new look
-
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్‌బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్‌స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్‌లో.. మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్‌గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
ట్రంప్ సరికొత్త లుక్.. నెట్టింట వైరల్
ఫ్లోరిడా: అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ సరికొత్త అవతారంలో అభిమానులను అలరించారు. ఫ్లోరిడాలోని తన పామ్ బీచ్ గోల్ఫ్ క్లబ్లో ట్రంప్ తాజాగా కొత్త అవతారంలో దర్శనమిచ్చారు. తెలుపు రంగు గోల్ఫ్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్, చేతిలో ఎరుపు రంగు క్యాప్ పట్టుకుని సందర్శకులతో సరదాగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.అయితే ఈ లుక్‌లో ట్రంప్‌లో కొత్త దనం ఏంటంటే మారిన ఆయన జుట్టు. ఎప్పుడూ కదులుతూ ఫ్రీగా ఉండే ఆయన జుట్టు స్టైల్ ఇప్పుడు పూర్తిగా మారింది. జుట్టు పైకి దువ్వి వెనక్కి సెట్ చేయడంతో ‘హ్యాట్ హెయిర్’ స్టైల్లోకి వచ్చేసింది.PRESIDENT DONALD J. TRUMP HAS A NEW HAIRSTYLE MAKEOVER pic.twitter.com/j4gXErl2KN— X Analyst (@topic_flow) December 18, 2024కాగా, ట్రంప్‌కు హష్మనీ కేసులో తాజాగా కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పటికే దోషిత్వం రుజువైన కేసును అధ్యక్ష పదవి వచ్చినంత మాత్రానా కొట్టేయడం కుదరదని కోర్టు ఇటీవలే తేల్చి చెప్పడం గమనార్హం. -
ప్రియాంక చోప్రా స్టైలిష్ లుక్ : విలువ రూ. 20 లక్షలు!
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా గురించిప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీనుంచి బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా ఎదిగింది. తరువాత హాలీవుడ్ దాకాఎదిగి అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా తనను తాను నిలబెట్టుకుంది. తాజాగా ముంబై ఈవెంట్లో స్టైలిష్ లుక్‌లో తళుక్కున మెరిసింది ప్రియాంక చోప్రా. ఆమె మొత్తం ఔట్ఫిట్ ధర ఏకంగా రూ. 20 లక్షలట. దీంతో ధరించిన డ్రెస్, నగలు, హీల్ ఇలా ప్రతీదీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్లో కాస్త సన్నగా తయారైన ఆమె అందరినీ ఆకర్షించడమే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. ప్రియాంక చోప్రా ధరించిన అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ వివియన్ వెస్ట్వుడ్కు చెందిన డ్రెస్ ఖరీదు ధర రూ. 2.26 లక్షలు. అలాగే ఆమె ధరించిన క్రిస్టియన్ లౌబౌటిన్ హీల్ ధర 71 వేల రూపాయలు. ఆగండి ఆగండి ఇంకా ఉంది. ప్రియాంక చోప్రా Bvlgari బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో ఆమె ధరించిన Bvlgari బ్రాండ్, రోజ్ గోల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్ ధర రూ. 7.6 లక్షలు. ఇక డైమండ్ చెవిపోగులు ధర తొమ్మిది లక్షలని ఫ్యాన్స్ అంచనా.ఇదీ చదవండి: అపుడు కటిక పేదరికం : ఇపుడు పూలసాగుతో కోట్ల ఆదాయంవిదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, ప్రియాంకకు దేశంపై ఉన్న ప్రేమ పాత్ర అపారం. తన కిష్టమైన గేట్‌వే అంటూ ఒక వీడియోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. అలాగే తన నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ ద్వారా ప్రాంతీయ సినిమాల్లో ముఖ్యమైన చిత్రాలకు సపోర్ట్ చేస్తోంది. నిర్మాతగా మరాఠీ-భాషా డ్రామా చిత్రం పానీకి సంబంధించిన ప్రచార కార్యక్రమానికి స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తన తల్లి మధు చోప్రా , కొత్త పెళ్లికొడుకు, సోదరుడు సిద్ధార్థ్ చోప్రాతో కలిసి పోజులిచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
కళ్లారా చూస్తూ సమన్యాయం
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలసపాలన నాటి కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడిన ప్రస్తుత తరుణంలో న్యాయదేవతకు సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త రూపునిచ్చింది. ఖడ్గధారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించారు. చట్టానికి కళ్లు లేవు అనే పాత సిద్ధాంతాన్ని పక్కనబెట్టి న్యాయదేవతకు ఉన్న గంతలనూ తీసేశారు. కళ్లారా చూస్తూ సమన్యాయం అందించే న్యాయదేవతను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గ్రంథాలయంలో కొలువుతీర్చారు. సీజేఏ డీవై చంద్రచూడ్ ఆదేశానుసారం న్యాయదేవత శిల్పంలో మార్పులు తీసుకొచ్చారు. చట్టం కళ్లులేని కబోదికాదని, బ్రిటిష్ వలస వాసనలను వదిలించుకుని భారత న్యాయవ్యవస్థ ఆధునికతను సంతరించుకోవాలని.. రాజులకాలంనాటి ఖడ్గంతో తీర్పు చెప్పడానికి బదులు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తీర్పు చెప్పినట్లు విగ్రహం ఉండాలని సీజేఐ చేసిన సూచనల మేరకు ఈ మార్పులు జరిగాయి. విదేశీవనిత వేషధారణలోకాకుండా గాజులు, నగలు, నిండైన చీరకట్టుతో అచ్చమైన భారతీయ వనితలా స్వచ్ఛతను స్ఫురణకు తెస్తూ శ్వేతవర్ణ న్యాయదేవతకు తుదిరూపునిచ్చారు. -
పద్దెనిమిదో శతాబ్దం నేపథ్యంలో...
గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ స్టయిల్‌తో మహేశ్‌బాబు కొత్త లుక్‌లోకి మారిన విషయం ఈ మధ్య కాలంలో ఆయన ఫొటోలు స్పష్టం చేశాయి. ఈ లుక్ రాజమౌళి దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమా కోసమేనని తెలిసిందే. ఇక ఈ సినిమా ఎప్పుడు ఆరంభమవుతుంది? అంటే డిసెంబర్లో అని సమాచారం. తాజాగా ఈ చిత్రం నేపథ్యం గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఆ కాలానికి తగ్గట్టుగా హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్లు వేయిస్తున్నారని భోగట్టా. ఈ చిత్రంలో దాదాపు రెండువందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారని, వారంతా ఓ గిరిజన తెగకు సంబంధించినవారనీ టాక్. ఇప్పటికే ఈపాత్రలకు సంబంధించిన నటీనటులను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తున్నారట. ఈ నెలాఖరుకి ప్రధాన తారాగణంతో వర్క్ షాప్స్ మొదలుపెట్టి డిసెంబర్లో షూటింగ్ ఆరంభించాలని అనుకుంటున్నారని సమాచారం. -
లుక్ మార్చిన రౌడీ.. షేక్ అవుతున్న ఇండస్ట్రీ..
-
ఉప్పెన బ్యూటీ.. న్యూలుక్, అస్సలు గుర్తుపట్టలేరు (ఫోటోలు)
-
న్యూ లుక్‌లో రాహుల్.. పీక్‌లో 20 ఏళ్ల పొలిటికల్ కెరియర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా మారారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల సమ్మతి మేరకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.ఈ బాధ్యతలు స్వీకరించి అనంతరం రాహుల్ గాంధీ ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. అతని ఎక్స్‌ప్రెషన్స్‌లో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తోంది. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. వీటిలో తాను ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యానన్న ఆనందం, ఉత్సాహం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి భాగస్వామ్య పార్టీల నేతలంతా హాజరయ్యారు. వారంతా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రకటించిన వెంటనే రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ముఖం వెలిగిపోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ప్రకటనకు ముందు రాహుల్ సమావేశంలో నిశ్శబ్దంగా ఉంటూ అందరి మాటలు ఆలకిస్తూ కనిపించారు.తనను ప్రతిపక్ష నేతగా ఎన్నిక చేసిన అనంతరం రాహుల్ ఆనందంతో తన గుండెపై చేయి వేసుకున్నారు. తరువాత చేతులు జోడించి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో 20 మంది నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 2004లో తొలిసారి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది తొలిసారిగా అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి ఆయన ప్రతిపక్ష నేత పదవిని చేపట్టలేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టారు. -
హీరోయిన్ శ్రీలీల ఇంతలా మారిపోయిందేంటి?
శ్రీలీల ఈ పేరు చెప్పగానే అదిరిపోయే డ్యాన్సులే గుర్తొస్తాయి. ఎందుకంటే 'ధమాకా', 'గుంటూరు కారం' చిత్రాల్లో ఈమె అలా దుమ్ముదులిపేసింది మరి. గతేడాది నుంచి ఈ ఏడాది సంక్రాంతి వరకు వరస సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. అలాంటిది ఈమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడంతో బ్రేక్ తీసుకుందేమోనని అనుకున్నారు. కానీ ఇప్పుడు రవితేజ కొత్త మూవీ లాంచ్‌లో పాల్గొని షాకిచ్చింది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్ రిలీజ్)ఎందుకంటే 'గుంటూరు కారం' వరకు సన్నగా చిన్న పిల్లలా కనిపించిన శ్రీలీల కాస్త ఇప్పుడు కాస్త బొద్దుగా, చబ్బీ లుక్‌లో కనిపించింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొన్నిరోజులు షూటింగ్స్ లేకపోతే ఇలా కాస్త బొద్దుగా మారడం హీరోయిన్లకు అలవాటే. రెండు రోజులు ఎక్సర్సైజ్ చేస్తే మళ్లీ నార్మల్ అయిపోతారు. అదేమంత పెద్దగా మేటర్ కాదు.కానీ శ్రీలీల లేటెస్ట్ లుక్ మాత్రం భలే ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తెలుగులో ఇప్పటికే 'సర్దార్ భగత్ సింగ్' ఒప్పుకొంది. కానీ ఈ మూవీ షూటింగ్ లేటవుతోంది. ప్రస్తుతానికైతే తెలుగులో రవితేజది మాత్రమే చేస్తోంది. తమిళ, హిందీలోనూ త్వరలో నటిస్తుందని అంటున్నార. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్) -
Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్ భీకర రూపం రహస్యం ఇదేనా?
పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పీక్కు చేరింది. ఈ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు గెలుచు కుని మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 2: ది రూల్' పై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమా టీజర్లో అల్లు అర్జున్ నీలి రంగు చీర, నగలు, నిమ్మకాయ దండలతో వెరైటీ లుక్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో అభిమాన హీరో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ ..ఈ మూవీలో లేడీ గెటప్‌తో కనిపించి అలరించాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా అమ్మవారి భీకర రూపంతో ఫ్యాన్స్‌ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఎర్రచందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతుంది కనుక ఇది గంగమ్మ జాతర నేపథ్యమే ఈ లుక్అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ గంగమ్మ జాతర తెలుసుకుందాం రండి. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలని భావిస్తారు. వారం రోజుల పాటు జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గంగమ్మ జాతర విశిష్టత పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించి వేధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కోవడంతో అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసి, పాలెగాడిని అంత మొందించిందని భక్తుల విశ్వాసం. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటారు. ఈ జాతరలో తొలి రోజున బైరాగివేషం ,రెండోరోజు బండవేషం,మూడోరోజు తోటివేషం,నాలుగోరోజు దొరవేషం వేసుకుంటారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి వేషం ధరిస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాళ్ళ వేషం వేస్తారు.మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. పేరంటాలు వేషంలోఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్నితయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచిమట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. బన్నీ న్యూ లుక్ రహస్యం వీడాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు పుష్ప 2: ది రూల్ టీజర్‌కి రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంది. బన్నీ మాతంగి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘మరో బ్లాక్‌బస్టర్..బన్నీకి మరో జాతీయ అవార్డు పక్కా" అని కమెంట్ చేశారు. -
జూనియర్ ఎన్టీఆర్ దేవర.. వైరలవుతోన్న న్యూ లుక్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ షూట్లకు సంబంధించిన జూనియర్ లుక్ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. Making waves in Goa !! 🌊🎵 #Devara @tarak9999 #KoratalaSiva #JanhviKapoor @NANDAMURIKALYAN #RajuSundaram @sabucyril @RathnaveluDop @sreekar_prasad @anirudhofficial @Yugandhart_ @YuvasudhaArts @DevaraMovie @Tseries @Tseriessouth pic.twitter.com/G81lHl1EM8 — NTR Arts (@NTRArtsOfficial) March 22, 2024 -
చీరలు కొన్న వాటిలానే ఉండాలంటే ఇలా చేయండి!
చీరలు వాడుతున్న కొద్దీ కొన్నప్పుడూ ఉన్నట్టు కనపించవు. కలర్ తగ్గిపోయి కట్టుకున్న నలిగిపోతున్నట్లు ఉంటుంది. కొత్త ఉన్నంత షైన్‌గా కనిపించదు. దీంతో ఈ షాపు మంచిది, అది మంచిది అంటూ షాపులు మార్చుతుంటాం. ఎన్ని చోట్లకు తిరిగి కొన్నా అదే తీరులో చీరలు ఉంటాయి. అలా కాకుండా చీరలు కొన్న ప్పుడే ఏ రేంజ్లో మెరుస్తూ కనిపిస్తున్నాయో అలానే ఉండాలంటే కొన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎప్పటికీ కొన్న వాటిలానే ఉంటాయి. ఇక్కడ చీరలు మెయింటైయిన్ చేయడమపైనే ట్రిక్ అంతా దాగి ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే.. ముందుగా చీరలను ఎలా పడితే అలా మడతలు పెట్టొద్దు. అలాగే మడత పెట్టి ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఇలా చేస్తే రంగు మారుతుంది. పైగా చీన ముడతలు ముడతలుగా అయిపోతుంది. ముడతలు పడకుండ మధ్యలో ఒకసారి తీసి తిరిగి మడతపెట్టాలి. వాటిని వెలుతురు పడని ప్రదేశాల్లోనే పెట్టాలి. చీరను ఉతికేటప్పుడూ కూడా జాగ్రత్త పాటించాలి. చీరలు అన్నింటిని ఒకే విధంగా ఉతికితే త్వరగా పాడవుతాయి. వాషింగ్ మిషన్ లో చీరలన్నింటిని ఉతక్కూడదు. కొన్నింటిని మినహాయించాలి. ఎందుకంటే? కొన్ని వాషింగ్ మిషన్‌లో ఉంటే కలర్ దిగిపోయే అవకాశం చీర పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి చీరలను చేత్తో నానబెట్టకుండా ఉతుక్కోవడం మంచిది. ఇంకొన్ని చీరలను ఉతక్కుండా డ్రైక్లీనింగ్‌కు ఇవ్వాలి. అలాగే కొన్ని లైట్ వైట్ చీరలను కొనేటప్పుడే ఎలా ఉతకాలి ఏంటన్నది అడిగి తెలసుకోవాలి. అలాగే ఐరన్ చేయడం వల్ల చీరలకు మంచి లుక్ వస్తుంది కాబట్టి ఐరన్ తప్పనిసరి. ఎక్కువ వేడి మీద అసలు ఐరన్ చేయొద్దు. ఇలా చేస్తే తొందరగా పాడవుతాయి. సిల్క్, పట్టు చీరలు ఐరన్ చేసేటప్పుడు కాటన్ క్లాత్ వేసి ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను తప్పక గుర్తించుకోవాలి ఎంత మంచిగా మెయింటెన్ చేసినా కూడా చీరలపై మరకలు, మడతలు అలాగే ఉంటాయి. దీంతో ఎలా పడితే అలా కాకుండా.. మరకను మాత్రమే క్లీన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెనిగర్, నిమ్మరసం, సబ్బుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని చీరలకు వర్క్ మరికొన్ని చీరలకు స్టోన్స్, ముత్యాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని విడివిడిగా ఉతకాలి. చీర నాణ్యతను బట్టి ఉతకే విధానంలో మార్పులు చేయాలి. లేదంటే అంత కష్టబడి డబ్బులు పెట్టి మరీ చేయించుకున్న వర్క్ పాడయ్యే పోయే ప్రమాదం ఉంటుంది. (చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజర్ట్‌గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..) -
సూపర్ లుక్
‘‘హాలీవుడ్ హీరోలా ఉన్నారు.. సూపర్ లుక్’’ అంటూ మహేశ్‌బాబు తాజా లుక్ గురించి నెటిజన్లు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా మహేశ్‌బాబు తన స్టయిలిష్ లుక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. ముందు నలుపు రంగు సూట్లో ఉన్న ఫొటోలు షేర్ చేసినప్పుడు సూపర్ అంటూ అభిమానులు మురిసిపోయారు. శనివారం గళ్ల చొక్కాతో ఒత్తయిన జుట్టుతో ‘త్రూ ది లెన్స్’ అంటూ మహేశ్ మరో ఫొటోను షేర్ చేయగా, ఆ లుక్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రం కోసం మహేశ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. మహేశ్‌తో పలు రకాల లుక్స్‌ని ట్రై చేస్తున్నారట రాజమౌళి. మరి.. మహేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రాజమౌళి సినిమా లుక్కా? లేక ఏదైనా యాడ్ షూటా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రంలో పలువురు విదేశీ తారలు కూడా నటించనున్నారు. -
మహేష్ నయా లుక్..రాజమౌళి మూవీ కోసమేనా (ఫొటోలు)
-
హాలీవుడ్ హీరో కాదు.. ఫేమస్ బిజినెస్ మ్యాన్ - గుర్తుపట్టారా?
పైన ఫోటోలో చూడగానే పిలక పెట్టుకుని, కళ్ళజోడుతో స్టైల్‌గా కనిపిస్తున్న వ్యక్తి ఏ హాలీవుడ్ హీరో అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఈయన ఇండియాలో ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అయితే ఎందుకు ఈ అవతారమెత్తారు అనే అనుమానం మీలో రావచ్చు? దాని గురించే ఇక్కడ తెలుసుకుందాం.. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్థాపించి, ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసి అతి తక్కువ కాలంలోనే గొప్ప అమ్మకాలను పొందుతూ దూసుకెళ్తున్న ఈయనే ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్'. ఈ పేరు వినగానే ఇప్పుడు గుర్తోచేసి ఉంటుంది, ఈయనే భవిష్ అగర్వాల్ అని.. ఇక ఈ అవతారమెందుకు ఎత్తరనుకుంటున్నారా.. భవిష్ అగర్వాల్ ఆదివారం అబుదాబిలో ఇటీవల ప్రారంభించిన 'బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థకు చెందిన హిందూ మందిర్'ను సందర్శించారు. ఆ సమయంలో ఇలా కనిపించారు. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి భవిష్ అగర్వాల్ ఈ టెంపుల్ సందర్శించిన సందర్భంగా.. ఇది నా జీవిత జ్ఞాపకం అని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. Visiting and speaking at the @BAPS Hindu Mandir in Abu Dhabi was a life memory for me. It is such a historic moment of two civilisations coming together and thankful to be there to witness it🙏🏼 pic.twitter.com/rfHh8x4eJ3 — Bhavish Aggarwal (@bhash) February 18, 2024 -
న్యూ లుక్‌లో హీరోయిన్ హానీ రోజ్.. ఫోటోలు వైరల్
-
MS Dhoni New Look Photos: ధోనీ న్యూ లుక్ అదిరింది (ఫొటోలు)
-
కొత్త లుక్‌లో ఎయిర్ఇండియా విమానాలు - ఫోటోలు వైరల్
టాటా గ్రూప్ ఎయిర్ఇండియాను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని అభివృద్ధిలో భాగంగా అనేక మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు లోగో, ఎయిర్‌క్రాఫ్ట్ లివరీలో మార్పులు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త డిజైన్ పొందిన ఎయిర్ఇండియా విమానాల ఫోటోలను సంస్థ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డిజైన్ పొందిన కార్లు త్వరలోనే వినియోగంలోకి రానున్నట్లు సమచారం. ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లోని వర్క్‌షాప్‌లో కొత్త లోగో, డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఏ350 విమానం ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. ఈ లేటెస్ట్ విమానాలు ఈ శీతాకాలం నాటికి భారత్‌కు రానున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇప్పటికే ఉన్న విమానాలు కూడా ఈ డిజైన్ పొందుతాయని, దీని కోసం దాదాపు 400 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని సమాచారం. సంస్థ విమానాలన్నీ కూడా 2025 నాటికి ఈ డిజైన్ పొందుతాయని తెలుస్తోంది. ఇదీ చదవండి: అంబానీ కంపెనీతో ఏడీఏఐ డీల్.. వేలకోట్లు పెట్టుబడికి సిద్ధం! ఎయిర్ ఇండియా తన కొత్త లోగో, ది విస్టా, గోల్డ్ విండో ఫ్రేమ్ నుంచి ప్రేరణ పొందిందని ఇంతకుముందు పేర్కొంది. అయితే దీనిని పూర్తిగా మార్చడానికి కంపెనీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే కొత్త లివరీ అండ్ డిజైన్‌లో ముదురు ఎరుపు, వంకాయ, గోల్డ్ కలర్స్ అందిస్తోంది. ఇవి చూడటానికి కొత్తగా ఆకర్షణీయంగా ఉన్నాయి. Here's the first look of the majestic A350 in our new livery at the paint shop in Toulouse. Our A350s start coming home this winter... @Airbus #FlyAI #AirIndia #NewFleet #Airbus350 pic.twitter.com/nGe3hIExsx — Air India (@airindia) October 6, 2023 -
స్లిమ్‌గా హీరోయిన్ ప్రియమణి.. షాకవుతున్న నెటిజన్లు (ఫోటోలు)
-
పండగ కిక్కు.. కొత్త లుక్కు
వినాయక చవితికి వినాయకుడికి విభిన్న రకాల వంటకాలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అలాగే ఈ పండక్కి వినాయకుడిని స్మరించుకుంటూ ‘పండగ కిక్కు..కొత్త లుక్కు’ అంటూ కొందరు సినిమా యూనిట్ వారు పలు రకాల అప్డేట్స్ ఇచ్చారు. వీటిలో కొన్ని ఈ విధంగా.. బీచ్‌లో సైంధవ్ బీచ్‌లో సేద తీరు తున్నారు వెంకటేశ్. ఆయన హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూ΄పొందుతున్న ‘సైంధవ్’ కొత్త పొస్టర్ విడుదలైంది. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా నటిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, తమిళ నటుడు ఆర్య, బాల నటి సారా కీలక పా త్రధారులు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్. వీడు టైగర్... రవితేజ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని రెండో పా ట ‘వీడు..’ను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించి, రవితేజ పొస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. రామ్.. కల్ట్ మామా ‘బిట్టు బిట్టు బాడీ మొత్తం రెడ్డూ చిల్లి సాల్టు..’ అంటూ సాగే పా ట ‘స్కంద’ చిత్రంలోనిది. రామ్ హీరోగా బోయపా టి శ్రీను దర్శకత్వంలో రూ΄పొందుతున్న చిత్రమిది. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లు. ఈ సినిమాలో రామ్, ఊర్వశీ రౌతేలా కాంబినేషన్లో వచ్చే ప్రత్యేక గీతం ‘కల్ట్ మామా’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా హేమచంద్ర, రమ్య బెహ్రా, మహా పా డారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ల సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. టీజర్ రెడీ ‘యానిమల్’ మూవీ టీజర్ రెడీ అవుతోంది. ఈ నెల 28న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించి, ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ పొస్టర్‌ను విడుదల చేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్. భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 1న, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. మది దోచేసిందే... ‘మాయే చేసి మెల్లగా మది దోచేసిందే సిన్నగా...’ అంటూ హీరో కల్యాణ్ రామ్ పా డారు. కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ నటిస్తున్న ‘డెవిల్’లోని పా ట ఇది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నవంబరు 24న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి ‘మాయే చేశావే..’ పా ట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరకల్పనలో ఆర్వీ సత్య రాసిన ఈ పా టను సిధ్ శ్రీరామ్ పా డారు. దేఖో ముంబై దోస్తీ మజా... కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ‘దేఖో ముంబై దోస్తీ మజా..’ పా ట లిరికల్ వీడియోను హీరో రవితేజ రిలీజ్ చేశారు. అమ్రిష్ గణేష్ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్, మేఘ్ ఉట్– వాట్ సాహిత్యం అందించగా, అద్నాన్ సమీ, పా యల్ దేవ్ ఈ పా టను పా డారు. అంజనాద్రిలో... తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన ‘హను–మాన్’ పొస్టర్ రిలీజైంది. ‘‘అంజనాద్రి అనే ఊహాత్మక ప్రదేశంలో ఈ సినిమా ఉంటంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. -
గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్
హీరో అంటే ఫ్యాన్స్‌కి స్టయిలిష్‌గా కనబడాలి.. హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్, వాకింగ్... ఇలా అన్నీ స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే అన్నట్లు ఉండాలి. ఫ్యాన్స్ ఇలానే కోరుకుంటారు. కానీ తమ హీరోని ‘గుండు’లో చూడాలనుకోరు. ఒకవేళ గుండులో కనిపించే క్యారెక్టర్ చేస్తున్నారని తెలిస్తే ‘బాగుండునా!’ అని చర్చించుకుంటారు. చివరికి లుక్ చూశాక ఈ క్యారెక్టర్ చేస్తే ‘బాగుండు’ అనుకుంటారు. మరి.. గుండులోనూ స్టయిలిష్‌గా కనిపిస్తే ఎందుకు కాదంటారు. ఇక ఈ లుక్‌లో చిరంజీవి, మోహన్‌లాల్, ధనుష్ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. భోళా శంకర్‌లో... వెండితెరపై ఇప్పటివరకూ చిరంజీవి గుండుతో కనిపించలేదు.. ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ డిమాండ్ చేసింది.. అంతే.. గుండుతో కనిపించడానికి రెడీ అయ్యారు. ఆ సినిమా ‘భోళా శంకర్’. అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వేదాళం’కి రీమేక్ ఇది. తమిళ వెర్షన్లో అజిత్ పూర్తి గుండుతో కనిపించలేదు... అయితే దాదాపు ‘హెడ్ షేవ్’ చేసుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం నున్నటి గుండుతో కనిపించనున్నారు. అయితే జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్ మేకప్‌తో చిరంజీవి గుండు లుక్‌ని మౌల్డ్ చేశారు టెక్నీషియన్స్. ఆ వీడియోను చిరంజీవి షేర్ చేసి, నిపుణుల పని తీరుని మెచ్చుకున్నారు కూడా. ఇక మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి ఫ్లాష్‌బ్యాక్‌లో గుండుతో కనిపిస్తారట. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా కథానాయికగా, ఆయన చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్ చేస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. నిధిని కాపాడే బర్రోజ్ ఒక నిధిని కాపాడే పని మీద ఉంటాడు బర్రోజ్. వాస్కోడగామా దాచిన నిధి అది. వాస్కోడగామా నిజమైన వారసునికి మాత్రమే ఆ సంపద దక్కాలి. వారికి నిధిని అప్పగించే బాధ్యతను తీసుకున్న బర్రోజ్ 400 ఏళ్లుగా ఆ నిధిని కాపాడుకుంటూ వస్తాడు. ఈ కథతో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. టైటిల్ రోల్లో నటిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు మోహన్ లాల్. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. గుండు, గుబురు గడ్డంతో మోహన్‌లాల్ గెటప్ ఈ సినిమాలో డిఫరెంట్‌గా ఉంటుంది. బాలల చిత్రంలా రూపొందిస్తున్నారనీ, పెద్దలనూ ఆకట్టుకునే విధంగా ఉంటుందని సమాచారం. భారతీయ తొలి త్రీడీ చిత్రం ‘మై డియర్ కుట్టి సైతాన్’ దర్శకుడు జీజో పున్నూస్ ఈ త్రీడీ ‘బర్రోజ్’కి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఈ ఏడాది ఓనమ్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. యాభైయ్యవ సినిమాలో గుండుతో... నటుడిగా కెరీర్లో 50వ మైల్ స్టోన్ చేరుకున్నారు ధనుష్. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. అయితే డైరెక్టర్‌గా ఆయనకిది తొలి చిత్రం కాదు. దర్శకుడిగా ‘పవర్ పాండీ’ (2017) మొదటి చిత్రం. ఆ చిత్రంలో ఓ అతిథి పాత్ర కూడా చేశారు. ఐదేళ్ల తర్వాత ధనుష్ మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలో గుండుతో కనిపించనున్నారట. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఆరంభమైంది. చిత్రీకరణ ఆరంభించక ముందు తిరుమల వెళ్లి ధనుష్ తలనీలాలు సమర్పించుకున్నారు. ఎలానూ ఈ చిత్రంలో గుండుతో కనిపిస్తారు కాబట్టి దైవాన్ని దర్శించుకుని, తల నీలాలు సమర్పించి ఉంటారని కోలీవుడ్ అంటోంది. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
షాకింగ్ లుక్‌లో హీరోయిన్ మెహ్రీన్
-
హీరోయిన్ మెహ్రీన్‌కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి?
ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా అందం కూడా అంతే ముఖ్యం. అందుకే హీరో,హీరోయిన్లు ఫిట్నెస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్‌లో గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా మెస్మరైజ్ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే సో బెటర్ అంటున్నారు. చదవండి: కమెడియన్ మనోబాల మృతికి కారణం ఇదేనా?.. ఆ వ్యసనం వల్లేనా? తాజాగా ఈ లిస్ట్‌లో మెహ్రీన్ కూడా చేరింది. ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఈ మధ్యకాలంలో బాగా సన్నబడింది. వర్కవుట్స్, డైట్ పాటిస్తూ జీరో సైజ్‌కి వచ్చేసింది. లేటెస్ట్గా తన లుక్‌కి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసి.. మెహ్రీన్‌కు ఏమైంది ఇంత సన్నబడింది? అయినా ఒకప్పటిలా బొద్దుగా ఉంటేనే బాగుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్‌మన్ కుటుంబానికి ఆర్థికసాయం -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ నయా లుక్.. ఏ కాలేజ్ అన్నా..?
ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఒకరు. ఆయన అందం గురించి ఎంత చెప్పిన తక్కువే. వయసుతో పాటు అందం కూడా పెరుగుతుందా అన్నట్లుగా మహేశ్ కనిపిస్తాడు. ప్రస్తుతం ఆయన ఏజ్ 47 ఏళ్లు. అయినా పాతికేళ్ల కుర్రాడిలా కనిస్తాడు. మహేశ్ కొడుకు గౌతమ్‌ని పక్కన నిలబెడితే ఇద్దరు అన్నదమ్ముల్లా కనిపిస్తారు. అందుకే కాబోలు ఇప్పటికీ మహేశ్ అంటే అమ్మాయిలకు పిచ్చి ప్రేమ. నమ్రతను చూసి ఈర్షపడే అమ్మాయిలు చాలానే ఉన్నారు. ఇక తాజాగా మహేశ్ నయా లుక్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఒట్టో బ్రాండ్ షర్ట్స్ యాడ్ కోసం ఫోటో షూట్ చేశాడు మహేశ్. దానికి సంబంధిన ఫోటోలను ట్వీటర్లో షేర్ చేశాడు. అందులో మహేశ్ న్యూలుక్లో మరింత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబు యాడ్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ఏ కాలేజ్ అన్నా?’ ‘ఇంజనీరింగ్ స్టూడెంట్‌లా ఉన్నావ్’, ‘గ్రీకువీరుడు’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మహేశ్ ప్రస్తుతం తివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. పూజాహెగ్డే హీరోయిన్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా 2024, జనవరి 13న విడుదల కానుంది. Life in luxury! #Otto pic.twitter.com/aSiJUTWVTT — Mahesh Babu (@urstrulyMahesh) April 6, 2023 -
అమెరికాలో జూ. ఎన్టీఆర్ సందడి.. తారక్ కొత్త లుక్ చూశారా?
ఆస్కార్ అవార్డు కార్యక్రమం నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ టీం అమెరికాలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు వరుసగా హలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తున్నారు. వేరుగా వేరుగా ఇంటర్య్వూలు ఇస్తున్న చరణ్, తారక్‌లు అవకాశం వస్తే హాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమేనంటూ ఆ దిశగా తమని తాము ప్రమోట్ చేస్తుకుంటున్నారు. అంతేకాదు తరచూ ఫొటోషూట్లకు ఫోజులు ఇస్తున్నారు. చదవండి: ‘బలగం’ మూవీపై చిరంజీవి రివ్యూ, ఏమన్నారంటే.. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ ఇచ్చిన ఫొటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదివరకు ఎన్నడు తారక్‌ను ఇలా చూడలేదంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సూట్లో తారక్ మాసివ్ క్లాసీ లుక్‌ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎన్టీతార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో ఆయన న్యూలుక్ క్షణాల్లో వైరల్‌గా మారింది. బ్లూ కలర్ సూట్‌తో తారక్ చాలా క్లాసీగా, కూల్‌గా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: తొలిసారి విమానం ఎక్కిన గంగవ్వ హడావుడి చూశారా? ట్రెండింగ్‌లో వీడియో కాగా ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కాటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆదివారం జరిగే ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ ఖాయమంటూ తెలుగు ప్రేక్షకులంతా ధీమా వ్యక్తి చేస్తున్నారు. ఆస్కార్ ఒక్క అడుగు చేరువలో ఉన్న ఆర్ఆర్ఆర్కు ఈ అవార్డు వరిస్తుందా? లేదా? అని భారత ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుని అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టించింది. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సుధీర్ బాబు, కొత్తలుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో సుధీర్ బాబు ఫలితాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన యాక్షన్ ఫిలింతో అలరించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన హంట్ బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం ప్లాప్‌గా నిలిచింది. ఇక సుధీర్ బాబు తన తదుపరి సినిమాను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఆయన మామ మశ్చీంద్ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఇందుకోసం ప్రమోగం చేస్తున్నాడని అప్పట్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్, ఫిట్నెస్ లుక్‌తో ఆకట్టుకున్న సుధీర్ బాబు ఈ సినిమా కోసం బొద్దుగా తయారయ్యాడు. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో తన లుక్‌ను తాజాగా విడుదల చేసి ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. దీనికి ‘బెట్.. ఇలా వస్తానని మీరు అనుకుని ఉండరు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. లావుగా ఉన్న సుధీర్ బాబుని ఇలా చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఇలా ట్విస్ట్ ఇచ్చావేంటి భయ్యా అంటూ నెటిజన్లు అతడి పోస్ట్ కామెంట్స్ చేస్తున్నారు. Bet you didn't see this coming 😉 Meet Durga! #MaamaMascheendra@HARSHAzoomout @chaitanmusic @pgvinda #SunielNarang @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/IWhVydn4ie — Sudheer Babu (@isudheerbabu) March 1, 2023 -
Anasuya Bharadwaj : కొత్త లుక్ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ అనసూయ..ఫోటోలు వైరల్
-
నిఖిల్ సిద్ధార్థ్ న్యూ లుక్.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవల 18 పేజెస్ మూవీతో మరో హిట్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ-2 తర్వాత ఆయన నటించిన చిత్రం ఇదే. ప్రస్తుతం 18 పేజెస్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో.. మరో మాస్ లుక్‌తో అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రేక్షకులను మరోసారి థియేటర్లలో పలకరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన నిఖిల్ లుక్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. ఈ విషయాన్ని హీరో సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోస్టర్‌ను గమనిస్తే.. అందులో నిఖిల్ గన్ పట్టుకుని సీరియస్‌లో లుక్‌లో కనిపించారు. నిఖిల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అఫీషియల్ లీక్.. కార్తికేయ-2 తర్వాత భారీ చిత్రంతో మీ ముందుకు వస్తున్నా. మల్టీ లాంగ్వేజ్ స్పై థ్రిల్లర్ ఈ వేసవిలో మీ ముందుకు రానుంది.' అంటూ పోస్ట్ చేశారు. నిఖిల్ లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ సినిమా కోసం వెయిటింగ్ అని కొందరు.. మరికొందరేమో పోస్టర్ చూడగానే బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
విజయ్ సేతుపతి షాకింగ్ లుక్ వైరల్, అవాక్కవుతున్న ఫ్యాన్స్
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగానే కాదు విలన్‌గానూ సత్తా చాటుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వెండితెరపై ఆయన విలక్షణ నటనకు ప్రతి ప్రేక్షకుడు ఫిదా అవుతున్నారు. ఇక ఉప్పెన మూవీతో తెలుగులో విలన్‌గా పరిచమైన ఆయన త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి. చదవండి: పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు ఇదిలా ఉంటే స్టార్ నటుడిగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఆయన లావుగా ఉండటం వల్ల తరచూ బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటుంటాడు. కాస్తా శరీరంపై శ్రద్ధ పెట్టాలని, డైట్ ఫాలో అవ్వు బ్రో అంటూ నెటిజన్లు ఆయనకు సూచిస్తుంటాడు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి నయా లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో విజయ్ సేతుపతి స్లీమ్‌గా హీరోలా కనిపించి ట్రోలర్స్‌కి షాకిచ్చాడు. ఇక ఆయన కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. దీంతో ఆయన ఫొటోను పలు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్ పేజీలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vijay Sethupathi (@actorvijaysethupathi) -
మంచు మనోజ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడా? ఫోటో వైరల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత మనోజ్ ఇంతవరకు సినిమా చేయలేదు. ఆ మధ్య ‘అహం బ్రహ్మాస్మి’ అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించినా ఇంతవరకు అది పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా తాజాగా మనోజ్ షేర్ చేసిన ఓ లెటెస్ట్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో ఉన్న ఫోటోను షేర్చేసిన మనోజ్ త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇది సినిమాలోని స్టిల్ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ మనోజ్ మాత్రం తన నెక్ట్స్ మూవీ గురించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ‘అహం బ్రహ్మాస్మి’ గురించి అప్డేట్ అడగ్గా.. మనోజ్ ఒక స్మైలీ ఎమోజీని షేర్ చేశాడు. మరి ఈ ప్రాజెక్ట్ నుంచి మనోజ్ తప్పుకున్నాడా? లేక మరైదేనా సినిమా అనౌన్స్ చేయనున్నాడా అన్నది చూడాల్సి ఉంది. Adios amigo 🙌🏽 pic.twitter.com/vSSnbL0Sxd — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 8, 2022 -
స్పోర్టీ లుక్‌లో 2023 కవాసాకి నింజా 650 బైక్: ధర తెలిస్తే షాకే!
సాక్షి, ముంబై: కవాసాకి మోటార్స్ స్పోర్ట్స్ బైక్ లవర్స్‌ను అకట్టుకునేలా కొత్త వెర్షన్ బైక్‌ను ఆవిష్కరించింది. కొత్త 2023 కవాసాకి నింజా 650ని భారతీయ మార్కెట్లో తీసుకొచ్చింది నింజా మిడ్-లెవల్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో మార్కెట్లో మాంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో సరికొత్తగా తీర్చి దిద్ది స్పోర్టీ డిజైన్, కొత్త ఫీచర్లు, అప్డేట్స్తో కొత్త కవాసాకి 2023 నింజా 650నిలాంచ్ చేసింది. లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్! మీరు అంతేనా?తస్మాత్ జాగ్రత్త! 2023 కవాసాకి నింజా 650 ఇంజీన్, ఫీచర్లు స్పోర్టీ లుక్‌లో తీసుకొచ్చిన ఈ బూక్‌లో 649 సీసీ పార్లల్-ట్విన్ ఇంజన్‌ను జత చేసింది. ఇది 8,000 rpm వద్ద 68 పవర్‌ను, 6,700 rpm వద్ద 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే విండ్‌షీల్డ్‌ను కొత్తగా డిజైన్ చేసింది. కొత్త డిజిటల్ TFT కలర్ ఇన్స్ట్రుమెంటేషన్, కాక్‌పిట్‌కు హై-టెక్, హై-గ్రేడ్ లుక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్లో ఇచ్చిన బ్లూటూత్ టెక్నాలజీతో రైడర్లు తమ బైక్‌ను వైర్‌లెస్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇంకా కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్‌తోపాటు, ట్విన్ ఎల్ఈడీ హెడ్లైట్లు,కొత్త డన్లప్ స్పోర్ట్‌మ్యాక్స్ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లు అందించింది. (ఎయిర్‌పాడ్స్ మిస్, స్మార్ట్ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?) ధర, లభ్యత దేశంలో ఈ బైక్ ధరను రూ.7.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ధర నిర్ణయించింది కవాసకి మోటార్స్. అన్ని అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద ఇప్పటికే కొత్త నింజా 650 బుకింగ్‌లు మొదలు కాగా, డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. -
సమంత సర్జరీ చేసుకుందా? సామ్ న్యూలుక్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్
స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ధా కాలం దాటిన ఇప్పటికీ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతూనే ఉన్నాయి. ఆమెకు ముందు, ఆమె తర్వాత వచ్చిన హీరోయిన్లు అవకాశాలు లేక ఫేడ్అవుట్ అయ్యారు. కానీ సామ్ మాత్రం ఇప్పటికీ ఆఫర్స్ క్యూ కడుతూనే ఉన్నాయి. ఇక గతేడాది స్టార్ హీరో నాగచైతన్యతో విడిపోయిన ఆమె తరచూ ఏదోకరకంగా వార్తల్లో నిలుస్తోంది. చదవండి: ఆల్భమ్ సాంగ్‌లో రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. తీవ్ర వ్యతిరేకత.. కేసు నమోదు ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది సమంత. తెలుగు, తమిళ్, హిందీతో పాటు ఓ హాలీవుడ్ చిత్రానికి సంతకం చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేసే పనిలో ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో సామ్ సర్జరీ కోసమే విదేశాలకు వెళ్లిందంటూ ఆ మధ్య పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో సామ్ న్యూలుక్ చర్చనీయాంశమైంది. తాజాగా ఓ ప్రకటనలో సామ్‌ను చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో సామ్ ముందుకంటే కాస్తా భిన్నంగా కనిపిస్తోంది. చదవండి: పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా? సదరు ప్రకటనలో సామ్ డిఫరెంట్‌గా కనిపించడం చూసి ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏంటీ సామ్ ఇలా మారిపోయింది! సర్జరీ చేసుకుందా?’ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద చిత్రాల షూటింగ్లో పాల్గొంటుంది. హాస్టారికల్ పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న శాకుంతలం షూటింగ్ చివరి దశకు చేరుకోవడమే కాదు డబ్బింగ్ వర్క్‌ను కూడా జరుపుకుంటోంది. View this post on Instagram A post shared by Drools (@droolsindia) -
అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మహేష్‌బాబు.. వైరల్ అవుతున్న ఫోటో
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌కు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో మహేష్ గతంలో ఎన్నడూ చేయలేని మాస్ పాత్రలో కనిపించనున్నాడట. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్న మహేశ్ తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ ఆలీమ్ హకీమ్ మహేశ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో ఆ పిక్ వైరల్‌గా మారింది. వయసు పెరుగుతున్నా రోజురోజుకి మరింత యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) -
స్టార్స్ మేకోవర్, న్యూ లుక్కు.. వెరీ కిక్కు
అభిమాన హీరోలు కొత్తగా కనబడితే ఫ్యాన్స్‌కి ఓ కిక్. అయితే ప్రతి సినిమాకీ కొత్తగా కనిపించడం కుదరదు. వెరైటీ క్యారెక్టర్ చేసినప్పుడు కొత్త లుక్ ట్రై చేస్తుంటారు. సూపర్ స్టార్ ట్యాగ్ ఉన్న ఇద్దరు హీరోలు రజనీకాంత్, మహేశ్‌బాబు ఇప్పుడు కొత్త హెయిర్ స్టయిల్ ట్రై చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫిజిక్‌ని మార్చుకుంటున్నారు. ఇంకా నేచురల్ స్టార్ నానీతో పాటు మరికొందరు హీరోలు కూడా ఫిజికల్‌గా మేకోవర్ అయ్యారు. ‘న్యూ లుక్కు.. వెరీ కిక్కు’ అంటూ వీరు కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. రజనీకాంత్ చాలా సింపుల్.. తెల్ల జుట్టు, నెరిసిన గడ్డంతోనే కనిపిస్తారు. కానీ సినిమాల్లో నల్లటి విగ్గుతో స్టయిలిష్‌గా కనబడతారు. అయితే ఇప్పటివరకూ కనిపించినట్లుగా కాకుండా ‘జైలర్’ సినిమాలో కొత్త రకం హెయిర్ స్టయిల్‌తో ఆకట్టుకోనున్నారు. ముంబైకి చెందిన హెయిర్ స్టయిలిస్ట్ హకీమ్ అలీమ్ ఈ సూపర్ స్టార్‌ని కొత్త రకం హెయిర్ స్టయిల్లో చూపించనున్నారు. రజనీతో హకీమ్ ఓ ఫొటో దిగి, కొత్తగా చూపించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పినప్పటి నుంచి ఈ సినిమాలో తమ అభిమాన హీరో గెటప్ విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. చదవండి: నెట్టింట దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్.. ఉలిక్కిపడ్డ యాంకరమ్మ అయితే దానికి ఇంకా సమయం ఉంది. ఎందుకంటే ఇంకా షూటింగే ఆరంభం కాలేదు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇక తెలుగు విషయానికొస్తే.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో అక్కడక్కడా తెల్ల జుట్టుతో కొత్తగా కనిపించనున్నారు మహేశ్. రజనీకి హెయిర్ స్టయిల్ చేస్తున్న హకీమ్ అలీమ్నే మహేశ్‌కి ఈ హెయిర్ స్టయిల్ చేస్తున్నారు. ఆ ఫొటోను నాలుగైదు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు కూడా. ఇక ‘శనివారం ఉదయం ఇలా కూల్‌గా పూల్‌లో’ అంటూ చొక్కా లేకుండా మహేశ్‌బాబు ఓ ఫొటో షేర్ చేశారు. కొంచెం బీస్ట్ (దృఢంగా) లుక్‌లో కనిపించారు. దాంతో త్రివిక్రమ్ సినిమాలో కొత్త హెయిర్ స్టయిల్లోనే కాదు.. ఫిజిక్ పరంగా కూడా కొత్తగా కనిపించనున్నారని ఊహించవచ్చు. పైగా మేకోవర్ కోసం ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌ని నియమించుకున్నారు మహేశ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నెక్ట్స్ సినిమా షూటింగ్‌లోకి ఎంటరయ్యేలోపు ఫ్యామిలీతో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు మేకోవర్ మీద కూడా దృష్టి పెట్టారట ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్‌లో కనిపిస్తారట. దాదాపు పది కిలోలు బరువు తగ్గాలని టార్గెట్‌గా పెట్టుకున్నారని భోగట్టా. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో ఎన్టీఆర్ డార్క్ మేకప్‌తో డిఫరెంట్‌గా కనిపించనున్నారు. చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన మరోవైపు గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ‘దసరా’ చిత్రం కోసం నాని పూర్తిగా మారిపోయారు. ఈ చిత్రంలో ఊర మాస్లో లుక్‌లో నాని కనిపిస్తారు. కొంచెం పెరిగిన జుట్టు, బరువు తగ్గిన ఫిజిక్‌తో నాని మేకోవర్ అయ్యారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఇంకోవైపు ‘ఏజెంట్’ కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ ఫిజిక్‌కి మారిపోయారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ఈ నెల 25న విడుదల కానున్న ‘లైగర్’లో బాక్సర్‌లా కనిపించడానికి విజయ్ దేవరకొండ ఫిజిక్‌ని మార్చుకున్నారు. ఇంకా పలువురు హీరోలు పాత్రకి తగ్గట్టు లావుగా లేక సన్నగా కనిపించే ప్రయత్నాల్లో ఉన్నారు. హెయిర్ స్టయిల్ పరంగానూ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ కొత్త మేకోవర్ ఫ్యాన్స్‌కి కిక్కో కిక్కు. -
ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు
సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ సొంతమైన ఇన్‌స్టాగ్రామ్‌లో అవతార్‌ని క్రియేట్ చేసుకోవడం ఇపుడు చాలా ఈజీ. ఫేస్బుక్, ఇన్‌స్టాలో మనకు నచ్చిన అవతార్ సృష్టించుకునే అవకాశాన్ని మెటా కల్పించింది. తద్వారా మన స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన అవతార్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. (Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?) ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్ ఇలా.... ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్‌ను క్రియేట్ చేసుకోవడానికి... ♦ మీ ప్రొఫైల్లోకి వెళ్లిన తరువాత స్క్రీన్ రైట్ కార్నర్‌లోని హంబర్గర్ మెనూ క్లిక్ చేయాలి. ♦ ఎకౌంట్–అవతార్‌లోకి వెళితే ‘అవతార్ మేకింగ్ స్క్రీన్’ ఓపెన్ అవుతుంది. ♦ స్కిన్ టోన్‌ను ఎంపిక చేసుకొని మీ ఇన్‌స్టా అవతార్‌ను తయారు చేసుకోవాలి. ♦ మీ అవతార్‌కు మీకు ఓకే అనిపిస్తే...స్క్రీన్ టాప్‌రైట్ కార్నర్‌లోని ‘డన్’ క్లిక్ చేయాలి. ♦ ఫేస్స్ట్రక్చర్, హెయిర్ స్టైల్, నోస్షేప్... మొదలైన ఆప్షన్స్‌ను యూజర్ ఎంపిక చేసుకోవచ్చు. ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ స్నాప్‌చాట్ ఇండియాలో స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్‌ను నెలకు కేవలం 49 రూపాయలకే అందిస్తోంది. దీంతో పాటు అనేక ప్రత్యేక ఫీచర్లను కూడా యూజర్లకు అందిస్తోంది. స్నాప్‌చాట్+లో ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్ మెసేజింగ్ అండ్ అప్డేట్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ స్నాప్‌చాట్ ‘స్నాప్‌చాట్ ప్లస్ సబ్స్క్రిప్షన్’ సర్వీస్‌ను లాంచ్ చేసింది. దీనిలో భాగంగా యూజర్లు ఎక్స్‌క్లూజివ్, ఎక్స్పెరిమెంటల్, ఫ్రీ రిలీజ్ ఫీచర్లతో యాక్సెస్ కావచ్చు. రీవాచ్ ఇండికేటర్, బ్యాడ్జ్, కస్టమ్ యాప్ ఐకాన్స్, బెస్ట్‌ఫ్రెండ్స్ ఫర్ఎవర్, ఘోస్ట్ ట్రయల్స్ ఆన్ స్నాప్ మ్యాప్, సోలార్ సిస్టమ్...అనే ఆరు ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది. సబ్స్క్రిప్షన్ సర్వీస్‌లోకి వచ్చాం అనేదానికి సూచనగా యూజర్ ప్రొఫైల్‌లో స్నాప్‌చాట్ ప్లస్ బ్యాడ్జ్, స్టార్లు కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: Anand Mahindra: వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, భార్య జంప్, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్ -
న్యూలుక్ లో టీమిండియా దిగ్గజం
-
RC15: భిన్నమైన లుక్‌లో రామ్ చరణ్, వీడియో వైరల్
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని, వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్. అయితే ఇప్పటికీ ఈ మూవీ టైటిల్ ఖారారు కాలేదు. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’, ‘సర్కారోడు’, ‘అధికారి’ వంటి టైటిల్స్‌ను చిత్ర బృందం పరిశీలిస్తుందని వినికిడి. చదవండి: మూవీ సక్సెస్.. దర్శకుడికి మాయోన్ మూవీ నిర్మాత సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే శంకర్ సినిమా అంటే అందులో హీరోలు విభిన్న లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా ఇందులో చరణ్ లుక్‌పై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రంలోని చరణ్‌కు సంబంధించిన ఓ షాకింగ్ లుక్ బయటకు వచ్చింది. చరణ్‌కు మేకప్ చేస్తున్న వీడియో క్లిప్ ఇది. ఇందులో చెర్రిని సగం మాత్రమే కనిపించేలా వీడియోను వదిలారు. గుబురు గడ్డం, కళ్ల జోడుతో సరికొత్త లుక్‌లో దర్శనం ఇచ్చాడు చరణ్. ఇక సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు టచప్ చేస్తున్నట్లుగా ఈ వీడియో క్లిప్ ఉండటంతో మెగా ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. A New Vibe , A New Hairstyle, A New Look and Definitely A New #RamCharan 🔥🔥#RC15 RAMpage ⏳#ManOfMassesRamCharan @AlwaysRamCharan pic.twitter.com/RE3umDJjjo — SivaCherry (@sivacherry9) July 2, 2022 -
మారుతి ఆల్టో: స్పార్క్ లుక్, రెట్రో డిజైన్, ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: జపనీస్ కార్ మేకర్ మారుతి సుజుకి పాపులర్ మోడల్ కారు ఆల్టోను రెట్రో డిజైన్‌లో తీర్చిదిద్ది జపాన్‌లో లాంచ్ చేసింది. సుజుకి ఆల్టో లాపిన్ ఎల్సీ పేరుతో సరికొత్తగా ఫోర్ వీలర్ డ్రైవ్ వేరియంట్‌గా ఈ కారును తీసుకొచ్చింది. ఇండియాలో విక్రయిస్తున్న అత్యంత పాపులర్ కారు ఆల్టోతో పోలిస్తే డిజైన్, స్పెసిఫికేషన్స్‌లో భారీ మార్పులు చేసింది. స్పార్క్ లుక్, రెట్రో డిజైన్‌తో ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, టిల్ట్ ఫంక్షన్‌తో కూడిన స్టీరింగ్ వీల్‌ను అమర్చింది. ముఖ్యంగా 660 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో 3-సిలిండర్ గ్యాసోలిన్ ఇంజన్‌తో అమర్చింది. ఈ ఇంజిన్ సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే కలిపి వస్తుందట. ఇది 63 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కీలెస్ ఎంట్రీ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఉంది. అలాగే డ్యాష్‌బోర్డ్ Apple CarPlay లేదా Android Autoకి అనుగుణంగా 7 అంగుళాల డిజిటల్ టచ్‌స్క్రీన్‌తో పాటు రివర్సింగ్ కెమెరాను కూడా అందిస్తోంది.. డ్రైవర్ డిస్ప్లేలో డిజిటల్, మైలేజ్, పవర్ రిజర్వ్ ఇతర సంబంధిత డేటాను అందిస్తుంది. జపాన్‌లో ఆల్టో లాపిన్ ఎల్సీ కారు ధర 14 లక్షల ప్రారంభ ధరగా నిర్ణయించింది. ఆ ల్టో లాపిన్ ఎల్సీ, ఆల్-వీల్ డ్రైవ్ , ఆల్-వీల్ డ్రైవ్ రెండు ఆప్షన్లలో ఇది లభించనుంది. అయితే జపాన్ కీ కార్లు, లేదా మినీవాన్ల మోడల్స్ మాదిరిగా ఉన్న ఈ కారు ఇండియా లాంచింగ్‌పై ఇప్పటికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే కొన్ని స్పెసిఫికేషన్స్‌లో కొన్ని మార్పులు చేసిన అనంతరం ఇండియాలో లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. ఈమేరకు దీని ధర 10 లక్షలకు దగ్గరగా ఉండనుందని అంచనా. -
'మాచర్ల నియోజకవర్గం' నుంచి నితిన్, కృతిశెట్టి కొత్త లుక్..
Nithin Krithi Shetty New Look From Macherla Niyojakavargam: నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చివరి పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ నితిన్, కృతీశెట్టి లుక్ విడుదల చేసింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిది. పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మిగిలిన ఒక పాటను త్వరలో చిత్రీకరించనున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ 12న సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు Except for one song, the entire talkie part of @actor_nithiin's #MacherlaNiyojakavargam has been completed ✅🔥 Ready to take charge on Theatres from August 12th! ⚠️💥#MNVFromAug12th ✨@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #MahathiSwaraSagar @SreshthMovies @adityamusic pic.twitter.com/WyIlhS1d9E — Sreshth Movies (@SreshthMovies) June 24, 2022 -
గుబురు గడ్డంతో రణ్‌బీర్ కపూర్.. నెట్టింట పోస్టర్ వైరల్
Ranbir Kapoor Rugged Look From Shamshera Movie Goes Viral: యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. లవ్ స్టోరీ ఉన్న సినిమాలతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా కనిపించిన రణ్‌బీర్ తాజాగా గుబురు గడ్డంతో దర్శనమిచ్చాడు. రణ్‌బీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం షంషేరా. ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో వాణి కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించనున్నారు. కరణ్ మల్హోత్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా రణ్‌బీర్ కపూర్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో రణ్‌బీర్ కపూర్ గుబురు గడ్డం, సూటిగా చూస్తున్న కళ్లు, చేతిలో గొడ్డలితో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో పలువురు నెటిజన్ల్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీలో రణ్‌బీర్ 1800 కాలం నాటి స్వాతంత్ర్య కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా 'సంజు' సినిమా తర్వాత రణ్‌బీర్ మూవీ ఏది ఇప్పటివరకు విడుదల కాలేదు. నాలుగేళ్ల తర్వాత హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ కానున్న 'షంషేరా'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. చదవండి: థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Ranbir Kapoor彡 (@ranbir__kapoor82) -
చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్
సాక్షి, విశాఖపట్నం : మనం రోజూ రకరకాల వస్తువులను ఎడాపెడా వాడేస్తుంటాం.. బోలెడన్ని పదార్థాలు తింటూ ఉంటాం. కానీ.. ఎప్పుడైనా చెత్తగురించి ఆలోచించామా.? రోడ్లపై పడేసిన వస్తువులు, సీసాలు, పాత ఎలక్ట్రానిక్ సామాన్లు.. ఇలా ఒకటేమిటి.? అన్నీ చెత్తని సృష్టించేవే..? వస్తువూ వస్తువూ పోగై.. కొండంత చెత్తగా మారుతూ ప్రపంచానికే సవాల్ విసురుతున్నా.. దాని గురించి మాత్రం ఎప్పుడూ పట్టించుకోం. నగరానికి చెందిన ఓ సంస్థ మాత్రం.. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ పునర్వినియోగానికి అనర్హం అన్నట్లుగా తనదైన శైలిలో వ్యర్థాలకు సరికొత్త అర్థాన్ని చెబుతోంది. జీరో వేస్ట్ నినాదంతో నగరంలోని పలు వ్యర్థాలకు కొత్త రూపునిస్తూ.. ప్రజల్ని చైతన్యవంతులను చేస్తోంది. చీపురు పుల్లల నుంచి.. వలల వరకూ.. గాజువాక ప్రాంతానికి చెందిన గ్రీన్ వేవ్స్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ సంస్థ.. జీరో వేస్ట్ నినాదంతో ముందుకు వెళ్తోంది. అంటే మనం వాడే ప్రతి వస్తువూ ఏదో ఒక విధంగా.. పునర్వినియోగానికి పనికొస్తుందని సంస్థ భావన. కేవలం భావన మాత్రమే కాదండోయ్.. ఎలా కొత్త రూపాన్ని ఇచ్చి.. పాత వస్తువును ఉపయోగించగలమో చేసి చూపిస్తోంది. చీపురు పుల్లల నుంచి చిరిగిపోయిన చేపల వలల వరకూ.. కాలిపోయిన వైర్ల నుంచి కొబ్బరి చిప్పల వరకూ.. ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి గాజు సీసాల వరకూ.. ప్రతి వస్తువుకూ కొత్తందం తీసుకొస్తోంది. కొబ్బరి చిప్పలతో కళాకృతులు.. మనమంతా కొబ్బరి మాత్రమే తీసుకొని.. చిప్పల్ని బయట పడేస్తాం. ఈ గ్రీన్‌వేవ్స్ సంస్థ ప్రతినిధులు మాత్రం.. అవి కేవలం చిప్పలు మాత్రమే కాదు.. విభిన్న కళాత్మక వస్తువులకు ప్రతిరూపాలని నిరూపిస్తున్నారు. కొబ్బరి చిప్పలతో కాఫీకప్పులు, కీ చైన్లు.. ఎన్ని రకాలుగా తయారు చేశారు. కొత్తగా వచ్చిన కేజీఎఫ్–2 సినిమాకు ప్రతిరూపాన్ని కూడా అచ్చుగుద్దినట్లు తయారు చేసేశారు. అంతేకాదు బుల్లెట్ బండి, దేవుళ్ల ప్రతిమలు, వాచీలు, నైట్ ల్యాంపులు, ఇలా.. ఎన్నో అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. (చదవండి: సరదాగా మాట్లాడుకుందామని పిలిచి..) -
న్యూలుక్స్తో దుమ్మురేపుతున్న టీమిండియా మాజీ కోచ్
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి శుక్రవారం కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ మధ్య కాలంలో క్రికెట్ అంశాలు తప్ప రవిశాస్త్రి గురించి పెద్దగా చర్చించుకోవాల్సింది ఏం లేదు. అయితే తాజాగా ట్విటర్ వేదికగా రవిశాస్త్రి రిలీజ్ చేసిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. క్రికెటర్ రవిశాస్త్రిలా కాకుండా స్వాగ్లుక్తో అదరగొడుతున్నాడు. తొలి ఫోటోలో ఫ్లాషీ జాకెట్‌తో.. మెడల్ గోల్డ్ చైన్.. కూలింగ్ గ్లాసెస్.. ఎవరికో చేతులు ఊపుతూ రస్టిక్ లుక్‌లో కనిపించాడు. ''నా ఫ్యామిలీ ముంబైలో ఉంది.. నేను ఈ క్షణంతో గడుపుతున్నా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక రెండో ఫోటోలో గుడ్‌మార్నింగ్ చెబుతూ.. ''నిద్రపోని వారికి గుడ్ మార్నింగ్ అనేది ఆప్షనల్‌గా కనిపిస్తుంది.'' అని పేర్కొన్నాడు. ఇక చివరగా మూడో ఫోటోను రిలీజ్ చేశాడు. ఆ ఫోటోలో ఒకావిడతో చాట్ చేస్తూ కనిపించిన రవిశాస్త్రి.. ''నేను ఆమె కలలో ఉన్నాను.. అయితే ఆమె మాత్రం నా వీఐపీ గెస్ట్లిస్ట్లో ఒకరు'' అంటూ క్యాప్షన్ పేర్కొన్నాడు. రవిశాస్త్రి ప్రస్తుతం ఐపీఎల్ 2022(ఇండియన్ ప్రీమియర్ లీగ్) బ్రాడ్కాస్ట్ డ్యూటీ నిర్వహిస్తున్నాడు. ఆటగాళ్ల బ్యాటింగ్, ఆటతీరు, ఫామ్ తదితర అంశాలపై చర్చలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నాడు. కాగా గతేడాది టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అయితేఘా టోర్నీలో టీమిండియా సూపర్-12 దశను దాటలేక చతికిలపడింది. అందునా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా అతని హయాంలో టీమిండియా మేజర్ టోర్నీల్లో గెలవనప్పటికి స్వదేశంలో, విదేశాల్లో చారిత్రాక సిరీస్‌లు గెలిచింది. ఇక టీమిండియా తరపున మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Babar Azam: నిబంధన తుంగలో తొక్కిన పాక్ కెప్టెన్.. పీసీబీ సీరియస్ My family lives in Mumbai and I live in the moment. pic.twitter.com/22BBncYoDL — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 ‘Good mornings’ are optional if you haven’t slept at all. pic.twitter.com/4OhSYEg3Ln — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 You’re in her DMs. She’s on my VIP guestlist. pic.twitter.com/eJTzoVKMz3 — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 -
లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల గుర్తించి పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఒక మనసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మెగా డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయినా వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 2020, డిసెంబర్9న చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకొని అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. చదవండి: హీరోయిన్ మాట్లాడుతుంటే చై ఏం చేస్తున్నాడో చూడండి.. అయితే గత కొన్ని రోజులుగా నిహారిక పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడం, ఆ తర్వాత పబ్ ఇన్సిడెంట్‌తో వార్తల్లో నిలిచిన నిహారిక తాజాగా తన లుక్‌ని మార్చేసింది. షార్ట్ హెయిర్‌తో ట్రెండీగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. న్యూ హెయిర్‌తో క్యూట్ లుక్స్‌తో నిహారిక ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: బన్నీకి ఇష్టమైన ఫుడ్ ఇదే.. రివీల్ చేసిన స్నేహారెడ్డి -
కిల్లర్ లుక్‌లో కమల్ హాసన్.. విక్రమ్ వచ్చేది అప్పుడే !
Kamal Haasan Vikram Movie New Poster Released: సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో విక్రమ్ ఒకటి. ఇందులో యూనివర్సల్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇదీవరకూ ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదిన ఎప్పుడూ ప్రకటిస్తారో ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ స్పెషల్ పోస్టర్లో కమల్ హాసన్ ఇంటెన్సివ్‌గా కిల్లర్ లుక్‌లో అదిరిపోయాడు. సూట్ ధరించి, చేతిలో కత్తి పట్టుకుని వైల్డ్‌గా కనిపిస్తున్నాడు. అలాగే ఈ పోస్టర్లో మార్చి 14న ఉదయం 7 గంటలకు విక్రమ్ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని వెల్లడించారు. విక్రమ్ మూవీ నుంచి విడుదలైన ఈ స్పెషల్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట్ల తెగ వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్షెషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 110 రోజులపాటు షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీ చిత్రీకరణ కోసమే తమిళ బిగ్‌బాస్ అల్టిమేట్ నుంచి కమల్ హాసన్ తప్పుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న విక్రమ్ మూవీలో కమల్ హాసన్ పూర్తిగా యాక్షన్ రోల్ పోషించనున్నారు. ఇందులో అర్జున్ దాస్, శివానీ నారయణన్, నరేన్, కాళీదాస్ జయరామ్, ఆంటోనీ వర్గీస్ తదితరులు నటిస్తున్నారు. Vikram theatrical release date to be announced on MARCH 14th, 2022 at 7 Am@ikamalhaasan @VijaySethuOffl #fafa@anirudhofficial @RKFI @turmericmediaTM#KamalHaasan#VikramReleaseAnnouncement#Vikram pic.twitter.com/CvFNholC78 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 11, 2022 -
నాగ చైతన్య సరికొత్త లుక్.. సోషల్ మీడియాలో వైరల్
Naga Chaitanya Look from Thank You Movie: అక్కినేని వారసుడు, టాలీవుడ్ గుడ్ బ్యాయ్ నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్గా లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్‌లోనే రెండు హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'థాంక్యూ' చిత్రంతో బిజీగా ఉన్నాడు. చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే తాజా షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చైతూ ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు. (చదవండి: ఓటీటీలోకి నాగ చైతన్య.. టైమ్ ట్రావెల్ కథలో జర్నలిస్ట్‌గా !) నాగ చైతన్య గడ్డంతో, స్పెక్ట్స్ పెట్టుకుని సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఫొటోను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు చైతూ. ఈ పిక్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీయడం విశేషం. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా 'పీసీ సర్ #థాంక్యూదిమూవీ' అంటూ అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే చైతూ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో అలరించనున్న సంగతి తెలిసిందే. -
Malavika Mohanan Birthday : మాళవిక మోహనన్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
షాకింగ్ : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన అఖిల్..
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’. ఇటీవలె ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్ మరో హిట్ ఖాతాలో వేసేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. షూటింగ్ ప్రారంభించే ముందే తన లుక్స్ కోసం నెలల తరబడి కష్టపడుతున్నాడు. తాజాగా షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో మారిన అఖిల్ న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. జిమ్‌లో కండలు తిరిగిన బాడీతో బీస్ట్ లుక్‌లో అఖిల్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
స్టైలిష్‌లుక్‌లో మహేశ్ బాబు.. అదిరిపోయిన ఫోటోషూట్
Mahesh Babu Latest Pic Goes Viral: సూపర్‌స్టార్ మహేశ్ బాబు స్టైలిష్ లుక్‌లో అదిరిపోయాడు. వయసు పెరుగుతున్నా రోజురోజుకి మరింత యంగ్ లుక్‌లో సర్ప్రైజ్ చేస్తున్నారు మహేశ్. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు పలు బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేశ్ తాజాగా పాల్గొన్న ఓ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టంట వైరల్ అవుతుంది. కంప్టీట్ బ్లాక్ డ్రెస్‌లో చేతిలో మొబైల్ పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం మహేశ్ సూపర్ స్టైలిస్ లుక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది ఏదైనా కమర్షియల్ యాడ్ ఫిల్మ్ కోసమా లేదా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించినదా అన్నది తెలియలేదు. కాగా మహేశ్, కీర్తి తొలిసారి జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా 2022, ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి. Super ⭐ @urstrulyMahesh looks Ultra Stylish in this latest photoshoot 🖤🔥#MaheshBabu #SarkaruVaariPaata #TeluguFilmNagar pic.twitter.com/2j2QGPAhno — Telugu FilmNagar (@telugufilmnagar) November 25, 2021 -
ఈ టీమిండియా క్రికెటర్లు ఫ్యాట్‌గా ఉంటే ఎలా ఉండేవారో ఓ లుక్కేయండి..!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన ఓ ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ పోస్ట్‌లో ఉన్న భారత ఆటగాళ్ల ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీమిండియా టాప్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఫొటోలను చూసి ఫ్యాన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ ఫొటోల్లో ఏముందో తెలుసుకోవాలంటే ఆ ఇన్‌స్టా పోస్ట్‌పై ఓ లుక్కేయండి. టీమిండియా క్రికెటర్లు ఫిట్నెస్ కోల్పోయి ఫ్యాట్‌గా మారితే ఎలా ఉంటారో ఊహించుకుని ఓ అభిమాని సరదాగా ఫొటో షాప్ ఫిల్టర్ సాయంతో వారి ముఖ కవళికలను మార్చాడు. View this post on Instagram A post shared by OFFICIAL BCCI 🔵 (@_official_bcci_) దీంతో ఫిట్‌గా ఉండే మన క్రికెటర్లు 30 ఏళ్లు దాటిన తర్వాత సాధారణ ప్రజలు పొట్టలేసుకుని, ఎలా అన్‌ఫిట్‌గా ఉంటారో అలా కనిపించారు. ముఖాలు వాచి పోయి అంకుల్స్‌ను తలపిస్తున్నారు. ఈ ఫొటోలను చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. ఎప్పుడూ ఫిట్‌గా కనిపించే మన క్రికెటర్లకు ఏంటీ దుస్థితి అని కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఏదో ఒక రోజు మనోళ్లు ఇలానే తయారవుతారని గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆతిథ్య దేశంతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే టీమిండియా రెండో టెస్ట్‌లో చిరస్మరణీయవిజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ కోసం ఇరు జట్లు సమాయత్తం అవుతున్నాయి. హెడింగ్లే స్టేడియంలో మనోళ్లు ఆదివారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, కేఎల్ రాహుల్, పంత్‌తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్‌లో చమటోడ్చారు. చదవండి: మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా -
శింబు: వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్..ఫోటో వైరల్
కోలీవుడ్ హీరో శింబు-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'వెందు తానింధుడు కాదు'. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం కోసం దాదాపు 30 కిలోల బరువు తగ్గిన శింబు సరికొత్త లుక్‌లో అలరిస్తున్నారు. లేటెస్ట్గా తన ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన ఫోటోను శింబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో క్లీన్‌షేవ్‌తో స్టైలిష్ లుక్‌లో శింబు కనిపిస్తున్నారు. కాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు ఇది వరకే ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ తమిళ రీమేక్ వెర్షన్లలో నటించిన సంగతి తెలిసిందే. ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. -
చిరు న్యూలుక్ వైరల్.. ఫీలవుతున్న పవన్ ఫ్యాన్స్ .. కారణం అదేనా?
ఫ్యాన్స్ తమ హీరోల విషయంలో చిన్న విషయాన్ని కూడా పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తారన్న సంగతి తెలిసిందే. అంతెందుకు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అభిమానులు రెచ్చిపోయిన ఘటనలు బోలెడు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విషయంలో ఏ చిన్న విషయమైనా.. ఆయన అభిమానులు ఓ రేంజ్లో స్పందిస్తారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అది పవన్ ఫ్యాన్స్‌ను ఫీలయ్యేలా చేస్తోందట. ఇటీవల సోషల్‌మీడియా వాడుకలో వచ్చినప్పటి నుంచి అందులో పోస్ట్ చేసే వాటిలో ఏ చిన్న పొరపాటు కూడా వెంటనే వైరల్‌గా మారి అందరికీ చేరుతోంది. ఇక అందులో కంటెంట్ కొంచెం అటు ఇటుగా ఉన్న రచ్చ రచ్చ అవుతోంది. అయితే తాజాగా చిరు యంగ్‌గా కనపడుతున్న ఫోటోను మెగా బ్రదర్ నాగబాబు షేర్ చేయగా అది నెట్టింట వైరల్‌గా మారి తెగ హల్చల్ చేస్తోంది. అసలు చిక్కు ఈ ఫోటోతోనే వచ్చింది. ఆ ఫోటోలో.. చిరంజీవిని మధ్యలో ఉంచి చుట్టూ మెగా హీరోలని ఉంచాడు. ఆ పిక్కి కామెంట్ పెట్టిన నాగబాబు.. ఈ పిక్‌లో ఉన్న మెగా హీరోలు అందరిలో కెల్లా మీరే యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్లో కానీ ఎవరూ మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నయ్యా’’ అంటూ చిరు పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే నాగబాబు షేర్ చేసిన ఈ ఫొటోలో రామ్ చరణ్ , అల్లు అర్జున్, వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ లు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ మిస్ అయ్యాడు . దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. కాగా పవన్ అభిమానులు ఈ అంశంపై సోషల్‌మీడియాలో నాగబాబు పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. మరికొందరు మాత్రం నాగబాబు మనసులో తన తమ్ముడు కూడా ఇంకా యంగ్‌గా ఉన్నాడని భావిస్తున్నట్టున్నాడు అందుకే ఫొటో మిస్ చేశాడేమో అని కామెంట్స్ పెడుతున్నారు. -
డెక్కన్ క్వీన్‌కు కొత్త లుక్
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై, పుణే నగరాల మధ్య నడిచే డెక్కన్ క్వీన్ రైలు కొత్త సొబగులతో ప్రయాణికులను అలరించనుంది. పారదర్శక విస్టాడోం కోచ్‌లతో పరుగులు తీయనుంది. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త రూపుతో డెక్కన్ క్వీన్ పరుగులు తీసేలా సుముహూర్తం ఖరారైంది. ఇటీవల డెక్కన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏర్పాటుచేసిన పారదర్శక విస్టాడోం కోచ్‌లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులకు మరో కానుక అందజేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ముంబై, పుణేల మధ్య నడిచే డెక్కన్ క్వీన్‌కు కూడా పారదర్శక విస్టాడోం కోచ్‌లు ఏర్పాటు చేయాలని సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు పంద్రాగస్టు నుంచి డెక్కన్ క్వీన్ రైలు సాధారణ కోచ్‌లకు బదులుగా విస్టాడోం కోచ్‌లతో పరుగులు తీయనుంది. ముంబై, పుణే నగరాల మధ్య అప్పటివరకు సాధారణ బోగీలతో నడిచిన డెక్కన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విస్టాడోం కోచ్‌లు ఏర్పాటు చేసి, జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభించారు. ఈ కోచ్‌ల పైకప్పు, ఇరువైపులా అద్దాలతో కూడిన పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. దీంతో రైలులో ప్రయాణిస్తుండగానే ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా కర్జత్–ఖండాలా–లోణావాలాల మధ్య ఘాట్ సెక్షన్ ఉంది. అక్కడ ఎటు చూసిన పచ్చని ప్రదేశం, అనేక కొండలు, సొరంగాలు, కొండల పైనుంచి పారుతున్న జలపాతాలు ఇలా అనేక అందాలను తిలకించవచ్చు. ఈ ప్రాంతాల మీదుగా రైలు వెళుతుండగా ఇరుదిక్కుల నుంచి తిలకించే ప్రకృతి అందాలు మైమరింపజేస్తాయి. ఈ రైలు ప్రారంభించిన నాటి నుంచి ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొన్నటి వరకు ఖాళీగా తిరిగిన ఈ రైలు పర్యాటకులు, ప్రయాణికుల వల్ల రైల్వేకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. దీంతో ఇదే తరహాలో డెక్కన్ క్వీన్ రైలుకు కూడా విస్టాడోం కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే సంకల్పించింది. ఈ మేరకు ఆగస్టు 15వ తేదీన విస్టాడోంలతో కూడిన డెక్కన్ క్వీన్ రైలు నంబర్ 02124 పుణే నుంచి ఉదయం 7.15 గంటలకు బయలుదేరి ముంబై సీఎస్ఎంటీకి ఉదయం 10.25 గంటలకు చేరుకుంటుంది. రైలు నంబర్ 02123 ముంబై సీఎస్ఎంటీ నుంచి సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి రాత్రి 8.25 గంటలకు పుణే చేరుకుంటుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి ఈ కొత్త డెక్కన్ క్వీన్ రిజర్వేషన్ల బుకింగ్ ప్రారంభమైందని రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా విస్టాడోం కోచ్‌లతో కూడిన డెక్కన్ క్వీన్ రైలుకు నాలుగు ఏసీ చెయిర్ కార్లు, తొమ్మిది సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు, మరో రెండు సామాన్య సిట్టింగ్‌తో పాటు గార్డు, బ్రేక్ వ్యాన్, ఒక ప్యాంట్రీ కారు ఉన్నాయి. ఇందులో టికెటు కన్ఫర్మ్ అయినవారినే అనుమతించనున్నారు. పర్యాటకుల కు, నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు స్టేషన్లో ప్రవేశించక ముందే థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష లు నిర్వహిస్తారు. కోవిడ్ నియమాలకు కట్టుబడి ఉంటేనే రైల్వే ప్లాట్‌ఫారంపైకి అనుమతిస్తామని రైల్వే అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్: ఆకట్టుకుంటున్న మహేశ్ న్యూలుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు రేపటితో 45 వసంతాలను పూర్తి చేసుకోబోతున్నాడు. రేపు(ఆగస్ట్ 9న) ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులకు వరుస సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి. 10 రోజుల నుంచే అభిమానులు ‘సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్’ పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మహేశ్‌కు సంబంధించిన ఓ తాజా లుక్ విడుదలైంది. ఇందులో ఆయన ఫార్మల్ షర్ట్, ప్యాంటు ధరించి స్టైలిష్‌గా మరింత యంగ్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఈ లుక్ ఆయన అభిమానులు, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక దక్షిణాదిలోనే మొట్టమొదటి సారిగా మహేశ్ పేరుతో అతిపెద్ద సెలబ్రెటీ ట్విట్టర్ స్పెస్‌ను నిర్వహించాలని ఆయన టీం ప్లాన్ చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమకు చెందిన మహేశ్ సన్నిహితులు ఆయన సినిమాల విజయాలపై, ఇతర విశేషాలపై చర్చిస్తారు. అంతేగాక రేపు ఉదయం 9:09 గంటలకు ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ నుంచి ఆసక్తికరమైన అప్డేట్ రానుంది. దీనితో పాటు ఆయన తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా బయటకు రానున్నాయి. దీంతో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో బర్త్‌డే బ్లాస్టర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేశ్ సరసన కీర్తి సూరేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. Yet another fun shoot! 📸 @avigowariker at his best again! pic.twitter.com/miQ0C9qykt — Mahesh Babu (@urstrulyMahesh) August 8, 2021 -
మళ్లీ సన్నగా, స్టయిలిష్‌గా కనిపించబోతున్న ఎన్టీఆర్!
Jr NTR: బరువు పెరగడం... తగ్గడం... ఇలా పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మేకోవర్ కావడానికి రెడీ అయిపోతారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో చేస్తున్న కొమురం భీమ్ పాత్ర కోసం కాస్త బరువు పెరిగారు. తర్వాత చేయనున్న చిత్రం కోసం బరువు తగ్గనున్నారని సమాచారం. అయితే రెగ్యులర్‌గా కన్నా కూడా కాస్త సన్నబడాలనుకుంటున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసమే ఈ మేకోవర్ అని భోగట్టా. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని పాట చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ఉక్రెయిన్ వెళ్లారు. ఆ పాటతో సినిమా పూర్తవుతుందట. దాంతో ఇండియా చేరుకున్న వెంటనే ప్రత్యేక డైట్, స్పెషల్ వర్కవుట్స్‌తో తగ్గే పని మీద ఉంటారని తెలిసింది. కొరటాల దర్శకత్వంలో చేసిన ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ స్టయిలిష్‌గా కనిపించారు. తాజా చిత్రంలోనూ అలా స్టయిలిష్‌గా కనిపించనున్నారని టాక్. -
ధోని హెయిర్ స్టైల్ అదరహో.. కుర్రకారు ఫిదా! లక్షల్లో లైకులు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనిది ప్రత్యేక స్థానం. విజయవంతమైన సారథిగా.. బ్యాట్స్‌మెన్‌గా.. వికెట్ కీపర్‌గా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు సంపాదించి పెట్టిన ఒకే ఒక్క కెప్టెన్‌గా ఘనత సాధించిన ధోని ఆటలోనే కాదు.. తన ఆహార్యంలోనూ స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేలా ధోనీ చూసుకుంటాడు. ఆయన క్రికెట్ కెరీర్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో స్టైల్స్‌లో కనిపించాడు. ఒక్కో స్టైల్ అదిరిపోయేలా ఉండడంతో యువత ధోనీ స్టైల్ అంటూ హెయిర్ సెలూన్లకు పరిగెత్తుతుంటారు. మళ్లీ ఇప్పుడు ధోనీ మరో హెయిర్ స్టైల్‌తో కొత్త లుక్‌లో కనిపించాడు. ధోనీతో హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ సెలబ్రిటీల స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆలిమ్ హక్కీమ్ ధోనీని సరికొత్త లుక్‌లో కనిపించేలా చేశారు. ప్రత్యేక హెయిర్ స్టైల్ చేసి న్యూలుక్లో మెరిసేలా ఆలిమ్ ధోనీని తయారుచేశారు. ఈ లుక్‌ను ఫంకీ హెయిర్ స్టైల్‌గా పేర్కొంటారని తెలుస్తోంది. ఈ లుక్ కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలను ఆలిమ్ హకీమ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫొటోలను నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. కుర్రకారు ఈ హెయిర్ స్టైల్‌ను చేయించుకోవాలని భావిస్తున్నారు. ధోనీ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్లో చెన్నె జట్టుతో ఆడుతున్నాడు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) -
న్యూలుక్లో ధోనీ అదుర్స్.. సరదాగా స్నేహితులతో అలా..!
రాంచీ: కరోనా మహమ్మారి కారణంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత రెండేళ్లుగా ఎక్కువ శాతం రాంచీలోని తన ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యాడు. అక్కడే సేంద్రీయ వ్యవసాయం చేస్తూ కుటుంబంతో సరదాగా సమయం గడుపుతున్నాడు. ఇక ఐపీఎల్ 2021 వాయిదా పడడంతో దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తున్నాడు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ టూర్ ముగించుకుని స్వస్థలానికి చేరుకున్న మాహీ.. రాంచీలోని తన స్నేహితులను కలిశాడు. వారితో కలిసి కార్ గ్యారేజ్‌లో భోజనం చేస్తూ సరదాగా టైంపాస్ చేశాడు. గ్యారేజ్‌లో ఉండే ఓ బల్లపై భోజనం పెట్టుకుని, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ విందు ఆరగించాడు. వారి వెనక పాతకాలం నాటి రోల్స్ రాయిస్ కారు ఒకటుంది. దానిని ఓ వ్యక్తి రిపేర్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by MS Dhoni / Mahi7781 🔵 (@ms.dhoni.sr07) ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెరిసిన గడ్డంతో ధోనీ నవ్వుతూ ఈ ఫొటోలో కనిపిస్తున్నాడు. సాధారణ వ్యక్తిలా ధోనీ భోజనం చేసిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది. న్యూ లుక్‌లో ధోనీ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ధోనీ.. అలా సింపుల్‌గా ఉండటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతని సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. స్టార్ క్రికెటర్ హోదాను పక్కకు పెట్టి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడాన్ని అభినంధిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ నెలలో యూఏఈలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by MS Dhoni / Mahi7781 🔵 (@ms.dhoni.sr07) -
వరుణ్ ధావన్ షాకింగ్ లుక్, అనిల్ కపూర్ స్పందన!
ప్రస్తుతం యంగ్ హీరోలంతా సినిమాల్లో తమ లుక్ కొత్తగా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఏవేవో ప్రమోగాలు చేస్తుంటారు. అలా డిఫరెంట్ లుక్స్‌తో అందరికి షాక్ ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన తాజా లుక్‌తో సూపర్ స్టార్ అనిల్ కపూర్‌ను ఆశ్చర్యపరిచాడు. భారీగా కండలు పెంచేసి షర్ట్ లేకుండా దిగిన మూడు ఫొటోలను షేర్ చేశాడు. ఇలా వరుణ్‌ను చూసిన సెలబ్రెటీలు, అభిమానులు అతడి శరీర సౌష్టవంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అనిల్ కపూర్ దీనిపై స్పందిస్తూ ‘టెర్రిఫిక్’ అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం వరుణ్‌కు సంబంధించిన ఈ ఇన్‌స్టా పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వరుణ్ తన తాజా చిత్రం ‘బేడియా’ కోసం భారీగా కండల పెంచాడట. హరర్ కామెడీ నేపథ్యంలో తెరక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ సరసన కృతీ సనన్ నటిస్తోంది. కరోనా సమయంలో కూడా ఈ మూవీ అరుణాచల్ ప్రదేశ్‌లో షూటింగ్‌ను కొనసాగించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
వెరైటీ లుక్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్
బాలీవుడ్ పరిశ్రమలో నటీనటులు ఫ్యాషన్ విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. ఇక వారి వస్త్రాధరణ విషయానికొస్తే ట్రెండీ లుక్ కోసం తెగ ప్రయత్నిస్తుంటారు. ఇక ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కాస్త ముందు వరుసలోనే ఉంటాడనే చెప్పాలి. రణ్వీర్ తన లుక్‌లో పరంగా ఎప్పటికప్పుడూ కొత్త దనం ఉండేలా జగ్రత్త పడుతుంటాడు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే తాజాగా మన హీరో ఓ కొత్త లుక్‌ని ట్రై చేశాడు. ఎంతలా అంటే చూసిన వాళ్లంతా షాకయ్యేలా. తాజాగా రణ్వీర్ సింగ్ ఇప్పుడీ లేటెస్ట్ లుక్‌లో కనిపించి తన ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశాడు. ఈ లుక్ కోసం.. బ్లూ కలర్ ట్రాక్‌సూట్, పొడవైన జుట్టు, ఓ లెదర్ హ్యాండ్‌బ్యాగ్‌ను ధరించాడు. దీనికి తోడు మెడలో భారీ సైజులోని నగలు వేసుకున్నాడు. నా ప్రియమైన అలెజాండ్రో అని ఈ ఫొటోలకు క్యాప్షన్ పెట్టిన రణ్వీర్.. అలెజాండ్రో మిచెల్, గుచ్చిలను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో షేర్ చేసిన నిమిషాల్లోనే బాలీవుడ్ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి కామెంట్లతో రణ్వీర్ నయా లుక్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆలియా భట్ ఆశ్చర్య పోగా, హిస్టారిక్ అంటూ హిమేష్ రేషమియా అన్నాడు. అర్జున్ కపూర్ అయితే అతన్ని హాలీవుడ్ నటుడు జేరెడ్ లీటోతో పోలుస్తూ వీర్ లీటో అని కామెంట్ చేయడం విశేషం. ఇక అభిమానులైతే తమకు మరో మీమ్ పండుగ వచ్చిందని కామెంట్లు పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) చదవండి: Mandira Bedi: గుండె బద్దలైంది...సారీ మందిరా! -
ఆ సినిమాలో యువరాణిగా కీర్తి లుక్, ఫొటో వైరల్
మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన మలయాళ తాజా చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించాడు. గతేడాది 2020 మార్చి 26న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా ఈ ఏడాది వేసవికి వాయిదా పడింది. 2022లో కూడా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో మరోసారి ఈ మూవీ వాయిదా పడింది. కాగా ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ (మోహన్‌లాల్ తనయుడు) కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని కీర్తి సూరేశ్ న్యూలుక్ బయటకు వచ్చింది. సంగీతకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి కేరళ యువరాణిగా పట్టాభిషిక్తురాలైన యువతిగా కీర్తి పాత్ర కొనసాగనున్నట్లు సమాచారం. ఒంటినిండా ఆభరణాలు ధరించి రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో వీణ వాయిస్తున్నట్లు ఉన్న తన స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళ యువరాణిగా కీర్తి అదిరిపోయిందంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరక్కల్ మూవీ విడుదలకు ముందే మూడు విభాగాల్లో(ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్ డిజైనింగ్) జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం. కాగా మరక్కర్.. ఓనమ్ పండగ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు ఇటీవల మోహన్‌లాల్ అధికారికంగా ప్రకటించారు. -
వైరలవుతున్న నటి రాధిక న్యూ లుక్ ఫోటోలు
సినీ నటి రాధిక శరత్ శరత్‌కుమార్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా హెయిర్ కట్ చేయించి న్యూ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..ఈ కొత్త లుక్ మీ అందరికి నచ్చుతుందని ఆశాస్తున్నానంటూ పేర్కొన్నారు. మొన్నటి దాకా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాధిక ఇప్పుడు మేక్ఓవర్పై దృష్టి పెట్టినట్లున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక చెక్‌బౌన్స్ కేసులో నటుడు శరత్‌కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న అనంతరం రాధిక ఆరోగ్యంపై పలు వదంతులు వచ్చాయి. వ్యాక్సిన్ తీసుకున్నాక ఆమెకు కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్వయంగా స్పందించిన రాధిక..అలాంటి పుకార్లను నమ్మవద్దంటూ పేర్కొంది. తనకు కరోనా సోకలేదని, కానీ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయని క్లారిటీ ఇచ్చింది. Cheering myself up ,hope u all like the look😄😄😄😄 pic.twitter.com/M5XCMu4cgi — Radikaa Sarathkumar (@realradikaa) April 28, 2021 చదవండి : శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' -
వైరల్ అవుతున్న బాలకృష్ణ న్యూ లుక్
ప్రతి సినిమాకు కొత్త లుక్ ట్రై చేయడంలో ముందుంటారు హీరో నందమూరి బాలకృష్ణ. దాదాపు అన్ని సినిమాల్లోనూ కొత్తగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్వకత్వంలో బాలకృష్ణ BB3 అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో BB3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం బాలయ్య న్యూలుక్లోకి మారిపోయాడు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సరసన నటిస్తోంది. తాజాగా హోలీ సంబరాల్లో పాల్గొన్న బాలకృష్ణ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నాడు. వరుస డిజాస్టర్స్‌లో ఉన్న బాలయ్యకు ఈ సినిమా కీలకంగా మారింది. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశముంది. మే28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చదవండి : చిరు, బాలయ్యలతో బాలీవుడ్ భామ రొమాన్స్! రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్ -
Yuvraj Singh: న్యూలుక్లో అదరగొడుతున్న యువీ
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచే సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్.. తన తాజా లుక్‌తో మరోసారి అభిమానులను అలరించాడు. యువీ తన న్యూలుక్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సరికొత్త లుక్‌లో యువీ పొడవాటి జుట్టుతో పాటు గడ్డంతో కనిపిస్తాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. దీంతో అభిమానులు భారీ ఎత్తున లైక్‌లు కొడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యువీ తాజా పోస్ట్ పై టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. " భాయ్ బాద్ షా లా మారిపోయావ్ " అంటూ ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా తదితరులు కామెంట్ చేశారు. కాగా, తాజాగా ముగిసిన రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ 2021 లో యువీ.. తన పూర్వపు ఫామ్‌ను కనబరుస్తూ ఇండియా లెజెండ్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ సిరీస్‌లో యువీ.. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 170.17 స్ట్రయిక్ రేట్‌తో 194 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో యువీ మొత్తం 17 సిక్సర్లు బాదాడు. టోర్నీ మొత్తంలో యువీనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలవడం విశేషం. వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన వరుసగా నాలుగు సిక్సర్లు బాది.. తన పాత రికార్డును( వరుసగా 6 సిక్సర్లు) మరోసారి సాధించేలా కనిపించాడు. ఫైనల్ మ్యాచ్‌లో సైతం యువీ రెచ్చిపోయి ఆడాడు. శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 60 పరుగులు సాధించి, భారత లెజెండ్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
పవన్ కల్యాణ్ న్యూలుక్.. షాకవుతున్న ఫ్యాన్స్
దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఆయన నటించిన ‘అజ్ఞాతవాసి’ విడుదలై మూడేళ్లు అవుతుండటంతో వెండితెరపై ఆయనను చూసేందుకు అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు. అయితే 2020లోనే వకీల్ సాబ్ మూవీ విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రీల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన గ్లామర్‌కు కాస్తా దూరమయ్యాడు. గడ్డం పెంచి పెద్ద జట్టుతో ఉన్న పవన్ కాస్తా బరువు కూడా పెరిగాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కాస్తా గ్లామర్‌పై దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలో పవన్ న్యూ లుక్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. క్లీన్ షేవ్‌తో స్లీమ్‌గా మునుపటి పవర్ స్టార్ల దర్శనమివ్వడంతో అభిమానులంతా సర్ప్రైజ్ అవుతున్నారు. ఈ ఫొటోలో పవన్ బ్లాక్ ట్రౌజర్-టీ షర్ట్‌తో నడుముపై చేతులు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తు దర్శనం ఇచ్చాడు. ఇలా స్టైలిష్ లుక్ వపన్‌ను చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ‘పవర్ స్టార్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పవన్ క్రిష్ డైరెక్షన్లో, హరీష్‌శంకర్, సాగర్ చంద్ర డైరెక్షన్లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pawan Kalyan (@pawankalyan.k) చదవండి: శివరాత్రికి పవన్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు: అషూ రెడ్డి వార్నింగ్ -
కొత్త ఏడాది, కొత్త పోస్టర్స్
కొత్త ఏడాదిని సరికొత్తగా స్వాగతించాలి. అందుకే నూతన సంవత్సరంలో సినీ అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త లుక్స్‌తో, కొత్త పోస్టర్స్‌తో స్వాగతం చెప్పాయి కొన్ని సినిమాలు.. ఆ వివరాలేంటో చూసేద్దాం. ♦ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్’ నుంచి ప్రభాస్ స్టిల్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతికి టీజర్ ఉంటుందని సమాచారం ♦ ‘ఎఫ్ 2’తో సందడి చేశారు కో బ్రదర్స్ వెంకటేశ్, వరుణ్ తేజ్. ఇప్పుడు డబుల్ ఫన్‌తో ‘ఎఫ్ 3’తో తిరిగొస్తున్నారు ♦ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’లో పవన్, శృతీ హాసన్ బైక్‌పై వెళుతున్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేస్తారు ♦ రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేస్తున్న చిత్రం ‘ఖిలాడీ’. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు ♦ ‘సీటీమార్’ కోసం కబడ్డీ కోచ్‌గా మారారు గోపీచంద్. ఫుల్ జోష్‌తో సీటీ కొడుతున్న స్టిల్ రిలీజ్ చేశారు ♦ శర్వానంద్ రైతు పాత్రలో నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’. ఇందులో ఆయన లుక్‌ను విడుదల చేశారు. ♦ సంక్రాంతికి సందడి చేయడానికి ‘అల్లుడు అదుర్స్’తో వస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు ♦ నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’, రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’ పోస్టర్స్ విడుదలయ్యాయి. ‘లక్ష్య’ లో అథ్లెట్‌లా రఫ్‌గా కనిపిస్తున్నారు నాగశౌర్య ♦ సుమంత్ ‘కపటధారి, సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’, అలీ, నరేష్ ముఖ్య పాత్రల్లో చేస్తున్న ‘అందరూ బావుండాలి అందులో మనముండాలి’, వశిష్ట సింహ, హెబ్బా పటేల్ ‘ఓదెల రైల్వేస్టేషన్’, సప్తగిరి హీరోగా చేస్తున్న ‘ఎయిట్’, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’, ‘ఆకాశవాణి’, ‘మోహన్‌కృష్ణ గ్యాంగ్‌లీడర్’ చిత్రాలు న్యూ ఇయర్‌కి న్యూ లుక్స్‌తో Ðð ల్కమ్ అన్నాయి. -
కొత్త లుక్‌తో కేక పుట్టిస్తోన్న నారప్ప..
-
మరింత యంగ్‌గా సూపర్ స్టార్ మహేష్
సూపర్‌స్టార్ మహేష్ బాబు నలభై ఐదేళ్ల వయసులోనూ ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. వయసు పెరిగే కొద్దీ మహేష్ మాత్రం ఇంకా యంగ్‌గా కనిపిస్తూ రోజురోజుకీ తన అందాన్ని పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మహేష్‌బాబు పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ యాడ్ చిత్రీకరణ కోసం తీసిన ఈ ఫోటో తనకిష్టమైన లుక్స్‌లో ఒకటని మహేష్ తెలిపాడు. ఎంతో స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ పోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ ఫోటోను క్లిక్‌మనిపించాడు. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాలో మహేష్ నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మహానటి ఫేం కీర్తి సురేష్ ఈ సినిమాతో తొలిసారి మహేష్‌తో జోడీ కట్టనున్నారు. ఈ చిత్రం అనంతరం భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. (రామ్ చరణ్ నో చెప్పిన కథకు మహేష్ ఓకే?) -
మాస్ సిద్
పుట్టినరోజు సందర్భంగా నవీన్‌చంద్ర కొత్త లుక్‌లో కనిపించారు. మంచు విష్ణు నిర్మాతగా, హీరోగా చేస్తున్న ‘మోసగాళ్లు’ చిత్రంలో నవీన్‌చంద్ర చేస్తున్న ‘సిద్’ పాత్ర లుక్‌ని బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఫిలిమ్స్ పతాకంపై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కీలక పాత్రలో నవీన్‌చంద్ర కనిపిస్తారు. పోస్టర్ చూస్తుంటే తనది మాస్ క్యారెక్టర్ అని అర్థం అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా ఫిల్మ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ ఆర్. -
సంజయ్ దత్ నయా లుక్
నయా (కొత్త) లుక్‌లో సంజయ్ దత్ తన అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు. ఆయనకు క్యాన్సర్ అని నిర్ధారణ కాగానే అభిమానులు చాలా బాధపడ్డారు. ’మా సంజూ బాబాకి ఏం కాదు.. త్వరలోనే క్యాన్సర్‌ని జయిస్తారు’ అని అభిమానులు పేర్కొన్నారు. అన్నట్లుగానే సంజయ్ దత్ త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. ’నేను క్యాన్సర్‌ని జయించాను’ అని అధికారికంగా చెప్పి, అందర్నీ ఆనందపరిచారు సంజయ్ దత్. తాజాగా నయా లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ముంబైలోని ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్ సెలూన్‌కి వెళ్లి, కొత్త హెయిర్ స్టయిల్ చేయించుకున్నారు సంజయ్ దత్. ఆ ఫొటోను హకీమ్ షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హిందీలో షంషేరా, పృథ్వీరాజ్ చిత్రాలు చేస్తున్నారు సంజయ్ దత్. అలాగే ‘కేజీఎఫ్’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కేజీఎఫ్ 2’లో నటిస్తున్నారు. -
సింగం స్టైల్లో.. ధోని న్యూలుక్
దుబాయ్ : మహేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరు భారత క్రికెట్లో సరికొత్త కొత్త చరిత్ర. హెలికాప్టర్ షాట్ కొట్టినా.. జుట్టుపెంచినా.. జుట్టు కత్తిరించినా.. మైదానంలో కెప్టెన్‌గా ఎన్నో మ్యాచ్‌లు కూల్‌గా గెలిపించినా.. ఓడినా ఇలా ధోని ఏంచేసినా క్రికెట్ అభిమానుల్లో అవి చర్చనీయాంశంగా నిలిచాయి. అయితే తాజాగా.. సుదీర్ఘ కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీ న్యూలుక్ ఇప్పుడు టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. ఎంతోకాలం నుంచి మైదానంలో ధోనిని చూడాలనుకుంటున్న వారికి తన గడ్డం స్టయిల్‌ను కాస్త మార్చుకొని ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు. ధోనీ ప్రస్తుతం సింగం స్టైల్లో కాస్త ట్రిమ్ చేసుకొని డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. అయితే ధోని న్యూలుక్‌పై అతడి అభిమానులు సోషల్ మీడియాలో వివిధ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ న్యూజిలాండ్- టీమీండియా మ్యాచ్‌లో ధోని చివరిసారిగా కనిపించాడు. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ('ధోని.. నిజంగా నువ్వు అద్భుతం') Thala #Dhoni In singam Look 😍🔥#SooraraiPottru #ipl2020schedule pic.twitter.com/YmT0yloTbE — Suriya Fans Members ™ (@SuriyaFCMembers) September 19, 2020 -
లుక్ ట్రిక్
సినిమా మ్యాజిక్కే వేరు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించడం సినిమాకు చాలా మామూలు విషయం. అందుకు తాజా ఉదాహరణ చిరంజీవి లుక్. ఇటీవలే చిరంజీవి గుండుతో ఉన్న లుక్‌ను ఆన్లైన్లో షేర్ చేసి, అభిమానులను ఆశ్చర్యపరిచారు. తన తదుపరి చిత్రాల్లో ఓ సినిమాకు సంబంధించిన లుక్ అని తెలిపారు. అయితే నిజంగానే చిరు గుండు చేయించుకున్నారని చాలామంది భావించారు. కొంతమంది చేయించుకోలేదన్నారు. ఆ లుక్ కేవలం ట్రిక్ అని మంగళవారం అసలు విషయం బయటపెట్టారు చిరంజీవి. మేకప్ టెక్నిక్తొ ఆ లుక్ ట్రై చేశాం అని, ఆ లుక్ కోసం ఎలా శ్రమించారో ఓ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. ‘‘ఎటువంటి లుక్ అయినా సరే నిజమేమో? అని నమ్మించగలిగే సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు. సినిమా మ్యాజిక్కు సెల్యూట్’’ అన్నారు చిరంజీవి. -
గుండు వెనుక ఉన్న అసలు నిజం ఇదే!
-
చిరంజీవి గుండు వెనుక ఉన్న అసలు నిజం ఇదే!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా సరికొత్త లుక్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఈ లుక్‌లో చిరు గుండుతో, మీసాలు లేకుండా కనిపించారు. ఒక స్టైలిష్ కళ్లజోడు పెట్టుకొని ఉన్న ఫోటోను ఆయన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘అర్బన్ మాంక్’ లుక్ అనే పేరుపెట్టారు. చిరును ఆ లుక్‌లో చూసిన అభిమానులతో పాటు రామ్ చరణ్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. పలువురు చిరు న్యూలుక్ సూపర్ అంటూ స్పందించారు. అయితే తాజాగా విడుదలయిన వీడియోతో చిరు గుండు వెనుక ఉన్న అసలు నిజం బయటపడిపోయింది. చిరు ఓ సినిమాలో క్యారెక్టర్ కోసం నిజంగానే గుండు చేయించుకొని ఉంటారని అందరూ భావించారు. అయితే చిరంజీవి గుండు చేయించుకోలేదని, ముగ్గురు మేకప్ ఆర్టిస్ట్‌లు కష్టపడి చిరుకు ఆ లుక్ తెచ్చినట్లు తెలుస్తోంది. మీరు కూడా ఒకసారి చిరు ‘అర్బన్ మాంక్’ మేకింగ్ వీడియోని చూసేయండి. చదవండి: సన్యాసిలా ఆలోచించగలనా? -
భలే ఉన్నావు బాబు
సినిమా హీరోలు లుక్కు మారిస్తే చాలు ఫ్యాన్స్‌కి అదో కిక్కు. ప్రస్తుతం అలాంటి కిక్కే ఫ్యాన్స్‌కు అందించారు మహేశ్‌బాబు. ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటించనున్నారు మహేశ్. ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించనున్నారాయన. అందుకోసం జుట్టు పెంచుతున్నారు కూడా. బుధవారం ఓ యాడ్ షూట్లో పాల్గొన్నారు మహేశ్. అందులో భాగంగా ఓ ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోలో కొత్త లుక్‌లో కనిపించిన మహేశ్‌ని చూసి ఫ్యాన్స్ అందరూ ‘భలే ఉన్నావు బాబు’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేశారు. అయితే ఇదే లుక్‌తో సినిమాలోనూ కనిపిస్తారా? ఇంకా డిఫరెంట్‌గా ఉంటుందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. -
రౌడీ న్యూ మూవీ లుక్ చూసి నెటిజన్లు ఫిదా!
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో తన ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ. దాంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటాడు రౌడీ. నిన్న ఫాదర్స్ డే సందర్భంగా రౌడీ తన నాన్నతో కలిసి ఉన్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో తన తండ్రితో కలిసి విజయ్ ఫోన్లో ఏదో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. (అమృతా ప్రణయ్ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్.) ‘నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో, రిస్క్‌లో, ప్రతి సహసోపేతమైన పనిలో నేనున్నాను నీకు తోడుగా ఉన్నాను అని ఎప్పుడూ చెప్పే వ్యక్తి’ అని కాప్షన్ జోడించి విజయ్ ఆ ఫోటోను పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫోటోలో రౌడీ లుక్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. పొడవాటి జుట్టు, ఫ్రెంచ్ స్టైల్లో గడ్డం పెంచి కనిపించాడు. ఈ లుక్‌లో విజయ్ను చూసి కొంత మంది రాకేష్మాస్టర్ లా ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్’ సినిమాలో ప్రస్తుతం విజయ్ నటిస్తున్నాడు. సినిమా షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. (విజయ్‌కు ‘మా’ తాత్కాలిక అధ్యక్షుడి మద్దతు) View this post on Instagram "I am with you." Is all he says everytime to my decisions, mistakes, risks, adventures and wars I take on. The first Deverakonda - Happy Father's Day Daddy - I love you ❤️ A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on Jun 21, 2020 at 5:14am PDT -
ఆగస్ట్‌లో కబడ్డీ కబడ్డీ
‘గౌతమ్‌నంద’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో గోపీచంద్ – డైరెక్టర్ సంపత్ నంది కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా, దిగంగన కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీ¯Œ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. నేడు గోపీచంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘సీటీమార్’ టీమ్ కొత్త స్టిల్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ–‘‘కబడ్డీ నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ ఏడాదే షూటింగ్ మొదలుపెట్టాం. కానీ లాక్ డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్‌లో 60 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. మిగిలిన భాగం చిత్రీకరణ ఆగస్ట్ మొదటివారంలో మొదలుపెట్టి ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నాం. ఒక పాట మినహా ఇప్పటికే నాలుగు పాటలు రికార్డ్ చేశారు సంగీత దర్శకుడు మణిశర్మ. మాస్ ప్రేక్షకుల కోసం ఒక ప్రత్యేక గీతాన్ని కంపోజ్ చేస్తున్నారాయన. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండబోతుంది’’ అన్నారు. కాగా ‘సీటీమార్’ చిత్రంలో ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. పల్లెటూరిలో ఉండి హీరోని ప్రేమించే ప్రత్యేక పాత్రలో దిగంగన నటిస్తున్నారు. ఈ సినిమాకి సమర్పణ: పవ¯Œ కుమార్. -
కేఎల్ రాహుల్‌కి ఇష్టమైన క్రికెటర్ ఆయనే..
లాక్డౌన్ కారణంగా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇంట్లోనే సరదాగా గడుపుతూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. తాజాగా తన కొత్త హెయిర్ కట్‌కి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. "మైండ్ పోయింది, జుట్టు పోయింది "అంటూ సరదాగా ఓ క్యాప్షన్ కూడా జోడించాడు. దీనికి బాలీవుడ్ తారలు సైతం స్పందించారు. నటి అనుష్క రంజన్ గిల్టీ అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రంజాన్ కపూర్ రాహుల్ హెయిర్‌కట్‌పై లాల్ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా చివరిసారిగా మ్యాచ్ ఆడగా, ఆ తర్వాత కరోనా కారణంగా అన్ని మ్యాచ్‌లు రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడూ బిజి బిజీగా గడిపే క్రికెటర్లకు బోలెడంత సమయం దొరికినట్లయ్యింది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్లు రెగ్యులర్‌గా లైవ్ చాట్లతో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. (పాక్ మాజీ క్రికెటర్ తౌఫిక్ ఉమర్‌కు కరోనా ) Mind gone, hair gone 🤯🔒 pic.twitter.com/RD6utJY3eW — K L Rahul (@klrahul11) May 23, 2020 ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న రాహుల్.. తన వర్కవుట్ వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాకుండా క్రికెట్, తన కెరియర్ లాంటి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని ఇటీవలె ఓ అభిమాని అడగ్గా..ఎబి డివిలియర్స్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ బ్యాట్స్ మాన్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13 వ సీజన్లో పంజాబ్‌కు చెందిన ఫ్రాంచైజీకి కెఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ ఆడాల్సి ఉన్నా కరోనా మహమ్మారి కారణంగా బీసీసీఐ మ్యాచ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. (కేంద్రం అనుమతిస్తేనే ఐపీఎల్ ) -
స్పెషల్ ట్రీట్
‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో తన సిక్స్ ప్యాక్ బాడీ చూపించి అభిమానులను ఉత్సాహపరిచారు ఎన్టీఆర్. హాలీవుడ్ ట్రైనర్ స్టీవెన్స్ లాయిడ్ శిక్షణతో ఈ శరీరాకృతిని సాధించారు. ఇవాళ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అప్పట్లో సిక్స్ ప్యాక్‌తో చేసిన ఫోటోషూట్‌లో రిలీజ్ చేయని ఓ స్టిల్‌ను బర్త్ డే స్పెషల్‌గా షేర్ చేశారు స్టీవెన్ -
అదిరేటి లుక్‌లో మహేశ్.. సినిమా కోసమేనా?
కరోనా లాక్డౌన్ కారణంగా దొరికిన అనూహ్య సమయాన్ని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన పిల్లలతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. సాధారణంగానే సినిమా షూటింగ్‌ల సమయంలో ఏ కాస్త విరామం దొరికినా ఇంట్లో వాలిపోతాడు. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో తన పిల్లలతో కలిసి చేసే అల్లరి పనులను ఎప్పటికప్పుడు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల్ సితార పాప కోసం మహేశ్ ఓ పాట పాడుతూ నవ్వించిన వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. గౌతమ్, సితారలతో కలిసి మహేశ్ సెల్ఫీ దిగిన ఫోటోను నమ్రత షేర్ చేశారు. ఈ ఫోటోలో సూపర్‌స్టార్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. కళ్ల జోడు పెట్టుకొని చాలా క్యూట్‌గా ఉన్న మహేశ్ లుక్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా మహేశ్ తన తదుపరి చిత్రం పరుశురామ్ డైరెక్షన్లో ఓ లవ్‌స్టోరీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే మీసాలు లేకుండా, కూల్‌గా, కాలేజీ స్టూడెంట్‌లా తన లుక్‌ను మార్చుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. View this post on Instagram My clan is retiring for the night ❤️❤️good nite people 🌟🌟#lockdownlife #staysafe A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on May 16, 2020 at 12:12pm PDT చదవండి: మహేశ్ కాదనడంతో చరణ్‌తో.. అమెజాన్‌లో అనుష్క సినిమా.. -
కపిల్ దేవ్ గుండు.. ఆమే కారణం!
కరోనా వైరస్ కష్టాలు పేద వారికే కాదు సంపన్నులకు, సెలబ్రెటీలకు కూడా తప్పటం లేదు. ఏదో ఒక విషయంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా భారత క్రికేట్ జట్టు మాజీ సారథి కపిల్ దేవ్ లాక్డౌన్ కారణంగా కూతురితో చేయించుకున్న హేయిట్ కట్ వికటించి, నున్నగా గుండు గీయించుకోవాల్సి వచ్చింది. తన న్యూలుక్ గురించి మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ జుట్టు బాగా పెరగటంతో అమియా(కూతరు)ను హేయిర్ కట్ చేయమని అడిగాను. తను నా జుట్టును చాలా చిన్నగా కత్తిరించింది. దీంతో నేను పూర్తిగా గుండు గీయించుకుని, ఫ్రెంచ్ బియర్డ్ పెట్టుకున్నాన’’ని చెప్పారు. ( కాల్చిపారేయండి: ట్రంప్ వార్నింగ్ ) అనంతరం లాక్డౌన్ అనుభవాలను పంచుకుంటూ.. ‘‘ ప్రస్తుతం ఇంట్లో వారికి అన్ని రకాలుగా సహయపడుతున్నాను. రోమీ(భార్య), అమియాలకు చేదోడువాదోడుగా ఉంటున్నాను. ఇంటి పనుల్లోనూ, వంట పనుల్లోనూ సహాయపడుతున్నా. నా షూలను పాలిష్ చేసుకోవటం మాత్రం నావల్ల కావటం లేద(నవ్వుతూ)’’ని అన్నారు. కాగా, కపిల్ న్యూలుక్‌పై స్పందించిన మాజీ భారత క్రికేటర్ సంజయ్ మంజ్రేకర్. కపిల్ న్యూలుక్ తనకెంతో నచ్చిందని, దాన్నలగే కొనసాగించాలని కోరారు. ( గాళ్‌ఫ్రెండ్ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే.. ) -
కొత్త లుక్కు... అదిరిపోయే కిక్కు
కొత్త ఏడాది వచ్చింది. వస్తూ వస్తూ సినిమాల కొత్త పోస్టర్లను, కొత్త చిత్రాల ప్రకటనలను మోసుకొచ్చింది. తెలుగు సినిమాకు కొత్త శోభను అలంకరించి ప్రేక్షకులకు అదిరిపోయే కిక్కు ఇచ్చింది. రజనీకాంత్ ‘దర్బార్’ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకడు. ఆర్మీమేజర్ అజయ్ కృష్ణగా మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. హీరో అల్లుఅర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘అల..వైకుంఠపురములో..’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా, క్రాక్’ చిత్రాల కొత్త లుక్స్ విడుదలయ్యాయి. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ‘డిస్కోరాజా’ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ‘క్రాక్’ వేసవిలో విడుదల అవుతుంది. ఈ నెల 15న ‘ఎంత మంచివాడవురా’ విడుదల కానుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన చిత్రం ఇది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు ‘అశ్వథ్థామ’గా వస్తున్నారు నాగశౌర్య. రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నితిన్‌ను ‘భీష్మ’గా మార్చారు దర్శకుడు వెంకీ కుడుముల. ఫిబ్రవరిలో ‘భీష్మ’ విడుదల కానుంది. పులివాసు దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ నటిస్తున్న ‘సూపర్‌మచ్చి’ పోస్టర్ని విడుదల చేశారు. అజయ్ కథుర్వర్, డింపుల్ జంటగా వేణు ముల్కల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వక్’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘హిట్’ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ని విడుదల చేశారు. ఫిబ్రవరి 28న సినిమా విడుదలకానుంది. నిర్మాత రాజ్‌కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన ‘చూసీ చూడంగానే..’ సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ‘క్రష్’ అనే టైటిల్ ఖరారు చేశారు.రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా బి. శశికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘22’ మూవీ టైటిల్ యానిమేషన్ లోగోని న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేశారు. ఇంకా ‘నా పేరు రాజా: ఈడోరకం’, ‘ఏమైపోయావే’, ‘ఒక చిన్న విరామం’, ‘అనుభవించు రాజా’ వంటి సినిమాల ప్రకటనలు, వీటికి సంబంధించిన ఫస్ట్‌లుక్, కొత్త లుక్‌లు కూడా ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఓసారి కోలీవుడ్ కాలింగ్ బెల్ కొడితే.. సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్ సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’!) సెకండ్లుక్ను విడుదల చేశారు. కార్తీ ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘మాస్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు.