
సినిమా హీరోలు లుక్కు మారిస్తే చాలు ఫ్యాన్స్‌కి అదో కిక్కు. ప్రస్తుతం అలాంటి కిక్కే ఫ్యాన్స్‌కు అందించారు మహేశ్‌బాబు. ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటించనున్నారు మహేశ్. ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించనున్నారాయన. అందుకోసం జుట్టు పెంచుతున్నారు కూడా. బుధవారం ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నారు మహేశ్. అందులో భాగంగా ఓ ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోలో కొత్త లుక్‌లో కనిపించిన మహేశ్‌ని చూసి ఫ్యాన్స్ అందరూ ‘భలే ఉన్నావు బాబు’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేశారు. అయితే ఇదే లుక్‌తో సినిమాలోనూ కనిపిస్తారా? ఇంకా డిఫరెంట్‌గా ఉంటుందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Comments
Please login to add a commentAdd a comment