
కన్నడ హీరో, రాక్‌స్టార్ యశ్, కేజీఎఫ్ 2 చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీ టీం తీర్థ యాత్రలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం వీఐపీ దర్శనంలో కేజీఎఫ్ 2 హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్, మూవీ టీం స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించగా.. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అలాగే నిన్న(ఆదివారం) ధర్మస్థల మంజునాథ్‌స్వామి, కుక్కే సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట కేజీఎఫ్– 2 బృందం ఉన్నారు. యశ్‌ను చూసిన భక్తులు ఆయనతో ఫోటో దిగడానికి ఎగపడ్డారు. ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడ ఎదురు చూస్తున్న మీడియాతో మాట్లాడకుండా కుక్కెకి వెళ్లిపోయారు. ఈ నెల 14న కేజీఎఫ్–2 దేశవ్యాప్తంగా విడుదలవుతున్న తరుణంలో చిత్రబృందం పుణ్యక్షేత్రాలను దర్శిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment