journey
-
కశ్మీర్‌కు వందేభారత్ .. టిక్కెట్ ఎంత? ఏ రూట్లో వెళుతుంది?
రాబోయే వేసవి సెలవుల్లో కుటుంబంతోపాలు ఆనందంగా గడపాలని అనుకుంటున్నారా? అయితే అందుకు కశ్మీర్‌కు వెళ్లే వందేభారత్ సిద్ధంగా ఉంది. అందమైన లోయలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సహజసిద్ధ అందాలను ఈ రైలులో నుంచి చూసి ఎంతగానో ఆనందించవచ్చు. అంతేకాదు ఈ ప్రయాణంలోని మధురానుభూతులను మీ వెంట తీసుకెళ్లవచ్చు.ఇదంతా ఎంతో దూరంలో లేదు. కశ్మీర్‌కు ప్రతిపాదిత వందే భారత్ రైలును ఎప్పుటి నుంచి నడుపుతారనే దానికి ఇప్పుడు సమాధానం దొరికేసింది. ఒక సీనియర్ రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న శ్రీనగర్‌కు వెళ్లే వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. శ్రీనగర్‌కు నడిచే ఈ వందే భారత్ రైలు కాట్రా- శ్రీనగర్ మధ్య నడుస్తుంది. అంటే ఢిల్లీలో లేదా దేశంలోని మరో ఇతర ప్రాంతంలో నివసిస్తున్నవారు ముందుగా కాట్రా చేరుకోవాలి. ఇక్కడి నుండి కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలులో శ్రీనగర్‌కు చేరుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఢిల్లీ నుంచి కట్రాకు గల వందేభారత్ రైలులో కట్రా చేరుకుని, అక్కడి నుంచి శ్రీనగర్ వెళ్లవచ్చు. కాగా కట్రా- శ్రీనగర్ మధ్య నడిచే కశ్మీర్ స్పెషల్ వందే భారత్ రైలు దేశంలోని ఇతర ప్రాంతాలకు నడిచే వందే భారత్ రైళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.కశ్మీర్‌కు నడిచే ప్రత్యేక వందే భారత్ రైలును అక్కడి వాతావరణం, అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ ప్రత్యేక రైలు -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రయాణిస్తుంది. ఈ రైలులోని కోచ్‌లు చైర్ కార్లు, జనరల్ చైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్లుగా విభజించారు. కొన్ని నెలల తర్వాత ఈ రైలును జమ్మూ వరకు పొడిగించనున్నారు. అప్పటి నుంచి ఈ రైలు జమ్మూ- శ్రీనగర్ మధ్య నడవనుంది. ఈ రైలు మార్గంలో రియాసి, బక్కల్, దుగ్గ, సవల్కోట్, సంగల్డాన్, సుంబెర్, ఖారి, బనిహాల్, ఖాజిగుండ్, సదురా, అనంతనాగ్, బిజ్బెహారా, పంజ్‌గామ్, అవంతిపోరా, రత్నిపోరా, కాకాపోరా, పాంపోర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలు కాట్రా నుంచి శ్రీనగర్‌కు రెండున్నర నుండి మూడు గంటల్లో చేరుకుంటుంది.రైల్వే వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ రైలులో ఏసీ చైర్ కార్ ఛార్జీ రూ.1500 నుంచి రూ.1700 మధ్య ఉండే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ రూ. 2400 నుండి రూ. 2600 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 17న రైలు ప్రారంభించిన అనంతరం రైల్వే అధికారులు ఛార్జీలను ప్రకటించనున్నారు. అప్పటి నుంచి సీట్ల బుకింగ్ ప్రారంభం కానుంది. ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. ఢిల్లీలో సినిమా, కేరళలో ప్రకటన షూటింగ్? -
హోటల్లో అంట్లు కడిగాడు,ఆత్మహత్యాయత్నం..కట్ చేస్తే.. రూ 500 కోట్లు
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రిటైలర్, నగల డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా టాప్ డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన ఈసక్సెస్ అంత ఈజీగారాలేదు. సామాన్య నేపథ్యంనుంచి వచ్చి గ్లోబల్ ఐకాన్‌గా ఎదగడానికి చాలా కష్టాలుపడాల్సి వచ్చింది. విపరీతమైన డిప్రెషన్, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన సోదరి నుంచి 20వేల రూపాయల అప్పుగా తీసుకొని ప్రారంభించిన ప్రయాణం పాతికేళ్ల తరువాత నేడు రూ. 500కోట్లకు చేరింది. సబ్యసాచి అసలు ఎక్కడివాడు, ఆయన కరీర్ మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం రండి!సబ్యసాచి 1974లో ఒక మధ్యతరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించాడు.తల్లిదండ్రులు బంగ్లాదేశీయులు. అతని తండ్రి బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి శరణార్థిగా వలస వచ్చారు. తండ్రి ఉన్ని మిల్లులో ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం కష్టాల్లో పడింది. అపుడు 15 ఏళ్ల వయస్సులో గోవాకు పారిపోయాడు సబ్యసాచి. అక్కడ వెయిటర్‌గా పనిచేశాడు ,గిన్నెలు కడిగాడు. అప్పుడే డిజైనర్ కావాలనే కల కన్నాడు. ఇందుకోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)చదువు కోవాలనుకున్నాడు. కానీ అడ్మిషన్‌కు డబ్బులు లేవన్నారు. అయినా పట్టువీడలేదు. ఎలాగో అలా కష్టపడి అడ్మిషన్ తీసుకున్నాడు. 1999లో అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత కొన్ని నెలల తర్వాత కేవలం ముగ్గురు సిబ్బందితో కోల్‌కతాలో తొలి స్టూడియోను ప్రారంభించాడు. అలా తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదీ సోదరి దగ్గర 20 వేల రూపాయలను అప్పుగా తీసుకొని మరీ. అలా ప్రస్థానం పాకిస్తాన్ ,యుఎఇ, ఇటలీ , దుబాయ్ ఫ్యాషన్ ప్రియులు ఇష్టపడే తొలి భారత గ్లోబల్ బ్రాండ్ ప్రస్తానానికి పునాది పడింది. ఇక అప్పటినుంచి అన్నీ అవార్డులు, రివార్డులు, ప్రశంసలే తప్ప వెనక్కి తీరిగి చూసింది లేదు.రేయింబవళ్లు కష్టపడి 2002లో లక్మే ఫ్యాషన్ వీక్‌లో తన తొలి కలెక్షన్‌ను ప్రదర్శించి, ఫ్యాషన్ మాస్ట్రోగా మారారు సబ్యసాచి ముఖర్జీ. సింగపూర్‌లో జరిగిన మెర్సిడెస్-బెంజ్ న్యూ ఆసియా ఫ్యాషన్ వీక్‌లో తొలి అంతర్జాతీయ అవార్డు (గ్రాండ్ విన్నర్ అవార్డు) గెలుచుకున్నాడు.డిప్రెషన్, ఆత్మహత్యాయత్నంతాను యుక్తవయసులో డిప్రెషన్‌కు గురయ్యానని, ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు.తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఒక సందర్భంగా సబ్యసాచి వెల్లడించాడు. “నేను నిరాశకు లోనయ్యాను మరియు ఆత్మహత్యకు ప్రయత్నించాను. నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. అమ్మ చెంపదెబ్బ కొట్టింది. జలుబు ఎంత సాధారణమో డిప్రెషన్ కూడా అంతే సాధారణం. మీరు డిప్రెషన్లో లేకుంటే, మీరు మామూలుగా లేరు అని అర్థం” అంటూ తన జర్నీని వివరించారు. అంతేకాదు తాను నిరాశను ఎదుర్కోకపోతే, ఫ్యాషన్ దిగ్గజంగా మారడానికి బదులుగా, వేరే కెరీర్ మార్గాన్ని అనుసరించేవాడినని పేర్కొన్నాడు. బహుశా శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ వంటి కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. చదవండి: పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్ సింగర్సబ్యసాచి ముఖర్జీ కెరీర్ మైలు రాళ్లుసబ్యసాచి ముఖర్జీ 2001లో ఫెమినా బ్రిటీష్ కౌన్సిల్ యొక్క మోస్ట్ ఔట్‌స్టాండింగ్ యంగ్ డిజైనర్ ఆఫ్ ఇండియా అవార్డుఅసాధారణ డిజైనర్ జార్జినా వాన్ ఎట్జ్డోర్ఫ్తో ఇంటర్న్‌షిప్ కోసం లండన్. 2002లో ఇండియన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న తర్వాత చాలా మీడియా దృష్టిని ఆకర్షించారు. 2003లో తొలి విదేశీ "గ్రాండ్ విన్నర్ అవార్డ్" గెలుచుకున్న తరువాత పారిస్‌లో జీన్-పాల్ గౌల్టియర్ , అజెడిన్ అలైతో వర్క్‌షాప్‌కు దారితీసింది.2004లో మయామి ఫ్యాషన్ వీక్‌లో ‘ ది ఫ్రాగ్ ప్రిన్సెస్ కలెక్షన్,’, భారతీయ వస్త్ర సౌందర్యం ప్రపంచానికి మరింత బాగా తెలిసి వచ్చింది.బ్లాక్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డుప్రపంచవ్యాప్త గుర్తింపు2005లో ది నాయర్ సిస్టర్స్‌ను ప్రారంభించాడు. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీలు, బగ్రూ లాంటి కలెప్రేరణ పొందిన వసంత-వేసవి సేకరణ. అతని క్రియేషన్స్ ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వార్షిక బ్లాక్-టై ఛారిటీ డిన్నర్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించడానికి ఆహ్వానం2006లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో సబ్యసాచి ప్రారంభ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ 07 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. న్యూయార్క్, మిలన్ మరియు లండన్ అనే మూడు ప్రధాన ఫ్యాషన్ వారాల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫ్యాషన్ డిజైనర్.సబ్యసాచి న్యూయార్క్ ,లండన్ ఫ్యాషన్ వీక్స్, అలాగే బ్రైడల్ ఆసియా 2007, లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ , 2007లో భారతదేశంలో జరిగిన వోగ్ లాంచ్‌లకు హాజరయ్యాడు. 2008లో నగల కలెక్షన్కూడా షురూ చేశాడు. GAJA బ్రాండ్ సహకారంతో 2016 వోగ్ వెడ్డింగ్ షోలో ప్రారంభమైంది. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో 2012లో ఒక క్యాలెండర్‌ను రూపొందించారు, ఆ తరువాతఫ్రెంచ్ లగ్జరీ పాదరక్షలు మరియు దుస్తులు డిజైనర్ క్రిస్టియన్ లౌబౌటిన్తో భాగస్వామిగా పనిచేశాడు.బ్రైడల్ కలెక్షన్‌తో పాపులర్2007లో తన తొలి బ్రైడల్ కలెక్షన్‌ను ఆవిష్కరించాడు,యు తన డిజైన్లతో వివాహ పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించాడు. భారతీయ సంప్రదాయ వస్త్రాలు, చేనేత, చేతితో తయారు చేసిన తనదైన శైలితో డిజైనర్ వెడ్డింగ్ దుస్తులకు పేరుగాంచాడు.హై-ఎండ్ లగ్జరీ ఇండియన్ టెక్స్‌టైల్స్‌ను ఉపయోగించిన తొలివ్యక్గాపేరుతెచ్చకున్నాడు. బంధాని, గోటా వర్క్, బ్లాక్-ప్రింటింగ్ , హ్యాండ్-డైయింగ్ లాంటి వర్క్స్‌తో ట్రెండ్ క్రియేట్ చేశాడు.బాలీవుడ్ సినిమాలకుసబ్యసాచి సంజయ్ లీలా బన్సాలీ చిత్రం బ్లాక్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేశారు. 2005లో ఒక ఫీచర్ ఫిల్మ్‌కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డుతో సహా చిత్రానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. బాబుల్,లాగ చునారి మే దాగ్,రావణ్, గుజారిష్, పా,నో వన్ కిల్డ్ జెస్సికా,ఇంగ్లీష్ వింగ్లీష్,బ్లాక్ లాంటి అనేక సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్స్ అందించారు.ప్రముఖుల వివాహాలు నటి విద్యాబాలన్ ,అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, నిక్ జోనాస్ , ప్రియాంక, అలియా పీవీ సింధు వివాహ దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. ఇంకా శ్రీదేవి, కత్రినా కైఫ్, టబు, షబానా అజ్మీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్,శ్రద్ధా కపూర్, సుస్మితా సేన్, కరీనా, నీతా అంబానీ, శ్లోకా, ఇషా, రాధిక అంబానీ సహసబ్యసాచి సెలబ్రిటీ క్లయింట్లే కావడం విశేషం. 25 సంవత్సరాల కృషి తర్వాత, సబ్యసాచి ముఖర్జీ బ్రాండ్ రూ. 500 కోట్ల విలువకు చేరింది. ఈ ఘనతను సాధించిన భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. -
Success Story: నాడు అమ్మతోపాటు గాజులమ్మి.. నేడు ఐఏఎస్ అధికారిగా..
బాల్యంలో కటిక దారిద్య్రం అనుభవిస్తూనే, చదువులు కొనసాగించిన కొందరు ఉన్నత స్థానానికి చేరుకున్న ఉదంతాల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఇదే కోవలోకి వస్తారు రమేష్ ఘోలాప్. ఈయన సాధించిన విజయం యువతకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.రమేష్ ఘోలాప్.. ఐఏఎస్ అధికారిగా మారేవరకూ సాగించిన ప్రయాణంలో చదువుపై ఆయన చూపిన అంకితభావం, శ్రద్ధ, కృషి మనకు కనిపిస్తాయి. మహారాష్ట్రలోని షోలాపూర్(Solapur) జిల్లాలోని మహాగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించిన రమేష్ చిన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. రమేష్ తండ్రి గోరఖ్ ఘోలాప్ ఒక చిన్న సైకిల్ మరమ్మతుల దుకాణం నడిపేవాడు. మద్యం అలవాటు కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇంట్లో పరిస్థితి అంతకంతకూ దిగజారింది. ఒకరోజు రమేష్ తండ్రి దుకాణం మూసివేశాడు.దీంతో రమేష్ తల్లి విమల్ ఘోలాప్ కుటుంబాన్ని పోషించేందుకు సమీప గ్రామాల్లో గాజులు అమ్మడం ప్రారంభించింది. ఆ సమయంలో రమేష్ తన తల్లికి సహాయం చేస్తూ వచ్చాడు. 2005లో రమేష్ తండ్రి మరణించాడు. కుటుంబసభ్యులు పొరుగింటివారి సాయంలో అంత్యక్రియలు(Funeral) నిర్వహించారు. ఈ ఘటన రమేష్‌ను అమితంగా ఆలోచింపజేసింది. పేదరికం నుండి బయటపడటానికి ఏకైక మార్గం విద్య అని రమేష్ గ్రహించాడు. చదువుపై దృష్టి సారించిన రమేష్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2009 లో ఉపాధ్యాయుడైన తర్వాత కూడా, తన ఆశయంపై దృష్టి సారిస్తూ ముందుకుసాగాడు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) కి సిద్ధం కావాలని నిర్ణయించుకుని, ప్రిపరేషన్ కోసం రమేష్ పూణేకు పయనమయ్యాడు. ఆ సమయంలో అతని తల్లి అండగా నిలిచింది. 2010లో రమేష్ తన మొదటి ప్రయత్నంలో యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష విఫలమయ్యాడు. పోలియో బాధితుడైన రమేష్ 2012లో వికలాంగుల కోటా(Disabled quota) కింద యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)287తో ఉత్తీర్ణుడయ్యాడు. ఐఎఎస్ అధికారి కావాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐఏఎస్ రమేష్ ఘోలాప్ జార్ఖండ్ ఇంధన శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన కథ కోట్లాది మంది యువతకు ప్రేరణ కల్పిస్తుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు -
నాలుగు చిట్కాలతో 18 కిలోలు : ఇన్ఫ్లూయెన్సర్ వెయిట్ లాస్ జర్నీ
అధిక బరువు తగ్గించుకోవాలని, స్లిమ్‌గా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ప్రణాళికా బద్ధంగా ప్రయత్నించి సక్సెస్ సాధిస్తారు. ఇందులో ఒక్కొక్కరి సక్సెస్ ఒక్కోలా ఉంటుంది. అలా పట్టుదలగా సాధన చేసిన ఇన్ఫ్లూయెన్సర్ తన బరువును తగ్గించుకొని, ఆరోగ్యంగా మారింది. ఎలా? తెలుసుకుందాం...రండి!అనేక రకాల ఆహార, వ్యాయామ నియమాలు ప్రచారంలోఉన్నాయి. వీటిల్లో ఏది పాటించాలో తెలియక, చాలామంది గందరగోళంలో పడి పోతారు. ఇవన్నీ చూశాక బరువు తగ్గడం కష్టం రా బాబూ అని ఊరుకుంటారు. మరికొంత మంది బరువు తగ్గించుకునే క్రమంలో విజయం సాధిస్తారు. అలాంటి వారిలో ఒకరు మాడీసే అనే మహిళ. తన విజయాన్ని సోషల్ మీడియాలో పంచుకొని మరో నలుగురికి ప్రేరణగా నిలిచింది. View this post on Instagram A post shared by @madyy_tseyఇన్‌స్టాలో తన వెయిట్ లాస్ జర్నీని షేర్ చేసింది. మేడీ. 4 దశల ఫార్ములా, వర్కౌట్స్, ఆహార నియమాలతో 18 కిలోల బరువు తగ్గించుకున్నట్టు తెలిపింది. అనుకున్న ఫలితం పొందాలంటే.. దీర్ఘకాలిక ఆచరణ, కచ్చితమైన యాక్షన్ ప్లాన్ ఉండాలని చెప్పింది. ఫిట్నెస్ , వెల్నెస్ రెండింటి మేళవింపుతో బరువు తగ్గించుకోవాలని సూచించింది. మాడీ సే పాటించిన నాలుగు సూత్రాలుకంబైన్డ్ స్ట్రెంత్ ట్రైనింగ్ & కార్డియో (వారానికి 4-6 సార్లు)కండరాలు బలంగా ఉండేందుకు జీవక్రియను పెంచుకునేందుకు కార్డియోతో పాటు పవర్ ట్రైనింగ్ఈ కాంబో కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేయడంలో సహాయపడుతుంది, మొత్తం ఫిట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.రోజుకి 2-3లీటర్లు నీళ్లు తాగడంపుష్కలంగా నీరు తాగడ వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఎనర్జీ వస్తుంది. విష పదార్థాలు తొలగిపోతాయిజీర్ణక్రియకు మద్దతు ఇస్తుందిసమతుల్య ఆహారం80 శాతం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, 20 శాతంమాత్రమే ఇష్టమైన అనుకూలమైన ఫుడ్ తీసుకోవాలి. ఫలితంగా అవసరమైన విటమిన్లు , మినరల్స్ శరీరానికి అందుతాయి, అదే సమయంలో స్వల్ప పరిధిలో మిగిలిన ఆహారం, ట్రీట్స్ ఎంజాయ్ చేయొచ్చు.ప్రతి 10 రోజులకు ఫోటోలుసాధారణ ఫోటోలు తీసుకుని చూసుకుంటూ ఉంటే అసలు విషయం తెలుస్తుంది. ఉత్సాహం వస్తుంది. కండరాల బలం, హార్మోన్ల మార్పులను పరిశీలించుకోవాలి. అలాగే కామెంట్లు కూడా చాలా ముఖ్యం.శరీర ఆకృతి, మార్పులను చూసుకోండం తనను సరియైన్ దారిలో నడవటానికి ఉపయోగపడింది అని చెప్పింది. అలాగే ఈ వెయిట్ లాస్ జర్నీలో కఠినంగా ఉండాలని ఓపిగ్గా ఫలితాల కోసం ఎదురు చూడాలని కూడా ఆమె వెల్లడించింది. View this post on Instagram A post shared by @madyy_tsey -
KR Narayanan: దళితునిగా పుట్టి.. రాష్ట్రపతిగా ఎదిగి..
ఈ రోజున అంటే అక్టోబర్ 27న దేశ మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ జన్మించారు. ఆయన భారత రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలపై వివిధ రచనలు చేశారు. ఇంతేకాదు అతని మేధో పనితనం, నిర్ణయాలు దేశానికి ఎంతో మేలు చేశాయి. కేఆర్ నారాయణన్ జయంతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...కేఆర్ నారాయణన్ 1921, ఫిబ్రవరి 4న జన్మించారు. ఇంటికి 8 కి.మీ దూరంలోని మిషనరీ పాఠశాలలో నారాయణన్ ప్రాథమిక విద్యను అభ్యసించారు. నారాయణన్ తెలివైన విద్యార్థి కావడంతో ట్రావెన్కోర్ రాజకుటుంబం అతనికి కాలేజీకి వెళ్లడానికి స్కాలర్షిప్ ఇచ్చింది. దీంతో ఆయన కొట్టాయంలోని సీఎంఎస్ కళాశాలలో 12వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంగ్ల సాహిత్యంలో ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు. అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు.1948లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత కేఆర్ నారాయణన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూను కలుసుకున్నారు. ఈ సమయంలో నెహ్రూ ఆయనను ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరమని కోరారు. 1949లో నారాయణన్ ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరారు. ఈ నేపధ్యంలోనే ఆయన టోక్యో, రంగూన్, లండన్, కాన్బెర్రా, హనోయిలలో రాయబారిగా పనిచేశారు. అనంతరం ఆయన టర్కియే, చైనాలలో భారత రాయబారిగా నియమితులయ్యారు.1980 నుండి 1984 వరకు అమెరికా రాయబారిగా ఉన్నారు. 1955లో కెఆర్ నారాయణన్‌ను దేశంలోనే అత్యుత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గానూ సేవలందించారు. 1978లో పదవీ విరమణ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు.1984లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సమయంలో కేరళలోని ఒట్టప్పలం స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. నారాయణన్ కాంగ్రెస్ టికెట్‌పై వరుసగా మూడుసార్లు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో వివిధ మంత్రి పదవులు నిర్వహించారు.1992లో కేఆర్ నారాయణన్ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1997లో దేశ 10వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కేరళ నుంచి రాష్ట్రపతి పదవిని అధిష్టించిన మొదటి వ్యక్తి, మొదటి దళితునిగా పేరుగాంచారు.కేఆర్ నారాయణన్ తన 84వ ఏట 2005 నవంబర్ 9న కన్నుమూశారు.ఇది కూడా చదవండి: వంట నూనె ధరలకు రెక్కలు -
'ఎకో ఫ్రెండ్లీ జర్నీ'! 27 దేశాలు చుట్టొచ్చిన ఇద్దరు మిత్రులు..!
ఇద్దరు ప్రయాణికులు ఒక్క ఫ్లైట్ జర్నీ చేయకుండా ఏకంగా 27 దేశాలు చుట్టొచ్చారు. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా కార్బన్ ఉద్గారాలు లేకుండా ప్రయాణించి చూపారు. డబ్బుని కూడా ఆది చేశారు. అస్సలు ఫ్లైట్ జర్నీ చెయ్యకుండా అన్ని దేశాలు చుట్టిరావడం సాధ్యమేనా..?.అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు ఎలా అన్ని దేశాలు ప్రయాణించగలిగారో చూద్దామా..!ఇటలీకి చెందిన టోమ్మాసో ఫరీనామ్, స్పెయిన్‌కి చెందని అడ్రియన్ లాపుఎంటే అనే ఇద్దరు గత వేసవిలో తమ అడ్వెంచర్‌ని ప్రారంభించారు. పర్యావరణానికి విఘాతం కలిగించకుండా వృక్ష సంపద, జంతువులతో సహవాసం చేసే ప్రపంచాన్ని సృష్టించాలనే లక్ష్యంతోనే తాము ఈ సాహసం చేసినట్లు చెప్పారు ఇద్దరు. తమ జర్నీలో ఎక్కడ కార్బన్ ఉద్గారాలకు తావివ్వకూడదనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించారు. తాము సోషల్ మీడియాలో బోట్ హిచ్‌హైకర్స్ అనే రైడ్‌ని సంప్రదించి ప్రయాణించినట్లు తెలిపారు. ఇలాంటి జర్నీ చేసిన అనుభవం లేకపోయినా ధైర్యం చేసి మరీ ఇలా సెయిలింగ్ బోట్లో అట్లాంటిక్ మీదుగా ప్రయాణించినట్లు వివరించారు. ఆ తర్వాత మోనోహాల్ బోట్లో పసిఫిక్ మీదుగా ప్రయాణించి గల్ఫ్ ఆఫ్ పనామా వరకు వెళ్లొచ్చినట్లు తెలిపారు. ఇలా తాము జర్నీ చేసినట్లు కుటుంబసభ్యులు, బంధువులకు చెబితే ఒక్కసారిగా వారంతా కంగుతిన్నారని చెప్పుకొచ్చారు ఈ ఇద్దరు మిత్రులు. అంతేగాదు గల్ఫ్ ఆఫ్ పనామాలో సముద్రంలోని భయంకరమైన అలలతో చేసిన జర్నీఓ పీడకలని చెప్పారు. అయినప్పటికీ తాము తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ జర్నీ చేయాలని అనుకోలేదని ధైర్యంగా చెప్పారు. ఇలా విమానంలో ప్రయాణించకుండా పర్యావరణానికి సహాయం చేయడమే కాకుండా డబ్బును కూడా ఆదా చేయడం విశేషం. ఒక్కోక్కరికి ఇలా 27 దేశాలు చుట్టి రావడానికి కేవలం రూ. 6 లక్షలు మాత్రమే ఖర్చు అయ్యింది. ఈ ఇద్దరు మిత్రులు 'ప్రాజెక్ట్ కునే'లో భాగంగా తమ కథనాన్ని ఆన్లైన్లో పంచుకోవడంతో నెట్టింట ఈ విషంయ తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఛారిటీ కోసం ఇంగ్లీష్ ఛానల్‌ని ఈదిన భారత సంతతి విద్యార్థి!) -
ప్రయాణాలపై ఇష్టంతోనే.. ఈ స్థాయికి!
ముంబైలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన నిఖిల్‌కు ప్రయాణాలు చేయడం అంటే బోలెడు ఇష్టం. ఎంత ఇష్టం అంటే రోజూ 50 నుంచి 100 కిలోమీటర్లు ఎక్కడో ఒకచోటుకి వెళ్లిరావాల్సిందే. అయితే ఒకానొక రోజు మాత్రం... ‘ఎప్పుడూ ముంబై మాత్రమేనా.. ఔట్‌సైడ్ ముంబై కూడా వెళ్లాలి’ అనుకున్నాడు.అలా బైక్‌పై ఆజ్మీర్, బెంగళూరుకు వెళ్లాడు. ఇక అప్పటి నుంచి మొదలైన ఔట్‌సైడ్ ముంబై ప్రయాణాలు ఆగలేదు. ఈ ప్రయాణాల పుణ్యమా అని మన దేశంలోని ‘మోటో వ్లాగింగ్’ ప్రఖ్యాత యూట్యూబర్లలో ఒకరిగా నిఖిల్ శర్మ పేరు తెచ్చుకున్నాడు.నిఖిల్ ఫ్యాన్ బేస్ విషయానికి వస్తే..యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫాలోవర్ల సంఖ్య లక్షలలో ఉంది. తాను వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పుడు మన దేశంలో వ్లాగింగ్‌కు పెద్దగా ్రపాచుర్యం లేదు. డైలీ వ్లాగింగ్ చేయడం ద్వారా ఆడియెన్స్‌తో ఎప్పటికప్పుడూ టచ్‌లో ఉండేవాడు. మన దేశంలో ఏ మూలన ఉన్న ఆడియెన్స్ అయిన నిఖిల్ చెబుతున్న కబుర్లు విని ఊహాల్లోనే తాను ఉన్న చోటుకి వెళ్లేవారు.వ్లాగింగ్‌కు ఆవలి ప్రపంచంలోకి వెళితే..నిఖిల్‌కు నటన అంటే ఇష్టం. బాలీవుడ్ సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించాడు. ఫ్లైట్ అటెండెంట్‌గా కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు. ఉద్యోగం మానేసినప్పుడు తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అదే సమయంలో తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై పడింది. ‘వ్లాగింగ్ వదలేయ్. డబ్బు సంపాదనపై దృష్టి పెట్టు’ అని కొద్దిమంది సలహా ఇచ్చారు. అయితే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన ప్యాషన్‌కు ఎప్పుడూ దూరం కాలేదు.ఆ ప్యాషనే తనను ప్రతిష్ఠాత్మకమైన యూట్యూబ్ ఫ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొనేలా చేసింది. ఔట్‌సైడ్ ముంబై యాత్రలు చేస్తే చాలు అనుకున్న అతడిని అమెరికా, కెనడా, ఇండోనేషియ, సౌత్ కొరియా, జపాన్... మొదలైన దేశాలకు వెళ్లేలా చేసింది. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30–ఇండియా’ జాబితాలో చోటు సంపాదించేలా చేసింది. క్లాతింగ్ బ్రాండ్ లేబుల్ ఎంఎన్తో డిజైనర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్న నిఖిల్... ‘ఎన్ని చేసినా వ్లాగింగ్ అనేది నా ప్యాషన్’ అంటున్నాడు.ప్రతిభతో పాటు..మన ప్యాషన్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు. రాజీ పడి వేరే దారి చూసుకోవడం సులభం. రాజీ పడకుండా నచ్చిన దారిలోనే వెళ్లడం కష్టం. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా పోదు. తప్పకుండా ఫలితం ఇస్తుంది. ప్రతిభతో పాటు ఓపిక కూడా ఉండాలి. తొందరపాటు వల్ల నష్టపోయిన ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు. – నిఖిల్ శర్మఇవి చదవండి: -
జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట!
గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ఫిట్నెస్ జర్నీ ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. జిమ్‌కి వెళ్లకుండా, ఫ్యాన్సీ డైట్‌ని అనుసరించకుండానే 10 నెలల్లో 23 కిలోల బరువు తగ్గించు కున్నాడు. దీంతో అంతకుముందు ముద్దుగా బొద్దుగా ఉండేవాడు కాస్త, నాజూగ్గా మారిపోయాడు.వ్యాపారవేత్త నీరజ్ బరువు తగ్గేందుకు ఎలా నియమాలు పాటించింది వరుస పోస్ట్‌ల ద్వారా ఫిట్నెస్ కన్సల్టెంట్, సతేజ్ గోహెల్ వివరించారు. అలాగే దీనికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు. గోహెల్ అందించిన వివరాల ప్రకారం కేవలం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తింటూ, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ నీరజ్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకో గలిగాడు.వృత్తి రీత్యా బిజీగా ఉండే నీరజ్ మొదట తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. తరువాత కూడా అనుభవం లేక జిమ్‌కి వెళ్లడానికి సంకోచించేవాడు. దీంతో అతని కోసం ఇంట్లో వినియోగించుకునేలా డంబెల్స్ తయారు చేసి ఇచ్చాడు గోహెల్. అలాగే ఇంటి ఫుడ్ సాధారణ నడక అలవాటు చేశాడు. మొదట్లో నీరజ్ 10 వేల అడుగులు వేయడానికి చాలా కష్టపడే వాడు. కానీ ఆ తరువాతికాలంలో నడక అలవాటుగా మారిపోయింది.ఫలితంగా 10 నెలల్లో నీరజ్ 23 కేజీల బరువు తగ్గాడు. 91.9 కేజీల నుంచి 68.7 కేజీలకు ఆయన బరువు దిగివచ్చింది. ఆహారంలో పనీర్, సోయా చంక్స్, పప్పు, ఇతర శాఖాహార ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవాడట. దీంతోపాటు చక్కెర పదార్థాలను బాగా తగ్గిం చేశాడు. ఇది పూర్తిగా టీం వర్క్, వారం వారం అతనితో టచ్‌లో ఉంటూ, అతనికిష్టమైన ఆహారాన్ని అందిస్తూనే, వర్కౌట్లు ప్లాన్ చేసినట్టు గోహెల్ తన పోస్ట్‌లో వెల్లడించాడు. అయితే దీనిపై నెటిజన్టు భిన్నంగా స్పందించారు. నీరజ్ సంకల్పాన్ని కొందరు ప్రశంసించగా, ఫిట్నెస్ పరిశ్రమ గురించి గొప్పగా చెప్పుకున్నట్టుగా ఉందంటూ మరొకరు విమర్శించారు.ముఖ్యంగా ‘‘నో నూట్రిషనిస్ట్, నో వర్కౌట్..నో నాన్ వెజ్ ..గురూ..(పోషకాహార నిపుణుడు లేడు, వర్కౌట్లు లేవు, మాంసాహారం లేదు గురు) డైటింగ్ అస్సలే లేదు.. కేవలం చురుకైన నడక, సైక్లింగ్, రోజువారీ 900-1000 కిలోల కేలరీలు బర్నింగ్ అని మరో యూజర్ ఒక పోస్ట్ పెట్టడం గమనార్హం. -
లాపతా లేడీస్: సిమ్లా టూ బాలీవుడ్, ఎవరీ యాపిల్ బ్యూటీ (ఫొటోలు)
-
Shahnaz Habib: 'ప్రయాణాల వెనుక రాజకీయాలు'.. ఉంటాయని తెలుసా..!
వేసవి వస్తే ప్రయాణాలు గుర్తుకు వస్తాయి. విమానం ఎక్కితే మొబైల్ ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచాలి. కాని ఈ ప్రయాణాల వెనుక చాలా రాజకీయాలు ఉంటాయంటోంది షెహనాజ్ హబీబ్. అమెరికాలో ప్రొఫెసర్‌గా ఉన్న ఈ కేరళ వనిత స్థానిక సంపదను ‘డిస్కవరీ’ చేయడానికే సామ్రాజ్యవాదులు ప్రయాణాలు చేశారని చెబుతుంది. సగటు మనిషి ప్రయాణాలకు ఎన్ని అడ్డంకులున్నాయో ఆమె పుస్తకం ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’ విశదంగా తెలియజేస్తోంది. ట్రావెల్ రైటర్ షెహనాజ్ పరిచయం.‘ప్రయాణాల్లో కూడా వివక్ష ఉంటుంది’ అంటుంది షహనాజ్ హబీబ్. ‘మీ ఒంటి రంగు, మీ పాస్‌పోర్ట్ రంగు మీ ప్రయాణం సులభం చేయవచ్చో, జటిలం చేయవచ్చో నిర్ణయిస్తాయి’ అంటుందామె. అమెరికాలోని బే పాత్ యూనివర్సిటీలోప్రొఫెసర్గా పని చేసే షహనాజ్ హబీబ్ కేరళలోని ఎర్నాకుళంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది. కాని ఆమె నేర్చిన ఇంగ్లిష్ భాష, ఆమె వ్యక్తీకరణ ఆమెకు విశేషమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. అమెరికాలోని వ్యాసకర్తల్లో ఆమెకు గుర్తింపు ఉంది. న్యూయార్క్ టైమ్స్‌లో షహనాజ్ హబీబ్ వ్యాసాలు వస్తాయి.కేరళ రచయిత బెన్యమిన్ రాసిన ఒక నవలను ‘జాస్మిన్ డేస్’ పేరున షహనాజ్ మలయాళంలో అనువదిస్తే ప్రతిష్టాత్మక 25 లక్షల రూపాయల జె.సి.బి. పురస్కారం లభించింది. కవిత్వం, కథలతో పాటు ట్రావెలోగ్స్ కూడా రాసే షహనాజ్ ఇటీవల వెలువరించిన యాత్రా కథనం ‘ఏరోప్లేన్ మోడ్’. అమెరికాలోనూ ఇండియాలోనూ విడుదలైన ఈ పుస్తకం యాత్రల విషయంలో కొత్త చూపును కలిగిస్తోంది.‘ప్రపంచ దేశాల పర్యటనలు తెల్లవాళ్లకు ఒక రకంగానూ రంగు తక్కువ ఆసియా, ఆఫ్రికా దేశాల వారికి ఒక రకంగానూ జరుగుతాయి. అమెరికా, యూరప్ దేశాల వారి తెల్లరంగు చూడగానే వారి ప్రయాణాలకు ఒక విలువ, గౌరవం ఉన్నాయని భావిస్తారు. వారిని అధికారులు చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. అదే బ్రౌన్, బ్లాక్ కలర్ ఉన్నవారికి అన్నీ ఆటంకాలే. ఇక అమెరికా పాస్‌పోర్ట్ ఉండి, వారు తెల్లవారైతే వారికి వీసా క్యూలన్నీ లేనట్టే. అమెరికా పాస్‌పోర్ట్ ఉంటే చాలా దేశాలకు అసలు వీసాయే అక్కర్లేదు. అంటే ఒక మనిషికి ప్రయాణ గౌరవం పాస్‌పోర్ట్ వల్లే వస్తోందన్న మాట. దీనినే నేను పాస్పోర్టిజమ్ అంటాను’ అంటుంది షహనాజ్.సంస్కృతి, సంపదల కోసం..‘17, 18 శతాబ్దాల్లో యాత్రీకులకు యూరప్ ప్రభుత్వాలు నిధులు ఇచ్చేవి. అలా ఇచ్చేది యాత్రికులను గౌరవించడానికి కాదు. వారు దేశ దేశాలు తిరిగి అక్కడి సంస్కృతులు, పంటలు, డబ్బు, బంగారం, వస్త్రాలు, మతాలు... వీటన్నింటి గురించి సమాచారం తెస్తే ఏ దేశాన్ని ఏ విధంగా కబళించవచ్చో ఆ ప్రభువులకు తెలిసేది. ఖండాలు, దేశాలు వాటిలోని ప్రజలు అనాదిగా జీవిస్తున్నా ఈ యూరోపియన్ యాత్రికులు వారిని ‘డిస్కవరీ’ చేశామని చరిత్రలు రాసుకున్నారు. కాని ఆ చరిత్రల్లో స్థానికులను ఏ విధంగా తుడిచి పెట్టారో ఉండదు.అలాగే ఇప్పుడు బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ల నుంచి ప్రపంచం తిరిగే పర్యాటకులకు వారి దేశాల్లోని పాఠ్య పుస్తకాల్లో తమ దేశాలు ఏయే దేశాలను ఎలా ఆక్రమించాయి, ఎలా దోచుకున్నాయో తెలియజేయరు. యాత్రల వెనుక చాలా చరిత్ర ఉంటుంది. అది తెలుసుకోవడం అవసరం’ అంటుంది షహనాజ్.ఎన్నో అందాలు..‘టూరిజమ్‌ను ఒక వ్యసనంగా మార్చారు. దీని వెనుక చాలా వ్యాపార ఎత్తుగడ ఉంది. కొత్త ప్రాంతాలు చూడకపోతే వెనుకబడతారనే భావజాలం సృష్టించారు. మా నాన్న ఎక్కడికీ తిరగడానికి ఇష్టపడేవాడు కాదు. మా అమ్మకు కొత్త ప్రాంతాలు చూడటం ఇష్టం. ఇద్దరూ కరెక్టే. ఈ టూరిజమ్‌లో కూడా తెల్లవారి దేశాలకే గిరాకీ ఎక్కువ. కాని ఆఫ్రికాలో ఎన్నో అందమైన దేశాలు ఉన్నాయి. ఇథియోపియాలోని అండర్‌గ్రౌండ్ చర్చ్‌లను చూస్తే మతి పోతుంది. కాని వాళ్లకు ప్రమోట్ చేసుకోవడానికి డబ్బు లేదు. ప్రతి దేశంలో సాంస్కృతిక చిహ్నాలుంటాయి. వాటి ఘన చరిత్ర ఉంటుంది. అయితే దానిని వర్తమానంలో ప్రతీకారాలకు ఉపయోగించకూడదు’ అంటుందామె. – షెహనాజ్ హబీబ్ -
అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..!
విమానాల్లో అత్యధిక దూరం ప్రయాణించిన ఈ పెద్దమనిషి పేరు టామ్ స్టూకర్. అమెరికాలోని న్యూజెర్సీవాసి. ప్రస్తుతం ఇతడి వయసు 69 ఏళ్లు. విమాన ప్రయాణాల మీద మక్కువతో 1990లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నుంచి 2.90 లక్షల డాలర్లకు (రూ.2.41 కోట్లు) లైఫ్‌టైమ్ పాస్ తీసుకున్నాడు.ఇక అప్పటి నుంచి తోచినప్పుడల్లా విమానాల్లో దేశాదేశాలను చుట్టేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఇతగాడు విమానాల్లో ఏకంగా 20 మిలియన్ మైళ్లకు (3.21 కోట్ల కిలోమీటర్లు) పైగా ప్రయాణాలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత విరివిగా విమాన ప్రయాణాలు చేసే వ్యక్తిగా రికార్డులకెక్కాడు. లైఫ్‌టైమ్ పాస్ కోసం అప్పట్లో తాను పెద్దమొత్తమే చెల్లించినా, అలా చెల్లించడం వల్ల ఇప్పటి వరకు లెక్కిస్తే తనకు 2.44 మిలియన్ డాలర్లు (రూ.20.30 కోట్లు) మిగిలినట్లేనని టామ్ చెప్పడం విశేషం. అతి తక్కువ లగేజీతో తాను ప్రయాణాలు చేస్తానని, చేసే ప్రయాణాల కంటే, ప్రయాణాల్లో మనుషులను కలుసుకోవడం తనకు చాలా ఇష్టమని అతడు చెబుతాడు.ఇవి చదవండి: అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే! -
ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్‌ప్యాక్
అరుదైన వ్యాధి సోకింది. నడక వద్దని చెప్పారు. కానీ 43 ఏళ్ల వయసులో 10 కిలోల మేర బరువు తగ్గాడు. అంతేకాదు సిక్స్ ప్యాక్ కూడా సాధించాడు. ఈ ప్రయాణాన్ని మొత్తాన్ని ఇన్‌స్టాలో తన ఫాలోయర్లతో పంచుకున్నాడు. ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ. స్ఫూర్తిదాయక మైన ఫిట్నెస్ జర్నీని, తన సిక్స్ ప్యాక్ ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. 2012లో 32 ఏళ్ల వయసులో అవాస్క్యులర్ నెక్రోసిస్ అనే వ్యాధి బారినపడ్డాడు అంకుర్. అతని కుడి తుంటి ఎముక పుచ్చిపోయింది. దీంతో అతని వాకింగ్ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. కోలుకోవడానికి నెలల తరబడి బెడ్ రెస్ట్‌లో ఉన్నాడు. తరువాత 5 నెలలపాటు చేతి కర్రల సాయంతో నడిచానంటూ ఇన్‌స్టా పోస్ట్‌తో తన జర్నీని గుర్తు చేసుకున్నాడు అంకుర్. కానీ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాక ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. అలా జీవితంలో తొలిసారి జిమ్‌లో చేరాడు. మెల్లిగా రన్నింగ్ కూడా మొదలుపెట్టాడు. అంతేకాదు ఒక మారథాన్‌లో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో కాస్త ఇబ్బందిపడినప్పటికీ, పట్టుదలతో అనుకున్నది సాధించాడు. 10 నెలల తర్వాత 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తి చేసినట్లు అంకుర్ వివరించాడు. ఈ ఉత్సాహంతోనే సిక్స్ ప్యాక్ ఎందుకు సాధించకూడదు అని ఆలోచించాడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం దాన్నొక సవాల్‌గా స్వీకరించి చేసి చూపించాడు. View this post on Instagram A post shared by Ankur Warikoo (@ankurwarikoo)రోజూ వ్యాయామం చేయడ ఆహార నియమాలను పాటించి సిక్స్ ప్యాక్ సాధించి, 43 ఏళ్ల వయసులో తాను ఫ్యాట్ ఫ్రీగా అవతరించడం విశేషం. పదేళ్ల కిందట తన ఫిట్నెస్ను, 6 ప్యాక్‌ను సాధించాలనుకున్నా, సెకండ్ లైఫ్‌కి ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఆయన పోస్ట్ కు 94 వేలకు పైగా లైక్ లు లభించాయి. అయితే ఆయన పోస్ట్‌పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అంటూ కమెంట్ చేశారు. -
నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్ అయినా ఒకటే
ఫీల్డ్ మారడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభం కాదు.కాస్త అటూ ఇటూ అయితే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.‘నేను సాధించగలను’ అనే పట్టుదల ఉన్న వారికి మాత్రం ఏ ఫీల్డ్ అయినా ఒకటే. అలాంటి ప్రతిభావంతులలో తేజ ఒకరు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసిన తేజ ఐటీ రంగంలోకి అడుగుపెట్టి టెక్ లీడర్‌గా మంచి పేరు సంపాదించింది. కర్ణాటకలోని బెల్గాంలో పెరిగిన తేజ మనకమె డాక్టర్ అయిన తండ్రి నుంచి విజ్ఞానప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునేది. డిఐవై (డూ ఇట్ యువర్ సెల్ఫ్) పాజెక్ట్స్ చేసేది. కర్ణాటక యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారిగా నాన్–మెడికల్ ఏరియాలలో మహిళల కోసం ద్వారాలు తెరుస్తున్న సమయం అది. తన సీనియర్స్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిపోయారు. వారిని యూనిఫామ్‌లో చూడడం తేజాకు ఎగ్టయిటింగ్గా అనిపించింది. వారి స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలోప్రాథమిక శిక్షణ తరువాత మౌంట్ అబూలో పాస్టింగ్ ఇచ్చారు. మౌంట్ అబూ స్టేషన్‌లోని ఉద్యోగులలో ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో తాను ఒకరు. మహిళల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఉండేవి కావు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పుడూ నిరాశపడేది కాదు తేజ,మౌంట్ అబూ తరువాత నాసిక్, బెంగళూరులలో కూడా పనిచేసింది. మన దేశాన్ని ఐటీ బూమ్ తాకిన సమయం అది.ఐటీ ఫీల్డ్‌లో ఉన్న సోదరుడు తేజాతో ఆ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకునేవాడు. దీంతో ఐటీ రంగంపై తనకు ఆసక్తి పెరిగింది. అలా ఎయిర్ ఫోర్స్‌ను వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టింది. టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో డెవలపర్‌గా చేరింది. ఫ్రెషర్‌గా ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తేజ అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఆ తరువాత టెక్నాలజీస్‌లో పనిచేసింది. 2005లో డెల్ టెక్నాలజీలో మేనేజర్‌గా చేరింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) స్థాయికి చేరింది. జెండర్ స్టీరియో టైప్స్‌ను బ్రేక్ చేస్తూ డెల్ ఐటీ–ఇండియాలో కీలక స్థానంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు ΄పోందింది.డెల్ ఫౌండేషన్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్, సప్లై చైన్, డేటా సైన్స్... మొదలైన విభాగాల్లో పట్టు సాధించింది. సీఎస్ఆర్ యాక్టివిటీస్‌పై బాగా ఆసక్తి చూపేది. ‘టెక్నాలజీ సహాయంతో ఎన్నో మంచిపనులు చేయవచ్చు’ అంటున్న తేజ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బుద్ద ఫౌండేషన్‌తో కలిసి వలస కార్మికులకు పునరావాసం కల్పించింది.‘ప్రతి మహిళకు ఒక రోల్‌మోడల్, మెంటర్ ఉండాలి. అప్పుడే ఎన్నో విజయాలు సాధించగలరు’ అంటున్న తేజ డెల్లో ‘మెంటర్ సర్కిల్ కాన్సెప్ట్’ను అమలు చేసింది. ప్రతి సర్కిల్లో కొందరు మహిళలు ఉంటారు. వారికో మెంటర్ ఉంటారు. ఈ సర్కిల్లో తమ సమస్యలను చర్చించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకరు సహాయంగా నిలవచ్చు. ‘ఇంజినీరింగ్ కాలేజీలో క్లాసులో నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కుటుంబంలో నేను ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఒక ముక్కలో చెపాలంటే సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆహ్వానించదగిన మార్పు. నేను నేర్చుకున్న విషయాల ద్వారా ఇతరులకు ఏ రకంగా సహాయం చేయగలను అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. టైమ్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో సమావేశాలు నిర్వహించాను’ అంటుంది తేజ. -
ఈసారి అమర్నాథ్ యాత్ర 45 రోజులే..
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త. ప్రబుత్వం తాజాగా అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం పలు షరతులు విధించింది. యాత్ర చేయబోయే ప్రతివారూ శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వారు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. పలు భద్రాతా ఏర్పాట్లు చేసిన తరువాతనే ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది 2024 అమర్నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీ అష్టమి తిథి మధ్యాహ్నం 02:19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళుతుంటారు. -
Smriti Mandhana: ఆటలోనే కాదు అందంలోనూ చాంపియన్.. స్మృతి మంధాన (ఫొటోలు)
-
దేశప్రధానికే లేఖ.. ఎన్నో హేళనలు, అవమానాలు.. దేనికీ బెదరని నటి (ఫోటోలు)
-
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? మహేశ్ సూపర్ హిట్ మూవీలో (ఫొటోలు)
-
మహిళల ప్రయాణం ఇక టీ–సేఫ్
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ప్రయాణించే పౌరులు, ముఖ్యంగా మహిళలు సురక్షితంగా గమ్య స్థానం చేరే వరకు పర్యవేక్షించేలా దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ పోలీసులు టీ–సేఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. స్మార్ట్‌ఫోన్ లేక పోయినా, సాధారణ మొబైల్ ఫోన్ ఉన్నా..ఈ టీ–సేఫ్ సేవలను వినియోగించుకునే వీలుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని, కీలకమైన సర్వీస్ అని అన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న మహిళా శక్తి విధానం ఆవిష్కరణలో భాగంగా మంగళవారం సచివాల యంలో టీ–సేఫ్‌ను సీఎం ప్రారంభించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, డి.అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 లేదా 112 నంబర్లకు డయల్ చేసి ఐవీఆర్ ఆప్షన్లో 8 నంబర్‌ను నొక్కడం ద్వారా టీ–సేఫ్ సేవలను వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక్కసారి సమాచారం ఇస్తే చాలు స్మార్ట్ ఫోన్లు ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, లేదా టీ–సేఫ్ వెబ్‌పేజీ ద్వారా వీటిని వినియోగించుకోవచ్చని సీఎం తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మహిళలు, చిన్నారుల సురక్షిత ప్రయాణం కోసం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ పోలీస్ శాఖకు సీఎం అభినందనలు తెలిపారు. టీ–సేఫ్‌కు డయల్ 100 ద్వారా లేదా యాప్ ద్వారా ఒకసారి సమా చారం ఇస్తే సరిపోతుందని, మళ్లీ మళ్లీ అత్యవసర సేవల కోసం 100 నంబర్‌కు ఫోన్ చేయాల్సిన పని లేకుండా పోలీసులే నిర్ధారిత సమయంలోపు పౌరులను సంప్రదిస్తూ వారు సురక్షితంగా గమ్యం చేరే వరకు పర్యవేక్షిస్తారని తెలిపారు. అవసరమైతే లైవ్ ట్రాకింగ్ లింక్ ఆ పరిధిలోని ప్యాట్రో వాహ నాలకు సైతం వెళుతుందని వివరించారు. లైవ్ లొకేషన్ పంపే వీలు టీ–సేఫ్ యాప్‌ను వినియోగించే పౌరులు ఆపదలో ఉన్నప్పుడు వారి లైవ్ లొకేషన్‌ను పోలీసులకు పంపే వీలు కూడా ఉందని రేవంత్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 791 ప్యాట్రో కార్లు, 1,085 బ్లూకోల్ట్స్ వాహనాలకు టీ–సేఫ్ అనుసంధానమై ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో మరింత సురక్షిత ప్రయాణం కోసం టీ–సేఫ్ యాప్ సేవలను ఇతర క్యాబ్, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ సేవల యాప్‌లకు అనుసంధానిస్తామని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సీఐడీ, మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్‌రెడ్డి, శిక్షణ విభాగం అదనపు డీజీ అభిలాష బిస్త్, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్ జైన్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు. -
కొంగొత్త ఆలోచనలకు అంకురం... ఇన్నొవేషన్ యాత్ర 2024!
అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC-CBIT), కాకతీయ శాండ్బాక్స్ నేతృత్వంలో.. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ (TSIC) భాగస్వామ్యంతో 'ఇన్నోవేషన్ యాత్ర - 2024' (Innovation Yatra - 2024) పేరుతో ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇందులో ఎలా పాల్గొనాలి, ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు జరుగుతుందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ఇన్నోవేషన్ యాత్ర - 2024 రేపటితో ప్రారంభమై శనివారం వరకు (మార్చి 12 నుంచి 16) జరగనుంది. ఇందులో నవమ్ ఫౌండేషన్, ఎకో సిస్టం భాగస్వాములుగా Ag-Hub, అడ్వెంచర్ పార్క్, AIC-GNITS, కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పల్లె సృజన మొదలైనవి భాగస్వాములుగా పాల్గొంటాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇన్నోవేషన్ యాత్ర 5 రోజులు, 60 మంది యాత్రికులు, 6 గమ్యస్థానాలు, 800 కి.మీ సాగుతుంది. ఇది ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎవరైనా ఈ యాత్రలో పాల్గొనటానికి అప్లై చేసుకోవచ్చు. ఐదు రోజులు జరిగే ఈ బస్సు యాత్రలో పాల్గొనేవారు విజవయంతమైన వ్యవస్థాపకులు, లోకల్ ఇన్నోవేటర్స్తో సమయాన్ని గడపవచ్చు. ఈ ప్రయాణంలో మంచి అనుభవాలు పొందటమే కాకుండా.. విలువైన విషయాలను తెలుసుకోగలుగుతారు. ఈ యాత్రలో పాల్గొనేవారు తెలంగాణలోని విభిన్న కమ్యూనిటీలను కలుసుకోవడం, వారి ప్రత్యేకమైన అవసరాలు.. వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి లోతైన అవహగాన పొందటమే కాకుండా, వారి అనుభవాల పట్ల సానుభూతిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. నిజ జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి కావలసిన మనస్తత్వం మీలో పెంపొందించుకోవడంలో ఈ యాత్ర తప్పకుండా తోడ్పడుతుంది. ఇన్నోవేషన్ యాత్రలో వ్యక్తిగత అభివృద్ధికి అతీతంగా.. విభిన్న నేపథ్యాలకు చెందిన 59 యాత్రికులతో కనెక్ట్ అవుతారు. దీని ద్వారా మీకు కావలసిన జ్ఞానాన్ని పొందుతారు. సవాళ్లను సృజనాత్మకంగా ఎదుర్కోవడానికి, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు ఈ యాత్ర ద్వారా సంపాదించవచ్చు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని ఆవిష్కర్తల స్ఫూర్తిదాయకమైన కథలను ప్రదర్శించడం కూడా ఇందులో ఒక భాగం. వారు సాధించిన విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనేది యాత్ర లక్ష్యం. -
ప్రియమణి గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా? (ఫొటోలు)
-
నేడు బీజేపీలోకి కాంగ్రెస్ దిగ్గజ నేత!
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి, కమలదళంలో చేరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ పచౌరీ కూడా కాంగ్రెస్‌ను వీడారు. సురేష్ పచౌరీ నేడు (శనివారం) భోపాల్‌లో జరగనున్న ఒక కార్యక్రమంలో బీజేపీలో చేరబోతున్నారు. 1972లో ఆయన ఇండియన్ యూత్ కాంగ్రెస్‌లో చేరి, తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1981లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1983 వరకు ఈ పదవిలో కొనసాగారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ పచౌరీ 1984లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై, ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ నేత సురేష్ పచౌరీ 1984,1990, 1996, 2002లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగానూ పనిచేశారు. -
రూ.300 జీతం.. ఎన్నో కష్టాలు.. సొంతంగా వ్యాపారం - ధీరుభాయ్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
-
వాలైంటైన్స్ డే స్పెషల్.. 9 సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్
ప్రేమికుల రోజు రానుంది. ఈ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ వేసే ఉంటారు. తన ప్రియురాలు/ ప్రియుడికి ఎలాంటి కానుకలు ఇవ్వాలని ఆలోచించే ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారు మొదట ఎక్కడ కలుసుకున్నారో ఆ నాటి స్మృతులను మరోసారి గుర్తుచేసుకుంటారు. ప్రేమించేవారిని ఎలా సర్ప్రైజ్ చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్ డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్బుక్ పేజీలో ఏ కవిత పోస్ట్ చేయాలో... ఇన్‌స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో.. సిద్ధంగా ఉంచుకునే ఉంటారు. ఇలా చాలా మంది ప్రేమికులకు సినిమా అనేది ఒక భాగం. అందుకే ప్రేమ గురించి గతంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేశాయి. అలా ప్రేమికులను మెప్పించిన ఆ సినిమాలు మళ్లీ రీరిలీజ్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే నాడు వచ్చే చిత్రాలు ఏంటో చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్లో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం విడుదలై సూపర్ హిట్ కొట్టింది. 2008లో విడుదలైన ఈ సినిమా గతేడాదిలోనే రీ రిలిజ్ అయి భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇందులో హీరో సూర్య డ్యుయల్ రోల్లో మెప్పించాడు. హ్యారీస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది. సిద్ధార్థ్ ప్రేమ కథా చిత్రాల్లో 'ఓయ్' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో షామిలీ హీరోయిన్గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి మంచి లవ్ స్టోరీగా మిగిలిపోయింది. సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం యూత్ బాగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పాన్ ఇండియా రేంజ్లో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం సీతారామం. 2022లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా క్లాసికల్ హిట్‌గా నిలిచింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. 1998లో బ్లాక్‌బస్టర్ అందుకున్న తొలిప్రేమ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ప్రేమికుల మనసులను గెలుచుకొని బ్లాక్బాస్టర్ అయింది. ఒక రకంగా పవన్‌కు ఈ చిత్రం స్టార్‌డమ్‌ను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇప్పటికే గతంలో రీ రిలీజ్ కావడంతో ఇప్పుడు తక్కువ సంఖ్యలో మాత్రమే థియేటర్లలోకి రానుంది. అలానే ఈ చిత్రాలతో పాటు సిద్ధార్, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', పన్నెండేళ్ల క్రితం శర్వానంద్, అంజలి జై కాంబినేషన్లో వచ్చిన 'జర్నీ' సినిమా కూడా రీ రిలీజ్ కానున్నాయి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు ప్రేమ కథా చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై', మొహబ్బతే వంటి హిట్ సినిమాలు కూడా రానున్నాయి. ఈ వాలెంటైన్స్ డే నాడు సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు. -
ఢిల్లీ మెట్రోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వార్తా సంస్థ ఏఎన్ఐ విడుదల చేసిన వీడియోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చుట్టూ భద్రతా అధికారులు నిలుచుని ఉన్నారు. మెట్రో నిర్వహణ గురించి డీఎంఆర్సీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి ముర్ముకు తెలియజేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. #WATCH | President Droupadi Murmu takes a metro ride in Delhi. pic.twitter.com/Elc2pdUmHJ — ANI (@ANI) February 7, 2024 -
ఈమె స్టార్ హీరోయిన్, ఆ ఒక్క సినిమాతో చాలా ఫేమస్.. కానీ ఆ తర్వాతే!
ఈమెని చూస్తే అచ్చ తెలుగమ్మాయి అనుకుంటారు. కానీ ఈమెది తెలుగు కాదు. సొంత భాషలో కెరీర్ సంగతి పర్లేదు కానీ తెలుగులో మాత్రం ఒకే ఒక్క సినిమాతో యమ క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత మాత్రం టాలీవుడ్లో సరిగా కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోయింది. భారీ బడ్జెట్ సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు అనన్య. అరె.. ఈమెని ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుంటున్నారా? పర్లేదు కాస్త గుర్తుపట్టారనమాట. కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ అసలు పేరు అయిల్య గోపాలకృష్ణ. కాకపోతే సినిమాల్లోకి వచ్చేసరికి అనన్య అని పేరు మార్చుకుంది. తండ్రి నిర్మాత కావడంతో చిన్నప్పుడే ఒకటి రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) ఇక డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్చరీలో(విలువిద్య) రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే టైంలో ఈమెకు మూడు నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ వాటికి నో చెప్పింది. కానీ కొన్నిరోజుల తర్వాత 'పాజిటివ్' అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2008 నుంచి ఇప్పటికీ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. 'జర్నీ' సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కి దగ్గరైపోయింది. ఆ తర్వాత హీరోయిన్గా తెలుగులో 'అమాయకుడు' అని స్ట్రెయిట్ మూవీ చేసింది. కానీ ప్లాఫ్ అయింది. గత కొన్నాళ్లలో అయితే 'అఆ', 'మహర్షి' లాంటి తెలుగు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసింది కానీ టాలీవుడ్లో ఇదేమంతగా ఉపయోగపడలేదు. దీంతో పూర్తిగా మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. నటిగా కొనసాగుతూనే 2012లో ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతానికైతే ఓవైపు ఫ్యామిలీ, మరోవైపు యాక్టింగ్ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. అయితే చాలారోజుల తర్వాత ఈమెని చూసి నెటిజన్స్ గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ఈమె 'జర్నీ' హీరోయిన్ కదా అని గుర్తుపట్టారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) View this post on Instagram A post shared by SuMaN RaMdAs 🇮🇳 (@the_art_of_photographer) -
సో బ్యూటిఫుల్..సో ఎలిగెంట్: నటి ఫిట్నెస్ జర్నీ , ఫ్యాన్స్ ఫిదా
చాలామంది మహిళల్లో ప్రెగ్నెన్సీలో బాగా బరువు పెరుగుదల కనిపిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే గర్భధారణకు ముందు ఆ తరువాత అన్నట్టు తయారవుతుంది మహిళల ఫిట్నెస్ పరిస్థితి. ప్రసవం తరువాత సహజంగా బరువు తగ్గడం అనేది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. మళ్లీ మునుపటి స్థాయికి చేరాలంటే అంత సులభం కాదు. చేయాల్సిన కసరత్తు చాలానే ఉంటుంది ఒకవైపు బిడ్డకు తల్లిపాలు, ఆలన పాలనా చూసుకుంటూనే తమ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీనికి సాధారణంగా ఆరు నెలలనుంచి రెండేళ్ల వరకు పట్టవచ్చు. కానీ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మూడు నెలల్లో 20 కేజీలు బరువు అందర్నీ ఆశ్చర్యపరిచ్చింది. 2022లో మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ సోషల్ మీడియాలో తన పోస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ప్రసవానంతర బరువు తగ్గే క్రమంలోన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఇన్‌స్టాలో 35.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఈ నటి “వావ్.. 20 కిలోలు తగ్గాను ... ఇంకా 6 కిలోలు తగ్గాలి అంటూ చెప్పుకొచ్చింది.మళ్లీ తనలా మారడానికి 16 నెలలు పట్టిందనే విషయాన్ని చెబుతూ లెహంగాలో అమేజింగ్లుక్లో ఉన్న కొన్ని చిత్రాలను ఫ్యాన్స్‌కు షేర్ చేసింది.ఎటువంటి క్రాష్ డైట్లు , క్రేజీ వర్కౌట్లు లేకుండానే తనని తాను, కొడుకును చూసుకుంటూ నిదానంగా ఈ స్థాయికి వచ్చానంటూ తన జర్నీ గురంచి పోస్ట్ చేసింది.దీంతో ఫ్యాన్స్ వావ్.. అద్భుతం అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) కాగా వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లొ వివాహం చేసుకుందిసోనమ్.నటి చివరిగా 'బ్లైండ్ మూవీలో కనిపించిన ఈమె మంచి స్క్రిప్ట్‌తో ఉంటే OTT ప్లాట్‌ఫారమ్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇటీవల ప్రకటించింది.మంచి కంటెంట్ ,మంచి సినిమాలో భాగం కావడం తనకు ముఖ్యమని తెలిపింది. -
సంక్రాంతి ప్రయాణం సాఫీగా..
చౌటుప్పల్, కోదాడ : సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగిపోయేందుకు జీఎంఆర్ సంస్థ, పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై పండగ వేళ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు సంక్రాంతి పండుగకు తమ స్వస్థలాలకు వెళ్తారు. ముఖ్యంగా హైదరాబాద్, ఆ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లేవారితో 65వ నంబర్ హైవేపై విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ మినహా మిగతా అన్ని ప్రాంతాలకు రోడ్డుమార్గంలో వెళ్లే వారికి ఇదే ప్రధాన రహదారి. లెక్కకు మించిన వాహనాలు బారులు తీరడంతో సంక్రాంతి సమయంలో ఈ హైవేపై ట్రాఫిక్ నత్తనడకన సాగుతుంది. ఇక సంక్రాంతికి ముందు రోజైతే టోల్గేట్ల వద్ద గంటల తరబడి స్తంభించిపోతుంది. ఇక ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఇక అంతే. ఈ నేపథ్యంలో.. శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు దృష్టిలో ఉంచుకుని జీఎంఆర్ సంస్థ ఇప్పటికే తగు చర్యలు చేపట్టింది. మరోవైపు పోలీసులు కూడా అవసరమైన చర్యలు చేపట్టారు. కాగా స్వస్థలాలకు బయలుదేరిన ప్రయాణికులతో గురువారం నాడే హైవేపై రద్దీ పెరిగింది. సొంతవాహనాలపైనే రాక పోకలు సంక్రాంతి సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోంది. గతంలో ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునేవారు. ప్రస్తుతం ఎక్కువగా సొంత వాహనాల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్లు, బస్సుల్లోని రద్దీని తట్టుకోలేక కొందరు అద్దె వాహనాలను తీసుకొని స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారు. దీంతో హైవేపై రద్దీ ఏర్పడుతోంది. గతేడాది సంక్రాంతి పండుగ సమయంలో రోజూ 55 నుంచి 60 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 70 నుంచి 75 వేల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్లాక్స్పాట్ల వద్ద భద్రంగా వెళ్లాలి హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించినప్పటికీ వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు 275 కి.మీ. దూరం ఉండగా అందులో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం నుంచి కృష్ణా జిల్లా నందిగామ శివారు వరకు 181 కి.మీ. మేర టోల్రోడ్డు ఉంది. కాగా ఈ మార్గంలో ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్లు) చాలా ఉన్నాయి. ఆయా ప్రాంతాలను అధికారులు గుర్తించారు. దండుమల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, చౌటుప్పల్, అంకిరెడ్డిగూడెం, పంతంగి, రెడ్డిబావి, పెద్దకాపర్తి, చిట్యాల, గోపలాయిపల్లి, ఏపీ లింగోటం, కట్టంగూర్, పద్మానగర్ జంక్షన్, ఇనుపాముల, కొర్లపహాడ్, టేకుమట్ల, చీకటిగూడెం, సూర్యాపేట శివారు (జనగామ క్రాస్‌రోడ్డు), మునగాల, ముకుందాపురం, ఆకు పాముల బైపాస్, కొమరబండ వై జంక్షన్ కట్టకొమ్ముగూడెం క్రాస్‌రోడ్డు, రామాపురం క్రాస్‌రోడ్డు, నవాబ్‌పేట, షేర్‌మహమ్మద్‌పేట ప్రాంతాలను ప్రధాన బ్లాక్స్పాట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణకు లైటింగ్, సైన్ బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టారు. రేడియం స్టిక్కర్లతో కూడిన రోడ్ మార్జిన్ మార్కింగ్‌లూ వేశారు. ప్రతి 20 కిలోమీటర్లకుఒక అంబులెన్స్ సంక్రాంతి రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీఎంఆర్ సంస్థ ఎన్హెచ్ఏఐ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసింది. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌తో కూడిన వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ క్రేన్లను సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో టోల్‌ప్లాజా పరిధిలో షిప్టుకు 20మంది చొప్పున అదనపు సిబ్బందిని జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, కీసర ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలు ఉన్నా యి. పోలీస్‌శాఖ ప్రతి టోల్‌ప్లాజా వద్ద 20 మంది పోలీస్‌లతో ప్రత్యేక టీమ్‌లను నియమించనుంది. రిస్క్ మేనేజ్మెంట్ టీమ్‌లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా 1033 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. పొద్దునే ప్రయాణం వద్దు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఉదయం పొగమంచు అధికంగా ఉంటోంది. దీని వల్ల రహదారిపై ప్రమా దాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ. ఉదయం పొగమంచు తగ్గిన తర్వాతే ప్రయాణాలు పెట్టుకోవాలని కూడా పోలీసులు చెపుతున్నారు. రహదారిపై ప్రమాదం జరిగే చాన్స్ ఉన్న ప్రదేశాలను ముందుగానే తెలుసుకుని జాగ్రత్తగాప్రయాణించాలని పేర్కొంటున్నారు. ఫాస్టాగ్ సరిచూసుకోండి వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్ వ్యాలిడిటీ ఉందో లేదో చూసుకోవాలి. సరిపడా నగదు ఉందో లేదో గమనించాలి. బ్లాక్‌లిస్టులో పడితే తిరిగి అప్డేట్ కావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్నా నగదు లేకపోతే టోల్ బూత్‌లోకి వెళ్లాక ఆ విషయం తెలిస్తే లైన్లోనే చిక్కుకోవాల్సి వస్తుంది. అప్పటికప్పుడు రీచార్జ్ చేసినా సేవలు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. అక్కడ కాస్త జాగ్రత్త అబ్దుల్లాపూర్ మెట్: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ వరకు 24 కిలోమీటర్ల మేర విజయవాడ జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వనస్థలిపురం నుంచి దండుమల్కాపూర్ వరకు పనులు ప్రారంభంగా కాగా నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో మాత్రమే రోడ్డు విస్తరణ పూర్తి దశకు చేరుకుంది. చాలా చోట్ల రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వాహనాల సంఖ్య పెరిగిన సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు హైదరాబాద్ – విజయవాడ హైవేపై ప్రమాదాల నివారణకు పెట్రోలింగ్ పెంచాం. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపకుండా, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా పరిధిలో కొన్ని ప్రధాన బ్లాక్ స్పాట్స్ గుర్తించాం. ఇక్కడ ప్రమాదాలు సంభవించకుండా నిబంధనలు అమలు చేస్తున్నాం. స్పీడ్ లిమిట్ బ్లింక్ లైట్స్ ఏర్పాటుతో రోడ్డుపై లైనింగ్ వేస్తాం. హైవే వెంట ఉన్న గ్రామాల ప్రజలకు, రైతులకు రాంగ్ రూట్లో వెళ్లవద్దని చెబుతున్నాం. –రాహుల్‌హెగ్డే, ఎస్పీ, సూర్యాపేట జిల్లా సురక్షిత ప్రయాణానికి తగిన ఏర్పాట్లు సంక్రాంతి పండుగ రద్దీని ఇప్పటికే అంచనా వేశాం. ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్రీధర్‌రెడ్డి, జీఎంఆర్ సంస్థ మేనేజర్ రోడ్డుపై వాహనాలు నిలపొద్దు జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్ల వద్ద అధికారులు వేగాన్ని, వాహనాలను నియంత్రించడానికి స్పీడ్ కంట్రోల్ స్టాపర్లను, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించడంతో పాటు రోడ్డుమీద ఉన్న స్పీడ్ స్టాపర్లను గమనించాలని, అతివేగంగా వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుపై వాహనాలను నిలపవద్దని కోరుతున్నారు. -
430 నగరాల నుంచి అయోధ్యకు నేరుగా 72 రైళ్లు..
అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అనంతరం అయోధ్యను సందర్శించేవారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయోధ్య సందర్శనకు వచ్చే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఏసీ మొదలుకొని స్లీపర్ క్లాస్, జనరల్ సౌకర్యాలతో కూడిన అన్ని రకాల రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. అయోధ్య వైపు వెళ్లే రైళ్ల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నదని సమాచారం. ప్రస్తుతం అయోధ్యకు 35 రైళ్లు నడుస్తున్నాయి. రోజువారీ రైళ్లతో పాటు, వీక్లీ రైళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు జనవరి 22 నుంచి 37 అదనపు రైళ్లను నడపనున్నారు. దీంతో దేశంలోని 430 నగరాల నుంచి మొత్తం 72 రైళ్లు అయోధ్యకు నడవనున్నాయి. దీని గురించి రైల్వే మంత్రిత్వ శాఖ సమాచార, ప్రచురణ డైరెక్టర్ శివాజీ మారుతీ సుతార్ మాట్లాడుతూ భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు అదనపు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మరిన్ని నగరాలను నేరుగా అయోధ్యకు అనుసంధానం చేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇది కూడా చదవండి: బాలరామునికి బొమ్మల బహుమానం -
ప్రేమికుల రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా 'రీ రిలీజ్'
దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన 'జర్నీ' సినిమా అప్పట్లో యూత్‌ను ఎంతగానో కట్టిపడేసింది. అంజలి, జై, శర్వానంద్, అనన్య జోడిగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను చూసిన వారందరూ ఇప్పటి జనరేషన్లో టువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అనేంతగా సినిమా కథలో హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఇందులోని ప్రేమ కథలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీ.సత్య సంగీతం అందించారు. అప్పట్లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. 2011 సెప్టెంబర్ 16న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్‌ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్లో ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్‌లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ.సుప్రియ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్‌గా మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ప్రేమికులకు ఈ సినిమా మంచి ఫీస్ట్ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
ముంబయి నుంచి అయోధ్యకు ముస్లిం మహిళ పాదయాత్ర
లక్నో: రాముడు ఆదర్శపురుషుడు. సర్వవ్యాప్తమైన రాముని జీవన విధానం ఆచరణీయం. రామునిపై విశ్వాసం అందరిసొంతం అని నిరూపిస్తోంది ఓ ముస్లిం మహిళ. అయోధ్య రామున్ని దర్శించుకోవడానికి ముంబయి నుంచి కాలినడకన బయలు దేరింది. ఆమె సహచరులతో కలిసి ఏకంగా 1,425 కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణిస్తోంది. ముంబయికి చెందిన షబ్నమ్‌కు రాముడంటే ఎంతో ఇష్టం. అయోధ్యలో కొలువుదీరనున్న రామున్ని దర్శించుకోవడానికి కాలినడకనే వెళ్లాలని నిర్ణయించుకుంది. తన సహచరులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేలతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించింది. ముస్లిం మహిళను అయినప్పటికీ రామున్ని పూజించడానికి అచంచలమైన భక్తి ఒక్కటే అర్హతని అంటోంది. రామున్ని పూజించడానికి హిందువు కానవసరం లేదని పేర్కొంది. మంచి మనిషిగా జీవించడమే ముఖ్యమని చెబుతోంది. ప్రస్తుతం యాత్రలో మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. ప్రతి రోజూ 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది. సుధీర్ఘ యాత్రలో అలసట వచ్చినప్పటికీ రామునిపై ఉన్న భక్తే తమ యాత్రను కొనసాగిస్తోందని షబ్నమ్ తెలిపింది. రాముని ఆరాధన ఏ ప్రత్యేక మతం లేదా ప్రాంతానికి పరిమితం కాదని, అది సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తాన్ని చుట్టుముడుతుందని షబ్నమ్ గట్టిగా నమ్ముతోంది. మతంతో సంబంధం లేకుండా రాముడు అందరివాడనే ప్రేరణ కలిగించడానికే యాత్రను చెపట్టినట్లు పేర్కొంది. అబ్బాయిలు మాత్రమే ఇలాంటి కష్టతరమైన యాత్రలు చేయగలరనే అపోహను దూరం చేస్తానంటోంది. యాత్రలో వీరిని కలిసిన పలువురు ఫొటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అయితే.. షబ్నమ్ పాదయాత్రకు సవాళ్లు తప్పలేదు. ఆమెకు భద్రత కల్పించడమే కాకుండా భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు. సున్నితమైన ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో కొందరు ద్వేషిస్తున్నప్పటికీ.. షబ్నమ్ తన ప్రయాణాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. విశేష స్పందనలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని తెలిపింది. రాముని జెండాను పట్టుకుని నడుస్తున్నప్పుడు ముస్లింలతో సహా అనేక మంది 'జై శ్రీరామ్' అని నినదించిన ఆనంద క్షణాలను అనుభవించానని షబ్నమ్ చెబుతోంది. -
ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !
శ్రీలంకకు వాయుమార్గం, జలమార్గాల్లో వెళ్లవచ్చు. అక్కడి రోడ్లు నల్లగా నున్నగా మెరుస్తూ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన దేశ ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. విమాన ప్రయాణం, పడవ ప్రయాణం, రోడ్డు ప్రయాణం తర్వాత మిగిలింది రైలు ప్రయాణమే. శ్రీలంక ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే ట్రైన్లో ప్రయాణించాల్సిందే. గంటకు పాతిక కిమీమీటర్ల వేగంతో ప్రయాణించే టాయ్ ట్రైన్ జర్నీ ఆద్యతం అలరించడమే కాదు, ఆ దారిలో వచ్చే చిన్న చిన్న గ్రామాలు స్థానికుల సౌకర్యాలతో కూడిన నిరాడంబరమైన జీవనశైలిని కళ్లకు కడుతుంది. బౌద్ధ ప్రాశస్త్య్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ నుంచి వెళ్లిన మా మహిళా విలేకరులమందరం ‘నాను వోయా’లో టాయ్ ట్రైన్ ఎక్కాం. పిల్లలతో ప్రయాణం టాయ్ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్లకు డిమాండ్ ఎక్కువ. ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. మిగతా తరగతులు కూడా రద్దీగా ఉంటాయి. మేము వెళ్లిన రోజు ఒక స్కూల్ నుంచి దాదాపుగా డెబ్బై మంది పిల్లలు మాతో ప్రయాణించారు. వాళ్లు జురాసిక్ పార్క్ సినిమా చూడడానికి వెళ్తున్నారు. ‘ఎల్లా’ కంటే ముందు ఒక స్టేషన్లో దిగేశారు. ఆ పిల్లల పేర్లన్నీ భారతీయతతో ముడిపడినవే. సంస్కృత ద్రవిడ సమ్మేళనంగా ఉన్నాయి. అయితే నకారాంతాలుగా లేవు, అన్నీ అకారాంతాలే. పిల్లల స్కూల్ డ్రస్ మీద వాళ్ల పేర్లు కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. వాటిని మనసులో చదువుకుని పైకి పలుకుతుంటే ఏదో సొగసుదనం ఉంది. పిల్లలు చక్కటి ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. రైలు ప్రయాణించే దారిలో వచ్చే స్టేషన్ల పేర్లను మేము తడుముకుంటూ చదువుతుంటే మా ఉచ్చారణను సరిదిద్దుతూ మా ప్రయాణానికి మరింత సంతోషాన్నద్దారా పిల్లలు. మబ్బుల్లో విహారం నాను వోయా స్టేషన్ క్యాండీ నగరానికి 70 కిమీల దూరంలో, నువారా ఎలియాకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిల్స్టేషన్ల మధ్య సాగే ప్రయాణం అది. దట్టంగా విస్తరించిన అడవుల మధ్య టక్‌టక్‌మని శబ్దం చేస్తూ వెళ్తుంది రైలు. ఆకాశాన్ని తాకడానికి పోటీ పడి పెరిగినట్లున్న వృక్షాల తలలను చూడడానికి తల వంచిన కిటికీలో నుంచి పైకి చూసే ప్రయత్నం అయితే చేస్తాం, కానీ మనకు మొదళ్లు కనిపించిన వృక్షాల తలలను చూడలేం. లోయలో నుంచి పెరిగి వచ్చిన వృక్షాల తలలను మాత్రమే చూడగలం. పచ్చటి ప్రకృతి చిత్రం చూస్తూ ఉండగానే మసకబారుతుంది. ఏంటా అని పరికించి చూస్తే మందపాటి మబ్బు ప్రయాణిస్తూ ఉంటుంది. రైలును తాకుతూ వెళ్లే మబ్బు కిటికీ లో నుంచి దూరి మనల్ని చల్లగా తాకి పలకరిస్తుంది. ఈ దారిలో కొండల మధ్య జలపాతాలు కూడా ఎక్కువే. జలపాతం సవ్వడి వినిపించనంత దూరంలో కనువిందు చేస్తుంటాయి. హాయ్ హాయ్‌గా... రైలు అర్ధచంద్రాకారపు మలుపుల్లో ప్రయాణించేటప్పుడు కిటికీలో నుంచి బయటకు చూస్తే లెక్కలేనన్ని చేతులు స్మార్ట్ ఫోన్లు, హ్యాండీకామ్‌లతో ఫొటో షూట్ చేస్తూ కనిపిస్తాయి. ఈ రైల్లో స్థానికులు వారి అవసరార్థం ప్రయాణిస్తారు. పర్యాటకులు ప్రకృతి పరవశం కోసమే ప్రయాణిస్తారు. ప్రతి విషయాన్ని స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయాలనే పాశ్చాత్య పర్యాటకులు ఈ రైల్లో ఎక్కువగా కనిపిస్తారు. వాళ్లు ముందుగానే ఫస్ట్ క్లాస్‌లో బుక్ చేసుకుంటారు. కొండలను కలుపుతూ వేసిన వంతెనలు, కొండను తొలిచిన సొరంగాల మధ్య సాగే ఈ ప్రయాణం మన తెలుగు రాష్ట్రంలో విశాఖ– అరకు ప్రయాణాన్ని, ఊటీ టాయ్ ట్రైన్ జర్నీని తలపిస్తుంది. బ్రిటిష్ పాలకులు నిర్మించిన రైలు మార్గం ఇది. అప్పటి నుంచి నిరంతరాయంగా నడుస్తూనే ఉంది. పర్యాటకులు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరపాటులో చేసే ప్రయాణం కాదిది. దృష్టి మరలిస్తే చూడాల్సిన వాటిలో ఏం మిస్సవుతామోనన్నంత ఉత్సుకతతో సాగే ప్రయాణం. మన స్టేషన్ త్వరగా రావాలని కూడా ఉండదు. రైల్లో ఒక బోగీలో వాళ్లకు మరో బోగీలో ఉన్న వాళ్లు ‘హాయ్’ చెప్పుకుంటూ చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ ప్రయాణిస్తారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: రావణ్ ఫాల్స్... ఎల్లా!) -
కృష్ణా తరంగాలపై ఆధ్యాత్మిక యాత్ర
సాక్షి, అమరావతి: జీవన వాహిని కృష్ణవేణి ప్రవాహ మార్గంలో ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రదేశాలు ఎన్నో.. అటువంటి కృష్ణమ్మ ఒడిలో పడవపై ఆధ్యాత్మిక యాత్రకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)శ్రీకారం చుడుతోంది. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక శోభ కలయికగా ప్రాజెక్టును రూపొందిస్తోంది. విజయవాడ నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై ప్రత్యేక బోటు తిప్పేందుకు చర్యలు చేపడు తోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని మూడు దేవా లయాలు, 2 పర్యాటక ప్రాంతాలను ఒక్క రోజులో చుట్టివచ్చేలా ప్రయాణ మార్గాన్ని రూపొందిస్తోంది. 80 కిలోమీటర్ల ప్రయాణం ఎకో–ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా ఏపీటీడీసీ కృష్ణానదిలో రానుపోనూ సుమారు 80 కిలోమీటర్ల బోటు ప్రయాణాన్ని అందుబాటులోకి తేనుంది. విజయవాడలోని బెరంపార్కులో బయలుదేరే బోటు తొలుత కనకదుర్గమ్మ ఘాట్‌కు చేరుకుంటుంది. అమ్మవారి దర్శనం తరువాత అనంతవరంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం, అక్కడి నుంచి పంచారామాల్లో ఒకటైన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దర్శనం చేయిస్తారు. మధ్యాహ్నం భోజనం తరువాత తిరుగు ప్రయాణంలో పవిత్ర సంగమం, భవానీద్వీపంలో ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది. ఈ యాత్రలో ఆలయాల దర్శనంతో పాటు భో జన సదుపాయాలను ఏపీటీడీసీ ఏర్పా టు చేస్తుంది. బోటులో గైడ్‌ను అందుబాటులో ఉంచనుంది. నాగా ర్జున సాగర్ నుంచి తీసుకొచ్చిన డబుల్ ఇంజిన్ బోటును ఏపీటీడీసీ ఈ ప్రాజెక్టు కోసం సిద్ధం చేస్తోంది. 40–45 మంది పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా ఈ బోటులో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణ సమయంలో పర్యాటకులకు బో టు లోనే ఆహారం అందుబాటులో ఉంచడంతో పాటు ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లోనూ అమృత్ కియోస్క్‌లను ఏపీటీడీసీ ఏర్పాటు చేయనుంది. అధికారుల బృందం అమరావతి వరకు ట్రయల్ రన్ పూర్తి చేసింది. బోటు సిద్ధమైన తరువాత అధికారికంగా మరోసారి ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం ప్రాజెక్టును ప్రారంభిస్తారు. టికెట్ రేట్లు నిర్ణయించేందుకు ఏపీటీడీసీ ప్రత్యేక కమిటీని నియమించనుంది. తొలుత వారాంతాల్లో ఒకసారే ఈ యాత్రను చేపట్టాలని భావిస్తోంది. పర్యాటకుల ఆసక్తి మేరకు నెమ్మదిగా యాత్రల సంఖ్యను పెంచనుంది. 4 వారాల్లోగా బోటును సిద్ధం చేసి కార్తీకమాసంలో యాత్రకు పచ్చజెండా ఊపేలా కసరత్తు చేస్తోంది. ఈ ప్యాకేజీలో స్పెషల్ దర్శనం పర్యాటకులకు దైవ దర్శనంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా కృష్ణానదిపై బోటు యాత్రను తీసుకొస్తున్నాం. పటిష్ట భద్రత మధ్య ప్రయాణం సంతోషంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వాటర్ సర్క్యూట్ టూరిజం కచ్చితంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బస్సులో వెళ్లి దైవ దర్శనం చేసుకోవడంతో పోల్చితే ఇది ఎంతో సులభంగా ఉంటుంది. ఈ ప్యాకేజీలో స్పెషల్ దర్శనం కల్పించడంతో పాటు ప్రసాదం అందజేస్తాం. ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతో పాటు సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలకు మరింత వెలుగులు అద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ -
ఈమెను గుర్తు పట్టారా? సేల్స్ వుమన్ నుంచి...
భారతదేశంలో ఎందరో మహిళలు అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. అత్యంత ప్రభావంతమైన పదవులను నిర్వహించారు.. నిర్వహిస్తున్నారు. అలాంటి కోవకు చెందినవారే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman). నేడు (ఆగస్ట్ 18) ఆమె పుట్టిన రోజు. 64 ఏళ్లు పూర్తయి 65వ యేడులోకి అడుగుపెట్టారు. భారతదేశ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఇంటరాక్టివ్ లీడర్షిప్ స్టైల్‌కు పేరుగాంచారు. కీలకమమైన ఈ పదవిని నిర్వహించిన రెండవ మహిళ, పూర్తి సమయం మహిళా ఆర్థిక మంత్రిగా పనిచేసిన మొదటి మహిళ నిర్మలా సీతారామన్. సేల్స్ వుమన్ నుంచి.. సేల్స్ వుమన్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అయ్యే వరకు నిర్మలా సీతారామన్ ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. ఆమె పదునైన వాక్పటిమ, చతురత, అంకితభావం, ప్రతిభకు ముఖ్యమైన ఆర్థిక మంత్రి పదవి దక్కింది. తమిళనాడులోని మధురైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1959 ఆగస్టు 18న నిర్మలా సీతారామన్ జన్మించారు. ఆమె తల్లి సావిత్రి సీతారామన్ గృహిణి. తండ్రి నారాయణ్ సీతారామన్ రైల్వేలో పనిచేశారు. విద్యాభ్యాసం తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాల నుంచి ఎకనామిక్స్‌లో బీఏ పూర్తి చేసిన నిర్మలా సీతారామన్ 1984లో జేఎన్‌యూ నుంచి మాస్టర్స్ డిగ్రీని అభ్యసించించారు. ఇండో-యూరోపియన్ టెక్స్టైల్ ట్రేడ్‌పై పరిశోధనలో పీహెచ్డీ కూడా చేశారు. ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PWC)లో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. కొంత కాలం పాటు బీబీసీతో కూడా ఆమెకు అనుబంధం ఉంది. ఆర్థిక మంత్రిగా ముద్ర.. పార్లమెంట్ వర్షాకాల సెషన్లో, ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లపై 28 శాతం ట్యాక్స్ ప్రవేశపెట్టడంతోపాటు జీఎస్టీ చట్టాలకు ముఖ్యమైన సవరణలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవిత బీమా పథకాలు, ఆర్థిక చేరికకు సంబంధించిన పథకాల అమలులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB) ప్రాముఖ్యతను నిర్మలా సీతారామన్ నొక్కిచెప్పారు. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం ద్వారా కొత్త ఆదాయపు పన్ను స్లాబ్‌లను ప్రవేశపెట్టడం ఆమె సాధించిన ముఖ్యమైన విజయాలలో ఒకటి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి నాయకత్వం వహించడంలో సీతారామన్ కీలక పాత్ర పోషించారు. ఈ చర్యను 2020లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ వ్యూహాత్మక పునర్నిర్మాణం వల్ల ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. బ్యాంకుల విలీనంతో భారత బ్యాంకింగ్ రంగం మరింత సామర్థ్యం చేకూరింది. -
ఆరుదైన ఫీట్ చేరుకున్న రాధిక శరత్‌కుమార్
నటి రాధిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన బహుభాషా నటి ఆమె. ఆమె నిర్మాతగా పలు చిత్రాలు, సీరియళ్లు నిర్మించారు. ఆరుపదుల వసంతాలను దాటిన ఈమె ఇప్పటికీ నాట్ అవుట్‌గా నటిస్తూనే ఉన్నారు. నటిగా 45 వసంతాలను పూర్తి చేసుకున్నారు. (ఇదీ చదవండి: హన్సిక సంగతేంటి నెల్సన్..?) 1978లో దర్శకుడు భారతీ రాజా కిళక్కే పోగుమ్ రయిల్ అనే తమిళ చిత్రం ద్వారా రాధికను కథానాయకిగా పరిచయం చేశారు. అది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ చిత్రంలోని పూవరసంపు పూత్తాచ్చు అనే పాట ఇప్పటికీ తమిళనాడులో వాడ వాడలా మారుమోగుతూనే ఉంది. ఆ తర్వాత తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తూ తెలుగు, హిందీ భాషల్లోనూ తన సత్తాను చాటారు రాధిక శరత్ కుమార్. సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించారు. పలు జాతీయ, రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. ఆమె నిర్మించి, నటించిన ఒరుకాదల్ కథై చిత్ర దర్శకుడికి ఇందిరాగాంధీ అవార్డు వరించింది. కాగా ఈమె నటిగా 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం తన భర్త శరత్ కుమార్‌తో కలిసి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బాహుబలి కట్టప్ప కుటుంబంలో తీవ్ర విషాదం) -
హీరోగా చేస్తున్న సమయంలో విలన్‌గా ఆఫర్.. అయినా ఓకే!
నిరోజ్ పుచ్చా హీరోగా ధీన రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భారతీయన్స్’. శంకర్ ఎన్. అడుసుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ అయింది. శనివారం విలేకరుల సమావేశంలో నిరోజ్ పుచ్చా మాట్లాడుతూ– ‘‘2019లో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్‌తో నా యాక్టింగ్ జర్నీ మొదలైంది. ‘భారతీయన్స్’ చేస్తున్నప్పుడే నాకు విలన్‌గా చాన్స్ వస్తే, ఓకే చెప్పాను. ఎందుకంటే హీరోనా? విలనా అని కాదు.. యాక్టర్‌గా నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
జాబిలిపై అన్వేషణకు ఇస్రో చంద్రయాన్-3
-
యాదాద్రి: ఫోన్‌ను రక్షించుకోబోయి టెక్కీ దుర్మరణం
సాక్షి, హన్మకొండ: విధి ఎంత విచిత్రమైందో.. సంతోషాన్ని క్షణాల్లోనే ఆవిరి చేసేస్తోంది. శ్రీకాంత్(25) అనే యువకుడిని జీవితం అలా అర్థాంతరంగా ముగిసిపోయింది. సెల్‌ఫోన్‌ను రక్షించుకోవాలనే తాపత్రయంతో రన్నింగ్ ట్రైన్ నుంచి పడి ప్రాణం కోల్పోయాడా యువకుడు. శాతావాహన్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం బీబీనగర్(యాదాద్రి భువనగిరి) సమీపంలో ఈ విషాదం జరిగింది. కమలాపూర్ మండలం నేరెళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముప్పు శ్రీకాంత్ అనే యువకుడు బీబీనగర్ సమీపంలో శాతావాహన్ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి మృతి చెందాడు. శ్రీకాంత్ హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. తొలిఏకాదశి, బక్రీద్ సెలవు దినం సందర్భంగా.. ఇంటికి వెళ్లేందుకు బుధవారం సాయంత్రం శాతవాహన ఎక్స్ ప్రెస్‌లో వరంగల్ బయల్దేరాడు. అయితే.. జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నాడు శ్రీకాంత్. మార్గం మధ్యలో బీబీ నగర్ వద్ద కర్రతో కొట్టి సెల్ ఫోన్ చోరీ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే సెల్‌ఫోన్‌ను కాపాడుకునే తాపత్రంలో శ్రీకాంత్ పట్టుజారి రైలు నుండి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగకు ఇంటికి కొడుకు వస్తాడని సంతోషంగా ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు.. కొడుకు శవం ఎదురు రావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదీ చదవండి: తండ్రి చేతిలో హతం.. ప్రియురాలు లేని జీవితం ఎందుకనుకుని.. -
క్యాట్ థెరపీ: లవ్యూ అంటూ ముచ్చటపడుతున్న నెటిజన్లు
ఎన్నిసార్లు రైల్లో ప్రయాణం చేసినా,రిజర్వేషన్ ఉన్నాకూడా ట్రాఫిక్ మహా సముద్రాన్ని ఈది స్టేషన్‌కు చేరి, ట్రైన్ ఎక్కి మన సీట్లో మనం కూర్చునేదాకా మహా గొప్ప టెన్షన్.. అలాగే ఎంత అనుభవం ఉన్నా.. ఎన్నిసార్లు గాల్లో విహరించినా ఎక్కిన ఫ్లైట్ దిగేదాకా విమాన ప్రయాణం అంటే అదో అలజడి. ఎలాంటి వారికైనా కొద్దో.. గొప్పో..ఈ ఒత్తిడి తప్పదు కదా. బహుశా అందుకేనేమో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. USA టుడే ప్రకారం బ్లాక్ అండ్ వైట్ రెస్క్యూ క్యాట్ ఇటీవలే విమానాశ్రయంలోని వాగ్ బ్రిగేడ్‌లో చేరింది. విమాన ప్రయాణీకుల ఒత్తిడిని, ఆందోళనను తగ్గించేందుకు ఈ అందమైన పిల్లి సిద్ధంగా ఉంటుంది. ఈ తరహా థెరపీని అందిస్తున్న మొదటి పిల్లి డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్. 14 ఏళ్ల థెరపీ క్యాట్ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సరికొత్త ఉద్యోగి. మా డ్యూక్ అసలు ఎవర్నీ నిరాశపర్చదు. ఒక్క క్షణం డ్యూక్‌ని పలకరిస్తే ప్రయాణ టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, ఎలాంటి భయం, బెరుకూ లేకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకులతో ఎలా మెలాగాలో, వారిలో ఒత్తిడిని పొగొట్టి, నవ్వులు ఎలా పూయించాలో కూడా ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారట. యానిమల్ థెరపిస్ట్‌గా సర్టిఫికేట్ కూడా పొందిందట. ఎయిర్‌పోర్ట్‌లో ఊపుకుంటూ తిరుగుతూ, పలకరిస్తూ, నవ్వులు పూయిస్తున్న డ్యూక్‌ని చూసిన ప్రయాణికులు, అందులోనూ క్యాట్ లవర్స్ తెగ మురిసిపోతున్నారట. దీంతో డ్యూక్‌ని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో యానిమల్ కేర్ అండ్ కంట్రోల్ 2010లో ఆకిలితో ఉన్న ఈ పిల్లిని గుర్తించడంతో ఒక కుటుంబం దీన్ని దత్తత తీసుకుంది శాన్ ఫ్రాన్సిస్కో సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ ద్వారా డ్యూక్ థెరపీ యానిమల్ శిక్షణ పొందింది. కాగా శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం ఈ కార్యక్రమాన్ని 2013లో ప్రారంభించింది. సర్టిఫైడ్ థెరపీ జంతువులను టెర్మినల్స్‌లో ఉంచుతుంది. తద్వారా ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చడమే లక్ష్యమని విమానాశ్రయ అధికారుల మాట. -
ఒడిశా రైలు ప్రమాదం: ‘లడ్డూ గోపాలుడే నన్ను కాపాడాడు’
‘భూమిపై ఇంకా నూకలున్నాయి’ ఈ నానుడి ఒడిశా రైలు దుర్ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నవారిని చూస్తే నూటికి నూరుశాతం నిజం అనిపిస్తుంది. ఒక మహిళా ప్రయాణికురాలి విషయంలో అదే జరిగింది. నిజానికి ఆమె కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేయాల్సివుంది. అయితే చివరి నిముషంలో ఆమె తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు ఈ మహిళ తన కథను వినిపించడంతో పాటు తనను లడ్డూ గోపాలుడు (శ్రీకృష్ణుడు) కాపాడానని కనిపించినవారందరికీ చెబుతున్నారు. మీడియాతో లక్ష్మీదాస్ సర్కార్ అనే మహిళ మాట్లాడుతూ తాను మిగిలిన ప్రయాణికుల మాదిరిగానే జూన్ 2న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సివుందన్నారు. అయితే తన కుమార్తెకు ఏదో పని ఉండటం వలన ప్రయాణం రద్దు చేసుకోవలసి వచ్చిందన్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగిందని తెలియగానే ఆమె లడ్డూ గోపాలుని విగ్రహాన్ని భక్తితో చేతుల్లోకి తీసుకుని, భగవంతునికి ధన్యవాదాలు తెలిపారు. లడ్డూ గోపాలుని దయ వలనే తాను ప్రాణాలతో ఉన్నానని పేర్కొన్నారు. హౌరాకు చెందిన లక్ష్మీదాస్ సర్కార్ జూన్ 2న షాలిమార్ నుంచి చెన్నై వెళ్లేందుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. ఆమె చెన్నైలోని తన కుమార్తెను చూసేందుకు వెళ్లాలనుకున్నారు. ఆమె కుమార్తె ఒక మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే కుమార్తెకు ఏదో పని ఉన్న కారణంగా లక్ష్మీదాస్ సర్కార్ తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని, తరువాత ఎప్పుడైనా వెళ్లవచ్చని నిర్ణయించుకున్నారు. అయితే రైలు ప్రమాదం గురించి తెలుసుకున్న ఆమె భగవంతుడే తన ప్రాణాలు కాపాడాడని చెబుతున్నారు. చదవండి: కుమారుని మృతదేహం మాయం.. కంగుతిన్న తండ్రి! -
యాంకర్ నుంచి నిర్మాత ఆ తరువాత సినిమాల్లోకి న ప్రయాణం ఎలా కొనసాగింది అంటే..!
-
ఆర్టీసీలో బ్రేక్ జర్నీ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇప్పటివరకు విమాన ప్రయాణికులకు మాత్రమే పరిమితమైన బ్రేక్ జర్నీ సదుపాయం ప్రస్తుతం ఆర్టీసీ ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సు మారిన ప్రతిసారి టిక్కెట్టును తీసుకునే వారు. ఇకపై అలాంటి అవసరం లేకుండా మల్టీ సిటీ టిక్కెటింగ్ సౌలభ్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఏదైనా పట్టణం నుంచి దూర ప్రాంతంలో ఉన్న మరో పట్టణానికి లేదా నగరానికి వెళ్లడానికి నేరుగా బస్సు సదుపాయం ఉండడం లేదు. ఇలాంటి వారు తాము వెళ్లేబోయే ప్రాంతానికి ఎక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉందో అక్కడికి చేరుకోవాల్సి ఉండేది. ఇకపై తాము బయలుదేరే చోటునుంచే వెళ్లే గమ్యస్థానానికి ఆన్లైన్ ద్వారా ఒకేసారి నేరుగా టిక్కెట్‌ను పొందవచ్చు. ఉదాహరణకు కడప నుంచి శ్రీకాకుళం వెళ్లాలంటే డైరెక్టర్‌గా ఆర్టీసీ సర్వీసు లేదు. విశాఖపట్టణం ఒక బస్సులో వచ్చి శ్రీకాకుళం వెళ్లాలంటే మరో బస్సు ఎక్కి టిక్కెట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంది. అంతేకాకుండా వీరు ఎక్కిన ప్రతి బస్సులోనూ రిజర్వేషన్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చేది. అయితే ఈ మల్టీ సిటీ టిక్కెటింగ్ విధానంలో తాము వెళ్లే బస్సులో ఒకే రిజర్వేషన్ చార్జితో ప్రయాణించే వీలు కల్పించారు. మారే బస్సులోనూ ముందుగానే సీటు రిజర్వు అయి ఉంటుంది. ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానంలో ప్రయాణీకులు తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు బ్రేక్ జర్నీ సదుపాయాన్ని కల్పించారు. తాము వెళ్లే బస్సుకోసం 2 గంటల నుంచి 22 గంటల వరకు వేచి ఉన్న బ్రేక్ జర్నీలో ఆ టిక్కెట్ చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ముందు వెళ్లే వారి బస్సు మార్గమధ్యలో ఎక్కడైనా మరమ్మతుకు గురైతే ఆ ప్రయాణీకుడిని మరో బస్సులో వెంటనే పంపించి ప్రయాణానికి ఆటంకం లేకుండా చూస్తారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాయలసీమలోని 8 జిల్లాల నుంచి విశాఖ పట్టణం మినహా ఇతర దూర ప్రాంతాలకు నేరుగా ఆర్టీసీ బస్సు సదుపాయాలు లేవు. దీనిని దృష్టిలో పెట్టుకుని విశాఖ సహా శ్రీకాకుళం, విజయనగరం, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మల్టీ సిటీ టిక్కెటింగ్ (బ్రేక్ జర్నీ) సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. ప్రచారం నిర్వహిస్తున్నాం ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిన మల్టీ సిటీ టిక్కెటింగ్ సదుపాయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నాం. టిక్కెట్ కౌంటర్లలోనూ ఈ విషయం తెలియజేస్తున్నాం. అక్కడక్కడ పోస్టర్లను కూడా ప్రదర్శించనున్నాం. ఈ కొత్త విధానంలో బ్రేక్ జర్నీకి వీలు కల్పిస్తున్నాం. కడప జోన్ వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె. పుట్టపర్తి, అనంతపురం, హిందూపురం డిపోల నుంచి బ్రేక్ జర్నీ సదుపాయం కల్పిస్తున్నాం. – గోపినాథ్‌రెడ్డి, కడపజోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
అది అత్యంత వింత రోడ్డు..రోజుకు 2 గంటలే కనిపించి..
ఇప్పుడున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు హైటెక్ రోడ్లను నిర్మించే పనిలో తలమునకలై ఉన్నాయి. అయితే ఈరోజుకీ కొన్ని రోడ్లు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తున్నారు. కొండ ప్రాంతాలోని రోడ్లు భీతిగొలుపుతుంటాయి.అయితే వీటకి భిన్నంగా ప్రపంచంలో ఒక రోడ్డు ఉంది. అది రోజులో కేవలం రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో అదృశ్యం అవుతుంది. ఇంతకీ ఆ రోడ్డు ఎక్కడ ఉంది? ఆ రోడ్డు మీదుగా ఎవరు ప్రయాణిస్తుంటారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోడ్డు ఫ్రాన్స్‌లో ఉంది. ఈ రోడ్డు ప్రధాన భూభాగాన్ని నోయిర్ మౌటియర్ ద్వీపంతో కలుపుతుంది. ఈ ప్రాంతం ఫ్రాన్స్‌లోని అట్లాంటిక్ వద్ద ఉంది. ఈ రోడ్డు 4.5 కిలోమీటర్ల పొడవు కలిగివుంది. ఈ రోడ్డును ‘పాసేజ్ డూ గోయిస్’ పేరుతో పిలుస్తారు. ఫ్రెంచ్ భాషలో ‘గోయిస్’ అంటే ‘చెప్పులు విడిచి రోడ్డు దాటడం’ అని అర్థం. ఇది రోజులో ఒక గంట లేదా రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో నీటిలో మునిగిపోతుంది. ఆ సమయంలో రోడ్డుకు నలువైపులా నీరే కనిపిస్తుంది. ఈ రోడ్డు తొలిసారిగా 1701లో మ్యాప్‌లో కనిపించింది. ఈ రోడ్డు దాటడం ఎంతో ప్రమాదకరం. రోజులో రెండు గంటలు మాత్రమే ఎంతో పరిశుభ్రంగా కనిపించి, ఆ తరువాత మాయమైపోతుంది. రోడ్డుకు రెండు పక్కల నీటిమట్టం పెరిగిపోతుంది. దీంతో అక్కడి నీటి లోతు 1.3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకూ ఏర్పడుతుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ రోడ్డు మీదుగా ప్రయాణించే చాలామంది ప్రతీయేటా మృత్యువు పాలవుతుంటారు. మొదట్లో జనం ఈ ప్రాంతానికి బోట్లలో వచ్చేవారు. తరువాత ఇక్కడ రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. 1840లో గుర్రాల సాయంతో జనం ఇక్కడికి వచ్చేవారు. 1986 తరువాత ఇక్కడ ప్రత్యేకమైన్ రేసులు నిర్వహిస్తూ వస్తున్నారు. 1999 నుంచి ఫ్రాన్స్ ఈ రోడ్డుపై ‘టూర్ ది ఫ్రాన్స్’ పేరిట సైకిల్ రేసులు నిర్వహిస్తూ వస్తోంది. -
రాహుల్ గాంధీ నైటవుట్, ఈసారి ఇలా..!
ఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో జోష్ మీద ఉన్న ఆ పార్టీ శ్రేణులు.. ఆ విక్టరీలో రాహుల్ గాంధీకి కూడా కొంత క్రెడిట్ కట్టబెట్టాయి. భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ గెలుపులో తన వంతు పోషించారాయన. ఇదే ఊపులో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అధికారం దిశగా ప్రయత్నిస్తామని ఆయన ప్రకటించుకున్నారు కూడా. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి సోషల్‌మీడియా హాట్ టాపిక్‌గా మారారు. హర్యానా అంబాలా వద్ద సోమవారం అర్ధరాత్రి సందడి చేశారాయన. ట్రక్కులో ఆయన పర్యటించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఛండీగఢ్ వెళ్లే క్రమంలో.. ఆయన ఈ పని చేసినట్లు తెలుస్తోంది. హెవీ వెహికల్స్ డ్రైవర్లు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు.. వాళ్లతో కలిసి ప్రయాణించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అంబాలా వద్ద ఆగి.. కాసేపు ఆయన ట్రక్కు డ్రైవర్లతో ముచ్చటించారు. ఆ తర్వాత ఆయన మార్గం మధ్యలో ఓ గురుద్వారాను దర్శించుకున్నారు. यूनिवर्सिटी के छात्रों से खिलाड़ियों से सिविल सर्विस की तैयारी कर रहे युवाओं से किसानों से डिलीवरी पार्टनरों से बस में आम नागरिकों से और अब आधी रात को ट्रक के ड्राइवर से आख़िर क्यों मुलाक़ात कर रहे हैं राहुल गांधी? क्योंकि वो इस देश लोगों की बात सुनना चाहते हैं,… pic.twitter.com/HBxavsUv4f — Supriya Shrinate (@SupriyaShrinate) May 23, 2023 Country needs such a leader#RahulGandhi pic.twitter.com/WOfCga0V7J — Kavish Aziz (@azizkavish) May 23, 2023 This is Rahul Gandhi, INC ex MP. Late night, he met with truck drivers, have a chat with them, asked them their problems. He travelled in one of the trucks too, enjoyed the desi music of truck driver. How many political leaders have you seen now doing this without any media… pic.twitter.com/HQFhjs7qR9 — Dr Nimo Yadav (@niiravmodi) May 23, 2023 -
ఫోన్లో ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఆ ‘యాప్’ వాడితే ఇక అంతే సంగతులు
రైల్వే ప్రయాణికుల్ని ఐఆర్సీటీసీ అప్రమత్తం చేసింది. irctcconnect.apk పేరుతో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దని సలహా ఇచ్చింది. ఇండియన్ రైల్వే పేరుతో ఓ ఫేక్ యాప్ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్, టెలిగ్రాంలలో ప్రత్యక్షమైంది. దీంతో అప్రమత్తమైన ఐఆర్సీటీసీ అధికారులు.. సర్క్యులేట్ అవుతున్న ఏపీకే ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవద్దని తెలిపారు. సైబర్ నేరస్తులు ఈజీ మనీ కోసం అడ్డదార్లు తొక్కుతున్నారని, వినియోగదారులు వ్యక్తిగత యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ బ్యాంకింగ్ వివరాల్ని సేకరించి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్లు సూచించింది. కాబట్టి యూజర్లు ఇలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ యాప్స్‌నే డౌన్లోడ్ చేసుకోండి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లు, యాప్స్‌ను పోలి ఉండేలా సైబర్ నేరస్తులు ఫేక్ వెబ్సైట్లు, యాప్స్‌ను తయారు చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం కలగకుండా ఈ యాప్‌తో కూడిన మోసపూరిత లింక్ (ఫిషింగ్ అటాక్)లను ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునేవారికి సెండ్ చేస్తున్నారు. పొరపాటున ఆ లింక్స్‌ను క్లిక్ చేస్తే ..ఫిషింగ్ దాడికి గురైన బాధితుల నుండి యూపీఐ వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారంతో సహా సున్నితమైన నెట్ బ్యాంకింగ్ వివరాల్ని దొంగిలిస్తున్నారు. ఇక నేరస్తులు ఐఆర్సీటీసీ పేరుతో షేర్ చేస్తున్న లింక్‌లతో యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవద్దని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఐఆర్సీటీసీ అఫిషియల్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ వంటి మొబైల్ యాప్స్‌ను గూగుల్, యాపిల్ ప్లేస్టోర్ల నుంచి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. -
మంచి మాట: జీవన స్పృహ
స్పృహ అనేది ప్రాణం ఉన్న ప్రతిమనిషికీ ఉండాల్సిన వాటిల్లో అతిముఖ్యమైంది. స్పృహ ఉండాలన్న స్పృహ కూడా లేనివాళ్లు ఉన్నారు. మనిషి ఏ పరిస్థితిలోనూ ఏ రకమైన మత్తుకూ లోనుకాకూడదు. ఏ రకమైన మత్తుకూ మనిషి చిల్తై పోకూడదు. కొన్ని సందర్భాల్లో మనిషిని నిస్పృహ ఆవరిస్తూ ఉంటుంది. దానికి కొనసాగింపుగా నిస్తేజం పట్టి పీడిస్తూ మనిషిని అదిమేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోంచి మనిషి తెప్పరిల్లి తేరుకోగలగాలి. అందుకు స్పృహ అనేది తప్పకుండా ఉండాలి. స్పృహతో నిస్తేజాన్ని నిశ్వాసిస్తూ ఉత్తేజాన్ని ఉచ్ఛ్వాసిస్తూ ఉండాలి; సత్తేజంతో ఉండాలి. మనిషిలో లేదా మనిషికి తప్పకుండా ఉండాల్సింది స్పృహ. స్పృహ అన్నది లేకుండా పోతే మనిషి తన నుంచి తాను తప్పిపోతాడు; మనిషి తనకు తాను కాకుండా పోతాడు. ఒక మనిషి తన జీవనోపాధిని కోల్పోవచ్చు, తన ఆస్తుల్ని కోల్పోవచ్చు, తనవి అన్నవాటిని అన్నిటిని ఒక మనిషి కోల్పోవచ్చు కానీ స్పృహను మాత్రం కోల్పోకూడదు. దేన్ని అయినా వదులుకోవచ్చు కానీ స్పృహను వదులుకోకూడదు. మనిషికి ఏదైనా లేకుండా పోవచ్చు కానీ స్పృహ లేకుండా పోకూడదు. తనకు తాను ఉన్నంత వరకూ, తనలో రక్తం పారుతున్నంత వరకూ మనిషికి స్పృహ ఉండాలి. మనిషి రక్తంలో స్పృహ పారుతూ ఉండాలి. మనిషిలో రక్తంలా స్పృహ ప్రవహిస్తూ ఉండాలి. తనలో స్పృహ ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితంలోకి ప్రయాణం చేస్తూ ఉండగలడు. స్పృహ మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. స్పృహ వల్ల మనిషికి బయటా, లోపలా చలనం కలుగుతుంది. ఆ చలనం గతికి, ప్రగతికి కారణం అవుతుంది. స్పృహ లేనప్పుడు మనిషికి ఏదీ అందదు, మనిషివల్ల ఏదీ జరగదు. స్పృహలేకపోతే మనిషికి గతి, ప్రగతి ఉండవు. ‘జీవితం నిన్ను బలపరిచేందుకు సిద్ధంగా ఉంది; అందుకు ముందు నువ్వు జీవితానికి తలుపు తెరిచి ఉంచాలి‘ అని జర్మన్ తాత్త్వికుడు ఎక్‌హార్ట్ టోల్ తెలియజె΄్పారు. స్పృహ ఉన్నప్పుడు మాత్రమే మనం జీవితానికి తలుపు తెరిచి ఉంచగలం. లేదా మనకు ఉన్న స్పృహ మాత్రమే జీవితానికి తలుపు తెరిచి ఉంచగలదు. మత్తు జీవితాన్ని మూసేస్తుంది. మన మత్తును మనం వదిలించుకోవాలి. మనల్ని మన జీవితం బలపరచాలంటే మనకు స్పృహ కావాలి. ఎక్‌హార్ట్ టోల్ స్పృహ విషయంలో ఇంకా ఇలా స్పష్టతను ఇచ్చారు, ‘మనకు కలిగే ఆలోచనను స్పృహ అని అనుకోవడం తప్పు. ఆలోచన, స్పృహ పర్యాయపదాలు కావు. ఆలోచన అనేది స్పృహలోని ఒక చిన్న క్రియారూపం మాత్రమే. స్పృహ లేకుండా ఆలోచన ఉనికిలో ఉండదు; కానీ స్పృహకు ఆలోచన అవసరం ఉండదు’. మనం స్పృహ తోనే జీవనం చెయ్యాలి. మనకు ముందు కొందరికైనా సామాజిక స్పృహ ఉండి ఉండబట్టే ఇవాళ సమాజం ఉంది. సంగీతం, సాహిత్యం, ఇతర కళలపై స్పృహ ఉన్న కొందరివల్ల అవి చలామణిలో ఉన్నాయి. విద్య, వృత్తులు, పరిశోధనలు వంటివాటిపై మనకు పూర్వం ఉన్నవాళ్లకు స్పృహ ఉండబట్టే మనం మనుగడ చెయ్యగలుగుతున్నాం. స్పృహలేని మనిషి ఊపిరితో ఉన్న రాయి . మనం స్పృహతో మనుగడ చేద్దాం. రాళ్లల్లా కాదు మనుషులమై బతుకుదాం. – శ్రీకాంత్ జయంతి -
సోనియాకు అడ్డుపడి చిన్నమ్మ శపథం! ఆనాడు అలా జరగకపోయి ఉంటే..
దేశంలో కుటుంబ, వారసత్వ రాజకీయాలు వేళ్లానుకునిపోయిన సమయం అది. ఆ సమయంలో.. భర్త చనిపోవడంతో ఆమెనే ప్రధాని అవుతుందని అంతా భావించారు. కానీ, పీఎం పదవితో పాటు పార్టీ పగ్గాలనూ వద్దనుకుని పార్టీ క్యాడర్‌ను, యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేశారామె. దాదాపు అర్ధదశాబ్దంపాటు రాజకీయం ఊసే ఎత్తలేదు. అయితే.. పార్టీ అంతర్గత సంక్షోభం, ఎన్నికల్లో దారుణ ఓటమి సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. దశాబ్దంపాటు పవర్ఫుల్ ఉమెన్‌గా ప్రపంచాన్ని ఆకట్టుకోలిగారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా.. సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ తన మార్క్ చూపిస్తూ పరిస్థితులను కొంతైనా చక్కబెడుతూ వచ్చారు. సోనియా గాంధీ.. అప్పటిదాకా రాజీవ్ గాంధీ సతీమణి. భర్త మరణాంతరం దాదాపు అర్థదశాబ్దంపాటు రాజకీయాల్లోకి రావడానికి అనాసక్తిని కనబరిచారు. అయితే.. 1996 ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ ఛిన్నాభిన్నం అయ్యింది. మూకుమ్మడిగా సీతారాం కేసరి నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. పార్టీలోని చాలామంది సొంత కుంపట్లను ఏర్పాటు చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో.. కాంగ్రెస్‌కు గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి. నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఒత్తిళ్లు పెరిగాయి. ఆ పరిణామాల నడుమ రాజకీయాల్లోకి అన్యమనస్కంగానే అడుగుపెట్టారామె. 1997 కలకత్తా(కోల్‌కతా)లో జరిగిన ప్లీనరీ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం పుచ్చుకున్నారామె. ఆపై 62 రోజులకే ఆమెకు పార్టీ బాధ్యతలు ఆఫర్ చేయగా.. అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపారు . అయితే.. ప్రధాని అభ్యర్థిత్వానికి ఆమె పేరు తెర మీదకు రావడంతో.. 1999 మే నెలలో పార్టీలో సీనియర్లు ముగ్గురు వ్యతిరేక గళం వినిపించారు. విదేశీ మూలాలు ఉన్న ఆమె.. భారత్‌కు ఎలా ప్రధాని అవుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. పార్టీకి రాజీనామా చేసేసి బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారామె. కానీ, ఆమెను నిలువరించిన పార్టీ.. ఆ ముగ్గురు రెబల్స్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ ముగ్గురే శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్.. వాళ్లు స్థాపించుకున్న పార్టీనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. వీళ్లే కాదు.. పార్టీ నుంచి బయటకు వచ్చిన మరికొందరు సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు కూడా. ఇది ఆమె ప్రధాని పదవికి అడ్డు తగిలిన మొదటి సందర్భం. 1999 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీ.. కర్ణాటక బళ్లారి నుంచి, ఉత్తర ప్రదేశ్ అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారామె. ఈ రెండింటిలో ఆమె అమేథీనే ఎంచుకున్నారు. ఇక బళ్లారిలో ఆమె ఓడించింది ఎవరినో తెలుసా?.. చిన్నమ్మగా పేరొందిన సుష్మా స్వరాజ్‌ను. సోనియాగాంధీ బంపర్‌మెజార్టీతో నెగ్గినప్పటికీ.. వాజ్‌పేయి పేరు, ఛర్మిష్మా, ఇతరత్రా కారణాలతో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ఆ సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగారామె. 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగ్గా.. అవతలి అభ్యర్థి జితేంద్ర ప్రసాదను 97 శాతం మార్జిన్‌తో ఓడించారామె. అప్పటి నుంచి ఓటింగ్ లేకుండానే ఆమె ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అంతేకాదు.. 2003లో ఏకంగా వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారామె. అధికారంలోకి యూపీఏ కూటమి 2004 సార్వత్రిక ఎన్నికల్లో.. సోనియా గాంధీ ఆమ్ ఆద్మీ(ఆర్డీనరీ మ్యాన్) పేరుతో దేశవ్యాప్త ప్రచారం నిర్వహించారు. అప్పటికే బీజేపీ ఇండియా షైనింగ్ పేరుతో ప్రచారంలో ఉంది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఊహించని పరాభవం ఎదురైంది. ఆ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి.. 2 లక్షలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు సోనియా గాంధీ. దాదాపు 15 పార్టీల కూటమి యూపీఏ పేరుతో కేంద్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధం అయ్యింది. ఈ ఎన్నికల విజయంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీనే దేశానికి ప్రధాని కాబోతున్నారంటూ చర్చ మొదలైంది. కానీ.. ► ప్రతిపక్ష కూటమి సోనియా ప్రధాని కాకుండా మోకాలడ్డింది. సుష్మా సర్వాజ్ అయితే ఏకంగా హెచ్చరికలకే దిగారు. సోనియా గనుక దేశానికి ప్రధానిని చేస్తే.. తాను గుండు చేయించుకుంటానని, కటిక నేలపై నిద్రిస్తానని శపథం చేసి.. రాజకీయ దుమారం రేపారు. మరోవైపు ఎన్డీయేలోని పక్షాలు న్యాయపరమైన కారణాలు చూపించి అభ్యంతరాలు లేవనెత్తారు. భారత పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 5 ప్రకారం.. కోర్టును ఆశ్రయించారు. కానీ, కోర్టు ఆమెకు ఊరటనే ఇచ్చింది. ► రాజకీయంగా చెలరేగుతున్న రగడ కారణంగా.. ప్రధాని పదవి చేపట్టకూడదనే నిర్ణయానికి వచ్చారామె. బదులుగా ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి నామినేట్ చేశారామె. పార్టీ నేతలు కూడా అందుకు అంగీకరించారు. ఆ సమయంలో ఆమె త్యాగనీరతిని అభిమానులు ఆకాశానికెత్తగా.. పొలిటికల్ స్టంట్ అంటూ ప్రత్యర్థులు పెదవి విరిచారు. ఇది రెండోసారి. ► ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వివాదం కారణంగా.. ఎంపీ పదవికి, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ పదవికి ఆమె రాజీనామా ప్రకటించారు. ఆపై 2006 మే నెలలో జరిగిన ఉప ఎన్నికలో రాయ్ బరేలీ నుండి 400,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ► 2009లో ఆమె నాయకత్వంలోనే మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కేంద్రంలో కొలువు దీరింది. ఆ ఎన్నికల్లో 206 లోక్‌సభ సీట్లు గెలవగా.. 1991 నుంచి అప్పటిదాకా ఏపార్టీ కూడా అంత సీట్లు గెలవకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లోనూ రాయ్ బరేలీ నుంచి ఆమె గెలుపొందారు. ► 2013లో.. పదిహేనేళ్లపాటు వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా పని చేసిన వ్యక్తి రికార్డును నెలకొల్పారామె. ► 2013లోనే.. ఎల్జీబీటీ హక్కులను బలపరుస్తూ ఐపీసీ సెక్షన్ 377 మద్దతు ప్రకటించారు. ► 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైంది. కాంగ్రెస్‌కు 44, మొత్తంగా యూపీఏ కూటమికి 59 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే.. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ గెలుపొందారు. ► అదే ఏడాదిలో తెలుగు రాష్ట్రాల విభజన ద్వారా సోనియమ్మగా పార్టీ నేతలచేత పిలిపించుకున్నారామె. ► ప్రతిపక్షాన్ని బంధించే జిగురు లాంటి వ్యక్తి సోనియా. ఈ కామెంట్ చేసింది ఎవరో కాదు వామపక్ష దిగ్గజ నేత సీపీఐ(ఎం) సీతారాం ఏచూరి. కాంగ్రెస్ పగ్గాలు సోనియాకా? రాహుల్‌కా? అనే చర్చ నడిచిన సమయంలో ఆయన సోనియాకే ఓటేశారు. ► 2016 నుంచి ఎన్నికల ప్రచారానికి ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. 2017 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి 49వ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. తిరిగి.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె ప్రచారం ద్వారా తెర మీదకు వచ్చారు. బీజాపూర్‌లో ఆమె బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 78 సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అదే సమయంలో బీజాపూర్ పరిధిలోని ఐదు స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. జనతా దళ్ (సెక్యులర్)తో పోత్తు విషయంలోనూ ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. ► 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్-యూపీఏ కూటమి ఓటమిపాలైంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో.. తిరిగి సోనియా గాంధీకే పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ► కాంగ్రెస్‌కు కుటుంబ పార్టీ అనే మచ్చ చెరిపేసేందుకు.. శాశ్వత అధ్యక్ష ఎన్నిక జరగాలని, ఆ నాయకత్వంలోనే 2024 ఎన్నికలకు వెళ్లాలని సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఆమె అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. అయితే గెహ్లాట్ ఎన్నికల బరి నుంచి తప్పుకోగా.. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించి కాంగ్రెస్‌కు గాంధీయేతర కుటుంబ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ► 1999లో అమేథీ నుంచి 4,18,960 ఓట్లు(67.12 శాతం ఓటు షేర్), బళ్లారి నుంచి 4,14,650 ఓట్లు(51.70 శాతం ఓటు షేర్) మెజార్టీతో ఆమె నెగ్గారు. ఆ తర్వాత 2004 ఎన్నికలో రాయ్ బరేలీ నుంచి 3,90,179 ఓట్ల మెజార్టీతో.. 2006 ఉప ఎన్నికలో ఏకంగా 4,74,891 ఓట్ల మెజార్టీతో ఆమె నెగ్గారు. తిరిగి 2009 ఎన్నికలో 4,81,490 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో 5,26,434 ఓట్ల మెజార్టీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 5,34,918 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ప్రతీ ఎన్నికకు ఆమె విక్టరీ మెజార్టీ గణనీయంగా పెరుగుతూ పోవడం గమనార్హం. ► 2004-14 అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో దేశంలో శక్తివంతమైన మహిళలు, ప్రభావశీలుర జాబితాలోనూ ఆమె ప్రతీ ఏడాది నిలుస్తూ వచ్చారు. ► 2007లో టైమ్స్ మ్యాగజైన్.. టాప్ 100 ప్రభావశీలుర జాబితాలో సోనియా గాంధీకి చోటు ఇచ్చింది. ► 2013లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తుల్లో 21వ ర్యాంక్, మహిళల్లో 9వ ర్యాంక్ కట్టబెట్టింది. ► మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా.. 2007 అక్టోబర్ 2వ తేదీన ఐక్యరాజ్య సమితిలో ఆమె ప్రసంగించారు. ఆనాటి నుంచి గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తూ వస్తున్నారు(ఐరాసలో తీర్మానం పాస్ అయ్యింది 2007 జులై 15న). ► నేషనల్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్‌గా, యూపీఏ చైర్‌పర్సన్‌గానూ ఆమె కీలక నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించారు. అందులో నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టంగా మారడం అనే రెండు ప్రధానమైనవి ఉన్నాయి. రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) కాంగ్రెస్ ప్లీనరీలో 76 ఏళ్ల సోనియా గాంధీ ప్రసంగిస్తూ.. పొలిటికల్ రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చిన సందర్భంలో.. -
Rk Roja: రిక్షాలో మంత్రి ఆర్కే రోజా ప్రయాణం
నగరి(చిత్తూరు జిల్లా): పవిత్ర పుణ్యక్షేత్రం వారణాశిలో కాశీవిశ్వేశ్వరుడి దర్శనం కోసం ఆర్కే రోజా వెళ్లారు. అయితే వారణాశిలోని వీధుల్లో మంత్రి రోజా రిక్షాలో తిరుగుతూ సందడి చేశారు. 144 ఏళ్ల తరువాత శనిత్రయోదశి నాడు మహాశివరాత్రి రావడంతో ఈ పర్వదినాన కాశీవిశ్వేశ్వరుని శనివారం ఆమె దర్శించుకున్నారు. గంగా హారతి అనంతరం తానో మంత్రి, సెలబ్రిటీ అని మరచి కాసేపు ఓ సాధారణ భక్తురాలిలా రిక్షాలో ప్రయాణించారు. -
బుల్లిపిట్ట.. ప్రపంచ రికార్డు.. నాన్‌స్టాప్‌గా 13,560 కిలోమీటర్ల ప్రయాణం
ఒక బుల్లి వలస పిట్ట 13,560 కిలోమీటర్లు ఏకబిగిన ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. విశ్రాంతి, ఆహారం లేకుండా నాన్‌స్టాప్‌గా 11 రోజులు ప్రయాణించి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. లిమోసా ల్యాపోనికా జాతికి చెందిన బార్ టెయిల్డ్ గాడ్విట్ అనే చిన్న పక్షి అమెరికాలోని అలాస్కా వద్ద నోమ్ తీరం నుంచి గతేడాది అక్టోబర్ 13న బయలుదేరి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వద్ద ఆన్‌సాన్స్ తీరం వరకు ప్రయాణించి ఈ రికార్డు సాధించింది. – సాక్షి, అమరావతి బహుదూరపు ప్రయాణానికి సిద్ధమైందిలా.. అలాస్కాలో బార్ టెయిల్డ్ గాడ్విట్ జాతికి చెందిన వలస పక్షులు (చిన్న వాటికి) మూడింటికి గతేడాది అక్టోబర్‌లో మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్నిథాలజీ సైంటిస్టులు తమ బర్డ్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా 5 గ్రాముల బరువుండే సోలార్ శాటిలైట్ ట్రాన్స్మిటర్లను అమర్చారు. ఐదు నెలల వయసున్న బీ6 (పక్షికి సైంటిస్టులు పెట్టిన పేరు) కూడా అందులో ఉంది. అయితే వలస వెళ్లిన మిగిలిన రెండు పక్షుల జాడ తెలియలేదు. కాగా, వలసకు సమయం ఆసన్నమైన తరుణంలో ఆ పక్షులు తమ శరీరాన్ని ప్రయాణానికి సిద్ధం చేసుకోవడం ప్రారంభించాయి. అనవసరమైన బరువును తగ్గించేందుకు జీర్ణ వ్యవస్థ సహా కొన్ని అవయవాలను కుదించుకున్నాయి. శక్తిని ఆదా చేసేందుకు తక్కువ పీడనం ఉండి ఎగరడానికి అనుకూలంగా ఉన్న గాలులు వీచే వరకు ఎదురు చూశాయి. అన్నీ అనుకూలంగా మారిన తర్వాత ఎగరడం ప్రారంభించాయి. ఆడ పక్షులే పెద్దవి.. ► బార్ టెయిల్డ్ గాడ్విట్ల రెక్కలు పెద్దగా విప్పి ఎగురుతాయి. ► నీటిపై తేలేందుకు వీలుగా వీటి శరీర అమరిక ఉండదు కాబట్టి సముద్రంలో విశ్రాంతి కోసం ఆగలేవు. ► ఈ పక్షులు 37 నుంచి 41 సెంటీమీటర్ల పొడవుంటాయి. ► మగ పక్షుల కంటే ఆడ పక్షులు పెద్దవిగా ఉంటాయి. మగవి 190 నుంచి 400 గ్రాములు, ఆడవి 260 నుంచి 630 గ్రాముల వరకు బరువు ఉంటాయి. ► ఇవి సముద్ర తీర ప్రాంతాలు, చిత్తడి ప్రాంతాల్లో వేట సాగిస్తూ.. నీటి పురుగులు, నత్తల వంటి జీవులను ఆహారంగా తీసుకుంటాయి. బీ6 ప్రయాణమిలా.. ► ఇది తొలుత హవాయికి పశ్చిమ దిశగా ఎగరడం ప్రారంభించింది. ► అక్టోబర్ 19న పసిఫిక్ ద్వీప దేశమైన కిరిబాటి మీదుగా ప్రయాణించింది. ► దాదాపు రెండు రోజుల తర్వాత సిడ్నీకి దగ్గరగా ఎగిరింది. ► న్యూజిలాండ్ మీదుగా అక్టోబర్ 25న టాస్మానియా తీరానికి చేరింది. ► గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించింది. ► అంతదూరం ఈ చిన్న పక్షి ఒంటరిగా ప్రయాణించిందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. ► అవిశ్రాంత ప్రయాణం కారణంగా పక్షి సగం బరువు కోల్పోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ► ఒక వయసుకు రాగానే సాధారణంగా ఈ జాతి పక్షులు గుంపుగా బయలుదేరి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వైపుకు వలస వెళుతుంటాయి. ► కానీ ఇప్పుడు తక్కువ వయసున్న పక్షులు పెద్ద పక్షుల నుంచి విడిపోయి దక్షిణ దిశగా సుదూరంగా ప్రయాణించాయి. ► 2020లో ఇదే జాతికి చెందిన ఓ పక్షి అలస్కా నుంచి న్యూజిలాండ్ వరకు 12,200 కి.మీ. ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. -
పండుగ ప్రయాణం.. నరకయాతన
సాక్షి, హైదరాబాద్: కరోనా తర్వాత పూర్తి స్థాయిలో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు జనం ఉత్సుకత కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే పల్లె బాట పట్టి ఖర్చుకు సైతం వెనకాడకుండా.. నరకయాతన అనుభవిస్తున్నారు. నగరం నుంచి ఇప్పుడు సొంతూళ్లకు ప్రయాణమంటే నరకమనే అర్థం!!. సంక్రాంతికి ప్రయాణాల కోసం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. మరికొందరు సుఖవంతమైన ప్రయాణం లేకున్న పర్వాలేదనుకుని.. తోపులాటలో నిల్చుని మరీ ఊళ్లకు పయనమయ్యారు. ఇంకోవైపు నగరాలు, పట్టణాల్లోని రోడ్లు, జాతీయ రహదారులు.. విపరీతమైన వాహన రద్దీతో కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ జామ్‌తో పడిగాపులు పడాల్సి వస్తోంది. రైళ్లు, బస్సు ప్రయాణాలకు మూడు, నాలుగు నెలల ముందే బుకింగ్‌లు అయిపోయాయి. దీంతో ప్రయాణాల కోసం బ్లాక్ దందాలను ఆశ్రయిస్తున్నారు చాలామంది. ఆ దందాలను కట్టడి చేసేందుకు అధికారులు యత్నిస్తున్నా.. ప్రయాణం ఎలాగైనా సాగాలని అవేం పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు కొందరు. ఇక విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగిపోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. సొంతూళ్లకు ప్రయాణికులు క్యూ కడుతుండడంతో కిటకిలాడుతున్నాయి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. బస్సుల్లో సీట్లు దొరక్క చివరి నిమిషంలో ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నారు మరికొందరు ప్రయాణికులు. అయితే అందులోనూ కుక్కి కుక్కి మరీ ప్రయాణాలు చేయిస్తున్నారు. ఈసారి సంక్రాంతికి 140 ప్రత్యేక రైళ్ళను ప్రకటించించింది దక్షిణ మధ్య రైల్వే. కానీ, ప్రయాణికుల తాకిడి విపరీతంగా ఉంది. దీంతో.. ఆ రైళ్లు ఎటూ సరిపోలేదు!. దీంతో స్టేషన్ బయటే ప్రయాణికులు ఎదురు చూపులు చూసే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కనెక్టవిటీ ఎంఎంటీఎస్ రైళ్లు మరమ్మత్తుల పనులతో రద్దు కావడంతో.. భారమైన సరే ఖర్చు పెట్టుకుని బస్టాండ్లకు, స్టేషన్లకు చేరుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంక్రాంతి పండుగకు వాహనాలు రహదారి ఎక్కడంతో.. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. పండుగకు మామూలు రోజులకంటే అధికంగా వాహనాల తాకిడి నెలకొంటుందనేది తెలిసిందే. అయితే ఈసారి ఆ తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువ వస్తోంది. ఫాస్టాగ్ ఉన్నా కూడా అర కిలోమీటర్ పైనే వాహనాలు జారీ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మామూలు రోజుల్లో 30-35 వేల వాహనాల రాకపోకలు సాగించేవని, కానీ, గత మూడు రోజుల నుంచి యాభై వేల వాహనాల రాకపోకలు కొనసాగించాయని జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు వాహనాల రద్దీని తట్టుకునేందుకు అదనపు టోల్ బూతులను తెరచినట్లు వెల్లడించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైరల్ వీడియో : ఇదేమి జర్నీరా అయ్యా..!
-
అత్యంత ఖరీదైన రైలు టిక్కెట్..ధర వింటే అవాక్కవుతారు
బస్సు టిక్కెట్ ధరలే ఎక్కువని చాలామంది ప్రజలు ట్రైయిన్‌లో ప్రయాణించి వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. పైగా ట్రైయిన్‌లో బెర్త్ బుక్ చేసుకుని హాయిగా పడుకుని వెళ్లిపోవచ్చు. సాధారణంగా సంపన్నులు మంచి ఫస్ట్ క్టాస్ ట్రైయిన్‌లో ప్రయాణిస్తారు లేదా లగ్జరియస్ బోగి బుక్ చేసుకుని వెళ్లడం గురించి విన్నాం. కానీ అత్యంత ఖరీదైన రైల్వే టిక్కెట్ ఒకటి ఉంటుందని, అక్కడ రైల్లో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని ఎప్పుడైనా విన్నారా!. ఔను} ఈ ట్రైయిన్ టిక్కట్ ధర అత్యంత ఖరీదు. పైగా లోపల ఫైవ్ స్టార్ రేంజ్లో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. చూస్తే మనకు ఇది ట్రైయిన్ లేక హోటల్ అన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది. మహారాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో రాజభవనాన్ని తలపించేలా రాయల్ ట్రీట్మెంట్తో కూడిన సౌకర్యాలు ఉంటాయి. ఐతే టిక్కెట్ ధర ఎంతంటే అక్షరాల 19 లక్షలు పై చిలుకే ఉంటుంది. ఈ లగ్జరీ రైలు 2010 నుంచి తన సేవలను అందిస్తోంది. ఈ రైలుని మన సాంస్కృతిక వారసత్వ సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యంత రాజసంగా తీర్చి దిద్దారు. ఈ రైలులో అత్యంత సంపన్నులు బుక్ చేసుకునే బోగిలోని గదులను నవరత్నగా పిలుస్తారు. ఆ గది ఎంత విలాసవంతంగా ఉంటుందో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. నెటిజన్లు మాత్రం నమ్మశక్యంగా లేదంటూ కామెంటు చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by 𝗞𝗨𝗦𝗛𝗔𝗚𝗥𝗔 | Video Creator (@kushagratayal) (చదవండి: గుంజీలు తీయండి..ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందండి) -
అపుడు 4 లక్షలు, ఇపుడు 7 వేల కోట్లు: ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?
సాక్షి,ముంబై: భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ కంపెనీ బిస్లరీని టాటా గ్రూపునకు చెందిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టేకోవర్ చేయనుంది. 1969లో కేవలం నాలుగు లక్షలకు రూపాయలకు కొనుగోలు చేసిన బిస్లరీ ఇపుడు 7 వేల కోట్లకు చేరింది. 1969లో 28 ఏళ్ల చౌహాన్ నేతృత్వంలో ని పార్లే ఎక్స్‌పోర్ట్స్ ఇటాలియన్ వ్యాపారవేత్త నుండి బిస్లరీ కొనుగోలు చేశారు. అపుడు దీని రూ. 4 లక్షలు. బిస్లరీని టాటాలకు 6-7వేల కోట్ల రూపాయలకు విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో 1969-2022ల వరకు బిస్లరీ జర్నీని ఒకసారి చూద్దాం. (Bisleri చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్) 1969-2022 బిస్లరీ సక్సెస్ జర్నీ ► బిస్లరీ ఒక ఇటాలియన్ కంపెనీ, దీనిని 1965లో ఫెలిస్ బిస్లరీ స్థాపించారు. అలా కంపెనీకి ఆ పేరు స్థిరపడింది. ►1969లో ఇటాలియన్ వ్యాపారవేత్త ఫెలిస్ బిస్లరీనుంచి చౌహాన్ కొనుగోలు చేశారు. ► Bisleriని తొలుత భారతదేశంలో గాజు సీసాలలో, బబ్లీ, స్టిల్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. ► తమ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ స్పాట్ వంటి బ్రాండ్లు ఉన్నాయి కానీ సోడా లేదు. అందుకే పాపులర్ బిస్లరీ సోడాను కొనుగోలు చేశానని చౌహాన్ చెప్పారు. అంతేకాదు అసలు నీళ్ల వ్యాపారంపై దృష్టి లేదట. ► 60వ -70వ దశకం ప్రారంభంలో ఫైవ్ స్టార్ హోటళ్ల నుండి సోడాకు మంచి డిమాండ్ ఉంది. 1993లో తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను రూ. 186 కోట్లకు కోకాకోలాకు విక్రయించినప్పుడు మాత్రమే అతని దృష్టి బాటిల్ వాటర్ పరిశ్రమపై పడింది. ►ప్రారంభంలో రవాణాదారులు నీటిని రవాణా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే తానే స్వయంగా రవాణా చేయాలని చౌహాన్ నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే బిస్లరీకి ఇప్పుడు 4,500 డిస్ట్రిబ్యూటర్లు ,వాటర్ బాటిళ్లను రవాణా చేసే 5,000 ట్రక్కులు ఉన్నాయి. ►2000ల ప్రారంభంలో టాటాకు చెందిన హిమాలయన్ బ్రాండ్‌తో మౌంట్ ఎవరెస్ట్ మినరల్ వాటర్‌తో బిస్లరీకి గట్టి పోటీ ఎదురైంది. ఇంకా అక్వాఫినా, కిన్లీ వంటి పోటీదారుల గట్టి పోటీ ఉన్నా తట్టుకొని టాప్‌లో నిలబడింది ► కోకా-కోలా (కిన్లే), పెప్సికో (ఆక్వాఫినా), కింగ్‌ఫిషర్ , నెస్లే వంటి పోటీదారుల మాదిరిగా కాకుండా, చౌహాన్‌కు ఇదొక్కటే ప్రధాన వ్యాపారం. అందుకే పట్టుదలగా సక్సెస్‌ను నిలుపుకున్నారు. ► కస్టమర్‌కు మెరుగైన విలువ, ప్యాకేజింగ్ లేదా పంపిణీని అందించే బ్రాండ్లు లేవు. ఏ బిజినెస్‌లోనైనా ముందు వచ్చినవారికే సక్సెస్.అయితే రెండవ లేదా మూడవ స్థానంలో వచ్చినట్లయితే, డిఫరెన్సియేటర్‌గా ఉంటే మంచిది. సో.. ఫస్ట్-మూవర్‌గా బ్రాండ్కోసం చాలా కష్టపడ్డాను అని 2007లో ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌహాన్ వెల్లడించారు. (షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?) ►తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను ఎందుకు విక్రయించారని అడిగినప్పుడు, మాజా, సిట్రా, గోల్డ్ స్పాట్ ,రిమ్-జిమ్ వంటి బ్రాండ్లను ప్రకటనలకు తన వద్ద అంత డబ్బులేదు. అందుకే బాటిలర్లపై ఎక్కువగా ఆధారపడేవాడినంటారు చౌహాన్. ►కానీ వయసు,ఆరోగ్యం క్షీణించడంతోపాటు, అతని కుమార్తె జయంతికి వ్యాపారంలోఆసక్తి లేకపోవడంతో, కంపెనీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌కు విక్రయించే నిర్ణయం తీసుకున్నారు. బిస్లరీతో విడిపోవడం బాధాకరమైన నిర్ణయమే, కానీ టాటాలు దానిని చాలా జాగ్రత్తగా కాపాడతారనే విశ్వాసాన్ని ప్రకటించారు చౌహాన్. ► కంపెనీని నడపాలన్న ఉద్దేశం లేని కారణంగా మైనారిటీ వాటాను ఉంచుకోనని, పర్యావరణం , స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి పెడతానని 82 ఏళ్ల చౌహాన్ చెప్పారు. -
కిక్కిరిసిన జర్నీ.. అరకొర రైళ్లే.. ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు
సాక్షి, హైదరాబాద్: నగరం పల్లెబాట పట్టింది. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో గత రెండు రోజులుగా బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. పండగకు మరో మూడు రోజులే ఉండడడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. దీంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర కూడళ్ల వద్ద ప్రయాణికుల రద్దీ కనిపించింది. అలాగే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి కూడా ప్రయాణికులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ సంఖ్యలో బయలుదేరారు. ఈ సంవత్సరం ఆర్టీసీ పుణ్యమా అని పండగ ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఆర్టీసీ బస్సుల్ని సాధారణ చార్జీలపైనే ప్రత్యేక బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికుల ఆదరణ పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కడప, కర్నూలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో మాత్రం యథావిధిగా దారిదోపిడీ కొనసాగుతోంది. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు అరకొరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. డిమాండ్ మేరకు రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు అదనంగా ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా వరకు బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తోంది. అరకొర రైళ్లే... ► ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయవలసి ఉండగా, ఈసారి అదనపు రైళ్లను చాలా వరకు తగ్గించారు. ► కొన్ని ప్రాంతాలకు మాత్రమే సుమారు 20 రైళ్లను అదనంగా ఏర్పాటు చేశారు. ► దసరా సందర్భంగా ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ► అదనపు రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ► ‘కనీసం జనరల్ బోగీలను కూడా అదనంగా ఏర్పాటు చేయడం లేదు. ఒక్కో బోగీలో వందలకొద్దీ కిక్కిరిసి ప్రయాణం చేయవలసి వస్తుంది’. అని కాగజ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫణీంద్ర విస్మయం వ్యక్తం చేశారు. ► తెలంగాణ ప్రాంతాలకు రైలు సర్వీసుల విస్తరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌కు వెళ్తున్న మరో ప్రయాణికుడు శ్రీనివాస్ ఆరోపించారు. దూరప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... ► తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజు సుమారు 3500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని 4400కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ► విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, కర్నూలు, కడప, తిరుపతి తదితర నగరాలతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ► అక్టోబర్ 1 నుంచి రద్దీ మరింత పెరగనున్న దృష్ట్యా రోజుకు 500 నుంచి 1000 వరకు అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఏ బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరుతాయి.. సీబీస్: అనంతపూర్, చిత్తూరు, కడప,కర్నూలు,ఒంగోలు, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్డు: వరంగల్, హనుమకొండ, జనగామ, యాదగిరిగుట్ట వైపు దిల్సుఖ్నగర్: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట .. జేబీఎస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లేవి.. ఎల్బీనగర్: వైజాగ్, విజయవాడ, గుంటూరు వైపు .. ఎంజీబీఎస్: మహబూబ్‌నగర్,వికారాబాద్, తాండూరు, భద్రాచలం, తదితర ప్రాంతాలకు.. సాధారణ చార్జీలే.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించరాదని, సాధారణ చార్జీలపైనే ఆర్టీసీ బస్సులు అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న దృష్ట్యా సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ కోరారు. ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్లు నమోదు చేసుకోవచ్చునని, నేరుగా ప్రయాణసమయంలోనూ టిక్కెట్లు తీసుకోవచ్చునని తెలిపారు. -
స్టార్‌బక్స్ కొత్త సీఈవో నరసింహన్ ఇన్స్పైరింగ్ జర్నీ.. ఫిదా అవ్వాల్సిందే!
ప్రపంచ కాఫీ తయారీ దిగ్గజం స్టార్‌బక్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎంపికైన లక్ష్మణ్ నరసింహన్ చాలా చిన్నస్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. అమ్మే స్ఫూర్తి. రాక్-కర్ణాటక మ్యూజిక్ వరకూ అన్నీ తెలుసు. చాలా చురుకైన ప్రతిభావంతుడు. ఎపుడూ సరదాగా, జోక్లేస్తూ ఉండటం అలవాటు. చదవడం, ముఖ్యంగా బిజినెస్ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. చిన్నపుడు ఫుట్‌బాల్ గేమ్‌లో గోల్ కీపర్‌గా ఉండటమే కాదు, ఎదిగిన తరువాత వ్యావార రంగంలో ఉన్నత పదవులకు వన్నె తెచ్చిన రాక్‌స్టార్. ముఖ్యంగా "మనం ఎక్కడి నుండి వచ్చామో అసలు మర్చిపోవద్దు" అనే జీవిత సత్యాన్ని ఎరిగిన వారు నరసింహన్. స్టార్‌బక్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా లక్ష్మణ్ నరసింహన్ ఎంపికతో గ్లోబల్ బ్రాండ్ బిజినెస్ లీడర్స్‌గా సత్తా చాటుతున్న భారతీయ సంతతికి చెందిన సీఈవో జాబితా పెరుగుతోంది. స్టార్‌బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్ అక్టోబర్ 1, 2022న కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తారు. స్టార్‌బక్స్ సీఈవోగా, గ్లోబల్‌లీడర్‌గా ఎదిగిన లక్ష్మణ్ నరసింహన్ 30 సంవత్సరాల అనుభవం, వివిధ హోదాల్లో పనిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయన్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఈ క్రమంలో లక్ష్మణ్ విద్య కరియర్, అలవాట్లు, హాబీలపై ఒక లుక్కేద్దాం. లక్ష్మణ్ నరసింహన్ ఏప్రిల్ 15, 1967న పూణేలో జన్మించారు. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పూణే, సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని ది లాడర్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఎంఏ, ది వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ద్వారా ఫైనాన్స్‌లో ఎంబీఏ పట్టా పొందారు. మెకిన్సేలో ఉద్యోగిగా కరియర్‌ను ప్రారంభించారు. 2012 వరకు 19 సంవత్సరాలు అక్కడ పనిచేశారు. కంపెనీలో తన పని చేస్తున్న సమయంలో, న్యూఢిల్లీ కార్యాలయానికి డైరెక్టర్, లొకేషన్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 2012లో నరసింహన్ పెప్సికో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా మరో మెట్టుఎక్కారు. కంపెనీ దీర్ఘకాలిక వ్యూహం, డిజిటల్ సామర్థ్యాలకు నాయకత్వం వహించి, కంపెనీని లాభాల బాటపట్టించారు. అనంతరం లాటిన్ అమెరికా, యూరప్, సబ్-సహారా ఆఫ్రికా కార్యకలాపాలకు సీఈవోగా కూడా పనిచేశారు. నరసింహన్ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్కు ట్రస్టీ కూడా, కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సభ్యుడు, యూఏ ప్రైమ్ మినిస్టర్స్ బిల్డ్ బ్యాక్ బెటర్ కౌన్సిల్ సభ్యుడిగానూ, వెరిజోన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడుగాను పనిచేశారు. సెప్టెంబరు 2019లో సీఈవోగా రెకిట్‌లో చేరారు. లైసోల్, డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్లఅమ్మకాల్లో రికార్డు సృష్టించారు. కంపెనీ కీలక ఎగ్జిక్యూటివ్‌గా ప్రధాన వ్యూహాత్మక పరివర్తన, స్థిరమైన వృద్ధికితో కంపెనీని లాభాల బాటపట్టించారు. అమ్మే స్ఫూర్తి, రోజుకు పూటే భోజనం ఇటీవలి కాలంలో ఆన్లైన్ గ్లోబల్ మీటింగ్ 'ఫైర్‌సైడ్ చాట్'లో తన జీవిత విశేషాలను పంచుకున్నారు లక్ష్మణ్ నరసింహన్. పూణేలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన తల్లి తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. అలాగే వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువు, వీసా ఇతర ఖర్చుల కోసం ఇంట్లోని వస్తువులను అమ్మి మరీ డబ్బు కూడగట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాదు జర్మనీలో సమ్మర్ స్కూల్లో విద్య నభ్యసించేటపుడు చేతిలో డబ్బుల్లేక రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసేవాడట. అందుకే ఏకంగా 10 కిలోల బరువు తగ్గానని, ఇదే తాను జీవితంలో మరింత పట్టుదలగా ఎదడగానికి దోహదం చేసిందంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంటారు నరసింహన్. అంతేకాదు లాటిన్ అమెరికాలో ఒక కంపెనీ నడుపుతున్నప్పుడు తాను వారాంతంలో స్పానిష్ నేర్చుకున్నారట. నిరంతరం మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని తన ఉద్యోగులకు సలహా ఇచ్చేవారట. ముఖ్యంగా "మనం ఎక్కడి నుండి వచ్చామో అసలు మర్చిపోవద్దు" అని కూడా సూచించారట. స్నేహితుల సంబరం నరసింహన్ క్లాస్మేట్ పారిశ్రామికవేత్త నితిన్ జోషి ప్రకారం తన స్నేహితులందర్నీ ఇప్పటికీ చాలా ప్రేయగా ఆప్యాయంగా పలకరించే బెస్ట్ ఫ్రెండ్. అన్నట్టు వీరికి కూడా పూర్వ విద్యార్థులతో ఒక వాట్సాప్ గ్రూపు కూడా ఉందట. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా 1982 లయోలా హై స్కూల్ గ్రూపులో తన ఫోటోలు, ఎపుడూ అప్డేట్లను పోస్ట్ చేస్తూ ఉంటారట. అయితే ఎప్పుడూ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండే ఆయన సడన్‌గా ఈ మధ్య బిజీ అయిపోయారట. కట్ చేస్తే స్టార్బక్స్గా సీఈవోగా ఎంపికైన వార్త తెలిసందంటూ జోషి చాలా సంతోషం వ్యక్తం చేశారు. కష్టాలను అధిగమించి, ప్రపంచం నలు మూలలా కష్టపడి పనిచేసి ఈ రోజు గ్లోబల్‌లీడర్‌గా ఎదిగాడని ఆయన ప్రశసించారు. తండ్రి మార్గదర్శకత్వంలో లక్ష్మణ్ ఫుట్‌బాల్ ఆడేవారనీ, ముఖ్యంగా స్కూలు స్థాయిలో జట్టు గోల్ కీపర్‌గా ఉండేవారని విన్సెంట్స్ బాయ్స్ అసోసియేషన్, వ్యాపారవేత్త ముర్తుజా పూనావాలా చెప్పారు. నరసింహన్ తమ అకాడమీకే గౌరవాన్ని, గుర్తింపును తెచ్చారని.. ఇందుకు తాము గర్వపడుతున్నామని CoEP యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సీఈఓ ముకుల్ సుతాన్ తెలిపారు. నరసింహన్ బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ సహచరుడని కూడా ఆయన గుర్తుచేశారు. -
కుటుంబాన్ని రిపేర్ చేస్తున్న మెకానిక్ రాధ
ఆ గ్యారేజ్‌లో రెంచ్‌లు, స్క్రూ డైవర్ల సందడితో గాజుల చప్పుడు కలిపి వినిపిస్తుంది. గ్రీజు అంటుకుపోయిన దుస్తులతో ఎప్పుడూ కనిపించే మెకానిక్ కాకుండా ఓ స్త్రీ చేతిలో రెంచీతో కొత్తగా కనిపిస్తుంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎంపీడీఓ కార్యాలయం రోడ్డులో ఉందీ మెకానిక్ షెడ్. భర్తకు అండగా నిలవడానికి భార్య మెకానిక్‌గా మారిన ఈ కథ ఆసక్తికరం. మట్టి అంటిన చేతులు నిజాయితీకి నిలువుటద్దాలు అంటారు కదా.. అలా నిజాయితీ కలిగిన ఓ మహిళ కథ ఇది. శ్రీకాకుళం: మహిళలు చాలా రంగాల్లో రాణిస్తున్నారు. చాలా మంది టీచర్లయ్యారు, ఇంకొందరు ప్రైవేటు సెక్టార్లలో రాణిస్తున్నారు, మరికొందరు రాజకీయా ల్లో ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు.. అలా రాధ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసే తత్వం ఉంటే రంగంతో పని లేదని నిరూపిస్తున్నా రు ఈమె. వాస్తవానికి బైక్ మెకానిక్ రంగం మగాళ్ల రాజ్యం. రోజంతా దుమ్ము, ధూళి, గ్రీజులతో ఈ పని మొరటుగా ఉంటుంది. కానీ కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఈ పనిని కూడా ఆమె బాధ్యతగా నెత్తికెత్తుకుంది. ► పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం రోడ్డులో గిరి మెకానిక్ షా పు ఉంది. అక్కడే రాధ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఎలాంటి వాహనం వచ్చినా ఇట్టే సమస్యను పసిగట్టి పరిష్కరించి పంపిస్తారు. వాస్తవానికి రాధ బైక్ మెకానిక్ పనులేవీ నేర్చుకోలేదు. కాలం ఆమెను ఈ రంగం వైపు నడిపించింది. ► పదహారేళ్ల కిందట రాధకు పోల గిరితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి స్వ స్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా రంభ గ్రామం. అక్కడ ఉపాధి లేక పలాస వరకు వలస వచ్చారు. గిరికి బైక్ మెకానిక్ పనులు తెలుసు. కానీ ఆయనకు సరిగ్గా వినిపించదు. దీంతో వ్యాపారంపై ఆ ప్రభావం పడింది. కస్టమర్లు రావడం.. సమస్యను చెప్పడానికి ఆపసోపాలు పడడంతో గిరికి గిరాకీ తగ్గింది. కోవిడ్ రాకతో.. ► అసలే వ్యాపారం అంతంతమాత్రంగా ఉంటే అప్పుడే కోవిడ్ కేసులు ఉద్ధృతం కావడం మొదలయ్యాయి. ఫలితంగా ఉన్న ఉపాధి కాస్తా పోయింది. షెడ్‌కు బళ్లు రావడం మానేశాయి. ఓ వైపు కుటుంబానికి తిండీ తిప్పలు, ఇంటి అద్దె, షాపు అద్దె కట్టాల్సి రావడంతో వీరికి ఏం చేయాలో పాలుపోలేదు. ► ఈ కష్టకాలంలో గిరి భార్య రాధ ఆదర్శ ప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. తాను షెడ్లో ఉంటే తప్ప పరిస్థితులు చక్కబడవని గ్రహించి మెకానిక్ పనులు నేర్చుకోవడం మొదలుపెట్టారు. భర్త తోడుతో.. కోవిడ్ కాలంలో అద్దెల భారం పెరిగి కరోనా సమయంలో ఉపాధి లేక పస్తులు పడ్డా రు. పనిచేసేందుకు ఎవరినైనా పెడదామంటే అంత జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీంతో రాధ స్వయంగా రోజూ దుకాణానికి వచ్చి సాయం చేసేది. సందేహాలు వస్తే గూగుల్, యూట్యూబ్‌లో వీడియోలు చూసి కొన్ని నేర్చుకునేవారు. కరోనా సమయంలో ఇంటి వద్దకు కొన్ని వాహనాలు వస్తే కాదనకుండా మరమ్మతులు చేసి పంపించేవారు. భర్తే ఆమెకు దగ్గరుండి విద్య నేర్పడం గమనార్హం. భర్త నేరి్పన విద్యతో అన్ని రకాల మరమ్మతులు చేస్తూ బైక్ మెకానిక్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సాధారణ వాహనాలతో పాటు పాతకాలం నాటి యమహా క్రక్స్ వంటి వాహానాలను కూడా ఆమె బాగు చేయగలరు.బీఎస్ 2 నుంచి బీఎస్ 6 వరకు స్కూటీలు, మోటారుసైకిళ్లు బాగు చేస్తున్నారు. భార్యాభర్తలం కష్టపడితేనే పైసలు కనిపిస్తున్నాయని, అందుకే సిగ్గు పడకుండా ఈ వృత్తిలో కొనసాగుతున్నానని ఆమె చెబుతున్నారు. పిల్లలను చక్కగా చదివించుకుని ఇక్కడే స్థిరపడాలని ఉందని ఆమె తెలిపారు. -
వరద నీటిలోనే పెళ్లికూతురి వివాహ ప్రయాణం
-
ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. నితిన్ ఎమోషనల్
Nithin Emotional Post On His 20 Years Cinema Journey: 'జయం' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు యంగ్ హీరో నితిన్. దిల్, సై, ఇష్క్ వంటి తదితర సినిమాలతో మంచి బ్రేక్ తెచ్చుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మూవీతో ఆగస్టు 12న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే 2002లో 'జయం' సినిమాతో కెరీర్ ప్రారంభించిన నితిన్ 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు, దర్శక-నిర్మాతలకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. 'డియర్ ఫ్రెండ్స్.. 20 ఏళ్ల కిందట నా మొదటి సినిమా అయిన జయంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. దీన్ని ఎలా వర్ణించాలో మాటలు కూడా రావడం లేదు. నాలోని నటుడిని గుర్తించి నాకు జయం సినిమాలో అవకాశం ఇచ్చిన తేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా సినీ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, వ్యక్తిగత సిబ్బంది.. ఇలా నాతో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో. ఈ అందమైన ప్రయాణంలో నాకు ఎంతోమంది అండగా నిలిచారు. కెరీర్లో కష్టాలు ఎదురైనప్పుడు ఎంతో సహకరించారు. ఇన్నేళ్లుగా అభిమానిస్తూ, నాపై నమ్మకాన్ని ఉంచి నా వెన్నంటే ఉంటూ వచ్చిన నా అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.' అని ట్విటర్లో ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు నితిన్. ❤️❤️❤️ pic.twitter.com/WbhRMZMac3 — nithiin (@actor_nithiin) June 14, 2022 -
స్విమ్మర్ షేక్ ఖాజా మొహిద్దీన్ విజయగాథ
బతుకుబాటలో కష్టాలకు ఎదురు ఈదుతూనే అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు ఈ యువకుడు. 12 ఏళ్ల వయసులో సరదాగా ప్రారంభించిన ఈతలో అసమాన ప్రతిభ చూపి ఎన్నో పతకాలు సొంతం చేసుకుంటున్నాడు. అందరిచేత శభాష్ షేక్ ఖాజా మొహిద్దీన్ అనింపించుకుంటున్నాడు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): అది 2003. కాకుమాను మండలం చినలింగాయపాలెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా షేక్ ఖాజా మొహిద్దీన్ దగ్గరలోని లక్ష్మీపురం బకింగ్‌హామ్ కాలువలో సరదాగా స్నేహితులతో కలిసి కేరింతలు కొడుతూ ఈత కొట్టేవాడు. మిగతా వారి కంటే వేగంగా ఈదడం గమనించిన పీఈటీ మనోహర్ మొహిద్దీన్ను ప్రోత్సహించారు. నిత్యం సాధన చేస్తే అంతర్జాతీయ స్విమ్మర్వి అవుతావని వెన్నుతట్టారు. ఆ మాట మొహిద్దీన్ మదిలో బలంగా నాటుకుపోయింది. అంతే అప్పటి నుంచి ఇంకా అతను ఈతను ఆపలేదు. కష్టాలను అధిగమించి ఖాజా స్వస్థలం కాకుమాను మండలం చందోలు. ప్రస్తుతం గుంటూరులోనే స్థిరపడ్డాడు. తండ్రి చిరుద్యోగి. అతి సామాన్య కుటుంబం. నిత్యం ఈత సాధనతో మంచి ప్రావీణ్యం సాధించిన ఖాజా అనేక పోటీల్లో పతకాలు సాధించాడు. ఈ తరుణంలోనే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. వెంటనే కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా మీదపడడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. అయినా వెనుకడుగు వేయలేదు. నిత్య సాధనతో ప్రతిభ కనబరుస్తూనే ఉన్నాడు. విద్యావంతురాలైన భార్య సహకారంతో ముందుకు సాగుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు. ఈత శిక్షకుడిగా మారినా ఆశించిన జీతభత్యాలు లేవు. కరోనా కష్టకాలంలో దాదాపు రెండేళ్లు స్విమ్మింగ్ పూల్స్ అన్నీ మూసేశారు. ఈ సమయంలో ఖాజా మంచితనం, స్నేహితుల అండదండలు అతడిని ముందుకు నడిపించాయి. ప్రస్తుతం ఖాజా జీఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. దీంతోపాటు గుంటూరులో ప్రముఖులకు శిక్షకుడిగానూ మారారు. ఎందరి నుంచో అభినందనలు పొందారు. మొహిద్దీన్ సాధించిన విజయాలు ► అంతర్జాతీయంగా : 2018లో ఖజికిస్తాన్లో జరిగిన ఇండో– ఖజక్ మాస్టర్స్ ఇన్విటేషన్ ఇంటర్నేషనల్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు. ఒక రజతం. ► అదే ఏడాది మలేషియాలో జరిగిన ఫస్ట్ ఏషియన్ పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు, ఒక కాంస్యం. ► 2019లో టర్కీలో జరిగిన టర్కీ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ వింటర్ పోటీల్లో ఐదు రజతాలు, రెండు కాంస్యాలు. ► 2020లో దుబాయ్‌లో జరిగిన 3వ ఇంటర్నేషనల్ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలు. ► 2022 గత నెల చివరిలో గోవాలో జరిగిన 4 కిలోమీటర్ల సీ స్విమ్మింగ్ పోటీల్లో ప్రథమ స్థానం. ► ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 10 బంగారు, ఆరు రజతాలు, ఏడు కాంస్యాలు. ► జాయతీ స్థాయిలో 10 బంగారు, 11 రజతాలు, ఏడు కాంస్యాలతోపాటు రాష్ట్ర స్థాయిలో 50కిపైగా పతకాలు. చివరి శ్వాస వరకూ.. మా మాస్టారు వల్ల నేను స్విమ్మర్ అయ్యాను. అనూహ్య విజయాలు సాధించాను. దీనికి నా కుటుబంతోపాటు ఎంతోమంది సహాయసహకారాలు కారణం. ఈత కొలను ఎన్నో జీవిత సత్యాలు నేర్పింది. ఈత మధ్యలో ఆపితే ప్రాణం ఎలా ఆగిపోతుందో.. జీవితంలో పోరాటం ఆపినా అది ముగిసిపోతుంది. అందుకే నా చివరి శ్వాస వరకు ఈత కొలనే నా జీవితం. ఇప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. ప్రభుత్వం చిన్న ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని మనవి. – ఖాజా మొహిద్దీన్, అంతర్జాతీయ స్విమ్మర్ -
జిలేబీ జర్నీ..! భారత్‌కు ఎలా వచ్చిందో తెలుసా..?
అలసి సొలసి ఇంటికి బయలుదేరుడుండగా... ఓ వీధి దుకాణంలో అప్పుడే తయారుచేసిన వేడి వేడిగా జిలేబీ మీ కంటికి ఎదురైతే.. ఇక మీ అడుగులు ఇంటికి బదులుగా ముందు జిలేబీ దగ్గరకే చేరుకుంటాయి. అంతేనా.. వెంటనే ఒక జిలేబి తీసుకొని తినేంతవరకూ మీ చేతులు కూడా ఊరుకోవు! మరి ఇంతలా మాయచేయగల ఆ తియ్యని జిలేబీ వెనుక ఒక పెద్ద చరిత్రనే ఉంది. చాలా మంది ఇది స్వదేశీ వంటకంగా పిలుస్తుంటారు. కానీ, జిలేబీ జర్నీ వేరే.... వాస్తవానికి, మధ్య– తూర్పు దేశాలైన జలాబియా, పెర్షియన్ నుంచి ’జుల్బియా’గా ఈ వంటకాన్ని దిగుమతి చేశారు. 10వ శతాబ్దాంలో ముహమ్మద్ బిన్ హసన్ అల్–బాగ్దాది రాసిన ’ కితాబ్ అల్ తబీఖ్’ పురాతన పెర్షియన్ వంటల పుస్తకంలో మొదటిగా దీని రెసిపీనీ ప్రస్తావించారు. దీని బట్టే ఇది పెర్షియన్ వంటకంగా పరిగణించొచ్చు. ఇండియాకు ఇలా వచ్చింది.. సాధారణంగా రంజాన్, ఇతర సంప్రదాయ పండుగ రోజుల్లో ప్రజలు సంతోషాన్ని పంచుకునే నేపథ్యంలో వారు తయారు చేసిన తీపి పదార్థాలను ఇచ్చిపుచ్చుకుంటుంటారు. అలా ఇబ్న్ సయ్యర్ అల్‌వార్రాక్ అనే అరబ్ షెఫ్ రాసుకున్న పుస్తకంలో ఈ వంటకం తనకు బహుమతిగా లభించినట్లు రాసుకున్నాడు. ఆ రుచిని మెచ్చిన ఆ వ్యక్తి తాను కూడా ఆ వంటకం నేర్చుకొని వివిధ దేశాల్లో విస్తరింపజేశారు. ఏది ఏమయినప్పటికీ, జుల్బియా భారతీయ జిలేబీకి భిన్నంగా ఉంటుంది. అక్కడ చక్కెర పాకానికి బదులుగా.. మిడిల్–ఈస్టర్న్ రెసిపీ, తేనె, రోజ్ వాటర్ సిరప్‌ను ఉపయోగించేవారు. ఈ రెసిపీనే పెర్షియన్ వ్యాపారులు భారత ఉపఖండానికి తీసుకువచ్చారు. ‘ప్రియామ్‌కార్న్‌పాకథా’ (క్రీ.శ 1450) – జైనసుర స్వరపరిచిన జైనవచనంలో జిలేబీ గురించి మన దేశంలో మొట్టమొదటగా ప్రస్తావించారు. అక్కడ అతను ఒక భారతీయ వ్యాపారి అందించే విందు మెనులో భాగంగా జిలేబీని పేర్కొన్నాడు. తర్వాత, క్రీ.శ. 1600 లో, సంస్తృత వచనం గుణ్యగుణబోధినిలోనూ ఉంది. అలా...మనోహరమైన జుల్బియా భారతీయ వంటకాల్లో స్వదేశీ ‘జలవల్లికా’ లేదా ‘కుండలికా’గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 15వ శతాబ్దం చివరి నాటికి, జిలేబీ దేశీయ ఉత్సవాల్లో భాగంగా మారింది, అలాగే వివాహాలు, ఇతర వేడుకలు వంటి వ్యక్తిగత సందర్భాలలో కూడా మారింది. దేవాలయాలలో ప్రసాదంగానూ మారింది. భిన్న రూపాలు.. జిలేబీకి చెందిన అనేక అవతారాలు ఇప్పుడు దేశంలోని ప్రధాన భూభాగంలో ప్రాచుర్యం పొందాయి – ఇండోర్ నైట్ మార్కెట్ల నుంచి హెవీవెయిట్ జిలేబాగా.., బెంగాల్ స్వీట్ మేకర్స్ వంటశాలల నుంచి చనార్ జిలిపిగా.., మధ్యప్రదేశ్ మావా జిలేబీ..., హైదరాబాద్ డోపెల్‌గేంజర్ ఖోవా జలేబీ... లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి జాంగ్రిగా ఇలా వివిధ పేర్లతో రకరకాలుగా జిలేబీ మన దేశంలో ఒక భాగంగా నిలిచిపోయింది. -
వామ్మో.. కరోనా ఎఫెక్ట్.. మేం జర్నీచేయం!
సాక్షి, సిటీబ్యూరో: వేసవి వచ్చిందంటే చాలు రైళ్లు కిటకిటలాడుతాయి. ప్రయాణికుల రాకపోకలు రెట్టింపవుతాయి. రైల్వేస్టేషన్లలో సందడి నెలకొంటుంది. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. గతేడాది వేసవిలో కోవిడ్ ఉధృతి దృష్ట్యా రైల్వే సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈసారి వేసవిలో అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ రెండో దశ కోవిడ్ విజృంభణతో ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. గత 15 రోజులుగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లు రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సుమారు 25 శాతానికి పైగా ప్రయాణికుల రద్దీ తగ్గినట్లు అంచనా. నెల రోజుల క్రితం వరకు సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు లక్ష మందికి పైగా రాకపోకలు సాగించగా ఇప్పుడు 60 వేల నుంచి 70 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు వేసవిలో ఏసీ బోగీలకు ఉండే డిమాండ్ కూడా తగ్గింది. కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రయాణికులు స్లీపర్ కోచ్‌లను ఎంపిక చేసుకోవడం గమనార్హం. రైళ్లన్నింటినీ పునరుద్ధరించాక ఇలా... ►ఈ ఏడాది సంక్రాంతి నుంచి రైళ్ల పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేశారు. గత సంవత్సరం కోవిడ్ దృష్ట్యా లాక్డౌన్ నిబంధనల అనంతరం మొదట 22 రైళ్లను అందుబాటులోకి తెచ్చిన దక్షిణమధ్య రైల్వే అధికారులు ఆ తరువాత ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచారు. ► అన్ని రైళ్లను ‘ప్రత్యేకం’ పేరిట నడుపుతున్నారు. సాధారణ చార్జీలను ‘తత్కాల్’కు పెంచేశారు. సంక్రాంతి నాటికి సుమారు 75 రైళ్లు అందుబాటులోకి రాగా ప్రస్తుతం వాటి సంఖ్య వంద దాటింది. ► సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ, ముంబయి, పట్నా, దానాపూర్, అహ్మదాపూర్, రెక్సాల్, లక్నో, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, తదితర అన్ని రూట్లలో రైళ్ల రాకపోకలు పెరిగాయి. ► ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 22 రైళ్లను కొత్తగా పునరుద్ధరించారు. మొదట్లో కేవలం 25 వేల మంది ప్రయాణం చేశారు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. సంక్రాంతి నాటికి అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా నమోదైంది. కొన్నింటిలో ఏకంగా 250 నుంచి 300కు చేరుకుంది. వీకెండ్స్‌లో 1.10 లక్షల మంది వరకు ప్రయాణం చేశారు. కానీ రెండో దశ కోవిడ్ విజృంభణతో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. ‘ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నవాళ్లు తమ ప్రయాణాలను యథావిధిగా కొనసాగిస్తున్నప్పటికీ కొత్తగా బుక్ చేసుకొనేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గింది’ అని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. పర్యాటకులు బంద్ సాధారణంగా వేసవి రోజుల్లో పర్యాటకుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరాన్ని సందర్శించేందుకు ఎక్కువ మంది వస్తారు. కానీ ఈసారి పర్యాటకులకు బదులు వలస కూలీల రాకపోకలు కొద్దోగొప్పో ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ కాలంలో సొంత ఊళ్లకు వెళ్లిన కూలీలు సడలింపు అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో తరచుగా సొంత ఊళ్లకు వెళ్లి వచ్చే వాళ్ల సంఖ్య పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గడమే కాకుండా నగరం నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గింది. -
బాలు మాతో 'పాటే'
సాక్షి, సిటీబ్యూరో : ఆయన లేకున్నా.. మాతో ‘పాటే’.. అంటోంది.. నగర కళా సాంస్కృతిక రంగం... గాన గంధర్వునితో తమజ్ఞాపకాలు తలచుకుని కన్నీరు మున్నీరవుతోంది. నగరంలో ఆయన అడుగుపెట్టని ఆడిటోరియం లేదు. ఆయనగళం వినిపించని వేదిక లేదు. ఆయన భుజం తట్టి ప్రోత్సహించనిసాంస్కృతిక సంస్థ లేదు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరనే వార్త తెలిసి ఎందరో సాంస్కృతిక రంగ ప్రముఖులు స్పందించారిలా.. తొలి సంగీత విభావరి మాతోనే.. గానగంధర్వులు బాల సుబ్రహ్మణ్యంతో హైదరాబాద్‌లో తొలి సంగీత విభావరి 1975లో మేమే నిర్వహించాం. అప్పట్లో రవీంద్రభారతిని సినిమా ప్రోగ్రామ్లకి ఇచ్చేవారు కాదు.. అందుకని లిబర్టీ దగ్గర లేడీ హైదరీ క్లబ్లో పెట్టాం. తర్వాత అఖిల భారత స్థాయిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటల పోటీలు పెడితే జడ్జిగా మహదేవన్ హాజరయ్యారు. ఆ పోటీ విజేతలకు రవీంద్రభారతిలో బహుమతులిచ్చాం. ఒక వికలాంగుడికి బహుమతి ఇవ్వాల్సి వస్తే బాలు అతడ్ని ఎత్తుకుని బహుమతి ఇచ్చారు. అలాగే ఏ.ఎం. రాజా స్వర్ణకంకణం లలిత కళాతోరణంలో బాలుకు ఇచ్చాం. ఆ స్వర్ణ కంకణానికి డబ్బులు ఎంత అయిందని అడిగి తెలుసుకుని ఆ మొత్తాన్ని వేగేశ్న ఫౌండేషన్ నిర్వహిస్తున్న వికలాంగ స్కూల్‌కి ఇచ్చేశారు. అలాగే మా దివ్యాంగుల ఆశ్రమానికి ఆయన ప్రధాన పోషకుడిగా కూడా మారారు. కళా సంస్థలకు నిధుల సేకరణ ప్రోగ్రామ్స్‌లో ఆయనెప్పుడూ రెమ్యునరేషన్ తీసుకునేవారు కాదు. అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద పెట్టిన మ్యూజిక్ అవార్డ్ బాలుకు ఇస్తే అందులో భాగంగా వచ్చిన రూ.లక్ష నగదును ఆయన తన పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కి అందించారు. ఆ ట్రస్ట్ తరఫున పేద గాయనీ గాయకులకు ఆర్థిక చేయూత అందించేవారు. ఆయనకు ఒకసారి వీణ బహుమతిగా ఇస్తే ఎవరో నిరుపేద అమ్మాయి వీణ నేర్చుకునే సరదా ఉందంటే ఆ వీణ తీసుకెళ్లి ఆమెకి ఇచ్చేశారు. ఇలాంటివెన్నో ఆయన కళా పోషణకు గుర్తులు. ఆయన లేకపోవడం కళా సంస్థలకు తీరని లోటు. ఎవరు పిలిచినా వీలున్నంత వరకూ హాజరయ్యేవారు. మా ఇద్దరిది 45 ఏళ్ల అనుబంధం. మా ఇళ్లకు వచ్చేవారు. భోజనం చేసేవారు. పిల్లల్ని ఆడించేవారు. ఏదేమైనా నగరంలోని కళాసంస్థలు ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్టే. – వంశీ రామరాజు మనసున్న పాట.. 20ఏళ్లుగా ఎస్పీబాలుతో పరిచయం ఉంది. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. నా ప్రతి పుస్తకం తొలి పాఠకుడు ఆయనే. నా ఫొటోగ్రఫీలన్నీ నచ్చేవి ఆయనకి. బాల సుబ్రహ్మణ్యంను నాకు రచయిత వెన్నెకంటి పరిచయం చేశారు. సంగమం సంస్థ పెట్టాక వందల కార్యక్రమాల ద్వారా ఆయనకు మరింత దగ్గరయ్యా. ఆయనలో మంచి గాయకుడు మాత్రమే కాదు మనసున్న మంచి మనిషి కూడా ఉన్నాడని ఎన్నో సందర్భాల్లో తెలిసింది. ఓ సారి సురభి నాటక సమాజానికి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. దీని కోసం బాలు చేత ఒక పాట పాడించి అప్పట్లో ఆయన రెమ్యునరేషన్ కింద రూ.50 వేలు ఇచ్చాం. ఆ కార్యక్రమానికి హాజరైన ఆయన సురభి వాళ్ల పేదరికం చూసి రూ.50 వేలు తిరిగిచ్చేశారు. అంతేకాదు మరో రూ.25 వేలు కూడా కలిపి వారికి ఇచ్చారు. ప్రముఖ గాయని జిక్కికి బ్రెస్ట్ కేన్సర్ చికిత్సకు ఆర్థిక సాయం చేద్దామని ఆయన్ని రమ్మని పిలిస్తే రాలేకపోయారు. అలాగే ఉడత సరోజినికి సాయం కోసం కూడా ఓ కార్యక్రమం పెడితే కూడా ఏదో అర్జంటు పని వల్ల రాలేనని చెప్పారు. కానీ ఖచ్చితంగా ఆ కార్యక్రమాల రోజు గుర్తు పెట్టుకుని మరీ రెండు కార్యక్రమాలకూ చెరో రూ.25 వేల చొప్పున పంపించారు. మరో సందర్భంలో గాయని పి.సుశీల ట్రస్ట్ పెట్టి తొలి జాతీయ అవార్డు తన పేరు మీద జానకికి ఇచ్చారు. ఈ సందర్భంగా బాలు మ్యూజిక్ ప్రోగ్రామ్ పెడితే రవీంద్రభారతిలో పొద్దున్నే వచ్చి సౌండ్ సిస్టమ్ చెక్ చేసుకున్నాడు. అది తనకు సరిగా లేదని తనకు అలవాటైన సౌండ్ సిస్టమ్‌కి మార్పించారు. అంతేకాదు ఆ సౌండ్ సిస్టమ్‌కి ఖర్చు కూడా తానే భరించారు. రెమ్యునరేషన్‌గా సుశీల రూ.50 వేలు ఇస్తే.. మంచి కార్యక్రమం.. నాకు రెమ్యునరేషన్ వద్దంటూ సున్నితంగా తిరిగిచ్చేశారు. 40ఏళ్ల పాటు వేల సినిమాలకు సితార్ ప్లే చేసిన మిట్టా జనార్దన్ అనే సితార విద్వాంసుడు బాలు తొలిపాట నుంచి ఆయనతో పాటు కలిసి ఉన్నాడు. ఆ కళాకారుడికి ఎవరూ ఏమీ చేయడం లేదు.. గుర్తింపు లేదు అంటూ బాధపడిన బాలు నన్ను పిలిచి అతడి గురించి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టమన్నారు. అంతేకాదు స్పాన్సర్స్‌ని కూడా ఆయనే మాట్లాడి గతేడాది రవీంద్రభారతిలో ప్రోగ్రామ్ చేసి మిట్టా జనార్దన్‌ని గ్రాండ్‌గా సన్మానించారు. ఏదో శాలువా కప్పి వదిలేయకుండా రూ.లక్ష పెట్టి స్వర్ణకంకణం స్వయంగా కొని తొడిగారు. అంత గొప్ప మానవత్వం ఉన్న మనిషిని కోల్పోవడం కళా.. సాంస్కృతిక రంగానికి తీరని లోటే. – సంజయ్ కిషోర్, సినీ పరిశోధకుడు, సంగమం సంస్థ నిర్వాహకులు ‘గాన గంధర్వ’ ఇచ్చే అదృష్టం దక్కింది.. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం లేరంటే వినడానికి చాలా బాధగా ఉంది. ఆయనతో ఉన్న 40 ఏళ్ల పరిచయంతో ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ కలిసి నిర్వహించడం నా అదృష్టం. బాలు స్ఫూర్తితో ఘంటసాల 24గంటలు కార్యక్రమం 95లో ప్రారంభించి ఇంకా రాష్ట్రం అంతా చేస్తూ వస్తున్నాం. బాలు జన్మస్థలం నాదీ నెల్లూరే. అక్కడ 24గంటల కార్యక్రమం పెట్టినప్పుడు సినారె చేతులమీదుగా ఘంటసాల సావిత్రమ్మ సమక్షంలో.. గాన గంధర్వ బిరుదు అధికారికంగా ఇచ్చాం. ఆయన తొలి పాట పాడి 45 ఏళ్లు అయిన సందర్భంగా 2011 డిసెంబరులో నగరంలోని లలిత కళాతోరణంలో ప్రోగ్రాం పెట్టినప్పుడు సన్మానాలు వద్దు, టిక్కెట్లు వద్దు అలాగైతేనే వస్తా అన్నారు. అయితే 3గంటల పాటు మీరే పాటలు పాడాలి అని అడిగితే.. సరేనని 28 పాటలు పాడారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. 2014లో విశ్వనాథ్‌కు సన్మానం చేసిన సందర్భంగా బాలు ఆయనకు పాటలాభిషేకం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11, 12 తేదీల్లో విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో ఘంటసాల 24 గంటల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం వెళ్లారు. అలా ఆయన పాల్గొన్న ఆఖరి ప్రోగ్రాం, ఆఖరి ప్రసంగం సైతం మాకే దక్కింది. స్నేహశీలి ఆయన. ఏమయ్యా రఘరామా అని ప్రేమగా పిలిచేవాడు.. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా మాకు తొలుత గుర్తొచ్చే పేరు ఆయనదే. అలాంటి ప్రముఖుడ్ని కోల్పోవడం తీరని లోటు. – రఘురామ్, కిన్నెర ఆర్ట్స్ థియేటర్ డాక్టరేట్‌తో సత్కరించిన తెలుగు వర్సిటీ నాంపల్లి: గాన గంధర్వుడు, పద్మభూషణ్, డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసింది. 1998లో విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవంలో ఎస్పీ బాలుకు డిలిట్ పురస్కారంతో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. బాలు తెలుగు విశ్వవిద్యాలయం పట్ల చూపిన ఆదరణ మరువలేనిదని తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ అన్నారు. తెలుగు భాషలోని ప్రతి అక్షరాన్ని అందంగా పలికి తెలుగు భాషా సంస్కృతికి అర్థవంతమైన నిర్వచనాన్ని అందించిన భాషా ప్రియులుగా, సినీ సంగీత రంగంలో అపారమైన ప్రతిభావంతులుగా నిలిచారని అన్నారు. వారి స్థానం భారతీయ భాషల చలన చిత్రరంగంలో అజరామరంగా కొనసాగుతుందని కీర్తించారు. ఎస్పీ బాలు మృతి పట్ల వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిణి ఆచార్యరెడ్డి శ్యామల, అంతర్జాతీయ తెలుగు భాషా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.సత్తిరెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ జె.అజయ్‌చంద్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన పాటగా మనతో ఉంటారు.. నన్ను పాటల పోటీల్లో ప్రథముడిగా గుర్తించి ప్రోత్సహించారు. అలాంటి ఆయనతోనే నా మొదటి పాట పాడగలగడం, ఆయనతో అనేక చిత్రాల్లో ద్విగళ గీతాలు పాడే అదృష్టం నాకు కలిగింది. మేం స్థాపించిన స్వరమాధురి సంస్థను అనేక రకాలుగా ప్రోత్సహించారు. ఎప్పుడు పిలిచినా వచ్చేవారు. చిత్రపరిశ్రమలో నాకు అన్నగా, స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా ఉంటూ నా సంగీత దర్శకత్వంలో తొలి పాట పాడారు. నాకు గుండెకి సర్జరీ జరిగితే ఇంటికి వచ్చి ధైర్యాన్ని చెప్పారు. ఆయన కేవలం వృత్తి పరంగానే కాదు వ్యక్తిగతంగానూ మరచిపోలేని మహోన్నతుడు. ఆయన్ను కోల్పోవడం అత్యంత బాధాకరం. ఆయనకు మరణం లేదు. సూర్యచంద్రలున్నంత వరకూ ఆయన పాట ఉంటుంది. – జి.ఆనంద్, గాయకులు, స్వరమాధురి సంస్థ -
ప్రాణం పోసుకుంది నేడే: చిరంజీవి
మెగస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలోనే కాదు సమాజంలో కూడా ఎందరికో ఆదర్శం. ఓ సామన్య కుటుంబంలో జన్మించి.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే మెగాస్టార్ రేంజ్‌కి ఎదిగి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో కృషి, శ్రమ, పట్టుదల అవసరం. ఇవన్ని ఉన్నాయి కనుకే ఆయన జీవితం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఎన్నో ఆటుపోట్లని దాటుకుని.. సిని పరిశ్రమలో ఉన్నత స్థానానికి చేరారు చిరంజీవి. నేటితో ఆయన సినీ ప్రయాణం 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆయన నటించిన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ 1978, సెప్టెంబర్ 22న విడుదలైంది. మంచి విజయాన్ని సాధించింది. కె.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయసుధ, రావుగోపాల్రావు, చంద్రమోహన్, చిరంజీవి, రేష్మా రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో చిరంజీవిది ముఖ్యమైన పాత్ర. పల్లెటూరి యువకుడిగా చిరు మెప్పించారు. ‘ప్రాణం ఖరీదు’ చిరంజీవికి నటుడిగా ప్రాణం పోసిందనే చెప్పాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిరు ట్వీట్ చేశారు. (చదవండి: సన్యాసిలా ఆలోచించగలనా?) #BornAsAnActor #ForeverGrateful #PranamKhareedu #thisdaythatyear pic.twitter.com/lKM1qQhpN9 — Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2020 ‘నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యత ఉందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆగస్టు 22 నేను మనిషిగా ప్రాణం పోసుకుంటే.. సెప్టెంబర్ 22 నటుడిగా ‘ప్రాణం’ పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి.. ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికి, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అంటూ చిరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది. ‘ప్రాణం ఖరీదు’ నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆచార్య’ వరకు తన 42 ఏళ్ల కెరీర్లో చిరంజీవి 152 సినిమాల్లో నటించారు. దాదాపు అన్ని జానర్లలో నటిస్తూ ప్రేక్షకులను ఆలరించారు. ఇటీవల వచ్చిన ‘సైరా’ చారిత్రాత్మక చిత్రంతో ఇన్నాళ్లు ఉన్న లోటుని కూడా తీర్చేసుకున్నారు. ఆయన మరెన్నో మంచి చిత్రాలు చేయాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. -
కరోనా: ఇదేం జర్నీ!!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సమయంలో జర్నీ బెంబేలెత్తిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరస్వ్యాప్తిని అడ్డుకొనేందుకు మాస్కు ఒక్కటే రక్షణ కవచం అని తెలిసినప్పటికీ కొంతమంది ప్రయాణీకులు బేఖాతరు చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లలోనూ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. మాస్కులు ఉన్నప్పటికీ వాటిని కేవలం అలంకారప్రాయంగా ధరిస్తున్నారు.లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో గత 3 నెలలుగా దూరప్రాంతాలు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిమితంగానైనా ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. మొదట్లో ఈ బస్సులను ఉప్పల్, ఎల్బీనగర్, బీఎన్‌రెడ్డి నగర్, తదితర శివార్లకే పరిమితం చేశారు. ఆ తరవాత మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్ వంటి ప్రధాన స్టేషన్లకు కూడా బస్సులను అనుమతించారు. బస్సులు రోడ్డెక్కిన తొలి రోజుల్లో కోవిడ్ నిబంధనలు పటిష్టంగానే అమలు జరిగాయి. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు చేతులు శుభ్రం చేసుకొనేవిధంగా శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. మాస్కులేని వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు మైకుల ద్వారా ప్రచారం కూడా చేపట్టారు.కానీ క్రమంగా ఈ నిబంధనలన్నీ గాల్లో కలిసిపోయాయి. ఇటు ప్రయాణికులు, అటు ఆర్టీసీలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంది. చివరకు కరోనా బాధితులు ప్రయాణం చేసినా పట్టించుకొనే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు కరోనా బారిన పడకుండా కాపాడుకొనేందుకు ఎవరికి వారు స్వీయజాగ్రత్తలు పాటించడం ఒక్కటే శ్రీరామ రక్ష అని వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నప్పటికీ ‘తమకేం కాదులే’ అని నిర్లక్ష్య ధోరణి అన్ని చోట్ల కనిపిస్తోంది. ఇందుకు ఆర్టీసీ బస్సులు కూడా ఏ మాత్రం మినహాయంపు కాదు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న బస్సులను పరిశీలించినప్పుడు ఈ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. నిబంధనలు నీరుగార్చారు.... సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజు 3500 బస్సులు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తాయి. 1.25 లక్షల మంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.కానీ కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్లో భాగంగా అన్ని సర్వీసులను నిలిపివేశారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం తెలంగాణ జిల్లాలకు మాత్రమే బస్సులను పరిమితం చేశారు. దీంతో రోజుకు 800 నుంచి 1000 బస్సుల వరకు హైదరాబాద్ నుంచి జిల్లాలకు నడుస్తున్నాయి. మొదట్లో ప్రయాణికుల ఆదరణ పెద్దగా లేకపోయినప్పటికీ జూలై నుంచి క్రమంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక బస్సులో సగటున 50 మంది చొప్పున ప్రస్తుతం 40 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు తెలంగాణలో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి జిల్లాలకు రాకపోకలు సాగిస్తున్న బస్సులకే డిమాండ్ బాగా ఉంది. కానీ ఇదే సమయంలో గత రెండు నెలలుగా కోవిడ్ ఉధృతి కూడా పెరిగింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్‌కే పరిమితమైన వైరస్ జిల్లాలను, గ్రామీణ ప్రాంతాలను సైతం చుట్టుముట్టింది పల్లెల్లోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పట్టణాల్లో వందల్లో కోవిడ్ బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కాకపోవడం ఆందోళన కలిగిస్తుందని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది రాకపోకలు సాగించే మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో 8 చోట్ల కాలితో తాకి వినియోగించుకొనే శానిటైజర్లను ఏర్పాటు చేస్తే వాటిని గుర్తు తెలియని వాళ్లు తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుతం మేనేజర్ కార్యాలయం వద్ద మాత్రం రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ‘ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లను వినియోగించాలని’ చెబుతున్నప్పటికీ కొంతమంది పట్టించుకోవడం లేదని ఎంజీబీఎస్ అధికారి ఒకరు చెప్పారు. జేబీఎస్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక ఎల్బీనగర్, ఉప్పల్, తదితర కూడళ్ల నుంచి రాకపోకలు సాగించే బస్సుల్లో మొదట ఆర్టీసీ సిబ్బందే ప్రయాణికులకు శానిటైజర్ ఇచ్చే వారు. ఇప్పుడు అలాంటి సదుపాయం కనిపించడం లేదు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే ఒత్తిడి కూడా లేకుండా పోయింది. అన్‌లాక్‌లో పెరగనున్న రాకపోకలు... సెప్టెంబర్ నుంచి నిబంధనలు మరింత సడలనున్నాయి. అన్‌లాక్‌లో భాగంగా అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభమవుతాయి. ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. మిగతా రాష్ట్రాలతో కూడా రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మెట్రో సర్వీసులతో పాటు, ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీ బస్సులు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రాకపోకలు మరింత పెరుగుతాయి. సరిగ్గా ఇదే సమయంలో కరోనా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.‘‘ జిల్లాల్లో పాజిటివ్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రయాణికుల రాకపోకలు పెరగడం వల్ల కరోనా వ్యాప్తి కూడా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కొద్దిగా తగ్గుముఖం పడుతున్న వైరస్ ఉధృతి తిరిగి పుంజుకున్నా ఆశ్చర్యం అవసరం లేదు’’ అని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ హర్ష చెప్పారు. జాగ్రత్తలు తప్పనిసరి.... ⇔ మాస్కులు ధరించడంతో పాటు, ప్రతి ప్రయాణికుడు శానిటైజర్ వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ⇔ బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు హ్యాండిల్ రాడ్ పట్టుకోక తప్పదు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా చేతులు శానిటైజ్ చేసుకోవలసిందే. ⇔ సీట్లో కూర్చున్న తరువాత కూడా చాలా మంది తరచుగా తమ ముందు ఉన్న సీట్ ఫ్రేమ్‌ను పట్టుకుంటారు.అలా పట్టుకోవలసి వచ్చినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం మంచిది. ⇔ సీట్లో ఇద్దరు, ముగ్గురు అపరిచితులు కూర్చోవలసి వచ్చినప్పుడు మధ్యలో మాస్కు తీయకుండా ప్రయాణం పూర్తయ్యే వరకు పూర్తిగా ధరించి ఉండాల్సిందే. ⇔ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు లేకుండా విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రయాణికులే వారిని అప్రమత్తం చేయడం మంచిది. -
ప్రయాణాలకు బ్రేకులు
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల రైళ్లు భారంగా నడుస్తున్నాయి. క్రమంగా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నగరంలో చిక్కుకుపోయిన దూరప్రాంతాల ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు 23 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. మే నెలలో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లకు జూన్, జూలై రెండోవారం వరకు బాగానే డిమాండ్ కనిపించింది. అయితే గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మరింత పెరగడంతో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రత్యేక రైళ్లను ప్రారంభించిన తొలిరోజుల్లో ప్రతి రోజూ వివిధ నగరాలకు 25 వేల నుంచి 30 వేల మంది వరకు ప్రయాణం చేశారు. వెయిటింగ్ లిస్టు కూడా బాగానే ఉండేది. అయితే ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 20 వేలు కూడా దాటడం లేదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఓ వైపు అన్‌లాక్ ప్రక్రియ మూడోదశకు చేరుకుంది. లాక్డౌన్ నిబంధనలను మరింత సడలించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినా, ప్రజల రాకపోకలు మాత్రం ఇప్పట్లో మెరుగుపడే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు దేశంలోని పలు నగరాల్లో వారం, పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తుండడంతో ప్రత్యేక రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి కోల్‌కతాకు వెళ్లే హౌరా ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్ వరకే పరిమితం చేశారు. ఇటీవల కొన్ని సర్వీసులను సైతం రద్దు చేశారు. ప్రయాణికులు పరిమితం.... లాక్డౌన్ కాలంలో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ, తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం మొదట బెంగళూర్–ఢిల్లీ, సికింద్రాబాద్–ఢిల్లీ మధ్య రెండు రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత సికింద్రాబాద్ నుంచి ముంబై, కోల్‌కతా, విశాఖ, తిరుపతి, బెంగళూర్, న్యూఢిల్లీ, తదితర ప్రాంతాలకు సర్వీసులను పెంచారు. దీంతో 23 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వివిధ కారణాల వల్ల హైదరాబాద్‌లో ఉండిపోయిన వారు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జనరల్ బోగీలకు సైతం రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మొదట్లో ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగానే సాగాయి. దీంతో వంద వరకు వెయిటింగ్లిస్టును కూడా అమల్లోకి తెచ్చారు. అయితే జూలై నుంచి తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మరింత ఉధృతం కావడంతో ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. తగ్గిన ఆదాయం ... సాధారణంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో రోజుకు 750 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 10.5 లక్షల మంది ప్రయాణం చేస్తారు.ఒక్క సికింద్రాబాద్ నుంచే సుమారు 220 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తాయి. 1.85 లక్షల మంది బయలుదేరుతారు. దక్షిణమధ్య రైల్వేకు మొత్తంగా రోజుకు రూ.12 కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. కానీ ఈ ఆదాయం ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ప్రత్యేక రైళ్ల నిర్వహణ కూడా భారంగా మారింది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.కోటి నుంచి రూ.1.5 కోట్లు మాత్రమే వస్తున్నట్లు అంచనా. ఆర్టీసీ బస్సుల్లోనూ అంతంతే.... సాధారణంగా హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజు 3500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. కరోనా కారణంగా ఏపీకి బస్సులను పూర్తిగా నిలిపివేశారు. పునరుద్ధరణ చర్యలకు ఇటీవల బ్రేక్ పడింది. ప్రస్తుతం తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు మాత్రమే 50 శాతం బస్సులు నడుస్తున్నాయి. వాటిలోనూ ఆక్యుపెన్సీ రేషియో 30 శాతం నుంచి 40 శాతం వరకే ఉంటుందని అధికారులు తెలిపారు. తప్పనిసరైతే తప్ప జనం బస్సుల్లో వెళ్లడం లేదు. ఇటీవల ఒకటి, రెండు రూట్లలో కోవిడ్ పేషెంట్లు సైతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు వార్తలు రావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత తగ్గినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్ ఉధృతి కారణంగా హైదరాబాద్‌లో సిటీ బస్సులను ఇప్పట్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం లేదని తెలిపారు. -
అమ్మా నాన్నల కోసం
ఇదో వీరోచిత కథ. మార్చి రెండో వారంలో పోర్చుగల్ నుంచి ఒక కొడుకు సుమారు 5600 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న అర్జంటైనాలోని తన తల్లిదండ్రులను చూడటానికి చిన్న బోట్లో అట్లాంటిక్ సముద్రం మీద బయలుదేరాడు. కరోనా వల్ల పోర్చుగల్‌లో, అర్జంటైనాలో ఫ్లయిట్స్ ఆపేయడమే కారణం. ఒకటి కాదు రెండు కాదు 85 రోజులు ఒక్కడే చిన్న బోట్లో ప్రయాణించాడు. చివరకు తల్లిదండ్రులను చేరుకున్నాడు. గగుర్పాటు కలిగించే అతని ప్రయాణం ఏదైనా తల్లిదండ్రుల దీవెనలే రక్షగా నిలిచాయి. ‘గురూ... ముందే ఆలోచించుకో’ అన్నారు ఫ్రెండ్స్. ‘నువ్వు వెళ్తావా వెళ్లు. సగం దారిలో వెనక్కు వస్తే రానిచ్చేది లేదు’ అన్నారు పోర్చుగల్ అధికారులు. 47 ఏళ్ల బాలెస్టెరో ‘నా అమ్మా నాన్నలే రక్ష’ అనుకున్నాడు. కరోనా ప్రపంచం మీద బయలుదేరింది. మార్చి రెండో వారం వచ్చేసరికి పోర్చుగల్‌లో లాక్డౌన్ మొదలయ్యింది. ఫ్లయిట్స్ అన్నీ బంద్ అయ్యాయి. బాలెస్టెరో స్పెయిన్‌లో ఉంటాడు. ధనికుల విహార పడవలకు సరంగుగా పని చేస్తుంటాడు. అతనికి సొంతంగా చిన్న పడవ ఉంది. 29 అడుగుల పొడవు ఉండే ఆ పడవతో ఖాళీ సమయాల్లో చుట్టుపక్కల దేశాలు తిరుగుతుంటాడు. మార్చి రెండోవారంలో బాలెస్టెరో తన పడవతో స్పెయిన్‌కు పొరుగున ఉండే పోర్చుగల్‌లోని పోర్టో శాంటో దీవిలో ఉన్నాడు. అప్పుడే కరోనా కలకలం మొదలయ్యింది. దేశాలన్నీ దిగ్బంధనం అవుతూ వస్తున్నాయి. ‘నువ్వు ఇక్కడే ఉంటే క్షేమంగా ఉంటావు’ అన్నారు మిత్రులు. ఎందుకంటే పోర్టో శాంటో దీవిలో అప్పటికి ఒక్క కరోనా కేసు కూడా లేదు. ‘నేను మా అమ్మా నాన్నలను చూడాలి’ అనుకున్నాడు బాలెస్టెరో. అతని అమ్మా నాన్న అర్జంటైనాలోని ‘మాల్ దే ప్లాటా’లో ఉంటాడు. బాలెస్టెరో సొంత ఊరు అదే. వాళ్లది మత్స్యకార కుటుంబం. చేపలు పట్టడం వృత్తి. బాలెస్టెరోకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే తండ్రి పడవ మీద సముద్రం మీదకు తీసుకెళుతూ ఉండేవాడు. 19 ఏళ్లు వచ్చాక బాలెస్టెరో కూడా మత్స్యకారుడు అయ్యాడు. అయితే ‘ఇందులో మజా ఏముందోయ్. ప్రపంచం చూడు’ అని ఒక మత్స్యకారుడు సలహా ఇస్తే ప్రపంచ దిమ్మరిగా మారాడు. 2017లో కష్టపడి ఒక చిన్న పడవ కొనుక్కున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులను చూడాలంటే ఆ పడవ తప్ప మరో మార్గం లేదు. కాని తల్లిదండ్రులను చూడటం అంత సులభమా. తను ఉంటున్న దీవి నుంచి అర్జంటైనా వరకు దాదాపు ఐదున్నర వేల నాటికల్ మైళ్ల దూరం. అట్లాంటిక్ సముద్రంపై ప్రయాణం. అట్లాంటిక్ పై ఒంటరి ప్రయాణం అంటే ప్రాణాలపై ఆశ వదిలేసుకోవాలి. ‘నా దగ్గర అంతా చూస్తే 300 డాలర్లు (సుమారు 20 వేల రూపాయలు) ఉన్నాయి. వాటిని పెట్టి నిల్వ ఉండే ఆహారం కొనేశాను. ఇలాంటి కష్టసమయంలో అమ్మానాన్నల దగ్గర ఉండి వాళ్లను చూసుకోవాలని వెంటనే బయలు దేరాను’ అన్నాడు బాలెస్టెరో. అట్లాంటిక్ సముద్రంలో అంతా బాగుంటే అంతా బాగుంటుంది. కొంచెం తేడా వస్తే పడవ తల్లకిందులవుతుంది. మూడు వారాల పాటు అంతా సజావుగా సాగింది. తర్వాతే బాలెస్టెరోకు అగాధమైన నీలిమ తప్ప, నిశ్శబ్దం తప్ప ఏమీ మిగల్లేదు. ‘రోజూ రాత్రి ఒక అర్ధగంట రేడియో వినేవాణ్ణి. కరోనా వార్తలు తెలిసేవి. ఇలాంటి ఘోరమైన సమయంలో ఇది నా ఆఖరు ప్రయాణం ఏమోనని భయం వేసేది. అప్పుడప్పుడు కనిపించే డాల్ఫిన్లు నాకు తోడుగా నిలిచాయి. ఒక్కోసారి పడవ మీద పక్షులు ఎగిరేవి. అవి ఉత్సాహ పరిచేవి’ అన్నాడు. బ్రెజిల్ తీరంలో ఒక దశలో రాక్షస కెరటాలు అతణ్ణి చుట్టుముట్టాయి. ‘కాని ఎలాగో గట్టెక్కాను’ అన్నాడతను.‘ ఒక రాత్రయితే ఒక పెద్ద ఓడ వెనుక వస్తూ కనిపించింది. అది నన్ను గుద్దుకుంటూ నా మీద నుంచి వెళ్లిపోతుందని చాలా భయపడిపోయాను’ అన్నాడతను. ఒక మనిషి 85 రోజులు అంత పెద్ద భూతం వంటి సముద్రం పై గడపడం చాలా పెద్ద సాహసం. ‘ఇల్లు చేరుతాను. అమ్మా నాన్నలను చూస్తాను’ అని పదే పదే అతడు అనుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. చివరకు అతను మొన్నటి బుధవారం (జూన్ 24) తన మాతృభూమి మీద కాలు పెట్టాడు. అతడి రాకను అతని సోదరుడు ప్రెస్‌కు తెలియ చేయడం వల్ల తీరానికి పెద్దఎత్తున మిత్రులు, పత్రికా రచయితలు వచ్చారు. 90 ఏళ్ల తండ్రి, సోదరుడు, తల్లి కూడా వచ్చారు. బాలెస్టెరోకు కోవిడ్ టెస్ట్ నిర్వహించారు. నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ అదే పడవలో మరో 14 రోజులు క్వారంటైన్లో ఉండమన్నారు. తల్లిదండ్రుల కోసం అన్ని రోజులు సముద్రం మీద ఉన్నవాడికి ఆ కొద్దిరోజులు ఒక లెక్కా. ‘నాన్న 90వ పుట్టిన రోజు నాడు నేను లేను. ఇప్పుడు దానిని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం’ అన్నాడు బాలెస్టెరో తృప్తిగా. అతని తోడుగా నిలిచిన అతని చిన్న పడవ ‘స్కువా’ అతనితో పాటు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది. – సాక్షి ఫ్యామిలీ -
బస్సులు, రైళ్లలో జర్నీకి ఝలక్ !
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.పండగలు, వరుస సెలవులు తదితర ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరే రైళ్లు, బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తారు. రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో దర్శనమిస్తుంది. ఇక పండగ రోజుల్లోనైతే రైలు ప్రయాణం అసాధ్యం. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ప్రతి రోజు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. సాధారణ రోజుల్లో లక్షలాది మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తుండగా ప్రస్తుతం 50 శాతం కంటేమించి ప్రయాణాలు చేయడం లేదని ఆర్టీసీ, రైల్వే వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కట్టడి కోసంహైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిçన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మినహా తెలంగాణలోనిఅన్ని ప్రాంతాలకునగరం నుంచి ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని వినియోగించుకునేవారి సంఖ్య మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లు అందుబాటులోకి వచ్చి నెల రోజులు దాటినా ప్రయాణికుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 18 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా ఆగస్ట్ 12 వరకు సాధారణ రైళ్ల రాకపోకలను నిలిపివేయనున్నట్లు రైల్వేశాఖ తాజాగా ప్రకటించడం గమనార్హం. కరోనా ఉద్ధృతి దృష్ట్యానే రైళ్ల రాకపోకలపై నియంత్రణ కొనసాగుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. (భారత్‌లో 5లక్షలు దాటిన కరోనా కేసులు) అప్పుడు అలా.. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి నిత్యం సుమారు 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరో వందకు పైగా ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచే 1.85 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. మరో లక్ష మంది ప్రయాణికులు కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరుతారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో ప్రతి రోజు 1.5 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు అన్ని రైళ్లు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, ముఖ్యంగా వివిధ అవసరాల దృష్ట్యా నగరానికి వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాలకు సైతం రాకపొకలు స్తంభించాయి. దీంతో ఉద్యోగ, వ్యాపార వర్గాలు.. ప్రత్యేకించి సాఫ్ట్వేర్ నిపుణులు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వేసవి సెలవుల దృష్ట్యా బంధువుల ఇళ్లకు చుట్టపు చూపుగా వచ్చిన వారు సైతం ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఇలా.. లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ద.మ రైల్వే 18 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మొదట్లో బెంగళూరు– న్యూఢిల్లీ, సికింద్రాబాద్–న్యూఢిల్లీ మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బెంగళూరు– సికింద్రాబాద్, ముంబై– సికింద్రాబాద్, హైదరాబాద్– న్యూఢిల్లీ, తిరుపతి– ఆదిలాబాద్, సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– విశాఖ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 18 ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ప్రతిరోజు 1.85 లక్షల మంది ప్రయాణికులు ఒక్క సికింద్రాబాద్ నుంచే రాకపోకలు సాగించగా ప్రస్తుతం కేవలం 25 వేల మంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. ‘ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి రైళ్లు అందుబాటులో లేకపోవడం ఒక్కటే కారణంగా భావించలేం. కోవిడ్ కారణంగా చాలా మంది రాకపోకలు సాగించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం బెర్తుల సామర్థ్యం మేరకు మాత్రం ప్రయాణికులు బయలుదేరుతున్నారు. సాధారణ రద్దీలో ఇది 50 శాతం మాత్రమే. ప్రయాణికుల రాకపోకలు సాధారణ స్థితికి రావడానికి మరి కొంత సమయం పట్టవచ్చు’ అని ద.మ రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బస్సుల్లోనూ అంతే.. ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులు ఆచితూచి రాకపోకలు సాగిస్తున్నారు. తప్పనిసరైతేనే ఇళ్లల్లోంచి బయటకు వస్తున్నారు. సాధారణంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచే ప్రతిరోజు 3,500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు అంతర్రాష్ట బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో సుమారు 1000 బస్సులు మాత్రం తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకపోకలు సాగిస్తున్నాయి. బస్సుల్లోనూ ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ‘ఒక్కో బస్సులో సగం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. కరోనా కారణంగా ప్రజలు తమ ప్రయాణాలను చాలా వరకు వాయిదా వేసుకున్నారు. బహుశా ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య పెరగవచ్చు’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. -
పగోడికీ ఈ కష్టమొద్దు!
ఊళ్లో పని లేకపోవడంతో వారంతా పొట్ట చేతబట్టుకుని వందల కిలోమీటర్ల దూరం వలస వెళ్లారు. అక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంటూ, దొరికింది తింటూ ఇరుకు గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి సమయంలో వచ్చిన కరోనా మహమ్మారి వారి బతుకులను దుర్భరం చేసింది. చేసేందుకు పనిలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. తినడానికి తిండి లేక నానాపాట్లూ పడ్డారు. పస్తులతో అక్కడ ఉండలేక.. ఇంటికి వెళ్లే పరిస్థితి లేక నరకం చవిచూశారు. కొంతమంది సాహసించి కాలినడకన సొంతూళ్లకు పయనమవ్వగా.. మరికొందరు అప్పులు చేసి, వేలకు వేలు కారు కిరాయి కట్టుకుని బతుకుజీవుడా అంటూ ఇళ్లకు చేరారు. లాక్డౌన్ సమయంలో తాము పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావని వాపోయారు. ఇలాంటి కష్టాలు పగోడికి కూడా రావొద్దని దండాలు పెట్టారు. ఇవీ తెలంగాణ నుంచి మహారాçష్ట్ర వలస వెళ్లినవారి వ్యథాభరిత గాథలు. ఇక కలో గంజో తాగి సొంతూళ్లేనే ఉంటామని, మళ్లీ వలస పోయేది లేదని చెబుతున్నారు. పిల్లలకు అటుకులు.. మాకు నీళ్లు.. ఊళ్లోనే వ్యవసాయం చేసుకుందామని బోర్లు వేసిన. కానీ నీళ్లు రాలే. ఇక బతుకుదెరువు కోసం భార్య, ఇద్దరు పిల్లలతోపాటు అన్న కొడుకు, అక్క కొడుకుతో కలిసి 20 ఏళ్ల క్రితం ముంబై పోయిన. అక్కడి బోరువెల్లి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నం. పిల్లలిద్దరూ చదువుకుంటుండగా.. మేం నలుగురం ఇళ్లలో పనిచేయడం, కూలిపనులకు వెళ్లడం చేసెటోళ్లం. కరోనా రావడంతో మా బతుకు దుర్భరంగా మారిపోయింది. కరోనా వైరస్‌తో ముంబైలో కేసులు పెరగడం, మేమున్న దిక్కునే ఎక్కువ కావడంతో రెడ్‌జోన్ చేసిండ్రు. యజమానులు ఇళ్లలో పని బంద్ చేసిండ్రు. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చె. పని లేకుండా పాయె. అందరం పస్తులుండాల్సి వచ్చింది. మనసున్నోళ్లు తెచ్చిచ్చే పొట్లాలే మాకు ఆహారం అయ్యాయి. తిండి ఎప్పుడు దొరుకుతదోనని ఎదురు చూడాల్సి వచ్చింది. ఎవ్వరు ఏమీ తేకపోతే గారోజు పిల్లలకు అటుకులు పెట్టి మేం మంచినీళ్లు తాగి పడుకునేటోళ్లం.. ఇంటికాడ ఉన్న మా అవ్వా, అయ్య ఫోన్ చేసి ఏడ్వవట్టె.. అక్కడ మేం.. ఇక్కడ వాళ్లు ఏడ్చుడే తప్ప ఏం జెయ్యలేని పరిస్థితి.. ప్రధాని సారు ఎవ్వరి ఊరికి వాళ్లు పోవచ్చు అని చెప్పడంతో బతుకు జీవుడా అనుకున్నాం. ఏదైనా పెద్ద బండి కిరాయికి తీసుకుని వద్దామంటే మనిషికి రూ.7వేలు అడిగిండ్రు.. గన్ని పైసలు మా కాడ లేవు. మా రెండు మోటార్ సైకిళ్లు ఉంటే ఒక్కొక్క బండిపై ముగ్గురం లెక్క ఆరుగురం బయలుదేరినం. పోలీసోళ్లు ఆపితే బతిమాలుకున్నాం. నీళ్లు ఉన్న తావు కాడ ఆపి అటుకులు, అరటిపండ్లు తింటూ.. అలసిపోయిన కాడ కొద్దిసేపు ఆపి.. బయలుదేరి 3 రోజులకు మా ఊరికి చేరినం.. కూలో నాలో చేసుకొని ఇక్కడే బతుకుతాం.. ఇక ఏ ఊరుకు పోయేది లేదు. – భూంపల్లి స్వామి, మహ్మద్‌షాపూర్, దౌల్తాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా ముంబై నుంచి మహ్మద్షాపూర్కు వచ్చిన భూంపల్లి స్వామి కుటుంబ సభ్యులు ఇంటికొస్తమనుకోలేదు..! ముంబైలోని థానా జిల్లా దేశయ్నాక్లోని కల్లు దుకాణంలో పనిచేసేది. కరోనా వచ్చిందని ముంబై అంతా బంద్ చేసిండ్రు. మళ్లీ దుకాణాలు చాలు ఐతయ్ కదా.. ఇంకొన్ని రోజులు పనిచేసి, నాలుగు పైసలు ఎనుకేసుకుందామని ఆశతో అక్కడే ఉన్న. పెద్దబిడ్డ పెళ్లికి అప్పు చేసిన పైసలన్నా తేర్పాలే అనుకున్న. లాక్‌డౌన్‌తో రోజు చాలీచాలని తిండి తినుకుంటూ, భయంతో రూంలనే ఉన్నాం. ఏమన్న ఐతే భార్య, పిల్లల గతి ఎట్ల అని అనిపించినప్పుడల్లా కండ్లళ్ల నీళ్లు తిరుగుడు. ఎట్లైనా ఇంటికి పోవాలె అని సేటుకు చెప్పడంతో పర్మిషన్ లెటర్ తీసుకున్నడు. కారులో తీసుకువచ్చి ఇంటికి చేర్చిండు.. అసలు ఇంటికొస్తమనుకోలేదు. ఇక ఇక్కడనే ఉండి సెంట్రింగ్ పనిచేసుకుంట. అచ్చినకాడికయే పైసలు..భార్యాపిల్లలను చూసుకుంటూ పుట్టిన ఊరులోనే ఉంటా. – ఉప్పరి అశోక్, మల్యాల, జగిత్యాల జిల్లా బతుకెట్లా దేవుడా? ముంబైలోని విలేపార్లే ఏరియాలో నేను, నా భర్త, కొడుకు ఇళ్లలో బోల్లు తోముకుంటూ అద్దెకు ఉంటూ బతికాం. కరోనాతో రెండు నెలల నుంచి అక్కడ పనులు లేవు. ఇళ్లలోనే ఉన్నాం. డబ్బులు లేకపోవడంతో చాలా ఇబ్బందైంది. నేను మా అల్లుడు కారులో ఒక్కదాన్ని వచ్చాను. భర్త, కుమారుడు అక్కడే ఉన్నారు. ముగ్గురికి నెలకు పదిహేడు వేలు వచ్చేవి. అందులో ఏడు వేలు ఇంటి అద్దె పోను మిగిలినవి తిండి ఖర్చులకు ఉండేవి. ఏమి మిగిలేవి కావు. మా కూతురు డెలివరీకి ఉండడంతో అక్కడ ఆసుపత్రిలో ఇబ్బంది ఉంటుందని పోలీసుల పర్మిషన్ లెటర్‌తో కారులో ముగ్గురం వచ్చాం. ఇంటికి చేరుకోగానే హోం క్వారంటైన్ చేశారు. చేతిలో రూపాయి లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ఆదుకొని సాయం చేయాలి. – గుమ్ముల లక్ష్మి, జెండావెంకటాపూర్, మంచిర్యాల జిల్లా ఇక ముంబైకి పోను.. 20 ఏళ్ల క్రితం ముంబైకి వలస వెళ్లిన. అక్కడ బోరువెల్లి ప్రాంతంలో ధోబీ పనులు చేసేవాడిని. లాక్డౌన్ సమయంలో ముంబైలో నరకయాతన అనుభవించిన. 45 రోజుల పాటు పని లేదు. చిన్న ఇరుకు గదిలో పదిమందిమి ఉండెటోళ్లం. బియ్యం, కూరగాయలు కొనడానికి గంటపాటు బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చేవారు. లాక్‌డౌన్‌కు రెండ్రోజుల ముందే ఇంటికి డబ్బులు పంపించడంతో కొన్ని రోజుల తర్వాత నా దగ్గర చిల్లిగవ్వ లేకుండా పోయె. ఇంకా ఇంటికి డబ్బు పంపించని తోటి కార్మికులను బతిమాలి చేబదులుగా కొంత డబ్బు తీసుకున్నాను. అతికష్టమ్మీద ఊరు చేరిన. ఇక ముంబైకి పోను. ఇక్కడే వ్యవసాయ పనులు చేసుకుని బతుకుతాను. – పోతుగంటి సత్తయ్య, అంచనూరు, దోమకొండ మండలం, కామారెడ్డి జిల్లా 700 కిలోమీటర్లు నడిచి ఇల్లు చేరిన.. కొన్నేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. ఊళ్లో ఉపాధి లేకపోవడంతో ఇద్దరు కొడుకులతో కలిసి మహారాష్ట్రలోని నార్సింగిలో కూలీపనులు చేసుకుంటూ బతుకుతున్నం. లాక్‌డౌన్‌తో అన్నీ మూసేయడంతో పనులు దొరకలేదు. ఇక చేసేదేమీ లేక కాలినడకన ఇంటికి బయలుదేరిన. దారిలో ఎవరూ కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. వారంరోజులపాటు 700 కిలోమీటర్లు నడిచి ఇల్లు చేరిన. ఇక్కడ కూడా పనులు లేకపోవడంతో చాలా ఇబ్బంది అయితాంది. – గిత్త సాలమ్మ, తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా కాలినడకన 850 కిలోమీటర్లు.. నేను కొన్నేళ్లుగా భార్యాబిడ్డలతో కలిసి ముంబై సమీపంలోని థానేలో ఉంటూ మట్టి పనులు చేస్తుండేవాడిని. కరోనా వ్యాప్తి అధికమైందని.. ఇక్కడ ఎవరూ ఉండరాదని ఒకరికొకరు చెప్పుకోవటం, ఇక్కడే ఉంటే ప్రాణాలు పోతాయన్న మాటలు విని భయపడ్డాను. పిల్లాపాపలతో కలిసి కాలినడకనైనా సొంతూరికి వెళ్దామని నిశ్చయించుకొని బయ ల్దేరాను. మా ఊరికి రోడ్డు మార్గంలో వెళితే 850 కిలోమీటర్లు ఉంటది. ఎర్రటి ఎండలో దారిపొడవునా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ రైలు పట్టాలు, పొలాల వెంట నడుచుకుంటూ వచ్చాం. దాహం వేసినప్పుడల్లా మంచినీటికి అలమటించాం. దారి పొడవునా వచ్చే గ్రామాల్లో చేతుల్లో ఉన్న నీటి సీసాలను నింపుకుని బతుకుజీవుడా అంటూ ఎనిమిది రోజుల తర్వాత ఊరు చేరినం. – బాబునాయక్, కొత్తతండా, అమరచింత, వనపర్తి జిల్లా -
ట్రావెల్ గాళ్.. సోలో జర్నీ
సిటీలోని ఇక్ఫై బిజినెస్ స్కూల్లో బీబీఏ గ్రాడ్యుయేషన్ చేస్తూ... శంకర్‌పల్లిలో నివసించే నిహారికా మోహన్ తండ్రి వ్యాపారి. అమ్మ గతంలో టీచర్‌గా పనిచేసి మానేసి ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం వరకూ నిహారిక గురించి ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అయితే టూర్ల మీద ఆమెకు ఉన్న అభిరుచి ఆమెకు కొత్త ఇమేజ్ను ఏర్పరుస్తోంది. తెలంగాణలో ట్రావెల్ వీడియోలు రూపొందిస్తున్న తొలి టీనేజర్‌గానే కాకుండా దక్షిణాదిలో సోలో జర్నీ చేస్తూ చానెల్ నిర్వహిస్తున్న మొదటి యువతిగా తనకు వస్తున్న స్పందనతో నిహారిక మరింత జోరుగా జర్నీ చేసేస్తోంది. ఈ క్రేజీగాళ్ పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే... ది 18తో... నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎదో వెళ్లొచ్చామా అన్నట్టు కాకుండా మంచి జ్ఞాపకంలా ఉండాలనుకుంటాను. అందుకే నేను వెళ్లిన ప్రాంతాన్ని వీడియో తీయడం అలవాటుగా మారింది. ఎక్కడో ఉన్న ప్రదేశాలని వెతుక్కుంటూ వెళ్లడం కాదు, మన దగ్గర ఉన్న వాటిని సందర్శించాలి అనుకున్నాను. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన స్పాట్స్‌కి వెళ్లాను. నాకు సోలోగా వెళ్లడం ఇష్టం. వయసుకు తగ్గట్టుగా ది 18 పేరుతో ఓ చానెల్ ప్రారంభించాను. ఏడాది పాటు వీడియోస్ తయారు చేశాను. నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల అన్నింటికన్నా ట్రావెల్ వీడియోస్ ఎడిటింగ్, ఫిల్మింగ్ బాగా అనిపించేవి. అదే సమయంలో యూట్యూబ్‌లో అప్పటికే బాగా అనుభవం ఉన్న సీఏపీడీటీకి చెందిన శరత్ అంకిత్ నన్ను కలిశారు. ఇద్దరం కలిసి ట్రావెల్ వీడియోస్ ప్లాన్ చేశాం. అక్కడ నుంచి మా జర్నీ ప్రారంభమైంది. ప్రయాణాలనేవి మామూలే కానీ... అమ్మాయిలు ఒంటరిగా జర్నీ చేయడం అనేది అడ్వంచరస్ అని కూడా అనిపిస్తుంది కదా. అందుకే సోలో గాళ్ ట్రావెలింగ్‌ని ఎంచుకుని ‘గాళ్ ఆన్ వీల్స్’ స్టార్ట్ చేశాం. అందరికీ బాగా నచ్చింది. దానికే బాగా ప్రశంసలు వచ్చాయి. స్పందన చాలా బాగుంది. నేను దీన్ని కొనసాగించగలనా? తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? వంటి సందేహాలు చాలా వచ్చాయి. ప్రకృతి ఒడిలో.... మొదటి నుంచి కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా, అక్కడి సంస్కృతులను అధ్యయనం చేయడమన్నా అమితమైన ఆసక్తి. ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ చారిత్రాత్మకంగా, సంస్కృతి పరంగా విశిష్టత కలిగిన వాటిని తెలుసుకొని వెళతాను. ఇప్పటి వరకు నేను వెళ్లిన ప్రాంతాల్లో తిరుమల మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగానే కాకుండా అద్భుతమైన ప్రకృతి సంపదకి నిలయం. ఇప్పటికీ సహజమైన ప్రకృతితో కనువిందు చేస్తుంది తిరుమల. అంతేకాకుండా ట్రావెలింగ్‌ని ఆస్వాదించాలంటే కచ్చితంగా కోస్తా తీరం వెళ్లాల్సిందే. నా జర్నీలో భాగంగా కాకినాడ, భద్రాచలం వెళ్లాను. గోదావరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిసరాలు మనస్సుని కట్టిపడేశాయి. పచ్చని ప్రకృతితో ఒడిలో ఒంటరిగా సేదతీరడం ఒక మధుర జ్ఞాపకంలా మిగిలి పోయింది. ఈ విధంగా మరెన్నో ప్రాంతాలకు వెళ్లి నా అభిరుచులను నెరవేర్చుకోవడం ఆనందంగా ఉంది. తదుపరి ఇతర రాష్ట్రాల ప్రయాణంలో భాగంగా కర్ణాటక వెళ్తున్నాను. బ్యాలెన్స్ చేసుకుంటూ... మా కాలేజ్‌లో అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. 75 శాతం తప్పకుండా ఉండాలి. కాబట్టి చాలా వరకూ వారాంతపు సెలవుల్లో టూర్లు వెళ్లి వస్తున్నా. ఎడిటింగ్ డబ్బింగ్ వంటి పన్లన్నీ కాలేజ్ నుంచి వచ్చేశాక నేరుగా ఆఫీసుకి వెళ్లిపోయి సాయంత్రాలలో చేసుకుంటున్నా. రాత్రి పూట ఇంటికి తిరిగివెళుతున్నా. యూ ట్యూబ్ వాళ్లు విభిన్న ప్రాంతాల్లో నిర్వహించిన 5 ఈవెంట్స్‌కి ఆహా్వనం అందుకున్నా. అలాగే టూర్లు వెళ్లే వారికి వీలైనంత హెల్ప్‌ఫుల్‌గా, అదే సమయంలో ఎంటర్టైనింగ్గా కూడా నా వీడియోస్ ఉండాలి. ఆంధ్రా, తెలంగాణ కలిపి 4 భాగాలు, 6 వీడియోస్ పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్‌కి నేను ప్రాధాన్యం ఇస్తాను. కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్న నాకు ఒక కాలేజ్ ఫెస్ట్‌లో ప్రసంగించమని ఆహ్వానం రావడం నా లైఫ్‌లో క్రేజీ మూమెంట్‌గా చెప్పాలి. నా లాంటి సాధారణ అమ్మాయి కూడా తలచుకుంటే ఏదో ఒకటి సాధించగలదనే విషయం లైఫ్‌లో అని అందరికీ అర్థమవ్వాలి. గతంలో ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండేదాన్ని కాదు. నేనేమీ సాధించలేక పోతున్నాననే ఒక నిస్పృహ నాలో ఉండేది. అయితే ఈ వర్క్ స్టార్ట్ చేశాక అంతా మారిపోయింది. నాకు 20 ఏళ్లంటే ఎవరూ నమ్మరు. నేను బాగా కష్టపడుతున్నానంటున్నారు. అయితే నేనేం చేస్తున్నాను అనేదానిపై నాకు పూర్తి స్పష్టత ఉంది. -
పండగ ప్రయాణమెలా!
సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. సొంత పల్లెలో కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపేందుకు, డూడూ బవసన్నల నృత్యాలు,గంగరెద్దులలోళ్ల సన్నాయి మేళాలు తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రయాణపాట్లు తప్పేలా లేవు.నెలరోజుల క్రితమే జనవరి నెలాఖరు వరకు రైల్వే రిజర్వేషన్ పూర్తికావడం, రిగ్రెట్‌గా చూపిస్తున్న రైల్వే రిజర్వేషన్తోప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ అదనపు చార్జీలు మోత మోగిస్తుండటంతోప్రయాణికుల జేబులకు చిల్లు పడుతోంది. రైల్వే శాఖ ఆధీనంలోని ఆర్సీటీసీ రైళ్లలో సైతం ప్రత్యేక బాదుడుఉండటంతో ప్రయాణికులకు సంకాంతి ప్రయాణంభారమైంది. రాజంపేట/కడప కోటిరెడ్డి సర్కిల్ : దూర ప్రాంతాలకు వెళ్లేవారంతా రైలు ప్రయాణంపై ఆసక్తి చూపిస్తారు. నవంబరు నుంచి చాలామంది ఈదిశగా ప్రయత్నించడంతో రిజర్వేషన్లన్నీ ఫుల్లయిపోయాయి. కొన్ని రైళ్లకు రిగ్రెట్(టికెట్ రావడం లేదు) వచ్చేస్తోంది. దీంతో ఏం చేయాలో ప్రయాణికులకు పాలుపోవడం లేదు. తత్కాల్‌పై ఆధారపడదామంటే అది కాస్తా లైన్లు జామ్ అయి కొద్దిమందికే పరిమితమవుతోంది. ప్రస్తుతం కడప నుంచి హైదరాబాదుకు వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో 80, రాయలసీమలో 70, చెన్నై–మంబయి దాదర్‌లో 80, చెన్నై–ఎగ్మోర్‌లో 40, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో 100, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌పెస్‌లో 120, కన్యాకుమారి జయంతి ఎక్స్‌ప్రెస్‌లో 100కు పైగా, చెన్నై–ముంబయి మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో 90కి పైగా వెయిటింగ్ లిస్టు కొనసాగుతోందని రైల్వే వర్గాలు తెలిపాయి.ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కడప మీదుగా రాకపోకలు సాగించేందుకు కొన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రజలు కోరుతున్నారు. పండగనగానే సొంతూళ్లకు చేరుకోవాలనే ఉత్సాహం ఉంటుంది.కానీ ఎలా చేరుకోవాలో అర్ధం కావడం లేదని రాజంపేటకు వెంకట రమణమూర్తి వాపోయారు. ఈయన కాకినాడ వెళ్లాల్సి ఉంది. అదనపుబోగీలు డౌటే.. సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణీకులు రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఇప్పటి వరకు అదనపు బోగీలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ప్రయాణీకులు ఆశలు వదలుకున్నారు. రెండేళ్ల కిందట ప్రత్యేక రైళ్లు నడిపి అదనంగా వసూలు చేయడాన్ని ఈ సందర్భంగా ప్రయాణీకులు గుర్తు చేసుకుంటూ , ప్రీమియం రైళ్లలో రోజురోజుకూ టికెట్ ధరలు మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సరికదా ఆర్టీసీ బస్సులో వెళ్దామంటే సంబంధిత అధికారులు రిజర్వేషన్ సైట్లను నిలిపివేస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నా అదనపు చార్జీలు మోత తప్పడంలేదు. సాధారణ రోజుల్లో రైల్వే చార్జీలు కంటే ఆర్టీసీ చార్జీలు ఎక్కువ. పండగ రోజుల్లో డిమాండ్ బట్టి రేట్లు పెంచేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ మరింత దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే 30శాతం వరకు రేట్లను పెంచేసిన యాజమాన్యాలు సంక్రాంతి తర్వాత వారం రోజులపాటు టికెట్ ధరపై వెయ్యి నుంచి రూ.1200 వరకు వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఏటా దోపిడే.. ఏటా ప్రయాణీకులను ప్రైవేటు, రైల్వే, ఆర్టీసీ యాజమాన్యాలు దోచేస్తున్నాయి. మరో వైపు ఉద్యోగులకు, ఉపాధ్యాయులలకు సంక్రాంతి సెలవులపై స్పష్టత రాకపోవడంతో రిజర్వేషన్‌పై వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ కావాలన్న దొరక్కపోవడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ చుట్టూ తిరుగుతున్నారు. -
సోలో జర్నీ...సో బెటరు...
నేను ముంబైలో చదువుతున్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి భారతదేశంలో కొన్ని ప్రదేశాలూ, యూరప్‌లో కొన్ని దేశాలూ, ఈజిప్ట్ చూశాను. అలాగే అమెరికాలో చదువుతున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా పర్యాటన చేశాను కానీ, జపాన్ చూడాలన్న కల మాత్రం ఈమధ్య వరకూ తీరలేదు. జపాన్ వెళ్ళాలని నిశ్చయించుకున్నాక ఏ సీజన్లో వెళ్ళాలని ముందుగా ఆలోచించాను. వసంతకాలంలో వెళ్తే సకురా హనామి (చెర్రీ పూల కనువిందు), వేసవిలో ఐతే నత్సుమత్సూరి (వేసవి ఉత్సవాలు), శిశిరంలో మోమోజీ (ఎర్రని మేపిల్ చెట్ల దర్శనం) ఉంటాయి. నేను శిశిరంలోనే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను – ఇంకోసారి తక్కిన సీజన్లలో వెళ్ళచ్చని అనుకుంటూ. ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించుకున్నాక, ముందుగా ఏర్పాటు చేసుకోవల్సింది వీసా. నేను అమెరికా నుండి జపాన్ వెళ్తూండడం వల్ల వీసా పని సులభంగా అయిపోయింది. నిజానికి భారతదేశం నుండి కూడా జపాన్ వీసా రావడం సులభమే. చాలా దేశాలతో పోలిస్తే జపాన్ వీసా ఫీజు కూడా చాలా తక్కువ. సుమారుగా ఐదువందల రూపాయలు. 2020 నుండి జపాన్ ప్రభుత్వం భారత పర్యాటకులకి ఈ–వీసా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే టోక్యో ఒలింపిక్స్ వెళ్దామనుకున్న వాళ్ళు ఈ ఈ–వీసా సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వీసా తర్వాత మనం వెళ్ళబోయే దేశంలో ఏ ఏ ప్రదేశాలు చూడాలి, ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉండాలి అని ప్రణాళిక వేసుకోవాలి. నా ప్రయాణం మొత్తం పదిరోజులే కాబట్టి నేను మూడు నాలుగు ప్రదేశాల కన్న ఎన్నుకోలేను, ఒక్కో చోటా రెండు మూడు రోజుల కన్న ఎక్కువ సమయం ఉండలేను. జపాన్‌లో ఉండే రకరకాల సంస్కృతుల్ని కొంచెం కొంచెంగా అనుభవించాలని నేను – నవీనత్వం కోసం టోక్యోనీ, రాచరికపు చిహ్నాల కోసం కానజావానీ, ఆలయాల కోసం క్యోటోనీ, గత వైభవపు కోట కోసం హిమేజీనీ, ప్రకృతి కోసం, ఆలయాల కోసం నారానీ ఎంచుకున్నాను. ఈ ప్రదేశాలన్నీ ఒక ప్రాంతంలో లేవు. అందుకని జపాన్ ఒక మూల నుండి ఇంకో మూలకి తిరగాల్సిన అవసరం ఉంది. ఐతే ఆ ఆవసరం ప్రపంచ ప్రసిద్ధమైన జపాన్ షిన్కాన్సెన్ (బుల్లెట్ రైళ్ళు) వాడే అవకాశం కూడా కలిగించింది. జపాన్‌లో ప్రయాణాలకి నేను జపనీస్ రైల్ పాస్ తీసుకున్నాను. అది ఆన్లైన్లో ముందుగానే కొనుక్కోవచ్చు. జపాన్ రైల్ నెట్‌వర్క్‌లో ఎప్పుడు రైలు ఎక్కాలన్నా ఆ పాస్ ఉపయోగపడుతుంది. షిన్కాన్సెన్ రైళ్ళలో సీటు రిజర్వ్ చేసుకుందుకు కూడా ఆ పాస్ ఉపయోగిస్తుంది. ఎక్కువ ప్రయాణం చేసేవాళ్లకి పాస్ చాలా ఉపయోగకరం. నేను వారం రోజుల పాస్ తీసుకున్నాను. వీసా, రైలు టికెట్ తర్వాత చూసుకోవల్సింది ఎక్కడ ఉండాలన్నది. ఒక్కళ్ళమే ప్రయాణం చేస్తున్నప్పుడు హŸటళ్ళలో కాకుండా హాస్టళ్లలో ఉండడం మంచిది. హాస్టళ్ళలో ఉంటే – మనలాగే ప్రయాణాలు చేసే వాళ్లని కలవచ్చు. ఒక్కోసారి వాళ్లతో కలిసి కొన్ని ప్రదేశాలు చూడచ్చు. అదీకాక హాస్టళ్ళు సురక్షితంగా అనిపిస్తాయి. అద్దెలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. నేను ఒక్కదాన్నే ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు హాస్టళ్లలో ఉండటమే మంచిదనిపిస్తుంది. నేనంతకు ముందు కొన్ని చోట్లకి సోలోగా ప్రయాణం చేశాను కానీ పది రోజులు ఒంటరిగా వెళ్ళడం జపాన్‌తోనే మొదలైంది. టోక్యో నరీతా విమానాశ్రయంలో దిగడంతో నా జపాన్ పర్యటన మొదలైంది. విమానాశ్రయం నుండి ట్రైన్ ఎక్కి అసకుసలో ఉన్న నా బసకు చేరుకున్నాను. అక్కడ నా గది మూడు గోడలకీ, అల్మైరాకీ మధ్యన ఉన్న ఒక పడక. ఐతే అందులో టీవీ, స్టొరేజ్, సేఫ్ లాంటి సౌకర్యాలతో పాటు నిత్యావసరాలకి అవసరమైన కిట్ కూడా ఉంది, పైజామాతో సహా. నేను ఆ హాస్టల్ ఎంచుకున్నది ప్రధాన కారణం అది సెన్సోజీ ఆలయానికి దగ్గరగా ఉండడం. మనం వెళ్ళే ఊళ్ళలో ఉండే ప్రధాన పర్యాటక ప్రదేశాలకి దగ్గరగా మనం ఉంటే మనకి సమయం బాగా కలిసి వస్తుంది. నేను నా బసకి చేరుకున్నది సాయంత్రం. సూర్యాస్తమయం తొందరగా అయిపోవడం వల్ల చీకటిలో దీపాల కాంతిలో ఆ గుడిని నేను చూశాను. ఆ గుడి చాలా పురాతనమైనది. ఎంతో ప్రసిద్ధమైనది. మర్నాడు నేను ఇషికావా ప్రాంతంలో ఉన్న కనజావాకి వెళ్ళాను. బుల్లెట్ రైలులో అదే నా మొదటి ప్రయాణం. రైలు అందమైన ప్రకృతి మధ్య వేగంగా సాగిపోయింది. కనజావాలో నేనో బొతిక్ హాస్టల్లో ఉన్నాను. సమురై డిస్ట్రిక్ట్ గా పేరుగాంచిన నాగామాచీ నన్ను శతాబ్దాల వెనకటి రోజుల్లోకి తీసికెళ్ళింది. అలానే హిగషి ఛాయా డిస్ట్రిక్ట్ లో గీషా (టీ వేడుక) గొప్ప అనుభవం. రాత్రి హాస్టల్లో గడిపి రెండోరోజు ఉదయమే – అక్కడున్న వనాల్లో తిరగడానికి వెళ్లాను. ఉదయం వెళ్తేనే ప్రకృతిæ రమణీయత బాగా ఆస్వాదించగలం. చెట్లనీ, రాలుతున్న ఆకుల్నీ, సరస్సుల్నీ తనివితీరా చూసి, దగ్గర్లోనే ఉన్న కానజావా కోటని కూడా చూశాను. కానజావా నుండి క్యోటోకి వెళ్లాను. ఆ దారిలో బుల్లెట్ రైలు లేదు. అందుకని థండర్ బర్డ్ అనే ఎక్స్ప్రెస్స్ రైల్లో ప్రయాణం చేసాను. దారిలో జపాన్ పల్లెటూరి వాతావరణం చూడగలిగాను. క్యోటోలో నేను సాంప్రదాయకమైన అతిథి గృహంలో ఉన్నాను. అలా ఉండడం వల్ల జపాన్ సంస్కృతి తెలుసుకోవచ్చు. ఆ సాయంత్రం యునెస్కో చేత ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన కియోమిజుదేరా ఆలయాన్ని చూశాను. ఆ సమయంలో శిశిరపు ప్రత్యేక దీపాలంకరణ అద్భుతంగా అనిపించింది. క్యోటోలో లోకల్ బస్ పాస్ కొనుక్కుని ఉదయమే బంగారు భవనం అని పిలవబడే కిన్కాకుజీ ఆలయానికి వెళ్లాను. ఆ తర్వాత క్యోటోలో ఎక్కువగా ఫొటోగ్రాఫులకెక్కే అరషియామా వెదురు పొదలకి వెళ్లాను. అక్కడ నడుస్తూ గాలికి వెదురు పొదల మీద నుండి శబ్దాలని వినడం శ్రవణానందకరం. అది అనుభవైకవేద్యం. అలా నడుస్తూ ఫుషిమీ ఇనారీ దగ్గర మంత్రముగ్ధుల్ని చేసే ప్రదేశాల్లో తిరిగాను. క్యోటో తర్వాత నా బస నారాలో. నారాలో ఉన్న జింకల పార్కు పక్కనే నా హాస్టల్. నాగరికతకి దూరంగా, జింకలకి దగ్గరగా ఉండడం ఓ అనుభవం. హాస్టల్లో కొందరితో కలిసి జింకల పార్కులో తిరిగాను. మర్నాడు ఉదయమే దగ్గర్లోని గుళ్ళని చూశాను. ఆ తర్వాత హిమేజీ ఆలయానికి ప్రయాణం అయ్యాను. దానికి బుల్లెట్ రైల్లో రెండు గంటల ప్రయాణం. ఐతే హిమేజీ కోట అద్భుతమైంది. అంతేకాదు. శిధిలమైపోకుండా ఉన్న కొన్ని కోటల్లో అది ఒకటి. తర్వాత తోదైజీ ఆలయానికి వెళ్ళాను. నేనెన్నో బౌద్ధాలయాలకి వెళ్ళాను కానే అవన్నే తొదైజీ బౌద్ధ మందిర వైభవానికి సాటి రావనిపించింది. ఆ ఆలయ దర్శనం తర్వాత నారా జింకలపార్కులో గడిపాను. నారాలో రెండురోజులూ ఆనందంగా సమయం తెలియకుండా గడిచిపోయింది. అక్కడ నుండి మళ్ళీ టోక్యోకి బుల్లెట్ రైల్లో ప్రయాణమయ్యాను. క్యోటో నుండి టొక్యోకి వెళ్తోంటే దార్లో మౌంట్ ఫుజీ కనిపిస్తుంది. నాకు తెలిసిన జపనీస్ ఙ్ఞానంతో నేను క్యోటో టికెట్ ఆఫీసులో, నేనెటు కూచుంటే ఫుజీ కనిపిస్తుందో కనుక్కుని రైల్లో అటుపక్క కిటికీ సీట్ సంపాదించాను. అలా మంచు నిండిన అగ్నిపర్వతం ఫుజీని స్పష్టంగా చూడగలిగాను. ఈసారి టోక్యోలో నేను ఉన్న హాస్టల్ అంతా ఆడవాళ్ళకే. అంతకు ముందున్న హాస్టళ్ళలో నేనున్న గదులు మాత్రం ఆడవాళ్లకి ఉండేవి. ఇన్నాళ్ళూ ప్రకృతి అందాన్నీ, గత వైభవ చిహ్నాలనీ చూస్తున్న నాకు టోక్యోలో ఆధునికత కొట్టొచ్చినట్లు కనిపించింది. గింజా, షిన్కూజూ, షిబూయా, అకిహాబరాలలో ఎలక్ట్రానిక్, ఎనిమే, మాంగా కొట్లు కొత్త వస్తువులతో వెలిగిపోతూ ఉండడం చూశాను. అలానే జపాన్ పెన్నులకీ ఇంకులకీ ప్రసిద్ధి. నేనిప్పటికీ ఇంకు పెన్నులు వాడతాను. అవి కొన్ని కొనుక్కున్నాను. ఆ తర్వాత కామాకురలో బౌద్ధాలయం చూశాను. పక్కనే పసిఫిక్ మహాసముద్రం దగ్గరకెళ్ళాను కానీ, చాలా చల్లగా ఉండడంతో నీళ్లలోకి దిగలేదు. ఆహరం గురించి ప్రస్తావించుకోకుండా జపాన్ పర్యటన ముచ్చటని ముగించలేం. పూర్తి శాకాహారిని కాబట్టి నాకు ఆహారం కష్టం అవుతుందని నేను భయపడ్డాను కానీ, వీగన్ రెస్టారెంట్లు ఎక్కువగానే ఉండడం వల్ల పెద్ద నగరాల్లో సమస్య లేకపోయింది. పెద్ద నగరాలు కాని చోట్ల కూడా గ్రాసరీలలో బన్నులూ, బ్రెడ్డులూ లాంటివి దొరుకుతాయి. ఐతే చూడ్డానికి శాకాహరంలా కనిపించే వస్తువుల్లో శాకాహారం కానివి ఏవైనా చేరి ఉంటాయా అన్నది చూసుకుంటూ ఉండాలి. ఐతే ఆహారం యాప్స్ ద్వారా చాలా విషయాలు ముందుగానే తెలుసుకోవచ్చు కాబట్టి నాకు బానే గడిచింది. నారాలో ఒకరోజు ఉదయం ఐదు గంటలకి నాకు హాట్ చాకొలేట్ దొరికింది కూడా. జపాన్‌లో అన్నిటి కన్న ముఖ్యం భాష. అక్కడ చాలా మందికి ఇంగ్లిష్ రాదు. నేను జపాన్ వెళ్దామని అనుకున్న తర్వాత కొంచెం జపనీస్ నేర్చుకున్నాను. అది కొంత ఉపయోగపడింది. ఐతే అనువాద యాప్స్ ఎక్కువ వచ్చాయి. వాటిని వాడుతూ అన్ని చోట్లా పనులు చేసుకున్నాను. అంతేకాదు. జపాన్‌లో చాలామంది వాళ్లకి భాష రాకపోయినా మనకి సాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. హడావిడి పడకుండా నేను అడిగిన దాన్ని అర్థం చేసుకుందుకు ప్రయత్నించారు. వాళ్లలో చాలా మందికి భారతదేశం అంటే అభిమానం ఉన్నట్లు అనిపించింది. నాతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ఓ పదిరోజులు ఆ దేశం ఆత్మీయపూర్వకమైన ఆతిథ్యం చవిచూడడం మరిచిపోలేని అనుభవం. ఇంకో జపాన్ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను. – అపరాజిత అల్లంరాజు(రచయిత్రి అమెరికాలో ఎమ్మెస్ చేసి యాపిల్‌లో పని చేసి భారతదేశం వచ్చేసి ప్రస్తుతం ఇండిపెండెంట్ కన్సల్టన్ట్ గా పనిచేస్తోంది) -
ఔటర్‌పై జర్నీ ఇక బేఫికర్
ఘట్కేసర్ నుంచి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మార్గమధ్యలో వెళ్తున్న కారును వెనక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరికి స్వల్ప గాయ మైంది. అదే మార్గంలో వెళ్తున్న మరో వాహనదారుడు ఈ ఘటన చూసి పోలీసు లకు సమాచారం అందిం చాలనుకున్నాడు. అయితే సెల్‌ఫోన్ సిగ్నల్ సరిగాలేక కనెక్ట్ కాలేదు. ఆ వెంటనే అక్కడే మెయిన్ క్యారేజ్‌వేపై ఉన్న ఎమర్జెన్సీ కాల్బాక్స్ ద్వారా చేసిన కాల్ వారి ప్రాణాలను నిలుపగలిగింది. శంషాబాద్ విమానాశ్ర యానికి వెళ్లడం కోసం గచ్చిబౌలి నుంచి తన బంధు వులతో కలసి ఓ వ్యక్తి బయలుదేరాడు. తెల్లవారుజామున 4 కావడంతో ఆ మార్గాన్ని పొగమంచు కప్పేసింది. అతడు ఆ పక్కనే ఉన్న భారీ స్క్రీన్‌ను చూశాడు. అక్కడ ‘మీ వాహన లైట్లు, ఇండికేటర్స్ వేసుకొని 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ముందుకెళ్లాలి అని డిస్ప్లే అవుతోంది. దీంతో సాఫీగా అతడి ప్రయాణం పూర్తయింది. సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు మార్గాన్ని ప్రమాద రహిత రహదారిగా మార్చేందుకు గాను అత్యాధునిక సాంకేతికతలో భాగంగా పలు సేవలను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా జరుగుతున్న హైవే ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (హెచ్‌టీఎంఎస్) సేవలను మరో 2 వారాల్లో వాహనదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లు, వెరియబుల్ సైన్ బోర్డులు, మెటిరోలాజికల్ ఎక్విప్మెంట్లు, సీసీటీవీ కెమెరాలు, ఆటోమెటిక్ ట్రాఫిక్ కౌంటర్ కమ్ కాసిఫయర్స్ (ఏటీసీసీ)లు ఏర్పాటు చేశారు. వీటన్నింటిని నానక్‌రామ్‌గూడలోని ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ విభాగ అధికారులు అనుసంధానం చేస్తున్నారు. సైన్ స్క్రీన్‌లో సమాచారం.. 158 కిలోమీటర్లు ఉన్న ఓఆర్ఆర్లో 19 ఇంటర్ఛేంజ్లున్నాయి.ఇంటర్‌ఛేంజ్‌లకు 1.3 కిలోమీటర్ల ముందు రెండు వైపులా వెరియబుల్ సైన్ స్క్రీన్ బోర్డులు 37 ఏర్పాటు చేశారు. అలాగే నేషనల్ హైవేతో అనుసంధానమయ్యే మార్గాల్లో 10 సైన్ స్క్రీన్ బోర్డులు అమర్చారు. మెటిరోలాజికల్ సెన్సార్స్, పొగమంచు, వెలుతురు మందగించడం, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, భారీ వర్షం కురిసినప్పుడు, ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడూ.. ఆయా సందర్భాల్లో వాహనచోదకులను అప్రమత్తం చేసేందుకు ఈ సైన్స్క్రీన్ బోర్డులపై ఆయా సమాచారాన్ని డిస్ప్లే చేస్తారు. ఆపదలో బటన్ నొక్కితే చాలు.. ఇప్పటివరకు ఓఆర్ఆర్లో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగి గుర్తించినా ఆయా ప్రాంత్లాలో సెల్‌ఫోన్ సిగ్నల్ సరిగా పనిచేయక కొన్ని నిమిషాల పాటు ఇటు పోలీసులు, అటు అంబులెన్స్‌లకు ప్రయత్నించిన సందర్భా లున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌ను ప్రతి కి.మీ. కు మెయిన్ క్యారేజ్‌వే ఎడమ వైపు, కుడి వైపు ఏర్పాటు చేశారు. వాటిల్లోని బటన్ నొక్కితే చాలు ఆటోమేటిక్‌గా హెచ్ఎండీఏ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్‌కు కనెక్ట్ అవుతుంది. ఇంటర్‌ఛేంజ్‌లపై నిఘానేత్రం.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించిన 19 ఇంటర్‌ఛేంజ్‌లు అంటే వాహనం ఓఆర్ఆర్పైకి వచ్చే వద్ద దాదాపు 38 సీసీటీవీ కెమెరాలను బిగించారు. జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాల్లో మరో 3 సీసీటీవీలు అమర్చారు. ఈ ప్రాంతాల్లోని నిఘానేత్రాలు గొడవలు, ప్రమాదాలను పసిగట్టి సమాచారాన్ని చేరవేస్తాయి. ఓఆర్ఆర్పై ఇప్పటివరకు శామీర్‌పేట, రాజేంద్రనగర్, తుక్కుగూడ, సుల్తాన్పూర్ ప్రాంతాల్లో ఈ ఆధునిక పరికరాలను అమర్చారు. పక్కాగా వాహనాల లెక్క ఓఆర్ఆర్పై ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయనేది ఆటోమేటిక్ ట్రాఫిక్ కౌంటర్ కమ్ క్లాషిఫయర్స్ (ఏటీసీసీ) తేల్చనుంది. వీటిని ప్రతి ఇంటర్‌ఛేంజ్‌కు ముందు సైన్ స్క్రీన్ బోర్డుల మాదిరిగానే 72 ఏర్పాటు చేశారు. ఇవి ఏ రోజుకారోజూ ఎన్ని వాహనాలు ప్రయాణం చేశాయి. ఏ రకమైన వాహనాలు ఉన్నాయనే వాటిని కంట్రోల్ సెంటర్‌కు చేరవేస్తుంది. దీనివల్ల టోల్ రుసుం వసూళ్లు మరింత పారదర్శకంగా జరగనున్నాయి. అలాగే నగరంలో ఏదైనా నేరం చేసి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే నిందితులు వాహనాన్ని సులువుగా గుర్తించే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు - 158 ఇంటర్ ఛేంజ్‌లు - 19 సైన్స్క్రీన్ బోర్డులు- 47 ఏటీసీసీ పరికరాలు- 72 ఎమర్జెన్సీకాల్ బాక్స్ సెంటర్లు- 328 సీసీటీవీ కెమెరాలు- 41 మెటిరోలాజికల్ ఎక్విప్మెంట్ బోర్డులు- 4 -
స్టేషన్ ఎప్పుడొస్తుందో.. ఎదురు చూడ్డమెందుకు?
పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా? అప్పుడే వచ్చేసిందా?నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసి మురిసి ముక్కచెక్కలయిందీ ! ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్ చేసింది నిన్న మొన్నేగా! నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగు మీద పెళ్ళి, పెరట్లో కొబ్బరి చెట్టు కింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి, ఇంటి ఇల్లాలినయి ఎన్నాళయిందనీ ! ముగ్గురు పిల్లల్నేసుకుని రిక్షాలెక్కుతూ దిగుతూ, హాస్పిటళ్లూ, స్కూళ్లూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ, పురుళ్లూ, తద్దినాలూ, నోములూ, వ్రతాలూ... ఎన్నెన్ని పండుగలూ, ఎంతెంత హైరానాలూ. ఇంతట్లోకే పెద్దయిపోయామా! అప్పుడే అందరూ అమ్మగారనడం మానేసి మామ్మగారంటున్నారు! అంటే అన్నారుగాని పాపం లేవబోతుంటే చేయందిస్తున్నారు! చేతనున్న చిన్న బ్యాగు తామే తెస్తామని లాక్కుంటున్నారు. పెద్దయితే అయ్యాం గానీ ఎంత హాయిగా ఉంటోందో! మండే ఎండల తర్వాత వాన చినుకు పడ్డట్టు, ముసుళ్ల వానల ముజ్జిడ్డులు దాటి, వెన్నెల మోసుకొచ్చే చందమామ కనపడ్డట్టు, గజగజలాడే చలి వణుకులు వణికాక వెచ్చటి కమ్మటి మట్టి గాలి పలకరించినట్టు... ఎంత హాయిగా వుందో! ఇంకొక పెద్ద విశేషం ఉందండోయ్, ఎవరికీ తెలియనిదీ మనం పైకి చెప్పనిదీ .. ఎవరూ మన మాట వినిపించుకోరు కాబట్టి మనమూ ఎవరి మాటా వినిపించుకోనక్కర్లేదు ! అంతా నిశ్శబ్ద సంగీతం! ఏరుని ఎప్పుడూ గలగలా ప్రవహించమంటే కుదుర్తుందా? సముద్రం దగ్గర పడుతుంటే హాయిగా నిండుగా హుందాగా అడుగులేస్తుంది కదా! అయినా ఎపుడేనా మనకి తిక్క పుట్టినపుడు అడ్డంగా, అర్థంపర్థం లేకుండా వాదించి ఇవతల పడచ్చు. ఇంత వయసు వచ్చాక ఆ మాత్రం చేయ తగమా ! ఈ మధ్యనే నేను కనిపెట్టాను ఇంకొక పెద్ద విశేషం... అస్తమానం ప్రవచనాలు వింటూ హైరానా పడక్కర్లేదు. మనకి చెప్పడం రాదు గానీ వాళ్లు చెప్పేవన్నీ మనకూ తెలుసు! అవునూ... మనం కనపడగానే మొహం ఇంత చేసుకుని ఆనందపడిపోయే మన పిన్నులూ, బాబాయిలూ, అత్తయ్యలూ, మామయ్యలూ ఏమయిపోయారు? ఎప్పుడెళ్లిపోయారు? అంటే మనమే పెద్దవాళ్లయిపోయామన్నమాట! చూస్తూండగానే సాటివాళ్లు కూడా కనిపించడం మానేస్తున్నారు. కొందరుండీ లేనట్టే. లేకా వున్నట్టే. జీవితానికి విశ్రాంతి దానంతటదే వస్తోంది. అయినా రైలెక్కాక కిటికీ పక్కన కూచుని దారిలో వచ్చే పొలాలూ, కాలవలూ, కుర్రకారూ, పల్లెపడుచులూ, టేకు చెట్లూ, భవనాలూ, వాటి పక్కనే గుడిసెలూ, అక్కడాడుకుంటూ చేతులూపే చిన్నారులూ, ఉదయిస్తూ అస్తమిస్తూ అలుపెరగక డ్యూటీ చేసే సూర్యనారాయణమూర్తులూ, మిణుకు మిణుకుమని హొయలుపోయే చుక్కలూ చూస్తూ ప్రయాణం ఎంజాయ్ చెయ్యాలి గానీ స్టేషనెప్పుడొస్తుందో అని ఎదురుచూడడం ఎందుకూ? తీరా అదొస్తే ఏముందీ! జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమేగా!– ‘ప్రయాణం’ అనే పేరుతో డాక్టర్ సోమరాజు సుశీల ఇటీవలే రాసుకుని ఫేస్బుక్లో షేర్ చేసిన పోస్టులోని కొన్ని భాగాలు. సోమరాజు సుశీల ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, రసాయన శాస్త్రవేత్త, ‘సోషల్‌కాజ్’ సంస్థ అధ్యక్షురాలు డా. సోమరాజు సుశీల (75) గురువారం మరణించారు. రసాయనశాస్త్రంలో పరిశోధన చేసిన సుశీల ఆ విభాగంలో పి.హెచ్డి. చేసిన తొలి తెలుగు మహిళ. రెండు సంవత్సరాల పాటు విజయవాడలోని మేరిస్‌స్టెల్లా కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా ఉన్నారు. 1966 నుంచి 1974 వరకు పుణేలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీలో పనిచేశారు. అనంతరం హైదరాబాద్‌లో భాగ్యనగర్ లేబొరేటరీస్ పేరున ఒక సంస్థను స్థాపించారు. ‘అఖిల భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం’ సభ్యురాలిగా, ‘భారతీయ తయారీ సంస్థల సంఘం’ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. బాధ్యతలతో ఎంత తీరికలేకపోయినా సేవా కార్యక్రమాలు మాత్రం మానలేదు. తెలుగులో ఎన్నో జాతీయవాద రచనలు చేశారు. దాదాపు ప్రతి కథలోనూ మానవతా స్పర్శ, హృదయావిష్కరణ ఉంటాయి. -
బీఎస్ఎన్ఎల్ అధికారులకు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో తమ అధికారులు ఎకానమీ విమానాల్లో ప్రయాణించాలని కోరింది. ఈ మేరకు కంపెనీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందుల మధ్య ఖర్చులను మరింత తగ్గించే చర్య, ప్రభుత్వ-టెలికాం మేజర్ బిఎస్ఎన్ఎల్ తన అధికారులందరినీ కార్యాలయ ఉత్తర్వు ప్రకారం దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలలో ఎకానమీ క్లాస్ ద్వారా మాత్రమే ప్రయాణించాలని కోరింది. సంస్థ ప్రస్తుత ఆర్థిక ఒత్తిడి నేపథ్యంలో సంస్థ అధికారులందరూ ఇప్పుడు విమానప్రయాణాల్లో ఎకానమీ క్లాస్ (దేశీయ, అంతర్జాతీయ)ను ఎంచుకోవాలని బీఎస్ఎన్ఎల్కోరింది. జూలై 26 నాటి ఉత్తర్వుల ప్రకారం బీఎస్ఎన్ఎల్ అధికారిక పర్యటనలను తదుపరి ఉత్తర్వుల వరకు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని తెలిపింది. అయితే, బీఎస్ఎన్ఎల్ సీఎండీ ముందస్తు అనుమతితో, అధికారులు వ్యాపార అవసరాల విషయంలో ఉన్నత తరగతిలో ప్రయాణించవచ్చని పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థ 2015-16లో రూ. 4,859 కోట్లు, 2016-17లో రూ .4,793 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కాగా డేటా-సెంట్రిక్ టెలికాం మార్కెట్లో మొబైల్ విభాగంలో తీవ్రమైన పోటీ, అధిక సిబ్బంది ఖర్చు , కొన్ని ప్రదేశాల్లో తప్ప 4 జి సేవలు లేకపోవడం బిఎస్ఎన్ఎల్ నష్టాలకు ప్రధాన కారణాల ని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంటుకు చెప్పారు. ఆయన పార్లమెంటుకు ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం, 2018-19లో రూ .14,202 కోట్లకు పెరగనుందని అంచనా. -
కోటా శ్రీనివాస రావు సినీ ప్రయాణం
-
ప్రమాదమని తెలిసినా..
సాక్షి, అశ్వారావుపేట : ఆటోలో మండు వేసవిలో ప్రయాణమంటేనే ప్రాణాంతకం. బస్సు సౌకర్యాలు లేని గ్రామాలకు ఆటోలే రవాణా మార్గాలు. కాకుంటే ప్యాసింజర్ ఆటో వెనుక డోరు తెరిచి దానిపై నిలుచుని ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయడం పల్లెటూర్లలో క్రేజీగా ఉంటుంది. కానీ కళ్లలో పడే దుమ్ము, ధూళికి ఇంటికి చేరేలోపే చతికిల బడతారిలా.. అశ్వారావుపేట మండలం జమ్మి గూడెం ఊట్లపల్లి మధ్యలో ఒక కిలోమీటరు ప్రయాణంలో ‘సాక్షి’కెమేరా ద్వారా చిత్రీకరించిన చిత్రాలివి. -
ఒక్క టికెట్.. తీరొక్క జర్నీ
సాక్షి, హైదరాబాద్: ఒక్క టికెట్‌పై తీరొక్క రవాణా అందుబాటులోకి రానుంది. బస్సు, రైలు, క్యాబ్, ఆటో అన్నింటికీ ఇక ఒకే టిక్కెట్. సమయానికి ఏది అందుబాటులో ఉంటే ఆ వాహనంలో ఎంచక్కా బయలుదేరవచ్చు. ఠంఛన్‌గా అనుకున్న చోటుకు అనుకున్న సమయానికి చేరుకోవచ్చు. ఈ స్మార్ట్కార్డుతో షాపింగ్ కూడా చేయొచ్చు. వస్తువులు కొనుక్కోవచ్చు. ప్రస్తుతం నోయిడా, నాగ్‌పూర్ వంటి నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ‘సింగిల్ టికెట్‌పై మల్టీ ట్రాన్స్పోర్ట్ జర్నీ’త్వరలో నగరంలో అందుబాటులోకి రానుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని సిటీబస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు ఉబర్, ఓలా క్యాబ్‌లు, ఆటోల్లో కూడా ఒకే టికెట్‌పైన ప్రయాణం చేయవచ్చు. ప్రజారవాణాలో ముందడుగుగా భావించే మల్టీట్రాన్స్పోర్టు స్మా ర్ట్ కార్డుపైన సోమవారంఇక్కడి బస్‌భవన్‌లో విస్తృత చర్చలు జరిగాయి. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ నేతృ త్వంలో ఏర్పాటైన టాస్క్‌పోర్స్ కమిటీలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఈడీ పురుషోత్తమ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్లు శర్మ, అల్కా, ఎల్అండ్టీ ప్రతినిధులు అనిల్ సైనీ, రవీందర్‌రెడ్డి, ఉబర్, ఓలా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్టీట్రాన్స్పోర్ట్ స్మార్ట్‌కార్డు వ్యవస్థ పనితీరు, ప్రయోజనాలు తదితర అంశాలపై ఎస్బీఐ అధికారులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నోయిడా, నాగ్‌పూర్‌లలో అమలవుతున్న స్మార్టుకార్డుల పనితీరును వివరించారు. ఆ నగరాల్లో కేవలం ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లకు మాత్రమే ఈ సింగిల్ టిక్కెట్ సిస్టమ్ పరిమితం. నగరంలో అన్ని రకాల ప్రజారవాణా సదుపాయాలను ఒక గొడుగు కిందకు తెచ్చేవిధంగా దీనిని అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ విధానానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మెటీరియల్‌ను ఎస్బీఐ అందజేయనుంది. ప్రయాణికుల నుంచి వచ్చే ఆదా యం సైతం ఎస్బీఐ నుంచి ఆయా రవాణా సంస్థలకు వెళ్తుంది. ‘ఓలా, ఉబర్ సంస్థలకు అనుబంధంగా నడుస్తున్న ఆటోరిక్షాలను కూడా దీని పరిధిలోకి తేవడం ద్వారా ప్రజలకు నిరంతరాయ ప్రయాణ సదుపాయం లభిస్తుంది’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలా పనిచేస్తుంది: సింగిల్ టికెట్ మల్టీ ట్రాన్స్‌పోర్టు స్మార్ట్‌కార్డులను స్టేట్‌బ్యాంకు అన్ని చోట్ల విక్రయిస్తుంది. ఆర్టీసీ బస్స్టేషన్లు, బస్‌పాస్ కౌంటర్లు, రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లు, మెట్రో స్టేషన్లు వంటి అన్ని ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తారు. ప్రయాణికులు మొదట రూ.50 చెల్లించి ఈ కార్డును కొనుగోలు చేయాలి. తరువాత రూ.200 నుంచి రూ.2000 వరకు రీచార్జ్ చేసుకోవచ్చు. తమ అవసరం మేరకు ప్రయాణం చేయవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల తరహాల్లోనే వీటి వినియోగం ఉంటుంది. ఇందుకోసం బస్సులు, రైళ్లు, ఆటోల్లో ప్రత్యేకంగా తయారు చేసిన టిక్కెట్ ఇష్యూ మిషన్లు(టిమ్స్) ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు బస్సు లేదా రైలు ఎక్కిన వెంటనే స్వైప్ చేయవచ్చు. ఉదాహరణకు ఉప్పల్ నుంచి అమీర్‌పేట్ వరకు బస్సులో వచ్చిన ప్రయాణికుడు అమీర్‌పేట్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో వెళ్లవచ్చు. అక్కడి నుంచి మరో చోటుకు క్యాబ్లోగాని, ఆటోలోగాని వెళ్లవచ్చు. లింగంపల్లి నుంచి బేగంపేట వరకు ఎంఎంటీఎస్ రైళ్లలో వచ్చిన ప్రయాణికులు అక్కడి నుంచి సిటీ బస్సుల్లో వెళ్లవచ్చు. ఇలా తమ అవసరానికి అనుగుణంగా ఎక్కడికంటే అక్కడికి అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను వినియోగించుకోవచ్చు. ఆర్టీసీలో మొదట ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో దీన్ని ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సుల్లోకి విస్తరిస్తారు. ఈ స్మార్ట్‌కార్డు వల్ల సిటీ బస్సుల్లో తిరుగుతున్న 33 లక్షల మందికి అలాగే ఎంఎంటీఎస్ రైళ్లలో రాకపోకలు సాగించే లక్షా 60 వేల మందికి మెట్రో సేవలను వినియోగించుకుంటున్న మరో 70 వేల మందికిపైగా ప్రయోజనం లభించనుంది. ఈ కార్డును వినియోగించే వారికి తాము పయనించిన దూరం, అందుకోసం చెల్లించిన డబ్బుల వివరాలు ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా చేరుతాయి. దీంతో తమ అకౌంట్లో ఇంకా ఎన్ని డబ్బులున్నాయి... ఎంత దూరం ప్రయాణం చేయవచ్చు... అనే అంశంపైన ప్రయాణికులకు అవగాహన కలుగుతుంది. బస్‌పాస్‌లకు వర్తింపు... బస్‌పాస్ వినియోగదారులు కూడా ఈ స్మార్ట్‌కార్డులను వినియోగించుకోవచ్చు. ఇందుకోసంకార్డులో ఒక ఆప్షన్ ఉంచుతారు. ప్రయాణికులు తమ నెల వారీ సాధారణ పాస్‌లు, ఎన్జీవో, స్టూడెంట్, తది తర పాస్‌లను దీనితో అనుసంధానం చేసి పయనించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 నుంచి 7 లక్షల మంది బస్‌పాస్ వినియోగదారులకు కూడా ఈ సదుపాయం లభించనుంది. ఈ స్మార్ట్ కార్డు ద్వారా లభించే మరో సదుపాయం షాపింగ్. ప్రయాణికులు దీనిని క్రెడిట్, డెబిట్ కార్డుల తరహాలో వినియోగిస్తూ షాపింగ్ చేయవచ్చు. ఒక స్మార్ట్కార్డుతో అనేక రకాల ప్రయోజనాలు లభించే విధంగా రూపొందిస్తున్నారు. -
చిత్రనళినీయం.. కథ వెనక కథ
ప్రియాతి ప్రియమైన పాఠకులారా!! ఈ రోజు ఈ ఉత్తరం మీకు వ్రాస్తుంటే నా మనసు చెప్పలేనంత ఉద్విగ్నభరితంగా ఉంది. 60 సంవత్సరాల సుదీర్ఘమైన నా రచనాప్రయాణంలో నేను 1957లో వ్రాసిన ‘చిత్రనళినీయం’అనే ఈ కథ నా తొలి అడుగు! దాదాపు 60 సంవత్సరాల అలుపెరుగని, నిరుత్సాహం ఎరుగని, విసుగు ఎరుగని, సుదీర్ఘ ప్రయాణం ఇది. నేను పుట్టి పెరిగినది ‘కాజ’అనే చిన్న గ్రామం. చాలా అందమైన పల్లెటూరు. ప్రకృతి మధ్య ఒదిగి పడుకున్న అమాయకపు పసిపాప లాంటి అందమైన ఊరు. ఎటు చూసినా పచ్చదనం! పంట కాలవలు. వరిచేలు. ఉదయం అవగానే చెట్ల మీద గుంపులుగా వాలే రామచిలుకలు, కావ్–కావ్ మని కాకుల గోలలు! వేణుగోపాల స్వామి ఆలయంలో జేగంటల ధ్వనులు.. ఇటు పక్క శివాలయంలో శివనామ స్మరణలు! దొడ్లో ఒక పక్క బావిలోంచి బకెట్టుతో నీళ్ళు తోడుతున్న చప్పుడు..! ఇటు పక్క కట్టెలపొయ్యి మీద కాగులో కాగుతున్న వేడి నీళ్ళు. పొయ్యిలోంచి కట్టెలు, పిడకల వాసన. కొద్ది దూరంలో ఆవు పేడ వాసన. గుమ్మం పక్కన విరగబూసి సువాసనలు వెదజల్లుతున్న సన్నజాజి చెట్టు. దానికి కొద్దిదూరంలో తులసి వనంలా పచ్చటి తులసి మొక్కలు.. తెల్లవారేసరికి ఒకటో రెండో పళ్ళు రాల్చే విరగ గాసిన బాదం చెట్టు. ఇంట్లో కరెంటు లేదు. కిరసనాయిలు లాంతర్ల ముందు కూర్చుని అప్పుడప్పుడు పుస్తకాలు చదివేదాన్ని. ఊరిలో అన్నిటికంటే నాకు ప్రియాతి ప్రియమైనది ‘మా ఊరి చెరువు’. దాన్ని చూస్తే సంతోషంతో పులకరింతలు వచ్చేవి.. ఎందుకంటే అది ఒక అందమైన, అద్భుతమైన దృశ్యం! ఆ చెరువులో తెలుపు, ఎరుపు కలువ పూలు!! కొన్ని మొగ్గలుగా ఉండేవి. కొన్ని విచ్చుకుని విరబూసి ఉండేవి. కార్తీకమాసంలో, చలిలో అమ్మా అత్తయ్యలు, చెరువుకి స్నానానికి వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ వెంట వెళ్ళేదాన్ని. అమ్మ ఒక పాత చీరలో నన్ను కాగితంలో పొట్లం చుట్టినట్టు చుట్టి చలిబారిన పడకుండా చూసేది. చెరువు మెట్ల మీద కూర్చుని అమ్మా అత్తయ్యలు అరటి దొప్పల్లో దీపాలు పెట్టి చెరువులోకి వదిలేస్తుంటే, అవి మెల్లగా నీటిలో ప్రయాణం చేస్తుంటే ఆ చీకటి రాత్రి, చెరువు – దీపాలు , నాకు చాలా ఆనందంగా, చూడముచ్చటైన దృశ్యంగా ఉండేది. తెల్లవారి అమ్మా అత్తయ్యలు చెరువు గట్టున ఉన్న రామాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే నేను చెరువుని వదలలేని దానిలా అక్కడే కూర్చునే దాన్ని.. చెరువు చుట్టూ పాకలు! పైకప్పులోంచి వలయాకారంగా బయటికి వస్తున్న వంట పొయ్యిల పొగలు. మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. పోస్ట్ అంతా పంట కాలవలో, పడవలో బందరు వెళ్ళాలి. అలా నేను వ్రాసిన నా మొట్టమొదటి కథ ‘చిత్ర నళినీయం’ పంట కాలవలో, పడవలో ప్రయాణం చేసి బందరు వెళ్ళి, అక్కడ నుంచి రైలులో మద్రాసు వెళ్ళింది. ఆ పచ్చటి పొలాలు, పంట కాలవల్లో ఆకాశం పైనుందా, క్రింద కాలవలో ఉందా అన్నట్టూ ప్రతిబింబించే దృశ్యాలు.. పడవని తాడుతో లాగుతూ ఒడ్డున నడిచే పల్లెకారులు, నీళ్ళలో వెళుతున్న పడవ శబ్దం. ఇదంతా గుర్తుకువస్తే ‘సత్యజిత్ రే’ సినిమాలో ఒక దృశ్యంలా అనిపిస్తుంది. అప్పటికే నా వివాహం కావడం వల్ల నా పేరు యద్దనపూడి సులోచనారాణి అని పెట్టుకున్నాను. అలాంటి పల్లెటూరిని వదిలి ఈ హైదరాబాదు వచ్చాను. కాలగమనంలో ఇన్నాళ్ళ నా సాహితీచరిత్ర సాగుతోంది. ఇంకెన్ని పుటలు ఉన్నాయో నాకే తెలి యదు. కాలగమనంలో మార్పు చూడండి.. ఆ నాడు పంట కాలవలో, పడవలో వెళ్ళే నా కథ, ఇప్పుడు నా కలం నుంచి తెల్ల కాగితం మీద వచ్చిన అక్షరాలని ‘అని’ నిమిషంలో కంప్యూటర్లో పెట్టడం జరుగుతోంది.. 1957 లో ప్రచురితం అయిన నా ఈ కథని మీ ముందు ఉంచుతుంటే, నా హృదయం ఊహించలేనంత ఉద్విగ్నంగా, ఆనందంగా ఉంది. ఈ క్షణం, 60 సంవత్సరాలు గల గతం, ఇప్పటి ఈ రోజు వర్తమానం రెండూ కలిసిపోయిన అద్భుత క్షణాలుగా అనిపిస్తున్నాయి.. కథ ముందు.. నేను రచయిత్రిగా ఎలా మారానో, నేను రాసిన మొట్టమొదటి కథ వెనక జరిగిన కథ ఇది : ‘చిత్రనళినీయం’ కథ పోస్ట్ చేయటానికి వెనక చిన్న కథ వుంది. నేను ఆ కథ రాయటానికి (ఇది నేను ఎస్.ఎస్.ఎల్.సి. పాస్ అయిన తర్వాత సెలవల్లో వ్రాసాను). అంత క్రితం 8వ క్లాసు చదువుతుండగా స్కూల్లో మేగ్జీన్ కోసం ఖుద్దూస్ మాస్టార్ గారు నన్ను ఒక కథ వ్రాయమని అడిగారు. నాకు రాదు అన్నాను. అంత క్రితం నేను ‘గోమాత’ మీద ఒక వ్యాసం వ్రాసి, క్లాస్‌లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. నేను అది బాగా వ్రాసానని, క్లాస్‌లో మిగతా పిల్లలతో నాకు అభినందనగా చప్పట్లు కొట్టించి, వారితో కలిసి ఆయన కూడా కొట్టారు! నా మనసు పరవశించి పోయింది. ఖుద్దూస్ మాస్టార్ ముస్లిం అయినా తెలుగు బాగా మాట్లాడేవారు, వ్రాసేవారు. చక్కగా కథలు చెప్పి నీతి బోధించేవారు. ఆయనంటే నాకు బాగా ఇష్టం. నిజానికి ‘గోమాత’ వ్యాసం వ్రాయటానికి నేను యేమీ కష్టపడలేదు. మా దొడ్లో ఒక ఆవు ఉండేది. అమ్మ దాన్ని ‘లక్ష్మి’ అని పిలిచేది. దాని ముఖానికి పసుపు రాసి, బొట్టు పెట్టి, దండం పెడుతూ దాని చుట్టూ ప్రదక్షిణం చేసేది. అది మూత్రం పోస్తే దాని తోక మీద పట్టి, తన తల మీద చల్లుకుని, నా తల మీద చల్లేది. లక్ష్మికి ఒక దూడ ఉండేది. అది దొడ్లో చెంగున గంతులేస్తుంటే మేం పిల్లలంతా దానితో ఆడేవాళ్ళం. నేను దాన్ని పట్టుకుని, మా అమ్మలా దాని మెడ మీద నిమిరేదాన్ని! అది నా దగ్గరికి వచ్చేసేది. మా బాబాయి ఒకరు ఆవు వల్ల ఉపయోగాలు చెప్పారు. ఇదంతా కలిపి ఒక వ్యాసం వ్రాసాను. మూత్రం శుద్ధి చేయటానికి పనికొస్తుందని, పాలు ఆరోగ్యానికి మంచిదని మా బాబాయి చెప్పినట్టే వ్యాసంలో వ్రాసాను. ఇది వ్రాసిన తర్వాత ఖుద్దూస్ మాస్టార్ స్కూల్ నుంచి వచ్చే వ్రాత పత్రికకి కథ వ్రాయమని అడిగారు. నాకు రాదు అని అంటే... నువ్వు వ్రాయగలవని ప్రోత్సహించారు. ఆయన పిల్లలతో కలిసి చప్పట్లు కొట్టింది గుర్తుకువచ్చి, శరీరం సంతోషంతో పులకరించేది. ఆ ఉత్సాహంతోనే స్కూల్ వ్రాత పత్రికకి ఒక కథ వ్రాసాను. దాని పేరు ‘మనోఛాయలు’ (ఇద్దరు స్కూల్లో చదివే స్నేహితురాళ్ల మధ్య చిన్న మనఃస్పర్థలు వచ్చి, మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఆనందంగా ఒకరి భుజం మీద మరొకరు చేతులేస్కొని, స్నేహంగా స్కూల్‌కి వెళ్ళటం! ) అది నా 14వ సంవత్సరంలో వ్రాసిన కథ! అది కూడా ఖుద్దూస్ మాస్టార్ మరీ మరీ వ్రాయమని అడిగితే వ్రాసినదే! నేను పెద్ద రచయిత్రిని అయిన తర్వాత, ఎవరో ఒకరు వ్రాయండి అని అడిగితే రాసిన నవలలే ఎక్కువ.. 1) సెక్రటరీ – రమణా – బాపు, జ్యోతి రాఘవయ్య గారు. 2) జీవన తరంగాలు – నార్ల వెంకటేశ్వరరావు గారు 3) మీనా – చక్రపాణి గారు 4) ఆరాధన – ఎమెస్కో ఎం.ఎన్. రావు గారు ఈ విధంగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు అయిపోయినాయి. వేసవి సెలవుల తర్వాత నవంబర్‌లో అమ్మ పోయింది. మనసులో భయం! ఒంటరితనం! దిగులు.. దుఃఖం! అప్పటికే పెళ్ళై రెండు సంవత్సరాలు అయింది. నాన్న ఎస్.ఎస్.ఎల్.సి. అయి, ఇంటర్ అయిన తర్వాత కాపురానికి పంపిస్తామని పెళ్ళికి ముందే షరతు పెట్టారు. ఇంటినిండా అక్కయ్యలు, ఒదినలు, పిల్లలు.. అయినా ఒంటరితనం. ఖుద్దూస్ మాస్టార్ ఒకసారి నాన్నని చూడటానికి వచ్చి.. నన్ను కథలు వ్రాయమని గట్టిగా చెప్పారు... కథలు వ్రాస్తే నా బాధలు పోతాయని చెప్పారు... అప్పుడు ‘చిత్రనళినీయం’ వ్రాసాను.. – యద్దనపూడి సులోచనారాణి రహస్యంగా పోస్టయిన కథ... మంగళవారం (29.05.2018) సంచికలో... -
నష్టాల ప్రయాణం
వరంగల్ రీజియన్‌లో డిపోలు : 9 ఆర్టీసీ బస్సులు : 762 అద్దె బస్సులు : 230 బస్సులు రోజూ తిరిగే కిలోమీటర్లు : 3.91 లక్షలు నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు : 10 లక్షలు రోజు సగటు ఆదాయం : రూ.1.15 కోట్లు హన్మకొండ: ఆర్టీసీ వరంగల్ రీజియన్ ప్రయాణం ఒడిదొడుకుల మధ్య సాగుతోంది. నష్టాలు, లాభాలతో ఎగుడు...దిగుడుల మధ్య ముందుకెళుతోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని డిపోలు, రీజియన్ల వారిగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ లాభాలబాట పట్టించాలని గతంలో సీఎం కేసీఆర్ చేసిన సూచనల మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో కొంతమేర సత్ఫలితాలు వచ్చాయి. వాస్తవానికి 2017 జనవరి నాటికి వరంగల్ రీజియన్ రూ.19.35 కోట్ల నష్టంలో ఉండేది. కానీ సంస్థాగతంగా చేపట్టిన చర్యలతో 2017 డిసెంబర్ నాటికి నష్టాల నుంచి పూర్తి స్థాయిలో గట్టెక్కి రూ.38 లక్షల లాభాల్లోకి వెళ్లింది. ఇలా 2017 సంవత్సరం భారీ నష్టాలతో మొదలై లాభాలతో ముగిసినప్పటికీ 2018 మొదటి నెలలోనే ఆర్టీసీ వరంగల్ రీజియన్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ ఒక్క నెలలోనే రూ.3.54 కోట్ల నష్టం వాటిల్లడంతో షాక్ తిన్న ఆర్టీసీ రీజియన్ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో 992 బస్సులు ఉండగా ఇందులో 762 సంస్థ బస్సులు, 230 అద్దెబస్సులు ఉన్నాయి. రీజియన్‌లో ప్రతిరోజు ఈ బస్సులు 3.91 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఇలా రోజుకు సగటున రూ.1.15 కోట్ల ఆదాయం వస్తోంది. పల్లెవెలుగు బస్సుల ద్వారా నష్టాలు ఎక్కువగా వస్తుండడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలనే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది. నష్టాలను పూడ్చుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వారిని తొలగించినా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా, సేవలకు ఆటంకం కలగకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏసీ బస్సుల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న అటెండెంట్లను తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. హన్మకొండ–హైదరాబాద్ మధ్య నడిచే బస్సులు మధ్య స్టేజీల్లో నిలిపే అవకాశం లేనందున ప్రయాణికులకు కాజీపేట, హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో వాటర్‌బాటిళ్లు, ఇతర వస్తువులు అటెండెంట్లను నియమించి అందించవచ్చని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఇలా ప్రతి బస్సుకు ఒక అటెండెంట్‌కు బదులు కాజీపేట, ఉప్పల్‌లో రెండు లేదా మూడు షిఫ్టుల్లో ఒక్కొక్కరిని నియమించి ప్రయాణికుల అవసరాలు తీర్చాలని చూస్తోంది. అయితే దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో అటెండెంట్లను మాత్రం కొనసాగించాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వరంగల్ రీజియన్‌లో 38 ఏసీ బస్సులున్నాయి. ఇందులో 15 వజ్ర ఏసీ మినీ బస్సులు. కొత్తగా వచ్చే 2 బస్సులతో రీజియన్‌లో మొత్తం 40 ఏసీ బస్సులు కానున్నాయి. ఈ బస్సుల్లో ప్రస్తుతం 30 మంది అటెండెంట్లు పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.8,500 వేతనం చెల్లిస్తోంది. వీరిలో కనీసం 20 మందిని తొలగించాలనే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సుల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు అనువైన ప్రధాన రూట్లలో సెమీ ఎక్స్‌ప్రెస్‌లు నడపాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రైవేట్ వాహనాలకు ధీటుగా ప్రయాణికులను త్వరగా గమ్యస్థానం చేరవేయడం ద్వారా ఆర్టీసీ వైపు ప్రయాణికులను ఆకర్షించడంతోపాటు ఆదాయం పెంచుకోవాలన్నదే ఆర్టీసీ ఆలోచన. దీంతోపాటు మిని పల్లెవెలుగు బస్సులను నడపాలని చూస్తోంది. మినీబస్సులను వన్మన్ సర్సీస్‌గా నడుపుతారు. ఇందులో కండక్టర్ అవసరం ఉండదు. దీంతో మ్యాన్‌పవర్ కూడా తగ్గుతోంది. తద్వారా వేతన పెట్టుబడులు తగ్గుతాయి. పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్న మహబూబాబాద్ డిపో పరిధిలో మినీపల్లె వెలుగు బస్సులు ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించింది. దీంతోపాటు జనగామ డిపోలోను కొన్ని రూట్లలో మినీబస్సులను ప్రవేశపెట్టి ఆదాయం పెంచుకోగలిగింది. ఈ క్రమంలో రీజియన్‌లోని మరికొన్ని డిపోల్లో ఆదాయం పెంచుకునేందుకు అనువుగా ఉన్న రూట్లలో మినీ పల్లెవెలుగు బస్సులు నడపాలనే ఆలోచనలో యాజమాన్యం ఉంది. ఈ మేరకు వరంగల్ రీజియన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పల్లె వెలుగు రూట్లపై ప్రత్యేక దృష్టి.. వరంగల్ రీజియన్‌లో ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచన చేస్తున్నాం. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. తమ ప్రణాళికలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకుంటాం. ఆ తర్వాత అమలు చేస్తాం. ప్రధానంగా పల్లెవెలుగు బస్సులు నడిచే రూట్లలో ఆదాయం పెంచుకునేలా ప్రణాళికలు తయారు చేస్తాం. అనవసర ఖర్చులు తగ్గించుకుంటాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. నష్టాలు పూడ్చుకునేందుకు ఆనువైన మార్గాలు ఎంచుకుని ముందుకు పోతాం. – తోట సూర్యకిరణ్, ఆర్ఎం, వరంగల్ రీజియన్ -
హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డులు
-
జాలీగా.. సెల్ఫీగా..
మెట్రో తొలి పయనం సిటీజనులను ఆనందాశ్చర్యాలకు గురి చేస్తూనే... సమస్యలతో స్వాగతం పలికింది. చాలా స్టేషన్లలో పార్కింగ్ వసతి లేకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. నిబంధనలు తెలియక చాలా మంది తికమక పడ్డారు. సిబ్బంది జరిమానాలు విధించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తానికి మెట్రో తొలి జర్నీ నగరవాసులకు తీపి, చేదు రుచి చూపించింది. ‘సాక్షి’ బుధవారం మెట్రో స్టేషన్లలో విజిట్ నిర్వహించగా కొన్ని సమస్యలు కనిపించాయి. ప్రధానంగా పార్కింగ్, టాయిలెట్లు, టికెట్ల కొనుగోలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. మెట్రో తొలి జర్నీకి జనం పోటెత్తారు. నాగోల్–అమీర్‌పేట్, అమీర్‌పేట్–మియాపూర్ మార్గాల్లోని స్టేషన్లన్నీ ప్రయాణికులతో బుధవారం కిక్కిరిశాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ తొలి పయనానికి తరలొచ్చారు. సెల్ఫీలు దిగుతూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు. పార్కింగ్ ప్రభో... ♦ నాగోల్, ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక స్టేషన్లలో పార్కింగ్ సమస్య ప్రధానంగా ఉంది. ఈ స్టేషన్లలో ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండగా... కార్లు, బస్సులు, క్యాబ్స్ నిలిపేందుకు స్థలం లేదు. ♦ నాగోల్ స్టేషన్‌కు చేరుకోవాలంటే బస్ దిగి దాదాపు కిలోమీటర్ నడవాల్సిందే. ♦ స్టేషన్ స్టేడియానికి రావాలంటే బస్ దిగి అర కిలోమీటర్ వెళ్లాల్సిందే. ఇక్కడ ఫుట్‌పాత్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ♦ ఎన్జీఆర్ఐ స్టేషన్లో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ♦ హబ్సిగూడ నుంచి తార్నాక వెళ్లే మార్గంలో పార్కింగ్ సౌకర్యం లేదు. ఇక్కడ ఫుట్‌పాత్ కూడా లేదు. దీంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. పరేడ్ గ్రౌండ్.. పార్కింగ్ లేదు ♦ విశాలమైన స్థలంలో నిర్మించిన స్టేషన్ ఇది. సికింద్రాబాద్‌లోని అన్ని స్టేషన్లలో ఇదే మెరుగైనది. కానీ పార్కింగ్ స్థలం మాత్రం లేదు. ♦ ఇక మెట్టుగూడ స్టేషన్లో కార్లు, క్యాబ్‌లు నిలిపేందుకు వీలులేదు. ఫుట్‌పాత్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ♦ సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ ఇరుకైన ప్రదేశంలో ఉంది. సమీపంలో ఎలాంటి వాహనాలు నిలిపేందుకు వీలులేదు. పాత గోపాలపురం పోలీస్ స్టేషన్ స్థలంలో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లుఅధికారులు పేర్కొంటున్నారు. తొలిరోజే వడ్డన.. ♦ తొలి ప్రయాణంలోనే సిటీజనులకు చేదు అనుభవం ఎదురైంది. నాగోల్ స్టేషన్లో కొందరు స్నేహితులు అరగంట కంటే ఎక్కువ సేపు ఉన్నందుకు ఒక్కొక్కరికి రూ.50 జరిమానా విధించారు. ♦ ఓ వ్యక్తి తార్నాక నుంచి బేగంపేట్‌కు ప్రయాణం చేశాడు. అయితే బేగంపేట్‌లో దిగాల్సింది.. అమీర్‌పేట్‌లో దిగాడు. దీంతో స్టేషన్ దాటి వచ్చినందుకు ఆయనకు జరిమానా వేశారు. ప్రారంభ స్టేషన్ పరిస్థితి ఇదీ.. ♦ మియాపూర్ మెట్రో ప్రారంభ స్టేషన్. కానీ ఇక్కడ ఒకే ఒక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ♦ టికెట్ తీసుకోవడానికే 45 నిమిషాలు లైన్లో నిల్చొవాల్సి వచ్చింది. ♦ మెట్రో యాప్, స్మార్ట్‌కార్డు, స్వైప్ మెషిన్లు త్వరితగతిన పనిచేయకపోవడం సమస్యగా మారింది. ♦ కాయిన్స్ వినియోగం తెలియక ప్రయాణికులు తికమక పడ్డారు. కొనసాగుతూ... ♦ మూసాపేట్, భరత్‌నగర్, ఎర్రగడ్డ స్టేషన్లలో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫుట్‌పాత్ పనులు పూర్తి కాలేదు. ♦ ఫుట్‌పాత్ పనులతో మూసాపేట్ స్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నిల్చొవడానికి స్థలం లేకపోవడంతో ప్రధాన రహదారిపైనే వేచి ఉన్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ♦ భరత్‌నగర్ స్టేషన్లో లిఫ్టు దగ్గరికి వెళ్లేందుకు దారి ఏమాత్రం బాగాలేదు. వృద్ధులు, వికలాంగులు, మహిళలకు తిప్పలు తప్పలేదు. అపరిశుభ్రంగా ఉంది. డస్ట్బిన్లు ఎక్కడా కనిపించలేదు. ♦ ఎర్రగడ్డ స్టేషన్లో పార్కింగ్‌కు ఇబ్బందులున్నాయి. ఇక్కడ టికెట్ వెండింగ్ మెషీన్లో క్రెడిట్/డెబిట్ కార్డు ఆప్షన్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు వెనుదిరిగారు. అమీర్‌పేట్‌లోనూ అంతే... ♦ అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్. ఇక్కడ తొలిరోజు ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. కానీ పార్కింగ్ స్థలం లేదు. దీనికి చాలీస్ కమాన్ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, అమల్లోకి రాలేదు. దీంతో స్టేషన్ కింది భాగంలో వాహనాలను అస్తవ్యస్తంగా పార్క్ చేశారు. ♦ ఇక బేగంపేట్, ప్రకాశ్‌నగర్ స్టేషన్లలో ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 10 వేల స్మార్ట్ కార్డులు తొలిరోజే 10 వేల మెట్రో స్మార్ట్ కార్డులను విక్రయించినట్లు ఎల్అండ్టీ సంస్థ తెలిపింది. నాగోల్–అమీర్‌పేట్, అమీర్‌పేట్–మియాపూర్ మార్గాల్లో బుధవారం మొత్తం 14 రైళ్లను 360 ట్రిప్పులు నడిపామని, దాదాపు 2లక్షల మంది ప్రయాణించారని పేర్కొంది. కాగా మెట్రో జర్నీకి వినియోగించే టోకెన్లు ఒకే రోజుకు పనిచేస్తాయని, నిర్దేశిత గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత వాటిని ఎగ్జిట్ గేట్ వద్ద వదిలి వెళ్లాలని సూచించింది. మళ్లీ ప్రయాణానికి అన్‌పెయిడ్ ఏరియాకు చేరుకొని, తిరిగి టోకెన్ కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ప్లాట్‌ఫామ్‌పై పసుపురంగు గీత దాటి ముందుకు రావద్దని హెచ్చరించింది. హ్యాపీ.. హ్యాపీ మెట్రోలో ప్రయాణించినందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నాం. మా ఆనందం, అనుభూతిని మాటల్లో చెప్పలేం. అమీర్‌పేట్ నుంచి నాగోల్ వరకు ప్రయాణించాం. చాలా బాగా అనిపించింది.– సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు ఫుల్.. థ్రిల్ మెట్రో పయనం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. తొలి జర్నీ చేయాలని ఫ్యామిలీతో కలిసి వచ్చాను. ఇందులో ప్రయాణం చాలా బాగుంది. ట్రాఫిక్, కాలుష్యం లేకుండా హాయిగా ప్రయాణించొచ్చు. నగరాభివృద్ధికి మెట్రో ఒక అవకాశం. – ధనుంజయ, తార్నాక చార్జీలు అధికం.. మెట్రో చార్జీలు అధికంగా ఉన్నాయి. సామాన్య ప్రజలు ఈ భారాన్ని మోయలేరు. అమీర్‌పేట్ నుంచి నాగోల్ వరకు రూ.45 చెల్లించాను. టికెట్ ధరల విషయంలో అధికారులు మరోసారి ఆలోచించాలి. – రమ్య, ఇంజినీరింగ్ విద్యార్థి జర్నీ సూపర్.. మెట్రో జర్నీ బాగుంది. మాది గుజరాత్‌లోని వాద్నగర్. చింతల్లో స్థిరపడ్డాం. ప్రధాని మోదీ ప్రారంభించిన మెట్రో రైలులో తొలిరోజు ప్రయాణించాలని ఎంతో ఉత్సాహంతో వచ్చాం. మెట్రో ప్రయాణం మాకెంతో సంతృప్తినిచ్చింది. – గుజరాతీలు పార్కింగ్ ఏదీ? మెట్రో వసతులు చాలా బాగున్నాయి. కానీ పార్కింగ్‌నే అసలు సమస్య. మెట్టుగూడ, సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్లలో కనీసం బైక్‌లకు కూడా పార్కింగ్ లేదు. ఇక కార్లు, క్యాబ్‌లలో వస్తే దూరంగా దిగి రావాల్సిందే. పార్కింగ్ వసతులు కల్పించాలి. – బాలశేఖర్, ప్రయాణికుడు