Yash X Villain Beard Oil Ad Video, Ahead Of Salaar Teaser - Sakshi
Sakshi News home page

Yash New Look: కౌబాయ్ గెటప్‪‌లో యష్.. లుక్ మాత్రం!

Published Wed, Jul 5 2023 8:43 PM | Last Updated on Thu, Jul 6 2023 9:10 AM

yash X Villain Beard Oil Ad Video Salaar Teaser - Sakshi

'సలార్' టీజర్ కోసం ఫ్యాన్స్ పిచ్చ వెయిటింగ్. ఎప్పుడెప్పుడు అది రిలీజ్ అవుతుందా? దాన్ని ఎన్నిసార్లు రిపీట్స్ లో చూద్దామా అని ప్లాన్స్ వేసుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాతో 'కేజీఎఫ్'కి సంబంధం ఉందనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. అందరూ దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో హీరో యష్ కొత్త లుక్ ఒకటి వైరల్ అయింది. అది 'సలార్' టీజర్ లోనిదా అని నెటిజన్స్ సందేహం వ‍్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: సలార్-కేజీఎఫ్ కనెక్షన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)

సలార్-కేజీఎఫ్ కనెక్షన్?
'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. 'సలార్' సినిమానూ తీస్తున్నాడు. దీంతో చాన్నాళ్ల ముందు నుంచే ఈ రెండు చిత్రాలకు సంబంధం ఉందని, ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అనే టాక్ నడుస్తోంది. 'సలార్' టీజర్ ని ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేస్తామని ఎప్పుడు ప్రకటించారో అందరూ అవాక్కయ్యారు. అంత పొద్దుపొద్దున ఏంటా అనుకున్నారు. అయితే 'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ లో రాకీభాయ్ పై ఎటాక్ జరిగే టైమే అదని, అందుకే అప్పుడు విడుదల చేస్తారనే అంటున్నారు. టీజర్ రిలీజైతే ఏమైనా క్లారిటీ రావొచ్చేమో.

యష్ కొత్త లుక్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యష్ కొత్త ఫొటోలు.. 'సలార్' టీజర్ లోనివి కాదు. గడ్డానికి సంబంధించిన ఓ ఆయిల్ బ్రాండ్ ప్రమోషన్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. దీనిలోనే యష్.. కౌబాయ్ గెటప్ లో కనిపించాడు. ఆ ఫొటోలని స్క్రీన్ షాట్ తీసిన కొందరు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని చూసిన ఫ్యాన్స్.. 'సలార్' టీజర్ లోనివి అని పొరబడ్డారు. ఇకపోతే 'కేజీఎఫ్ 2' తర్వాత యాడ్స్ మాత్రమే చేస్తున్న యష్.. కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడో?

(ఇదీ చదవండి: జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement