Super Star Rajinikanth
-
రజనీకాంత్ సినిమాకు ఆ కండీషన్ పెట్టిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్
తమిళ సినిమా: తాజాగా కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే అది రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజు కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం గురించే అన్నది గమనార్హం. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోపక్క తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో రజినీకాంత్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. తదుపరి జై భీమ్ చిత్రం జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. తాజాగా రజనీకాంత్ 171వ చిత్రం గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. దీన్ని నిర్మించడానికి పలువురు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అందులో నటుడు కమలహాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా ఉండటం విశేషం. అయితే ఇప్పుడు సన్ పిక్చర్స్ సంస్థ ఈ అవకాశాన్ని తన్నుకుపోయినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మాతకు ఓ కండిషన్ పెట్టినట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనకు రూ. 40 కోట్లు పారితోషికం ఇస్తేనే రజిని చిత్రానికి దర్శకత్వం ఇస్తానని లోకేష్ కనకరాజ్ డిమాండ్ చేశారన్నదే ఆ టాక్. అయితే అంత మొత్తం ఇవ్వడానికి సన్ పిక్చర్స్ సంస్థ సుముఖంగా లేదని, దీంతో మరో దర్శకుడితో ఈ చిత్రాన్ని చేయాలని భావించినట్లు సమాచారం. కానీ తనకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ కావాలని రజనీకాంత్ పట్టుపట్టారని, దీంతో వేరే దారి లేక లోకేష్ కనకరాజ్ డిమాండ్‌కు తలొగ్గిన సన్ పిక్చర్స్ సంస్థ ఆయనకు రూ.40 కోట్లు పారితోషికం ఇవ్వడానికే సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. -
దొంగతనం చేయడానికి ఐశ్వర్యే కారణం.. పనిమనిషి షాకింగ్ స్టేట్మెంట్
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో కొన్ని రోజుల క్రితం భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. 60 సవర్ల బంగారు నగలు చోరీకి గురైయ్యాయని ఐశ్వర్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి పనిషి ఈశ్వరిని నిందితురాలిగా గుర్తించారు. ఈమెను అరెస్ట్ చేసి విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. అయితే తాను దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యే అంటూ విస్తుపోయే సమాధానం ఇచ్చింది. 'నేను ఐశ్వర్య ఇంట్లో గొడ్డు చాకిరీ చేశాను. ఆమె చెప్పిన పనులన్నీ చేసేదాన్ని. అయితే ఐశ్వర్య దగ్గర బోలెడు డబ్బులు ఉన్నా నాకు రూ. 30వేల జీతమే ఇచ్చేవారు. ఆ డబ్బు ఒక కుటుంబం బతకడానికి సరిపోతుందా? అందుకే దొంగతనాలు చేయడం మొదలుపెట్టా. మొదట చిన్నచిన్న వస్తువులు దొంగిలించేదాన్ని. కానీ దొరికిపోలేదు. దీంతో ధైర్యం చేసి నగలు కూడా దొంగతనం చేశాను' అంటూ విచారణలో ఈశ్వరి చెప్పుకొచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఐశ్వర్య చెప్పినదాని కంటే ఈశ్వరి ఇంట్లో ఇంకా ఎక్కవ బంగారమే దొరికింది. ఆమె ఐశ్వర్య ఇంటితో పాటు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో కూడా పనిచేసేదట. దీంతో ఆ నగలు అక్కడ దొంగిలించిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
క్రేజీ బజ్.. కాంతార-2లో సూపర్‌స్టార్ రజనీకాంత్?
కన్నడ సెన్సేషన్ కాంతార మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్రానికి ఇప్పటికే సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా కాంతార-2కు సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఈ మూవీలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా టాక్ వినిపిస్తుంది. ఇదే విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో రిషబ్ శెట్టిని ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. ఒకవేళ రజనీకాంత్‌ను సంప్రదించకపోతే ఇది కేవలం పుకారు అని బదులిచ్చేవారు. దీంతో కాంతార-2పై మరింత ఆసక్తి నెలకొంది. -
డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి రజని ఫోన్, ఏమన్నారంటే..!
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరో తెరకెక్కిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్, ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం బాలయ్య కెరీర్లో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ వీర సింహారెడ్డి టీంను ప్రశంసించారు. చదవండి: పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ అంతేకాదు డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారట తలైవా. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోయారు గోపిచంద్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘‘ఇది నాకు అద్భుతమైన క్షణం. తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ సర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘వీర సింహారెడ్డి చిత్రాన్ని చూశాను. మూవీ మేకింగ్ నాకు బాగా నచ్చింది’ అని ఆయన నాతో చెప్పారు. చదవండి: కర్ణాటకలో సింగర్ కైలాశ్ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం మా చిత్రం గురించి ఆయన అన్న మాటలు, ఆయనకు కలిగిన భావోద్వేగం.. ఇంతకంటే నాకు ఈ ప్రపంచంలో విలువైనది ఇంకేదీ లేదనిపిస్తోంది. థ్యాంక్యూ రజని సర్’’ అని గోపించంద్ మలినేని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్స్‌గా నటించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. This is a surreal moment for me🤩🤗 Received a call from the Thalaivar, The Superstar @rajinikanth sir. He watched #VeeraSimhaReddy and loved the film. His Words of praise about my film and the emotion he felt are more than anything in this world to me. Thankyou Rajini sir🙏 — Gopichandh Malineni (@megopichand) January 29, 2023 -
తలైవాతో జతకడుతున్న తమన్నా.. ఫస్ట్‌లుక్ రిలీజ్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో 169వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో రివీల్ ఏశారు మేకర్స్. మిల్కీ బ్యూటీ తమన్నా తలైవాతో జతకడుతుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమన్నా ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేసింది. కాగా జైలర్ చిత్రం మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో పాటు కన్నడ హీరో శివ రాజ్‌కుమార్, సునీల్‌లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. .@tamannaahspeaks from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL — Sun Pictures (@sunpictures) January 19, 2023 -
'లవ్‌టుడే' డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్?
తమిళసినిమా: రజనీకాంత్ 171వ చిత్రం నుంచి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది ఆయన చేస్తున్న 169వ చిత్రం. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రజనీకాంత్ తదుపరి మరో రెండు చిత్రాల్లో నటించడానికి సిద్ధమయ్యారు. అందులో లాల్ సలాం అనేది ఒకటి. దీనికి కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇకపోతే 171వ చిత్రం గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. దీనికి డాన్ చిత్రం ఫేమ్ విను చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. సడన్‌గా ప్రదీప్ రంగనాథన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటింన లవ్ టుడే చిత్రం అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన రజనీకాంత్ ప్రదీప్రంగనాథన్ను ఎంతగానో ప్రశంసించారు. విను చక్రవర్తి చెప్పిన కథ రజనీకాంత్‌కు అంతగా రుచించలేదని, దీంతో ప్రదీప్ రంగనాథన్ తన 171వ చిత్రానికి దర్శకత్వం వహించేలా ప్రచారం జరుగుతోంది. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ రెండు చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడం మరో విశేషం. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్.. ఆ తర్వాత దర్గాకు కూడా..
సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌తో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయం వెలుపలు రజనీకాంత్‌ను చూడటానికి భక్తులు ఉత్సాహం చూపారు. తిరుమల శ్రీవారిని దర్శనం అనంతరం నేరుగా రజనీకాంత్ కడపకు వెళ్లారు. అక్కడ కొలువైన అమీన్‌పీర్ దర్గాను ఆయన దర్శించుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్‌తో పాటు రజనీ దర్గాను సందర్శించారు. -
ఘనంగా రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు.. సీఎం నుంచే ఫస్ట్ విషెస్
తమిళ సినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ జన్మదినాన్ని ఆయన అభిమానులు సోమవారం కోలాహలంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచే పెద్దఎత్తున అభిమానులు, స్థానికులు రజనీకాంత్ ఇంటికి చేరుకున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్ 2002లో కథా, కథనం సమకూర్చి కథానాయకుడిగా నటించి నిర్మించిన బాబా చిత్రం పలు మార్పులు చేర్పులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్ అయ్యి అనూహ్య వసూళ్లు సాధిస్తోంది. కాగా స్థానిక క్రోంపేటలోని బాబా చిత్రం ప్రదర్శింపబడుతున్న వెట్రి థియేటర్లో అభిమానులు ఆదివారం రాత్రి రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.' ఈ వేడుకలో రజనీకాంత్ సతీమణి లత రజినీకాంత్ పాల్గొని అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి.. తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ శుభాకాంక్షలు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే మొట్ట మొదటిగా ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి రజనీకాంత్‌కు శుభాకాంక్షలు అందడం విశేషం. ఆయన మీడియా ద్వారా రజనీకాంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. అలాగే అగ్ర నటుడు కమలహాసన్ కూడా రజనీకాంత్‌కు విషెస్ చెప్పారు. తన మిత్రుడు సంపూర్ణ ఆరోగ్యంతో తన విజయ ప్రయాణాన్ని కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని కమల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా రజనీకాంత్ తాజాగా నటిస్తున్న జైలర్ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను చిత్ర వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా జైలర్ చిత్రంలో రజనీకాంత్ పాత్ర పేరు ముత్తువేల్ పాండియన్ అనే విషయాన్ని ప్రకటించడం అభిమానుల్లో జోష్ నింపింది. -
సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్... 9నుంచి రజనీ చిత్రోత్సవాలు
తమిళసినిమా: రజనీకాంత్ పుట్టినరోజు అంటే ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులకు పండగే. రజినీకాంత్ పుట్టినరోజున అభిమానులు ఆలయాల్లో పూజలు, అనాథాశ్రమాల్లో అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈసారి ఇంకొంత స్పెషల్యాడ్ అవ్వడం విశేషం. రజనీకాంత్ ఈనెల 12న 71వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన గత 20 ఏళ్ల క్రితం కథ, కథనాన్ని సమకూర్చి నటించి నిర్మించిన చిత్రం బాబాను కొంత మార్పులు, చేర్పులతో సరికొత్త హంగులు చేర్చి విడుదల చేయడం ప్రత్యేకత అయితే రజనీకాంత్ చిత్రోత్సవాలు పేరుతో పీవీఆర్ సంస్థ ఈ నెల 9వ తేదీ నుం 15వ తేదీ వరకు ఆయన నటించిన హిట్ చిత్రాలను చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో రీ రిలీజ్ చేయడం మరో విశేషం. బాబా, శివాజి, 2.ఓ, దర్బార్ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. కాగా సరికొత్త హంగులతో రూపొందిన బాబా చిత్ర ప్రీమియర్ చెన్నైలోని సత్య థియేటర్లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకు నిర్మాత కలైపులి ఎస్.థాను, లతా రజనీకాంత్, గీత రచయిత వైరముత్తు పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. లతా రజనీకాంత్ మాట్లాడుత 20 ఏళ్ల క్రితం చూసిన దానికంటే పదిరెట్లు సంతృప్తిని బాబా చిత్రం కలిగింందని పేర్కొన్నారు. థియేటర్లో అభిమానుల చప్పట్లతో చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నారు. వారికి తమ కుటుంబంపై ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని అన్నారు. -
Superstar Rajinikanth: మరోసారి తెరపైకి బాబా
సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం బాబా. ఆయనే కథ కథనాలను సమకూర్చారు. ఈ చిత్రానికి అన్నామలై వీరా, బాష వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. నటి మనిషా కొయిరాలా కథానాయకిగా నటించిన ఇందులో గణేష్ సుజాత ఎంఎన్ నంబియార్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, సంగవి, కరుణాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చోటా.కే.నాయుడు చాయాగ్రహణను, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. రజనీకాంత్‌తో దర్శకుడు సురేష్ కృష్ణ 2002 భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. అప్పట్లో ఈ చిత్రంపై రాజకీయ వ్యతిరేకత కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఇందులోని మాయా మాయా, శక్తి కొడూ.. కిచ్చూ కిచ్చూ పాటలు ప్రజాధరణ పొందాయి. ఈ పాటలకు నృత్య దర్శకత్వం వహించిన బృందా, ప్రభు దేవా, లారెన్స్‌కు మంచి గుర్తింపు వచ్చింది. చిత్రంలో రజనీకాంత్ తరచూ చేతి వేళ్లతో చూపించే బాబా ముద్ర చిన్న పిల్లలకు రీచ్ అయింది. అలాంటి చిత్రాన్ని నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరించి మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్ర కథలో కూడా మార్పులు చేస్తున్నట్లు, పాటలను కూడా రీమిక్స్ చేసి డాల్ఫీ సౌండ్ సిస్టంలో రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశాయి. -
తలైవాతో ఢీ అంటున్న శివరాజ్‌కుమార్
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నాత్తే తరువాత నటిస్తున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. పడయప్పా తరువాత నటి రమ్యకృష్ణ రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అదే విధంగా నటుడు వసంత్ రవి, యోగిబాబు, వినాయగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోకి తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వచ్చారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న జైలర్ చిత్రం గత ఆగస్టు నెలలో ప్రారంభమైంది. ఇటీవల కడలూర్ ప్రాంతంలో రెండో షెడ్యూల్ జరుపుకుంది. ఇప్పటికే 59 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై జైలర్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. చిత్రంలో తలైవా యాక్షన్ సన్నివేశాలు హైఓల్టేజ్‌లో ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేయగా అది ట్రెండింగ్ అవుతోంది. కాగా జైలర్ చిత్రంలో శివరాజ్ కుమార్ రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంతో రజినీకాంత్‌కు ఎంతో అనుబంధం ఉంది. అలాంటిది జైలర్ చిత్రంలో రజనీకాంత్‌ను శివ రాజ్ కుమార్ ఢీ కొనే సన్నివేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. -
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రజినీకాంత్ రెమ్యూనరేషన్
-
జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కర్ణాటక అసెంబ్లీకి రావాలని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రత్యేక ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేయనున్నారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. టాలీవుడ్లోనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాకుండా పునీత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తారక్‌తోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి కూడా కర్ణాటక ప్రభుత్వం అహ్వానాలు పంపింది. ఎన్టీఆర్, రజినీకాంత్‌కు కర్ణాటక చాలా ప్రత్యేకం. సూపర్ స్టార్‌కు మహారాష్ట్ర మూలాలు ఉన్నా కర్నాటకలోనే బస్ కండక్టర్‌గా పనిచేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం కర్నాటక కావడంతో వీరిద్దరిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. -
రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో రెండు సినిమాలకు సూపర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు వచ్చేనెల 5న చెన్నైలో జరగనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది నిర్మాణ సంస్థ. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. జైలర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తాజాగా రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు సంతకం చేశారు. ఇవాళ లైకా ప్రొడక్షన్స్ అధినేత తమిళకుమారన్, ఛైర్మన్ సుభాస్కరన్, బ్యానర్ డిప్యూటీ ఛైర్మన్ ప్రేం శివసామితో రజనీకాంత్ ఉన్న ఫోటోనూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. #Thalaivar @rajinikanth Signed two films with LYCA PRODUCTIONS ,Pooja For the Both films will happen on NOV 5 in Chennai! 🤩🔥 Thalaivar #Rajinikanth with Lyca Chairman #Subaskaran , Lyca Head #Tamilkumaran & Deputy chairman #Premsivasamy! ⭐@LycaProductions pic.twitter.com/wWtuECgyjc — BA Raju's Team (@baraju_SuperHit) October 28, 2022 -
సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసిన తమన్నా
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 169వ చిత్రం గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ చిత్రంలో పలు ప్రత్యేకతలు సంతరించుకోవడమే ఇందుకు కారణం. తలైవా ఇంతకు ముందు నటించిన అన్నాత్తే ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 70 దాటిన వయసులోనూ సూపర్‌స్టార్ ఇమేజ్ను కాపాడుకుంటూ వస్తున్న రజనీకాంత్‌కు ఈ చిత్రం విజయం చాలా అవసరం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించడం పైనా చర్చ జరుగుతోంది. కారణం ఈయన ఇంతకుముందు విజయ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కించిన బీస్ట్ చిత్రం నిరాశ పరచడమే. అయితే ఇలాంటి దర్శకుడితో రజనీకాంత్ చిత్రం చేయడానికి పచ్చజెండా ఊపారంటే కథలో విషయం ఉండే ఉంటుంది. చిత్రానికి జైలర్ అనే పవర్ఫుల్ టైటిల్‌ను పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించి రజనీకాంత్‌తో చేసిన ఫొటో షూట్ అదిరిపోయింది. మరో విషయం ఏంటంటే ఇందులో తలైవా డబుల్రోల్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క అంశం చాలు ఆయన అభిమానులు పండుగ చేసుకోవడానికి. చిత్రంలో భారీ తారాగణం నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించే వారి లిస్టులో అందాలరాశి ఐశ్వర్యరాయ్, రమ్యకృష్ణ, ప్రియాంక మోహన్ వంటి వారితో పాటు ఇప్పుడు తమన్నా పేరు వినిపిస్తోంది. రజనీకాంత్–రమ్యకృష్ణ ధీటుగా నటించిన పడయప్పా చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ల తరువాత ఈ జంట మళ్లీ ఇప్పుడు జైలర్ చిత్రంలో నటించనుండటంతో చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ద్విపాత్రాభినయం చేస్తున్న రజనీకాంత్‌కు ఒక పాత్ర సరసన రమ్యకృష్ణ నటించబోతున్నారు. రెండో పాత్రకు నటి తమన్నా జత కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే తలైవాతో తమన్నా నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. చాలా గ్యాప్ తరువాత ఈ మిల్కీ బ్యూటీ కోలీవుడ్‌కు రీ ఎంట్రీ చిత్రం కూడా ఇదే అవుతుంది. ఇకపోతే దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
అన్నాత్తే కలెక్షన్స్ తో రజనీ ఫుల్ హ్యాపీ
-
83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు
Super Star Rajinikanth Reaction On 83 Movie: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మాజీ క్రికెటర్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పాత్రలో మెప్పించి ఆకట్టుకుంటున్న చిత్రం '83'. 1983 వన్డే ప్రపంచకప్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్ సాధించిన కపిల్ డెవిల్స్ అద్బుతం చేసి చూపెట్టింది. అప్పటివరకు సాధారణ వ్యక్తులుగా కనిపించిన ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయారు. ప్రపంచకప్ సాధించిన టీమిండియాలోని 14 మంది ఆటగాళ్లు తర్వాతి తరానికి ఒక ఐకాన్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చిన 83 సినిమా డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా అశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. నిమా తెరకెక్కించిన చిత్ర బృందానికి, ముఖ్యంగా కపిల్ దేవ్‌ను యాజ్ ఇట్ ఈజ్ దింపేసిన రణ్వీర్ సింగ్‌కు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 83 సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ చిత్రాన్ని పొగడ్తలతో బౌండరీలు దాటించారు. 'వావ్ వాట్ ఏ మూవీ.. అద్భుతం..' అంటూ ఆకాశానికెత్తారు రజనీ కాంత్. అలాగే నిర్మాతలకు, చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా తెలిపారు సూపర్ స్టార్. ఈ ట్వీట్లో చిత్ర నిర్మాత కబీర్ ఖాన్, కపిల్ దేవ్, హీరో రణ్వీర్ సింగ్, నటుడు జీవాను మెన్షన్ చేశారు. #83TheMovie wow 👏🏻👏🏻 what a movie… magnificent!!! Many congratulations to the producers @kabirkhankk @therealkapildev @RanveerOfficial @JiivaOfficial and all the cast and crew … — Rajinikanth (@rajinikanth) December 28, 2021 ఇదీ చదవండి: 1983 వరల్డ్ కప్‌ను తెరపై చూపించిన '83' మూవీ రివ్యూ -
200 కోట్ల వసూళ్ల చేరువలో పెద్దన్న
-
తొలిరోజు అన్నాత్తే వసూళ్లు 70 కోట్లు ?
-
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్
-
నేడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న రజనీకాంత్
-
రజనీ ఎంట్రీ.. సన్నిహితుడి కీలక వ్యాఖ్యలు
సాక్షి, చెన్నె: తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఉండి ఉంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అయితే తాను రాజకీయాల్లోకి రాను అనే ప్రకటన తాజాఎన్నికల వరకు మాత్రమేనని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పుకొచ్చారు. రజనీకాంత్ చేసిన ప్రకటనలో ‘ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను’ అని చెప్పలేదని గుర్తుచేస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత రజనీ రాజకీయ ఎంట్రీ ఉంటుందని ఆయన పరోక్షంగా చెబుతున్నారు. దీంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ మొదలైంది. గాంధీయ మక్కల్ ఇయ్యకమ్ (జీఎంఐ) అధినేత, రజనీకాంత్ సన్నిహితుడు తమిళరువి మణియన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘రజనీ ఇక రాజకీయాల్లోకి రాను అనే ప్రకటన చేయలేదు. ప్రస్తుతం రాలేనని చెప్పుకొచ్చారు. అందుకే రజనీ మక్కల్ మండ్రమ్ (ఆర్ఎంఎం)ను ఇంకా రద్దు చేయలేదు. ఒకవేళ భవిష్యత్‌లో రజనీ రాజకీయాల్లోకి వస్తానంటే గాంధీయ మక్కల్ ఇయ్యకమ్ సహాయం చేస్తుంది. లేకపోతే స్వచ్ఛంద సంస్థగా కొనసాగుతుంది’’ అని మణియన్ తెలిపారు. రెండు నెలల కిందట తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి రజనీకాంత్ సంచలన చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అనారోగ్యం బారిన పడడంతో యూటర్న్ తీసుకుని ‘రాజకీయాల్లోకి రాను’.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా సేవ చేస్తా’ అని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ప్రేక్షకాభిమానులు, ప్రజలు రజనీ రాజకీయాల్లోకి రావాలనే విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. దీనిపై కూడా ఇటీవల రజనీ ‘తనను ఇబ్బంది పెట్టవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉంటే రజనీ మాత్రం రాజకీయాల్లోకి రావాలనే పెద్ద ఎత్తున ప్రజలు కోరుతున్నారు. -
కోలీవుడ్ కాలింగ్?
కోలీవుడ్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీకి కబురొచ్చిందట. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సీక్వెల్‌కి కియారాని కథానాయికగా అడిగారని సమాచారం. రజనీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పి. వాసు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్, రాఘవా లారెన్స్ లీడ్ రోల్ చేస్తారు. హీరోయిన్గా కియారా అద్వానీని ఖరారు చేశారట. ‘లక్ష్మీబాంబ్’ (‘కాంచన’ హిందీ రీమేక్) చిత్రంతో లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్‌కి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో కియారాయే హీరోయిన్. ‘లక్ష్మీబాంబ్’ సినిమా జర్నీలో కియారా వర్క్ నచ్చిన లారెన్స్ ‘చంద్రముఖి 2’లో కూడా ఆమెనే హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకున్నారట. మరి.. కోలీవుడ్‌లో కియారా జర్నీ ‘చంద్రముఖి 2’తో ప్రారంభం అవుతుందా? వెయిట్ అండ్ సీ. -
సంక్రాంతికి వస్తా
రాబోయే సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందకు రెడీ అవుతున్నారు రజనీకాంత్. శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ ‘అన్నాత్తే’ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార, కీర్తీ సురేష్, మీనా, ఖుష్భూ, ప్రకాష్‌రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్ సంస్థ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... వరుసగా మూడో ఏడాది సంక్రాంతి పండక్కి రజనీకాంత్ చిత్రం థియేటర్లో విడుదల కానుంది. ‘పేట్టా’ (2019), ‘దర్బార్’ (2020) చిత్రాలు సంక్రాంతి పండక్కి విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. 2021 పండక్కి కూడా రావడానికి రజనీ రెడీ అవుతున్నారు. అభిమానులకు పండగే పండగ. -
ఏడాది పెరిగిందంతే.. మిగతాదంతా సేమ్ టు సేమ్
చెన్నై : రజనీకాంత్ ఈ పేరు సినీ అభిమానులకు తారక మంత్రం. ఎందరికో ఉత్సాహాన్ని, మరెందరికో ప్రోత్సాహాన్ని, అందరికీ స్ఫూర్తిని ఇచ్చే పేరు రజనీకాంత్. చాలా మంది కలలు కనే సూపర్‌స్టార్. పోలిటికల్ స్టార్‌గా మరెందరో కలలు కంటున్న నటుడు. అన్నీ కలిసొస్తే రేపటి తమిళం నాయకుడు. అతడే రజనీకాంత్. కష్టాలు పడిన వ్యక్తి. కన్నీటి విలువ తెలిసిన మనిషి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి నిలువెత్తు అద్దం. ఆడంబరాలను చూసిన వ్యక్తి, అయినా నిరాడంబరమే ఈయన పాటించే సూక్తి. గొప్ప గుప్తదానపరుడు రజనీ. సేవా కార్యక్రమాలకు ప్రోద్బలుడు రజనీ. ఈయన స్టైల్స్‌కు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అదే చిటికేస్తే అభిమానుల దండు సామాజిక సేవలకు ఉరుకుతుంది. ఇలా రజనీకాంత్ సులక్షణాలను ఏకరువు పెట్టడానికి ఎంతో ఉంది. అందరూ పుడతారు. కొందరే దానికి సార్థకతను చేకూర్చుకుంటారు. అలా సార్థక నామధేయుడు రజనీకాంత్. ఈయన జీవితం అందరికీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ రోజు ఈ తలైవా పుట్టిన రోజు.. ఓ సారి ఆయన ప్రస్థానం వైపు కన్నేద్ధాం... పేదరికమే పుట్టినిల్లుగా ... రజనీకాంత్ అసలు పేరు శివాజీరావ్ గైక్వాడ్ అన్నది ఏ కాస్త సినీ పరిజ్ఞానం ఉన్న వారందరికీ విధితమే. కర్ణాటక రాష్ట్రం, బెంగళూర్‌లో పుట్టి పెరిగిన మరాఠీ కుటుంబీకుడు. రామోజీరావ్ గైక్వాడ్, రమాబాయిలకు పుట్టిన నాలుగవ సంతానం. 1949 డిసెంబర్ 12న పుట్టిన శివాజీరావ్ గైక్వాడ్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి సాధారణ బాల్యానే అనుభవించాడు. బెంగళూర్‌లోని ఆచార్య పాఠశాల, వివేకానంద బాలక్ సంఘం పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. చిన్నతనం నుంచే భయం అనేది ఆయకు చాలా దూరం, అదే సమయంలో ధైర్యం ఎక్కువ. అయితే శివాజీరావ్‌కు చదువుపై కంటే నటనపైనే ఆసక్తి, మక్కువ. అలా పాఠశాల విద్య పూర్తి కాగానే నాటకాల్లో నటించడం ప్రారంభిచాడు. అలా భృతి కోసం బస్ కండక్టర్‌గా వృత్తిని చేపట్టారు. అయితే నటనపై ఆసక్తి వెంటాడుతుంటే ఆర్థిక స్తోమత లేకపోయినా, మిత్రుల సాయంతో మదరాసు పట్టణానికి రైలెక్కేశాడు. ఆ తరువాత నటనలో శిక్షణ కోసం ఫిల్మ్‌ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. ఆ సమయంలో పడరాని కష్టాలు పడ్డాడు. అయినా మొండి ధైర్యం, ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధనపై దృష్టి పెట్టారు. కష్టే ఫలి అంటారు కదా..అలా దర్శకుడు కే.బాలచందర్ దృష్టిలో పడ్డాడు. 1975లో ఆయన దర్శకత్వం వహించిన అపూర్వరాగంగళ్ చిత్రంలో చిన్న పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా కే.బాలచందర్ చేత నటుడిగానే కాకుండా రజనీకాంత్‌గానే రూపాంతరం చెందారు. మలి చిత్రాన్ని కన్నడంలో చేశారు. ఆ తరువాత అదే కే.బాలచందర్ మూండ్రు ముడిచ్చు అనే చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు రజనీకాంత్‌లోని విలక్షణ నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్లకు చాలా పవర్ ఉంటుంది. మనిíÙలో మరుగున పడిన కసి అనే పక్షికి రెక్కలు విప్పుకునేలా చేస్తాయి. అలా నటన అదే దాహంలో ఉన్న రజనీకాంత్‌కు దాన్ని తీర్చే అవకాశాలు రావడం, ఆయనలోని నటనకు పదును పెట్టడంతో స్టార్ హీరోగా అవతరించారు. తనదైన స్టైలిష్ నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ఈయన సిగరెట్ తాగడంలో స్టైలే వేరు. ఆ స్టైల్‌కే సినీ జనాలు ఫిదా అయిపోయారు. 16 వయదినిలే, గాయత్రీ చిత్రాల్లో విలన్‌గా నటించి పేరు తెచ్చుకున్నారు.1977లో నటించిన భువన ఒరు కేల్వికురి చిత్రం రజనీకాంత్ కెరీర్‌కు పెద్ద టర్నింగ్ అయ్యింది. ప్రతినాయకుడిగా చప్పట్లు కొట్టించుకున్న రజనీకాంత్‌లో కథానాయకుడుగా ఉన్నాడని గుర్తించిన రచయిత, నిర్మాత కలైజ్ఞానం భైరవి అనే చిత్రంతో రజనీ సినీ జీవితాన్ని మరో మలుపు తిప్పారు. అలా కథానాయకుడిగా తొలి చిత్రంతోనే సూపర్‌స్టార్ పట్టంను కట్టించుకున్న అరుదైన నటుడు రజనీకాంత్. ముల్లుం మలరుం, ఆరిలిరిందు అరుబదు వరై వంటి చిత్రాలు రజనీకాంత్‌లోని నటుడిని మరింద పదునుపెట్టాయి. ఆ తరువాత బిల్లా, పోకిరిరాజా, తన్నికాట్టు రాజా, మురట్టు కాళై వంటి పక్కా కమర్శియల్ చిత్రాలు రజనీకాంత్‌ను ఉన్నత స్థానంలో కూర్చొపెట్టాయి. అదేవిధంగా పడిక్కాదన్, మన్నన్, అన్నామలై, పాండియన్, మూండ్రుముగం, బాషా, చంద్రముఖి, ముత్తు, శివాజీ, యందిరన్ ఇలా వరుసగా పలు చిత్రాలు రజనీ కెరీర్లో మైలురాయిగా నిలిచాయి. ముత్తు చిత్రంతో ఈయన ఖ్యాతి ఖండాంతరం దాటింది. జపాన్, మలాలీ భాషల్లో అనువదింప బడి వసూళ్ల వర్షం కురిపించిన చిత్రం ముత్తు. ఇక బాషా చిత్రంలో డాన్‌గా విశ్వరూపం చూపించారు. ఈ చిత్రంతో తెలుగులోనూ కలెక్షన్ల కింగ్‌గా మారారు. రజనీకాంత్ ఒక్క తమిళంలోనే కాదు, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్, బెంగాళీ అంటూ భాషల్లో నటించి తనదైన ముద్రను వేసుకున్నారు. తమిళ సినీరంగాన్ని ఎంజీఆర్, శివాజీగణేశన్ వంటి దిగ్గజాలు ఏలుతున్న సమయంలోనే రజనీకాంత్ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇలా రజనీకాంత్ జీవిత పయనం ఎందరికో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక పాఠం అని చెప్పవచ్చు. 40 ఏళ్లుగా సూపర్‌స్టార్, దక్షిణాది సూపర్‌స్టార్, ఇండియన్ సూపర్‌స్టార్‌గా ఏక ఛత్రాదిపత్యాన్ని ఏలుతున్న రజనీకాంత్ తన 69 ఏళ్ల వయసులోనూ ఇటీవల పేట అనే చిత్రంలో రజనీ శభాష్ అనిపించారు. గురువారం ఈ సంచలన నటుడి జన్మదినం. రజనీకాంత్ 70వ ఏటలోకి అడుగు పెట్టారు. ఆయన వయసు మాత్రమే జస్ట్ ఒక్క ఏడాదే పెరిగింది. ఆయన వేగం, స్టైల్, క్రేజ్, స్టార్డమ్ ఇత్యాదివన్నీ గత 40 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పటికీ యాజ్ ఇటీజ్నే. ప్రస్తుతం దర్బార్ చిత్రంలో పొంగల్‌కు దుమ్మురేపడానికి సిద్ధం అవుతుండడంతో పాటు, 70లోనూ తన చావ, సత్తా చూపడానికి 168వ చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో నిరాడంబరంగా ప్రారంభమైంది. ఇందులో సీనియర్ నటీమణులు కుష్బూ, మీనాలతో పాటు ఈ తరం క్రేజీ నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం. నవశకానికి వ్యూహంలో రజనీ సినీరంగంలో తిరుగులేని నాయకుడిగా రాణిస్తున్న రజనీకాంత్‌ను ఆయన అభిమానులు ఇప్పటికే తలైవా(నాయకుడు) అని సం¿ోదిస్తున్నారు. అయితే వారి ఆకాంక్ష అంతా రజనీకాంత్‌ను రాజకీయ తలైవాగా చూడాలన్నదే. కాగా వారి చిరకాల కోరికను తీర్చడానికి రజనీకాంత్ కూడా సిద్ధం అయ్యారు. ఇప్పటికే తన రాజకీయ రంగప్రవేశం తథ్యం అని భహిరంగంగానే ప్రకటించిన రజనీకాంత్ ఇక పార్టీని ప్రకటించడమే తరువాయి అన్నంతగా రాజకీయ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. గత 25 ఏళ్ల అభిమానుల కలను సాకారం చేయడానికి పావులు కదుపుతున్నారు. సమయం దగ్గర పడుతోంది. సుమారు మరో ఏడాదిన్నర మాత్రమే ఉంది. రాజకీయ రణరంగంలోకి దూకడానికి శస్త్ర హస్తాలు సిద్ధంచేసుకుంటున్నారన్నది ఆయన ప్రజాసంఘ నిర్వాహకుల మాట. ఇప్పటికే తన అభిమానులను ప్రజా క్షేత్రంలోకి దింపిన రజనీకాంత్ త్వరలోనే తనూ ప్రజల్లోకి వెళ్లడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సహా నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌తో రాజకీయ దోస్తీకి సై అంటున్నారు. సినీరంగంలోని తమ స్నేహం రాజకీయరంగంలోనూ కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సూచనగా రాబోయే కాలంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు అని రజనీకాంత్ బహిరంగంగానే పేర్కొన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఇటీవల దర్బార్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై అభిమానుల నమ్మకాన్ని వృతాకానీయనని చెప్పి వారిలో ఆశలను మరింత చిగురింపజేశారు. దీంతో తమిళనాడు రాజకీయాల వాతావరణం వేడెక్కింది. మరి ఈ సినీ రారాజా, రాజకీయ రాజు అవుతారా చూద్దాం. 70వ ఏటలో అడుగుపెడుతున్న మన సూపర్‌స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుదామా! -
అయోధ్య తీర్పు : ప్రజలకు రజనీకాంత్ విఙ్ఞప్తి
సాక్షి, చెన్నై : అయోధ్య వివాదంపై త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పార్టీ పెట్టేవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటా. పార్టీ పెట్టిన తర్వాత ఎవరితో పొత్తు అనేది నా నిర్ణయమే. బీజేపీ నన్ము నమ్ముకుని ఉండాల్సిన అవసరం లేదు. అందుకే నేను కాషాయరంగును దగ్గరకు రానివ్వను’అని రజనీ పేర్కొన్నారు. (చదవండి : అయోధ్యలో నిశ్శబ్దం) (చదవండి : ఈనెల 17లోగా 6 కీలక తీర్పులు!) -
నగరానికి తమిళ సూపర్ స్టార్
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘కాలా’ సందడి చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తన కాలా చిత్రం ప్రమోషన్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి నగరానికి వచ్చారు. రజనీకాంత్‌ను చూడడానికి ప్రయాణికులు గుంపుగా చేరడంతో దేశీయ టెర్మినల్ వద్ద సందడి చోటు చేసుకుంది. ఆయనతో పాటు చిత్రనిర్మాణ బృందం కూడా ఉంది. -
మార్చిలో రజనీ రాజకీయ యాత్ర..
సాక్షి, చెన్నై: మార్చి నెల నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ యాత్ర ప్రారంభమౌతున్నట్లు సమాచారం. రాష్ట్ర పర్యటనపై రజనీ కసరత్తులు చేస్తున్నారు. ఫిబ్రవరి చివరిలోపు మక్కల్ మండ్రమ్ జిల్లా కన్వీనర్లను సూపర్ స్టార్ నియమించనున్నారు. మక్కల్ మండ్రమ్ కార్యదర్శిగా రాజూ మహాలింగం నియమితులయ్యారు. చెన్నైలో రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. రజనీ కాంత్ వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుతం కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ ప్రకటనకు కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
ఫోటో చాన్సివ్వకుంటే ఆత్మాహుతి
- సేలం జిల్లా రజనీకాంత్ అభిమానుల సంఘం హెచ్చరిక సేలం: కన్నవారి మీదకంటే హీరోలంటేనే అమితమైన అభిమానం, ప్రేమ ప్రదర్శిస్తారు అభిమానులు. అలాంటి వారికి కొన్ని సమయాల్లో హీరోతో కలిసి పోటో తీసుకునే అవకాశం కూడా దొరకదు. జీవితమంతా అభిమానులుగా కొనసాగిన తమకు ఫొటో తీసుకునే అవకాశం కల్పించకుంటే రజనీకాంత్ ఇంటిముందే ఆత్మాహుతికి పాల్పడతామని సేలం రజనీకాంత్ అభిమానులు హెచ్చరించారు. సేలం జిల్లా రజనీకాంత్ అభిమానుల సంఘం సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘ న్యాయసలహాదారు ఏ.ఎస్.రజని మాట్లాడుతూ.. రజీనీతో కలిసి ఫొటో తీసుకునేందుకు సేలం జిల్లాకు 250 నుంచి 300 టోకన్లు అందజేశారన్నారు. ఈ టోకన్లను జిల్లా రజనీ అభిమానుల సంఘం కార్యదర్శి పళనివేల్ తనకు కావాల్సిన వారికి విక్రయించారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంలో రజనీ జోక్యం చేసుకుని అసలైన అభిమానులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆయన ఇంటి ముందే ఆత్మాహుతికి పాల్పడతామని ఆయన వెల్లడించారు. -
మళ్లీ తలై‘వా’
దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రప్పించేందుకు అభిమాన లోకం మళ్లీ తలై‘వా’...అని నినదించే పనిలో పడ్డారు. ఇక, రాష్ట్రంలో బుధవారం హల్చల్ చేసిన పోస్టర్లు ఈ చర్చకు తెర లేపాయి. అభిమానులతో కథానాయకుడు భేటీ కానున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఏప్రిల్ రెండున కీలక నిర్ణయం ప్రకటన అన్నట్టు సంకేతాలు హోరెత్తాయి. సాక్షి, చెన్నై : అశేషాభిమాన లోకం మన్నల్ని అందుకుం టున్న కథానాయకుడు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు అప్పుడుప్పుడు తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. తమ పెద్దలతో సన్నిహితంగా ఉండే రజనీని ఆకర్షించే రీతిలో కమలనాథులు తీవ్ర కుస్తీలు పట్టినా, ఫలితం శూన్యం. రాజకీయ అరంగేట్ర నినాదం తెర మీదకు వచ్చినప్పుడల్లా, దేవుడు ఆదేశిస్తే.. అంటూ తన దైన శైలి హావభావాలతో రజనీకాంత్ ముందుకు సాగుతుంటారు. ప్రస్తుతం తమిళనాట నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రజనీ రాజకీయాల్లోకి రావాలన్న నినాదం మిన్నంటింది. ఈ నినాదంపై తన సన్నిహితులతో కథనాయకుడు చర్చలు జరుపుతున్నట్టుగా రాష్ట్రంలో ప్రచారం కూడా బయలు దేరింది. అయితే, సూపర్‌స్టార్ మాత్రం ఎక్కడ ఎవ్వరికీ చిక్కకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు రెండు రోజులుగా తలై‘వా’ అన్న నినాదాన్ని మళ్లీ తెర మీదకు తెచ్చి పోస్టర్లతో హల్ చల్ సృష్టించే పనిలో పడ్డారు. బుధవారం ఓ అడగు ముందుకు వేసినట్టుగా ఏర్పాటైన పోస్టర్లు ఈ చర్చకు దారి తీశాయి. శ్రీలంక పర్యటన చివరి క్షణంలో రద్దు కావడం, రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునేందుకు తమ నాయకుడు సిద్ధం అవుతోన్నట్టుగా ప్రచారాన్ని అభిమానులు ఊపందుకునేలా చేయడం గమనార్హం. అదే సమయంలో ఏప్రిల్ రెండో తేదీన అభిమానులతో రజనీ భేటీ కానున్నారని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులకు ఆహ్వానం పలికి ఉన్నట్టు, ఏడు వేల మందితో సాగనున్న భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం హోరెత్తడంతో తమిళ మీడియాల్లో ప్రాధాన్యత పెరిగింది. శ్రీలంక పర్యటన రద్దుపై రజనీకాంత్ అక్కడి ఈలం తమిళులకు బుధవారం ఓ లేఖ రాయడంతో అభిమానుల్లో ఉత్సాహం బయలు దేరింది. సమయం అనుకూలిస్తే ఈలం తమిళుల్ని తప్పకుండా కలుస్తా అని ఆయన రాసిన లేఖతో అభిమానులు కాస్త అత్యుత్సాహం, దూకుడు ప్రదర్శించే పనిలో పడ్డారని చెప్పవచ్చు. తమిళనాట సమయం అనుకూలంగానే ఉన్నట్టు, రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చే పనిలో పడడం గమనార్హం. కోడంబాక్కం రాఘవేంద్రకల్యాణ మండపం వేదికగా ఏప్రిల్ రెండో తేదీన రజనీకాంత్ అభిమానులతో భేటీ కానున్నట్టు ప్రచారం ఊపందుకోవడంతో, అలాంటి కార్యాచరణే లేదంటూ ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. -
సింధుపై సూపర్ స్టార్ ట్వీట్.. సంచలనం
ఆయన ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు.. ఒక్క ట్వీట్ చేస్తే వేల సార్లు చేసినట్లు! అవును, ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి జాతిని పులకింపజేసిన పీవీ సింధును ఆశీర్వదిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ట్వీట్ సంచలనాలు సృష్టిస్తోంది. 'హ్యాట్సాఫ్ పీవీ సింధు.. నేను నీ అభిమానినైపోయా..' అన్న రజనీ ట్వీట్ 24 గంటల వ్యవధిలో దాదాపు 19 వేల సార్లు రీ ట్వీట్ అయింది. (హ్యాట్సాఫ్.. నేను నీ అభిమానినైపోయా!) సోషల్ మీడియా పట్ల అనాసక్తత ప్రదర్శించే రజనీకాంత్ 2014లో ట్విట్టర్ లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 33 ట్వీట్లు మాత్రమే చేశారు. కూతురు సౌందర్య, అల్లుడు ధనుష్, ఐశ్వర్యా రాయ్, అమితాబ్, ప్రధాని మోదీ, ఏఆర్ రెహమాన్.. ఇలా సెలెక్టివ్ గా 23 మందిని మాత్రమే ఫాలో అవుతారు. కానీ రజనీ ఫాలోవర్ల సంఖ్య 30 లక్షల పైమాటే! ఒలింపిక్ బ్యాడ్మింటన్ విమెన్స్ సింగిల్స్ విభాగంలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్స్ లో తెలుగు తేజం పీవీ సింధు.. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ పై ఓడినప్పటికీ రజత పతకాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. పలు రంగాల ప్రముఖులేకాక, యావత్ జాతి సింధును అభినందనలతో ముంచెత్తుతున్నారు. Hats off to you #PVSindhu .... I have become a great fan of yours ... Congratulations ! — Rajinikanth (@superstarrajini) 19 August 2016 -
పుష్కరాలకు విచ్చేయనున్న సూపర్ స్టార్
కృష్ణా పుష్కరాలలో పవిత్ర స్నానం ఆచరించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ గుంటూరు విచ్చేయనున్నారు. పుష్కరాలలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది. త్వరలో రజనీకాంత్ గుంటూరులోని చింతపల్లిలో ఉన్న విష్ణు పంచాయతన దివ్య మహా పుణ్య క్షేత్రానికి చేరుకుని పవిత్ర పుష్కర స్నానం ఆచరించనున్నారు. గతేడాది గోదావరి పుష్కరాలకే ప్రభుత్వం రజనీకి ఆహ్వానం పంపినప్పటికీ.. ఆ సమయంలో ఆయన రాలేకపోయారు. కృష్ణా పుష్కరాలకు రజనీ హాజరవుతారని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అనంతరం రజనీ ఓ నెల రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' రెండవ దశ షూటింగ్లో పాల్గొంటారు. రోబో 2.0లో బాలీవుడ్ రుస్తుం అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. -
రజనీకాంత్-జాకీ చాన్ కాంబినేషన్లో సినిమా?
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ - చైనీస్ సూపర్ స్టార్ జాకీ చాన్ కాంబినేషన్లో సినిమా రూపొందనుందా? ప్రస్తుతం మలేసియన్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త ఇది. మలేసియన్ నిర్మాత మొహమ్మద్ రఫీజి మొహమ్మద్ జిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించనున్న ఈ చిత్రానికి ‘చినీ సాగ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని సమాచారం. సూపర్ స్టార్స్ ఇద్దర్నీ సదరు మలేసియన్ నిర్మాత కలిశారట. ఈ చిత్రంలో కథానాయికగా నటించమని సోనమ్ కపూర్‌ని అడిగానని కూడా మలేసియన్ మీడియాతో పేర్కొన్నారాయన. రఫీజి చెబుతున్న మాటలు నిజమైతే ఇది కచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మలేసియాలోని చినీ అనే సరస్సులో ఉండే డ్రాగన్ చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ఇందులో పలువురు ప్రముఖ మలేసియన్ తారలు కీలక పాత్రలు చేస్తారట. నార్వే, ఇండియా, చైనా, ఇండోనేసియా, థాయ్‌ల్యాండ్‌లో చిత్రీకరించనున్నారని భోగట్టా. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా చేయాలనుకున్నారట. కానీ, బడ్జెట్ సమకూర్చుకోలేక అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని రఫీజి అంటున్నారు. 90 శాతం గ్రాఫిక్స్‌తో సాగే ఈ చిత్రం 90 శాతం ఇంగ్లిష్ భాషలోనే ఉంటుందట. మరి.. ఈ చిత్రం నిజంగానే తెరకెక్కుతుందా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. -
మెరుపు వేగంతో...
తమిళ పరిశ్రమలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ హీరో విజయ్ అని అక్కడివాళ్లు అంటుంటారు. అక్కడ తిరుగు లేని హీరో అనిపించుకున్న విజయ్ ‘తుపాకీ’ ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ ‘కత్తి’ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న ‘తెరి’ తెలుగులోకి విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ‘తెరి’ నిర్మాత ‘కలైపులి’ థానుతో కలిసి ‘దిల్’ రాజు తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. తెరి అంటే మెరుపు అని అర్థం. ఇది యాక్షన్ థ్రిల్లర్. ఆ మధ్య తమిళంలో ‘రాజా రాణి’ వంటి సక్సెస్ఫుల్ మూవీకి దర్శకత్వం వహించిన అట్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘‘ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తెలుగు టైటిల్, పాటల విడుదల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ‘దిల్’ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. సమంత, అమీజాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: జార్జ్ సి. విలియమ్స్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాతలు: ‘దిల్’రాజు, కలైపులి ఎస్ థాను. -
చెన్నై వెర్సస్ ముంబయ్!
జోరుగా రజనీ-అక్షయ్‌ల ఫుట్‌బాల్ మ్యాచ్ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, నార్త్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడితే... చూడ్డానికి పసందుగా ఉంటుంది. అసలు వీళ్లెందుకు మ్యాచ్ ఆడాలి అనుకుంటున్నారా? సినిమా కోసమే ఆడనున్నారు. రజనీకాంత్ హీరోగా ‘రోబో’కి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో ‘2.0’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హిందీ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా నటించడం విశేషం. ఈ ఇద్దరూ పాల్గొనగా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియమ్లో ఫుట్‌బాల్ మ్యాచ్ సీన్లు తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్టేడియమ్ చుట్టూ పెద్ద పెద్ద బెలూన్లు, ‘ఐఎఫ్ఎల్’ లోగో, ‘చెన్నై వెర్సస్ ముంబయ్’ ఇలా రియల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ని తలపించే సందడి నెలకొంది. ఇప్పటికే పలువురు జూనియర్ ఆర్టిస్టులతో శంకర్ రిహార్సల్స్ చేయిస్తున్నారు. సోమవారం నుంచి రజనీకాంత్, అక్షయ్‌కుమార్ మ్యాచ్ ఆడనున్నారు. సినిమాకి కీలకంగా నిలిచే ఈ సన్నివేశాల చిత్రీకరణకు దాదాపు 40 రోజులు పడుతుందని సమాచారం. కాగా, జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియమ్లో రజనీ, అక్షయ్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకుని, భారీ ఎత్తున జనాలు గుమిగూడిపోయారు. ప్రస్తుతానికి రజనీ, అక్షయ్ లేరని తెలిసి నిరుత్సాహపడ్డారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ఒకట్రెండు సన్నివేశాల్లో కనిపిస్తారని సమాచారం. వాస్తవానికి ఇందులో అక్షయ్ చేస్తున్న విలన్ పాత్రకు ముందుగా అమితాబ్‌ను అడిగారు దర్శకుడు శంకర్. ఆ పాత్ర గురించి రజనీని అమితాబ్ సంప్రతిస్తే, విలన్‌గా మిమ్మల్ని అంగీకరించరని, చేయొద్దనీ అన్నారట. ఎలాగైనా బిగ్ బీని ఈ సినిమాలో నటింపజేయాలనుకొని, ఆయనతో పాటు ఆయన తనయుడి కోసం రెండు ప్రత్యేక సన్నివేశాలను శంకర్ క్రియేట్ చేసి ఉంటారని ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
ఈ సూపర్ స్టార్ కి చైనా సూపర్ స్టార్ విలన్
సూటూ, బూటూ, చలువ కళ్లద్దాలు, కొంచెం నెరిసిన జుత్తు, గడ్డంతో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చూస్తుంటే ‘స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే..’ అనే పాట అందుకోవాలనిపిస్తోంది కదూ. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోనూ కనిపించనంత స్టయిలిష్‌గా ఆయన కనిపించనున్న చిత్రం ‘కబాలి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచీ రజనీ అభిమానులు పరమానందపడిపోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పా. రంజిత్ దర్శకత్వంలో అగ్రనిర్మాత కలైపులి యస్. థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ మలేసియాలో జరుగుతోంది. వచ్చే నెల 28 వరకూ అక్కడ చిత్రీకరిస్తారు. చిత్ర విశేషాలను కలైపులి యస్. థాను చెబుతూ - ‘‘మా సంస్థలో స్టార్ హీరోలతో అనేక సినిమాలు తీశాను. ఇప్పుడు రజనీకాంత్‌తో సినిమా నిర్మించడం నా లైఫ్ ఎచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను. ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైనా సూపర్ స్టార్ విల్సన్ చౌ విలన్‌గా నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ స్వరపరచిన బాణీలు హైలైట్‌గా నిలుస్తాయి. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్, అనంతశ్రీరామ్ పాటలు రాస్తున్నారు. మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళి, మాటలు: సాహితి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ‘దేవి-శ్రీదేవి’ సతీష్. -
అందుకే పేరు మార్చుకున్నా..
పేరులో ఏముంది అనే నాస్తికులు, పేరులోనే అంతా ఉంది అనే ఆస్తికులు ఉన్నారు. దేనికయినా నమ్మకమే కారణం. ఇక తారల విషయానికొస్తే సెంటిమెంట్‌కు ఎక్కువ విలువనిస్తారు.నటి ధన్సిక అదృష్టం వరించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రంలో ఆయన సోదరిగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు సాయి ధన్సికగా పేరు మార్చుకున్నారు.కారణమేమిటమ్మా అని అడిగితే తను సాయి భక్తురాలని వివరించారు. అదేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం. నేను అరవాన్ చిత్రంలో నటిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు చుట్టు ముట్టాయి. చాలా మనస్తాపానికి గురయ్యాను. అప్పుడు నా స్నేహితురాళ్లు ఒక సారి షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకురా అని చెప్పారు. వెంటనే నేను షిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాను. మనసుకు చాలా ప్రశాంతత అనిపించింది. ఆలయం నుంచి బయటకు రాగానే నాకు మనస్తాపాన్ని కలిగించిన వారు ఫోన్ చేసి క్షమాపణ కోరారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పటి నుంచి ఇప్పుడు రజనీకాంత్‌తో నటించే అవకాశం వరకూ అంతా మంచే జరుగుతోంది. అందుకే నా పేరు ముందు సాయిని చేర్చుకున్నాను. -
సూపర్ స్టార్ రజనీ రిహార్సల్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి రిహార్సల్స్ కావాలా? లొకేషన్‌కి డెరైక్ట్ ఎటాక్ ఇచ్చేసి, డెరైక్టర్ ఇలా చెప్పింది అలా సింగిల్ టేక్‌లో చేసేయగల సత్తా ఉంది ఆయనకు. కానీ, రిహార్సల్స్ చేశారు. ‘ఈ స్టయిల్ ఓకేనా? వేరేలా చేయనా?’ అని దర్శకుణ్ణి అడిగితే, అతగాడికి ఏం చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయిపోయాడట. ‘అట్టకత్తి’, ‘మదరాస్’ చిత్రాల ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రజనీకాంత్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌కి ముందు వర్క్‌షాప్ నిర్వహించాలని రంజిత్ అనుకున్నారట. చిత్రబృందం మొత్తాన్ని ఆ వర్క్‌షాప్‌కి హాజరు కావాల్సిందిగా కోరారట. కానీ, రజనీ దగ్గర ‘మీరొద్దు సార్.. డెరైక్ట్‌గా లొకేషన్‌కి వస్తే చాలు’ అన్నారట. అందుకు రజనీ ఏం చెప్పలేదు. మౌనం వహించారు. మొదటిరోజు వర్క్‌షాప్‌లో నటీనటులకు తమ తమ పాత్రలకు తగ్గట్టుగా ఎలా నటించాలో చెప్పడంతో పాటు సాంకేతిక నిపుణులకు కూడా తగిన సూచనలు ఇచ్చారట రంజిత్. రెండో రోజు కూడా ముమ్మరంగా రిహార్సల్స్ జరుగుతుంటే, హఠాత్తుగా రజనీ ప్రత్యక్షమై, తాను కూడా నటించి చూపించారట. ‘ఎలా చేయమంటారో చెయ్యండి’ అని రంజిత్ని అడిగి మరీ, నటించి చూపించారట. దాంతో యూనిట్ మొత్తం ఉబ్బి తబ్బిబైపోయ్యారట! ఏది ఏమైనా... రజనీ స్టయిలే వేరు! -
మరో ప్రయత్నం
సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మళ్లీ మళ్లీ గాలమేసేందుకు కమలనాథులు సిద్ధం అవుతున్నారు. తొలిసారిగా రాష్ట్రంలో అడుగు బెడుతున్న పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ద్వారా రజనీకి పిలుపు పంపేందుకు వ్యూహ రచన చేశారు. కూటమిలోని మిత్రులు దూరమవుతుండడంతో రాష్ట్రంలో మళ్లీ ఆవిర్భవించిన తమాకాని తమ వైపు తిప్పుకోవాలన్న ప్రయత్నాల్లో పడ్డారు. రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు బీజేపీ ప్రతినిధిగా పొన్ రాధాకృష్ణన్ వెళ్లారు. ఆయనకు కేంద్రంలో సహాయ మంత్రి పదవి వరించింది. అయితే, రాష్ట్ర అసెంబ్లీలో కమలనాథులకు ప్రతినిధులు లేరు. 2016 ఎన్నికల్లో ప్రతినిధులు అడుగు పెట్టడమే కాకుండా అధికారాన్ని శాసించడం లేదా అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కమలనాథులు పరుగులు తీస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రగతి చాటుతామన్న పిలుపునిచ్చే పనిలో పడ్డారు. రాష్ట్రంలో బలమైన వ్యక్తులుగా, జనాదరణ కల్గిన వారిని తమ వైపు తిప్పుకుని వారిని పార్టీలోకి ఆహ్వానించడం లేదా, మద్దతు కూడగట్టుకోవడం లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన దృష్టిని అంతా తమిళనాడు మీద కేంద్రీ కరించేందుకు సిద్ధం కావడంతో కమలనాథుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. తలై‘వా’: ఇప్పటి వరకు తలైవా (రజనీ) మాత్రం కమనాథులకు ఎక్కడా చిక్కలేదు. బీజేపీ అధిష్టానం పెద్దలతో మిత్ర బంధం రజనీ కాంత్‌కు ఉన్న దృష్ట్యా ఆయన్ను ఎలాగైనా పార్టీలోకి రప్పించడం లేదా, మద్దతు సేకరించడం కోసం ఎదురు చూస్తున్న కమలనాథులకు అమిత్ షా పర్యటన తోడ్పాటును అందించే అవకాశాలున్నాయి. శనివారం చెన్నైకు రానున్న అమిత్ షాను రజనీతో భేటీ అయ్యే విధంగా వ్యూహాన్ని రచించారు. మరో ప్రయత్నంగా రజనీని అమిత్ షా ద్వారా ఆహ్వానించే ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. రజనీతో అమిత్ షా భేటీకి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నా, తలైవా నుంచి మాత్రం ఇంత వరకు అపాయింట్ మెంట్ రానట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అమిత్ షా చెన్నై పర్యటనతో కథానాయకుడి మనసు మారాలని కమలనాథులు ఎదురు చూస్తున్నాయి. వాసన్‌కు ఆఫర్ : బీజేపీ కూటమి నుంచి ఎండీఎంకే బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక, తనకు సీఎం అభ్యర్థిత్వం ఇవ్వాలని డీఎండీకే అధినేత విజయకాంత్ మెలిక పెట్టారు. అలాగే, తమ నేతృత్వంలోని కూటమిలోకి రావాలంటూ బీజేపీకి పీఎంకే అల్టిమేటం ఇచ్చింది. తాజా పరిణామాలతో డీఎండీకే, పీఎంకేలు బీజేపీ కూటమిలో కొనసాగడం అనుమానంగా మారింది. దీంతో రాష్ర్టంలో మళ్లీ పురుడు పోసుకున్న వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్(తమకా)ను తమ వైపు తిప్పుకోవాలన్న యోచనలో కమలనాథులు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వాసన్ తమతో చేతులు కలుపుతారన్న ఆశాభావంతో కమలనాథులు ఉన్నారు. అయితే, తనకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఆలోచన లేదని, తన లక్ష్యం తమాకాను బలోపేతం చేయడమేనని వాసన్ పేర్కొంటుండడం గమనార్హం. -
అభిమానుల పార్టీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై దశాబ్దాల తరబడి ఊహాగానాలు సాగుతుండగా, రజనీ అభిమాన సంఘాల నేత ప్రకటన ఇచ్చాడు. రజనీకాంత్ జన్మదినమైన ఈనెల 12న అభిమాన సంఘాలన్నీ రాజకీయపార్టీగా రూపాంతరం చెందుతున్నట్లు తమిళనాడు రజనీకాంత్ ప్రజా కార్మికుల సంఘం అధ్యక్షులు ఎస్ఎస్ మురుగేష్ ప్రకటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సీజన్ వచ్చినపుడల్లా రజనీకోసం అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేయడం రాష్ట్రంలో పరిపాటిగా మారింది. రజనీ సైతం నర్మగర్భంగా వ్యవహరిస్తూ సంకేతాలు ఇవ్వడమేగానీ ఏ పార్టీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించలేదు. తాజా పార్లమెంటు ఎన్నికలు, ఇటీవల జయలలిత రాజకీయ సంక్షోభ సమయంలో సైతం రజనీ ప్రసన్నం కోసం బీజేపీ బలంగా ప్రయత్నాలు చేసింది. అయితే జయ బెయిలుపై విడుదల కాగానే రజనీ ఆమెకు శుభాకాంక్షలు తెలపడంతో అన్ని పార్టీలు బిత్తరపోగా, బీజేపీ భారీమోతాదులో భంగపడింది. రజనీ రాజకీయ ప్రవేశంపై అన్ని పార్టీలు దాదాపుగా ఆశలు వదులుకున్నాయి. జన్మదినం రోజున రాజకీయ పార్టీ రజనీకాంత్ బలం, బలగమంతా ఆయన అభిమానులు, అభిమాన సంఘాలే. అటువంటిది రాష్ట్రంలోని రజనీ అభిమాన సంఘాలన్నింటినీ రాజకీయపార్టీగా మార్చబోతునట్లు తిరుపూరు జిల్లాకు చెందిన రజనీకాంత్ వీరాభిమాని మురుగేష్ ప్రకటించి సంచలనానికి తెరలేపారు. రజనీకాంత్ మహిళా సేవా సంఘాలను సైతం కలుపుకుని పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రజనీ అభిమాన సంఘాలను రాజకీయపార్టీగా మారుస్తున్నామని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు సైతం చేసుకున్నట్లు మురుగేష్ వెల్లడించారు. 12వ తేదీన పార్టీ పేరును ప్రకటించిన అనంతరం మరికొద్ది రోజుల్లో మదురై లేదా కోవైలో పార్టీ మహానాడును భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ఆయన చెప్పారు. ర జనీ అభిమాన సంఘాల అధ్యక్షులతో చర్చించిన అనంతరమే రాజకీయపార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుపూరు కేంద్రంగా పార్టీ ఆవిర్భావంపై 14 జిల్లాల్లో సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఆనవాయితీ కొనసాగేనా? ప్రతి ఏడాది డిసెంబరు 12వ తేదీన రజనీకాంత్ తన జన్మదినాన్ని ఆయన అభిమానులు కోలాహలంగా జరుపుకుంటారు. ఉచితంగా పుస్తకాల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. రజనీ సైతం జన్మదినాన అభిమానులను కలుసుకోవడం ఆనవాయితీ. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అభిమానులను తన ఇంటి వద్ద ప్రత్యక్షంగా పలకరిస్తారు. ఈ ఏడాది తన జన్మదిన కానుకగా లింగా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు రజనీ స్వయంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. లింగా విడుదలతోపాటూ రజనీ జన్మదినాన్ని కోలాహలంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో అదే రోజున రజనీ అభిమాన సంఘాలు రాజకీయ పార్టీగా మార బోతున్నట్లు వెలువడిన ప్రకటన అందరినీ అయోమయంలో పడవేసింది. రజనీ అభిమానులంతా తిరుపూరులో పార్టీ అవిర్భావ వేడుకకు హాజరవుతారా లేక చెన్నైలోని రజనీ ఇంటికి చేరుకుంటారా అనేది అగమ్యగోచరమైంది. రజనీ అభిమాన సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఆయన సోదరుడు సత్యనారాయణరావు రెండురోజుల క్రితం తిరుచ్చికి వచ్చారు. రజనీ రాజకీయ అరంగేట్రంపై ఆయనను ప్రశ్నించినవారికి ‘రజనీ రాజకీయాల్లోకి రారు, రజనీకి రాజకీయాలు సూట్ కావు అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల వల్ల రాజకీయపార్టీ ఆవిర్భావానికి రజనీకి ఎటువంటి సంబంధం లేదని తేలింది. మురుగేష్ చర్యలను మరో అభిమాని తీవ్రంగా తప్పుపట్టాడు. రజనీ అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చడం అభిమాన సంఘాల నిబంధనలకు విరుద్ధమని ఖండించారు. రజనీ పేరు, ప్రతిష్టలను మురుగేష్ అప్రతిష్టపాలు చేస్తున్నాడని చెప్పారు. రజనీ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్య తప్పదని మరో అభిమాని చేసిన హెచ్చరిక వల్ల అభిమాన సంఘాలన్నీ మురుగేష్ బాటలో పయనించడం లేదని స్పష్టమైంది. అభిమాన సంఘాలు రాజకీయపార్టీగా మారుతున్న క్రమంపై రజనీకాంత్ ఏవిధంగా స్పందిస్తారో తేలాలంటే మరో రెండురోజులు ఆగాల్సిందే. -
‘లింగా’ విడుదల రోజే...
సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా చిత్రం విడుదల రోజే నూతన తారలు నటించిన యారో ఒరువన్ చిత్రం విడుదలవుతోంది. నవగ్రహ సినీ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం యారో ఒరువన్. నవ నటుడు రామ్ హీరోగా నటిం చిన ఈ చిత్రంలో నటి ఆదిర హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. కథ, కథనం, మాటలు చాయా గ్రహణం, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను కేఎన్ పైజూ నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, తాను పలు టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వహించినట్లు తెలిపారు. యారో ఒరువన్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం గురించి చెప్పాలంటే కనిపించకుండా పోయిన భార్య కోసం గాలించే భర్త రామ్, డిటెక్టివ్ ఆయన బృందం ఎదుర్కొనే అమానుష సంఘటనలే చిత్ర ఇతివృత్తం అని వెల్లడించారు. చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్లు తెలిపారు. లింగ విడుదలవుతున్న థియేటర్లు కాకుండా మిగిలిన థియేటర్లు తమకు లభిస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ తేదీన మరో చిత్రం ఏదీ విడుదల కావడం లేదని అందువలనే తానీ చిత్రాన్ని విడుదల చేస్తున్నానని వివరించారు. -
రజనీకాంత్‌ని ఢీ కొట్టేందుకు రెడీ
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఢీ కొట్టేందుకు నామ్ తమిళర్ కట్చి నేత, దర్శకుడు సీమాన్ సిద్ధమయ్యారు. రజనీ రాజకీయాల్లోకి ఒంటరిగా వచ్చినా, మద్దతుతో వచ్చినా ఢీ కొట్టేందుకు రెడీ అని సవాల్ విసిరారు. తమిళుడే ఈ గడ్డను ఏలాలని, ఎవరు బడితే వాళ్లు జబ్బలు చరిస్తే ఊరుకోమన్నారు. * తేల్చుకుందాం * సీమాన్ సవాల్ * తమిళుడే ఈ గడ్డను ఏలాలి సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించే విధంగా పలువురు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం రాజకీయాల్లోకి రాబోనని రజనీ స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సినీ దర్శకుడిగా, నటుడిగా తమిళనాట ప్రస్తానాన్ని ఆరంభించి నామ్ తమిళర్ కట్చి నేతగా ఎదిగిన సీమాన్ ఏకంగా రజనీ కాంత్‌ను టార్గెట్ చేసి సవాళ్లు విసరడం చర్చనీయాంశమైంది. ‘‘ఒంటరిగా వస్తావా..మద్దతుగా వస్తా వా.. రా...తేల్చుకుందాం’’ అంటూ వారిద్దరి మధ్య పాత పగ ఉన్నట్లు సీమాన్ వ్యాఖ్యలు చేయడాన్ని రజనీ అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు నామ్ తమిళర్ కట్చి, రజనీ అభిమానుల మధ్య వివాదాన్ని రేపే అవకాశాలు కన్పిస్తున్నాయి. టార్గెట్ రజనీ: ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ జయంతి, మహావీరుల దినోత్సవం గురువారం తిరునెండ్రయూరులోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. ఇందులో సీమాన్ ప్రసంగిస్తూ రజనీ కాంత్‌ను టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో ప్రభాకరన్ మహా నేత అని, ఆయన్ను మహా నేతగా ప్రతి తమిళుడు అభివర్ణించాల్సిందేనన్నారు. ఆయనకు సరి తూగే నాయకుడెవ్వరు ఇక్కడ లేరని, అందరూ తమ ఉనికిని చాటుకునేందుకు రాజకీయాల్లోకి వస్తే, తమిళ జాతి కోసం తనువు చాలించేందు కు సిద్ధపడ్డ నేత ప్రభాకరన్ అని కొనియాడారు. తమిళుల కోసం తమ పార్టీ ఆవిర్భవించిందని, తాను సీఎంను అవుతానో లేదో తనకు అనవసరం అని, తనకు తమిళ జాతి మనుగడ, సంక్షేమం, సంస్కృతి పరిరక్షణ ముఖ్యం అన్నారు. రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని అనేక మంది ఆహ్వానిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. తన జీవిత కాలంలో తమిళుల కోసం ఆయన ఏమి చేశారని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. ఆయన్ను ఆహ్వానిస్తున్న వాళ్లంతా భజన ప్రియులేనని, తమిళ జాతి విలువ తెలియనివాళ్లేనని మండిపడ్డారు. తమిళుల కోసం సర్వాన్ని ఆర్పించిన అనేక మంది మహానుభావులు ఈ గడ్డ మీద ఉన్నారని, అలాంటి వారిని ఎందుకు రాజకీయాల్లోకి ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. తమిళుడే ఈ గడ్డను ఏలాలి అని, ఎవరిని బడితే వారిని ఆహ్వానిచ్చేయడం ఇకనైనా మానుకోండని హితవు పలికారు. ఒక వేళ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తే, ఒంటరిగానైనా సరే, మద్దతుగానైనా సరే ఎన్నికల్లో నిలబడితే ఢీ కొట్టేందుకు తాను రెడీ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఆయన అడుగు బెడితే, తొలి ప్రత్యర్థిని తానేనని, తాను ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు నామ్ తమిళర్ కట్చి వర్గాల్ని ఉత్సాహంలో నింపినా, రజనీ అభిమానుల్లో మాత్రం ఆగ్రహాన్ని రేపుతోంది. సీమాన్ ఎల్టీటీఈ అస్త్రంతో మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు సైతం ఈ వేదిక మీద చేయడాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో కటకటాల్లోకి వెళ్లొచ్చిన సీమాన్‌కు తాజా వ్యాఖ్యలు ఎలాంటి చిక్కుల్ని సృష్టించబోతున్నాయో..! -
రజనీతో కార్తీ భేటీ
దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయ పక్షాల నేతలు వరుసగా కలుసుకుంటూ రావడం చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తాజాగా రజనీతో భేటీ కావడంతో రాజకీయ వర్గాలు ఆంతర్యాన్ని వెతికే పనిలో పడ్డాయి. సాక్షి, చెన్నై : రజనీ కాంత్ ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలకు హాట్ కేకులా మారుతున్నారు. ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఆయనకు సీఎం అభ్యర్థిత్వాన్ని సైతం ఆఫర్ చేసింది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా రజనీ కాంత్ లేఖాస్త్రం సంధించడం బీజేపీ వర్గాల్ని కలవరంలో పడేసింది. జయలలితను పరామర్శిస్తూ రజనీ రాసిన లేఖ తో అన్నాడీఎంకే వర్గాలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ తమ వెంట ఉన్న రజనీ కాంత్, రానున్న ఎన్నికల్లోను తమకు మద్దతుగానే ఆయన వ్యవహరిస్తారన్న ఆశాభావం అన్నాడీఎంకేలో వ్యక్తమవుతోంది. ఈ లేఖాస్త్రం ఓ వైపు చర్చకు దారి తీసిన సమయంలో డీఎంకే నేతలు పలువురు రజనీని రెండు రోజుల క్రితం పరామర్శించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ వంతు వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు రజనీ కాంత్‌తో భేటీ కావడం మరింత ఆసక్తికరంగా మారింది. కార్తీ భేటీ : మూడు నెలలుగా రజనీ కాంత్ లింగా చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. పది రోజుల క్రితం చెన్నైకు వచ్చిన ఆయన, లింగా చిత్ర వ్యవహారాల మీద దృష్టి పెట్టారు. దీంతో పోయెస్ గార్డెన్లో ఉన్న రజనీ కాంత్‌ను ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా అటు రాజకీయ వర్గాలు, ఇటు మిత్రులు కలుసుకుంటున్నారు. శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు, కాంగ్రెస్ నేత కాార్తీ చిదంబరం పోయేస్ గార్డెన్లో రజనీ కాంత్ ఇంటి మెట్లు ఎక్కారు. రజనీ కాంత్‌ను కలుసుకుని పుష్ప గుచ్ఛాలు అందజేశారు. కార్తీ వెంట మరో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. తన ఇంటికి వచ్చిన కార్తీతో చాలా సేపు రజనీకాంత్ మాటా మంతిలో మునిగారు. కార్తీ చిదంబరం నేతృత్వంలోని ఓ ట్రస్టు కార్యక్రమానికి రజనీ కాంత్‌ను ఆహ్వానించినట్టు సమాచారం. ఈ భేటీ గురించి కాంగ్రెస్ వర్గాల్ని కదిలించగా, కార్తీ చిదంబరం రజనీకాంత్‌ను కలిసిన మాట వాస్తవేమనని, అయితే, అది వ్యక్తిగతమేనంటున్నారు. చిదంబరం మద్దతుదారుల్ని కదిలించగా, రజనీ కాంత్, కార్తీ చాలా సేపు రాజకీయాల గురించి మాట్లాడుకున్నారని, అలాగే, కార్తీ ట్రస్టు నేతృత్వంలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజనీ కాంత్‌ను ఆహ్వానించి ఉన్నట్టు పేర్కొంటున్నారు. అయితే గతంలో కాంగ్రెస్‌తో కయ్యం ఏర్పడ్డప్పుడు చిదంబరం సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఏదైనా సాగేనా లేదా, ఈ భేటీ కేవలం మర్యాదేనా..? అన్న విషయమై ఆంతర్యాన్ని వెతికే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి. చిదంబరంపై ఆగ్రహం: ఓ వైపు రజనీ కాంత్‌తో కార్తీ చిదంబరం భేటీ అయితే, మరో వైపు చిదంబరంపై ఏకంగా కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం ప్రదర్శించాయి. ఆంగ్ల మీడియాకు చిదంబరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నెహ్రు, ఇందిరా కుటుంబాలకు చెందని వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే సమయం వస్తుందని పేర్కొనడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యల్ని టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు, ఎమ్మెల్యే విజయ ధరణిలు ఖండించారు. నెహ్రు, ఇందిర కుటుంబాలకు చెందిన వాళ్లు అధ్యక్షులుగా ఉండబట్టే పార్టీ బలంగా ఉందని, లేని పక్షంలో పార్టీలో ఐక్యత కొరవడి ఉండేదన్న విషయాన్ని చిదంబరం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ అయితే, చిదంబరం వ్యాఖ్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో ఆధిపత్యం లక్ష్యంగా కేంద్ర మాజీ మంత్రులు జీకే వాసన్, చిదంబరం మద్దతు గ్రూపుల మధ్య పోటీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో విరక్తితో చిదంబరం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన మద్దతు దారులు పేర్కొనడం ఆలోచించాల్సిందే. -
విజయ్, విజయకాంత్లకు బీజేపీ గాలం
‘ఇన్నాళ్లు సూపర్ స్టార్ రజనీకాంత్ నినాదాన్ని పఠించిన కమలనాథులు ఇక, ఇళయదళపతి విజయ్, డీఎండీకే అధినేత విజయకాంత్ పేర్లను జపించేందుకు సిద్ధమయ్యారు.’ విజయ్‌కు గాలం వేయడంతో పాటుగా విజయకాంత్‌కు అండగా నిలబడేందుకు బీజేపీ అధిష్టాన ం కసరత్తుల్లో మునిగింది. సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాల్లో మునిగింది. పీఎం మోదీచరిష్మాను, రాష్ట్రంలోని ఇన్నాళ్లు సాగిన ద్రవిడ పార్టీల అవినీతిని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న బలమైన శక్తుల మద్దతును కూడగట్టుకునే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యూరు. సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి దించడం లక్ష్యంగా తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఇన్నాళ్లు రజనీ నినాద మంత్రాన్ని పఠించిన కమలనాథులు, ఇక విజయకాంత్, విజయ్ పల్లవి అందుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇళయ దళపతిగా పేరున్న విజయ్‌కు రాష్ట్రంలో అశేష అభిమాన లోకం ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు విజయ్ తన మద్దతును ప్రకటించారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో అన్నాడీఎంకే సర్కారు రూపంలో విజయ్‌కు చిక్కులు తప్పలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు వేదికగా నరేంద్ర మోదీతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. విజయ్ను మోదీ ప్రశంసలతో ముంచెత్తడం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. విజయ్ ఎలాంటి సంకేతం ఇవ్వకున్నా, ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతుగా ఆయన అభిమానులు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో విజయ్ మద్దతను పూర్తి స్థాయిలో దక్కించుకోవడం లక్ష్యంగా కమలనాథులు ప్రయత్నాల్లో పడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలతో విజయ్‌కు గాలం వేసే పనిలో కొందరు నాయకులు పడ్డారు. సేవా కార్యక్రమాలకు వేదికగా విజయ్ నేతృత్వంలో ఉన్న మక్కల్ ఇయక్కం మద్దతును కూడగట్టుకోవడం లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. తమకు మద్దతుగా నిలిచిన పక్షంలో విజయ్‌కు లేదా, ఆయన సూచించే వ్యక్తికి రాజ్య సభ సీటును ఎరగా వేయడానికి కమలనాథులు రెడీ అవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకేకు అండ: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్ మనసు మారకుండా, తమతో కలసి ఉండే విధంగా కొత్త వ్యూహాన్ని రచించారు. విజయకాంత్‌కు రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం, ఆ పార్టీకి, ఆ పార్టీ నేతృత్వంలోని కెప్టెన్ టీవీకి అండగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. పదేళ్లుగా పార్టీని ఒంటరిగా విజయకాంత్ ముందుకు తీసుకె ళుతున్నారు. అన్నీ తానై ముందుకు సాగుతున్న విజయకాంత్‌కు కెప్టెన్ టీవీ, న్యూస్ చానెళ్లు ఉన్నాయి. ఈ చానెళ్లు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. పార్టీని ముందుకు తీసుకెళ్లడం విజయకాంత్‌కు భారంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ అధిష్టానం, ఆయనకు అండగా నిలబడేందుకు సిద్ధమైనట్టు సమాచారం. తమతో మిత్రత్వం కొనసాగిస్తే, ఈ సారి విజయకాంత్ సతీమణి ప్రేమలత, బావ మరిది సుదీష్‌లలో ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటుగా, టీవీ చానెళ్ల అభివృద్ధికి ఆర్థిక సహకారాన్ని ఇచ్చి, పూర్తి స్థాయిలో కూటమి పార్టీ, మద్దతు నేతల కార్యక్రమాల ప్రచారం లక్ష్యంగా ఉపయోగించుకునేందుకు కమలనాథులు వ్యూహ రచన చేశారు. విజయకాంత్ సీఎం సీటు లక్ష్యంగా రాజకీయ పయనం సాగిస్తున్న దృష్ట్యా, ఎన్నికల నాటి పరిస్థితుల మేరకు ‘సీఎం’ సీటు నిర్ణయం తెరపైకి తెచ్చే విధంగా కమలనాథులు కసరత్తుల్లో దిగారు. రంగంలోకి అమిత్ షా: మహారాష్ట్ర ఎన్నికలు ముగియడంతో ఇక తమిళనాడులో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అమిత్ షా సిద్ధమవుతున్నారు. త్వరలో తన వ్యూహాల అమలు లక్ష్యంగా ఆయన రంగంలోకి దిగనున్నట్టు కమలాలయంలో ప్రచారం ఊపందుకుంటోంది. అమిత్ షా రంగంలోకి దిగబోతున్నందునే ఈనెల 26న పార్టీ సర్వ సభ్య సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ పిలుపు నిచ్చారని చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం ప్రకటనతో అమిత్ షా వ్యూహాల అమలు లక్ష్యంగా నేతలు పరుగులు తీయనున్నారు. దీంతో కొద్ది రోజుల నుంచి కమలనాథుల నోట ‘వీ’ నినాద జపం మార్మోగనుంది. ఇక, రజనీకి సీఎం సీటు ఆఫర్, విజయ్ గాలం, విజయకాంత్‌కు ఆర్థిక అండ ఇచ్చే రీతిలో అమిత్ రచించిన వ్యూహాలు ఏ మేరకు ఫలితాల్ని ఇస్తాయోనన్నది వేచి చూడక తప్పదు. -
రజనీకి గాలం
సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఎలాగైనా రాజకీయాల్లోకి దింపడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. అధిష్టానం వ్యూహాల అమలు లక్ష్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం లత రజనీకాంత్‌ను ఆమె కలుసుకోవడంతోపాటుగా, రజనీ, కమల్ లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి దించేందుకు గతంలో అభిమాన లోకం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. అభిమానుల ఒత్తిడి శ్రుతి మించడంతో తలొగ్గిన రజనీ కాంత్ ‘దేవుడు ఆదేశిస్తే... రాజకీయాల్లోకి వస్తా..’ అన్న మెలిక పెట్టారు. అభిమానుల నోళ్లకు తాళం వేయించారు. అయితే, ఎన్నికల సమయాల్లో ‘రజనీ రాజకీయాల్లోకి రా...!’ అన్న నినాదం తెరపైకి రావడం సహజంగా మారింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి దింపే ప్రయత్నాలు వేగవంత మయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో రజనీ కాంత్‌కు ఉన్న మిత్రత్వం ఇందుకు ఓ కారణం. దక్షిణాదిలో కర్ణాటకలో బలంగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బలం పుంజుకుంటున్నా, తమిళనాడులో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా బీజేపీ పరిస్థితి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో మోదీ ప్రభావంతో ఓ సీటును తన్నుకెళ్లినా, ఈ ప్రభావానికి సినీ గ్లామర్‌ను తోడు చేసి తమిళనాడులోనూ పాగా వేయాలన్న లక్ష్యంతో బీజేపీ అధిష్టానం వ్యూహ రచనల్లో ఉంది. ఇందుకు గాను రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు కార్యాచరణ సిద్ధం చేశారు. రంగంలోకి తమిళి సై : తొలి విడత మంతనాల బాధ్యతల్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌కు బీజేపీ అధిష్టానం అప్పగించింది. దీంతో రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి దించడమే లక్ష్యంగా తన ప్రయత్నాల్ని తమిళి సై వేగవంతం చేశారు. రజనీ కాంత్‌తో సంప్రదింపులకు ముందుగా ఆయన సతీమణి లతారజనీకాంత్‌తో భేటీ కావడం గమనార్హం. నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు బొమ్మల కొలువును రజనీ కాంత్ ఇంట్లో ఏర్పాటు చేశారు. చివరి రోజు పోయేస్ గార్డెన్‌లోని ఆయన ఇంటికి ఈ బొమ్మల కొలువు సందర్శన నిమిత్తం తమిళి సై సౌందరరాజన్ వెళ్లారు. బొమ్మల కొలువుకు పూజల అనంతరం లతా రజనీ కాంత్‌తో భేటీ అయ్యారు. ఈ భేగా సమయంలో రజనీ కాంత్ ఇంట్లో లేని దృష్ట్యా, తాను చెప్పదలచుకున్న విషయాల్ని లతా రజనీ కాంత్ ముందు ఉంచినట్టు సంకేతాలు వెలువడ్డాయి. మరో మారు వచ్చి రజనీ కాంత్‌ను కలుస్తానని చెప్పి, మోదీ జీవిత చరిత్ర పుస్తకాన్ని తమిళి సై అందజేశారు. వాస్తవమే: తాను రజనీ కాంత్ ఇంటికి వెళ్లడం వాస్తవమేనని, లత రజనీ కాంత్‌తో భేటీ అయినట్టు తమిళి సై స్పష్టం చేశారు. రజనీ కాంత్, ప్రధాని నరేంద్ర మోదీ మంచి మిత్రులు అని పేర్కొంటూ, రజనీ కాంత్, కమల్ లాంటి వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కరువవుతోందన్నారు. ఈ సమయంలో రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావడం లేదా, బీజేపీకి మద్దతుగా నిలబడటం లక్ష్యంగా తమ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలు దొందు దొందేనని, అవినీతి ఊబిలో కూరుకున్న ఈ పార్టీలకు పట్టం కట్టే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని పేర్కొన్నారు. అందుకే సమాజ హితాన్ని కాంక్షించే రజనీకాంత్, కమల్ లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్న సమయంలో రజనీ ఏదో ఒక రూపంలో గళం వినిపిస్తున్నారని, ప్రస్తుతం అదే పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా దాన్ని ఓ మారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రజనీ కాంత్‌ను త్వరలో కలవనున్నట్టు పేర్కొన్నారు. -
ఐదు రోజులుగా మారువేషంలో రజనీకాంత్
దక్షిణ భారతదేశ సూపర్ స్టార్ రజనీ కాంత్ బెంగళూరులో ప్రత్యక్షం అయ్యారు. అయిదు రోజుల క్రితం ఇక్కడకు చేరుకున్న ఆయన, తన చిన్నప్పుడు సంచరించిన పలు ప్రాంతాలను మారువేషంలో తిరుగాడారు. విశ్రాంతి కోసమే ఇక్కడకు వచ్చిన ఆయన తన స్నేహితుడు ఉంటున్న రేస్‌కోర్సు రోడ్డులోని గోల్ఫ్ వ్యూ అపార్ట్మెంట్లో విడిది చేశారు. గురువారం ఈ విషయాన్ని పసిగట్టిన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని జై రజనీకాంత్...జై జై రజనీకాంత్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలియని చుట్టుపక్కల వారు ఒక్కసారిగా బిత్తరపోయారు. తర్వాత విషయం తెలుసుకుని వారుకూడా అభిమానుల్లో కలిసిపోయి రజనీకాంత్‌ను చూసేందుకు ఎగబడ్డారు. చివరకు రజనీకాంత్ బయటకు వచ్చి అభివాదం చేయటంతో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రజనీకాంత్‌తో ఫోటోలు తీయించుకునేందుకు పోటీ పడ్డారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది. కాగా తనకు వీలున్నప్పుడల్లా రజనీకాంత్ బెంగళూరుకు వస్తుంటారు. ఆయన సోదరుడు, ప్రాణ స్నేహితులు చాలామంది ఇక్కడే ఉన్నారు. దీంతో రజనీ బెంగళూరు వచ్చినప్పుడల్లా అభిమానుల కళ్లుగప్పి మారువేషంలో తాను చిన్నప్పుడు తిరిగిన రోడ్లు, మాస్ హోటల్స్, టిఫిన్ సెంటర్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ అయిదు రోజులు కూడా ఆయన తన స్నేహితులతో కలిసి మారువేషంలో నగర రహదారులపై ఉత్సాహంగా గడిపినట్లు సమాచారం.