తక్కువ ఖర్చుతో ఆ సర్వీసులు- గో ఎయిర్ | Go Air plans overseas journey in October | Sakshi
Sakshi News home page

తక్కువ ఖర్చుతో ఆ సర్వీసులు- గో ఎయిర్

Published Mon, Aug 7 2017 3:27 PM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

తక్కువ ఖర్చుతో ఆ సర్వీసులు- గో ఎయిర్

తక్కువ ఖర్చుతో ఆ సర్వీసులు- గో ఎయిర్

కోల్‌కత్తా: ప్రయివేటు విమానయాన సంస్థ గో  ఎయిర్‌ విదేశాలు వెళ్లాలనుకునే విమాన ప్రయణికులకు ఊరటనందిస్తోంది.  త్వరలోనే  తక్కువ ఖర్చుతో నడిచే  విదేశీ విమాన సర్వీసులు ప్రారంభించనున్నామని ప్రకటించింది.

తమ విదేశీ కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభిస్తామని గో ఎయిర్‌  మేనేజింగ్ డైరెక్టర్ హెహ్ వాడియా వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి తమ  విదేశీ గో ఎయిర్‌ విమానాలను ప్రారింభిచనున్నామని  ఆయన అన్నారు.  ప్రారంభంలో  ఆసియా రీజన్‌ తమ సేవలను ప్రారంభిస్తామన్నారు.  ప్రస్తుతం ఉన్న 24-బలమైన విమానాలకు తోడు నియో ఎ320  143 ఎయిర్‌ బస్‌లకు  ఆర్డర్‌చేసినట్టు  పేర్కొన్నారు. వీటిలో అయిదింటిని ఇప్పటికే తమకు అందాయని, ఇంజీన్‌ లోపాల కారణంగా డెలివరీ ఆలస్యమవుతున్నట్టు వాడియా వివరించారు.

మరోవైపు   ప్రభుత్వ రంగ విమాన సంస్థ  ఎయిర్‌ ఇండియా వాటాల కొనుగోలుపై   మరో వైమానిక సంస్థ ఇండిగోకు పోటీగా రానుందా అని  ప్రశ్నించినపుడు అలాంటిదేమీలేదని  స్పష్టం చేశారు.  అలాగే  సంస్థ ఐపీఓకు వచ్చే  అంచనాలను  కూడా  ఆయన కొట్టి పారేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement