరులో 300 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చినా పట్టించుకోకుండా ఇరు పక్షాలు ఘర్షణ కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న మూడు వేల మందికి పైగా ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే అక్కడ ఉన్న వారిని భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సూడాన్‌లోని భారతీయుల భద్రత పరిస్థితిపై అధికారులతో వర్చువల్‌గా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సూడాన్‌లోని భారత రాయబారి రవీంద్ర ప్రసాద్ జైస్వాల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సూడాన్‌లోని చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారిచడమే గాక క్షేత్ర స్థాయిలో అక్కడ పరిస్థితులకు సంబంధించిన నివేదికను మోదీ సమీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే అధికారులను అప్రమత్తంగా ఉండాలని, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ..పౌరుల తరలింపుకి సంబంధించిన అన్ని రకాల సహాయాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పొరుగు దేశాల తోపాటు సూడాన్‌లో ఉన్న పౌరులతో సంభాషణలు చేయడం వంటి ప్రాముఖ్యతల గురించి నొక్కి చెప్పారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌తో జైశంకర్ చర్చలు ఈ రోజు తెల్లవారుజామున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సూడాన్‌లోని అధ్వాన్నమైన పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో చర్చించారు. కాల్పుల విరమణ కోసం దౌత్యం జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సూడాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అక్కడ చిక్కుకున్న భారతీయల భద్రత, తరలింపుపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అదీగాక అక్కడ ఉన్న భారతీయ పౌరులు ఉన్నచోటునే ఉండాలని ఖార్టుమ్‌లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఇదిలా ఉండగా, అక్కడ చిక్కుకుపోయిన తమ పౌరులను తరలించేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్న విమానాశ్రయలే రంణరంగాలుగా మారిపోవడంతో అధి సాధ్యం కాకవపోవచ్చని తెలుస్తోంది. కాగా, ఖార్టూమ్‌లోని రాయబార కార్యాలయం ప్రకారం.. సుమారు 2,800 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకుపోయారని, అందులో 1200 మంది సూడాన్‌లోనే 150 ఏళ్లుగా నివశిస్తున్నట్లు సమాచారం. (చదవండి: ప్రకాష్ సింగ్ బాదల్‌కు అస్వస్థత.. ఆరోగ్య పరిస్థితిపై అమిత్ షా ఆరా) -
త్వరలో మరో ‘జోడో’!
నవా రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్): అదానీ వ్యవహారంలో మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. అధికార బీజేపీ నేతలు నిస్సిగ్గుగా అదానీ గ్రూపుకు ఏకంగా పార్లమెంటులోనే కొమ్ముకాస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వ్యాపార మిషతో వచ్చి భారత్‌ను ఆక్రమించిన ఈస్టిండియా కంపెనీతో అదానీ గ్రూపును పోల్చారు! అక్రమ మార్గాల్లో భారీగా సంపద పోగేసి దేశానికి వ్యతిరేకంగా పని చేస్తోందని ఆరోపించారు. దీనిపై మోదీ స్పందనేమిటని పార్లమెంటులో విపక్షాలన్నీ నిలదీస్తే అది తప్ప అన్ని విషయాలపైనా మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు. ‘‘దీనిపై నిజం వెలుగు చూసేదాకా అదానీ గ్రూపు వ్యాపార పద్ధతులు తదితరాలపై ప్రశ్నస్త్రాలు సంధిస్తూనే ఉంటాం. అవసరమైతే పార్లమెంటులో వెయ్యిసార్లైనా దీన్ని ప్రస్తావిస్తాం’’ అని స్పష్టం చేశారు. ఆదివారం రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ మూడో రోజు ముగింపు సమావేశాలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘అదానీకి ఒక్కటే చెప్పదలచా. ఆయన కంపెనీ దేశానికి నష్టం చేస్తోంది. దేశ మౌలిక వసతులన్నింటినీ చెరబడుతోంది’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘పోర్టులు తదితరాలతో పాటు దేశ సంపదను చెరబట్టిన కంపెనీకి వ్యతిరేకంగా దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం మేం చేస్తున్న పోరాటమిది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘చరిత్ర పునరావృతమవుతోంది. అవసరమైతే మరోసారి మరో కంపెనీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుంది’’ అని ప్రకటించారు. కాశ్మీరీల్లో దేశభక్తిని రగిల్చాం... భారత్ జోడో యాత్ర ద్వారా జరిగిన ‘తపస్సు’ తాలూకు స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘అందుకు కావాల్సిన వ్యూహాలు రూపొందించండి. దేశమంతటితో పాటు నేను కూడా వాటిలో భాగస్వామిని అవుతా’’ అని సూచించారు. తద్వారా త్వరలో మరో దేశవ్యాప్త యాత్ర ఉంటుందని సంకేతాలిచ్చారు. ‘‘జోడో యాత్రలో ప్రజలు లక్షలాదిగా పాల్గొన్నారు. యాత్ర పొడవునా నేనెంతో నేర్చుకున్నా. కన్యాకుమారిలో మొదలై కశ్మీర్ చేరేసరికి ఎంతగానో మారాను. మిగతా ప్రజలంతా ఆనందంగా ఉంటే కశ్మీరీలు మాత్రమే ఎందుకు బాధల్లో ఉన్నారని ఒక బాలుడు అడిగాడు. నా యాత్ర కాశ్మీర్లో ప్రవేశించాక పోలీసు సిబ్బంది పత్తా లేకుండా పోయారు. కానీ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు అంతటా వేలాదిగా కశ్మీరీలు త్రివర్ణం చేబూని నాతో పాటు నడిచారు. తానూ లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరేశానని మోదీ చెప్పుకున్నారు. నాతోపాటు వేలాది మంది కాశ్మీరీలు లాల్‌చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎగరేశారు. త్రివర్ణంపై కశీ్మరీల్లో ప్రేమను మోదీ తన వేధింపు చర్యల ద్వారా దూరం చేస్తే మేం దాన్ని వారిలో తిరిగి పాదుగొల్పాం. ఈ తేడాను ఆయన అర్థం చేసుకోలేకపోయారు’’ అని కాంగ్రెస్ ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య చెప్పుకొచ్చారు. సమైక్యంగా శ్రమిద్దాం... ఎన్నికల పరీక్ష నెగ్గుదాం ‘‘కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, తెలంగాణల్లో అసెంబ్లీ ఎన్నికలున్నందున ఈ ఏడాదంతా చాలా కీలకం. ఆ ఎన్నికల్లో విజయానికి సమైక్యంగా, క్రమశిక్షణతో కృషి చేయండి’’ అని పార్టీ నేతలు, కార్యకర్తలకు రాయ్‌పూర్ ప్లీనరీ పిలుపునిచ్చింది. తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికలకు చక్కని వేదిక సిద్ధం చేసుకుందామని పేర్కొంది. ఈ మేరకు ఐదు సూత్రాలతో రాయ్‌పూర్ డిక్లరేషన్‌ను ప్లీనరీ ఆమోదించింది. భావ సారూప్యమున్న పార్టీలతో నిర్మాణాత్మక ఉమ్మడి ప్రణాళికతో కలిసి పని చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు, అది ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ పేర్కొంది. ‘‘బీజేపీ, ఆరెస్సెస్‌లతో, వాటి మోసపూరిత రాజకీయాలతో ఎన్నడూ రాజీ పడని ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ నియంతృత్వానికి, మతవాద, ఆశ్రిత పెట్టుబడిదారీ పోకడలకు వ్యతిరేకంగా దేశ రాజకీయ విలువ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, సమాజంలో చీలిక తెచ్చే యత్నాలు, రాజకీయ నియంతృత్వాలపై రాజీలేని పోరాటం చేస్తాం. ఇందుకోసం భావ సారూప్య పార్టీలతో కలిసి పని చేస్తాం’’ అని డిక్లరేషన్‌లో పేర్కొంది. పాసీఘాట్ నుంచి పోరుబందర్ దాకా...! తూర్పున అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసీఘాట్ నుంచి పశ్చిమాన గుజరాత్‌లోని పోరుబందర్ దాకా మరో దేశవ్యాప్త పాదయాత్ర చేసే యోచన ఉన్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. ‘‘భారత్ జోడో యాత్ర సక్సెస్‌తో పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. మరో యాత్ర కోసం కార్యకర్తలు ఉవ్విళ్లూరుతున్నారు. అది జోడో యాత్రకు భిన్నంగా ఉంటుంది. దారి పొడవునా నదులు, దుర్గమారణ్యాలున్నందున చాలావరకు కాలినడకన, అక్కడక్కడా ఇతరత్రా సాగొచ్చు. జూన్‌కు ముందు గానీ, నవంబర్ ముందు గానీ కొత్త యాత్ర మొదలు కావచ్చు. కొద్ది వారాల్లో నిర్ణయం తీసుకుంటాం’’ అని వివరించారు. -
దక్షిణ కొరియా 6జీ ఫ్యూచర్ ప్లాన్స్ అదుర్స్: చైనాకే షాకిస్తుందా..?
సియోల్: టెలికం రంగంలో 5జీ నెట్వర్క్ ఒక సంచలనం అని చెప్పాలి. ఇప్పటికే మన దేశంలో చాలా ప్రాంతాల్లో 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా దక్షిణ కొరియా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా అనుకున్న దానికంటే రెండు సంవత్సరాల ముందుగానే అందు బాటులోకి తేనున్నామని, దక్షిణ కొరియా సైన్స్, ఐసీటీ మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది.రాబోయే 6జీ నెట్వర్క్ పేటెంట్ పోటీలో ఈ సంఖ్యను 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచనున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది. ఎలెక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, రోబోటిక్ నూతన సాకేంతికత, ఉత్పత్తులతో దూసుకుపోతున్న దక్షిణ కొరియా 2028లో ప్రపంచంలోనే తొలి 6జీ నెట్వర్క్ సేవను ప్రారంభించాలని యోచిస్తోంది. వైర్లెస్ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా కే-నెట్వర్క్ 2030 ప్రణాళికలో భాగంగా నెక్ట్స్ జెన్ నెట్వర్క్ కోసం రానున్న రెండేళ్లలో మరింత వేగవంతం చేయనుంది. బెర్నామా నివేదిక ప్రకారం ప్రపంచస్థాయి 6జీ టెక్నాలజీ ద్వారా సురక్షితమైన మొబైల్ నెట్‌వర్క్‌ను దక్షిణ కొరియా ఆవిష్కరించనుంది. కౌంటీ నెట్వర్క్ సరఫరా గొలుసును బలోపేతం చేయాలనే ప్రణాళికలో భాగంగా, దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 625.3 బిలియన్ వోన్ లేదా 481.7 బిలియన్ డాలర్ల విలువైన కోర్ 6జీ సాంకేతికతలపై పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా, దేశంలో తదుపరి తరం మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీ ఉత్పత్తులపై దేశీయ కంపెనీలను ప్రోత్సహించాలని భావిస్తోంది. మొబైల్ పరికరానికి అనుకూలంగా ఉండే ఓపెన్ RAN లేదా ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం స్థానిక కంపెనీలను ప్రోత్సహించనుదని Yonhap నివేదించింది. కాగా ఆసియాలో నాల్గవ-అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గత సంవత్సరం 5జీ పేటెంట్ల సంఖ్యలో 25.9 శాతంగా ఉంది. ఈ విషయంలో మార్కెట్ లీడర్ చైనాను 26.8 శాతం మాత్రమే అనేది గమనార్హం. -
11 ఇంటర్ చేంజర్లు.. 85 వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు(ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం.. దీని నిడివి 158.645 కి.మీ... ప్రస్తుతానికి నాలుగు వరసల రోడ్డు.. ఈ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులను 11 చోట్ల అడ్డంగా దాటాల్సి ఉన్నందున భారీ ఇంటర్‌చేంజర్ స్ట్రక్చర్లను నిర్మించనున్నారు. ఒక్కోటి దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. వీటికితోడు 105 అండర్ పాస్‌లు.. 85 వంతెనలు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్లాన్లను సిద్ధం చేస్తున్నారు. ప్రతి మూడు కి.మీ.కు రెండు అండర్‌పాస్‌లు పెద్ద రహదారులను దాటేటప్పుడు ట్రంపెట్, డబుల్ ట్రంపెట్, క్లెవర్ లీఫ్ నమూనాల్లో ఇంటర్‌చేంజర్ వంతెనలను నిర్మించనున్న విషయం తెలిసిందే. కానీ, రోడ్లతో సంబంధం లేకుండా ప్రతి కిలోమీటరున్నర నడివికి ఓ అండర్‌పాస్ చొప్పున నిర్మాణానికి ప్లాన్చేశారు. స్థానికంగా ఉండే ఊళ్ల నుంచి వాహనాలు రోడ్డును అటూఇటూ దాటాలంటే కచ్చితంగా అండర్‌పాస్‌లు అవసరం. అందుకోసం ప్రతి కిలోమీటరున్నరకు ఒకటి చొప్పున ఉండేలా డిజైన్ సిద్ధం చేశారు. అలా ఉత్తర భాగం నిడివిలో 105 అండర్‌పాస్‌లకు ప్లాన్ చేశారు. ఇది చిన్నాచితక అండర్‌పాస్‌లు కాదు. భారీ వాహనాలు సులభంగా దూసుకెళ్లేలా 5.5 మీటర్ల ఎత్తుతో ఉంటాయి. భవిష్యత్తులో ఈ రోడ్లను వెడల్పు చేయాల్సి వస్తే, అండర్‌పాస్‌లను వెడల్పు చేయటం సాధ్యంకాదు. అందుకే ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 20 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఇక వాగులువంకలు, సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించే కెనాల్స్, చెక్‌డ్యామ్‌లు, గుట్టల నుంచి జాలువారే ప్రాంతాల్లో ప్రత్యేకంగా వంతెనలు నిర్మిస్తారు. నీటిప్రవాహానికి రింగురోడ్డు ఏమాత్రం అడ్డంకి కావద్దని ఈ ఏర్పాటు చేశారు. ఉత్తర రింగు నిడివిలో దాదాపు 85 వరకు ఇలాంటి వంతెనలు నిర్మించనున్నారు. నీళ్లు వెళ్లటానికే పరిమితం కాకుండా పక్కనుంచి ట్రాక్టర్లు లాంటి వాహనాల రాకపోకలకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇలా ఇంటర్ ఛేంజర్లు, అండర్‌పాస్‌లు, నీళ్లు పారేందుకు నిర్మించే వంతెనల కోసం రూ.2 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. డ్రాఫ్ట్ డీపీఆర్ సిద్ధం రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి రూ.13,800 కోట్లు ఖర్చవుతుందని డ్రాఫ్ట్ డీపీఆర్‌లో అధికారులు పేర్కొన్నారు. ఈ రోడ్డును ప్రతిపాదించిన సమయంలో రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా, ఇప్పుడు ఆ ఖర్చు భారీగా పెరగనుందని స్పష్టమవుతోంది. రోడ్డు నిర్మాణానికి రూ.8,600 కోట్లు, భూపరిహారా నికి రూ.5,200 కోట్లు అవసరమవుతాయని డ్రాఫ్ట్ డీపీఆర్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. రోడ్డు నిర్మాణ వ్యయంలో స్ట్రక్చర్లు, వంతెనలు, అండర్‌పాస్‌లకు రూ.2 వేల కోట్ల ఖర్చవుతుందని పేర్కొన్నట్టు సమాచారం. భూసేకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు చెరో రూ.2,600 కోట్లు చొప్పున భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను జమ చేయాల్సిందిగా ఇప్పటికే ఎన్హెచ్ఏఐ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన అంశం తెలిసిందే. రింగురోడ్డు దక్షిణ భాగానికి సంబంధించి అలైన్ మెంటును ఖరారు చేసి ఢిల్లీకి ఆమోదం కోసం పంపారు. 189.2 కి.మీ. నిడివితో ఈ అలైన్ మెంటును రూపొందించారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపాల్సి ఉంది. ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. -
వాట్ ఏ ప్లాన్.. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌తో పాటు మరిన్ని ఓటీటీలు!
కరోనా దెబ్బకు ఓటీటీ మార్కెట్ విపరీతంగా పుంజుకుంది. వందల కోట్లలో ఓటీటీ వేల కోట్లుకు చేరింది. ఈ క్రమంలో ఓటీటీల సంస్థలు కస్టమర్లను పెంచుకునే పనిలో పడ్డాయి. అందుకోసమే ప్రత్యేకంగా సిరీస్‌లు, సినిమాలు, ప్రత్యేక కార్యక్రమాలతో హడావుడి చేస్తున్నాయి. కంటెంట్ వరకు అంతా బాగున్న కస్టమర్లు పైసలు పెట్టి సబ్స్క్రైబర్లుగా మార్చడం కోసం మొబైల్ ఓన్లీ ప్లాన్స్‌ను (Mobile Only Plans) కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందిస్తున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం. అమెజాన్ ప్రైమ్ వీడియో అమెజాన్ ఇటీవల ప్రైమ్ వీడియో కోసం మొబైల్-మాత్రమే సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ .దీని ధర రూ. 599, ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ మొబైల్ డివైజ్ సబ్స్క్రైబర్లకు ప్రైమ్ వీడియో యాక్సెస్‌ను మాత్రమే అందిస్తుంది. ఇది ఉచిత డెలివరీలు, అమెజాన్ మ్యూజిక్ మొదలైన ఇతర ప్రైమ్ మెంబర్షిప్ ప్రయోజనాలను ఉండవని గమనించుకోవాలి. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌తో సహా అనేక రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది, దీని ధర నెలకు రూ.149. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫాంలో SD (480p) క్యాలిటీ అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ డిస్ని+హాట్‌స్టార్ (Disney+ Hotstar) మొబైల్ డివైజ్ కోసం నెలవారీ, వార్షిక ప్లాన్లను అందిస్తుంది. దీని ధర మూడు నెలలకు రూ.149, సంవత్సరానికి రూ.499. ఈ రెండు ప్లాన్లు యాడ్-సపోర్టుతో వస్తాయి. ఒకేసారి ఒక డివైజ్‌లో మాత్రమే లాగిన్ చేయగలరు. వూట్ సెలెక్ట్ మొబైల్ ప్లాన్ Voot Select సంవత్సరానికి రూ. 299 ఖరీదు చేసే ఒక మొబైల్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఒక డివైజ్‌కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. SD 720p స్ట్రీమింగ్‌ను అవకాశం ఉంటుంది. సోనీలైవ్ మొబైల్ ప్లాన్ సోనీలైవ్ మొబైల్ ప్లాన్ సంవత్సరానికి రూ.599తో ఉంది. ఇది ఒక మొబైల్ డివైజ్‌లో మాత్రమే 720p స్ట్రీమింగ్కు అవకాశం ఉంటుంది. జీ5 జీ5లో మొబైల్ ప్లాన్ అందుబాటులో లేదు. అయితే, ఇది సంవత్సర వ్యాలిడిటీ, మూడు నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది. వాటి ధర రూ.999( సంవత్సరం) , రూ. 399 (3 నెలలు). చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
అంతర్జాతీయ మార్కెట్లో ఎయిరిండియా న్యూ టార్గెట్
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో దేశీ, అంతర్జాతీయ మార్కెట్లలో 30 శాతం వాటాను సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. కంపెనీకి ఇప్పుడు దేశీయంగా 10 శాతం, అంతర్జాతీయంగా 12 శాతం మార్కెట్ వాటా ఉంది. పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకునే దిశగా ఎయిరిండియా ప్రస్తుతం కసరత్తు చేస్తోందని, మంచి పురోగతి కనిపిస్తోందని విల్సన్ వివరించారు. వచ్చే అయిదేళ్లలో తమ విమానాల సంఖ్యను మూడు రెట్లు పెంచుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే 15 నెలల్లో 5 వైడ్-బాడీ బోయింగ్, 25 ఎయిర్‌బస్ చిన్న విమానాలను సమకూర్చుకోనున్నట్లు వివరించారు. ఎయిరిండియాను టాటా గ్రూప్ ఈ ఏడాది జనవరిలో టేకోవర్ చేసింది. కంపెనీని తిరిగి లాభాల బాట పట్టించడానికి విహాన్డాట్ఏఐ పేరిట పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను అమలు చేస్తోంది. -
బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే!
BSNL Rs.275 Broadband Plan: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day 2022) సందర్భంగా తమ కస్టమర్ల కోసం అదరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం చవకైన ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు యూజర్లకు కలిగే విధంగా ఈ ప్లాన్‌ని ప్రకటించింది. అయితే ఈ ప్లాన్ పరిమిత కాలమే ఉంటుందన్న బీఎస్ఎన్ఎల్ తాజాగా ఆ ఆఫర్ చివరి తేదీని వెల్లడించింది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ప్లాన్ రూ. 275 బీఎస్ఎన్ఎల్(BSNL) తన ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ప్లాన్ రూ.275ను ప్రకటించింది. ప్రత్యేకంగా ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 60 Mbps స్పీడ్‌తో 3300జీబీ (3.3TB) వరకు డేటా లభిస్తుంది. అయితే ఇది ప్రమోషనల్ ప్లాన్ కాబట్టి, ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక ప్లాన్‌ను అక్టోబర్ 13వ తేదీ వరకే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తాజాగా ప్రకటించింది. అంటే ఈ రూ.275 ప్లాన్ బెనిఫిట్స్ పొందాలంటే అక్టోబర్ 13వ తేదీలోగా రీచార్జ్ చేసుకోవాలి. కొత్త కస్టమర్లు, ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్న కస్టమర్లు కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. రూ.275 భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వివరాలు ఇవే బీఎస్ఎన్ఎల్ రూ.275 ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఆఫర్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఆఫ్షన్లకు కూడా వ్యాలిడిటీ మాత్రం 75 రోజులు ఉంటుంది. డేటా కూడా 3.3టీబీ(3.3TB) అంటే 3,300జీబీ వరకు డేటా లభిస్తుంది. అయితే ఇందులో ఓ ఆప్షన్‌కి 30Mbps, మరో ఆప్షన్‌కి 60Mbps స్పీడ్ లభిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌లో తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డేటా కోటా పూర్తవగానే 2Mbps స్పీడ్‌తో ఇంటర్నెట్ వస్తుంది. చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
‘మిషన్ తెలంగాణ’తో ముందుకు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ‘మిషన్ తెలంగాణ’కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సంపాదించడమే లక్ష్యంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు దూసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. అధికార టీఆర్ఎస్పై రాజకీయ విమర్శలు, సవాళ్లు, ఆరోపణలు వంటి వాటిపై దూకుడును ప్రదర్శిస్తూనే, హామీల అమల్లో వెనకడుగు, ప్రజా వ్యతిరేక విధానాలపై తగిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేలా వ్యూహాలు అమలు చేయాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండొచ్చునని పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రూపాల్లో పోరాట ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయించింది. ఓట్ల శాతం పెరగడంపై ఉత్సాహం.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరేడు శాతమున్న పార్టీ ఓట్లు, 2019 లోక్‌సభ ఎన్నికల కల్లా 19.5 శాతానికి చేరుకోవడం బీజేపీ నాయకత్వం, శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. మార్చి 14 నుంచి పార్లమెం ట్ బడ్జెట్ తదుపరి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్ల పరిధిలో నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలను పూర్తిచేయాలని నిర్ణయించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో నాయకు లు, కార్యకర్తలను క్రియాశీలం చేసి, ఎన్నికలకు స న్నద్ధం చేయాలని భావిస్తున్నారు. కిందిస్థాయి నుం చి పార్టీ శ్రేణులను ఎన్నికల కార్యాచరణకు సిద్ధం చేస్తూనే, రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దరఖాస్తుల ఉద్యమం చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. మార్చిలో మలివిడత ప్రజా సంగ్రామ యాత్ర! దుబ్బాక ఉప ఎన్నికల్లో ఊహించని విధంగా రఘునందన్‌రావు గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా ఎన్నడూ లేని విధంగా 48 కార్పొరేటర్ల విజయం, హుజూరాబాద్‌లో డబ్బు, అధికారం, ఇతర వనరుల పరంగా మేరుపర్వతంగా ఉన్న టీఆర్ఎస్ను ఢీకొని ఈటల రాజేందర్ గెలవడంతో పార్టీ బలం క్రమంగా పుంజుకుంటున్నదని నాయకత్వం అంచనా వేస్తోంది. దీంతో పాటు ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన తొలివిడత పాదయాత్ర విజయవంతం కావడం, దీని ద్వారా ప్రభుత్వ, టీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారంతో పాటు వైఫల్యాలు, అప్రజాస్వామిక విధానాలను గట్టిగా ఎండగట్టగలిగామని భావిస్తోంది. దీనికి కొనసాగింపుగా మార్చి 2, 3 వారాల్లో మలివిడత ప్రజా సంగ్రామయాత్రను జోగుళాంబ దేవాలయం నుంచి మొదలుపెట్టి భద్రాచలం శ్రీసీతారామచంద్ర ఆలయం వద్ద ముగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. -
యూపీలో కమలదళం రోడ్ మ్యాప్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు కమలదళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహంపై ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జ్తో సహా పలువురు బీజేపీ నేతలు కసరత్తు చేసి రోడ్‌మ్యాప్ రెడీ చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌పైనే పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే వచ్చే నెలన్నరలోపు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో 200కి పైగా ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటి బాధ్యతలను 30మందికి పైగా కేంద్రమంత్రులకు అప్పగించారు. తొలిదశలో భాగంగా వచ్చే 30 రోజుల్లో 18 మంది కేంద్రమంత్రులు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో ర్యాలీలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరికొందరు కీలక నేతల ఎన్నికల ర్యాలీలు ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువగా జరుగనున్నాయి. రానున్న 45 రోజుల పాటు ప్రతిరోజూ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరో ఒకరు ఉత్తరప్రదేశ్‌లో ర్యాలీ, కార్యక్రమం ద్వారా ప్రజలతో సన్నిహితంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రచార వ్యూహంతో సంబంధం ఉన్న పార్టీ నేత ఒకరు తెలిపారు. అంతేగాక రాబోయే 30 రోజుల్లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు సంబంధించి యూపీలో అత్యధిక పర్యటనలు ఉండనున్నాయి. వచ్చే రెండు నెలల పర్యటన షెడ్యూల్ సైతం ఖరారు చేసే పనిలో కమలదళం బిజీగా ఉంది. నేటి నుంచి ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు సుల్తాన్పూర్ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను మోదీ ప్రారంభించనున్నారు. 19న ప్రధాని బుందేల్‌ఖండ్ వెళ్ళే అవకాశం ఉందని తెలిసింది. నవంబర్ 20న లక్నోలో జరుగనున్న దేశవ్యాప్త డీజీపీ, ఐజీ స్థాయి పోలీసు అధికారుల కార్యాక్రమంలో ప్రధాని, హోంమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పలు భారీ ప్రాజెక్టులను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని సమాచారం. ఇందులో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ సహా పలు భారీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని సమాచారం. -
రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కోసం ఇలా చేయండి
పదవీ విరమణకు దగ్గర్లో ఉన్నాను. పోస్ట్ ఆఫీసు, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్, కార్పొరేట్ ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాలకు అదనంగా.. నెలవారీగా స్థిరమైన ఆదా యం కోసం న్యూజీవన్ శాంతి మాదిరి యాన్యుటీ ప్లాన్‌లో రూ.20 లక్షలు ఇన్వెస్ట్ చేయనా? – నితిన్ ఇది మంచి ఆలోచన కాదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాన్యుటీ ప్లాన్లు సరైన నాణ్యత కలిగినవి కావు. యాన్యుటీల్లోనూ వివిధ రకాలున్నాయి. జీవించి ఉన్నంత కాలం హామీ మేరకు స్థిరమైన ఆదాయన్నిచ్చేవి ఒక రకం. మరొక రకంలో ముందుగా నిర్ణయించిన మేర క్రమం తప్పకుండా పాలసీదారు జీవించి ఉన్నంత కాలం పాటు చెల్లింపులు కొనసాగుతాయి. పాలసీదారు మరణానంతరం అసలు పెట్టుబడి నామినీకి అందజేస్తారు. నిర్ణీత కాలానికోసారి చెల్లింపులు పెరిగే యాన్యుటీ పథకాలు కూడా ఉన్నాయి. అన్ని రకాల యాన్యుటీల్లోనూ రాబడులు చాలా తక్కువగానే ఉన్నాయి. పాలసీదారు జీవించి ఉన్నంత కాలం పాటు చెల్లింపులు చేయాల్సిన రిస్క్‌ను బీమా కంపెనీలు తీసుకోవడమే రాబడులు తక్కువగా ఉండడానికి కారణం. ఎందుకంటే ఎవరు ఎంత కాలం పాటు జీవించి ఉంటారన్నది తెలియదు కనుక. కొందరు సుదీర్ఘకాలం పాటు జీవించి ఉండొచ్చు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (ఎంఐపీ), సీనియస్ సిటిజన్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అదనంగా మార్కెట్ ఆధారిత పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చన్నది నా సూచన. కొంత భాగం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులు అందుకోవచ్చు. స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేసేట్టే అయితే ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్ ఉంటుంది. కానీ, దీర్ఘకాలంలో ఈ రిస్క్ తగ్గిపోతుంది. అయినా రక్షణాత్మకంగానే వ్యవహరించాలి. పెట్టుబడులన్నింటినీ ఒకే సాధనంలో పెట్టేయకూడదు. పెట్టుబడులన్నీ ఒకేసారి కాకుండా ఏడాది నుంచి 18 నెలల కాలంలో పెట్టే విధంగా చూసుకోండి. మూడేళ్ల క్రితం సిప్ మార్గంలో ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. మార్కెట్ పడిపోతుందన్న ఆందోళన నేపథ్యంలో పెట్టుబడులను డెట్ పథకాల్లోకి మళ్లించుకోవాలా? లేదంటే మార్కెట్ పతనాన్ని అవకాశంగా భావించి మరింత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలా? – సీహెచ్. సాగర్ మొదట ఆందోళన అన్నది అనవసరం. ఒకవేళ ఏడాది క్రితమే మీరు ఈ విషయమై ఆందోళన చెంది ఉంటే.. ఈక్విటీల నుంచి స్థిరాదాయ పథకాలకు (డెట్సాధనాలు) మళ్లిపోయి ఉండేవారు. గత 18 నెలల్లో చాలా మంది ఇలా ఆందోళన చెందినవారే. కానీ, మార్కెట్ ర్యాలీ అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్కెట్ క్రమంగా పెరుగుతూనే వెళ్లింది. ఎవరైతే ఆందోళన చెంది ఈక్విటీ పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారో.. దీర్ఘకాలంలో వచ్చే అరుదైన అవకాశాన్ని వారు కోల్పోయారు. అందుకే ఆందోళన అన్నది పనికిరాదు. రెండు అంశాలను ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. వచ్చే 10–15 ఏళ్ల వరకు డబ్బులతో అవసరం లేదనుకుంటే ఈక్విటీల్లోనే పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. మీరు గడిచిన మూడేళ్ల నుంచే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ పెట్టుబడులు ఇంకా వృద్ధి చెందాల్సి ఉంది. మీ ప్రణాళిక ప్రకారమే నడుచుకోవాలి తప్పిదే ఆందోళన వద్దు. మార్కెట్లో దిద్దుబాటు వచ్చినా.. అది ఎప్పుడన్నది ఎవరూ అంనా వేయలేరు? ప్రస్తుత పరిస్థితులే వచ్చే ఆరు నెలల పాటు కొనసాగొచ్చు. లేదంటే రెండేళ్లపాటు ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్లు పడితే ఎప్పుడు తిరిగి కోలుకుంటాయన్నది తెలియదు. ఒక నెల పాటు కొనసాగొచ్చు. లేదంటే 2020 మార్చిలో మాదిరిగా ఉండొచ్చు. ఆందోళన అన్నది తప్పుడు నిర్ణయానికి దారితీయవచ్చు. ఎంతకాలం పాటు ఇన్వెస్ట్ చేయగలరు, ఎంతకాలం పెట్టుబడులను కొనసాగించగలరన్న అంశాల ఆధారంగా ప్రణాళిక ఉండాలి. ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టి మూడేళ్లే అయింది కనుక పెద్ద మొత్తంలో ఇంకా సమకూరి ఉండకపోవచ్చు. అందుకే కనీసం పదేళ్లపాటు అయినా పెట్టుబడులను కొనసాగించాలి. అది కూడా వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల సమతూకాన్ని (అస్సెట్ అలోకేషన్) నిర్ణయించుకుని అడుగులు వేయాలి. నిర్ణీత కాలానికోసారి ఈ పెట్టుబడులను మీ ప్రణాళికకు తగినట్టు మార్పులు చేసుకుంటూ వెళ్లాలి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వాల్యూ రీసెర్చ్ చదవండి: జుపీ నిధుల సమీకరణ -
ఖర్చు ఎక్కువైనా సరే అనుకునేవారు ఓసారి ట్రై చేయొచ్చు
అంతరిక్షంలో సరికొత్త రేస్ మొదలైంది. గగన వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టే రోజు వచ్చేస్తోంది. ఆదివారం వర్జిన్ గెలాక్టిక్ సంస్థ.. 20న బ్లూఆరిజిన్ కంపెనీ తమ స్పేస్ ఫ్లైట్లను పంపుతున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష యాత్రలకు సిద్ధమవుతోంది. ఖర్చు కాస్త ఎక్కువైనా సరే.. ఓసారి అంతరిక్ష ప్రయాణం చేయాలనుకునే వారు ఓసారి ట్రై చేయొచ్చు. ఈ స్పేస్ టూరిజం విశేషాలు తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ ఇన్నాళ్లూ స్పేస్.. ప్రయోగాలకే.. వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలు నిర్వహించేందుకు పలు దేశాలు, కొన్ని సంస్థలు చాలా ఏళ్ల కిందే ప్రయత్నా లు మొదలుపెట్టాయి. స్పేస్ టెక్నాలజీ చాలా క్లిష్టమైనది. రాకెట్లు, స్పేస్ షటిల్స్, ఇతర పరికరాలకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దీంతో పెద్ద దేశాలకు చెందిన ప్రభుత్వ అంతరిక్ష సంస్థలు మాత్రమే అంతరిక్ష యాత్రలు చేపట్టగలిగాయి. అవి కూడా అన్వేషణలు, ప్రయోగాలకే పరిమితం అయ్యాయి. అయితే 2001 ఏప్రిల్ 30న రష్యా తొలిసారిగా శాస్త్రవేత్తలు కాకుండా సాధారణ వ్యక్తిని వాణిజ్యపరంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. రష్యాకు చెందిన సోయూజ్ రాకెట్ ద్వారా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)’కు వెళ్లిన అమెరికన్ వ్యాపారవేత్త డెన్నిస్ టిటో తొలి అంతరిక్ష యాత్రికుడిగా నిలిచాడు. ఏడు రోజులు అంతరిక్షంలో ఉన్నందుకు 2కోట్ల డాలర్లు (ఇప్పుడు మన కరెన్సీలో రూ.147 కోట్లు) చార్జిగా చెల్లించాడు. తర్వాత మరికొందరు మా త్రమే అంతరిక్ష యాత్రలకు వెళ్లగలిగారు. విపరీతమైన ఖర్చు, స్పేస్‌లోకి వెళ్లేందుకు అవకాశాలు తక్కువగా ఉండటమే దీనికి కారణం. ప్రైవేటు కంపెనీల రాకతో.. డెన్నిస్ టిటో ఘటన తర్వాత అంతరిక్ష యాత్రలకు వెళ్లాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే పలు ప్రైవేటు కంపెనీలు తెరపైకి వచ్చా యి. ధనిక వ్యాపారవేత్తలు రిచర్డ్ బ్రాస్నన్ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ, అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ కంపెనీని, టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించి ప్రయోగాలు మొదలుపెట్టారు. అవన్నీ ఇటీవలే ఓ కొలిక్కి వచ్చాయి. మనుషులను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లి, తిరిగి సురక్షితంగా ల్యాండ్ అయ్యే స్పేస్ షటిల్స్‌ను వారు అభివృద్ధి చేశారు. ఇద్దరూ సొంత స్పేస్ ఫ్లైట్లలో.. ఆదివారం జరిగే అంతరిక్ష యాత్ర లో వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాస్నన్, కొందరు కంపెనీ ఉద్యోగులు స్పేస్‌లోకి వెళ్తున్నారు. 20న బ్లూఆరిజిన్ నిర్వహించనున్న యాత్రలో జెఫ్ బెజోస్, మరికొందరు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి రానున్నారు. ఇద్దరూ కూడా తమ సొంత కంపెనీల స్పేస్ ఫ్లైట్ల గగన విహారానికి వెళ్తుండటం గమనార్హం. ఈ యాత్రలతో అంతరిక్ష పర్యాటకానికి దారులు తెరుచుకున్నట్టేనని నిపుణులు చెప్తున్నారు. స్పేస్ కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండటంతో టూర్ వ్యయం కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఏయే కంపెనీలు.. ఎప్పుడెప్పుడు? స్పేస్ ఎక్స్ ఈ సంస్థ తమ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ‘ది క్రూ డ్రాగన్’ స్పేస్ షటిల్‌ను ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం నాసా శాస్త్రవేత్తలను, పరికరాలను ఐఎస్ఎస్కు తీసుకెళ్లడానికి, తిరిగి తీసుకురావడానికి వినియోగిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘ఇన్స్పిరేషన్4’ పేరిట తొలి వాణిజ్య యాత్ర చేపట్టనున్నారు. అందులో నలుగురు ప్యాసింజర్లు స్పేస్ టూర్‌కు వెళ్తున్నారు. అయితే దీనికి అయ్యే చార్జీలను బయటపెట్టలేదు. ఇదే సంస్థ భవిష్యత్తులో విస్తృతంగా అంతరిక్ష యాత్రలు చేపట్టేందుకు ‘స్టార్ షిప్’ స్పేస్ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా 2023లో చంద్రుడిపైకి యాత్ర చేపడతామని ప్రకటించింది. జపాన్‌కు చెందిన యుసకు మెజవా అనే వ్యాపారవేత్త అందులో ఇప్పటికే సీటు బుక్ చేసుకున్నారు. ఆక్సిమ్ స్పేస్ స్పేస్ ఎక్స్, నాసా సంస్థలతో కలిసి ఆక్సిమ్ స్పేస్ సంస్థ అంతరిక్ష యాత్రలకు ప్లాన్ చేస్తోంది. 2022 జనవరిలో నలుగురు ఎనిమిది రోజుల స్పేస్ టూర్‌కు వెళ్లనున్నారు. దీనికి ఒక్కొక్కరు 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) చెల్లిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన రాకెట్, స్పేష్ షటిల్‌ను ఈ యాత్రలకు వినియోగించనున్నారు. బ్లూ ఆరిజిన్ ఈ సంస్థ తమ న్యూషెపర్డ్ పునర్వినియోగ రాకెట్ ద్వారా ఇప్పటికే పలు ప్రయోగాలు నిర్వహించింది. ఈ నెల 20న జెఫ్ బెజోస్, మరో ఐదుగురు సిబ్బంది, శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ద్వారా కాసేపు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి రానున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి వాణిజ్య యాత్రలను ప్రారంభిస్తామని బ్లూఆరిజిన్ ప్రకటించింది. వర్జిన్ గెలాక్టిక్ వీఎస్ఎస్ యూనిటీ ప్రత్యేక విమానం ద్వారా ‘స్పేస్ షిప్ టూ’ స్పేస్ వెహికల్‌ను భూమికి 10 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అంతరిక్షంలోకి స్పేస్ షటిల్‌ను ప్రయోగించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఇప్పటికే పలుమార్లు విజయవంతంగా ప్రయోగించింది. తాజాగా ఆదివారం తొలి ఫ్లైట్ జరగనుంది. వచ్చే ఏడాది నుంచి వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలను మొదలుపెట్టనుంది. కొద్ది నిమిషాల్లోనే ముగిసే ఈ టూర్ల కోసం ఇప్పటికే 600 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్టు ప్రకటించింది. ఒక్కొక్కరికి 2.5 లక్షల డాలర్లు (రూ.18.5 కోట్లు) చార్జిగా నిర్ణయించింది. ఇదే వరుసలో మరిన్ని కంపెనీలు కూడా.. రష్యా స్పేస్ ఏజెన్సీ తమ సోయూజ్ రాకెట్ ద్వారా ఇప్పటికే అంతరిక్ష యాత్రలు నిర్వహిస్తుండగా.. బోయింగ్ కంపెనీ స్పేస్ టూరిజం కోసం స్టార్‌లైనర్ స్పేస్ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ది డ్రీమ్ ఆఫ్ గేట్‌వే ఫౌండేషన్ భూమి చుట్టూ తిరుగుతూ ఉండే అంతరిక్ష హోటల్ ‘వోయేజర్ స్టేషన్’ను ప్లాన్ చేస్తోంది. దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. కొన్ని నిమిషాల నుంచి... కొన్ని రోజుల దాకా.. అంతరిక్ష యాత్రలు అంటే.. కొన్ని నిమిషాలు గడిపి తిరిగిరావడం నుంచి కొద్దిరోజులు ఐఎస్ఎస్లో ఉండటం దాకా వేర్వేరుగా ఉంటాయి. అంతరిక్షంలోకి వెళ్లి గుండ్రంగా ఉన్న భూమిని, కాస్త దగ్గరగా చంద్రుడిని, సువిశాల విశ్వాన్ని వీక్షించడానికి చేసే సాధారణ స్పేస్ ఫ్లైట్లు అరగంట నుంచి గంటలో ముగుస్తాయి. వీటికి ఒక స్థాయి ధనికులు కూడా భరించే స్థాయిలో కొన్ని లక్షల నుంచి ఒకట్రెండు కోట్ల వరకు చార్జీలు ఉంటాయి. ఐఎస్ఎస్లో కొద్దిరోజులు గడపడం, భూమి చుట్టూ పరిభ్రమించడం సుదీర్ఘ యాత్రల కిందికి వస్తాయి. వీటికి పదుల కోట్లలో ఖర్చు అవుతుంది. నాసా కూడా రంగంలోకి.. అంతరిక్ష రంగంలో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా స్పేస్ టూరిజంపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్ను) ప్రైవేటుకు అప్పగించి.. తాము అందులో ఓ వినియోగదారుడిగా కొనసాగాలని భావిస్తోంది. ఇప్పటికే నాసాకు చెందిన వ్యోమగాములు, పరికరాలను ఐఎస్ఎస్కు తీసుకెళ్లేందుకు స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లలో అంతరిక్ష యాత్రలు చేపడతామని, వెళ్లి రావడానికి అయ్యే ఖర్చును నిర్ధారించాల్సి ఉందని నాసా ఇప్పటికే పేర్కొంది. ఐఎస్ఎస్లో గడిపితే ఒక్కో టూరిస్టు రోజుకు 35 వేల డాలర్లు (రూ.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. -
టయోటా మోటార్స్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో ఆటో పరిశ్రమపై అధిక పన్నుల విధానం కారణంగా మరింత విస్తరించబోమని ప్రకటించింది.ఇక మీదట ఇండియాలో విస్తరణ ప్రణాళికలపై దృష్టి లేదనీ, అయితే మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతామని జపాన్ కు చెందిన టయోటా తెలిపింది. భారతీయ పన్నుల విధానం వల్ల కార్ల ఉత్పత్తి చేసినా డిమాండ్ లేదని ఈ నేపథ్యంలో ఇండియాలో ఇక పెట్టుబడులు పెట్టేది లేదని స్పష్టం చేసింది టయోటా. కార్లు, మోటారు బైకులపై ప్రభుత్వం పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయనీ దీంతో తమ ఉత్పత్తి దెబ్బతింటోందనీ, ఫలితంగా ఉద్యోగావకాశాలు పడిపోతున్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ అన్నారు. భారీ పెట్టుబడుల తరువాత కూడా అధిక పన్నుల ద్వారా మిమ్మల్ని కోరుకోవడం లేదనే సందేశం అందుతోందని అని విశ్వనాథన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధానంగా ఇన్నోవా, ఫార్చునర్ కార్లతో భారతీయ వినియోగదారులకు చేరువైన ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో కార్ల కంపెనీ టయోటా 1997లో ఇండియా మార్కెట్లోకి వచ్చింది.(సేల్స్ మరోసారి ఢమాల్, ఆందోళనలో పరిశ్రమ) అతిపెద్ద మార్కెట్ భారత్ నుంచి ఇప్పటికే (2017లో) అమెరికాకు చెందిన జనరల్ మోటర్స్ వైదొలిగింది.ఫోర్డ్ కంపెనీ కూడా విస్తరణ ప్రణాళికలకు స్వస్తి చెప్పి మహీంద్రాలో జాయింట్ వెంచర్ గా కొనసాగుతోంది. హార్లీ డేవిడ్ సన్ కూడా ఇదే బాటలో ఉన్నట్టు ఇటీవల నివేదికలు వెలువడ్డాయి. భారతదేశంలో కార్లు, ద్విచక్ర వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు సహా మోటారు వాహనాలపై 28 శాతం జీఎస్టీ అమలవుతోంది. ఇంజిన్ సైజు, పొడుగు, లగ్జరీ కేటగిరీ వారీగా 1 శాతం నుంచి 22 శాతం అదనపు పన్నులు భారం పడుతోంది. 1500 సీసీ ఇంజిన్‌తో పాటు, నాలుగుమీటర్ల పొడువు దాటిన ఎస్‌యూవీల దాదాపు 50శాతం వరకూ పన్నులు పడుతున్నాయని కంపెనీలు అంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంది. కరోనా సంక్షోభం కంటే ముందే ఆటో రంగం కుదేలైన సంగతి తెలిసిందే. అమ్మకాలు క్షీణించి, ఆదాయాలు లేక ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ఆటో పరిశ్రమను కరోనా మరింత దెబ్బతీసింది. పలు కంపెనీలు దేశం నుంచి వైదొలగుతున్నాయి. ఈ మందగమనం నుంచి బయటపడేందుకు కనీసం నాలుగేళ్లు పడుందని అంచనా. అటు టయోటా తాజా నిర్ణయంతో మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ కంపెనీలను ఆకర్షించి, భారీగా పెట్టుడులవైపు చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఎదురు దెబ్బేనని ఆటో రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ నెల 23న టయోటా అర్బన్ క్రూయిజర్ సబ్-4 ఎం ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ను ఇప్పటికే ప్రారంభించింది. -
హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు..!
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మోడల్ ఆధారంగా పెంపు ఉండనున్నట్లు చెప్పిన కంపెనీ.. ఎంత మేర ధరలు పెరగనున్నాయనేది వెల్లడించలేదు. మారుతీ, టాటా మోటార్స్‌తో పాటు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా వాహన ధరలను జనవరి 1 నుంచి పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. -
సిటీ, పల్లె వెలుగు కనీస చార్జీ రూ.10
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సిటీ సర్వీసులతోపాటు గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లె వెలుగు బస్సు సర్వీసుల కనిష్ట టికెట్ ధరను రూ. 10గా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ చార్జీ రూ. 5గా ఉంది. టికెట్ చార్జీ పెంచితే తప్ప ఆర్టీసీ మనుగడ అసాధ్యంగా మారడంతో కి.మీ.కి 20 పైసల చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఈ మేరకు అధికారులు శుక్రవారం కసరత్తు చేసి కొత్త టికెట్ ధరలను ప్రాథమికంగా నిర్ణయించారు. సిటీ ఆవల తిరిగే ఎక్స్‌ప్రెస్, డీలక్స్, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల లాంటి సాధారణ సర్వీసులకు ప్రస్తుత చార్జీపై కి.మీ.కి 20 పైసలు చొప్పున పెంచనున్నారు. చిల్లర సమస్య రాకుండా దాన్ని తదుపరి మొత్తానికి పెంచుతారు. కానీ తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతున్న సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసుల విషయంలో కనిష్ట మొత్తాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు. అయితే కి.మీ.కి 20 పైసల చొప్పున పెంపునకే సీఎం అనుమతించినందున కనిష్ట మొత్తాన్ని రెట్టింపు చేసే అంశాన్ని శనివారం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆయన అనుమతిస్తే శనివారం సాయంత్రానికి తుది టికెట్ ధరలను ప్రకటించి సోమవారం నుంచి పెంచిన చార్జీలు అమలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ మార్గాలకు చార్జీలు ఇలా... చార్జీల పెంపుతో హైదరాబాద్ నుంచి విజయవాడకు అన్ని కేటగిరీ బస్సుల్లో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలు దాదాపు రూ. 55 మేర పెరుగుతాయి. అలాగే కరీంనగర్‌కు రూ. 32, వరంగల్‌కు రూ. 30, నిజామాబాద్‌కు రూ. 35, ఖమ్మంకు రూ. 45, ఆదిలాబాద్‌కు రూ. 60 మేర పెరుగుతాయి. ఉదాహరణకు ప్రస్తుతం నగరం నుంచి విజయవాడకు సూపర్ లగ్జరీ చార్జీ రూ. 315గా ఉంది. దీన్ని రూ. 370కి పెంచుతారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ. 140 ఉంది. దాన్ని రూ. 175కు పెంచుతారు. కి.మీ.కి 20 పైసల చొప్పున పెంచుతూ చిల్లర సమస్య రాకుండా ఆ మొత్తాన్ని సర్దుతారు. రోడ్డు సెస్, టోల్ వ్యయాల వల్ల చార్జీల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. శనివారం సాయంత్రానికి అన్ని డిపోలకు తుది చార్జీల పట్టికను అధికారులు పంపనున్నారు. -
జియో ఫైబర్ వచ్చేసింది.. ప్లాన్స్ ఇవే..
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆప్టికల్ ఫైబర్ ఆధారిత జియోఫైబర్ సర్వీసులను కమర్షియల్‌గా నేడు (గురువారం, సెప్టెంబరు 5) ప్రారంభించింది. జియో ఫైబర్ కస్టమర్లకు ల్యాండ్‌లైన్ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్ కాల్స్, సెకనుకు 100 మెగాబిట్ నుంచి 1 గిగాబిట్ దాకా స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుతాయి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, టైటానియం పేరుతో మొత్తం 6 ప్లాన్లను పరిచయం చేసింది. జియో ఫైబర్ ప్లాన్లు నెలకు రూ. 699 నుంచి ప్రారంభం. రిలయన్స్ జియో గురువారం భారతదేశంలోని 1,600 నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ - జియో ఫైబర్ - దాని "ఫైబర్ టు ది హోమ్" సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. జియో ఫైబర్‌తో తన వాగ్దానాన్ని కొనసాగిస్తోందని రిలయన్స్ జియో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జియో ఫైబర్ ప్లాన్లు నెలకు రూ. 699 నుంచి 8,499 మధ్య ఉంటాయి. జియో ఫైబర్ అల్ట్రా-హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ (1 జిబిపిఎస్ వరకు), ఉచిత దేశీయ వాయిస్ కాలింగ్, కాన్ఫరెన్సింగ్ , ఇంటర్నేషనల్ కాలింగ్, టివి వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఎంటర్టైన్మెంట్ ఓవర్ టాప్ (ఒటిటి) అనువర్తనాలు వంటి సేవలను అందిస్తుంది. గేమింగ్, హోమ్ నెట్వర్కింగ్, పరికర భద్రత, వర్చువల్ రియాలిటీ అనుభవం, ప్రీమియం కంటెంట్ ప్లాట్‌ఫాం తమదనిరిలయన్స్ జియో తెలిపింది. ప్రపంచ రేట్ల కంటే పదోవంతు కంటే తక్కువ ధరలకు ధర నిర్ణయించింది, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి, ప్రతి బడ్జెట్‌కు, ప్రతి అవసరానికి అనుగుణంగా ప్లాన్లను సిద్ధం చేశామని తెలిపింది. నెలవారీ ప్లాన్లు జియోఫైబర్ ప్లాన్ అద్దెలు రూ .699 -రూ.8,499 అతి తక్కువ ప్లాన్‌లో కూడా 100 ఎంబీపీఎస్ వేగంతో సేవలు దీర్ఘకాలిక్ ప్లాన్స్ వినియోగదారులకు 3, 6 , 12 నెలల ప్లాన్లను కూడా ఎన్నుకోవచ్చు. ఈఎంఐ సౌకర్యం కూడా. ఇందుకు బ్యాంక్‌లతో టై ఆప్ జియో ఫైబర్ వెల్కమింగ్ ఆఫర్ ప్రతీ వినియోగదారుడికి అమూల్యమైన సేవలు వార్షిక ప్లాన్ - ప్రయోజనాలు జియో హోమ్ గేట్‌వే జియో 4కే సెట్ టాప్ బాక్స్ టెలివిజన్ సెట్ (గోల్డ్ ప్లాన్ ఆ పైన మాత్రమే) మీకు ఇష్టమైన ఓటీటీ అనువర్తనాలకు చందా అపరిమిత వాయిస్ , డేటా సేవలు రిలయన్స్ జియో ఫైబర్ ఆఫర్లు -
ఎయిర్టెల్ ‘డియర్ కామ్రేడ్’ డీల్ : బంపర్ ఆఫర్లు
సాక్షి, హైదరాబాద్ : టెలికాం సేవల సంస్థ భారతీ ఎయిర్టెల్ (ఎయిర్టెల్), టాలీవుడ్ అప్ కమింగ్ మూవీ ‘డియర్ కామ్రెడ్’తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తాజా ఒప్పందం ద్వారా ఎయిర్టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ కేటగిరీలలో స్పెషల్ `డియర్ కామ్రెడ్` ప్యాక్‌లు లాంచ్ చేసింది. అలాగే ప్యాక్‌ల రీచార్జ్‌లపై ఎంపిక చేసిన లక్కీ వినియోగదారులకు ఉచితంగా సినిమా టికెట్లతోపాటు, డియర్ కామ్రేడ్ మూవీ నటీ నటులను కలుసుకునే బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నామని ఎయిర్టెల్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం మైత్రి మూవీ మేకర్స్‌తో తాము కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. రూ.169 ప్రీపెయిడ్‌తో రీచార్జ్ చేసుకున్న వారు లేదా ఎయిర్టెల్ లైఫ్ స్టైల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.499 లేదా అంతకుమించి రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు ఈ బంపర్ ఆఫర్లను అందించనుంది. ఎంపిక చేసిన లక్కీ కస్టమర్లు ఎయిర్టెల్ మీట్ అండ్ గ్రీట్‌లో భాగంగా, డియర్ కామ్రెడ్ సినిమాలో నటీనటులను కలుసుకునే అవకాశం దొరుకుతుంది. దీంతోపాటుగా వినియోగదారులు ప్రత్యేకమైన డాటా, టాక్‌టైం ప్రయోజనాలు తదితర మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆఫర్లను అందిస్తోంది. ఏపీ, తెలంగాణ ఎయిర్టెల్ సీఈఓ అవ్నీత్ సింగ్ పూరి, మైత్రీ మూవీ మేకర్స్ అధిపతులు పరస్పరం ఈ ఒప్పందంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. డియర్ కామ్రెడ్ సినిమాతో ఒప్పందం ద్వారా ప్రాంతీయ భాషల కంటెంట్ స్పష్టమైన సమాచార మార్పిడికి ఉపయోగపడుతుందని ఎయిర్టెల్ భావిస్తోందని పూరి అన్నారు. సినిమా హీరో విజయ దేవర్కొండ స్పందిస్తూ డియర్ కామ్రెడ్ సినీ ప్రయాణంలో ఎయిర్టెల్ భాగస్వామ్యం తనకు సంతోషాన్ని, ఉత్కంఠను కలిగిస్తోందన్నారు. వినియోగదారులు డియర్ కామ్రేడ్ ఎయిర్టెల్ ప్యాక్‌లను రీచార్జ్ చేసుకోవాలని, తద్వారా మనమంతా కలుసుకోవాలని ఆకాంక్షించారు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో డియర్ కామ్రేడ్ రూపుదిద్దుకుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన శృతి రామచంద్రన్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే. -
రుణ ప్రణాళిక ఖరారు
సాక్షి, మెదక్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళిక విడుదలైంది. గత ఆర్థిక సంవత్సరం రూ.1,876 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ఈ సారి రూ.2,262 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.386 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.1,850 కోట్లు.. ఇతరత్రా రూ.412 కోట్ల రుణాలను అందజేయనున్నారు. వ్యవసాయానికి రూ.450 కోట్లు అదనం 2018–19 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.1,400 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 65 శాతం లక్ష్యాన్ని చేరినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి వెల్లడించారు. అదేవిధంగా.. ఇతర రుణాల పంపిణీకి సంబంధించి రూ.476 కోట్లు కేటాయించారు. ఇందులో 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రుణాలకు సంబంధించి పంపిణీ లక్ష్యం రూ.1,850 కోట్లు.. ఇతర రుణాలు రూ.412 కోట్లుగా నిర్ధారించారు. వ్యవసాయ రంగానికి రూ.450 కోట్లు పెంచగా.. ఇతర రుణాలకు 64 కోట్లు కోత విధించారు. రుణ పంపిణీ లక్ష్యాన్ని చేరుకోవాలి : కలెక్టర్ జిల్లాలోని ప్రతి బ్యాంకు తప్పనిసరిగా తమకు నిర్దేశించిన మేరకు రుణాల పంపిణీ లక్ష్యాన్ని చేరుకుని జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికను విడుదల చేశారు. మహిళా సంఘాలు, బ్యాంకు లింకేజీకి సంబంధించిన వాల్‌పోస్టర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల 2019–20 వార్షిక ప్రణాళికను సైతం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బ్యాంకుల వారీగా వ్యవసాయ పంట రుణాల లక్ష్యాలు, సాధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని బ్యాంకులు మినహా ఆశించిన స్థాయిలో రుణాలు మంజూరు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో అయినా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అంతా బ్యాంకర్ల చేతిలోనే.. వ్యవసాయ, ఇతర రుణాల పంపిణీకి సంబంధించి ప్రతి ఏటా రుణ ప్రణాళిక ఖరారు చేస్తున్నారు. అయితే ఎప్పుడు కూడా వందశాతం లక్ష్యాన్ని చేరుకున్న దాఖలాలు లేవు. ఇందుకు బ్యాంకర్లే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. పలు కొర్రీలతో రైతులు, ఇతర వర్గాలకు రుణాలు అందజేయడం లేదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ యంత్రాంగం పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి హెచ్చరించినప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనైనా పూర్తి స్థాయిలో రుణ లక్ష్యాన్ని చేరుకుంటారా.. లేదా.. అనేది వేచి చూడాల్సిందే. ప్రతి అధికారి కృషి చేయాలి.. ప్రతి బ్యాంకుకు తమ శాఖ పరిధిలో కొంత రుణ లక్ష్యాన్ని నిర్ధేశించామని.. దీన్ని చేరుకునేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి బ్యాంకు తప్పనిసరిగా వ్యవసాయ రుణాలను రైతులకు అందజేయాలన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో కొన్ని బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని.. ఇది తగదన్నారు. ప్రతి సమావేశంలో బ్యాంకులు పంపిణీ చేయాల్సిన రుణ లక్ష్యాన్ని వివరిస్తున్నామని.. కొందరు బ్యాంకర్లు దానికనుగుణంగా వ్యవహరించడం లేదన్నారు. ఇదే కొనసాగితే సదరు బ్యాంకులపై చర్యలకు సిఫారసు చేయనున్నట్లు హెచ్చరించారు. ముద్ర రుణాల పంపిణీలో నిర్లక్ష్యంపై సీరియస్.. ప్రభుత్వం చిన్న, మధ్య తరగతి వ్యాపారుల కోసం ముద్ర, స్టాండ్ అప్, పీఎంఈజీపీ పథకాల కింద రుణాలను అందజేస్తోందని కలెక్టర్ వివరించారు. వ్యాపారులు వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఈ పథకాల ముఖ్య ఉద్దేశమన్నారు. కానీ.. బ్యాంకులు ఈ రుణాల మంజూరులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయన్నారు. ముద్ర రుణాల మంజూరు కోసం తమను ఎవరు సంప్రదించడం లేదని ఒక బ్యాంకు మేనేజర్ చెప్పగా.. కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా రూ.50 వేలు ఇచ్చే పథకానికి.. మీ దగ్గరకు ఎవరూ రావడం లేదా.. అని ప్రశ్నించారు. వచ్చే వారికి అనేక రకాలుగా షరతులు విధించడం లేదా.. అంటూ అసహనం వ్యక్తం చేశారు. తమ పరిధిలో లేదు అనే సమాధానాల వల్ల చిరు వ్యాపారులు బ్యాంకుల వద్దకు రావడం మానేశారని కలెక్టర్ అన్నారు. బ్యానర్ ప్రదర్శించండి.. ముందుగా ప్రతి బ్యాంకు తప్పనిసరిగా మా బ్యాంకులో ముద్ర రుణాలు ఇవ్వబడును అనే బ్యానర్ ప్రదర్శించాలని ఆదేశించారు. అవసరమున్న వారు బ్యాంకులో సంప్రదించగా.. తిరస్కరించినట్లు తెలిస్తే సంబంధిత బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న స్టాండప్, పీఎంఈజీíపీ రుణాలను త్వరగా అందజేయాలని సూచించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం కింద జిల్లాలో పంటవేసే ప్రతిరైతు బీమా చేయించుకునేలా చూడాలని, బ్యాంకు అధికారులు ఈ ప్రక్రియపై దృష్టి సారించాలని çకలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని విషయాలు రైతులకు తెలియజేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతారామారావు, లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్ నాగరాజు, నాబార్డు ఏపీఎం సీసిల్ తిమోతి, లీడ్ జిల్లా అధికారి వెంకటేశ్, డీఏఓ పరశురాం నాయక్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ దేవయ్య, డీడబ్ల్యూ జ్యోతిపద్మ, డీటీడబ్ల్యూఓ వసంతరావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పరిశ్రమల శాఖ జీఏం తిరుపతయ్య, బీసీడబ్ల్యూ సుధాకర్‌తోపాటు బ్యాంకు మేనేజర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పతంజలి సిమ్ కార్డు ప్లాన్స్ ఇవే!
న్యూఢిల్లీ : ఫుడ్, ఆయుర్వేద్ మెడిసిన్, కాస్మటిక్స్, హోమ్ కేర్, పర్సనల్ కేర్ విభాగాల్లో ఉత్పత్తుల్లో దూసుకుపోతున్న పతంజలి తాజాగా టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘స్వదేశీ సమృద్ధి’ పేరిట సిమ్‌లను కూడా బాబా రాందేవ్ మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్తో జత కట్టిన రాందేవ్, ఈ పతంజలి సిమ్ కార్డులను తీసుకొచ్చారు. ఇప్పటికే రిలయన్స్ జియో ఎంట్రీతో అతలాకుతలమవుతున్న టెలికాం మార్కెట్, పతంజలి సిమ్ కార్డుల ఎంట్రీతో ఈ రంగంలో మరింత పోటీ నెలకొనబోతోంది. తొలిదశలో పతంజలి ఉద్యోగులు, కార్యాలయ సిబ్బందికే ప్రవేశపెట్టనున్న ఈ సిమ్ కార్డు ప్లాన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పతంజలి బీఎస్ఎన్ఎల్ రూ.144 ప్లాన్. ఈ ప్లాన్ వాలిడిటీ నెల రోజులు. దీనిపై అపరిమిత వాయిస్ ఆల్ఇండియా రోమింగ్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందనున్నారు. పతంజలి బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ప్లాన్ ఓచర్- రూ.792. ఈ ప్లాన్ వాలిడిటీ 6 నెలలు. దీనిపై అపరిమిత వాయిస్ ఆల్ఇండియా రోమింగ్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు. రూ.1584తో పతంజలి బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ప్లాన్ ఓచర్ -1584. ఈ ప్లాన్ వాలిడిటీ ఏడాది. దీనిపై అపరిమిత వాయిస్ ఆల్ఇండియా రోమింగ్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు. బీఎస్ఎన్ఎల్కు చెందిన ఐదు లక్షల కౌంటర్ల ద్వారా త్వరలో వినియోగదారులు పతంజలి సిమ్ కార్డులను పొందొచ్చని రాందేవ్ బాబా చెప్పినట్లు ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ తెలిపింది. సిమ్ కార్డులను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తెచ్చిన తర్వాత.. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డ్ తీసుకున్నవారు పతంజలి ప్రొడక్టులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని ఏఎన్ఐ పేర్కొంది. అలాగే ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమా ప్రయోజనాలూ ఉంటాయి. -
జియో దెబ్బకు ఎయిర్టెల్ కూడా..
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్లాన్లను అలా సమీక్షించిందో లేదా దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ కూడా తన రీచార్జ్ ప్లాన్లను రివ్యూ చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్ల చెల్లుబాటును పొడిగిస్తూ అప్డేట్ చేసింది. తద్వారా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. రూ. 448, రూ.509 ప్రీపెయిడ్ రీచార్జ్‌లపై ఈ అదనపు ప్రయోజనాలను వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం రూ.448 ప్లాన్ వాలిడిటీని 70 రోజుల నుంచి 82 రోజులకు పెరిగింది. రూ. 509 ప్రణాళిక 84 రోజుల బదులుగా ఇకపై 91 రోజులు పాటు చెల్లుతుంది. ఈ మార్పులు అన్ని ప్రీపెయిడ్ ఎయిర్టెల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, వింక్‌మ్యూజిక్ , ఎయిర్టెల్ టీవీ ఆప్ చందా వంటి ఇతర ప్రయోజనాలు ఈ పథకంలోనే లభిస్తాయి. -
హెచ్‌డీఎఫ్‌సీకి ఫండ్ రైజింగ్ బూస్ట్
సాక్షి, ముంబై: భారీ ఎత్తున నిధుల సమీకరణ చర్యలుచేపట్టిందన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం నాటి బుల్ మార్కెట్లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్ భారీగా లాభపడింది. వివిధ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టే ప్రతిపాదన నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్ల దిగారు. హెచ్డీఎఫ్సీకౌంటర్ 52 వారాల గరిష్టాన్ని తాకింది. బిఎస్ఇ ఫైలింగ్ ప్రకారం, అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) లేదా ఏడీఆర్, డిపాజిటరీ రిసీప్ట్స్ తదితర మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని చర్చించేందుకు 2017 డిసెంబర్ 20 న బోర్డు సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంకు వాటాదారుల ఆమోదంతో సహా. బోర్డు ఆమోదం పొందినట్లయితే, పైన పేర్కొన్న ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందేందుకు విస్తృత సాధారణ సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరోవైపు ఈ షేరుపై రూ. 2165 టార్గెట్‌తో ఎనలిస్టులు బై కాల్ ఇస్తున్నారు. -
భారీ ప్రణాళికలతో దూసుకొస్తున్న షావోమి
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన చైనా కంపెనీ షావోమి మరింత శరవేగంగా దూసుకొస్తోంది. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయం, పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించడానికి యోచిస్తోందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కార్లు విక్రయాలతో పాటు రుణాలు ఇవ్వడం లాంటి ఇతర ఫైనాన్సింగ్ సేవలను అందించనుందనీ ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్‌లో తెలిపిందని పేర్కొంది. ఆర్‌ఓసీలో షావోమి దాఖలు చేసిన వివరాల ప్రకారం, అన్ని రకాల వాహానాలు (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) రవాణ పరికరాలు, ఇతర రవాణా సామగ్రి, విడిభాగాలను సరఫరా చేయనున్నామని ప్రకటించింది. అంతేకాదు నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, పేమెంట్ బ్యాంకు, లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్, ఇతర ఆర్థిక సేవలు, పేమెంట్ గేట్ వే, సెటిల్మెంట్ సిస్టమ్ ఆపరేటర్లు, మొబైల్ వర్చ్యువల్ నెట్వర్క్ ఆపరేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించాలని భావిస్తున్నట్టు సంస్థ తెలిపింది. -
‘కైసే హో ’.. అచ్చా హై!
♦ సీనియర్ డీపీవో శ్రీరాములుకు డీఆర్ఎం వీజీ భూమా కితాబు ♦ రైల్వే డివిజన్లో మూడు కొత్త ప్రణాళికలు ప్రారంభం లక్ష్మీపురం (గుంటూరు) : సౌత్ సెంట్రల్ పరిధిలోని గుంటూరు రైల్వే డివిజన్లో ఎన్నడూ లేని విధంగా డివిజన్ పరిధిలో ఉన్న 4 వేల మంది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ‘కైసే హో (ఎలా ఉన్నావు)’ కార్యక్రమం ప్రారంభించడం అభినందనీయమని గుంటూరు రైల్వే డీఆర్ఎం వీజీ భూమా అన్నారు. స్థానిక పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్ఎం కార్యాలయ ప్రాంగణంలోని సీనియర్ డీపీవో కార్యాలయంలో డీఆర్ఎం వీజీ భూమా, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఎం. శ్రీరాములు సంయుక్తంగా మంగళవారం కైసే హో (ఎలా ఉన్నావు), మై ఫ్యామిలీ ట్రీ, ఎస్.ఎమ్.ఎస్.. కార్యక్రమాలపై డివిజన్ పరిధిలోని సంబంధిత విభాగాధిపతులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఈ మూడు కార్యక్రమాలను డీఆర్ఎం ప్రారంభించారు. సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకే.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని 129 మంది సూపర్వైజర్ల కంట్రోల్లో 4 వేల మంది సిబ్బంది ఆయా విభాగాలలో వి«ధులు నిర్వర్తిస్తున్నారని, వారందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కైసే హో కార్యక్రమం ఏర్పాటు మంచి ప్రయత్నమని సీనియర్ డీపీవో శ్రీరాములును అభినందించారు. ఈ కార్యక్రమం మొదటగా సౌత్ సెంట్రల్లో ప్రారంభించడం, అది కూడా గుంటూరు రైల్వే డివిజన్లో మొదలెట్టడం సంతోషదాయకంగా ఉందని తెలిపారు. తమ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగితో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం బాగుంటుందన్నారు. అలాగే ‘మై ఫ్యామిలీ ట్రీ’ అనే కార్యక్రమంలో ప్రధానంగా డివిజన్ పరిధిలోని విధులు నిర్వర్తించే 4 వేల మంది ఉద్యోగుల పేరు వివరాలతో పాటు వారి జనన ధృవీకరణ వివరాలు కూడా సేకరించడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా డివిజన్ పరిధిలో ప్రతి ఉద్యోగి జన్మదినం రోజు స్వయానా డీఆర్ఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు చెప్పారు. అదే రోజు ఆ ఉద్యోగి డివిజన్ పరిధిలోగాని, విధులు నిర్వర్తించే ప్రాంతంలోగానీ ఓ మొక్కను నాటే కార్యక్రమం కూడా ప్రవేశపెట్టామని వెల్లడించారు. దీని ద్వారా 4 వేల మంది నాలుగు వేల మొక్కలను నాటే అవకాశం కల్పించామని తెలిపారు. ఆ మొక్కల బాగోగులు కూడా ఆ ఉద్యోగి చూసుకోవాలని చెప్పారు. అదే విధంగా ‘ఎస్.ఎమ్.ఎస్’ కార్యక్రమంలో డివిజన్ పరిధిలో ప్రమాదవశాత్తు గాయాల పాలైన, మరణించిన, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగికి ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ 9701309607 కు మెసేజ్ చెయ్యడం ద్వారా సంబంధిత విభాగాధిపతులకు ఆ సమాచారం పంపించి తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. ప్రతి మంగళవారం.. సీనియర్ డివిజనల్ పర్సనల్ అధికారి ఎం. శ్రీరాములు మాట్లాడుతూ డీఆర్ఎం వీజీ భూమా, ఏడీఆర్ఎం రంగనాథ్ సహకారంతో ఈ సరికొత్త కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో కైసే హో కార్యక్రమం ప్రతి మంగళవారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు డివిజన్ పరిధిలో ఉన్న 4 వేల మంది ఉద్యోగుల సమస్యల గురించి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు, సీనియర్ డీఎస్టీ మునికుమార్, సీనియర్ డీఎస్వో సుబ్రహ్మణ్యం, సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు. -
తక్కువ ఖర్చుతో ఆ సర్వీసులు- గో ఎయిర్
కోల్కత్తా: ప్రయివేటు విమానయాన సంస్థ గో ఎయిర్ విదేశాలు వెళ్లాలనుకునే విమాన ప్రయణికులకు ఊరటనందిస్తోంది. త్వరలోనే తక్కువ ఖర్చుతో నడిచే విదేశీ విమాన సర్వీసులు ప్రారంభించనున్నామని ప్రకటించింది. తమ విదేశీ కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభిస్తామని గో ఎయిర్ మేనేజింగ్ డైరెక్టర్ హెహ్ వాడియా వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి తమ విదేశీ గో ఎయిర్ విమానాలను ప్రారింభిచనున్నామని ఆయన అన్నారు. ప్రారంభంలో ఆసియా రీజన్ తమ సేవలను ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 24-బలమైన విమానాలకు తోడు నియో ఎ320 143 ఎయిర్ బస్‌లకు ఆర్డర్చేసినట్టు పేర్కొన్నారు. వీటిలో అయిదింటిని ఇప్పటికే తమకు అందాయని, ఇంజీన్ లోపాల కారణంగా డెలివరీ ఆలస్యమవుతున్నట్టు వాడియా వివరించారు. మరోవైపు ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియా వాటాల కొనుగోలుపై మరో వైమానిక సంస్థ ఇండిగోకు పోటీగా రానుందా అని ప్రశ్నించినపుడు అలాంటిదేమీలేదని స్పష్టం చేశారు. అలాగే సంస్థ ఐపీఓకు వచ్చే అంచనాలను కూడా ఆయన కొట్టి పారేశారు. -
పేటీఎం యాప్ వాట్సాప్‌కు షాకిస్తుందా?
ముంబై: పాపులర్ మెసేజింగ్ యాప్‌ను దెబ్బకొట్టేందుకు ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎ సిద్ధపడుతోంది. త్వరలోనే వాట్సాప్‌కు పోటీగా ఓ మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేయనుంది. సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ పోటీ గా పేటీఎం వ్యూహాన్ని రచిస్తోందని పేటీఎం సన్నిహిత వర్గాల సమాచారం. సాఫ్ట్ బ్యాంక్, అలీబాబా మద్దతునందిస్తున్న ఈ ప్రముఖ డిజిటల్ చెల్లింపు సంస్థ ఈ నెల చివరినాటికి ఈ యాప్‌ను లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఆహారం నుంచి..విమాన టికెట్ల దాకా ప్రతీదాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్న పేటీఎం దేశ ప్రజలను ఆకర్షించేవిధింగా దీన్ని రూపొందించిందట. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా సందేశాలు, ఫోటోలు,ఆడియో, వీడియోలు షేర్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఈ వార్తలపై అటు పేటీఎం, ఇటు వాట్సాప్ స్పందించాల్సి ఉంది. కాగా పేటీఎం ప్రస్తుతం 22. 5 కోట్లకు (225 మిలియన్లు) పైగా వినియోగదారులను కలిగి ఉంది. మరోవైపు అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న వాట్సాప్ రోజువారీ వినియోగదారుల సంఖ్య ఇటీవల వందకోట్లను దాటేసింది. మరి రానున్న పేటీఎం యాప్ స్థిరమైన వృద్ధితో సాగుతున్న వాట్సాప్‌కు ధీటుగా , పోటీగా నిలబడుతుందా? వేచి చూడాలి. -
జియో మళ్లీ 3 నెలల ఆఫర్!
♦ రూ.399తో 84 రోజులు అన్లిమిటెడ్ ♦ రూ.349కి 56 రోజులు.. పరిమిత డేటా ♦ పోస్ట్ పెయిడ్కూ ఆకర్షణీయ ప్లాన్లు న్యూఢిల్లీ: ధన్ ధనాధన్ ఆఫర్ ముగింపు దగ్గర పడుతుండటంతో ‘రిలయన్స్ జియో’ తాజాగా రెండు కొత్త ప్యాక్‌లను ఆవిష్కరించింది. అలాగే ప్రస్తుతమున్న ప్లాన్స్‌లో కొన్ని మార్పులు చేసింది. జియో రూ.19 నుంచి రూ.9,999 వరకు వివిధ ప్లాన్స్‌ను అందిస్తోంది. సంస్థ వెబ్సైట్ ప్రకారం.. కొత్త ప్లాన్స్ ఇవీ... ప్రిపెయిడ్: రూ.349, రూ.399 ధరల్లో ప్రైమ్ సభ్యుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్యాక్స్‌ను ఆవిష్కరించింది. రూ.349 ప్యాక్‌లో 20 జీబీ 4జీ డేటాను పొందొచ్చు. వాలిడిటీ 56 రోజులు. డేటాపై పరిమితి లేదు. 20 జీబీ అయిపోయాక స్పీడ్ 128 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇక రూ.399 ప్యాక్‌లో 84 జీబీ డేటాను 84 రోజులు పొందొచ్చు. రోజుకు 1 జీబీ 4జీ డేటా పరిమితి ఉంది. ఇది అయిపోయిన తర్వాత స్పీడ్ 128 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. పోస్ట్‌పెయిడ్: రూ.349, రూ.399 ధరల్లో పోస్ట్‌పెయిడ్ ప్యాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి వాలిడిటీ వరుసగా 2, 3 నెలలు. రూ.349 ప్యాక్‌లో 20 జీబీ 4జీ డేటాను పొందొచ్చు. డేటాపై ఎలాంటి పరిమితి లేదు. 20 జీబీ అయిపోయాక స్పీడ్ 128 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇక రూ.399 ప్యాక్‌లో 90 జీబీ డేటా పొందొచ్చు. రోజుకు 1 జీబీ 4జీ డేటా పరిమితి ఉంది. ఆ తర్వాత స్పీడ్ 128 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. సవరించిన ప్యాక్స్ ఇవీ.. రూ.309, రూ.509 ప్యాక్‌లను సవరించింది. ఈ ప్లాన్స్‌లో ప్రిపెయిడ్ యూజర్లు వరుసగా రోజుకు 1 జీబీ, 2 జీబీ 4జీ డేటాను 56 రోజుల వరకు పొందొచ్చు. 4జీ డేటా అయిపోయిన తర్వాత స్పీడ్ 128 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఇదివరకు ఈ ప్యాక్స్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అదే పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ప్యాక్స్ వాలిడిటీ 2 నెలలుగా ఉంది. వీరికి వాలిడిటీ ఇదివరకు నెల రోజులు. ప్రీమియం ప్లాన్స్‌లో మార్పులు... ♦ రూ.999 ప్లాన్‌లో 60 జీబీ కాకుండా 90 జీబీ 4జీ డేటాను 90 రోజులుపాటు పొందొచ్చు. ♦ రూ.1,999 ప్యాక్ వాలిడిటీ 120 రోజులుగా ఉంది. ఇందులో 125 జీబీ కాకుండా 155 జీబీ 4జీ డేటా వస్తుంది. ♦ రూ.4,999 ప్లాన్‌లో ఇకపై 380 జీబీ 4జీ డేటా పొందొచ్చు. దీని వాలిడిటీ 210 రోజులు. ♦ రూ.9,999 ప్యాక్‌లో 780 జీబీ 4జీ డేటా పొందొచ్చు. దీని వాలిడిటీ 390 రోజులు. -
ప్రణాళికలు సిద్ధం చేయాలి
► కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ నల్లగొండ టూటౌన్ : హరితహారం కింద మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాకు 2 కోట్ల 22 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామని, దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో 40 వేల మొక్కలు నాటే విధంగా ప్రణాళిక తయారు చేసుకుని గంతలు తీయించాలని ఆదేశించారు. మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉన్న భూములను గుర్తించా లని, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. 13 నుంచి 17 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని, బడి బాట కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారులు విధిగా పాల్గొనాలని ఆదేశించారు. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పిం చాలని సూచించారు. రంజాన్ పండు గ సందర్భంగా జిల్లాలో 16న దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని, 18వ తేదీన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని చెప్పారు. నియోజకవర్గాల్లో నాలుగు మసీదులను ఎంపిక చేసి కార్యక్రమాలను నిర్వహించే విధంగా మసీద్ కమిటీలతో సమావేశం నిర్వహించి గత రెండేళ్లలో లబ్ధిపొందని వారిని గుర్తించి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, డీఆర్డీఓ అంజయ్య పాల్గొన్నారు. అర్జీలకు పరిష్కారం చూపాలి ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే ఆర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రతి ఆర్జీదారుని సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మన మీద నమ్మకంతో ఇక్కడి వచ్చి ఆర్జీలు ఇస్తున్నారని, ఒక వేళ సమస్య పరిష్కారం కాకున్నా దానిపై స్పష్టమైన వివరాలతో ఆర్జీదారునికి సమాధానం పంపించాలని ఆదేశించారు. మండల కార్యాలయాల్లో చిన్న పనుల కోసం ప్రజలను తిప్పుకోకుండా సంబంధిత శాఖల జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం నల్లగొండ : జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు దిక్సూచిగా నిలిచేందుకు జిల్లా జ్ఞాన, ఆవిష్కరణ కేంద్రం (డిస్ట్రిక్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్) ప్రారంభమైంది. అభివృద్ధి ప్రణాళికలకు తోడు జిల్లాలో నెలకొన్న సమస్యలను అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పరిశోధనల ద్వారా అధ్యయనం చేసేందుకు ఈ కేంద్రం వేదికగా నిలవనుంది. జిల్లా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించినందున సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ చేతుల మీదుగా నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించారు. ప్రభుత్వ కార్యక్రమాల గురించి జిల్లా యంత్రాంగానికి అవగాహన కలిగించడంతో పాటు సరికొత్త ఆలోచనల ద్వారా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించేందుకు వీలుగా ఈ కేంద్ర ం పనిచేయనుంది. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే డేటాను విశ్లేషించి దాని ద్వారా ప్రతి అంశంపై తగు నిర్ణయాలు తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ శాఖల్లో డేటాను విశ్లేషించేందుకు నాలెడ్జ్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో లోటుపాట్లను సవరించి తగిన సలహాలు, సూచనలు చేయవచ్చన్నారు. బీసీ గురుకులం పరిశీలన జిల్లా కేంద్రంలో రెడ్డి హాస్టల్లో ఏర్పాటు చేసిన బీసీ గురకుల పాఠశాలను ప్రభుత్వ సంక్షేమ సలహాదారు రామ్లక్ష్మణ్తో కలిపి బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అశోక్‌కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో సెక్రటరీ మల్లయ్యబట్టు, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, కన్వీనర్ శోభ, బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణచారి పాల్గొన్నారు. -
భారాన్ని తగ్గించుకునేందుకు అనిల్ ప్లాన్స్ ఇవే!
ఆర్ కామ్ కు అప్పుల కుప్పతో మారిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.45వేల కోట్లను ఇది బ్యాంకర్లకు బాకీ పడింది. ఈ భారీ రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలను రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ శుక్రవారం మీడియా సమావేశంలో వివరించారు. ఎయిర్ సెల్ విలీనం, బ్రూక్ ఫీల్డ్ కు టవర్ ఆస్తుల విక్రయం ఆర్ కామ్ రుణాన్ని 60 శాతం తగ్గిస్తాయని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ చెప్పారు. ఆర్ కామ్ రుణం రూ.45కోట్ల మేర ఉందని, ఈ రుణాన్ని తగ్గించుకునే ప్రణాళికలను బ్యాంకర్లుఆమోదించారని అనిల్ అంబానీ తెలిపారు. ఈ రెండు డీల్స్ ను పూర్తి చేసుకోవడానికి తమ వద్ద డిసెంబర్ వరకు సమయముందని చెప్పారు. ''లెండర్లందరితో మేము మీటింగ్ నిర్వహించాం. మా ప్లాన్స్ వివరించాం. వాటిని లెండర్లు ఆమోదించారు. కంపెనీ వద్ద రుణాన్ని తగ్గించుకోవడానికి ఏడు నెలల సమయముంది'' అని తెలిపారు. ఒకవేళ అప్పటికి కూడా రుణాన్ని తగ్గించుకోలేని పక్షంలో రుణాన్ని పునర్వ్యస్థీకరించుకునేందుకు వీలుగా ఆర్బీఐ ప్రొవిజన్స్ ఉన్నాయని, వాటిని అప్లై చేస్తామని చెప్పారు. ఇదేసమయంలో ఎయిర్ సెల్- ఆర్ కామ్ విలీనానికి కూడా డిసెంబర్ వరకు లెండర్లు సమయమిచ్చినట్టు, దీంతో విలీనసంస్థ ఎయిర్ కామ్ గా మారనుందని పేర్కొన్నారు. విలీనం అనంతరం కొత్త వైర్ లెస్ కంపెనీలో 50 శాతం స్టాక్ ను ఆర్ కామ్ కలిగి ఉంటుందని తెలిపారు. ఎయిర్ సెల్ విలీనం, బ్రూక్ ఫీల్డ్ కు స్టాక్ ను అమ్మే డీల్స్ అనంతరం అంటే సెప్టెంబర్ 30కి ముందే రూ.25వేల కోట్ల రుణాన్ని బ్యాంకులకు తిరిగి చెల్లిస్తామని వాగ్ధానం చేశారు. రుణాన్ని ఈక్విటీలోకి మార్చే ప్రతిపాదనేమీ లేదని స్పష్టంచేశారు. కంపెనీకి రేటింగ్ ఏజెన్సీల ఇస్తున్న డౌన్ గ్రేడింగ్ పై అనిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. -
మూత‘బడే’నా!
ప్రాథమికోన్నత పాఠశాలల రద్దుకు సర్కారు యోచన పాఠశాల వివరాల సేకరణలో ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ వర్గాలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ రద్దుకే ఈ కుట్ర : నిరుద్యోగులు అధికారంలోకి ఎవరొచ్చినా ముందుగా ప్రయోగాలకు వేదికయ్యేది విద్యాశాఖే. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోగా.. తాజాగా విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. - భానుగుడి(కాకినాడ) జిల్లా వ్యాప్తంగా 331 మండల పరిషత్ ప్రాథమికోన్నత, 12 మున్సిపల్ ప్రా«థమికోన్నత, 31 ఎయిడెడ్ ప్రాథమికోన్నత, 43 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలున్నాయి. ఇందులో 36,230 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం తొలుత పదిమంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేయాలని, 19 మంది విద్యార్థులుంటే ఒక ఉపాధ్యాయుడిని, 60 మంది విద్యార్థులకు 1:30 నిష్పత్తి చొప్పున ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని యోచించింది. అయితే దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వకపోయినా.. ప్రస్తుతం విద్యాశాఖాధికారుల నుంచి జిల్లాలో ఉన్న ప్రా«థమికోన్నత పాఠశాలలు, విద్యార్థులు, ఇతర వివరాలను సేకరిస్తోంది. ఇవి పాఠశాలలను రద్దు చేసే వ్యూహంలో భాగమేనని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన మొదలైంది. లంక గ్రామాల పరిస్థితేంటి? ఉన్నత పాఠశాలలు ఇకటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటే ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేశారు. జిల్లాలో లంక గ్రామాలన్నీ ఉన్నత పాఠశాలలకు 5 కి.మీ. దూరంలో ఉన్నాయి. అక్కడి నుంచి విద్యార్థులు సైకిల్, కాలిబాటన వచ్చే అవకాశాలు లేవు. ఉన్నత పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు జిల్లాలో 100కి పైగా ఉన్నట్టు అంచనా. వీటిని మూసివేస్తే ఆయా గ్రామాల్లోని విద్యార్థులు సుదూర ప్రాంతాలకు రాలేక శాశ్వతంగా విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇది ముమ్మాటికీ డీఎస్సీని అడ్డుకోవడమే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచి విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కేస్తోందని నిరుద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రేషనలైజేషన్, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల మూసివేత వంటి చర్యలు భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేకుండా చేసే యోచనే అని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. పాఠశాలల మూసివేతకు వ్యతిరేకం ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న చర్యలకు యూటీఎఫ్ పూర్తి వ్యతిరేకం. తక్షణమే ఆ ఆదేశాలను వెనక్కితీసుకోవాలని కోరాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు పోరాటం చేస్తాం. ప్రాథమికోన్నత పాఠశాలలనే పూర్తిగా మూసివేయాలన్న ఆలోచనే కరెక్ట్ కాదు. - బీవీ రాఘవులు, యూటీఎఫ్ జిల్లా అ««ధ్యక్షుడు. విద్యాహక్కు చట్టాన్ని కాలరాయడమే. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించడం ముమ్మాటికీ విద్యాహక్కు చట్టాన్ని కాలరాయడమే. ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేయాలన్న జీవో వచ్చిన తక్షణమే ఆందోళనలతో రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నాం. -పి. సుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ పనికిమాలిన చర్య పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి పాటుపడాల్సిన ప్రభుత్వం విద్యార్థులు లేరని పాఠశాలలను మూసివేయడం పనికి మాలిన చర్య. ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్‌లు, సబ్జెక్టు నిపుణులు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి విద్యార్థుల సంఖ్య పెరగకుంటే అప్పుడు పాఠశాలలను మూసివేయాలి గానీ వసతులు లేకుండా విద్యార్థులు లేరని మూసివేయడం తగదు. కేవీ శేఖర్, ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ సంఘటితంగా పోరాడతాం. జాక్టో, ఫ్యాప్టోలతో పాటుగా, నిరుద్యోగ సంఘాలను సైతం కలుపుకుని ఈ విషయమై పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిస్తే ఇప్పటి వరకు విజయం సాధించలేని విషయమేదీలేదు. ఈ నిర్ణయం ప్రతీ పేద విద్యార్థికి చేటుచేసేదే గనుక అంతా సంఘటితమై ఖండించాలి. - చింతాడ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
ఆ నోట్లపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల ముద్రణపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రూ.5000 రూ.10, 000 నోట్లను పరిచయం చేసే యోచన లేదని స్పష్టం చేసింది. అలాంటి ఆలోచనలు లేవని శుక్రవారం వెల్లడించింది. ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ లోక్‌సభలో ఈ మేరకు వివరణ ఇచ్చారు. ముద్రణ ఖర్చులను తగ్గించుకునేందుకు ..అయిదువేలు,పదివేల నోట్లను తీసుకురానున్నారా అని సభలో ప్రశ్నించినపుడు మంత్రి ఇలా సమాధానమిచ్చారు. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించినట్టు అర్జున్ రామ్ మేగ్వాల్ లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వీటి ముద్రణకు తగిన నిధులు ఆర్బీఐ దగ్గర లేవని చెప్పారు. కాగా గత ఏడాది నవంబర్ 8న అప్పటికి చెలామణీలో 86 శాతం రూ.500, రూ.1000నోట్లను కేంద్రప్రభుత్వం నిషేధించింది. అనంతరం క్రొత్త రూ .500 నోటుతోపాటు,రూ.2 వేలనోటును కూడా పరిచయం చేసింది. అలాగే మళ్లీ వెయ్యి రూపాయల నోటును తిరిగి పరిచయం చేసే ఆలోచన లేదని గతనెలలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ స్పష్టం చేసారు. -
కొత్త సినిమా పై ఫోకస్ పెట్టిన సూపర్ స్టార్
-
ప్రజలను నేరుగా కలవనున్న సీఎం కేసీఆర్
-
వ్యూహ ప్రతివ్యూహాలు
ఆరు నూరైనా సత్యాగ్రహ యాత్ర చేపడతామంటున్న కాపు నేతలు అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు ఇప్పటికే షాడో పార్టీలతో నిఘా నేటి నుంచి రంగంలోకి దిగనున్న పోలీసు బలగాలు తాయిలాల పేరుతో కాపుల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వ యత్నం అమలాపురం టౌన్ : కాపులను బీసీల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండుతో.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యాన ఈ నెల 25 నుంచి కోనసీమలో జరపతలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రను అడ్డుకునేందుకు.. ప్రభుత్వం గతం మాదిరిగానే ప్రయత్నాలు ఆరంభించింది. గత నవంబర్ 16న జరగాల్సిన ఈ యాత్రను భారీ ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపి.. కాపు నేతలను గృహ నిర్బంధం చేసి, ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వాయిదా పడిన ఈ యాత్రను ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకూ నిర్వహించాలని కాపు జేఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఈ యాత్రను ఆరు నూరైనా ఈసారి నిర్వహించి తీరతామని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క అనుమతి లేదన్న సాకుతో ఈ యాత్రను అడ్డుకుంటామని జిల్లా పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలను రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటు కాపు నేతలు, అటు పోలీసుల వ్యూహప్రతివ్యూహాల నడుమ పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందోనన్న ఆందోళన అటు కాపుల్లోనూ.. ఇటు పోలీసు వర్గాలు, అధికార పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది. ఎవరి వ్యూహం వారిది యాత్ర కోసం ఇప్పటికే కాపు నేతలు కోనసీమలో గ్రామగ్రామానా పర్యటించి, సమావేశాలు ఏర్పాటు చేసి కాపులను సమాయత్తం చేస్తున్నారు. యాత్రను ఎలా అడ్డుకోవాలనే దానిపై జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కాకినాడలో శనివారం జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వ్యూహాన్ని వివరించారు. మరోపక్క కాపు కార్పొరేష¯ŒS కాపులకు ఇస్తున్న రుణాలపై ప్రభుత్వం జిల్లాలో పలుచోట్ల అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రాయితీలను, తాయిలాలను వివరిస్తూ, కాపుల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాపు కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS రామానుజయను జిల్లాలోనే ఉంచి ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఉద్యమ సారథి ముద్రగడపై విమర్శలు గుప్పిస్తోంది. ఈ యాత్ర వల్ల ప్రయోజనం లేదని జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. సిద్ధమైన యాక్ష¯ŒS ప్లా¯ŒS పాదయాత్రను అడ్డుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మూడు అంశాల ప్రాతిపదిక న యాక్ష¯ŒS ప్లా¯ŒS సిద్ధం చేసుకున్నట్లు తెలి సింది. యాత్ర అనివార్యమైతే.. యాత్ర కు అనుమతి తీసుకోకపోతే.. అనుమ తి తీసుకుంటే.. ఇలా మూడు కోణా ల్లో ఏది జరిగినా అందుకు అనుగుణంగా పోలీసు బందోబస్తు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కోనసీమలోని ఒక్కో మండలాన్ని యూనిట్‌గా చేసుకుని ప్రతిచోటా ఒక్కో జిల్లా పోలీసు బలగాలను నియమించేం దుకు కసరత్తు చేస్తున్నారు. అటు మెట్టకు, ఇటు కోనసీమకు ఇతర జిల్లాల నుంచి పోలీసు బలగాలను సోమవారం దింపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రో¯ŒS కెమెరాలను కూడా సిద్ధం చేస్తున్నారు. కాపు నేతల వెన్నంటి నీడలా.. ఇప్పటికే కాపు ఉద్యమ నేతల కదలికలపై పోలీసులు కన్ను వేశారు. వారివద్ద మఫ్టీలో ఉన్న పోలీసులను షాడో పార్టీలుగా నియమించారు. షాడో పార్టీ కానిస్టేబుళ్లు కాపు నేతల వెన్నంటే ఉంటున్నారు. నేతలు ఎక్కడికి వెళితే వారూ అక్కడకు వెళుతున్నారు. కార్లలో కూడా వారిని అనుసరిస్తున్నారు. కోనసీమలో రాష్ట్ర కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, కాపు జేఏసీ నాయకులు కల్వకొలను తాతాజీ, నల్లా పవ¯ŒSల వెంట ప్రస్తుతం షాడో పార్టీల నిఘా కొనసాగుతోంది. ఫిబ్రవరి 10 వరకూ జిల్లాలో 144 సెక్ష¯ŒS : కలెక్టర్ కాకినాడ సిటీ : శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఫిబ్రవరి 10వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా 144 సెక్ష¯ŒS విధిస్తూ కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జనవరి 31న తునిలో జరిగిన కాపు ఐక్యగర్జన, ఫిబ్రవరిలో కిర్లంపూడిలో మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, జూ¯ŒSలో ఆందోళన ఘటనల సందర్భంగా అవాంఛనీయ, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ పాదయాత్ర నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకే ఈ ఉత్తర్వులు ఇచ్చామన్నారు. దీని ప్రకారం జిల్లాలో ఐదుగురు, ఆపైన వ్యక్తులు ఒకేచోట గుమిగూడరాదని తెలిపారు. అలాగే శాంతియుత వాతావరణానికి, ప్రశాంత పౌర జీవనానికి భంగం కలిగించే సమావేశాలు, ధర్నాలు చేయరాదని, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉపన్యసించరాదని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఎలక్ట్రానిక్ ఛానల్స్ ద్వారా నిరసన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను నిషేధించారు. నిషేధాజ్ఞల కాలంలో సెల్ఫో¯ŒS, ఇంటర్నెట్ సేవలు, బల్క్ ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేయాలని మొబైల్ నెట్వర్క్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించారు. జిల్లా ప్రజలు ఈ ఉత్తర్వులను పాటించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో అధికార, పోలీసు యంత్రాగాలకు అన్నివిధాలా సహకరించాలని కలెక్టర్ కోరారు. ముద్రగడ కదలికలపై నిఘా నేడు కిర్లంపూడి రానున్న పోలీసు బలగాలు జగ్గంపేట : కాపు సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. కాకినాడలో ఆదివారం జరిగిన కాపు జేఏసీ సమావేశానికి వెళ్లిన ముద్రగడను పోలీసులు వెంబడించినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. కాపులకు రిజర్వేషన్లను సాధించేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ ఉద్యమబాట పట్టిన ఆయనను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారు. యాత్రకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో కిర్లంపూడిలోని ఆయన నివాసం ముందు మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి పోలీసు సిబ్బందిని కిర్లంపూడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో ఉన్న కల్యాణ మండపాన్ని సిబ్బంది కోసం సిద్ధం చేశారు. ముద్రగడ యాత్ర ప్రకటన నేపథ్యంలో గత నవంబరులో సుమారు 6 వేల మంది పోలీసులు వివిధ జిల్లాల నుంచి బందోబస్తు కోసం జిల్లాకు వచ్చారు. ఈసారి కూడా అదే స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. ముద్రగడ యాత్ర నేపథ్యంలో కిర్లంపూడికి పోలీసు బలగాలు వస్తున్నాయని జగ్గంపేట సీఐ కాశీ విశ్వనాథం చెప్పారు. అయితే ఎంతమంది వస్తారనేది ఇంకా చెప్పలేమన్నారు. -
గతం కంటే ఘనం
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు జనగామలో రెట్టింపు స్థాయిలో నీటి మట్టాలు యాసంగికి నీరందించేందుకు ప్రణాళికలు వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలాలు గత ఏడాది కంటే భారీగా పెరిగాయి. గ్రామాల్లో చిన్న నీటివనరుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీతలు, మరమ్మతులు చేపట్టడంతో పాటు దేవాదులు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపారు. అలాగే గత సెప్టెంబర్, అక్టోబర్‌లో విస్తారంగా కురి సిన వర్షాలతో నీటి మట్టాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. చెరువుల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు భారీగా పెరిగి తక్కువ లోతులోనే నీరందుతోంది. దీంతో ఈ ఏడాది యాసంగి పంటలకు కావాల్సిన సాగునీరు సరిపడా అందే అవకాశాలున్నాయి. పునర్విభజన ప్రక్రియతో కొత్తగా ఏర్పాటైన వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో సుమారు 3 నుంచి 4 మీటర్ల మేరకు భూగర్భ జలాల మట్టం పెరగడంతో నీరు గతేడాది కంటే ఎక్కువగా లభించే అవకాశాలున్నాయి. ఆచార్య జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గతేడాది, ఇప్పటి భూగర్భ జలాల మట్టాల నమోదును పరిశీలిస్తే కేవలం మీటరు మాత్రమే పెరిగింది. కాగా, జనగామ జిల్లాలోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో నింపడంతో ఈ ప్రాంతంలో గణనీయంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి. ఇక్కడ గతేడాది జనవరిలో నమోదైన భూగర్భ జలాలు.. ప్రస్తుతం నమోదైన మట్టాలను పరిశీలిస్తే సుమారు 4.18 మీటర్లు పెరిగాయి. దీంతో జిల్లాలో యాసంగి పంటలను విస్తారంగా పండిం చేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు.వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కలిపి మొత్తం 5459 చెరువులు ఉన్నాయి. చెరువుల నిల్వ నీటి సామర్థ్యం 47,177 మిలియన్ క్యూబిక్ ఫీట్ (ఎంసీఎఫ్‌టీ)లు. ప్రసుత్తం 36,013 ఎంసీఎఫ్‌టీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ చెరువుల కింద 3,47,949 ఎకరాల ఆయకట్టు ఉంది.అందుబాటులో ఉన్న నీటి లభ్యతతో ఖరీఫ్, యాసంగి సీజన్లలో 1,23,033 ఎకరాల్లో సాగు నీరందించేలా చిన్న నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో యాసంగి పంట సాగుకు భరోసా కలుగనుంది. రబీ సీజన్లో 25,200 ఎకరాలకు సాగునీరందించేందుకు నీటి లభ్యత అందుబాటులో ఉందని నీటిపారుదల శాఖ పేర్కొంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 9.57 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 5.66 మీటర్ల లోతునే ఉన్నాయి. అంటే గతేడాది కంటే 3.91 మీటర్ల పైనే నీటి లభ్యత ఉంది.వరంగల్ రూరల్ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 10.50 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 7.45 మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే గతేడాది కంటే 3.05 మీటర్లు పైనే నీటి లభ్యత ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 9.45 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 8.76 మీటర్ల లోతులో ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 6.74 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 6.13 మీటర్ల లోతులో ఉన్నాయి. ఇక్కడ నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. జనగామ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 13.84 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 9.65 మీటర్ల లోతులోనే ఉన్నాయి. అంటే గతేడాది కంటే 4.18 మీటర్లు పైనే నీటి లభ్యత ఉంది. -
రూ.23 రీచార్జ్ తో అన్లిమిటెడ్ ఆఫర్
ముంబై: టెలికాం రంగంలో కొనసాగుతున్న ప్రైస్ వార్ లోకి తాజాగా మరో టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్ దూసుకువచ్చింది. వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ పధకాలను బుధవారం లాంచ్ చేసింది. ఏ నెట్వర్క్ కైనా ఉచిత అపరిమిత కాల్స్ అందించే సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. రూ. 23లతో మొదలయ్యే రీచార్జ్ లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ23, రీఛార్జ్ పై వినియోగదారులు ఒక రోజు ఒక చెల్లుబాటుతో ఏ నెట్ వర్కుకైనా అపరిమిత స్థానిక , ఎస్టీడీ కాలింగ్ అవకాశాన్ని అందిస్తున్నట్టు ఎయిర్‌సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ . 348 రీఛార్జ్ (స్థానిక మరియు ఎస్టీడీ) అంతటా ఉచిత కాల్స్ అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటూ 500 ఎంబీ 3జీ డేటా , 4జీ వినియోగదారులకు 1.5జీబీ 3జీ డేటా ఉచితంగా అందిస్తోంది.వాలిడిటీ 28 రోజులు. వినియోగదారులను సంతోషపెట్టేందుకు ఉచిత కాలింగ్, డాటా సదుపాయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని ఎయిర్‌సెల్ లిమిటెడ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అనుపమ్ వాసుదేవ్ తెలిపారు. వినియోగదారులకు ఆహ్లాదం, కాల్ మరియు డేటా ప్రయోజనాలు అందించేందుకు , అందుబాటుధరల్లో ఆన్ లైన్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ రెండు పథకాలను లాంచ్ చేసినట్టు పేర్కొన్నారు. -
ట్రంప్ దెబ్బ:25వేల ఉద్యోగాల ఆఫర్
అమెరికా టెక్ దిగ్గజం ఐబీఎం అమెరికన్లకు భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. రాబోయే నాలుగు సంవత్సరాల్లో దేశంలో 25,000 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డోనాల్డ్ ట్రంప్ వివిధ టెక్నాలజీ దిగ్గజాలతో భేటీ కి ముందు రోజు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు 6వేల ఉద్యోగాలను 2017లో తీసుకోనున్నామని ఐబిఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గిన్నీ రోమట్టీ తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో సంస్థ కార్యకలాపాలు చేపట్టిన పునర్నిర్మాణంలో భాగంగాఓ రాబోయే నాలుగు సంవత్సరాలలో బిలియన్ డాలర్లను ఉద్యోగి శిక్షణ మరియు అభివృద్ధికో్సం పెట్టుబడిగా పెట్టనుందని ఐబీఎం ఛైర్మన్ తెలిపారు. డాటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా చాలా సంస్థలు తమ వ్యాపారాన్ని పునర్నిర్మించుకుంటున్నాయని ఆమె గుర్తుచేశారు. ఈ నియామకాలు వైట్ కాలర్ వెర్సస్ బ్లూ కాలర్ కాదనీ, పరిశ్రమలో భారీ డిమాండ్ ఉండి, ఖాళీగా ఉండిపోతున్న కొత్త కాలర్ ఉద్యోగాలని ఆమె చెప్పారు. మరోవైపు ట్రంప్ అమెరికా ఆర్థికవృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ట్రంప్ ఏర్పాటు చేసిన బిజినెస్ లీడర్ల స్ట్రాటజిక్ అండ్ పాలసీ ఫోరంలో రోమెట్టి సభ్యురాలిగా ఉన్నారు. గత కొన్ని ఏళ్లుగా ఐబీఎం లాంటి అమెరికా దిగ్గజాలు దేశంలో వేల ఉద్యోగాలు తొలగిస్తూ భారతదేశ ఉద్యోగులవైపు మొగ్గు చూపుతున్నాయన్న విమర్శలు చెలరేగాయి. దీంతో దశాబ్దంలో మొదటిసారి 2013 సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే చివరిలో స్వల్పంగా ఉద్యోగులను నియమించుకున్నట్టు నివేదించింది. ఆ తరువాతి సంవత్సరం మొత్తం వర్క్ ఫోర్స్ లో 12 శాతం నియమించుకున్నట్టు తెలిపింది. అలాగే గత అయిదేళ్లలో లేని ప్రాధాన్యతను గత ఏడాది అమెరికా ఉద్యోగులకు ఇచ్చినట్టు ఐబీఎం వెల్లడించింది. వివిధ సంస్థల అధిపతులు ముఖ్యంగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రో సాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల అక్షరం లారీ పేజ్ (గూగుల్) తెస్లా నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అధిపతులను బుధవారం జరగనున్న సమావేశానికి ఆహ్వానం అందింది. అటు చైనాలో రూపొందించే ఐ ఫోన్లను అమెరికాలో తయారు కావాలని ఆశిస్తున్నట్టు ట్రంప్ గత వారం ప్రకటించారు. ఇందుకు అమెరికాలో పెద్ద ఫ్యాక్టరీని నెలకొల్పాలని యోచిస్తున్నట్టు చెప్పారు. తద్వారా అమెరికాలో భారీ ఎత్తున ఉద్యోగాల కల్పనకు ఆలోచిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
కోల్ ఇండియా విభజనకు రంగం సిద్ధం?
-
కోల్ ఇండియా విభజనకు రంగం సిద్ధం?
న్యూఢిల్లీ: దేశీయ బొగ్గురంగంలో నెలకొన్నగుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇంధన భద్రత సమీక్షించి కోల్ ఇండియా మోనో పలికి చెక్ పెట్టే బాధ్యతను సీనియర్ భారత ప్రభుత్వ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై ఒక సంవత్సరంలోగా ఈ సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద కోల్ మైనర్ కోల్ఇండియా లిమిటెడ్‌ను విభజించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఈ రంగంలో మోనోపలీ పెరిగిపోయిందని.. దీన్ని తగ్గించేందుకే ఈ చర్య తీసుకోనున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పినట్టు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ఇండియాను.. కేంద్రం ఏడు కంపెనీలుగా విభజించాలని భావిస్తోంది. ఈ రంగంలో మరింత పోటీ పెరగాలన్నా, ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలన్నా ఇది తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు నవంబరు 30 న ప్రధాని ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ప్రధాని నిర్ణయం ఆధారంగా మంత్రిత్వ శాఖ తన వైఖరిని సమీక్షించనుందని బొగ్గు మంత్రి పియూష్ గోయల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కోల్ ఇండియా విభజనను కార్మిక సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధమైనా.. కోల్ఇండియా లాంటి అతి పెద్ద సంస్థను విడదీయడం అంత సులభం కాదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు కుదింపు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రాధాన్యత లాంటి అంశాలు కార్మికులకు ఆందోళనకరంగా మారనున్నాయన్నారు. అయితే ఈ అంచనాలపై ఆల్ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. చిన్న కంపెనీల నిర్వహణ సులభం అవుతుందని ఫెడరేషన్ ప్రతినిధి డీడీ రామానందన్ వ్యాఖ్యానించారు. కాగా కోల్ఇండియా విభజనపై ప్రధాని పగ్గాలు చేపట్టగానే మోడీ ఆరా తీశారని తెలుస్తోంది. ఈ చర్య ద్వారా మరింత సమర్ధవంతమైన మెరుగైన పని తీరును రాబట్టవచ్చని ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 2014 లో కోల్ ఇండియా విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే కార్మిక సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గింది. ఈ తాజా ప్రతిపాదన 28 బిలియన్ డాలర్ల స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కోల్ ఇండియా చీలికకు దారి తీస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. మరోవైపు ఉత్పత్తిని పెంచేందుకు కోల్ ఇండియా కొత్త సాంకేతిక మెషినరీ కొనుగోలుకు బిలియన్ల డాలర్ల రూపాయలను వెచ్చిస్తోంది. -
రబీ ప్రణాళిక ఖరారు
3,16,800 హెక్టార్లలో వివిధ పంటల సాగు 38,100 క్వింటాళ్ల విత్తనాలు అవసరం 1.70 మెట్రిక్ టన్నుల ఎరువులకు ప్రతిపాదనలు కరీంనగర్ అగ్రికల్చర్ : జిల్లా రబీ ప్రణాళికను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. అక్టోబర్ నుంచి రబీ సీజన్ మొదలవుతుండగా.. జిల్లావ్యాప్తంగా 3,16,800 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రధానంగా పప్పుదినుసులు, ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించినప్పటికీ వరి, మెుక్కజొన్న సాగుపైనే రైతులు మెుగ్గుచూపుతారని అంచనా వేశారు. ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాకు 38,100 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు, 1,70,500 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయాలని కోరారు. ఇప్పటికే కొన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. వివిధ పంటల సాగు అంచనా (హెక్టార్లలో) : వరి 22500, జొన్న 1500, సజ్జ 2వేలు, మక్క 55000, పెసర్లు 5వేలు, మినుములు 5500, కంది 400, శనగలు 1500, బబ్బెర్లు 3500, పల్లి 10వేలు, సన్‌ఫ్లవర్ 600, నువ్వులు 500. ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో) : యూరియా 77,500, డీఏపీ 15500, ఎంవోపీ 23250, కాంప్లెక్స్ 54250. విత్తనాలు (క్వింటాళ్లలో) : పల్లి 9500, శనగలు 2300, మినుములు 300, పెసర్లు 800, కందులు 50, వరి 20వేలు, మక్కలు 5వేలు, నువ్వులు 50 క్వింటాళ్ల చొప్పున ఇప్పటికే అందుబాటులో ఉంచారు. -
ముకేష్ అంబానీ మరో ఎత్తుగడ..?
ముంబై: బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్నీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వ్యాపార విస్తరణలో భాగంగా ముఖ్యమైన ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కంపెనీలో మూడు సంవత్సరాల పాటు పనిచేసిన ప్రతిభ గల టాప్ వంద మంది ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్నారు. సగటున రెండుకోట్ల జీతం తీసుకుంటున్నఉద్యోగులకు వారి వేతనాల్లో 10-15శాతం మేరకు సంస్థ షేర్ల రూపంలో అందించనున్నారు. లాంగ్-టర్మ్ ఇన్సెంటివ్ ప్లాన్ అని పేరు పెట్టిన ఈ పథకం ప్రకారం సగటున రూ .2 కోట్ల ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఈ ప్రోత్సాహకాలు రిలయన్స్ అందించనుందని సంస్థకు చెందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపు 20-30 లక్షల విలువ చేసే షేర్లను ఆయా ఉద్యోగులకు ఎలాట్ చేయనుంది. దీనికి నిర్దేశించిన కాలపరిమితి మూడు సంవత్సరాలు పూర్తికాగానే ఈ ఎలాట్ మెంట్ ఉంటుంది. ఈ బోనస్ సంస్థలో టాప్ 100 ఉద్యోగులకోసమే మాత్రమే ఉద్దేశించబడిందనీ, ఇతర స్థాయిల్లో ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపారు. అయితే ఈ వార్తలపై రిలయన్స్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ వార్తలను ధృవీకరించిన సంస్థ ఉన్నతోద్యోగి ఎలాంటి షేర్లను కేటాయించాలి అనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. రిలయన్స్ లాంటి షేర్లను కేటాయిస్తామంటే ఎవరు మాత్రం కాదంటారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థ లాభాలను, సంపదను ఉద్యోగులకు పంచి ఇచ్చే సాంప్రదాయం రిలయన్స్ గ్రూపునకు కొత్త అని మరో ఆర్ఐఎల్ ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఇది సంస్థ వ్యాపారవృద్ధికి దోహదపడుతుందన్నారు. కాగా సాధారణంగా ఐటీ, ఈ కామర్స్ రంగాల్లో ఈ పద్ధతి అమల్లో ఉంది. టాప్ లెవల్ ఉద్యోగుల రాజీనామాల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు వెలుగులోకి వస్తాయని మార్కెట్ వర్గాల భావిస్తున్నాయి. గత రెండేళ్లకాలంలో ఆర్ఐఎల్ ఉన్నతోద్యోగులు సంస్థకు రాజీనామా చేయడం ఈ పథకానికి దారి తీసి వుండొచ్చని అంచనా వేశారు. -
భారత్ శ్రీలంక హనుమాన్ సేతువు యోచన
-
బహుముఖ వ్యూహం
మహబూబ్‌నగర్ క్రైం: కష్ణా పుష్కరాలను విజయవంతం చేస్తామని జిల్లా అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏకకాలంలో ట్రాఫిక్, భద్రతపై నిఘా పెట్టి బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తామని వెల్లడించారు. రద్దీ నియంత్రణ(క్రౌడ్ మేనేజ్మెంట్)కు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులు జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి జిల్లా దాటి వెళ్లే వరకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పుష్కరాల నిర్వహణ, వీఐపీల భద్రత, ట్రాఫిక్ జాం, ఘాట్లలో రద్దీ నియంత్రణ వంటి పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. – కష్ణాపుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు – ఓకే సమయంలో ట్రాఫిక్, భద్రతపై నిఘా – హైవేపై ప్రతి 30కి.మీ.లకు ఒక హోల్డింగ్ పాయింట్ – భూత్పూర్ వద్ద భారీ జంక్షన్ – ‘సాక్షి’తో అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసులు మహబూబ్‌నగర్ క్రైం: కష్ణా పుష్కరాలను విజయవంతం చేస్తామని జిల్లా అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏకకాలంలో ట్రాఫిక్, భద్రతపై నిఘా పెట్టి బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తామని వెల్లడించారు. రద్దీ నియంత్రణ(క్రౌడ్ మేనేజ్మెంట్)కు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులు జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి జిల్లా దాటి వెళ్లే వరకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పుష్కరాల నిర్వహణ, వీఐపీల భద్రత, ట్రాఫిక్ జాం, ఘాట్లలో రద్దీ నియంత్రణ వంటి పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. భూత్పూర్ వద్ద జంక్షన్.. జిల్లాలో అన్నింటì కీ మధ్య ఉండే భూత్పూర్ చౌరస్తాలో తాత్కాలిక ఔట్ పోస్టుతో ఓ పెద్ద జంక్షన్‌ను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్, రంగారెడ్డి, రాయచూర్ వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ భూత్పూర్ వద్ద నిలిపి ఏ ఘాట్‌లో రద్దీ తక్కువగా ఉంటే ఆ వైపు వాహనాలను పంపిస్తాం. ఇక్కడ ఓ డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తుంటారు. 7 వాచ్ టవర్స్ జిల్లాలో అతి ముఖ్యమైన 9ఘాట్ల వద్ద ఏడు భారీ వాచ్ టవర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా ఘాట్లలో జరిగే ప్రతి కదలిక పోలీసులకు తెలుస్తుంది. అలాగే వికలాంగుల కోసం ప్రత్యేక ఘాట్లు ఉంటాయి. ఇక్కడ వికలాంగులతో పాటు వద్ధులకు అవకాశం కల్పిస్తాం. గంటగంటకూ నమోదు సరిహద్దుల నుంచి జిల్లాలోకి ప్రవేశించే వాహనాలను ఆయా ప్రాంతాల్లో హోల్డింగ్ చేస్తాం. హైదరాబాద్ వైపు నుంచే వాహనాలకు షాద్‌నగర్, బాలానగర్, భూత్పూర్ హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నాం. ఇక్కడ వాహనాలు నిలిపి ఏ ఘాట్‌లో వాహనాలు, భక్తులు తక్కువగా ఉన్నారో అక్కడికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తాం. దాంతో పాటు ట్రాఫిక్ రీడింగ్ పాయింట్లను అక్కడక్కడ ఉంచుతాం. ఈ పాయింట్ల వద్ద జిల్లాలోకి ఎన్ని వాహనాలు వస్తున్నాయి అనేది నమోదు చేస్తాం. గంట గంటకూ వాహన లెక్కలు తీస్తాం. 40కి.మీ. ఓ సీఐ పర్యవేక్షణ గతేడాది గోదావరి పుష్కరాలలో ఆయా జిల్లాలో ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీన్ని దష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా జిల్లాలోని హైదరాబాద్ రోడ్ వైపు, కర్నూలు రోడ్ వైపు, రాయచూర్ రోడ్ వైపు ఇలా తదితర రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి 20కి.మీ. ఒక సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ), 40కి.మీకు ఇన్స్పెక్టర్(సీఐ)స్థాయి అధికారి వాహనాలను భద్రతను ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తారు. పుష్కరాలకు వచ్చే భక్తులు చాలా వరకు తమ సొంత వాహనాల్లోనే వస్తారని అంచనా వేస్తున్న దష్ట్యా జాతీయ రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు అత్యవసర సమయాల్లో టోల్గేట్లు ఎత్తివేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దీనిపై ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జాతీయ రహదారుల అథారిటీ(ఎన్హెచ్ఏఐ)కి లేఖ రాశాం. దీనిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. 24గంటలూ నిరంతర భద్రత.. పుష్కరాలకు దాదాపు 1.5కోట్ల నుంచి రెండున్నర కోట్ల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రధానఘాట్ల వద్ద 360డిగ్రీల కోణంలో తిరిగే 180సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూంలో ప్రత్యక్ష ప్రసారం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పుష్కరాలకు వచ్చే భక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైనా సరే పోలీసుశాఖ చేసే సూచనలు పాటించి సహకరించాలి. బీచుపల్లి, రంగాపూర్, అలంపూర్, సోమశిల, గొందిమళ్ల ఘాట్‌లో వీఐపీలు, సామాన్య భక్తులు పుష్కర స్నానం చేయడానికి వేర్వేరు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక యాప్.. పుష్కరాలలో స్నానం చేయడానికి వస్తున్న భక్తుల కోసం పోలీస్‌శాఖ నుంచి ఒక ప్రత్యేక యాప్ ప్రారంభించనున్నాం. భక్తుల సౌకర్యార్థం వారు ఎక్కడున్నారు. ఏ ఘాట్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది, ఏ రహదారిలో ఎలాంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఏ రహదారిలో వెళితే ఏ ఘాట్‌కు త్వరగా చేరుకునే అవకాశం ఉంది.. తదితర వివరాలతో జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రత్యేక ఆండ్రాయిడ్ యాప్‌ను తీసుకొస్తున్నాం. పుష్కరాలకు రైల్వేల ద్వారా ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా మహబూబ్‌నగర్, కొత్తూరు, గద్వాల, అలంపూర్ తదితర రైల్వే పోలీసులతో కలిసి పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం. -
పతంజలికి పోటీగా నెస్లే తిరిగి పుంజుకుంటుందా?
ముంబై: వేలకోట్ల టర్నోవర్ లక్ష్యంతో భారత మార్కెట్లోకి దూసుకు వస్తున్న పతంజలి పోటీని తట్టుకొనేందుకు నెస్లే ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్లో కొత్త ప్రధాన ప్రత్యర్థి పతంజలి ఆహార ఉత్పత్తులకు దీటుగా తన నూతన 25 కొత్త ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తోంది. తద్వారా మ్యాగీ వివాదంతో కుదేలైన తన వ్యాపారాన్ని తిరిగి కొల్లగొట్టాలని యత్నిస్తోంది. ఇందులో భాగంగా వివిధ కేటగిరీల్లో 25 కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇన్ స్టెంట్ నూడుల్స్ మార్కెట్లో 55.5శాతం వాటాతో నెస్లే ఉత్పత్తులదే హవా. అయితే రాబోయే రోజుల్లో రూ.500కోట్ల టర్నోవర్ లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్లో మరింత ముందుకు వెళ్లడానికి ఇదే మాకు సరైన సమయమని నెస్లే ఇండియా సీఎండీ సురేష్ నారాయణన్ పిటిఐకి చెప్పారు.గతేడాది మేము తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నానీ, ఇంకా రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మ్యాగీ నూడుల్స్ లో అనేక రకాల ప్లావర్స్ ను కంపెనీ కొత్త ఉత్పత్తులను కొన్నింటిని విడుదల చేసిన నారాయణ్ ఇప్పటికే ఉన్న ఉత్పత్తులను నాణ్యంగా వినియోగదారులకు అందించటంతో పాటు ముఖ్యగా పసిపిల్లలు, మహిళలు, పెద్దలు, అర్బన్ మార్కెట్ లోని వినియోగదారులను ఆకట్టుకునేలా తన ఉత్పత్తులపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఇందులో 20-25 వరకు ఉత్పత్తులు ఉంటాయన్నారు. వీటిలో మరికొన్నింటిని రాబోయే నాలుగు ఆరువారాల్లో రిలీజ్ చేస్తామన్నారు. దీంతో సింగిల్ లార్జెస్ట్ విండో గా అవతరించనున్నామని ప్రకటించారు. ఇకముందు ఈ కామర్స్ లోకి, అలాగే పానీయాల రంగంలోకి అడుగిడుతున్నట్టు తెలిపారు. కాగా మోతాదుకు మించి లెడ్ ఉన్న కారణం ఫుడ్ స్టాండర్డ్స్ అసోసియషన్ ఆఫ్ ఇండియా గత ఏడావి మ్యాగీ నూడల్సు ను నిషేధించిన సంగతి తెలిసిందే. మరి కొత్త ఉత్పత్తులతో వస్తున్న నెస్లే కు వినియోగదారులనుంచి పూర్వ ఆదరణ లభిస్తుందా.. అనుకున్నమార్కెట్ షేర్ ను కొల్లగొడుతుందా... వేచి చూడాల్సిందే.. -
సిటీకి సోలార్
నగరంలో ఇక సౌరశక్తితో వీధి దీపాలు భవనాలపై రూఫ్‌టాప్ ప్యానళ్లు రోజుకు 5.6 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం ‘స్మార్ట్‌సిటీ’తో చోటుచేసుకోనున్న మార్పులు హన్మకొండ : వరంగల్ నగరానికి సోలార్ సొబగులు రానున్నాయి. కాలుష్య రహితంగా విద్యుత్ దీపాలు వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. స్మార్ట్‌సిటీ పథకం ద్వారా వరంగల్ నగరంలో భారీ స్థాయిలో 5 మెగావాట్లకు పైగా సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుని సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. దీనికి అదనంగా నగరంలో రోజూ వెలువడే తడి చెత్త ఆధారిత బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. స్మార్ట్‌తో ఆరంభం స్మార్ట్‌సిటీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 100 నగరాల్లో వరంగల్ ఒకటి. తొలివిడత పథకం అమలుకు సంబంధించి జనవరిలో ప్రకటించిన 20 నగరాల జాబితాలో స్థానం దక్కించుకునే అవకాశం వరంగల్‌కు త్రుటిలో తప్పింది. దీంతో రెండో విడతలో కచ్చితంగా స్థానం దక్కేలా సమగ్ర నివేదికను రూపొందించారు. దాదాపు రూ. 2861 కోట్లతో రూపొందించిన ఈ ప్రణాళికలో కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేశారు. అందులో భాగంగా బయోగ్యాస్ ప్లాంటు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. తడి, పొడి చెత్త నిర్వహణలో భాగంగా తడిచెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేలా బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం నగరంలో రెండు బయోగ్యాస్ ప్లాంట్లు పని చేస్తుండగా స్మార్ట్‌సిటీ పథకం కింద మరో రెండు నెలకొల్పాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. భద్రకాళి ఆలయం రోడ్డు, కాపువాడ వద్ద ఈ ప్లాంట్లు నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ నగరంలో అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకుంటూ రోజుకు కనీసం ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న విద్యుత్ దీపాల్లో 2500 లైట్లను పూర్తిగా సోలార్ ప్యానెల్ ఆధారిత విద్యుత్ దీపాలుగా మార్చాలని నివేదికలో సూచించారు. అదేవిధంగా నగరంలో ఉన్న భవనాలపై ఫొటోవోల్టాయిక్ (పీవీ) సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును ప్రోత్సహించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలపై పెద్ద ఎత్తున పీవీ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు నగరంలో ఉన్న చెరువు తీర ప్రాంతాలను సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారుస్తారు. దీని కోసం నగరంలో గుర్తించిన చెరువుల తీర ప్రాంతం వెంట సోలార్ విద్యుత్ గొడుగులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగర పరిధిలో ఉన్న 14 చెరువుల వెంట ఈ తరహాలో సౌరగొడుగులను అమరుస్తారు. సగటున ప్రతి పది మీటర్లకు ఒక కిలోవాట్ వంతున సోలార్ శక్తిని ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. మొత్తంగా స్మార్ట్‌సిటీ పథకం ద్వారా ప్రతి రోజు 5.6 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయూలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నగర సామాజిక అవసరాలకు వినియోగిస్తారు. -
దుర్గగుడికి మరో ఘాట్ రోడ్డు
⇒ కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ఘాట్‌రోడ్డు మొదటి మలుపు వరకు.. ⇒భవానీపురం, విద్యాధరపురం, గొల్లపూడి వాసులకు ఉపయుక్తం ⇒ దుర్గాఘాట్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ⇒ ర్యాంపు నిర్మాణం పూర్తయితే కొండ మీదకు మూడు మార్గాలు దుర్గగుడి వద్ద మరో ఘాట్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే సర్వే పూర్తిచేశారు. అర్జునవీధిలో ర్యాంపు నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఇవి పూర్తయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది. విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ప్రస్తుతం ఉన్న ఘాట్‌రోడ్డు మధ్య నుంచి మరో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డు వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు దుర్గాఘాట్, మరోవైపు ఇంద్రకీలాద్రి మధ్య రోడ్డు తక్కువగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని ఆలయ అధికారులు యోచిస్తున్నారు. గొల్లపూడి, భవానీపురం, విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు దుర్గాఘాట్ వరకూ వచ్చి ఘాట్‌రోడ్డులోకి ప్రవేశించకుండా కుమ్మరిపాలెం సెంటర్ వద్ద నుంచే నేరుగా కొండ మీదకు వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్ణయించారు. సర్వే షురూ కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న మొదటి మలుపు, ఓం టర్నింగ్ వరకూ ఒక ఘాట్‌రోడ్డు ఏర్పాటుచేస్తే దుర్గాఘాట్ వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల కుమ్మరిపాలెం వైపు నుంచి వచ్చేవారు ఆ ఘాట్‌రోడ్డు నుంచి వస్తారు. వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజీవైపు నుంచి వచ్చే వాహనాలు ప్రస్తుతం ఉన్న పాత ఘాట్‌రోడ్డులో నుంచే వస్తాయి. రెండు ఘాట్‌రోడ్లు మొదటి మలుపు వద్ద కలుస్తాయి. దీనిపై ఇటీవల దేవస్థానం అధికారులు సర్వే చేయగా, సుమారు 265 మీటర్ల ఘాట్‌రోడ్డు ఏర్పాటు చేయాలని అంచనా వేశారు. కమిషనర్ అనుమతులు లభించాకే.. రెండో ఘాట్‌రోడ్డు ఏర్పాటు అనేది ఇంకా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. వాస్తుతో పాటు ఎంత ఖర్చవుతుంది?, బాధితులకు ఎంతమేర నష్టపరిహారం ఇవ్వాలి?.. తదితర అంశాలపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. వీటిపై పూర్తిగా ఒక స్పష్టత వచ్చిన తరువాత, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తీసుకున్నాక ప్రారంభిస్తామని ఇంజినీరింగ్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ర్యాంపు పూర్తయితే.. అర్జున వీధి విస్తరణతో పాటు మల్లికార్జున మహామండపం మొదటి అంతస్తుకు ర్యాంపు నిర్మిస్తున్నారు. అలాగే, అర్జున వీధి విస్తరణ పూర్తయిన తరువాత మల్లికార్జున మహామండపానికి హైస్పీడ్ లిప్టులు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న ఘాట్‌రోడ్డుకు కొత్తగా నిర్మించే రోడ్డుతో పాటు అర్జున వీధిలో ర్యాంపు నిర్మాణం పూర్తయితే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. నివాసాల తొలగింపునకు సర్వే గతంలో కనకదుర్గా ప్లైఓవర్ కోసం హెడ్ వాటర్‌వర్క్స్ ఎదురుగా ఉన్న కొన్ని ఇళ్లు తొలగించారు. ఇప్పుడు రెండో ఘాట్‌రోడ్డు పేరుతో మరో 170 ఇళ్లను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్లైఓవర్ పై నుంచి చూస్తే కేవలం ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు తప్ప ఇళ్లు ఉండకూడదనే ఉద్దేశంతోనే వాటిని తొలగిస్తున్నారనే అపోహ కూడా ఇళ్ల యజమానుల్లో ఉంది. ఈ ఇళ్ల తొలగింపునకు సర్వేను రెవెన్యూ విభాగం అధికారులు రెండు రోజులుగా చేపడుతున్నారు. కాగా, గతంలో ఇంద్రకీలాద్రిపై తొలగించిన ఇళ్లకు ఇచ్చిన నష్టపరిహారం మాదిరిగానే తమకూ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. -
రాకీ హ్యండ్సమ్ రీమేక్ ప్లాన్‌లో 'రామ్ చరణ్'
-
పడకేసిన పర్యాటకం
మన్యంలో కానరాని టూరిజం ప్రగతి అమలుకు నోచుకోని ప్రతిపాదనలు పాడేరు: ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి రూపొందిం చిన ప్రణాళికలు ముందుకు సాగడం లేదు. రెండేళ్లుగా మన్యంలో పర్యాటక అభివృద్ధికి చేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. ఏజెన్సీలోని డల్లాపలి, లమ్మసింగి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ రూ.14.5 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ఈ పర్యాటకాభివృద్ధికి చేపట్టే ప్రాజెక్టులను మం జూరు చేస్తూ ప్రభుత్వం గతేడాది జీవో జారీ చేసింది. డల్లాపల్లిలో రూ.6.5 కోట్లు వెచ్చించి 30 రిసార్ట్స్‌తోపాటు రెస్టారెంట్, వ్యూపాయింట్, స్విమ్మింగ్‌పూల్, కాన్ఫరెన్స్ హాల్, చింతపల్లి మండలంలోని లంబ సింగిలో రూ.8 కోట్లతో 40 రిసార్ట్స్, 2 రెస్టారెంట్లు, కాన్ఫరెన్స్‌హాల్, ఆయుర్వేద హెల్త్ స్పా, ఓపెన్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, వ్యూపాయింట్ తదితర వాటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే నేటికీ మన్యంలో పర్యాటక అభివృద్ధి ప్రణాళికలు రూపుదాల్చలేదు. డల్లాపల్లిలో బటర్‌ఫ్లై పార్కు నిర్మించాలనే ప్రతిపాదనను ఆదిలోనే విరమించారు. డల్లాపల్లి, లమ్మసింగి ప్రాంతాల్లో ఇప్పటికే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఏడాది పొడవునా వివిధ రాష్ట్రాల నుంచి ఏజెన్సీకి పర్యాటకులు వస్తుం టారు. డల్లాపల్లి, లమ్మసిం గి ప్రాంతాలలో పర్యాటకులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. కనీసం కాటేజీలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తే పర్యాటకులకు సౌలభ్యం చేకూరడమే కాకుండా పర్యాటక ప్రాం తాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. డల్లాపల్లి నుంచి లంబసింగి వెళ్లే మార్గ మధ్యంలోని కొత్తపల్లి జలపాతాన్ని మాత్రం వనబంధు కల్యాణ యోజన పథకం నిధులతో అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ చర్యలు చేపట్టింది. ఏజెన్సీలో జలపాతాలు, ఇతర 150 పర్యాటక స్థలాలను గుర్తించి అధికారులు ఇది వరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఇవేవీ కార్యరూపం దాల్చడం లేదు. గతేడాదిగా మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. మన్యంలోని పర్యాటక ప్రాజెక్టులు రూపుదాల్చక ముందే విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి వద్ద రూ.192 కోట్లతో ఒక ప్రాజెక్టును చేపట్టేందుకు గత మంగళవారం ప్రభుత్వం ఆమోదించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ దీన్పార్కు, వాటర్పార్కు, బోటింగ్, స్టార్ హోటల్ నిర్మాణానికి క్యేజిల్ హిల్స్ ప్రాజెక్టు లిమిటెడ్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోనే ఇది భారీ పర్యాటక ప్రాజెక్టుగా దీన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. మన్యంలో ఇప్పటికే ప్రసిద్ధి చెందిన అరకు, అనంతగిరి పర్యాటక కేంద్రాలకు, విశాఖపట్నం, విజయనగరం జిల్లా కేంద్రాలకు చేరువగా ఉన్న తాటిపూడి లో భారీ పర్యాటక ప్రాజెక్టు చేపడుతుండటంతో ఏజెన్సీలో పర్యాటకాభివృద్ధిని ప్రభుత్వం వెనుక్కినెట్టే పరిస్థితి కనిపిస్తోంది. డల్లాపల్లి, లమ్మసింగి ప్రాంతాలో రిసార్ట్స్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉందని పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. -
ఉగ్ర శత్రువులు
-
యూరప్‌లో 9/11 తరహా దాడులకు కుట్ర
-
GHMC ఎన్నికల నిర్వహణలో మార్పులు
-
ఆర్ఎస్ఎస్ క్రిస్టియన్ విభాగం!
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) క్రిస్టియన్ విభాగాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మేరకు డిసెంబర్ 17న వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు క్రిస్టియన్ మత పెద్దలతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. దశాబ్దం క్రితం ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం.. రాష్ట్రీయ ఇసాయ్ మంచ్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఇదే విధానంలో క్రిస్టియన్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ఎస్ యోచిస్తోంది. డిసెంబర్ 17న నిర్వహించిన సమావేశాన్ని.. క్రిస్టియన్ విభాగం ఏర్పాటుకు పునాదిగా భావించవచ్చని ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రేష్ కుమార్ అన్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీతో సంత్సంబంధాలను పెంపొందించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవలి కాలంలో దేశంలో మత అసహనం పెరిగిపోతుందంటూ చెలరేగుతున్న దుమారానికి కూడా ఇది కొంత స్వాంతన కలిగించే చర్యగా ఆర్ఎస్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నారు. -
గృహభంగం
పోయిన వేసవి సెలవులకి ఎలాగైనా సార్థకత కలిగించాలని మొదట్లో అనుకున్న మాట. అనేక ప్రణాళికలు, ప్రయాసలు. అన్నీ అటకకి ఎక్కించడం పూర్తయ్యాక, అసంపూర్ణంగా మిగిలిపోయిన ఏ కవితో రాత్రుల్ని రక్కసిలా నమిలి మింగేసేది. ప్రతి అనుభవమూ ఓ కథావస్తువై నన్ను ఊరించేది. ఈ సెలవులూ వృథాగా జారిపోతున్నాయి కదా అని బాధపడుతూ, కాలం నదీగట్టున నేనొక జాలరినై క్షణాల్ని ఒడిసిపట్టుకునేవేళ ఈ సెలవుల్ని సార్థకం చేసుకునే ఒక సువర్ణ అవకాశం తటస్థించింది. ఆదివారం సంతలో రోడ్డు ఒడ్డున సేదదీరుతున్న పుస్తకపుంగవుల్లోంచి ఎస్.ఎల్.భైరప్ప నిటారుగా లేచి నిలబడి నేరుగా నా చేతుల్లో ‘గృహభంగ’మై ఒదిగిపోయాడు. కన్నడ నుంచి తెలుగు చేయబడ్డ ఈ నవల 1925-40ల నాటి కథాంశంతో నడుస్తుంది. మూర్ఖురాలైన ఓ ఇంటావిడ తన కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేసుకుందన్నదే వస్తువు. అలాంటి ఇంటికి కోడలుగా వస్తుంది నంజమ్మ. సంసారం పట్టని భర్త, అయినదానికీ కానిదానికీ బూతుపురాణం వల్లించే అత్త మధ్య నలగలేక వేరుకాపురం పెట్టి, ముగ్గురు పిల్లల్నీ మూర్ఖపతినీ పోషించడానికి ఆమె పడే తపన కట్టిపడేస్తుంది. నంజమ్మ తండ్రి సింహంలాంటి కంఠీజోష్యులు దేశంమీద పడి తిరుగుతూ వుంటాడు. మహదేవయ్య బిక్షమెత్తుకునే సన్యాసి. నంజమ్మకు తండ్రిలా సాయపడతాడు. యింకా వేశ్య నరసి పాత్ర, మరిది అప్పణ్ణయ్య పాత్ర తమతమ ధర్మాన్ని నిర్వర్తిస్తాయి. గమ్మత్తయిన విషయమేంటంటే నవలావరణంలోకి మనల్ని లాగి రచయిత అదృశ్యమౌతాడు. మనం పాత్రల మధ్యకి ప్రవేశించి నంజమ్మతో పాటు కడుపు కాల్చుకుంటాం. గంగమ్మ బూతులకు చెవులు మూసుకుంటాం. కంఠీజోష్యుల గుర్రపుడెక్కల శబ్దానికి జడుసుకుంటాం. కడగొట్టు సంతానం విశ్వన్నను ఎలా కాపాడుకోవాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటాం. చదవడం పూర్తయ్యాక నంజమ్మను లోకానికి పరిచయం చేయాలని తపిస్తాం. కొత్తపల్లి సురేశ్, 9493832470 -
మూడేళ్లలో ఎయిర్టెల్...
రూ.60 వేల కోట్ల పెట్టుబడులు నెట్వర్క్ మెరుగుదలే లక్ష్యం... న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మెగా పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. నెట్వర్క్ మెరుగుదల, సర్వీసుల నాణ్యతను పెంచడమే లక్ష్యంగా వచ్చే మూడేళ్లలో రూ.60,000 కోట్లను పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియజేసింది. టెలికం రంగంలో పోటీ తీవ్రతరమవుతుండటం, కాల్ డ్రాప్ సమస్యపై కేంద్రం కొరడా ఝుళిపించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎయిర్టెల్ తాజా ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాల్డ్రాప్లను అరికట్టేందుకు నెట్వర్క్ మౌలిక సదుపాయాలను పెంచుకోవడంపై భారీగా పెట్టుబడి పెట్టాలంటూ నియంత్రణ సంస్థ ట్రాయ్ టెలికం కంపెనీలకు పదేపదే సూచిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ లీప్’లో భాగంగా ఈ మొత్తాన్ని ఎయిర్టెల్ వెచ్చించనుంది. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో 70,000 బేస్ స్టేషన్లను నెలకొల్పనున్నామని... ఒక్క ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో వీటిని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని భారతీ ఎయిర్టెల్ (భారత్, దక్షిణాసియా) ఎండీ, సీఈఓ గోపాల్ విట్టల్ తెలిపారు. మొత్తమ్మీద మూడేళ్లలో 1,60,000 బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయనునున్నట్లు చెప్పారు. అత్యధికం మౌలికంపైనే... రూ.60 వేల కోట్ల పెట్టుబడుల్లో అత్యధిక మొత్తాన్ని కాల్, డేటా సేవల నాణ్యత పెంచేవిధంగా మౌలిక సదుపాయాలపైనే ఖర్చు చేయనున్నట్లు మిట్టల్ తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 2.2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.16,000 కోట్లు) పెట్టుబడి కూడా తాజా ప్రణాళికల్లోకే వస్తుందన్నారు. కంపెనీ చరిత్రలో ఒకే ఏడాదిలో ఇదే అత్యంత భారీ పెట్టుబడిగా కూడా ఆయన చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా చౌక 4జీ సేవలను అందించేందుకు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం
జాతిహితం బీజేపీ ప్రచారం భయంగొలిపేటంత అధికసంఖ్యాక వాదంతో సాగింది. ముస్లింలు తమను పాకిస్తాన్‌తో ముడిపెట్టడాన్ని అసహ్యించుకుంటారు. ఆ అవమానాన్నే వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఈ ఎన్నికలను వారు తమ భవితను మెరుగుపరుచుకునే అవకాశంగా చూడలేకపోయారు. భయం నేలమాళిగలోకి వెళ్లిపోయారు. ఎవరు బీజేపీని ఓడిస్తారనిపిస్తే వారికి ఓటు చేశారు. ఒవైసీ తుడిచిపెట్టుకుపోవడం దాని పర్యవసానమే. ముస్లింలు తిరిగి తమ ‘‘లౌకికవాద’’, హిందూ పరిరక్షకులను కౌగిలించుకోడానికి పరుగులు తీస్తున్నారు. మైనారిటీ లేదా ముస్లిం ఓటు బ్యాంకుపై బిహార్ ఎన్నికలు మరోమారు రాజకీయ చర్చకు తెరదీశాయి. ఆ చర్చలోకి వెళ్లడానికి ముందు ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. మొహ్మద్ ఆలీ జిన్నా పాకిస్తాన్‌కు వెళ్లిపోయాక భారత ముస్లింలు మరే ముస్లిం నేతపైనా నమ్మక ముంచలేదు. వారెప్పుడూ ఎవరో ఒక హిందూ నేతనే నమ్మారు. వారు ఏదో ఒక్క పార్టీకి చెందినవారే కావాల్సిన అవసరమూ లేకపోయింది. నాలుగు దశాబ్దాలు వారు ఇందిరా గాంధీ కుటుంబాన్ని నమ్మారు. ఆ తర్వాత, షా బానో కేసు నుంచి శిలాన్యాస్ వరకు రాజీవ్ గాంధీ వేసిన తప్పుడటుగుల పరంపర తో.. దేశ ప్రధాన భూభాగంలోని ముస్లింలు వీపీ సింగ్, ములాయంసింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్లవైపు మొగ్గారు. మాయావతి వారి ఎంపిక అవకాశాలను మరింత విస్తరింప జేశారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, అస్సాం తదితర రాష్ట్రాల్లోనైతే ముస్లింలు హిందువుల నేతృత్వంలోని కాంగ్రెస్‌కే అంటిపెట్టుకున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్లో వామపక్షాలూ, ఆ తదుపరి మమతా బెనర్జీల వలే మరిన్ని ప్రత్యామ్నాయాలు ఆవిర్భవించినప్పుడు వారు తమ విధేయతను వారికి బదలాయించారు. అయితే అప్పుడూ వారు హిందూ నాయకులపైనే విశ్వాసముంచారు. దాదాపు ఈ పార్టీల నేతలంతా - బహుశా వామపక్షాలను మినహాయిస్తే - హిందూ మతాన్ని అనుసరించేవారు, నమ్మేవారు. బీజేపీ/ ఆర్ఎస్ఎస్ ‘‘మౌలానా ములాయం’’గా ఎగతాళి చేసే ములాయంసింగ్ హనుమాన్ భక్తుడినని సగర్వంగా చెప్పుకుంటారు. ఆయన రక్షణమంత్రిగా (1996-98 యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం) ఉన్నప్పటి ఢిల్లీ కృష్ణమీనన్ రోడ్డులోని ఆయన అధికారిక నివాసంలో ఆకర్షణీయమైన చిన్న హనుమాన్ గుడిని కూడా నిర్మించారు. జైల్లో ఉండగా తాను తన ఇష్ట దైవ మైన శివుడ్ని ఎలా ప్రార్థించిందీ, స్వేచ్ఛ లభించినందుకుగానూ మాంసాహారాన్ని ఎలా విసర్జించినదీ లాలూ చెబుతారు. ముస్లిం నేతల పట్ల విముఖత కాంగ్రెస్, ముస్లిం నేతలను తయారుచేయలేదని తరచుగా విమర్శలకు గురౌతుంటుంది. కానీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ నుంచి అహ్మద్ పటేల్, సల్మాన్ ఖుర్షీద్‌ల వరకు వాస్తవానికి అది ఆ ప్రయత్నాలు చేసింది. తమ కనుసన్నల్లోని డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్‌లను రాష్ట్రపతి భవన్‌కు కూడా పంపింది. అయితే ఆజాద్సహా వారిలో ఎవరినీ భారత ముస్లింలు తమ నాయకునిగా చూడలేదు. ఈ వాదనను మనం మరింతగా పొడిగించవచ్చు. బీజేపీ సైతం ఏపీజే అబ్దుల్ కలాంను తన ప్రధాన స్రవంతి ముస్లిం హీరోగా పరిగణించింది. ఆయన అత్యంత జనాదరణ కలిగిన రాష్ట్రపతి అయ్యారు. కానీ ముస్లింలకు ఉత్తేజాన్నిచ్చే నాయకునిగా కంటే హిందువులకు ఆదర్శప్రాయుడైన నేతగానే మిగిలిపోయారు. ఆయన మరణించినప్పుడు దాదాపు ఏ ఒక్క మసీదూ ప్రత్యేక ప్రార్థనలు చేయలేదనే విషయాన్ని మితవాద వ్యాఖ్యాతలు, ఇంటర్నెట్ వాగుడుకాయలు కూడా అపనమ్మకంతో (లేదా ఆనందంతో?) గమనించారు. అత్యధిక మెజారిటీ ప్రజలకు ఆయన వీణ వాయించగలిగిన, సంస్కృత శ్లోకాలను వల్లించగలిగిన గొప్ప భారత నేత, జాతీయవాది (‘‘ముస్లిం అయినప్పటికీ’’). పిల్లలకు అన్ని మంచి మాటలూ చెప్పడమే కాదు, వారిచేత తిరిగి పలికించారు కూడా. కానీ ముస్లింలకు మాత్రం ఆయన నేత కాదు. భారత ముస్లింలు ఆజాద్, కలాం లేదా భావజాలపరంగా వారికి పూర్తి భిన్న ధ్రువంలోని జకీర్ నాయక్ వరకు అందరినీ తిరస్కరించడం మన రాజకీయాల ప్రత్యేక లక్షణం. (ముంబైకు చెందిన డాక్టర్ జకీర్ నాయక్ వామపక్షవాది నుంచి సువార్తా బోధకునిగా మారి ప్రపంచ ఖ్యాతినార్జించారు.) బీజేపీ అందుకు ‘‘సంతృప్తిపరచే’’ విధానాలను తప్పు పడుతుంది. కానీ అది వాస్తవాల పరీక్షకు నిలవ లేదు. ముస్లింలు దళితులతో సమాన స్థాయిలో ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారనడానికి ఆధారం అవసరమని కాదుగానీ... సచార్ కమిటీ నివేదిక వెల్లడి చేసిందదే. రాజకీయంగా, ప్రభుత్వాధికార యంత్రాంగం పరంగా వారు దళితులకన్నా కూడా తక్కువ సాధికారతను కలిగి ఉన్నారు. వారి సంరక్షకులుగా నటించిన అర్జున్‌సింగ్ లాంటి నేతలు వారిని వాడుకుని, మరింత అంధకారంలోకి నెట్టేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి కాంగ్రెస్, ములాయం, లాలూ, సీపీఎం, మమతా చేసిందేమీ లేదు. 1960ల మధ్యలో ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం మజ్లిస్ పార్టీ ఏర్పడింది. నెహ్రూ/శాస్త్రి తదుపరి కాలంలోని కాంగ్రెస్ క్షీణదశలో ఉండగా అది కొన్ని ఓట్లు సంపాదించింది. కానీ త్వరలోనే అది ముస్లింల తిరస్కారానికి గురై, సోషలిస్టు శక్తుల్లో కలిసిపోయింది. ‘‘లౌకికవాద’’ పరిరక్షకులకు సవాలు హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, అస్సాంలోని ఏఐయూడీఎఫ్ నేత బద్రుద్దీన్ అజ్మల్ ముస్లింలకు హిందూ నేతలు నేతృత్వం వహించే ఈ ధోరణిని సవాలు చేయడం కొత్త పరిణామం. వారు తమ భౌగోళిక లేదా జాతిపరమైన ప్రాంతీయ పరిధులకు పరిమితమైనంత కాలం వారిని ప్రత్యేకించి పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ ఒవైసీ మహారాష్ట్ర శాసనసభలో రెండు స్థానాలను సాధించడం ఈ ధోరణిలోని మార్పును సూచించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలోని ముస్లింలలో చాలా పెద్ద భాగం అజ్మల్‌కు ఓటు చేయడంతో ఆయన ఆ ఎన్నికల్లో అద్భుత ఫలితాలను సాధించారు. తద్వారా ఆశ్చర్యకరంగా బీజేపీ అక్కడి 14 స్థానాల్లో 7 సాధించగా, కాంగ్రెస్ 3 స్థానాలకు పరిమితమై పూర్తిగా దెబ్బతినిపోయింది. భారత ముస్లింలు ఆరు దశాబ్దాల ఈ దోరణిని మార్చుకుని ఇప్పుడు తమ ‘‘సొంత’’ నాయకుల కోసం అన్వేషిస్తున్నారా? మీరు మాకు ఓటు చేయండి బీజేపీ/ఆర్ఎస్ఎస్ల నుంచి మిమ్మల్ని కాపాడటానికి ప్రయత్నిస్తామంటూ తమ భయాన్ని వాడుకోవడం తప్ప, ‘‘లౌకికవాద’’ పార్టీలు తమకు చేసిందేమీ లేదనే వాస్తవాన్ని వారు ఇప్పుడు గ్రహించారా? ఇది భౌతికమైన మనుగడ అనే కనీస విధానాల నుంచి ముస్లింలు బయటపడటం అవుతుందా? ఒక విధంగా అది, మీరు పోరాడేది హిందువులతోనా లేక పేదరికం, అవకాశాల లేమితోనా? అంటూ నరేంద్ర మోదీ వారికి 2014లో ఇచ్చిన సందేశమే అవుతుంది. వారు అప్పుడే బీజేపీకి ఓటు చేయడానికి సిద్ధంగా లేరు. కానీ తమను తక్కువగా చూసి, ఎప్పటికీ నమ్మకంగా పడి ఉంటారనుకున్న వారిని కొంత మేరకు విడిచిపెట్టేస్తున్నారు. ఒవైసీ, అజ్మల్ ఇద్దరూ కేవలం ముస్లింల మనుగడ గురించే గాక, ఉద్యోగాలు,సాధికారత అంటూ మరింత ఆధునికమైన భాషలో మాట్లాడారు. ముస్లిం ఓటర్లు భయం నుంచి సాధికారత వైపు మొగ్గుతున్నారు. ఈ మార్పువల్ల ముందుగా నష్టపోయేది కాంగ్రెసే. ముస్లింలను భయపెట్టిన ప్రచారం ఈ ముందస్తు అంచనాతోనే బీజేపీ అస్సాంను పక్వానికొచ్చిన ఫలంగా భావించింది. అస్సాం ప్రజలను రెండు శిబిరాలుగా చీల్చి, అజ్మల్ ముస్లింలోని అత్యధికుల ఓట్లను రాబట్టుకునేలా చే యడం ద్వారా కాంగ్రెస్‌ను కూలదోయడమనేది దాని ఫార్ములా. బీజేపీ తన నిరాశాజనకమైన సహజాతాన్ని అనుసరించి సాగించిన ప్రచార కార్యక్రమం ఆ గాలి ఎదురు తిరగడానికి దోహదపడి ఉండవచ్చు. ‘‘మీ అతి పెద్ద శత్రువు ఎవరు’’ అనే వాదనను తిరిగి మోదీ చేసిన మాట నిజమే. కానీ ఆ ప్రచారం పూర్తిగా భయంగొలిపేటంతటి ఆధిక సంఖ్యాక వాదంతో సాగింది. భారత ముస్లింలు తమను పాకిస్తాన్‌తో ముడిపెట్టడాన్ని అసహ్యించుకుంటారు. అయితే, అదే అవమానాన్ని వారు తరచుగా ఎదుర్కోవాల్సి వచ్చింది. బీఫ్ తినేవారంతా పాకిస్తాన్‌కు పోవాలని ఒకరంటే, షారూఖ్ ఖాన్ హృదయం పాకిస్తాన్‌లోనే ఉందని మరొకరు. వీటన్నిటినీ తలదన్నేది... బిహార్‌లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్లో టపాకా యలు పేల్చి సంబరాలు చేసుకుంటారంటూ అమిత్ షా చేసిన హెచ్చరికే. ఇది వెర్రిగా మనుగడ కోసం అనే పాత వైఖరికి తీసుకుపోయేది. వారిని పాకిస్తాన్‌కు ‘‘తిప్పి’’ పంపేస్తామనే బెదిరింపును ఇప్పుడు పదే పదే వల్లెవేయడం వారి విధేయతపట్ల బీజేపీ అనుమానాలను నిజమైనవిగా చేసింది. దీంతో వారిక ఈ ఎన్నికలను తమ భవిష్యత్తును ఆర్థికంగా మెరుగుపరుచుకునే అవకాశంగా చూడలేకపోయారు. తిరిగి భయం అనే నేల మాళిగలోకి వారి తిరిగి వెళ్లిపోయారు. తమ బలమంతా కూడగట్టుకుని పైకి వచ్చి... ఎవరు బీజేపీని ఓడించి, తమను రక్షిస్తారనిపిస్తే వారికి ఓటు చేశారు. ఒవైసీ తుడిచి పెట్టుకుపోవడం, డిపాజిట్లు గల్లంతవడం వంటివన్నీ దాని పర్యవసానాలే. ప్రమాదకరమైన ఈ కాలంలో ఒవైసీ, అజ్మల్‌లు ఆధునికతకు చెందిన శక్తులు కావచ్చని ‘‘సూచించడం’’ అంటే నన్ను తిట్టిపోస్తారనే. అందుకు సిద్ధపడుతున్నాను. కానీ వారిద్దరూ ముస్లింల మనస్తత్వంలో వస్తున్న మార్పునకు కచ్చితమైన సంకేతాలు. తమ పాత ధోరణి నుంచి బయటపడి, తమ సొంత రాజకీయ ఉన్నత వర్గాలను తయారు చేసుకోవాలని ఈ కొత్త ధోరణి ముస్లింలను ఒప్పిస్తోంది. బిహార్‌లో బీజేపీ వేసిన తప్పుటడుగులు ఈ పరిణామ ధృతిని దెబ్బతీశాయి. 2014లో బీజేపీతో ముస్లింల సంబంధాలను మోదీ కొత్తగా నిర్వచించడం కోసం చేసిన ప్రయత్నం ఇప్పుడు విచ్ఛిన్నమైపోయింది. ముస్లింలు తిరిగి తమ ‘‘లౌకిక వాద’’, హిందూ పరిరక్షకులను కౌగిలించుకోడానికి పరుగులు తీస్తున్నారు. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
మహిళలకు ఆర్థిక స్వావలంబన
మహిళల్లో ఆర్థిక స్వావలంబన మెరుగుపరుస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. మహిళా సంక్షేమం, ప్రగతి పథకాలకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ పురుషులతో సమానంగా స్త్రీలు సంపాదనపరులు కావాలని, ఇందుకు స్వయం సహాయ సంఘాలు ఎంతగానో దోహదపడుతాయని అన్నారు. అందుకనే నాలుగేళ్ల కాలంలో మహిళా పథకాల కింద రూ.20,270 కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించామని తెలిపారు. అలాగే ఈ ఏడాది మరో రూ.6వేల కోట్ల బ్యాంకు రుణాలను స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా మంజూరు చేయనున్నట్లు ఆమె తెలి పారు. రాష్ట్రంలోని 10 వేల స్వయం సహాయక సంఘాలకు ఈ మొత్తం ద్వారా లబ్ధిచేకూరుతుందని చెప్పారు. మహిళలపై ఆధారపడే కుటుంబాల్లో జీవినాధారం పెంచేందుకు, వివిధ పథకాల అమలుకు 700 గ్రామాలను గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఆయా గ్రామాల్లోని చిన్నతరహా మహిళా గ్రూపులకు రూ.58 కోట్ల రుణాలను బాంకుల ద్వారా అందజేస్తామని తెలిపారు. ఒక్కో గ్రూపుకు ఒక లక్ష రూపాయల చొప్పున 1500 గ్రామాలకు రూ.15 కోట్లు కేటాయించామని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 1.14 లక్షల ఇళ్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ర హదారుల అంశంపై మాట్లాడుతూ, 2015-16 ఆర్థికసంవత్సరంలో రూ.800 కోట్లతో 4వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ది చేస్తున్నామని అన్నారు. గ్రామసీమలో రాష్ట్ర ప్రగతికి పట్టుకొమ్మలు అనే నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపుగా అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్లను వేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.50వేల కోట్లతో 41 బ్రిడ్జీలను నిర్మిస్తున్నామని అన్నారు. ఈ పనులు పూర్తయ్యే దశలో మరో రూ.1475 కోట్లు కేటాయించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. బ్రిడ్జీలు, రహదారుల విస్తరణ, రోడ్ల మరమ్మతులతో పాటుమరిన్ని అభివృద్ది కార్యక్రమాలను గ్రామాలకు తీసుకెళుతున్నామని అన్నారు. -
స్మార్ట్‌సిటీ ప్రణాళికకు రూ.192 కోట్లు విడుదల
ప్రతి నగరానికీ రూ.2 కోట్లు ► మూడు నెలల్లో ప్రతి నగరం నుంచీ ప్రణాళికలు సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీస్ మిషన్ కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 96 నగరాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.192 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో ప్రతి నగరానికి రూ.2 కోట్ల రూపాయలు స్మార్ట్‌సిటీ ప్రణాళిక రూపకల్పనకు అందిస్తారు. ప్రతి నగర పాలక సంస్థలు సాంకేతిక పరిజ్ఞాన సంస్థల సహాయంతో తమ తమ నగరాలను ఏవిధంగా స్మార్సిటీలుగా రూపుదిద్దుతామో సమగ్రమైన ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మూడు నెలల గడువును విధించారు. మూడు నెలల తరువాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చేరిన ప్రణాళికల్లోంచి అత్యుత్తమంగా ఉన్న 20 ప్రణాళికలను ఎంపిక చేసి ఈ ఆర్థిక సంవత్సరానికి ఆ 20 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి కోసం ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ మిషన్‌లో వంద నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటిలో 98 నగరాలను ఇప్పటికే ఎంపిక చేసింది. ఈ 98 నగరాల్లో న్యూఢిల్లీ, చండీగఢ్‌లకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ త్వరలోనే నిధులను విడుదల చేయనుంది. మిగతా 96 నగరాలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నిధులను సమకూరుస్తుంది. జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి మరో రెండు నగరాల పేర్లు రావలసి ఉంది. మరోవైపు న్యూఢిల్లీలో గురువారం స్మార్ట్‌సిటీలపై ఓ వర్క్‌షాప్ జరిగింది. 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. స్మార్ట్‌సిటీ ప్రణాళిక నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఇందులో పాల్గొన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. 38 నగరాలకు సంబంధిత నిధుల మంజూరు ఉత్తర్వులను ఈ వర్క్ షాపులో మంత్రి అందజేశారు. -
ఇన్-టచ్ బ్యాంకులపై ఎస్బీఐ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరికొత్త టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా యువతను ఆకర్షించే విధంగా దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ వాలెట్, కొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వచ్చే రెండేళ్ళలో దేశవ్యాప్తంగా 250 ఇన్-టచ్ శాఖలను ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ఇప్పటికే 8 నగరాల్లో ఇన్-టచ్ శాఖలను ఏర్పాటు చేశామని, త్వరలోనే హైదరాబాద్‌లో కూడా ఇన్-టచ్ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్బీఐ సీజీఎం హరిదయాళ్ ప్రసాద్ తెలిపారు. మొబైల్ వాలెట్యాప్ ‘బడ్డీ’ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగదేతర లావాదేవీలన్నీ నిర్వహించుకునే విధంగా ఇన్-టచ్ శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు రూ. 12 లక్షలతో తయారు చేసిన క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే మొబైల్ వ్యాన్‌ను గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. -
మరో ఆకర్ష్‌కు తెరదీస్తున్న టీఆర్ఎస్
-
అధ్యయనం... అందని దూరం
- అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్లకు గ్రహణం - కొన‘సా...గుతున్న’ రీజనల్ రింగ్ రోడ్డు స్టడీ - గడువు దాటినా అందని నివేదికలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఆవిష్కరించేందుకు ఓ వైపు ప్రణాళికలు రూపొందిస్తున్నా... మరోవైపు అభివృద్ధి ప్రాజెక్టులపై హెచ్ఎండీఏ తలపెట్టిన అధ్యయనాలు మాత్రం అతీగతీ లేకుండాపోయాయి. నిర్ణీత గడువు ముగిసినా నివేదికలు సమర్పించే విషయంలో ఏజెన్సీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా శివారు ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన హెచ్ఎండీఏ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం ఆ సంస్థలకు కలిసొచ్చింది. నగరంపై ఒత్తిడిని తగ్గించేందుకు చుట్టుపక్క ఉన్న అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల ను రాజధానితో అనుసంధానం చేస్తూ రోడ్ నెట్‌వర్క్‌ను కల్పించడం ద్వారా త్వరిత అభివృద్ధికి గల అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని ఆదేశించింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ టీఓజీసీ (ట్రాన్జిడ్ ఓరియంటెడ్ గ్రోత్ సెంటర్స్), మెట్రో రైల్ కారిడార్‌లో టీఓడీ(ట్రాన్జిడ్ ఓరియంటెడ్ డెవలప్మెంట్)లకు గల అవకాశాలపై సమగ్ర నివేదికను కోరింది. ఈ మేరకు హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ అధికారులు అధ్యయన బాధ్యతలను ‘లీ అసోసియేట్స్’ సంస్థకు అప్పగించారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల 4 జిల్లాలను కలుపుతూ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి ‘ఆర్వీ అసోసియేట్స్’ సంస్థతో అధ్యయనం ప్రారంభించింది. దీనికి సుమారు రూ.1.50 కోట్లు వెచ్చించింది. వీటితో చేసుకున్న ఒప్పందం ప్రకారం అర్బన్ నోడ్స్, అర్బన్ సెంటర్స్‌పై ఇప్పటికే ప్రాథమిక నివేదిక, రీజనల్ రింగ్ రోడ్డుపై డ్రాఫ్టు రిపోర్టు అందాల్సి ఉంది. వీటిని హెచ్ఎండీఏ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ అధ్యయనాలు స్తంభించిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మందగమనం... నగరం చుట్టు పక్కల 4 జిల్లాలను కలుపుతూ బృహత్ ప్రణాళికలో ప్రతిపాదించిన 290 కి.మీ. రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి మొదట్లో అధ్యయనం వేగంగా సాగినా... ఆ తర్వాత మందగించింది. నిర్దిష్ట గడువు దగ్గరపడినా ఇంతవరకు ఫీజుబులిటీ రిపోర్టును కూడా ఆ సంస్థ ఇవ్వకపోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టుల అధ్యయనాన్ని త్వరగా పూర్తిచేసి నిర్దిష్ట వ్యవధిలోగా నివేదిక రూపొందిస్తే నిధులు ఏమేరకు అవసరమన్నది స్పష్టమవుతుంది. అవసరమైన చోట్ల వివిధ ప్రాంతాల్లో భూసేకరణకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్న రోడ్డును వివిధ ప్రాంతాల్లోని రోడ్లతో (లింక్) కలిపి అభివృద్ధి చేస్తే ప్రధాన మార్గంతో అనుసంధానమై...మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. తొలిదశలో దీనికోసం రూ.10 కోట్లు వెచ్చిస్తే కొన్ని ప్రాంతాలకు రోడ్ నెట్వర్క్ సమకూరే అవకాశం ఉంది. అధ్యయన నివేదికలు రూపొందకపోవడంతో ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురైంది. బడ్జెట్ సమావేశాల నాటికి ఆ నివేదికలు అంది ఉంటే ఎంతో కొంత నిధుల కేటాయింపు జరిగేది.లేదంటే... పీపీపీ మోడ్‌లో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి ఓ విధాన నిర్ణయం వెలువడేది. రీజనల్ రింగ్‌రోడ్డుపై అటు హెచ్ఎండీఏ గానీ, ఇటు ప్రభుత్వం గానీ ఆరా తీయకపోవడంతో అధ్యయన సంస్థ సేదతీరుతోంది. ఇప్పటికైనా హెచ్ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా శ్రద్ధ తీసుకొని అధికారులను పరుగెత్తిస్తే తప్ప అధ్యయనాలు కొలిక్కి వచ్చే అవకాశమే లేదన్నది సుస్పష్టం. -
విద్యా ప్రమాణాల పెంపుకు ప్రణాళిక అవసరం: నాగేశ్వర్
హైదరాబాద్: విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యార్థి సంఘాలు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కె.నాగేశ్వర్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ నేత గుండా మల్లేష్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని ఆర్భాటంగా ప్రకటించి కిమ్మనకపోవటం విచారకరమన్నారు. వివిధ విద్యార్థి సంఘాల నేతలు బి.సాంబశివ, గౌతం ప్రసాద్, స్టాలిన్, నాగేశ్వర్, తేజ, మహేష్ పాల్గొన్నారు. -
జిల్లా జీడీపీ 19.13 శాతం లక్ష్యం
- 22విఎస్‌సీ1120:- జిల్లాకలెక్టర్ యువరాజ్ - పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు - పెండింగ్,ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు - కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ యువరాజ్ సాక్షి, విశాఖపట్నం: రానున్న ఆర్థిక సంవత్సరంలో 19.13 శాతం అభివృద్ధిరేటు సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ యువరాజ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో కేబినెట్ సమావేశానంతరం సీఎంచంద్రబాబు నాయుడు కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ యువరాజ్ జిల్లాలో అభివృద్ధి పెంపునకు రూపొంచిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ వివరాలను శుక్రవారం రాత్రి విశాఖపట్నంలో స్థానిక విలేకరులకు విడుదల చేశారు. జిల్లా జీడీడీపీలో 61 శాతం సర్వీస్ సెక్టార్ నుంచే వస్తుందని.. ఈ రంగాన్ని మరింత బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అలాగే పరిశ్రమలసెక్టార్లో 2013-14లో రూ.19,903కోట్లు కాగా, 2014 -15లో రూ.21,654కోట్లు కాగా, 2015-16లో రూ.25,091కోట్లు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇక అన్నింటికంటే ప్రధాన ప్రాధాన్యతా రంగమైన సేవా రంగంలో 2013-14లో రూ.39,945కోట్లు కాగా, 2014-15లో రూ.45,321 కోట్లుగా ఉందని, 2015-16లో రూ.54,745కోట్లు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రూ.7455కోట్లు పారిశ్రామిక రంగం ద్వారా రూ.25,091కోట్లు, సేవా రంగం ద్వారా రూ.14,061కోట్లు అదనపు ఆదాయం రాబట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 6,272కోట్లతో 746పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని, వీటి ద్వారా 9819 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు. రుషికొండలో 1,2,3 హిల్స్‌లో మెగా ఐటీ హబ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, అలాగే విశాఖలో సిగ్నేచర్ ఐటీటవర్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్, హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రానున్న ఆర్థికసంవత్సరంలో రూ.6వేల కోట్లతో కాఫీ ప్లాంటేషన్‌కు చర్యలు చేపట్టామన్నారు. పర్యాటక రంగం పరంగా రూ.12.75కోట్లతో కైలాసగిరిపై తెలుగు కల్చరల్ హరిటేజ్ మ్యూజియం, రూ.30కోట్లతో క్రూయిజ్ టూరిజం డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం పెండింగ్,ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయడం, ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచడం, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్లడం వంటి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. -
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
-
వర్రీ.. డూ జర్నీ!
వేసవిలో స్కూల్ ఉండదు. పుస్తకాలతో పని ఉండదు. పిల్లల అల్లరికి హద్దులుండవు. వారి అల్లరిని కట్టడి చేయడానికి చూడచక్కని ప్రదేశాలకు వెళ్లాలని, కుటుంబమంతా ఆనందంగా గడపాలని పెద్దలు ప్రణాళికలు వేసుకుంటారు. అవన్నీ ఎలా ఉన్నా ప్రయాణ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చాలా విహారం కాస్త విసుగ్గా అనిపిస్తుంది. ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలు విహారాన్ని మరింత ఆనందాన్ని మార్చేస్తుంది. 1 మీరే ఒక ట్రావెల్ సెంటర్ అవ్వండి... ఒక ప్రాంతానికి వెళ్లేటప్పుడు అక్కడి వాతావరణం, ఉండదగిన చోటు... దానికి తగ్గ ఏర్పాట్లతో ఒక జాబితాను రూపొందించండి. విమానాశ్రయ ఫోన్ నెంబర్లు, కార్ అద్దెకు ఇచ్చే కేంద్రాల ఏజెంట్ల నెంబర్లతో పాటు టికెట్, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు,..ల నెంబర్లన్నీ ఒక వైపు రాసుకోవాలి. అలాగే, ప్రయాణానికి కేంద్రబిందువుగా ఉండే ప్రాంతం, పర్యటించాల్సిన ప్రాంతాల జాబితాతో పాటు వ్యక్తిగత లగేజీ ప్యాకింగ్ లిస్ట్..మీ నోట్‌బుక్‌లో రాసుకున్న జాబితాను అనుసరించి కుటుంబంలోని వారికి సూచనలు ఇవ్వాలి. టికెట్స్, పాస్‌పోర్ట్, ట్రావెల్ డాక్యుమెంట్స్, ప్రయాణానికే ప్రత్యేకమైన టాయిలెట్ వస్తువులు, టిష్యూ పేపర్లు, ఇతర ప్రయాణ వస్తువులు, వ్యక్తిగతంగా తీసుకెళ్లదలచినవి.. ఇలా జాబితా ప్రకారం అన్ని వస్తువులను నీటుగా సర్దాలి. 2 తేలికైనదే ఎప్పుడూ సరైనది... పాత కాలంలో లాగా బరువైన వస్తువులన్నీ వెంట మోసుకెళ్లకుండా ‘ఎంత తేలికైనది అయితే అంత ఎక్కువ ప్రయోజనం’ అనే సూత్రానికి సిద్ధమవ్వండి. చాలా వరకు ఉపయోగించి, పడేసే వస్తువులను వెంట తీసుకెళ్లడం సముచితం. అవి కూడా పర్యావరణ హితమైన ట్రావెల్ వస్తువులు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిపై దృష్టి పెట్టడం మంచిది. ఏమాత్రం బరువు లేని థెర్మల్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్.. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గాన వెళ్లేవారికి ఈ బ్యాక్‌ప్యాక్స్ తేలికగానే కాదు, ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. 3 పిల్లల కోసం ప్రత్యేకం... ప్రయాణంలో పిల్లలు సులువుగా తినడానికి వీలున్న ఆహారాన్ని తీసుకెళ్లడం అందరూ చేసేపనే. అయితే, వీటి కోసం ప్రత్యేకించి బ్యాగులు అవసరం లేకుండా ధరించిన దుస్తులకే ఎక్కువ పాకెట్స్ ఉన్నవి ఎంచుకోవడం మేలు. లేదా, ‘బ్యాక్ ప్యాక్ బ్యాగ్’లో వేసి పిల్లలకే ఇస్తే వారు దానిని ఆనందంగా వెంట తీసుకెళ్లడానికి ఇష్టపడతారు. ఆ విధంగా పిల్లలనీ ప్రయాణపు పనుల్లో అవకాశం కల్పించినట్టూ ఉంటుంది. 4 వేడిని ఎదుర్కోండిలా... ప్రయాణంలో ఎండ, కాలుష్యం.. ఇతరత్రా పిల్లలు-పెద్దల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. 15 నిమిషాలకు ఒకసారి శుభ్రమైన నీరుతాగేలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే గంటకు ఒకసారి ఎస్.పి.ఎఫ్ 30 శాతం గల సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. వాహనాల్లో ఉన్నప్పటికీ ఈ లోషన్ తప్పనిసరి. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువ గల తాజా పండ్లు, శాఖాహార భోజనానికే అధిక ప్రాముఖ్యమివ్వాలి. నూనె, వేపుడు పదార్థాలను సాధ్యమైనంతవరకు ప్రయాణంలో దూరంగా ఉంచడమే మంచిది. బయట వేడి అధికంగా ఉంది కదా అని పిల్లలను వాహనాల్లోనే ఒంటరిగా వదిలి వె ళ్లడానికి ప్రయత్నించకండి. 5 మెడికల్ కిట్ తప్పనిసరి... విహారంలో పిల్లలలకు రాత్రి సమయాల్లో కీటకాలు కుట్టినప్పుడు దురదలు వస్తాయి. వెంటనే వాటికి విరుగుడుగా యాంటీబయాటిక్ లోషన్లు వాడాలి. అలాగే చెవుల్లోకి, ముక్కులోకి కీటకాలు దూరుతుంటాయి. రోడ్డు మార్గాన నడిచినప్పుడు పాదాలకు ముళ్లు గుచ్చుకోవడం మామూలే! ఇలాంటప్పుడు, వాటిని తీయడానికి టీజర్లు తీసుకెళ్లాలి. పిల్లలు మోచేతులకు, మోకాళ్లకు దెబ్బలు తగిలించుకోవడం సహజమే! వెంటనే ప్రాధమిక చికిత్స అందించేందుకు వీలుగా దూది, కత్తెర, బ్యాండేయిడ్.. ఉండాలి. అత్యవసర సాధనాలతో కూడిన కిట్ వెంట ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం మార్కెట్లో ట్రావెల్ మెడికల్ కిట్స్ లభిస్తున్నాయి. -
కాలుష్య నివారణ దిశగా అడుగులు
మే నెలలో గోదావరి శుద్ధి కార్యక్రమం తీరంలో ప్లాస్టిక్‌పై నిషేధం ‘సాక్షి’ కథనానికి స్పందన రాజమండ్రి : కాలుష్యం కోరల నుంచి గోదావరికి విముక్తి కలిగించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మలినాలను తొలగించి పుష్కరాలనాటికి నదీజలాలను కాలుష్యరహితం చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నదీ కాలుష్యంపై ‘కాలుష్య కాసారం’ శీర్షికన గత నెల 28న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్.. ఈ బాధ్యతను ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు హెచ్.అరుణ్‌కుమార్, కాటమనేని భాస్కర్లకు అప్పగించారు. మే నెలలో గోదావరి నది నీటిమట్టం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కాలుష్యం కూడా ఎక్కువవుతుంది. ఆ సమయంలో తీరగ్రామాల్లో నదిలో పెరిగిన నాచు, ఇతర పదార్థాలను తొలగిస్తారు. నీటి అడుగున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతారు. ఇందుకు మత్స్యకారుల సహకారం తీసుకుంటారు. స్నానఘట్టాల్లో గోదావరిని కలుషితం చేయవద్దనే బోర్డులు పెట్టి సేవాసంస్థల ఆధ్వర్యంలో నిఘా ఉంచుతారు. ఈ బాధ్యతను ప్రధానంగా ఆధ్యాత్మిక సేవాసంస్థలకు అప్పగించాలని ప్రసాద్ సూచించారు. నదీ కాలుష్యాన్ని నివారించాలనే నినాదంతో ఘాట్ల వద్ద ఇప్పటినుంచే ప్రచారం చేపట్టే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. ఇందుకోసం ఇప్పటికే యానాం ఎమ్మెల్యే ముందుకు వచ్చినట్టు సమాచారం. గోదావరి తీర గ్రామాల్లో పారిశుధ్య చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపడతారు. రాజమండ్రిలోని పలు స్నానఘట్టాల్లో వేలాదిగా ప్లాస్టిక్ వ్యర్థాలు తేలుతూంటాయి. నగరంలోని మురుగు కాలువల ద్వారా ఇవి నదిలో చేరుతున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని నదీతీర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
గొంతెండుతోంది..
1268 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు రూ.13.10కోట్లతోప్రణాళిక {పభుత్వానికి ప్రతిపాదన నిధుల కోసం ఎదురుచూపు వేసవి తరముకొస్తోంది.. నీటి ఎద్దడి ముంచుకొస్తోంది..వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లు,భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ వేసవిలో తీవ్రనీటి ఎద్దడి నెలకొనే పరిస్థితులు ప్రస్పుటమవుతున్నాయి. ముఖ్యంగా మెట్ట, ఏజెన్సీప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించిన అధికారులు.. ఇందుకుతగిన ప్రణాళికలు సిద్ధం చేశారు. నిధుల కోసంఎదురు చూస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: రానున్న వేసవిలో జిల్లాలోని 1268 పంచాయతీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉందని గ్రామీణ నీటిసరఫరా విభాగం ప్రాథమికంగా అంచనాకొచ్చింది. ఈ పంచాయతీల పరిధిలోని హేబిటేషన్స్‌లో సుమారు 10.50లక్షల మంది నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నారని లెక్కలేసింది. అంతేకాకుండా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు ఆశించిన స్థాయిలో పెరగక పోవడంతో మిగిలిన గ్రామాల్లోనూ తాగునీటి కష్టాలు తప్పవన్న భావనకొచ్చింది. ముందుగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే పంచాయతీలపైనే ఆర్డబ్ల్యూఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసింది. రూ.13.10కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. నిధులు మంజూరు కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని 925 పంచాయతీల పరిధిలో 9320 ఆవాస ప్రాంతాలుంటే..వాటిలో 3015 మెట్ట ప్రాంతంలోనూ, 6305 ఏజెన్సీలోనూ ఉన్నాయి. ఇక రక్షిత నీరు 1669 పంచాయతీల్లో పూర్తి స్థాయిలోనూ, 3799 ఆవాసాల్లో పాక్షిక స్థాయిలోనూ సరఫరా చేస్తున్నారు. రక్షితనీటివనరులు లేని గ్రామాలు 45ఉండగా, అసలు నీటి వనరులే లేని గ్రామాలు 16 ఉన్నాయి. జిల్లాలో చేతిపంపులు 18,178 ఉండగా,వాటిలో15,273 మెట్ట,. 2905 ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో 629 గ్రామాలను పూర్తి కరువు ఛాయలున్నట్టుగా గుర్తించారు. వీటిలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి 161 గ్రామాలకు ట్రాన్స్ పోర్టు ద్వారా నీరందించాల్సిన పరిస్థితులన్నాయని గుర్తించారు. ఐదు బావులను లోతుచేయాలని, 438 బావులను ఫ్లెషింగ్ చేయాలని, 25ఓపెన్ వెల్స్‌ను కూడా లోతు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.2.07 కోట్లు వ్యయమవుతుందని అంచనా కొచ్చారు. 638 గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు సీపీడబ్ల్యూ స్కీమ్స్, బోర్‌వెల్స్ మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. విద్యుత్ కనెక్షన్లు, మోటార్లు పనిచేయకపోవడం తదితర సమస్యల పరిష్కారానికి రూ.11.03 కోట్లు అవసరమవుతాయని అంచనావేశారు. ఎద్దడి లేకుండా చర్యలు గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఈసారి నీటి ఎద్దడి నెలకొనే అవకాశాలున్నాయి. అయినప్పటికీ సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. జిల్లాలో ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. -తోట ప్రభాకరరావు, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
ఎయిర్‌పోర్టుకు మహర్దశ
మాస్టర్‌ప్లాన్‌కు ప్రతిపాదనలు పూర్తి మూడు దశల్లో అభివృద్ధికి ప్రణాళికలు ఫైల్‌ను ఢిల్లీకి పంపిన అధికారులు రన్‌వే విస్తరణ, టెర్మినల్ భవనాలే కీలకం ప్రహరీ నిర్మాణానికి భూసార పరీక్షలు సాక్షి, విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని కేంద్ర విమానయాన శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు నూతన మాస్టర్‌ప్లాన్‌కు ప్రతిపాదనలు రూపొందించారు. దానికి అనుగుణంగా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. మాస్టర్‌ప్లాన్‌లోని ప్రతిపాదనలను అధికారులు ఢిల్లీకి పంపారు. కేంద్రం అనుమతి రాగానే ఆరు నెలల వ్యవధిలో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఎయిర్పోర్ట్ డెరైక్టర్‌గా రాజ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి రివైజ్డ్ ప్లాన్ తయారుచేశారు. ప్రస్తుతం ఈ ప్లాన్ అమలులో ఉంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం విమాన సర్వీసుల రద్దీ పెరిగింది. గన్నవరం నుంచి రోజూ 10 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం 80 శాతంపైనే ఆక్యుపెన్సీ ఉంటోంది. రాష్ట్ర విభజన తర్వాత పెరిగిన ప్రాధాన్యత రాష్ట్ర విభజన నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రాధాన్యత పెరిగింది. దీనికి అనుగుణంగా ఇక్కడి అధికారులు తరచూ పలు ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతం ఉన్న రన్ వే, టెర్మినల్ భవనం దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సరిపోవని అధికారులు తేల్చారు. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. మూడు నెలల క్రితం ఎయిర్పోర్ట్ అథారిటీ ముఖ్య అధికారులు గన్నవరంలో పర్యటించి అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించారు. సీఎం చంద్రబాబు కూడా ఇటీవల గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అధికారుల ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందని భావిస్తున్నారు. మూడు దశల్లో అభివృద్ధి ప్రధానంగా మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనల్లో పేర్కొన్న అంశాలను మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు. టెర్మినల్ బిల్డింగ్స్, ఆపరేషన్స్, సిటీ సెక్టార్లుగా విభజించి మూడు దశల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిలో 7,500 అడుగుల రన్‌వే ఉంది. టెర్మినల్ బిల్డింగ్‌లో సీటింగ్ కెపాసిటీ 250 మాత్రమే. ఈక్రమంలో మొదటి దశలో టెర్మినల్ భవనాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సుమారు 1,500 సీటింగ్ సామర్థ్యంతో టెర్మినల్ భవనం నిర్మించాలని మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీనిలో జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. వివిధ ఎయిర్‌లైన్ కంపెనీలకు గదులు కేటాయించడానికి వీలుగా టెర్మినల్ భవనంలో ప్రత్యేకంగా కొంతభాగం ఉండాలని మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్నారు. ఇదే తరహాలో ఇతర అవసరాల కోసం కూడా కొంత స్థలం కేటాయించాలని నిర్ణయించారు. రెండో దశలో ఆపరేషన్స్‌లో కీలకమైన రన్ వేను విస్తరిస్తారు. రన్ వేను 12వేల నుంచి 15వేల అడుగులకు పెంచాలని ప్రతిపాదనలు రూపొందించారు. విమానాల పార్కింగ్ కోసం కొంత ప్రదేశం కేటాయించాలని నిర్ణయించారు. సిటీ సెక్టార్లో భాగంగా మూడో దశలో నగరానికి ఎయిర్‌పోర్టు ఎంత దూరంలో ఉందనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఉన్న ఇన్ గేట్, అవుట్ గేట్లను మార్చడం, జాతీయ రహదారికి కనెక్టివిటీ ఉండేలా చూడటం వంటి అంశాలను ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రహరీ కోసం పరీక్షలు మాస్టర్‌ప్లాన్ పనులతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం ఉన్న ప్రహరీ స్థానంలో నూతనంగా భారీ రక్షణ గోడ నిర్మించటానికి కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు గత వారంలో భూసార పరీక్షలు నిర్వహించారు. ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడిన వెంటనే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని ఎయిర్పోర్ట్ డెరైక్టర్ రాజ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. దీనికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పారు. -
కేజీ టు పీజీలో 4 నుంచి 12 వరకు గురుకుల విద్య
గ్రామీణ విద్యార్థులకే ఆ స్కూళ్లలో ప్రవేశాలు ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి అంగన్వాడీ కేంద్రాలు అధికారులతో చర్చిస్తున్న విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి త్వరలో సీఎం సమక్షంలో విద్యావేత్తలు, సంఘాలతో సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న కేజీ టు పీజీ విద్యా విధానంలో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకుల విద్యను ప్రవేశ పెట్టేందుకు కసరత్తు మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకే ఈ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాక 3వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి ఈ ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పించాలని యోచిస్తున్నారు. ఈ స్కూళ్లలో ప్రవేశాలను లాటరీ ద్వారా కల్పించాలా? లేక ప్రవేశ పరీక్ష ద్వారా కల్పించాలా? అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే లాటరీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా ఈ విద్యా విధానంపై అధికారులతో చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కేజీ టు పీజీ స్కూళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఇప్పటికే నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ స్కూళ్లు ప్రారంభం అయినా కాకపోయినా, ఎవరి మెప్పు కోసమో కాకుండా గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు ఇదివరకు మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరంలో (2015-16లో) ప్రారంభం కాకపోయినా ఆ తరువాత విద్యా సంవత్సరం నుంచి పక్కా ప్రణాళికలతో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కేజీ టు పీజీ విద్యా విధానం ఎలా ఉండాలన్న అంశంలోనూ విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. వీరితో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని సమాచారం. ఇక ప్రాథమిక స్థాయిలో ప్రీప్రైమరీ సెక్షన్ల ఏర్పాటు ఎలా అన్న కోణంలోనూ ఆలోచనలు జరుపుతున్నారు. ప్రాథమిక విద్యను తెలుగు మీడియంలో ప్రారంభించాలని మొదట్లో భావించారు. అయితే తల్లిదండ్రుల నుంచి ఇంగ్లిషు మీడియం కావాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ అంశంపైనా పరిశీలన జరుపుతున్నారు. ఇక అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తీసుకువచ్చి ప్రీప్రైమరీ సెక్షన్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో స్కూల్‌ను దాదాపు రూ. 50 కోట్ల చొప్పును వెచ్చించి ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని పాఠశాల విద్యా అధికారులను మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ఉపాధ్యాయుల విధానంలోనూ మార్పులు తీసుకురాబోతున్నారు. ఇందులో భాగంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న టీచర్లను పూర్వ ప్రాథమిక (ప్రీప్రైమరీ), ప్రైమరీ (ప్రాథమిక) స్కూళ్లలో సర్దుబాటు చేయడం సాధ్యం అవుతుందా? లేదా? ఎంతమందిని ఆ స్కూళ్లలో సర్దుబాటు చేయవచ్చన్న అంశాలపై కసరత్తు చేస్తున్నారు. మిగతా ఉపాధ్యాయుల్లో అర్హత కలిగిన వారి పోస్టుల పేర్లను మార్పు చేయడం ద్వారా ఈ స్కూళ్లలోనే సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఆ తరువాత ఇంకా అవసరమైన పోస్టుల్లో కొత్త టీచర్లను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘రహదారి’లో అగ్ర పథమే లక్ష్యం
రూ.14 వేల కోట్లతో 26 వేల కి.మీ. రోడ్ల నిర్మాణం: తుమ్మల సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన రహదారి వ్యవస్థ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను దేశంలో తొలి స్థానంలో నిలపటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 26 వేల కిలోమీటర్ల మేర రోడ్లను తీర్చిదిద్దేందుకు రూ.14 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించబోతున్నామన్నారు. సోమవారం సాయంత్రం ఆయన రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీలు, సీఈలు, జిల్లాల ఎస్ఈలతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లను భారీ ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తుమ్మల వెల్లడించారు. రాష్ట్రంలో 2,700 కి.మీ.గా ఉన్న జాతీయ రహదారుల నిడివిని మరో 2 వేల కి.మీ. పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. అందులో తొలుత వెయ్యి కి.మీ. మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారన్నారు. తీవ్ర ట్రాఫిక్ చిక్కులతో సతమతమవుతున్న హైదరాబాద్‌లో సమస్య పరిష్కారానికి 45 కీలక జంక్షన్లను గుర్తించి వాటిల్లో ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్టు తెలిపారు. ఇదే తరహాలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి పెద్ద పట్టణాలను కూడా గుర్తించామన్నారు. తొలుత వరంగల్ ప్రధాన రహదారిని ఆరులేన్లుగా మారుస్తున్నట్టు తుమ్మల తెలిపారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దులను అనుసంధానించే క్రమంలో నదులపై నిర్మాణంలో ఉన్న వంతెనలను వేగంగా పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రోడ్లు భవనాలశాఖ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. -
21వ శతాబ్దికి అనుగుణంగా..
స్మార్ట్ సిటీలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం న్యూఢిల్లీ: దేశంలో ఏర్పాటు చేయదలచిన స్మార్ట్ సిటీలు 21వ శతాబ్దపు అవసరాలకు తగినట్లుగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పట్టణాల పరిపాలనను మెరుగుపరచడం ఈ సిటీల పథకం లక్ష్యం కావాలని... పట్టణ ప్రజలతో పాటు పట్టణాలపై ఆధారపడిన ప్రజానీకాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. సోమవారం ఢిల్లీలో స్మార్ట్ సిటీల అంశంపై జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘స్మార్ట్ సిటీ’లపై కేంద్ర, రాష్ట్రాల పట్టణాభివృద్ధి సంస్థలతో త్వరలో ఒక వర్క్‌షాప్ నిర్వహించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను ఆదేశించారు. పట్టణాల్లో మెరుగైన పరిపాలన దేశ పరిపాలన బలోపేతం కావడానికి తోడ్పడుతుందన్నారు. ఈ స్మార్ట్ సిటీలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉండాలని చెప్పారు. 21వ శతాబ్ధంలో పట్టణాలు, నగరాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవితం, పౌర కేంద్రీకృత సేవలు వంటివాటిని గుర్తించాలని అధికారులకు సూచిం చారు. ఘనవ్యర్థాల నిర్వహణ, వృథానీటి పునర్వినియోగం వంటి వాటితో వృథా నుంచి సంపదను సృష్టించే చర్యలు చేపట్టాలన్నారు. -
మహా’యజ్ఞం మొదలు!
మహానది-గోదావరి-కృష్ణా-కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియకు కేంద్రం శ్రీకారం ఈ వారంలోనే తెలంగాణ, ఒడిశాలతో కేంద్ర ప్రత్యేక బృందాల చర్చలు ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్, ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టుల అనుసంధానం గోదావరి నీటిని కృష్ణాకు తరలించేలా ప్రణాళిక ఇచ్చంపల్లి-సాగర్ లింకుకు రూ. 26,289 కోట్ల ఖర్చు సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రధాన నదుల అనుసంధాన ప్రక్రియ ఆరంభమవుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చకచకా ప్రణాళికలు రచిస్తోంది. నదుల అనుసంధాన పథకం కింద దక్షిణాది ప్రాంతానికే తొలి ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. రాష్ట్రాలతో చర్చలకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా తొలుత తెలంగాణ, ఒడిశాలను సంప్రదించనుంది. మహానది-గోదావరి-కృష్ణా నదుల అనుసంధాన ంపై కేంద్రం నియమించిన రెండు ప్రత్యేక బృందాలు ఈ వారంలోనే తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు రానున్నాయి. ఇప్పటికే అనుసంధాన సాధ్యాసాధ్యాలపై నివేదికలు సిద్ధమయ్యాయి. తదుపరి కార్యాచరణలో.. పర్యావరణ, అటవీ అనుమతులు, ప్రణాళిక వ్యయం, నీటి లభ్యతపై బృందాల ప్రతినిధులు అధికారులతో చర్చించి ఓ అంచనాకు రానున్నారు. బృహత్తర ప్రణాళిక.. భారీ ఖర్చు! అదనపు జలాల లభ్యత ఉన్న నది నుంచి మరో నదికి నీటిని మళ్లించడమే అనుసంధాన ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. దక్షిణాదిలో ప్రధాన నదులైన మహానది, గోదావరి, కృష్ణా, కావేరీలకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యం కల్పించారు. ఒడిశాలోని మహానది మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించాలన్నది ప్రణాళిక. మహానదిలో సుమారు 360 టీఎంసీలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకు ఉన్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్నాయి. ఈ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర పరిధిలో ఇచ్చంపల్లి(గోదావరి)-నాగార్జునసాగర్(కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించేందుకు చర్యలు చేపడతారు. ఇందుకు ఒక్క 299 కిలోమీటర్ల పొడవైన ఇచ్చంపల్లి-సాగర్ అనుసంధాన ప్రక్రియకే రూ. 26,289 కోట్లు అవసరం అవుతాయని లెక్కగట్టారు. ఇందులో ప్రధాన లింక్ కెనాల్‌కు రూ. 14,636 కోట్ల అవసరమని అంచనా వేశారు. ఇక 312 కిలోమీటర్ల పొడవైన ఇచ్చంపల్లి-పులిచింతలకు సైతం భారీ ప్రణాళికే రచించారు. దీని పూర్తి అంచనా ఎంతన్నది తెలియకున్నా ప్రధాన కెనాల్‌కు మాత్రం రూ. 4,252 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక అనుసంధాన కాల్వల వెంబడి రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వల తవ్వకంతో 226 గ్రామాలు, లక్ష మంది ప్రజలు ప్రభావితం కానున్నారు. మరో 51 వేల అటవీ, 70 వేల వ్యవసాయ భూమి కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక బృందాలు వీటన్నింటిపై కూలంకషంగా రెండు రాష్ట్రాలతో చర్చించనున్నాయి. అనుసంధానంపై రాష్ట్రాల అభ్యంతరాలు తెలుసుకుంటాయి. గోదావరిపై కొత్తగా చేపడుతున్న ప్రాణహిత-చేవెళ్ల(160 టీఎంసీలు), ఎల్లంపల్లి(60 టీఎంసీలు), దేవాదుల(38 టీఎంసీలు), కంతనపల్లి(50 టీఎంసీలు) ప్రాజెక్టుల నీటి అవసరాలపైనా బృందం చర్చించనుంది. లబ్ధి అంచనాలు ఇలా.. అనుసంధానించనున్న ఇచ్చంపల్లి-పులిచింతల, ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో తెలంగాణలో మొత్తంగా 9 లక్షల హెక్టార్ల మేర అదనపు సాగు అందుబాటులోకి వస్తుం దని కేంద్రం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అలాగే గృహ, సాగునీటి అవసరాలకు మరో 15 టీఎంసీల మేర నీరు అందుబాటులోకి వస్తుందని, 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇచ్చంపల్లి-సాగర్ అనుసంధానంతో కరీంనగర్ జిల్లాలో 2 మండలాలు, వరంగల్ 11, నల్లగొండలోని 9 మండలాల్లో 2.87లక్షల హెక్టార్లకు అదనపు సాగునీరు లభిస్తుంది. ఇచ్చంపల్లి-పులిచింతలతో వరంగల్ 2 మండలాలు, ఖమ్మం 13 మండలాలు, నల్లగొండ జిల్లాలోని 2, కరీంనగర్లో ఒక మండల పరిధిలో 6.13 లక్షల హెక్టార్ల సాగు భూమికి నీరందనున్నట్లు అంచనా వేశారు. అనుసంధాన కార్యక్రమానికి ఖర్చు భారీగానే ఉన్నా పథకం ఫలితాలు.. పదేళ్ల తర్వాత తెలుస్తాయని, అవి వందేళ్ల పాటు నిలిచి ఉంటాయని భావిస్తున్నారు. ప్రాథమిక అంచనా మేరకు పదో ఏడాది తర్వాత విద్యుత్ అవసరాలు, సాగు రూపేనా ఇచ్చంపల్లి-సాగర్ల కింద ఏటా రూ.3 వేల కోట్లు, ఇచ్చంపల్లి-పులిచింతల కింద రూ.2,201.67 కోట్ల మేర ప్రయోజనాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. -
పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువులు
తెలంగాణ విద్యావిధానంపై సమీక్షలో సీఎం కేసీఆర్ పేదలు, ధనవంతులు అన్న తేడా ఉండొద్దు మరిన్ని రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలి హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు ఉండటానికి వీల్లేదు సాక్షి, హైదరాబాద్: పేదలు, ధనవంతులు అన్న తేడా లేకుండా ఒకే పాఠశాలలో, ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందేలా తెలంగాణ రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేల పిల్లలతో పాటే నిరుపేదల పిల్లలూ ఒకే స్కూల్లో చదవాలని, ఒకే యూనిఫాం ఉండాలని సూచిం చారు. ఈ మేరకు కేజీ నుంచి పీజీ వరకు ఉత్తమ విద్య అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. తెలంగాణ విద్యా విధానంపై శనివారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు బీఆర్ మీనా, శైలజా రామయ్యర్, ప్రదీప్‌చంద్ర, జయేష్ రంజన్, సోమేశ్ కుమార్, నర్సింగరావు, శ్రీధర్, స్మితా సబర్వాల్ తదితరులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ప్రీస్కూల్ విద్య అందుతోందని, వాటిని ప్లే స్కూళ్లుగా మార్చాలని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగాలన్నారు. పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలల పనితీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. సరైన విద్య అందక పేద విద్యార్థులు భవిష్యత్తులో నిరుపయోగమైన తరంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని పేద పిల్లలందరూ ఆంగ్ల మాధ్యమంలో ఉత్తమ విద్య అందుకోవాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు బాగుందని, వాటి సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించారు. మండలానికి రెండు మూడు చొప్పున రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి, అందులోనే 12వ తరగతి వరకు విద్య అందించాలనే ప్రతిపాదనతో పాటు నిర్బంధ విద్య అమలుపై వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమీక్షలో చర్చించారు. అయితే ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. విద్యారంగంలో అనుభవజ్ఞులు, మేధావులు, సీనియర్ అధికారులతో త్వరలో సదస్సు నిర్వహించి తెలంగాణ విద్యా విధానంపై చర్చించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ పరిశీలించిన ప్రతిపాదనలివీ.. ఒకటో ప్రతిపాదన: 4వ తరగతి నుంచి రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోవాలి. రెండో ప్రతిపాదన: 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలి. మూడో ప్రతిపాదన: ప్రస్తుతం మండలానికి 3, 4 స్కూళ్లలో ఆంగ్ల విద్యా బోధన జరుగుతోంది. ఇదే పద్ధతి అన్ని స్కూళ్లలోనూ కొనసాగాలి. నాలుగో ప్రతిపాదన: మండలానికి 4 రెసిడెన్షియల్ స్కూళ్లుండాలి. కనీసం ఒకటైనా ఉండాలి. ఐదో ప్రతిపాదన: తెలుగు మీడియం విద్యార్థులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చి మొదటి సంవత్సరంలో ఇంగ్లిష్ నేర్పడంపై దృష్టి పెట్టాలి. టీచర్లూ ఆంగ్ల బోధనకు సన్నద్ధం కావాలి. వసతి గృహాలకు సన్న బియ్యం రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు మేలు రకం సన్న బియ్యాన్ని అందించాలని సీఎం కేసీఆర్ సూచించారు. వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నం, నీళ్ల చారు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎవరూ అడగకపోయినా వసతి గృహాల విద్యార్థుల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు చదువులో ఉండగానే వృత్తి నైపుణ్యం పెంచాలని కోరారు. ఇంజనీరింగ్ విద్యార్థులను పరిశ్రమలకు అప్పగించాలని, అక్కడ తాము చదివే చదువు ద్వారా చేయాల్సిన పనులపై అవగాహన పెంచుకోగలుగుతారని అభిప్రాయపడ్డారు. -
యాదగిరిగుట్ట ఈవో కృష్ణవేణి బదిలీ
సాక్షి, హైదరాబాద్: తిరుమల తరహాలో యాదగిరిగుట్ట క్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్న తరుణంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ఎం.ఎం.డి.కృష్ణవేణిని మార్చి మహబూబ్‌నగర్ జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరక్టర్‌గా పనిచేస్తున్న రెవెన్యూ విభాగం డిప్యూటీ కలెక్టర్ ఎన్.గీతను ఆ స్థానంలో నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వు జారీ చేసింది. కృష్ణవేణి యాదగిరి గుట్ట దేవాలయ ఈవోగా ఉంటూ జాయింట్ కమిషనర్ హోదాలో దేవాదాయశాఖ విజిలెన్స్ అధికారిగా కమిషనరేట్‌లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆమెను పూర్తిస్థాయిలో విజిలెన్స్ అధికారిగా నియమించింది. -
రైతుకు ‘సహకారం’ లేనట్లే...
ముక్కుపిండైనా రుణం వసూలు కార్యదర్శులకు సమావేశాలు డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆదేశాలు రికవరీలో జిల్లాది ఆఖరి స్థానం నూజివీడు :రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడు చేస్తుందా అని ఎదురుచూస్తున్న రైతులపై మరో పిడుగు పడనుంది. ఓ వైపు రుణాలను మాఫీ చేయకపోగా, మరోవైపు కొత్త రుణాలివ్వని నేపథ్యంలో ప్రైవేటు వడ్డీవ్యాపారస్తుల వద్ద అప్పులు చేసి పంటలు సాగుచేసుకుంటున్న రైతుల నుంచి ముక్కుపిండయినా సరే సహకార రుణాలను వసూలు చేయడానికి జిల్లాలోని 50కేడీసీసీబీ బ్రాంచిల మేనేజర్లు, సూపర్వైజర్లతో పాటు 425 పీఏసీఎస్‌ల కార్యదర్శులను జిల్లా సహకార ఉన్నతాధికారులు సన్నద్ధం చేస్తున్నారు. దీనికి గానూ ఎన్ని ఒత్తిడిలున్నా రుణమాఫీ జాబితాలను సిద్ధం చేసినందుకు గానూ అభినందన సభ పేరుతో డివిజన్ కేంద్రాల్లో శనివారం సమావేశాలు నిర్వహించారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక రుణాలతో పాటు రుణమాఫీకి అర్హత లేని వారి రుణాలను వసూలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. వసూలుతో పాటు కొత్త రుణాల మంజూరుపై కూడా దృష్టి కేంద్రీకరించనున్నారు. అయితే రుణాలను వసూలు చేసే సమయంలో రైతుల నుంచి నిరసన జ్వాలలు ఎదురుకాకుండా ఉండేందుకు గానూ ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న సహకార వారోత్సవాల్లో రుణాలను చెల్లించేందుకు గానూరైతులను మానసిక సిద్ధం చేసేలా వారిలో చైతన్యం కలిగించాలని డివిజనల్ కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ తోలిక్యా, ఉన్నతాధికారులు కిరణ్‌కుమార్, వేణుగోపాల్, రమేష్‌కుమార్ నిర్ణయానికి వచ్చారు. రుణాల వసూలును డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని, కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అప్పటికీ చెల్లించకపోతే జనవరి నెలలో వేలం పాటలు సైతం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. రుణాల రికవరీలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కృష్ణాజల్లా ఆఖరి స్థానంలో ఉందని, దీని స్థానాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో నిబంధనలకనుగుణంగా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నారు. రూ.600 కోట్ల వరకు బకాయిలు... జిల్లాలో సహకార రుణాలు ఈ ఏడాది మార్చి31 నాటికి రూ.844.11కోట్లు ఇచ్చారు. వీటిపై డిమాండ్ రూ. 1037.29కోట్లు ఉండగా, రూ.436.56కోట్లు మాత్రమే వసూలలు అయ్యాయి. మిగిలిన 600.72కోట్లు వసూలు కావాల్సి ఉంది. అయితే దీనిలో 50శాతం రుణమాఫీ అయినా ఇంకా రూ.300 కోట్లు వసూలు కావాల్సి ఉంటుంది. పీఏసీఎస్ కార్యదర్శుల ఆందోళన... ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో రైతుల వద్దకు వెళ్లి రుణాల రికవరీ చేయాలని ఒత్తిడిచేస్తే వారి నుంచి నిరసన జ్వాలలు ఎదుర్కొనాల్సి వస్తుందని సొసైటీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసేవరకు ఆగడమే మేలనే అభిప్రాయాన్ని అధిక శాతం కార్యదర్శులు వ్యక్తం చేశారు. -
‘విశ్వ’మంత సేవకు...
ప్రణాళికలు సిద్ధం చేసిన గ్రేటర్ ఆర్టీసీ 11 బస్ టెర్మినళ్లు, 55 డిపోలకు ప్రతిపాదనలు సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం దిశగా గ్రేటర్ హైదరాబాద్ అడుగులు వేస్తోంది. అదే స్థాయిలో సేవలను అందించేందుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో నగర అవసరాలకు అనుగుణంగా సర్వీసులు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే విధంగా, బలమైన ప్రజా రవాణా వ్యవస్థగా ఇప్పుడున్న స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా దృష్టి సారిస్తోంది. నగరం చుట్టూ 11 భారీ టెర్మినల్స్, అదనంగా 55 బస్ డిపోలు ఏర్పాటు చేయనుంది. నగరంలో ప్రస్తుతం 34.02 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. 2019 నాటికి ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఘట్కేసర్ , పెద్ద అంబర్పేట్, శామీర్‌పేట్, గండిమైసమ్మ, శంకర్పల్లి, మొయినాబాద్, తదితర ప్రాంతా ల్లో, ఔటర్ రింగురోడ్డు చుట్టూ వందలాది కాలనీలు కొత్తగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ఇందుకనుగుణంగా సిటీ సర్వీసులను పెంచేందుకు ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం గ్రేటర్లో 28 డిపోలు ఉన్నాయి. మొత్తం 1239 రూట్లలో 3,798 బస్సులు ప్రజలకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న డిపోల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో 83కు పెంచాలని, 8 వేలకు పైగా బస్సులను అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ భావిస్తోంది. రానున్న ఐదేళ్లలో ప్రయాణికుల సంఖ్య 60 లక్షల నుంచి 70 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. ప్రవేశ మార్గాల్లో 11 భారీ టెర్మినల్స్.. వాహనాల రద్దీ, రోజు రోజుకు పెరుగున్న నగర జనాభా, ఇరుకైపోతోన్న రహదారులు, దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నగరంలోకి ప్రవేశించేందుకు ఇబ్బందుంలు ఎదువరుతున్నాయి. భవిష్యత్తు అవ సరాలను దృష్టిలో ఉంచుకొని నగరానికి నాలుగువైపులా ప్రధాన ముఖద్వారాల్లో 11 భారీ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వీటి నుంచి ప్రయాణికులు నగరంలోకి వచ్చి, వెళ్లేందుకు లోకల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బెంగళూరు మార్గంలో ఆరాంఘర్, వికారాబాద్ మార్గంలో మొయినాబాద్, శంకర్పల్లి, ముంబయి నుంచి వచ్చే బస్సులకు సుల్తాన్పూర్ వద్ద, మెదక్ మార్గంలో గండిమైసమ్మ వద్ద, నాగ్‌పూర్ మార్గంలో రాకపోకలు సాగించే బస్సులకు గౌడవెల్లి వద్ద, కరీంనగర్ మార్గంలో శామీర్‌పేట్, వరంగల్ వైపు ఘట్కేసర్ వద్ద, విజయవాడ మార్గంలో పెద్ద అంబర్పేట్ , నాగార్జున్‌సాగర్ మార్గంలో ఇబ్రహీంపట్నం, శ్రీశైలం మార్గంలో తుక్కుగూడ వద్ద భారీ టెర్మినళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 55 కొత్త డిపోలు అవసరం ... ప్రస్తుతం జంటనగరాల పరిధిలో ఉన్న 28 డిపోలను ఐదేళ్లలో 83 కు పెంచేవిధంగా ఆర్టీసీ ప్రతిపాదనలు చేస్తోంది. ఇందుకు స్థలాలు అవసరం. ప్రస్తుతం ఉన్న డిపోల్లో పార్కింగ్ సామర్ధ్యానికి రెట్టింపు బస్సులు ఉన్నాయి. వంద బస్సులకు మాత్రమే పార్కింగ్ స్థలం అందుబాటులో ఉన్న డిపోల్లో 150 నుంచి 200 బస్సులను పార్క్ చేస్తున్నారు. ఐదేళ్లలో బస్సుల సంఖ్య 8 వేలు దాటే అవకాశం ఉంది. ఆ దృష్ట్యా డి పోల సంఘ్య పెంపు తప్పనిసరని భావిస్తోంది. నగరం చుట్టూ ఉన్న రేడియల్ రోడ్లలో సైతం బస్సు డిపోలను ఏర్పాటు చేయాలనుకుంటోంది. కొత్తగా బాలాజీనగర్, భూదాన్‌పోచంపల్లి, బోరబండ, ఏదులనాగులపల్లి, కోహెడ, కెపీహెచ్బీ ఫోర్త్ ఫేస్, మంకాల్, మొయినాబాద్, ముత్తంగి, పోచారం, కుత్భుల్లాపూర్, ఉప్పర్‌పల్లి, కామారెడ్డిగూడ, కొండాపూర్, గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ హబ్, గచ్చిబౌలి క్యూ సిటీ, సర్దార్‌నగర్, నాదర్‌గూల్, శంషాబాద్, చేవె ళ్ల, కాటేదాన్ మధుబన్ కాలనీలలో కొత్త డిపోలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే రేడియల్ రోడ్ల చుట్టూ మరో 33 డిపోలు ఏర్పాటు చేసి, రవా ణా సదుపాయాలు పెంచాలని ఆర్టీసీ భావిస్తోంది. -
దళితుల అభివృద్ధికి ప్రణాళికలు
దళిత బహుజనఫ్రంట్ సదస్సులో వక్తల డిమాండ్ హైదరాబాద్: దళితుల సమగ్రాభివృద్ధికోసం అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి, నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించాలని వక్తలు డిమాండ్‌చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి సవరణలు చేయూలని, దానికున్న పదేళ్ల పరిమితిని ఎత్తివేయాలని, ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలకు నిధులు విడుదల చేయూలని వారు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో దళిత బహుజనఫ్రంట్ ఆధ్వర్యంలో దళితుల సమగ్రాభివృద్ధిపై నిర్వహించిన రాష్ర్టసదస్సులో పలువురు వక్తలు వూట్లాడారు. వ్యవసాయాధార దళిత కుటుంబాలకు రెండో దశ భూపంపిణీని ప్రారంభించాలని విజ్ఞప్తిచేశారు. సెంటర్‌ఫర్ దళిత్‌స్టడీస్ కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బడుగు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే పాత్రను దళితసంఘాలు నిర్వహించాలన్నారు. దళిత యువతకు ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి అనుగుణంగా గ్రామాల్లో యువతకు ఎలాంటి ఉపాధికావాలి .. దానికి ఏమి చేయాలో సూచిస్తూ నివేదికను సమర్పించాలని కోరారు. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి దళితుల అభ్యున్నతికి గట్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 59 దళిత కులాలుండగా చిందోళ్లు, గుర్రపు మాల తదితర దళిత కులాల అభ్యున్నతికి అందరూ కృషిచేయకపోతే చరిత్ర క్షమించదన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన పి.శంకర్ మాట్లాడుతూ అసైన్డ్‌భూముల అన్యాక్రాంతాన్ని అరికట్టాలని, దళితులకు పంపిణీచేసిన భూములను భూసేకరణ చట్టం కింద ప్రజాప్రయోజనాల పేరుతో స్వాధీనం చేసుకోవద్దని కోరారు. ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటుచేసి దానికి మానవ హక్కుల సంఘం తరహాలో జ్యుడీషీయల్ అధికారాలు కల్పించి దళితులపై దాడులను నివారించాలని కోరారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డీబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్, భూహక్కుల పరిశోధకురాలు ఉషా సీతాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన ఫ్రంట్ తెలంగాణ అధ్యక్షుడిగా పి.శంకర్, ప్రధాన కార్యదర్శిగా బి.మొగులయ్యను ఎన్నుకున్నారు. -
బ్యాంక్ కొలువుకు మరో మార్గం..
బ్యాంకుల్లో ఉద్యోగం సొంతం చేసుకోవాలంటే..? జాతీయ స్థాయిలో నిర్వహించే ఐబీపీఎస్ వంటి పోటీ పరీక్షలు.. వాటిలో విజయానికి.. కొలువు ఖరారు చేసుకోవడానికి విస్తృత ప్రణాళికలు.. విభిన్న వ్యూహాలు.. సాధారణంగా బ్యాంకుల్లో క్లరికల్ స్థాయి నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ వరకు ఉద్యోగ సాధనకు మార్గాలు. కానీ.. బ్యాంకింగ్ రంగంలో ట్రెండ్ మారుతోంది. ఫ్రెష్ టాలెంట్‌ను రిక్రూట్ చేసుకునేందుకు బ్యాంకులు కొత్త పంథా అనుసరిస్తున్నాయి. తమ అవసరాలకు సరితూగే విధంగా ప్రత్యేకంగా కోర్సులు ప్రవేశపెడు తున్నాయి. ఇందుకోసం అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కోర్సు పూర్తి చేస్తే సర్టిఫికెట్, సదరు బ్యాంకులో కొలువు ఖాయం. తొలుత ప్రైవేటు బ్యాంకులతో మొదలై.. ప్రభుత్వ రంగ బ్యాంకులకూ విస్తరిస్తున్న.. బ్యాంకింగ్ కెరీర్ గ్యారెంటీ కోర్సులపై విశ్లేషణ.. బ్యాంకింగ్.. శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగం. అంతేస్థాయిలో మానవ వనరుల డిమాండ్ కూడా పెరుగుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్బీఐ మినహా మిగతా అన్ని బ్యాంకులకు క్లరికల్, పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ (ఐబీపీఎస్) జాతీయస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ.. దాంతోపాటు, దాని అనుబంధ బ్యాంకుల్లో ఉద్యోగాలకు.. సొంత ఎంపిక ప్రక్రియను అనుసరిస్తోంది. ఉద్యోగుల ఎంపికలో ప్రత్యేక శ్రధ్ధ ఇక.. ప్రైవేటు బ్యాంకులు.. యువ ప్రతిభా వంతులకు పెద్దపీట వేస్తున్నాయి. వివిధ రూపాల్లో ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికి ఉద్యోగుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా యి. తమ బ్యాంకు అవసరాలకు సరితూగేలా అభ్యర్థులను తీర్చిదిద్దుతున్నాయి. క్షేత్ర స్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకుని, పూర్తిస్థాయి బ్యాంకింగ్ పరిజ్ఞానం పొందిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకుం టున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్సులు రూపొందిస్తున్నాయి. వీటిని వివిధ విద్యా సంస్థలతో ఒప్పందం ద్వారా అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసినవారికి బ్యాంకింగ్‌లో పీజీ డిప్లొమా సర్టిఫికెట్‌తోపాటు.. మేనేజ్మెంట్ ట్రైనీ, ప్రొబేషనరీ ఆఫీసర్ హోదాలతో కొలువులు ఖరారవుతున్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో కోర్సులు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంకు.. ఇలా ప్రైవేటు బ్యాంకులు ఇప్పుడు బ్యాంకింగ్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతగా ఉన్న ఈ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ప్రవేశ పరీక్షల్లో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జన రల్ నాలెడ్జ్, రీజనింగ్ ఎబిలిటీ అంశాల్లో ప్రశ్నలుంటాయి. పేర్లు వేర్వేరు.. లక్ష్యం ఒకటే ఆయా బ్యాంకులు అందిస్తున్న ఈ కోర్సుల పేర్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. అన్నింటి లక్ష్యం ఒకటే. అది.. పూర్తిస్థాయిలో విధుల్లోకి అడుగుపెట్టే నాటికి బ్యాంకింగ్ కార్యకలాపాలపై పరిపూర్ణ అవగాహన కల్పించడం. ఉదాహరణకు.. ఐసీఐసీ ఐ బ్యాంకు.. మణిపాల్ యూనివర్సిటీతో కలిసి సంయుక్తంగా అందిస్తున్న కోర్సు.. పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్. ఈ కోర్సు పూర్తి చేసినవారిని ఐసీఐసీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నియమిస్తారు. ఇదే విధంగా యాక్సిస్ బ్యాంకు ‘యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్’ పేరుతో పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ కోర్సును అందిస్తోంది. ఇవేకాకుండా హెచ్ఎస్బీసీ బ్యాంకు సొంతంగా గ్రాడ్యుయేషన్ అర్హతగా రెండేళ్ల వ్యవధి ఉన్న గ్రాడ్యుయేట్ అనలిస్ట్ ప్రోగ్రామ్‌ను పలు విభాగాల్లో నిర్వహిస్తోంది. క్లాస్ రూం + ప్రాక్టికల్ నాలెడ్జ్ బ్యాంకులు అందించే ఈ కోర్సులు సాధారణంగా ఏడాది వ్యవధిలో ఉంటున్నాయి. విద్యార్థులు నైపుణ్యాలు సొంతం చేసుకునే రీతిలో కరిక్యులం అమలవుతోంది. బోధనలో భాగంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, రిస్క్ అనాలిసిస్ వంటి కోర్ అంశాలతో పాటు.. బ్యాంకు సేవలు, విధివిధానాలపై అవగాహన కల్పిస్తారు. ఈ క్రమంలో ఏడాది కోర్సులో తొమ్మిది నెలలు క్లాస్ రూం టీచింగ్ తర్వాత మూడు నెలలు సంబంధిత బ్యాంకులో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ రోజు నుంచే ఆదాయం బ్యాంకులు అందిస్తున్న.. ఈ కోర్సుల్లో చేరిన వారికి క్లాస్‌రూంలో అడుగుపెట్టిన రోజు నుంచే ఆదాయం పొందే అవకాశం లభిస్తోంది. క్లాస్ రూం టీచింగ్, ఇంటర్న్‌షిప్ సమయంలో నిర్ణీత మొత్తాన్ని స్టైఫండ్ రూపంలో ఆయా సంస్థలు ఇస్తున్నాయి. ఈ మొత్తాలు ఆయా బ్యాంకుల విధివిధానాల మేరకు ఉంటున్నాయి. యాక్సిస్ బ్యాంకు క్లాస్ రూం టీచింగ్‌లో నెలకు రూ. 5 వేలు; ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ. 9 వేలు అందిస్తోంది. ఫీజుల కోసం రుణ సదుపాయం ఆయా కోర్సులకు నిర్దేశించిన ఫీజు, ఇతర అకడమిక్ ఖర్చులకు కావాల్సిన మొత్తానికి సదరు బ్యాంకులే రుణ సదుపాయం కూడా అందిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసుకుని బ్యాంకులో ‘కొలువు’దీరాక నిర్ణీత వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా కోర్సు పూర్తయ్యాక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు మారటోరియం సదుపాయం (రీ పేమెంట్ హాలిడే)ను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. సర్వీస్ ఒప్పందం కోర్సులు పూర్తి చేసుకుని సదరు బ్యాంకులో ఉద్యోగం సొంతం చేసుకున్న అభ్యర్థులు నిర్దేశించిన సంవత్సరాలు పనిచేస్తామని సర్వీస్ అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆయా బ్యాంకుల విధానాలపై ఆధారపడి ఉంటుంది. కోర్సులకు దరఖాస్తు చేసేముందే అభ్యర్థులు ఈ వివరాలన్నీ తెలుసుకోవాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియామకాలు జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ఐబీపీఎస్ క్లరికల్, పీవో పరీక్షల స్కోర్, ఇంటర్వ్యూల ఆధారంగా జరుగుతాయి. కానీ ఇటీవల కొన్ని బ్యాంకులు ఐబీపీఎస్ విధానంతోపాటు.. తాము కూడా సొంతంగా కోర్సును నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారికి కొలువులిచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు.. మణిపాల్ గ్లోబల్ అకాడమీతో కలిసి సంయుక్తంగా ఏడాది వ్యవధిలో పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స కోర్సుకు రూపకల్పన చేశాయి. మొత్తం అభ్యర్థుల సంఖ్యలో ప్రభుత్వ విధానాల మేరకు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు టెక్నికల్ సిబ్బంది నియామకం కోసం కూడా అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ పేరుతో ఒక ప్రత్యేక కోర్సుకు శ్రీకారం చుట్టింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్, ఐటీ విభాగాల్లో జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్‌తో ప్రారంభ హోదా లభిస్తుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కూడా తాజాగా మణిపాల్ గ్లోబల్ అకాడమీతో ఒప్పందం ద్వారా పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సుకు రూపకల్పన చేసింది. ప్రవేశ పరీక్షలో రాణించాలంటే బ్యాంకులు అందిస్తున్న కోర్సులు.. వాటిలో ప్రవేశానికి సంబంధించి ప్రతి బ్యాంకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలో రాణించడం సులభమే. ఇప్పటికే ఐబీపీఎస్, ఎస్బీఐ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు అదే ప్రిపరేషన్‌తో ఈ కోర్సుల ఎంట్రెన్స్లకూ హాజరుకావచ్చు. తాజాగా బ్యాచిలర్స్ డిగ్రీతో ఈ కోర్సులనే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ స్కిల్స్, అర్థమెటిక్, జనరల్ అవేర్‌నెస్‌లపై పట్టు సాధిస్తే విజయం సాధించడం సులువే. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు సాధారణంగా డిసెంబర్ నుంచి జూలై వరకు ఆయా బ్యాంకుల అవసరాలకు అనుగుణంగా వెలువడతాయి. వివిధ జాతీయస్థాయి దినపత్రికలను చూస్తుండాలి. అదనంగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆయా బ్యాంకులు నిర్వహిస్తున్న జాబ్ గ్యారెంటీ కోర్సుల ప్రవేశ ప్రక్రియలో అభ్యర్థులు అదనంగా ఎదుర్కోవాల్సిన దశ గ్రూప్ డిస్కషన్. రాత పరీక్షలో విజయం సాధించిన వారికి బృంద చర్చలు ఉంటాయి. ఇందులోనూ రాణిస్తే మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. చివరకు రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. అకడమిక్ ట్రాక్ బాగుంటేనే జాబ్ గ్యారెంటీ కోర్సులను అందిస్తున్న ఆయా బ్యాంకులు అభ్యర్థుల అర్హతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పదో తరగతి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ వరకు అకడమిక్ రికార్డ్ బాగుంటేనే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాచిలర్స్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. అంతేకాకుండా గరిష్ట వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్దేశించి.. తాజా గ్రాడ్యుయేట్లకే అవకాశం కల్పిస్తున్నాయి. ప్రయోజనాలు చేకూర్చే టై-అప్స్ ఇప్పుడు పలు బ్యాంకులు తమ అవసరాలకు సరితూగే విధంగా ఇన్స్టిట్యూట్లతో ఒప్పందం ద్వారా కోర్సులు నిర్వహించడం.. అటు ఔత్సాహిక అభ్యర్థులకు, ఇటు పరిశ్రమ వర్గాలకు ప్రయోజనకరం. వీటి ద్వారా అభ్యర్థులకు ముందుగానే తాము కార్యక్షేత్రం లో నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన లభిస్తుంది. మరోవైపు బ్యాంకుల కోణంలో వినియోగదారులకు చక్కటి సేవలందించేం దుకు సుశిక్షితులైన సిబ్బంది దొరుకుతారు. - ఎం. కమలాకర్‌రావు, డీజీఎం, ఆంధ్రాబ్యాంకు ఔత్సాహికులకు సరైన అవకాశం బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోరుకునే ఔత్సాహికులకు, అదేవిధంగా ఉన్నత విద్య అభిలాష ఉన్న వారికి అనుకూలమైనవి ఈ జాయింట్ వెంచర్ కోర్సులు. శరవేగంగా వృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ రంగంలో ఏటా వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. అదే సమయంలో క్షేత్ర నైపుణ్యాలు కలిగిన సిబ్బంది ద్వారా వినియోగదారులకు మరింత సేవలందించా లనే ఉద్దేశంతోనే ఈ కోర్సుల రూపకల్పన జరుగుతోంది. అభ్యర్థులు జాబ్ ట్రెండ్‌నే దృష్టిలో పెట్టుకోకుండా తమ అభిరుచికి కూడా ప్రాధాన్యమిస్తే రెండూ నెరవేరే అవకాశం లభిస్తుంది. - కె. శ్రీధర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్), టాలెంట్ స్ప్రింట్. ఆ మూడు అవసరాలు తీరేలా ప్రైవేటు రంగంలోని బ్యాంకుల్లో మానవ వనరుల అవసరం ఎంతో ఉంది. అదే సమయంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ పెద్ద కసరత్తుగా మారింది. ఈ నేపథ్యం లో ఆవిష్కృతమవుతున్నవే బ్యాంకింగ్ కోర్సులు. వీటి ద్వారా బ్యాంకుల కోణం లో మ్యాన్ పవర్ డిమాండ్, సప్లయ్, స్కిల్డ్ మ్యాన్ పవర్ అనే మూడు ప్రధాన లక్ష్యాలు నెరవేరుతాయి. ఔత్సాహిక విద్యార్థులు ఈ అవకాశాలను అంది పుచ్చుకుంటే ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చు. -జి. వాసుదేవన్, సదరన్ హెడ్, కోటక్ మహీంద్ర బ్యాంక్ బోస్టన్ నివేదిక పేర్కొన్న అంశాలు బ్యాంకుల్లో సుశిక్షితులైన మానవ వనరుల సిబ్బంది ఆవశ్యకతపై ఇండియన్ బ్యాంకింగ్-2020 పేరిట బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రూపొందించిన నివేదిక.. బ్యాంకులు - అకడమిక్ ఇన్స్టిట్యూట్స్.. ఒప్పందాల ద్వారా ప్రత్యేకమైన కోర్సులు రూపొందించాలని పేర్కొంది. తద్వారా బ్యాంకుల్లో అవసరమైన నైపుణ్యాలు అభ్యర్థుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనిసూచించింది. ముఖ్యంగా క్లరికల్, జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్-1 స్థాయి పోస్టుల విషయంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏలు, ఇతర పీజీ ప్రోగ్రామ్‌లు ఎంతో అవసరమని తెలిపింది. -
గిరిజనాభ్యున్నతే ఐటీడీఏ లక్ష్యం
రూ.3280.83 కోట్లతో ప్రణాళికలు స్వాతంత్య్ర దినోత్సవంలో పీవో వినయ్‌చంద్ పాడేరు: విశాఖ ఏజెన్సీలోని అన్ని వర్గాల గిరిజనుల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా ఐటీడీఏ పని చేస్తుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ అన్నారు. తలారిసింగ్ క్రీడామైదానంలో స్వాతంత్య్ర దినోత్సవా న్ని శుక్రవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పీవో జాతీయ జెండాను ఎగు ర వేసి విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో రూ.3280.83 కోట్లతో గిరిజన సంక్షేమానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రభు త్వ ఆమోదం రాగానే తాగునీరు, విద్య, ఇంజినీరింగ్, వ్యవసాయం, ఉద్యాన వనం, పట్టుపరిశ్రమ, విద్యుత్ తదితర రంగాల్లో కార్యక్రమాలు విస్తృతమౌతాయన్నారు. ఏజెన్సీలోని అన్ని మండలాల్లో బ్యాంకు సేవలను విస్తృతం చేసి గిరిజన రైతులకు బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వ రాయితీలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ, పచ్చతోరణం పథకాల కిం ద ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పండ్ల జాతుల మొక్కలను పెంచుతున్నామన్నారు. గతేడాది 9,371 మంది విద్యార్థులకు రూ.10.47 కోట్ల ఉపకార వేతనాలు మంజూరు చేశామన్నారు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.104.59 కోట్ల అం చనా వ్యయంతో పాఠశాల భవనాలు, డీఆర్ డిపోలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఉపాధి పథకం ద్వారా రూ.29.67 కోట్లతో సీసీ రోడ్లు, డ్రయినేజీలు నిర్మించామన్నారు. ఏజెన్సీలోని కాఫీ ప్రాజెక్టు ద్వారా గిరిజన రైతులకు తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజనులకు కూలి పనులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, డీఎఫ్ఓ శాంతారాం, ఏఎస్పీ ఎ.బాబూజీ, ఐటీడీఏ ఏపీవో పి.వి.ఎస్.నాయుడు, గిరిజన సంక్షేమ ఈఈ ఎం.ఆర్జీ నాయుడు, పాడేరు ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, ఉపాధ్యక్షురాలు ఎం.బొజ్జమ్మ, పాడేరు సర్పంచ్ కిల్లు వెంకటరత్నం, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం పలు డ్వాక్రా సంఘాలకు కొత్త రుణాలు, పలు ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, సాంస్కృతిక ప్రదర్శనలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను ఐటీడీఏ పీవో, డీఎఫ్ఓ, ఏఎస్పీలు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన సీఏహెచ్ పాఠశాల హెచ్ఎం జి.వి.ప్రసాద్, వార్డెన్ మల్లికార్జునరావు, పీడీ సింహాచలం, ఇతర ఉపాధ్యాయులందర్ని ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ ప్రత్యేకంగా అభినందించి మెమెంటోలను అందజేశారు. -
19న ఇంటివద్దే ఉండండి
►సర్వే ద్వారా జిల్లా ‘డాటా బేస్’ తయారు ►ఈ వివరాల ప్రకారమే జిల్లాకు పథకాలు,బడ్జెట్ కేటాయింపు ►ఆ రోజు ఏ ఇల్లూ డోర్ లాక్ చేయొద్దు ► అందుబాటులో ఉన్నవారు సమగ్రమైన వివరాలివ్వాలి ►'సాక్షి’తో కలెక్టర్ చిరంజీవులు సాక్షిప్రతినిధి, నల్లగొండ :రాష్ర్ట ప్రభుత్వం చేపట్టనున్న ఒకరోజు సర్వేకు సబంధించి శుక్రవారం సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చిరంజీవులు పాల్గొన్నారు. ఆ వివరాలు ఆయన ‘సాక్షి’కి తెలియజేశారు. జిల్లాలోని 9.50 లక్షల కుటుంబాల పూర్తి వివరాలను సర్వే ద్వారా సేకరించనున్నామని, మొత్తంగా 35.50 లక్షల జనాభా కవర్ అవుతారని వివరించారు. దీనికి 25 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 38వేల మంది సిబ్బంది అవసరం అవుతున్నారని, వీరిని పర్యవేక్షించేందుకు సూపర్వైజర్లు, ఇతరత్రా అంతా కలిపి 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సర్వేలో పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 19న జరిపే సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో 15 రోజుల్లో ‘డాటా ఎంట్రీ’ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈ డాటా ఆధారంగానే జిల్లాలో అమలు చేయాల్సిన పథకాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఈ విధంగా చూస్తే సర్వేకు అత్యంత ప్రాధాన్యం ఉందని, జిల్లా ప్రజలంతా సర్వేలో పాల్గొని పూర్తి వివరాలు తెలియజేయాలని కలెక్టర్ చిరంజీవులు జిల్లా ప్రజలకు పిలుపు ఇచ్చారు. సీఎంతో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కొన్ని సూచనలు కూడా చేశారు. సర్వే ఫార్మాట్లో ఉన్న కొన్ని లోపాలను, ముఖ్యంగా బ్యాంకు అకౌట్‌నంబర్లు, భూముల వివరాలు వంటి వాటిని సరిచేయాలని సూచించారు. -
ఉపాధి కల్పనకు ప్రణాళికలు
ఖమ్మం జెడ్పీ సెంటర్: జిల్లాలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సాధ్యనమైనంత త్వరగా ప్రణాళికలు రూపొంది స్తామని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర సంయుక్త కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లు, డ్వామా పీడీలతో శనివా రం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈజీ ఎస్, జాతీయ జీవనోపాధి మిషన్ పథకాలను సమర్థంగా అమలు చేసే సీఎఫ్‌టీ (క్లస్టర్ ఫెసిలిటేషన్ బృందం) ప్రాజెక్టుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్లస్టర్ ఫెసిలిటేషన్ బృందం ఎంపిక చేసిన గ్రామాల్లో పేదరికాన్ని పూర్తిగా రూపుమాపేలా ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు కింద డ్వామా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు వివరించారు. గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులను క్షేత్రస్ధాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సమర్థంగా అమలయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపా రు. ఈ సంద ర్భంగా రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ మూడేళ్ల కాలపరిమితి గల సీఎఫ్‌టీ ప్రాజెక్టు సంబందించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు త్వరగా తయారు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్‌నారాయణ, డ్వామా పీడీ వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
మీరేంటో చెప్పే మీ బడ్జెట్..
ఇంటిని చూసి ఇల్లాలి గురించి, మన ఫ్రెండ్స్‌ను చూసి మన గురించి చెప్పేయొచ్చంటారు. అలాగే, డబ్బుకు సంబంధించి మన వైఖరి గురించి చెప్పేది కూడా ఒకటుంది. అదే .. బడ్జెట్‌పై మన అవగాహన. బడ్జెట్ విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కొక్క స్టయిల్ ఉంటుంది. కొందరు నిక్కచ్చిగా పాటించేవారు.. కొందరు అసలు బడ్జెటింగ్ అన్నదే పాటించనివారు.. ఇలా వివిధ రకాలుగా ఉంటారు. ఇలా రకరకాల బడ్జెట్ వైఖరుల గురించి వివరించేదే ఈ కథనం. పైసా పైసా లెక్క పెడతారు.. ఈ కోవకు చెందిన వారు ప్రతిరోజూ బడ్జెట్‌ను చూసుకుంటూ ఉంటారు. పరిమితులు విధించుకోవడంలోనూ.. ఒక్కో దానిపై ఎంతెంత ఖర్చు చేస్తున్నాం, ఎంత ఆదా చేస్తున్నాం లాంటి విషయాల్లోనూ పక్కాగా వ్యవహరిస్తుంటారు. అనుకోకుండా ఏవైనా ఖర్చులు ఒక్కసారిగా మీద పడినా.. తగిన విధంగా సర్దుబాట్లు చేసుకోగలరు. నెలవారీ బడ్జెట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ మించకుండా చూసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు బడ్జెట్ సూపర్స్టార్లు. నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించే సత్తా ఉన్నవారు. ఈ తరహా బడ్జెట్ వైఖరి ఉన్న వాడి జీవితంలో మిగతా అంశాల్లో కూడా క్రమశిక్షణతో ఉంటారన్నది తెలియజేస్తుంది. అయితే, బడ్జెట్‌పై మరీ ఎక్కువగా ఆలోచించి .. ఆలోచించి బుర్ర పాడుచేసుకోకుండా కాస్త పట్టు విడుపులు ఉండాలన్నది వీరు గ్రహించాలి. అప్పుడు.. ఆడుతూ, పాడుతూ లక్ష్యాలను సాధించవచ్చు. బడ్జెట్టా? అంటే ఏంటి? ఈ కేటగిరీకి చెందిన వారైతే .. బడ్జెట్ గురించి లెక్కలేసుకోవడం గురించి కనీసం ఆలోచన కూడా చేయరని అర్థం. ఏ నెలకానెల వచ్చిన జీతాన్ని... బిల్లులు, బకాయిలు కట్టేయడం. మళ్లీ అవసరం పడితే అప్పో సప్పో చేయడం.. క్రెడిట్ కార్డు పరిమితి కూడా దాటేసి .. చివరికి మళ్లీ జీతం వచ్చే దాకా ఎదురుచూడటం.. ఇలా ఈ రోజు గడిచింది చాల్లే అనుకునే టైపు వారు. కెరియర్‌పరంగా గానీ మరో విషయంలో గానీ పెద్దగా ప్రణాళికలు వీరికి ఉండకపోవచ్చు. జీవితం ఎటు తీసుకెడితే అటు వెళ్ళడానికి ప్రాధాన్యమిస్తారు. పోనీ ఏకాగ్రత ఉన్నా.. అది ఏదో ఒకదానిపైనే (మంచో, చెడో) ఉండటం వల్ల మిగతావాటిని కోల్పోతుంటారు. ఏదైతేనేం.. ఇలా డబ్బు విషయంలో క్రమశిక్షణ లేకపోతే.. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం ఏమాత్రం సాధ్యపడదు. కాబట్టి .. పైన పేర్కొన్న కారణాలన్నీ చూసిన తర్వాతైనా.. ఈ కోవకి చెందినవారు తక్షణమే ఒక బడ్జెట్ అంటూ రూపొందించుకుంటే.. బోలెడన్ని ఆర్థిక సమస్యలను క్రమక్రమంగానైనా తగ్గించుకోవచ్చు. తద్వారా క్రెడిట్ కార్డులపై ఆధారపడకుండా ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవచ్చు. ఏదో రకంగా చేసేయొచ్చు .. డబ్బు గురించి మరీ గీచి గీచి చూసుకుంటే.. పనులు జరగవని, చివరికి రూపాయి పెట్టాల్సిన చోట రెండు రూపాయలు పెట్టాల్సి రావొచ్చన్నది ఇలాంటి వారి ఆలోచన విధానంగా ఉంటుంది. అయితే, ప్రత్యేకంగా ఒక బడ్జెట్ అంటూ రూపొందించుకోకపోయినా.. ఇలాంటివారు ఖర్చులను ఎంతో కొంత పరిమితం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించినన్ని రోజులు ఏదో రకంగా మేనేజ్ చేసేయొచ్చని భావిస్తారు. ఏదో ఒక దాని ఖర్చులు తగ్గుతాయి.. అలా మిగిలే డబ్బును దాచడం మొదలుపెడితే లక్ష్యాలను తొందరగా సాధించేయొచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ, ఇదే ఫార్ములా పాటిస్తే.. లక్ష్యాల సాధన దిశగా ముందుకెళ్లడం కష్టమే. ఎందుకంటే, ఈ తరహా ఆలోచనా విధానం ఉన్న వాళ్లకు స్పష్టమైన ప్లాన్ అంటూ ఉండదు. లక్ష్యాలను నిర్దేశించుకుంటారు కానీ.. దానికంటూ పక్కా ప్రణాళిక ఉండదు. కనుక ఈ కోవకి చెందినవారు లక్ష్యాలు పెట్టుకోవడంతో పాటు వాటికంటూ ప్లానింగ్ కూడా వేసుకోవాలి. కచ్చితంగా పాటించాలి. రాసుకుంటాను..కానీ .. ఇలాంటి వారు మంచి ఉద్దేశంతోనే శ్రీకారం చుడతారు. ప్రతి నెలా బడ్జెట్ రాసుకుంటారు. ఖర్చులను ఎంతకు పరిమితం చేసుకోవాలి.. ఎంత పొదుపు చేయాలి వగైరాలన్నీ కూడా లెక్కలేసుకుంటారు. కానీ.. వాటిని అమల్లో పెట్టాల్సి వచ్చేసరికి మాత్రం కట్టుతప్పుతుంటారు. కంటికి నదురుగా కనిపించినవి ఎడాపెడా కొనేస్తారు. ఎంత ఖర్చు చే ద్దామనుకున్నాం.. ఎంత చేస్తున్నాం అన్నది లెక్కేసుకోలేక కష్టపడుతుంటారు. మధ్యమధ్యలో బడ్జెట్ గుర్తొచ్చి తెగ బాధపడిపోతుంటారు. ఈ తరహాకి చెందినవారు.. లక్ష్యాలను నిర్దేశించుకోవడాన్ని, వాటిని సాధించడానికి ప్రణాళికలు వేసుకోవడాన్ని ఇష్టపడతారు. ఇదంతా బాగానే ఉన్నా, బడ్జెట్ వేసుకోగానే దానిపై ఉత్సాహం పోతుంది. మళ్లీ పాత పద్ధతులకే మళ్లుతుంటారు. అయితే, అసలు బడ్జెట్ ఆలోచనే లేకపోవడం కన్నా ఏదో ఒకటి ప్లాన్ ఉండటం మంచిదే. ఒక ప్రక్రియంటూ ప్రారంభించడమూ హర్షించతగినదే. అయితే, పాటించడంలో కష్టాలను అధిగమించాలంటే.. వేసుకున్న ప్రణాళికను పక్కాగా అమలు చేయగలిగే మార్గాలను అన్వేషించేందుకు ప్రయత్నించాలి. బడ్జెట్ రాద్దామనుకుంటాను.. కానీ.. మీరు ఈ కోవకి చెందినవారైతే .. బడ్జెట్ ప్రాధాన్యం గురించి మీకు తెలుసు. అది మీ లక్ష్యాల సాధనకు ఉపయోగపడుతుందన్నదీ తెలుసు. కానీ, అమలు చేసేందుకు కావాల్సిన ఉత్సాహం కొరవడి ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు మొదలుపెట్టినా.. మళ్లీ మధ్యలో వదిలేస్తుంటారు. బడ్జెటింగ్ అంటే ఒక బ్రహ్మపదార్థంలా, గందరగోళపర్చేదిగా, ఏం చేసినా వర్కవుట్ కానిదిగా అనిపిస్తుంటుంది. మీరు ఈ కేటగిరీకి చెందిన వారైతే.. లక్ష్యాలను సాధించలేకపోవడానికి ఏదో ఒక సాకును వెతుక్కుంటున్నారన్న మాట. ఇది గుర్తించగలిగితే.. తక్షణం దిద్దుబాటు చర్యలు ప్రారంభించండి. అవసరమైతే స్నేహితుల సహాయమో లేదా ఆర్థిక నిపుణుల సలహాలో తీసుకోండి. భయాలను విడిచిపెట్టి, భవిష్యత్తుపై పట్టు సాధించండి. -
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత
పుంగనూరు: ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేలా తగు చర్యలు తీసుకుని సమస్య పరి ష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం పుంగనూరు షాదిమహాల్‌లో ముస్లిం మైనార్టీల నాయకుడు ఖాదర్‌బాషా ఏర్పా టు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖాదర్‌బాషా, అంజుమన్ అధ్యక్షుడు అమీర్జాన్తో పాటు ముస్లిం నేతలు ఎంపీ మిథున్‌రెడ్డిని శాలువకప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లు ఇబ్రహిం, అమ్ము, నయాజ్, ఆసిఫ్‌లను ఎంపీ మిథున్‌రెడ్డి సన్మానించారు. అనంతరం ముస్లిం నాయకుడు ఖాదర్‌బాషా 1500 మం దికి దుస్తులు, వంట సామాగ్రిని ఉచితంగా అందజేశారు. వాటిని మిథున్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మంచి నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, సమస్య పరిష్కారానికి ప్రణాళికలు చేపట్టామన్నారు. ప్రాంతాల వారీగా మంచినీటి బోర్లు, పైపులైన్లు వేస్తామన్నారు. ఎంపీ నిధులను పూర్తి స్థాయిలో మంచి నీటి సమస్య పరిష్కారానికే ఖర్చు చేసేందుకు నిర్ణయించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచినీటి సమస్యను తీర్చేందుకు అవసరమైతే ట్యాంకర్లను ఏర్పా టు చేసి నీటిని సరఫరా చేస్తామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతా ల్లో ఉన్న సమస్యలను గుర్తించి, ప్రణాళికాబద్దంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొంతసేపు ఉర్దూలో ప్రసంగించడంతో ముస్లింలు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. ముస్లిం మైనార్టీలను ఆదుకుంటాం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వారిని ఆదుకుంటామని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. తండ్రి ఆశయాల మేరకు జగన్మోహన్రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ చేపట్టలేని విధంగా ముస్లిం మైనార్టీల కోసం భాస్కర్‌రెడ్డి ట్రస్ట్ ద్వారా కోట్లాది రూపాయలు నిధులు విరాళంగా అందజేస్తున్నామని తెలిపారు. షాదిమహళ్లకు, మసీదుల నిర్మాణానికి తమ వంతు విరాళాలు అందజేస్తున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో ముస్లిం మైనార్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించి, వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నేత లు ఇనాయతుల్లా షరీఫ్, ఫకృద్ధిన్ షరీఫ్, ఎంఎస్.సలీం, ఖాదర్, కిజర్‌ఖాన్, ఖాన్, రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, మురుగప్ప, ఆవుల అమరేంద్ర, జయక్రిష్ణ, రాజేష్, కుమార్, సూరి తదితరులు పాల్గొన్నారు. -
వేములవాడకు ఎల్లంపల్లి నీళ్లు
మేడిపెల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వేములవాడ నియోజకవర్గంలోని భూములకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు తెలిపారు. గురువారం మేడిపెల్లి, కట్లకుంటలో ‘మన ఊరు-మన ప్రణాళిక’పై జరిగిన గ్రామసభల్లో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని 97 వేల ఎకరాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. చందుర్తి మండలం రుద్రంగి శివారులో ఉన్న చెరువును నింపి కథలాపూర్, మేడిపెల్లి మండలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మేడిపెల్లిలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జెడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, ఎంపీపీ పల్లి జమున, నియోజకవర్గ ఇన్చార్జి అంబయ్య, మండల పరిశీలకుడు శాంతికుమార్, తహశీల్దార్ వసంత, ఎంపీడీవో సుందరవరదరాజన్, ఎంఈవో జితేందర్‌రావు, సర్పంచులు బొంగోని రాజాగౌడ్, గౌరి భూమయ్య, రాములు, అంగడి ఆనందం, చెట్ట గంగరాజు, ఎంపీటీసీలు కుందారపు అన్నపూర్ణ, దాసరి శంకర్, సురకంటి విజయనారాయణరెడ్డి, భూమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవ్..
సాక్షి, విజయవాడ : ఇకపై విజయవాడలోనే ఎక్కువ రోజులుంటానని, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేయాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆదేశించారు. శనివారం గురునానక్‌నగర్‌లోని ఎన్ఏసీ కల్యాణమండపంలో జరిగిన టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు నెలాఖరుకు కొత్త రాజధాని ప్రకటిస్తారని చెప్పారు. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ తయారుచేస్తామని తెలిపారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల నేతలకు బాధ్యతలు అప్పగిస్తామని, ఎక్కడికక్కడ నిధులు ఎలా తెచ్చుకోవాలి.. ఆదాయం ఎలా పెంచుకోవాలి.. సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలుచేయాలి వంటి అంశాలకు అక్కడే ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించి.. నాయకులు, కార్యకర్తల పని తీరుపై మూడు నెలలకొకసారి నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు. అందరి జాతకాలు తీస్తానని, వాటి ఆధారంగానే కష్టపడి పనిచేసే వారికి ప్రమోషన్లు ఇస్తానని పేర్కొన్నారు. ‘ఐదేళ్ల వరకు ఎన్నికలు లేవని పడుకుంటే కుదరదు.. ఇప్పటివరకు నేను పరిగెత్తాను.. ఇకముందు మిమ్మల్ని పరిగెత్తించి నేను కూర్చుంటాను..’ అంటూ కార్యకర్తలను హెచ్చరించారు. బందరు పోర్టు అభివృద్ధి చేస్తాం.. వెస్ట్కోస్టులో గుజారాత్‌కు మాత్రమే తీరప్రాంతం ఉందని, అక్కడ పోర్టులు అభివృద్ధి చేశారని, ఈస్ట్కోస్టులో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే తీరప్రాంతం ఉందని, ఇక్కడ మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. కేంద్రం సహాయంతో ఆయిల్ రిఫైనరీ, ఆక్వా యూనిట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణాజిల్లాను ఇండస్ట్రియల్ కారిడార్‌గా మారుస్తామని చెప్పారు. కోస్తా కారిడార్‌ను అభివృద్ధి చేసి స్పీడ్ ట్రైన్లు, బులెట్ రైళ్లు రప్పిస్తామన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉండడం విచారకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవ్.. రాష్ట్ర విభజన జరగడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయని, డబ్బులు లేవని చంద్రబాబు చెప్పారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల్ని ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు మనం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై తాను విడుదల చే.సే శ్వేతపత్రాలను చూసి కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు. పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలను తాను ఎప్పుడూ విస్మరించనని, అధికారుల కంటే ముందు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని తొలుత ఈ సమావేశం నిర్వహించానని తెలిపారు. కార్యకర్తల కోసం రూ.20 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని, దాన్ని మరింత పెంచుతామని చెప్పారు. సమావేశానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా, మంత్రి కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీధర్, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావ్, వల్లభనేని వంశీమోహన్, బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో ముందుకు వెళ్దాం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. గ్రామ స్థాయిలో నెలకొన్న సమస్యల్ని సూక్ష్మ పరిశీలనతో గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పించింది. గ్రామం, పట్టణం, మండలం, జిల్లా స్థాయిల్లో ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేయాలి.’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రణాళికల రూపకల్పనపై గురువారం కలెక్టరేట్లో జరిగిన సమావేశానికి మంత్రి మహేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రణాళికలను ఏ విధంగా తయారు చేయాలి.. ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి అభిప్రాయాలను సేకరించారు. ప్రజాప్రతినిధుల సూచనలు వారి మాటల్లోనే.. పాఠశాల ల్లో తాగునీటి వసతి మెరుగుపర్చాలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన అంతంతమాత్రంగానే ఉంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ.. తాగునీటి వసతి మాత్రం కల్పించలేదు. దీంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తాగాల్సివస్తోంది. టాయిలెట్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. తాజాగా రూపొందించే ప్రణాళికలో ఆయా అంశాలకు ప్రాధాన్యం కల్పిస్తే బాగుంటుంది.- జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం గ్రామాల్లో మెజార్టీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాజా ప్రణాళికలో వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. సాగు పనులు ముమ్మరమైనప్పుడు, దిగుబడులు వచ్చే సమయంలో కూలీలు లేక రైతులు నష్టపోతున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టే పనుల్లో చాలావరకు అక్కరకురాకుండా పోతున్నాయి. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వ్యవసాయ రంగం కొంతైనా మెరుగుపడుతుంది. - ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే చెరువుల పరిరక్షణ కీలకం ప్రధాన తాగునీటి వనరులైన చెరువులు జిల్లాలో చాలాచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్నింట్లో కబ్జాల పర్వం కొనసాగుతోంది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా చేపట్టే ప్రణాళికల్లో చెరువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వాటిని సంరక్షించేందుకు ప్రహరీలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే -
కిరణ్ సర్కార్ పధకాలు,ప్రాజెక్ట్‌ల పై వేటు
-
మోడల్ పట్టణంగా అనకాపల్లి
రూ.65 కోట్లతో శాశ్వత మంచినీటి ప్రణాళిక ఏలేరు కాలువ నుంచి నీటి మళ్లింపు ఆధునిక బస్షెల్టర్లు, సెంట్రల్ లైటింగ్ జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ అనకాపల్లిరూరల్: అనకాపల్లిని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ వెల్లడించారు. అనకాపల్లి జోనల్ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణ వాసుల మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.65 కోట్లతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అలాగే రూ.70 లక్షలతో పాతపైపులైన్ల స్థానంలో కొత్తవి వేస్తామని చెప్పారు. పూడిమడక రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రూ.18.5 లక్షలతో నూకాంబిక గుడి, వేల్పులవీధి, చిరంజీవి బస్టాప్, కూరగాయల మార్కెట్ వద్ద మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే రూ.3.5 లక్షలతో ఆధునిక బస్షెల్టర్లు నిర్మిస్తామని చెప్పారు. మున్సిపల్ మైదానం వద్ద ఇద్దరు నైట్వాచ్మన్లను, లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నీటి వృథా అరికట్టేందుకు రూ.2.65 లక్షలతో కుళాయిలకు హెడ్స్ బిగిస్తామని చెప్పారు. కొత్తగా 20 చోట్ల బోరుబావులు తవ్విస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 400 బీపీఎల్ కుళాయి కనెక్షన్లు తక్షణం మంజూరు చేయనున్నట్లు చెప్పారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం పట్టణాన్ని వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం కనుక్కుంటామని చెప్పారు. శారదనగర్‌లో ప్రస్తుతం ఉన్న చెత్తను పూర్తిగా తొలగిస్తామని తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సత్యనారాయణరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ పి.వి.జగన్నాథరావు పాల్గొన్నారు. -
రానున్న మూడు నెలలు కీలకం...
ఒకపక్క పండుగలు,మరోపక్క ఉమ్మడి రాజధాని భద్రత అప్రమత్తమైన జంట పోలీసు కమిషనర్లు సాక్షి, సిటీబ్యూరో: రానున్న మూడు నెలలు పోలీసులకు సవాల్‌గా మారనున్నాయి. ఒకపక్క వరుసగా వస్తున్న ఇరువర్గాల పండుగలు.., మరోపక్క ఉమ్మడి రాజధాని భద్రతా చర్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్ రానున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల జరిగిన రాజేంద్రనగర్, మౌలాలి ఘటనలను దృష్టిలో పెట్టుకున్న వీరు మరింత జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే వీరు అదనపు పోలీసు కమిషనర్లు, సంయుక్త కమిషనర్లు, డీసీపీల నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో వేర్వేరుగా సమీ క్ష సమావేశాలు నిర్వహించారు. నగరంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలు ప్రారంభం కావడంతో పోలీసులపై మరింత పని భారం పెరిగింది. దీంతో పాటు మూడు నెలల్లో రంజాన్, బోనాలు, బక్రీద్, వినాయక ఉత్సవాలు రానున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. రెండు కమిషనరేట్లలో సిబ్బంది సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. వారితోనే ప్రణాళికాబద్ధంగా బందోబస్తు నిర్వహిస్తే మంచి ఫలి తాలు వస్తాయని భావిస్తున్నారు. ఇటీవల మౌలాలిలో జరిగిన మత ఘర్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మ ల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రాజశేఖరరెడ్డిని కమిషనర్ ఆనంద్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘ టనలు పునరావృత్తం కాకుండా ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మతఘర్షణలు జ రిగితే మొదటి వేటుపడేది సంబంధిత స్టేషన్ ఇన్స్పెకర్పైనే అని ‘మల్కాజిగిరి’ ఘటన ద్వారా అందరికీ తె లిసింది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లోని ఇన్స్పెక్టర్లు ఉదయం 8 గంటలకే ఠాణాకు వచ్చి కూర్చుంటున్నారు. బస్తీలు, కాలనీలలో జరిగే ప్రతి అం శాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు. మైత్రీ కమిటీలపై చూపు.... ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటే ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా సులభంగా పరిష్కరించవచ్చనే ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులు మైత్రీ, శాంతి కమిటీలపై దృష్టి పెట్టారు. ప్రతీ ఠాణాలో ఉన్న ఈ కమిటీలున్నా.. కొన్ని చోట్ల పని చేయడంలేదు. కమిటీలను పునరుద్ధరించి రాబోయే రోజుల్లో ఏదైనా సమస్యలు వస్తే వాటి సహకారంతోనే పరిష్కరించాలని పోలీసు కమిషనర్లు భావిస్తున్నారు. మైత్రీ కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే అన్ని ఠాణాల ఇన్స్పెక్టర్లను సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆదేశించారు. దీంతో సైబరాబాద్ పరిధిలో బుధవారం నుంచి మైత్రీ,శాంతి కమిటీలతో పోలీసులు సమావేశాలు ప్రారంభించారు. వారం రోజుల్లో సమావేశాలు పూర్తి చేసి భద్రతపై దృష్టి పెట్టనున్నారు. ఇక నగరంలో మాత్రం మైత్రీ సంఘాల సమావేశాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఒకట్రెండు రోజుల్లో ఇక్కడ కూడా మొదలు కానున్నాయి. ముఖ్యంగా పాతబస్తీ, దానికి ఆనుకున్న ప్రాంతాలపై పోలీసులు మరింత దృష్టి కేంద్రీకరించారు. సైబరాబాద్లోనైతే మూడు నెలల పాటు ఏకంగా 144 సెక్షన్‌ను విధించారు. సెలవులు కరవే... వరుస పండుగల నేపథ్యంలో పోలీసు సిబ్బందికి రానున్న మూడు నెలల్లో ఎలాంటి సెలవులు లభించే అవకాశంలే దు. సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే... ఇక ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు ఠాణాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది సంఖ్యను పెంచుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురంటున్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల కోసం కేంద్రం నుంచి అదనపు బలగాలు ఇంకా రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న బలగాలతోనే బందోబస్తును నెట్టుకొస్తుండటంతో సివిల్ పోలీసులపై అధిక పనిభారం పడింది. -
పిసినారి కోటీశ్వరులు..
జల్సాలకు కోట్లు కోట్లు ఖర్చు చేసే వారితో పాటు కోట్లు గడించినా.. పైసా పైసా లెక్క చూసుకునే కోటీశ్వరులూ కొంత మంది ఉన్నారు. డబ్బు విలువ తెలియడం చేత ఆచి తూచి ఖర్చు చేసినా... పొదుపు, ఆదాను మరీ పీక్లెవెల్స్కి తీసుకెళ్లి పిసినారులు అనే బిరుదులు కూడా తెచ్చుకున్నారు. అలాంటి కొందరు ఆల్‌టైమ్ పిసినారి కోటీశ్వరులు, డబ్బును ఆదా చేసే విషయంలో వారి విచిత్ర అలవాట్లు చూడండి.. హెటీ గ్రీన్ ప్రపంచంలోనే అత్యంత పిసినారిగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఘనత హెటీ గ్రీన్‌ది. అత్యద్భుతమైన వ్యాపార దక్షతతో విచ్ ఆఫ్ వాల్స్ట్రీట్గా పేరొందిన ఆమె తన జమానాలో పెద్ద కోటీశ్వరురాలు. ఇక, ఆమె పీనాసితనం విషయానికొస్తే.. అర్ధణా కూడా విలువ చేయని స్టాంపు కోసం ఒక రాత్రంతా ఆమె తన వాహనంలో వెతుక్కుంటూ గడిపారు. ఒక డ్రెస్ కొంటే అది చిరిగిపోయేదాకా ప్రతి రోజూ దాన్నే వాడేవారు. ఉతికేటప్పుడు కూడా ఎక్కడెక్కడ మురికిగా ఉందో ఆ భాగాన్ని మాత్రమే ఉతుక్కుని సబ్బును ఆదా చేసేవారు. వైద్యం ఖర్చులను ఆదా చేసేందుకు కొడుకు కాలు విరిగినా సొంత వైద్యమే చేశారు. చివరికి ఆ కాలు తీసేయాల్సి వచ్చింది. మైఖేల్ బ్లూమ్‌బర్గ్ ఈయన సంపద 27 బిలియన్ డాలర్ల పైగానే ఉం టుంది. అయినా కూడా పదేళ్ల క్రితం నుంచి రెండే జతల షూలను వాడుతున్నారు. వాటిపై లేబుల్స్ చెరిగిపోయి.. రంగు వెలిసిపోయినా వాటిని విడిచిపెట్టలేదు. ఇక కాఫీలాంటివి తాగాల్సి వస్తే.. వీలైనంత తక్కువ పరిమాణం కొనుక్కుంటారట. డేవిడ్ షెరిటన్ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌లో తొలినాళ్లలో ఇన్వెస్ట్ చేసిన కోటీశ్వరుడు షెరిటన్. హోటల్లో భోంచేసినప్పుడు.. అందులో కొంత భాగం మిగిలిపోతే వదిలేసి వచ్చేయడు షెరిటన్. దాన్ని ప్యాక్ చేయించుకుని ఇంటికి పట్టుకెళ్లి, మర్నాడు తింటాడు. పదిహేనేళ్లుగా బార్బర్ ఖర్చులు లేకుండా తన జుత్తును తనే కట్ చేసుకుంటున్నాడు. -
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ
బేసిక్స్.. బీమా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంక్షిప్త రూపమే యులిప్స్. మ్యూచవల్ ఫండ్స్ కేవలం పెట్టుబడి సాధనాలు కాగా.. యులిప్స్ పథకాలు ఇటు బీమా రక్షణతో పాటు అటు పెట్టుబడి ప్రయోజనాలు కూడా కల్పిస్తాయి. పెట్టుబడులపైనా, మధ్యకాలిక రాబడులపైనా దృష్టి ఉన్నవారికి ఫండ్స్ అనువైనవి. కాగా దీర్ఘకాలికంగా పెట్టుబడి ప్రయోజనాలతో పాటు బీమా రక్షణ కూడా ఒకే సాధనం ద్వారా కావాలనుకునే వారికి యులిప్స్ అనువైనవి. మార్కెట్లో వివిధ అవసరాలకు అనుగుణమైన అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. రిటైర్మెంట్ కోసం, సంపద పెంచుకునేందుకు, పిల్లల చదువు అవసరాలు.. మొదలైన వాటన్నిం టికీ వివిధ రకాల పాలసీలు ఉన్నాయి. ఈ పాలసీలకు కట్టే ప్రీమియంలలో కొంత భాగాన్ని బీమా కంపెనీ స్టాక్ మార్కెట్లు తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఫలితంగా ఆయా సాధనాల్లో రిస్కులను బట్టి మనకి వచ్చే రాబడులు ఆధారపడి ఉంటాయి. యులిప్ పథకాన్ని ఎంచుకునే ముందు.. మీ రిస్కు సామర్థ్యం ఎంత ఉందనేది మీకు మీరు అంచనా వేసుకోవాలి. వివిధ పథకాల్లో చార్జీలు ఏ మేర ఉంటున్నాయో పోల్చి చూసుకోవాలి. మీరు కట్టే ప్రీమియంలో ఎంత భాగం బీమా కవరేజికి పోతోంది.. ఎంత మొత్తం ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్మెంట్కి వెళుతోంది తెలుసుకోవాలి. పన్నులపరంగా ప్రయోజనాలేమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. -
టీడీపీ అభ్యర్థుల మధ్య అగాధం
ఎవరి దారి వారిదే... ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తలోదారి పైకి కలిసి ప్రచారం... లోపల ఎవరి లెక్కలు వారివే కేశినేని నోటి దురుసు కొనకళ్ల పొదుపు చర్యలు ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా.. టీడీపీలో నేతల మధ్య విభేదాలు తొలగకపోగా ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రచారంలో కలిసి పాల్గొంటున్నా.. తెరవెనుక వెన్నుపోట్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వారి విభేదాలతో మధ్యలో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య ఏర్పడ్డ అగాధం ఇప్పట్లో సమసిపోదని పార్టీ పరిశీలకులే పెదవి విరుస్తున్నారు. సాక్షి, విజయవాడ : విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని)కి నోటి దురుసు ఎక్కువని, దీనికితోడు అందరినీ చులకన చేసి మాట్లాడతాడని పార్టీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలో తన ఆధిపత్యం సాధించాలని నాని ప్రయత్నిస్తుంటే దానికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమాత్రం అంగీకరించడం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని ఉమాకు, కేశినేని నానికి మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరింది. ఈ ఇద్దరు నేతల మధ్య పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. విజయవాడ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్‌కు, కేశినేని నానికి మధ్య ఎప్పుడో ఏర్పడ్డ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమాకు, కేశినేని నానికి మధ్య అనేక విభేదాలు ఉన్నాయి. బొండా ఉమా, దేవినేని ఉమాలు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని నమ్ముతున్న కేశినేని నాని సెంట్రల్లో సొంత కుంపటి కూడా పెట్టుకోవడం ఇందులో భాగమేనని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను డమ్మీలను చేసి తాను పెత్తనం చేయాలని కేశినేని చూస్తున్నారనేది ఆయా స్థానాల అభ్యర్థుల అభిప్రాయంగా కనబడుతోంది. జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్యతోనూ నానికి పొసగడం లేదు. నానితో కలిసి ఉన్నట్లే నటిస్తున్నా.. ఎన్నికల నాటికి శ్రీరాం తాతయ్య దేవినేని ఉమా వర్గంతో కలిసి కేశినేనికి దెబ్బకొడతారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తమపై పెత్తనం చేయాలని చూస్తున్న కేశినేని నానిని ఎన్నికల్లో ఓడించి, తాము గెలిచి తమ సత్తా చూపించాలనే భావనలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది. కొనకళ్ల కొంప ఎమ్మెల్యే అభ్యర్థులే ముంచుతారా... ఈసారి ఎన్నికల్లో టీడీపీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొనకళ్ల నారాయణ డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లు సమయంలో తనకు గుండెనొప్పి రావడమే తనను విజయపథంలో నడిపిస్తుందనే గట్టి నమ్మకంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నిక ల స్థాయిలో కూడా ఖర్చు పెట్టకుండా పొదుపు చర్యలు పాటిస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నారు. దీంతో ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రచారం తామే చేసుకుంటున్నారు తప్ప కొనకళ్ల గురించి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు కొల్లు రవీంద్ర (బందరు), కాగిత వెంకట్రావు (పెడన), వర్ల రామయ్య (పామర్రు) ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా వారికి సహాయం అందించేందుకు కొనకళ్ల సిద్ధంగా లేరని సమాచారం. కాంగ్రెస్ నుంచి వచ్చిన మండలి బుద్ధప్రసాద్, కొనకళ్ల నారాయణ మధ్య ఇంకా సఖ్యత ఏర్పడలేదు. వంశీమోహన్ (గన్నవరం), బోడే ప్రసాద్ (పెనమలూరు), రావి వెంకటేశ్వరరావు (గుడివాడ) కొనకళ్లను పట్టించుకోకుండా తమ ప్రచారం తాము చేసుకుంటున్నారు. గతంలో కాపు, గౌడ సామాజిక వర్గాలు కొనకళ్లకు అండగా ఉన్నాయని, ఈసారి ఆయా వర్గాలు వైఎస్సార్సీపీకి అండగా మారడంతో కొనకళ్ల వల్ల తమకు ఉపయోగం లేదనే భావనలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
వేస్తారు గాలం..జర భద్రం
రేపటి తో ముగియనున్న ప్రచారం తాయిలాల పంపిణీకి పక్కా ఏర్పాట్లు రంగంలోకి మహిళా కార్యకర్తలు బొట్టు పెట్టి బహుమతులు అందజేత నాయకులకు నజరానాలు బస్తీల్లో పారనున్న మద్యం సాక్షి, సిటీబ్యూరో : ఇప్పటివరకూ హోరాహోరీ ప్రచార పోరులో ఉన్న అభ్యర్థులు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలపైనా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెర పడనుంది. ఇక మిగిలింది రెండు రోజులే. ఉన్న ఈ కొద్ది సమయాన్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకుంటూనే.. ఓటర్లకు ఎర వేసే కార్యక్రమాలనూ వేగవంతం చేశారు. ప్రచారం తర్వాత పోలింగ్‌కు కేవలం ఒక్కరోజు సమయం మాత్రమే ఉండటంతో ఆ లోగానే ఓటర్లను బుట్టలో వేసేందుకు చేయాల్సిన కార్యక్రమాలు, జరగాల్సిన ‘పంపిణీ’లు, తదితర కార్యక్రమాలు సజావుగా పూర్తయ్యేందుకు అవసరమైన ప్రణాళికల్లో మునిగారు. ఇప్పటికే ఈ తంతు ఒకటి రెండు దశల్లో పూర్తయినప్పటికీ.. అంతిమ దశలో ఎలాంటి ఆటంకాల్లేకుండా తాయిలాల పంపిణీకి పకడ్బందీ ప్రణాళికలు వేశారు. బస్తీసంఘాలు, స్వయంసహాయక సంఘాలు, కులసంఘాలు, ఆటో యూనియన్లు, వివిధ జేఏసీలు, కాలనీ సంఘాలు, క్లబ్ సభ్యులు, వైరి పార్టీల్లోని అసంతృప్తి నేతలను లక్ష్యంగా చేసుకొని ఈ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. వారిని ప్రలోభ పెట్టేందుకు తమ వారిని ఇప్పటికే పురమాయించారు. నజరానాలతో ఎర కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒకటి, రెండు దఫాలుగా నగదు పంపిణీ, బహుమతుల పంపిణీ వంటివి జరిగిపోయాయి. అయినప్పటికీ, మిగిలిన సమయం అత్యంత కీలకం కావడంతో ప్రత్యేక శ్రద్ధతో తమ పనులు కానిస్తున్నారు. మద్యాన్ని, నగదును, బహుమతులను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి మహిళలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే కుక్కర్లను సరఫరా చేశారు. పోలింగ్‌కు ముందురోజు మరికొన్ని బహుమతులు అందజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో స్వయంసహాయక మహిళా బృందాలకు నేరుగా నగదు పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రివేళల్లో నిఘా బృందాలు ఎక్కువగా ఉంటాయ ని భావించి పట్టపగలే ఈ పంపిణీ తతంగాన్ని పూర్తిచేస్తున్నా రు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రూ. రెండు వేలు, సంఘం అధ్యక్షురాలికి రూ. ఐదు వేలు వంతున పంపిణీ జరుగుతున్నట్లు సమాచారం. బస్తీలు, మురికివాడల ప్రాంతాల్లో మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారు. ఇదీ లెక్క... మహిళా ఓటర్లను పట్టుకుంటే చాలు ఓట్ల పంట పండినట్టే అన్నది అభ్యర్థుల లెక్క. ఈ నేపథ్యంలో వీరిని ఆకట్టుకుంటే చాలన్నట్టుంది వారి తీరు. ఉదాహరణకు కంటోన్మెంట్లో సుమారు 2.42 లక్షల ఓటర్లలో మహిళా ఓటర్లు లక్షా పదివేల వరకు ఉన్నారు. వీరిలో స్వయంసహాయక సంఘాల సభ్యులదే అతిపెద్ద గ్రూపు. సుమారు 1400 వరకు ఉన్న గ్రూపుల్లో సుమారు 15వేల మంది సభ్యులున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్ధులు వీరి ఓట్ల కోసం గాలం వేస్తున్నారు. అమ్మా.. తల్లి.. అక్కా.. చెల్లీ.. అంటూ సంబోధిస్తూ అభ్యర్ధులు ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రచార సమయంలో మహిళలు అభ్యర్ధులను సమీపించి సమస్యలపై నిలదీసినా.. వారి సమస్యలు విన్నవించినా ఓపికగా వింటున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో నివసించే మహిళలకు తాయిలాలతో పాటు అనేక వరాలను ఉదారంగా ఇస్తున్నారు. గెలిచిన వెంటనే మీరు అడిగిన పని చేసిపెడుతామంటూ హామీలు, వాగ్దానాలు గుప్పిస్తున్నారు. సంఘాలకు ప్యాకేజీలు అభ్యర్థుల పంపిణీ జాబితాలో సంఘాలకే ప్రాధాన్యం. కులసంఘాలు, కాలనీ సంఘాలతో సంప్రదింపులు జరుపుతూ ఓటుకు వేయి నుంచి రెండు వేల వరకు ఆయా సంఘాల నేతలకు అందజేస్తున్నారు. వివిధ సంఘాలతోపాటు కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ నేతలనూ ప్రలోభపెడుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన నాయకులను తనవైపునకు తిప్పుకున్న ఓ అభ్యర్థి ఆయా స్థాయిల్లోని వివిధ రాజకీయ నాయకులకు భారీ నజరానాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాకేజీలుగా నగదు మొత్తాలు పంపిణీ అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. డివిజన్ల అధ్యక్షులకు రూ. 10 లక్షలు వంతున అందజేస్తున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన పార్టీ అభ్యర్థి స్వయంసహాయక సంఘాలు, బస్తీసంఘాలను టోకున కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఒక దఫా పంపిణీ జరిగిపోగా, మిగతా రెండు విడ తల్ని మిగిలిన రెండు రోజుల్లో పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్లకు రూ. వెయ్యి వంతున ఇంటింటికీ పంపిణీ చేసేందుకు మరికొందరు వ్యూహరచన చేసినట్లు సమాచారం. సెంటిమెంటుతో ఆయింట్మెంట్ మరికొందరు అభ్యర్థులు ప్రచారంలో సెంటిమెంటును ప్రయోగిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నా రు. ఉదయం, సాయంత్రం వేళల్లో కాలనీలు, బస్తీల్లో కలియ దిరుగుతూ ఓటర్లను నేరుగా కలుసుకొని హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇదే తరుణంలో కొందరు పాత బంధుత్వాన్ని గుర్తు చేస్తుండగా.. మరికొందరు కుల, మతాల్ని ప్రస్తావిస్తూ ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకొం దరు ‘నేను స్థానికుడిని, మీ వాడినే... కే కేస్తే క్షణాల్లో మీముం దు వాలిపోతా..., ఏ సమస్య వచ్చినా మీకోసం 24 గంట లూ మా తలుపులు తెరిచే ఉంటాయి. మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి’ అంటూ ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇదే తరుణంలో తమ సతీమణులను కూడా రంగంలోకి దించి మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు రకరకాల పాట్లు పడుతున్నారు. వీరంతా ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలను, బంధుగణాన్ని వెంటేసుకొని ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరీ ఓట్లు అడుగుతున్నారు. బస్తీలు, కాలనీల్లో మహిళలు చేస్తున్న ప్రచారం... పేరంటానికి ఆహ్వానిస్తున్నట్లుగా హడావుడిగా సాగుతోంది. బొట్టు పెడుతున్న క్రమంలోనే కుక్కర్లు, చీరలు, కుంకుమ భరిణలు, బొట్టు బిళ్లలు తదితర కానుకలు, డబ్బు ఎరగా వేస్తున్నారు. మీ ఓట్లు తప్పకుండా మా వారికే వేయాలంటూ ఓటర్లును ప్రలోభపెడుతున్నారు. అయితే... ఈ వ్యవహారం ఎవరి కంటా పడకుండా గుట్టుగా నిర్వహిస్తున్నారు. తాయిలాలు ఇచ్చిన వారికి... తీసుకొన్న వారికి తప్ప తమ వెంట ఉన్న కార్యకర్తలకు కూడా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకొంటుండటం గమనార్హం. ఇలా వివిధ మార్గాల ద్వారా ఓటర్లను బుట్టలో వేసుకొని ఓట్లు కొల్లగొట్టడంపైనే అభ్యర్థులంతా దృష్టి సారించారు. డబ్బులు పంపిణీ చేస్తూ పట్టుబడ్డ టీడీపీ నాయకులు బోడుప్పల్, న్యూస్‌లైన్: ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ టీడీపీ నాయకులు మేడిపల్లి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలోని ఓ అపార్టుమెంట్లో టీడీపీ నాయకులు కోటిరెడ్డి, అశోక్, సుధాకర్ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి రూ. 22, 500 స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ మహేష్‌గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రలోభాలపై టీడీపీ ఫిర్యాదు ఎస్ఆర్నగర్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ నాయకులు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అల్లాఉద్దీన్ కోఠిలో హ్యాండ్‌బ్యాగులు పంపిణీ చేస్తున్నారని సనత్‌నగర్ టీడీపీ అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ శనివారం పోలీసులకు ఫిర్యా దు చేశారు. బ్యాగులపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో పాటు స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డి ఫొటో ఉన్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ముగిసిన తొలి ఘట్టం
నామినేషన్ల పర్వం పూర్తి మొత్తం అభ్యర్థులు 333 మూడు లోక్‌సభ స్థానాలకు 52 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు 281 స్వతంత్రులుగా ఆసక్తి కనబరిచిన యువకులు 21న పరిశీలన 23న ఉపసంహరణ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ పర్వంలో మొత్తం 333 మంది నామినేషన్లు సమర్పించారు. జిల్లాలోని 3 లోక్‌సభ స్థానాలకు 52 మం ది, 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు 281 మం ది నామినేషన్లు దాఖలు చేశారు. 21న పరిశీలన, 23న ఉపసంహరణ ఉం టుంది. అనంతరం బరిలో ఉన్నది ఎవరన్నది నిర్ధారణ అవుతుంది. మే 7న పోలింగ్,16న ఓట్ల లెక్కింపు ఉం టుంది. కాగా అప్పుడే రెబెల్స్‌ను బుజ్జగించడంతోపాటు ప్రచారానికి ఆ యా పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుం టున్నారు. ఇంకా పది హేను రోజులే గడువున్నందున వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రత్యేక వాహనాల్లో వెళ్లి ఓటర్లను నేరుగా కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఆయా అసెం బ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రచారం పూర్తి చేశారు. రెండో విడతగా ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలిసే ందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వీకరించని అనితా నామినేషన్ విశాఖ లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు అనితా సకురు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌కు వచ్చారు. అప్పటికే సమయం దగ్గరపడడం, అలాగే బి-ఫారం లేకపోవడంతో ఆమె నామినేషన్‌ను అధికారులు స్వీకరించలేదు. ఆమె ఇప్పటికే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేశారు. ఆ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గంటా శ్రీనివాసరావు బి-ఫారం సమర్పించారు. ఈమేరకు అనితా సకురు స్వతంత్ర అభ్యర్థిగా మిగిలిపోయారు. ఇదిలా ఉంటే ఆమెను పోటీ నుంచి తప్పించేందుకు అప్పుడే పార్టీ పెద్దలు చర్యలు చేపట్టారు. ఆమెను బుజ్జగించినట్లు సమాచారం. లోక్‌సభకు భారీగా స్వతంత్రులు జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో విశాఖ ఎంపీ స్థానానికి స్వతంత్రులు పోటీ పడి నామినేషన్లు వేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా16 మంది స్వతంత్రులు పోటీకి ఉత్సాహం కనబరిచా రు. యువకులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీగా నామినేషన్ కు అభ్యర్థులు రూ.25 వేలు దరావతు చెల్లించాల్సి ఉంది. అంత మొత్తం కట్టి మరీ భారీగా యువకులు, మహిళలు స్వతంత్రులుగా పోటీకి సన్నద్ధం కావడం సర్వత్రా ఆశ్చర్యం గొలుపుతోంది. ఈ నెల 23న ఉపసంహరణ అనంతరం ఎంతమంది ఉంటారన్నది నిర్ధారణ అవుతుంది. -
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక
సాక్షి, బళ్లారి : జిల్లాలోని అన్ని గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి పరమేశ్వర్ నాయక్ పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం జిల్లాకు విచ్చేసిన ఆయన నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. బళ్లారికి మంచినీటిని అందించే అల్లీపురం రిజర్వాయర్‌లో నీటి సేకరణ తక్కువగా ఉన్నందున భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారికి సూచనలు ఇచ్చామన్నారు. కుడితిని, మించేరి గ్రామాల్లోని చెరువు పనులు పూర్తి చేసి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మంచినీటి సమస్యల పరిష్కారానికి నిధుల కొరత లేదని, గ్రామ పంచాయతీల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నీటి సమస్యపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆర్టికల్-371(జే) త్వరలో అమల్లోకి వస్తుందని,దీంతో జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కరువు ప్రాంతాలుగా ప్రకటించిన జిల్లాలోని ఆరు తాలూకాల్లో కరువు నివారణ పనులు చేపట్టి కూలీలు వలసలు నివారించి జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు. అల్లీపురం రిజర్వాయర్ స్థితిగతులపై మంత్రికి ఎస్‌యూసీఐ వినతి: ఇదిలా వేసవిలో బళ్లారిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్‌యూసీఐ ప్రముఖులు సోమశేఖర్, మంజుల, దేవదాసు, ప్రమోద్ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కుదించుకుపోయిన అల్లీపురం రిజర్వాయర్ రక్షణ గోడ పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో 7.5 మీటర్లకుగాను 4.5 మీటర్లు మాత్రమే నీటిని నిల్వ చేశారని, దీంతో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని మంత్రికి వివరించారు. రిజర్వాయర్ పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరారు. జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి మాట్లాడుతూ బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా మంచినీటి సమస్య రాకుండా చూస్తానని, ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అల్లీపురం రిజర్వాయర్ పరిశీలన : ఎనిమిది నెలల క్రితం గట్టు కుప్పకూలిన అల్లీపురం రిజర్వాయర్‌ను జిల్లా ఇన్చార్జ మంత్రి పరమేశ్వరనాయక్ గురువారం మొదటిసారిగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదిత్య అమ్లాన్ బిస్వాస్, సంబంధిత అధికారులతో కలిసి రిజర్వాయర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గట్టుకు పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టి మంచినీటి సమస్య రాకుండా చూస్తామన్నారు. నీటి మట్టం 2.5 మీటర్లు తక్కువ ఉన్నందున డిసెంబర్ 26 వరకు రిజర్వాయర్‌లోకి నీరు పంప్ చేసి ఏప్రిల్ నుంచి నీరు సరఫరా చేస్తామన్నారు. అంతవరకు మోకా కాలువ ద్వారా నగరానికి మంచినీరు అందిస్తామన్నారు. నగర కమిషనర్ చిక్కణ్ణ, కాంగ్రెస్ నాయకులు రాంప్రసాద్, కార్పొరేటర్ వెంకట రమణ పాల్గొన్నారు. -
నగర రూపు రేఖల్ని మార్చనున్న టిఒడి-2014ప్లాన్