KGF 2
-
పుష్ప -2 క్రేజ్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 అల్‌టైమ్ రికార్డ్స్ బ్రేక్!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఈనెల 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 11 రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్క్‌ను అధిగమించింది.సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా నార్త్‌లోనూ తగ్గేదేలే అంటోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు హిందీలో ఎప్పుడు లేని విధంగా రూ.561 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: పుష్ప2 'పీలింగ్స్' సాంగ్ వీడియో విడుదల)కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మూవీ వసూళ్లు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. The BIGGEST INDIAN FILM is on a rampage at the box office ❤🔥#Pushpa2TheRule grosses 1409 CRORES GROSS WORLDWIDE in 11 days 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/bWbwb50sj4— Pushpa (@PushpaMovie) December 16, 2024 -
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శివలింగం దగ్గర 'కేజీఎఫ్' హీరోయిన్ (ఫొటోలు)
-
బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. కేజీఎఫ్-2 రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్!
శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజై 12 రోజులైనప్పటికీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.589 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించింది. కేవలం ఇండియాలోనే రూ.498 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.422 కోట్ల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏకంగా రూ.20.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.విడుదలైన రెండోవారం మొదలైన స్త్రీ-2 చిత్రానికి థియేటర్లలో ఆదరణ దక్కించుకుంటోంది. హిందీ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్-2 సాధించిన వసూళ్ల కంటే కేవలం 12 కోట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఇదే జోరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టనుంది. ఈ చిత్రం త్వరలోనే అత్యధిక వసూళ్లు చేసిన ఆరో భారతీయ చిత్రంగా నిలవనుంది. మూడో వారాంతం నాటికి రూ.500 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అపర్శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. ఈ వారంలోనూ బాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో స్త్రీ-2 ప్రభంజనం కొనసాగించే అవకాశముంది. ఆగస్ట్ 30న శుక్రవారం బీటౌన్‌లో బిగ్ స్టార్స్ చిత్రాలు ఏవీ రావడం లేదు. ఇది కూడా ఈ చిత్రానికి వసూళ్లుపరంగా కలిసి రానుంది. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన భావోద్వేగానికి పట్టం
70వ జాతీయ అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 28 భాషలకు చెందిన 300 చిత్రాల వరకూ పోటీ పడ్డాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు పోటీలో అవకాశం ఉంటుంది. అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది. ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధాన అవార్డులను పరిశీలిస్తే... ఎమోషనల్‌గా సాగే కథాంశాలకు, భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు...ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలో అంతు చిక్కని సమ్యలకు ఎలా పరిష్కారం చూపించింది? అనే అంశంతో రూపొందిన డివోషనల్, ఎమోషనల్ తెలుగు మూవీ ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రంలో కనబర్చిన పవర్ఫుల్, ఎమోషనల్ నటనకుగాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా, సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు దక్కించుకుంది. ప్రేమ, ప్రేమలో విఫలం, కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళమ్’లో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటనకు గాను నిత్యామీనన్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో భార్య పాత్రలో కనబర్చిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసీ పరేఖ్ అవార్డు అందుకోనున్నారు. ఓ నాటక రంగానికి సంబంధించిన ట్రూప్ నేపథ్యంలో ఆనంద్ ఇకర్షి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘ఆట్టమ్’కి ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. చనిపోయిన ఓ స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి ముగ్గురు వృద్ధ స్నేహితులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కి వెళ్లే కథాంశంతో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఊంచాయి’. ఈ ఎమోషనల్ రైడ్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన సూరజ్ బర్జాత్యా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) అవార్డును హిందీ ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ’కి సంగీత దర్శకుడు ప్రీతమ్, ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును తమిళ ‘΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్–1’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దక్కించు కున్నారు.ఇక గత ఏడాది పది అవార్డులు దక్కించుకున్న తెలుగు పరిశ్రమ ఈసారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సరిపెట్టుకుంది. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.జాతీయ అవార్డులోని కొన్ని విభాగాలు.... ⇒ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ) ⇒నటీమణులు: నిత్యా మీనన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ) ⇒చిత్రం: ఆట్టమ్ (మలయాళం)⇒దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఊంచాయి – హిందీ) ⇒దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్ (ఫౌజా –హరియాన్వీ) సంగీత దర్శకత్వం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ– హిందీ)⇒సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఏఆర్ రెహమాన్ (΄పొన్నియిన్ సెల్వన్ – 1, తమిళ్) నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర– పార్ట్ 1: శివ – హిందీ) ⇒నేపథ్య గాయని: బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క సీసీ 225/2009 – మలయాళం) ⇒సహాయ నటి: నీనా గు΄్తా (ఊంచాయి– హిందీ) ⇒సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి) ⇒బాల నటుడు: శ్రీపత్ (మాలికాపురమ్ – మలయాళం) ⇒సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్ – 1) ⇒కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్) ⇒యాక్షన్ డైరెక్షన్: అన్బు–అరివు (కేజీఎఫ్ 2 – కన్నడ) ⇒విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ (హిందీ) ⇒మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి. చిట్టెల (గుల్మోహర్ – హిందీ) ⇒సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి – ΄పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం) ⇒స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): ఆనంద్ ఏకార్షి (ఆట్టమ్ – మలయాళం) ⇒జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ్రపోత్సహించే చిత్రం: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ) ⇒సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కాంతార (కన్నడ).ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు⇒తెలుగు: కార్తికేయ–2 ⇒కన్నడ: కేజీఎఫ్ చాప్టర్–2 ⇒తమిళ్: ΄పొన్నియిన్ సెల్వన్ – 1 ⇒మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009 ⇒హిందీ: గుల్మోహర్అవార్డు బాధ్యత పెంచింది – చందు మొండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సందర్భంగా చిత్రబృందం సమావేశం నిర్వహించింది. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నేషనల్ అవార్డు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మైల్స్టోన్ మూమెంట్. మా బ్యానర్‌కి తొలి జాతీయ అవార్డు ఇది’’ అన్నారు. ‘‘కృష్ణుడు నిజం అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డు కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను’’ అని అభిషేక్ అగర్వాల్ చె΄్పారు.నిఖిల్ మాట్లాడుతూ – ‘‘కార్తికేయ 2’ విజయం సాధించడానికి, అవార్డు రావడానికి కారణం మా టీమ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, అద్భుతమైన విజయం సాధించింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు.కార్తికేయ కథేమిటంటే... ద్వాపర యుగంలో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలి కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, ‘కలియుగంలో వచ్చే ఎన్నో అంతు చిక్కని సమస్యలకు ఈ కడియం పరిష్కారం చూపుతుంది’ అని చెబుతాడు. కలియుగంలో నాస్తికుడైన డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళతాడు. అప్పటికే కడియానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్రోఫెసర్ రంగనాథ రావ్‌ను హతమార్చడానికి ట్రై చేస్తుంటాడు సైంటిస్ట్ శాంతను. అతని మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు రంగనాథ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు శ్రీకృష్ణ భక్తులైన అధీరుల తెగకు చెందిన వ్యక్తులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. అయితే రంగనాథ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ) సాయంతో వారందరి నుంచి డాక్టర్ కార్తికేయ ఎలా తప్పించుకున్నాడు? చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నదే కథ.ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించిన ‘ఆట్టమ్’ కథేంటంటే.. ఓ నాటక బృందంలో 12 మంది నటులు, ఒక నటీమణి ఉంటారు. నటులుగా వినయ్ పాత్రలో వినయ్ ఫోర్ట్, అంజలిగా జరీన్ షిబాబ్, కళాభవన్ షాజాన్ హరి కీలక పాత్రలు పోషించారు. వీళ్ల నాటక ప్రదర్శన ఓ విదేశీ జంటకి నచ్చడంతో తమ రిసార్ట్‌లో వాళ్లకి ఆతిథ్యమిస్తారు. పార్టీ అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అయితే తన గదిలో కిటికీ పక్కన నిద్రపోతున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి నాటక బృందంలోని 12 మందిలో ఒకరా? లేకుంటే బయటి వ్యక్తా? అనే విషయాన్ని అంజలి ఎలా బయటపెట్టింది? అన్నది ‘ఆట్టమ్’ కథ. హాలీవుడ్ మూవీ ‘12 యాంగ్రీమెన్’ (1954) ఆధారంగా ‘ఆట్టమ్’ రూపొందింది.కెరాడి టు పాన్ ఇండియాకర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రిషబ్ శెట్టి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేశారు రిషబ్. డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బుల కోసం కూలి పనులు చేశారు. 2004 నుంచి 2014 వరకు (తొలి సారి డైరెక్షన్ చేసేవరకు) వాటర్ క్యా¯Œ లు అమ్మారు. రియల్ ఎస్టేట్ సంస్థలో, హోటల్స్‌లో పని చేశారు. క్లాప్ బాయ్‌గా ఇండస్ట్రీలో జర్నీ ్రపారంభించిన రిషబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు.‘తుగ్లక్’ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రికీ’ (2016). ఆ తర్వాతి సినిమా ‘కిరిక్ పార్టీ’తో దర్శకుడిగా రిషబ్ పేరు కన్నడనాట మార్మోగింది. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. -
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను వెళ్లడించింది. ఈసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కన్నడ హీరో రిషబ్ శెట్టి (కాంతార) అందుకోనున్నాడు. అయితే, ఉత్తమ నటిగా నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఇద్దరికి సంయుక్తంగా దక్కింది. జాతీయ ఉత్తమ చిత్రంగా ఆట్టమ్ (మలయాళం) నిలిచింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2' నిలిచింది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్-2 అవార్డు దక్కించుకుంది. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్మొహర్ నిలిచింది.జాతీయ అవార్డ్ విజేతలు వీరేఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి)ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్మోహర్) ఉత్తమ ప్రాంతీయ సినిమాలుఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలు ఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్- లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్)ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్) -
నాలుగేళ్లకే లాభాల్లోకి చేరిన హైదరాబాద్ కంపెనీ
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు తాజాగా విడుదలకు సిద్ధమైన కల్కి చిత్రానికి డిజిటల్‌మార్కెట్ చేస్తున్న సిల్లీమాంక్స్ నాలుగేళ్లకే లాభాల్లోకి చేరింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రూ.26.83లక్షలు లాభాన్ని పోస్ట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లమేర నష్టపోయిన సంస్థ తాజా ఫలితాల్లో లాభాలు పోస్ట్ చేయడంతో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.కంపెనీ లాభాలపై సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలకంగా ఉన్న సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభదాయకంగా మారడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. సంస్థ చేపట్టిన కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలతో ఈ విజయం సొంతమైంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. సంస్థ ప్రాజెక్ట్‌లు ఇవే..ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ సంస్థ సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. గతంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు త్వరలో విడుదలయ్యే ప్రబాస్ నటించిన కల్కి 2898-ఏడీ చిత్రం యూనిట్లతో కలిసి పనిచేసింది. డిజిటల్ మార్కెటింగ్తోపాటు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తోంది.ఉద్యోగులకు షేర్క్యాపిటల్లో 5 శాతం వాటాకంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా తమ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ‘ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్’(ఈసాప్)ను ప్రకటించింది. ఈప్లాన్‌లో భాగంగా కంపెనీ మొత్తం షేర్క్యాపిటల్లో 5శాతం వాటాను తమ ఉద్యోగులకు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో ఈవాటాలో 70 శాతం మూలధనాన్ని ఉద్యోగులకు పంచనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2024 నుంచి ప్రారంభంకానుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండికరోనా కారణంగా సినిమా పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి తీవ్ర అనిశ్చితులు ఎదుర్కొంది. క్రమంగా కొవిడ్ భయాలు తొలగి గతేడాది నుంచి ఆ రంగం పుంజుకుంటోంది. ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన కంపెనీలు లాభాల్లోకి చేరుతున్నట్లు మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. -
కరీనా కపూర్ ఖాన్ KGF స్టార్ యష్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది
-
కేజీఎఫ్ ప్రజల ప్రేమ అమోఘం: స్టార్ డైరెక్టర్
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా.రంజిత్. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రతిభావంతులైన కొత్త సంగీత కళాకారులను ప్రోత్సహించే విధంగా గత కొన్నేళ్లుగా నీలం కల్చరల్ సెంటర్ పేరుతో మార్గశిర మాసంలో పలు గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనం సంగీత కార్యక్రమాన్ని హోసూరు, చైన్నె, కేజీఎఫ్ ప్రాంతాల్లో నిర్వహించ తలపెట్టారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేజీఎఫ్‌లోని నగర పరిపాలన మైదానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈనెల 28 నుంచి 30 వరకు చెన్నైలో మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు రంజిత్ మాట్లాడుతూ.. బుద్ధుని ఆశీస్సులతో ఈ జన సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేజీఎఫ్ ప్రజల ప్రేమాభిమానాలు తనను ఆశ్చర్య పరిచాయన్నారు. ఇకపై కూడా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానన్నారు. సంగీత కళాకారులతో కలిసి బాబా సాహెబ్ అంబేడ్కర్ మార్గంలో మనమంతా పెద్ద విప్లవాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు దినేష్, కలైయరసన్, రచయిత తమిళ్ ప్రభ, దర్శకుడు దినకర్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై పలువురు కళాకారులు జన సంగీత కళలను ప్రదర్శించి ఆహుతులను ఆలరించారు. We are all set at kgf, come join us today and celeberate a music festival straight from the roots✨🎊🥁 Welcome you All! Entry Free! Today at 3pm. Location: Municipality Ground, Robertsonpet. Kolar Gold Fields,Karnataka.@beemji @Neelam_Culture @NeelamSocial @KoogaiThirai pic.twitter.com/qfwusQKKdB — Margazhiyil Makkalisai (@makkalisai) December 23, 2023 రు. -
సలార్ డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్.. టీజర్ రిలీజ్..!
కేజీయఫ్, కాంతార, సలార్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతోన్న మరో చిత్రం బఘీరా. ఈ చిత్రంలో శ్రీమురళీ, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. ఈ మూవీకి సూరి దర్శకత్వం వహించగా.. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రోజు హీరో శ్రీమురళి బర్త్ డే సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ బఘీరా టీజర్ చేసింది. విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రఘు, అచ్యుత్ కుమార్. గరుడ రాముడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 𝐖𝐡𝐞𝐧 𝐬𝐨𝐜𝐢𝐞𝐭𝐲 𝐛𝐞𝐜𝐨𝐦𝐞𝐬 𝐚 𝐣𝐮𝐧𝐠𝐥𝐞... 𝐚𝐧𝐝 𝐨𝐧𝐥𝐲 𝐨𝐧𝐞 𝐩𝐫𝐞𝐝𝐚𝐭𝐨𝐫 𝐫𝐨𝐚𝐫𝐬 𝐟𝐨𝐫 𝐣𝐮𝐬𝐭𝐢𝐜𝐞...💥 Presenting #BagheeraTeaser to you all ▶️ https://t.co/VRviuMij3o Wishing our 'Roaring Star' @SRIMURALIII a very Happy Birthday.#Bagheera… pic.twitter.com/UxMAaJp1Qr — Hombale Films (@hombalefilms) December 17, 2023 -
తారక్, యష్ చిత్రాలపై అంచనాలు పెంచేసిన ప్రశాంత్ నీల్
కేజీఎఫ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ ఫ్రాంచైజీతో వచ్చిన రెండు సినిమాలు చరిత్రను సృష్టించాయి. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు టాప్ హీరోలు క్యూ కడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయన చేతిలో పాన్ ఇండియా హీరో జూ ఎన్టీఆర్ చిత్రం ఉంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం కథపై ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రశాంత్. తాజాగా ఓ ఇంటరర్వ్యూలో తారక్ సినిమా గురించి మాట్లాడి అంచనాలను పెంచేశాడు. ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు విభిన్నంగా తారక్ మూవీ ఉంటుందని ఆయన తెలిపాడు. కానీ.. ఆ చిత్రానికి సంబంధించిన కథ ఏ నేపథ్యంలో సాగుతుందో అనేది ఆయన రివీల్ చేయలేదు. అభిమానులు మాత్రం భారీ యాక్షన్ చిత్రమని భావిస్తున్నారని ఆయన చెప్పాడు. తారక్‌తో తీస్తున్న జానర్ ఏదైనా అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 2024 ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. మరోవైపు యష్ జోడి 'కేజీఎఫ్' ఫ్రాంచైజీలో భాగంగా పార్ట్-3 ఉంటుందని ఆయన తెలిపాడు. KGF విడుదలైన 3 సంవత్సరాల తర్వాత, KGF 2 విడుదలైంది. దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కరోనాతో షాక్‌కు గురైన సినిమాలకు ఇది కొత్త ఆశను తెచ్చిపెట్టింది. త్వరలో కేజీఎఫ్- 3 రాబోతుంది. యష్ లేని కేజీఎఫ్ లేదు. త్వరలో ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తెలుపుతారు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి అయింది. సీక్వెల్ చేయాలనే ఆలోచనతోనే 'కేజీయఫ్ 2' ఎండింగ్లో హింట్ ఇచ్చామని ఆయన పేర్కొన్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ తెరకెక్కిస్తున్న చిత్రం 'సలార్'. ఇందులో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీరావు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన సలార్ ట్రైలర్ భారీగా రికార్డ్లను క్రియేట్ చేసింది. డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నెల 15 నుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
యష్ కొత్త చిత్రం ప్రకటన.. సాయి పల్లవికే ఛాన్స్.. డైరెక్టర్ ఎవరంటే
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు యష్.. KGF చాప్టర్ 2 విడుదలై ఇప్పటికి ఏడాదిన్నర అవుతుంది. కానీ ఆయన నుంచి ఏ సినిమా గురించి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు, కాబట్టి అభిమానులు యష్ 19 గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్ అయిన ఈ నటుడి సినిమా కోసం దేశం మొత్తం సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతలో, నటుడు యష్19 గురించి ఒక అప్డేట్ వచ్చేసింది. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం ఉదయం 09:55 గంటలకు యష్ 19 టైటిల్‌ను ప్రకటించనున్నట్లు రాకింగ్ స్టార్ తెలియజేశాడు. దీని తరువాత, ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, దర్శకుడు, సాంకేతిక నిపుణుల గురించి చర్చ జరుగుతోంది. దీంతో చాలా మంది నటీనటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో యష్ హీరోయిన్గా నటి సాయి పల్లవి పేరు ముందు వరుసలో ఉంది. సౌత్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా గుర్తింపు పొందిన నటి సాయి పల్లవిలో మంత్రముగ్ధులను చేసే డ్యాన్స్‌తో పాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత) ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఆమె వెనుదిరిగి చూడలేదు. మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల తర్వాత ఇప్పుడు యష్‌తో ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం సాయి పల్లవి ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం యష్ 19కి సంతకం చేసిందని టాక్. ఆమె ఇప్పటికే తెలుగులో నాగ చైతన్య రాబోయే చిత్రం తండేల్‌లో నటిస్తోంది. అలాగే, నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో సాయి పల్లవి, యష్ నటిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారని సమాచారం. ఈ వార్తను సాయి పల్లవి నిర్ధారించింది కానీ యష్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. యష్ 19వ చిత్రం టైటిల్‌ను ఈ డిసెంబర్ 8, శుక్రవారం ఉదయం 09:55 గంటలకు విడుదల చేయనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కించనున్నట్లు దాదాపు ఖాయమైపోయింది. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందించే అవకాశం ఉంది. గీతు మోహన్ దాస్ హిందీలో అబద్ధాల పాచికలు అనే చిత్రాన్ని 2014లో తెరకెక్కించారు. ఆ చిత్రానికి గాను రెండు జాతీయ అవార్డులు ఆమెకు దక్కాయి. సుమారుగా 50కి పైగా చిత్రాల్లో నటించి మంచి నటిగా కూడా గుర్తింపు పొందారు. It’s time… 8th December, 9:55 AM. Stay tuned to @KvnProductions #Yash19 pic.twitter.com/stZYBspuxY — Yash (@TheNameIsYash) December 4, 2023 -
KGF ఫ్యాన్స్ బీ రెడీ.. ఛాప్టర్-3 ఎప్పుడంటే
ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో కేజీఎఫ్ మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. ఈ సినిమాతో హీరో యష్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి క్రియేట్ చేసింది. దీంతో 2022లో రెండవ భాగాన్ని విడుదల చేశారు మేకర్స్. 'కేజీఎఫ్' సిరీస్ గ్రాండ్ సక్సెస్ తర్వాత, మేకర్స్ ఈ చిత్రానికి మూడవ భాగాన్ని ప్రకటించారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి.. KGF, యష్ అభిమానులు 'KGF- 3' గురించి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి :నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్) తాజాగా హోంబలే ఫిల్మ్స్‌కు చెందిన అధికార ప్రతినిధి 'కేజీఎఫ్' మూడవ భాగం గురించి కొత్త అప్డేట్ చెప్పారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్- 3 మూవీ 2025లో విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ సినిమా నిర్మాణ పనులు 2023లోనే ప్రారంభమవుతాయని, ఇదే విషయాన్ని డిసెంబర్ 21న హోమ్‌బలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు 2024లో ప్రారంభించి.. 2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం. కేజీఎఫ్- ఛాప్టర్ 2 ఎండింగ్లో పార్ట్- 3 ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. అందుకే సినిమా కూడా కన్‌క్లూజన్ లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. కానీ అటు ప్రోడక్షన్ హౌస్ గానీ ఇటు హీరో గానీ ఎటువంటి అప్డేట్ను షేర్ చేయలేదు. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్‌తో 'సలార్' సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. యష్ ఇప్పటి వరకు తన నుంచి మరో సినిమా ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఈ మూవీ అప్డేట్ గురించి ఎక్కడా ప్రచారంలోకి రాలేదు. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారంతో కేజీఎఫ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్) -
అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ
ఇప్పుడు ఏ భాషలో సినిమా తీసుకున్నా ముద్దు అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రేక్షకులకు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే స్క్రీన్‌పై అది చూడటానికి బాగానే ఉన్నా.. దాని వెనక కష్టాలు పెద్దగా ఎవరికీ తెలియవు. అయితే గతంలో తనకు ముద్దు వల్ల జరిగిన చేదు అనుభవాన్ని 'కేజీఎఫ్' ఫేమ్ రవీనా టాండన్ బయటపెట్టింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) ఏం జరిగింది? 1991 నుంచి ఇండస్ట్రీలో ఉన్న రవీనా టాండన్.. హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది. టాలీవుడ్ వరకు వస్తే బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల్లో నటించింది. 'కేజీఎఫ్ 2'లో రమికా సేన్ పాత్ర చేసి చాలా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే 'నో కిస్సింగ్ రూల్' పాటించే ఈమెకు కెరీర్ ప్రారంభంలో అనుకోకుండా సహనటుడి పెదాల్ని తన పెదాలతో. దీంతో ఈమెకు వాంతి అయిందట. రవీనా కామెంట్స్ 'ఎప్పుడూ ముద్దు సీన్స్‌లో నటించలేదు. ఎందుకో వాటిలో యాక్ట్ చేస్తే నాకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే నటించను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఓ సీన్ చేస్తున్నప్పుడు సహనటుడి పెదాలు పొరపాటున నా పెదాలకు తగిలాయి. అది అతడు కావాలని చేయలేదు. కానీ చిరాగ్గా అనిపించింది. వెంటనే గదిలోకి వెళ్లిపోయా. ఎంతో వికారంగా అనిపించింది. వాంతి చేసుకున్నా. నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండనిపించింది' అని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది. అయితే అది ఏ సినిమా, నటుడెవరు తదితర విషయాలు మాత్రం బయటపెట్టలేదు. (ఇదీ చదవండి: Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ) -
సైమా అవార్డ్స్: కాంతారా, కేజీఎఫ్ మధ్య పోటీ.. విజేతల జాబితా ఇదే
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) సెప్టెంబర్ 15న అట్టహాసంగా ప్రారంభమైంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 11వ ఎడిషన్ సౌత్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరుగుతోంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే తెలుగు,కన్నడ సినీ రంగంలోని ప్రముఖులు అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నేడు తమిళ్,మలయాళం చిత్రాలకు అందించనున్నారు. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) కన్నడలో కాంతారా, చార్లీ 777, కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి చిత్రాలకు భారీగా అవార్డులు వచ్చాయి. ‘కెజిఎఫ్ చాప్టర్ 2’లో అద్భుత నటనకుగానూ యష్ 'ఉత్తమ నటుడు' అవార్డును, శ్రీనిధి శెట్టి 'ఉత్తమ నటి' అవార్డును గెలుచుకున్నారు. కాంతారా చిత్రంలో అద్భుతమైన నటనకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డును గెలుచుకున్నాడు. రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అత్యధికంగా కాంతారా సినిమాకు 10 అవార్డులు వచ్చాయి. కన్నడ చిత్రసీమలో అవార్డు దక్కించుకున్న వారి జాబితా ఇదే. కన్నడ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (కన్నడ): ( 777 చార్లీ) * ఉత్తమ నటుడు (కన్నడ): యష్ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నటి (కన్నడ): శ్రీనిధి శెట్టి (KGF చాప్టర్ 2) * ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి -(కాంతారా) * ఉత్తమ సంగీత దర్శకుడు: బి. అజనీష్ లోక్‌నాథ్ (కాంతారా) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : రిషబ్ శెట్టి (కాంతారా) * ఉత్తమ నటి ( క్రిటిక్స్) : సప్తమి గౌడ (కాంతారా) * ఉత్తమ విలన్ : అచ్యుత్ కుమార్ (కాంతారా) * ఉత్తమ సహాయ నటుడు : దిగంత్ మంచలే (గాలిపాట 2) * ఉత్తమ సహాయ నటి : శుభ రక్ష (హోమ్ మినిస్టర్) * ఉత్తమ నటుడు: ప్రకాష్ తుమినాడ్ (కాంతారా) * ఉత్తమ గేయ రచయిత (కన్నడ) : ప్రమోద్ మరవంతే 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయకుడు (కన్నడ) : విజయ్ ప్రకాష్, 'సౌందర్య రాశివే' పాట కోసం (కాంతర) * ఉత్తమ నేపథ్య గాయని (కన్నడ): సునిధి చౌహాన్, 'విక్రాంత్ రోనా'లోని 'రా రా రక్కమ్మ' పాట కోసం * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : భువన్ గౌడ (KGF చాప్టర్ 2) * ఉత్తమ నూతన దర్శకుడు: సాగర్ పురాణిక్ (డొల్లు) * ఉత్తమ నూతన నిర్మాత : అపేక్ష పురోహిత్,పవన్ కుమార్ వాడెయార్ (డొల్లు) * ఉత్తమ నూతన నటుడు: పృథ్వీ షామనూర్ (పదవి పూర్వ) * ఉత్తమ నూతన నటి: నీతా అశోక్ (విక్రాంత్ రోనా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : రిషబ్ శెట్టి (కాంతారా) * స్పెషల్ అప్రిషియేషన్ అవార్డ్ : ముఖేష్ లక్ష్మణ్ (కాంతారా) * ప్రత్యేక ప్రశంస అవార్డు ఉత్తమ నటుడు (కన్నడ): రక్షిత్ శెట్టి (చార్లీ 777) -
కేజీయఫ్-2 క్లైమాక్స్‌తో ‘సలార్’కు లింకు.. టీజర్ టైమ్‌తో క్లారిటీ?
మరో రెండు రోజుల్లో (జూలై 6) ‘సలార్’ టీజర్ రాబోతుంది. ‘ఆదిపురుష్ రిజల్ట్‌తో డీలా పడ్డ ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇది పెద్ద ఉమశమనం. అందుకే టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జులై 6 తర్వాత తమ హీరో పేరు మరోసారి పాన్ ఇండియా స్థాయిలో మారు మ్రోగి పోవడం ఖాయమనే ధీమాతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే సలార్ టీజర్‌ని అంత పొద్దున( ఉదయం 5.12 గంటలకు) రీలీజ్ చేయడం వెనుక కారణం ఏంటనే చర్చ నెట్టింట మొదలైంది. (చదవండి: బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ను ఢీ కొడుతున్న ప్రభాస్..) ప్రభాస్‌కి ఉదయమే టీజర్‌ని విడుదల చేసే సెంటిమెంట్ ఉందని, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల మాదిరి సలార్ అప్డేట్ కూడా ఉదయమే ఇవ్వాలని ప్రభాస్ సూచించడంతోనే సలార్ టీజర్‌ని అంత పొద్దున రిలీజ్ చేస్తున్నారనే టాక్ నిన్నటిదాకా వినిపించింది. ఇక తాజాగా మరో క్రేజీ రూమర్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. సలార్ మూవీకి కేజీయఫ్ చిత్రంతో లింక్ ఉందంట.. అందుకే టీజర్‌ని ఉదయం 5.12 గంటలకు విడుదల చేస్తున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. సరిగ్గా 5.12 గంటలకే ఎందుకు? ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీయఫ్ సిరీస్‌లు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిందే. గతేడాది విడుదలైన ‘కేజీయఫ్ 2’ చిత్రం పార్ట్ 1ని మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. రాఖీ భాయ్ చనిపోవడంతో ఆ చిత్రం ముగుస్తుంది. ఆ క్లైమాక్స్ సీన్‌కి సలార్ టీజర్ విడుదలకి సంబంధం ఉందట. రాఖీ భాయ్ చనిపోయినట్లు చూపించే సన్నివేశంలో నాలుగు గడియారాలు ఉంటాయి. ఒక్కోక్కటి ఒక్కో సమయాన్ని సూచిస్తుంది. అందులో ఒకటి సరిగ్గా 5.12 నిమిషాలను చూపిస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి ఇప్పుడు తెగ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. కేజీయఫ్ సిరీస్‌తో సలార్‌కు లింక్ ఉందని.. అందుకే టీజర్‌ని ఉదయం 5.12 గంటలకు విడుదల చేస్తున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. కొంతమంది ఇది నిజమే అంటుంటే.. మరికొంత మంది ‘ఇదేం కనెక్షన్స్రా బాబోయ్...’ అని కామెంట్ చేస్తున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం ఈ సారి బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. #Salaar #KGF #Prabhas 5:12 AM is the time Rocky Bhai gets attacked in KGF-2 climax and it’s the teaser time of Salaar 🔥🔥 . Mother of all collisions Salaar is coming up 🔥🔥🔥. Salaar 🚢 Kgf #Prabhas #Yash @hombalefilms#salaarbhaicoming pic.twitter.com/KduNGXoGAB — NANI CAMERON ™ (@Nani____3) July 3, 2023 -
లేడీ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన 'కేజీఎఫ్' యశ్!
పాన్ ఇండియా హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ టాప్ లో ఉంటాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు ఉంటారు. తెలుగు కాకుండా దక్షిణాది నుంచి ఈ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో 'కేజీఎఫ్' యశ్ ఒకడు. గతేడాది ఏప్రిల్ లో 'కేజీఎఫ్ 2'తో వచ్చి వేల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. దీంతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యాన్స్ అయితే ఈ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అప్డేట్ వచ్చేసినట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?) 'కేజీఎఫ్' రెండు సినిమాల కోసం దాదాపు ఏడేళ్లు వెచ్చించిన హీరో యశ్.. అందుకు తగ్గ ఫలితం అందుకున్నాడు. ఇదే ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ బడ్జెట్ తో సినిమాలు చేస్తే అభిమానులకు నచ్చకపోవచ్చు. అందుకే ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో కలిసి ఓ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడట. అధికారికంగా బయటకు రానప్పటికీ.. ఈ కాంబో ఖరారైనట్లు తెలుస్తోంది. మలయాళంలో 1989-2009 మధ్య నటిగా ఓ 20కి పైగా సినిమాలు చేసిన గీతూ మోహన్ దాస్.. 2009లో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. 2014లో 'లైయర్స్ డైస్' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. 2019లో 'మూతున్' మూవీ తీసింది. లాక్ డౌన్ టైంలో ఓ యాక్షన్ స్టోరీ రెడీ చేసిన ఈమె.. దాన్ని యశ్ కి చెప్పగా అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అదే టైంలో ఓ రొమాంటిక్ స్టోరీ కూడా యశ్ కోసం సిద్ధం చేసిందట. ఈ రెండింట్లో ఏది చేయాలనే కన్ఫ్యూజన్ కాస్త నడుస్తోందని, ఇది క్లియర్ అయిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?) -
ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?
మనల్ని ఎంటర్టైన్ చేసే సినిమా స్టార్స్.. నటించడంతో పాటు పలు వ్యాపారాలు చేస్తుంటారు. మొన్నటివరకు ఫుడ్, రెస్టారెంట్స్ లో వీళ్లు ఎక్కువగా కనిపించారు. రీసంట్ టైంలో మహేశ్, బన్నీ, విజయ్ దేవరకొండ లాంటివాళ్లు మల్టీప్లెక్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇవన్నీ చాలా సాధారణ విషయాలన్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో, 'కేజీఎఫ్ 2' విలన్ ఎవరూ ఊహించని వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కళ్లు చెదిరే మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. డ్రగ్స్ కి బానిసవడం, అక్రమాయుధాల కేసులో జైలుకి వెళ్లడం లాంటి చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. అదంతా పక్కనబెట్టి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఓవైపు లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు విలన్, సహాయక పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. గతేడాది 'కేజీఎఫ్ 2'లో అధీరాగా భయపెట్టిన సంజూ.. ప్రస్తుతం విజయ్ 'లియో', ప్రభాస్-మారుతి దర్శకత్వంలో వస్తున్న మూవీలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇలా కెరీర్ పరంగా బాగా సంపాదిస్తున్న సంజయ్ దత్.. ఇప్పుడు లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. రిటైల్ బిజినెస్ చేయడమే టార్గెట్ గా కార్టెల్ & బ్రోస్ అనే ఆల్కోబెవ్ (ఆల్కహాలిక్ బేవరేజ్) స్టార్టప్ లో పెట్టుబడి పెట్టాడు. ఈ కంపెనీ ఎక్కువగా స్కాచ్-విస్కీ తయారు చేస్తుంది. మన దేశంలో పోర్ట్ ఫోలియోని విస్తరించడమే లక్ష్యంగా.. ఈ కంపెనీలో సంజయ్ దత్ దాదాపు రూ.1000 కోట్ల మొత్తం పెట్టుబడిగా ఉంచినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!) -
'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్.. 'ఆదిపురుష్' మేనియా నుంచి మెల్లగా బయటకొచ్చేస్తున్నారు. ఈ సినిమా నచ్చడం, నచ్చకపోవడం గురించి ఇక్కడ ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 'సలార్' రచ్చ మొదలైపోయింది. ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వన్ అండ్ ఓన్లీ మూవీ ఇది. తాజాగా కొత్త పోస్టర్ ని విడుదల చేసి హైప్ ని పెంచేశారు. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) పోస్టర్ అదిరింది! 'సలార్'.. ఈ ఏడాది సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ తో చిత్రబృందం బిజీబిజీగా ఉంది. ఈ మూవీ థియేటర్లలోకి రావడానికి ఇంకా 100 రోజులే ఉందని చెబుతూ తాజాగా అప్డేట్ ఇచ్చారు. 'ప్రపంచానికి సీపీఆర్ పెట్టాల్సిన టైమ్ వచ్చింది' అని వేరే లెవల్లో క్యాప్షన్ పెట్టి ఎలివేషన్ ఇచ్చారు. అభిమానులకు మంచి కిక్ ఇచ్చే మాట చెప్పారు. పోస్టర్ లో కేజీఎఫ్ కనెక్షన్? 'సలార్' సినిమాకు కేజీఎఫ్ స్టోరీతో సంబంధం ఉందని చాన్నాళ్ల నుంచి వినిపిస్తున్న మాట. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ రెండు సినిమాల్ని లింక్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన 'సలార్' పోస్టర్ చాలా డార్క్ గా ఉంది. దీన్ని బ్రైటెనెస్ పెంచి చూస్తే.. అందులో కొన్ని బాక్సులు కనిపించాయి. అయితే అవి 'కేజీఎఫ్ 2'లో రాకీ భాయ్ సముద్రంలో పడేసిన బంగారం బాక్సులు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజమేంటనేది.. 'సలార్' రిలీజ్ అయితేనే తెలియదు. (ఇదీ చదవండి: పాన్ ఇండియా హీరోలకు బోలెడు కష్టాలు.. ప్రభాస్ సహా వాళ్లందరూ!) -
కేజీఎఫ్ రాఖీ భాయ్ ఫ్యామిలీ ఫొటోలు చూశారా..
-
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు
ఆది నుంచీ భారతీయ చిత్ర పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. అలనాటి మొఘల్-ఎ-ఆజం, షోలే నుంచి లగాన్, దిల్వాలే దుల్హనియా లేజాయింగే, పీకే , పఠాన్, బజరంగీ భాయిజాన్ లాంటి బాలీవుడ్ సినిమాలతో పాటు దేశంలో రెండవ అతిపెద్ద నిర్మాణ కేంద్రంగా ఉన్న టాలీవుడ్లో 1977లో ఎన్టీ రామారావు నటించిన అడవి రాముడు సినిమా కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. 1992లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి మూవీ ఘరానా మొగుడు , బాక్సాఫీస్ వద్ద రూ 10 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం. బాహుబలి, పుష్ప సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో నిలిచాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ రూ.1258 కోట్లను రాబట్టడమే కాదు ఆస్కార్ అవార్డులను సైతం కైవసం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే కన్నడ మూవీల జాబితాలో వసూళ్లకు సంబంధించిన టాప్ వసూళ్లతో దూసుకుపోతున్న మూవీ కేజీ ఎఫ్-2. 100కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన టాప్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ వసూళ్లలో కన్నడ సినీ పరిశ్రమను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చివరిగా విడుదలైన పఠాన్ జనవరి 25 న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,050.3 కోట్లు వసూలు చేసింది, 2023లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. (తనను తాను పెళ్లాడిన యువతి ఫస్ట్ యానివర్సరీ, అదిరిపోయే వీడియో వైరల్) అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఇండియన్ మూవీస్ దంగల్ అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.2,000 కోట్లు వసూలు చేసింది. దంగల్‌లో అమీర్ ఖాన్ రెజ్లర్ మహావీర్ ఫోగట్ పాత్రను పోషించాడు. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) బాహుబలి-2 ద కంక్లూజన్ రెండు భాగాలుగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ప్రభాస్, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్య కృష్ణన్ , సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించిన సీక్వెల్ బాహుబలి-2 రూ.1810 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1,258 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట బ్లాక్ బస్టర్ హిట్.. ఈ సినిమాలో తొలిసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించింది కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ. 1,250 కోట్లు వసూలు చేసింది. 2018 సూపర్ హిట్ అయిన కేజీఎఫ్‌కి సీక్వెల్‌గా కేజీఎఫ్2 తెరకెక్కింది.ఈ మూవీలో 2 లో యష్, సంజయ్ దత్ , రవీనా టాండన్ నటించారు.(వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) బజరంగీ భాయీజాన్ సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.969 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యమైన పాత్రలో నటించారు. పీకే రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన పీకే ప్రపంచవ్యాప్తంగా రూ.769 కోట్లు రాబట్టింది. అమీర్ ఖాన్, అనుష్క శర్మ, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తదితరులు నటించారు. సీక్రెట్ సూపర్ స్టార్ చిన్న బడ్జెట్ చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద రూ.966 కోట్లు వసూలు చేసింది.అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమీర్ ఖాన్ చిన్న పాత్రలో నటించారు. ---- పోడూరి నాగ ఆంజనేయులు -
బాలీవుడ్ ని బ్రేక్ చేసిన 2018 మూవీ
-
KGF-3: 'వాగ్దానం ఇంకా మిగిలే ఉంది'.. కేజీఎఫ్-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. అభిమానులు సైతం సినిమాను గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రశాంత్‌నీల్ పవర్ఫుల్ డైరెక్షన్‌తో కమర్షియల్ సినిమాలకు ట్రెండ్ సెట్ చేశారు. హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేస్తూ..'మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ చేసిన పవర్ఫుల్ ప్రామిస్. కేజీఎఫ్-2 చిత్రంలో మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఒక పురాతన ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది. కోట్లమంది అభిమానుల హృదయాలను గెలిచింది.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చివర్లో వాగ్దానం ఇంకా మిగిలే ఉందంటూ కేజీఎఫ్-3 పై హింట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే కేజీయఫ్-3 మొదలు కానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 భారీ హిట్ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ వచ్చే వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కాగా..కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్‌తో కలిసి పని చేయనున్నారు. ఆ తర్వాత కేజీయఫ్-3 ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. The most powerful promise kept by the most powerful man 💥 KGF 2 took us on an epic journey with unforgettable characters and action. A global celebration of cinema, breaking records, and winning hearts. Here's to another year of great storytelling! #KGFChapter2#Yash… pic.twitter.com/iykI7cLOZZ — Hombale Films (@hombalefilms) April 14, 2023 -
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేజీఎఫ్ నటి.. ఫోటో వైరల్
కన్నడ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక అవినాష్. శాండల్‌వుడ్‌లో సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈమె కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమాలో సీనియర్ ఉమెన్ జర్నలిస్ట్ పాత్రలో నటించి పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందింది. ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బిజీబిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా మాళవిక అవినాష్ అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలికగా తీసుకోవద్దు. లేదంటూ నాలాగే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. పనాడోల్, నెప్రోసిమ్ వంటి సాంప్రదాయ ఔషధం తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యం చేయకుండా త్వరగా డాక్టర్ని సంప్రదించండి అంటూ నెటిజన్లను కోరింది. ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్‌పై ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
1000 కోట్లు లోడింగ్..బాక్సాఫీస్‌కు కలెక్షన్ల సునామీ
-
‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడానికి అదే కారణం..: రామ్‌చరణ్
లాస్ ఏంజిల్స్‌లో ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డు వేడుక కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి, తనయుడు కార్తికేయ, సంగీతదర్శకుడు కీరవాణి, గాయకుడు కాలభైరవ, నటుడు శ్రీ సింహా తదితరులు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కాగా ఆస్కార్ అవార్డు సాధించడం గురించి రాజమౌళిని స్పందించమని విలేకర్లు అడగ్గా.. ఆయన ‘జైహింద్’ అన్నారు. ఇక ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లాస్ ఏంజిల్స్ నుంచి శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు రామ్‌చరణ్. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం గురించి స్పందిస్తూ– ‘‘భారతీయ అభిమానులందరూ ‘ఆర్ఆర్ఆర్’ను ఆదరించారు. ‘నాటు నాటు’ పాటను సూపర్ హిట్ చేశారు. ‘నాటు నాటు’ పాట మాది కాదు.. ప్రజల పాట. ప్రేక్షకుల అభిమానమే ఆస్కార్‌కి దారి వేసింది, అవార్డు వరించేలా చేసింది. వారితో పాటు కీరవాణి, చంద్రబోస్, రాజమౌళిగార్లకి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు రామ్‌చరణ్. తప్పుగా అర్థం చేసుకున్నారు: కాలభైరవ ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను పాడినందుకు ఆనందంగా ఉందంటూ ఓ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు కాలభైరవ. ‘‘ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించినందుకు గర్వపడుతున్నాను. నాకు ఈ విలువైన క్షణాలు దక్కడానికి రాజమౌళి బాబా, నాన్న (కీరవాణి), కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్ మాస్టర్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ... ఇలా మరికొందరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమయ్యారు. యూఎస్ టీమ్ కూడా హెల్ప్ చేసింది. వీరి సహకారం, ప్రోత్సాహం లేకపోతే ఆస్కార్ వేదికపై నా ప్రదర్శన వీలయ్యేది కాదు’’ అని ఆ నోట్లో చెప్పు కొచ్చారు కాలభైరవ. కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పేర్లను కాలభైరవ ప్రస్తావించకపోవడంతో ఈ ఇద్దరి హీరోల అభిమానులు, కొందరు నెటిజన్లు తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా కాలభైరవ స్పందించారు. ‘‘ఆర్ఆర్ఆర్’ సినిమా, ఇందులోని ‘నాటు నాటు’ పాట సక్సెస్‌కు తారక్ అన్న, చరణ్ అన్న ముఖ్యులు. అందులో సందేహం లేదు. అయితే నేను ఆస్కార్ వేదికపై నా ప్రదర్శనకు సంబంధించిన విషయం గురించి మాత్రమే ఆ నోట్లో ప్రస్తావించాను. అది తప్పుగా అర్థమైనట్లుంది. అయినప్పటికీ నా మాటలను క్షమించమని అడుగుతున్నాను’’ అని కాలభైరవ పేర్కొన్నారు. ఆస్కార్ వేదికపై షాక్ అయ్యా: గునీత్ మోంగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ నిర్మాత గునీత్ మోంగా శుక్రవారం ముంబై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మామూలుగా ఆస్కార్ అవార్డు అందుకున్నవారు తమ యాక్సెప్టెన్సీ స్పీచ్‌ను 45 సెకన్లలో పూర్తి చేయాలి. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ దర్శకురాలు కార్తీకి అన్ని సెకన్లలోనే పూర్తి చేశారు. కానీ నిర్మాత గునీత్ మోంగా కాస్త ఎక్కువ టైమ్ తీసుకుని మాట్లాడుతుండగా స్పీచ్ ఆపాలన్నట్లుగా వెనకనుంచి మ్యూజిక్ ప్లే చేశారు ఆస్కార్ నిర్వాహకులు. అలాగని నిర్వాహకులు ఈ 45 సెకన్ల నియమంలో కఠినంగా ఏమీ లేరు. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెల్చుకున్న చార్లీ మాక్సే, మ్యాథ్యూ ఫ్రౌండ్లు 45 సెకన్ల కన్నా ఎక్కువగా మాట్లాడినా, నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ విషయంపై గునీత్ మోంగా స్పందించారు. ‘‘ఇండియాకు తొలి ఆస్కార్ అవార్డును సాధించామనే గొప్ప విషయం గురించి చాలా మాట్లాడాలనుకున్నాను. కానీ నా స్పీచ్‌ను కట్ చేశారు. షాక్ అయ్యాను. ఇండియా తరఫున నేను మాట్లాడే అవకాశాన్ని నా నుంచి ఎవరో లాగేసుకున్నట్లుగా అనిపించింది. నేను మళ్లీ ఆస్కార్‌కు వెళతాను. అప్పుడు తప్పకుండా నా గొంతు మళ్లీ వినిపిస్తాను’’ అని పేర్కొన్నారు గునీత్. అత్యధిక కలెక్షన్ల జాబితాలో ఆర్ఆర్ఆర్ మూడో స్థానం.. భారతీయ చిత్రాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూడోస్థానంలో నిలిచింది. ఇదివరకు ఈ స్థానంలో ‘కేజీఎఫ్: చాఫ్టర్ 2’ ఉండేది. తొలుత అత్యధిక గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో వరుసగా ‘దంగల్’ (దాదాపు రూ. 1900 కోట్లు), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’(రూ. 1800 కోట్లు), ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ (రూ. 1230 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (దాదాపు రూ. 1150 కోట్లు), ‘పఠాన్’ (రూ. 1050 కోట్లు.. ఇంకా ప్రదర్శిత మవుతోంది) ఉన్నాయి. అయితే గత ఏడాది అక్టోబరులో జపాన్‌లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. జపాన్ బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటివరకు రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలాగే ‘ఆస్కార్’ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఈ నెల 3న, తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 10న ‘ఆర్ఆర్ఆర్’ను రీ రిలీజ్ చేశారు. దీంతో మరికొన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఈ వసూళ్లు మొత్తాన్ని కలిపితే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ గ్రాస్ కలెక్షన్స్‌ను ‘ఆర్ఆర్ఆర్’ దాటిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.