యావత్ భారత్ సినీలోకం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’. కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది.
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సలార్‌కు సంబంధించిన ఓ క్రేజీ రూమర్ సినీ ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీయఫ్ ఫేమ్ యశ్ నటించారట. సినిమా క్లైమాక్స్‌లో హీరో యశ్‌తో పాటు ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ చేయనున్నారట.
కొట్టి పారేయలేం
సలార్‌లో ఎన్టీఆర్, యశ్ నటించారనే రూమర్‌ని కొట్టి పారేయలేం అని సినీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ప్రశాంత్ తన తర్వాత సినిమా ఎన్టీఆర్‌తో చేస్తున్నాడు. దేవర షూటింగ్ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో నటిస్తాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చేస్తాడు. అలాగే యశ్‌తో కేజీయఫ్ 3 కూడా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్. ఈ నేపథ్యంలో వీరిద్దరు సలార్‌లో గెస్ట్ రోల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ.. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం ముగ్గురు పాన్ ఇండియా హీరోలు కలిసి నటించిన భారీ చిత్రం ‘సలార్’అవుతుంది.
సలార్ రీమేకా?
సలార్‌కి సంబంధించిన ఇంకో రూమర్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2014లో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘ఉగ్రం’ చిత్రానికి ఇది రీమేక్ అనే ప్రచారం జోరందుకుంది. సలార్ ప్రారంభ సమయంలోనూ ఇదే రూమర్ వినిపించింది. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ఇది రీమేక్ కాదని స్పష్టం చేశాడు. ఉగ్రం షేడ్స్ సలార్ ఉంటాయి కానీ.. ఇది కొత్త కథ అని చెప్పాడు.
(చదవండి: ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్)
చాలా కాలం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ రీమేక్ రూమర్ తెరపైకి వచ్చింది. ఉగ్రం చిత్రాన్ని యూట్యూబ్ నుంచి తొలగించారని, రీమేక్ కాబట్టే దాన్ని తొలగించారిన కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కొంతమంది కావాలని ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని మండి పడుతున్నారు. ఇప్పటికే యూట్యూబ్‌లో ఉగ్రం అందుబాటులో ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment