'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ | Prabhas Salaar 2 Shelved Rumours, Hombale Films Clarify | Sakshi
Sakshi News home page

Salaar 2: పుకార్లపై నవ్వుతూ భలే కౌంటర్ ఇచ్చారు

Published Sun, May 26 2024 1:05 PM | Last Updated on Sun, May 26 2024 1:32 PM

Prabhas Salaar 2 Shelved Rumours, Hombale Films Clarify

ప్రభాస్ 'సలార్ 2' ఆగిపోయిందా? ఇంకెందుకులే అని పక్కనబెట్టేశారా? మీరు కూడా ఇలాంటి రూమర్స్ ఎక్కడో ఓ చోట వినే ఉంటారుగా. గత కొన్నిరోజుల నుంచి ఈ మూవీ గురించి ఏదో ఓ గాసిప్ వస్తూనే ఉంది. ఎందుకంటే ఆగస్టు నుంచి డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ మొదలు పెట్టబోతున్నాడు. రీసెంట్‌గానే తారక్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అదిగో అప్పటినుంచి 'సలార్' సీక్వెల్‌పై పుకార్లు షురూ అయ్యాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

'కేజీఎఫ్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన యాక్షన్ మూవీ 'సలార్'. పలుమార్లు వాయిదా పడి.. గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. బాగానే ఉందనే టాక్ అయితే వచ్చింది గానీ వసూళ్లు మాత్రం రూ.700 కోట్లు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు నుంచి ప్రశాంత్ నీల్‪‌తో ఇతడి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోతుందనేసరికి 'సలార్'ని లైట్ తీసుకున్నారా అనే సందేహాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే క్లారిటీ ఇచ్చిన 'సలార్' నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.. 'వాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు' అనే క్యాప్షన్‌తో ప్రశాంత్ నీల్-ప్రభాస్ సెట్‌లో ఉ‍న్న ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. అంటే 'సలార్ 2'పై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం అన్నట్లు తేలింది. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి చూస్తే తారక్‌తో మూవీ కంప్లీట్ చేసిన తర్వాతే ప్రశాంత్ నీల్ 'సలార్ 2' తీస్తాడేమో?

(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‍‌గా పెళ్లి చేసుకున్న ‍'స్ట్రేంజర్ థింగ్స్' నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement