పద్దెనిమిదో శతాబ్దం నేపథ్యంలో... | Mahesh Babu upcoming movie updates | Sakshi
Sakshi News home page

పద్దెనిమిదో శతాబ్దం నేపథ్యంలో...

Published Sat, Sep 14 2024 3:32 AM | Last Updated on Sat, Sep 14 2024 3:32 AM

Mahesh Babu upcoming movie updates

గుబురు గడ్డం, లాంగ్‌ హెయిర్‌ స్టయిల్‌తో మహేశ్‌బాబు కొత్త లుక్‌లోకి మారిన విషయం ఈ మధ్య కాలంలో ఆయన ఫొటోలు స్పష్టం చేశాయి. ఈ లుక్‌ రాజమౌళి దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమా కోసమేనని తెలిసిందే. ఇక ఈ సినిమా ఎప్పుడు ఆరంభమవుతుంది? అంటే డిసెంబర్‌లో అని సమాచారం. తాజాగా ఈ చిత్రం నేపథ్యం గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఆ కాలానికి తగ్గట్టుగా హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్లు వేయిస్తున్నారని భోగట్టా. ఈ చిత్రంలో దాదాపు రెండువందల మంది జూనియర్‌ ఆర్టిస్టులు ఉంటారని, వారంతా ఓ గిరిజన తెగకు సంబంధించినవారనీ టాక్‌. ఇప్పటికే ఈపాత్రలకు సంబంధించిన నటీనటులను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తున్నారట. ఈ నెలాఖరుకి ప్రధాన తారాగణంతో వర్క్‌ షాప్స్‌ మొదలుపెట్టి డిసెంబర్‌లో షూటింగ్‌ ఆరంభించాలని అనుకుంటున్నారని సమాచారం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement