Kantara Movie
-
కాంతారగడ
యశవంతపుర: హిట్ మూవీ, జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన కాంతారకు, అలాగే నటుడు రిషభ్ శెట్టి, దర్శక నిర్మాతలకు చిక్కొచ్చిపడింది. నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార–2 (చాప్టర్ 1) సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా గవిగుడ్డలో కాంతార–2 యూనిట్ సినిమా షూటింగ్ చేస్తోంది. అటవీ ప్రాంతంలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని స్థానిక నాయకులు కొందరు యసలూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పేలుళ్లు కూడా జరుపుతున్నారని, దీని వల్ల ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని ఆరోపించారు. ప్రశి్నస్తే షూటింగ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే మరోచోటుకు వెళ్లి చిత్రీకరణ చేసుకోవాలని, ఇక్కడ మాత్రం వద్దని గ్రామస్తులు కూడా గళమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే తాను కోర్టులకైనా వెళతామని చెప్పడం గమనార్హం. షూటింగ్ అనుమతులు ఇలా జిల్లా యసళూరు విభాగం శనివార సంత అనే చోట హేరూరు గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో జనవరి 3 నుంచి 15 వరకు తాత్కాలిక సెట్టింగ్‌ల నిర్మాణానికి, 15 నుంచి 25 వరకు షూటింగ్ చిత్రీకరణకు నియమాలతో అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాసన్ ఎసీఎఫ్ మధు, ఆర్ఎఫ్ఒ కృష్ణలు పరిశీలించా. గత 10 రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. అటవీ ప్రాంతంలోకి వందలాది మంది వస్తూ పోతూ ఉన్నారు. అనుమతులు తీసుకున్న ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతోందని కూడా ఆరోపణలు రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నిజమైతే రద్దు చేయాలి: మంత్రి ఖండ్రేఈ నేపథ్యంలో అక్కడ కాంతార సినిమా షూటింగ్‌ను రద్దు చేయాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె అధికారులను ఆదేశించారు. వన్యజీవులు, ప్రకృతికి హాని జరుగుతుంటే తక్షణం షూటింగ్‌ను బంద్ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రకృతి పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి ఈశ్వరఖండ్రె లేఖ రాశారు. చిత్ర నిర్వాహకులు అడవిలో ఉవ్వెత్తున మంటలను వేసి షూటింగ్ చేయడం, పేలుళ్లు జరిపినట్లు తెలిసిందని మంత్రి ఖండ్రే లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల అక్కడ వన్యజీవులు, చెట్లుచేమలకు ముప్పు వస్తుందని పత్రికలలో వార్తలు వచ్చాయని, ఇదే నిజమైతే తక్షణం షూటింగ్‌ను రద్దు చేయాలని సూచించారు. ఈ పరిణామాలతో షూటింగ్ కొనసాగడం అనుమానంగా ఉంది. -
యువకుడిపై దాడి.. చిక్కుల్లో కాంతార మూవీ టీమ్..!
కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు.. దేశవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రిషబ్ శెట్టి ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ టీమ్ చిక్కుల్లో పడింది. ఈ సినిమా షూటింగ్ వల్ల అటవీ ప్రాంతం నాశనం అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో కాంతారా చాప్టర్-1 చిత్రీకరణ జరుగుతోంది. దీంతో స్థానికులతో పాటు జిల్లా పంచాయతీ మాజీ సభ్యులు ఆందోళనకు దిగారు. అడవుల్లో పేలుడు పదార్థాల వినియోగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో గవిగుడ్డ, హేరురు గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో రహస్యంగా చిత్రీకరణ చేయడంపై స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గడ్డి మైదానంలో చిత్రీకరణకు అనుమతి తీసుకుని.. అటవీ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.స్థానిక నేతల సీరియస్సినిమా చిత్రీకరణ వల్ల జంతువులు, పక్షులకు హాని కలుగుతోందని జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు సన్న స్వామి ఆరోపించారు. ఇప్పటికే అడవి ఏనుగుల దాడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అడవులను రక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.చిత్రబృందంతో వాగ్వాదం..అడవుల్లో పేలుడు పదార్ధాల వినియోగంపై స్థానికులు చిత్ర బృందం సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవలో స్థానికుడైన హరీష్ అనే యువకుడిపై సిబ్బంది దాడి చేయగా గాయాలైనట్లు సమాచారం. అతన్ని వెంటనే సమీపంలోని సకలేష్‌పూర్‌లోని క్రాఫోర్డ్ ఆసుపత్రిలో చేర్పించారు.ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంతార మూవీ చిత్రీకరణను వేరే ప్రదేశానికి మార్చాలని.. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కాగా.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతారా: చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కేజీఎఫ్ మేకర్స్, హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. 2022లో వచ్చిన కాంతార అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. -
రిషబ్ శెట్టి పోస్ట్.. రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం!
శాండల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-2 పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దాదాపు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.అయితే రిషబ్ శెట్టి తాజాగా చేసిన ట్వీట్ సరికొత్త వివాదానికి దారితీసింది. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన కిరిక్ పార్టీ సినిమాను ఉద్దేశించి రిషబ్ పోస్ట్ పెట్టారు. 8 ఏళ్ల కిందట మొదలైన ఈ ప్రయాణం హృదయాలను హత్తుకునే ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకంగా మార్చిన మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి డైరెక్షన్లోనే తెరకెక్కించారు.అయితే ఈ సినిమాతో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజా పోస్ట్‌లో రిషబ్ ఆమె పేరును ప్రస్తావించలేదు. ఇది చూసిన నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక లేకపోతే చెత్త సినిమాగా మారేదని ఓ నెటిజన్ విమర్శించాడు. అంతేకాకుండా రిషబ్ షేర్ చేసిన ఫోటోలు రష్మిక లేకపోవడం ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్‌కు విపరీతమైన కోపం తెప్పించింది. కావాలనే ఆమె పేరును, ఫోటోను పెట్టలేదని కొందరు అభిమానులు మండిపడ్డారు. రిషబ్ పోస్ట్‌లో తన సోదరుడు రక్షిత్ పేరును మాత్రమే ప్రస్తావించడంపై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాగా.. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ ನಮ್ಮ ಜೀವನದ ಭಾಗವಾಗಿ 8 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ, ಅನೇಕ ಸುಂದರ ನೆನಪುಗಳು ಮತ್ತು ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಈ ಪಯಣವನ್ನು ಅರ್ಥಪೂರ್ಣವನ್ನಾಗಿಸಿವೆ.ನಿಮ್ಮ ಬೆಂಬಲಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. 8 years ago, a journey began that touched hearts and created countless memories.Here’s to your love and support… pic.twitter.com/67ehO9dnOz— Rishab Shetty (@shetty_rishab) December 30, 2024 -
ఛత్రపతి శివాజీగా పాన్ ఇండియా హీరో.. పోస్టర్ విడుదల
కన్నడ హీరో రిషబ్ శెట్టి మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రానున్న చిత్రం 'ఛత్రపతి శివాజీ మహారాజ్'. భారీ బడ్జెట్ తెరకెక్కను ఈ చిత్రాన్ని ఒక పోస్టర్‌తో తాజాగా రిషబ్ ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి నటించనున్న ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను దర్శకుడు సందీప్ సింగ్ షేర్ చేశారు. 'ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇది అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధున్ని గౌరవించటానికి నిర్మిస్తున్నాం. యుద్ధ రంగంలో శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటన స్ఫూర్తిని, స్వపరిపాలన కోసం పోరాడిన మరాఠ యోధుడు శివాజీ. అతని జీవితం, వారసత్వం భారతీయ చరిత్రలో చెరగని ముద్రను మిగిల్చాయి' అని ఆయన గుర్తుచేసుకున్నారు. శివాజీ అన్‌టోల్డ్ స్టోరీతో ప్రేక్షకులకు తాము చూపించబోతున్నట్లు ఆయన అన్నారు.కాంతార సినిమా తర్వాత రిషబ్ శెట్టి మార్కెట్ పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఆయన చేతిలో అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి. కాంతార ప్రీక్వెల్తో పాటు జై హనుమాన్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' వంటి బిగ్ ప్రాజెక్ట్‌లో ఆయన భాగమైనందుకు ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. 2025,2026,2027 ఇలా వరుసగా రిషబ్ శెట్టి సినిమాలు విడుదల కానున్నాయి.Our Honour & Privilege, Presenting the Epic Saga of India’s Greatest Warrior King – The Pride of Bharat: #ChhatrapatiShivajiMaharaj. #ThePrideOfBharatChhatrapatiShivajiMaharajThis isn’t just a film – it’s a battle cry to honor a warrior who fought against all odds, challenged… pic.twitter.com/CeXO2K9H9Q— Rishab Shetty (@shetty_rishab) December 3, 2024 -
'కాంతార' యూనిట్ ప్రయాణిస్తున్న బస్సు బోల్తా
'కాంతార' సినిమా యూనిట్ సభ్యలకు ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా షూటింగ్‌ను మేకర్స్ ఆపేశారు. కన్నడ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార1 భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతుంది. అయితే, చిత్ర యూనిట్‌కు ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.నవంబర్ 24న రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని సుమారు 20 మంది సభ్యులతో ప్రయాణిస్తున్న మినీ బస్సుకు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని జడ్కల్లో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు ఆరుగురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జడ్క్ల్లోని మూడూరు నుంచి కొల్లూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా కాంతార షూటింగ్‌ను ఆపేశారు.డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫోన్ చూస్తూ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బస్సులో ఉన్న ఒక ఆర్టిస్ట్ ఆరోపించాడు. ఘటన జరగగానే కొందరు డ్రైవర్‌పై చేయి చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్‌గా రిషభ్ స్వీయ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ దీనిని నిర్మిస్తున్నారు. 2025 అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
గ్లామర్ డోస్ పెంచిన..కాంతార బ్యూటీ సప్తమిగౌడ లేటెస్ట్ ఫొటోస్
-
రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్.. గ్లింప్స్ అదిరిపోయింది!
కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టిన చిత్రం కాంతార. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. కాంతార: చాప్టర్-1 పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీఎత్తున నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. దాదాపు కాంతార రిలీజైన రెండేళ్ల తర్వాత ప్రీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కాంతార పార్ట్-1 రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశారు. వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. Step into the sacred echoes of the past 🔥#KantaraChapter1 - Worldwide Grand Release on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓.Watch the First Look Teaser ▶️ https://t.co/8cGsjMKXA7#KantaraChapter1onOct2 #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG… pic.twitter.com/vBctAk2Zgs— Hombale Films (@hombalefilms) November 18, 2024 -
'కాంతార 1' రిలీజ్ డేట్ వచ్చేసింది... ఇంత ఆలస్యంగానా?
కాంతార.. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన అద్భుతాలు అన్నీఇన్నీ కావు. కన్నడ స్టార్ రిషభ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డు సైతం గెలిచింది. ఈ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రీక్వెల్ రెడీ అవుతోంది.రిషబ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లో రిషబ్ ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని కనిపించారు.ఇకపోతే ‘కాంతార చాప్టర్ 1’ కోసం నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రత్యేకంగా సిద్ధమయ్యాడు. కేరళలో ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో కఠినమైన శిక్షణ పొందారు. వచ్చే ఏడాది దసరాకు కాంతార 1 ముందుగానే టికెట్ బుక్ చేసుకుంది. మరి ఈ మూవీ ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!చదవండి: సమంత యాడ్ వీడియో వైరల్.. గుర్తుపట్టలేకున్న ఫ్యాన్స్ -
రిషబ్ శెట్టి తండ్రిగా మోహన్ లాల్.. కాంతారా 2 నుంచి లేటెస్ట్ అప్డేట్..
-
కాంతార ప్రీక్వెల్‌లో మోహన్‌లాల్.. ఆ పాత్ర చేయనున్నాడా?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, టీజర్ కూడా విడుదల చేశారు. కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్ను కాంతారా ఒక్కసారిగా మార్చేసింది. దీంతో కాంతార ప్రీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే తాజాగా కాంతార చాప్టర్-1కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రిషబ్ శెట్టి తండ్రిగా ఆయన నటిస్తారని లేటేస్ట్ టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో రిషబ్ శెట్టిని మోహన్‌లాల్ కలుసుకున్నారు. ఆయన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. అదే సమయంలో వీరి మధ్య కాంతార గురించే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంతారా: చాప్టర్-1 లో మోహన్‌లాల్ పాత్రపై గత రెండు రోజులుగా శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఇక అభిమానులకు పండగే.(ఇది చదవండి: 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం)కాగా.. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తోన్న కాంతార చాప్టర్- 1 ప్రస్తుతం నాలుగో షూటింగ్ షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
కాంతార హీరోగా రిషబ్ శెట్టి కాదు.. ఫస్ట్ అనుకున్నది ఎవరంటే?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్ కూడా విడుదల చేశారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ శెట్టి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కాంతార మూవీకి మొదట హీరోగా తాను చేయాలని అనుకోలేదని తెలిపారు. ఈ చిత్రంలో శివ పాత్రను పోషించడానికి శెట్టి మొదటి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను సంప్రదించినట్లు వెల్లడించారు. రాజ్‌కుమార్‌కు ఈ స్క్రిప్ట్‌ను వినిపించినప్పుడు ఎంతో ఉత్సాహంగా విన్నారని.. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయాడని రిషబ్ వివరించారు. ఓ రోజు నాకు ఫోన్ చేసి నా కోసం ఎదురు చూస్తే సినిమా ఏడాది ఆలస్యం కావొచ్చని నాతో అన్నారని తెలిపారు. అయితే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఊహించని విధంగా అక్టోబర్ 29, 2021న బెంగళూరులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి రెండు రోజుల ముందు కలుసుకున్నానని రిషబ్ గుర్తు చేసుకున్నారు. తన సినిమా కాంతార గురించి ఆయన ఆరా తీశారని చెప్పుకొచ్చారు. సినిమా పట్ల రాజీ పడవద్దని నాకు సూచించారు. షూట్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను రాజ్‌కుమార్‌కు చూపించినట్లు వెల్లడించారు. ఫోటోలు చూసిన రాజ్‌కుమార్ చాలా సంతోషంగా వ్యక్తం చేశారని.. నీ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పాడని రిషబ్ శెట్టి తెలిపారు. -
హిందీ సినిమాలు భారత్‌ను నెగెటివ్‌గా చూపిస్తున్నాయి: కాంతార హీరో
రెండేళ్ల క్రితం వచ్చిన కాంతార మూవీ బాక్సాఫీస్‌ను గడగడలాడించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన రిషబ్ శెట్టికి ఇటీవలే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించింది. దీంతో ఇతడి పేరు నేషనల్ వైడ్ మార్మోగిపోతోంది. ఇలాంటి సమయంలో రిషబ్ శెట్టి బాలీవుడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ మూడే నాకు గర్వకారణంఓ మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్.. మన దేశాన్ని నెగెటివ్‌గా చూపిస్తున్నాయి. అలాంటి చిత్రాలు అంతర్జాతీయ వేదికల్లో చోటు దక్కించుకోవడం శోచనీయం. నా వరకైతే దేశం, నా రాష్ట్రం, నా భాష.. ఈ మూడింటినీ చూసి గర్వంగా ఫీల్ అవుతుంటాను. వీటిని ప్రపంచానికి పాజిటివ్‌గా చూపించాలని నమ్ముతాను. అందుకోసం నావంతు ప్రయత్నిస్తున్నాను అని పేర్కొన్నాడు.అది తప్పు కాదా?ఇది చూసిన జనాలు.. హీరో వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? అదెప్పటినుంచో అలాంటి సినిమాలే ఎక్కువగా తీస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం.. నీ సినిమాల్లో అశ్లీలత లేనట్లే మాట్లాడుతున్నావంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతదాకా ఎందుకు? కాంతార సినిమాలో హీరోయిన్ నడుము గిల్లలేదా? అది తప్పు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ సీన్స్ ఆపేయండి..ఈయన ఒక్క సినిమా హిట్ కొట్టి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్లా ఫీలవుతున్నాడు. కాంతారకు అనవసరంగా హైప్ ఇచ్చారు. దాన్ని ఒకసారి చూశాక మళ్లీ చూడాలన్న ఆసక్తే రాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. సౌత్ సినిమాల్లో హీరోయిన్ల నడుము గిల్లే సన్నివేశాలు ఆపేయండి.. చూడటానికి చాలా అభ్యంతరకరంగా ఉంది. అవి ఆపేశాక నీతులు చెప్పండి అని మరో వ్యక్తి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ సినిమా చేస్తున్నాడు. -
జాతీయ అవార్డ్.. హీరో పునీత్ - వాళ్లకు అంకితం: రిషబ్ శెట్టి
కేంద్రం తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో దక్షిణాది సినిమాలు అద్భుతాలు చేశాయి. కన్నడ సినిమా 'కాంతార'కి గానూ ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి పురస్కారం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అవార్డ్ రావడంపై రిషబ్ స్పందించాడు. దివంగత హీరో పునీత్‌పై తనకు ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)తనకు వచ్చిన జాతీయ అవార్డుని రాష్ట్రంలోని దేవ నర్తకులకి, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్, కన్నడ ప్రేక్షకులకు అంకితమిస్తున్నట్లు రిషబ్ శెట్టి పేర్కొన్నాడు. జాతీయ అవార్డ్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశాడు.హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కాంతార' సినిమాలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. కేవలం రూ.15 కోట్లు పెడితే ఏకంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. ఇందుకు గానూ రిషబ్.. ఉత్తమ నటుడిగా నిలవడం కన్నడ సినిమా రేంజ్‌ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
జాతీయ సినిమా అవార్డ్‌తో పాటు ఏమేం ఇస్తారు?
జాతీయ అవార్డులనీ ప్రకటించారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. మరోవైపు తమిళ, మలయాళ సినిమాలు ఈసారి మంచి దూకుడు చూపించాయి. అయితే అవార్డ్ విజేతలు ఎవరనేది తెలిసిపోయింది. మరి వాళ్లకు పురస్కారంతో పాటు ఏమేం ఇస్తారో తెలుసా?(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)జాతీయ సినీ అవార్డు విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతి ఇస్తారు. అలానే గుర్తింపుగా ప్రశంస పత్రాలను బహుకరిస్తారు. జ్యూరీ అభినందనల అందుకున్న సినిమాలకు మాత్రం సర్టిఫికేట్ మాత్రమే దక్కుతుంది. జ్యూరీ స్పెషల్ విజేతలకు ప్రశంస పత్రంతో పాటు నగదు బహుమతి లభిస్తుంది.తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్ విన్నర్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ పాపులర్ చిత్రం, ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ విభాగాలకు మాత్రం రూ.3 లక్షల డబ్బు.. మిగిలిన అందరూ విజేతలకు మాత్రం రూ.2 లక్షల నగదు లభిస్తుంది. (ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
క్లాప్ బాయ్ నుంచి నేషనల్ అవార్డ్ విన్నర్‌గా.. 'రిషబ్ శెట్టి' ప్రయాణం
కాంతార సినిమాతో రిషబ్ శెట్టి పేరు పాపులర్ అయింది. కాంతార మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాందించుకున్నారు రిషబ్ శెట్టి. కన్నడలో విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్‌తో అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్‌ను శాసించింది. కాంతార అద్భుతమైన విజయంలో రిషబ్ శెట్టి పాత్ర చాలా కీలకం. 2010లో సినీరంగంలోకి అడుగుపెట్టి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ 2016లో రికి, కిరీక్ పార్టీ సినిమాలకు దర్శకతం వహించాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన రిషబ్ శెట్టి తాజాగ విడుదలైన 70వ జాతీయ ఉత్తమ నటుడిగా (కాంతార) అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. అసలు రిషబ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేశారు? అనే విషయాలు తెలుసుకుందాం.కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో రిషబ్ జన్మించారు. తన తండ్రి భాస్కర శెట్టి జ్యోతిష్కుడు కాగా అమ్మ రత్నావతి. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు రిషబ్. ఆయనకు అక్క, అన్నయ్య ఉన్నారు. సినిమాల్లో అరంగేట్రానికి ముందు అనేక ఉద్యోగాలు రిషబ్ శెట్టి చేశారు. తన అవసరాల కోసం నాన్నను ఎప్పుడూ డబ్బు అడగలేదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.ఇండస్ట్రీలో మొదట క్లాప్ బాయ్‌గా తన జర్నీని ప్రారంభించిన రిషబ్ ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.ఇండస్ట్రీలో పరిచయాలు లేకుండానే..తన సినీ ప్రస్థానం గరించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'నేను నటుడిని కావాలనుకున్నా. కానీ పరిశ్రమలో నాకు ఎటువంటి పరిచయాలు లేవు. ఎలా అప్రోచ్ అవ్వాలనేది నా ఆలోచన. అందుకే నేను ఒక కన్నడ నటుడి కథను చదివా. అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి.. హీరోగా ఎలా మారాడనే దాని గురించి చదివాను. నా చదువు తర్వాత ఫిల్మ్ మేకింగ్‌పై షార్ట్‌టర్మ్ కోర్సు చేశా. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి.. ఏడేళ్ల తర్వాత నటన వైపు మొగ్గు చూపా.' అని అన్నారు.(చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)కూలీ పనులకు కూడా వెళ్లేవాడురిషబ్ శెట్టి నటుడిగా అరంగేట్రానికి ముందు చాలా పనులు చేశాడు. చిన్నతనంలో బాగా అల్లరి చేస్తున్న రిషబ్ పై చదువుల కోసం తన గ్రామం నుంచి బెంగుళూరుకు మకాం మార్చాడు. డిగ్రీ చదివేటప్పుడు సినిమా చూసేందుకు నాన్నను డబ్బులు అడగలేక.. కూలీ పనులకు వెళ్లేవాడు. 2004 నుంచి 2014 వరకు తన మొదటి డైరెక్షన్ చేసేవరకు 10 ఏళ్లపాటు వాటర్ క్యాన్లు అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటల్స్‌లో పనిచేశారు. అలా తన గమ్యాన్ని చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారు.సినీ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి ప్రయాణంచదువుకునే సమయంలోనే రిషబ్‌కు సినిమాలు అంటే పిచ్చి. ఆ సమయంలోనే అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ పరిచయాలు లేకపోవడంతో సినీ పరిశ్రమలో క్లాప్ బాయ్, స్పాట్ బాయ్‌గా పనిలో చేరారు. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తుగ్లక్ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ తొలి దర్శకత్వం వహించిన చిత్రం రికీ విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. ఆపై అదే ఏడాది దర్శకత్వ వహించిన మరో చిత్రం కిరిక్ పార్టీ మూవీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.‘కాంతార’ ప్రభంజనంచిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. 2022 సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఆక్కడ ప్రభంజనం సృష్టించింది. అక్కడ కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్ వుడ్లో కేజీయఫ్2 తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘కాంతారా’నే. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 400 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో సుమారు రూ. 75 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. కాంతార చిత్రంలో రిషబ్ ప్రధాన కథానాయకుడిగా నటించిడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్ శెట్టి సత్తా చాటారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. 2018లో రిషబ్ దర్శకత్వం వహించిన సర్కారీ హిరియ ప్రాథమిక షాలే, కాసరగోడు (Sarkari Hi. Pra. Shaale, Kasaragodu) సినిమాకుగాను జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ బాలల చిత్రంగా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఎంపికైంది. -
జాతీయ అవార్డ్ గెలుచుకున్న సినిమాలు.. ఏయే ఓటీటీల్లో?
70 జాతీయ అవార్డులని కేంద్రం తాజాగా శుక్రవారం ప్రకటించింది. 2022 డిసెంబరు 31లోపు సెన్సార్ పూర్తయిన చిత్రాలకుగానూ పురస్కార విజేతలు ఎవరెవరనేది అనౌన్స్ చేశారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' మాత్రమే ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. మలయాళ, తమిళ సినిమాలదే పూర్తిగా ఆథిపత్యం. ఇంతకీ ఈ మూవీస్ అన్నీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల పూర్తి లిస్ట్)నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్- ఓటీటీఉత్తమ చిత్రంగా నిలిచిన మలయాళ సినిమా 'ఆట్టమ్'.. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టిని నిలబెట్టిన 'కాంతార'.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఉత్తమ నటిగా నిత్యా మీనన్ చేసిన 'తిరు' సన్ నెక్స్ట్లో, మానసి పరేఖ్ 'కచ్ ఎక్స్‌ప్రెస్' షీమారో మీ అనే ఓటీటీలో ఉంది.ప్రాంతీయ చిత్రాల విభాగంలో.. కార్తికేయ 2(తెలుగు) జీ5లో ఉంది. పొన్నియిన్ సెల్వన్-1 (తెలుగు-తమిళ) అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.సౌది వెళ్లక్క సీసీ 225య/2009 (మలయాళ) చిత్రం సోనీ లివ్‌లో ఉంది.వాల్వీ (మరాఠీ).. అమెజాన్ ప్రైమ్, జీ5 ఓటీటీల్లో ఉంది.కబేరి అంతర్జాన్ (బెంగాలీ).. జియో సినిమా ఓటీటీలో ఉంది.గుల్ మోహర్ (హిందీ).. హాట్ స్టార్‌లో ఉంది.ఉత్తమ దర్శకుడు విభాగంలో సూరజ్ బర్జాత్యాకి అవార్డు వచ్చిన 'ఊంచాయ్'.. జీ5లో ఉంది.విజువల్ ఎఫెక్ట్స్, ప్లే బ్యాక్ సింగర్ తదితర కేటగిరీల్లో విజేతగా నిలిచిన 'బ్రహ్మస్త్ర'.. హాట్‌స్టార్‌లో ఉంది.ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో అవార్డ్ గెలిచిన 'కేజీఎఫ్ 2'.. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది.ఉత్తమ మేకప్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో గెలిచిన బెంగాలీ మూవీ 'అపరాజితో'.. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.ఉత్తమ బాలనటుడిగా నిలిచిన శ్రీపాథ్ నటించిన 'మలికాపురమ్'.. హాట్‌స్టార్‌లో ఉంది.(ఇదీ చదవండి: 'తంగలాన్' సినిమా రివ్యూ) -
'కాంతార' బ్యూటీ.. షార్ట్‌లో భలే అందంగా ఉంది! (ఫొటోలు)
-
కాంతార 2 రిలీజ్ డేట్ లాక్..
-
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ -2023.. ఉత్తమ చిత్రాలు ఏవో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ మరో ఘనతను దక్కించుకుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్- 2023లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇవాళ ప్రకటించిన 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ యాక్టర్స్‌గా ఎన్టీఆర్, రామ్‌చరణ్ సంయుక్తంగా ఆవార్డ్ అందుకోనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల విజేతలను కూడా ప్రకటించారు. ఏయే సినిమాకు అవార్డులు దక్కాయో ఫుల్ లిస్ట్ చూసేయండి.68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2023 విజేతలు వీళ్లే..తెలుగు..ఉత్తమ చిత్రం- ఆర్ఆర్ఆర్ఉత్తమ దర్శకుడు- ఎస్ఎస్ రాజమౌళిఉత్తమ నటుడు- రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ఉత్తమ నటి - మృణాళ్ ఠాకూర్ (సీతారామం)ఉత్తమ నటి (క్రిటిక్స్) -సాయి పల్లవి( విరాట్ పర్వం)ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)ఉత్తమ సహాయ నటి - నందితాదాస్ (విరాట్ పర్వం)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ఎం.ఎం.కీరవాణి (ఆర్ఆర్ఆర్)ఉత్తమ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)ఉత్తమ నేపథ్య గాయకుడు - కాలభైరవ (కొమురం భీముడో.. ఆర్ఆర్ఆర్)ఉత్తమ నేపథ్య గాయని - చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు.. ఆర్ఆర్ఆర్)బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు శిరిల్ (ఆర్ఆర్ఆర్)తమిళంఉత్తమ చిత్రం - పొన్నియిన్ సెల్వన్- 1ఉత్తమ నటుడు- కమల్ హసన్ (విక్రమ్)ఉత్తమ నటి- సాయి పల్లవి (గార్గి)ఉత్తమ దర్శకుడు- మణి రత్నం (పొన్నియిన్ సెల్వన్ -1)ఉత్తమ సంగీత దర్శకుడు- ఏఆర్ రెహమాన్ (పొన్నియన్ సెల్వన్- 1)ఉత్తమ సహాయ నటుడు -(మేల్) కాళి వెంకట్ఉత్తమ సహాయ నటి - ఊర్వశిఉత్తమ చిత్రం క్రిటిక్స్- కదైసి వ్యవసాయిఉత్తమ యాక్టర్ క్రిటిక్స్ - ధనుష్ (తిరు), మాధవన్(రాకెట్రీ)ఉత్తమ నటి క్రిటిక్స్- నిత్యా మీనన్ (తిరు)ఉత్తమ గేయ రచయిత- తమిరైఉత్తమ గాయకుడు- సంతోష్ నారాయణ్ (తిరు)ఉత్తమ గాయని - అంతనా నందిఉత్తమ తొలి చిత్ర నటుడు- ప్రదీప్ రంగనాథ్ఉత్తమ తొలి చిత్ర నటి - అదితి శంకర్ (విరుమన్)ఉత్తమ సినిమాటోగ్రఫీ- సెంథిల్, రవి వర్మన్ కన్నడఉత్తమ చిత్రం -కాంతారఉత్తమ నటుడు- రిషబ్ షెట్టి (కాంతార)ఉత్తమ నటి - చైత్ర జే అచార్ఉత్తమ దర్శకుడు - కిరణ్ రాజ్ (777 ఛార్లీ)ఉత్తమ సహాయ నటుడు- అచ్యుత్ కుమార్ఉత్తమ సహాయ నటి - మంగళఉత్తమ సంగీత దర్శకుడు - అజనీష్ఉత్తమ గేయ రచయిత - నాగేంద్ర ప్రసాద్ఉత్తమ గాయకుడు - సాయి విగ్నేశ్ఉత్తమ గాయని- సునిధి చౌహాన్ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)- ధరణి మండలఉత్తమ నటుడు క్రిటిక్స్- నవీన్ శంకర్ఉత్తమ నటి క్రిటిక్స్- సప్తమి గౌడమలయాళంఉత్తమ చిత్రం- నా తన్ కేస్ కోడుఉత్తమ నటుడు- కుంచకో బోబన్ ( నా థన్ కేస్ కోడు)ఉత్తమ నటి - దర్షన రాజేంద్రన్ (జయజయజయజయహే)ఉత్తమ దర్శకుడు- రతీస్ బాలకృష్ణన్ (నా థన్ కేస్ కోడు)ఉత్తమ సహాయ నటుడు- ఇంద్రాన్స్ (ఉడల్)ఉత్తమ సహాయ నటి -పార్వతి తిరువోతు (ఫుజు)ఉత్తమ సంగీత దర్శకుడు- కైలాష్ మీనన్ (వాషి)ఉత్తమ గేయ రచయిత- అరుణ్ అలత్ (హృదయం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - ఉన్ని మీనన్ (భీష్మ పర్వం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - మృదుల వారియర్ (పాథోన్పథం నోట్టండు)ఉత్తమ ఫిలిం (క్రిటిక్స్)- అరిఇప్పుఉత్తమ నటుడు (క్రిటిక్స్)- అలెన్సియర్ లే లోపెజ్ (అప్పన్)ఉత్తమ నటి (క్రిటిక్స్) -రేవతి (భూతకాలం) -
కల్కి బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ.. ఈ ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
బుజ్జి కారును నడిపిన కాంతార హీరో.. వీడియో వైరల్
ప్రభాస్ -నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. దీంతో ఈ చిత్రంపై పాన్ ఇండియాతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో బుజ్జి అనే కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జిని ప్రధాన నగరాల్లో తిప్పుతున్నారు.తాజాగా బుజ్జి కారును కాంతార హీరో రిషబ్ శెట్టి నడిపారు. బుజ్జి కారును డ్రైవ్ చేసి ప్రశంసల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విటర్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. బుజ్జి కారును ఇప్పటికే పలువురు సినీతారలు డ్రైవ్ చేశారు. ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే కల్కి టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. KALKI X KANTARA 🔥@shetty_rishab gets his hands on #Bujji.#Kalki2898AD pic.twitter.com/IvIHuxGO6y— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 24, 2024 -
కాంతార హీరో ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు షేర్ చేసిన నటుడు!
కాంతారా మూవీతో స్టార్డమ్ సొంతం చేసుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతార బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకుంది. దీంతో రిషబ్ కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవలే ఆయన మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ను కలిశారు. దీంతో ఆయన కాంతార-2 కోసమే మోహన్‌లాల్‌ను కలిశాడని వార్తలొచ్చాయి. కాంతార 2 విషయానికొస్తే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా రిషబ్ శెట్టికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడీయాలో యాక్టివ్‌గా ఉండే రిషబ్ ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు రిషబ్ దంపతులు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రముఖ శ్రీ శారదాంబ ఆలయంలో తమ ముద్దుల కూతురికి అక్షర అభ్యాసం పూర్తియిందంటూ రిషబ్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు. చాన్నాళ్లు కష్టపడి డైరెక్టర్ అయ్యాడు. హిట్ కొట్టాడు. అలా అటు నటుడిగా ఇటు దర్శకుడిగా అడపాదడపా మూవీస్ చేశాడు. కానీ రెండేళ్ల క్రితం ఓ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఎంతలా అంటే ప్రాంతీయ హీరో కాస్త పాన్ ఇండియా హీరో అయ్యేంతలా. కోట్లాదిమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. మరి ఇంతలా చెప్పాం కదా.. ఇతడు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి పేరు రిషభ్ శెట్టి. హా అవును మీరు ఊహించింది కరెక్టే. 'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించాడు. రూ.15 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తీయగా.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీనిబట్టి ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అయ్యిందో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ తీస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది రిలీజ్ ఉండొచ్చు.రిషభ్ శెట్టి విషయానికొస్తే.. కర్ణాటకలోని కుందాపుర అనే ఊరిలో పుట్టాడు. జూ.ఎన్టీఆర్ అమ్మది కూడా ఈ ఊరే. అందుకేనేమో తారక్ అంటే రిషభ్ శెట్టి చాలా ఇష్టం. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పాడు కూడా. 2012 నుంచి శాండల్ వుడ్లో ఉన్న రిషభ్ శెట్టి.. 'కాంతార' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఫ్యామిలీ విషయానికొస్తే.. ప్రగతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 'కాంతార'తో సంచలన హిట్ కొట్టిన ఇతడు.. ప్రీక్వెల్తో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో?(ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!) -
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ కాంతారతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ సప్తమిగౌడ. ఈ సినిమాలో ఫారెస్ట్ కానిస్టేబుల్ పాత్రలో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు దక్కిచుకుంది. ఇటీవల శాండల్‌వుడ్‌లో యువ చిత్రంలో హీరోయిన్గా నటించింది. యువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా శివరాజ్‌కుమార్ అన్నయ్య కుమారుడు యువరాజ్‌కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ మూవీ ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం రెంటల్ విధానంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఉచితంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. సంతోష్ ఆనంద్రామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రంలో యువరాజ్‌కుమార్ రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు. మరోవైరు ఈ ఏడాదిలోనే సప్తమి గౌడ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిస్తోన్న తమ్ముడు మూవీలో సప్తమి గౌడ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. -
గర్ల్ ఫ్రెండ్ అంటూ విష్ చేసిన కాంతార హీరో.. వీడియో వైరల్!
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రిలీజైన కాంతారకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాంతార సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'కాంతారా చాప్టర్- 1' ఫస్ట్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా రిషబ్ తన భార్య ప్రగతి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విష్ చేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఉన్న క్షణాలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. బర్త్ డే రోజు తన భార్య ప్రగతికి గుర్తుండిపోయేలా శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా బర్త్ డే గర్ల్‌ఫ్రెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఆనందం ఒక వరంలా ఉండనివ్వండి. ఈ బంధం చిరస్థాయిగా నిలిచిపోనివ్వండి. మీ ఆయురారోగ్యాలు, మా ఆప్యాయత ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial)