Puneeth Rajkumar
-
నా భర్తతో హోటల్ రూమ్‌లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి
రాఘవేంద్ర రాజ్‌కుమార్ రెండో కుమారుడు యువ రాజ్‌కుమార్, భార్య శ్రీదేవి భైరప్ప మధ్య విడాకుల గొడవ కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. భార్య శ్రీదేవితో విడిపోవడానికి జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను యువ రాజ్‌కుమార్ దాఖలు చేశాడు. దానిని ఖండించిన శ్రీదేవి తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన భర్తకు కన్నడ హీరోయిన్ సప్తమిగౌడతో ఎఫైర్ ఉందని ఆరోపించింది. ఇదే సమయంలో యువ రాజ్‌కుమార్ లాయర్ కూడా శ్రీదేవిపై తీవ్రమైన ఆరోపణలే చేశాడు. మరోక వ్యక్తితో శ్రీదేవికి సంబంధం ఉందని, ఆస్తి కోసమే ఇలాంటి చెత్త పనులు చేస్తుందని ఆయన తెలిపాడు.కోర్టును ఆశ్రయించిన సప్తమిగౌడశ్రీదేవిపై కాంతార నటి సప్తమిగౌడ కోర్టును ఆశ్రయించింది. యువరాజ్‌కుమార్ కేసులో తన పేరు ప్రస్తావిస్తూ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ సప్తమిగౌడ బెంగళూరు సిటీ సివిల్‌కోర్టులో కేసు వేసింది. దీంతో ఆమె పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయరాదని జడ్జి ఆదేశాలిచ్చారు. శ్రీదేవికి కూడా నోటీసులు జారీ చేశారు. యువ రాజ్‌కుమార్ కాపురంలో కలతలకు నటి సప్తమిగౌడ కారణమని శ్రీదేవి ఆరోపిస్తోంది. 'యువ' సినిమాలో సప్తమిగౌడతో యువ రాజ్‌కుమార్ కలిసి నటించారు. ఈ సినిమా 2024 మార్చి ఆఖరులో విడుదలై మిశ్రమ ఫలితాల్ని చవిచూసింది. కానీ భారీగా వసూళ్లను రాబట్టింది. యువ రాజ్‌కుమార్, సప్తమి మధ్య అపైర్ ఉందని శ్రీదేవి ఆరోపించింది. ఇద్దరిని హోటల్ రూమ్‌లో చూశానని చెబుతోంది. ఇది సప్తమిగౌడకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో కోర్టును ఆశ్రయించింది.దివంగత నటుడు రాజ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్,రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే విషయం తెలిసిందే. వీరిలో రాఘవేంద్ర కుమారుడే యువ రాజ్‌కుమార్. అయితే, ఈ వివాదంపై శివ రాజ్‌కుమార్ ఎలాంటి కామెంట్ చేయలేదు. -
యువ రాజ్‌కుమార్, శ్రీదేవి దాంపత్య జీవితంలో 'ఎఫైర్స్' చిచ్చు
కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు రాజ్ కుమార్ మనవడు యువ రాజ్ కుమార్ తన భార్య శ్రీదేవి బైరప్పతో విడిపోవడానికి సిద్ధమయ్యాడు. జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. తనను క్రూరంగా శ్రీదేవి హింసిస్తుందంటూ అందులో పేర్కొన్నాడు. దానిని ఖండించిన శ్రీదేవి కూడా తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.రాఘవేంద్ర రాజ్‌కుమార్ రెండో కుమారుడు యువ రాజ్‌కుమార్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తన భార్య శ్రీదేవి భైరప్పపై లీగల్ నోటీసులో తీవ్ర ఆరోపణలు చేశారు. వాటిపై శ్రీదేవి భైరప్ప కూడా కౌంటర్ ఇచ్చింది. యువ రాజ్‌కుమార్‌కు అక్రమ సంబంధం ఉందని శ్రీదేవి సంచలన ఆరోపణ చేసింది. విడాకుల కేసుకు సంబంధించి యువ రాజ్‌కుమార్ తరఫు న్యాయవాది విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శ్రీదేవి భైరప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు. అది గమనించిన శ్రీదేవి భైరప్ప.. ‘సత్యం ఎప్పుడూ గెలుస్తుంది’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. దివంగత నటుడు రాజ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్,రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే విషయం తెలిసిందే.న్యాయవాది చేసిన తీవ్రమైన ఆరోపణలు ఏమిటి..?'శ్రీదేవికి మరొకరితో అక్రమ సంబంధం ఉంది. శ్రీదేవి తన భర్త పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఇంటి పేరు దుర్వినియోగం చేస్తుంది. ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తితో శ్రీదేవికి ఎఫైర్ ఉంది. తన అక్రమ సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ నటితో యువ రాజ్‌కుమార్‌కు సంబంధం ఉందంటూ తప్పుడు కథనం చెబుతుంది. యువ రాజ్‌కుమార్‌కు లైంగిక సమస్య ఉందని నా లీగల్ నోటీసుకు శ్రీదేవి సమాధానంగా ఇచ్చింది. లైంగిక సమస్య ఉంటే అక్రమ సంబంధం ఎలా సాధ్యమవుతుంది..?' అని ప్రెస్మీట్లో న్యాయవాది ప్రశ్నించారు.ఆయనకు ఒక నటితో ఎఫైర్ ఉంది: శ్రీదేవి భైరప్ప 'వృత్తిపరమైన సమగ్రతను కాపాడుకోవాల్సిన వ్యక్తి బహిరంగంగా ఒక మహిళ పాత్రపై తక్కువ స్థాయిలో తప్పుడు ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైనది. గత కొన్ని నెలలుగా నేను ఎన్నో బాధలు పడ్డా, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు మౌనంగా ఉన్నాను. కానీ నా మర్యాదను, మానవత్వాన్ని గౌరవించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరం. యువ రాజ్‌కుమార్‌కు ఒక నటితో అక్రమ సంబంధం ఉంది. నిజం, న్యాయం తప్పకుండా గెలుస్తుందని నేను నమ్ముతున్నాను.' అని శ్రీదేవి భైరప్ప సోషల్ మీడియాలో రాశారు.యువ రాజ్ కుమార్ చైల్డ్ ఆర్టిస్టుగా ఓమ్ చిత్రంలో మెప్పించాడు. ఈ ఏడాదిలోనే 'యువ' అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మైసూరుకు చెందిన శ్రీదేవిని ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు మొదట అంగీకరించలేదు. అయితే పునీత్ రాజ్‌కుమార్ జోక్యంతో వీరిద్దరి పెళ్లి జరిగింది. నివేదిక ప్రకారం, శ్రీదేవి మొదట్లో డాక్టర్ రాజ్‌కుమార్ సివిల్ సర్వీస్ అకాడమీని చూసుకుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నత చదువులు చదువుతోంది. జూలై 4 విడాకుల విషయం కోర్టులో విచారణ జరగనుంది. View this post on Instagram A post shared by Sridevi Byrappa (@sridevibyrappa) -
Sangeetha Sringeri: పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కొత్త కారు కొన్న స్టార్ హీరో సతీమణి.. ధర ఎంతో తెలిస్తే
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించి మూడేళ్లు కావస్తుంది. ఆయన మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను ఆయన సతీమణి అశ్విని తన భుజాన వేసుకున్నారు. ఆమె ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమా పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల హోస్పేటలో జరిగిన 'యువ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సగంలో వదిలేసిన పనులను అశ్విని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన పిఆర్‌కె ప్రొడక్షన్స్‌కు సంబంధించిన పలు సినిమాలు నిర్మాణరంగంలో ఉన్నాయి. ఆగిపోయిన ఆ ప్రాజెక్ట్‌లను ఆమె కొనసాగిస్తున్నారు. వాటిలో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రంమలో నిర్మాత అశ్విని పునీత్ రాజ్‌కుమార్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పునీత్‌కు కూడా కారు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు AudiQ7 కారు ఆ జాబితాలో చేరింది. ఈ రోజుల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. ఆడి క్యూ7 ఇతర కార్ల కంటే డిజైన్, లుక్స్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ తదితర అంశాల్లో చాలా భిన్నంగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇది లీటర్ పెట్రోల్‌కు 14 కి.మీల మైలేజీని కూడా ఇస్తుంది. క్షణాల్లో 250 KMPH స్పీడ్‌ను అందుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలతో కూడిన ఆడి క్యూ7 కారు ఆన్-రోడ్ ధర రూ.1 కోటి 10 లక్షల వరకు ఉంటుంది. 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా తన భార్య అశ్వినికి రూ. 5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారుని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు పునీత్. అంతకు ముందు కూడా జాగ్వార్ కారుని తన భార్యకి గిఫ్ట్‌గా పునీత్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అశ్విక కొన్న కారు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
స్టార్ హీరో సినిమా రీరిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న సతీమణి
పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా 'జాకీ' సినిమా కర్ణాటక వ్యాప్తంగా మళ్లీ విడుదలైంది. ఈ చిత్రాన్ని KRG స్టూడియో రాష్ట్రవ్యాప్తంగా 120కి పైగా స్క్రీన్లలో విడుదల చేసింది. మార్చి 17న పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజు ఉంది. దీంతో ఆయన అభిమానుల కోరిక మేరకు జాకీ చిత్రాన్ని నేడు రిలీజ్ చేశారు. పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ మరణించిన తర్వాత ఆయన నుంచి రీరిలీజ అయిన తొలి సినిమా జాకీ కావడంతో చాలా వరకు థియేటర్లలో పూలతో అలంకరించారు. తెల్లవారుజామున 4.30 నుంచి 'జాకీ' స్పెషల్ షోలు వేశారు. అభిమానులతో పాటు సినిమాను చూసేందుకు పునీత్ సతీమణి అశ్విని కూడా వెళ్లారు. వెండితెరపై తన భర్తను చూసి ఆమె భావోద్వేగానికి లోనైంది. కొన్నిసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారుజ ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అశ్వినితో పాటు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు కూడా సినిమా చూశారు. దునియా సూరి డైరెక్షన్లో 2010లో జాకీ సినిమా విడుదల అయింది. కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్‌సెట్టింగ్ చిత్రాలలో ఒకటిగా, పునీత్ రాజ్‌కుమార్ కెరీర్లో ల్యాండ్‌మార్క్ సినిమాల్లో ఒకటిగా జాకీ చిత్రం నిలిచింది. పునీత్ రాజ్‌కుమార్ సరసన భావన ఇందులో నటించింది. Best ever Fan Show For me 🥺🔥👑 Stadium gintha jasthi soun ithu 🔥#Jackie #DrPuneethRajkumar pic.twitter.com/8HnpUMZDeP — Venka appu (@Venkaappu777) March 15, 2024 -
స్టార్ హీరో చిత్రాన్ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ.. ఎందుకంటే?
కన్నడ దివంగత స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆయన కెరీర్లో చివరిసారిగా నటించిన చిత్రం గంధడ గడ. డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో రిలీజై ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ చిత్రం మొదట అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత లైసెన్స్ గడువు ముగియడంతో తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి అమెజాన్ ఈ మూవీని తొలగించింది. దీంతో పునీత్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: పునీత్ రాజ్‌కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే అమెజాన్‌లో తొలగించినా.. గంధడ గడ మూవీ మరికొన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం యూట్యూబ్, గూగుల్ టీవీ, ఐట్యూన్స్, యాపిల్ టీవీల్లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సినిమాను వీక్షించాలనుకుంటే...రూ.100 అద్దె చెల్లించి చూసేయొచ్చు. ఈ డాక్యుమెంటరీని కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఈ డాక్యూమెంటరీ ఫిల్మ్ లో నటిస్తూనే స్వయంగా నిర్మించారు పునీత్ రాజ్‌కుమార్. కాగా.. పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది. -
పునీత్ రాజ్‌కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్
కన్నడ సినిమా యువరాజు, పవర్ స్టార్, కర్ణాటక రత్న పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెంది నేటికి రెండేళ్లు. నేటికీ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఆయన సజీవంగానే ఉన్నాడు. సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు సామాజిక సేవలో కూడా అప్పూ నిమగ్నమయ్యాడు. అందుకే నేటికీ ఆయన అభిమానుల మదిలో మరపురాని జ్ఞాపకం. కంఠీర స్టూడియోలోని అప్పు స్మారకాన్ని పూలతో అలంకరించారు. సంస్మరణ సభకు సన్నాహాలు కంఠీరవ స్టూడియోలోని ఆయన సమాధి దగ్గర శనివారం అప్పు సంస్మరణ సభకు సన్నాహాలు చేశారు. ఈ సమాధిని పునీత్ రాజ్ కుటుంబం నిర్మించింది. పునీత్ రాజ్‌కుమార్ సమాధిని తెల్లటి పాలరాతితో నిర్మించారు. దానిపై పునీత్ ఫోటో పెట్టారు. సమాధి చుట్టూ ఉన్న ప్రాంతం తెల్లటి రాతి పలకతో కప్పబడి ఉంటుంది. తన తండ్రి స్మారకం మాదిరిగానే పుత్ర స్మారకం కూడా ఏర్పాటు చేశారు. నేడు ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్, పిల్లలు సమాధి దగ్గరకు వచ్చి పూజలు చేశారు. వారితో పాటుగా శివరాజ్ కుమార్ కూడా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నాడు. అక్కడకు భారీగా ఆయన అభిమానులు తరలి వచ్చారు. క్యూలో నిల్చున్న అభిమానులు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ, పునీత్ రాజ్‌కుమార్ సమాధులను రకరకాల పూలతో అలంకరించారు. పూజలు చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో సమాధి వద్దకు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడి నివాళీలు అర్పిస్తున్నారు. అప్పా (నాన్న) ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడని వారు నినాదాలు చేస్తున్నారు. పునీత్ మరణం తర్వాత జూ. ఎన్టీఆర్ మాట్లాడిన మాటాలను తాజాగా ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అభిమానులకు అన్నదాన ఏర్పాట్లు పునీత్ సమాధి దర్శనానికి వచ్చే అభిమానులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మందికి పులావ్, పెరుగు, కుంకుమపువ్వు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు. 20 మందితో కూడిన బృందం వంట చేస్తోంది. రోజంతా అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాట్లను శివరాజ్ కుమార్ ఏర్పాటు చేశాడు. ► పునీత్ రాజ్‌కుమార్ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించడం, 26 అనాథ ఆశ్రమాలు, 16 వృద్ధుల ఆశ్రమాలు, 19 గోశాలలు ఏర్పాటు చేశాడు. అవి ఇప్పటికీ ఆయన భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ► పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది. We Will Never Miss You....🥺 Untill See You Again......🙏🏻💐 ನಿಮ್ಮನು ಪಡೆದ ನಾವು ಪುನೀತ.... Atleast,We Are Waiting In Our Dream To See You 🥺😭🙏🏻#DrPuneethRajkumar pic.twitter.com/ntLaMstVmP — POWER STAR (@Yuva_PRK) October 28, 2023 #Appuliveson #DrPuneethRajkumar Day 730, Still love for him remains same ♥️pic.twitter.com/qWgQEfy0iu — Insulter (@Insulter3730010) October 29, 2023 We miss you @PuneethRajkumar garu 😭#WeMissYouAppu #AppuLiveOn #PowerStar #DrPuneethRajkumar #PuneethRajkumarLivesOn#DrPuneethRajkumar pic.twitter.com/mtGZEwdMNG — NTR Fans AnaNTapuR (@Anantapur_FCNTR) October 29, 2023 -
పేరుకే నా తమ్ముడు.. తండ్రిలా నా కోసం ఏం చేశాడంటే: పునీత్ అన్నయ్య
మనిషికి కష్టాలు వచ్చినప్పుడే జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. తన వాళ్లు ఎవరో.. పరాయి వాళ్లు ఎవరో తెలుస్తుంది. జీవితంలో నిజమైన ఆప్తులు ఎవరో తెలియాలంటే బలమైన కష్టాలు రావాలి అనే మాట నూటికి నూరు శాతం నిజం. అలా ఎన్నో కష్టాలను ఈ ముగ్గురు అన్నదమ్ములు ఎదుర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకరిని చూస్తే మరొకరికి ప్రేమ... కన్నడ సినీ ఇండస్ట్రీలో పునీత్ రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్ (శివన్న),రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లు రక్తసంబంధానికి ఉన్న విలువలను అనేకమార్లు చాటిచెప్పారు. ఈ ముగ్గురిలో అందరి కంటే పెద్దవారు శివన్న.. చివరి వాడు పునీత్ రాజ్‌కుమారు అని తెలిసిందే. (ఇదీ చదవండి: అనారోగ్యంతో తండ్రి.. తన పంతాన్ని పక్కన పెట్టేసిన విజయ్) తాజాగా పునీత్ గురించి తన రెండో అన్న రాఘవేంద్ర పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. పునీత్ రాజ్‌కుమార్‌ను తామందరం ఇంట్లో 'అప్పు' అని ప్రేమగా పిలుచుకుంటామని ఆయన గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబంలోని అందరిపై అప్పు ప్రేమ ఒకేలా ఉంటుందని రాఘవేంద్ర ఇలా చెప్పాడు. 'నాకంటే అప్పు పదేళ్లు చిన్నవాడు.. అందుకే వాడిని నేను తమ్ముడిలా కాకుండా కొడుకులా చూశాను. పునీత్ బతికి ఉన్నప్పుడు కూడా కొడుకులానే భావించేవాడిని... అప్పును చిన్నప్పటి నుంచి నేనే షూటింగ్‌కి తీసుకెళ్లేవాడిని.. వాడికి స్నానం కూడా చెయించేవాడిని అలా మా మధ్య తండ్రీకొడుకుల బంధం ఏర్పడింది. ఒక సినిమాలో కూడా ఇద్దరం కలిసి అలాంటి పాత్రలలోనే కనిపించాం.' అని రాఘవేంద్ర చెప్పాడు పునీత్ రాజ్‌కుమార్ రక్తసంబంధానికి మంచి మెసేజ్ ఇచ్చి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తన అన్నయ్య గుర్తుచేసుకున్నారు. శివన్న, పునీత్‌లకు ఇద్దరికీ చెరో ఇల్లు ఉండేది. కానీ తనకు మాత్రమే సొంత ఇల్లు లేదని రాఘవేంద్ర చెప్పాడు. అలాంటి సమయంలో అప్పునే తనకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు. వారిద్దరి ఇంటి కంటే ఎంతో గొప్పగా ఇంటిని నిర్మించి తనకు ఇచ్చాడని పేర్కొన్నాడు. పునీత్ లేకుంటే ఇప్పటికి కూడా తాను ఇంత ఖరీదైన ఇల్లు నిర్మించుకునే వాడిని కాదని ఆయన చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్) 'అప్పట్లో నేను సినిమాల్లో నటించడం మానేశాను.. దీంతో నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అప్పట్లో నేను ఒంటరిగా ఆ కష్టాలను భరించేవాడిని ఎవరితోను చెప్పుకునే వాడిని కాదు. అలాంటి సమయంలో నా పరిస్థితిని గమనించి మా ఇంటి బాధ్యతను పునీత్ తీసుకున్నాడు. ఆర్థిక సాయంతో పాటు కొన్ని సినిమా అవకాశాలను కూడా అప్పూనే ఇప్పించాడు. ఏ సినిమా చేసినా నన్నూ వాడి వెంట ఎక్కడికైనా తీసుకెళ్లేవాడు. అతను నాకు అన్నయ్య స్థానం ఇచ్చాడు, కానీ.. తండ్రిగా నా జీవితాన్ని నిలబెట్టి ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.' అని పునీత్ రాజ్‌కుమార్‌ను ఆయన గుర్తుచేసుకున్నాడు. -
జిమ్ చేస్తున్నా గుండెజబ్బులు.. సిద్దార్థ్ నుంచి స్పందన వరకు.. కారణమేంటి?
సాధారణంగానే సెలబ్రిటీలు స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతుంటారు. వయసు పైబడుతున్నా ఇంకా అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అదే సమయంలో 40ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటుతో ఇటీవల తరచూ సెలబ్రిటీలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.సరైన జీవనశైలి, పౌష్టికాహారం, శారీరక శ్రమ ఉంటే గుండెపోటు నుంచి కశ్చితంగా తప్పించుకోవచ్చు అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని సెలబ్రిటీల మరణాలను చూస్తే అర్థమవుతుంది.వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసులోనే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిద్దార్థ్ శుక్లా నుంచి స్పందన వరకు.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీళ్లే.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలుగతంలో హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 13 విజేత, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయేనాటికి ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన నిత్యం వ్యాయాయం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్‌ను ఫాలో అయ్యేవాడు. చనిపోయే ముందురోజు కూడా వర్కవుట్స్ చేశాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ దురదృష్టం కొద్దీ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశాడు.ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా 2021లో గుండెపోటుతోనే హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ 46 ఏళ్ల వయసులోనే హార్ట్ఎటాక్కు గురయ్యారు. యన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.చిన్నవయసులోనే హార్ట్ఎటాక్మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా కూడా గుండెపోటుతోనే మరణించారు. ఈయన ప్రముఖ నటుడు అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 35ఏళ్ల వయస్సులోనే హార్ట్ ఎటాక్‌తో చిరంజీవి సర్జా కన్నుమూశారు. చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సుమారు 19 సినిమాల్లో నటించాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చదవండి: హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అర్థంతరంగా తారకరత్న తనువు చాలించాడు. సుమారు 23రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. పునీత్ కుటుంబంలో మరో విషాదంతాజాగా కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు.2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే స్పందన కూడా మరణించడం శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఈనెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కానీ ఆ వేడకకు కొన్నిరోజులు ముందే స్పందన ఇలా హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.వ్యాయామం చేస్తున్నా ఎందుకీ గుండెజబ్బులు?స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నా చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకొస్తుందనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తుంది. గతంలో 25-30-40 ఏళ్ల వయస్సులో గుండెపోటు అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవలికాలంలో ఈ సంఖ్య పెరుగుతోంది. వర్కవుట్స్ చేస్తే మంచిదే కదా అని అతిగా వ్యాయామాలు చేయకూడదు.దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతంది. యువత చాలా ఎక్కువ జిమ్ చేస్తుంటారు. కానీ జిమ్‌లో చేసే కొన్ని పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణమౌతుంటుంది. వ్యాయామం ఎప్పుడూ సాధారణ స్థాయిలో, మితంగా ఉండాలి. పరిమితి దాటితే అనర్థాలు తప్పవు.హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంపై, గుండెపై దుష్ప్రభావం పడుతుంది. గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని, వయసు పెరుగుతున్న కొద్దీ డాక్టర్ల సూచనతో వ్యాయామం, డైట్‌ను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?
ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెకేషన్‌కు వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది. స్పందన ఆకస్మిక మరణం ఆమె కుటుంబ సభ్యులను,శాండల్‌వుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమో వయస్సు కేవలం 44 ఏళ్లు మాత్రమే. ఒకప్పుడు గుండెజబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వయసు పైబడిన వారిలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 60ఏళ్లలో వచ్చే వ్యాధులు కూడా 30-40లోనే పలకరిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇండియాలో 25 శాతం గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపు వారిలోనే నమోదవుతున్నాయి. అసలు చిన్న వయస్సులోనే గుండెజబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి హార్ట్ ఎటాక్ వస్తే ప్రాణాలు పోయినట్లేనా? ఈ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నవయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పుడు 60లో వచ్చే గుండెజబ్బులు ఇప్పుడు టీనేజీ పిల్లలను కూడా కబలిస్తున్నాయి. గుండెపోటు లక్షణాలను మొదట్లోనే గుర్తించకపోవడం కారణంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, సమయ పాలన లేకపోవడం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఇతర అనారోగ్య సమస్యలు గుండెపోటుకు ప్రధానంగా కారణమవుతున్నట్లు పలువురు వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు స్ట్రోక్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గుండెజబ్బులకి కరోనాయే కారణం అని చెప్పే ఆధారాలు లేవని చెబుతున్నా, కోవిడ్‌తో శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. డయాబెటీస్ కారణమా? ఇటీవల జరిపిన ఓ పరిశోధన ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే దక్షిణాసియా దేశాల ప్రజల్లోనే గుండె సమస్యలతో బాధపడేవారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్లు తేలింది. ఇందుకు జీన్స్ మాత్రమే కాదు.. మారుతున్న జీవన శైలి కూడా కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు.2030 నాటికి ఇండియాలో 80 మిలియన్ మంది డయాబెటీస్‌తో బాధపడుతుంటారని అంచనా. మన దేశ జనాభాలో సుమారు 10శాతం యువత ఇప్పటికే పలు లైఫ్‌స్టైల్ డిజార్డర్లతో బాధపడుతున్నట్లు తేలింది. దీనికి ఉప్పు, కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని అతిగా తీసుకోవడం కూడా ఒక కారణం.వీటి వల్ల శరీరంలో చెడు కొవ్వులు, హైపర్ టెన్షన్ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. చిన్న వయసులోనే గుండెజబ్బు రావడానికి మరో కారణం.. డయాబెటీస్(మధుమేహం). డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ధమనుల్లో రక్తం గడ్డకడుతుంది. వీటినే బ్లడ్‌క్లాట్స్ అంటారు. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెకు వెళ్లే రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె నొప్పి వస్తుంది. ఇక ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లు కూడా గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇప్పట్లో యూత్ చిన్న వయసులోనే స్మోకింగ్, డ్రింకింగ్‌ను అలవాటు చేసుకుంటున్నారు. ఇది మితిమీరి గుండెపోటుకు కారణం అవుతుంది. గుండెనొప్పి సంకేతాలు ఇలా గుండె చాలా భారంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది రక్తం సరఫరా తగ్గి గుండెలో మంటగా ఉంటుంది. మత్తుగా ఉండి, చెమటలు ఎక్కువగా పడుతాయి. తీవ్రమైన అలసట, ఛాతి దగ్గర నొప్పి వస్తే అస్సలు నిర్లక్యం చేయొద్దు. రీర పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే గుండెనొప్పికి సంకేతంగా భావించవచ్చు. గుండె ఆరోగ్యం మీ చేతిలోనే.. ►గుండెజబ్బులు రాకుండా ముందునుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి ► మీ కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం, గుండె జబ్బులు ఉన్నట్లయితే ముందస్తుగా స్క్రీనింగ్ చేయించుకోవాలి ► ఆరోగ్యానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ► వ్యాయామం చేస్తే మంచిదే కదా అని అతిగా చేయకూడదు. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది ► ఒత్తిడి,సరైన నిద్ర లేకపోవడం కూడా గుండెజబ్బులకు మరో కారణం ► కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు డైట్లో ఉండేలా చూసుకోవాలి -
పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం.. గుండెపోటుతో స్పందన మృతి
కన్నడ ప్రముఖ నటుడు,సింగర్ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మరణించారు. కుటుంబంతో కలిసి బ్యాంకాక్‌కు విహారయాత్రకు వెళ్లిన స్పందన అక్కడ గుండెపోటుతో మరణించారు. ఆమె ఆకస్మిక మరణ వార్తతో కుటుంబ సభ్యులతో పాటు శాండల్‌వుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు. 2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచి స్పందన మరణించడం చాలా బాధాకరమైన సంఘటననే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) ఈ నెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. 2007లో విజయ్ రాఘవేంద్రను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. విజయ రాఘవేంద్ర, స్పందన జంటకు శాండల్‌వుడ్‌లో భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. తన భర్త సినిమాలకు స్పందననే నిర్మాతగా ఉండి పలు సినిమాలను కూడా నిర్మించింది. తుళు కుటుంబానికి చెందిన స్పందన మాజీ పోలీసు అధికారి శివరామ్ కుమార్తె. 2017లో విడుదలైన రవిచంద్రన్ చిత్రం అపూర్వలో కూడా ఆమె అతిధి పాత్ర పోషించింది. స్పందన భౌతికకాయం రేపటిలోగా బెంగళూరుకు తీసుకురానున్నట్లు సమాచారం. శాండల్‌వుడ్‌లో పాపులర్ యాక్టర్ అయిన స్పందన భర్త విజయ్ రాఘవేంద్ర నటించిన 'చిన్నారి ముఠా' సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. అక్కడి పరిశ్రమలో ఆయన సుమారు 50 సినిమాలకు పైగా నటించగా 20కు పైగా పాటలు పాడారు. ప్రస్తుతం పలు టీవీ షోలలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దిగ్భ్రాంతికి గురి చేసింది: కర్ణాటక ముఖ్యమంత్రి ప్రముఖ కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన అకాల మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. స్పందనను కోల్పోయిన విజయ రాఘవేంద్ర, బికె శివరామ్‌ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. -
ఛాతిపై పచ్చబొట్టుగా పవర్‌స్టార్ పేరు..పిక్ వైరల్
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి రెండేళ్లు కావోస్తున్నా.. అతని అకాల మరణాన్ని మాత్రం అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. కన్నడలో ఏ సినిమా ఈవెంట్ జరిగా పునీత్ పేరును స్మరించుకుంటున్నారు. పునీత్ కుటుంబ సభ్యులు కూడా ఆయన పేరు తెరపై కనిపిస్తే.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పునీత్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ అయితే ప్రతి సినిమా ఈవెంట్లో తమ్ముడిని తలచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఇక తాజాగా తన తమ్ముడి పేరుని ఛాతిపై టాటూగా వేయించుకున్నాడు రాఘవేంద్ర రాజ్‌కుమార్. (చదవండి: నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నా..హీరో అశ్విన్ కన్నీటి పర్యంతం) రాఘవేంద్రకు తమ్ముడు అంటే చాలా ఇష్టం. వయసులో చాలా చిన్నవాడు కావడంతో అతన్ని సొంత కొడుకులా చూసుకున్నాడు. అయితే 46 వయసులో పునీత్ గుండె పోటుతో మరణించాడాన్ని రాఘవేంద్ర తట్టుకోలేకపోయాడు. ఇప్పటికీ ఏదైనా స్టేజిపై పునీత్ ఫొటో కనిపిస్తే దుఃఖం ఆపుకోలేడు. ఇక తన తమ్ముడిని చిరకాలం గుర్తించుకోవడం కోసం చాతిపై ‘అప్పు’ అని టాటూ వేయించుకున్నాడు. ఇది పునీత్ ముద్దు పేరు. అప్పుతో పాటు టోటో, నుక్కి పేర్లను కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. అవి పునీత్ ఇద్దరి కుమార్తెల ముద్దు పేర్లు. వాళ్ల అసలు పేర్లు ‘వందిత, ధృతి’. ఇక రాఘవేంద్ర విషయానికొస్తే.. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. రాఘవేంద్ర చివరగా పునీత్ నటించిన ‘జేమ్స్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించాడు. ಅಪ್ಪು ಮತ್ತು ಅಪ್ಪು ಮಕ್ಕಳ ಹೆಸರನ್ನ ಎದೆ ಮೇಲೆ ಹಾಕಿಸಿಕೊಂಡ ರಾಘಣ್ಣ 🙏@iRaghanna #RaghavendraRajkumar pic.twitter.com/GMwRx7ZSYQ — Sagar Manasu (@SagarManasu) May 28, 2023 -
ఓటీటీకి వచ్చేసిన పునీత్ రాజ్‌కుమార్ చివరి మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేంకగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 'అప్పు' అంటూ ఆయన అభిమానులు ప్రేమగా పిలుచుకునే కన్నడిగుల ఆర్యాధ్య నటుడు పునీత్ రాజ్ కుమార్. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పునీత్ 2021లో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి ముందు గంధడ గుడి అనే వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరి ఫిలిం తీశారు. ఈ మూవీ గతేడాది పునీత్ వర్ధంతి(అక్టోబర్ 22, 2022) సందర్భంగా థియేటర్లో రిలీజ్ అయ్యింది. పునీత్ చివరి సినిమా కావడంతో ప్రేక్షకులంత థియేటర్లకు క్యూ కట్టారు. కర్ణాటక అడువుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో గంధడ గుడి డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పునీత్ జయంతి సందర్భంగా శుక్రవారం (మార్చి 17)నుంచి ఈ సినిమాను కన్నడ వెర్షన్లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ప్రకృతి ప్రేమికుడైన పునీత్ కర్ణాటక ప్రకృతి అందాలను నేటి యువత, విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరిని తీశారన్నారు ఆయన భార్య, ఈ మూవీ నిర్మాత అశ్విని. రాష్ట్రంలోని అడవులు, అందమైన ప్రదేశాలను ఇందులో చక్కగా చూపించామన్నారు అశ్విని. -
Puneeth Rajkumar: ఐరన్ స్క్రాప్‌తో పునీత్ రాజ్‌కుమార్ విగ్రహం
తెనాలి: కర్ణాటకకు చెందిన ప్రముఖ సినీనటుడు డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ అభిమానుల వినతిపై ఆయన నిలువెత్తు ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని గుంటూరు జిల్లా తెనాలిలోని సూర్య శిల్పశాల శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తయారు చేశారు. టన్నున్నర ఐరన్ స్క్రాప్‌ను వినియోగించి నాలుగు నెలలు శ్రమించి తొమ్మిది అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు. బెంగళూరులోని ఓ ప్రధాన కూడలిలో ప్రతిష్టించనున్నారు. -
పునీత్ జయంతి రోజునే ఉపేంద్ర సుదీప్‌ల కబ్జా రిలీజ్
తమిళసినిమా: కేజీఎఫ్ పార్టు–1, పార్టు–2, కాంతార, 777 చార్లీ, విక్రాంత్ రోమా వంటి కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి భారతీయ సినిమానే తమ వైపు తిప్పుకున్నాయి. తాజాగా అదే బాణీలో రూపొందిన కన్నడ చిత్రం కబ్జా. బహు భాషా నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటించిన ఇందులో నటి శ్రియ కథానాయకిగా నటించారు. మురళి శర్మ, సుధ ముఖ్యపాత్రలు పోషించారు. శిద్దేశ్వరా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఆర్.చంద్రశేఖర్ నిర్మించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఇది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేజీఎఫ్ చిత్రం ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 7 భాషల్లో కన్నడ చిత్ర పరిశ్రమ అప్పు అని అభిమానంతో పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలకు సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం కబ్జా అని తెలిపారు. 1947 ప్రాంతంలో ఒక స్వాతంత్య్ర సమరయోధుడు వేధింపులకు గురవుతాడన్నారు. ఆయన కుమారుడు గ్యాంగ్‌స్టర్ ముఠాలో చిక్కుకుంటాడని ఆ తర్వాత జరిగే కథే ఈ కబ్జా చిత్రం అని చెప్పారు. -
ఆయన స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేరు.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రంలో నటిస్తోంది. పుష్-పార్ట్ 1 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ ఎదిగిన ఆమె బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలూ చేస్తోంది. కర్ణాటకలో పుట్టి కన్నడలో మొదటి హిట్ అందుకున్న రష్మిక మందన్నా దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కమార్తో ఓ చిత్రంలో నటించారు. ఆయనతో కలిసి అంజనీపుత్ర అనే చిత్రంలో కనిపించారు. ఆ సినిమా విడుదలై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు పుష్ప బ్యూటీ. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ.. ' ఇప్పటికీ అంజనీపుత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నేను పునీత్ రాజ్‌కుమార్‌తో సంభాషణలను గుర్తు చేసుకుంటూనే ఉంటా. పునీత్ సార్ నాపై ఎక్కువ నమ్మకంతో ఉండేవారు. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్థానాన్ని నా హృదయంలో ఎప్పటికీ భర్తీ చేయలేరు. ఈ సినిమాలో అవకాశం కల్పించిన హర్ష సార్‌కు థాంక్యూ.' అంటూ పోస్ట్ చేసింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. It’s #5YearsForAnjaniPutra already🤍 I keep thinking about the conversations with @PuneethRajkumar sir and he was more confident in me than myself always. He has the best heart, forever will be irreplaceable in my heart. Thankyou Harsha sir for this film,it means a lot to me.🌸 — Rashmika Mandanna (@iamRashmika) December 21, 2022 -
ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలిచి వేసింది: కిచ్చా సుదీప్
కన్నడ హీరో దర్శన్‌పై చెప్పుల దాడిని మరో నటుడు కిచ్చా సుదీప్ ఖండించారు. ఇలా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చర్య తనను తీవ్ర కలవరానికి గురి చేసిందని అన్నారు. పునీత్ రాజ్ కుమార్ ఉండి ఉంటే ఇలాంటి చర్యలను సమర్థించేవారా అని ఆయన అభిమానులను సుదీప్ ప్రశ్నించారు. దర్శన్‌పై చెప్పులు విసరడాన్ని ఖండిస్తూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఆదివారం 'క్రాంతి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కర్ణాటకలోని హోస్పేట్లో సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. కిచ్చా సుదీప్ ట్విటర్లో రాస్తూ.. 'మన భూమి, భాష, సంస్కృతి అనేది ప్రేమ, గౌరవానికి సంబంధించినది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి వ్యక్తి గౌరవంగా వ్యవహరించడానికి అర్హులు. నేను చూసిన వీడియో నన్ను చాలా కలవరపెట్టింది. ఇంకా చాలా మంది అలాగే సినిమాలోని ప్రముఖ మహిళ కూడా అక్కడే నిలబడి ఉన్నారు. వారంతా ఈవెంట్లో నిమగ్నమై ఉన్నారు. మీరు వారిని అవమానించారు. ఇలాంటి పనులు చేసింది కన్నడిగులేనా అన్న అనుమానం వస్తోంది.' అని రాసుకొచ్చారు. దర్శన్, పునీత్ అభిమానులకు మధ్య పరిస్థితులు బాగా లేవని నేను అంగీకరిస్తున్నా.. కానీ ఇలాంటి ప్రతిచర్యను పునీత్ స్వయంగా మెచ్చుకుని మద్దతు ఇచ్చేవారా? అని ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే..: కాగా దర్శన్ ఇటీవల అదృష్ట దేవతపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 'అదృష్ట దేవత ప్రతిసారీ తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడే చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి లాక్కెల్లి దుస్తులు విప్పేయాలి. అప్పుడు ఆమె ఎక్కడికీ వెళ్లదు' అని దర్శన్ చేసిన కామెంట్లు ఎంతగానో వివాదాస్పదమయ్యాయి. అదృష్ట దేవతను లక్ష్మీ దేవతగా భావిస్తారు. శ్రీ విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిపై అంత నీచంగా ఎలా మాట్లాడతావంటూ అతడిపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. కాగా.. దర్శన్ నటించిన చిత్రం క్రాంతి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వి హరికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దర్శన్ సరసన రచితా రామ్ నటిస్తోంది. Rebellion isn't always an Answer. ❤️🙏🏼 pic.twitter.com/fbwANDdgP0 — Kichcha Sudeepa (@KicchaSudeep) December 20, 2022 -
కన్నడ ప్రేక్షకులకు లేఖ రాసిన పునీత్ భార్య, ఏమన్నారంటే..
దివంగ నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘గంధర గుడి’. వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరి చిత్రంగా ఈ మూవీ రూపొందింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కర్ణాటక ప్రేక్షకులతో పాటు సెలబ్రెటీలను సైతం బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కర్ణాటక అడవులను, వాటిలోని ప్రాముఖ్యతను కన్నడిగులకు తెలియాలజేయాలనే ఉద్ధేశంతో పునీత్ రాజ్‌కుమార్ ఈ మూవీ చేశారట. చదవండి: విశ్వక్ సేన్‌పై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు? ఈ విషయాన్ని తాజాగా ఆయన భార్య అశ్విని రేవంత్ తెలిపారు. ఈ మేరకు ఆమె కర్ణాటక ప్రేక్షకులను ఉద్దేశిస్తూ లేఖ విడుదల చేశారు. ‘‘గంధద గుడి.. ఇది పునీత్ రాజ్‌కుమార్ కలల చిత్రం. కర్ణాటక అడవుల అందాలు అందరికీ చూపించాలని ఆయన ఈ సినిమా చేశారు. కన్నడ ప్రజలందరూ ఈ సినిమా చూడలన్నది ఆయన కోరిక. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిత్రం చూడాలని అప్పు(పునీత్) ఎంతగానో కోరుకున్నారు. మన పిల్లల కోసం మన అడవులను కాపాడుకుందాం. వాళ్లకి కర్ణాటక అందాలను చూపిద్దాం’’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. చదవండి: తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’ కాగా అమోఘవర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పునీత్ భార్య అశ్వినీ నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 28న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కొద్ది రోజులకే పునీత్ గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఆయన మరణించిన కొన్ని రోజు రోజులకే ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా విశేష ఆదరణ అందుకుంది. ప్రధానీ నరేంద్ర మోదీ సైతం గంధర గుడి ట్రైలర్‌పై స్పందించారు. ‘పునీత్ కోట్లాది మంది హృదయాలలో జీవిస్తూనే ఉంటారు. ఆయన ఎంతో ప్రతిభ కలిగిన నటులు. గంధద గుడి సినిమా కర్ణాటక ప్రకృతి సౌందర్యాన్ని చూపుతోంది. ఈ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు’ అని మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ನಾಡಿನ ಜನತೆಯಲ್ಲಿ ನನ್ನ ಒಂದು ಮನವಿ... An appeal to all the people of the state.#GGKids #GGMovie #GandhadaGudi #DrPuneethRajkumar pic.twitter.com/tf01Kt2Alu — Ashwini Puneeth Rajkumar (@Ashwini_PRK) November 6, 2022 -
‘కాంతార’కి ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ హీరో: అసలు విషయం చెప్పిన రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. మొదట సెప్టెంబర్ 30న కన్నడ వెర్షన్లో రిలీజైన ఈ సినిమా అక్టోబర్ 15న తెలుగులో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత హిందీలోనూ రిలీజై నార్త్ ఆడిన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది. భాషతో సంబంధం లేకుండా కథకి, కల్చర్ కీ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. దీంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. చదవండి: హన్సిక కాబోయే భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? విడుదలైన అన్ని భాషల్లో కాంతార వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తిర విషయాన్ని బయటపెట్టాడు ‘కాంతార’ డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించి నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరోగా ముందు అనుకుంది తనని కాదని, ఓ కన్నడ స్టార్ హీరోనంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో తెలిపాడు రిషబ్ శెట్టి. ఇటీవల బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన రిషబ్ ఈ మూవీ విశేషాలను పంచుకున్నాడు. చదవండి: తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్‌గా త్రోబ్యాక్ వీడియో ఈ సందర్భంగా కాంతార స్క్రిప్ట్ మొదట కన్నడ సూపర్ స్టార్, దివంగత నటులు పునీత్ రాజ్‌కుమార్ కోసం రాశానని చెప్పాడు. ‘పునీత్ రాజ్‌కుమార్ సార్ కోసమే కాంతార కథ రాశాను. స్క్రిప్ట్ అంత పూర్తయ్యాక వెళ్లి ఆయనను కలిసి స్క్రిప్ట్ చెప్పాను. అయితే ఆయన అప్పటికే పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేయలేనని చెప్పారు. అయితే ఈ కథ రియాలిటీగా రావాలంటే మీరు నటిస్తేనే బాగుంటుందని, ఇందులో మీరే చేయాలంటూ పునీత్ రాజ్‌కుమార్ సారు సలహా ఇచ్చారు. నన్నే హీరోగా చేయమన్నారు. ఇక ఆయన ఈ సినిమా చేయనన్నారు కాబట్టి. ఇక నేను చేశాను’ అంటూ రిషబ్ శెట్టి అసలు విషయం చెప్పుకొచ్చాడు. -
కన్నడ రాజ్యోత్సవ వేడుకలో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ప్రజలు కుల మతాలకు అతీతంగా సమైఖ్యంగా ఉండాలని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈయన ప్రస్తుతం జైలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆ యన ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. కాగా రజనీకాంత్ మంగళవారం బెంగళూరులో జరిగిన దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. కన్నడ రాజోత్సవ దినం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో జరిగింది. పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రకటించిన కర్ణాటక రత్న అవార్డును ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రజనీకాంత్, జూనియర్ ఎనీ్టఆర్ కలసి పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశి్వనికి అందజేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి రజనీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ కన్నడ భాషలో ప్రసంగించి చప్పట్లు పొందారు. రజనీకాంత్ మాట్లాడుతూ అందరికీ కన్నడ రాజోత్సవ శుభాకాంక్షలు అన్నారు. పునీత్‌రాజ్‌కుమార్ అంత్యక్రియల్లో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. అయితే అది ఆయన నటుడు కావడం వలన కాదని, ఆయన మానవత్వం, సత్ప్రవర్తన కారణంగానే అని అన్నారు. రాజ్‌కుమార్ దైవబిడ్డ అని పేర్కొన్నారు. ఆయన నటించిన తొలి చిత్రం అప్పును తాను విడుదలకు ముందే చూశానని, అది శతదినోత్సవం జరుపుకుందని గుర్తు చేశారు. కాగా ప్రజలందరూ కుల,మతాలకు అతీతంగా, ఐక్యంగా, సంతోషంగా మనఃశ్శాంతిగా జీవించాలని అల్లా, జీసస్, రాజరాజేశ్వరి దేవతను ప్రార్థిస్తున్నానని రజనీకాంత్ పేర్కొన్నారు. కాగా జోరువానలో సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకి కర్ణాటక మంత్రి గొడుగు పట్టడం విశేషం. -
పునీత్‌రాజ్‌కుమార్‌కు కన్నడ రత్న అవార్డు.. ( వైరల్ ఫొటోలు )
-
నా దృష్టిలో అతనే కర్ణాటక రత్న.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
కర్ణాటక అసెంబ్లీలో టాలీవుడ్ యంగ్ టైగర్ అదిరిపోయే ప్రసంగమిచ్చారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్ కన్నడ భాషలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పునీత్ రాజ్‌కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు యంగ్ టైగర్. వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అప్పూ.. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన చేసిన సేవలు అద్భుతం. రాజ్‌కుమార్‌తో ఉన్న క్షణాలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తాను అప్పూకు ఓ స్నేహితుడిగానే ఇక్కడికి వచ్చా. మీ అందరి అభిమానాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశమిచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు. అప్పూ ఫ్యామిలీ నన్ను ఓ కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు వారికి రుణపడి ఉంటా.' అంటూ కన్నడలో మాట్లాడారు. దీంతో సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
పునీత్ రాజ్‌కుమార్‌కు కన్నడ రత్న అవార్డు
తమిళసినిమా: దిగ్గజ నటుడు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుమారుడు, యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గత ఏడాది గుండెపోటుతో హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. ఆయన చివరిగా నటించిన జేమ్స్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అదేవిధంగా కందాడ కుడి అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ రూపొందించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాకుండానే ఆయన మరణించడంతో ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్ మిగిలిన భాగాన్ని విడుదల చేశారు. ఇది పునీత్ రాజ్‌కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్. దీనిని ఆయన తొలి వర్ధంతి సందర్భంగా సోమవారం విడుదల చేయనున్నారు. కాగా పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత అవార్డు కన్నడ రత్నను ప్రదానం చేయనుంది. ఈ అవార్డు ప్రదానోత్సవ వేడుక పునీత్ రాజ్‌కుమార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నవంబర్ 1న బెంగుళూరులో భారీఎత్తున ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి నటుడు రజనీకాంత్‌కు, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. వీరిద్దరూ ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొననున్నారు. దీనిపై నటుడు రజనీకాంత్ శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. పునీత్‌రాజ్‌కుమార్‌కు కన్నడ రత్న అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు నవంబర్ 1న మధ్యాహ్నం చెన్నై నుంచి బెంగళూరుకు చేరుకోనున్నట్లు అందులో పేర్కొన్నారు. పునీత్ గొప్ప నటుడని కొనియాడారు. -
జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి యంగ్ టైగర్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కర్ణాటక అసెంబ్లీకి రావాలని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రత్యేక ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు కర్ణాటక రత్న అనే విశిష్ఠ పురస్కారం అందజేయనున్నారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ నిలవనున్నారు. టాలీవుడ్లోనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాకుండా పునీత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తారక్‌తోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి కూడా కర్ణాటక ప్రభుత్వం అహ్వానాలు పంపింది. ఎన్టీఆర్, రజినీకాంత్‌కు కర్ణాటక చాలా ప్రత్యేకం. సూపర్ స్టార్‌కు మహారాష్ట్ర మూలాలు ఉన్నా కర్నాటకలోనే బస్ కండక్టర్‌గా పనిచేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం కర్నాటక కావడంతో వీరిద్దరిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. -
దివంగత స్టార్ హీరో ట్రైలర్ రిలీజ్.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
కన్నడ స్టార్, దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చిత్రం 'గంధడగుడి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ప్రధాని మోదీకి ట్వీట్ చేసింది చిత్రబృందం. దీనిపై మోదీ కూడా స్పందించారు. పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసుకుంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ రాస్తూ 'పునీత్ రాజ్‌కుమార్ మన మధ్య లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. పునీత్ అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వారు. గంధడగుడి సినిమా ప్రకృతి మాతకు, కర్ణాటక ప్రకృతి సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు నివాళి' అంటూ ట్వీట్ చేశారు. కన్నడలో పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్ అకస్మాత్తుగా మరణించారు. Appu lives in the hearts of millions around the world. He was brilliance personified, full of energy and blessed with unparalleled talent. #GandhadaGudi is a tribute to Mother Nature, Karnataka's natural beauty and environmental conservation. My best wishes for this endeavour. https://t.co/VTimdGmDAM — Narendra Modi (@narendramodi) October 9, 2022