
రాబోయే సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందకు రెడీ అవుతున్నారు రజనీకాంత్. శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ ‘అన్నాత్తే’ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార, కీర్తీ సురేష్, మీనా, ఖుష్భూ, ప్రకాష్‌రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్ సంస్థ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... వరుసగా మూడో ఏడాది సంక్రాంతి పండక్కి రజనీకాంత్ చిత్రం థియేటర్‌లో విడుదల కానుంది. ‘పేట్టా’ (2019), ‘దర్బార్’ (2020) చిత్రాలు సంక్రాంతి పండక్కి విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. 2021 పండక్కి కూడా రావడానికి రజనీ రెడీ అవుతున్నారు. అభిమానులకు పండగే పండగ.
Comments
Please login to add a commentAdd a comment