Is Rajinikanth part of Rishab Shetty's 'Kantara 2'? - Sakshi
Sakshi News home page

Kantara2 : క్రేజీ బజ్‌.. కాంతార-2లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌?

Published Sat, Feb 25 2023 4:07 PM | Last Updated on Sat, Feb 25 2023 4:49 PM

Rajinikanth To Be Part Of Rishab Shetty Kantara2 - Sakshi

కన్నడ సెన్సేషన్‌ కాంతార మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.

రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్రానికి ఇప్పటికే సీక్వెల్‌ ప్రకటించారు మేకర్స్‌. అయితే తాజాగా కాంతార-2కు సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఈ మూవీలో తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించనున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా టాక్‌ వినిపిస్తుంది.

ఇదే విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో రిషబ్‌ శెట్టిని ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. ఒకవేళ రజనీకాంత్‌ను సంప్రదించకపోతే ఇది కేవలం పుకారు అని బదులిచ్చేవారు. దీంతో కాంతార-2పై మరింత ఆసక్తి నెలకొంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement