'కల్కి' సినిమా వచ్చి నెలరోజులు దగ్గరైపోయింది. వేరే సినిమాలేం సరైనవి లేకపోవడంతో ఇప్పటికీ చాలా చోట్ల విజయవంతంగా రన్ అవుతోంది. మూవీ గురించి ఇప్పటికీ ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన నితిన్ జిహానీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 'కల్కి' నుంచి సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)
'మీరు 'కల్కి'లో చూసింది ఒక్క కాంప్లెక్స్ మాత్రమే. కానీ ప్రపంచంలో వేర్వేరు చోట్ల ఏడు కాంప్లెక్స్‌లు ఉంటాయి. వీటన్నింటినికీ సుప్రీం యాష్కిన్ నాయకుడు. కంటికి కనిపించని అద్భుత శక్తి 'కలి' దిగువన ఇతడు పనిచేస్తుంటాడు' అని నితిన్ జిహానీ చెప్పుకొచ్చాడు.
'కల్కి' చూసిన తర్వాత చాలామంది కమల్ హాసన్.. కలి పాత్రధారి అనుకున్నారు. కానీ నితిన్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే కలి, సుప్రీం యాష్కిన్ వేర్వేరు అని క్లారిటీ వచ్చేసింది. అలానే ఏడు కాంప్లెక్స్‌లు అంటే నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోయే సినిమాల్లో వీటిని చూపిస్తారేమో? దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేశాడో ఏంటో?
(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)
Comments
Please login to add a commentAdd a comment