Kalki 2898 AD
-
ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్!
టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని హితవు పలికారు. ఇలా వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఒక సినిమా వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు శ్రీరామ్ అన్నారు. చిత్రపరిశ్రమ తరపున నేను క్షమాపణలు చెబుతున్నా అని మాట్లాడారు. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలని సూచించారు. విజయవాడలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.కల్కి చిత్రంపై ఆరోపణలు..సినిమాల్లో హైందవ ధర్మంపై మూడుకోణాల్లో జరుగుతోందని అనంత శ్రీరామ్ ఆరోపించారు. తెరపైన కనిపించే పాత్రలు...వినిపించే పాటల్లో హైందవ ధర్మం దుర్వినియోగం.. కావ్యేతిహాసపురాణాల వక్రీకరణ.. తెరవెనుక మా ముందు అన్యమతస్తుల ప్రవర్తన అని తెలిపారు. వినోదం కోసం వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా అని తెలిపారు. మూడు కోణాల్లో దాడి..అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..'సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి మూడు కోణాల్లో జరుగుతోంది. కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రలు, పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, తెరవెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతం భారత సాహితీ, వాంగ్మయ శరీరానికి రెండు కళ్లలాంటివి. కానీ అదే రామాయణం, మహభారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కొకోల్లలు. గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి.. నిన్న, మొన్న విడుదలైన కల్కి చిత్రంలో కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతున్నా. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డమీదే చెబుతున్నా. అప్పటి చిత్ర దర్శకులు.. ఇప్పటి సినిమా నిర్మాతలు ఇదే జిల్లాకు చెందినవారైనా సరే పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్లు కాదు.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు.. హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థమని గంటాపథంగా తెలియేజేస్తున్నా' అని అన్నారు. కృష్ణాజిల్లా గడ్డపై నిలబడి చెబుతున్నా..అనంతరం మాట్లాడుతూ..'కల్కి సినిమాలో అగ్ని దేవుడిచ్చిన ధనుస్సు పట్టిన అర్జునుడి కంటే... సూర్యదేవుడిచ్చిన ధనుస్సు పట్టిన కర్ణుడు వీరుడని చెప్పారు. ఇలాంటి అభూతకల్పనలు... వక్రీకరణలు జరుగుతున్నా మనం చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైనా వస్తాయి. చిత్రీకరణ,గీతాలాపనలో ఎన్నో రకాలుగా వక్రీకరణ జరుగుతోంది. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఎలా? మన హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్దాం. ఒక సినిమా పాట రాసేందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లా. ఆపాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చేయనన్నాడు. ఆ పాట చేయనన్నందుకు జీవితాంతం ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయనని చెప్పా. 15 ఏళ్లుగా ఒక్క పాట కూడా రాయలేదు. పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు చిత్ర దర్శకనిర్మాతలతో తిరుపతి పవిత్రతను హేళన చేస్తున్నా నిమ్మకనీరెత్తినట్లు ఉంటాం. కారణం వాళ్లకు మార్కెట్ ఉంది కాబట్టి. సినిమా అనేది వ్యాపారాత్మకమైన, కళాత్మకమైన వ్యాపారం. ఆ వ్యాపారాన్ని సినిమాలకు లేకుండా చేయాలంటే...హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రభుత్వం బహిష్కరించాలి. హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలను మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్పమార్గం. మనం తిరస్కరిస్తే వ్యాపారం నడవదు..డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఏ నిర్మాత వచ్చి హైందవ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తారో చూద్దాం.' అని అనంత శ్రీరామ్ అన్నారు -
మా అమ్మలా పెంచాలనుకుంటున్నాను: దీపికా పదుకోన్
‘‘మా అమ్మగారు నన్ను ఎలా పెంచారో నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలనుకుంటున్నాను’’ అంటున్నారు హీరోయిన్ దీపికా పదుకోన్. ప్రభాస్ హీరోగా నటించినపాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతరపాత్రలుపోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి 2’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.తొలి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో ద్వితీయ భాగంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ‘కల్కి 2’ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్. 2025లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని టాక్. ‘కల్కి 2898 ఏడీ’తో టాలీవుడ్లో అడుగుపెట్టారు దీపికా పదుకొనే. ఈ మూవీలో ఆమె చేసిన సుమతిపాత్ర నిడివి తక్కువగా ఉందనే మాటలు వినిపించాయి. అయితే ‘కల్కి 2’లో ఆమెపాత్ర చాలా కీలకమని, ఆమె కూడా త్వరలోనే షూటింగ్లోపాల్గొంటారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఏర్పాటు చేసిన ఓ గెట్ టు గెదర్పార్టీలోపాల్గొన్న దీపికకి ‘కల్కి 2’ సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆమె బదులిస్తూ..‘‘నేను కూడా ‘కల్కి 2’ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పుడు నా తొలి ప్రాధాన్యం నా కుమార్తె దువా. నా కూతురు పెంపకం కోసం కేర్ టేకర్‌ని నియమించుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మా అమ్మగారు ఎలా అయితే పెంచారో.. నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలని, తన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే... హీరో రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్‌లకు 2018 నవంబరు 14న వివాహం కాగా ఈ ఏడాది సెప్టెంబరులో వారికి కుమార్తె (దువా) జన్మించిన సంగతి తెలిసిందే. -
రికార్డులు తిరగరాసిన పుష్ప.. చిన్న చిత్రాలకు పెద్ద విజయం
తెలుగు సినిమా తగ్గేదే లే అన్నట్లుగానే 2024 సాగింది. విజయాల శాతం తక్కువే అయినప్పటికీ... కొన్ని చిత్రాలు సాధించిన వసూళ్లు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. రూ. 1700 కోట్లతో ‘పుష్ప: ది రూల్’ బాక్సాఫీస్‌ని రూల్ చేసింది. రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ‘కల్కి2898 ఏడీ’ సత్తా చాటింది. యువ హీరోలు తేజ సజ్జా ‘హను–మాన్’, కిరణ్ అబ్బరం ‘క’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇంకా నూతన తారలతో వచ్చిన సినిమాలూ ఆకట్టుకున్నాయి. ఇక 2024 రౌండప్లోకి వెళదాం...ఈ ఏడాది తెలుగు తెరపై అనువాద చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది. తమిళ చిత్రాలు రజనీకాంత్ ‘వేట్టయాన్: ది హంటర్’, విజయ్ సేతుపతి ‘మహారాజా’, శివ కార్తికేయన్ ‘అమరన్’ కార్తీ–అరవింద్ స్వామిల ‘సత్యం–సుందరం’, విక్రమ్ ‘తంగలాన్’, ధనుష్ ‘రాయన్’, విజయ్ ‘ది గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, తమన్నా–సుందర్ .సి ‘బాకు’ (అరణ్మణై 4) చిత్రాలకు తెలుగులో ఆదరణ దక్కింది. ఈ ఏడాది తెలుగులో మలయాళ చిత్రాల హవా కూడా కనిపించింది. ‘మంజుమ్మెల్ బాయ్స్’, మమ్ముట్టి ‘భ్రమయుగం’, నస్లెన్ ‘ప్రేమలు’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడు జీవితం’, టొవినో థామస్ ‘ఏఆర్ఎమ్’ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. కన్నడ చిత్రాలు ఉపేంద్ర ‘యూఐ’, కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’లకు అలరించాయి.తెలుగు సినిమా అసలు సిసలైన పండగ సంక్రాంతితో ఆరంభం అవుతుంది. ఈ పండగకి వచ్చే పెద్దా చిన్నా సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోతాయి. అలా 2024లో సంక్రాంతికి వచ్చిన సినిమాలతో థియేటర్లు పండగ చేసుకున్నాయి. సినీ లవర్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. ఈ ఏడాది సంక్రాంతి పండక్కి మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హను–మాన్’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ వరుసగా విడుదల అయ్యాయి.త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదే రోజున ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ ఫిల్మ్ ‘హను–మాన్’ భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి వచ్చిన సీనియర్ హీరోలతో పాటు యువ హీరో తేజ విజయం అందుకోవడం విశేషం. ఇక వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో విడుదలైన ‘సైంధవ్’ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. సంక్రాంతి పండగలో చివరిగా వచ్చిన నాగార్జున మాస్ కమర్షియల్ ‘నా సామి రంగ’ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అయ్యారు.ఇంకా జనవరి నెలలో విడుదలైన ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘సర్కారు నౌకరి’, హన్సిక ‘105 మినిట్స్’ నిరాశపరిచాయి. జనవరిలో దాదాపు ఇరవై సినిమాలు వచ్చినా ఆకట్టుకున్నవి తక్కువే. ఇక ఫిబ్రవరిలో ఇరవై సినిమాలకు పైగా వచ్చాయి. కులవివక్ష నేపథ్యంలో సుహాస్ హీరోగా నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’కి కొద్దిపాటి ప్రేక్షకాదరణ దక్కింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించారు.మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ రూపొందింది. సీక్వెల్ కూడా మహి దర్శకత్వంలోనే రూపొందింది. ఈ నెలలో రవితేజ ‘ఈగిల్’ సినిమా ఓ మోస్తరు హిట్ అందుకుంది. ఈ మాస్ ఫిల్మ్‌కి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఇంకా సందీప్ కిషన్ హారర్ ఫిల్మ్ ‘ఊరి పేరు భైరవకోన’ ఫర్వాలేదనిపించుకుంది. ఈ చిత్రానికి వీఐ దర్శకుడు. అలాగే ప్రియమణి ‘భామాకలాపం 2’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక మార్చిలో ముప్పైకి పైగా సినిమాలు వస్తే, అలరించినవి మాత్రం ఐదారు సినిమాలే. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’కి ఆశించిన ఫలితం దక్కలేదు.శివ కందుకూరి మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’, అఘోరాగా విశ్వక్ సేన్ నటించిన ‘గామి, అనన్య నాగళ్ల హారర్ మూవీ ‘తంత్ర’, హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ‘రజాకార్’ చిత్రాలు ఆడియన్స్‌ను అలరించే ప్రయత్నం చేశాయి. అయితే సిద్ధు జొన్నలగడ్డ–అనుపమా పరమేశ్వరన్ల ‘డీజే టిల్లు స్క్వేర్’, శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ‘డీజే టిల్లు స్క్వేర్’ రూపొందగా, ‘ఓం భీమ్ బుష్’కి హర్ష కొనుగొంటి దర్శకుడు. ఇదే నెల ఆరంభంలో వచ్చిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘వ్యూహం’ చర్చనీయాంశమైంది.ఏప్రిల్‌లో థియేటర్స్‌లోకి వచ్చిన చిత్రాలు ఇరవైలోపే. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఓ మోస్తరుగా అలరించింది. ఇదే నెలలో నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో వచ్చిన అంజలి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ నవ్వించింది. ఇక మే నెలలో వచ్చిన ఇరవై చిత్రాల్లో కార్తికేయ ‘భజే వాయు వేగం’, ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, మోహన్ భగత్ ‘ఆరంభం’ ఆడియన్స్ దృష్టిని తమ వైపు తిప్పుకోగలిగాయి.‘భజే వాయు వేగం’తో దర్శకుడిగా ప్రశాంత్ రెడ్డి పరిచయం కాగా, ‘ఆరంభం’తో అజయ్ నాగ్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో వీవీ గోపాలకృష్ణ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ‘అల్లరి’ నరేశ్ ‘ఆ... ఒక్కటి అడక్కు..!’, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలకు ఊహించిన ఫలితాలు రాలేదు. జూన్‌లో దాదాపు పాతిక సినిమాలు రాగా, అందరి దృష్టి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పైనే నిలిచింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇదే నెలలో వచ్చిన సుధీర్‌బాబు ‘హరోంహర’, శర్వానంద్ ‘మనమే’ వంటివి అంచనాలను అందుకోలేకపోయాయి. అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మెప్పించింది. జూలైలో మీడియమ్ చిత్రాలు ఓ పది విడుదలయ్యాయి. వీటిలో నవదీప్ ‘లవ్‌మౌళి’, ప్రియదర్శి–నభా నటేశ్ల ‘డార్లింగ్‘, రక్షిత్ శెట్టి ‘ఆపరేషన్ రావణ్‘, రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ వంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఏ చిత్రం కూడా హిట్ కాలేకపోయింది. ఆగస్టు నెలలో దాదాపు ముప్పై సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆగస్టు నెలాఖర్లో వచ్చిన నాని ‘సరిపోదా శనివారం’ సూపర్ హిట్‌గా నిలవగా, అల్లు శిరీష్ ‘బడ్డీ’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు నిరాశపరిచాయి. అయితే చిన్న చిత్రాలుగా రిలీజైన దర్శకుడు అంజి మణిపుత్ర– హీరో నార్నే నితిన్ ‘ఆయ్’, యదు వంశీ దర్శకుడిగా పరిచయమై, నూతన నటీనటులు చేసిన ‘కమిటీ కుర్రోళ్ళు’ హిట్‌గా నిలిచాయి. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రావు రమేశ్ లీడ్ రోల్లో నటించిన ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రం మెప్పించింది. ఎన్టీఆర్ ‘దేవర’ మేనియాతో సెప్టెంబరులో పెద్దగా సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్టు 1’ ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా యూనిట్ పేర్కొంది. ఇదే నెలలో వచ్చిన నివేదా థామస్ ‘35: చిన్న కథ కాదు’, శ్రీ సింహా–హాస్యనటుడు సత్య–ఫరియా అబ్దుల్లా చేసిన ‘మత్తు వదలరా 2’ చిత్రాలు అలరించాయి.ఈ ఏడాదికి అక్టోబరు కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. ముందుగా శ్రీవిష్ణు ‘స్వాగ్’ సినిమా రిలీజైంది. శ్రీవిష్ణు నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక దసరాకి వచ్చిన సుధీర్‌బాబు ‘మా నాన్న సూపర్ హీరో’, గోపీచంద్ ‘విశ్వం’, సుహాస్ ‘జనక అయితే గనక’ చిత్రాలకు ఓ మోస్తరు ప్రేక్షకాదరణ దక్కింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘విశ్వం’ దసరా హిట్ సినిమాల్లో ముందు నిలిచింది. దసరా తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన రూరల్ డ్రామా ‘పొట్టేల్’ ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేయగలిగింది. అక్టోబరులో దీపావళి సందర్భంగా విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్‘, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘లక్కీ భాస్కర్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే దర్శక ద్వయం సుజిత్–సందీప్ పరిచయం అయిన ‘క’ సూపర్ హిట్ అయింది. నవంబరులో భారీ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. విడుదలైన వాటిలో కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడితో విశ్వక్ సేన్ హీరోగా చేసిన ‘మెకానిక్ రాఖీ’, సత్యదేవ్–ధనంజయల ‘జీబ్రా’, కొత్త దర్శకుడు విక్రమ్ రెడ్డి తీసిన ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రాలు అలరించాయి. వరుణ్ తేజ్ ‘మట్కా’, నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నిరుత్సాహపరచాయి. ఇక డిసెంబరు తొలి వారంలోనే హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్‌ల ‘పుష్ప: ది రూల్’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లుగా యూనిట్ ప్రకటించింది. హిందీలో ‘పుష్ప 2’కు రూ. 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం విశేషం. ఈ విధంగా ఇప్పటికే ‘పుష్ప 2’ పలు రికార్డులను తిరగ రాసింది. ఈ సినిమా ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శితమవుతోంది. నెలాఖరులో అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’, ‘వెన్నెల’ కిశోర్–అనన్య నాగళ్ల నటించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’, ధర్మ ‘డ్రింకర్ సాయి’ వంటి చిత్రాలు వచ్చాయి. విజయాల శాతం తక్కువ, అపజయాల శాతం ఎక్కువ అన్నట్లుగా 2024 సాగింది. స్ట్రయిట్, డబ్బింగ్ చిత్రాలతో కలిపి దాదాపు 250 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే పెద్దా... చిన్నా... అనువాద చిత్రాలు సాధించిన విజయాలు పది శాతం లోపే. 2025లో సక్సెస్ రేట్ పెరగాలని కోరుకుందాం.మిస్సింగ్: ఈ ఏడాది వెండితెరను మిస్ అయిన సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, యువ హీరోల్లో నాగచైతన్య, రానా (సోలో హీరోగా..), అఖిల్, నితిన్, మంచు విష్ణు, నందమూరి కల్యాణ్‌రామ్, నాగశౌర్య, అడివి శేష్, సాయి దుర్గా తేజ్, నవీన్ పొలిశెట్టి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఉన్నారు. -
బాలీవుడ్లో కనిపించని ఖాన్ త్రయం.. టాప్ లేపిన 'పుష్ప' రాజ్
ఈ బాలీవుడ్‌కి ఏమైంది... దాదాపు రెండు మూడేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లు అంత ఆశాజనకంగా లేవు. అసలు ఈ ఏడాది ఖాన్ త్రయం (సల్మాన్, ఆమిర్, షారుక్) వెండితెరపై కనిపించనే లేదు. విడుదలైన చిత్రాల్లో మీడియమ్ స్టార్స్ చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది మాత్రం హిందీలోకి అనువాదమైన తెలుగు చిత్రాలు ‘కల్కి 2898 ఏడీ, పుష్ప: ది రూల్’ కావడం విశేషం. ఇక ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా సాగిందో తెలుసుకుందాం.హిందీ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది అంత అచ్చొచ్చినట్లుగా లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించే హిందీ సినిమాల సంఖ్య తక్కువైపోయింది. కాస్తో కూస్తో ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కాపాడింది హారర్ చిత్రాలనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది విడుదలైన హిందీ చిత్రాల్లో హారర్ ‘స్త్రీ 2’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్లో నటించిన ‘స్త్రీ’ 2018లో విడుదలై, రూ. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, అప్పట్లోనే సంచలనాలు సృష్టించింది. ఓ ఉమెన్ సెంట్రిక్ హారర్ ఫిల్మ్ వందకోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించడం బాలీవుడ్లో అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో ‘స్త్రీ 2’ వస్తుందనగానే ఈ సినిమాపై బాలీవుడ్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను వమ్ము చేయకుండా ‘స్త్రీ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ లీడ్ రోల్స్‌లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ గెస్ట్ రోల్స్‌లో నటించిన ‘స్త్రీ 2’ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ. 850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. రూ.650 గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచి, రికార్డు సృష్టించింది.హిందీ ఆడియన్స్ ‘స్త్రీ 2’ హారర్ హ్యాంగోవర్లో ఉన్నారేమో కానీ ఆ వెంటనే వచ్చిన మరో హారర్ హిందీ చిత్రం ‘భూల్ భూలయ్యా 3’ సినిమానూ విశేషంగా ఆదరించారు. కార్తీక్ ఆర్యన్, త్రిప్తీ దిమ్రీ హీరోయిన్లుగా నటించిన ఈ హారర్ మూవీకి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ ఇతర రోల్స్ చేశారు. ఈ ఏడాది నవంబరు 1న విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టి, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే కోవలో అంటే... హారర్ నేపథ్యంలోనే వచ్చిన ‘సైతాన్’ చిత్రం హిందీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రాబట్టుకోగలిగింది.వికాస్ బాల్ డైరెక్షన్‌లోని ఈ మూవీలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్‌లో నటించారు. ‘సైతాన్’ సినిమాలో విలన్‌గా మాధవన్, మరో లీడ్ రోల్లో నటించిన మరాఠీ నటి జాంకీలు ఈ సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలిచారు. ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే అదీ చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియన్స్ పట్టించుకోరని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ఈ ఏడాది మరోసారి ప్రూవ్ అయింది. హిందీ ఆడియన్స్‌ను మెప్పించిన హారర్ మూవీ ‘ముంజ్య’.యువ తారలు అభయ్ వర్మ, శర్వారీ హీరో హీరోయిన్లుగా, సత్యరాజ్, మోనాసింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ హారర్ ఫిల్మ్‌కు ఆదిత్య సర్ఫోత్థార్ దర్శకత్వం వహించారు. అంచనాలు లేకుండా జూన్‌లో విడుదలైన ఈ మూవీ రూ. 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, బాలీవుడ్ ఆడియన్స్‌లో హారర్ జానర పట్ల ఉన్న మక్కువను మరోసారి నిరూపించింది. అలాగే 2018లో విడుదలైన హారర్ మూవీ ‘తుంబాడ్’ ఈ ఏడాది సెప్టెంబరులో రీ–రిలీజై హిట్ మూవీగా నిలిచింది. కథానాయికల జోరు హారర్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచిన చిత్రాలు హీరోయిన్స్ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించినవి కావడం ఈ ఏడాది విశేషం. ముందుగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘లాపతా లేడీస్’ సినిమా గురించి ప్రస్తావించుకోవాలి. కొంత గ్యాప్ తర్వాత కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 1న థియేటర్స్‌లో రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేని ఈ చిత్రానికి విడుదల తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో ఆడియన్స్ నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించింది. ప్రతిభ రంతా, నితాన్షి గోయెల్, స్పర్శ్ శ్రీవాత్సవ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీలో రవికిషన్, ఛాయా కందమ్ కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలవడమే కాకుండా, విమర్శకుల ప్రసంసలను దక్కించుకుంది. అంతేకాదు... 2025 మార్చిలో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘లాపతా లేడీస్’ సినిమాను, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీ మూవీగా పంపారు. ఇలా ‘లాపతా లేడీస్’ చిత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కానీ 97వ ఆస్కార్ షార్ట్‌లిస్ట్ జాబితాలో ఈ సినిమాకు చోటు దక్కకపోవడం ఇండియన్ ఆడియన్స్‌కు కాస్త బాధ కలిగే అంశమనే చెప్పాలి. ఇదే నెలలో అంటే... ఫిబ్రవరి 23న విడుదలైన ΄÷లిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్టికల్ 370’. యామీ గౌతమ్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది.ఆదిత్యా సుహాస్ డైరెక్షన్‌లోని ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో హిట్‌గా నిలిచింది. అలాగే టబు, కరీనా కపూర్, కృతీ సనన్ నటించిన ఉమెన్ మల్టీ స్టారర్ మూవీ ‘క్రూ’ కూడా ప్రేక్షకుల మెప్పు పొంది, ఈ ఏడాది సూపర్‌హిట్ మూవీస్‌లో చోటు దక్కించుకోగలిగింది. రాజేశ్ ఏ క్రిష్ణన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లింగ్ డ్రామా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇక ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాయలల్ కపాడియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డును సైతం గెలుచుకుంది.అంతేనా... మరికొన్ని అంతర్జాతీయ అవార్డులను కూడా ఈ చిత్రం గెలుచుకుంది. కనికా కస్రూతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఛాయా కందమ్ మరో లీడ్ రోల్లో నటించారు. ఈ చిత్రం హిందీ భాషలో (మలయాళ, మరాఠీ భాషల్లో కూడా విడుదలైంది) సెప్టెంబరులో ఇండియాలో విడులైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. హిట్ యాక్షన్ బాలీవుడ్లో బడా మల్టీస్టారర్ మూవీగా రూపొందిన చిత్రం ‘సింగమ్ ఎగైన్’. దర్శకుడు రోహిత్ శెట్టి ‘సింగమ్’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించగా, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. ఇంతటి భారీ క్యాస్టింగ్‌తో, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘సింగమ్ ఎగైన్’ ఓ మోస్తరు హిట్‌ను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. బాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.అయితే ‘సింగమ్ ఎగైన్’ రిలీజైన రోజునే... అంటే... నవంబరు 1నే, ‘భూల్ భూలయ్యా 3’ చిత్రం కూడా థియేటర్స్‌లోకి వచ్చింది. ‘సింగమ్ ఎగైన్’ సినిమా వసూళ్లపై కొంత ఎఫెక్ట్ పడటానికి ఈ సినిమా ఓ కారణం అని బాలీవుడ్ ట్రేడ్ వర్గీయులు చెప్పుకున్నారు. ఇక హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోని ఈ మూవీలో తొలి సారిగా హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ కలిసి నటించారు. జనవరి 25న విడులైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇంకా షాహిద్ కపూర్ రోబో లవ్‌స్టోరీ ‘తేరీ బోతో మే ఐసా ఉల్జా జియా’, విక్కీ కౌశల్ కామెడీ డ్రామా ‘బ్యాడ్ న్యూజ్’ వంటి చిత్రాలకు ప్రేక్షకులు హిట్ స్టేటస్ ఇచ్చారు. – ముసిమి శివాంజనేయులుటాప్ లేపిన పుష్ప రాజ్ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపిన చిత్రం ‘పుష్ప: ది రూల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూ పొందిన ‘పుష్ప: ది రూల్’ సినిమా హిందీ వెర్షన్ రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఏడాది బాలీవుడ్ స్ట్రయిట్ హిందీ బ్లాక్‌బస్టర్ హిట్ ఫిల్మ్ ‘స్త్రీ 2’ కలెక్షన్స్‌ను సైతం అధిగమించి, ‘పుష్ప: ది రూల్’ సినిమా రికార్డు సృష్టించింది. ఇలా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా ‘పుష్ప ది రూల్’ నిలిచింది. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప: ది రూల్’ సినిమా ఇప్పటికే రూ.1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా, మేకర్స్ వెల్లడించారు.‘పుష్ప: ది రూల్’ మూవీ ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ప్రభాస్ చేసిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాలీవుడ్ ఆడియన్స్‌తో హిట్ ఫిల్మ్ అనిపించుకుంది. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన్ 27న థియేటర్స్‌లోకి వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ మూవీ హిందీలో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.ఇలా ఈ ఏడాది హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం కూడా హిందీ ఆడియన్స్‌ను మెప్పించింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు.కనిపించని ఖాన్ త్రయం‘సింగమ్ ఎగైన్, బేబీ జాన్’ చిత్రాల్లో సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా కనిపించారు. కానీ ఆయన హీరోగా నటించిన సినిమా ఏదీ ఈ ఏడాది థియేటర్స్‌లోకి రాలేదు. అలాగే అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ హీరోలుగా నటించిన చిత్రాలు కూడా థియేటర్స్‌లోకి రాలేదు. ఇంకా రణ్‌బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ (సింగమ్ ఎగైన్ మూవీలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించలేదు)... ఇలా బాలీవుడ్ అగ్రశ్రేణి హీరోల సినిమాలు థియేటర్స్‌లోకి రాకపోవడం కూడా హిందీ బాక్సాఫీస్‌కి ఓ మైనస్ అని చెప్పాలి. -
'ఆ థియేటర్‌తో ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు'.. గుర్తు చేసుకున్న కల్కి డైరెక్టర్
కల్కి మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కల్కి పార్ట్-2 పనులతో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్.అయితే తాజాగా హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ థియేటర్‌ను గుర్తు చేసుకున్నారు. అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలుగు సినిమా చరిత్రలో సత్యం థియేటర్ ఒక భాగమన్నారు. ఆ థియేటర్లో గీతోపదేశంలోని కుడ్యచిత్రం అంతర్భాగమని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే మల్టీప్లెక్స్‌గా మార్చాక ఆ ఆ కుడ్యచిత్రాన్ని భద్రపరచలేదని ఆవేదన చెందాను.. కానీ మళ్లీ ఆ ఫోటోను చూడడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. ఆ చిత్రాలను అలాగే భద్రపరచిన నిర్మాత సునీల్ నారంగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సత్యం థియేటర్ మళ్లీ సత్యంగానే మారిందని ఇన్‌స్టాలో నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) -
ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడైన సినిమా ఇదే..!
మరికొద్ది రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇకపోతే ఈ ఏడాదిలో చాలా చిత్రాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్త్రీ-2, సింగం ఏగైన్, భూల్ భూలయ్యా-2 లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ జాబితాలో అత్యధిక క్రేజ్ ఉన్న చిత్రంగా పుష్ప-2 నిలిచిన సంగతి తెలిసిందే.తాజాగా పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఒక్క రోజులోనే అత్యధిక టికెట్స్ అమ్ముడైన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో వెల్లడించింది. అంతేకాకుండా అత్యధికంగా 10.8 లక్షల మంది సోలో ఆడియన్స్ వీక్షించినట్లు వెల్లడించింది.కాగా.. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా కనిపించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1508 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. -
అక్కడి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన ప్రభాస్... ఎందుకంటే?
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. దాదాపు రూ.1200 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు ఆ మధ్య వైజయంతి మూవీస్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.జపాన్ భాషలో సారీ చెప్తూ..అంతేకాదు, జపాన్ను సైతం వస్తానని మాటిచ్చాడు ప్రభాస్. కానీ ప్రస్తుతం కాలికి గాయంతో బాధపడుతున్నందున ఆ ప్లాన్‌ను వాయిదా వేశాడు. దీంతో జపాన్ భాషలో అక్కడివారికి సారీ చెప్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'నాపై, నా సినిమాలపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. గాయం వల్లే..జపాన్‌కు రావాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ నా కాలికి గాయం కావడం వల్ల రాలేకపోతున్నాను. కానీ త్వరలోనే మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను. జనవరి 3న జపాన్‌లో రిలీజయ్యే కల్కి 2898 ఏడీ మూవీ చూసి ఎంజాయ్ చేయండి' అని పేర్కొన్నాడు. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నాడు.కల్కి సినిమా సంగతులుకల్కి విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వర్షన్స్)తో పాటు నెట్‌ఫ్లిక్స్ (హిందీ వర్షన్)లో అందుబాటులో ఉంది.#プラバース から日本のすべてのファンの皆さんへメッセージ 🫶❤️🔥- https://t.co/mLRYxxFLXl#Kalki2898AD releasing in cinemas across Japan from January 3rd!#カルキ2898AD #Kalki2898ADinJapan@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/CYdG1kmTmm— Kalki 2898 AD (@Kalki2898AD) December 18, 2024//#カルキ2898ADジャパンプレミア実況🏹\\TOHOシネマズ六本木ヒルズ 無事終了いたしました✨次は、19:00〜新宿ピカデリーにて!🔥#カルキ2898AD来日譚 pic.twitter.com/YIEbOzkhF6— 【公式】映画『カルキ 2898-AD』 (@kalki2898AD_jp) December 18, 2024చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్ -
స్టార్ హీరో ప్రభాస్ మళ్లీ గాయపడ్డాడా?
వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. గతేడాది 'సలార్', ఈ ఏడాది 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న డార్లింగ్ హీరో.. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీస్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. మరి ఎప్పుడు జరిగిందో గానీ ప్రభాస్ చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే వెల్లడించినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)'బాహుబలి' తర్వాత నుంచి ప్రభాస్ తన ప్రతి సినిమాను జపాన్‌లోనూ విడుదల చేస్తున్నాడు. రాబోయే జనవరి 3న 'కల్కి' జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా ప్రీమియర్ కోసం ప్రభాస్ వెళ్లే ప్లాన్ ఫిక్సయింది. ఇప్పుడు ఇతడి చీలమండ బెణికిందని, దీంతో జపాన్ రాలేకపోతున్నానని జపనీస్ భాషలో ప్రభాస్ ఓ లెటర్ ఒకటి వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో పలుమార్లు ప్రభాస్ గాయపడ్డాడు!ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికే చాలా షూటింగ్ పెండింగ్‌లో ఉందని, బహుశా ఈ తేదీకి రాకపోవచ్చనే రూమర్స్ నడుస్తున్నాయి. విడుదల తేదీ ఇంకా చాలా దూరముంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
తొలి స్థానంలో స్త్రీ2... రెండో స్థానంలో కల్కి 2898 ఏడీ
ప్రతి ఏడాది ప్రేక్షకులను ఆకర్షించే, చర్చించుకునేలా చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. అలా ఈ ఏడాది కూడా పలు ఇండియన్ సినిమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి.... అలరించాయి. కాగా ఇండియాలో గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ ఫర్ మూవీస్ జాబితాలోని మొదటి పది చిత్రాల్లో మూడు తెలుగు చిత్రాలు నిలిచాయి. తొలి స్థానంలో రాజ్‌కుమార్ రావు– శ్రద్ధా కపూర్ నటించిన హిందీ చిత్రం ‘స్త్రీ 2’, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ రెండో స్థానంలో నిలిచాయి. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘సలార్’కు తొమ్మిదో స్థానం లభించింది. 3, 4, 5, 6, 7, 8 స్థానాల్లో వరుసగా హిందీ చిత్రాలు ‘ట్వల్త్ ఫెయిల్, లాపతా లేడీస్’, తెలుగు చిత్రం ‘హను–మాన్’, తమిళ చిత్రం ‘మహారాజా’, మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’, తమిళ చిత్రం ‘గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు నిలిచాయి. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ చేసిన ‘ఆవేశం’ సినిమా చివరి స్థానంలో నిలిచింది. అలాగే గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చెస్ షోల జాబితాలో తొలి స్థానంలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ నిలిచింది. ‘మిర్జాపూర్, పంచాయత్, కోట ఫ్యాక్టరీ’ వంటి సిరీస్‌లకు చోటు దక్కింది. -
అత్యంత ఆదరణ కలిగిన చిత్రంగా టాలీవుడ్ మూవీ.. సెకండ్ ప్లేస్ ఏదంటే?
తాజాగా ఈ ఏడాది ఐఎండీబీ సినిమా ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ఏడాది అత్యంత ఆదరణ కలిగిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. 2024లో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో శ్రద్ధకపూర్ సూపర్ హిట్ చిత్రం స్త్రీ-2 నిలవగా.. మూడోస్థానాన్ని విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రం దక్కించుకుంది.ఆ తర్వాత స్థానాల్లో వరుసగా.. అక్షయ్ కుమార్ సైతాన్, హృతిక్ రోషన్ ఫైటర్, మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్, బాలీవుడ్ మూవీ భూల్ భూలయ్యా-3, కిల్, సింగం ఏగైన్, లపట్టా లేడీస్ ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికొస్తే మొదటిస్థానంలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్ బజార్ నిలిచింది. ఈ జాబితాను ప్రకటిస్తూ ఐఎండీబీ పోస్టర్స్‌ను విడుదల చేసింది.కాగా.. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశాపటానీ, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించారు.Presenting the Most Popular Indian Movies of 2024 that captured your hearts and kept you coming back for more! 💛📍Of all the movies released in India between January 1 and November 25, 2024, that have an average IMDb user rating of 5 or higher, these 10 titles were… pic.twitter.com/aP8nYcQuvO— IMDb India (@IMDb_in) December 11, 2024 ఐఎండీబీ టాప్-10 చిత్రాలు- 20241.కల్కి 2898 ఏడీ2.స్త్రీ-23.మహారాజా4.సైతాన్5.ఫైటర్6. మంజుమ్మెల్ బాయ్స్7.భూల్ భూలయ్యా-38.కిల్9.సింగం ఏగైన్10. లపట్టా లేడీస్టాప్-10 వెబ్ సిరీస్‌లు ఇవే..1. హీరామండి ది డైమండ్ బజార్2. మీర్జాపూర్ సీజన్-33.పంచాయత్ సీజన్-34.గ్యారాహ్ గ్యారాహ్5. సిటాడెల్ హనీ బన్నీ6.మామ్లా లీగల్ హ7.తాజా ఖబర్ సీజన్-28. మర్డర్ ఇన్ మహిమ్9. శేఖర్ హోమ్10.ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో -
అక్కడి 'ప్రభాస్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత అంతటి విజయాన్ని కల్కి అందుకుంది. సుమారు రూ. 1200 కోట్లకు పైగానే ఈ చిత్రం కలెక్షన్స్ రాబట్టింది.కల్కి చిత్రం జపాన్‌లో విడుదల చేస్తున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం జపనీస్‌లో కూడా విడుదల కానుందని ఒక వీడియోతో మేకర్స్ పంచుకున్నారు. 2025 జనవరి 3న జపాన్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.పురాణాలను, సైన్సును ముడిపెడితూ తీసిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న భారత్‌లో విడుదలైంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటించారు. విజువల్ వండర్లా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
అంతర్జాతీయ స్థాయిలో ‘కల్కి 2’: స్వప్న, ప్రియాంక
‘‘కల్కి 2’ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి.. ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు స్వాప్న దత్, ప్రియాంక దత్ చెప్పారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌పై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలై, ఘనవిజయం సాధించింది.‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని ప్రదర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్వాప్నదత్, ప్రియాంక దత్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తొలి పార్టు చిత్రీకరణ టైమ్‌లోనే 30 నుంచి 35 శాతం ‘కల్కి 2’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాలోని ప్రధాన నటీనటుల షూటింగ్ కాల్షీట్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. తొలి పార్టులో మదర్ రోల్ చేసిన దీపికా పదుకొనే ‘కల్కి 2’లోనూ మదర్ రోల్ చేస్తారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ‘కల్కి 2’ చిత్రీకరణ వచ్చే ఏడాది ్రపారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీతో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ రెబల్ స్టార్ బర్త్ డే కావడంతో మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో మెగాస్టార్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తాజాగా ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ చేశారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ మరెవరో కాదు.. కల్కి మూవీలో బుజ్జిగా అలరించిన కారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. బుజ్జి పేరుతో ఉన్న ట్విటర్లో హ్యాండిల్లో వీడియోను పోస్ట్ చేసింది కల్కి టీమ్.కాగా.. ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో బుజ్జి పేరుతో ఉన్న కారుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రిలీజ్‌కు ముందు పలు నగరాల్లో బుజ్జి సందడి చేసింది. ఈ సినిమాలో బుజ్జి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. కాగా.. బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.Happy Birthday BHAIRAVA - from your best friend #Bujji ❤️#Prabhas #Kalki2898AD pic.twitter.com/szhxo0xLqH— Bujji (@BelikeBujji) October 23, 2024 -
Happy Birthday Prabhas: అజాతశత్రువు.. అందరికి ‘డార్లింగ్’
టాలీవుడ్‌కి చెందిన చాలా మంది హీరోలు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కానీ టాలీవుడ్‌నే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక స్టార్ ఎవరంటే..అది ప్రభాస్ అనే చెప్పొచ్చు. ఈ ఒక్క పేరు ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఆల్ ఇండియా నెంబర్ వన్ హీరో మన రెబల్ స్టారే అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ అయితే.. ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల దాకా థియేటర్స్ కు వెళ్లడం ఒక ఫినామినా. ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాం అనే మలి వయసు పెద్దలు కూడా ప్రభాస్ సినిమాకు థియేటర్స్ కు కదలడం ఆయన ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్సీ ఉన్న స్టార్ అని తెలియజేస్తుంటుంది. అందుకే బాక్సాఫీస్ దగ్గర డే 1 రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ గ్రాస్, రికార్డ్ స్థాయి ఓవర్సీస్ కలెక్షన్స్ సాధ్యమవుతున్నాయి.ప్రభాస్ చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్స్ ప్రేక్షకుల్ని ఇంతలా ఆకర్షిస్తున్నాయని అనుకోవచ్చు. సలార్ లో ప్రభాస్ హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ కటౌట్ కు కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనుకున్నారు ఆడియెన్స్. అదీ స్క్రీన్ ప్రెజెన్స్ లో ప్రభాస్ కున్న ఛరిష్మా. బాహుబలి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ రీజనల్ స్టార్స్ కే కాదు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఒక నెరవేరని కల, సాధ్యం కాని ఫీట్. కానీ ప్రభాస్ అలవోకగా బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో రెండు సార్లు థౌసండ్ క్రోర్ గ్రాస్ మూవీస్ చేశాడు. బాహుబలి 2 డే 1, 200 కోట్ల రూపాయలు వసూళు చేయడం ట్రేడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ వెయ్యి రోజుల శ్రమ కలెక్షన్స్ రూపంలో రిజల్ట్ ఇచ్చింది. కల్కి 2898 ఏడి మూవీ 1100 కోట్ల రూపాయల గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ చేయడం ప్రభాస్ రీసెంట్ గా క్రియేట్ చేసిన ఒక సెన్సేషన్. ప్రభాస్ బిగ్ హీరోనే కాదు బిగ్ టికెట్ హీరో అని ఈ బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేస్తున్నాయి.ప్రభాస్ సినిమా అంటే ప్రొడ్యూసర్స్, ట్రేడ్ సెక్టార్ లో ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఆయన సినిమాల మీద ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు, ఆ పెట్టుబడికి ప్రభాస్ స్టార్ డమ్, బాక్సాఫీస్ స్టామినానే పూచీ. అందుకే వందల కోట్ల రూపాయలతో బడ్జెట్ తో ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నాయి ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌసెస్. మారుతి డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా...ప్రభాస్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్స్. వీటిలో ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రాబోతోంది. మిగతా మూవీస్ చిత్రీకరణలో వివిధ దశల్లో ఉన్నాయి.ప్రభాస్ స్టార్ గానే కాదు వ్యక్తిగానూ అంతే గొప్పవారు. తనను ఇంత పెద్ద స్టార్ ను చేసిన అభిమానులు, ప్రేక్షకులంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే సొసైటీలో ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తుంటారు. మిగతా స్టార్స్ కంటే రెట్టింపు డొనేట్ చేస్తుంటారు. ఈ ఏడాది కేరళలో వనయాడ్ విలయానికి విపత్తు సాయంగా తన వంతు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రభాస్, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయలు విరాళం అందించారు. అజాతశత్రువు అనే పాత మాటకు డార్లింగ్ అనే కొత్త అర్థానిచ్చిన ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు( అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే) -
ప్రభాస్ 'కల్కి' విలన్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా? (ఫొటోలు)
-
నేను మాట్లాడింది ప్రభాస్ గురించి కాదు.. జోకర్ కామెంట్స్‌పై క్లారిటీ!
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. కల్కి చిత్రంలో ప్రభాస్ నటనను ఉద్దేశించి జోకర్లా ఉన్నాడంటూ మాట్లాడారు. దీంతో అర్షద్ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా తాను చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారాయన. ఐఫా-2024 అవార్డ్స్ వేడుకల్లో పాల్గొన్న అర్షద్ వార్సీ తాను చేసిన కామెంట్స్ గురించి మాట్లాడారు. (ఇది చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?)అర్షద్ వార్సీ మాట్లాడుతూ.'ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. నేను కేవలం పాత్ర గురించి మాత్రమే మాట్లాడాను. ఇక్కడ వ్యక్తి గురించి నేను చెప్పలేదు. ప్రభాస్ అద్భుతమైన నటుడు. ఈ విషయాన్ని తాను పదే పదే నిరూపించుకున్నాడు. అతని గురించి మనకు తెలుసు. కానీ మంచి నటుడికి చెడ్డ పాత్ర ఇచ్చినప్పుడు అది ప్రేక్షకులకు చాలా బాధగా ఉంటుంది' అని అన్నారు. ప్రభాస్ గురించిన నేను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అర్షద్ వార్సీ తెలిపారు. అయితే ప్రభాస్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేయడంతో అర్షద్ పెద్దఎత్తున ట్రోలింగ్‌కు గురయ్యాడు. -
బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కల్కి 2898 ఏడీ
ప్రభాస్ హీరోగా నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’కి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి అక్టోబరు 11 వరకు దక్షిణ కొరియాలో 29వ బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్‌ఎఫ్) జరగనుంది. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న 279 చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’కి చోటు లభించింది. అక్టోబరు 8, 9 తేదీల్లో ఈ చిత్రం ‘బీఐఎఫ్‌ఎఫ్’లో ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని ‘కల్కి 2898ఏడీ’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ‘ఎక్స్’ మాధ్యమంలో ధ్రువీకరించింది. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న విడుదలై, సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుంది. -
భారత్ నుంచి ఆస్కార్ కోసం నామినేట్ అయిన చిత్రాలు ఇవే
ఆస్కార్ అవార్డుల రేస్‌లో ఈ ఏడాది సౌత్ ఇండియా నుంచి భారీగానే సినిమాలు పోటీ పడుతున్నాయి. తెలుగు,తమిళ్, మలయాళం నుంచి పలు సినిమాలు ఎంట్రీ కోసం ఊరిస్తున్నాయి. 2024వ ఏడాదికి గానూ మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలను గుర్తించి వాటిని ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసింది. ఈమేరకు ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించింది. 2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి 'లాపతా లేడీస్' ఎంపికైనట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. భారత్ నుంచి పలు భాషలకు చెందిన 29 చిత్రాల్లో లా పతా లేడీస్‌ను మాత్రమే ఎంపిక చేశారు.అస్కార్ కోసం ఈసారి ఎక్కువగా సౌత్ ఇండియా సినిమాలే పోటీ పడ్డాయి. 29 చిత్రాల్లో టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు 'కల్కి 2898 ఏడీ,హనుమాన్,మంగళవారం' ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో 6 తమిళ చిత్రాలు నామినేట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. వాటిలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్, ఎస్జే.సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్ఎక్స్, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ కథానాయకుడిగా నటించి,దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి. మలయాళం నుంచి ఆట్టం, ఆడుజీవితం (ది గోట్ లైఫ్),ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఉళ్ళోజుక్కు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా సౌత్ ఇండియా నుంచి 13 సినిమాలు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యాయి. అయితే, భారతీయ చిత్ర పరిశ్రమ పంపిన 29 సినిమాల్లో ప్రస్తుతానికి లపతా లేడిస్ మాత్రమే అస్కార్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మిగిలిన సినిమాల గురించి అధికారికంగా ప్రకటన వస్తుంది. 🤞🏼 pic.twitter.com/YgdeaTsTNi— Prasanth Varma (@PrasanthVarma) September 23, 2024 -
'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?
ప్రభాస్ 'కల్కి' సినిమా వచ్చి నాలుగు నెలలైపోయింది. రిలీజ్ టైంలోనే అర్జునుడు, కర్ణుడు పాత్రలు వాటి మధ్య సన్నివేశాల గురించి చర్చోపచర్చలు నడిచాయి. అర్జునుడు గొప్ప అని కొందరు లేదులేదు కర్ణుడే గొప్ప అని మరికొందరు వాదించుకున్నారు. అదంతా ముగిసిపోయి చాలా కాలామైపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు 'కల్కి' సినిమాపై విమర్శలు చేశారు.గరికపాటి ఏమన్నారు?తాజాగా వినాయక చవితి సందర్భంగా గరికపాటి ప్రవచనాలు చెప్పారు. మాటల సందర్భంగా 'కల్కి' గురించి ప్రస్తవన వచ్చేసరికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మహాభారతంలో ఉన్నది వేరు సినిమాలో చూపించింది వేరు అని చెప్పారు. అశ్వద్ధామ, కర్ణుడిని హీరోలుగా చూపించడమేంటో తనకు అస్సలు అర్థం కాలేదని కౌంటర్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)వీడియోలో ఏముంది?'కర్ణుడు ఎవరో తెలియకపోతే 'కల్కి' సినిమాలో చూపించినవాడే కర్ణుడు. మనేం చేస్తాం. సినిమావోళ్లు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు అందులో చూపించింది వేరు. అశ్వద్ధామ, కర్ణుడు అర్జెంట్‌గా హీరోలైపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లేదు. బుర్రపాడైపోతుంది. పైగా మహాభారతమంతా చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వద్ధామ కాపాడాడు. అశ్వద్ధామని కర్ణుడు ఎప్పుడూ ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వద్ధామ మహావీరుడు. ఇక్కడేమో 'ఆచార్య పుత్ర ఆలస్యమైంది' అని డైలాగ్ పెట్టారు. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ వెయ్యి రూపాయలు ఎక్కువిస్తే డైలాగ్ రాసేవాడు రాసేస్తాడు కదా' అని గరికపాటి అన్నారు.'కల్కి' మూవీ గురించిజూన్ 27న థియేటర్లలో రిలీజైన 'కల్కి'.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనికి కొనసాగింపుగా తీస్తున్న రెండో భాగం షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికి 'కర్ణ 3102 బీసీ' అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. (ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)తనకు నచ్చని రాజకీయ పార్టీలపై, సినిమా హీరోలపై విమర్శలు చేసే గరికిపాటి నరసింహారావు.. తాజాగా కల్కిపై విమర్శలు pic.twitter.com/vThPZ5s4Nn— greatandhra (@greatandhranews) September 23, 2024 -
'కల్కి' పార్ట్ 2.. టైటిల్ ఫిక్స్ అయిందా?
ప్రభాస్ లైనప్ ప్రస్తుతం ఫుల్ ప్యాక్డ్ ఉంది. ఈ ఏడాది 'కల్కి 2898'తో రూ.1000 కోట్ల మార్క్ దాటేశాడు. ప్రస్తుతం 'రాజాసాబ్'తో ఫుల్ బిజీ. దీని తర్వాత సలార్ 2, కల్కి 2 రెడీగా ఉన్నాయి. ఓవైపు 'సలార్' షూటింగ్ గురించి సెట్స్ సిద్ధమవుతుండగా.. మరోవైపు 'కల్కి' పార్ట్ 2 గురించి కొన్ని గాసిప్స్ వైరల్ అయిపోతున్నాయి. టైటిల్‌ని ఫిక్స్ చేయడంతో పాటు స్టోరీ ఎలా ఉండబోతుందో మాట్లాడేసుకుంటున్నారు.(ఇదీ చదవండి: పిల్ల దెయ్యం సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్)ఇప్పటికే వచ్చిన 'కల్కి' తొలి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. చివర్లో మహాభారతం ఎపిసోడ్, అందులో కర్ణుడు-అర్జునుడు సీన్స్ సూపర్ హైలైట్ అయ్యాయి. వీటిని చూసి చాలామంది మరికాసేపు ఇవి ఉంటే బాగుండు అని ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్ల కోరిక నెరవేరిందని చెప్పొచ్చు.ఎందుకంటే సీక్వెల్‌కి 'కర్ణ 3102 BC' అనే టైటిల్ నిర్ణయించారట. పేరు బట్టే అర్థమైపోతుందిగా.. మొత్తం కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్‌గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట. ఉన్న కొద్దిపాటి నిమిషాలకే మహా భారతం సీన్లతో నాగ్ అశ్విన్ తన మార్క్ చూపించాడు. మరి ఇప్పుడు రెండో పార్ట్ ఇంకేం మ్యాజిక్ చేస్తాడోనని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. రాబోయే జనవరి నుంచి షూటింగ్ మొదలవ్వొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: అమెరికాలో పెళ్లి.. సమంతనే స్పెషల్ ఎట్రాక్షన్) -
కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు, వీడియో వైరల్
దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఎప్పటి మాదిరే ఈ సారి కూడా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా పాత్రలపై స్పెషల్ వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవరతో పాటు పలువురి స్టార్ హీరోల లుక్‌లో ఉన్న గణపతి బొమ్మలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ‘కల్కి’ రూపంలో ఉన్న వినాయకుడే ఈ ఏడాది స్పెషల్ అట్రాక్షన్ నిలిచాడు.కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడుప్రభాస్ హీరోగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ ఏడాది జూన్ 27న విడుదలై..బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్, యాస్కిన్‌గా కమల్ నటించారు. ఈ సినిమా చూసిన వాళ్లకు ప్రత్యేక కారు ‘బుజ్జి’, కాంప్లెక్స్ ప్రదేశాలు అలా గుర్తిండిపోతాయి. ఇప్పుడు ఇదే సినిమాను పోలిన ఓ గణపతి మందిరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వినాయకుడు అశ్వత్థామ రూపంలో ఉండగా.. మందిరం కాంప్లెక్స్ ప్రదేశంలా ఉంది. ‘కల్కి’వినాయకుడు ఎక్కడ ఉన్నాడు?‘కల్కి’ వినాయకుడి విడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అసలు ఈ మందిరం ఎక్కడ ఏర్పాటు చేశారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ వెరైటీ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేసింది తమిళ ప్రజలే. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ మందిరం ఉన్నట్లు తెలుస్తోంది. కాంప్లెక్ మాదిరి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్‌లో బుజ్జిని కూడా ఉంచారు. లోపల యాస్కిన్ లుక్‌లో ఉన్న కమల్ బొమ్మ పెట్టి.. అమితాబ్ అశ్వత్థామ లుక్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, నుదుటిపై మణి వెలిగిపోతున్నట్లు ఓ లైట్ కూడా సెట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఏడాది స్పెషన్ వినాయక విగ్రహం ఇదేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. #wow pic.twitter.com/54ssb41OTm— devipriya (@sairaaj44) September 9, 2024 -
ఓటీటీలోనూ తగ్గేదేలే.. ఆ జాబితాలో టాప్ ప్లేస్‌లో కల్కి!
ప్రభాస్- నాగ్అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ బ్లాక్‌బస్టర్ మూవీ కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో నెల రోజులకు పైగా అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతం ఓటీటీలోనూ కల్కి మూవీకి విపరీతమైన క్రేజ్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో సౌత్ లాంగ్వేజేస్‌లో అందుబాటులో ఉంది. హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. స్ట్రీమింగ్కు వచ్చిన రెండు వారాల్లోనే అత్యధికంగా 2.6 మిలియన్ల వ్యూస్, 7.5M గంటల టైమింగ్‌తో గ్లోబల్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో వరల్డ్ వైడ్‌గా మొదటి స్థానంలో కొనసాగుతోంది. కాగా..ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.కాగా.. ఈ మూవీకి సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. పార్ట్-2లో కమల్ హాసన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. ఈ మూవీని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
'కల్కి' నిర్మాతలకు రామ్‌చరణ్ సర్ప్రైజ్.
-
మీకు మరణం లేదా..? కల్కి డిలీట్ సీన్స్ హైలైట్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. ఈ ఏడాదిలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1200 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓటీటీలో కూడా ట్రెండింగ్‌లో కల్కి ఉంది. ఈ క్రమంలో కల్కి డిలీట్ సీన్స్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా హిందీ వెర్షన్ ప్రసారం అవుతుంది. ఇదే తేదీ నుంచి తెలుగు, తమిళంతో సహా మిగతా భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
Dupe: ఏడడుగుల అశ్వత్థామ
ఏడడుగుల అశ్వత్థామ‘కల్కి’ సినిమాలో అశ్వత్థామ మనందరికీ నచ్చాడు కదా. అమితాబ్ బచ్చన్ ఆ పాత్రలో కనిపిస్తాడు. ద్వాపర యుగం నాటి పాత్ర కాబట్టి సినిమాలో మిగిలిన అన్ని పాత్రలు ఇప్పటి ఎత్తులో ఉన్నా అమితాబ్ 7 అడుగుల ఎత్తులో ఉంటాడు. కాని సినిమాల్లో అన్ని సన్నివేశాల్లో హీరోలు యాక్ట్ చేయరు. వాళ్లకు డూప్స్ ఉంటారు. ‘కల్కి’లో కూడా అమితాబ్‌కు డూప్ ఉన్నాడు. అతని పేరు సునీల్ కుమార్. ఇక్కడ ఫోటోల్లో ఉన్నాడే... అతనే. ఇతని ఎత్తు ఏడు అడుగుల ఏడంగుళాలు. జన్యుపరమైన ఇబ్బందుల వల్ల ఇంత ఎత్తు పెరిగాడు. జమ్ము– కశ్మీర్లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈ మధ్యనే సినిమాల కోసం ఇతణ్ణి ఉపయోగిస్తున్నారు. కల్కి సినిమా మొత్తం అమితాబ్‌కు డూప్‌గా నటించాడు. అమితాబ్ సునీల్‌ని చూసి ‘అరె... నేనే లంబు అనుకుంటే ఇతను నాకంటే లంబుగా ఉన్నాడే’ అని సరదాపడ్డాడట. సునీల్ కుమార్ ఇటీవల పెద్ద హిట్ అయిన ‘స్త్రీ2’లో కూడా ఉన్నాడు. అందులో ‘సర్కటా’ అనే దెయ్యం వేషం వేశాడు. షూటింగ్‌ల కోసం లీవ్ పెట్టి ముంబై, హైదరాబాద్ తిరగాలంటే సెలవు కొంచెం కష్టమైనా సినిమాల్లో నటించడం బాగనే ఉందని సంతోషపడుతున్నా సునీల్.