KGF 2 Movie Makers Released A Special Video On First Anniversary, Breaks Silence On KGF 3 - Sakshi
Sakshi News home page

KGF-3: 'వాగ్దానం ఇంకా మిగిలే ఉంది'.. కేజీఎఫ్‌-3పై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌!

Published Fri, Apr 14 2023 3:59 PM | Last Updated on Fri, Apr 14 2023 4:21 PM

KGF Series Movie Makers Released A Video About KGF-2  - Sakshi

కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్‌-2 బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాతో యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ట్వీట్‌ చేసింది. ఓ వీడియోను షేర్‌ చేస్తూ ట్వీట్ చేసింది. అభిమానులు సైతం సినిమాను గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రశాంత్‌నీల్‌ పవర్‌ఫుల్‌ డైరెక్షన్‌తో కమర్షియల్‌ సినిమాలకు ట్రెండ్ సెట్‌ చేశారు.

హోంబలే ఫిల్మ్స్‌ ట్వీట్ చేస్తూ..'మోస్ట్ పవర్‌ఫుల్ మ్యాన్‌ చేసిన పవర్‌ఫుల్‌ ప్రామిస్. కేజీఎఫ్‌-2 చిత్రంలో మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఒక పురాతన ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది. కోట్లమంది అభిమానుల హృదయాలను గెలిచింది.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చివర్లో వాగ్దానం ఇంకా మిగిలే ఉందంటూ కేజీఎఫ్‌-3 పై హింట్‌ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే కేజీయఫ్‌-3 మొదలు కానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్‌-2 భారీ హిట్‌ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని అప్‌ డేట్స్‌ వచ్చే వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. 

కాగా..కేజీయఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం సలార్‌తో  బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్‌తో కలిసి పని చేయనున్నారు. ఆ తర్వాత కేజీయఫ్‌-3 ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement