Raayan Movie
-
ఫేట్ మార్చిన రజనీ, ధనుష్ సినిమాలు.. అదృష్టమంటే ఈ డస్కీ బ్యూటీదే (ఫొటోలు)
-
రజినీకాంత్‌తో నటించావా? అని అడిగారు.. రాయన్ ఫేమ్ ఆసక్తికర కామెంట్స్!
ధనుశ్ ఇటీవలే రాయన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ధనుశ్ తమ్ముడి పాత్రలో మెప్పించాడు. అయితే ఈ చిత్రం ధనుశ్కు సోదరిగా నటించిన దుషారా విజయన్ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. రాయన్ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె రజినీకాంత్ వెట్టైయాన్ చిత్రంలో కనిపించనుంది.దసరాకు ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుశ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ హీరో అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే ఆయన్ని అభిమానిస్తున్నట్లు తెలిపింది. నేను రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేస్తున్నానని తెలిసి ధనుశ్ ఆనందించారని వెల్లడించింది.దుషారా విజయన్ మాట్లాడుతూ..'ధనుశ్ ఓసారి నా వద్దకు వచ్చారు. రజినీకాంత్ సర్‌తో యాక్ట్ చేశావా? అని అడిగారు. అవునని చెప్పా. ఆయన వెంటనే ఈ విషయంలో నిన్ను చూసి అసూయపడుతున్నా.. ఎందుకంటే నేను ఇంకా ఆయనతో కలిసి నటించలేదన్నారు. రజనీకాంత్‌ను ఆయన ఎంతలా ఇష్టపడతారో ఆ రోజే నాకర్థమైంది' అని ఆమె అన్నారు. -
మరో ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ 'రాయన్' మూవీ
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'రాయన్'. యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీతో తీయగా.. ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. తెలుగు హీరో సందీప్ కిషన్‌తో పాటు కాళీదాస్ జయరం, అపర్ణ బాలమురళి, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్ అవగా.. తెలుగులో ఓకే ఓకే అనేలా ఆడింది.(ఇదీ చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో)మొన్నీమధ్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసిన ఈ చిత్రానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రాయన్'ని మరో ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థకు సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఉంది. ఇందులోకే ఇప్పుడు రాయన్ అందుబాటులోకి వచ్చింది. కాకపోతే విదేశీ ఓటీటీ ప్రియులకు మాత్రమే ఈ యాప్‌లో 'రాయన్' స్ట్రీమింగ్ అవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనని స్వయంగా సన్ నెక్స్ట్ పోస్ట్ చేసింది.'రాయన్' విషయానికొస్తే.. రాయన్ (ధనుష్) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు. ఇతడికి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి ఉంటుంది. గుట్టుగా బతుకున్న వీళ్ల జీవితం.. రాయన్ తమ్ముడు వల్ల ఊహించని చిక్కులు ఎదుర్కొంటుంది. కుటుంబంలో ఒకరిని ఒకరు చంపుకొనేంత వరకు వెళ్తారు. అసలు దీనికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: హీరో భార్యకు తప్పని బాడీ షేమింగ్.. పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
'రాయన్'తో లాభాలు.. ధనుష్‌కు గిఫ్ట్‌గా రెండు చెక్కులు
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టింది. దీంతో నిర్మాత కళానిధి మారన్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాజాగా ధనుష్‌ను కలిసి రెండు చెక్కులు అందించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధనుష్ కెరియర్లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది.ధనుష్ హీరోగా, డైరెక్టర్‌గా తన ప్రతిభను రాయన్‌లో చూపించాడు. బాక్సాఫీస్ వద్ద రూ. 158 కోట్ల కలెక్షన్లు రాబట్టి నిర్మాతతో పాటు పంపిణీదారులకు కూడా రాయన్ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇది ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా, అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా గుర్తింపు పొందింది. ధనుష్‌ని స్వయంగా కలుసుకున్న నిర్మాత ఆపై రెండు చెక్కులను చిత్ర విజయానికి బహుమతిగా అందజేశారు. ఒకటి హీరోకి,మరొకటి దర్శకుడికి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ధనుష్‌కు ఎంత మొత్తం ఇచ్చారని చెప్పలేదు. కానీ, సుమారు రూ. 10 కోట్ల వరకు ఇచ్చి ఉంటారని నెట్టింట ప్రచారం జరుగుతుంది.ఓటీటీలో రాయన్రాయన్ సినిమా నేడు (ఆగష్టు 23) ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్‌పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో వీకెండ్ వచ్చేసింది. గురువారం 'కల్కి' సినిమా ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో చూసిన చాలామంది మరోసారి షో వేశారు. అలానే కొత్తగా ఇంకేమైనా మూవీస్ వచ్చాయా అని సెర్చ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే రెండు తమిళ డబ్బింగ్ చిత్రాల తెలుగు వెర్షన్స్ తాజాగా అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఏ ఓటీటీలో ఉన్నాయి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)ధనుష్.. హీరోగా నటించిన దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్'. ఇతడి కెరీర్లో ఇది 50వ సినిమా. కమర్షియల్ హంగులతో తీసిన ఈ సినిమాలో యాక్షన్, డ్రామా బాగానే వర్కౌట్ అయింది. తమిళంలో బాగానే డబ్బులొచ్చాయి కానీ తెలుగులో ఎందుకో సరిగా ఎక్కలేదు. తాజాగా ఇది అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 09న తెలుగులో రిలీజైన ఈ సినిమాని రెండు వారాలైన కాకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ అనుకున్నారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఓటీటీలోనే కాబట్టి టైమ్ పాస్ చేసేయొచ్చు. 'కల్కి' కాకుండా ఓటీటీలో మరేదైనా మూవీస్ చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
ఆగస్టు 15 లాంటి మంచి వీకెండ్‌ని టాలీవుడ్ ఘోరంగా మిస్ చేసుకుంది. 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిలయ్యాయి. 'ఆయ్' అనే చిన్న మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోగా... డబ్బింగ్ బొమ్మ 'తంగలాన్' తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇదిలా ఉండగా ఈ వారం చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటి రిలీజ్ కావడం లేదు. 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' అనే తెలుగు మూవీ, 'డీమోంటీ కాలనీ 2' అనే డబ్బింగ్ సినిమా థియేటర్లలోకి వస్తున్నాయి.(ఇదీ చదవండి: 51 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో)ఓటీటీలో మాత్రం ఈ వారం 'కల్కి', 'రాయన్' లాంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు 'గర్‌ర్‌ర్' అనే డబ్బింగ్ మూవీ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఈ మూడు తప్పితే పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాకపోతే వీటిలో ఏవి బాగుంటాయనేది ఓటీటీలోకి వస్తే గానీ చెప్పలేం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 19 నుంచి 25 వరకు)అమెజాన్ ప్రైమ్యాంగ్రీ యంగ్ మ్యాన్: ద సలీం జావేద్ స్టోరీ (హిందీ సిరీస్) - ఆగస్టు 20కల్కి 2898 ఏడీ (తెలుగు సినిమా) - ఆగస్టు 22ఫాలో కర్లో యార్ (హిందీ సిరీస్) - ఆగస్టు 23రాయన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 23నెట్ఫ్లిక్స్టెర్రర్ ట్యూజ్‌డే: ఎక్స్ట్రీమ్ (థాయ్ సిరీస్) - ఆగస్టు 20జీజీ ప్రీసింక్ట్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22కల్కి 2898 ఏడీ (హిందీ వెర్షన్) - ఆగస్టు 22మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22ప్రెట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ద మూవీ పార్ట్ 1 (జపనీస్ సినిమా) - ఆగస్టు 22ఇన్ కమింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 23ద ఫ్రాగ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23ఆహాఉనర్వుగల్ తొడరకథై (తమిళ సినిమా) - ఆగస్టు 23హాట్స్టార్గర్ర్ర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 20ద సుప్రీమ్స్ ఎట్ ఎర్ల్స్ ఆల్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 23మనోరమస్వకార్యం సంభవబాహులం (మలయాళ మూవీ) - ఆగస్టు 23ఆపిల్ ప్లస్ టీవీపచింకో సీజన్ 2 (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23లయన్స్ గేట్ ప్లేఇన్ ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 23జియో సినిమాడ్రైవ్ ఏవే డాల్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 23(ఇదీ చదవండి: రాఖీ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ అవ్వొద్దు!) -
ఓటీటీలో 'రాయన్'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈమేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ధనుష్ కెరియర్లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది. ఇందులో తన అద్భుతమైన నటనతో పాటు డైరెక్టర్‌గా కూడా ధనుష్ మెప్పించాడు. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రాయన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే, సినిమా విడుదలైన నెలరోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రాయన్ సినిమా ఆగష్టు 23న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఆ సంస్థ లాభాలను అందుకుంది. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్‌పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
రాయణ్ బ్లాక్ బస్టర్.. దూకుడు పెంచిన ధనుష్..
-
రాయన్‌ను అభినందించిన మహేశ్ బాబు
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. విడుదల సమయంలో మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. రాయన్ తెరకెక్కించిన తీరును చూసిన ప్రేక్షకులు ధనుష్ టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. ఇందులోని నటీనటులు అందరూ కూడా తమ అద్భుతమైన నటనతో ఇచ్చిపడేశారు. అందుకే రాయన్ టీమ్‌పై అభినందనల వెల్లువ వస్తుంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు రాయన్ సినిమా చూసి ఫిదా అయ్యారు. సినిమాపై అయన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు.సోషల్ మీడియా వేదికగా రాయన్ సినిమాపై మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. 'ధనుష్ అద్భుతంగా నటించడమే కాకుండా బ్రిలియంట్‌గా డైరెక్ట్ చేశారు. కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. రెహమాన్ మ్యూజిక్ సినిమాకు బాగా కలిసొచ్చింది. SJ సూర్య, ప్రకాశ్ రాజ్,సెల్వ రాఘవన్, సందీప్ కిషన్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ ఇతర నటీనటుల యాక్టింగ్ సూపర్. రాయన్ భారీ విజయాన్ని అందుకున్నాడు. మూవీ టీమ్‌కు కంగ్రాట్స్' అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ధనుష్ కూడా రియాక్ట్ అయ్యారు. 'మీ ప్రశంసలతో మా టీమ్ ఆశ్చర్యానికి లోనైంది. మీ ఆత్మీయతకు చాలా ధన్యవాదాలు' అంటూ తెలిపారు. ఎస్.జే సూర్య, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళీ కూడా మహేశ్ బాబుకు తిరిగి సమాధానంగా కృతజ్ఞతలు తెలిపారు.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై ధనుష్ 50వ సినిమాగా రాయన్ సినిమా తెరకెక్కింది. మరోసారి తన రస్టిక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో మెప్పించారు. దీంతో తొలి మూడురోజుల్లోనే రూ. 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కోలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా రాయన్ చిత్రానికి మంచి ఆదరణ లభించడం విశేషం.#Raayan…. Stellar act by @dhanushkraja… brilliantly directed and performed. 🔥🔥🔥 Outstanding performances by @iam_SJSuryah, @prakashraaj, @sundeepkishan, and the entire cast. An electrifying score by the maestro @arrahman. 🔥🔥🔥 A must-watch… Congratulations to the entire…— Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2024 -
పైరసీ సినిమాలకు అడ్డాగా తమిళ్‌రాకర్స్.. అడ్మిన్ అరెస్ట్
సినిమా కలెక్షన్స్‌కు గొడ్డలిపెట్టుగా మారిన పైరసీని అరికట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక రూపంలో పైరసీ జరుగుతూనే ఉంది. సినిమా థియేటర్లలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వివిధ వెబ్సైట్లలో మూవీ ప్రత్యక్షమవుతోంది. తాజాగా ధనుష్ రాయన్ సినిమాను కూడా ఇలాగే పైరసీ చేసేందుకు ప్రయత్నించాడో వ్యక్తి.వెబ్సైట్లో ఫ్రీగా..మధురైకి చెందిన స్టీఫెన్ రాజ్ కేరళలోని తిరువంతపురం థియేటర్లో తన సెల్ఫోన్లో రాయన్ సినిమాను రికార్డు చేసి తమిళ్‌రాకర్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. ఇటీవలే వచ్చిన గురువాయురప్పన్ అంబలనడై సినిమాను సైతం థియేటర్లో రిలీజైన తర్వాతి రోజే వెబ్సైట్లో ఫ్రీగా అందుబాటులోకి తెచ్చాడు. దీంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాతలు కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అడ్మిన్ అరెస్ట్దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు స్టీఫెన్‌ను అరెస్ట్ చేశారు. మహారాజ, కల్కి 2898 ఏడీ చిత్రాల కాపీలు సైతం అతడి దగ్గర ఉన్నట్లు గుర్తించారు. తమిళ్‌రాకర్స్ అడ్మిన్‌గా పని చేస్తున్న ఇతడు.. థియేటర్లో కూర్చున్నప్పుడు కాఫీ కప్ పెట్టుకునే హోల్డర్‌లో మొబైల్ ఫోన్ పెట్టి సినిమాను రికార్డు చేస్తున్నట్లు తెలిపారు.చదవండి: హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగాహీరో -
ధనుశ్ బర్త్ డే స్పెషల్.. ఈ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవల రాయన్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 26న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే రాయన్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఇవాళ ధనుశ్ బర్త్ డే కావడంతో చిత్రబృందం, అభిమానులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. అంతే కాకుండా సన్ పిక్చర్స్ సంస్థ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ధనుశ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రాయన్ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించారు. -
ట్రెండ్ ఫాలో అయిన ధనుష్.. 50వ చిత్రం సూపర్ హిట్..
-
'రాయన్' ఫస్ట్ డే కలెక్షన్స్.. అక్కడ కేవలం రూ. 20 లక్షలే
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'రాయన్'. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 26న విడుదలైన ఈ చిత్రం మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించేలా రాయన్ ఉందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ఇలా స్టార్ యాక్టర్స్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను రాయన్ చేరుకోలేకపోయింది.రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ధనుష్ స్వీయ దర్శకత్వం వహించాడు. సినిమాపై మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ రాయన్‌కు ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చాయని తెలుస్తోంది. ధనుష్‌కి తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. సార్, తిరు లాంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. ఇండస్ట్రీ లెక్కల ప్రకారం రాయన్ మూవీ విడుదలైన తొలి రోజు భారత్‌లో రూ. 13.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచి రూ. 1.6 కోట్లు రాగా తమిళ వెర్షన్‌కు రూ. 11.85 కోట్లు వచ్చాయి. అయితే హిందీ నుంచి కేవలం రూ. 20 లక్షలు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.20.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. -
'రాయన్' సినిమా రివ్యూ
ధనుష్‌కి తమిళంలో ఉన్నంత క్రేజ్ తెలుగులోనూ ఉంది. 'సార్', 'తిరు' లాంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. అలాంటిది ఇతడు హీరోగా నటించి దర్శకత్వం వహించిన మూవీ 'రాయన్' వస్తుందంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయి కదా! అందున ఇది ధనుష్‌కి 50వ మూవీ. ఇంతకీ ఇది ఎలా ఉంది? హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కాతవరాయన్ (ధనుష్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. దీంతో ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో వేరేచోటకు వలస పోతాడు. పెద్దయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని బతికేస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న ఇతడి జీవితం.. అదే ఊరిలో పేరు మోసిన గూండాలు దురై, సేతు వల్ల తల్లకిందులవుతుంది. ఓ టైంలో సొంత తమ్ముడే.. రాయన్ని చంపాలనుకుంటాడు. ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?హీరో కమ్ దర్శకుడిగా ధనుష్.. ఈ పాయింట్ చాలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి. కానీ యాక్టర్‌గా న్యాయం చేసిన ధనుష్.. రైటర్ కమ్ డైరెక్టర్‌గా విఫలమయ్యాడు. కథగా చూసుకుంటే 'రాయన్' పాతదే. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా స్టోరీలతో మూవీస్ చాలానే వచ్చాయి. అంతెందుకు ఇలాంటి ఫ్లేవర్ ఉన్న స్టోరీల్లో గతంలో ధనుషే హీరోగా నటించాడు.ఫస్టాప్ విషయానికొస్తే.. రాయన్ బాల్యంతో కథ మొదలవుతుంది. ఊరెళ్లి వస్తానని చెప్పిన తల్లిదండ్రులు రాకపోవడం, కొన్ని అనుకోని పరిస్థితుల్లోని ఊరి నుంచి తప్పించుకుని రావడం.. ఇలా ఎక్కడో చూశామే అనిపించిన సీన్లతో టైటిల్స్ పడతాయి. ప్రస్తుతంలోకి వచ్చిన తర్వాత అయినా స్టోరీ కదులుతుందా అంటే అస్సలు కదలదు. రాయన్, అతడి షాప్, తమ్ముళ్లు, వాళ్ల చుట్టూ ఉండే వాతావరణం.. ఇలా బోరింగ్‌గా సాగుతూ ఉంటుంది. కాస్త హై ఇచ్చే ఫైట్ సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్‌లో అయినా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అసలు కన్విన్స్ కాని, లాజిక్ లేని విధంగా స్టోరీ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సన్నివేశాలు మినహా 'రాయన్' పూర్తిగా నిరాశపరుస్తుంది. పాత్రల మధ్య డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తీద్దామనుకున్న ధనుష్.. అసలేం తీశాడో అర్థం కాని విధంగా సినిమా ఉంటుంది. సెకండాఫ్‌లో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి ట్విస్ట్ పెట్టి ఏదో మేనేజ్ చేద్దామనుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.ఎవరెలా చేశారు?నటుడిగా ధనుష్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతడి చెల్లిగా నటించిన దుశరా విజయన్, తమ్ముడిగా చేసిన సందీప్ కిషన్‌కి ఉన్నంతలో మంచి రోల్స్ పడ్డాయి. సెకండాఫ్‌లో హాస్పిటల్లో జరిగే ఫైట్ సీన్లో దుశరా యాక్టింగ్‌కి విజిల్ వేయాలనిపిస్తుంది. విలన్‌గా చేసిన ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. వీళ్లతో పాటు ప్రకాశ్ రాజ్, అపర్ణ బాలమురళి, కాళీదాస్ జయరాం, సెల్వరాఘవన్.. ఇలా మంచి మంచి యాక్టర్స్‌ని పెట్టుకున్నారు. కానీ వీళ్లకు సరైన సీన్స్ పడలేదు. అసలు ఇంతమంది స్టార్స్‌ని సినిమాలో ఎందుకు పెట్టుకున్నారా అనే డౌట్ వస్తుంది.టెక్నికల్ విషయాలకొస్తే పాటలు అస్సలు బాలేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్టర్‌గా ధనుష్‌ని వంకపెట్టడానికి లేదు కానీ దర్శకుడిగా మాత్రం ఫ్లాఫ్ అయ్యాడు. దానికి తోడు 'రాయన్' చూస్తున్నంత సేపు తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది 'రాయన్' సంగతి!రేటింగ్: 1.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Raayan X Review: ధనుష్ 'రాయన్' ట్విటర్ రివ్యూ
తమిళ హీరో ధనుష్ మైల్ స్టోన్ మూవీ 'రాయన్'.ఇతడే దర్శకత్వం వహించిన, హీరోగా నటించాడు. సందీప్ కిషన్, కాళీదాస్ జయరాం, దుసరా విజయన్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. తాజాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? చూసిన వాళ్లు ట్విటర్లో టాక్ ఏంటి?ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, సెకండాఫ్ మరింత బాగుందని అంటున్నారు. అలానే ధనుష్ ఎంట్రీ అదిరిపోయిందని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్యాంగ్ సూపర్ గా ఉందని అంటున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని చెప్పుకొచ్చారు. పూర్తి రివ్యూ ఏంటనేది మరికాసేపట్లో వచ్చేస్తుంది.#Raayan - ARR Bhai is the second hero of the movie🥶🫶Sema BGM, especially the flashback portions🤌🔥🔥 pic.twitter.com/y8Nl2Q7wiU— AmuthaBharathi (@CinemaWithAB) July 26, 2024#Raayan First Half REPORT -Raayan - Raw & Rustic One 🔥💥 . @dhanushkraja 's Transformation 🥵🔥 screen presence ... Fireyyyy One ! #Dhanush 's Direction 🏆🙏🙏 Top Notch ... Literally Witnessed an another Vetrimaran Here 🔥 Casting & their Performance - Perfect 💥… pic.twitter.com/shheQ4m4ir— Let's X OTT GLOBAL (@LetsXOtt) July 26, 2024#Raayan interval 💥💥💥💥💥💥#dhanush naaaaaaaaaaaa 💥💥💥💥💥💥💥💥💥💥💥 Watha edra Dragon Template ah omalae #RaayanFDFS pic.twitter.com/TAUiUjcsPG— Tonystark👊🏽 (@Tonystark2409) July 26, 2024#Raayan First half - ABOVE AVERAGE to GOOD🤝- Takes some to set the phase & establish the characters & the story gears up in the midway of the movie 🔥- A Usual Revenge drama but shies out well with the treatment of Director #Dhanush👌- Goosebumps Interval Portion🔪🥵- ARR… pic.twitter.com/XE9v9Lc0Fv— AmuthaBharathi (@CinemaWithAB) July 26, 2024Simple and neat title card with terrific BGM..#Raayan pic.twitter.com/5zt02u4Hhg— R Vasanth (@rvasanth92) July 26, 2024