Prakash Raj Birthday: Prakash Raj Announced Good News For Puneeth Rajkumar Fans, Check Inside - Sakshi
Sakshi News home page

Happy Birthday Prakash Raj: ఇకపై ఆ బాధ్యత నాదే.. ప్రకాశ్‌ రాజ్‌ కీలక ప్రకటన

Published Sat, Mar 26 2022 1:55 PM | Last Updated on Sat, Mar 26 2022 3:23 PM

Prakash Raj Announced About Puneeth Rajkumar Foundations On Birthday - Sakshi

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ పుట్టిన రోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కన్నడ పవర్‌ స్టార్‌, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌(అప్పు) సేవల తన ఫౌండేషన్‌ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘నా ప్రత్యేకమైన రోజున మీ అందరితో ఈ శుభవార్త పంచుకుంటున్నందుకు ఆనందం ఉంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ ప్రారంభించిన సేవలను ఇకపై ప్రకాశ్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా ముందుకు తీసుకేళ్లబోతున్నాను. 

చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తాను’ అంటూ అప్పు ఫొటోను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ‘అప్పు ఎక్స్‌ప్రెస్‌’ అని రాసి ఉన్న ఈ పోస్ట్‌ను ఆయన పంచుకున్నారు. ఆయన ట్వీట్‌పై పునీత్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌పై ప్రశంసలు కురిపిస్తు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. కాగా ప్రకాశ్‌ రాజ్‌ లాక్‌డౌన్‌లో ఎంతోమందికి సేవలు అందించారు. తన ఫాంహౌజ్‌లో నిరాశ్రయులకు ఆయన ఆశ్రయం కల్పించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement