Hombale Films
-
హోంబలే ఫిల్మ్స్ బిగ్ ప్రాజెక్ట్ 'మహావతార్' ప్రకటన
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హోంబలే ఫిల్మ్స్ పరిచయం అవసరం లేని నిర్మాణ సంస్థ. ఈ సంస్థ నుంచి ఇప్పటికే కేజీఎఫ్,సలార్,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించింది. ఆపై ప్రభాస్‌తో మరో మూడు చిత్రాలను నిర్మిస్తున్నట్లు కూడ తెలిపింది. అయితే, తాజాగా ఈ సంస్థ ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అందుకు సంబంధించిన పోస్టర్‌తో పాటు ఒక వీడియోను కూడా ప్రేక్షకులతో పంచుకుంది.'మహావతార్: నరసింహ' అనే హిస్టారికల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ మూవీలో నటించనున్న నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సామ్ సీఎస్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్‌లు నిర్మిస్తున్నారు. మహావతార్ సిరీస్‌లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్‌గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్ హిట్ ఇచ్చారు.హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నుంచి కాంతార ప్రీక్వెల్ చిత్రీకరణ జరపుకుంటుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషభ్‌శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు సలార్ పార్ట్2 శౌర్యంగ పర్వం కూడా ఇదే సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంతో కలిపి ప్రభాస్‌తో మూడు భారీ చిత్రాలు ప్లాన్ చేసినట్లు ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. -
అగ్ర నిర్మాణ సంస్థ.. రెబల్ స్టార్‌తో బిగ్ డీల్.. ఏకంగా మూడు భారీ ప్రాజెక్టులు!
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ నటించారు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ మెప్పించారు.అయితే గతేడాది డిసెంబర్ సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు.వరుసగా మూడు ప్రాజెక్టులుఅయితే తాజాగా భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఈ బ్యానర్లోనే ప్రభాస్ సలార్-2 త్వరలోనే పట్టాలెక్కనుంది. అంతే కాకుండా రెబల్ స్టార్‌తో మరో రెండు ప్రాజెక్టులు చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రభాస్‌తో వరుసగా 2026,2027,2028 సంవత్సరాల్లో మూడు చిత్రాలు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.బిగ్ డీల్ఈ లెక్కన ప్రభాస్‌తో భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్,.. ఏకంగా మూడు చిత్రాలకు దాదాపు రూ.450 కోట్లకు పైగానే పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్‌తో రాబోయే మూడు సినిమాలకు రెబల్ స్టార్ బిగ్ డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రభాస్ టాలీవుడ్లో ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రంలో తొలిసారి పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఆ తర్వాతే సలార్-2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
ప్రశాంత్ నీల్ కథతో సినిమా.. 'బఘీర' ట్రైలర్ చూశారా?
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో తెలుగులోనూ బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త మూవీ కోసం రెడీ అవుతున్నాడు. డైరెక్టర్‌గా పుల్ ఫామ్‌లో ఉన్న నీల్.. 'బఘీరా' సినిమాకు స్టోరీ అందించాడు. తాజాగా ఆ చిత్ర తెలుగు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన 'బఘీరా' సినిమాను.. 'కేజీఎఫ్', 'సలార్' నిర్మించిన హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. డాక్టర్. సూరి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే మంచి యాక్షన్ ఫీస్ట్‌లా అనిపించింది. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకుని విలన్లని చంపడం లాంటివి 'కేజీఎఫ్' చిత్రాన్ని గుర్తుచేస్తున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)ట్రెలర్ బట్టి చూస్తే.. చిన్నప్పుడు తల్లిని పోగొట్టుకున్న ఓ పిల్లాడు.. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని, ముసుగు వేసుకుని 'బఘీరా' గెటప్‌లో విలన్లని చంపుతుంటాడు. చివరకు బఘీరాని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.కన్నడతో పాటు తెలుగులోనూ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే 'లక్కీ భాస్కర్', 'క' లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్, 'అమరన్' అనే డబ్బింగ్ దీపావళికి రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి మరీ తెలుగులో 'బఘీరా' ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో) -
'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ
ప్రభాస్ 'సలార్ 2' ఆగిపోయిందా? ఇంకెందుకులే అని పక్కనబెట్టేశారా? మీరు కూడా ఇలాంటి రూమర్స్ ఎక్కడో ఓ చోట వినే ఉంటారుగా. గత కొన్నిరోజుల నుంచి ఈ మూవీ గురించి ఏదో ఓ గాసిప్ వస్తూనే ఉంది. ఎందుకంటే ఆగస్టు నుంచి డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ మొదలు పెట్టబోతున్నాడు. రీసెంట్‌గానే తారక్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అదిగో అప్పటినుంచి 'సలార్' సీక్వెల్‌పై పుకార్లు షురూ అయ్యాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'కేజీఎఫ్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన యాక్షన్ మూవీ 'సలార్'. పలుమార్లు వాయిదా పడి.. గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందనే టాక్ అయితే వచ్చింది గానీ వసూళ్లు మాత్రం రూ.700 కోట్లు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్‌తో ఇతడి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోతుందనేసరికి 'సలార్'ని లైట్ తీసుకున్నారా అనే సందేహాలు వచ్చాయి.ఈ క్రమంలోనే క్లారిటీ ఇచ్చిన 'సలార్' నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.. 'వాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు' అనే క్యాప్షన్‌తో ప్రశాంత్ నీల్-ప్రభాస్ సెట్లో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. అంటే 'సలార్ 2'పై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం అన్నట్లు తేలింది. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే తారక్‌తో మూవీ కంప్లీట్ చేసిన తర్వాతే ప్రశాంత్ నీల్ 'సలార్ 2' తీస్తాడేమో?(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి)They can't stop laughing 😁#Prabhas #PrashanthNeel#Salaar pic.twitter.com/FW6RR2Y6Vx— Salaar (@SalaarTheSaga) May 26, 2024 -
వాళ్లకు డబ్బులు తిరిగిచ్చేసిన 'సలార్' నిర్మాత.. అదే కారణమా?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్'.. బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ వరకు చాలామంది సందేహపడ్డారు. కానీ థియేటర్లలోక వచ్చిన తర్వాత వసూళ్ల మోత మోగించింది. అలాంటి ఈ సినిమా వల్ల కొందరు డిస్ట్రిబ్యూటర్స్‌కి నష్టాలొచ్చాయట. ఇప్పుడిదే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) 'కేజీఎఫ్' లాంట ఊరమాస్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడనేసరికి అందరూ అంచనాలు పెంచుకున్నారు. ఇందుకు తగ్గట్లే బిజినెస్ కూడా జరిగింది. నైజాం హక్కుల్ని దక్కించుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. మంచి లాభాల్ని కూడా చూసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ 'సలార్' రైట్స్‌ని ఎక్కువ ధరకి కొనడం కొంపముంచిందట. పెట్టిన పెట్టుబడి తగ్గట్లు ఆయా ప్రాంతాల్లో వసూలు కాలేదని, దీంతో 'సలార్' నిర్మాత విజయ్ కిరగందూర్.. సదరు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయిన మొత్తాన్ని తాజాగా తిరిగిచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు 'సలార్' సీక్వెల్ 'శౌర్యంగపర్వం' షూటింగ్ జూన్ నెల నుంచి మొదలయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే 'సలార్' రెండో పార్ట్.. వచ్చే ఏడాది థియేటర్లలో రావడం గ్యారంటీ. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) -
ఇకపై సలార్ పాన్ ఇండియా కాదు.. అంతకు మించి!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ నటించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. స్నేహితునికి ఇచ్చిన మాట కోసం ప్రభాస్ చేసే పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ డైలాగ్స్ సైతం ఫ్యాన్స్‌ను కట్టిపడేశాయి. థియేటర్లలో భారీగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలో టాప్-10లో నిలిచిన నాన్- ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. త్వరలోనే ఈ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. పాన్ ఇండియా మూవీ సలార్.. ఇప్పుడు గ్లోబల్ మూవీగా మారిపోయిందంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Thala for every reason 🫠🫠#SalaarTopsOnNetflix #SalaarCeaseFire is trending at top 7 on Netflix🎬 pic.twitter.com/iGyBG2qFfK — Jay (@slowandlow02) January 23, 2024 View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
సలార్ మేకర్స్ బిగ్ ప్లాన్.. అక్కడ కూడా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతుండడంతో విదేశీ భాషల్లోనూ సలార్ రిలీజ్ చేయనునట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని స్పానిష్ భాషలో రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని స్పానిష్ భాషలో రాస్తూ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దీంతో సలార్ సీజ్ఫైర్ పార్ట్-1 మార్చి 7న లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల కానుంది. విదేశాల్లోనూ తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ కావడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. #SalaarCeaseFire se estrenará en América Latina el 7 de marzo de 2024, en español, lanzado por @Cinepolis. ¡Prepárate para la acción épica! 💥#SalaarCeaseFire is releasing in Latin America on 7th March 2024, in 𝐒𝐩𝐚𝐧𝐢𝐬𝐡.@IndiaCinepolis#Salaar #Prabhas #PrashanthNeel… pic.twitter.com/B5wV9BVmuM — Hombale Films (@hombalefilms) January 5, 2024 -
మరికొద్ది గంటల్లో సలార్ రిలీజ్.. సూపర్ సాంగ్ విడుదల!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు మరికొద్ది గంటల్లో రానుంది. యంగ్ రెబల్ ఫ్యాన్స్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్ ఈనెల 22న తెల్లవారుజామునే థియేటర్లలో సందడి చేయనుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే టికెట్స్ బుకింగ్ ప్రారంభం కాగా.. లక్షల్లో అమ్ముడయ్యాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ప్రతి గాథలో' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, ట్రైలర్స్ ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. -
కీర్తి సురేశ్ లేడీ ఒరియంటెడ్ ఫిలిం.. గ్లింప్స్ చూశారా?
వరుస విజయాలతో మంచి హుషారులో ఉంది హీరోయిన్ కీర్తి సురేశ్. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాది బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. అందులో ఒకటి సైరన్.. హీరో జయం రవితో జోడీ కట్టిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఆమె నటించిన మరో చిత్రం రఘుతాత. ఇది లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం. దీన్ని ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించడం విశేషం. ఇది పిరియాడికల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కుతోంది. సుమన్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోందని తాజాగా విడుదల చేసిన చిత్ర గ్లింప్స్‌ను చూస్తే తెలుస్తోంది. ఇంతకు ముందు తోపుడు బండ్లు, రిక్షాలలో చిత్రాలను ప్రచారం చేసేవారు. ఈ చిత్ర గ్లింప్స్‌లోనూ.. తోపుడు బండిపై కీర్తి సురేశ్ పోస్టర్ అంటించి ప్రచారం చేస్తున్నట్లు చూపించారు. నటుడు ఎంఎస్.భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనందసామి, రాజేశ్ బాలకృష్ణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాన్ సంగీతాన్ని, యామిని యజ్ఞమూర్తి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాతో కీర్తి సురేశ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి! చదవండి: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే -
Vijay Kiragandur: సలార్ అందరి అంచనాలు అందుకుంటుంది
‘‘ప్రభాస్ సూపర్ స్టార్. ప్రశాంత్ నీల్ పెద్ద డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో అని అభిమానులు, ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ ఎలాంటి కథ చెబుతున్నారు? ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారు? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరి అంచనాలను ‘సలార్’ అందుకుంటుంది’’ అని నిర్మాత విజయ్ కిరగందూర్ అన్నారు. ప్రభాస్, శ్రుతీహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ‘సలార్’ మూవీ తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ... ► ‘సలార్’ ని 2021లో ్ప్రారంభించాం. కోవిడ్ కారణంగా 2022లో పూర్తి స్థాయి షూటింగ్ ్ప్రారంభించి, 2023 జనవరిలో షూటింగ్‌ను పూర్తి చేశాం. ఐదు భాషల్లో(తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ) సినిమాను విడుదల చేయాలనుకోవడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. పోస్ట్‌ప్రొడక్షన్‌కి కూడా సమయం పట్టింది. మా హోంబలే ఫిలింస్ తొలిసారి తెలుగులో హీరో ప్రభాస్‌గారితో పనిచేశాం. ప్రభాస్‌గారు చాలా మంచి వ్యక్తి. అందువల్లే ఈ ప్రయాణం మాకు మధురమైన అనుభూతినిచ్చింది. ► ‘సలార్: సీజ్ఫైర్’ 90 శాతం షూటింగ్‌ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చిత్రీకరించాం. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాం.. మేకింగ్ పరంగా ఎక్కడా రాజీపడలేదు. ‘కేజీఎఫ్’తో కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్లోనూ మాకు మంచి గుర్తింపు దక్కింది. మా పై వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు, నమ్మకం మాలో మరింత బాధ్యతను పెంచాయి. అందువల్ల వాళ్లకి నచ్చేలా మంచి సినిమాలు చేయాలని ముందుకు వెళుతున్నాం. ► మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు వేర్వేరుగా ఉంటాయి. అయితే అన్నీ కలిస్తేనే ఇండియన్ సినీ ఇండస్ట్రీ అవుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమను గ్లోబల్ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా అభి్ప్రాయం. అంతే తప్ప ఇది తెలుగు, ఇది కన్నడ సినిమా అని ఆలోచించటం లేదు. నిర్మాతగా పదేళ్లు పూర్తయ్యాయి. ఒక్కో సినిమా ఒక్కో అనుభవాన్ని నేర్పించింది. ప్రశాంత్ నీల్ప్రొడక్షన్, మార్కెటింగ్‌లలో కల్పించుకోడు. మా మధ్య మంచి అనుబంధం, అవగాహన ఉంది. ‘సలార్’ లో రెండు భాగాలుగా చేసేంత కథ ఉంది.. అందుకే రెండు భాగాలుగా తీస్తున్నాం. ► నాకు కథ, డైరెక్టర్ ముఖ్యం. బడ్జెట్‌కి ఎక్కువ ్ప్రాధాన్యత ఇవ్వను. అవసరం మేరకు ఎంతైనా ఖర్చు పెడతాను. తెలుగు ఇండస్ట్రీ వాళ్లు బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు సినిమాను ఆదరిస్తున్న తీరే అందుకు ఉదాహరణ. ఓ వైపు ప్రభాస్‌గారు, మరోవైపు ప్రశాంత్ నీల్ గారు బిజీగా ఉండటంతో ‘సలార్’ మూవీ నుంచి గ్రాండ్ ఈవెంట్ చేయలేదు. సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ ఈవెంట్‌ను కండెక్ట్ చేస్తాం. -
డంకీ సినిమా రిలీజ్.. సలార్ మేకర్స్ సంచలన నిర్ణయం!
మరికొద్ది గంటల్లో షారుక్ ఖాన్ నటించిన డంకీ థియేటర్లలో సందడి చేయనుంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. నలుగురు వ్యక్తులు అక్రమంగా విదేశాలకు వెళ్తే ఏమవుతుంది అనే కథాంశంతో డంకీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది పఠాన్, జవాన్ చిత్రాలతో వేల కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్ బాద్షా హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయిపోయారు. అభిమానుల భారీ అంచనాల మధ్య మూడో చిత్రం విడుదలకు సిద్ధమైంది. అయిత ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న ఈ సినిమా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్‌తో పోటీ పడనుంది. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు కావడంతో థియేటర్ల విషయంలో వివాదం తలెత్తింది. ఇప్పటికే పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో డంకీ ప్రదర్శనకు సమానంగా స్క్రీన్స్ కేటాయిచాలని హోంబలే ఫిల్మ్స్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డంకీతో సమానంగా ప్రభాస్ సలార్‌కు స్క్రీన్స్ ఇవ్వకపోవడంతో నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో 'సలార్' చిత్రాన్ని విడుదల చేయటం లేదని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ థియేటర్లలో బుకింగ్ చేసుకున్న ఆడియన్స్ టికెట్స్ క్యాన్సిల్ కావడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అంతే కాకుండా ట్విటర్లోనూ బాయ్‌కాట్ పీవీఆర్ ఐనాక్స్ అని ట్రెండింగ్ అయింది. గూస్బంప్స్ తెప్పిస్తోన్న సెకండ్ ట్రైలర్.. సలార్ రెండో ట్రైలర్ రిలీజ్ తర్వాత సలార్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. Pan India Star #Prabhas' #Salaar unlikely to release in PVR INOX due to unfair screen sharing with #ShahRukhKhan's #Dunki.#BoycottPVRInox "The makers have withdrawn the release of Salaar from the multiplex chains in the South Indian Markets. They won't be releasing Salaar in… pic.twitter.com/RHTV3BuRdu — Manobala Vijayabalan (@ManobalaV) December 20, 2023 REBELS GO To PLAYSTORE And DESTROY PVR APP RATING💥💥💥💥💥 Show Them The Power Of #Prabhas and #SALAAR. SHAME ON YOU AJAY BIJLI #BoycottPVRInox #BoycottpvrAjayBijli pic.twitter.com/a5AA8mZuF0 — Ashok Kumar (@bashokkumar_) December 20, 2023 -
సలార్ డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్.. టీజర్ రిలీజ్..!
కేజీయఫ్, కాంతార, సలార్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతోన్న మరో చిత్రం బఘీరా. ఈ చిత్రంలో శ్రీమురళీ, రుక్మిణీ వసంత్ జంటగా నటించారు. ఈ మూవీకి సూరి దర్శకత్వం వహించగా.. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రోజు హీరో శ్రీమురళి బర్త్ డే సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ బఘీరా టీజర్ చేసింది. విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రఘు, అచ్యుత్ కుమార్. గరుడ రాముడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 𝐖𝐡𝐞𝐧 𝐬𝐨𝐜𝐢𝐞𝐭𝐲 𝐛𝐞𝐜𝐨𝐦𝐞𝐬 𝐚 𝐣𝐮𝐧𝐠𝐥𝐞... 𝐚𝐧𝐝 𝐨𝐧𝐥𝐲 𝐨𝐧𝐞 𝐩𝐫𝐞𝐝𝐚𝐭𝐨𝐫 𝐫𝐨𝐚𝐫𝐬 𝐟𝐨𝐫 𝐣𝐮𝐬𝐭𝐢𝐜𝐞...💥 Presenting #BagheeraTeaser to you all ▶️ https://t.co/VRviuMij3o Wishing our 'Roaring Star' @SRIMURALIII a very Happy Birthday.#Bagheera… pic.twitter.com/UxMAaJp1Qr — Hombale Films (@hombalefilms) December 17, 2023 -
రెండు సినిమాలు బరిలో ఉన్నా సలార్ రిలీజ్.. ఎందుకంటే?
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్(పార్ట్ -1). ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ తేదీ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే చివరికి ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరో పది రోజుల్లోనే సినిమా రిలీజ్ కానుండగా.. ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ సలార్ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రిలీజ్ తేది విషయంపై క్లారిటీ ఇచ్చారు. (ఇది చదవండి: బిగ్‌బాస్‌తోనే ఫేమ్.. వరుణ్ తేజ్ పెళ్లి వార్తతో షాకయ్యా!) సలార్ చిత్రం 2014లో వచ్చిన ఉగ్రమ్ చిత్రానికి రీమేక్ కాదని విజయ్ కిరంగదూర్ వెల్లడించారు. ఉగ్రమ్ మాదిరిగానే ఈ చిత్రం రీమేక్ అని చాలామంది భావించారని.. అలాంటిదేం కాదని కొట్టిపారేశారు. ప్రశాంత్ నీల్.. ఉగ్రమ్‌తో పాటు కేజీఎఫ్ తెరకెక్కించాడని.. ప్రతిసారి భిన్నంగా ఏం చేయాలో అతనికి తెలుసని అన్నారు. సలార్ రీమేక్ అనే వార్తలు కేవలం రూమర్స్ అని అన్నారు. అంతే కాకుండా సలార్ విడుదల తేదీ డిసెంబర్ 22 నిర్ణయించడంపై విజయ్ కిరంగదూర్ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటుందని అన్నారు. మాకు జాతకాలపై ఉన్న నమ్మకం ప్రకారమే ఆ తేదీని ఎంపిక చేశామని తెలిపారు. డంకీ, అక్వామన్ పోటీలో ఉన్నప్పటికీ.. దశాబ్దం కాలంగా తాము అనుసరిస్తున్న పద్ధతినే సలార్ విషయంలోనూ కొనసాగిస్తున్నట్లు విజయ్ కిరంగదూర్ వివరించారు. (ఇది చదవండి: పోస్టర్ కోసం క్రియేట్ చేసిన పదం.. కొత్త సినిమా టైటిల్‌గా!) సెన్సార్ పూర్తి కాగా.. ఇటీవలే సలార్ పూర్తి కాగా.. 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలానే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అంటే 18 ఏళ్ల నిండని వాళ్లు.. ఈ మూవీ చూడటం కుదరదని సెన్సార్ బోర్ట్ చెబుతోంది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ప్రభాస్ 'సలార్' షర్ట్ కావాలంటే ఇలా పొందండి.. ధర ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సలార్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. భారీ బడ్జెట్‌తో 'హోంబలే ఫిల్మ్స్' ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్నారు. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 1న 'సలార్' ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. త్వరలో సలార్ కోసం ఒక భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసే పనిలో 'హోంబలే ఫిల్మ్స్' ఉంది. ఇందుకోసం డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్, టీజర్ హిట్ కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. హోంబలే సంస్థ మెల్లగా సలార్ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టింది. ప్రస్తుతం 'సలార్' టీ షర్ట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఆన్లైన్లో ప్రభాస్ అభిమానుల కోసం వీటిని విక్రయిస్తున్నారు. హోంబలే వెర్సెస్ (hombaleverse) వెబ్సైట్లో వీటిని విక్రయిస్తున్నారు. ఇందులో సలార్ టీ-షర్ట్, హూడీ, హార్మ్ స్లీవ్లను పొందవచ్చు. వీటిని కొనుగోలు చేయాలనుకున్న అభిమానులు హోంబలే వెర్సెస్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పొందవచ్చు. వీటి ధరలను పరిశీలిస్తే, టీ-షర్టు ధర రూ.499 నుంచి ప్రారంభమై రూ.1499 వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆ టీ షర్ట్ ధరలను చూసి భయపడిపోతున్నారు. అంత ధర ఉంటే సామాన్యాలు ఎలా కొనాలి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలు, స్టార్ నటీనటుల క్రేజ్ చూసి ఇంతకు ముందు ఇలాంటి టీ షర్టులు ఇతరులు అమ్మేవారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తోంది చిత్రబృందం. షారూఖ్ ఖాన్ నటించిన 'డంకీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద 'సలార్'తో పోటీ పడుతోంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాబట్టి బాక్సాఫీస్ వద్ద సలార్‌తో క్లాష్ అని భావిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమై విశేష స్పందన లభించింది. డిసెంబర్ 22న సలార్ 5000 థియేటర్లకు పైగా విడుదల కానుంది. -
సినిమా రిలీజైన ఇన్నాళ్లకు ఆ పాట వీడియో రిలీజ్
తెలుగు సినిమాలో తెలుగులోనే కొన్ని కొన్ని సరిగా ఆడవు. అలాంటిది ఓ కన్నడ సినిమా.. ఏ మాత్రం అంచనాల్లేకుండా కర్ణాటకలో రిలీజై సెన్సేషన్ సృష్టించింది. తెలుగులోనూ అంతకు మించి అనేలా హిట్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో క్లైమాక్స్ సాంగ్ ఎంత హిట్టయిందో, అన్నే వివాదాలు కూడా వచ్చాయి. (ఇదీ చదవండి: దానికి నో చెప్పానని నాతో అలా ప్రవర్తించారు.. హాట్ బ్యూటీ కామెంట్స్!) అయితే 'కాంతార' మూవీకి ఎంతో పేరు తెచ్చిన 'వరహారూపం' పాట లిరికల్ సాంగ్ మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. తాజాగా సినిమాకు ఏడాది పూర్తయిన సందర్భంగా పూర్తి వీడియోని రిలీజ్ చేశారు. నిర్మాణ సంస్థ తన యూట్యూబ్ ఛానెల్ లో ఆ పాటని పోస్ట్ చేసింది. ఇంకెందుకు లేటు మీరు దీనిపై ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
సలార్ వాయిదా పడనుందంటూ మొన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. చివరికి అదే నిజమైంది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. 'సలార్‌పై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయాలనుకున్నాం.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయక తప్పడం లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీకు అద్భుతమైన సినిమాను అందివ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాను మరింత బాగా తీర్చిదిద్దేందుకు మా టీమ్ అవిశ్రాంతంగా పని చేస్తోంది. సలార్‌కు ఫైనల్ టచ్ ఇస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం' అని హోంబలే ఫిలింస్ బ్యానర్ ట్వీట్ చేసింది. సలార్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందులో భాగంగా సలార్: పార్ట్ 1- సీజ్ ఫైర్‌ను ఈ నెలలో విడుదల చేస్తామన్నారు. కానీ అంతలోనే చిత్రాన్ని వాయిదా వేశారు. గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడం వల్లే ఈ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేసినట్లు తెలుస్తోంది. We deeply appreciate your unwavering support for #Salaar. With consideration, we must delay the original September 28 release due to unforeseen circumstances. Please understand this decision is made with care, as we're committed to delivering an exceptional cinematic experience.… pic.twitter.com/abAE9xPeba — Hombale Films (@hombalefilms) September 13, 2023 చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన యంగ్ హీరో.. ఫోటోలు వైరల్ -
సలార్ రిలీజ్ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్!
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మూవీ రిలీజ్ వాయిదా పడిందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా చెప్పకపోయినా రిలీజ్ వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. సలార్‌పై తాజాగా మరో టాక్ ఊపందుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. దీనిపై ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే గనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం సలార్ చిత్రబృందం పోస్ట ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. కాగా..'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాయి. కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ .. డార్లింగ్ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో ప్రస్తుతం ఫ్యాన్స్ ఆశలన్నీ 'సలార్'పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మేకర్స్ స్పందించి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. కాగా..ఈ చిత్రంలో శృతి హాసన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ సాలార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #BreakingNews… PRABHAS: ‘SALAAR’ TO ARRIVE IN NOV… #Salaar is NOT arriving on 28 Sept 2023, it’s OFFICIAL now… The post-production work of this #Prabhas starrer is going on in full swing… #HombaleFilms - the producers - are bringing the film in Nov 2023… New release date… pic.twitter.com/SbOLGSobz5 — taran adarsh (@taran_adarsh) September 2, 2023 -
Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో సాలిడ్ యాక్షన్ మూవీ 'సలార్'ను హోంబలే ఫిలింస్ వారు నిర్మిస్తున్నారు. నేడు (జులై 6) టీజర్‌ను కూడా వదిలారు మేకర్స్.. 'కేజీయఫ్' బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి. సెప్టెంబరు 28న మొదటి భాగం రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో అన్ని భాషలలో భారీ బిజినెస్ జరగనుంది. (ఇదీ చదవండి: నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్) ఇప్పటికే ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసేందకు భారీగానే పోటీ పడుతున్నారు. సలార్ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను అల్లు అరవింద్ తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గీతా ఆర్ట్స్ 50వ వార్షికోత్సవాన్ని త్వరలో జరుపుకోనుంది. అందుకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ ద్వారా విడుదల చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. అయితే, సలార్‌ను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ వారి నుంచి రైట్స్ కొనుగోలు చేయడం అంత సులభమైన విషయం కాదు. సలార్‌కు పెరుగుతున్న బజ్ కారణంగా సినిమా రైట్స్‌కు భారీగానే ధరను ఫిక్స్ చేస్తారు. లేదా కొన్ని షరతులతో మూవీ రైట్స్‌ను విక్రయిస్తారు. గతంలో కూడా KGF 2 తెలుగు హక్కులను వారు విక్రయించలేదు. కమీషన్ ఆధారంగా తెలుగులో విడుదల చేశారు. దాంతో భారీగానే లాభాలను పొందారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు) అలాంటిది కేజీఎఫ్-2 రైట్స్‌నే అమ్మకపోతే సలార్ తెలుగు రైట్స్ అమ్ముతారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అల్లు అరవింద్ వారిని ఒప్పించగలుగుతారా? అనేదానికి సమాధానం త్వరలో తెలుస్తుంది. అయితే, 'కాంతార' సినిమాను నిర్మించింది కూడా హోంబలే ఫిల్మ్స్ వారే... ఇదే మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌నే. కాబట్టి వారితో అల్లు అరవింద్‌కు మంచిపరిచాయాలే ఉన్నాయి కాబట్టి సలార్ అవకాశం కూడా రావచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. -
Prabhas Salaar Teaser: లయన్, చీతా, టైగర్ అంటూ వేటకొచ్చిన డైనోసార్
డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూసిన 'సలార్' టీజర్ వచ్చేసింది. ప్రభాస్ మాస్ యాక్షన్ అవతార్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసి పడేసింది. దాదాపు 106 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో.. సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఇక ఇందులో ఎక్కువగా ప్రభాస్ కారెక్టర్‌కు సంబంధించి హీరో ఎలివేషన్ డైలాగ్ చెప్తూ సీనియర్ యాక్టర్ టిన్ను ఆనంద్‌ను చూపించారు. మిగతా క్యారెక్టర్స్‌ను పెద్దగా చూపించలేదు. ప్రభాస్ ఫేస్ మాత్రం చూపించకుండా పిడికిలి బిగించిన తన చేతిని మాత్రమే చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఫినిషింగ్‌లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను చూపిస్తూ టీజర్‌ను ముగించారు. 2023 సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు టీజర్లో స్పష్టం చేశారు. సలార్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా శ్రుతిహాసన్ హీరోయిన్గా చేస్తోంది. విలన్ రాజమన్నార్ పాత్రలో జగపతి బాబు, మరో విలన్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. తమిళ నటి శ్రియారెడ్డి కూడా కీలకపాత్ర పోషించింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్.. టీజర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో గూస్ బంప్స్ తెప్పించాడు. ప్రశాంత్ నీల్ ఎప్పటిలానే మాస్ ఫార్ములాని నమ్ముకున్నాడు. టీజర్ చూస్తుంటే హోంబలే ఫిల్మ్స్ బడ్జెట్‌కి ఏ మాత్రం వెనకాడలేదని క్లియర్‌గా అర్థమవుతోంది. -
ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
ఫహాద్ ఫాజిల్ పేరుకే మలయాళ నటుడు గానీ డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు గత కొన్నేళ్ల నుంచి బాగా పరిచయమే. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఫహాద్ ఫాజిల్ నటించిన 'ధూమమ్' సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. మలయాళంతో పాటు కన్నడలో జూన్ 23న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి; రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..) 'కేజీఎఫ్, కాంతార,సలార్' లాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారే ధూమమ్‌ను నిర్మించారు. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాల్సింది కానీ ఎందుకో వెనక్కి తగ్గి.. కేవలం మలయాళ, కన్నడ భాషలకే పరిమితం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జులై 21 నుంచి ధూమమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమాలో అపర్ణా బాల మురళి హీరోయిన్గా మెప్పించింది. ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: Nayanthara: నయనతార ఆశలన్నీ 75 పైనే!) 'ధూమం' కథేంటి? సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) జీవితం, జీతం బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తమ సంస్థ వల్ల చిన్నపిల్లలు కూడా పొగాకు బారిన పడుతుండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ టైంలోనే అవినాష్, అతడి భార్య ఓ ప్రమాదంలో పడతారు. వీళ్ల బాడీలకు టైమ్ బాంబ్ ఫిక్స్ చేస్తారు. అది పేలకూడదంటే సిగరెట్స్ తాగుతూ తక్కువ సమయంలో కోటి రూపాయలు పోగు చేయాలి. ఈ గండం నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేదే 'ధూమం' స్టోరీ. -
'సలార్' నిర్మాతలకు షాకిచ్చిన ఆ సినిమా రిజల్ట్!
'కేజీఎఫ్', 'కాంతార' లాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించి, వందల కోట్ల లాభాలు అర్జించిన హోంబలే ఫిల్మ్స్ కు షాక్ తగిలింది. అది కూడా ఓ చిన్న మూవీ వల్ల. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఎందుకంటే మరో మూడు నెలల్లో 'సలార్' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇలాంటి టైంలో తాము నిర్మించిన ఓ చిత్రానికి ఫ్లాప్ టాక్ రావడం అవాక్కయ్యేలా చేసింది. ఫహాద్ ఫాజిల్ పేరుకే మలయాళ నటుడు గానీ డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు గత కొన్నేళ్ల నుంచి బాగా పరిచయమే. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో పోలీస్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఈ మధ్యే 'ధూమం' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాల్సింది కానీ ఎందుకో వెనక్కి తగ్గి.. కేవలం మలయాళ, కన్నడ భాషలకే పరిమితం చేశారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) కన్నడలో లూసియా, యూటర్న్ లాంటి డిఫరెంట్ చిత్రాలతో హిట్స్ కొట్టిన పవన్ కుమార్ దీనికి దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా జనాల్ని పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోతోంది. రెండు రోజుల్లో రూ.2.5 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చినట్లు టాక్. స్టోరీ పరంగానూ పొరపాట్లు జరగడంతో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా రూ.8 కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టినప్పటికీ.. నెగిటివ్ టాక్ రావడం నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ని అయోమయానికి గురిచేసింది. 'ధూమం' కథేంటి? సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) జీవితం, జీతం బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తమ సంస్థ వల్ల చిన్నపిల్లలు కూడా పొగాకు బారిన పడుతుండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ టైంలోనే అవినాష్, అతడి భార్య ఓ ప్రమాదంలో పడతారు. వీళ్ల బాడీలకు టైమ్ బాంబ్ ఫిక్స్ చేస్తారు. అది పేలకూడదంటే సిగరెట్స్ తాగుతూ తక్కువ సమయంలో కోటి రూపాయలు పోగు చేయాలి. ఈ గండం నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేదే 'ధూమం' స్టోరీ. (ఇదీ చదవండి: మహేశ్ సినిమా క్లైమాక్స్ బయటపెట్టిన రాజమౌళి తండ్రి) -
సుధా కొంగర దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా!
ఏడు పదుల వయసు పైబడిన సూపర్ స్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈయనతో చిత్రాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈయన ఏక కాలంలో రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న జైలర్ చిత్రం. కాగా రెండవది ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రం. ఇందులో రజనీకాంత్ అతిథిగా ఓ పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. కాగా, ఈ రెండు చిత్రాల షూటింగులను రజనీకాంత్ పూర్తి చేశారు. తదుపరి జై భీమ్ చిత్రం ఫేమ్ టీజే.జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది రజనీకాంత్ నటించనున్న 170వ చిత్రం అవుతుంది. దీన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా రజినీకాంత్ నటించే 171 వ చిత్రానికి కూడా ఇప్పుడు పోటీ నెలకొంది. దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కారణం ఇద్దరు దర్శకులు, పలువురు నిర్మాతలు క్యూలో ఉండటమే. రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీన్ని నిర్మించడానికి పలువురు దర్శకులు పోటీ పడుతున్నారని, అందులో విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా ఉస్ట్లు ప్రచారం జరుగుతోంది. (చదవండి: రూ. 37 కోట్లతో ఇల్లు కొన్న అలియా.. ఆ వ్యాపారం కోసమేనట!) తాజాగా మరో ఆసక్తికరమైన ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు ఇరుదు చుట్రు, సూరరైపోట్రు వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వహించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర కూడా రజనీకాంత్‌ను దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈమె ఇప్పటికే రజనీకాంత్‌కు కథను వినిపించినట్లు అది ఆయనకు నచ్చినట్లు ప్రచారం జరిగింది. కాగా దీన్ని కేజీఎఫ్ చిత్రం ప్రేమ్ హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం బెంగళూరులోని ఒక ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్ ను దర్శకురాలు సుధా కొంగర, హోంబలి చిత్ర నిర్మాత కలిసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
KGF-3: 'వాగ్దానం ఇంకా మిగిలే ఉంది'.. కేజీఎఫ్-3పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. భాషతో సంబంధం లేకుండా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. అభిమానులు సైతం సినిమాను గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రశాంత్‌నీల్ పవర్ఫుల్ డైరెక్షన్‌తో కమర్షియల్ సినిమాలకు ట్రెండ్ సెట్ చేశారు. హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేస్తూ..'మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ చేసిన పవర్ఫుల్ ప్రామిస్. కేజీఎఫ్-2 చిత్రంలో మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఒక పురాతన ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది. కోట్లమంది అభిమానుల హృదయాలను గెలిచింది.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చివర్లో వాగ్దానం ఇంకా మిగిలే ఉందంటూ కేజీఎఫ్-3 పై హింట్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే కేజీయఫ్-3 మొదలు కానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 భారీ హిట్ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ వచ్చే వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. కాగా..కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్‌తో కలిసి పని చేయనున్నారు. ఆ తర్వాత కేజీయఫ్-3 ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. The most powerful promise kept by the most powerful man 💥 KGF 2 took us on an epic journey with unforgettable characters and action. A global celebration of cinema, breaking records, and winning hearts. Here's to another year of great storytelling! #KGFChapter2#Yash… pic.twitter.com/iykI7cLOZZ — Hombale Films (@hombalefilms) April 14, 2023 -
ఇది వారికే అంకితమిస్తున్నా: రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్
ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు రిషబ్‌శెట్టి. అదే సినిమాకుగాను ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఆయన మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. తనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రిషబ్ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. ముంబయిలో సోమవారం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. లేఖలో రిషబ్ శెట్టి రాస్తూ.. 'ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడంలేదు. ‘కాంతార’ అవకాశం ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ, నిర్మాత విజయ్ కిరగందూర్ సర్‌కు ధన్యవాదాలు. హోంబలే సంస్థతో కలిసి మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా. కాంతార భాగమైన చిత్రబృందం, నా జీవిత భాగస్వామి ప్రగతిశెట్టి లేనిదే ఈ అవార్డు లేదు. వారి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ అవార్డును కర్ణాటక ప్రజలు, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్, భగవాన్ (దివంగత దర్శకుడు)సర్‌కు అంకితమిస్తున్నా. నన్ను అభిమానించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.' అని రిషబ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు రిషబ్. తదుపరి చిత్రంలో హీరో తండ్రి పాత్రను ప్రధానంగా చూపిస్తారని తెలుస్తోంది. -
అందుకే కాంతార ఆస్కార్‌కు నామినేట్ కాలేదు: నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం కాంతార. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. హోంబలే ఫిలిం నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్‌కు షాట్లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. చదవండి: ‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి శివానంద్ ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? ఈ నేపథ్యంలో కాంతార ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంపై తాజాగా ఈ మూవీ నిర్మాత, హోంబలే ఫిలిం అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో విజయ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా సమయం నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న కథ నేపథ్యం ఉన్న సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఆడియన్స్ కొత్త రకం కంటెంట్‌నే ఆదరిస్తున్నారు. అదే విధంగా ఇప్పటి ఫిలిం మేకర్స్ లక్ష్యం కూడా అదే. కాంతార, ఆర్ఆర్ఆర్ సినిమాల విషయంలో అదే జరిగింది. కాంతార ద్వారా తుళు కల్చర్‌ని అంతా తెలుసుకున్నారు. ఇకపై కూడా అలాంటి కథలపైనే దృష్టి పెడుతున్నాం’ అన్నారు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న బాలయ్య వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..! ఇక కాంతార ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడంపై మాట్లాడుతూ.. ‘కాంతార సినిమా సప్టెంబర్ రిలీజయింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల నామినేషన్స్ సమయం లోపు ప్రచారం చేయలేకపోయాం. చాలా తక్కువ టైం ఉండటంతో ఎక్కువ ప్రచారం చేయలేకపోయాము. అందుకే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ అవ్వలేదనుకుంట. ఆ లోటుని కాంతార 2 తీరుస్తుంది. ఆల్రెడీ కాంతార 2 పనులు మొదలయ్యాయి. 2024 చివరి వరకు కాంతార 2 సినిమాని తీసుకొస్తాం. ఆ సినిమాని అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.