‘కల్కి 2898’..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే చర్చిస్తున్నారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించాడని అందరు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామతో పాటు పలు పాత్రలను చూపించారు. ఆ సన్నివేశాలన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా అశ్వత్థామ, కృష్ణుడి మధ్య వచ్చే సన్నివేశాలు.. సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి.
(చదవండి: 'కల్కి'లో నిజంగానే అది అద్భుతం.. ఎందుకంటే?)
అయితే సినిమా మొత్తంలో మూడు, నాలుగు సార్లు కృష్ణుడు కనిపిస్తాడు. కానీ ఆయన మొఖం మాత్రం కనిపించదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కావాలనే కృష్ణుడి ఫేస్ రివీల్ చేయలేదట. ఆ పాత్రను ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌తో చేయించాలని భావించారట. నిర్మాత అశ్వనీదత్ ఈ ఇద్దరి హీరోలను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో వారిద్దరు ఆ పాత్రను చేయలేకపోయారు.
(చదవండి: ఇంటర్నేషనల్ మీడియాలో 'కల్కి' హవా .. వేరే లెవల్!)
‘కల్కి 2898’ విడుదలైన మంచి విజయం సాధిస్తే..పార్ట్ 2లో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌తో కృష్ణుడు పాత్ర చేయించాలని డైరెక్టర్ నాగి అనుకున్నాడట. అందుకే పార్ట్ 1లో కృష్ణుడి ఫేస్‌ని రివీల్ చేయకుండా కథను నడిపించాడు. అనుకున్నట్లే సినిమా పెద్ద విజయం సాధించింది. తొలి రోజే ఏకంగా రూ. 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి రికార్డును సృష్టించింది. వీకెండ్‌లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. డైరెక్టర్ అంచనా వేసిందే జరిగింది కాబట్టి.. పార్ట్ 2లో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉంది.
పార్ట్ 1 కృష్ణుడు ఇతనే
‘కల్కి 2898’లో కృష్ణుడి పాత్ర పోషించిన నటుడితో పాటు చాలా మంది పేర్లను మేకర్స్ రహస్యంగానే ఉంచారు. అయితే సినిమా విడుదలైన తర్వాత అందరి పేర్లు బయటకు వచ్చాయి. ఎవరెవరు ఏ పాత్ర పోషించారనేది కూడా సోషల్ మీడియా ద్వారా తెలిసిపోయింది. అర్జునుడుగా విజయ్ దేవరకొండ నటించగా.. కృష్ణుడిగా తమిళ నటుడు కృష్ణకుమార్ సుబ్రమణియమ్ నటించాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఇక ఈ చిత్రంలో కీలకమైన అశ్వత్థామ పాత్రను అమితాబ్ బచ్చన్, సుప్రీం యాష్కిన్ పాత్రను కమల్ హాసన్ పోషించారు. ఇతర కీలక పాత్రల్లో దీపికా పదుకొణె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి నటించారు.
(చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment