Rajinikanth Slammed By Puneeth Rajkumar Fans: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోంది. ఆయన కన్నుమూసి 12 రోజులు గడుస్తున్నా ఆయన లేరనే చేదు నిజాన్ని కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన అంత్యక్రియలకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. ఆయన మరణ వార్త విని భారత సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. దీంతో శాండల్‌వుడ్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే స్టార్ హీరో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం చాలా ఆలస్యంగా పునీత్‌కు సంతాపం తెలిపారు.
చదవండి: రజనీకాంత్ ఎమోషనల్.. పునీత్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నా..
అయితే దానికి కారణం లేకపోలేదు. పునీత్ మరణించిన రోజే ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజే డిశ్చార్జ్ అయిన రజనీ అప్పటి నుంచి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పునీత్ మరణించిన 12 రోజుల తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా పునీత్‌కు నివాళులు అర్పించారు. అది కూడా ఆయన కూతురు, సినీ దర్శకురాలు సౌందర్య కొత్తగా ప్రారంభించిన హూట్ అనే యాప్ ద్వారా సంతాపం తెలిపారు.
చదవండి: హీరోయిన్ పూర్ణతో రవిబాబు ఎఫైర్ అంటూ వార్తలు, స్పందించిన నటుడు
పునీత్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘నువ్వు లేవన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను పునీత్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా నాన్నా’ అంటూ చేసిన ట్వీట్‌ను హూట్ యాప్‌లో తన ఆడియో సందేశ లింకును జత చేశారు. అయితే, ఆయన ఇచ్చిన సందేశంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హుట్ యాప్ ద్వారా ఆయన సందేశం ఇవ్వడంతో.. ఇది పునీత్ మరణానికి చలించినట్టు లేదని, తన కూతురు యాప్‌ను ప్రమోట్ చేయడానికి ఆయన మృతిని ఉపయోగించుకున్నట్టు కనిపిస్తోందంటూ పునీత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Rajini became 100% viyabaari (businessman )
— Shattia Nathan (@Shattianathan1) November 10, 2021
దీంతో ఓ అభిమాని రజనీ చేసిన ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ ‘కన్నింగ్ ఫెలో’ అంటూ విమర్శ వ్యాఖ్యలు చేశాడు. ‘మీ లాంటి గొప్ప నటులు యాప్ ప్రమోషన్ కోసం మరణ సందేశాలను ఇవ్వడం షాక్‌కు గురి చేసింది’ అని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఇక హూట్ యాప్‌ను సంతాపాల కోసమూ వాడుకోవచ్చన్నమాట’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు సంతాపం తెలియజేస్తున్నారా? లేదంటే యాప్‌ను ప్రమోట్ చేసుకుంటున్నారా?' అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇంత చెత్త పద్ధతిలో యాప్‌ను ప్రమోట్ చేయడం ఆపేయండంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ఇంత నీచానికి దిగజారిపోతారా? అంటూ నెటిజనల్లు రజనీపై మండిపడుతున్నారు.
So cunning fellow. Puneeth died ten days before now only u giving condolence words. Am ashame of your behaviour. U given speech reg daughters new project. U will get best lesson from God am sure.
— Bhaskar (@baaskarnamitha) November 10, 2021
Shocked.. Legend like you should not use grievance message for App Promotion😡😡
— Wasim raja (@wasimrajam) November 10, 2021
Now condolence also in Hoote App. Ithu ungalukkey overaa illaya Sir.
— Anees H (@Anees_Offl) November 10, 2021
Or @soundaryaarajni whoever is handling this id. 🙆♂️
How to get it thalaiva ? ...its a condolence or app promotion?🙂
— i m -sarju (@SarjethSs) November 10, 2021
Whoever using this id please stop promoting the app in such a worst manner.. Promoting the app through condolences is such a low for this Legend superstar @rajinikanth 😌
— Ctrl C + Ctrl V (@thalapathy_modi) November 10, 2021
Comments
Please login to add a commentAdd a comment