ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్ | Upcoming OTT Release Movies In Telugu August 4th Week | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఒక్క వారంలో ఓటీటీల్లో 18 మూవీస్.. అవేంటంటే?

Published Mon, Aug 19 2024 10:25 AM | Last Updated on Mon, Aug 19 2024 11:29 AM

Upcoming OTT Release Movies In Telugu August 4th Week

ఆగస్టు 15 లాంటి మంచి వీకెండ్‌ని టాలీవుడ్ ఘోరంగా మిస్ చేసుకుంది. 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిలయ్యాయి. 'ఆయ్' అనే చిన్న మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోగా... డబ్బింగ్ బొమ్మ 'తంగలాన్' తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇదిలా ఉండగా ఈ వారం చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటి రిలీజ్ కావడం లేదు. 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' అనే తెలుగు మూవీ, 'డీమోంటీ కాలనీ 2' అనే డబ్బింగ్ సినిమా థియేటర్లలోకి వస్తున్నాయి.

(ఇదీ చదవండి: 51 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో)

ఓటీటీలో మాత్రం ఈ వారం 'కల్కి', 'రాయన్' లాంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు 'గర్‪‌ర్‌ర్' అనే డబ్బింగ్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఈ మూడు తప్పితే పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాకపోతే వీటిలో ఏవి బాగుంటాయనేది ఓటీటీలోకి వస్తే గానీ చెప్పలేం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 19 నుంచి 25 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • యాంగ్రీ యంగ్ మ‍్యాన్: ద సలీం జావేద్ స్టోరీ (హిందీ సిరీస్) - ఆగస్టు 20

  • కల్కి 2898 ఏడీ (తెలుగు సినిమా) - ఆగస్టు 22

  • ఫాలో కర్‌లో యార్ (హిందీ సిరీస్) - ఆగస్టు 23

  • రాయన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 23

నెట్‌ఫ్లిక్స్

  • టెర్రర్ ట్యూజ్‌డే: ఎక్స్‌ట్రీమ్  (థాయ్ సిరీస్) - ఆగస్టు 20

  • జీజీ ప్రీసింక్ట్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22

  • కల్కి 2898 ఏడీ (హిందీ వెర్షన్) - ఆగస్టు 22

  • మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22

  • ప్రె‍ట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ద మూవీ పార్ట్ 1 (జపనీస్ సినిమా) - ఆగస్టు 22

  • ఇన్ కమింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 23

  • ద ఫ్రాగ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23

ఆహా

  • ఉనర్వుగల్ తొడరకథై (తమిళ సినిమా) - ఆగస్టు 23

హాట్‌స్టార్

  • గర్‌ర్‌ర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 20

  • ద సుప్రీమ్స్ ఎట్ ఎర్ల్స్ ఆల్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 23

మనోరమ

  • స్వకార్యం సంభవబాహులం (మలయాళ మూవీ) - ఆగస్టు 23

ఆపిల్ ప్లస్ టీవీ

  • పచింకో సీజన్ 2 (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23

లయన్స్ గేట్ ప్లే

  • ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 23

జియో సినిమా

  • డ్రైవ్ ఏవే డాల్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 23

(ఇదీ చదవండి: రాఖీ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ అవ్వొద్దు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement