మా అమ్మలా పెంచాలనుకుంటున్నాను: దీపికా పదుకోన్‌ | Actor Deepika Padukone prioritizing raising daughter Dua over work: Kalki 2898 AD to be delayed | Sakshi
Sakshi News home page

మా అమ్మలా పెంచాలనుకుంటున్నాను: దీపికా పదుకోన్‌

Dec 31 2024 12:12 AM | Updated on Dec 31 2024 12:12 AM

Actor Deepika Padukone prioritizing raising daughter Dua over work: Kalki 2898 AD to be delayed

‘‘మా అమ్మగారు నన్ను ఎలా పెంచారో నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలనుకుంటున్నాను’’ అంటున్నారు హీరోయిన్‌ దీపికా పదుకోన్‌.  ప్రభాస్‌ హీరోగా నటించినపాన్‌ ఇండియన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్ , కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతరపాత్రలుపోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 27న విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘కల్కి 2’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

తొలి భాగం బ్లాక్‌బస్టర్‌ కావడంతో ద్వితీయ భాగంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ‘కల్కి 2’ ప్రీప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు నాగ్‌ అశ్విన్‌. 2025లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని టాక్‌. ‘కల్కి 2898 ఏడీ’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు దీపికా పదుకొనే. ఈ మూవీలో ఆమె చేసిన సుమతిపాత్ర నిడివి తక్కువగా ఉందనే మాటలు వినిపించాయి. అయితే ‘కల్కి 2’లో ఆమెపాత్ర చాలా కీలకమని, ఆమె కూడా త్వరలోనే షూటింగ్‌లోపాల్గొంటారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఏర్పాటు చేసిన ఓ గెట్‌ టు గెదర్‌పార్టీలోపాల్గొన్న దీపికకి ‘కల్కి 2’ సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. 

ఆ ప్రశ్నకు ఆమె బదులిస్తూ..‘‘నేను కూడా ‘కల్కి 2’ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పుడు నా తొలి ప్రాధాన్యం నా కుమార్తె దువా. నా కూతురు పెంపకం కోసం కేర్‌ టేకర్‌ని నియమించుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మా అమ్మగారు ఎలా అయితే పెంచారో.. నేను కూడా నా కూతుర్ని అలాగే దగ్గరుండి పెంచాలని, తన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే... హీరో రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకోన్‌లకు 2018 నవంబరు 14న వివాహం కాగా ఈ ఏడాది సెప్టెంబరులో వారికి కుమార్తె (దువా) జన్మించిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement