Ad Shooting
-
సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!
Sitara Ad Video: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు తన తర్వాతి తరాన్ని కూడా అప్పుడే పరిచయం చేసేశాడు. కొడుకు గౌతమ్ ఓ సినిమాలో నటించాడు. కాకపోతే అది చైల్డ్ ఆర్టిస్ట్ రోల్. కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కూతురు సితార మాత్రం ఇప్పటి నుంచే తండ్రి మించిపోయేలా అలరిస్తోంది. (ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలున్నారు.. బాంబు పేల్చిన తెలుగు హీరోయిన్) సితారకు ప్రస్తుతం 11 ఏళ్లు. అయితేనేం ఏ సెలబ్రిటీ కిడ్కి సాధ్యం కాని విధంగా ఓ యాడ్‌లో నటించింది. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. సరే ఎంత అందుకుంది అనేది పక్కనబెడితే ఆ మొత్తాన్ని ఛారిటీకి ఇచ్చేసినట్లు స్వయంగా ఆమెనే బయటపెట్టింది. అలానే ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ఈ యాడ్‌ని తొలుత ప్రదర్శించారు. ఇప్పుడు ఆ యాడ్ పూర్తి వీడియోని మహేశ్‌బాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఈ యాడ్ వీడియోలో సితార.. చాలా అనుభవం ఉన్న అమ్మాయిలా నటించింది. కొన్నిచోట్ల యాక్టింగ్‌లో మెరుపడాల్సి ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్రెజెన్స్, హైట్, స్కిన్ కలర్ తదితర అంశాల్లో మాత్రం తండ్రి మహేశ్‌ని మించిపోతుందేమో అనిపించేలా ఉంది. త్వరలో సినిమాల్లోకి వస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సితార.. ఆల్రెడీ డ్యాన్సర్‌గా ప్రూవ్ చేసుకుంది. ముందు ముందు ఇంకెన్ని అద్భుతాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుందో చూడాలి. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) (ఇదీ చదవండి: మెగాహీరో సినిమాలకు దూరం) -
'కేజీఎఫ్' యష్ కొత్త లుక్.. 'సలార్' టీజర్ కోసమేనా?
'సలార్' టీజర్ కోసం ఫ్యాన్స్ పిచ్చ వెయిటింగ్. ఎప్పుడెప్పుడు అది రిలీజ్ అవుతుందా? దాన్ని ఎన్నిసార్లు రిపీట్స్ లో చూద్దామా అని ప్లాన్స్ వేసుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాతో 'కేజీఎఫ్'కి సంబంధం ఉందనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. అందరూ దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో హీరో యష్ కొత్త లుక్ ఒకటి వైరల్ అయింది. అది 'సలార్' టీజర్ లోనిదా అని నెటిజన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) సలార్-కేజీఎఫ్ కనెక్షన్? 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. 'సలార్' సినిమానూ తీస్తున్నాడు. దీంతో చాన్నాళ్ల ముందు నుంచే ఈ రెండు చిత్రాలకు సంబంధం ఉందని, ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అనే టాక్ నడుస్తోంది. 'సలార్' టీజర్ ని ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేస్తామని ఎప్పుడు ప్రకటించారో అందరూ అవాక్కయ్యారు. అంత పొద్దుపొద్దున ఏంటా అనుకున్నారు. అయితే 'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ లో రాకీభాయ్ పై ఎటాక్ జరిగే టైమే అదని, అందుకే అప్పుడు విడుదల చేస్తారనే అంటున్నారు. టీజర్ రిలీజైతే ఏమైనా క్లారిటీ రావొచ్చేమో. యష్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యష్ కొత్త ఫొటోలు.. 'సలార్' టీజర్ లోనివి కాదు. గడ్డానికి సంబంధించిన ఓ ఆయిల్ బ్రాండ్ ప్రమోషన్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. దీనిలోనే యష్.. కౌబాయ్ గెటప్ లో కనిపించాడు. ఆ ఫొటోలని స్క్రీన్ షాట్ తీసిన కొందరు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని చూసిన ఫ్యాన్స్.. 'సలార్' టీజర్ లోనివి అని పొరబడ్డారు. ఇకపోతే 'కేజీఎఫ్ 2' తర్వాత యాడ్స్ మాత్రమే చేస్తున్న యష్.. కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడో? (ఇదీ చదవండి: జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!
స్టార్ హీరోలు.. తమ అభిమానుల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు! దారుణంగా మోసం చేస్తున్నారు! అవును మీరు విన్నది నిజమే. ఈ మధ్య కాలంలో ఈ తరహా సంఘటనలు మరీ ఎక్కువవుతున్నాయి. తాాజాగా స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, రామ్ చరణ్ చేసిన పనికి ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అవుతున్నారు. తమని తామే తిట్టుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? వీడియో దానికోసమా? మిగతా హీరోల సంగతేమో గానీ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఏం చేసినా సరే అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. 'మహానటి', 'సీతారామం' సినిమాలతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. కొన్నిరోజుల ముందు ఓ వీడియో పోస్ట్ చేసి, డిలీట్ చేసేశాడు. తనకు సరిగా నిద్రపట్టడం లేదని ఆ వీడియోలో బాధపడ్డాడు. కట్ చేస్తే.. ఇదంతా కూడా ఓ ఫోన్ బ్రాండ్ ప్రమోషన్ కోసమేనని తాజాగా క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) రామ్‌చరణ్ కూడా పైన దాంట్లో దుల్కర్ వీడియో పెట్టి కావాలని డిలీట్ చేసి, అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అలా ఏం చేయలేదు. కాకపోతే రెండు రోజుల ముందు ఓ వీడియో రిలీజ్ చేయగా.. అందులో రామ్ చరణ్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కనిపించారు. ఇదేదో వెబ్ సిరీస్ లేదా సినిమా కోసమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఇదీ ఓ బట్టలు విక్రయించే ఓ యాప్ కోసం ప్రమోషన్ అని తేలిపోయింది. ఇలా పైన చెప్పిన రెండు సందర్భాలే కాదు.. ఈ మధ్య పలువురు హీరోహీరోయిన్లు ఇలానే ఏదో ఓ వీడియో రిలీజ్ చేయడం, అభిమానుల్లో హైప్ వచ్చేలా చేయడం, తీరా చూస్తే అది ఏదో బ్రాండ్ ప్రమోషన్ కోసం అని తెలిసి మోసపోవడం. ఫ్యాన్స్ కి అలవాటు అయిపోయింది. ఈ క్రమంలో సొంత హీరోహీరోయిన్లనీ ఏం అనలేక అభిమానులు తమని తామే తిట్టుకుంటున్నారు. కాబట్టి స్టార్స్ ఏదైనా వీడియో, పోస్ట్ పెట్టేటప్పుడు కాస్త ఆలోచించండి. మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. యువ హీరోయిన్ ఫిర్యాదు) -
వైరల్ వీడియో: విరాట్ కోహ్లీ యాడ్ షూట్ ఫన్నీ డాన్స్
-
మరోసారి జతకట్టిన హరీశ్ శంకర్-బన్నీ, థాయ్‌లాండ్‌లో షూటింగ్..
దర్శకుడు హరీశ్ శంకర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘డీజే’ చిత్రం మంచి విజయం సాధించడమే కాదు భారీ వసూళ్లు రాబట్టింది. తాజా వీరిద్దరు మళ్లీ జత కట్టారు. హరీశ్ దర్శకత్వంలో బన్నీ నటించనున్నాడు. దీనికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ పని చేశాడు. అయితే, ఇది సినిమా కోసం కాదు. ఓ యాడ్ ఫిల్మ్ కోసం. ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీతో తమ బ్రాండ్‌ను ఎండార్స్ చేసేందుకు పలు వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. Get ready to see never before Avatar of…… “ICONSTAAR “ @alluarjun #adshoots — Harish Shankar .S (@harish2you) July 28, 2022 దీంతో వాణిజ్య సంస్థలు తమ ప్రకటనల్లో నటించాలని కోరుతూ బన్నీని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ మరో యాడ్‌లో నటించనున్నాడు. అయితే ఇప్పటికీ వరకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ పలు ప్రకటనల్లో నటించాడు. ఇప్పుడు తొలిసారి హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా హరీశ్ శంకర్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్లో జరిగనుందని సమచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. Icon Staar @AlluArjun is teaming up with director @harish2you and DOP Sudeep Chatterjee for an ad shoot for @AstralPipes being shot in Hyderabad. #AlluArjun pic.twitter.com/H2CSh7BAxG — Suresh Kondi (@SureshKondi_) July 28, 2022 చదవండి: బిగ్‌బాస్‌లోకి అలనాటి స్టార్ యాంకర్! భారీ రెమ్యునరేషన్ ఆఫర్? నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ -
ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం: పూజా హెగ్డే
Pooja Hegde About Working With Amitabh Bachchan: అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం పూజా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ సరసన 'సర్కస్' సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. ఇవేకాకుండా పలు సినిమాలతో జోరు మీద ఉంది. సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉంటోంది పూజా. ఇటీవల బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ప్రముఖ శీతల పానీయం మాజా యాడ్‌లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ యాడ్‌లో అమితాబ్‌తో నటించడం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బుట్టబొమ్మ. 'అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. నాలాంటి వారికి అమితాబ్ గురువులాంటివారు. ఇంత వయసులో కూడా ఆయన సమయపాలన, డెడికేషన్ నాకెంతో నచ్చాయి. ఆయన మనవరాలిగా నటిస్తున్నప్పుడు చెప్పలేని అనుభూతికి లోనయ్యాను' అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. చదవండి: వెబ్ వీక్షకులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న ఈమె ఎవరో తెలుసా ? మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ -
పెళ్లి తర్వాత నటించనన్నావ్.. మరి ఇదేంటి?!
మహిళల జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం బిడ్డకు జన్మనివ్వడం. నవమోసాలు బిడ్డను తన కడుపులో మోసి జన్మనిస్తుంది స్త్రీ. ఇక డెలివరీ తర్వాత కనీం ఆరు నెలల వరకు ఏ పనులు చేయరు.. బిడ్డను చూసుకోవడంతోనే సరిపోతుంది ఆడవారికి. అందుకే ఉద్యోగం చేసే మహిళలకు కూడా ఆరు నెలల మెటర్నటీ లీవు ఇస్తాయి కంపెనీలు. కానీ సెలబ్రిటీలు మాత్రం రెండు మూడు నెలల విరామం తర్వాత వారి వారి పనులతో బిజీ అవుతారు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చి పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే షూటింగ్లో పాల్గొంటున్నారు. ఓ యాడ్ షూట్ పాల్గొన్న అనుష్క ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. ఇది చూసిన నెటిజనులు అనుష్క శర్మకు సంబంధించిన ఓ పాత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇదేంటి అనుష్క.. మాట తప్పావ్ అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఆ వీడియోలో అనుష్క ఏం మాట్లాడింది అనే వివరాలు.. 2012 లో ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ టాక్ షో హోస్ట్ సిమి గరేవాల్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా పెళ్లి గురించి, ఇండస్ట్రీ గురించి పలు విషయాలను వెల్లడించారు అనుష్క శర్మ. ఆ వీడియోలో ‘‘వివాహం తర్వాత మీరు నటిస్తారా’’ అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు అనుష్క పెళ్లి తర్వాత తాను పనిచేయదలుచుకోవడం లేదని చెప్పారు. వివాహం తనకు చాలా ముఖ్యమని, పెళ్లి చేసుకొని పిల్లలను కనాలని అనుకుంటున్నాను అన్నారు. అంతేకాకుండా పెళ్లి తర్వాత సినిమాలు, యాడ్స్ వంటివి చేయనని వెల్లడించారు. అప్పుడు అలా మాట్లాడిన అనుష్క ఇప్పుడు పెళ్లై.. పాప పుట్టిన తర్వాత యాడ్స్‌లో నటించడానికి సిద్ధమయ్యారు. దీంతో గతంలో మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజనులు.. ఇదేంటి అనుష్క ఇలా చేశావ్.. మాట తప్పావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Anushka Sharma (@anushkasharma5021) అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని 2017 లో వివాహం చేసుకున్నారు. సిమి గరేవాల్‌తో ఇంటర్వ్యూ తర్వాత సంవత్సరం 2013 లో ఈ జంట ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. చాలా సంవత్సరాలు డేటింగ్ చేసిన తరువాత డిసెంబర్ 2017 లో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 11న వామికా అనే కుమార్తెకు జన్మనిచ్చారు. అనుష్క శర్మ 2008 లో రాబ్ నే బనా దీ జోడి చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇక వివాహం తరువాత పరి, సంజు, సుయిధాగా, జీరో వంటి సినిమాల్లో కనిపించారు. చదవండి: అనుష్క సెల్ఫీ: ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్ విరుష్కా: నెంబర్ 11 వెనుకున్న రహస్యం! -
‘ఎంత అందంగా ఉన్నావో.. నీ పెళ్లెప్పుడు?’
బాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి టాపిక్ వస్తే చాలు.. అందరి కళ్లు రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ల మీదకే వెళ్తాయి. గత కొన్నేళ్లుగా లవ్‌లో ఉన్న వీరిద్దరి పెళ్లి గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మీడియా కూడా వీరిని అడిగే ఫస్ట్ ప్రశ్న పెళ్లి గురించే. తాజాగా మరో సారి రణ్‌బీర్-ఆలియా పెళ్లి ముచ్చట తెర మీదకు వచ్చింది. ఇందుకు కారణం ఏంటంటే కొద్ది రోజుల కిత్రం ఆలియా మెహందీ ఆర్టిస్ట్ వీణా నగ్డా కోసం బ్రైడల్ యాడ్ షూట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోని వీణా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పీచ్ కలర్ లెహంగా.. దానికి మ్యాచింగ్ భారీ ఆభరణాలు ధరించి.. చేతుల్లో ఎర్రగా పండిన మెహందీని చూపుతూ ఆలియా దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘‘పెళ్లి కుమార్తెగా ఎంత అందంగా.. ముద్దుగా ఉన్నావో’’.. ‘‘త్వరగా పెళ్లి చేసుకో’’.. ‘‘ఇంతకు నువ్వెప్పుడు పప్పన్నం పెడతావ్’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఈ ఫోటోలో ఆలియాతో పాటు మెహందీ డిజైనర్ వీణా నగ్డా కుడా ఉన్నారు. తాజాగా వీణ.. వరుణ్ ధావన్-నటాషా దలాల్ వివాహం సందర్భంగా వారికి మెహందీ డిజైనర్‌గా వ్యవహరించారు. View this post on Instagram A post shared by ᴀʟɪᴀ💕 (@mylife_aliabhatt) ఇక ఆలియా-రణ్‌బీర్‌ల విషయానికి వస్తే.. ఈ జంట 2020లోనే వివాహం చేసుకోవాల్సి ఉండేనని.. అయితే కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని ప్లాన్స్ అటకెక్కాయని స్వయంగా రణ్‌బీర్ కపూరే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆలియా తెలుగులో ప్రతీష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. చదవండి: నన్ను దారుణంగా తిడుతున్నారు.. -
భలే ఉన్నావు బాబు
సినిమా హీరోలు లుక్కు మారిస్తే చాలు ఫ్యాన్స్‌కి అదో కిక్కు. ప్రస్తుతం అలాంటి కిక్కే ఫ్యాన్స్‌కు అందించారు మహేశ్‌బాబు. ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటించనున్నారు మహేశ్. ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించనున్నారాయన. అందుకోసం జుట్టు పెంచుతున్నారు కూడా. బుధవారం ఓ యాడ్ షూట్లో పాల్గొన్నారు మహేశ్. అందులో భాగంగా ఓ ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోలో కొత్త లుక్‌లో కనిపించిన మహేశ్‌ని చూసి ఫ్యాన్స్ అందరూ ‘భలే ఉన్నావు బాబు’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేశారు. అయితే ఇదే లుక్‌తో సినిమాలోనూ కనిపిస్తారా? ఇంకా డిఫరెంట్‌గా ఉంటుందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. -
షూట్ స్టార్ట్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఆరు నెల్లల కోవిడ్ బ్రేక్ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. షూటింగ్ ప్రారంభించారు. అయితే ఇది సినిమా కోసం కాదు. ఓ కమర్షియల్ యాడ్ కోసం. సినిమాలతో పాటు బ్రాండ్ అడ్వటైజ్మెంట్లు ఎక్కువగా చేస్తుంటారు మహేశ్. రెండు రోజుల పాటు జరిగే ఈ యాడ్ చిత్రీకరణలో బుధవారం పాల్గొన్నారాయన. అలాగే మహేశ్ నటించనున్న ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
కోహ్లిని కలిసిన అఖిల్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి చేశాడు. ఎప్పుడూ క్రికెట్ గ్రౌండ్లో బిజీగా ఉండే కోహ్లి కాస్త గ్యాప్ తీసుకొని షూటింగ్‌లకు కూడా హాజరవుతున్నాడు. తాజాగా ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్న కోహ్లిని టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కలిశాడు. శుక్రవారం నుంచి జరగనున్న టెస్ట్ మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న కోహ్లి ఇక్కడే షూటింగ్లో పాల్గొన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. -
నా మీద బురద చల్లొద్దు
‘‘నాన్సెన్స్.. ఆ మాటల్లో నిజం లేదు. ఇప్పుడే కాదు... ఎప్పుడూ నేనలా చెయ్యను. నా గురించి లేనిపోని వదంతులు సృష్టించి, నా మీద బురద చల్లొద్దు’’ అంటున్నారు కత్రినా కైఫ్. ఈ అందాల సుందరి ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నారు. ఈ షూటింగ్ నుంచి హఠాత్తుగా ఆమె వాకౌట్ చేశారనే వార్త జోరుగా షికారు చేస్తోంది. ఇది కత్రినాకు తెలిసి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. దీని గురించి ఆమె వివరంగా చెబుతూ -‘‘వృత్తిని దైవంగా భావించే ఆర్టిస్ట్‌ని నేను. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం నా నిఘంటువులో లేదు. ఆ యాడ్ షూటింగ్లో 12 గంటలు నిరాటంకంగా పాల్గొన్నాను. వాళ్లు చెప్పిన టైమ్కన్నా 5 గంటలు ఎక్కువగానే పని చేశాను. 12 గంటలు పని చేయడమంటే చిన్న విషయం కాదు. పైగా అదనపు పని గంటలకు నేను అదనపు పారితోషికం కూడా డిమాండ్ చేయలేదు. అలాంటిది నా గురించి అవాకులు చెవాకులు ప్రచారం చేయడం న్యాయం కాదు’’ అన్నారు. మరి.. కత్రినా గురించి ఎవరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నట్లు అంటే.. కాంపిటీషన్లో ఉన్న నాయికల్లో ఎవరో చేస్తున్న పని ఇది అని ఆమె స్నేహితులు అంటున్నారు. ఇవాళ సక్సెస్ అవ్వడం, దాని కాపాడుకోవడమే ముఖ్యం కాదని, శత్రువుల కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోవడం కూడా ముఖ్యమేనని కత్రినా ఫ్రెండ్స్ అంటున్నారు. అదను చూసి మాటల తూటాలు విసరడానికి కత్రినా కూడా సిద్ధంగా ఉన్నారట.