న్యూ లుక్తో అదరగొట్టిన అంజలి | Actress Anjali Dazzles in her New Look | Sakshi
Sakshi News home page

న్యూ లుక్తో అదరగొట్టిన అంజలి

Published Sat, Nov 15 2014 9:13 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

న్యూ లుక్తో అదరగొట్టిన అంజలి - Sakshi

న్యూ లుక్తో అదరగొట్టిన అంజలి

తమిళ రీమేక్‌ 'జర్నీ' సినిమాతో టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందిపుచ్చుకున్న అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి... తనకు లైఫ్‌నిచ్చిన కోలివుడ్‌పై  మళ్లీ దృష్టి పెట్టినట్లు ఉంది. అందుకే దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అక్కడ ఓ రేంజ్‌లో దర్శనమిచ్చింది. ఇటీవల తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వహించిన 'కయల్‌' సినిమా ఆడియో వేడుకలో అంజలి పాల్గొంది.  అలా ఇలా కాకుండా ఓ రేంజ్లో ఈ వేడుకకు హాజరయ్యింది.

నల్లటి పొట్టి గౌను ధరించి వచ్చిన అంజలి తమిళ తంబీల మతి పొగొట్టింది. కోలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడు పొందికగా కనపడ్డ ఆమె...మరీ కురస దుస్తుల్లో అందాలు ఆరబోసే సరికే  అందరూ షాక్‌ తిన్నారు.  దాంతో ఆడియో వేడుక కార్యక్రమంలో అందరి కళ్లు అంజలిపైనే పడ్డాయట. బహుశా కోలివుడ్‌లో మళ్లీ ఆఫర్ల కోసమే ఇలా కన్పించేదేమోనని తమిళ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు కోలివుడ్‌లో హాట్‌  ఫేవరేట్‌గా నిలిచిన ఈ తెలుగింటి బ్యూటీ.... పిన్నితో విబేధాలు, తమిళ దర్శకుడు కళాంజీయమ్‌తో కోర్టు వివాదం కారణంగా రెండేళ్ల నుంచి తమిళ చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటుంది . ఏదీ ఏమైనా మరోసారి తమిళ చిత్ర పరిశ్రమలో అంజలి సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement