Prakash Raj
-
Prakash Raj: పవన్ సనాతన వేషం వెనుక రహస్యం
-
సనాతన ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఎవరు పవన్ కళ్యాణ్..?: ప్రకాశ్ రాజ్
సౌత్ ఇండియా పాపులర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన పలుమార్లు పవన్ రాజకీయ తీరుపై విమర్శలు చేసిని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరింతగా వైరల్ అవుతున్నాయి.పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానన్నారు కదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ను కోరారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ' సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ ఎవరు..? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్ మట్లాడారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో నిరుద్యోగత ఉంది. విపరీతమైన అవినీతితో నిండిపోయింది. ఎక్కడ చూసిన కూడా లంచాలే కనిపిస్తున్నాయి. ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలాచోట్ల రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా సెడెన్‌గా తను కాస్ట్యూమ్స్ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు..? ఇలా రకరకాలుగా దుస్తులు మార్చేసి మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అసలు అతను ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పడానికి నేను చాలా అన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను. డెమోక్రసీలో అపోజిషన్ అనేది లేకుంటే ఎలా..? ప్రజల పక్షాన నిలబడి వారిని ఎవరు ప్రశ్నించాలి..?' అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్అదే ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూ వివాదం గురించి కూడా ఇలా మాట్లాడారు. 'సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు. చాలా సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. కోట్లమంది భక్తుల మనోభావాలకు సంబంధించించిన తిరుమల లడ్డూపై ఎవరైనా మాట్లాడే సమయంలో సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంతమాత్రం కరెక్ట్ కాదు. లడ్డూ తయారీలో కల్తీ జరిగింటే అందుకు కారణమైన వారిని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోండి.' అంటూ ఆయన సూచించారు. He has no vision. I'm feeling very uncomfortable with him being the Deputy Chief Minister. - @prakashraaj about @PawanKalyan #PawanKalyan #SanatanaDharmaRakshanaBoard pic.twitter.com/AjZJWO77Ec— Telugu Chitraalu (@TeluguChitraalu) April 2, 2025 -
సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్/మియాపూర్: ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజగుట్ట ఠాణాలో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కాగా... తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మందిపై రిజిస్టరైంది. ఇందులో సినీనటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తదితరులు నిందితులుగా ఉన్నారు. మియాపూర్‌కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాలక్రమంలో బానిసలుగా...: బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌కు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫణీంద్ర గత ఆదివారం తమ కాలనీకి చెందిన యువకులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే వారిలో అత్యధికులు ఈ యాప్స్‌పై ఆసక్తి చూపడాన్ని గమనించారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమే దీనికి కారణమని ఫణీంద్ర గుర్తించారు. ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారం యువతను ప్రధానంగా డబ్బు అవసరం ఉన్న వారిని బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోకి లాగుతోందని, అనేకమంది వాటిలో డబ్బు పెట్టి నిండా మునిగిపోతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు ఫణీంద్ర గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పూర్తి వివరాలు సమరి్పస్తూ బుధవారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా రంగంలోకి.. పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై బీఎన్ఎస్లోని 318 (4), 112 రెడ్ విత్ 49, గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4, ఐటీ యాక్ట్‌లోని 66 డీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నిందితుల్లో కొందరు పంజగుట్టలో నమోదైన కేసులోనూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల వివరాలను సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మరోపక్క పంజగుట్ట కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మంగళ, బుధవారాల్లో టేస్టీ తేజ, హబీబ్‌నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్‌ను ప్రశ్నించారు. గురువారం విష్ణు ప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని 3 నుంచి 8 గంటలపాటు ప్రశి్నస్తున్న అధికారులు కొందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాము కేవలం స్కిల్డ్ గేమ్ అని చెప్పడంతోనో, తెలియకో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేశామని కొందరు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ యాప్స్ నిర్వాహకులతో బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో తదుపరి విచారణకు బ్యాంకు స్టేట్మెంట్స్తో హాజరుకావాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు. మిగిలిన ఇన్ఫ్లూయన్సర్లు ఒకటిరెండు రోజుల్లో విచారణకు రానున్నారు. -
బెట్టింగ్ యాప్ కేసు.. అవును ప్రమోట్ చేశా.. కానీ: స్పందించిన ప్రకాశ్ రాజ్
బెట్టింగ్ యాప్స్ కేసు వ్యవహారంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను కూడా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు వెల్లడించారు. అయితే 2016 జూన్‌లో ఓ యాడ్ చేసినట్లు తెలిపారు. అది కేవలం ఏడాది పాటు మాత్రమే చేసుకున్న అగ్రిమెంట్ అని వెల్లడించారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.ఈ వ్యవహారంపై వీడియోలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ..' బెట్టింగ్ యాప్ కేసు గురించి ఇప్పుడే తెలిసింది. 2016లో ఓ యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను ఆ యాడ్ చేసిన మాట నిజమే. కానీ ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లోనూ ఒప్పందం పొడిగిస్తామని కంపెనీ వాళ్లు అడిగారు. కానీ నేను ఆ యాడ్‌ను ప్రసారం చేయవద్దని కోరా. 9 ఏళ్ల కిందట ఏడాది పాటు ఒప్పందంతో చేసుకుని ఈ యాడ్ చేశా. ఇప్పుడు ఏ గేమింగ్ యాప్‌కు ప్రచారకర్తగా పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపా. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. ఒకవేళ పిలిస్తే నేను చేసిన ప్రకటనపై పోలీసులకు వివరణ ఇస్తా' అని అన్నారు.My response 🙏🏿🙏🏿🙏🏿 #SayNoToBettingAps #justasking pic.twitter.com/TErKkUb6ls— Prakash Raj (@prakashraaj) March 20, 2025 -
బెట్టింగ్ యాప్స్‌పై ప్రకాష్ రాజ్ వివరణ
-
గెలవక ముందు ‘జనసేనాని’.. గెలిచాక 'భజన సేనాని’: ప్రకాశ్ రాజ్
సాక్షి, అమరావతి: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న(శుక్రవారం) రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, పవన్ గెలవక ముందు ‘‘జనసేనాని’’.. గెలిచిన తరువాత ‘‘భజన సేనాని" అంతేనా? అంటూ సెటైర్లు వేశారాయన. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టులను ట్వీట్‌కి ప్రకాశ్‌రాజ్ జత చేశారు.‘‘హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ అంతకుముందు మరో ట్వీట్ కూడా చేశారు ప్రకాష్‌రాజ్. ‘‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారాయన.కాగా, పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే కూడా స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.“ గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా #justasking pic.twitter.com/EqjtqK6qFA— Prakash Raj (@prakashraaj) March 15, 2025‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు. -
పవన్ కల్యాణకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
-
తమిళులపై కామెంట్స్.. పవన్‌కు ప్రకాష్‌రాజ్ కౌంటర్
చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.నటుడు ప్రకాష్‌రాజ్ ట్విట్టర్ వేదికగా..‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please..’ అంటూ కామెంట్స్ చేశారు."మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please... 🙏🏿🙏🏿🙏🏿 #justasking— Prakash Raj (@prakashraaj) March 14, 2025ఇక, అంతకుముందు.. పవన్ కల్యాణ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జాతీయ విద్యావిధానంపై తమిళనాడు, కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్‌ను తొలగించారు. ఆ స్థానంలో తమిళనాడులో ‘రూ’ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. కాగా మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఇప్పటికే సీఎం స్టాలిన్ దీనిపై స్పందించారు. ‘తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొందరు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ, ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో చెప్పడం లేదు. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. -
నటుడు ప్రకాష్ రాజ్ కొత్త కారవ్యాన్ చూశారా (ఫోటోలు)
-
ఈయన్ను బయటకు పంపించేయండి: విజయ్ సేతుపతి
భిన్న నటులందరూ ఒకే దగ్గర సమావేశమయ్యారు. తమిళ సినీ స్టార్స్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), అరవింద్ స్వామి, మలయాళ హీరో ఉన్ని ముకుందన్, కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్, తెలుగు హీరో సిద్ధు జొన్నలగడ్డ, హిందీ నటుడు విజయ్ వర్మ.. అందరూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతాఇందులో విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలకు మిగిలినవారంతా పడిపడి నవ్వారు. ఎవరైనా అద్భుతంగా నటిస్తే నేను అభద్రతాభావానికి లోనవుతాను. ఫలానా సన్నివేశంలో అంత ఈజీగా ఎలా యాక్ట్ చేశారు? అని ఆలోచిస్తుంటాను.. అని విజయ్ చెప్పుకుంటూ పోతుంటే అరవింద్ స్వామి నవ్వకుండా ఉండలేకపోయాడు.(చదవండి: Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ)అంతా ఈయన వల్లే..అతడిని చూసి ప్రకాశ్ రాజ్ సైతం నవ్వేశాడు. ఈయన వల్లే నవ్వానంటూ ప్రకాశ్.. అరవింద్వైపు వేలు చూపించాడు. దీంతో సేతుపతి.. సర్.. ఈయన నన్ను మాట్లాడినవ్వట్లేదు. ఇంటర్వ్యూ మధ్యలో చెడగొడుతున్నాడు. వెంటనే ఈయన్ని బయట నిల్చోబెట్టండి అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కోరాడు. దీంతో అక్కడున్న మిగతా నటులు సైతం ఘొల్లుమని నవ్వారు.రాత్రి సిట్టింగ్..కొన్నిసార్లు అరవింద్ స్వామి నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. వెళ్లాక మేము తాగుతూ కూర్చుంటాం. రెండుమూడు గంటలపాటు నన్ను టీజింగ్ చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లయితే తెల్లవారేవరకు నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు అని సీక్రెట్ బయటపెట్టాడు. ఇక మరో సందర్భంలో జీవిత సత్యాన్ని బయటపెట్టాడు. జీవితం కొన్నిసార్లు మనకు పాఠాలు చెప్తుంది. దాన్ని నేర్చుకోకపోతే లైఫ్ మనకు గుణపాఠం చెప్తుందన్నాడు. చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి! -
'బఘీర' మూవీ రివ్యూ
టైటిల్: బఘీరనటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, అచ్యుత్, గరుడ రామ్, ప్రకాశ్ రాజ్ తదితరులుదర్శకుడు: డాక్టర్ సూరినిర్మాతలు: హోంబలే ఫిలింస్సంగీత దర్శకుడు: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టివిడుదల: 31 అక్టోబర్, 2024ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం హీరో శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బఘీర. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ చిత్రంతో డాక్టర్ సూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. దీపావళి కానుకగా కన్నడతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథవేదాంత్ (శ్రీ మురళి)కి చిన్నప్పటి నుంచే ప్రజలను కాపాడే ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. సూపర్ హీరోలకు పవర్ ఉంది కాబట్టి వాళ్లు జనాన్ని కాపాడుతున్నారు కానీ ఏ పవర్ లేకపోయినా పోలీసులు కూడా జనాన్ని కాపాడుతున్నారని తల్లి చెప్పడంతో వేదాంత్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. కొన్నాళ్లపాటు సిన్సియర్ పోలీసాఫీసర్‌గా పని చేస్తాడు. కానీ పై నుంచి ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. తనకు పరిమితులు విధిస్తారు. అంతేకాదు, తన పోలీసు ఉద్యోగం కోసం తండ్రి రూ.50 లక్షలు లంచం ఇచ్చాడని తెలిసి కుంగిపోతాడు. తన స్టేషన్ ముందు జరిగిన ఓ ఘటన వల్ల అతడు బఘీరగా అవతారమెత్తుతాడు. రాత్రిపూట బఘీరగా మారి క్రిమినల్స్‌ను వేటాడుతుంటాడు. అలా బఘీరకి జనాల్లో మంచి క్రేజ్ వస్తుంది. ఓ క్రిమినల్ రానా( గరుడ రామ్) అన్ని వ్యాపారాలకు బఘీర అడ్డొస్తాడు. ఈ ప్రయాణంలో బఘీరకు ఎదురైన సవాళ్లేంటి? వేదాంతే బఘీర అని సీబీఐ పసిగడుతుందా? వేదాంత్ ప్రేమకథ సుఖాంతమైందా? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే!విశ్లేషణప్రశాంత్ నీల్ నుంచి వచ్చే సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది. బఘీర కూడా ఆ కోవకు చెందినదే.. కాకపోతే కేజీఎఫ్‌లో అమ్మ సెంటిమెంట్, సలార్‌లో స్నేహం.. బాగా పండాయి. అలాంటి ఓ బలమైన ఎమోషన్ ఈ సినిమాలో పండలేదు. ప్రజల్ని నేరస్థుల బారి నుంచి రక్షించేందుకు హీరోలు ముసుగ వేసుకుని సూపర్ హీరోలా మారడం ఇదివరకే చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఈ మూవీలో హీరో పోలీస్ కావడం.. పోలీస్‌గా ఏదీ చేయలేకపోతున్నానన్న బాధతో సూపర్ హీరోగా మారడం కొత్త పాయింట్.ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా మొదలవుతాయి. అయితే హీరో లవ్ ట్రాక్ కథకు స్పీడ్ బ్రేకులు వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. హీరో బఘీరగా మారాక కథనం మరింత రంజుగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. సిబిఐ ఆఫీసర్‌గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఈ బఘీర ఎవరు? అని తెలుసుకునేందుకు ప్రకాష్ రాజ్ పడే తిప్పలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ వరకు హీరోకు, విలన్‌కు మధ్య బలమైన ఫైట్ ఉండదు. క్లైమాక్స్ కొత్తగా ఏమీ ఉండదు.ఎవరెలా చేశారంటే?వేదాంత్ అనే ఐపీఎస్ అధికారిగా, సూపర్ హీరో బఘీరగా శ్రీ మురళి రెండు షేడ్స్ లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. రుక్మిణి వసంత్ పాత్రకు కథలో ప్రాధాన్యతే లేదు. ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, రంగనాయనా వంటివాళ్లు స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ భలే అనిపిస్తుంది.టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కథ రొటీన్ కావడంతో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కొత్తదనం ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఏ సీన్ చూసినా ఎక్కడో చూశానే అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలిచింది.(కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రేటింగ్: 2.75 /5 -
అవకాశాలు రాకుండ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా నిలబడ్డ
-
సినిమా ఛాన్సులు పోయినా పర్వాలేదు ప్రశ్నిస్తా: ప్రకాష్ రాజ్
సౌత్ ఇండియాలో పాపులర్ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన తన కుటుంబంతో పాటు సినిమా ఛాన్స్‌ల విషయం గురించి కూడా మాట్లాడారు. తన జీవితంలో ఎక్కువగా బాధించిన ఘటనలు రెండు ఉన్నాయని ఆయన అన్నారు. తన కుమారుడి మరణమంతో పాటు స్నేహితురాలు గౌరీ (గౌరీ లంకేష్) మరణం అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు.ప్రకాశ్ రాజ్- లలిత పెద్ద కుమారుడు సిద్ధు (5) 2004లో మృతి చెందాడు. మేడపై గాలిపటాన్ని ఎగురవేస్తున్న సమయంలో ఒక స్టూల్ నుంచి జారిపడి కన్నుమూశాడు. ఆ సమయం నుంచి ప్రకాష్ రాజ్, లలిత మధ్య విభేదాలు పెరిగాయి. అలా చివరికి 2009లో లలితకు ప్రకాష్ రాజ్ విడాకులు ఇచ్చారు. అనంతరం 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, కుమారుడి మరణం తీవ్రంగా బాధపెట్టిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ పంచుకున్నారు. కానీ, అలాగే బాధలో ఉండిపోతే ఎలా..? అని ముందుకు సాగానంటూ పంచుకున్నారు. 'ఆ సంఘటనతో నేను స్వార్థపరుడిగా మారలేను. నాకు కుమార్తెలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, నాకు వృత్తి ఉంది, నాకు మనుషులు ఉన్నారు. నేనూ ఒక మనిషి, నాకు జీవితం ఉంది, నాపై ఆధారపడి ఉన్న వాళ్లకు నేను చేయాల్సింది చాలా ఉంది. అందుకే తిరిగి నిలబడ్డాను.' అని ఆయన అన్నారు.ప్రశ్నించడం ఆపనుఇండస్ట్రీలో బాలచందర్, కృష్ణవంశీ, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకులు ఇచ్చిన అవకాశాలే తనను ఇంతటి స్థాయికి చేర్చాయని ప్రకాష్‌రాజ్ గుర్తుచేసుకున్నారు. కథ బాగుంటే ఎలాంటి సినిమానైనా చేస్తానని ఆయన తెలిపారు. తనకు ఉన్న టాలెంట్‌కు ప్రజల నుంచి ఆదరణ, ప్రేమ వల్లే ఇక్కడ తాను నటుడిగా కొనసాగుతోన్నానని చెప్పారు. నేటి సమాజంలో గళం వినిపించలేని ప్రజలకు గొంతుకగా ఉంటానని ఆయన అన్నారు. సమాజంలో జరిగే తప్పులను చూస్తూ నోరు మెదపకుండా ఉండలేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సినిమా అవకాశాలు కోల్పోయినా ప్రశ్నించడం మాత్రం ఆపనని బలంగా చెప్పారు. ఇప్పటి వరకు తనపై ఎన్ని కుట్రలు పన్నినా తట్టుకొని నిలబడ్డానని ఆయన గుర్తుచేసుకున్నారు. భవిష్యత్‌లో కూడా అంతే స్థాయిలో నిలబడతానని ప్రకాష్ రాజ్ అన్నారు. -
కార్తీ తప్పు లేకపోయినా సారీ చెప్పించారు: ప్రకాశ్ రాజ్
గత కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ వరస ట్వీట్స్ వేస్తున్నారు. 'జస్ట్ ఆస్కింగ్' పేరుతో చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. దేనికి కూడా పవన్ నుంచి సమాధానం లేదు. ఇక రీసెంట్గా ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. హీరో కార్తీతో పవన్ సారీ చెప్పించుకున్న విషయం గురించి మాట్లాడారు. తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పించుకున్నారని అన్నారు.(ఇదీ చదవండి: కొండా సురేఖపై పిటిషన్.. కోర్టులో నాగార్జున స్టేట్మెంట్)అసలేం జరిగింది?కార్తీ హీరోగా నటించిన 'సత్యం సుందరం'.. సెప్టెంబరు 28న తెలుగులో రిలీజైంది. అంతకు కొన్నిరోజుల ముందు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. ఇందులో యాంకర్, లడ్డు గురించి ఓ ప్రశ్న అడగ్గా.. అది సెన్సిటివ్ మేటర్ వద్దులేండి అని కార్తి అనేశాడు. ఇందులో ఏం లేనప్పటికీ.. పవన్ ఈ విషయాన్ని ఓ ప్రెస్మీట్లో చెప్పారు. ఎందుకొచ్చిన సమస్యలే అని కార్తి క్షమాపణ చెప్పాడు. అంతటితో అది అయిపోయింది.ప్రకాశ్ రాజ్ ఏమన్నారు?దీని గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. కార్తీ ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేయలేదని, తప్పు లేకపోయినా సరే సారీ చెప్పించుకున్నారని అన్నాడు. నార్మల్ అయితే క్షమాపణ చెప్పకపోయేవాడు. సినిమా రిలీజ్ ఉంది, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ తదితరులకు ఇబ్బంది రాకూడదని చెప్పి ఉంటాడని అన్నాడు. సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించుకుని మరీ సారీ చెప్పినట్లు పవన్ కల్యాణ్ ప్రచారం చేసుకున్నారని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో క్లిప్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందన్న టాలీవుడ్ హీరోయిన్)కార్తిది తప్పు లేకపోయినా ఆయన చేత పవన్ కళ్యాణ్ సారి చెప్పించుకున్నాడు సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ Create చేసి సారీ చెప్పినట్లు ట్విట్టర్ లో ప్రచారం చేశారు -@prakashraaj 🔥🔥🔥 pic.twitter.com/1gFGL0vioV— MBYSJTrends ™ (@MBYSJTrends) October 7, 2024 -
లడ్డూ వివాదంపై పవన్ కల్యాణ్ కు క్లాస్ పీకిన ప్రకాష్ రాజ్
-
ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్.. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. జస్ట్ ఆస్కింగ్ అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. సినీ నటులు గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. #justasking https://t.co/MsqIhDpbXa— Prakash Raj (@prakashraaj) October 2, 2024అంతకుముందు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణం. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం. ఎన్ కన్వెన్షన్ విషయంలోనే ఇది జరిగింది. అలాగే.. మరో హీరోయిన్ రకుల్ త్వరగా వివాహం చేసుకోవడానికి కూడా కేటీఆర్ వైఖరే కారణం. విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మహిళలంటే కేటీఆర్‌కు చిన్నచూపు. హీరోయిన్స్ కి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు. దుబాయ్ నుండి సోషల్ మీడియాను అపరేట్ చేయమని కేటీఆర్ కొందర్ని పురమాయించాడు. అక్కడి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుస్తోంది. అక్కడి నుంచే నాపై పోస్టులు పెడుతున్నారు. మొన్న ఇద్దరిని, ఈరోజు ఇద్దరిని కేటీఆర్ దుబాయికి పంపించాడు అని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ‘అక్కా..దొంగ ఏడుపులు ఎందుకు?’.. మంత్రులపై కేటీఆర్ సెటైర్లు -
ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్.. పవన్‌పై మళ్లీ సెటైర్!
గత కొన్నిరోజుల నుంచి ప్రకాశ్ రాజ్-పవన్ కల్యాణ్ మధ్య ట్విటర్ వార్ నడుస్తూనే ఉంది. తిరుపతి లడ్డూ విషయమై మొదలైన ఈ రచ్చ కాస్త ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తప్పు ఎక్కడ జరిగింది? ఎవరు చేశారనేది పక్కనబెట్టి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు దెబ్బతీశారు. ఈయనకు వంతపాడటం అన్నట్లు లడ్డూ వ్యవహారాన్ని రాజకీయాంగా ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో రెచ్చగొట్టేలా పవన్ పలు కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ?.. డిప్యూటీ సీఎం పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు!)గత కొన్నిరోజుల నుంచి పవన్‌ని సోషల్ మీడియాలో ఓ రేంజులో ఆడుకుంటున్న ప్రకాశ్ రాజ్.. మరోసారి సెటైరికల్ ట్వీట్ వేశాడు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వాళ్లు చెప్పిన కొటేషన్స్ చెబుతూ పవన్‌పై కౌంటర్ వేశాడు.'నువ్వు మైనారిటీవి అయినా నిజం ఎప్పటికీ నిజమే -మహాత్మా గాంధీ. మనకు దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు ఉన్నాయి. కానీ వీటిని ఎప్పుడూ రాజకీయాల్లోకి తీసుకురాలేదు. ఇదే భారత్, పాకిస్థాన్‌ల మధ్య తేడా. -లాల్ బహదూర్ శాస్త్రి. మీ అందరికీ #గాంధీ జయంతి #లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు … ఈ సత్యాన్ని మనందరిలో నింపనివ్వండి జస్ట్ ఆస్కింగ్' అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!)Wishing you all happy #GandhiJayanti #LalBahadurShastriJayanti … Let this TRUTH sink into all of us 🙏🙏🙏 #justasking pic.twitter.com/AQV92znBHc— Prakash Raj (@prakashraaj) October 2, 2024 -
ట్విట్టర్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ పై ప్రకాశ్ రాజ్ సటైర్లు
-
పవన్ అసలు రంగు బట్టబయలైంది
ఇకనైనా దేవుడిని రాజకీయాల్లోకి లాగకండితిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. ల్యాబ్ రిపోర్టులో అస్పష్టత ఉంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు రుజువు లేకుండా మీడియా ముందు ఎందుకు హడావుడి చేశారంటూ నిలదీసింది. జూలైలో రిపోర్టు వెలువడితే ఇప్పుడెందుకు బయటపెట్టారంటూ ప్రశ్నించింది. ఇకనైనా మీరు దేవుణ్ని రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్. – ప్రకాశ్‌రాజ్, ప్రముఖ నటుడుదేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి 🙏🏿🙏🏿🙏🏿జస్ట్ ఆస్కింగ్. #justasking #justpleading pic.twitter.com/kLjnnJRuun— Prakash Raj (@prakashraaj) September 30, 2024 సుప్రీంకోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది తిరుమల లడ్డూ అంశంపై సరైన ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీం కోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది – సుబ్రమణియన్‌స్వామి, మాజీ ఎంపీ Tirupati Laddu controversy: Supreme Court slams CM Naidu, says no conclusive proof yet. Test report was on rejected ghee https://t.co/3ZHuifcdWN via @PGurus1— Subramanian Swamy (@Swamy39) September 30, 2024బాబు, పవన్ రాజీనామా చేయాలిచంద్రబాబు, పవన్ ఇద్దరూ వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారు. తిరుమల దేవస్థానంపై విశ్వాసాన్ని దెబ్బ తీసినందుకు వీరే బాధ్యత వహించాలి. హిందువులను మోసం చేసినందుకు, అబద్ధాలు ఆడినందుకు పశ్చాత్తాప్పడి పదవులకు రాజీనామా చేయాలి. -పీవీఎస్ శర్మ, ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారిSC has put the ball in Central govt court whether to continue SIT investigation or with other agencies.One more issue by which Modi govt will control @ncbn in addition to #SkillDevelopmentScam We have to wait & see how both CM and Dy CM will dance to BJP tunes in Delhi.— PVS Sarma (@pvssarma) September 30, 2024From day one, since #TTDprasadam controversy erupted, I was convinced that only non-believers & dirty minds would play with devotees sentiments.I was not wrong.CM @ncbn & Dy CM @PawanKalyan raised the issue without any proof or evidence& hurt sentiments.#Thoo#CheeChee— PVS Sarma (@pvssarma) September 30, 2024భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం తిరుపతి లడ్డూ వ్యవహారం భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం. నివేదికలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. ఒక ఆహార పదార్థంలో 14 రకాల కల్తీలు చేయవచ్చా? ఇక మతవాదులకు చెప్పడానికి ఏముంది! – ధన్య రాజేంద్రన్ (ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ చీఫ్)Tirupati laddu row: How politics is shaping the conflictWas adulterated ghee actually used in srivari laddu?Should devotees really be worried about their faith being defiled?@PoojaPrasanna4 tells you all about this and more in this week's Let Me Explain. Watch the full… pic.twitter.com/6RoAAsw0P8— TheNewsMinute (@thenewsminute) September 27, 2024 దేవుళ్లను రాజకీయాలకు దూరంగా పెట్టండి కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి – పూనమ్‌కౌర్, నటి "At least the Gods should be kept away from politics"- SUPREME COURT 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 30, 2024బాబు, పవన్‌ను చూస్తుంటే సిగ్గేస్తోంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను చూస్తుంటే సిగ్గేస్తోంది. – గబ్బర్, ప్రముఖ మలయాళీ రచయిత బాబు మతపరమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నారు తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని మతపరమైన భావోద్వేగాలు ప్రేరేపించేందుకు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గతంలోనే ‘ఎక్స్’లో చెప్పాను. ఈరోజు సుప్రీంకోర్టు సరిగ్గా అదే చెప్పింది. – శ్రీధర్ రామస్వామి, ఏఐసీసీ సోషల్ మీడియా నేషనల్ కో–ఆర్డినేటర్A few days ago I had posted on the Tirupati Laddu row was instigated by CBN to make it communal and he has a history to that. Today the SC has pulled up CBN for his remarks 👇 https://t.co/jHMeraRveB pic.twitter.com/PLEA4MmXUA— Sridhar Ramaswamy శ్రీధర్ రామస్వామి ✋🇮🇳 (@sridharramswamy) September 30, 2024 పవన్ అసలు రంగు బట్టబయలైంది తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం వ్యాఖ్యలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు రంగు బట్టబయలైంది. ఇలాంటి కపట అవకాశవాదులకు మద్దతు ఇవ్వకండి – వీణా జైన్ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్) Breaking!🚨Police raid on Sadhguru Isha Foundation, Today only Madras High court raised serious concerns over itThere are multiple allegations on Sadhguru & his foundation. Details of raid yet to come pic.twitter.com/UQrQ1Z289A— Veena Jain (@DrJain21) October 1, 2024దేవాలయాలను రాజకీయాల్లోకి లాగుతారా? ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు రాజకీయాల్లోకి దేవాలయాలను లాగుతారా? ఓట్ల కోసం మన ప్రార్థనా స్థలాలను లాగడం ఎంతవరకు సమంజసం? లడ్డూ విషయంలో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబే అసత్య ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం సబబేనా? రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని, బహిరంగంగా ఒకటి, రహస్యంగా మరొకటి.. బీజేపీ ఎందుకు ఆటలాడినట్టు? – ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ రాజ్యసభShame! If such be the case why did the Chief Minister claim otherwise? Will temples now be dragged into the politics of targeting opponents? For a few thousand votes it is okay to drag our places of worship?How is it okay to shake the faith of crores of devotees who believed… pic.twitter.com/DASek9o77h— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 30, 2024బాబు ప్రజలకు క్షమాపణ చెబుతారా! చంద్రబాబూ సిగ్గు సిగ్గు. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెబుతారా! – సుమంత్ రామన్, రాజకీయ విశ్లేషకులు హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారురాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు. వీరిద్దరూ క్షమాపణ చెప్పాలి. పవన్ చాలా గొప్ప నటుడు. ఆయన నటనతో రాజకీయాల్లోనూ రాణించాలనుకుంటే అది పొరపాటే. – డాక్టర్ గిరిజా షేట్కార్, యూనివర్సల్ హెల్త్ రైట్స్ అడ్వొకేట్ఇప్పుడేం చేస్తారు మీరందరూ అబ్బబ్బ.. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం ఎంత రచ్చ చేశారు? భక్తుల మనోభావాల్ని ఎంత హింసించేశారు? రాజకీయ నేతల్ని పక్కన పెడదాం.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఎంత ఓవరాక్షన్ చేశారు వీళ్లంతా. ప్రాయశి్చత్త శ్లోకాలట..! వాళ్లే కనిపెట్టేసి .. రామ రామా.. మీరు చేసింది మామూలు రచ్చనా.. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు మీరంతా! ఇప్పుడు ఏం చేస్తారు మీరందరూ? మీరు నిజంగా వేంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి.. ఎంత మంది పెడతారో చూస్తాను. – వీణావాణి, వేణు స్వామి భార్యవైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికి వారు ఆడిన పెద్ద అబద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద అబద్ధమాడారు. ఇది వారు రాజకీయ స్వార్ధంతో ఆడిన అబద్ధం. చాలా సిగ్గు చేటు. – హర్ష్ తివారి -
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ?.. డిప్యూటీ సీఎం పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు!
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసిన ప్రకాశ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి' అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. కాగా.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల లడ్డు విషయంలో దీక్షలు చేస్తానంటూ మీడియా ముందుకొచ్చి మరీ ప్రకటించారు. లడ్డూ ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ పలుసార్లు కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం వ్యాఖ్యలతో మరోసారి పవన్‌కు తనదైన శైలిలో చురకలంటించారు.(ఇది చదవండి: 'జస్ట్ ఆస్కింగ్' అంటూ మరోసారి ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్)సోమవారం సుప్రీం కోర్టులో లడ్డు అంశంపై విచారణ జరిగింది. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా..? అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ హెచ్చరించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై వెంటనే నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు షేర్ చేస్తూ.. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి' అంటూ పోస్ట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking— Prakash Raj (@prakashraaj) October 1, 2024 -
ట్విట్టర్లో ప్రకాష్ రాజ్ మరో చురక..
-
'జస్ట్ ఆస్కింగ్' అంటూ మరోసారి ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో మరోసారి స్పందించారు. తాజాగా సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా..? అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ హెచ్చరించింది.సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తెలుపుతూ ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు షేర్ చేస్తూ.. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్' అంటూ ఒక పోస్ట్ చేశారు. లడ్డూ ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ పలుమార్లు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు.. ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ పలు ప్రశ్నలు సంధించడంతో ప్రకాశ్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి 🙏🏿🙏🏿🙏🏿జస్ట్ ఆస్కింగ్. #justasking #justpleading pic.twitter.com/kLjnnJRuun— Prakash Raj (@prakashraaj) September 30, 2024 -
ఎందుకింత అయోమయం పవన్..
-
పవన్ కల్యాణ్‌కి ప్రకాష్ రాజ్ మరో సూటి ప్రశ్న
తనని తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకొంటున్న పవన్ కల్యాణ్‌కి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వరస షాకులు ఇస్తున్నాడు. గత రెండు రోజులుగా ట్విటర్లో ప్రకాశ్ రాజ్-పవన్ మధ్య పెద్ద వార్ జరుగుతోంది. తాజాగా మరో ట్వీట్ చేసి పవన్ కల్యాణ్ తీరుని ఎండగట్టారు. మనకేం కావాలి అని ప్రశ్నిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని లేవనెత్తారు.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ట్వీట్లో ఏముంది?'మనకేం కావాలి... ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన.. అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్' అని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చాడు.ఏం చెప్పాలనుకున్నారు?ప్రకాశ్ రాజ్ గత ట్వీట్స్‌తో పోలిస్తే ఈసారి పవన్ కల్యాణ్ తన మాటలతో ప్రజల భావోద్వేగాలని ఎలా రెచ్చగొడుతున్నారో అనేది చెప్పకనే చెప్పారు. దీని ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారా అని పవన్‌ని సూటిగా ప్రశ్నించారు. మరి ఈ ట్వీట్‌పై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి?(ఇదీ చదవండి: 'దేవర' చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మృతి)మనకేం కావాలి...ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..?లేక ప్రజల మనోభావాలుగాయపడకుండా..పరిపాలనా సంబంధమైన..అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..?జస్ట్ ఆస్కింగ్ #justasking— Prakash Raj (@prakashraaj) September 27, 2024 -
పవన్‌కు ప్రకాశ్‌రాజ్ కౌంటర్
-
అరె అవతారం..అయోమయం.. పవన్ పై ప్రకాష్ రాజ్ పంచులు
-
గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక ఇంకో అవతారం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ‘‘గెలిచే ముందు ఒక అవతారం. గెలిచాక ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్’’ అంటూ తనదైన శైలిలో పరోక్షంగా పవన్‌ను ఉద్దేశించే ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం..ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్? #justasking— Prakash Raj (@prakashraaj) September 26, 2024తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఆరోపణలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రకాష్ రాజ్.. పవన్ కల్యాణ్‌ను కోట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ‘మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు)’’ అని పేర్కొన్నారు.దీనిపై పవన్ కల్యాణ్ మంగళవారం కనకదుర్గమ్మ ఆలయం వద్ద స్పందించారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉన్నప్పటికీ.. సున్నితాంశాలపై తెలుసుకుని మాట్లాడాలని పవన్ సూచించారు. ‘‘ ప్రకాష్ రాజ్‌తో పాటు పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని, అప్పటిదాకా వీలుంటే తన ట్వీట్ మళ్లీ చదవి అర్థం చేసుకోవాలని’’ అని పేర్కొన్నారు. ఈ లోపు..ఈలోపే.. ‘సత్యం సుందరం’ ఈవెంట్లో ‘లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైంది’ అని నటుడు కార్తీ నవ్వుతూ చెప్పడంపైనా పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని సూచించడంతో కార్తీ క్షమాపణ చెప్పారు. అందుకు పవన్ బదులిస్తూ, కార్తి కావాలని అనలేదని అర్థమైందని అనడంతో అక్కడికి ఆ వివాదం ముగిసింది. అయితే.. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్...’ అని ప్రకాశ్‌రాజ్ పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం ఇక్కడితోనే ముగిసిపోదని అర్థమైంది. -
పవన్ కు ప్రకాష్ రాజ్ మరుసారి కౌంటర్
-
అందులో ఉన్న ఆనందం ఏంటో.. పవన్‌కి ప్రకాశ్ రాజ్ మరోసారి కౌంటర్!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి కౌంటర్ ఇచ్చాడు. హీరో కార్తీని పవన్ టార్గెట్ చేయడాన్ని తప్పు పడుతూ.. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్...’ అని ట్వీట్ చేశాడు.(చదవండి: దయచేసి ఆ వీడియోని ఇప్పుడు వాడకండి : యాంకర్ రష్మి)తిరుమల లడ్డు వివాదంపై పవన్ కల్యాణ్ చేస్తున్న రాద్ధాంతాన్ని ప్రకాశ్‌రాజ్ మొదటి నుంచి తప్పుపడుతున్నాడు. ‘జస్ట్ ఆస్కింగ్’అంటూ పవన్ చర్యలను తప్పుపడుతూ ట్వీట్ చేశాడు. ప్రకాశ్ రాజ్ పోస్టులపై పవన్ అసహనం వ్యక్తం చేశాడు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ప్రశ్నలకు సమాధానమిస్తానని, ఆలోపు వీలైతే తను చేసిన ట్వీట్స్ మళ్లీ ఒకసారి చదవండి’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. కార్తీ వివాదం ఏంటి?‘సత్యం సుందరం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో యాంకర్ లడ్డు కావాలా అంటూ కార్తిని అడుగుతుంది. దానికి కార్తి నవ్వుతూ.. ‘లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైంది’ వద్దులే అన్నాడు. ఆయన సరదా అన్నట్లు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం కార్తి వ్యాఖ్యలను తప్పపడుతూ.. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని హెచ్చరించాడు. ఈ వివాదం పెద్దది కావొద్దనే ఉద్దేశంతో కార్తి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్... #justasking— Prakash Raj (@prakashraaj) September 25, 2024 -
హిందువులంతా ఏకం కావాలి
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా ఏకమై.. కలసికట్టుగా మాట్లాడాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందువులు మౌనం వహిస్తే, ఆ మౌనం భవిష్యత్తు తరాలను నాశనం చేస్తుందన్నారు. ధర్మాన్ని పరిరక్షించడం గుడికి వెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా, నా ఒక్కడి బాధ్యతేనా అంటూ ప్రశ్నించారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కనక దుర్గమ్మవారి దర్శనం అనంతరం ఇంద్రకీలాద్రిపై ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సనాతన ధర్మానికి సంబంధించి పోరాటం చేయాలనుకుంటే తనను ఆపేవారు ఎవరూ లేరన్నారు. ధర్మం కోసం పోరాటం చేస్తే చనిపోవడానికి సిద్ధమని, కానీ, అక్కడిదాకా తీసుకెళ్లనని చెప్పారు. సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా..? మాట్లాడేవారు ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడండి అని చెప్పారు. సెక్యులరిజం అనేది వన్ వే కాదని అది టూ వే అని చెప్పారు. హిందువులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మసీదులో చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతారా అని అన్నారు. హిందూ దేవుళ్లపైన మాట్లాడేవారు అల్లాహ్ పైన, మహ్మద్ ప్రవక్తపైన, జీసస్పైన మాట్లాడగలరా అంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఇస్లాంపైన మాట్లాడితే ఆ మతం వారు పెద్దఎత్తును బయటకు వస్తారు అంటూ చెప్పారు. హిందువులను రోడ్లపైకి రమ్మని చెప్పడం లేదన్నారు. కనీసం హిందువులకు కోపం రాకపోతే ఏం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ వారికి కూడా విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారం జోకులు వేయడం, మీమ్స్ చేయడం సరికాదన్నారు. ఓ సినిమా ఫంక్షన్లో జోకులు వేస్తున్నారని, ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. దేశమంతటికి కలిపి ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ తప్పనిసరి అని చెప్పారు. అంతకుముందు పవన్ కళ్యాణ్‌కు ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. ఆలయం మెట్లను కడిగి, పసుపు రాశారు.మహిళలను అడ్డుకున్న సిబ్బంది ఆలయంలో మెట్లను పవన్‌కళ్యాణ్ శుభ్రం చేసే కార్యక్రమానికి అర్ధగంట ముందు, ఆ తర్వాత కూడా మహిళా భక్తులు మెట్ల పూజ చేసుకోకుండా ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. మెట్ల పూజ చేసుకుంటూ వస్తున్న మహిళా భక్తులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని క్యూలైన్లోకి పంపేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, మహిళా భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. మెట్ల పూజ మొక్కు పూర్తి చేసుకోకుండా దర్శనానికి వెళ్లమని చెప్పడం ఎంత వరకు సబబని మహిళలు మండిపడ్డారు. -
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై అంబటి రియాక్షన్
-
పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పవన్.. ప్రకాష్ రాజ్‌పై విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ .. నేను చేసిన ట్వీట్ ఏంటి? నా ట్వీట్‌పై మీరు మాట్లాడుతుందంటేంటి. మరోసారి నా ట్వీట్‌ను చదవి అర్థం చేసుకోండి. నేను షూటింగ్ నిమిత్తం విదేశాల్లో వున్నాను 30 తేదీ తరువాత వస్తాను. మీ ప్రతి మాటకు సమాధానం చెపుతాను. మీకు వీలైతే నా ట్వీట్‌ని మళ్లీ చదివి అర్థం చేసుకోండి’ అంటూ వీడియోని విడుదల చేశారు. Dear @PawanKalyan garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa— Prakash Raj (@prakashraaj) September 24, 2024 ట్వీట్లో ప్రకాష్ రాజ్ ఏమన్నారంటేపవన్ కల్యాణ్... మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించుకునేలా చేస్తున్నారు? ఇప్పటికే మన దేశంలో ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l— Prakash Raj (@prakashraaj) September 20, 2024 ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై పవన్ ఇలా మాట్లాడారుసున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఆయనతో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు.చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే -
గొడవలు చేయగల సత్తా నాకూ ఉంది : పవన్ కళ్యాణ్
విజయవాడ, సాక్షి: ఒక సనాతనవాదిగా, హిందువుగా బయటకు వచ్చి గొడవలు చేయగల సత్తా తనకుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటున్నారు. హిందువులకు ఇతర మతాలపై విద్వేషం ఉండదని, కానీ, సెక్యులరిజం అనేది అన్ని వైపులా నుంచి రావాలని అన్నారాయన.మంగళవారం ఉదయం ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి పవన్ వచ్చారు. ఆపై తిరుమల లడ్డూ వ్యవహారంలో వైఎస్సార్సీపీ సహా తన మీద పలువురు విమర్శలు చేయడంపై ఆయన స్పందించారు. ‘‘సాటి హిందువులే హిందుత్వాన్ని కించపరుస్తున్నారు. తోటి హిందువులను కించపరుస్తున్నారు. ఇష్టానికి మాట్లాడుతున్నారు. మరి మిగతా మతాల మీద జోకులేయరేం?. నన్ను పచ్చిబూతులు తిట్టినా మౌనంగా ఉన్నా. కానీ నన్ను విమర్శించేవాళ్లకు చెబుతున్నా. సనాతన ధర్మం జోలికి రావొద్దు. చేస్తే.. బయటకు వచ్చి గొడవలు చేయగల సత్తా నాకుంది... చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రిదాకా రామనామమే వినిపిస్తుంది. రామ భక్తులం మేం. అలాంటిది సనాతన ధర్మం మీద దాడి జరిగితే మాట్లాడొద్దంటే.. ఏమనాలి?. హిందువులుగా అది మీ బాధ్యత కాదా? ధర్మాన్ని పరిరక్షించరా?’’. .. తిరుమల లడ్డూ వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌ను తానేం నిందించట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే జగన్ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులోనే ఈ తప్పు జరిగిందని, ఆ సమయంలో జరిగిన అపచారం పై స్పందించాలని మాత్రమే కోరుతున్నానని పవన్ అన్నారు... ‘‘భారతదేశపు సినిమా అభిమానులు అందరూ హిందువులు కాదా?. ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్లమీదకు వచ్చి కొడతారని మీకు భయం. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సైలెంట్ గా ఉండాలి. మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడాలి. నిన్న సినిమా ఫంక్షన్ లో లడ్డూ గురించి మాట్లాడారు’’.తనను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయడంపైనా పవన్ తీవ్రంగా స్పందించారు. ‘‘అపవిత్రం జరిగిందనే నేను మాట్లాడాను తప్ప.. మరో మతాన్ని ఏమైనా నిందించానా?. ఆ మాత్రం దానికే గోల చేయకూడదని ప్రకాశ్ రాజ్ అంటున్నారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా?. ఏం పిచ్చి పట్టింది మీకు? ఎవరి కోసం మీరు మాట్లాడుతున్నారు. మీరంటే గౌరవం ఉన్నా.. అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోను. .. ప్రకాష్ రాజ్ గారూ.. మేం చాలా బాధపడ్డాం.. మీకు ఇది ఇదంతా హాస్యం కావచ్చు. మాకు ఇదంతా చాలా బాధ. మీ ఇష్టానికి సనాతన ధర్మం పై మాట్లాడుతున్నారు. మీరు సరస్వతీ దేవి, దుర్గాదేవి లపై జోకులు వేస్తారా?. ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టే సనాతన ధర్మం బోర్డు రావాలని తాను కోరుతున్నానని అన్నారు. సనాతనధర్మ రక్షణ అనేది గుడికెళ్ళే ప్రతీ హిందువు బాధ్యత కాదా?’’ అని పవన్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఈ పెద్దమనిషికి సనాతన ధర్మం అంటే తెలుసా? -
పవన్.. రెచ్చగొట్టడం మానేసి ముందు ఆ పని చూడు: ప్రకాశ్ రాజ్
తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తామని మరోసారి నిరూపించింది. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం చంద్రబాబు తానా అంటే తాను తందాన అంటున్నారు. దీనిపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే కదా ఈ ఘటన జరిగింది. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. ఆ పని చేయడం మానేసి ఈ ఆందోళనలను జాతీయస్థాయిలో ఎందుకు వ్యాపింపజేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఉన్న మతకల్లోలాలు చాలవన్నట్లు దీన్ని ఎందుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని చూస్తున్నారు? అని అసహనం వ్యక్తం చేశారు.అసలేం జరిగింది?2024 జూలై 12న ఆవు నెయ్యిని పరీక్షల కోసం టీటీడీ పంపింది. అది ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)కి జూలై 17న చేరగా పరీక్షించి జూలై 23న నివేదిక ఇచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే! ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే అందులో వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు ఉందే తప్ప ఎక్కడా జంతువుల కొవ్వు కలిసినట్లు లేదు. కానీ టీడీపీ.. జంతు మాంసం కలిసిందంటూ దుష్ప్రచారానికి తెరదీసింది. Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l— Prakash Raj (@prakashraaj) September 20, 2024చదవండి: ఈ బతుకే వ్యర్థం అని నిద్రమాత్రలు మింగా: బాలీవుడ్ నటి -
‘ ఉత్సవం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉత్సవంనటీనటులు:దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ తదితరులునిర్మాత: సురేష్ పాటిల్రచన, దర్శకత్వం: అర్జున్ సాయిసంగీతం: అనూప్ రూరబెన్స్సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్విడుదల తేది: సెప్టెంబర్ 13, 2024కథేంటంటే..అభిమన్యు నారాయణ(ప్రకాశ్ రాజ్).. అంతరించి పోయిన సురభి నాటక మండలిలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. అతని కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాశ్)కి కూడా నాటక కళాకారులు అంటే చాలా గౌరవం. అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని నేటి ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలను గట్టేకించాలని ప్రయత్నిస్తుంటాడు. మరో రంగస్థల నటుడు మహాదేవ్ నాయుడు(నాజర్) కూతురు రమ(రెజీనా) సహాయంతో కార్పొరేట్ వీకెంట్ ఈవెంట్లో రంగస్థల నటులతో నాటక ప్రదర్శనను ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో రమ-కృష్ణలు ప్రేమలో పడతారు.అయితే ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోతారు. మరోవైపు స్నేహితులైన అభిమన్యు, మహాదేవ్‌లు కృష్ణ, రమలకు పెళ్లి చేయాలని ఫిక్సవుతారు. అయితే ఈ విషయం తెలియకుండా ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రమనే అని కృష్ణకు, పెళ్లి కొడుకు కృష్ణనే అని రమకు తెలియదు. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఒకరికి తెలియకుండా ఒకరు ఇంట్లో నుంచి పారిపోతారు.అయితే ఈ విషయాన్ని అటు పెళ్లికొడుకు వాళ్లు, ఇటు పెళ్లి కూతురు వాళ్లు ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు దాచి..పెళ్లి సమయానికల్లా వాళ్లను వెతికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు. అసలు రమ-కృష్ణలు ప్రేమలో ఎలా పడ్డారు? విడిపోవాడానికి గల కారణం ఏంటి? పెద్దలు ఫిక్స్ చేసిన సంబంధం కూడా ఇదేనని ఇద్దరికి ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు రమ-కృష్ణలు ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..సినిమాలకు స్పూర్తి నాటకాలు. ఆ నాటక కళాకారుల మీద తీసిన సినిమానే ‘ఉత్సవం’. ఒకవైపు రంగస్థల కళాకారులు కష్టాలను చూపిస్తూనే ఓ చక్కని ప్రేమకథను చెప్పొకొచ్చాడు దర్శకుడు అర్జున్ సాయి. డైరెక్టర్ రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్నితెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. ఒకదానికొకటి సంబంధం లేని సన్నివేశాలు వస్తుంటాయి. అలాగే ఎమోషనల్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం, ఈ మధ్యే వచ్చిన రంగమార్తండా సినిమాలను గుర్త చేస్తాయి. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది. (చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)ఫస్టాఫ్లోహీరో హీరోయిన్ల ప్రేమాయణంతో పాటు నాటక కళాకారులు కష్టాలను చూపించారు. ఇక సెకండాఫ్‌లో నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నం.. అలాగే వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటో చూపించారు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్ సినిమాకే హైలెట్. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలను కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహించినట్లే రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే..దిలీప్ ప్రకాష్‌కి ఇది రెండో సినిమా . అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. తండ్రికి విలువనిచ్చే కొడుకుగా, ఓ మంచి ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తండ్రి, రంగస్థల నటుడు అభిమన్యు నారాయణగా ప్రకాశ్ రాజు జీవించేశాడు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్లో శివుడి అవతారంలో కనిపించి.. తనదైన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. మరో నాటక కళాకారుడు మహాదేవ్గా నాజర్ కూడా అదరగొట్టేశాడు. , రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా రివ్యూ
టైటిల్: పురుషోత్తముడునటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ముకేశ్ ఖన్నా తదితరులుదర్శకుడు: రామ్ భీమననిర్మాతలు: రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్విడుదల తేదీ: 26 జూలై, 2024ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ వంటి సూపర్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. చాలాకాలంగా ఇతడికి మంచి హిట్ లేదు. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో కొంచెం గ్యాప్ తీసుకొని పురుషోత్తముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఓ మోస్తరు హైప్ క్రియేట్ అయింది. మరి ఈ రోజు (జూలై 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథరచిత రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. అతడిని తన కంపెనీకి సీఈవో చేయాలని తండ్రి (మురళీ శర్మ) భావిస్తాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం.. సీఈవో కావాలంటే ముందు ఆ వ్యక్తి వంద రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లాలి. ఆ విషయాన్ని రామ్ పెద్దమ్మ (రమ్య కృష్ణ) అందరికీ గుర్తు చేస్తుంది. ఆ కంపెనీలో తనకు 50 శాతం వాటా ఉండటంతో రామ్ అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు. రాజమండ్రి దగ్గర్లోని కడియపులంక అనే గ్రామానికి ఒంటరిగా వెళ్లిపోతాడు.ఆ గ్రామంలో నర్సరీ నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్ ముత్తం శెట్టి) కుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.. ఈ క్రమమంలో పేద ప్రజల జీవన విధానం, కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి సాయం చేస్తాడు.. ఈ పాయింట్‌తో శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందార్.. ఇలా పలు తెలుగు చిత్రాలు వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇదే! కథ రొటీన్ అయినా తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.కానీ పాత కథే కావడంతో సినిమా చూస్తున్నంతసేపు అవే గుర్తుకు వస్తుంటాయి. కథనం కూడా ఊహకు తగ్గట్లే సాగిపోతుంది. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండకుండా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా అంతా కూడా పెద్దగా ట్విస్టుల్లేకుండా సాఫీగా సాగిపోతుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. చివర్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారంటే?రామ్ పాత్రకు రాజ్ తరుణ్ న్యాయం చేశాడు. హీరోయిన్ హాసిని సుధీర్ అందంతో మెప్పించింది. నటనలోనే ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. రమ్యకృష్ణ ఎప్పటిలాగే హుందాగా నటించింది. ప్రకాశ్ రాజ్, విరాన్ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతావారు పర్వాలేదనిపించారు. చదవండి: ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘పురుషోత్తముడు’
రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. హాసినీ సుధీర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముఖేష్ ఖన్నా ఇతర కీలక పాత్రల్లో నటించారు. రామ్ భీమన దర్శకత్వంలో డా. రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ భీమన మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా నేను ‘ఆకతాయి, హమ్ తుమ్’ అనే రెండు సినిమాలు చేశాను. ఆ తర్వాత ఆరేళ్లకు నాకు ‘పురుషోత్తముడు’ చాన్స్ వచ్చింది. విజయం సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘మంచి క్లీన్ ఎంటర్టైనర్ మూవీ తీశామని గర్వంగా చెప్పగలం’’ అన్నారు రమేశ్ తేజావత్. ‘‘పురుషోత్తముడు’లో మంచి పోలీసాఫీసర్ రోల్ చేశాను. ఈ సినిమా సక్సెస్ కావాలి’’ అన్నారు బ్రహ్మానందం.‘‘ఈ సినిమాలో నటించడాన్ని ఆస్వాదించా. రాజ్ తరుణ్ ఈ ప్రెస్‌మీట్‌కు రాలేదు. త్వరలోనే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడతారు’’ అన్నారు రాజా రవీంద్ర. ‘‘నాది మహా రాష్ట్ర. నన్ను తెలుగు అమ్మాయిలా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు హాసినీ సుధీర్. -
ఏడు ఎపిసోడ్లుగా ఏకం.. ట్రైలర్ చూశారా?
ప్రకాశ్ రాజ్, రాజ్ బి శెట్టి, షైన్ శెట్టి, మానసి సుధీర్, ప్రకాశ్ తుమినడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ఏకం. ఇందులో ఏడుగురి జీవితాలను ఏడు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు. ఈ సిరీస్ కోసం ఏకంగా ఐదుగురు దర్శకులు పని చేశారు. సుమంత్ భట్, స్వరూప్ ఎలమొన్, సనల్ అమన్, శంకర్ గంగాధరన్, వివేక్ వినోద్ దర్శకత్వం వహించారు. వీరిలో సనల్, వివేక్ మినహా మిగతా ముగ్గురూ స్క్రీన్‌ప్లే అందించారు. ఈ స్క్రీన్‌ప్లేకు జీఎస్ భాస్కర్ అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. ఈ సిరీస్ జూలై 13న ఏకం ద సిరీస్ (https://www.ekamtheseries.com/) వెబ్సైట్లో విడుదల కానుంది.భావోద్వేగాల సమ్మేళనంఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమ, భయం, ధైర్యం, బాధ.. ఇలా అన్నిరకాల ఎమోషన్స్‌ను రంగరించారు. ఎంతో సహజసిద్ధంగా కనిపిస్తున్న ఈ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యుంటే ఎక్కువమంది చూసే ఆస్కారం ఉండేది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ సిరీస్‌ను తిరస్కరించడంతో మరో అవకాశం లేక సొంత ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెస్తున్నారు.పట్టించుకోని ఓటీటీలుఈ విషయాన్ని కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లడించాడు. '2020 జనవరిలో ఏకం ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. కరోనా వల్ల కాస్త ఆలస్యమైంది. 2021 అక్టోబర్‌లో ఫైనల్ కట్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ అద్భుతమైన సిరీస్‌ను ప్రపంచానికి చూపించాలని ఆరాటపడ్డాను. కానీ ఎంత ఎదురుచూసినా, ప్రయత్నించినా ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఏకం తీసుకోవడానికి ముందుకు రాలేదు. అందుకే మా సొంత ప్లాట్ఫామ్లోనే దీన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు' అని ట్వీట్ చేశాడు. Presenting #EKAM – with love, from us to you! 🤗Join the waitlist now!🔗 https://t.co/PFMuw92M13 @ParamvahStudios @teamjourneyman #SumanthBhat @sandeep_ps5 @AaronMac05 @prakashraaj @RajbShettyOMK @ShineShetty_ @worldofekam @definestudio_ pic.twitter.com/e6DCwAj7tD— Rakshit Shetty (@rakshitshetty) June 17, 2024చదవండి: అమ్మ ఎక్కడ? అని అడుగుతున్నారు.. ఏం చెప్పాలో.. ఏంటో? -
మళ్ళీ ఆయనే గెలుస్తారు: నటుడు ప్రకాష్ రాజ్
తిరువనంతపురం: దేశంలో ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న తరుణంలో సీనియర్ నేతలు సైతం నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఈ సమయంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి మళ్ళీ 'శశిథరూర్' విజయం సాధిస్తారని అన్నారు. జరగబోయే 2024 లోక్‌సభ ఎన్నికలో శశిథరూర్ మళ్ళీ విజయం సాధిస్తారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తిరువనంతపురం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ నుంచి చాలా అందుకుంది. కాబట్టి మళ్ళీ ఆయనే గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. శశి థరూర్ నా స్నేహితుడు, గొప్ప నాయకుడు. అందుకే అతని అండగా నిలబడటానికి నేను వచ్చానని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రస్తుతం ఈయన (శశి థరూర్) కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకుడు పన్నియన్ రవీంద్రన్‌లను ఎదుర్కొని పోటీకి నిలబడుతున్నారని అన్నారు. 2009 నుంచి గెలుస్తున్న శశి థరూర్‌కు వ్యతిరేకంగా బీజేపీ బలమైన నాయకున్ని బరిలోకి దింపింది. కాబట్టి ఈ సారి జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. 20 ఎంపీ స్థానాలకు కేరళ రాష్ట్రంలో 2019లో 19 స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకోగా.. ఒక స్థానంలో సీపీఎం గెలుపొందింది. బీజేపీ విఫలమైంది. 2016లో ఒక్కసారి మాత్రమే బీజేపీ నెమోమ్ అసెంబ్లీ స్థానంలో గెలిచింది. అయితే ఇప్పటివరకు బీజేపీ ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేదు. కాగా కేరళలోని మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. #WATCH | Thiruvananthapuram, Kerala: Actor Prakash Raj says, " I find this (Thiruvananthapuram) constituency has received a lot from Shashi Tharoor. It is going to be his term again, I am here to just stand by him not because he is a great friend of mine, but because he has given… pic.twitter.com/J34XOJUQ7Y — ANI (@ANI) April 22, 2024 -
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారా?
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తరుణంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారని సోషల్ ప్రచారం జోరందుకుంది. అయితే, తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలక్షణ నటుడు కొట్టిపారేశారు. దిస్కిన్ డాక్టర్ అనే ఎక్స్ అకౌంట్ యూజర్.. ప్రకాష్ రాజ్ బీజేపీలోకి చేరుతున్నారంటూ ట్వీట్ చేశారు. నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారింది. ప్రకాష్ రాజ్ స్పందన కంటే ముందే దాదాపు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఆ ట్వీట్‌కు విలక్షణ నటుడు స్పందించారు. ‘నన్ను కొనేంత సైద్ధాంతిక బలం బీజేపీకి లేదని’ వ్యంగ్యంగా స్పందించాడు ప్రకాష్ రాజ్. I guess they tried 😂😂😂 must have realised they were not rich enough (ideologically) to buy me.. 😝😝😝.. what do you think friends #justasking pic.twitter.com/CCwz5J6pOU — Prakash Raj (@prakashraaj) April 4, 2024 ఈ ఏడాది జనవరిలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రాజకీయ పార్టీలు టికెట్ ఆఫర్ చేస్తున్నాయని అన్నారు. తాను మోదీని విమర్శిస్తున్నాను కాబట్టే టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, తన సిద్ధాంతాలు నచ్చి కాదని పేర్కొన్నారు.అలాంటి ట్రాప్‌లో తాను పడబోనన్న ప్రకాశ్ రాజ్.. తనను సంప్రదించిన పార్టీలేవో చెప్పలేదు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రకాశ్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. -
వాళ్లు మన కోసం పోరాడుతున్నారు : లడఖ్‌లో ప్రకాష్ రాజ్ బర్త్‌డే
కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్ హక్కులను, పర్యావరాణాన్ని కాపాడాలంటూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ‘క్లైమేట్ ఫాస్ట్’ పేరుతో మార్చి 6న నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఉద్యమానికి పర్యావరణ వేత్తలు స్థానిక ప్రజలతో పాటు ప్రముఖులు, వివిధ ప్రాంతాలు, సంఘాల వారు మద్దతు పలుకు తున్నారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. మార్చి 26, మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకాష్ రాజ్ వాంగ్ చుక్ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు స్వయంగా ఉద్యమ ప్రదేశానికి తరలి వెళ్లారు. వారికి మద్దతు తెలపడం ద్వారా తన పుట్టిన రోజు జరుపుకుంటున్నానని తెలిపారు. ‘‘మన దేశం .. మన పర్యావరణం, మన భవిష్యత్తు కోసం లడఖ్ ప్రజలు పోరాడుతున్నారు. వారికి అండగా నిలుద్దాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిరసన తెలుపుతున్న వేలాదిమంది ఉద్యమకారుల వీడియోను కూడా షేర్ చేశారు. Its my birthday today .. and i’m celebrating by showing solidarity with @Wangchuk66 and the people of ladakh who are fighting for us .. our country .. our environment and our future . 🙏🏿🙏🏿🙏🏿let’s stand by them #justasking pic.twitter.com/kUUdRakYrD — Prakash Raj (@prakashraaj) March 26, 2024 మరోవైపు సేవ్ లడఖ్, సేవ్ హిమాలయాస్ అంటూ చేపట్టిన వాంగ్‌చుక్ దీక్ష 21 రోజులకు చేరింది. ఇంతవరకూ రాజకీయ నాయకులనుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ వాంగ్ చుక్ ట్వీట్ చేశారు. తన దీక్ష, ఆరోగ్యంపై ఎప్పటికపుడు అప్డేట్ ఇస్తున్న ఆయన ప్రజలనుంచి తనకు లభిస్తున్న మద్దతుపై సంతోషాన్ని, కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతిజ్ఞులు కావాలి, వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకులు కాదంటూ వాంగ్‌చుక్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఇకనైనా స్పందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 21st Day OF MY #CLIMATEFAST 350 people slept in - 10 °C. 5000 people in the day here. But still not a word from the government. We need statesmen of integrity, farsightedness & wisdom in this country & not just shortsighted characterless politicians. And I very much hope that… pic.twitter.com/X06OmiG2ZG — Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024 -
ప్రకాష్ రాజ్ బర్త్‌డే స్పెషల్.. రేర్ పిక్స్
-
‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’.. ప్రకాష్‌రాజ్ కౌంటర్
బెంగళూరు: అన్నీ 420 పనులు చేసి ఈ లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లకుపైగా గెలుస్తామనడం కేవలం మూర్ఖత్వమేనని బీజేపీని ఉద్దేశించి సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఇలాంటి ప్రకటనలు కాంగ్రెస్ సహా ఏ పార్టీ చేసినా అది మూర్ఖత్వమేనన్నారు. కర్ణాటకలోని చిక్‌మగ్‌ళూర్ ప్రెస్‌క్లబ్‌లో ప్రకాష్‌రాజ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీ ఒంటరిగా 400కుపైగా సీట్లు గెలిచే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. ప్రజలు గెలిపిస్తేనే ఎవరైనా గెలుస్తారని చెప్పారు. ఇన్ని సీట్లు తీసుకుంటామని ఏ పార్టీ చెప్పడానికి వీల్లేదన్నారు. కాగా, ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మాట్లాడుతూ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీఏ 400కుపైన సీట్లు గెలుస్తుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచార సభల్లోనూ అబ్ కీ బార్ చార్ సౌ పార్( ఈసారి 400కుపైన) అనే నినాదాన్ని బీజేపీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బాండ్లతో బీజేపీకి 6,986 కోట్లు -
ప్రకాశ్ రాజ్ నుంచి అవార్డ్ విన్నింగ్ మూవీ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు!
ప్రకాశ్ రాజ్ పేరు చెప్పగానే విలక్షణమైన పాత్రలే గుర్తొస్తాయి. హీరో, విలన్, తండ్రి, బాబాయ్.. ఇలా అన్ని రకాలు పాత్రలు చేశాడు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నటించాడు. అయితే గతంతో పోలిస్తే ప్రకాశ్ రాజ్ ఇప్పుడు చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నాడు. మొన్నీమధ్య 'గుంటూరు కారం'లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అలరించాడు. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఓ అవార్డ్ విన్నింగ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కన్నడలో తీసిన 'ఫొటో' అనే సినిమాని కొత్త దర్శకుడు ఉత్సవ్ గోన్వర్ తీశాడు. గతేడాది దిల్లీలో జరిగిన హ్యాబిటట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తోపాటు బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ రెండు చోట్ల కూడా 'ఫొటో' చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ దక్కడం విశేషం. అయితే ఈ సినిమా చూసిన ప్రకాశ్ రాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎలాగైనా సరే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే మార్చి 15న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 'ఫొటో' సినిమా కథ విషయానికొస్తే.. బెంగళూరులో ఓ వ్యక్తి, వలస కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి 10 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. అయితే ప్రభుత్వం అనుకోని పరిస్థితుల్లో లాక్డౌన్ విధిస్తుంది. దీంతో తమ సొంతూరు అయిన రాయచూర్‌కి నడక మార్గంలోనే వెళ్తారు. అసలు ఇంటికి వెళ్లారా అనేది పాయింట్. అలానే ఇదే కథలో ఆ పిల్లాడికి బెంగళూరులోని విధానసౌధ(కర్ణాటక శాసనసభ) ముందు నిలబడి ఫొటో తీసుకోవాలనే కోరిక ఉంటుంది. మరి లాక్డౌన్ కష్టాల మధ్య దాన్ని నెరవేర్చుకున్నాడా లేదా అనేదే 'ఫొటో' సినిమా స్టోరీ. కథ పరంగా బాగానే ఉంది. వలస కూలీల కష్టాలు ప్రతిబింబించేలా ఉంది. పలు అవార్డ్ వేడుకల్లో ప్రదర్శించారు. ఈ క్రమంలోనే సినిమా నచ్చి.. సొంతంగా రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ని జనాలు చాలావరకు మర్చిపోయారు. అలాంటిది ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందనేది చూడాలి? (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) -
Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ
టైటిల్: గుంటూరు కారం నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు) రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ సంగీతం:తమన్ ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: జనవరి 12, 2024 కథేంటంటే.. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని బెదిరిస్తాడు. అయినా కూడా కుతూరినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందుచూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్ బాబు)ను పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు. తండ్రి రాయల్ సత్యం(జయరామ్) చెప్పినా వినకుండా.. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్‌ని నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్‌లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ప్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు... ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్‌లో సినిమాలను తెరకెక్కించాడు. అల.. వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలుకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణల్లోనూ కొత్తదనం కొరవడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్‌ప్లేతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి? కథనం ఎలా సాగబోతుందనేది రివీల్ చేసేశాడు. మహేశ్ బాబు ఎంట్రీ అదిరిపోతుంది.తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు. ఇక ‘నాది నెక్లెస్ గొలుసు’ పాటకు మహేశ్, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్‌లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథేమి ఉండడు. ‘కిటికిలో నుంచి చూసే నాన్న.. తలుపులు మూసుకునే అమ్మ.. రోడ్డు మీద తిరిగే కొడుకు’ సింపుల్‌గా చెప్పాలంటే ఇదే ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కాస్త హిలేరియస్‌గా సాగుతుంది. లేడిస్‌తో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్, అజయ్ క్యారెక్టర్‌తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు. చివర్లో తల్లి-కొడుకు( రమ్యకృష్ణ- మహేశ్‌బాబు) మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేశ్ బాబు. యాక్షన్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఏదేమైనా గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. -
ప్రకాశ్ రాజ్, బాబీ సింహాపై స్టాలిన్ ప్రభుత్వం చర్యలు
సౌత్ ఇండియాలో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, బాబీ సింహా అక్రమ నిర్మాణాల కేసుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కొడైకెనాల్ మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. అక్కడ మధురై బెంచ్ చేపట్టిన విచారణ సందర్భంగా స్టాలిన్ సర్కారు ఈ మేరకు వివరణ ఇచ్చింది. కొడైకెనాల్లో సరైన అనుమతులు లేకుండా, నిబంధనలను ఉల్లంఘించి నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహా బంగ్లా నిర్మిస్తున్నారని గతేడాది సెప్టెంబర్‌లో వివాదం తలెత్తింది. కొడైకెనాల్ కొండ ప్రాంతంలోని రైతుల రాకపోకలు కొనసాగించేన దారిలో వారు ఇల్లు నిర్మించారని అక్కడి రైతులు ఫిర్యాదు చేశారు. నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహా నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాలు నిర్మిస్తున్నారని పెతుపర గ్రామాధికారి మహేంద్రన్ ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశారు. విల్పట్టి పంచాయతీ పరిధిలోని ప్రాంతంలో నటుడు ప్రకాష్ రాజ్ 7 ఎకరాల భూమిని, బాబీ సింహా ఒక ఎకరాన్ని కొనుగోలు చేశారు. నటీనటులిద్దరూ నిబంధనలను ఉల్లంఘించి ఆ భూమిలో బంగ్లా నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. కొడైకెనాల్ వంటి కొండ ప్రాంతాలలో బంగ్లాల నిర్మాణానికి తమిళనాడు బిల్డింగ్ పర్మిట్ నిబంధనల ప్రకారం సరైన అనుమతి పొందాలి. అలాగే కొండ ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి భవన నిర్మాణ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం అవసరం. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రకాష్‌రాజ్, బాబిసింహలు పెటుప్పరై ప్రాంతంలో బంగ్లా నిర్మించారని తెలుస్తోంది. ఈ విషయమై ఫిర్యాదు చేసినా.. ఇద్దరూ ప్రముఖ నటులు కావడంతో ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ నిర్మాణాల వల్ల కొండచరియలు విరిగిపడి పెద్ద నష్టం వాటిల్లుతుంది. అలాగే కొడైకెనాల్ పెటుప్పరైలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా అధునాతన పరికరాలు ఉపయోగించి రాళ్లను పగలగొట్టినందుకు సరైన ప్రభుత్వ అనుమతి లేకుండా ఆధునిక బంగ్లాలు నిర్మించిన నటులు ప్రకాష్‌రాజ్, బాబీ సింహలపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యక్తి ఎస్. మహమ్మద్ జునాథ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది ఇప్పటికే ఉన్న నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల సమీపంలోని నివాసాలకు ముప్పు ఏర్పడిందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణకుమార్, విజయకుమార్ ఈ పిటిషన్‌పై వాదనలు విన్నారు. రెండు భవనాల నిర్మాణ పనులను నిలిపివేసినట్లు న్యాయస్థానానికి తమిళనాడు సర్కారు తెలిపింది. ఇద్దరిపైనా లీగల్ యాక్షన్ ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు- ప్రకాశ్ రాజ్, బాబీ సింహాపై తీసుకున్న చర్యలకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. -
డబ్బు కోసం చెత్త సినిమాలు కూడా చేశా: ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్.. ఏ పాత్రలోనైనా ఇట్టే జీవించేయగల సమర్థుడు. దక్షిణాదిన అన్ని భాషల్లో నటించిన ఈయన బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేశాడు. అయితే కొన్నిసార్లు కేవలం డబ్బు కోసమే కథ, పాత్ర నచ్చకపోయినా సదరు సినిమాల్లో నటించానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. 'నేను ఎన్నో సినిమాలు చేశాను. కొన్నిసార్లు నన్ను రిజెక్ట్ కూడా చేశారు. దానివల్ల పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే.. నాకు నో చెప్పడం వెనక ఎంత రాజకీయం జరిగి ఉంటుందో నేను ఊహించగలను. వారు తప్పని పరిస్థితుల్లో నన్ను సినిమా నుంచి తప్పించారనే విషయాన్ని అర్థం చేసుకోగలను. ఓవరాక్టింగ్.. యాక్టింగ్ చేస్తున్నట్లేగా అయినా నా లైఫ్‌స్టైల్ వేరేలా ఉంటుంది. ముందు నాకు సౌకర్యంగా ఉందా? లేదా? అనేది చూస్తాను. ఆ తర్వాతే మిగతావాటి గురించి ఆలోచిస్తాను. కొన్నిసార్లయితే కేవలం డబ్బు కోసమే పిచ్చి సినిమాలన్నీ చేశాను. సినిమాలో ఎందుకంత ఓవరాక్టింగ్ చేస్తావని కొందరు అంటుంటారు. వారికి నేను చెప్పే సమాధానం.. నేను నిజంగా ఓవరాక్టింగ్ చేస్తున్నానంటే నాకు నటించడం వచ్చినట్లే కదా! కమర్షియల్ సినిమాలపై ద్వేషం లాంటిదేమీ లేదు. ఆ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. వారి కోసం మేకర్స్ ఎంతో కష్టపడి సినిమాలు తీస్తున్నారు. వారు నన్ను విలన్‌గానే సెలక్ట్ చేసుకుంటున్నారు. పైసా తీసుకోకుండా ఫ్రీ సినిమాలు కొన్నిసార్లు.. ఈ చెత్త సినిమాలు చేయడం అవసరమా? అని నాది నాకే అనిపిస్తుంది. కానీ డబ్బు కావాలంటే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోక తప్పదు కదా! మరికొన్నిసార్లు పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తుంటాను. అప్పుడు ఎందుకిలా ఉచితంగా సినిమాల్లో నటిస్తున్నావని అడుగుతుంటారు. కానీ అలాంటి సినిమాల్లో నటించినప్పుడు, దానికి వచ్చిన రెస్పాన్స్ చూసినప్పుడు పొందిన ఆనందం డబ్బుతో కొలవలేనిది. ఇది నా లైఫ్.. నాకు నచ్చినట్లుగా బతుకుతున్నాను' అని చెప్పుకొచ్చాడు. ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం గుంటూరు కారం, దేవర, పుష్ప 2:ద రూల్ సినిమాలు చేస్తున్నాడు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి.. అశ్వినిని పెళ్లి చేసుకుంటానన్న యావర్ -
రూ. 100 కోట్ల కేసులో ప్రకాష్ రాజ్‌కు ఊరట.. ఆ స్కామ్‌లో క్లీన్ చిట్
అక్రమ నగదు బదిలీ కేసులో చిక్కుకున్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఊరట లభించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన జ్యువెలరీ గ్రూపుపై రూ.100 కోట్ల పోంజీ, మోసం కేసులో ప్రకాష్ రాజ్ పేరు వినిపించింది. దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసి ఆయన్ను విచారించింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆయనకు క్లీన్ చిట్ లభించింది. నివేదికల ప్రకారం, మనీలాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్ ప్రమేయం లేదని తేలింది. ఆయన ఆ సంస్థకు కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని తెలిపింది. దీని గురించి ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రకాష్ రాజ్, "తమిళం అర్థం కాని వారి కోసం. తమిళనాడులోని ప్రణవ్ జ్యువెలర్స్ మోసంతో నటుడు ప్రకాష్ రాజ్‌కు ఎటువంటి సంబంధం లేదని అధికారిక ప్రకటన వెలువడింది. నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి ఎందరో ఆదరించారు. సత్యమేవ జయతే." తిరుచిరాపల్లికి చెందిన భాగస్వామ్య సంస్థ ప్రణవ్ జ్యువెలర్స్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నవంబర్ 20న ఈడీ అధికారులు దాడులు నిర్వహించి రూ.23.70 లక్షల నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నటుడు ప్రకాష్ రాజ్ ఈ జ్యువెలర్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఈ విధంగా, ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని ఈడీ కోరింది. కొన్ని ఉద్దేశపూర్వక చెల్లింపులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆయన్ను ప్రశ్నించాలని కోరుతూ ED గత నెలలో అతనికి సమన్లు జారీ చేసింది. కేసు నేపథ్యం: ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న జ్యువెలర్స్ కంపెనీపై తమిళనాడు ఆర్థిక నేరాల విభాగం పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. పోలీసుల ఫిర్యాదు మేరకు ప్రణవ్ జ్యువెలర్స్, ఇతరులు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో అధిక లాభాలు వస్తాయని ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేశారని ఈడీ తెలిపింది. అయితే, ప్రణవ్ జ్యువెలర్స్ తమ డబ్బును పెట్టుబడిదారులకు తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. జ్యువెలర్స్ ఆర్గనైజేషన్, ఇతర అనుబంధ వ్యక్తులు ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించడం ద్వారా మోసం చేశారు. విచారణలో, బ్యాంక్ చెల్లింపులు, నకిలీ ఎంట్రీలకు బదులుగా రూ.100 కోట్లకు పైగా ఇచ్చినట్లు అంగీకరించింది. 23.70 లక్షలు వివరించలేని రూ. నగదు, 11.60 కిలోల బంగారు కడ్డీలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. For those who don’t understand Tamil BREAKING NEWS:-Official announcement of the Investigation team. Actor prakash raj is not involved in any ponzi scam of tamilnadu s Pranav jewellers.. 🙏🏿🙏🏿🙏🏿 I thank everyone who trusted me and stood by me .. #SathyamevaJayathe #justasking pic.twitter.com/AZ6hLM8wjI — Prakash Raj (@prakashraaj) December 15, 2023 -
కేసీఆర్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన నటుడు ప్రకాష్ రాజ్
-
ప్రకాశ్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ!
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్ మనీలాండరింగ్ కేసులో ఈడీ నోటీసులిచ్చింది. ప్రస్తుతం ఆయన ప్రణవ్ జువెలర్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ నుంచి అందుకున్న చెల్లింపుల వివరాలను సమర్పించాలంటూ ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దాదాపు రూ.100 కోట్ల స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చెన్నైలో విచారణకు హాజరు కావాలని సూచించింది. కాగా.. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నందునే విచారణకు పిలిచింది. కాగా.. గత కొంతకాలంగా బీజేపీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈడీ దాడులు.. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ కంపెనీపై నవంబర్ 20న ఈడీ దాడులు చేసింది. ఆ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు సేకరించిందని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!
-
మళ్లీ వార్తల్లో నిలిచిన మా ఎన్నికలు.. మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ కామెంట్లు
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఇండస్ట్రీలో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు పదవీ కాలం రెండేళ్లు పూర్తి కావస్తోంది. కొన్ని నెలల్లో మళ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పని తీరుపై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సుమారు రెండేళ్ల క్రితం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి కోసం మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ మధ్య హోరా హోరీగా పోటీ కొనసాగింది. ఈ బిగ్‌ఫైట్‌లో మంచు విష్ణు భారీ విజయంతో మా అధ్యక్షుడి పీఠాన్ని అదరోహించారు. ఆ తర్వాత ఆయన సినీ కార్మికులతో పాటు సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తున్న వారికి మా సభ్యత్వంతో పాటు పలు సహాయసహకారాలు అందించారు. కానీ ఆ ఎన్నికల్లో అందరి ఎజెండాలో మా బిల్డింగ్ నిర్మాణం ప్రధానంగా ఉంది. త్వరలో దానిని నిర్మాస్తామని మంచు విష్ణు గతంలో ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికి కూడా మా బిల్డింగ్ నిర్మాణం జరగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు గురించి ప్రకాశ్ రాజ్ ఇలా చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్‌పై పాక్ క్రికెటర్ బలుపు మాటలు.. రజాక్,అఫ్రిది,అక్తర్ క్షమాపణలు) 'మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవీ కాలం రెండేళ్లు పూర్తి కావస్తోంది. కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదు. అలాగే మా కి సొంత భవనం కూడా లేదు. మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదు సున్నా.' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మా అధ్యుక్షుడిగా మంచు విష్ణుని ఎన్నుకున్న సభ్యులు అందరూ ఇప్పుడు ఆలోచించాలంటూ ప్రకాశ్ రాజ్ చెప్పారు. అతను ఈ రెండేళ్లలో ఏమి చేశాడో చెప్పాలని కోరాడు. బోగస్ ఓట్లతో పాటు బయట నుంచి విమానాల్లో పిలిపించుకోవడం, వంటి కార్యక్రమాలు చేయడంతో విష్ణు గెలిచాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో..? చెయ్యనో..? తెలియదని చెప్పిన ప్రకాశ్ రాజ్.. ఇక నుంచి తన దృష్టి జాతీయ అంశాలపై ఉందని పేర్కొన్నారు. కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల తాను మా అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. -
అల్లు అర్జున్‌పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన వంటి చిత్రాలు టాలీవుడ్ ఖ్యాతిని జాతీయస్థాయిలో అవార్డులను పొందాయి. ఈ ఘనతను పురస్కరించుకుని మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాదులో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. టాలీవుడ్లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడం.. తెలుగువారందరూ గర్వించాల్సిన విషయం. కానీ.. ఇలాంటి సందర్భంలో చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి రావడం లేదు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ లాంటి వారిని సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావడం లేదు? బన్నీకి జాతీయ అవార్డు వస్తే, అది సినీ పరిశ్రమలోని నటీనటులందరికీ గర్వకారణం. రాజమౌళి మన తెలుగు సినిమాని ఆస్కార్‌కు తీసుకువెళితే అది తెలుగు పరిశ్రమకు, తెలుగు వారందరికీ గర్వకారణం అని ప్రకాష్ రాజ్ అన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డు రావడం తెలుగు సినిమా గర్వకారణం. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు ఎందుకంటే అల్లు అర్జున్ కష్టం అలాంటిది. తను మొదటి సినిమా చేస్తున్నప్పుడు అల్లు అరవింద్‌గారు బన్నీని ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లమంటే.. నేను ఇతర సినిమా షూటింగ్స్‌లో ఉన్నపుడు అల్లు అర్జున్ వచ్చి ట్రైపాయిడ్ కెమెరా దగ్గర కింద కూర్చుని నన్ను చూస్తున్న క్షణాలు నాకు గుర్తున్నాయి. తరువాత మేము గంగోత్రి చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలో నేను తన నటన చూసి అల్లు అరవింద్‌తో 'దిస్ బోయ్ విల్ గ్రో' అన్నాను. నేను బన్నీలో ఉన్న ఆకలి చూశాను. బన్నీ ఈ రోజు ఉన్న చాలా మంది యువతకి ఒక ఉదాహరణగా నిలిచాడు. నువ్వు ఇప్పుడెలా ఉన్నావనేది కాదు.. నీలో సంకల్పం ఉంటే.. నీ కళ్ల ముందు కళలుంటే.. నువ్వు ధైర్యంగా కష్టపడితే ఈ రోజు బన్నీకి జాతీయ అవార్డు వచ్చింది. బన్నీకి జాతీయ అవార్డు వస్తే నా బిడ్డకి వచ్చినట్టు భావిసున్నా. నాకు మొదటిసారి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో తెలుగు సినిమా అంటే అక్కడివారు తక్కువగా చూసేవారు. కానీ ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు తెలువారికి రావడం చాలా గర్వంగా ఉంది. మనకి అవార్డు వస్తేనే కాదు మనవాళ్లకి వస్తే కూడా మనకి వచ్చినట్టు. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు కానీ ఇదెందుకు మన సినీ పెద్దలకి రావట్లేదు? మన సినిమాతో బౌండరీస్ దాటేస్తున్న సమయంలో అవతలి వాళ్లకంటే మన వాళ్లని మనం గౌరవించకపోతే ఎలా..? అంటూ ప్రకాష్ రాజ్ సినీ పెద్దలను ప్రశ్నించారు. -
క్షమించమని సిద్ధార్థ్‌ను కోరిన శివరాజ్ కుమార్
కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం నడుస్తోంది. కర్ణాటకలో ప్రతిచోటా పోరు కొనసాగుతోంది. కావేరి కోసం శాండల్‌వుడ్ తారలు కూడా తమ గళాన్ని పెంచారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇప్పటికే కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో తమిళ హీరో సిద్ధార్ధ్‌కు నిరసన సెగ తగలింది. తను నటించిన 'చిన్నా' చిత్రం విడుదల సందర్భంగా బెంగళూరులో ప్రమోషన్ కార్యక్రమం చేపట్టాడు. దీనిని పలువురు కన్నడ అనుకూల వ్యక్తులు అడ్డుకున్నారు. అక్కడి మీడియా సమావేశం నుంచి సిద్ధార్థ్‌ను బయటకు పంపించేశారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్ ) వారు చేసిన ఈ పనిని చాలామంది తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ చర్య సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. తాజాగా సిద్దార్థ్‌కు జరిగిన అవమానంపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఇలా ప్రస్తావించారు. 'నిన్న జరిగిన ఈ ఘటన నిజంగా బాధాకరం.. మా ఇండస్ట్రీ తరపున సిద్ధార్థ్‌కి క్షమాపణలు చెబుతున్నా.. సిద్ధార్థ్ క్షమించండి.. చాలా బాధపడ్డాం.. ఈ తప్పు ఇంకెప్పుడూ జరగదు' అంటూ నటుడు సిద్ధార్థ్‌కి శివన్న సారీ చెప్పాడు. అలాగే కన్నడ ప్రజలు చాలా మంచివారు.అన్ని భాషలను ఇష్టపడతారు. కర్ణాటకకు చెందిన వారు మాత్రమే అన్ని భాషల సినిమాలను చూస్తారు.ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలం. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అని ఆయన అన్నారు. చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ప్రకాశ్ రాజ్ ఇదే వివాదంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. 'దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాకుండా.. సామాన్యులను, కళాకారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా చేయడం అసలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటకకు చెందిన మనిషిగా ఇక్కడి ప్రజలందరి తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నాను.' అని సోషల్ మీడియా ద్వార ప్రకాశ్ రాజ్ తెలిపారు. దీనికి రెండు చేతులు జోడించి ఉన్న ఎమోజీలను పెట్టారు. Instead of questioning all the political parties and its leaders for failing to solve this decades old issue.. instead of questioning the useless parliamentarians who are not pressurising the centre to intervene.. Troubling the common man and Artists like this can not be… https://t.co/O2E2EW6Pd0 — Prakash Raj (@prakashraaj) September 28, 2023 -
నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదు..
బెంగళూరు: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కర్ణాటకాలోని బాగాల్కోట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రయాన్ 3పై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. చంద్రయాన్ 3 పంపిన ఫొటోపై ప్రకాశ్‌రాజ్ అనుచితంగా ప్రవర్తించారు. బనహట్టి పోలీసు స్టేషన్లో హిందూ సంస్థ నాయకుడు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్‌రాజ్‌పై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశాడు. చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు నటుడు ప్రకాశ్ రాజ్. చంద్రయాన్ 3 ఇప్పుడే పంపిన ఫొటో అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విమర్శల అనంతరం కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు నటుడు ప్రకాశ్ రాజ్. తాను ఎవరినీ ఉద్దేశించి ఆ పోస్టు చేయలేదని అన్నాడు. ద్వేషించే వాళ్లకి ద్వేషమే కనిపిస్తుందని సమర్థించుకున్నాడు. అది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ అని పేర్కొన్నాడు. మీరు ఏ చాయ్ వాలా గురించి అనుకుంటున్నారో..?అంటూ వ్యంగ్యంగా రిప్లే ఇచ్చాడు. ఇదీ చదవండి: ప్రధాని మోదీకి పాక్ సోదరి రాఖీ.. గత 30 ఏళ్లుగా.. -
మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో?
న్యూఢిల్లీ: భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3పై అనుచిత వ్యాఖ్యలు చేసి నవ్వులపాలైన సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అయినా కూడా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోలేదు సరికదా దానిని సమర్ధించుకున్నాడు. ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3 పై చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. జులై 14న భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ చంద్రుడిపై కాలు మోపడానికి సిద్ధంగా ఉన్న చంద్రయాన్-3 పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్)లో టీ వడపోస్తున్న ఒక వ్యక్తి ఫోటో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నెటిజన్లు ప్రకాష్ రాజ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకోకపోగా తాను పోస్ట్ చేసిన దానిని సమర్ధించుకున్నాడు. ద్వేషించే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుంది.. అది ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్.. అది అర్ధం చేసుకోకుండా ఎవరికి వారు విమర్శిస్తే ఎట్లా? నేను కేరళ చాయ్‌వాలాని ఉద్దేశించి పోస్ట్ చేశాను.. మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో..? అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. చంద్రయాన్-3 పార్టీలకతీతంగా ప్రతి భారతీయుడు గర్వించాల్సిన ప్రయోగమని.. ఎవ్వరైనా ఆ వ్యత్యాసాన్ని గ్రహించి ప్రవర్తించాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఇది కూడా చదవండి: నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా -
ప్రకాశ్‌రాజ్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
న్యూఢిల్లీ: సినీ నటుడు ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3 పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్(ఒకప్పుడు ట్విటర్) వేదికగా చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నుండి పంపిన మొట్టమొదటి ఫోటో అని రాసి ఒకతను తీ వడపోస్తున్న ఫోటోను ట్వీట్ చేసాడు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార బీజేపీ పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేయడంలో అప్డేటెడ్ గా ఉండే ప్రకాష్ రాజ్ ఈసారి మాత్రం తాను చేసిన విమర్శకు ప్రతిగా తాను విమర్శల పాలయ్యాడు. జూలై 14న భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టనున్న నేపథ్యంలో యావత్ భారతదేశం ఆ అద్భుత క్షణం కోసం ఎదురుచూస్తోంటే ప్రకాష్ రాజ్ మాత్రం ఈ విజయవంతమైన ప్రయోగాన్ని అభినందించకపోగా సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశాడు. ఒక వ్యక్తి టీ వడపోస్తున్న ఫోటో పోస్ట్ చేసి చంద్రయాన్ నుంచి విక్రమ్ ల్యాండర్ పంపించిన ఫోటో.. వావ్.. అంటూ పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అదే స్థాయిలో ప్రకాష్ రాజ్‌పై విమర్శలు కురిపించారు. తప్పు చేస్తే తప్పని చెప్పడంలో తప్పులేదు కానీ.. ఏది పెడితే దాన్ని విమర్శించే ప్రయత్నం చేయకూడదని హితవు పలికారు. BREAKING NEWS:- First picture coming from the Moon by #VikramLander Wowww #justasking pic.twitter.com/RNy7zmSp3G — Prakash Raj (@prakashraaj) August 20, 2023 ఇది కూడా చదవండి: నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా -
జోకర్ నాయకుడైతే చూసేది సర్కస్ మాత్రమే.. ప్రకాష్ రాజ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభ శనివారం జరిగింది. ఈ సభను సినీనటుడు, రచయిత,సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సమూహ లోగోను ఆవిష్కరించారు. ‘లౌకిక ప్రజాస్వామిక విలువలకోసం రచయితలు అందరూ సంఘటితమైనదే సమూహా. ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచయితలు అందరి ఉమ్మడి స్వరమే సమూహ. సహనశిలతను పాటిస్తూ మతోన్మాదాన్ని ధిక్కరించే సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తల ఉమ్మడి వేదిక సమూహా’. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘కేవలం ప్రతిభ ఉంటేనే రచయిత, కవి, కళాకారుడు కాలేరు. సమాజ పరిస్థితులపై స్పందించగలిగితేనే రాణించగలుగుతారు. శరీరానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గుతాయి.. కానీ దేశానికి తగిలిన గాయాలు మౌనంగా ఉంటే తగ్గలేవు. ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సమాజంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఊరికే కూర్చోలేను. 100 రోజుల నుండి మణిపూర్ రగిలిపోతుంటే పార్లమెంట్లో నువ్వా నేనా అన్నటు నడిచారు. రాజకీయం తప్ప సమస్య మీద స్పందన లేదు. 10 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయం తప్ప ప్రజల సమస్యలపై చర్చించలేదు. జోకర్ని నాయకుడు చేస్తే మనం చూసేది సర్కస్ మాత్రమే. మనలో ఐక్యత లేదు. మొదట మనలో మార్పు రావాలి. 70ఏళ్ల తర్వాత మనం రియలైజ్ అయ్యాం.. ఎక్కడ తప్పు జరిగిందని చూసుకోవాలి. మొదటిసారి ఇలాంటి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం బాధగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: గులాబీలో సీటు హీటు.. కేటీఆర్, కవిత మధ్య పొలిటికల్ పోరు! -
సినీ తారలకు ట్విటర్ షాక్.. చిరంజీవితో సహా బ్లూటిక్ తొలగింపు!
సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎక్కువగా అప్డేట్స్ ఇస్తుంటారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ సందడి చేస్తుంటారు. అయితే వారి అఫీషియల్ అకౌంట్స్‌కు బ్లూ టిక్ సింబల్ ఉంటుంది. అయితే తాజాగా ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ సెలబ్రీటీలకు షాకిచ్చారు. సబ్స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించిని వారి బ్లూ టిక్స్‌ను తొలగించారు. ఇలా బ్లూ టిక్ తొలగించిన వారిలో టాలీవుడ్ ప్రముఖులు ఉండడం విశేషం.. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ చందా చెల్లించని యూజర్ల అకౌంట్లకు వెరిఫైడ్ బ్లూ టిక్‌లు తొలగిస్తోంది. ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ ఇప్పటికే ప్రకటించిన విధంగా నెలవారీ లేదంటే ఏడాది చందా చెల్లించని యూజర్ల అకౌంట్లకు ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్‌లు ఎగిరిపోయాయి. అయితే, ఇలా బ్లూ టిక్‌లు కోల్పోయిన వారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఉండడం విశేషం. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,వెంకటేష్, అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని, నితిన్, ప్రకాశ్ రాజ్, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు తమ బ్లూ టిక్‌ను కోల్పోయారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణు బ్లూ టిక్‌లు అలాగే ఉన్నాయి. అయితే వీరంతా ట్విట్టర్ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఉంటారని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ విషయాకొనిస్తే.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా సైతం తమ బ్లూ టిక్‌ను కోల్పోయారు. సౌత్‌లో ముఖ్యంగా తమిళ స్టార్ రజినీకాంత్, విజయ్, శింబు లాంటి పెద్ద హీరోలకు సైతం బ్లూ టిక్ లేకుండా పోయింది. Bye bye #BlueTick …. It was nice having you….my journey ..my conversations..my sharing…will continue with my people … you take care #justasking — Prakash Raj (@prakashraaj) April 20, 2023 బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సిందే: ఎలన్ మస్క్ ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లకు వెరిఫైడ్ బ్లూ టిక్‌లు కావాలనుకుంటే వెబ్ కోసం అయితే నెలకు రూ.650, యాప్ కోసమైతే నెలకు రూ.900 చెల్లించాలి. ఏడాదికైతే రూ.6500 డిస్కౌంట్ ఆఫర్‌ను ట్విట్టర్ అందిస్తోంది. దీనికి ఈ ఏడాది ఏప్రిల్ 20 చివరి తేదీగా ప్రకటించింది. ఈ లోపల బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోనివారు బ్లూటిక్ కోల్పోతారని ప్రకటించారు. ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ చెప్పినట్లుగానే సెలబ్రిటీలు తమ ట్విట్టర్ బ్లూ టిక్‌లను కోల్పోతున్నారు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రంగమార్తాండ, ఎక్కడంటే?
కొన్ని సినిమాలు బాగుంటాయి. కలెక్షన్లు, బాక్సాఫీస్ రికార్డులకు అతీతంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాయి. వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రంగమార్తాండ. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై మధు, వెంకట్ రెడ్డి నిర్మించారు. మరాఠీలో సూపర్ హిట్‌గా నిలిచిన నటసామ్రాట్‌కు ఇది తెలుగు రీమేక్‌గా తెరకెక్కింది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 22న థియేటర్లలో విడుదలైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ సడన్‌గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఓటీటీలో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ప్రసారమవుతోంది. కథ విషయానికి వస్తే.. రాఘవరావు(ప్రకాశ్ రాజ్) ఓ రంగస్థల కళాకారుడు. ఆయన ప్రతిభకు మెచ్చి అభిమానులు రంగమార్తాండ బిరుదు ప్రదానం చేస్తారు. అయితే ఆ సత్కార సభలోనే రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిస్తాడు. తన ఆస్తులను కూడా పిల్లలకు పంచేస్తాడు. కొడుకు, కోడలికి ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, కూతురికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న సొమ్మును అప్పగిస్తాడు. ప్రేమించినవాడితో పెళ్లి కూడా చేస్తాడు. అన్ని బాధ్యతలు తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. మరి ఆయన శేష జీవితం ఆనందంగా సాగిందా? రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరొందిన వ్యక్తి జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు? అతడి నిజజీవితం ఎలా ముగిసిందనేది మిగతా కథ. story of an extraordinary theatre artist and the unexpected changes in his life when he decides to retire ✨#RangaMaarthaandaOnPrime, watch now https://t.co/woDFJ0AJwD pic.twitter.com/0vQgtKa4NB — prime video IN (@PrimeVideoIN) April 7, 2023 -
‘సినిమావాళ్లు వస్తుంటారు.. పోతుంటారు’
బెంగళూరు: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. బీజేపీకి మద్దతు ప్రకటించడం అక్కడి సీనీ, రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ ఈ పరిణామంపై స్పందించింది. రాజకీయాలు, సినిమాలు వేరని, అవి ఒకదానిపై మరొకటి ప్రభావం చూపెట్టబోవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చెబుతున్నారు. సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం.. ఎన్నికల్లో ఏమేర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని గురువారం మీడియా నుంచి శివకుమార్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నేను భావిస్తున్నా. ఎంతో మంది సినిమావాళ్లు వచ్చారు, వెళ్లారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. అవి ఎలాంటి పరిణామాలు చూపించబోవు. సినిమా వాళ్ల సపోర్ట్‌తో గెలుస్తుందనుకోవడం బీజేపీ భ్రమ’’ అని శివకుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే.. నటుడు సుదీప్ బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించారు. తాను బీజేపీలో చేరబోనని, ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, కేవలం బొమ్మైకి మద్దతు ఇచ్చేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. డబ్బు కోసమో మరే అవసరం కోసమో ఇక్కడికి రాలేదు. కేవలం.. ఒకేఒక వ్యక్తి కోసం వచ్చా. సీఎం మామ(బొమ్మైని ఉద్దేశించి..)తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. కేవలం ఆయనకు మద్దతు తెలిపేందుకే వచ్చా. ఆయన చెప్పిన అభ్యర్థిని నేను ప్రచారం చేస్తా. అంతేగానీ నేను రాజకీయాల్లోకి రాను. సినిమాలు తీయడమే నా అభిమానులకు ఇష్టం అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీప్‌ను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆయన నివాసంలో కలిశారు. దీంతో సుదీప్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అది రాజకీయ భేటీ కాదని, కేవలం వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు ఆ సమయంలో వెల్లడించారు. అంతకు ముందు సిద్ధరామయ్యతో, జేడీఎస్ కుమారస్వామిని సైతం సుదీప్ పలుమార్లు కలిశారు. మరోవైపు బీజేపీకి సుదీప్ మద్దతు ఇచ్చే అంశాన్ని కన్నడ పార్టీలు, పలువురు సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. తొలుత అది ఉత్త ప్రచారమై ఉంటుందన్న నటుడు ప్రకాష్ రాజ్.. సుదీప్ చేరికపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపై ట్విటర్లో.. ‘‘డియర్ సుదీప్ గారూ.. అందరూ ఇష్టపడే ఆర్టిస్ట్ గా... మీరు ప్రజల గొంతుక అవుతారని అనుకున్నాను. కానీ మీరు రాజకీయ పార్టీతో మిమ్మల్ని మీరు రంగులు మార్చుకోవాలని ఎంచుకున్నారు. సరే.. ప్రతి పౌరుడు ఇకపై మిమ్మల్ని, మీ పార్టీని ప్రశ్నిస్తుంటాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేశారు. Dear Sudeep.. as an artist loved by everyone one.. I had expected you to be a voice of the people. But you have chosen to colour yourself with a political party .. WELL .. Get ready to answer ..every question a citizen will ask YOU and YOUR party .@KicchaSudeep #justasking — Prakash Raj (@prakashraaj) April 6, 2023 The weight you have to carry now .. ನೀವು ಈಗ ಹೊರಲೇಬೇಕಾದ ಬೇರೆ ಬಣ್ಣದ ಲೊಕದ ಭಾರ .. #justasking https://t.co/ygF75aEaJu — Prakash Raj (@prakashraaj) April 6, 2023 ఇక జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. బొమ్మైని గౌరవించడం వల్లే ఆయన తరపున ప్రచారం చేసేందుకు సుదీప్ అంగీకరించారు. అభివృద్ధి విషయంలో బీజేపీ విఫలమైంది. ఎన్నికల్లో గెలవడానికి సినిమా నటులను వాడుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. అది వర్కవుట్ కాదు. సినిమా నటులను చూసేందుకు జనం వస్తుంటారు. సెలబ్రిటీలు అన్ని పార్టీలకు ప్రచారం చేస్తారు. అలాగే.. వాళ్లు ఏ పార్టీకి పరిమితం కాదు అని కుమారస్వామి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో సుదీప్‌కు మాస్ ఫాలోయింగ్ ఉంది. నాయక సామాజిక వర్గానికి చెందిన 51 ఏళ్ల సుదీప్ మద్దతుద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ ఆశిస్తోంది. కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజిక వర్గం.. కళ్యాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. ఆ వర్గం ఓటు బ్యాంకుతో పాటు సుదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ రెండో జాబితా విడుదల బనశంకరి: కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరో 42 మంది అభ్యర్థులతో గురువారం రెండో జాబితా విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ సీటుతోపాటు మరో చోటు నుంచి పోటీకి దిగుతారని భావిస్తున్న కోలారు స్థానం ఇందులో లేవు! ముగ్గురు సిట్టింగ్‌లకు టికెట్లు దక్కలేదు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురికీ చోటు దక్కింది. 124 మందితో కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం తెలిసిందే. -
దిగ్భ్రాంతికి లోనయ్యా.. బాధగా ఉంది: ప్రకాష్ రాజ్
బెంగళూరు: సినీ నటుడు, రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రకాష్ రాజ్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోటి నటుడు, కన్నడ స్టార్‌గా పేరున్న సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై ప్రకాష్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిచ్చా సుదీప్ ప్రకటనతో దిగ్భ్రాంతికి గురయ్యా. ఎంతో బాధించింది అని ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నారాయన. అంతకు ముందు కిచ్చా సుదీప్ బీజేపీలో చేరతారంటూ వచ్చిన కథనాలను ప్రకాష్ రాజ్ ఖండించారు. అది తప్పుడు వార్త అయ్యి ఉంటుందని బలంగా నమ్ముతున్నా. బీజేపీ ఓటమి భయంతోనే అలాంటి ప్రచారానికి దిగింది. అలాంటి ఉచ్చులో పడడానికి సుదీప్ అమాయకుడేం కాదంటూ ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ, ఆ అంచనాని తలకిందులు చేస్తూ బుధవారం బీజేపీకి మద్దతు ప్రకటించారు సుదీప్. తాను రాజకీయాల్లో చేరబోనంటూనే.. రాబోయే ఎన్నికల్లో కేవలం బీజేపీ తరపున ప్రచారం చేస్తానని సుదీప్ చెప్పారు. సీఎం బసవరాజ్ బొమ్మై తనకు గాడ్‌ఫాదర్ లాంటి వాడని, ఆయన ఏ పార్టీలో ఉన్నా తాను ప్రచారం చేసేవాడినంటూ సుదీప్ నిన్న ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. -
ఆ సినిమాలో చేస్తే అవకాశాలు రావన్నారు: శివాత్మిక రాజశేఖర్
జీవిత రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి శివాత్మిక. 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక. ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రంగమార్తాండ'లో శివాత్మిక చేసిన పాత్రతో మరింత ఫేమ్ వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చూసిన సినీ ప్రేక్షకులు శివాత్మిక పాత్రను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించింది. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారామె. శివాత్మిక మాట్లాడుతూ.. ‘రంగమార్తాండలో నాది మెయిన్ రోల్ కాదు. అందుకే సినిమాకు అంగీకరించినప్పుడే నాకు చాలా మంది వద్దని చెప్పారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చెయ్యొద్దని సలహా ఇచ్చారు. అలాంటి సినిమాలు ఎవరూ చూడరని చెప్పారు. చాలా భయపడతారు. కానీ ఇప్పుడు ఆ సినిమానే మంచి హిట్ అయి పేరు తీసుకొచ్చింది. కానీ దొరసాని సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నా. ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నా. కానీ ఆ తరువాత గ్యాప్ వచ్చింది. దీంతో నేను అనుకున్నంత ఈజీ కాదన్న విషయం అప్పుడర్థమైంది.' అంటూ చెప్పుకొచ్చింది. -
ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ ట్వీట్.. దుమారం
బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంతో.. ఆయన చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. నీరవ్ మోదీ లలిత్‌మోదీ మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఉంచి.. తన ట్విటర్ వాల్‌పై పోస్ట్ చేశారాయన.జనరల్ నాలెడ్జ్.. ఈ ముగ్గురిలో కామన్ ఏంటి? జస్ట్ ఆస్కింగ్ #Justasking అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీకి మద్దతుగానే ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. దీంతో బీజేపీ శ్రేణులు, మోదీ అభిమానులు ఈ ట్వీట్‌పై మండిపడుతున్నారు. General Knowledge:- What is common here #justasking pic.twitter.com/HlNCjJejwk — Prakash Raj (@prakashraaj) March 25, 2023 గతంలోనూ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రకాష్ రాజ్ పలు ట్వీట్లు చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మోదీ అనే ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలతోనే రాహుల్ గాంధీపై 2019లో పరువు నష్టం దావా నమోదు కావడం, తాజాగా ఆయనకు గుజరాత్ సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం.. ఆ వెంటనే ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడం.. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చెలరేగడం తెలిసిందే. -
ఆయన నటనలోని మ్యాజిక్‌ని చూశా: ప్రకాశ్‌రాజ్
ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వంలో కాలిపు మధు, ఎస్. వెంకట్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘‘మరాఠీ ‘నటసామ్రాట్’ సినిమా చూశాక ఒక కళాకారుడి జీవితంలో ఉన్న బరువు నాకు అర్థం అయింది. ఇలాంటి కథను నేను చూపించాలని అనుకున్నాను. ‘నటసామ్రాట్’ గురించి కృష్ణవంశీకి చెప్పగానే బాగుందన్నాడు. ఎమోషన్స్ చక్కగా ప్రెజెంట్ చేయగలడని తనని ఈ సినిమా రీమేక్ ‘రంగ మార్తాండ’కు దర్శకత్వం వహించమని కోరాను. బ్రహ్మానందంగారితో కలిసి వర్క్ చేయడం వల్ల ఆయన నటనలోని మ్యాజిక్‌ను చూసే అవకాశం దొరికింది’’ అన్నారు. ‘‘ప్రకాశ్‌రాజ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న అద్భుత నటులు బ్రహ్మానందం ఈ సినిమా కోసం కొత్త ఆర్టిస్టులా నటించారు’’ అన్నారు కృష్ణవంశీ. ‘ఈ చిత్రం క్లయిమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్ నట విశ్వరూపం చూస్తారు. ప్రతి సీన్‌ని కృష్ణవంశీ చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు బ్రహ్మానందం. -
Rangamarthanda Review: ‘రంగమార్తాండ’ రివ్యూ
టైటిల్: రంగమార్తాండ నటీనటులు: ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నిర్మాతలు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి దర్శకత్వం : కృష్ణవంశీ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: రాజ్ కె.నల్లి విడుదల తేది: మార్చి 22, 2023 క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘నక్షత్రం’(2017) బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ..ఇప్పుడు ‘రంగమార్తాండ’తో వచ్చాడు. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్‌లో భాగంగా సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలతో పాటు మీడియాకు కూడా పలుమార్లు ప్రిమియర్స్ వేడయంతో ‘రంగమార్తాండ’కు బజ్ ఏర్పడింది. భారీ అంచనాల ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ‘రంగమార్తాండ’ కృష్ణవంశీకి కమ్‌బ్యాక్ చిత్రమైయిందా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రాఘవరావు(ప్రకాశ్ రాజ్) ఓ రంగస్థల కళాకారుడు. తన నటనతో ప్రేక్షకుల అభిమానంతో పాటు ఎన్నో కీర్తిప్రతిష్టతలను సాధిస్తాడు. ఆయన ప్రతిభకు మెచ్చి ‘రంగమార్తాండ’బిరుదుని ప్రదానం చేస్తారు అభిమానులు. అయితే ఆ సత్కార సభలోనే తన రిటైర్మెంట్ని ప్రకటించి అందరికి షాకిస్తాడు. అంతేకాదు తన ఆస్తులను పిల్లలకు పంచిస్తాడు. కొడుకు రంగారావు(ఆదర్శ్), కోడలు గీత(అనసూయ)లకు ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, అమ్మాయి శ్రీ(శివాత్మిక రాజశేఖర్)కి తాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న సొమ్ముని అప్పగిస్తాడు. ప్రేమించిన వ్యక్తి(రాహుల్ సిప్లిగంజ్)తో కూతురు పెళ్లి కూడా చేస్తాడు. ఇలా బాధ్యతలన్ని తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. మరి రాఘవరావు అనుకున్నట్లుగా శేష జీవితం ఆనందంగా సాగిందా? తను ఇష్టపడి కట్టుకున్న ఇంటి నుంచే ఆయన ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? పిల్లలే తన సర్వస్వం అనుకున్న రాఘవరావు దంపతులకు జీవితం ఎలాంటి పాఠం నేర్పించింది? భర్తే సర్వస్వం అనుకొని నమ్ముకున్న భార్యకు, చిన్నప్పటిని నుంచి కష్టసుఖాల్లో తోడుగా ఉన్న ప్రాణ స్నేహితుడు చక్రి(బ్రహ్మానందం)కు ఎలాంటి న్యాయం చేశాడు? రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరొందిన వ్యక్తి.. జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు ? చివరికి అతని నిజజీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మారాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేకే రంగమార్తాండ. ఇలాంటి కథను ముట్టుకోవడమే పెద్ద సాహసం. ఆ చిత్రంలో కథ, కథనం కంటే నటన చాలా బలంగా ఉంటుంది. నానా పటేకర్‌తో సహా ఆ సినిమాలో పనిచేసిన వాళ్లంతా కెరీర్ బెస్ట్ యాక్టింగ్‌లు ఇచ్చేశారు. అలాంటి కథను రీమేక్ చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. కానీ ఈ విషయంలో కృష్ణవంశీ వందశాతం విజయం సాధించాడు. ‘నటసామ్రాట్’ సోల్ మిస్ అవ్వకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేసి మెప్పించాడు. తెలుగు నాటకాలు..పద్యాలతో ప్రతి సన్నివేశాన్ని చాలా భావోద్వేకంగా రాసుకున్నాడు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా.. రాఘవరావు రంగస్థలం నాటకాలకు రిటైర్మెంట్ ప్రకటించి జీవితం అనే నాటకంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతి సీన్ చాలా ఎమోషనల్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం అయితే కంటతడి పెట్టిస్తుంది. భార్యను ముద్దగా ‘రాజుగారు’అని పిలుస్తూ సేవలు చేసే దృశ్యాలు హృదయాలను ఆకట్టుకుంటాయి. ’ఆనందం.. రెండు విషాదాల మధ్య విరామం’ అంటూ ఇంటర్వెల్ బోర్డు పడడంతో ప్రేక్షకులు బరువెక్కిన హృదయాలతో సీట్ల నుంచి లేస్తారు. ఇక సెకండాఫ్‌లో వచ్చే ప్రతి సన్నివేశం హృదయాలను హత్తుకుంటాయి. కూతురు దగ్గరకు వెళ్లిన రాఘవరావు దంపతులకు ఎదురైన అవమానాలు.. స్నేహితుడు చక్రి జీవితంలో చోటు చేసుకున్న విషాదాలతో సెకండాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. ఆస్పత్రిలో ఉన్న చక్రి ‘ముక్తిని ఇవ్వరా’ అంటూ స్నేహితుడిని వేడుకోవడం... ‘మన ఇంటికి మనం వెళ్లిపోదామయ్యా..’ అంటూ రాఘవరావు భార్య అడగడం.. ఇవన్ని గుండెని బరువెక్కిస్తాయి. క్లైమాక్స్ సీన్ చూసి భారమైన మనసుతో, బరువెక్కిన గుండెతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. భార్యభర్తల అనుబంధం, స్నేహబంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. ఎవరెలా చేశారంటే.. ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించగల గొప్ప నటుడు ఆయన. రంగమార్తండ రాఘవరావు పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఈ సినిమాకు బ్రహ్మానందం ఒక సర్ప్రైజింగ్ ప్యాకెజ్. చక్రి పాత్రలో ఆయన తన కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తర్వాత దర్శకనిర్మాతలు బ్రహ్మానందంను చూసే కోణం మారుతుంది. ఆ స్థాయిలో బ్రహ్మానందం నటన ఉంటుంది. ముఖ్యంగా ఆస్పత్రి సీన్లో ప్రకాశ్‌రాజ్‌ని బ్రహ్మానందం పూర్తిగా డామినేట్ చేశాడు. తెరపై ఓ కొత్త బ్రహ్మానందాన్ని చూస్తారు. ఇక రాఘవరావు భార్యగా రమ్యకృష్ణ నటన అద్భుతమని చెప్పాలి. శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ తదితరులు పాత్రల పరిధి మేర నటించారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. ఎలాంటి రణగొణ ధ్వనుల లేకుండా.. చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలకు కూడా సినిమాలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్రతి వారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో ‘రంగమార్తాండ’ కచ్చితంగా ఉంటుంది. ఈ కథ కొత్తదేం కాదు. అందరికి తెలిసిన కథే.. మనం నిత్యం చూస్తున్న అమ్మ నాన్నల జీవిత కథే. ఇంత గొప్పకథను అంతేగొప్పగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఈ తరం, రేపటి తరం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. -అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
‘రంగమార్తాండ’ చిత్రం ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
అప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: కృష్ణ వంశీ
‘‘రంగమార్తాండ’ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, ‘నేను మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటాను’ అని చెప్పడం విశేషం. ప్రతిఒక్కరూ తమ తల్లితండ్రులతో కలిసి ఈ సినిమాను చూడాలి’’ అని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ–‘‘రంగమార్తాండ’ సినిమాకి ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణల అద్భుతమైన నటన, ఇళయరాజాగారి సంగీతం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. రమ్యకృష్ణ కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని చెప్పినప్పుడు తను సరేనంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో రమ్యకృష్ణపై సన్నివేశాలు తీసేటప్పుడు చాలా బాధపడ్డాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది.. చిత్రీకరిస్తుంటే కంట్లో నుంచి నాకు నీళ్లు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ వంటి మంచి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్. -
'రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా'.. ఆసక్తిగా టీజర్
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఫుల్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేను ఒక నటుడిని అనే చిరంజీవి వాయిస్‌తో టీజర్ మొదలైంది. 'రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా' అనే బ్రహ్మనందం డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. 'నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పె డైలాగ్‌తో టీజర్ అదిరిపోయింది. ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం రంగమార్తాండుడి జీవన నాటకమని దర్శకుడు కృష్ణవంశీ పేర్కొన్నారు . ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించారు. -
మీరెప్పుడూ చూడని ప్రకాశ్‌రాజ్ ఫ్యామిలీ ఫోటోలు
-
SSMB 28 సెట్లో సందడి చేయనున్న శ్రీలీల! కొత్త షెడ్యూల్ అప్పుడే స్టార్ట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్లో ఈ మూవీ సెట్‌పైకి వచ్చింది. ఇటీవలె హైదరాబాద్ రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తదుపరి అప్డేట్ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. SSMB 28కు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ రేపటి(ఫిబ్రవరి 28) నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం త్రివిక్రమ్ ఓ భారీ సెట్ ప్లాన్ చేశాడట. చదవండి: టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్ హైదరాబాద్ శివారులోని ఓ ఇంట్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందట. ఈ షెడ్యూల్లో మహేశ్ బాబు హీరోయిన్ పూజా హెగ్డే, ప్రకాశ్ రాజ్‌తో పాటు యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా జాయిన్ కానుందట. ఇక్కడ హీరోహీరోయిన్ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. అంతేకాదు ప్రకాశ్ రాజ్-మహేశ్ మధ్య ఉండే సీన్స్‌ను చిత్రీకరించబోతున్నారట. ఈ షెడ్యూల్‌తో శ్రీలీల SSMB 28 సెట్లో తొలిసారి అడుగుపెట్టబోతుంది. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ కాగా ఇందులో పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ కాగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్గా నటిస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు మరో బాలీవుడ్ నటి ఇందులో సందడి చేయనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమి పడ్నేకర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర సెకండ్ హాఫ్‌లో చాలా కీలకంగా ఉంటుందట. అది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనువిందు చేయనుందని టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. -
కొందరి జీవితాలు అంతే.. ప్రకాశ్ రాజ్‌కు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్..!
ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదం ఇంకా ముగిసిపోలేదు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం మరింత రాజుకుంటోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌కు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. ది కశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అన్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో ది కాశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అంటూ ప్రకాశ్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. తన జీవితమంతా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాతానని ఆయన చెప్పారు. కొంతమంది అబద్ధాలతో తమ జీవితాన్ని వెల్లదీస్తున్నారని ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అనుపమ్ ఖేర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ' కొందరు మనుషులు తమ స్థాయిని తగ్గట్లు మాట్లాడతారు. కొంతమంది మాత్రం తమ జీవితమంతా అబద్ధం చెబుతారు. మరికొందరు నిజాలే మాట్లాడతారు. నా జీవితమంతా నిజం మాట్లాడిన వారిలో నేనూ ఒకడిని. అబద్ధాలు చెబుతూ జీవించాలనుకోవడం అది వారి కోరిక.' అంటూ ప్రకాశ్ రాజ్‌కు గట్టిగా కౌంటరిచ్చారు. కాగా.. గతేడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ 1990లలో కశ్మీరీ హిందువుల వలసలను ఈ చిత్రంలో చూపించారు.వివేక్ అగ్నిహౌత్రి దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించారు. ఈ చిత్రంలో అనుపమ్ ప్రధాన పాత్రలో పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. -
కశ్మీరీ ఫైల్స్ సినిమా.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలుపై దుమారం
-
ప్రకాశ్ రాజ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్
విలక్షణ నటడు ప్రకాశ్ రాజ్ ది కశ్మీర్ ఫైల్స్ మూవీ, ఆ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నహోత్రిపై చేసిన సంచలన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇటీవ కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘కశ్మీర్ ఫైల్స్ ఓ చెత్త సినిమా అని, ఆ సినిమాపై ఇంటర్నేషనల జ్యూరీ ఉమ్మివేసిందంటూ వివాదాస్పదంగా స్పందించాడు. దీంతో ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. దీంతో తాజాగా ఆయన కామెంట్స్ కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ స్పందించాడు. చదవండి: బాలుని చూడటానికి వెళ్లలేదు.. నన్ను రావద్దన్నారు: పి సుశీల ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్‌ను అంధకార్ రాజ్ అంటూ ప్రస్తావించాడు ఆయన. ఈ మేరకు వివేక్ అగ్ని హోత్రి ప్రకాశ్ రాజ్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఆయన ట్వీట్ చేస్తూ.. “జనాలు ఆదరించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ అర్బన్ నక్సల్స్‌కు నిద్రలేకుండా చేసింది. అలాంటిది వీక్షకులను మొరిగే కుక్కలు.. అని పిలుస్తూ సినిమా రిలీజైన ఏడాది తర్వాత కూడా ఇబ్బంది పెడుతున్నారు. మిస్టర్ ‘అంధకార్ రాజ’.. భాస్కర్ ఎప్పటికీ మీదే అయినప్పుడు నేనెలా పొందుతాను” అంటూ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. చదవండి: హీరో అవుదామని ఆశగా మద్రాస్ వెళితే హేళనగా మాట్లాడారు..మానసిక క్షోభకు గురయ్యా: మెగాస్టార్ ప్రస్తుతం వివేక్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఈవెంట్లో ప్రకాశ్ రాజ్ మాట్టాడుతూ.. పఠాన్ మూవీ ప్రశంసిస్తూ.. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. ది కశ్మీర్ ఫైల్స్ అనేది ఓ చెత్త సినిమా. దాన్ని సినిమా ఎవరు నిర్మించారో తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారిపై ఉమ్మివేసింది. అయినా కూడా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. A small, people’s film #TheKashmirFiles has given sleepless nights to #UrbanNaxals so much that one of their Pidi is troubled even after one year, calling its viewer’s barking dogs. And Mr. Andhkaar Raj, how can I get Bhaskar, she/he is all yours. Forever. pic.twitter.com/BbUMadCN8F — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 9, 2023 -
ఆ సినిమాపై ఉమ్మేసినా సిగ్గురాలేదు.. ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్
వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రకాశ్ రాజ్.. అప్పుడప్పుడు తన కాంట్రవర్సీ మాటలతో వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ పఠాన్‌ను ప్రశంసలతో మంచెత్తుతూ.. వివేక్ అగ్నిహోత్రి మూవీ ది కశ్మీర్ ఫైల్స్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో ప్రకాశ్ రాజ్.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై విమర్శలు చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి కేవలం మొరగడానికే పనికొస్తారుగానీ.. కాటువేసే దమ్ము వీరికి లేదన్నారు. కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ' ది కశ్మీర్ ఫైల్స్ నాన్సెన్స్ చిత్రాల్లో ఒకటి. ఆ సినిమా ఎవరు నిర్మించారో మాకు తెలుసు. ఆయనకు ఎలాంటి సిగ్గులేదు. అంతర్జాతీయ జ్యూరీ వారిపై ఉమ్మివేసింది. అయినా కూడా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు. వారు చేసేది కేవలం సౌండ్ పొల్యూషన్. బాలీవుడ్ బాయ్ కాట్ అన్నవారికి పఠాన్ 700 కోట్లు వసూలు రాబట్టింది. వాళ్లకు తెలిసింది కేవలం మొరగడమే. వారితో ఏం కాదు. ఎందుకంటే బయట చాలా సెన్సిటివ్ మీడియా ఉంది. అందుకే నేను చెప్తున్నా. నాకు తెలిసి ఇలాంటి మూవీలు చేయడానికే వాళ్లు దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ప్రతిసారి కూడా ప్రజలను ఫూల్ చేయలేరు' అని అన్నారు. కాగా.. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కాశ్మీర్ ఫైల్స్ 2022లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటి. జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం 1990లలో కాశ్మీరీ హిందువుల వలసలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు. “They needed to ban #Pathaan. It's going 700Cr. These idiots, who needed to #BanPathaan, didn’t run Modi’s movie for 30Cr. They’re simply barking, they do not chew. Don’t fret. Sound air pollution!” says Actor #PrakashRaj at #MBIFL2023 in #Kerala.#PathaanMovie #BoycottGang pic.twitter.com/CismuRxJ4k — Hate Detector 🔍 (@HateDetectors) February 6, 2023 -
అఫీషియల్.. సమంత ‘శాకుంతలం’ వాయిదా
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా శాకుంతలం పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరంటే! ఈ క్రమంలో ఆడియన్స్‌కి నిరాశ ఎదురైంది. కొద్ది రోజులుగా శాకులంత మూవీ వాయిదా అంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా చిత్రం బృందం ప్రకటన ఇచ్చింది. ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాల్సిన శాకుంతలం చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. “ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాను విడుదల చేయలేకపోతున్నామని ప్రేక్షకులకు తెలిపేందుకు చింతిస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌తో వస్తాం. నిరంతరం మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అంటూ ప్రకటన ఇచ్చింది. చదవండి: ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తున్నారు: కిరాక్ ఆర్పీ అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కథానాయకుడిగా నటించగా.. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో అర్హ భరతుడు పాత్రలో కనిపించనుంది. The theatrical release of #Shaakuntalam stands postponed. The new release date will be announced soon 🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/f0cyBfDCyj — Gunaa Teamworks (@GunaaTeamworks) February 7, 2023 -
మీకంటే ఆమెనే ఎక్కువ.. అక్షయ్ కుమార్‌పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
బాలీవుడ్ నటి రిచా చద్దా ట్వీట్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మంచు విష్ణు, నిఖిల్ సిద్ధార్థ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆమె ట్వీట్‌ను తప్పబట్టారు. ఓ నెటిజన్ ట్వీట్‌కు ఇండియన్ ఆర్మీని ఉద్దేశిస్తూ ఆమె రిప్లై ఇవ్వడమే వివాదానికి ప్రధాన కారణం. 2020లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో మన సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. (చదవంండి: బాలీవుడ్ నటిపై హీరో నిఖిల్ ఆగ్రహం.. ఎందుకంటే?) అయితే తాజాగా సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆమెను తప్పుపట్టడాన్ని ప్రకాశ్ రాజ్ ఖండించారు. ట్వీట్లో ఆయన రాస్తూ.. 'మీ నుంచి ఇలాంటి స్పందన ఊహించలేదు. మీకంటే ఎక్కువగా ఆమెనే మా దేశానికి సంబంధించినది. ఊరికేనే అడుగుతున్నా' అంటూ ట్వీట్ చేశారు. Didn’t expect this from you @akshaykumar ..having said that @RichaChadha is more relevant to our country than you sir. #justasking https://t.co/jAo5Sg6rQF — Prakash Raj (@prakashraaj) November 25, 2022 -
నాతో నటించేందుకు చాలా మంది వెనకాడుతున్నారు: ప్రకాశ్ రాజ్
తనతో కలిసి నటించేందుకు వెనకాడుతున్నారంటూ నటుడు ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య ప్రకాశ్ రాజు సినిమాల కంటే రాజకీయ అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని, మోదీ సర్కార్ టారెట్ చేస్తూ ఆయన ట్వీట్స్ చేస్తున్నారు. 2019లో ఆయన బెంగళూరు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆయన రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అదే ఆసక్తి తన సినీ కెరీర్‌ను దెబ్బతీసేలా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: అలా నటించిన ఒకే ఒక్కడు.. సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల ఓ ఇంగ్లీష్ చానల్‌తో ముచ్చటించిన ఆయన తన సినీ కెరీర్‌పై రాజకీయ ప్రభావం పడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు కొందరు నాతో కలసి పనిచేయడం లేదు. నాతో కలసి నటించొద్దని వారికి చెప్పడం వల్ల కాదు. నాతో పనిచేస్తే వారిని యాక్సప్ట్ చేయరేమోనన్న భయం పట్టుకుంది. అలాంటి వారందరినీ కోల్పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా భయం మరొకరికి శక్తిగా కాకూడదనుకుంటాను. అందుకే ఎలాంటి పరిణామాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళతాను. చదవండి: కృష్ణ చనిపోయారని బాధపడకండి, స్వర్గంలో ఆమెతో కలిసి..: వర్మ ట్వీట్ వాటిని స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధమే’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ‘నేను వీటి విషయంలో కొంచెం కూడా విచారించడం లేదు. నటపైనే దృష్టి పెడుతున్నాను. నేను ఇప్పుడు మరింత స్వేచ్ఛగా భావిస్తున్నాను. ఎందుకంటే, నేను నా స్వరాన్ని వినిపించకపోతే కేవలం ఓ మంచి నటుడిగానే చనిపోతాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే చాలా మంది నటులు మౌనంగా ఉంటున్నారని, అందుకు తాను వారిని నిందించాలని అనుకోవడం లేదన్నారు. ఎందుకుంటే మాట్లాడడం వల్ల వచ్చే పరిణామాలను వారు తట్టుకోలేరంటూ ప్రకాశ్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. -
ఫామ్‌హౌజ్ వ్యవహారం.. ప్రకాష్ రాజ్ ఘాటు ట్వీట్
సాక్షి, బెంగళూరు: తెలంగాణలో రాజకీయాలను వేడేక్కించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ‘‘ఢిల్లీకి చెందిన సిగ్గులేని బ్రోకర్లు..ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. మానమర్యాదలను అమ్ముకున్నవాళ్లు.. ప్రజాస్వామ్యాన్నే వేలానికి పెట్టారు’’ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ఇదిలా ఉంటే.. తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నిన్న(గురువారం) సాయంత్రం ప్రెస్మీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీజేపీపై ఆగ్రహం.. ప్రజాస్వామ్యం నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ ప్రసంగంతో పాటు మీడియాకు సమర్పించిన వీడియోలను కూడా ప్రకాష్ రాజ్ ట్యాగ్, పోస్ట్ చేశారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాన్ని పోలీసులు భారీ ఆపరేషన్ ద్వారా చేధించడం.. ఆపై కేసు నమోదు విచారణ.. కోర్టుకు చేరిన వ్యవహారం, తదనంతర పరిణామాలు.. ఈలోపు మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. Shameless Brokers from Delhi..killing democracy ಮಾನ ಮರ್ಯಾದೆ ಮಾರಿಕೊಂಡವರು.. ಪ್ರಜಾಪ್ರಭುತ್ವವನ್ನೇ ಹಾರಾಜಿಗೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ.. #LotusLeaks #justasking pic.twitter.com/w516YyTpoI — Prakash Raj (@prakashraaj) November 4, 2022 -
భార్య, కొడుకుతో ప్రకాష్ రాజ్.. వైరలవుతోన్న ఫోటోలు
-
డెవిల్ కపుల్స్.. భర్తతో కలిసి దుర్మార్గాలు చేసే భ ‘లేడీ విలన్స్’
విలన్.. హీరోయిన్ వెంట పడ్డాడు. లేకపోతే హీరోతో గొడవ పడ్డాడు. ఏదో ఒకటి. హీరోయిన్ విల న్ అసహ్యయించుకుంటుంది. అతన్ని ఛీ కొడుతుంది. హీరో ఏమో చావకొడతాడు. మూకీ నుంచి టాకీ వరకు ఒకటే స్టోరీ లైన్. విలన్ని చూసి భయపడే ఆడవాళ్లు ఉంటారు. చీదరించు కునే ఆడవాళ్లు ఉంటారు…మరి…విలన్‌కి జోడీ మాటేంటి ? ఈడూ జోడూ అంటే హీరో హీరో యిన్స్ మాత్రమేనా ? ఈ డౌట్ సహజంగా అందరికీ వస్తుంది కదా. ఇంతకీ తెలుగు సినిమాల్లో విలన్ జోడీలు లేరా? చిలకాగోరింకల్లా అనోన్యంగా ఉంటూ…కలిసికట్టుగా దుర్మార్గాలు చేసే డెవిల్ కపుల్స్ మీద ఒక లుక్ వేసేద్దామా.. ఏ సినిమా చూసినా హీరోకే జోడి. అది లవర్ కావచ్చు. లేదా భార్య కావచ్చు. కానీ…విలన్ కి మాత్రం జోడి ఉండదు. హీరోయిన్ చేత ఛీ కొట్టించుకునే విలన్లే అందరూ. ఒకవేళ భార్య రూపం లో జోడి ఉన్నా…ఆమె విలన్ని…విలన్ లానే చూస్తుంది. అలా కాకుండా విలన్ చేసే ప్రతి దుర్మార్గాన్ని సపోర్ట్ చేసే జోడి ఉంటే ? ఆమె భార్య కావచ్చు. ప్రేయసి కావచ్చు. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా విలన్‌కి అలాంటి జోడి దొరుకుతూ ఉంటుంది. అతను చేసే వెధవ పనున్నింటికీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. విలన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. క్రాక్ సినిమా తో మరోసారి ఈ ట్రెండ్ ఫోకస్‌లోకి వచ్చింది. కఠారి కృష్ణకి అన్ని రకాలుగా అండగా ఉండే జయమ్మ క్యారెక్టర్ అందరినీ ఆకర్షించింది. ఈ చిత్రంలో కటారి కృష్ణ పాత్రని సముద్రఖని పోషించగా, జయమ్మగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించింది. అర్జున్.. ఒక్కడు తర్వాత గుణశేఖర్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ బ్యాగ్రౌండ్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మధుర మీనాక్షి టెంపుల్ సెట్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఈ సినిమాలో విలన్ బాల నాయ గర్ అయితే, అంతకు మించి అన్న టైప్‌లో విలనీజాన్ని పండించింది ఆండాల్ పాత్ర. బాల నాయగర్గా ప్రకాష్ రాజ్, ఆయన సతీమణి ఆండాల్గా సరిత నటించారు. భర్త మనసు తెలు సుకుని మరీ దుర్మార్గపు పనులు చేసే భార్యగా సరిత నటన ప్రశంసలు అందుకుంది. మహేశ్ బాబుతో పాటుగా సరితకు కూడా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. విలన్‌కి జోడిగా ఉంటూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసే ఆడవాళ్లు తెలుగు సినిమాల్లో తక్కు వే. మహేశ్‌బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో అలాంటి క్యారెక్టర్ని డిజై న్ చేశారు. నిజంలో విలన్‌గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ సినిమాలో గోపిచంద్‌కి జంటగా రాశి నటించింది. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్‌కి క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. సినిమాకి, సినిమాకి పూర్తి భిన్నమైన జానర్స్‌ని ఎంపిక చేసుకునే హీరోల్లో రానా ఒకడు. నేనే రాజు, నేనే మంత్రి అందుకో ఉదాహరణ. జోగేంద్ర, రాధ చూడముచ్చటైన జంట. చివరి వరకు మూవీలో ఈ కపుల్ ట్రావెల్ చేయక పోయినా…కథ మలుపు తిరగడానికి మాత్రం కారణమౌ తుంది. అదే ఊరి సర్పంచ్ జంట. సర్పంచ్‌గా ప్రదీప్ రావత్ నటిస్తే…అతని భార్యగా బిందు చంద్రమౌళి నటించారు. ప్రదీప్ రావత్, బిందు చంద్రమౌళి ఇద్దరూ నెగిటివ్ రోల్స్‌లో తెగ జీవించేశారు. ఒక సినిమా. పది విభిన్నమైన క్యారెక్టర్లు. దశావతారంతో నట విశ్వరూపం చూపించేశారు కమలహాసన్. ఒక్కో పాత్ర పూర్తి భిన్నమైన నేపథ్యంతో సాగుతోంది. కథానాయకుడు, ప్రతికథా నాయకుడుతో పాటుగా కథని మలుపు తిప్పే కీలక పాత్రలన్నీ తానే పోషించారు. అందులో విలన్ పాత్ర ఫ్లెచర్కి జంటగా మల్లికా షరావత్ నటించింది. గోవింద్‌ని పట్టుకునే క్రమంలో ఫ్లెచర్కి మల్లికా షరావత్ అన్ని రకాలుగా సహకరిస్తుంది. అమ్మోరు. పాతికేళ్ల క్రితమే వి.ఎఫ్.ఎక్స్ తో సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించిన చిత్రం. అసలే స్పెషల్ ఎఫెక్ట్స్. ఆ పైన భక్తి చిత్రం. ఒకవైపు భక్తి భావోద్వేగం. మరోవైపు తొలి సారిగా కళ్ల ముందు కనిపిస్తున్న సరికొత్త సాంకేతిక మాయజాలం. అందుకే…అమ్మోరు అం తటి ఘన విజయం సాధించింది. దేశంలోని అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లో చర్చ జరిగే చేసింది. అమ్మోరు చిత్రంలో ప్రధాన విలన్‌గా గోరఖ్ పాత్రలో రామిరెడ్డి నటించారు. అదే చిత్రంలో మరో విలన్‌గా బాబూమోహన్ నటించారు. బాబూ మోహన్‌కి జంటగా వడివుక్కరసి నటించారు. హీరో కుటుంబంలో చిచ్చు పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భార్యా, భర్తలిద్దరూ కలిసికట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య కుట్రల కోణంలో కెమిస్ట్రీ చాలా బాగా పండింది. టాలీవుడ్లో దాదాపు పదేళ్ల పాటు ఏలేసిన హీరోయిన్స్‌గా ఒకరు సిమ్రాన్. సహజంగా హీరో యిన్‌గా ఫేడౌట్ అయిన తర్వాత ఏ వదినగానో, అక్కగానో రీఎంట్రీ ఉంటుంది. కానీ…సిమ్రాన్ మాత్రం లేడీ విలన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ మూవీ సీమరాజా తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో విలన్ లాల్ భార్యగా నెగివిట్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేసింది సిమ్రాన్. హీరోయిన్ సమంతాతో పాటుగా లాల్, సిమ్రాన్ ల విలనీజం కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. -
కేటీఆర్ ప్రశంసపై కొండారెడ్డిపల్లివాసుల ఆగ్రహం
కేశంపేట: సినీనటుడు ప్రకాశ్‌రాజ్ తన దత్తత గ్రామమైన రంగారెడ్డి జిల్లా కేశంపేట పరిధిలోని కొండారెడ్డిపల్లిని బాగా అభివృద్ధి చేశారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించడంపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో కలసి సర్పంచ్ పల్లె స్వాతి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిపై కేటీఆర్ పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రకాశ్‌రాజ్ 2019 వరకే తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, ఆయన చేసిన అభివృద్ధి కంటే తాము సొంత నిధులతో చేసిన అభివృద్ధి ఎక్కువగా ఉందని ఆమె స్పష్టం చేశారు. మూడేళ్లుగా సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్న తమను అభినందించాల్సి పోయి.. ప్రకాశ్‌రాజ్ అభివృద్ధి చేశారని చెప్పడం ఎంతవరకు సమంజసమని సర్పంచ్ స్వాతి ప్రశ్నించారు. పనిచేసింది మేమైతే.. ప్రశంసలు ప్రకాశ్‌రాజ్‌కా? అంటూ కేటీఆర్‌కు ప్రశ్న సంధించారు ఆ ఊరి ప్రజలు. This is the village adopted by @prakashraaj Great progress made in tandem with local MLA @AnjaiahYTRS Garu 👏 https://t.co/yGfYdloaFT — KTR (@KTRTRS) September 20, 2022 -
అప్పు గుర్తుగా అంబులెన్స్ విరాళమిచ్చిన ప్రకాశ్ రాజ్
పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జ్ఞాపకార్థం సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 32 జిల్లాల్లో అప్పు ఎక్స్‌ప్రెస్ పేరుతో అంబులెన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం మొదటిగా మైసూరు నగరంలోని మిషన్ ఆస్పత్రికి అప్పు ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌ను ప్రకాశ్ రాజ్ అందజేశారు. ఈమేరకు పలు ఫొటోలను ఆయన ట్విటర్లో షేర్ చేశాడు. కాగా కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న కన్నుమూసిన విషయం తెలిసిందే! “”APPU Xpress “” donated a free ambulance for the needy in memory of our dear #puneethrajkumar .. a #prakashrajfoundation initiative.. the joy of giving back to life .. pic.twitter.com/HI57F9wwZl — Prakash Raj (@prakashraaj) August 6, 2022 చదవండి: బిగ్‌బాస్ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరే.. ఆర్ఆర్ఆర్లో కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే.. -
బాలీవుడ్‌ను టార్గెట్ చేసిన ప్రకాశ్ రాజ్, సటైరికల్ కామెంట్స్‌తో ట్వీట్
ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్ రాజ్.. దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్స్ వేస్తున్నాడు. కొంతకాలంగా మోడీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ పోస్టులు పెడుతున్నాడు. అయితే.. గతంలో ప్రభుత్వంపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు ప్రస్తుతం మౌనం వహించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇందులో కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, శిల్పాశెట్టి, జూహీ చావ్లా, అనుపమ్ ఖేర్ ట్వీట్స్‌కు సంబంధి స్క్రీన్ షాట్స్ ఉండటంలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇందులో ‘సంతోషం పెట్రోల్ ధరలా తరహాలో పెరగాలి.. బాధలు ఇండియన్ రూపీలాగా తగ్గాలి. హృదయం కరప్షన్ తరహాలో జాయ్‌తో నిండిపోవాలి’ అంటూ వివేక్ అగ్నిహోత్రి గతంలో చేసిన ఈ ట్వీట్ అప్పుట్లో తీవ్ర రచ్చకు దారి తీసింది. ఇక శిల్పా శెట్టి డాలర్ రేటు పెరుగుతూ ఉండడం పై సెటైర్ వేసింది. అలా అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్‌లతో పాటు నటి జూహి చావ్లా సైతం రూపాయి విలువను లో దుస్తులతో పోల్చడం వివాదాస్పదంగా మారింది. అయితే ఈ ట్వీట్స్ 2012,13 చేసినవి కావడం గమనార్హం. ఈ ట్వీట్స్‌కు సంబందించిన స్క్రీన్ షాట్స్‌కు ప్రకాశ్ రాజ్ ‘ఒకప్పుడు దేశంలో’ అంటూ జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసి పోస్ట్ చేశాడు. ఏదేమైన ప్రకాశ్ రాజ్ తాజా ట్వీట్ మాత్రం బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో హాట్‌టాపిక్ నిలిచింది. Once upon a time…in my country.. #justasking pic.twitter.com/KOgkQwQwAy — Prakash Raj (@prakashraaj) July 20, 2022 -
మహేశ్ సినిమాలో ఆ పాత్రను అయిష్టంగానే చేశా: ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. పరిశ్రమలో ప్రకాశ్ రాజ్‌కు ప్రత్యేకం స్థానం ఉంది. ఎలాంటి పాత్రలోనైన ఇట్టే ఒదిగిపోయే నటుడు ఆయన. అందుకే ఆయన నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండడనడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి పాత్రెయిన ఆయన ఇమిడిపోయే తీరు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలా ఆయనను అందరి చేత విలక్షణ నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్ బాబు చిత్రంలో తనకు నచ్చని పాత్ర చేశానంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ‘ఏ ఆర్టిస్టుకైనా ఒక్కోసారి నచ్చని పాత్రలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాత్రల్లో 'సరిలేరును నీకెవ్వరు' సినిమాలో నేను చేసిన పాత్ర ఒకటి. ఆ సినిమాలో అబద్ధాలు చెప్పే రాజకీయనాయకుడి పాత్ర పోషించాను. అయితే నాకు పాత్ర నచ్చకున్న అయిష్టంగానే చేయాల్సి వచ్చింది. నటులకు కొన్ని సార్లు వారి నిర్ణయాలు.. అభిప్రాయాలతో పనిలేకుండా అలా జరిగిపోతూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. కాగా మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో తానును అలాంటి పాత్రను చేయడం అసంతృప్తిగా అనిపించినా, ఆయన నిర్మించిన 'మేజర్' సినిమాలోని పాత్ర తనకు సంతృప్తినిచ్చిందన్నారు. ఇక తన కెరీర్లో 'ఆకాశమంత' .. 'బొమ్మరిల్లు' సినిమాలు తనకు చాలా సంతోషాన్ని కలిగించాయని ఆయన చెప్పారు. చదవండి: కొత్త జంట నయన్-విఘ్నేశ్‌కు ఓటీటీ షాక్! రూ. 25 కోట్ల ఒప్పందం రద్దు? -
తెలంగాణ పర్యటన వేళ మోదీపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు
విలక్షణ నటుడు, రాజకీయ నేత ప్రకాశ్ రాజ్.. ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు హైదరాబాద్ చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ, మోదీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా.. తెలంగాణలో అద్భుత పాలన నడస్తున్నది చెబుతూ.. హైదరాబాద్‌కు వస్తున్నఅత్యుత్తమ నాయకుడికి స్వాగతం అన్నారు. ఈ క్రమంలోనే పాలన ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా చెప్పారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటనలను సైతం ప్రస్తావించారు. మోదీ పర్యటిస్తున్న సమయంలో బీజేపీ పాలిత స్టేట్స్లో ప్రజలు కట్టిన పన్నుల మొత్తంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తుంటారు. కానీ, తెలంగాణలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనను ఆస్వాదించాలని, దూరదృష్టితో మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫొటోతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, టీ హబ్, ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల భవనాలతో కూడిన ఫొటోలను షేర్ చేశారు. Dear supreme leader.. welcome to Hyderabad..in the states ruled by BJP ..tax payers money is spent in crores to lay roads for your highness visit.. but here it is spent for us Citizens…enjoy the ride n hope you will learn how to deliver infrastructure with a vision #justasking pic.twitter.com/dj5ZVwU6fD — Prakash Raj (@prakashraaj) July 2, 2022 ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కేంద్ర మంత్రికి చేదు అనుభవం.. బీజేపీ నేతలు ఫైర్ -
ఒకే ఫ్రేంలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు.. ఫొటో వైరల్
ఈ ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సినీ ఇండస్ట్రీనే కాదు..తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసింది. జనరల్ ఎలక్షన్స్ తలపించే విధంగా మా ఎన్నికలు వాడివేడిగా జరిగాయి. ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ అంటూనే ప్రత్యక్ష ఆరోపణలకు తెరదీశారు. ఇక అధ్యక్ష పదవికి పోటీ పడ్డ ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల మధ్య జరిగిన మాటల యుద్దం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి ఈ ఎన్నికలో మంచు విష్ణు గెలిచి మా అధ్యక్ష పీటాన్ని కైవసం చేసుకున్నాడు. చదవండి: ఘనంగా ప్రారంభమైన విశ్వక్ సేన్-అర్జున్ మూవీ, క్లాప్ కొట్టిన పవన్ దీంతో ప్రకాశ్ రాజ్‌తో సహా అతడి ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు మా అసోసియేషన్‌కు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎదురు పడిని దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరు ఒకే ఫ్రేంలో కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా యాక్షన్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్, ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లుగా రాబోతున్న మూవీ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యాక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హజరై హీరోహీరోయిన్ల తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. చదవండి: హమ్మయ్యా.. షూటింగ్ పూర్తయింది: పూజా హెగ్డే అయితే పవన్ కల్యాణ్‌తో పాటు ఈ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు కూడా హజరైనట్లు తెలుస్తుంది. ఈ మూవీ లాంచింగ్ వేడుకలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎదురుపడి మాట్లాడుకుంటున్న ఫొటో బయటకు వచ్చింది. వారి మధ్యలో హీరో విశ్వక్ సేన్ కూడా కనిపించాడు. అయితే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు సీరియస్‌గా ఎదో మాట్లాడుకోవడం చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె గురించే వీరిద్దరు చర్చించుకుంటున్నారా? అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Prakash Raj Support Sai Pallavi About Controversial Comments: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాట పర్వం'. ఈ మూవీ విడుదలకు ముందు నుంచి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో 'కశ్మీర్ ఫైల్స్ మూవీలోని హింస, గోరక్షక దళాలు, మానవత్వం' గురించి మాట్లాడింది. ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలపై శనివారం (జూన్ 18) స్పష్టతనిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికి తప్పేనని, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సాయి పల్లవి ఇచ్చిన వివరణపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఆమెకు మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో 'మానవత్వమే అన్నింటికంటే ముందు. కాబట్టి సాయి పల్లవి.. మేము నీతోనే ఉన్నాం.' అని రాసుకొచ్చారు ప్రకాశ్ రాజ్. కాగా నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 'విరాట పర్వం' చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. చదవండి: 'విరాట పర్వం'పై సరళ అన్నయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ Humanity first … we are with you @Sai_Pallavi92 https://t.co/6Zip4FJPv3 — Prakash Raj (@prakashraaj) June 19, 2022 -
ఇక ముహూర్తమే!: కొత్త జాతీయ పార్టీకి కేసీఆర్ బాస్.. చక్రం తిప్పనున్న పీకే..
ప్రత్యామ్నాయ ఎజెండా.. ‘తెలంగాణ మోడల్’ జెండా! ► టీఆర్ఎస్ జెండాను పోలిన రీతిలో కొత్త పార్టీ పతాకం.. ఎన్నికల గుర్తుగా కారును కొనసాగించేలా ఎన్నికల సంఘాన్ని కోరాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్త పార్టీ ఎజెండా కూడా ఖరారైనట్టు సమాచారం. ► తెలంగాణ ఉద్యమం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో కొనసాగగా.. ఇంచుమించు ఇవే అంశాలను జాతీయ ఎజెండాలోనూ ఎత్తుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. విద్యుత్ సమస్య, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత, వివిధ రంగాల్లో టీఆర్ఎస్ సర్కారు ప్రగతిని రోల్ మోడల్‌గా చూపనున్నట్టు సమాచారం. ► పార్టీ ఎజెండాను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా.. వివిధ రంగాలకు చెందిన వారిని కూడగట్టే పనిని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు అప్పగించినట్టు తెలిసింది. ► దేశంలోని పలువురు వ్యవసాయ, ఆర్థిక, నీటి పారుదల, విద్యుత్, పాలనా రంగాల నిపుణులతో కేసీఆర్ ఇప్పటికే మంతనాలు జరిపారు. మొత్తంగా దేశం ముందు పెట్టాల్సిన ప్రత్యామ్నా య, ఆర్థిక ఎజెండాను రూపొందించే బాధ్యతను హైదరాబాద్‌లోని ఓ సామాజిక, ఆర్థిక అధ్యయన బృందానికి అప్పగించినట్టు తెలిసింది. ► ఇక పార్టీ ఎజెండాపై విస్తృత ప్రచారం కల్పించేందుకు దేశవ్యాప్తంగా పలు వర్సిటీల్లో సదస్సులు నిర్వహించేలా ఇప్పటికే కొన్ని విద్యార్థి బృందా లను సిద్ధం చేసినట్టు సమాచారం. ► తెలంగాణ ఉద్యమ వ్యాప్తి, టీఆర్ఎస్ విస్తరణలో కీలకపాత్ర పోషించిన ‘సాంస్కృతిక కళారూపాలను కొత్త పార్టీకి కూడా జోడించనున్నారు. దీనికి అవసరమైన సాహిత్యం, కళాకారులు వంటి అనేక అంశాలపై కసరత్తు జరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో జాతీయ పార్టీ ఏర్పాటుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మూడు రోజులుగా ప్రగతిభవన్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో మంతనాలు జరిపిన కేసీఆర్.. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలకు తుది రూపునిచ్చినట్టు తెలిసింది. ‘భారత రాష్ట్ర సమితి’, ‘భారత నిర్మాణ సమితి’, ‘భారత ప్రజా సమితి’లలో ఒక పేరును ఖరారు చేసి.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు మంచి రోజులు ఉండటంతో సరైన ముహూర్తం చూసి.. కొత్త జాతీయ పార్టీ పేరు, ఎజెండా, నియమావళి, జెండా, ఎన్నికల గుర్తు తదితరాలను ప్రకటించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో త్వరలోనే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ కొత్త జాతీయ పార్టీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ వ్యవహరించనుండగా.. ప్రశాంత్ కిషోర్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్ హోదా కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏర్పాట్లపై తుది కసరత్తు.. ‘భారత రాష్ట్ర సమితి’ లేదా ‘భారత నిర్మాణ సమితి’గా టీఆర్ఎస్ అవతరించే పక్షంలో.. ఆపై రాష్ట్రంలోనూ కొత్త పేరుతోనే మనుగడ సాగించనుంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు కొత్త జాతీయ పార్టీకి చెందిన గుర్తు, ఎజెండాపైనే ఎన్నికల బరిలోకి దిగే అవకాశముంది. జాతీయ పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్లు తదితరాలను కొత్త పార్టీ పేరిట మార్పిడి చేసేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు, చిక్కులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. కొత్త జాతీయ పార్టీ ఆవిర్భావ ప్రకటనతోపాటు జాతీయ కార్యవర్గం/పొలిట్ బ్యూరోను కేసీఆర్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో భావ సారూప్యత కలిగిన చిన్న పార్టీలు, వివిధ సామాజిక సంస్థలు, సంఘాలను విలీనం చేసుకుంటూ కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్టు సమాచారం. కొత్త పార్టీ కార్యవర్గంలో రాజకీయ నేతలకంటే వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావి వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాపై తమ చిత్తశుద్ధిని చాటాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలో బహిరంగ సభ పెట్టి.. కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపనపై ప్రకటన చేశాక.. జూలై మొదటి వారంలో దేశ రాజధాని ఢిల్లీ లేదా పరిసర రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ సభకు తెలంగాణతోపాటు ఉత్తరాది నుంచి జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజయ్యేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఉత్తరాదిన పార్టీ విస్తరణకు అనువైన వాతావరణం ఉందని భావిస్తూ.. ఉత్తరాది రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో రాజకీయ శూన్యత లేదనే అభిప్రాయంతో ఉన్న కేసీఆర్.. సందర్భాన్ని బట్టి ముందుకు సాగాలని భావిస్తున్నారు. రైతు నేత రాకేశ్ తికాయత్ సేవలను వినియోగించుకోవడం, యూపీలో ఆర్ఎల్డీ, జార్ఖండ్‌లో జేఎంఎం, బిహార్‌లో ఆర్జేడీ, యూపీలో సమాజ్‌వాదీ వంటి పార్టీలతో ఏ తరహా సంబంధాలను కొనసాగించాలనే కోణంలోనూ కేసీఆర్ కొంతమేర స్పష్టతకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులు, కలిసి వచ్చే పార్టీలు, నేతల వివరాలతో పీకే బృందం ఇప్పటికే నివేదికలు రూపొందించినట్టు సమాచారం. కొత్త పార్టీకి ‘సినీ గ్లామర్’! జాతీయ రాజకీయాల్లో వీలైనంత త్వరగా కుదురుకోవాలని భావిస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పార్టీకి సినీ గ్లామర్‌ను కూడా అద్దుతున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాశ్‌రాజ్ కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతుండగా.. మరో నటుడు సోనూసూద్ కూడా కొత్త పార్టీలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సోషల్ మీడియా దన్నుతో.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ విస్తరణ కోసం కొన్ని జాతీయ మీడియా సంస్థల సాయం తీసుకోవడంతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వ్యూహ రచన చేశారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ విధానాలపై కేసీఆర్ హిందీలో చేసిన ప్రసంగాల్లోని అంశాలు ఇప్పటికే సామాజిక మాధ్య మాల ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాయని.. వేల సంఖ్యలో కామెంట్లు, లైక్‌లు వస్తున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
నాటక కళాకారులను గుర్తుతెచ్చే ‘ఉత్సవం’
నాటక కళా రంగం గొప్పదనం గురించి తెలియజేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా దీలీప్, రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు నటించారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల కానుంది. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అనూప్ రూబెన్స్ తన పాటలతో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడని, కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ అద్భుతమైన విజువల్స్‌తో ‘ఉత్సవం’ను అందంగా తీర్చిదిద్దారని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. -
హీరో కార్తీ, అతిథి శంకర్ విరుమన్ రిలీజ్ డేట్ ఫిక్స్
సాక్షి, చెన్నై: ‘విరుమన్’ చిత్రం వినాయక చవితికి విడుదలకు ముస్తాబవుతోంది. కార్తీ కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. ముత్తయ్య దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. నటుడు రాజ్‌కిరణ్, ప్రకాష్‌రాజ్, సూరి, ఆర్కే సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కాగా చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ஆகஸ்ட் 31 விநாயகர் சதுர்த்திக்கு வர்றோம் #விருமன் #VirumanFromAug31@Karthi_Offl @Suriya_offl @2D_ENTPVTLTD @dir_muthaiya @thisisysr @AditiShankarofl @rajsekarpandian @prakashraaj #Rajkiran @sooriofficial @sakthivelan_b pic.twitter.com/qnr2X1NKKT — Actor Karthi (@Karthi_Offl) May 18, 2022 -
ప్రకాశ్‌రాజ్‌కు బెదిరింపు లేఖ.. ‘మీపై నేరుగా దాడిచేసి పోలీసులకు లొంగిపోతా’
శివాజీనగర/బెంగుళూరు: బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, సాహితీవేత్త వీరభద్రప్పతో పాటు 16 మంది కర్ణాటక సాహితీవేత్తలకు బెదిరింపు లేఖలు వచ్చాయి. ‘జై హిందూ దేశం, జై సహిష్ణు’పేరుతో వచ్చిన ఈ లేఖల్లో ‘మీపై నేరుగా దాడిచేసి పోలీసులకు లొంగిపోతా’అని ఉంది. దీనిపై వీరభద్రప్ప, పలువురు రచయితలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు భద్రత పెంచాలని కోరారు. తాను హిందువును కాదని, లింగాయత్‌ను అని వీరభద్రప్ప ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రకటించారు. చదవండి👉🏻 చింతన్ శిబిర్ వేళ కాంగ్రెస్‌కు షాక్.. సీనియర్ నేత సునీల్ జాఖడ్ గుడ్‌బై -
మేజర్ ట్రైలర్: ఒక్క ప్రాణం పోయిన నన్ను నేను సోల్జర్ అనుకోలేను..
Mahesh Babu To Launch The Adivi Sesh Major Trailer: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం (మే 9) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించారు మేకర్స్. తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేయగా, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగిన ఈ ట్రైలర్లో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటనలను చాలా బాగా చూపించారు. 'ఒక్క ప్రాణం పోయిన నన్ను నేను సోల్జర్ అనుకోలేను', 'ప్రతి అమ్మ ఇలానే ఆలోచిస్తుంది' వంటి తదితర డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. చదవండి: ‘మేజర్’ ట్రైలర్‌ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ -
ప్రకాశ్‌రాజ్ ఒక బఫూన్
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు ప్రకాశ్‌రాజ్ ఒక బఫూన్ అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గురించి మాట్లాడేంత సీన్ ప్రకాశ్‌రాజ్‌కు లేదన్నారు. ప్రకాశ్‌రాజ్ మొనగాడైతే ‘మా’ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, కేసీఆర్ మెప్పు కోసమే ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీనుద్దేశించి ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. -
కేజీఎఫ్ 2కు కోట్లల్లో కలెక్షన్లు, రెమ్యునరేషన్ కూడా కోట్లల్లోనే!
'వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్.. బట్ వయలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్..' కేజీఎఫ్ 2లోని పాపులార్ డైలాగ్ ఇది. రీల్ లైఫ్‌లోని డైలాగ్ రియల్ లైఫ్‌లోకి వచ్చేసరికి ఇదిగో ఇలా మారిపోయింది.. 'రికార్డ్స్, రికార్డ్స్, రికార్డ్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ రికార్డ్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్' అనేలా తయారైంది పరిస్థితి. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఒక్క హిందీలోనే ఇప్పటివరకు రూ.268 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.720 కోట్లకు పైగా రాబట్టింది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2లో నటించిన తారలకు ఎంతమేర పారితోషికం ముట్టజెప్పారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం రాఖీభాయ్ యశ్ ఈ సినిమాకు రూ.25 - 30 కోట్ల మేర పారితోషికం తీసుకున్నాడట. అధీరాగా నటించిన సంజయ్ దత్ రూ.10 కోట్లు, రవీనా టండన్ రూ.2 కోట్లు, శ్రీనిధి శెట్టి రూ.3-4 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.80-85 లక్షల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కళాఖండాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ రూ.15-20 కోట్ల దాకా అందుకున్నాడట! చదవండి: అది చూసి అవకాశం..నమ్మలేకపోయా: కేజీఎఫ్-2 ఎడిటర్ హీరోతో డేటింగ్, కామెంట్ డిలీట్ చేసిన బిగ్‌బీ మనవరాలు -
ఏక భాష వద్దు.. ‘నాకు హిందీ తెలియదు’
ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీని అంగీకరించాలని, స్థానిక భాషలను కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న వాదన తెరపైకి వచ్చింది. గత వారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యకలాపాలు అధికార భాషలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని, ఇది కచ్చితంగా హిందీ ప్రాముఖ్యతను పెంచుతుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు హిందీని విస్తరించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘వివిధ రాష్ట్రాల పౌరులు కమ్యూనికేట్ చేసేటప్పుడు అది భారతదేశ భాషలో ఉండాలి. అదే సమయంలో ప్రాంతీయ భాషల నుంచి పదాలను ఇముడ్చుకునేందుకు అనువుగా హిందీని మార్చాల’ని అమిత్ షా వ్యాఖ్యానించారు. హిందీ ఎక్కువగా మాట్లాడేవారు ఉంటే.. అది దేశాన్ని ఒక్కటిగా ఉంచుతుందన్న భావన కలుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 10వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం, బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నాయకులు దీనిపై స్పందించారు. భాషాపరమైన ఆధిపత్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలను ఏకం చేసే పేరుతో హిందీని అందరిపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హిందీని బలవంతంగా రుద్దడం మానుకుని.. స్థానిక భాషలను పరిరక్షించడం, ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని అసోం సాహిత్య సభ కోరింది. తమిళనాడు నుంచి డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఈ చర్య దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని డీఎంకే పేర్కొంది. భారతీయుడని నిరూపించుకోవడానికి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని తమిళనాడు బీజేపీ నేతలు అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా మోదీ సర్కారు చర్యను తప్పుబట్టింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్లో తన అభిప్రాయాన్ని తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బలంగా గళం వినిపించారు. హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో #StopHindiImposition హాష్‌ట్యాగ్‌తో ప్రచారం చేశారు. ‘నాకు హిందీ తెలియదు’ అనేది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ వంటి సెలబ్రిటీలు కూడా ట్విటర్ వేదికగా తమ నిరసన వ్యక్తం చేశారు. (క్లిక్: నన్ను పట్టించుకోవడం లేదు.. కొత్త పెళ్లికొడుకులా ఉన్నా..) కేవలం హిందీ భాష ద్వారా మాత్రమే భారతదేశానికి గుర్తింపు వస్తుందన్న కేంద్రం వాదనలో పస లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బిహార్ మినహా ప్రతి రాష్ట్రానికి స్వంత భాష ఉందని వెల్లడించారు. అలాంటప్పుడు హిందీ భాషను అన్ని రాష్ట్రాలపై రుద్దడం సరికాదని అంటున్నారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదని.. సంస్కృతి, గుర్తింపు కూడానని వివరించారు. భాషా వైవిధ్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఏక భాష విధానం సమర్థనీయం కాదని స్పష్టం చేస్తున్నారు. (క్లిక్: ఆరెస్సెస్ అలాంటిది కాదని ఆయనకు చెప్పా) -
కొడుకును బతికించుకోలేకపోయా, చనిపోవాలనిపించింది!
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నో సహాయకార్యక్రమాలు చేసి ఎందరో జీవితాల్లో వెలుగు నింపారాయన. మానవత్వం, దయాగుణానికి నిలువెత్తు రూపంలా ఉండే ప్రకాశ్ రాజ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ తన హవా చూపిస్తున్నాడు. సినిమాల్లో ఎన్నో విజయాలను చూసిన ఆయన వ్యక్తిగతంగా మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. మొదటి భార్య లలితకుమారికి విడాకులు ఇచ్చి ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ప్రకాశ్‌రాజ్ ఈ విడాకుల విషయంపై స్పందించాడు. నిన్న (మార్చి 26న) ప్రకాశ్ రాజ్ బర్త్‌డే సందర్భంగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో ఆయన ఏమన్నాడంటే.. 'మొదటి భార్య లలితకుమారితో విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నాను. కానీ నా పిల్లలు ఆమెతో కలిసే ఉంటున్నారు. విడిపోయిన తర్వాత నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించింది. ఇదే విషయాన్ని నా తల్లికి, ఇద్దరు కూతుళ్లకు చెప్తే మంచి నిర్ణయమన్నారు. ఆ తర్వాత పోనీ వర్మ వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడాను. నాకు, మీ కూతురికి 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మీ అందరూ నా కుటుంబంగా ఏర్పడాలనుందని చెప్పి ఒప్పించాను. మాకు పెళ్లైంది, కొడుకు పుట్టాడు. అతడికి ఐదేళ్ల వయసున్నప్పుడు రిసార్ట్‌లో గాలిపటం ఎగరేస్తూ కిందపడ్డాడు. అప్పుడు తలకు పెద్ద దెబ్బ తగిలింది. ఎంత కష్టపడ్డా అతడిని బతికించుకోలేకపోయాం. ఆ సమయంలో ఈ ప్రపంచమే వద్దనిపించింది. కానీ పదిమంది కోసమైనా బతకాలి కదా! ఆ తర్వాత నాకింకో బాబు పుట్టాడు, సంతోషంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు ప్రకాశ్ రాజ్. చదవండి: ఇకపై ఆ బాధ్యత నాదే.. ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన ట్విటర్లో ఫ్యాన్స్ వార్, స్టార్ హీరో చనిపోయాడంటూ ట్రోలింగ్! -
బర్త్‌డే సందర్భంగా ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్(అప్పు) సేవల తన ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నా ప్రత్యేకమైన రోజున మీ అందరితో ఈ శుభవార్త పంచుకుంటున్నందుకు ఆనందం ఉంది. పునీత్ రాజ్‌కుమార్ ప్రారంభించిన సేవలను ఇకపై ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకేళ్లబోతున్నాను. చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్ఆర్ఆర్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తాను’ అంటూ అప్పు ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ‘అప్పు ఎక్స్‌ప్రెస్’ అని రాసి ఉన్న ఈ పోస్ట్‌ను ఆయన పంచుకున్నారు. ఆయన ట్వీట్‌పై పునీత్ ఫ్యాన్స్, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్‌పై ప్రశంసలు కురిపిస్తు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. కాగా ప్రకాశ్ రాజ్ లాక్డౌన్లో ఎంతోమందికి సేవలు అందించారు. తన ఫాంహౌజ్‌లో నిరాశ్రయులకు ఆయన ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే. On my day today.. I’m extremely happy to announce this .. details soon a #prakashrajfoundation initiative “let’s give back to life” pic.twitter.com/hra3HYWPtO — Prakash Raj (@prakashraaj) March 26, 2022 -
వచ్చేస్తున్నాడు తొలి సూపర్ సోల్జర్..
-
ప్రధాని మోదీపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు, ట్వీట్ వైరల్
Prakash Raj Satirical Comments On Modi: నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఓ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్ ప్రధాని మోదీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని అన్న వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సెటైరికల్‌గా స్పందించాడు. చదవండి: భార్యతో స్టార్ హీరో రొమాంటిక్ డేట్, ఫస్ట్‌టైం పబ్లిక్‌గా.. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ‘దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. నిద్రపోలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకాశ్ రాజ్ ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తుంటాడనే విషయం విధితమే. Please have some common sense… not able to sleep is a medical condition called INSOMNIA.. it should be treated .. not bragged about ..🙏🏻🙏🏻 please take care of your leader #justasking pic.twitter.com/CPj7rP7F6Z — Prakash Raj (@prakashraaj) March 22, 2022 -
అదరగొడుతున్న సూపర్ సోల్జర్.. 'ఎటాక్' రెండో ట్రైలర్ రిలీజ్
John Abraham Attack Part 1 Movie Second Trailer Release: ఇప్పటివరకూ దేశాన్ని కాపాడేందుకు సైనికులు చేసిన సాహసాలు చూశాం. దుష్ట శక్తులతో పోరాడి కష్టాల్లో ఉన్న వారిని రక్షించిన సూపర్ హీరోలను వీక్షించాం. ఇప్పుడు ఒక కొత్త సూపర్ సోల్జర్ను చూడబోతున్నాం. అటు సూపర్ హీరోల అద్భుత శక్తి, ఇటు సైనికుల దేశభక్తిని పుణికిపుచ్చుకుని వస్తున్నాడు ఈ సూపర్ సోల్జర్. అతనెవరో కాదు బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం. 'సత్యమేవ జయతే 2' సినిమా తర్వాత జాన్ అబ్రహం నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఎటాక్: పార్ట్ 1'. ఉగ్రవాదులను ఏరిపారేసే తొలి సూపర్ సోల్జర్‌గా కనిపించనున్నాడు జాన్ అబ్రహం. ఇది వరకు ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆ ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మంగళవారం (మార్చి 22) ఈ మూవీ రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మొదటి ట్రైలర్లానే ఈ ట్రైలర్ అదిరిపోయింది. బీజీఎం, యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఒక సోల్జర్‌కు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను అమర్చి, దేశ భద్రతను కాపాడలనే సరికొత్త కథతో ఈ సినిమా రూపొందింది. సైన్స్ ఫిక్షన్, హై ఆక్టేన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. -
‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్, ట్వీట్ వైరల్
Prakash Raj Comments On The Kashmir Files Movie: నిజ సంఘటనల ఆధారం బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్రి హోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనూహ్య స్పందన వస్తోంది. జమ్మూకశ్మీర్‌లో 1990లలో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలను ఈ చిత్రంలో చూపించారు. మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన ఈమూవీ సంచలనం సృష్టిస్తోంది. ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ‘ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మూవీపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదవండి: Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్ తొలి ట్వీట్, నెటిజన్ల అసహనం 'కశ్మీర్ ఫైల్స్ చిత్రం పాత గాయాలను నయం చేస్తుందా? లేక మరింత రెచ్చగొట్టేలా చేస్తుందా? లేదంటే ద్వేషం అనే విత్తనాలను నాటుతుందా? జస్ట్ ఆస్కింగ్' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రకాశ్ రాజ్ ట్వీట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ మూవీ మాత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. ప్రధాని మోదీ నుంచి ఎందరో బీజేపీ నేతలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి కొన్ని రాష్ట్రాలు బెనెఫిట్స్ షోలను కూడా ప్రకటించాయి. కాగా ఈ మూవీ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి కేంద్ర హోంశాఖ 'వై' కేటగిరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటులు అనుపమ ఖేర్, మిథున్ చక్రవర్తి, నటి పల్లవి జోషిలు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: Vidya Balan: నాతో దారుణంగా ప్రవర్తించారు, 6 నెలలు అద్ధంలో చూసుకోలేదు #kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA — Prakash Raj (@prakashraaj) March 18, 2022 -
The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సంచలన ఆరోపణలు
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలనాలతో పాటు రాజకీయ పరమైన చర్చలకూ నెలవైంది ఇప్పుడు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, సినిమా కలెక్షన్లు సంగతి పక్కనపెడితే.. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా కశ్మీర్ ఫైల్స్ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక విమర్శలకతీతంగా.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై ప్రశంసలు గుప్పిస్తున్నారంతా. మరోపక్క విపక్షాలు సినిమాపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా The Kashmir Files అబద్ధాలు చూపించిందని సెటైర్లు గుప్పించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సైతం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా ఈ అంశంపై వీడియో పోస్ట్‌తో ఓ ట్వీట్ చేశారు. #kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA — Prakash Raj (@prakashraaj) March 18, 2022 ఇదిలా ఉండగా.. ఎన్డీఏ భాగస్వామి నేత ఒకరు కశ్మీర్ ఫైల్స్‌పై సంచలన ఆరోపణలకు దిగారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన Hindustani Awam Morcha వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ సంచలన ఆరోపణలు చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మేకర్లకు ఉగ్రవాద సంబంధిత గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు ఆయన. फिल्म के नाम पर जो माहौल बनाया जा रहा है, उससे हिन्दु-मुस्लिम सहित विभिन्न धर्मों के बीच खाई और बढ़ेगी, जो किसी भी प्रकार से देशहित में नहीं है। — Ashok Gehlot (@ashokgehlot51) March 17, 2022 ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీహార్‌లో ట్యాక్స్ మినహాయింపు ప్రకటించింది ప్రభుత్వం. ఆ మరునాడే జితన్ మాంఝీ విమర్శలు గుప్పించడం విశేషం. ‘‘ఈ మూవీ కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్‌కు తిరిగి రాకుండా వారిలో భయాందోళనలు రేకెత్తించేందుకు ఉగ్రవాద సంస్థల కుట్రగా కనిపిస్తుంద’’ని ట్వీట్ చేశారు మాంఝీ. అంతేకాదు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో సహా కశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉండొచ్చన్న మాంఝీ.. ఈ విషయంపై సీరియస్‌గా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. “द कश्मीर फाइल्स”आतंकवादियों की एक गहरी साजिश भी हो सकती है,जिसे दिखाकर आतंकी संगठन कश्मीरी ब्राम्हण मे खौफ एवं डर का माहौल बना रहें हैं ताकि डर से कश्मीरी ब्राम्हण पुनः कश्मीर ना जा पाएं। “द कश्मीर फाइल्स”फिल्म यूनिट सदस्यों के आतंकी कनेक्शन की जांच होनी चाहिए। .@AnupamPKher — Jitan Ram Manjhi (@jitanrmanjhi) March 18, 2022 इबादतों और बख्शीश की रात शब-ए-बारात की दिली मुबारकबाद। अल्लाह से दुआ है कि वह हम सभी की गलतियों को माफ कर हमारी अर्जियां कबूल फरमाएं। — Jitan Ram Manjhi (@jitanrmanjhi) March 18, 2022 ఇదిలా ఉండగా.. ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను అందించింది కేంద్రం. కశ్మీర్ ఫైల్స్ విడుదల అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే ఏడు నుంచి ఎనిమిది సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు భద్రత కల్పించనున్నారు. -
ఇండియాస్ సూపర్ సోల్జర్‌పై 'ఎటాక్'.. అదరగొడుతున్న ట్రైలర్
John Abraham Attack Movie Part 1 Trailer Released: 'సత్యమేవ జయతే 2' సినిమా తర్వాత జాన్ అబ్రహం నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఎటాక్'. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఎటాక్ సినిమా మొదటి పార్ట్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'జీవితంలో రెండు ముఖ్యమైన రోజులుంటాయి. ఒకటి మనం పుట్టిన రోజు. మరొకటి మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు' అంటూ ప్రారంభమైన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్‌తో కట్టిపడేసింది. చాలా థ్రిల్లింగ్‌గా యాక్షన్ ఉంది. శశ్వాత్ సచ్దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. యాక్షన్స్ సీన్స్‌లో జాన్ అబ్రహం అదరగొట్టాడు. ట్రైలర్ కట్ చేసిన విధానం వావ్ అనిపిస్తుంది. ఈ మూవీలో తీవ్రవాదాన్ని ఎదుర్కొనే సూపర్ సోల్జర్ పాత్రలో జాన్ అబ్రహం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 'ఎటాక్ అనేది 'జాన్ అబ్రహం ఎంటర్టైన్మెంట్' సొంత స్వదేశీ కాన్సెప్ట్. కథకు తగినట్లుగా యాక్షన్ సన్నివేశాలు అసమానంగా ఉంటాయి. ఈ సినిమాలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ట్రైలర్లో వాటిని చూపించలేదు. ఎందుకంటే ఆ ట్విస్ట్‌లను వెండితెరపైనే చూడాలి.' అని నిర్మాతల్లో ఒకరైనా జాన్ అబ్రహం తెలిపాడు. అలాగే ఈ చిత్రం గురించి డైరెక్టర్ లక్ష్య రాజ్ 'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. అద్భుతమైన నటీనటులు, చిత్ర యూనిట్‌తో తెరకెక్కించాం. మేము పడిన కష్టాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడనున్నారు.' అని పేర్కొన్నాడు. -
వేగంగా పరిగెత్తమంటున్న ఆది.. అలరిస్తోన్న 'క్లాప్' ట్రైలర్
Aadhi Pinisetty Starrer Clap Movie Trailer Released: ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించగా.. ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ మూవీకి ఇళయరాజా సంగీతమందించడం విశేషం. స్పోర్ట్స్ డ్రామాగా తెరెకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న క్లాప్ నేరుగా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. పముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'మనం జీవితంలో ఓడిపోయేది ఎప్పుడో తెలుసా ? మన టాలెంట్ మీద మనకే నమ్మకం లేని ఆ క్షణం' అంటూ ప్రారంభమైన క్లాప్ ట్రైలర్ ఆద్యంతం అలరించింది. 'పరిగెత్తూ.. వేగంగా పరిగెత్తూ.. నువ్వు పోటీ చేసేది మనుషులతో కాదు టైమ్‌తో' అనే డైలాగ్ చివర్లో ఆకట్టుకునేలా ఉంది. భాగ్యలక్ష్మీ అనే యువతిని అథ్లేట్‌గా చేయడానికి ఆది పడిన కష్టమేంటీ అనేదే సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కోచ్‌గా ఆది అదిరిపోయే నటన కనబర్చి ఆకట్టుకున్నాడు. -
సీఎం కేసీఆర్‌తో ప్రకాశ్ రాజ్ భేటీ!
Prakash Raj Meets Telangana CM KCR: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ శనివారం మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించారు. అలాగే గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను కూడా ఆయన పరిశీలించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఒకేచోట అన్ని నిత్యావసరాలు దొరికేలా విశాలమైనమార్కెట్‌ను నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించిన అంశాలను చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మహతి ఆడిటోరియం, ఆర్అండ్ఆర్ కాలనీలను సందర్శించారు. అంతకుముందు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి అక్కడ పంప్‌హౌస్, కట్టను పరిశీలించారు. ప్రకాశ్‌రాజ్ శుక్రవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. సాయంత్రం అక్కడే బస చేసి ఉదయం మల్లన్న సాగర్‌ను సందర్శించారు. శనివారం సాయంత్రం మళ్లీ ఫాంహౌస్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. -
సీఎం కేసీఆర్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
-
ద్విభాషా చిత్రం.. క్లాప్ కొట్టిన అలీ
రెండు భాషల్లో షురూ ప్రకాశ్‌రాజ్, నవీన్ చంద్ర, కార్తీక్ రత్నం కీలక పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం షురూ అయింది. వాలీ మోహన్‌దాస్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో వాణీ బోజన్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ అండ్ కావ్య సమర్పణలో థింక్ బిగ్ బ్యానర్‌పై దర్శకుడు ఏ.ఎల్ విజయ్, శ్రీ షిరిడీ సాయి మూవీస్ అధినేత యం. రాజశేఖర్ రెడ్డి, ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీ క్రియేషన్స్‌పై బి. నర్సింగరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత సి. కల్యాణ్, దర్శక–నిర్మాత తమ్మా రెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు అలీ క్లాప్ కొట్టారు. దర్శకుడు అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. యం. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నేను చెప్పిన ఈ సినిమా కథను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్న ప్రకాశ్ రాజ్, ఏ.ఎల్ విజయ్, నవీన్ చంద్రలకు థ్యాంక్స్’’ అన్నారు. నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు వేగేశ్న సతీష్, రచయిత జనార్ధన మహర్షి, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ అతిథిలుగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: గురుదేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మల్లాల. -
ప్రకాశ్ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ కృష్ణవంశీ
Director Krishna Vamsi Interesting Comments On Prakash Raj: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రకాశ్ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనను రాక్షసుడు అని పిలిచి ఆశ్చర్యపరిచారు. కాగా కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా రంగమార్తాండ. 'నట సామ్రాట్' అనే మరాఠీ సినిమాకి ఇది రీమేక్. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఈ మూవీ రూపొందుతోంది. కాగా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ తాజాగా తిరిగి సెట్స్‌పైకి వచ్చింది. చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్.. దీంతో ప్రకాశ్ రాజ్‌కు సంబంధించిన ఎమోషనల్ క్లైమాక్స్ సీన్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు కృష్ణవంశీ ట్వీటర్లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చివరి దశకు చేరుకున్న రంగమార్తాండ. నేను అత్యంత అభిమానించే నటుడు.. నటరాక్షసుడు ప్రకాశ్ రాజ్‌తో భావోద్వేగభరితమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న.. స్టన్నింగ్’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, రాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: కరోనా ఎఫెక్ట్.. మరో భారీ బడ్జెట్ చిత్రం వాయిదా Started the final ANKAM of RANGAMARTHANDA..... Shooting a most emotional climax with my most fav actor NATARAKSHSA prakashraj ... Stunning 💕💕💕💕. pic.twitter.com/n9PRnR5sEH — Krishna Vamsi (@director_kv) January 6, 2022 -
MAA: రాజీనామాలపై మంచు విష్ణు కీలక నిర్ణయం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ‘మా’ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలుపొందిన 11 మంది రాజీనామాలను ఆమోదించారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని మంచువిష్ణు క్లారిటీ ఇచ్చారు. అయితే ‘మా’సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించలేదని తెలిపారు. ‘మా’ బిల్డింగ్‌పై చర్చలు జరుగుతున్నాయని.. వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుని మంచు విష్ణు అనఆనరు. కాగా, ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు…ప్రకాశ్ రాజ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొంది, రాజీనామా చేసిన సభ్యులు వీరే జాయింట్ సెక్రటరీ: ఉత్తేజ్ వైస్ ప్రెసిడెంట్: బెనర్జీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్ ఈసీ మెంబర్స్ బ్రహ్మాజీ శివారెడ్డి సుడిగాలి సుధీర్ ప్రభాకర్ తనీష్ కౌశిక్ సురేశ్ కొండేటి సమీర్ -
ప్రకాశ్‌రాజ్ మౌనవ్రతం..దానికోసమే అంటూ ట్వీట్
Prakash Raj Will Be In Mouna Vratha For A Week: ఏ విషయం గురించి అయినా ముక్కుసూటిగా మాట్లాడే ప్రకాశ్‌రాజ్..వారం రోజుల పాటు మౌనం వహించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఇదేదో నిరసనతో చేస్తున్నది మాత్రం కాదు. ఇటీవలె కొంత అనారోగ్యానికి గురైన ప్రకాశ్‌రాజ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా వోకల్ కార్డ్స్‌కు వారం పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇవ్వమని వైద్యులు సూచించారట. దీంతో వారం రోజుల పాటు మౌన వ్రతం అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు..గెట్ వెల్ సూన్ సర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలే సూర్య ప్రధాన పాత్రలో నటించిన జైభీమ్ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. ఇందులో ప్రకాశ్‌రాజ్ ఓ వ్యక్తిని కొట్టే సీన్‌పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. Had a complete check up with the doctors.. I’m rocking .. only my vocal chords need complete rest for a week. So “Mouna vratha “ .. will bask in silence..Bliss — Prakash Raj (@prakashraaj) November 15, 2021 -
Jai Bhim :‘చెంప దెబ్బ’ సీన్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్
తమిళ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజాగా చిత్రం ‘జైభీమ్’. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీకీ చెందిన సెలెబ్రిటీలందరూ ఈ సినిమాని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో తమ స్పందనను తెలుపుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం పోలీసులు కొన్ని కులాలకి చెందిన నిరుపేద ప్రజలని ఎలా టార్గెట్ చేసి హింసించేవారనేది ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడంటూ దర్శకుడు జ్ఞానవేల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ సినిమాలో వచ్చిన ఓ చెంపదెబ్బ సీన్ వివాదంగా మారింది. (చదవండి: Jai Bhim: ఎవరీ జస్టిస్ చంద్రు? జై భీమ్ మూవీతో ఆయనకేం సంబంధం?) ఓ సీన్లో హిందీ మాట్లాడుతున్న వ్యక్తిని ప్రకాష్‌రాజ్ చెంపదెబ్బ కొడతాడు. విచారణలో భాగంగా పోలీసు అధికారిగా నటించిన ప్రకాశ్ రాజ్ అలా కొడతాడు. అయితే 'ఇది హిందీ భాషని అవమానించడమే' అంటూ కొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ప్రకాశ్ రాజ్స్పందించాడు. ‘జై భీమ్ సినిమాలో అణగారిన వర్గాల బాధని, వాళ్లు పడే కష్టాన్ని చూపించాం. కానీ కొంతమంది అసలు విషయాన్ని మరిచి.. చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు’అని ప్రకాశ్ రాజ్ ట్విట్ చేశాడు. నేను నటించాననే కారణంతో ఈ సినిమాను వివాదంలోకి లాగుతున్నారు. ఇలాంటి వివాదాలపై స్పందించడం అర్థం లేదు’అని ఆయన తెలిపారు. -
జై భీమ్ హిట్ టాక్: ఆ సీన్‌పై దుమారం
సాక్షి, హైదరాబాద్: అమాయకులపై కొందరు పోలీసులు, ముఖ్యంగా దొంగలుగా దళితులపై ముద్ర వేస్తూ పోలీసులు అక్రమ కేసులు, వేధింపుల నేపథ్యంలో తెరకెక్కిన జై భీమ్ ఓటీటీలో హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తమిళనాడులోని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సూర్య చంద్రు పాత్రలో జీవించారు. అయితే విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ మూవీలోని ఒక సీన్‌పై వివాదం నడుస్తోంది. హిందీలో మాట్లాడే వ్యక్తిని ప్రకాశ్ రాజ్ 'చెంపదెబ్బ' సన్నివేశం చర్చకు దారి తీసింది. హిందీలో మాట్లాడినందుకే అలా అతగాడి చెంప చెళ్లుమనిపించాడని సోషల్‌మీడియాలో కొంతమంది విమర్శలకు దిగారు. అయితే నిర్దిష్ట పాత్ర (రైస్ మిల్లు యజమాని) జరిగిన నేరంలోని నిజాల్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యూహం తెలిసి హిందీలో మాట్లాడుతున్న ఆ పాత్రను అలా కొట్టాడు తప్ప, హిందీ మాట్లాడే ఇండియన్స్‌కు వ్యతిరేకంగా కాదు, తమిళ చిత్ర నిర్మాతలు హిందీ భాషకు వ్యతిరేకం కాదని కొంతమంది స్పందిస్తున్నారు. హిందీలో మాట్లాడినందుకు చెప్పుతో కొట్టడానికి దీనికి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. కాగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకున్నారు సూర్య, జ్యోతిక దంపతులు. నవంబరు 2, మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. பணம் சம்பாதிக்க எல்லா மொழியிலும் படம் எடுப்பாணாம் இங்க இருக்குற குழந்தைகள் மட்டும் வேற மொழி படிக்க கூடாதாம் 😠#ஜெய்பீம் தமிழ் பதிப்பு ~என்னை ஏன் அடிக்கிறாய்? ~தமிழில் பேசுங்கள் #ஜெய்பீம் ஹிந்தி பதிப்பு ~என்னை ஏன் அறைந்தாய்? ~இப்போது உண்மையைச் சொல்.. #FraudsOfSurya pic.twitter.com/FXD2ve7dCW — Karthikeyan S 🚩🇮🇳ௐ🕉️🌷 (@karthikbjpkarur) November 2, 2021 He uses Hindi to obfuscate the truth about his involvement in a crime. He collaborates with Tamil criminals. This has nothing to do with being slapped for speaking in Hindi. https://t.co/vp5zPNAuGU — Udhav Naig (@udhavn) November 2, 2021 Hi, the scene is not against Hindi-speaking Indians. The particular character tries to get away by speaking in Hindi (so that Prakash Raj wouldn't understand) and knowing this strategy, he slaps and asks him to speak in Tamil.Tamil filmmakers are not against the language Hindi1/2 — Rajasekar (@sekartweets) November 2, 2021 -
జై భీమ్ మూవీ రివ్యూ
టైటిల్ : జై భీమ్ నటీనటులు : సూర్య, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రాజిష విజయన్, లిజోమోల్ జోసీ, మణికంఠన్ తదితరులు నిర్మాతలు : సూర్య, జ్యోతిక దర్శకత్వం : టి.జె.జ్ణానవేల్ సంగీతం : షాన్ రొనాల్డ్ ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్ సినిమాటోగ్రఫీ : ఎస్.ఆర్.కాదిర్ విడుదల తేది : నవంబర్ 02, 2021(అమెజాన్ ప్రెమ్ వీడియో సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకే పెద్ద పీట వేస్తుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. విభిన్నమైన కథలతో తెరకేక్కే సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతాడు. కొత్త కొత్త గెటప్ లలో దర్శనం ఇస్తూ సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేస్తాడు. సూర్య కెరీర్లో అత్యధిక విజయాలు ప్రయోగాల ద్వారా వచ్చినవే. తాజాగా ఈ స్టార్ హీరో చేసిన మరో ప్రయోగమే ‘జై భీమ్’.కోర్టు రూమ్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. దళితులపై అగ్ర కులాల ఆకృత్యాల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. (Jai Bhim: దుమారం రేపుతున్న ‘చెంపదెబ్బ’ సీన్) కథేటంటే.. రాజన్న(మణికందన్), సినతల్లి(లిజోమోల్ జోస్) దళిత దంపతులు. పాములు పట్టుకుంటూ జీవనం సాగిస్తారు. ఒక రోజు ఆ ఊరి ప్రెసిడెంట్ ఇంట్లోకి పాము రావడంతో దాన్ని పట్టుకునేందుకు రాజన్న వెళ్తాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఈ కేసులో రాజన్నను అరెస్ట్ చేస్తారు పోలీసులు. పాములు పట్టే క్రమంలో అన్ని గమనించే రాజన్న ఈ చోరీకి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేస్తారు. నేరం ఒప్పుకోమని రాజన్నతో పాటు అతని కుటుంబ సభ్యులను సైతం వేధిస్తారు. అయితే చేయని తప్పుని ఒప్పుకోనని మొండికేస్తాడు రాజన్. కట్ చేస్తే.. జైలు నుంచి రాజన్న తప్పించుకుపోయాడని భార్య సినతల్లికి చెబుతారు పోలీసులు. దీంతో తన భర్త ఏమయ్యాడో తెలియక ఆమె బాధపడుతుంటుంది. తన భర్త ఆచూకి కోసం లాయర్ చంద్రు(సూర్య)ను కలుస్తుంది సినతల్లి. ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ కేసును టేకాప్ చేస్తాడు చంద్రు. ఈ క్రమంలో చంద్రుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? రాజన్న కోసం చంద్రు వేసిన పిటిషన్ కారణంగా ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి?ఇంతకీ రాజన్న ఏమయ్యాడు? అనేదే ‘జైభీమ్’కథ ఎవరెలా చేశారంటే..? లాయర్ చంద్రు పాత్రలో సూర్య ఎప్పటి మాదిరే అద్భుతంగా నటించాడు. కోర్టు సీన్స్‌లో ఆయన పలికించిన హావభావాలు మనసును తాకుతాయి. ‘ఆకాశం నీ హద్దురా’లాంటి అద్భుతమైన చిత్రం తర్వాత.. అదే స్థాయి డెప్త్ ఉన్న రోల్ తనది. చంద్రు పాత్రలో సూర్య తప్ప మరొకరని ఊహించుకోలేం. ఇక గిరిజన దంపతులుగా మణికందన్, లిజో మోల్ జోసేలు అద్భుత నటనను కనబరిచారు. ముఖ్యంగా సినతల్లిగా నటించిన లిజోమోల్ జోస్ గురించి చెప్పాలి. సమాజంలోని దాష్టీకాన్ని ఎదిరించే దళిత మహిళగా ఆమె నటన అభినందనీయం. డీజీపీ దగ్గర ఆమె చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సిన్సియర్ పోలీస్ గా ప్రకాష్ రాజ్, పంతులమ్మగా రజిషా విజయన్, రావు రమేశ్ తమదైన నటనతో మెప్పించారు. జై భీమ్ ఎలా ఉందంటే..? పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన తన భర్తను విడిపించుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ‘జై భీమ్’. తమిళనాడులోని కడలూరులో జరిగిన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించాడు దర్శకుడు జ్ణానవేల్. ఇటీవల తెలుగులో వచ్చిన వకీల్ సాబ్, నాంది, తిమ్మరుసు సినిమాల మాదిరే ‘జైభీమ్’ కూడా కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ఓ అమాయకుడు చేయని తప్పుకు జైలుపాలవ్వడం.. ఆ కేసును హీరో టేకప్ చేసి, ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొడుతూ.. చివరకు న్యాయం జరిపించడం. దాదాపు కోర్టు డ్రామా నేపథ్యంలో వచ్చే సినిమాలన్ని ఇలానే సాగుతాయి. దర్శకుడు జ్ఞాన్వేల్ అలాంటి పాయింట్‌నే ఎంచుకుని ఉత్కంఠ భరితంగా ‘జై భీమ్’ను తెరకెక్కించాడు. తాను ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో వందశాతం సఫలమయ్యాడు. అమాయకులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు పెట్టి, వారు నేరం ఒప్పుకునేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడతారనే విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. లాయర్ చంద్రుగా సూర్య ఎంట్రీ అయినప్పటి సినిమాపై ఆసక్తి పెరుగుతంది. అరెస్ట్ అయిన రాజన్న జైలులో కనిపించకపోవడం, అతను ఏమయ్యాడే విషయాన్ని చివరి వరకు చెప్పకపోవడంతో సినిమాపై ఉత్కంఠ పెరుతుంది. పోలీసులు అతడిని ఏం చేశారు? అసలు బతికే ఉన్నాడా? అన్న ప్రశ్నలు ప్రేక్షకుడి మదిలో మొదలవుతాయి. చివరకు అసలు విషయం తెలిసి భావోద్వేగానికి లోనవుతారు. ఇక క్లైమాక్స్ అయితే అదుర్స్ అనే చెప్పాలి. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. కట్టిపడేసేలా కథనాన్ని నడిపించాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. షాన్ రొనాల్డ్ సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకి ప్రాణం పోశాడు.ఎస్.ఆర్. కాదిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కోర్టు సన్నివేశాలను తెరపై అద్భుతంగా చూపించాడు. . ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఆసక్తికర అప్డేట్: మెగాస్టార్ వాయిస్‌తో కృష్ణవంశీ ‘రంగమార్తాండ’
ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠిలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘నటసామ్రాట్’ చిత్రానికి రీమేక్‌గా ‘రంగమార్తాండ’ తెరకెక్కింది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి ‘గాడ్‌ఫాదర్’ మెగాస్టార్ చిరంజీవి గొంతు ఇచ్చినట్లు తాజాగా డైరెక్టర్ కృష్ణవంశీ వెల్లడించారు. చదవండి: 'సర్కారు వారి పాట' సెట్లో నమ్రత సందడి ఈ మేరకు ఆయన ట్విట్ చేస్తూ.. ‘అడగ్గానే ఒప్పుకుని.. మరేమీ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మా చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పినందుకు థాంక్యూ అన్నయ్యా’ అంటూ చిరుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మెగా వాయిస్ ‘రంగమార్తాండ’ వినీలాకాశంలో మరో వెలుగు దివ్వె అని అభివర్ణించారు ఆయన 'రంగమార్తాండ' చిత్రంలో ప్రకాశ్ రాజ్‌తో పాటు రమ్యకృష్ణ కీ రోల్ పోషిస్తుండగా.. అనసూయ భరద్వాజ్, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ThQ annyya for ur generocity n unconditional kindness ...one more crowned lightening on #rangamarthandas sky ... THE MEGA VOICE........ @prakashraaj @meramyakrishnan @ShivathmikaR @anusuyakhasba @Rahulsipligunj @AadarshBKrishna @kalipu_madhu pic.twitter.com/mApNqcGvxV — Krishna Vamsi (@director_kv) October 26, 2021 -
రేపు గుడ్‌న్యూస్ చెబుతా : మంచు విష్ణు
Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు కార్యచరణ మొదలు పెట్టారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ ఫైల్‌పై సైన్ చేసిన విష్ణు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఎన్నికల్లో గెలిస్తే మాకు సొంత బిల్డింగ్ కట్టిస్తానని ప్రకటించిన మంచు విష్ణు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. చదవండి : ఘనంగా వైవా హర్ష వివాహం.. ఫోటోలు వైరల్ ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు,మూడు చోట్ల స్థలాలను కూడా చూసినట్లు పేర్కొన్నారు. తాజాగా 'మా'కు సంబంధించి రేపు గుడ్‌న్యూస్ చెబుతానంటూ హింట్ ఇచ్చాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. మరోవైపు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ రాజీనామాలపై కూడా మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న సస్పెన్స్ కూడా నెలకొంది. చదవండి : ఆరోజు జరిగింది ఇదే..వీడియో రిలీజ్ చేసిన మంచు విష్ణు సమంత డబ్బుల కోసం కేసులు వేయలేదు : లాయర్ Have a very good news to share on #MAA front. Will share it tomorrow 💪🏽 — Vishnu Manchu (@iVishnuManchu) October 21, 2021 -
అనుమానాల నివృత్తికే సీసీ ఫుటేజీ పరిశీలన: ప్రకాశ్‌రాజ్
బంజారాహిల్స్(హైదరాబాద్): మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్ ఆరోపించడమే కాకుండా సోమవారం ‘మా’ఎన్నికల పోలింగ్ సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసుల సమక్షంలో పరిశీలించారు. ఈ మేరకు తన ప్యానెల్ సభ్యులైన శ్రీకాంత్, బెనర్జీ, తనీష్‌తో కలిసి ఉదయం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చేరుకొని బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్, ఇన్స్పెక్టర్ రాజ శేఖర్‌రెడ్డి, సెక్టార్ ఎస్ఐ శివశంకర్‌తో కలిసి ఫుటేజీని వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసమే పోలింగ్ సెంటర్లో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించామన్నారు. ఎన్నికల అధికారి వద్ద మరో ఏడు కెమెరాలకు సంబంధించిన ఫుటేజీ ఉందని, దాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. తమకు కేవలం ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌తోనే ఇబ్బందులున్నాయని ఆరోపించారు. -
చాలా విషయాల్లో బైలాస్ మార్చాలనుకుంటున్నా: మంచు విష్ణు
Manchu Vishnu Talks In Press Meet Over MAA Bylaws: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలని అనుకుంటున్నట్లు తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎవరు పడితే వాళ్లు ‘మా’ సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన ప్యానల్ సభ్యులతో కలిసి మంచు విష్ణు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం శ్రీవిద్యానికేతన్‌లో విష్ణు తన ప్యానల్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా విషయాల్లో అసోసియేషన్‌లోని బైలాస్‌ను మార్చాలనుకుంటున్నానన్నారు. చదవండి: ఆవేశం తగ్గించుకోండి, మరో రెండేళ్లు కూడా విష్ణునే అధ్యక్షుడు: బాబూ మోహన్ బైలాస్ మార్చడమంటే అంత ఈజీ కాదని, దీనిపై సినీ పెద్దలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఎవరంటే వాళ్లు ‘మా’ సభ్యులు కాకూడదనేదని తాను భావిస్తున్నానని మంచు విష్ణు పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని, అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు. ఆ రోజు రాత్రి లేట్ అవ్వడంతో మరునాడు కౌంటింగ్ కొనసాగించారని తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ అడగడం ‘మా’ సభ్యుల హక్కని విష్ణు చెప్పారు. ప్రకాశ్‌రాజ్, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారని, అయితే వారి రాజీనామాను ఆమోదించలేదన్నారు. త్వరలోనే దీనిపై ప్రకాశ్ రాజ్‌కు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తానని మంచు విష్ణు తెలిపారు. చదవండి: 'మా' ఎన్నికల్లో మరో వివాదం.. పోలీసుల ఎంట్రీ -
'మా' ఎన్నికల్లో మరో వివాదం.. పోలీసుల ఎంట్రీ
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. పోలింగ్ రోజున జరిగిన పరిణామాలపై ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజ్ కోరిన ప్రకాశ్‌రాజ్ తాజాగా ఆయన ప్యానల్ సభ్యులతో కలిసిజూబ్లీహిల్స్ స్కూల్‌కు చేరుకున్నారు. సీసీ ఫుటేజీ తమకు అందించాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ను డిమాండ్ చేశారు.అయితే మంచు విష్ణు లేనందున ఇరువురి సమక్షంలో మాత్రమే సీసీ ఫుటేజీ ఇస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్‌కు సీసీటీవీ ఫుటేజీని ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో వివాదం నెలకొంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేసే క్రమంలో జూబ్లీహిల్స్ స్కూల్‌కు పోలీసులు సైతం చేరుకున్నారు. ఈ సందర్భంగా సీసీ ఫుటేజీని ప్రిజర్వ్ చేస్తామని ఈ సందర్భంగా పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వివాదం నెలకొంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేసే క్రమంలో జూబ్లీహిల్స్ స్కూల్‌కు పోలీసులు సైతం చేరుకున్నారు. కాగా, అలాగే ప్రుకాశ్ రాజ్ ఆరోపణలపై స్పందించిన మంచు విష్ణు.. ‘ప్రకాశ్ రాజ్ సంతోషంగా సీసీ పుటేజ్‌ను చూడొచ్చు. మేము ప్రజాస్వామ్య బద్ధంగానే గెలిచాం. ఎన్నికల సమయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు ఇరువైపుల జరిగి ఉండోచ్చు. దీంతో మా మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మాత్రమే వచ్చాయి తప్ప అక్కడ ఏం జరగలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానల్లో గెలిచిన వారి రాజీనామాలు మేము మీడియా ద్వారానే విన్నాం. ఇప్పటి వరకు నాకు ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది. మిగతా ఆయన ప్యానల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు’ అని విష్ణు స్పష్టం చేశారు. అలాగే ప్రకాశ్ రాజ్, నాగబాబుల రాజీనామాలు తాను ఆమోదించలేదని విష్ణు తెలిపారు. కాగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఈనెల 10న జరిగిన ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది: మంచు విష్ణు పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర ట్వీట్ చేసిన మంచు విష్ణు -
‘మా’లో వివాదంలో మరో ట్విస్ట్.. రంగంలోకి పోలీసులు
MAA Elections 2021: ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసి వారం రోజులు గడుస్తున్నా... వివాదం మాత్రం తగ్గడం లేదు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానల్ మధ్య హోరా హోరిగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేశారు ప్రకాశ్ రాజ్. అంతేకాదు ఎన్నికల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామాలు కూడా చేశారు. ఓట్ల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని, ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. ఎలక్షన్ టైం సీసీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. కానీ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని వెల్లడించారు. తాజాగా ఈ వివాదం కొత్త కోణం చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తూందో చూడాలి. -
'మా' ఎన్నికలపై ఆర్జీవీ సెటైర్లు.. ట్వీట్ వైరల్
RGV Satirical Comments On MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈసారి సినీ ఇండస్ట్రీనే కాదు..తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ అంటూనే ప్రత్యక్ష ఆరోపణలకు తెరదీశారు. ఎన్నికలు పూర్తయినా ఇంకా మాటల దాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. చదవండి: వైరల్: షో మధ్యలో బాలయ్యకు ఫోన్ చేసిన రోజా సినీ ప్రముఖులు సైతం మా ఎన్నికలు జరిగిన తీరుపై బహిరంగంగానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మా ఎన్నికలపై తనదైన స్టైల్లో స్పందించారు. మా మొత్తం ఎపిసోడ్ సర్కస్‌లా ఉందని, సిని'మా' వాళ్లు సర్కస్ లాంటి వాళ్లని ప్రజలకి నిరూపించారంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Cine”MAA”people proved to the audience, that they are actually a CIRCUS 😳😳😳😳 — Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2021 చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్ చిరు చెల్లెలి బర్త్‌డే : స్పెషల్ విషెస్ తెలిపిన 'భోళా శంకర్' -
విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం!
Manchu Vishnu MAA President: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు, గెలిచిన కార్యవర్గ సభ్యులు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో పదవి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా రానున్నారు.. అలాగే నందమూరు బాలకృష్ణను సైతం విష్ణు ప్రత్యేకంగా ఆహ్వానించారు. చదవండి: ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్ బాబు, విష్ణు కాగా శుక్రవారం నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో అరగంట పాటు మోహన్ బాబు, విష్ణులు చర్చించిన సంగతి తెలిసిందే. అలాగే.. సినీ పెద్దలు పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంను కలిసి ప్రమాణా స్వీకార మహోత్సవానికి రావాలని విష్ణు కోరారు. అయితే సినిమా పెద్దలను ఆహ్వానించిన విష్ణు.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించనట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కౌంటింగ్ రోజున.. త్వరలో చిరంజీవిని వ్యక్తిగతంగా కలుస్తానని మంచు విష్ణు చెప్పిన సంగతి విదితమే. చదవండి: ‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చమని సూచించారు: మంచు విష్ణు కానీ ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన ఎవరిని విష్ణు ఆహ్వానించనట్లుగా సమాచారం. ఇక గురువారం విష్ణు సోదరుడు మంచు మనోజ్, పవన్ కల్యాణ్‌ను ఓ సినిమా సెట్లో కలిశారు. అక్కడ పవన్ అరగంట పాటు చర్చిన మనోజ్ విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పవన్‌ను కోరినట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై విష్ణు టీం కానీ, పవన్ టీం కాని స్పష్టత ఇవ్వలేదు. అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తానన్నా మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్, అతని ప్యానెల్లో గెలిచిన సభ్యులకు ప్రమాణ స్వీకారానికి రావాలని ఫోన్లో ఆహ్వాన సందేశం పంపారు. అలాగే ప్రతి మా సభ్యుడికి మా కార్యాలయం మెసెజ్ ద్వారా ఆహ్వానం పంపింది. -
చల్లారని ‘మా’ రగడ.. ఎన్నికల అధికారికి లేఖ రాసిన ప్రకాశ్ రాజ్
MAA Elections 2021 Results: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పర్వం ముగిసినప్పటికీ ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలింగ్ జరిగిన తీరుపై అనుమానం వ్యక్తం చేశారు ప్రకాశ్‌రాజ్. పోలింగ్ జరిగిన రోజు సీసీటీవీ దృశ్యాలు ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు గురువారం లేఖ రాశారు. పోలింగ్‌రోజు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మోహన్‌బాబు, నరేశ్ మా సభ్యులను బెదిరించడమే కాకుండా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. మీరే వారిని, వారి అనుచరులను పోలింగ్ ప్రదేశాల్లోకి అనుమతించారని భావిస్తున్నామన్నారు. మా ఎన్నికలు జరిగిన తీరు జనంలో మనల్ని చులకన చేసిందన్నారు. అసలేం జరిగిందన్నది మా సభ్యులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారని, ఇందుకోసం పోలింగ్ సమయంలో రికార్డైన సీసీ టీవీ దృశ్యాలు తమకు ఇవ్వాల్సిందిగా కోరారు. త్వరగా స్పందించకపోతే సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించడం లేదా మార్చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 3 నెలల వరకు దృశ్యాలు భద్రపరచడం మీ బాధ్యత అంటూనే వాటిని కోరే హక్కు తమకు ఉందని నొక్కి చెప్పారు. ప్రకాశ్‌రాజ్ లేఖపై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్ మా ఆఫీసులో భద్రంగానే ఉందని, నిబంధనల ప్రకారం ఎవరడిగినా ఇవ్వడానికి రెడీ అని తెలిపారు. -
అనసూయ ఆరోపణలపై స్పందించిన కృష్ణమోహన్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. వివాదాలు, విమర్శలకు మాత్రం పుల్‌స్టాప్ పడడం లేదు. ముఖ్యంగా ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాశ్ రాజ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు.. తన ప్యానల్ తరపున గెలిచిన 11 మందితో రాజీనామాలు చేయించాడు. ఇదే సమయంలో కౌంటింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయని ప్రకాశ్ రాజ్ ప్రెస్మీట్లో ఆరోపించారు. ఆయన ప్యానల్ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయిన యాంకర్ అనసూయ సైతం పోలింగ్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆమె విజయం సాధించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో అనసూయతో పాటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ షాక్‌కు గురైంది. దీనిపై ‘‘రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా’ అంటూ ఆమె సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. ఇక మంగళవారం ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి బ్యాలట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు. తాజాగా ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన కృష్ణమోహన్.. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారికంగా అనౌన్స్ చేయడానికి ముందే ఆమె గెలిచినట్టు మీడియాలో ప్రచారం జరిగిందని కృష్ణమోహన్ చెప్పారు. తాను బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లానని చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బ్యాలెట్ పేపర్లను ఉంచిన బాక్స్‌ల తాళాలను మాత్రమే తాను ఇంటికి తీసుకెళ్లానని కృష్ణమోహన్ స్పష్టం చేశారు. -
ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌పై ఫైర్ అయిన నరేష్
MAA Elections 2021 Resignation: కలిసి పని చేస్తాం అన్నవాళ్లు ఎందుకు రాజీనామా చేశారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) మాజీ అధ్యక్షుడు నరేష్ ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన అనంతరం నేడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: Maa Elections 2021: పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకం చేసిన మంచు విష్ణు 'కలిసి పనిచేస్తాం అన్నవాళ్లు..రాజీనామా ఎందుకు చేశారు? ఓడినా, గెలిచినా కలసి పనిచేస్తాం అన్నారు. మరి ఇప్పుడేమైంది? బయటి నుంచి ప్రశ్నించడం ఏంటి? నరేంద్ర మోదీ గెలిచాడని కాంగ్రెస్ వాళ్లు దేశం వదిలి వెళ్లలేదు కదా. 'మా' అనేది కుటుంబం. గెస్ట్‌గా వచ్చిన వాళ్లే ఇది కుటుంబం కాదు అంటారు. ఫ్యాక్షనిజం మానేద్దాం. కలసి పనిచేద్దాం. రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ గురించి కొత్త ప్యానల్ చూసుకుంటుంది. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగోదు. ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. ఎమోషన్స్.. ప్రస్టేషన్ వద్దు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. కానీ గెలిచాక కూడా ఆరోపణలు చేయడం ఏంటి' అంటూ ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులపై నరేష్ అసహనం వ్యక్తం చేశారు. చదవండి: రోజుకో ట్విస్ట్.. మంచు విష్ణు యాక్షన్ ప్లాన్ ఏంటి? -
అప్పుడు స్టూడియో బయటకు వెళ్లి ఏడ్చాను: ప్రకాశ్ రాజ్
‘మా’ ఎన్నికల్లో ఓడిన ప్రకాశ్ రాజ్ తన ప్యానల్లో గెలిచిన సభ్యులతో కలిసి ముకుమ్ముడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా రాజీనామా, ఆరోపణలతో పరిశ్రమలో రచ్చ కొనసాగుతుండగా.. ఇటీవల ఆయన ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి బయటకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన తనకు సంబంధించిన పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. ఈ మేరకు ఆయన వెండితెర ఎంట్రీ గురించి హోస్ట్ అడగ్గా ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. తన సొంతూరు బెంగళూరని, పుట్టి పెరిగిందంతా అక్కడే అని చెప్పారు. అలాగే బెంగళూరులో ఉన్నపుడు నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడినని, అలా నటనపై ఆసక్తి కలిగిందన్నారు. ఇలా ఓ నాటకంలో నా ప్రదర్శన చూసిన సీనియర్ నటి లక్ష్మీ గారు దక్షిణాన గొప్ప నటుడివి అవుతావని ప్రశంసించారని చెప్పారు. చదవండి: బిగ్‌బాస్ 5: స్పెషల్ ఎపిసోడ్లో ఆది, 25 నిమిషాలకే షాకింగ్ రెమ్యునరేషన్! ‘ఓ సారి నా ఫొటోను ఆర్టిస్ట్ గీత బాలచందర్‌కు పంపించారు. ఆ తర్వాత నేను కూడా ఒకసారి వెళ్లి ఆయనను కలిశాను. 9 నెలల తర్వాత ఓ రోజు బాలచందర్ ఫోన్ చేసి అవకాశం ఇచ్చారు. అలా డ్యూయెట్లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా అంతగా విజయం సాధించనప్పటికీ నా కెరీర్‌కు ఉపయోగపడింది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక గతంలో తనపై విధించిన నిషేధంపై ఈ సందర్భంగా హోస్ట్ ఆయనను ప్రశ్నించగా ఇందుకు ప్రకాశ్ రాజ్.. మహేశ్ బాబుతో ఆగడు సినిమా చేయాల్సి ఉందని, ఆ సినిమా సమయంలోనే జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో తనని బ్యాన్ చేశారన్నారు. ‘శ్రీనువైట్ల ‘ఆగడు’ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో నా డేట్స్ కుదరలేదు. వెంటనే దర్శకుడు శ్రీను వైట్ల నా స్థానంలో సోనూ సూద్‌ను తీసుకున్నారు. చదవండి: పుష్ప: అదిరిపోయిన రష్మిక ‘శ్రీవల్లి’ సాంగ్ దీనిపై నేను ప్రశ్నంచడంతో బూతులు తిట్టానని ఆరోపిస్తూ నాపై నిషేధం విధించారు’ అని ఆయన తెలిపారు. అంతేగాక ఏ భాషలోనైనా తన డబ్బింగ్ తానే చెప్పుకుంటానని, ఎందుకంటే భాష మాట్లాడకపోతే మన ప్రదర్శన కనిపించదన్నారు. తన మొదటి తెలుగు సినిమాకు సాయి కుమార్ తమ్ముడు రవి డబ్బింగ్ చెప్పారని, అప్పడు బాలసుబ్రహ్మణ్యం స్టూడియో డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ సమయంలో తాను ఆయనకు అలా కాదు ఇలా అంటూ సూచనలు ఇస్తుంటే నామీదకు అరిచి బయటకు వెళ్లామంటూ గట్టిగా అరిచారని చెప్పారు. దీంతో స్టూడియో బయటకు వచ్చి ఏడ్చేశానని, అయితే తనకు భాష నేర్చుకోవడం అన్న, సాహిత్యం చదవడమన్న ఇష్టమన్నారు. భాష నేర్చుకోవడమంటే వారి సంస్కృతిని గౌరవించినట్లు అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
రోజుకో ట్విస్ట్.. మంచు విష్ణు యాక్షన్ ప్లాన్ ఏంటి?
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసినా రోజుకో ట్విస్ట్ తెరమీదకి వస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు చాలా ఉత్కంఠను రేపాయి. అదే స్థాయిలో ఎన్నికల తర్వాత కూడా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్, నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం, అనంతరం ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలను ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: ఆ విషయం గురించి నేను చెప్పకూడదు: 'మా' ఎన్నికల అధికారి మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన ముందు అనేక సవాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు ఈ మూకుమ్మడి రాజీనామాలను ఆమోదిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా మా అసోసియేషన్‌లో ఏదైనా ఒక పదవి ఖాళీ ఏర్పడితే, దాన్ని భర్తీ చేసే అధికారి మా అధ్యక్షుడికే ఉంటుంది. ‘మా’ బైలాస్ నిబంధన ప్రకారం.. మా సభ్యుడి పోస్ట్‌కు ఖాళీ ఏర్పడితే.. ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకొని దాన్ని భర్తీ చేస్తారు. దీనికి జనరల్ బాడీ సభ్యులందరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి మూకుమ్మడి రాజీనామాలను సైతం ఆమోదించి ఆ స్థానంలో కొత్తవారిని నామినేట్ చేస్తారా? లేక బుజ్జగింపులు చేసి రాజీనామాలను వెనక్కి తీసుకునేలా ఒప్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది. చదవండి: కొత్త కుంపటిపై ప్రకాశ్‌రాజ్ క్లారిటీ -
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల అధికారి
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. ఎన్నికలు ముగిసినా కాంట్రవర్సరీలు, ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ప్రకాశ్‌రాజ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? అనే ప్రశ్నను లేవనెత్తారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.చదవండి: ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!... బ్యాలెట్ పేపర్స్‌ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయంపై మా ఎన్నికల అధికారి కృష్ణమోషన్ స్పందించారు. యాంకర్ అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందన్న వ్యాఖ్యల్లో నిజం లేదని, అధికారికంగా ప్రకటించక ముందే వార్తలు ఎలా బయటకు వెళ్లాయో తెలియడం లేదన్నారు. ఇక తాను బ్యాలెట్ పేపర్లను తీసుకెళ్లినట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. తాను బ్యాలెట్ పేపర్ల తాళాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లానని, బ్యాలెట్ పేపర్లు కాదని స్పష్టం చేశారు.ఇక ప్రకాశ్‌రాజ్ రాజీనామాపై స్పందిస్తూ..అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం అని, ఇది కరెక్టా కాదా అన్నది ఎలక్షన్ కమిషనర్‌గా తాను చెప్పకూడదు, చెప్పలేనని పేర్కొన్నారు. దీనిపై మా ప్రెసిడెంట్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.చదవండి: మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ -
మోహన్ బాబు తిడుతుంటే విష్ణు ఆపాడు: తనీష్
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11మంది రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో తనీష్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలింగ్ రోజు తనను మోహన్ బాబు బూతులు తిట్టారని ఎమోషనల్ అయ్యాడు. 'నేను ఏరోజూ మీడియా ముందుకు రాలేదు. వివాదాలకు మొదట్నుంచి నేను దూరంగా ఉన్నాను. నాకు ఓటేసిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. పోలింగ్ రోజు మోహన్ బాబు నన్ను బూతులు తిట్టారు. ఆపేందుకు ప్రయత్నించిన బెనర్జీని సైతం మోహన్ బాబు తిట్టిపోశారు. మంచు విష్ణు మధ్యలో జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపారు. మా అమ్మను కించపరిచే బూతులు మోహన్‌బాబు తిట్టారు. నాకు నా తల్లే సర్వస్వం. అలాంటిది ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. గతంలో వివిధ సందర్భాల్లో నరేష్ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది' అంటూ తనీష్ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ -
కొత్త కుంపటిపై ప్రకాశ్‌రాజ్ క్లారిటీ
Prakash Raj Clarity On New Association : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన ప్యానల్ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం' అని ప్రకాశ్‌రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్‌కు పోటీగా మరో అసోసియేషన్ పెడుతున్నారంటూ ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. చదవండి: మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ 'ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(ATMAA)'పేరుతో కొత్త అసోసియేషన్ ప్రకటించనున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ రూమర్స్‌పై ప్రకాశ్ రాజ్ స్పందించారు. కొత్త కుంపటి పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన స్పష్టం చేశారు. చదవండి: ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!... -
MAA Elections 2021: అందుకే రాజీనామా చేశాం : శ్రీకాంత్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు తెచ్చిన సంక్షోభంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరుపున గెలిచిన11 మంది రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందిన శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతాన్ని దృష్టిలో పెట్టుకొనే రాజీనామా చేస్తున్నామని తెలిపారు. రెండు ప్యానళ్లకు చెందిన సభ్యులు ఉంటే.. ‘మా’అభివృద్ది ఆటంకం ఏర్పడుతుందని, సమస్యలు ఎత్తి చూపితే తమ వళ్లే జరగలేదని చెప్పే అవకాశాలు ఉన్నాయని.. అందుకే ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలిచిన వారంతా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో ‘మా’అధ్యక్షుడిగా చేసిన నరేశ్ ఆధ్వర్యంలోనే మంచు విష్ణు పనిచేస్తాడని శ్రీకాంత్ ఆరోపించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని విష్ణు నెరవేర్చాలని, లేదంటే కచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పారు. ‘మా’సంక్షేమం కోసమే తాము రాజీనామా చేశామని, తమకు ఓట్లేసిన వారు ఈ ఒక్కసారి క్షమించాలని శ్రీకాంత్ కోరారు. -
మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్
Maa elections 2021: ప్రకాశ్‌రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: నేను అసమర్థుడిని కాను.. మౌనంగా ఉన్నా అంతే : మోహన్ బాబు బెనర్జీపై చేయి చేసుకున్నారు 'రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. మోహన్ బాబు ఎన్నికల ప్రక్రియలోనే కూర్చున్నారు ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారు. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్ నటుడిపై చేయి చేసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన మా సభ్యులు అన్నారు. అందుకే మా ప్యానల్ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం' అని ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. రాజీనామా చేసినా ప్రశ్నిస్తాం.. ఇక తన రాజీనామా గురించి మాట్లాడుతూ..మాలోనే కొనసాగుతానని, రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని, అయితే దానికి ఓ కండీషన్ ఉందని ప్రకాశ్‌రాజ్ అన్నారు. బైలాస్‌లో బయటవాళ్లు పోటీ చేయకుండా మార్పు చేయవద్దు. ఎవరైనా పోటీ చేయవచ్చు అన్నదానికి విష్ణు ఒప్పుకుంటే రాజీనామాను వెనక్కి తీసుకుంటా అని పేర్కొన్నారు. ఇక రాజీనామా చేసినా మా సభ్యల సంక్షేమం కోసం ప్రశ్నిస్తామని, ఓడిపోయాం అని మేం వదిలేయబోమని స్పష్టం చేశారు. చదవండి: అనసూయకు బిగ్ షాకిచ్చిన 'మా' -
కొత్త కుంపటి పెట్టేందుకు సిద్ధమైన ప్రకాశ్‌రాజ్!
Maa elections 2021: మోహన్ బాబు సమక్షంలో మా ఎన్నికలు జరిగాయని ప్రకాశ్ రాజ్ అన్నారు. తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరూ కలిసి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇక కథ ముగిసింది అనుకుంటే మరో కొత్త కథ తెరమీదకు వచ్చింది. మా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్ కొత్త కుంపటి పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరికాసేపట్లో ప్రకాశ్‌రాజ్ ప్రెస్‌మీట్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే మా సభ్యత్వానికి ప్రకాశ్‌రాజ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ఆలోచనలపై రకరకాల ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. ప్రకాశ్‌రాజ్ ప్రెస్‌మీట్‌పై టాలీవుడ్లో ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏం చెప్పబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మరోవైపు ఓటమికి జీర్ణించుకోలేక ఇలా కొత్త అసోసియేషన్ వైపు అడుగులు వేయడం ఎంత వరకు సమంజసం అంటూ ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ఒకవేళ ప్రకాశ్‌రాజ్ కొత్త అసోసియేషన్ ప్రకటిస్తే టాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోనుందనే టాక్ కూడా ఫిల్మీ దునియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: MAA Elections 2021: ఈ కారణాల వల్లే ప్రకాశ్‌రాజ్ ఓడిపోయాడా? -
ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!...
గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఉత్కంఠను రేపిన మా ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోరులో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌పై 107ఓట్ల తేడాతో విష్ణు మా అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. మా ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. అందరి కంటే ముందుగా చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రత్యక్షంగా మెగా బ్రదర్ నాగబాబే ప్రకాశ్‌రాజ్‌కు క్యాంపెయిన్ చేశారు. అయినప్పటికీ ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడానికి గత కారణాలు ఏంటి అని ఓసారి పరిశీలిస్తే.. ► ప్రకాశ్‌రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష బరిలో ఉన్నానని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. మొదట్లో ఈ విషయంపై ఆర్జీవీ వంటి సినీ ప్రముఖులు ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్‌గా నిలబడినా.. ఆ తర్వాత మా అసోసియేషన్‌కు తెలుగు వాళ్లు కాకుండా, వేరే పరిశ్రమకు చెందిన వాళ్లు ఎలా పాలిస్తారు అంటూ వచ్చిన విమర్శలు వచ్చాయి. వీటిని తిప్పికొట్టకపోవడం ప్రకాశ్‌రాజ్‌కు మైనస్‌కు మారింది. ►. కెరీర్ పరంగా ప్రకాశ్‌రాజ్ చాలా బిజీ ఆర్టిస్ట్. సంవత్సరానికి ఇతర భాషలతో కలిపి సుమారు 7-8 సినిమాల్లో నటిస్తారు. అలాంటి బిజీ ఆర్టిస్ట్ మా అసోసియేషన్‌కు ఎలా సేవ చేస్తారనే వాదన తెరపైకి వచ్చింది. ఎక్కడో తమిళనాడులో ఉండి ఇక్కడి ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించేంత సమయం ఎలా కేటాయిస్తారనే కామెంట్స్ కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించాయి. ► మంచు విష్ణుకు మోహన్ బాబు చేసిన క్యాంపెయిన్ ప్రకాశ్‌రాజ్‌కు మైనస్ అయిందని చెప్పొచ్చు. సినీ పరిశ్రమలో ఆయనతో చాలామందికి ప్రత్యేక అనుబంధం ఉంది. మోహన్ బాబు చెబితే కాదనలేం అనే సినీ ప్రముఖులు కూడా ఉండటంతో ప్రకాశ్‌రాజ్‌కు ఓట్లు తగ్గాయన్నది మరో కారణంగా చెప్పుకుంటున్నారు. ►చాన్నాళ్లుగా ఉన్న మా బిల్డింగ్ సమస్యపై దృష్టి పెట్టకపోవడం. అటు మంచు విష్ణు మా బిల్డింగ్ కోసం తన సొంత డబ్బులు ఖర్చుపెడతానని నమ్మకం కలిగించడం కూడా ప్రకాశ్‌రాజ్‌కు మైనస్‌గా మారింది. ► మా అధ్యక్షుడిగా ఎన్నికైతే చేసే కార్యక్రమాలు, సంక్షేమం వంటి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టకపోవడం.. మంచు విష్ణు తర్వాత కూడా ఎలాంటి మ్యానిఫెస్టో ప్రకటించకపోవడం అతి పెద్ద మైనస్ అని టాక్ వినిపిస్తుంది. ► నాగబాబు మినహా మెగా ఫ్యామిలీ నుంచి ప్రత్యక్షంగా ఎవరూ మద్ధుతు ప్రకటించకపోవడం ► ఎన్నికలకు రెండు రోజులు ముందు నాకు పెద్దల మద్దతు అవసరం లేదు అంటూ ప్రకాశ్‌రాజ్ చేసిన కామెంట్స్ నెగిటివిటిని పెంచేశాయి. ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదం అవసరం లేదంటూ ప్రకాశ్‌రాజ్ తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు ఆయనకే బెడిసి కొట్టిందనే చెప్పాలి. ►ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను మా ఎన్నికల్లో ఓటేసేందుకు సిద్ధం చేయకపోవడం. ఎలక్షన్స్ రోజు ముంబై, బెంగుళూరు, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరీ కొందరు వేసిన ఓట్లు మంచు విష్ణుకు అనుకూలంగా మారాయి. చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే.. నాగబాబు, ప్రకాశ్‌రాజ్ రాజీనామాలను ఆమోదించను: మంచు విష్ణు -
నా రాజీనా‘మా’కు లోతైన అర్థం ఉంది: ప్రకాశ్‌రాజ్
Maa Elections 2021: ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రాంతీయవాదం, జాతీయవాదం నడుమ జరిగాయి. తెలుగువాడు కానివాడు ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు, కానీ పోటీ చేయకూడదా? నేను తెలుగువాణ్ణి కాకపోవడం నా దురదృష్టం. నా తల్లిదండ్రులు తెలుగువారు కాదు.. అది నా తప్పు కాదు.. వారి తప్పూ కాదు’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. సోమవారం విలేకరులతో ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ – ‘‘పరభాషా నటులు ‘మా’ సభ్యులుగా ఉండొచ్చు కానీ పోటీ చేయడానికి అనర్హులుగా బైలాస్‌లో మార్పులు తీసుకొస్తామని ఇటీవల ‘మా’ ఎన్నికలకు ముందు తెలిపారు. ఇటువంటి ఎజెండాతో, ఐడియాలజీతో ఉన్న అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండలేను. పైగా ‘మా’ అసోసియేషన్‌కి తెలుగువాడు కాని నా సేవలు వద్దని తీర్పు ఇచ్చారు.. ‘మా’ లోపలికి రావొద్దని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నేను ఎలా వెళ్లగలను? కళాకారుడిగా నాకూ ఓ ఆత్మ గౌరవం ఉంటుంది.. అందుకే ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ‘మా’తో నాది 21 ఏళ్ల అనుబంధం. ‘నువ్వు అతిథిగా వచ్చావు.. అతిథిగానే ఉండాలి’ అంటూ మోహన్‌బాబు, కోట శ్రీనివాసరావుగార్లు, రవిబాబు వంటివారు మాట్లాడారు.. అందుకే అతిథిగానే ఉంటా. ‘మా’ సభ్యుడు కాకున్నా నన్ను పిలిచి తన సినిమాలో చేయమని మంచు విష్ణు అడిగినా నటిస్తాను. తెలుగు ఇండస్ట్రీవారితో నా బంధం ఎప్పటిలానే కొనసాగుతుంది. ‘మా’ ఎన్నికల తర్వాత కొందరు ‘ఇండస్ట్రీలో మేమంతా ఒక్కటే’ అని మాట్లాడే అబద్ధాలను నేను నమ్మను’’ అన్నారు. అంతేకాకుండా సోమవారం రాత్రి ఓ ట్వీట్ చేశారాయన. ‘‘మా వెంట నిలిచిన ‘మా’ సభ్యు లందరికీ.. నేను రాజీనామా చేయడానికి ఓ లోతైన అర్థం ఉంది. త్వరలో ఆ కారణాన్ని వివరిస్తాను’’ అని ట్వీట్ చేశారు. చదవండి: నన్ను రెచ్చగొట్టాలని చాలా మంది చూశారు: మోహన్ బాబు -
ప్రకాశ్ రాజ్ రాజీనామాపై స్పందించిన మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాంతం, జాతీయ వాదాన్ని తెర మీదకు తీసుకొచ్చినందుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఈ క్రమంలో తన రాజీనామాపై ప్రకాశ్ రాజ్ తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు వాట్సప్‌లో సమాచారం అందించారు. చదవండి: ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా ఈ మేరకు ఆయన మెసేజ్ చేస్తూ ‘‘మా’ ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు విష్ణు. ‘మా’ను నడిపించేందుకు అవసరమైన శక్తి నికు కలగాలని ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్-మెంబర్‌గా నీకు అన్ని విధాలా సాయం చేస్తా.. థ్యాంక్యూ... ప్రకాశ్‌రాజ్’’ అని మెసేజ్ పంపారు. దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ.. మీ నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను అంకుల్ అంటూ రాసుకొచ్చారు. ‘అంకుల్ మీరు నాకంటే వయసులో చాలా పెద్దవారు. గెలుపు, ఓటములు అనేవి ఒకే నాణేనికి ఉండే రెండు ముఖాలు. రెండింటిని మనం సమానంగా చూడాలి’ అని అన్నారు. చదవండి: MAA Elections 2021 Results: అది నా దురదృష్టం: ప్రకాశ్ రాజ్ ఆవేదన అలాగే ‘మీరు మా కుటుంబంలో ఒక భాగం. అది మీకు కూడా తెలుసు. ప్లీజ్ మీరు భావోద్యేగానికి లోనవకండి. నాకు మీ సలహాలు, సూచనలు అవసరం, మనిద్దరం కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నా. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. దీనిపై చర్చించుకుందాం. అప్పటి వరకు మీరు తొందర పడకండి’ అంటూ సమాధానం ఇచ్చాడు. కాగా ప్రాంతీయత ఆధారంగా ‘మా’ ఎన్నికల పోలింగ్ జరిగిందని, ఇక ఇలాంటి అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండాలని లేదంటూ ప్రకాశ్ రాజ్ భావోద్యేగానికి లోనైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మా ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
అలాంటి అసోసియేషన్‌లో సభ్యుడిగా కొనసాగలేను: ప్రకాశ్ రాజ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించగా, ఇక ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి కొందరు గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారిగా ప్రకాశ్ రాజ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా ఈ మేరకు ఆయన ‘గెలిచిన మంచు విష్ణు, అతడి ప్యానల్ సభ్యులకు శుభాకాంక్షలు. ఒక ప్రణాళిక ప్రకారం వచ్చారని వాటన్నింటిన నెరవేర్చండి. ఇక ఈ ఎన్నికల్లో ఎలా ఓడిపోయాం, గెలిచాం అన్నది ముఖ్యం కాదు. ‘మా’ ఎన్నికలు రాజకీయ వేదిక కాదు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి. పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కానీ ఎవరెవరు నాకు ఓటు వేశారో తెలియదు. రాజకీయం, సినిమా రెండు వేరు అనుకుంటున్నా. నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు. అది నా తప్పా. నేను తెలుగు వాడిని కాకపోవడం నా దురదృష్టం. అందుకే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇది ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఓటమిని జీర్ణించుకున్నాకే రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: MAA Elections 2021: ఇక సెలవంటూ నాగబాబు సంచలన నిర్ణయం ‘అసోసియేషన్‌కు ఒక నాయకత్వం వహించిన మీకు, తెలుగువాడు మాత్రమే ఉండాలన్నారు. దాన్ని మెంబర్స్ ఆమోదించారు. తెలుగుబిడ్డ, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నా. అలాగే ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో నేను అతిథిగా ఉండాలంటే అసోసియేషన్ మెంబర్‌గా ఉండకూడదు. పెద్ద నటులు కోట శ్రీనివాస రావు, రవిబాబు వ్యాఖ్యలను గౌరవిస్తాను. వారి చెప్పినట్టుగానే అతిథిగా ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. ‘మా’ ఎన్నికల్లో జాతీయవాదం గెలిచిందంటూ బీజేపీ నేత బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు’ అంటూ ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించగా, ఇక ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి కొందరు గెలుపొందారు. ఈ నేపథ్యంలో సోమవారం(అక్టోబర్ 11) హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. చదవండి: MAA Elections 2021: ఇక సెలవంటూ నాగబాబు సంచలన నిర్ణయం ‘మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు చాలా చైతన్య వంతంగా జరిగాయి. గెలిచిన మా సభ్యులకు శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ మీకు, నాకు తెలుసు. హామీలు అన్నింటినీ పూర్తి చేయడం ముఖ్యం. నా ప్రాంతం, జాతీయ వాదం తెర మీదకు తీసుకు వచ్చారు. నేను తెలుగు బిడ్డనే, నేను ఒక కళాకారుణ్ణి’ అంటూ చెప్పిన అనంతరం ఆయన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘనవిజయం
‘‘ఇది ఏ ఒక్కరి విజయం కాదు. ‘మా’లోని సభ్యులందరి విజయం. అందరూ మనవాళ్లే. అందరి ఆశీస్సులు ఉన్నాయి. నా బిడ్డ(మంచు విష్ణు), అతని జట్టు సభ్యులు గెలిచారు. ఇది ఆనందం అనుకుంటే కరెక్ట్ కాదు. భయంకరమైన ప్రామిస్‌లు చేసేశారు. వాటన్నింటినీ నా బిడ్డ వందశాతం సాధిస్తాడు. నా బిడ్డ చెప్పింది చెప్పినట్లు చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పదలచుకున్నది ఏంటంటే... జరిగింది... జరిగిపోయింది.. అందరం కళామతల్లి బిడ్డలం అని గుర్తుపెట్టుకోవాలి. నటుడిగా నాకు జన్మనిచ్చిన దాసరిగారు ఎక్కడ ఉన్నారో!. ఇకపై మూవీ ఆర్టిస్ట్స్ ఎలక్షన్స్ జరగకుండా ఏకగ్రీవంగా జరిగేలా పెద్దలు నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టండి. ఆ ప్యానల్ వారు కావొచ్చు.. ఈ ప్యానల్ వారు కావొచ్చు.. నా సోదరులు, నా ఆడపడుచులు.. ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా మీడియా ముందుకు వెళ్లవద్దని కోరుకుంటున్నాను. ఆ దేవుడి ఆశీస్సులతో పాటు రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు నా బిడ్డకు, అతని జట్టు సభ్యులకు ఉండాలి. వారు అనుకున్నది విజయవంతం అవుతుంది. నా తమ్ముడు నరేశ్ చాలా కష్టపడ్డారు. ఎలక్షన్ అధికారికి, సహకరించిన కొందరు ‘మా’ సభ్యులకు ధన్యవాదాలు. ఇది అందరి విజయం. కృష్ణ, కృష్ణంరాజు, నా సోదరుడు బాలయ్య, నా ఆత్మీయుడు చిరంజీవి, పవన్‌కల్యాణ్.. ఇలా అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉండాలని కోరుకుంటున్నాను. విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్’’ అని మోహన్‌బాబు అన్నారు. దాదాపు మూడు నాలుగు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల హడావిడికి ఆదివారం తెరపడింది. ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు వైస్‌ప్రెసిడెంట్స్, ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్లతో పాటు 18 మంది ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) సభ్యులతో కూడిన 26 మంది ‘మా’ (2021– 2023) ప్యానల్ సభ్యుల కోసం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయ కేతనం ఎగురవేశారు. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించారు. మంచు విష్ణుకు 381 ఓట్లు పోలవ్వగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పడ్డాయి. విజేతలను ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రకటించారు. ‘‘925 మంది సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో 883 ఓటర్లు ఉండగా 665 మంది ఓట్లు వేశారు (52 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు). ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు. సమయాభావం వల్ల మిగతా వివరాలను సోమవారం అధికారికంగా వెల్లడిస్తాం’’ అని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అన్నారు. ‘మనమంతా ఒకటే కుటుంబం. ప్రకాశ్‌రాజ్‌గారు అంటే నాకు చాలా ఇష్టం. నరేశ్‌గారికి, సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఆ ప్యానల్, ఈ ప్యానల్ అంటూ లేదు. మేం అందరం ఒకటే కుటుంబం. రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్న ఫీలింగ్ కలిగింది. ‘మా’ లో ఇలాంటి పరిణామాలు ఇంకెప్పుడూ జరగకూడదు’’ అని అన్నారు మంచు విష్ణు. ‘‘తెలుగు బిడ్డ గెలిచాడు. విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. ‘‘నేను వెళ్లేటప్పుడు మంచి వారసుడిని ఇచ్చి వెళతాను అని చెప్పాను. మంచు విష్ణు రూపంలో మంచి వారసుడు వచ్చాడు. ‘మా’ మసకబారలేదు.. మెరుగుపడింది’’ అన్నారు నరేశ్. ఇదిలా ఉంటే... మంచు విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, జాయింట్ సెక్రటరీగా గౌతమ్‌రాజు ఇటు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ గెలుపొందారని తెలిసింది. అలాగే ఈసీ మెంబర్స్‌గా ప్రగతి, పూజిత, శశాంక్, జయవాణి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ, మాణిక్, హరినాథ్‌బాబు, బొప్పన విష్ణు, శ్రీనివాసులు, సంపూర్ణేష్ బాబు, శివారెడ్డి, కౌశిక్, అనసూయ, సురేశ్ కొండేటి, బ్రహ్మాజీ, ఖయ్యుం గెలిచారనే వార్త బయటికొచ్చింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రికార్డు పోలింగ్ ‘మా’ ఎలక్షన్స్‌లో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు పోలింగ్ నమోదు అయ్యింది. గత ‘మా’ ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే నమోదు కాగా, ఈ సారి 665 (883 ఓట్లకు గాను..70 శాతానికి పైగా) ఓట్లు పోల్ అయ్యాయి. పోలైన ఓట్లలో 52 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. అయితే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకే పోలింగ్‌కు అనుమతి ఉన్నప్పటికీ రెండు ప్యానల్స్ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పోలింగ్ సమయాన్ని మరో గంట పొడగించారు. ఎప్పుడూ లేనట్లుగా ‘మా’లో భాగమైన సభ్యులు ఇతర రాష్ట్రాల (ముంబై, చెన్నై, కర్ణాటక) నుంచి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయాన్ని పొడగించడం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ‘మా’ సభ్యులు కూడా ఉత్సాహంగా ‘మా’ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వంటి కారణాలు పోలింగ్ శాతం పెరగడానికి కారణం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఫైటింగ్.. బైటింగ్.. బెట్టింగ్! ‘మా’ ఎన్నికల పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌కల్యాణ్ వంటి స్టార్స్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ బూత్‌లో హడావిడి చేస్తున్న ఓ అజ్ఞాతవ్యక్తిని నటుడు వీకే నరేశ్ పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు ప్యానల్ సభ్యుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగి, కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందంటూ ఇరువర్గాల అభ్యర్థులు ఆరోపించారు. అలాగే పోలింగ్ కేంద్రంలో తమ ప్యానల్స్ తరఫున ప్రచారం చేసే ప్రక్రియలో భాగంగా శివబాలాజీ, సమీర్‌లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో శివబాలాజీ చేతిని నటి హేమ కొరకడం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆ తర్వాత శివబాలాజీ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. మరోవైపు ‘మా’ ఎన్నికల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కొందరు బెట్టింగ్‌రాయుళ్లు ‘మా’ ఎన్నికల జయాపజయాలపై బెట్టిం గ్‌కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఫైటింగ్.. బైటింగ్.. బెట్టింగ్ నడుమ ఎన్నికలు జరిగాయి. ఓటుకు దూరం కొన్ని రోజులుగా ‘మా’ ఎన్నికల గురించి హీట్ నడుస్తున్నప్పటికీ కొందరు ప్రముఖ నటీనటులు ఎన్నికల్లో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేశ్, రానా, మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, నిహారిక, అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య, సుమంత్, సుశాంత్ ఓటు హక్కును వినియోగించుకోనట్లు తెలిసింది. ఇంకా మహేశ్‌బాబు (స్పెయిన్‌లో ‘సర్కారు వారిపాట’ షూటింగ్లో ఉన్నారు) ప్రభాస్, ఎన్టీఆర్, నితిన్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకోలేదు. ముంబయ్ నుంచి జెనీలియా, ఢిల్లీ నుంచి జయప్రద హైదరాబాద్‌కు వచ్చి ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయడం విశేషం. చెల్లని ఓట్లు ఈసీ మెంబర్స్ కోసం పోలైన 665 ఓట్లలో 44 ఓట్లు చెల్లనవిగా ఎలక్షన్ అధికారులు వెల్లడించారు. అయితే ‘మా’ సభ్యులకు పోలింగ్‌పై అవగాహన లేకపోవడం వల్ల చెల్లని ఓట్లు నమోదయ్యాయా? లేక సభ్యులకు ఇష్టం లేక చెల్లని విధంగా ఓట్లు వేశారా? అన్న చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యర్థుల ఆలింగనం ‘మా’ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ మధ్య పరస్పర ఆరోపణలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆదివారం ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా పోలింగ్ కేంద్రం నుంచి ప్రకాశ్‌రాజ్‌తో తాను ఉన్న ఫోటోను షేర్ చేశారు మంచు విష్ణు. ఈ ఫోటో, ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నటుడు, నిర్మాత నాగబాబు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారాయన. ‘‘ప్రాంతీయవాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక అసోసియేషన్‌లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు. నా రాజీనామాను 48 గంటల్లో ‘మా’ కి నా సిబ్బంది ద్వారా పంపిస్తాను. ఇది నేను ఎంతగానో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం’’ అని ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు నాగబాబు. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ‘‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, ఇతర విజేతలందరికీ పేరు పేరునా అభినందనలు.. నా శుభాకాంక్షలు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. ‘మా’ ఇప్పటికీ, ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచనట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. -
‘మా’ విజయం: ప్రకాశ్‌రాజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన విష్ణు
MAA Elections 2021 Results: గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో హీరో మంచు విష్ణు విజయం సాధించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సమయంలో విష్ణు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రకాశ్‌రాజ్‌ను పట్టుకుని ఏడ్చేశాడు. గెలుపు ప్రకటన అనంతరం విష్ణు తన తండ్రి మోహన్‌బాబు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తండ్రి మోహన్‌బాబుకు అంకితమిచ్చారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టండి మోహన్‌బాబు మాట్లాడుతూ.. 'బాబా ఆశీస్సులు, మా సభ్యుల ఆదరణతో విష్ణు గెలిచాడు. చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్ సహా అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల ఆశీస్సులు విష్ణుకు ఉంటాయి. నా బిడ్డ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాడు. మా అభివృద్ధికి విష్ణు కట్టుబడి ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది.. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. వివాదాలకు ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టండి. ఎవరూ ఎవరి గురించి ఆరోపణలు చేయొద్దు' అని సూచించారు. -
MAA Elections 2021 Results: 'మంచు'కే మా అధ్యక్ష పదవి
Manchu Vishnu Won MAA President: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రకాష్‌రాజ్ ఓటమి చెందారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు.కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మంచు విష్ణు ప్యానల్ జోష్‌లో ఉంది. కౌంటింగ్ కేంద్రం బయట అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. Na thammuda mazaa kaaaa…. Here’s to his stupendous win my hero!!!!!! @iVishnuManchu — Lakshmi Manchu (@LakshmiManchu) October 10, 2021 "మా" అధ్యక్షుడిగా గెలిచిన @iVishnuManchu గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు.జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన "మా" ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది.#MaaElections2021— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2021 "మా" ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. "మా" ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికి అభినందనలు.భారత్ మాతాకి జై !#MaaElections2021— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2021 -
ప్రకాశ్‌రాజ్‌తో సెల్ఫీ ఫోటో షేర్ చేసిన మంచు విష్ణు
MAA Elections 2021: Manchu Vishnu Selfie With Prakash Raj: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రకాశ్‌రాజ్,మంచు విష్ణు కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. పోలింగ్ కేంద్రంలో ఎదురుపడిన వీళ్లిద్దరూ మోహన్ బాబు సమక్షంలో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. అనంతరం మంచు మనోజ్ సైతం వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను షేర్చేస్తూ..'వాటమ్మా ..వాట్ ఈజ్ దిస్ అమ్మా' అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. పోలింగ్‌కి ముందు వరకు కూడా ఫ్యానెల్ సభ్యులు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఇలాంటి తరుణంలో ఇద్దరూ కలిసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో 'పిక్ ఆఫ్ ది డే' అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న మా ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్రాజ్లలో ఎవరు గెలుస్తారన్నది మరికాసేపట్లో తేలనుంది. D Day! pic.twitter.com/Wabrp6KheJ — Vishnu Manchu (@iVishnuManchu) October 10, 2021 What ammaaaa what is this ammmaaaa ?!:) 😜 pic.twitter.com/41gAotPHJD — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 10, 2021 -
వార్ వన్‌సైడ్ అవుతుంది: రవిబాబు
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల చరిత్రలోనే ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో 83శాతానికి పైగా పోలింగ్ (మధ్యాహ్నం 3గంటల వరకు) నమోదయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటేయడం ఇదే తొలిసారి. వీరిలో ఎక్కువ మంది ఓటింగ్ మంచు విష్ణుకు ప్లస్ అవుతుందని సమాచారం. తొలిసారి ఇంత భారీ పోలింగ్ నమోదవడం మంచి పరిణామమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అవుతుందని నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు. మంచు విష్ణు ప్యానలే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం
MAA Elections 2021 Counting Live Updates : మంచు విష్ణు విజయం మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మంచు విష్ణు ప్యానల్ జోష్‌లో ఉంది. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందింన ఆఫీస్ బేరర్లు వీళ్లే.. జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ విజయం వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ విజయం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ విజయం మంచు విష్ణు ప్యానల్ నుంచి గెలుపొందింన ఆఫీస్ బేరర్లు వీళ్లే.. వైస్ ప్రెసిడెంట్‌గా మాదల రవి విజయం జనరల్ సెక్రటరీగా రఘుబాబు విజయం ట్రెజరర్‌గా శివబాలాజీ విజయం జాయింట్ సెక్రటరీగా గౌతమ్‌రాజు విజయం బాబూ మోహన్‌పై శ్రీకాంత్ గెలుపు జాయింట్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్ రాజు విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ గెలుపొందారు. బాబూ మోహన్‌పై శ్రీకాంత్ విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్యానల్ నుంచి పృథ్వీ రాజ్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు ఆధిక్యం మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ముందంజలో ఉన్నారు. ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ ముందంజలో ఉన్నారు. 7ఓట్ల తేడాతో జీవితపై రఘుబాబు గెలుపు మా జనరల్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్ నుంచి రఘుబాబు గెలుపొందారు. జీవితా రాజశేఖర్‌పై 7ఓట్ల తేడాతో రఘుబాబు విజయం సాధించారు. ట్రెజరర్‌గా మంచు విష్ణు ప్యానెల్ నుంచి శివ బాలాజీ 32 ఓట్ల తేడాతో గెలుపొందారు. శివబాలాజీకి 316 ఓట్లు, ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు చెందిన నాగినీడుకు 284 ఓట్లు వచ్చాయి. ఆఫీస్ బేరర్ల ఓట్లు కౌంటింగ్ ఆఫీస్ బేరర్ల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ల ఓట్లను లెక్కిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా మంచు విష్ణు ప్యానల్ నుంచి బాబూమోహన్,ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ పోటీ చేశారు. ట్రెజరర్లుగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి నాగినీడు, మంచు విష్ణు ప్యానల్ నుంచి శివ బాలాజీ పోటీ చేశారు. మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మంచు విష్ణు ప్యానల్లో 9 మంది విజయం మంచు విష్ణు ప్యానల్ నుంచి 9 మంది ఈసీ సభ్యులు విజయం సాధించారు. మాణిక్, హరినాథ్, బొప్పన,శివ, జయవాణి, శశాంక్, పూజిత, పసునూరి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ గెలుపొందారు. అటు ప్రకాశ్ రాజ్ ప్యానల్లో 9మంది గెలుపొందారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ఈసీ మెంబర్ల కౌంటింగ్ ముగిసింది. మంచు విష్ణు ప్యానల్లో 10మంది ఈసీ సభ్యులు లీడ్‌లో ఉండగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8మంది సభ్యులు లీడ్‌లో ఉన్నారు. క్షణక్షణానికి లీడ్స్ మారుతున్న నేపథ్యంలో మా ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠగా మారాయి. ప్రకాశ్‌రాజ్ ప్యానల్లో నలుగురు ఈసీ సభ్యులు గెలుపొందారు. కౌశిక్, శివారెడ్డి, సురేష్ కొండేటి.. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందారు. అటు విష్ణు ప్యానెల్ నుంచి మాణిక్, హరినాథ్, బొప్పన,శివ, జయవాణి, శశాంక్, పూజిత, పసునూరి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ ముందంజలో ఉన్నారు. తొలి ఫలితం తొలి ఫలితం ప్రకాశ్ రాజ్ ప్యానలే బోణీ కొట్టింది. ఈసీ మెంబర్లు కౌశిక్, శివారెడ్డి ప్రకాశ్‌రాజ్ ఫ్యానల్ నుంచి గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్లలో మంచు విష్ణు ముందంజ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. అధ్యక్షుడిగా మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ ఆధిక్యంలో ఉంది. మంచు విష్ణు ప్యానెల్లో 10మంది ఈసీ సభ్యులు ముందంజలో ఉన్నారు. భారీగా క్రాస్ ఓటింగ్ పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 50 చెల్లనివిగా గుర్తించారు. మోహన్ బాబు, మురళీ మోహన్ సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈసీ మెంబర్లలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కౌంటింగ్ కోసం ఆరు టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై ఇద్దరికి అనుమతి ఇచ్చారు. మొత్తం 665 ఓట్లు పోలవగా ఇందులో పోస్టల్ బ్యాలెట్ నుంచి 60 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా పోస్ట్‌లో బ్యెలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది మరికాసేపట్లో తేలనుంది. -
‘మా’ పోలింగ్‌కు తరలివచ్చిన సినీ తారలు
-
MAA Elections 2021: శివబాలాజీని కొరికిన హేమ!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్‌రాజ్ ఫ్యానల్ మెంబర్స్‌పై మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాగా, పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవపై నటుడు నరేశ్ స్పందించారు. ‘పెద్ద గొడవలేవి జరగలేదు. ఎవరో ఒకరు ప్రకాశ్ రాజ్ బ్యాడ్జ్ వేసుకొని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. నేను, ప్రకాశ్ రాజ్ కౌగిలించుకున్నాం. ‘నో ఫైటింగ్.. ఓన్లీ ఓటింగ్’అని చెప్పుకున్నాం. శివబాలాజీని నటి హేమ కొరికిందని నరేశ్ ఆ గాయాన్ని మీడియాకు చూపించారు. -
‘మా’ ఎన్నికల్లో ఉద్రిక్తత, ప్రకాశ్ రాజ్, నరేశ్ మధ్య వాగ్వాదం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల పోలింగ్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్ రాజ్, ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేశ్ మధ్య వివాదం చోటుచేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువరు వాగ్వాదానికి దిగారు. అలాగే ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై మంచు విష్ణు ప్యానల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడంపై విష్ణు ప్యానల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి పోలింగ్‌లో రిగ్గింగ్ పాల్పిడినట్లు విష్ణు ప్యానల్ ఆరోపించారు. సభ్యుడు కానీ వ్యక్తులు కూడా పోలింగ్ బూత్‌కు వచ్చినట్లు పేరొన్నాడు. అంతేగాక పోలింగ్ కేంద్రం ముందు ఇరు ప్యానల్ సభ్యుల మధ్య గొడవలు తలెత్తడంతో కేంద్రం బయటక ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో విష్ణు ప్యానల్ సభ్యుడు, నటుడు శివ బాలజీ చేతిని గుర్తు తెలియని వ్యక్తి కొరికినట్లు నరేశ్ ఆరోపణలు చేశాడు. -
‘మా’చరిత్రలోనే రికార్డు స్థాయిలో..ముగిసిన ఎన్నికల పోలింగ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘మా’చరిత్రలోనే రికార్డు స్థాయిలో 83 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.‘మా’లో మొత్తం 925 మంది సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2:20 PM మా చరిత్రలో రికార్డ్ స్థాయి పోలింగ్ ‘మా’ఎన్నికల్లో ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. గతేడాది కేవలం 474 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా, ఈ సారి మాత్రం ఇప్పటికే 545 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించడంతో మరింతమంది తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మా ఎన్నికల ఫలితాలు ఆలస్యం కానుంది. అర్థరాత్రి దాటిన తర్వాతే ఫలితాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 2:05 PM ఓటేసిన అఖిల్ ‘మా’ఎన్నికల్లో యంగ్ హీరో అఖిల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆయనతో పాటు హీరో సుధీర్ బాబు, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకేసారి యంగ్ హీరోలంతా రావడంతో వారితో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. 1:55 PM ‘మా’పోలింగ్ మరో గంట పొడిగింపు ‘మా’ఎన్నికల పోలింగ్ని మరో గంట పొడిగించారు. వాస్తవానికి మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగియాలి. కానీ ఓటు వేసే వాళ్లు చాలా మంది ఉండండంతో పోలింగ్ని మరో గంట పొడిగించినట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. ఇరు ప్యానళ్లతో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో ‘మా’ ఎన్నికల పోలింగ్ మధ్నాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. 1:40 PM విష్ణు గెలుపు ఖాయం : నరేశ్ ‘మా’ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధిస్తాడని నటుడు నరేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఓటు రెండేళ్ల పాలనకు పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు కుక్కల్లా అరిచారని, ఇవి వారి నోళ్లు మూయించే ఎన్నికలని తెలిపిన నరేశ్.. కచ్చితంగా మంచు విష్ణుదే విజయమని తేల్చి చెప్పారు. 1:15 PM మధ్నాహ్నం ఒంటి గంట వరకు 450 ఓట్లు పోలైయ్యాయి. హీరో నాని సైతం తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. 1:05 PM తెలుగు కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వండి: ఆర్ నారాయణ మూర్తి సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి వాళ్లు జాతీయ స్థాయి సినిమాలు తీయడం సంతోషించాల్సిన విషయమని, సినిమాల్లో తెలుగు కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 12:40 PM ఓటేసిన నాగార్జున అక్కినేని నాగార్జున తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. నాగ్‌తో పాటు కమెడియన్ పృథ్విరాజ్ కూడా మధ్యాహ్నం 12:40 గంటలకు పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేశారు. కాగా, చిరంజీవి, బాలకృష్ణ, మురళీ మోహన్ తదితర సీనియర్ హీరోలు ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మహేశ్ బాబు, అల్లు అర్జున్, వెంకటేశ్, నాని, నాగచైతన్య లాంటి అగ్రహీరోలు ఇప్పటి వరకు తమ ఓటు వేయడానికి రాకపోవడం గమనార్హం. 12:26 PM ‘మా’ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు 380 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 925 మంది ‘మా’ సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. 12:10 PM అందుకే శివబాలాజీ చేయి కొరికా : హేమ శివబాలజీ చేయిని కోరకడంపై హేమ క్లారిటీ ఇచ్చింది. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. 11:45 AM ‘మా’లో పోటీ నాతోనే మొదలైంది: రాజేంద్రప్రసాద్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా’లో పోటీ తనతోనే మొదలైందన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. వాళ్లు తమలో ఒకరేనన్నారు. ‘మా’కు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. 11:25 AM 11 గంటల వరకు ఎంతమంది ఓటు వేశారంటే.. మా ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతుంది. చిన్న చిన్న వివాదాలు మినహా.. పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 287 ఓట్లు పోలైయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగుతంది. మొత్తం 925 మంది ‘మా’ సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. 11:10 AM టాలీవుడ్ నా సొంతిల్లు: జెనీలియా ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో నటి జెనీలియా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై నుంచి వచ్చి మరీ ఓటు వేశారు. అనంతరం ఆమెమాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ నాకు సొంతిల్లు అని తెలిపారు. ఈ ఎన్నికల్లో మంచి వ్యక్తే గెలుస్తారని తెలిపారు. త్వరలోనే సూపర్ ప్రెసిడెంట్‌ను చూస్తామన్నారు. 10:35 AM అందరం ఒకే కుటుంబానికి చెందినవాళ్లం: ఆర్కే రోజా ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయని, సాధారణ ఎన్నికలను తలిపిస్తున్నాయన్నారు. ఈ సారి ఎన్నకల్లో ఎన్నో వివాదాలు తెరపై వచ్చాయి. ఇందులో ఉంది 900 మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్లం. ఎవరు గెలిచిన ఓడినా కలిసి కట్టుగా ఉండాలని, సమస్యలను ఇరూ రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లాలి. రెండు ప్యానల్లో నాతో పని చేసిన వారె ఉన్నారు. చివరికి అందరం కలిసి కట్టుగా ఉంటాం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ►మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కేంద్రానికి నటి జెనిలీయా చేరకున్నారు. ఈ సందర్భంగా విష్ణు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి జెనిలీయాను లోపలికి తీసుకెళ్లాడు. 10:20 AM మా ఎన్నికల్లో మరోసారి రసాభాస మొదలైంది. ఎన్నికల కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ ప్యానెళ్ల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు కోపంతో ఊగిపోయారు. పోలింగ్ సెంటర్లో ప్రచారం చేయడానికి ఎలా అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10:00 AM మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ఇద్దరూ అన్నదమ్ముల్లాంటివారే ‘మా’అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, విష్ణు అన్నదమ్ముల్లాంటి వారని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఇద్దరూ ఇండస్ట్రీకి బాగా చేసేలా కనిపిస్తున్నారు. దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. ప్రకాశ్ రాజ్, తమ్ముడు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముళ్ల లాంటి వారే. మాటల్లో చెప్పడమే కాకుండా చేతుల్లో చేసి చూపించేవారు. రేపు షూటింగ్లలో మళ్లీ కలిసి పని చేసుకునే వాళ్లమేనని తెలిపారు. 9:30AM ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి ‘మా’ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సినీ పెద్దలు క్యూ కడుతున్నారు. ‘మా’ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విన్నర్లు ఎవరనేది ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. మెగా ఫ్యామిలీ అంతా ప్రకాశ్ రాజ్‌కే మద్దతు ఇస్తున్నారు కదా విలేకర్లు ప్రశ్నించగా, అలాంటిదేమి లేదని చిరంజీవి అన్నారు. ఓటర్లు ఎవరిని గెలిపిస్తే వారికే తన మద్దతు ఉంటుందన్నారు. 9:10 AM నేను కూడా పోటీ చేయాలనున్నా: సాయి కుమార్ మా అధ్యక్ష పదవి కోసం కొనసాగుతోన్న ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు సాయి కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తాను కూడా పోటీ చేయాలనుకున్నానని, కానీ షూటింగ్లో బిజీ ఉండడంతో పోటీలో లేనని చెప్పుకొచ్చాడు.తాను లోకల్, నాన్ లోకల్ కాదని నేషనలిస్ట్ అని తెలిపాడు. 9:05AM ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ చరణ్ మా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ఆయనతో పాటు మంచు లక్ష్మీ, శ్రీకాంత్, సుమ, సుడిగాలి సుధీర్, ఉత్తేజ్, సాయి వెంకట్, వేణు, ఈటీవీ ప్రభాకర్, మురళీమోహన్ తదితరులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9:00AM మా ప్యానల్‌దే గెలుపు : మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో మా ప్యానల్‌దే గెలుపు అన్నారు మంచు విష్ణు. సినీ పెద్దల ఆశీర్వాదాలు తమకే ఉన్నాయన్నాని చెప్పారు. ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఆయన పెద్దరికాన్ని గౌరవించి తానేమి అనలేదని, తన విజ్ఞతకే వాటిని వదిలేస్తున్నానని చెప్పారు. 8:50 AM ‘మా’ పోలింగ్ వద్ద ఉద్రిక్తత ‘మా’పోలింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్‌రాజ్ ఫ్యానల్ మెంబర్స్‌పై మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురిని అక్కడ నుంచి పంపించేశారు. 8:25 AM ►మా ఎన్నికలు కొనసాగుతున్నాయి. తనికెళ్ల తనికెళ్ళ భరణి, రఘుబాబు, ఆకాశ్ పూరి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 8.20 AM వ్యక్తిగత దూషణలు అవసరమా?: పవన్ ►‘మా’పోలింగ్ ప్రారంభమైంది. పొసాని కృష్ణ మురళి, పవన్ కల్యాణ్ వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గతంలో ఇంతపోటీ నేను చూడలేదు. తిప్పికొడితే 900 ఓట్లు ఉండవు. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా’ అని ప్రశ్నించారు. సినిమాలు చేసే వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయన్నారు. ఇక మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్న ప్రచారం జరుగుతుందన్నదానిపై పవన్ స్పందిస్తూ.. ‘వారిద్దరు మంచి ఫ్రెండ్స్’ అని తెలిపారు. 7.50 AM మంచు విష్ణును ఆలింగనం చేసుకున్న ప్రకాశ్‌రాజ్ ►మా ఎన్నికలు జరుగుతోన్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు సినీ తారలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉన్న మంచు విష్ణు ఉదయాన్నే చేరుకోగా. కాసేపటి క్రితమే ప్రకాశ్ రాజ్ కూడా వచ్చారు. వచ్చి రాగానే మంచు విష్ణును ఆలింగనం చేసుకున్నారు. ఇక అక్కడే ఉన్న మోహన్ బాబును చూడగానే కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు అయితే మోహన్ బాబు దానికి నిరాకరించి ప్రకాశ్ రాజ్‌ను భుజం తట్టాడు. ఈ సన్నివేశం ఆసక్తిని రేకెత్తించింది. 7.45 AM MAA Elections Voting Live Updates: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఆరువారాల నుంచి హోరాహోరీగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు వాడీవేడిగా కొనసాగాయి. హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. మా ఎన్నికలో ఓటు వేసే సభ్యులు తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారులు సూచించారు. జూబ్లీహిల్స్ స్కూల్ ప్రధాన గేటు వద్ద పోలీసులు, ఆయా ప్యానెళ్ల ఏజెంట్లు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతిస్తారు. కేంద్రంలోకి వెళ్లిన తర్వాత జాబితాలో మరోసారి సభ్యుల పేర్లను తనిఖీ చేస్తారు. అక్కడ ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాతనే ఓటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. -
‘మా’ ఎన్నికలు: నాగబాబు కామెంట్స్‌పై స్పందించిన మంచు విష్ణు
మెగా బ్రదర్ నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానంటూ మంచు విష్ణు మండిపడ్డారు. తాజాగా మంచు విష్ణు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షులు నరేశ్ సాక్షితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో తామే తప్పకుండా గెలుస్తామని థీమా వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి తన బంధువా? కాదా? అనే దానిపై విష్ణు స్పందిస్తూ.. దీనిని ఆయననే రుజువు చేయమని, తన ఫ్యామిలీ గురించి తనకంటే ఎక్కువగా ఆయన తెలుసు అనుకుంటా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాగే ప్రతి పక్షంలో ఉన్న వ్యక్తి తనని, తనని ఫ్యామిలీపై కూడా విమర్శలు చేస్తున్నారని, ఆయనకు తానేంటో త్వరలోనే చూపిస్తా అంటూ సవాలు విసిరారు. తాను చేసేది తప్పు అయితే తనని, ఎన్నికల అధికారిన సస్పెన్స్ చెయొచ్చని విష్ణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆశుక్రవారం నిర్వహించిన మేనిఫెస్టో డిన్నర్ పార్టీకి 250 నుంచి 300మంది వస్తారనుకున్నామని, కానీ 560మంది వచ్చారన్నారు. అందరూ ‘మా’ సభ్యులే అని వారంతా తనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులను పిలిచి తనకెందుకు ఓటు వేయాలో చెప్పానని, వాళ్లకు నచ్చితే వేస్తారన్నారు. ఈసారి ఇతర ప్రాంతాల్లో ఉన్న ‘మా’ సభ్యులు విమానంలో వచ్చి మరీ ఓటు వేస్తున్నారని, తన హామిలన్ని అమలు కావాలంటే తన ప్యానల్ మొత్తం గెలవాలంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. అలాగే నరేశ్ కూడా మాట్లాడుతూ.. ‘రెండు రోజుల నుంచి ఎన్నికల ఏర్పాట్లను చూస్తున్నామన్నారుఉఉ. ఇరు ప్యానెల్ వర్గాలు కూడా వచ్చాయని, ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. రేపు ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలవుతుందని, మధ్యాహ్నం 2గంటలకు ముగుస్తుందని చెప్పారు. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని, నాలుగైదు గంటల పాటు ఓట్లను లెక్కిస్తారని తెలిపారు. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టాలని మొదట అనుకున్నామని, కానీ వర్షాల కారణంగా అందరి ఆమోదంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ఎవరి ప్రచారాన్ని వాళ్లు ముగించుకుని నేడు ఏర్పాట్లలోనే ఉన్నామన్నారు. -
‘మా’ ఎన్నికల అధికారిపై అనుమానాలు ఉన్నాయి: నాగబాబు సంచలన వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరూ విమర్శలు గుప్పించుకుంటూ, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో ఈసారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలనను తలపిస్తున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాగబాబు విష్ణు ప్యానల్, మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నాగాబాబు మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌పై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని, అతడి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహణపై తనకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయన మోహన్ బాబుకు దూరపు బంధువు అవుతారనే సమాచారం తమకు వచ్చిందని, అందుకే అతడు విష్ణుకు ఫేవర్‌గా ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక తమకు కొత్త ఎన్నికల అధికారి కావాలని పేర్కొన్నారు. అంతేగాక మాలో పొస్టల్ బ్యాలెట్ లేదని, మొదట పోస్టల్ బ్యాలెట్ పెట్టాలని విష్ణు ప్యానల్ ప్రతిపాదనను చేసినప్పుడు తమకు కూడా సహెతుకంగా అనిపించి ఒకే అన్నామన్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్‌ను స్కాంలా ఉపయోగించి దాని ద్వారా సభ్యులను ప్రభావితం చేస్తారని ప్రకాశ్ రాజ్ పసిగట్టి ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే మొదటి నుంచి ప్రకాశ్ ప్యానల్‌కు మద్దతు ఇస్తున్న నాగబాబు విష్ణు, విష్ణు ప్యానల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంకా ఏయే విషయాలు వెల్లడించారో తెలియాలండే ఆయన సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్య్వూ కోసం ఇక్కడ ఓ లుక్కేయండి.