
జీవితంలో ఏదైనా జరగవచ్చు. సాధారణ వృత్తి అనుకున్న దానిలో కూడా లక్షలు గడించవచ్చు. అందరూ చేసే అదే వృత్తిలో కొందరు మాత్రమే పాపులర్ అవుతుంటారు. దీన్నే లక్ అంటారనుకుంటా.. కానీ, దాని వెనుక ఎంతో కష్టం కూడా ఉండొచ్చు. కొందరి జీవిత సక్సెస్ స్టోరీలు చూస్తే మనకు నిజమే అనిపిస్తుంది. అందుకు చిన్న ఉదాహరణ ఆలీమ్ హకీమ్. సాధారణంగా ఒక సెలూన్ షాప్‌నకు వెళితే అక్కడ ఒక మనిషి హెయిర్ కటింగ్‌కు రూ.150 తీసుకుంటారు. లగ్జరీ సెలూన్ అయితే రూ.500 తీసుకుంటారు. ఇక సెలబ్రిటీస్‌కు ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుండవచ్చు. అయితే ఒక్కసారి కటింగ్‌కు లక్షల్లో చెల్లించడం అనేది ఎప్పుడైనా విని ఉంటామా..? మనం విని ఉండకపోవచ్చు. ఇది జరుగుతున్న వాస్తవం.
ఆలీమ్ హకీమ్ అనే హెయిర్‌స్టర్ గురించే ఇదంతా. ఇతను హాలీవుడ్ హెయిర్‌స్టర్. మొదట్లో ఒకరికి హెయిర్ కట్ చేస్తే రూ.20 తీసుకునేవారట. ఆ తరువాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇప్పుడు మినిమమ్ లక్ష రూపాయల వరకూ తీసుకుంటున్నారని సమాచారం. ఏంటి ఒకసారి జుత్తు కట్ చేస్తే లక్ష ఎవరు చెల్లిస్తారు ? అని ఆశ్చర్యపోతున్నారా. నిజమేనండి..? ఇది కూడా మినిమమ్ ధర మాత్రమేనట.. అత్యధికంగా ఆయన రూ.2.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. ఆలీమ్ హకీమ్ ఇప్పుడు సాదారణ హెయిరిస్ట్ కాదు. సెలబ్రిటీల హెయిరిస్ట్. అదీ మామూలు సెలబ్రిటీలకు కాదు. సూపర్‌స్టార్స్‌కు హెయిర్‌స్టర్. ఈయన తల మీద కత్తెర పెట్టారంటే అక్షరాలు లక్ష చెల్లించాల్సిందేనట. హాలీవుడ్‌కు చెందిన ఈయనకు కస్టమర్స్ అందరూ ఇండియాకు చెందిన వారే కావడం విశేషం.
ఆలీమ్ హకీమ్ కస్టమర్స్ లిస్ట్ ఇదే
ఈయనకు సినీ, క్రికెట్ క్రీడాకారుల మధ్య మంచి క్రేజ్ ఉంది. ఈయన కస్టమర్లంతా సినీస్టార్స్, క్రికెట్‌స్టార్స్ వంటి వారే. అందులో సూపర్‌స్టార్ రజనీకాంత్,విజయ్ సేతుపతి, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అభిషేక్ బచ్చన్, క్రికెట్ స్టార్ ఎంఎస్.ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్,చాహల్ వంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. రజనీకాంత్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు హెయిర్‌స్టర్‌గా పని చేసింది ఆలీమ్ హకీమే. అటువంటింది ఆయన హెయిర్‌స్టైల్ పని తనం. ఏదైనా ఒక్కసారి పాపులర్ అయితే ఆ తరువాత పేరైనా, డబ్బైనా వెతుక్కుంటూ వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ.
Comments
Please login to add a commentAdd a comment