భారీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన సంస్థ హోమ్ బాలే. ఇప్పటికే ఈ బ్యానర్ నుంచి కేజీఎఫ్ పార్ట్– 1, పార్ట్–2, కాంతారా వంటి చిత్రాలు విడుదలై భారీ వసూళ్లతో సంచలన విజయాలను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యానర్లో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా హొంబాలే ఫిలింస్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ ఓ ప్రకటన చేశారు.
చదవండి: వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన హీరోయిన్
అలాగే రాబోయే 5 ఏళ్లలో సినిమా రంగంలో రూ. 3000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు వెల్లడించాడు. గత ఏడాది తమకు సక్సెస్‌ఫుల్‌గా గడిచిందన్నాడు. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోందన్నారు. సినిమాల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను, చారిత్రిక విషయాలను చూపిస్తూ వస్తున్నామన్నారు. కాగా ఇలాంటి సినిమా రంగం కోసం తన సంస్థ రానున్న అయిదేళ్లలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టడం ఆనందంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం ఈ బ్యానర్లో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం సలార్ చిత్రంతో పాటు పృథీరాజ్ హీరోగా టైసప్, ఫాహత్ ఫాజిల్ కథానాయకుడుగా ధూమమ్, దక్షిత శెట్టి దర్శకత్వంలో రిచర్డ్ ఆంటోనీ చిత్రాలను తెరకెక్కుతున్నాయి.
On behalf of @HombaleFilms, I wish to extend my heartfelt greetings for the new year and appreciate you all for showering unwavering love and support towards us. #HappyNewYear! - @VKiragandur#HombaleFilms pic.twitter.com/h5vXMsaMWP
— Hombale Films (@hombalefilms) January 2, 2023
Comments
Please login to add a commentAdd a comment