Prabhas Salaar 100 Days To Witness Poster Released - Sakshi
Sakshi News home page

Salaar Movie: 'సలార్' కొత్త పోస్టర్ లో ఉన్నవి అవేనా?

Published Tue, Jun 20 2023 6:34 PM | Last Updated on Tue, Jun 20 2023 7:13 PM

Prabhas Salaar 100 Days Poster - Sakshi

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్.. 'ఆదిపురుష్' మేనియా నుంచి మెల్లగా బయటకొచ్చేస్తున్నారు. ఈ సినిమా నచ్చడం, నచ్చకపోవడం గురించి ఇ‍క్కడ ఏం మాట‍్లాడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 'సలార్' రచ్చ మొదలైపోయింది. ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వన్ అండ్ ఓన్లీ మూవీ ఇది. తాజాగా కొత్త పోస్టర్ ని విడుదల చేసి హైప్ ని పెంచేశారు.

(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!)

పోస్టర్ అదిరింది!
'సలార్'.. ఈ ఏడాది సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ తో చిత్రబృందం బిజీబిజీగా ఉంది. ఈ మూవీ థియేటర్లలోకి రావడానికి ఇంకా 100 రోజులే ఉందని చెబుతూ తాజాగా అప్డేట్ ఇచ్చారు. 'ప్రపంచానికి సీపీఆర్ పెట్టాల్సిన టైమ్ వచ్చింది' అని వేరే లెవల్లో క్యాప్షన్ పెట్టి ఎలివేషన్ ఇచ‍్చారు. అభిమానులకు మంచి కిక్ ఇచ్చే మాట చెప్పారు.

పోస్టర్ లో కేజీఎఫ్ కనెక్షన్?
'సలార్' సినిమాకు కేజీఎఫ్ స్టోరీతో సంబంధం ఉందని చాన్నాళ్ల నుంచి వినిపిస్తున్న మాట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ రెండు సినిమాల్ని లింక్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన 'సలార్' పోస‍్టర్ చాలా డార్క్ గా ఉంది. దీన్ని బ్రైటెనెస్ పెంచి చూస్తే.. అందులో కొన్ని బాక్సులు కనిపించాయి. అయితే అవి 'కేజీఎఫ్ 2'లో రాకీ భాయ్ సముద్రంలో పడేసిన బంగారం బాక్సులు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజమేంటనేది.. 'సలార్' రిలీజ్ అయితేనే తెలియదు.

(ఇదీ చదవండి: పాన్ ఇండియా హీరోలకు బోలెడు కష్టాలు.. ప్రభాస్ సహా వాళ్లందరూ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement