ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Raayan And Toofan Movie Telugu OTT Streaming Details | Sakshi
Sakshi News home page

OTT Movies: ఓటీటీలో 'రాయన్', 'తుఫాన్'.. ఎందులో చూడాలి?

Aug 23 2024 9:24 AM | Updated on Aug 23 2024 9:31 AM

Raayan And Toofan Movie Telugu OTT Streaming Details

మరో వీకెండ్ వచ్చేసింది. గురువారం 'కల్కి' సినిమా ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో చూసిన చాలామంది మరోసారి షో వేశారు. అలానే కొత్తగా ఇంకేమైనా మూవీస్ వచ్చాయా అని సెర్చ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే రెండు తమిళ డబ్బింగ్ చిత్రాల తెలుగు వెర్షన్స్ తాజాగా అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఏ ఓటీటీలో ఉన్నాయి?

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)

ధనుష్.. హీరోగా నటించిన దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్'. ఇతడి కెరీర్‪‌లో ఇది 50వ సినిమా. కమర్షియల్ హంగులతో తీసిన ఈ సినిమాలో యాక్షన్, డ్రామా బాగానే వర్కౌట్ అయింది. తమిళంలో బాగానే డబ్బులొచ్చాయి కానీ తెలుగులో ఎందుకో సరిగా ఎక్కలేదు. తాజాగా ఇది అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.

'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 09న తెలుగులో రిలీజైన ఈ సినిమాని రెండు వారాలైన కాకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ కాన్సెప్ట్ అనుకున్నారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఓటీటీలోనే కాబట్టి టైమ్ పాస్ చేసేయొచ్చు. 'కల్కి' కాకుండా ఓటీటీలో మరేదైనా మూవీస్ చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయండి.

(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement