vijay antony
-
రూ.197 కోట్ల స్కామ్.. ఆసక్తికరంగా 'భద్రకాళి' టీజర్
'బిచ్చగాడు' మూవీతో తెలుగులో బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇతడు.. నటుడు, నిర్మాత, పాటల రచయిత, ఎడిటర్, సంగీత దర్శకుడిగా ఆకట్టుకుంటున్నాడు. ఇతడి 25వ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అది ఆసక్తికరంగా ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)'అరువి', 'వాళ్' లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన అరుణ్ ప్రభు.. విజయ్ ఆంటోనితో తీస్తున్న మూవీకి తెలుగులో 'భద్రకాళి' అనే టైటిల్ పెట్టారు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. కథని పెద్దగా బయటపెట్టలేదు గానీ విజువల్స్ చూస్తుంటే మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.ఇది రాజకీయ నేపథ్య కథతో తీసిన సినిమా అని తెలుస్తోంది. ఏదో రూ.197 కోట్ల స్కామ్ చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు. గ్యాంగ్ స్టర్, మోసగాడు, ఫ్యామిలీ మ్యాన్, గవర్నమెంట్ ఆఫీసర్, ఖైదీగా.. ఇలా రకరకాల కోణాల్లో చూపించారు. వేసవి కానుకగా ఇది థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత) -
'పరాశక్తి' కోసం పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. మరోవైపు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమాకి కూడా ‘పరాశక్తి’ టైటిల్ ఖరారు చేయడం విశేషం. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న ‘పరాశక్తి’కి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు టీజర్‌ని విడుదల చేశారు. ‘సైన్యమై కదిలిరా... పెను సైన్యమై కదిలిరా...’ అంటూ శివ కార్తికేయన్ చెప్పే డైలాగులు టీజర్లో ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. → విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘పరాశక్తి’ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ పై ‘పరాశక్తి’రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ‘‘విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
OTT: హిట్లర్’ రివ్యూ.. ఇదో లవ్ క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘హిట్లర్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాంనెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు... ఈ సినిమా పేరుకి, సినిమాకి అస్సలు సంబంధముండదు. కాని సినిమా మాత్రం ఓ అద్భుతమైన థ్రిల్లర్ అని చెప్పవచ్చు. హిట్లర్ సినిమా ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యం. ధనశేఖరన్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో విజయ్ యాంటోని, హీరోయిన్ రియాసుమన్ ప్రధాన పాత్రలలో నటించగా ప్రముఖ దర్శకులు, నటులు అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అంతే కాదు నాటి విలన్ చరణరాజ్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఇక హిట్లర్ కథ విషయానికొస్తే ఇదో వినూత్నమైన కథ. హీరో సెల్వకు చెన్నైలోని ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వస్తుంది. దాని కోసంగా కరుక్కవేల్ అనే స్నేహితుడి రూమ్ కి వస్తాడు సెల్వ. కరుక్కవేల్ తన కాలేజ్ స్నేహితుడని గుర్తు చేస్తాడు సెల్వ. కాని కరుక్కవేల్ తాను సెల్వని ఇప్పుడే చూస్తున్నానని చెప్తాడు. ఇంతలో సారా సెల్వకి ఓ రైల్వే స్టేషన్ లో అనుకోకుండా పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరో పక్క నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్లను ఎవరో బైక్ లో వచ్చి ఓ రేర్ పిస్టల్ తో చంపుతుంటారు. దానిని శక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఆ విచారణలో భాగంగా ఎన్నికలలో పోటీ చేయబోతున్న రాజకీయవేత్త రాజవేలు బ్లాక్ మనీ దాదాపు 500 కోట్లు పోయిందని తెలుస్తుంది. ఓ పక్క సెల్వ సారా లవ్ ట్రాక్, మరో పక్క రౌడీ షీటర్ హత్యలు, ఆ పైన డబ్బు పోవడం. ఈ మూడూ పేర్లల్ గా నడుపుతూ కథను అనూహ్యమైన మలుపులతో ఈ సినిమా స్క్రీన్ ప్లే చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఊహించని ట్విస్టులే ఈ సినిమాకి ప్రాణం. ఈ వీకెండ్ చూడదగ్గ సినిమా ఈ హిట్లర్. కాకపోతే పిల్లలకు ఈ సినిమాని దూరంగా ఉంచాలి. పేరుకే ఈ సినిమా హిట్లర్ కాని సినిమా మాత్రం సూపర్ హిట్టు. -
మర్డర్ మిస్టరీ
విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘గగన మార్గన్’ టైటిల్ ఖరారైంది. ‘అట్టకత్తి, సూదు కవ్వుం, ఏ1, మాయవన్’ వంటి తమిళ చిత్రాలకు ఎడిటర్‌గా చేసిన లియో జాన్ పాల్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.‘‘గగన మార్గన్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ముఖ్యంగా ముంబైలో చిత్రీకరించిన అండర్ వాటర్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సైలెంట్‌గా కొత్త సినిమా పూర్తి చేసిన విజయ్ ఆంటోని
కథానాయకుడిగా సక్సెస్ అయిన సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. బిచ్చగాడు సినిమాతో తెలుగు వారికి బాగా కనెక్ట్ అయిన విజయ్ నుంచి జయాపజయాలకు అతీతంగా పలు చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. దర్శకుడిగా కూడా ఆయన ప్రతిభను ప్రేక్షకులకు చూపించారు. మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్నున్న విజయ్ నిర్మాతగానూ విజయాలు అందుకున్నారు. విజయ్‌ఆంటోని తాజాగా నటించిన హిట్లర్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ విషయాన్ని అటుంచితే ఈయన తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎలాంటి హంగామా లేకుండా, అసలు ప్రారంభం అయిన విషయాన్నే తెలపకుండా చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ చిత్రం ద్వారా లియో జాన్‌పాల్ అనే ఎడిటర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈయన పిజ్జా, సూదుకవ్వుమ్ (గడ్డం గ్యాంగ్ పేరుతో తెలుగులో రీమేక్ అయింది) తదితర చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశారు. మహానది శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ఆంటోనినే సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో వీకెండ్ వచ్చేసింది. గురువారం 'కల్కి' సినిమా ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో చూసిన చాలామంది మరోసారి షో వేశారు. అలానే కొత్తగా ఇంకేమైనా మూవీస్ వచ్చాయా అని సెర్చ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే రెండు తమిళ డబ్బింగ్ చిత్రాల తెలుగు వెర్షన్స్ తాజాగా అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఏ ఓటీటీలో ఉన్నాయి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)ధనుష్.. హీరోగా నటించిన దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్'. ఇతడి కెరీర్లో ఇది 50వ సినిమా. కమర్షియల్ హంగులతో తీసిన ఈ సినిమాలో యాక్షన్, డ్రామా బాగానే వర్కౌట్ అయింది. తమిళంలో బాగానే డబ్బులొచ్చాయి కానీ తెలుగులో ఎందుకో సరిగా ఎక్కలేదు. తాజాగా ఇది అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 09న తెలుగులో రిలీజైన ఈ సినిమాని రెండు వారాలైన కాకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ అనుకున్నారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఓటీటీలోనే కాబట్టి టైమ్ పాస్ చేసేయొచ్చు. 'కల్కి' కాకుండా ఓటీటీలో మరేదైనా మూవీస్ చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
ఓటీటీలో 'తుఫాన్'.. పదిరోజుల్లోనే స్ట్రీమింగ్
కోలివుడ్ హీరో విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం ఇప్పడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతుంది. విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ఈ సినిమాని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. సత్యరాజ్, శరత్ కుమార్, మేఘా ఆకాష్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ వంటి స్టార్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.తుఫాన్ సినిమా విడుదలై వారం రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ, అమెజాన్ ప్రైమ్‌లో సడెన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం తమిళ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. తమిళ్లో తుఫాన్ చిత్రాన్ని ఆగష్టు 2న విడుదల చేశారు. టాలీవుడ్లో ఆగష్టు 11న విడుదల చేశారు. ఈ క్రమంలోనే ముందుగా తమిళ్ వర్షన్‌ను ఓటీటీలో విడుదల చేసిన మేకర్స్ వచ్చే వారంలో తెలుగు వర్షన్ కూడా విడుదల చేయనున్నారని సమాచారం. -
ఆ సీన్లో నటించింది నేను కాదు... విజయ్ ఆంటోని
నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మలై పిడిక్కాద మనిదన్. ఇన్ఫినిటీ ఫిలిం వేంచర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించారు. నటుడు శరత్‌కుమార్, సత్యరాజ్, నటి మేఘాఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ఈ చిత్రంలోని ఆరంభంలో వచ్చే ఒక నిమిషం సన్నివేశాలను తనకు తెలియకుండా కలిపారని దర్శకుడు విజయ్ మిల్టన్ ఆరోపించడంతో పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ విషయమై ఆయన మీడియాను కలవడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ తరువాత మీడియాను కలవాలనే తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. చిత్రంలో కథానాయకుడు ఏం చేస్తాడు, అతను రౌడీనా? పోలీసా? అతనికి వర్షం అంటే ఎందుకు నచ్చదు? వంటి విషయాలను సస్పెన్స్‌గా ఉంచానన్నారు. అయితే ఆ సన్నివేశాలను చిత్రంలో ముందుగానే రివీల్ చేసేలా తనకు తెలియకుండా చేర్చారని దర్శకుడు విజయ్ మిల్టన్ ఆరోపించడంతో నటుడు శరత్‌కుమార్ ఈ వివాదంలో జోక్యం చేసుకుని దర్శకుడికి, నిర్మాతకు మధ్య సమన్వయం కుదిర్చినట్లు సమాచారం. ఈ వివాదం గురించి ఆ చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని పేర్కొంటూ మలై పిడిక్కాద మనిదన్ చిత్రంలో నిమిషం పాటు సాగే సన్నివేశానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ సన్నివేశాల్లో నటించింది తాను కాదని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికైనా ఈ వివాదం సద్దుమణిగినా? అనే చర్చ సాగుతోంది. -
నా లుక్ కొత్తగా ఉంటుంది: సత్యరాజ్
‘‘బాహుబలి’ తర్వాత సినిమాల రేంజ్ పెరిగింది. తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘తుఫాన్’ సినిమాతో వారికి మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నాను’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో కమల్ బోరా, డి. లలిత, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘తుఫాన్’ కంటెంట్, క్వాలిటీ మాకు సక్సెస్ ఇస్తాయన్న నమ్మకం ఉంది. నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. వారికి థ్యాంక్స్’’ అన్నారు.‘‘నాకు నచ్చిన థ్రిల్లర్ మూవీ ‘తుఫాన్’. ఈ సినిమాలో నా లుక్, మేకోవర్, క్యారెక్టర్ కొత్తగా ఉంటాయి’’ అన్నారు సత్యరాజ్. ‘‘తుఫాన్’ను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు విజయ్ మిల్టన్. ‘‘తుఫాన్’లో క్వాలిటీ కంటెంట్, కమర్షియల్ అంశాలు ఉన్నాయి’’ అన్నారు ధనుంజయ. -
విజయ్ ఆంటోని ‘తుఫాన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరో బర్త్‌డే.. సంతోషమే లేకుండా పోయింది!
బిచ్చగాడు సినిమాతో తెలుగులో మోస్ట్ పాపులర్ అయిన హీరో విజయ్ ఆంటోని. ఈ తమిళ హీరో బర్త్‌డే నేడు (జూలై 24). పుట్టినరోజు అనగానే ఎవరైనా హుషారుగా ఆనందంగా గడిపేస్తుంటారు. కానీ కుటుంబమే ప్రాణంగా బతికే విజయ్ ఆంటోనికి ఈసారి ఆ భాగ్యం లేకుండా పోయింది. కూతురు చనిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్‌డే కావడంతో మనసు నిండా విషాదం కూరుకుపోయి ఉన్నా పైకి మాత్రం జీవం లేని నవ్వుతో కనిపించాల్సి వస్తోంది.కూతుర్ని పోగొట్టుకుని..గతేడాది సెప్టెంబర్ 19న విజయ్ కూతురు మీరా చెన్నైలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. 16 ఏళ్ల వయసులో ప్రాణాలు తీసుకునేంత కష్టం ఏమొచ్చిందని గుండెలవిసేలా రోదించారు. తన బాధను తండ్రితో చెప్తే క్షణాల్లోనే ఆ విచారాన్ని తొలగించి సంతోషం నింపేవాడు. కానీ ఎవరితోనూ ఏమీ చెప్పకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అప్పటినుంచి విజయ్ దంపతులు కుమిలిపోతూనే ఉన్నారు. తన రెండో కూతురి కోసం ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటపడుతున్నారు. ఆ విషాదం నుంచి బయటపడని ఆంటోనిఇటీవల వచ్చిన రోమియో సినిమాలోనూ నిర్మాతగా భార్య ఫాతిమా పేరుకు బదులు చనిపోయిన కూతురు మీరా పేరును వాడారు. అక్కడే వారు గడిచిన విషాదం నుంచి బయటపడలేదని తెలుస్తోంది. కాగా విజయ్ ఆంటోని సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. నాక్క ముక్క పాటకుగానూ కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డు అందుకున్న తొలి సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. నాన్ మూవీతో హీరోగా మారాడు. తర్వాత సంగీతాన్ని పక్కన పెట్టి హీరోగానే ఎక్కువ సినిమాలు చేశాడు.చదవండి: పని చేస్తూ సంపాదించే భార్య నాకొద్దు.. పెళ్లికి ముందే బిగ్‌బీ కండీషన్? -
తెలుగులో అమ్మ పాట పాడి అదరగొట్టిన విజయ్ ఆంటోని
-
విజయ్ ఆంటోని 'తుఫాన్' ట్రైలర్ విడుదల
విజయ్ ఆంటోని.. తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో బాగా దగ్గరపయ్యాడు. రీసెంట్గా ఇటీవలే 'లవ్‌గురు'తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇప్పుడాయన 'తుఫాన్'తో మెప్పించనున్నాడు. విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ఈ సినిమాని కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.సత్యరాజ్, శరత్ కుమార్, మేఘా ఆకాష్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ వంటి స్టార్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా విడుదలైన తుఫాన్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఇది ఒక దీవిలో జరిగే కథతో రూపొందించారు. ఒక అపరిచిత వ్యక్తి అపరిచిత సమాజంలోకి అడుగు పెట్టాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడన్నదే ఈ ట్రైలర్లో ఉంది. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు అనుబంధాలు, భావోద్వేగాలు ఇలా అన్ని అంశాలున్నట్లు తెలుస్తోంది. -
Vijay Antony: కొన్ని నెలలుగా చెప్పులు వేసుకోవడమే మానేశాను: విజయ్ ఆంటోని
బయటకు అడుగుపెట్టాలంటే చెప్పులు ఉండాల్సిందే. వాకింగ్ చేస్తున్నప్పుడు, దగ్గర్లోని షాపుకు వెళ్లాలంటే చెప్పుల్లేకుండా అడుగువేయం. కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు ఉపయోగిస్తారు. ఇలా పొద్దున్న నిద్రలేచిన సమయం నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తాం. అయితే, కోలీవుడ్ హీరో, డైరెక్టర్ విజయ్ ఆంటోనీ చెప్పులు లేకుండా కనిపించారు. అంతేకాకుండా భవిష్యత్‌లో కూడా చెప్పులో వేసుకోనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'తుఫాన్'. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్ విడుదల కార్యక్రమంలో విజయ్ అంటోని పలు విషయాలను పంచుకున్నాడు. వేదిక మీదు చెప్పులు లేకుండా విజయ్ కనిపించడంతో ఏదైనా దీక్షలో ఉన్నారా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా చెప్పాడు. 'నేను ఎలాంటి దీక్షలో లేను. సుమారు 3 నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. దీనికి ప్రత్యేకమైన కారణం లేదు. ఒకరోజు నేను చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. అంతేకాకుండా మనలో కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను దీంతో చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన అన్నారు. టాలీవుడ్లో జాతి రత్నాలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనుదీప్ కూడా తాను పెద్దగా చెప్పులు ఉపయోగించనని గతంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక నివేదకల ద్వారా వెళ్లడి అయిన విషయం తెలిసిందే. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా
కోలీవుడ్‌లో విజయ్ ఆంటోని సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రంలో నటించారు. మృణాళిని రవి ఇందులో హీరోయిన్గా నటించింది. విజయ్ ఆంటోని స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. ఏప్రిల్ 11న తెలుగులో కూడా విడుదలైన లవ్ గురు ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో విడుదల చేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా విజయ్ అంటోని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ లవ్ గురు సినిమా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. సినిమా విడుదలైన నెలలోపే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే తాజాగా తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ ప్రేక్షకులను మెప్పించిన లవ్ గురు చిత్రాన్ని ఈ వీకెండ్లో చూసి ఎంజాయ్ చేయండి.లవ్ గురు కథేంటి..?అరవింద్ పాత్రలో విజయ్ ఆంటోని మెప్పించాడు. 35ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోయానే అనే బాధ అతనిలో ఉంటుంది. సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్న అరవింద్ ఓ చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. దీనిని గ్రహించిన కుటుంబ సభ్యులు వారిద్దరికీ పెళ్లి చేస్తారు. కానీ, పెళ్లైన మరుసటి రోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్‌కు అర్థమవుతుంది. ఈ పెళ్లి ఆమెకు ఎందుకు ఇష్టం లేదు..? లీలా కోరిక ఏంటి..? ఆమె మనసును గెలుచుకునేందుకు అరవింద్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు వంటి సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. -
Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?
వైవిధ్య పాత్రలను పోషిస్తూ అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం ‘లవ్ గురు’. ఆయన నటించిన తొలి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లవ్ గురు’ కథేంటంటే.. ఆర్థిక సమస్యల కారణంగా మలేసియా వెళ్లిన అరవింద్(విజయ్ ఆంటోని) కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. అప్పటికే ఆయనకు 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. ఇప్పటికైనా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాలని సొంతూరు సింహాచలం వెళ్తాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తల్లిదండ్రులు.. లీల తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. కానీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్‌తో పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లైన మరుసటి రోజు అరవింద్‌కు ఈ విషయం తెలుస్తుంది. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత అరవింద్‌ను దూరం పెడుతుంది లీల. విడాకులు తీసుకుందామని చెబుతుంది. లీల డ్రీమ్ గురించి తెలిసిన తర్వాత ఆమెపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అరవింద్. ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? లీలా జీవితంలోకి వచ్చిన విక్రమ్ ఎవరు? జనని ఎవరు? ఆమెకు అరవింద్‌కు ఉన్న సంబంధం ఏంటి? నిప్పు అంటే అరవింద్‌కు ఎందుకు భయం? హీరోయిన్ కావాలనే లీల కల నెరవేరిందా లేదా? చివరకు వీరిద్దరు విడిపోయారా? లేదా దగ్గరయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది. ‘లవ్ గురు’ కూడా అదే తరహా కథ. ఓ మహిళ కలకు పెళ్లి అడ్డం కాకూడదని, మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే అసలైన ప్రేమ అనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది ఇందులో కొత్తదనమేమి ఉండడు. హీరోతో పెళ్లి హీరోయిన్‌కి ఇష్టం ఉండడు. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ప్రేమను పొందడానికి హీరో రకరకాల ప్రయత్నం చేస్తాడు. చివరకు ఒక్కటవుతారు.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వినోదాత్మకంగా కథనాన్ని సాగించడం లవ్‌గురు ప్రత్యేకత. కేలవం భార్యభర్తల రిలేషన్‌ని మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్‌ని కూడా జోడించడం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. హీరోహీరోయిన్ల పాత్రలతో చాలా మంది కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనేది ఈ సినిమాలో చూపించారు. అరవింద్‌ని ఓ పీడకల వెంటాడే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. మలేసియా నుంచి ఇండియాకు తిరిగి రావడం.. చావు ఇంటిలో లీలను చూసి ఇష్టపడడం.. పెళ్లి చేసుకొని హైదరాబాద్‌కు మకాం మార్చడం వరకు కథనం సింపుల్‌గా సాగుతుంది. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత లీల స్నేహితులు చేసే హంగామ నవ్వులు పూయిస్తాయి. అలాగే విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్ మధ్య జరిగే సంభాషణ కూడా వినోదాన్ని పంచతుంది. యోగిబాబు ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. భార్య ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో చేసే పని షారుక్ ‘రబ్ నే బనా ది జోడి’ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా అంటూ లీల ప్రెండ్స్ చేసే హంగామా బోర్ కొట్టిస్తుంది. అరవింద్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. అరవింద్‌గా విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన హావాభావాలతో మెప్పించారు. లీల పాత్రలో మృణాళిని రవి మెప్పించింది. తన అందంతో తెరపై ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
లవ్ గురు నవ్వులు పంచుతుంది: నిర్మాత రవిశంకర్
‘‘విజయ్ ఆంటోనిగారి ‘బిచ్చగాడు’ సినిమా ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఫేవరెట్ మూవీ. ఆయన నటించిన ‘లవ్ గురు’ సినిమా నవ్వులు పంచుతుంది’’ అన్నారు నిర్మాత రవిశంకర్. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ గురు’. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవుతోంది. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. సోమవారం నిర్వహించిన ‘లవ్ గురు’ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ చాలా బాగుంది. ఈ సినిమా తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి హిట్ అవుతుంది’’ అన్నారు. హీరో, నిర్మాత విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘లవ్ గురు’ కథ విన్నాక నా కెరీర్లో ‘బిచ్చగాడు’ తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని వినాయక్‌కు చెప్పాను. ఈ సినిమాను హిందీలో వినాయక్ డైరెక్షన్లోనే చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ ప్రపంచంలో ప్రేమ ద్వారా ఏదైనా సాధించొచ్చు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం’’ అన్నారు వినాయక్ వైద్యనాథన్. -
'నా భార్యను వన్ సైడ్ లవ్ చేస్తున్నా మావయ్య..'..ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో విజయ్‌ఆంటోని. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'బిచ్చగాడు -2'తో దర్శకుడిగా మారి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం 'రోమియో' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీకి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ కథాచిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూడగానే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోకు ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో లవ్ గురు చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు భరత్ ధనశేఖర్ సంగీతమందించారు. ఈ #LoveGuru చిత్రం specially భార్యామణుల కోసం తీయబడినది 🌹🤔 ▶https://t.co/uzXkprMMcS A Summer Blockbuster. Releasing this Ramzan💥 Telugu Release by @MythriOfficial@vijayantonyfilm @vijayantony @mirnaliniravi @actorvinayak_v #BarathDhanasekar @Bhashyasree @Gskmedia_pr… pic.twitter.com/fPV3Fms1t0 — Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024 -
లవ్ గురులా పరిష్కారాలు చెబుతాను
‘‘మనందరిలో దాదాపు 95 శాతం మందికి ప్రేమ సమస్యలు ఉంటాయి. అమ్మాయిలను హ్యాండిల్ చేయడం అనేది అబ్బాయిలకు పెద్ద సమస్య. మా ‘లవ్‌గురు’ చూస్తే ప్రేమలో అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో అబ్బాయిలకు తెలుస్తుంది. నేను ‘లవ్ గురు’లా పరిష్కారాలు చెబుతాను’’ అని విజయ్ ఆంటోని అన్నారు. విజయ్ ఆంటోని, మృణాళినీ రవి జంటగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘లవ్ గురు’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మా లవ్ గురు’ సినిమా చూసిన తర్వాత పెళ్లి చేసుకున్నవారు, చేసుకోనివారు వారి జీవితాల్లోని మహిళలను మరింత అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు’’ అన్నారు. ‘‘లవ్ గురు’ చిత్రం విజయ్ ఆంటోనీగారి 2.ఓ అనుకోవచ్చు’’ అన్నారు వినాయక్. ‘‘ఈ సినిమాలో లీల పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు మృణాళినీ రవి. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
‘బిచ్చగాడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా తమిళ చిత్రం ‘రోమియో’. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాళినీ రవి హీరోయిన్గా నటిస్తున్నారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌పై విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ ధనశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌కి భాష్యశ్రీ సాహిత్యం అందించగా, ఆదిత్య ఆర్కే పాడారు. ‘‘విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో నటిస్తున్న చిత్రం ‘లవ్ గురు’. ఇందులో మనసుని కదిలించే చెల్లెలి సెంటిమెంట్ కూడా ఉంటుంది. వేసవిలో ఈ చిత్రం విడుదల చేయనున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: ఫరూక్ జే బాష. -
బిచ్చగాడు హీరో రొమాంటిక్ మూవీ.. తెలుగులో ఆసక్తికర టైటిల్!
సంగీత దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్‌ఆంటోని. అంతే కాకుండా సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి నిర్మాతగా కూడా మారారు. గతేడాది పిచ్చైక్కారన్ –2 చిత్రంతో మళ్లీ వరుసగా చిత్రాలు నిర్మిస్తూ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల నటించిన రక్తం చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం విజయ్ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. విజయ్ ఆంటోని నటిస్తోన్న తాజా చిత్రం రోమియో. ఈ చిత్రంలో అతనికి జంటగా మృణాళిని రవి కనిపించనుంది. విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో కాదల్ డిస్టెన్సింగ్, ఐ హేట్యూ ఐ లవ్ యూ సిరీస్-3 యూట్యూబ్ సీరిస్‌కు దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి తెలుగులో లవ్ గురు అనే టైటిల్ ఖరారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి భరత్ ధన శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో యోగిబాబు, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధా శ్రీజ రవి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
మరో క్రేజీ కాన్సెప్ట్ మూవీతో వస్తున్న విజయ్ ఆంటోని
'బిచ్చగాడు' సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోని. ఆయన హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'హిట్లర్'. చెందూర్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై టీడీ రాజా, డీఆర్ సంజయ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ధన నిర్వహించారు. మణిరత్నం శిష్యుడైన ఈయన.. 'వానం కొట్టం' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకున్న ధన.. ఇప్పుడు 'హిట్లర్'తో రాబోతున్నారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) ఈ సినిమాలో ప్రియా సుమన్ హీరోయిన్ కాగా.. గౌతమ్ మేనన్, రెడిన్ కింగ్స్లీ, వివేక్, ప్రసన్న తదితర ఇతర పాత్రలు పోషించారు. వివేక్, మెర్విన్ల ద్వయం సంగీతమందించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం మూవీ టీమ్.. చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు పంచుకున్నారు. ధన ఇంతకుముందు తీసిన 'వానం కొట్టం' చిత్రానికి తాను చాలా పెద్ద అభిమానినని.. ఈ చిత్రాన్ని చాలా తక్కువ రోజుల్లో అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని .. ఒక వ్యక్తి సర్వాధికారాన్ని ప్రశ్నించే కథా చిత్రంగా 'హిట్లర్' ఉంటుందని హీరో విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
హిట్లర్ యాక్షన్
విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జంటగా నటించిన చిత్రం ‘హిట్లర్’. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ ΄పౌరుడి కథే ‘హిట్లర్’. ఈ మూవీలో లవ్ ట్రాక్‌కి కూడా ్రపాధాన్యత ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ ‘హిట్లర్’లో కిల్లర్‌గా విజయ్ ఆంటోని కొత్త లుక్‌లో, క్యారెక్టరైజేషన్లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
'మీరా బంగారం..' విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్ పోస్ట్
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కాసేపు కనిపించకపోతేనే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అలాంటిది చిన్నవయసులోనే కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఇలాంటి కడుపుకోతనే అనుభవిస్తున్నారు హీరో విజయ్ ఆంటోని దంపతులు. ఇటీవల విజయ్ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మీరా బంగారం.. నవ్వుతూ తుళ్లుతూ కళ్లముందు తిరిగే కూతురు ఇక లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు విజయ్, అతడి భార్య ఫాతిమా ఆంటోని. తాజాగా ఫాతిమా.. మీరాను గుర్తు చేసుకుంటూ ఎమోషనలైంది. 'మీరా బంగారం.. ఎందుకింత త్వరగా వెళ్లిపోయావమ్మా.. ఇప్పటికీ మేమిది నమ్మలేకపోతున్నాం. నీ స్పర్శ కోసం నీ పియానో ఎదురుచూస్తోంది తల్లీ.. నీ అమ్మను నేనిక్కడ ఉంటే నన్ను కాదని వెళ్లిపోయావా.. బహుశా ఈ ప్రపంచం నీ కోసం కాదేమో! నిన్ను కలిసేవరకు.. ఈ చావుబతుకుల మధ్య ఉండే గీత నాకు అర్థం కావట్లేదు. నేను నిన్ను కలిసేవరకు ఈ బాధ నాకు తప్పదు. అక్కడ బాగా తిని విశ్రాంతి తీసుకో అమ్మా. లారా(మీరా చెల్లెలు) కూడా నిన్ను ఎంతో మిస్ అవుతోంది..' అంటూ ఎక్స్(ట్విటర్)లో కూతురితో కలిసి దిగిన ఓ పాత ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారగా బాధపడకండి మేడమ్ అంటూ నెటిజన్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. MeeraThangam ur piano waits and longs for ur touch,as we r all still in disbelief,ur gone too soon baby,May be this world is not for you,but Amma is yet here,can’t understand the concept between life and death I’ve blanked outUntil I meet u eat well and stay happy,laara misses😭 pic.twitter.com/Uif0x8lNQC — Fatima Meera Vijay Antony (@mrsvijayantony) December 10, 2023 చదవండి: సినీ నటితో 'యానిమల్' నటుడి వివాహం -
విజయ్ ఆంటోనితో నాకు ఎలాంటి సంబంధం లేదు: హీరోయిన్
కోలీవుడ్‌లో నటి అనూయకు మంచి గుర్తింపే ఉంది. 'శివ మనసుల శక్తి' చిత్రంలో నటుడు జీవాతో జత కట్టి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఒరుకల్ఒరు కన్నాడి, మదురై సంభవం, నన్బన్ తదితర చిత్రాల్లో నటించింది. తమిళ బిగ్‌బాస్ సీజన్-1లో కూడా అడుగుపెట్టింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈ భామ ఐటెం సాంగ్స్‌లోనూ నటించడానికి వెనుకాడ లేదు. అయితే అలా శృంగార తారగా అందాలు ఆరబోసిన అవకాశాలు లేకపోవడంతో ఈమె పూర్తిగా తెరమరుగయ్యారనే చెప్పాలి. అయితే తరచూ తన గ్లామరస్ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ తన అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేస్తోంది. కాగా ఇటీవల తన ఇన్ స్ట్రాగామ్ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భాన్ని అనూయ పేర్కొంటూ తాను దుబాయ్‌లో పుట్టి పెరిగానని చెప్పింది. ఇంజనీరింగ్ పూర్తి చేశానని, కాగా తనకు సంబంధం లేకపోయినా నటుడు విజయ్ ఆంటోని, సుందర్ సి, జీవాతో తనను కలుపుతూ వదంతులు ప్రచారం చేశారని చెప్పింది. తాను ఎవరితోనూ రిలేషన్షిప్లో లేకున్నా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి ప్రచారాలు అన్నీ అవాస్తవాలు కావడంతో తాను పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది. తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నానని తెలిపింది. దీంతో ఎందుకు ఒంటరిగా ఉన్నారు? పెళ్లి చేసుకోవచ్చుగా అన్న ఒక అభిమాని ప్రశ్నకు అనూయ బదిలీస్తూ తన చుట్టూ మంచి మగవాళ్లెవరూ లేరని చెప్పింది. దీంతో అనూయ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు. అనూయ హీరో విజయ్ చిత్రం అయిన స్నేహితుడులో నటించింది. ఆ చిత్రంలో వారి ప్రొఫెసర్ పాత్రలో కనిపించిన సత్యరాజ్‌కు కూతురిగా ఆమె మెప్పించింది. -
విజయ్ ఆంటోని అలాంటివాడు.. ఈగో లేకుండా..: సత్యరాజ్
నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వల్లి మయిల్. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా కోలీవుడ్‌లో హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఇందులో నటుడు సత్యరాజ్, దర్శకుడు భారతీరాజా, రెడిన్ కింగ్స్లీ, జీపీ ముత్తు ముఖ్యపాత్రలు పోషించారు. ఇంతకుముందు జీవా, పాండినాడు, అళగర్‌సామియిన్ కుదిరై వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సుశీంద్రన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం వల్లి మయిల్. విజయ్.. నిరాడంబర వ్యక్తి నల్లుసామి పతాకంపై డీఎన్ తాయ్ శరవణన్ నిర్మించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సుశీంద్రన్ మాట్లాడుతూ.. విజయ్ ఆంటోని హీరోగా ఈ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. సత్యరాజ్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని చాలా నిరాడంబర వ్యక్తి అని, చాలా యథార్థంగా మాట్లాడతారని అన్నారు. అప్పుడు ఎంజీఆర్.. ఇప్పుడు విజయ్ ఆంటోని హీరోయిన్ పేరుతో రూపొందే చిత్రాల్లో నటించడానికి హీరోలు సాధారణంగా అంగీకరించరని, ఈగో అడ్డుపడుతుందని అన్నారు. అయితే అప్పట్లో ఎంజీఆర్.. రాజకుమారి, చంద్రలేఖ, అదేవిధంగా రజనీకాంత్.. చంద్రముఖి వంటి హీరోయిన్ పేర్లతో కూడిన చిత్రాల్లో నటించారన్నారు. అలా ఈ వల్లి మయిల్ చిత్రంలో విజయ్ ఆంటోని నటించారని చెప్పారు. కాగా ఇలాంటి సాఫ్ట్ టైటిల్ దర్శకుడు సుశీంద్రన్ రాజకీయ నేపథ్యంలో కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని సత్యరాజ్ ప్రశంసించారు. చదవండి: తెలంగాణ ఎన్నికలు.. ఓటేసిన సెలబ్రిటీలు -
‘విక్రమ్ రాథోడ్’గా వస్తున్న విజయ్ ఆంటోనీ
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. రీసెంట్‌గానే బిచ్చగాడు 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా(తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్ రాథోడ్’. అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్.కౌశల్యా రాణి నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను తెలుగులో ఒ.బాబూరావు, జీపీఎస్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. -
నెలలోపే ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ హీరో సినిమా!
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ ఏడాది బిచ్చగాడు-2 (పిచ్చైక్కారన్ 2) చిత్రంతో మరో హిట్ అందుకున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటిస్తోన్న నటుడు విజయ్ తాజాగా నటించిన చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రానికి సీఎస్ అముదాన్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 3వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రం విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన నటి మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యానంబీశన్ ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషం.ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. #Raththam from November 3rd on @PrimeVideoIN 🩸 pic.twitter.com/0S7VbGaNvL — vijayantony (@vijayantony) October 31, 2023 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!
విజయ్ ఆంటోని, నందితాశ్వేతా, రమ్యానంభీశన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సీఎస్ అముదమ్ దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకుముందు తమిళ్ పడం, తమిళ్‌పడమ్–2 వంటి వినోదభరిత కథాచిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పూర్తి భిన్నంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొందించారు. ఇటీవలే బిచ్చగాడు-2 సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్ ఆంటోని. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కథేంటంటే.. ముఖ్యంగా మీడియా నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం రత్తం. చిత్ర ప్రారంభంలోనే ఒక పత్రిక సహాయ సంపాదకుడిని ఆయన కార్యాలయంలోనే ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేస్తాడు. చనిపోయిన వ్యక్తి విజయ్ ఆంటోనికి మిత్రుడు. కాగా ఇంతకుముందు పత్రికలో పనిచేసిన విజయ్‌ఆంటోని ఈ తరువాత జర్నలిజానికి దూరంగా వేరే ప్రపంచంలో జీవిస్తుంటారు. అలాంటిది ఆయన మళ్లీ మీడియా ప్రపంచంలోకి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కారణం ఏమిటి? జరుగుతున్న హత్యలకు కారణం ఎవరూ? వంటి అంశాలపై ఆయన ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. అయితే ఆ మిస్టరీని ఆయన ఛేదిస్తారా? అందుకు ఎలాంటి సాహసానికి పూనుకుంటారు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం రత్తం. ఇటీవలే విడుదలైన ఈ చిత్రాని ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విషాదం కాగా.. ఇటీవలే విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కుమార్తె మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడింది. -
సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించేదాన్ని కాదు: విజయ్ ఆంటోనీ భార్య
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది.ఈ ఘటనతో వారి కుటుంబం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేని స్థితిలో ఉంది. మీరా మరణానంతరం మరో కుమార్తె లారా ఆంటోనీని తాము వెళుతున్న అన్ని చోట్లకు విజయ్ ఆంటోనీ దంపతులు తీసుకెళ్తున్నారు. తాజాగా విజయ్ కొత్త సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి కూడా తన రెండో కుమార్తె లారాను వెంటబెట్టుకుని వెళ్లారు. (ఇదీ చదవండి: ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వార్నింగ్ ఇచ్చిన అరియాన) విజయ్ ఆంటోనీ పలు సినిమాలతో నిత్యం బిజీగా ఉండటం వల్ల ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా వారి సొంత నిర్మాణ సంస్థ బాధ్యతలు స్వీకరించి అన్నీ తానై నడిపిస్తోంది. అలా నిత్యం వారిద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటున్నారు. ఇప్పటికే విజయ్ నిర్మాణంలో వచ్చిన పలు సినిమాల భాద్యతలను ఫాతిమానే దగ్గరుండి చూశారు. అలా సినిమా నిర్మాణ రంగంలో ఆమెకు మంచి అనుభవంతో పాటు గుర్తింపు ఉంది. కుమార్తె మీరా మరణం నేపథ్యంలో ఫాతిమా ఆంటోనీ తాజాగా ట్వీట్ చేశారు. మీరాను మరోసారి గుర్తుచేసుకుని తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. 'నువ్వు 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని నాకు తెలిస్తే.. నిన్ను నాకు మరింత దగ్గరగా ఉంచుకునే దానిని. కనీసం నిన్ను సూర్యచంద్రులకు కూడా చూపించకుండా నేను దాచుకునే దాన్ని. ప్రస్తుతం నువ్వు మా మధ్య లేకపోవడంతో ఎప్పుడూ నీ ఆలోచనలలో మునిగిపోయి చచ్చిపోతున్నాను. నువ్వు లేకుండా మేము జీవించడం కష్టంగా ఉంది. ఈ అమ్మ- నాన్న దగ్గరకి తిరిగి వచ్చేయ్ అమ్మా.. నీ కోసం నీ చెల్లెలు ఎదురుచూస్తూనే ఉంది. లవ్ యు తంగం.' అని తన ఎక్స్ (ట్విటర్)లో తెలిపారు. If I’d known u will live only for 16 yrs, I would have just kept u very very close to me,not even shown you to the sun and moon,am drowning and dying with ur thoughts,can’t live without you ,come back to babba and amma.laara keeps waiting for u,love u Thangam@vijayantony pic.twitter.com/7PAQ5Ji9qp — Fatima Meera Vijay Antony (@mrsvijayantony) October 9, 2023 -
బాధలో కూడా ప్రమోషన్స్..
-
కూతురు లేదన్న బాధను దిగమింగుకుంటూ ప్రమోషన్స్
-
అదిరిపోయే కాంబినేషన్లో 'హిట్లర్'గా వస్తున్న విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ.. విభిన్నమైన కథలతో పాటు తన సూపర్ టాలెంట్‌తో సినీ ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. బిచ్చగాడు2తో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని ఆ తర్వాత 'హత్య' అంటూ పలకరించినా అది పెద్దగా మెప్పించలేదు. తాజాగా మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. దానికి హిట్లర్ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ పేరుతో ఇప్పటికే చిరంజీవి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. దీంతో సులభంగా హిట్లర్ పేరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుందనే ఈ టైటిల్ పెట్టినట్లు టాక్. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటం విశేషం. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్‌గా హిట్లర్ సినిమాను నిర్మిస్తోంది. (ఇదీ చదవండి; నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్) విజయ్ ఆంటోనీతో గతంలో ‘విజయ్ రాఘవన్’ మూవీని నిర్మించిన వారు ఆయనతో మరో సినిమా చేస్తుండటం విశేషం. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలుగా ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. అయితే దీనిని అన్ని భాషల్లో లాంచ్ చేశారు. 'హిట్లర్' సినిమా గురించి చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. 'ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఒక నియంతను ఎదుర్కొనే సాధారణ పౌరుడి కథే హిట్లర్.' అని చెప్పారు. మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. ట్రైన్ జర్నీలో ఉన్న విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ను ఎదుర్కొన్నట్లు చూపించారు. ఇదే ట్రైన్లో హీరోయిన్ రియా సుమన్‌ను హీరో కలుసుకుంటాడు. గన్ పేలుస్తూ గౌతమ్ మీనన్ కొత్త లుక్‌లో కనిపించారు. త్రీడీ యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ మోషన్ పోస్టర్లో చివరగా విజయ్ ఆంటోని జోకర్ గెటప్‌లో దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఇదీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. -
దు:ఖంలోనూ చిన్న కూతురితో ప్రమోషన్లకు వచ్చిన విజయ్ ఆంటోనీ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట ఈ మధ్య జరిగిన విషాదం గురించి అందరికీ తెలిసిందే.. 16 ఏళ్ల వయసులోనే ఆయన కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచి వేసింది. కూతురు చనిపోవడంతో విజయ్ ఎంతగానో కృంగిపోయాడు. ఈ బాధలో ఇప్పటి వరకు కనీసం ఆయన బయటకు కూడా రాలేదు. తన కుటుంబ సభ్యులు సరిగ్గా భోజనం కూడా చేయడంలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇంతటి దు:ఖంలోనూ ఆయన తన తోటీ నటీనటులు, దర్శకనిర్మాతల కోసం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. (ఇదీ చదవండి; థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా) సాదారణంగా చాలామంది నటీనటులు సినిమా షూట్ పూర్తి అయిన తర్వాతో ఎదో కారణం చెప్పి సినిమా ప్రమోషన్లుకు రాకుండా నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంటారు. కానీ కన్నకూతురు చనిపోయినా తన సనిమా విడుదల దగ్గర్లో ఉండటంతో ఆయన నిర్మాతల గురించి ఆలోచించి తన చిన్న కూతురుతో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. కూతురును కోల్పోయిన పది రోజుల్లోనే విజయ్ ఆంటోనీ ఆ బాధను దింగమింగుకుని మరీ.. తన సినిమా ప్రమోషన్లో పాల్గొనడం అందరినీ ఆలోచింప జేసేలా చేసింది. వ్యక్తిగత సమస్యల వల్ల సినిమాకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో విజయ్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారని తెలిసింది. విజయ్ హీరోగా సీఎస్ ఆముదన్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం 'రత్తం'. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు విడదల విషయంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. విజయ్ పరిస్థితిని చూసి ఈ చిత్రాన్ని మళ్లీ వాయిదా వేసేందుకు రెడీ అయ్యారు. అలా చేస్తే నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని విజయ్ ఈ సినిమాను ముందుగా అనుకున్న అక్టోబరు 6న రిలీజ్ చేయండి అని చెప్పారట. అందుకు అంగీకరించిన మూవీ టీమ్ చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విజయ్ ఆంటోనీ తన రెండో కూతురితో కలిసి పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలు కూడా విడుదలయ్యాయి. దీంతో ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్ నిబద్ధత కలిగిన నటుడంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా తమిళ్లో మాత్రమే విడుదల అవుతుంది. త్వరలో తెలుగులో కూడా విడుదల కానుంది. #VijayAntony's Daughter #Lara at the Raththam press meet❤️@vijayantony @mrsvijayantony #Raththam #Galatta pic.twitter.com/jbg63rDcUy — Galatta Media (@galattadotcom) September 28, 2023 #VijayAntony arrives at #Raththam press meet with his second daughter Lara. pic.twitter.com/jkFCL750dv — Chennai Times (@ChennaiTimesTOI) September 28, 2023 -
ఇంతటి దుఃఖంలో కూడా విడుదల ఆపొద్దని చెప్పిన విజయ్ ఆంటోనీ.. కారణమిదే
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం ఇప్పటికీ శోకసంద్రంలోనే ఉంది. మీరాతో పాటు తాను కూడా మరణించానని ఆయన తెలిపాడు. కంటికి రెప్పలా చూసుకున్న బిడ్డ చనిపోతే ఏ తండ్రి అయినా పడే బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన కుటుంబం మొత్తం ఇంత దుఃఖంలో ఉన్నా తన కొత్త సినిమా 'రత్తం' విడుదల ఆపకూడదని నిర్ణయించుకోవడం విశేషం. (ఇదీ చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బాలకృష్ణ) దీనికి ప్రధాన కారణం ఇప్పటికే ఆ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. దీంతో నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని ఆయన భావించాడట. ముందుగా అనుకున్న సమయానికే చిత్రం అక్టోబర్ 6న తమిళ్లో విడుదలవుతోందని మేకర్స్ ప్రకటించారు.తెలుగు వర్షన్ విడుదల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రెండు వారాల క్రితం నుంచే రత్తం సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టారు. బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్లను కూడా ముందస్తుగానే లాక్ చేసుకున్నారు. తీరా ఇలాంటి సమయంలో సినిమా వాయిదా పడితే నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని విజయ్ ఆంటోనీ భావించారట. చెన్నైలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస హత్యల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీఎస్ ఆముధన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో పరిశోధక అధికారిగా, భిన్న కోణాలున్న వ్యక్తిగా కనిపించనున్నారు విజయ్. చెన్నైలో జరిగిన ఈ వరుస హత్యల కారణంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కొందరు మంత్రుల రాజీనామాకు కూడా దారితీసింది. ఈ సన్నివేశాల్ని ఎంతో ఆకట్టుకునే విధంగా దర్శకుడు చూపించిన తీరు సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో నందితా శ్వేత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. మీడియా, రాజకీయ, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఈ మూవీలో ప్రధానంగా చూపించారని తెలుస్తోంది. -
విజయ్ ఆంటోని కూతుర్ని తలుచుకుని విశాల్ ఎమోషనల్
హీరో విశాల్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటోని. సునీల్, నటి రీతూవర్మ, అభినయకింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్‌కుమార్ నిర్మించారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించిన మార్క్ ఆంటోనీ చిత్రం ఈనెల 15న విడుదలవగా ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయవంతంగా ప్రదర్శిమవుతోంది. ఈ చిత్రం దాదాపు రూ.65 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నెలో జరిగిన సక్సెస్ మీట్లో విశాల్ మాట్లాడుతూ.. ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం ఒక్క వ్యక్తికి అంత సాధ్యం కాదన్నారు. దాన్ని నిర్మాత వినోద్‌కుమార్ సుసాధ్యం చేశారని అభినందించారు. ఈ చిత్రంలోని ఒక పాట కోసమే దాదాపు కోటిన్నర ఖర్చు చేశారని తెలిపారు. గజనీ మహ్మద్ 18 ఏళ్లు దండయాత్ర చేసి గెలిచినట్లు తాను 11 ఏళ్ల పోరాటం తర్వాత వచ్చిన విజయమే ఈ చిత్రం అన్నారు. ఈ చిత్రం ద్వారా తనకు దర్శకుడు అధిక్ రవిచంద్రన్, నటుడు సునీల్ వంటి మంచి మిత్రులు లభించారని పేర్కొన్నారు. యూనిట్ సభ్యులందరూ తమ చిత్రంగా భావించి మార్క్ ఆంటోనీ కోసం ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. ఈ చిత్రం హిట్ అవుతుందని ముందే భావించాం.. కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు విశాల్ పేర్కొన్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా మరణంపై స్పందిస్తూ ఆయన స్టేజీపై ఎమోషనలయ్యారు. విజయ్ తన కాలేజ్‌మేట్ అని పేర్కొన్న విశాల్.. మీరా ఆత్మకు శాంతి చేకూరాలంటూ కాసేపు మౌనం పాటించారు. తన తాను ఇంతకుముందు కొన్ని చిత్రాలు నిర్మించినా, మార్క్ ఆంటోని తన జీవితంలో మరిచిపోలేని చిత్రం అని నిర్మాత వినోద్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బుర్ర తక్కువ బాలయ్య -
కుమార్తె మృతిపై స్పందించిన విజయ్ ఆంటోనీ.. కన్నీరు పెట్టిస్తున్న వ్యాఖ్యలు
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం గత రెండు రోజులుగా శోకసంద్రంలోనే ఉంది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ఎక్స్(ట్విటర్) వేదికగా తాజాగా స్పందించారు. అందులో ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన కుమార్తెతో పాటు తాను కూడా చనిపోయానని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. (ఇదీ చదవండి: విజయ్ ఆంటోని కూతురు మృతితో సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్) 'నా పెద్ద కుమార్తె ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రదేశానికి వెళ్లింది. నా కూతురు మీరా ఎంతో ప్రేమగా, ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి ఆమె వెళ్లిపోయింది. మీరా ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. ఎందుకంటే తనతో పాటే నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను.' అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు. మీరా మృతిపై అందరి హృదయాలను కదిలించే నోట్‌ను విజయ్ ఆంటోనీ షేర్ చేశారు. దీంతో ఆయన అభిమానులతో పాటు నెటిజన్లను కూడా దానిని చూసి కంటతడి పెడుతున్నారు. నిర్మాత ఫాతిమాను విజయ్ 2006లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా బలవన్మరణానికి పాల్పడిన పెద్ద కుమార్తె చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. -
విజయ్ ఆంటోని కూతురు మృతితో సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్
విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్యతో తమిళ చిత్రసీమ తీవ్రమైన శోకంలో ఉంది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అంతకుముందే నటుడు మరిముత్తు మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాంటి సమయాల్లో వార్తాపత్రికలతో పాటు పలు యూట్యూబ్ చానెళ్ల కార్యకలాపాలు పలు వివాదాలకు కారణమయ్యాయి. దీంతో ప్రముఖుల మృతి ఘటనల్లో మీడియాను అనుమతించబోమని సంచలన నిర్ణయాన్ని కోలీవుడ్ తీసుకుంది. అసలు కారణం ఏంటి..? కోలీవుడ్‌లో ఈ మధ్యే జైలర్ నటుడు మరిముత్తు గుండెపోటుతో మరణించారు. ఆ విషాదం మరిచిపోకముందే విజయ్ ఆంటోనీ కుమార్తె మరణించడంతో ఇండస్ట్రీతో పాటు పలువురిని కలచివేసింది. ఈ నేపథ్యంలో వారికి నివాళిలు పలువరు ప్రముఖులు అర్పించారు. ఆ సమయంలో తమిళ ప్రముఖ మీడియా ఛానల్స్‌తో పాటు యూట్యూబ్ సిబ్బంది వ్యవహరించిన తీరు తమిళనాట చర్చనీయాంశం అయింది. నివాళులర్పించేందుకు వచ్చే సెలబ్రిటీలతో పోటీపడి మైక్‌లు పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి ఆ వీడియోలకు తప్పుడు తంబ్‌నైల్స్ పెట్టి వ్యూవ్స్ కోసం పలు యూట్యూబ్ ఛానెల్‌లు పోటీపడ్డాయి. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఊహించని షాకిచ్చిన పోలీసులు) అంతేకాకుండా అంత్యక్రియల సమయంలో శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పలు ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెరపైకి వచ్చింది. మీడియా, యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఇలాంటి కార్యకలాపాలపై సినీ పరిశ్రమ నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ నటులు వివేక్, మైలస్వామి, మనోబాల మృతి ఘటనల్లో కూడా మీడియా ఇలాగే ప్రవర్తించిదని వారు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల మృతికి సంబంధించిన సంఘటనలకు మీడియాను అనుమతించబోమని నిర్మాతల సంఘం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీరాజా ప్రకటన చేశారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే సమాజంలో ఈ నిర్ణయాన్ని మీడియా గౌరవించాలని ఆయన కోరారు. ఒక వ్యక్తి చనిపోతే ఎక్కువ నష్టం బాధిత కుటుంబానికే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీడియా వారికి ఏమైనా సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల అనుమతి ఉన్నా కూడా చనిపోయిన వారి ఇంటి వద్దకు ఎలాంటి మీడియా వారికి అనుమతి ఉండదని ఆయన ప్రకటించారు. -
ఆ భయమే మీరాను ఆత్మహత్య చేసుకునేలా చేసిందా? ఏం జరిగింది?
కూతురి ఆత్మహత్యతో విజయ్ ఆంటోని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 12వ తరగతి చదువుతున్న మీరా మీరా సూసైడ్ ఘటన కోలీవుడ్‌ను షాక్‌కి గురి చేస్తోంది. ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నదానిపై పలువురు చర్చిస్తున్నారు. అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి మాత్రమే అని తెలుస్తోంది. చదువుల కారణంగా మీరా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో కుంగిపోతోందని, కొంతకాలంగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మీరా ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ విజయ్ ఆంటోనీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ మాట్లాడుతూ.. మీరా మృతిపై కీలక విషయాలు వెల్లడించింది. ''మీరాకు చీకటి అంటే చాలా భయమని వాళ్ల నానమ్మ(విజయ్ అంటోని తల్లి) చెప్పింది. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, చీకట్లో కాసేపు ఉండాలన్నా హడలిపోయేదని, అలాంటి అమ్మాయి ఇంతటి కఠిన నిర్ణయం ఎలా ధైర్యం చేసి తీసుకుందో అర్థం కావడం లేదు. పిల్లల్ని ఎంతగానో ప్రేమించే విజయ్‌కి ఇలా జరగడం చాలా దురదృష్టకరం'' అంటూ ఆమె వెల్లడించింది. ఈ క్రమంలో భయం, డిప్రెషన్ వంటి సున్నితమైన అంశాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. భయం ఒక్కోక్కరికి ఒక్కో విధంగా ఉండొచ్చు. కొందరు ఇంట్లో ఇంటరిగా ఉండాలంటే భయపడతారు, మరికొందరు స్నానం చేయడానికి, చీకట్లో ఉండేందుకు విపరీతంగా భయపడుతుంటారు. నీళ్ళని చూసినా, మెట్లెక్కుతూ కిందకి చూసినా, సముద్రాన్ని చూసినా భయపడిపోతుంటారు. ఇదొక సాధారణ మానసిక సమస్య. దీనికి మందుల ద్వారా, సిస్టమాటిక్ డీ సెన్సిటైజేషన్ అనే కౌన్సిలింగ్ ద్వారా నయం చెయ్యొచ్చు. ఈ ఫోబియా నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం.. దేన్నుంచి అయితే భయపడుతున్నారో ఆ పనుల్ని నిరంతరం చేస్తూ ఉండటం. ఉదాహరణకు మీకు డ్రైవింగ్ అంటే భయమనుకోండి. అదే పనిని జాగ్రత్తగా మళ్లీమళ్లీ చేయడానికి అలవాడుపడండి. కొందరికి ఫోబియా ఉంటుంది. ఉదాహరణకు.. బొద్దింక అంటే భయం ఉన్నప్పుడు ఒక గాజు గ్లాసు దాని మీద బోర్లించి ఓ నిమిషం దాన్ని చూస్తూ గడపడం. దీని వల్ల ఆ ఫోబియా నుంచి బయట పడవచ్చునంటారు మానసిక శాస్త్రవేత్తలు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించొద్దు. శారీరక సౌష్టవం కోసం ఎంత శ్రద్ద పెడుతున్నామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఇందుకోసం మంచి ఆహరం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఇష్టమైన వాళ్లతో మాట్లాడటం, తమ సమస్యలను స్నేహితులతో పంచుకోవడం వంటివి చేయాలి. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ అన్నట్లు.. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి, ఆందోళన, నిరుత్సాహం మనిషిని మానసిక రోగులుగా మార్చతాయి. దీనికి ఒక్కటే మార్గం. పాజిటివ్ థింకింగ్. భయాన్ని తక్కువ చేసి చూడటం.. ధైర్యంగా ముందుకెళ్లడం ఇవే నివారణ మార్గాలు’’. இது எல்லாமே ஒரு Teacher கவனிச்சா Students-க்கு Help பண்ணமுடியும் ! - Archana | Psychiatrist #MentalHealthAwareness #Mentalhealth #Psychiatrist #mentalwellness #VijayAntonyDaughter #VijayAntony #ssmusic pic.twitter.com/pFc2iTJ2Li — SS Music (@SSMusicTweet) September 21, 2023 இப்பவும் இவருக்கு இந்த இழப்புன்றத ஏத்துக்கவே முடியல 😭#VijayAntony pic.twitter.com/r4tg1TByzo — Monkey Cinema (@monkey_cinema) September 21, 2023 -
విజయ్ ఆంటోని కూతురి సూసైడ్ నోట్ వైరల్?
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతే ఆ బాధను జీర్ణించుకోవడం ఎవరితరమూ కాదు. కళ్ల ముందు ఆడుతూపాడుతూ తిరిగే కూతురు ఇక కనిపించదన్న వాస్తవాన్ని క్షణమైనా భరించలేరు పేరెంట్స్. అయినా సరే, భగవంతుడు కొందరికి అటువంటి శిక్షలే వేస్తాడు. భరించలేని బాధను ఇస్తాడు. హీరో విజయ్ ఆంటోని సైతం ప్రస్తుతం అదే బాధతో కుమిలిపోతున్నాడు. మిస్ యూ ఆల్ ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే కదా! సెప్టెంబర్ 19న తెల్లవారుజామున ఉరి వేసుకుని మరణించింది. అయితే ఆమె గదిలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది. తమిళ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. చెన్నై పోలీసులు ఆమె రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మీరా.. తన స్నేహితులను, టీచర్స్‌ను మిస్ అవుతానని రాసుకొచ్చింది. తన మరణం వల్ల కుటుంబం బాధపడుతుందని పేర్కొంది. చివర్లో.. లవ్ యూ ఆల్.. మిస్ యూ ఆల్ అని రాసింది . ఈ లెటర్‌ను ఆమె నోట్‌బుక్‌లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? ఇక విగతజీవిగా పడి ఉన్న కూతుర్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది ఆమె తల్లి ఫాతిమా. 'నిన్ను నా గర్భంలో మోశానమ్మా.. నాతో ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా?' అని కంటికి ధారగా ఏడ్చేసింది. కూతురితో చివరిసారిగా ఫాతిమా మాట్లాడిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. చీకటి అంటే భయమున్న మీరా ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? నిజంగానే డిప్రెషన్లో ఉందా? మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: మీరాకు కన్నీటి వీడ్కోలు.. భౌతికకాయం చూసి విద్యార్థుల కంటతడి! 3 ఇడియట్స్ నటుడు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య -
ముగిసిన మీరా అంత్యక్రియలు.. బోరున విలపించిన విజయ్ దంపతులు!
విజయ్ ఆంటోనీ కూతురు మీరాకు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఓమందూర్ ఆసుపత్రి నుంచి మీరా మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానిక నుంగమ్‌బాక్కమ్‌లోని చర్చికి తరలించారు. అక్కడ ప్రార్థనల అనంతరం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మీరా పార్థీవ దేహానికి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు కార్తీ, సత్తిరాజ్, శింబు, భరత్, సిబి రాజ్, దర్శకులు భారతీ రాజా, శశి, మిష్కిన్, సుశీంద్రన్, ఎడిటర్ మోహన్, మోసన్రాజా, ఎస్ఆర్ ప్రభు, సతీష్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, ప్రభుదేవా, నటి సుధ పలువురు మీరాకు నివాళులర్పించారు. మీరా చదువుకున్న పాఠశాల నిర్వాహకులు, సహ విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు ఆమె భౌతికాయాన్ని చూడటానికి పెద్దఎత్తున తరలివచ్చారు. మీరా భౌతికకాయాన్ని చూసిన పలువురు విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో మీరా భౌతికాయానికి స్థానిక కీల్పాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిక్రియల సమయంలో మీరా తల్లి ఫాతిమా విజయ్ ఆంటోని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది. మీరా సూసైడ్ కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ(16) బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ(16) బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో విజయ్‌కు ధైర్యం చెప్పారు. తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన ప్రతి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పించింది. పిల్లల పట్ల కన్నవారికి ఎంత ప్రేమ ఉంటుందో.. ఇలాంటి సమయంలో బాధను భరించడం చాలా కష్టంగానే ఉంటుంది. ఈ విషాద సమయంలో విజయ్ ఆంటోనీకి కోలీవుడ్ పరిశ్రమ అండగా నిలిచింది. అయితే తమ పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో విజయ్ భార్య ఫాతిమా పోస్ట్ చూస్తేనే అర్థమవుతోంది. గతంలో ఆమె తన పెద్దకూతురి పట్ల చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ విషాద సమయంలో విజయ్, ఆయన భార్య ఫాతిమా ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. పిల్లలపై వారి ప్రేమను తెలిపేందుకు ఈ ట్వీట్ నిదర్శనం. ఫాతిమా తన కుమార్తె మీరా పాఠశాలలో సాధించిన విజయాల గురించి చేసిన పాత పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. మార్చిలో ఫాతిమా తన కూతురు మీరా స్కూల్ యూనిఫాంతో ఉన్న చిత్రాన్ని పంచుకుంది. ట్వీట్లో రాస్తూ.. 'నా బలం వెనుక ఉన్న శక్తి, నా కన్నీళ్లకు ఓదార్పు, నా ఒత్తిడికి కారణం(నీ కొంటెతనం సూపర్)నా తంగకట్టి-చెల్లకుట్టి. మీరా విజయ్ ఆంటోనీ కంగ్రాట్స్ బేబీ’.' అంటూ పోస్ట్ చేసింది. కుమార్తె మరణం తర్వాత ఫాతిమా చేసిన పాత పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ ఆంటోనీ, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జయం రవి, ఆర్జే బాలాజీ, శరత్‌కుమార్, పలువురు తారలు సంతాపం తెలిపారు. కాగా.. విజయ్ భార్య ఫాతిమా ఫిల్మ్ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. విజయ్ సినిమాలకు సైతం నిర్మాతగా వ్యవహరించారు. The Force behind my strength,the consolations to my tears,the reason for my stress(Naughtiness super loaded)my Thangakatti-chellakutty. Meera Vijay Antony ,Congrats Baby 🤗❤️🥰🔥🔥🔥 pic.twitter.com/yfTTdIiAjL — Fatima (@mrsvijayantony) March 12, 2023 -
విజయ్ ఆంటోని కూతురు సూసైడ్.. టీనేజీ వయసులోనే డిప్రెషన్
ఈ మధ్య కాలంలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. జీవితంలో ఏదో కోల్పోయిన పీలింగ్‌తో డిప్రెషన్‌కు లోవుతున్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకసారి ఒంటితనంతో బాధపడ్డవాళ్లే. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యామనో, పేదరికం, ప్రేమలో విఫలమవ్వడం, ఉద్యోగం లేకపోవడం, పనిలో ఒత్తిడి.. ఇలా ఎన్నో కారణాలు డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. ప్రపంచంలో సగటున 40 శాతం మంది ‘డిప్రెషన్’ డిజార్డర్స్‌తో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదో జరిగిపోతుందని, తమతో ఎవరూ లేరన్న ఒంటిరి ఫీలింగ్ మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించడమే అతిపెద్ద తప్పు. మీలాగే లక్షలాది మంది ఏదో ఒక కారణంతో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అంతమాత్రాన ప్రాణం తీసుకోకూడదు. సాధారణంగా సినిమా స్టార్స్‌ని చూడగానే,వాళ్లకేంటి సంతోషంగా ఉన్నారని అనుకుంటాం. కానీ యటకు బాగానే కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల వాళ్లు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. దీపికా పదుకొణె దగ్గర్నుంచి కాజల్ అగర్వాల్ వరకు డిప్రెషన్ నుంచి బయటపడినవాళ్లే. ఇదేం అంత పెద్ద సమస్య కాదు, అలా అని తేలిగ్గా తీసుకునే విషయం కూడా కాదు. సమస్యను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డాం అనేది ముఖ్యం. తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ ఆత్యహత్యతో కోలీవుడ్ ఇండస్ట్రీ షాక్‌కి గురయ్యింది. టీనేజీ వయసులోనే డిప్రెషన్‌తో మీరా సూసైడ్ చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న మీరా మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. గత కొన్నాళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న మీరా అందుకు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. కానీ అంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మీరా డిప్రెషన్‌కు చదువల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ఈరోజుల్లో పిల్లలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ర్యాంకుల వెంట పడిపోయి పేరెంట్స్ పిల్లలను ప్రెజర్ చేయొద్దని సూచించారు. అలాంటిది ఈరోజు ఆయన కూతురే డిప్రెషన్‌తో చనిపోవడం తీరని విషాదాన్ని నింపుతుంది. Stay strong @vijayantony brother#VijayAntony| #Meera| #MeeraVijayAntonypic.twitter.com/01Fbf3RtvN — SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023 మీరా ఆ నిర్ణయం తీసుకునేముందు ఒక్కసారి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే బాగుండేదని, చిన్న వయసులోనే మీరా కఠిన నిర్ణయం తీసుకుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా విజయ్ ఆంటోని ఓ సందర్భంలో.. ఏడేళ్ల వయసులోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడని, దీంతో తన తల్లి ఎంతో కష్టపడి తనను పెంచిందని, ఆత్మహత్య సమస్యకు ఎప్పుడూ పరిష్కారం కాదని విజయ్ పేర్కొన్నారు. కానీ విధి ఎంత విచిత్రమో.. ఆరోజు తండ్రి సూసైడ్ చేసుకోగా, ఇప్పుడు కూతురు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కొన్ని సార్లు జీవితం మనల్ని పరీక్షిస్తుందో, శిక్షిస్తుందో అర్ధం కాదు, స్టే స్ట్రాంగ్ విజయ్ సార్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. #VijayAntony lost his father to suicide when he was just 7 years old 🥹💔 Tragically, today, his own daughter has also taken her life 😭 being @vijayantony is not easy 😢#Meera| #MeeraVijayAntonypic.twitter.com/EqEEfet3Ta — SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023 ఒత్తిడి.. ఎలా బయటపడాలి? ఒంటరితనం వల్ల రకరకాల ఆలోచనలు మైండ్లోకి వస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు ఫ్రెండ్స్, ఫ్యామిలితో సమయం గడపండి. ఏదో సాధించాలని తపన అందరిలో ఉంటుంది. కానీ దానికి టైం కూడా రావాలి. కష్టపడిన వెంటనే ఫలితం ఆశించకండి. సమయంతో పాటూ అన్నీ సర్దుకుంటాయి అని పాజిటివ్‌గా ఉండండి. ఖాళీగా ఉండకుండా ఏదైనా కొత్త హాబీని ఏర్పరుచుకోండి. సంగీతం, డ్యాన్స్, మ్యాజిక్.. ఇలా ఏదో ఒక వ్యాపకాన్ని ఇష్టంతో చేయండి. ఎన్ని చేసినా, ఎంత ప్రయత్నించినా ఒంటరితనం, డిప్రెషన్ నుంచి బయటరాలేమనుకుంటే వెంటనే సైకాలజిస్ట్‌ని సంప్రదించండి. Disclaimer: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అప్పుడు ఆయన.. ఇప్పుడు కన్న కూతురు.. తీవ్ర విషాదంలో విజయ్!
తమిళ నటుడు, బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు మీరా(16) ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. తెల్లవారుజామున సూసైడ్ చేసుకున్న మీరాను ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక సంఘటన కుటుంబాన్నే కాదు.. మొత్తం కోలీవుడ్‌ను షాక్‌కు గురి చేసింది. కాగా.. మీరా చెన్నైలోని ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. చదువుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: కొత్త సినిమా ప్రకటించిన దర్శకధీరుడు.. డైరెక్టర్ ఎవరంటే?) అయితే ఈ విషాద సమయంలో విజయ్ ఆంటోనీకి సంబంధించిన పాత ఇంటర్వ్యూ నెట్టింట వైరలవుతోంది. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలతో రిలేషన్‌పై పలు సూచనలు చేశారు. తాను ఎప్పుడు కూడా తన కుమార్తెను చదువు విషయంలో బలవంతం చేయలేదని అన్నారు. పిల్లల చదువుల గురించి ఇంటి దగ్గర ఎప్పుడు చర్చించలేదని తెలిపారు. కానీ పిల్లలతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలని ఆయన సూచించారు. విజయ్ మాట్లాడుతూ..'నేను నా కూతురిని ఆమె ఇష్టం వచ్చినట్లు ఉండేలా ప్రోత్సహిస్తాను. ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని చెప్పలేదు. ఏదైనా సరే తన ఇష్టానికే వదిలేశా. చదవు విషయంలో చాలా ఫ్రీడమ్ ఇస్తా. చదవాలనుకుంటే చదవచ్చు. అది తన ఇష్టం. నేను చదువు విషయంలో పిల్లలను బలవంతం చేయను.' అని అన్నారు. మనం పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని విజయ్ సూచించారు. దీనివల్ల పేరేంట్స్, పిల్లలకు మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుందన్నారు. (ఇది చదవండి: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..! ) పిల్లల గురించి అంతలా ఆలోచించే విజయ్ ఆంటోని ఇంట్లో ఇలా జరగడం ఆయన అభిమానులకు షాకింగ్‌కు గురిచేసింది. ఆయనకు లారా అనే చిన్న కుమార్తె కూడా ఉంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు శరత్ కుమార్, రాఘవ లారెన్స్, వెంకట్ ప్రభు, ఆయన అభిమానులు ధైర్యంగా ఉండాలని మద్దతుగా నిలుస్తున్నారు. అయితే మీరా డిప్రెషన్‌తో బాధపడుతోందని.. చికిత్స కూడా తీసుకుంటోందని ఆంటోనీ సన్నిహితులు ఒకరు వెల్లడించారు. కానీ ఆంటోనీ తండ్రి కూడా అతనికి ఏడు సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. విజయ్ తండ్రి ఆత్మహత్యపై గతంలో మాట్లాడుతూ..' జీవితంలో ఎలాంటి సంక్షోభం ఎదురైనా ఆత్మహత్యలే శరణ్యం కాదు. వారి పిల్లల గురించి తలచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నాకు ఏడేళ్లు. మా చెల్లికి ఐదేళ్లు. అది నా వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపింది. అయితే అది ఎంత అనేది నాకు మాత్రమే తెలుసు. మా నాన్న పోయిన తర్వాత మమ్మల్ని పెంచడానికి అమ్మ చాలా కష్టపడింది. అందుకే ఆత్మహత్యల గురించి వింటే నాకు చాలా బాధేస్తుంది. జీవితంలో ఎదురయ్యే సంక్షోభాల గురించి నాకు తెలుసు. చాలా కష్టాలు చూశా. కానీ ఆత్మహత్య గురించి ఎప్పుడూ ఆలోచించలేదు." అని అన్నారు. #VijayAntony lost his father to suicide when he was just 7 years old 🥹💔 Tragically, today, his own daughter has also taken her life 😭 being @vijayantony is not easy 😢#Meera| #MeeraVijayAntonypic.twitter.com/EqEEfet3Ta — SEKAR 𝕏 (@itzSekar) September 19, 2023 -
బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..!
బిచ్చగాడు ఫేమ్, కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొంది. 12వ తరగతి చదువుతున్న ఆయన కూతురు మీరా ఆంటోని సూసైడ్ చేసుకుంది. అయితే అమ్మాయిని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో కన్నుమూసింది. తీవ్రమైన ఒత్తిడితోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ప్రిన్స్ ఒక వెధవ.. ప్రశాంత్‌కు డ్రగ్ ఎక్కేసింది: షకీలా) కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నైలోని అల్వార్‌పేటలోని డీడీకే రోడ్డులో నివాసముంటున్నారు. విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ (16) చర్చ్ పార్క్ స్కూల్లో పన్నెండో తరగతి చదువుతోంది. అయితే చదువుల వల్లే ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. మీరా తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే తన గదిలో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మీరాను గమనించిన కుటుంబసభ్యులు కావేరీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన జరిగిన సమయంలో విజయ్ ఆంటోని ఇంట్లో లేడని చెబుతున్నారు. #BREAKING || நடிகரும் இசையமைப்பாளருமான விஜய் ஆண்டனியின் மகள் தூக்கிட்டு தற்கொலை மன அழுத்தம் காரணமாக தற்கொலை என கூறப்படுகிறது சென்னை, டிடிகே சாலையில் உள்ள வீட்டில் அதிகாலை 3 மணி அளவில் தூக்கிட்டு தற்கொலை #vijayantony | #vijayantonydaughter | #laara pic.twitter.com/MZ7Px8HsV2 — Thanthi TV (@ThanthiTV) September 19, 2023 Disclaimer: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఆ వార్తల్లో నిజం లేదు.. పరువు నష్టం దావా వేస్తా: విజయ్ ఆంటోని
తమిళసినిమా: సంగీత దర్శకుడు నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రత్తం. తమిళ్ పడమ్ చిత్రం ఫేమ్ సిఎస్ అముదమ్ దర్శకత్వంలో ఇన్ఫినిటీ ఫిలిమ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, జి. ధనుంజయన్, ప్రదీప్ బి. పంకజ్ బోరా కలిసి నిర్మిస్తున్నారు. నటి రమ్య నంబీశన్, మహిమ నబియార్, నందిత శ్వేత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని, గోపీ అమర్నాథ్ అందిస్తున్నారు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రత్తం అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చైన్నెలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సీఎస్ అముదమ్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని తాను చదువుకున్న రోజుల్లోనే మిత్రులందరికీ, ఓకే కళాశాలలో చదువుకున్నామని చెప్పారు. ఆయన హీరోగా ఓ చిత్రం చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నానని ఈ రత్తంతో అది కుదిరిందని చెప్పారు. ఇది మీడియా నేపథ్యంలో సాగే కథా చిత్రం అని తెలిపారు. చిత్రంలో మత రాజకీయాలు కూడా ఉంటాయని, అయితే ఇందులో ఇంతకుముందు వచ్చిన ఏ చిత్ర ఛాయలు ఉండవని చెప్పారు. దర్శకుడు అముదమ్ చెప్పిన కథ కొత్తగా ఉండటంతో ఇందులో నటించడానికి అంగీకరించినట్లు విజయ్ ఆంటోని చెప్పారు. కాగా ఇటీవల ఏఆర్ రెహమాన్ నిర్వహించిన సంగీత కచేరీ వ్యవహారంలో నటుడు విజయ్ ఆంటోని హస్తం ఉన్నట్లు ఒక యూట్యూబ్‌లో ఛానల్లో ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన విజయ్ ఆంటోని ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, తాను ఆ యూట్యూబ్ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఇప్పటికే ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిపారు. -
బిచ్చగాడు ఇప్పుడు 'లవ్ గురు' అయ్యాడు!
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్‌ఆంటోని.. ఆ తర్వాత నటుడు, ఎడిటర్, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఈ మధ్యే 'బిచ్చగాడు 2'తో దర్శకుడుగాను మారి హిట్ కొట్టారు. తాజాగా 'రోమియో' చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా తీస్తున్నారు. తెలుగులో లవ్‌గురు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!) ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ కాగా, వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన గుడ్ డెవిల్ అనే నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇది రొమాంటిక్ లవ్ కథాచిత్రంగా తీస్తున్నట్లు విజయ్ చెప్పుకొచ్చారు. ఇందులో కొత్త విజయ్ ఆంటోనీని చూస్తారని ఆయన చెప్పారు. దీనికి భరత్ ధనశేఖర్ సంగీతాన్ని, ఫరూఖ్ జే.బాషా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రోమియో చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నా తదుపరి చిత్రం #LOVEGURU ని ఎనౌన్స్ చేస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది🙏😊 Summer 2024#Blockbuster @GoodDevilOffl @mirnaliniravi pic.twitter.com/uNgRh9lvZs — vijayantony (@vijayantony) August 16, 2023 (ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!) -
'లాక్ డౌన్ నైట్స్'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
జీవీ, 8 తోట్టాగల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ వెట్రి హీరోగా.. పూచ్చాండి చిత్రం ఫేమ్ హంశినీ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం లాక్డౌన్ నైట్స్. ఈ చిత్రానికి ఎస్ ఎస్.స్టాన్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాత వినోద్ శబరీస్ తాజాగా తమిళంలో నిర్మిస్తున్న చిత్రం లాక్డౌన్ నైట్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర టైటిల్ పోస్టర్‌ను సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా.. ఇటీవల కన్నడలో కిశోర్, పూజా గాంధీ జంటగా సంహారిణి అనే భారీ చిత్రాన్ని వినోద్ శబరీస్ నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: 'అతనికి ఏ మహిళతోనూ రిలేషన్ లేదు'.. స్టార్ హీరోపై కంగనా ప్రశంసలు!) ఎస్ ఎస్.స్టాన్లీ ఇంతకు ముందు ఏప్రిల్ మాదత్తిల్, పుదుకోట్టైయిలిరుందు సరవణన్, వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు గంగై అమరన్, మదియళగన్, లోగన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సాలై సహదేవన్ ఛాయాగ్రహణం, జస్టిస్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిగా మలేషియాలో చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. (ఇది చదవండి: ఈమెని గుర్తుపట్టారా? మీకు బాగా తెలిసిన స్టార్ యాంకర్) -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!
ఏ సినిమా అయినా థియేటర్లలోకి రావడం లేటు.. బిగ్ స్క్రీన్‌పై చూసి ఆనందించేవాళ్లు కొందరైతే, ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసేవాళ్లు మరికొందరు. వాళ్లకోసమా అన్నట్లు ప్రతివారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు అలానే ఓ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే మరీ రెండు వారాల్లోనే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసిందనే టాక్ వినిపిస్తుంది. విజయ్ ఆంటోని పేరు చెప్పగానే 'బిచ్చగాడు' సినిమానే గుర్తొస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇతడు.. కొన్నాళ్లకు ఆ ప్రొఫెషన్ కొనసాగిస్తూనే.. నటుడిగానూ మారాడు. అలా 'బిచ్చగాడు'తో తెలుగు, తమిళ భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీని తర్వాత హీరోగా మూవీస్ చేస్తున్నాడు గానీ పెద్దగా సక్సెస్ అయితే అందుకోలేకపోతున్నాడు. అలా ఈ ఏడాది 'బిచ్చగాడు' సీక్వెల్‌తో వచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) అక్కడే స్ట్రీమింగ్? ఈ సినిమా ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఫస్ట్ పార్ట్ కి ఉన్న క్రేజ్ వల్ల మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్స్ రాబట్టింది. గత నెలలో అంటే జూలై 21న 'హత్య' అనే థ్రిల్లర్ సినిమాతో విజయ్ ఆంటోని ప్రేక్షకుల్ని పలకరించాడు. పోస్టర్, ట్రైలర్ తో అంచనాలు పెరిగినప్పటికీ.. థియేటర్లలో మాత్రం బోల్తా కొట్టేసింది. ఇప్పుడీ సినిమా ఓవర్ సీస్ ఓటీటీలో రిలీజైపోయినట్లు తెలుస్తోంది. మనదేశంలో మాత్రం తెలుగు, తమిళంలో ఆగస్టు 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 'హత్య' కథేంటి? మోడల్ లైలా(మీనాక్షి చౌదరి)ని ఎవరో హత్య చేస్తారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకవు. ఈ క్రమంలోనే ఆమె మర్డర్ కేసుని డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోని)తోపాటు ఐపీఎస్ అధికారి సంధ్య దర్యాప్తు చేస్తారు. చివరకు ఈ హత్యని ఎలా పరిష్కరించారు? అసలు మోడల్ని చంపింది ఎవరు? అనేది మెయిన్ స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ
టైటిల్: హత్య నటీనటులు: విజయ్ ఆంటోనీ, మీనాక్షి చౌదరి, రితికా సింగ్, మురళీ శర్మ, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ్ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు దర్శకత్వం: బాలాజీ కుమార్ సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్ సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్ విడుదల తేది: జులై 21, 2023 బిచ్చగాడు-2 మూవీతో రీసెంట్ సూపర్ హిట్ అందుకున్న తమిళ హీరో విజయ్ అంటోని.. నటించిన కొత్త మూవీ ‘కోలై’. తెలుగులో హత్య పేరుతో విడుదల చేశారు. మీనాక్షి చౌదరి, రితికా సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఓ మోస్తరు అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘హత్య’ కథేంటంటే.. హైదరాబాద్‌కు చెందిన ఫేమస్ మోడల్ లైలా(మీనాక్షి చౌదరి) తన ఇంట్లో హత్యకు గురవుతుంది. ఈ కేసు కొత్తగా డ్యూటీలో చేరిన ఐపీఎస్ సంధ్య(రితికా సింగ్) చేతికి వస్తుంది. ఆమె ప్రముఖ డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోనీ) సహాయం కోరుతుంది. ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. లైగా బాయ్‌ఫ్రెండ్ సతీష్(సిద్ధార్థ శంకర్), ప్రముఖ ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్(అర్జున్ చిదంబరం), మోడల్ కో ఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్(మురళీ శర్మ)తో పాటు బబ్లూ అనేవ్యక్తి (కిషోర్ కుమార్)ని విచారిస్తారు. మరి ఈ నలుగురిలో లైలాను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? ఈ కేసు విషయంలో ఐపీఎస్ అధికారి సంధ్యకు డిటెక్టివ్ వినాయక్ ఎలాంటి సహాయం చేశాడు. కేసు విచారణలో వీరిద్దరికి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు హంతకుడిని ఎలా గుర్తించారు? అనేది తెలియాలంటే ‘హత్య’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఇలాంటి చిత్రాల్లో ప్రేక్షకుడు థ్రిల్‌కు గురయ్యే సన్నివేశాలు ఉంటేనే కథతో లీనమవుతారు. కానీ ‘హత్య’లో అలాంటి సన్నివేశాలు తక్కువనే చెప్పాలి. పైగా ఈ తరహా కథలు తెలుగులో బోలెడు వచ్చాయి. ఈ చిత్రంలో కొత్తగా చూపించిదేమి లేదు.ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా రొటీన్‌గా ఉంటుంది. లైలా హత్యతో కథ ప్రారంభం అవుతుంది. ఎలాంటి సాగదీత లేకుండా అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. లైలా హత్య కేసు విచారణలో ఐపీఎస్ సంధ్య డెటెక్టివ్ వినాయక్ సహాయం కోరడం.. ఇద్దరు కలిసి విచారణ ప్రారంభించడం.. కొంతమంది అనుమానితుల్ని పిలిచి విచారించడం..ఇలా రొటీన్‌గా ఫస్టాఫ్ సాగుతుంది. ఇక మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం విజయ్ ఆంటోనీ పాత్ర ఫ్యామిలీ నేపథ్యం, అతని కూతురు యాక్సిడెంట్ గురయ్యే సీన్స్‌ని చొప్పించారు. అయితే అవి సాఫీగా సాగుతున్న కథను అతికించినట్లు ఉన్నాయే తప్పా.. ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేవు. ఇంటర్వెల్ సీన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండాఫ్‌లో కూడా రొటీన్‌గా సాగుతుంది. లైలా హత్యలో కేసులో అనుమానితులు వరుసగా చనిపోవడంతో అసలు హంతకుడు ఎవడనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే సినిమా స్టార్టింగ్‌లోనే కాస్త జాగ్రత్తగా గమనిస్తే హంతకుడు ఎవరో ఈజీగా కనిపెట్టగలరు. ఓవరాల్‌గా ‘హత్య’ ఓ రొటీన్ క్రైమ్ థ్రిల్లర్. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ వినాయక్‌గా విజయ్ ఆంటోనీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగ్గట్టుగా సీరియస్ లుక్, గ్రే హెయిర్‌తో తెరపై కొత్తగా కనిపించాడు. ఇక మోడల్ లైలాగా మీనాక్షి చౌదరి తన పాత్ర పరిధిమేర నటించింది. కథంతా తన పాత్ర చుట్టే తిరుగుతుంది కానీ గుర్తిండిపోయే సన్నివేశాలేవి తనకు పడలేదు. ఐపీఎస్ సంధ్యగా రితికా సింగ్ నటన పర్వాలేదు. మురళీ శర్మ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతగా బాగా నటించాడు. రాధికా శరత్ కుమార్, సిద్ధార్థ్ శంకర్, అజిత్ చిదంబరంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేంతిక పరంగా సినిమా పర్వాలేదు. -
ఆ సీన్లు లేకుండా చేస్తారా.. నాకు మీరే న్యాయం చేయండి: విజయ్ ఆంటోని
కోలివుడ్లో 'నాన్' అనే సీరియస్ కథా చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. ఆ తరువాత పలు సక్సెస్‌పుల్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన పిచ్చైక్కారన్– 2 తెలుగులో (బిచ్చగాడు-2) చిత్రంతో దర్శకుడిగానూ పరిచయం అయ్యి విజయం సాధించారు. తాజాగా విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన చిత్రం కొలై (హత్య). నటి రిత్వికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాలాజీ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: ఎవరూ నమ్మలేరు మన హీరోయిన్లు పాక్ సినిమాల్లో నటించారంటే) ఈ సందర్భంగా చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విజయ్ ఆంటోని మాట్లాడుతూ కథ చెప్పినప్పుడు ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని దర్శకుడు చెప్పారన్నారు. ఆ తరువాత ఇద్దరని అన్నారనీ, వారిలో నటి మీనాక్షీ వేరే నటుడికి పెయిర్ కాగా, నటి రిత్వికా సింగ్ తనకు సోదరిగా నటించినట్లు చెప్పారు. ఇందులో తనకు ఒకే ఒక్క భార్య ఉన్నారనీ, ఆమె కూడా కళ్ల ముందే కాలిపోతుందని చెప్పారు. అలా ఈ చిత్రంలో తనకు రొమాన్స్ లేకుండా చేశారని, ఇందుకు తనకు న్యాయం కావాలి అని సరదాగా అన్నారు. అయితే దర్శకుడు బాలాజీ కే.కుమార్ ఏడు ఏళ్ల తరువాత దర్శకత్వం వహంచిన చిత్రం ఇది అనీ, చాలా బాగా వచ్చిందని పేర్కొన్నారు. కాగా మళ్లీ సంగీత దర్శకుడిగా ఎప్పుడు పని చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ, ప్రస్తుతానికి కొంచెం గ్యాప్ ఇచ్చానని, తన కేరీర్ ముగిసేలోగా కనీసం 20 మంది కొత్త సంగీత దర్శకులను పరిచయం చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. అందుకే సంగీతదర్శకుడిగా కొంత కాలం తప్పుకుంటున్నట్లు చెప్పారు. -
'1923లో జరిగిన ఓ ఘటనే ఈ సినిమాకు మూలం'
‘‘హత్య’ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటే హాలీవుడ్ డిటెక్టివ్ చిత్రాలు గుర్తొస్తాయి. గిరీష్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ‘హత్య’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు విజయ్ ఆంటోని. బాలాజీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, రితికా సింగ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హత్య’. ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. గ్లోబల్ సినిమాస్, సురేశ్ ్ర΄÷డక్షన్స్ సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా హాజరై, ‘హత్య’ హిట్టవ్వాలన్నారు. ‘‘1923లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రం తీశాను’’ అన్నారు బాలాజీ కుమార్. -
హత్య చేసిందెవరు?
విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. లోటస్ పిక్చర్స్‌తో కలిసి ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్‌పై కమల్ బోరా, జి. ధనుంజయన్, ప్రదీప్ .బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మించిన ‘హత్య’ ఈ నెల 21న రిలీజవుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాయి. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ ΄ాత్ర చేశారు. ఈ క్యారెక్టర్లో ఆయన సరికొత్త లుక్‌లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. -
ఆ బ్యానర్‌కు విజయ్ ఆంటోని ఫుల్ సపోర్ట్.. ఏకంగా మూడు సినిమాలు..
పిచ్చైక్కారన్ –2(బిచ్చగాడు 2) చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొలై. బాలాజీ కుమార్ దర్శకత్వంలో ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇందులో నటి రిత్వికా సింగ్, మీనాక్షి చౌదరి నాయకిలుగా నటించారు. గిరీష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చైన్నెలోని సత్యం థియేటర్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి, కలైపులి ఎస్. ధాను, సత్య జ్యోతి త్యాగరాజన్, అమ్మ క్రియేషన్స్ శివ ,దర్శకుడు విజయ్, లింగుసామి, మిష్కిన్, నటుడు జాన్ విజయ్, నటి మీనాక్షి చౌదరి, ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న శక్తి ఫిలిమ్స్ ఫ్యాక్టరీ శక్తి వెల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ.. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థను ప్రారంభించడానికి ముఖ్య కారణం నటుడు విజయ్ ఆంటోనీ అని పేర్కొన్నారు. ఈ సంస్థలో వరుసగా మూడు చిత్రాలు చేద్దామని ఆయనే తమను ప్రోత్సహించారని తెలిపారు. ఆ విధంగా కొలై చిత్రం, తర్వాత రత్తం, ఆ తర్వాత మలై పిడిక్కాద మనిదన్ చిత్రాలు తమ సంస్థ నుంచి వరుసగా విడుదల కానున్నాయని చెప్పారు. ఇలా విజయ్ ఆంటోనితో వరుసగా చిత్రాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు బాలాజీ కుమార్ దీన్ని ఉత్తమ చిత్రంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన బడ్జెట్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించినట్లు ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో చాలా ఎమోషనల్ విషయాలు చోటుచేసుకుంటాయని ధనుంజయన్ తెలిపారు. చదవండి: ప్రాజెక్ట్ కె యూనిట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ -
ఓటీటీలోకి వచ్చేసిన 'బిచ్చగాడు 2'.. స్ట్రీమింగ్ అందులో
టాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఎవరూ ఊహించని రేంజులో హిట్ అవుతుంటాయి. అలాంటి మూవీస్ లిస్ట్ తీస్తే అందులో డబ్బింగ్ చిత్రం 'బిచ్చగాడు' కచ్చితంగా ఉంటుంది. రీసెంట్ గా దీని సీక్వెల్ 'బిచ్చగాడు 2' థియేటర్లలోకి రాగా, ఇది మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తెలుగులో కలెక్షన్స్ బాగానే సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. తెలుగులో శ్రీకాంత్ 'మహాత్మ' మూవీకి సంగీతమందించాడు. పేరు కూడా తెచ్చుకున్నాడు. కొన్నాళ్లకు 'నకిలీ' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అంటే 2016లో 'బిచ్చగాడు' చేసిన విజయ్ అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నాడు. తమిళంలో ఏమోగానీ తెలుగులో ఎవరూ ఊహించని రేంజులో ఈ మూవీ హిట్ అయింది. అప్పటినుంచి విజయ్ ఆంటోని చాలా సినిమాలు చేశాడు కానీ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. దీంతో తనకు అచ్చొచ్చిన 'బిచ్చగాడు'నే విజయ్ ఆంటోని నమ్ముకున్నాడు. సీక్వెల్ లో హీరోగా నటించి, మ్యూజిక్, ఎడిటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసర్.. ఇలా అన్ని బాధ్యతల్ని తానే చూసుకుని ఫైనల్ గా హిట్ కొట్టాడు. జూన్ 18 నుంచి అంటే ఈరోజు(ఆదివారం) నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇంకెందుకు లేటు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. Vijay Gurumoorthy is here now! #Bichagadu2 is streaming now on #DisneyPlusHotstar. #Bichagadu2OnHotstar. @vijayantony @iYogiBabu @KavyaThapar pic.twitter.com/vU7tWi43V3 — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) June 18, 2023 (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!) -
'బిచ్చగాడు 2' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్
తెలుగులో ఎప్పుడు ఏ సినిమా, ఎందుకు హిట్ అవుతుందనేది అస్సలు అంచనా వేయలేం. అలా 2016లో ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్ సక్సెస్ కొట్టిన మూవీ 'బిచ్చగాడు'. అప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్ గా అందరికీ తెలిసిన విజయ్ ఆంటోని.. ఈ సినిమాతో హీరోగా క్రేజ్ సంపాదించాడు. చాలా సినిమాల్లో నటించాడు. అయితే 'బిచ్చగాడు' సక్సెస్ తర్వాత విజయ్ ఆంటోని చాలా సినిమాలు చేశాడు గానీ ఏవి కూడా పెద్దగా హిట్ కాలేదు. దీంతో తనకు సక్సెస్ ఇచ్చిన 'బిచ్చగాడు' సీక్వెల్ తో ఈ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే.. ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినప్పటికీ తెలుగులో హిట్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంతో పోలిస్తే తెలుగులో 'బిచ్చగాడు 2'కి మంచి కలెక్షన్స్ వచ్చాయి. చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్స్ లాభాలు సొంతం చేసుకున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే కొందరు మూవీ లవర్స్ మాత్రం ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. వారి కోసమా అన్నట్లు తాజాగా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం జూన్ 18 నుంచి హాట్ స్టార్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌లు ఇవే! టాప్ 5లో ఏమున్నాయంటే?) -
విజయ్ ఆంటోనీ లేటెస్ట్ మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!
విజయ్ ఆంటోనీ టాలీవుడ్ అభిమానులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవలే బిచ్చగాడు -2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా 'విక్రమ్ రాథోడ్' సినిమా తెలుగులోనూ రాబోతోంది. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!) అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. రావూరి వెంకటస్వామి, కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ముఖంపై గాయాలతో కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: అచ్చిరాని సమ్మర్.. ఈసారి తెలుగు సినిమాలన్నీ కూడా!?) -
తెలుగు రాష్ట్రాల్లో ఇల్లు కట్టుకుంటా: 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని
బీచ్‌రోడ్డు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు కట్టుకుంటా.. తెలుగు భాష నేర్చుకుంటానని హీరో విజయ్ ఆంటోనీ అన్నారు. బిచ్చగాడు–2 సినిమా సక్సెస్ మీట్‌ను శనివారం బీచ్‌రోడ్డులో నిర్వహించారు. బిచ్చగాడు, బిచ్చగాడు–2 సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. భవిష్యత్తులో తన చిత్రాల షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లో జరుపుతామన్నారు. త్వరలోనే బిచ్చగాడు–3 కూడా తెరకెక్కించనున్నట్టు చెప్పారు. ఈ చిత్రం 2026లో విడుదలవుతుందన్నారు. ఈ సందర్భంగా బిచ్చగాడు 2లోని చెల్లి చెల్లి పాట పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ బిచ్చగాడుని మించి బిచ్చగాడు–2 విజయవంతం అవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ రెండు సినిమాలు తెలుగులో సూపర్ హిట్లు కావడం ఆనందంగా ఉందన్నారు. డిస్ట్రిబ్యూటర్ సురేష్ మాట్లాడుతూ బిచ్చగాడు–2 సినిమా తమిళంలో కన్నా తెలుగులోనే బాగా విజయవంతం అయ్యిందన్నారు. ఆంధ్రాలోనే అతి పెద్ద థియేటర్ అయిన జగదాంబలో బిచ్చగాడు–2 సినిమా హౌస్‌ఫుల్‌గా నడుస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను పూర్వీ పిక్చర్స్ ద్వారా విడుదలైందని తెలిపారు. కథ బాగుంటే హీరో ఎవరైనా సరే సినిమా హిట్ అవుతుందనడానికి ఈ సినిమానే ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో థియేటర్ అధినేత వి.జగదీష్, మేనేజర్ రాజు, పూర్వీ పిక్చర్స్ అధినేత నాయుడు తదితరులు పాల్గొన్నారు. 2026లో బిచ్చగాడు 3 -
'బిచ్చగాడు' హీరో.. రియల్ లైఫ్‌లో కూడా హీరోనే!
బిచ్చగాడు సినిమాతో ఫేమస్ కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో తాజాగా సీక్వెల్‌ను తెరకెక్కించారు. తానే హీరోగా, దర్శకుడిగా రూపొందించిన బిచ్చగాడు-2 ఇటీవలే థియేటర్లలో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) తాజాగా ఈ సినిమా సక్సెస్‌ను విజయ్ ఆంటోనీ అందరికంటే భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రాజమండ్రిలోని ఓ హోటల్లో యాచకులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తానే స్వయంగా వారికి వడ్డించారు. ఇదీ చూసిన ఆయన అభిమానులు హీరో చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. విజయ్ ఆంటోని భోజనం వడ్డిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు. (ఇది చదవండి: అమ్మ చనిపోయేముందు నా పేరే కలవరించింది: నటి) -
బిచ్చగాడు 3 ఉంటుంది: హీరో విజయ్ ఆంటోని
ఒక్కో రంగంలో తనను తాను సక్సెస్‌ఫుల్‌గా మలుచుకుంటూ ఎదుగుతూ వస్తున్న నటుడు విజయ్ ఆంటోని. ఈయన మొదట్లో సంగీత దర్శకుడిగా రంగప్రవేశం చేశారు. ఆ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత 2012లో నాన్ అనే చిత్రంతో నిర్మాతగా, కథానాయకుడిగా మారారు. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. అలా వరుసగా నటిస్తూ, మరో పక్క సంగీత దర్శకుడిగానూ రాణిస్తున్న విజయ్ ఆంటోని బిచ్చగాడు(పిచ్చైక్కారన్) చిత్రంతో సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఇటీవల బిచ్చగాడు 2 చిత్రంతో దర్శకుడిగానూ అవతారమెత్తారు. ఈ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా బహుముఖాలను ప్రదర్శించి సక్సెస్ అయ్యారు. ఇటీవల విడుదలైన బిచ్చగాడు 2 చిత్రం మంచి వసూళ్లను సాధిస్తోంది. దీంతో ఈ చిత్రానికి పార్టు 3 ఉంటుందని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్ 2025లో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. అయితే ఇది బిచ్చగాడు 1, 2 సినిమా కథలకు సంబంధం ఉండదని, వేరే విధంగా ఉంటుందని తెలిపారు. కాగా ప్రస్తుతం విజయ్ ఆంటోని రత్తం, మళై పిడిక్కాద మణిదన్, వల్లి మలై, అగ్నిసిరకుకళ్, కొలై చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు విడుదలైన తరువాతనే బిచ్చగాడు 3 చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు విజయ్‌ఆంటోని చెప్పారు. చదవండి: తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోను: హరీశ్ శంకర్ -
వెయిటర్‌గా మారిన 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని ఇటీవలె బిచ్చగాడు-2 సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయిన బిచ్చగాడు మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా నటించారు. కావ్య థాపర్ ఇందులో హీరోయిన్గా నటించింది. మే 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ ఆంటోనీ వెయిటర్‌గా మారారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు విచ్చేసి వెయిటర్‌గా సర్వ్ చేసి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
'చావు అంచుల దాకా వెళ్లా'.. బిచ్చగాడు హీరోయిన్ కామెంట్స్
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమా బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు బిచ్చగాడు-2 రూపొందిన సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో కొనసాగుతుంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హీరోయిన్ కావ్య థాపర్ తనను రక్షించిందని విజయ్ ఆంటోనీ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై కావ్య థాపర్ స్పందించింది. ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన ఆమె ఆనాడు ప్రమాదం జరిగిన ఇన్సిడెంట్ను గుర్తుచేసుకుంటూ.. మలేషియాలో యాక్షన్ సీన్ చేస్తుంటే అనుకోకుండా పెద్ద ప్రమాదం జరిగింది. చదవండి: అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే విజయ్ ఆంటోనీ సముద్రంలో పడిపోయారు. ఆయన్ని రక్షించాలని నేను కూడా సముద్రంలో దూకాను. ఈత కొడుతూ వెళ్లి ఆయన్ను పట్టుకున్నాను. ఆ సమయంలో చావు అంచుల దాకా వెళ్లినట్లు అనిపించింది. వెంటనే యూనిట్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించారు అంటూ చెప్పుకొచ్చింది కావ్య థాపర్. -
ప్రముఖ ఓటీటీలో బిచ్చగాడు-2.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆయన ఆ చిత్రానికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిన్న(శుక్రవారం)తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించి హీరోగా నటించారు. కావ్య థాపర్ విజయ్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను కూడా హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత అంటే జూన్ మూడోవారం లేదా చివరి వారంలో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. -
బిచ్చగాడు 2 సంచలనం
-
Bichagadu 2 Review: ‘బిచ్చగాడు 2’మూవీ రివ్యూ
టైటిల్: బిచ్చగాడు 2 నటీనటులు: విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దాతో రాధా రవి, వై.జి. మహేంద్రన్, యోగి బాబు తదితరులు దర్శకత్వం: విజయ్ ఆంటోని సంగీతం: విజయ్ ఆంటోని సినిమాటోగ్రఫీ: విజయ్ మిల్టన్, ఓమ్ ప్రకాష్ విడుదల తేది: మే 19, 2023 ‘బిచ్చగాడు 2’ కథేంటంటే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ) ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఏడో వ్యక్తి. ఎన్నికల ఫండ్ కోసమే రూ. 5000 కోట్లు ఇచ్చేస్తాడు. ఆయన ఆస్తుల విలువ దాదాపు లక్ష కోట్ల వరకు ఉంటుంది. అయితే.. విజయ్ గురుమూర్తి ఆస్తిపై అతని స్నేహితుడు, వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరించే అరవింద్(దేవ్ గిల్) కన్నుపడుతుంది. ఎలాగైనా విజయ్ ఆస్తిని కొట్టేయాలని ఆలోచిస్తున్న సయమంలో టీవీలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ గురించి చెప్పేది వింటాడు. విజయ్‌ని చంపేసి అతని శరీరంలో వెరొకరి బ్రెయిన్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేయించి, ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ వేస్తాడు. పథకం ప్రకారమే విజయ్‌ని దుబాయ్‌కి వచ్చేలా చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఆ బాడీలో సత్య అనే ఓ బిచ్చగాడి బ్రెయిన్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆనంద్ అనుకున్నట్లు విజయ్ ఆస్తిని చేజిక్కించుకున్నాడా? అసలు సత్య ఎవరు? ఎలా బిచ్చగాడు అయ్యాడు? అతని చెల్లెలు ఎవరు? ఎలా దూరమైంది? సత్య చిన్నప్పుడు జైలుకు ఎందుకు వెళ్లాడు? సత్య విజయ్‌గా మారిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అతనిపై ఎవరికి అనుమానం రాలేదా? విజయ్ ప్రియురాలు, కంపెనీ సెక్రటరీ హేమ(కావ్యా థాపర్)కు నిజం తెలిసిన తర్వాత ఏం చేసింది? సీఎం(రాధా రవి) సత్యను ఎందుకు చంపించాలనుకున్నాడు? అసలు యాంటీ బికిలీ కార్యక్రమం ఏంటి? చివరకు సత్య తన చెల్లి కలిశాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘బిచ్చగాడు’లో మదర్ సెంటిమెంట్ ఉంటే.. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘బిచ్చగాడు 2’లో సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఓ మంచి సందేశాన్ని ఇవ్వడం ఈ సినిమా స్పెషల్. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ అనే ఆసక్తికర సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి సాగదీత లేకుండా బిలియనీర్ విజయ్ గురిమూర్తి నేపథ్యాన్ని తెలియజేస్తూ అలసు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఇక సత్య పాత్రని పరిచయం చేయగానే.. తర్వాత ఏం జరుగుతుందనేది మనకు తెలిసిపోతుంది. అతని బ్రెయిన్‌ని విజయ్ బాడీలోకి ట్రాన్స్‌ప్లాంట్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు లెన్తీగా అని అనిపించినా.. ఇంటర్వెల్ సీన్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథ మొత్తం సిస్టర్ సెంటిమెంట్, సందేశం.. సామాజిక సేవ చుట్టు తిరుగుతుంది. పేదల కోసం ‘యాంటీ బికిలీ’అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విజయ్ అనౌన్స్ చేసిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. చివర్లో వచ్చే కోర్టు సీన్స్ ఆకట్టుకుంటాయి. అదే సమయంలో సినిమా మొత్తంలో కొన్ని సన్నివేశాలు ప్రతిసారి రిపీట్ అవ్వడం.. అది కూడా ఎమోషనల్‌గా చూపించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో స్క్రీన్ల్ప్లే మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. ఓవరాల్‌గా ఈ బిచ్చగాడు కొన్ని చోట్ల ఏడిపిస్తాడు.. యాక్షన్స్‌తో అలరిస్తాడు.. అలాగే ఓ మంచి సందేశాన్ని అందిస్తాడు. ఎవరెలా చేశారంటే.. ఒక సినిమాకు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం అంటే అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. కానీ విజయ్ ఆంటోని మాత్రం ఈ విషయంలో సక్సెస్ సాధించాడు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు. అలా అని తన నటనలో ఎక్కడా తగ్గలేదు. ధనవంతుడైన విజయ్ గురిమూర్తిగా, బిచ్చగాడు సత్యగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన విజయ్ ... ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో పాటు ఎమోషన్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక విజయ్ గురుమూర్తి ప్రియురాలు హేమగా కావ్యా థాపర్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సినిమా ప్రారంభంలో వచ్చే పాటలో అందాల ప్రదర్శన చేసి అందరిని అలరించింది. ఇక నెగెటీవ్ షేడ్స్ ఉన్న అరవింద్ పాత్రకి దేవ్ గిల్ న్యాయం చేశాడు. సీఎంగా రాధా రవి, డాక్టర్‌గా హరీశ్ పేరడితో పాటు యోగిబాబు, జాన్ విజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. విజయ్ ఆంటోని అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాకు పునర్జన్మ నిచ్చింది ఆమెనే: విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించి, సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించి దర్శకుడిగా తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన చిత్రం పిచ్చైక్కారన్–2. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో!) విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ' ఈ సినిమాలో సరైన వ్యక్తులను పెట్టాం. ఎడిటింగ్, మ్యూజిక్, డైరెక్షన్.. ఇలా టెక్నికల్ వర్క్‌లో బిజీగా ఉండడం వల్ల తెలుగు నేర్చులేకపోయా. భవిష్యత్తులో తప్పకుండా తెలుగులో మాట్లాడతా. హీరోయిన్ కావ్య థాపర్ ప్రమాదం నుంచి నన్ను రక్షించింది. నేను చేసిన పొరపాటు వల్లే చిత్రీకరణలో ప్రమాదం జరిగింది. బిచ్చగాడు చూసిన మిమ్మల్ని ఈ సినిమా నిరాశపరచదు.' అని విజయ్ అన్నారు. అడివి శేష్ నటించిన గూఢచారి’ సినిమాని చూశానని.. అలాంటి సినిమాలో నటించడమేకాకుండా కథను స్వయంగా రాయడం కష్టమన్నారు. ఆకాశ్ పూరీ నటించిన సినిమా బాగా ఆకట్టుకుందన్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్రం ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ముందుగా నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ పొంగల్ రోజున విజయ్ ఆంటోని సహాయకుడు ఫోన్ చేసి సార్ నీళ్లలో మునిగి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని చెప్పారన్నారు. అప్పుడు తనకు ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైందన్నారు. తాను విజయ్ ఆంటోనికి అర్థాంగిగానూ, ఆయన చిత్ర నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: అగ్రహీరోల సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా ప్లాన్!) దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ విజయ్ ఆంటోని మంచి సంగీత దర్శకుడిగా రాణిస్తూ మళ్లీ కథానాయకుడిగా నటించాడు ఎందుకు అని అనుకున్నానని, అయితే పిచ్చైక్కారన్ చిత్రం చూసిన తరువాత తన ఆలోచన మారిందన్నారు. ఇప్పుడు ఈ పిచ్చైక్కారన్–2 చిత్రం ట్రైలర్ చూస్తుంటే అన్ని విషయాలు చక్కగా చేశారనిపిస్తోందన్నారు. విజయ్ ఆంటోని పునర్ జన్మ ఎత్తింది ఆయన సతీమణి ఫాతిమా కోసం, అభిమానుల కోసం అని ఆయన మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు. -
కోలీవుడ్ కు సీక్వెల్స్ కలిసి రావడం లేదా?
-
Bichagadu 2 Movie: నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడింది ఆమెనే: విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం బిచ్చగాడు-2. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ నిర్వహించారు. 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. హీరో, దర్శకుడు విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. 'హీరోయిన్ కావ్యే నన్ను పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడింది. తనకు థ్యాంక్యూ. ఇండస్ట్రీలో మొదటి నుంచీ నన్ను సపోర్ట్ చేస్తోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బిచ్చగాడు తర్వాత మరో బ్లాక్ బస్టర్ వస్తోంది. మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు. ఈ సారి సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు.' అని అన్నారు. (ఇది చదవండి: ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి) తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... ' ఏపీ, తెలంగాణలో ఫస్ట్ టైమ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. విజయ్ ఆంటోనీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నేను ఈ సినిమా రెండు రీళ్లు చూశాను. చాలా అద్భుతంగా ఉంది. రెండు రీళ్లకే నెక్ట్స్ ఏంటీ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.' అని అన్నారు. నటుడు జాన్ విజయ్ మాట్లాడుతూ.. 'ఫస్ట్ టైమ్ ఒక తెలుగు సినిమా స్టేజ్ మీద నిల్చున్నా. ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో సంచలనాలు సృష్టించాడు విజయ్. తెలుగు పరిశ్రమ ఈ చిత్రాన్ని ఎంతో ఆదరించింది. ఈ సారి దర్శకుడుగా మరింత పెద్ద బాధ్యత తీసుకున్నాడు విజయ్. ఈ మూవీ మీ అందరికీ బాగా నచ్చుతుంది." అన్నారు. (ఇది చదవండి: క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ ఆర్టిస్టుగా మారిన రంగస్థలం మహేశ్) ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'ఈ చిత్రాన్ని నాకు బాగా తెలిసిన ఉషా పిక్చర్స్ వారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఫస్ట్ పార్ట్‌లో అద్భుతమైన పాయింట్‌తో వచ్చారు. ఆ టైమ్‌లో ఈ సినిమా అన్ని బంధాలను బాగా గుర్తు చేసింది. ఇప్పుడు మరోసారి అలాంటి సెంటిమెంట్‌తోనే ఈ చిత్రం వస్తున్నట్టు కనిపిస్తోంది. నాకు చెల్లి చెల్లీ అనే పాట చాలా ఇష్టం. ఈ పాట ఎంత గొప్పగా తీసి ఉంటారో ఊహించగలను. ఈ చిత్రాన్ని హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.'అని అన్నారు. -
బిచ్చగాడు బంధాలను గుర్తు చేసింది
‘‘విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ చిత్రం అన్ని బంధాలను బాగా గుర్తుచేసింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘బిచ్చగాడు 2’ కూడా అలాంటి సెంటిమెంట్‌తోనే వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేయాలి’’ అని ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విజయ్ ఆంటోని హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘బిచ్చగాడు 2’. కావ్య థాపర్ హీరోయిన్. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘మొదటి భాగంలో మదర్ సెంటిమెంట్ చూశారు.. రెండో భాగంలో సిస్టర్ సెంటిమెంట్ చూడబోతున్నారు’’ అన్నారు. ‘బిచ్చగాడు 2’ని తెలుగులో విడుదల చేస్తున్న ఉషా పిక్చర్స్ విజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఏపీ, తెలంగాణలో తొలిసారి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘బిచ్చగాడు’ని తెలుగువారు ఎంతో ఆదరించారు. ‘బిచ్చగాడు 2’ అంతకంటే ఎక్కువగా మీకు నచ్చుతుంది’’ అన్నారు ఫాతిమా. ‘‘బిచ్చగాడు’ని తెలుగులో నేనే విడుదల చేశాను. ఆ సినిమా కంటే ‘బిచ్చగాడు 2’ ఇంకా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. నటుడు జాన్ విజయ్, తెలుగు అనువాద రచయిత భాష్య శ్రీ ΄ాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్. -
ఆసక్తిని రేకెత్తిస్తున్న 'బిచ్చగాడు-2' ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగులోనూ ఆయనకు సూపర్ క్రేజ్‌ను తెచ్చిపెట్టిందీ సినిమా. దీంతో ఇప్పుడు రానున్న బిచ్చగాడు-2పై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. మే 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..? లక్ష కోట్లకు వారసుడైన ధనవంతుడిగా విజయ్ ఇంట్రడక్షన్ అదిరిపోతుంది. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ చుట్టూ కథను నడిపించినట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. కావ్య థాపర్, దేవ్ గిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
విజయ్ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
‘బిచ్చగాడు’ వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘బిచ్చగాడు–2’ తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడులవుతున్న ఈ సినిమాకు విజయ్ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేశాయి. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్‌ను రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. Trailer tomorrow at 11 AM🔴 Releasing Worldwide on May 19🟡#BLOCKBUSTER 🟢#Pichaikkaran2 #bichagadu2 pic.twitter.com/Xc0TjFQWzx — vijayantony (@vijayantony) April 28, 2023 -
కన్నీళ్లు తెప్పిస్తున్న 'బిచ్చగాడు-2' సాంగ్ చెల్లి వినవే..
‘బిచ్చగాడు’ వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘బిచ్చగాడు–2’ తమిళ, తెలుగు భాషల్లో ఈ వేసవిలో విడుదల కానుంది. విజయ్ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయిక. విజయ్ ఆంటోని సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెల్లీ వినవే.. నా తల్లీ వినవే, నీ అన్నను కాను అమ్మను నేను, చిట్టీ వినవే.. నా బుజ్జీ కనవే.. నీ పుట్టుమచ్చై ఉంటా తోడు..’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఈ పాటను భాష్య శ్రీ రాయగా అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ‘‘ప్రతి ఒక్కర్నీ కదిలించేలా ఈ పాట సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బిచ్చగాడు 2: బికిలి బికిలి అంటూ గొంతెత్తిన హీరో
‘వీళ్లే బికిలి బికిలి బిలి బిలి.. బికిలి బికిలి బిలి బిలి...’ అంటూ పాడారు విజయ్ ఆంటోని. 2016లో విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘పిచ్చైక్కారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శశి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు ‘బిచ్చగాడు’కు సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ వస్తోంది. విజయ్ ఆంటోని నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బికిలి’ అనే పాట మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశారు. భాష్యశ్రీ రాసిన ఈ పాటకు మ్యూజిక్ కంపోజింగ్, సింగర్ విజయ్ ఆంటోనీయే కావడం విశేషం. ఇక పేదవాళ్ల పేదరికాన్ని ఉపయోగించుకుని తన ధనబలంతో వారిని బానిసలుగా చేసి, డబ్బు ఉందన్న అహంకారంతో తిరిగేవాళ్లకు తాను బికిలీ అని పేరు పెట్టినట్లు విజయ్ ఆంటోని పేర్కొన్నారు. -
సమంతతో బాక్సాఫీస్ ఫైట్‌కు దిగిన కోలీవుడ్ హీరో
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా బిచ్చగాడు-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణలోనే విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ను వదిలారు మేకర్స్. ఏప్రిల్14న ఈ బిచ్చగాడు-2ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే సరిగ్గా అదేరోజు సమంత నటించిన శాకుంతలం చిత్రం కూడా రిలీజ్ కానుండటంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఫైట్ కనిపించనుంది. -
వినూత్నంగా బిచ్చగాడు 2 ప్రమోషన్స్, హీరో లేకుండా ట్రైలర్..!
తమిళ హీరో విజయ్ ఆంటోని హీరో తెరకెక్కితోన్న లేటెస్ట్ చిత్రం ‘బిచ్చగాడు 2’. గతంలో సాధారణ సినిమాగా విడుదలై సెన్షేషన్ క్రియేట్ ‘బిచ్చగాడు’కు ఇది సీక్వెల్. ప్రస్తుతం మూవీ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇదిలా రీసెంట్గా మలేషియలో జరిగిన షూటింగ్లో జరిగిన ప్రమాదంలో విజయ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ ఆంటోని 90 శాతం కోలుకున్నాడు. దీంతో అతడు షూటింగ్‌ను ప్రారంభించాడు. ఇక ఈ చిత్ర సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వినూత్నంగా ప్రారంభించింది. చదవండి: ఆటో రామ్ ప్రసాద్‌కు క్యాన్సర్? స్పందించిన నటుడు తాజాగా బిచ్చగాడు 2కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలారు మేకర్స్. టీజర్, ట్రైలర్లకు భిన్నంగా ‘స్నీక్ పీక్ ట్రైలర్’ అంటూ సినిమా ఓపెనింగ్ సన్నివేశాన్ని విడుదల చేసి, అంచనాలు పెంచుతోంది. నాలుగు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్లో ఎక్కడ హీరో గనిపించకపోవడం విశేషం. డబ్బు ప్రపంచానికి హానికరం అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే భిన్న కాన్సెప్ట్‌తో బిచ్చగాడు 2 రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆధునాతనమైన టెక్నాలజీని డబ్బు కోసం ఎలా దుర్వినియోగం చేశాడు, దీని ఎదురయ్యే పరిణామాల చూట్టు బిచ్చగాడు 2 కథ ఉండోబోతుందని తెలుస్తోంది. చదవండి: ప్రకాశ్ రాజ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ -
తీవ్ర గాయాల నుంచి కోలుకున్న స్టార్ హీరో.. షూటింగ్ ప్రారంభం
కోలీవుడ్ స్టార్ హీరో, బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోని ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు 2 మూవీ షూటింగ్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ముఖానికి బలమైన గాయాలు కావడంతో. పళ్లు, దవడ ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం తాను తొంభై శాతం కోలుకున్నానంటూ తాజాగా తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు విజయ్. చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే.. ఈ మేరకు ఆయన తమిళంలో ట్విట్ చేశారు. ‘ప్రస్తుతం 90 శాతం కోలుకున్నాను. ప్రమాదంలో విరిగిన నా దవడ, ముక్కు ఎముకలు కలిసిపోయాయి. ఏం జరిగిందన్నది నాకు తెలియదు. కానీ, మీ వల్ల నేను గతంలో కంటే ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నా. ఏప్రిల్ 2న విడుదల కాబోయే పిచైకారన్ 2(బిచ్చగాడు 2) షూటింగ్‌ను నేటి నుంచి ప్రారంభించబోతున్నా. నాపై చూపించిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞుడుని. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ విజయ్ తన ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ ట్విట్లో రాసుకొచ్చారు. చదవండి: ‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? அன்பு இதயங்களே நான் 90% குணம் அடைந்து விட்டேன். உடைந்த என் தாடை, மூக்கு எலும்புகள் ஒன்று சேர்ந்துவிட்டன. என்னமோ தெரியவில்லை, நான் இப்போது முன்பைவிட அதிக சந்தோஷத்தை உங்களால் உணருகிறேன்😊 வரும் ஏப்ரல் வெளியாகும் பிச்சைக்காரன் 2 பட வேலைகளை இன்று முதல் தொடங்குகிறேன்🙏 அன்புக்கு நன்றி — vijayantony (@vijayantony) February 2, 2023 -
విజయ్ ఆంటోని ఆరోగ్యంపై రకరకాల వార్తలు! ఫొటోతో క్లారిటీ ఇచ్చిన హీరో
కోలీవుడ్ స్టార్ హీరో, బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోని ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు 2 మూవీ షూటింగ్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ముఖానికి బలమైన గాయాలు కావడంతో. పళ్లు, దవడ ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, కొమాలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమాలంత ఆందోళనకు గురవుతున్నారు. చదవండి: ఎన్టీఆర్ వర్థంతి నాడు నాగ్ అలా.. ఏఎన్ఆర్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. ఈ క్రమంలో తన ఆరోగ్యంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు విజయ్. ఆస్పత్రి బెడ్‌పైనే ఉన్న ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. తన ఆరోగ్యంపై బాగానే ఉందని, కోలుకుంటున్నానని చెప్పారు. ‘‘డియర్ ఫ్రెండ్స్.. మలేషియాలో ‘పిచ్చైకారన్ 2’ (‘బిచ్చగాడు 2’) చిత్రీకరణ చేస్తున్న సమయంలో నేను ప్రమాదానికి గురయ్యా. ఈ ఘటనలో నా దవడ, ముక్కు భాగాలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా కోలుకున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తి అయ్యింది. వీలైనంత తొందరలో మీతో మాట్లాడతాను. ఈ కఠిన పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని విజయ్ ట్వీట్ చేశారు. చదవండి: ఆనంద్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గురించిన ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ఈ సందర్భంగా ఆస్పత్రి బెడ్‌పైనే థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ ఉన్న తన ఫోటోని షేర్ చేశారు ఆయన. దీంతో ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది. విజయ్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్న క్రమంలో స్వయంగా ఆయనే ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మలేషియాలో జరుగుతున్న బిచ్చగాడు-2 షూటింగ్లో యాక్షన్ సీన్స్ చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. Dear friends, I am safely recovered from a severe jaw and nose injury during Pichaikkaran 2 shoot in Malaysia. I just completed a major surgery. I will talk to you all as soon as possible😊✋ Thank you for all your support and concern for my health🙏❤️ pic.twitter.com/YJm24omxrS — vijayantony (@vijayantony) January 24, 2023 -
'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమం?
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తమిళ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ పళ్లు విరిగిపోయాయని, దవడ ఎముక సైతం విరిగినట్లు తెలుస్తోంది. ముఖానికి కూడా బలంగా దెబ్బలు తగిలియని సమాచారం. ప్రస్తుతం ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని, కండిషన్ సీరియస్‌గా ఉండటంతో విజయ్ కుటుంబసభ్యులు ఇప్పటికే మలేషియాకు చేరుకోగా, అక్కడినుంచి చెన్నైకి తరలించినట్లు ఆమె భార్య ఫాతిమా తెలిపారు. కాగా మలేషియాలో ప్రస్తుతం బిచ్చగాడు-2 షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీన్స్ చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకంటున్నారు. ప్రస్తుతానికి బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లే. మరోవైపు విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు. -
'బిచ్చగాడు' హీరోకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు దాదాపు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై భారీగా పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పిచ్చైక్కారన్–2 (బిచ్చగాడు-2) తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతుండడం ప్రత్యేకత. అయితే తాజాగా విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి. మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్‌లో పిచైక్కారన్- 2 సెట్లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ వాటర్ బోట్లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆ సమయంలో అదుపు తప్పిన వాటర్ బోట్ కెమెరామెన్ సిబ్బంది ఉన్న పెద్ద పడవలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బిచ్చగాడు టాలీవుడ్‌లోనూ ఫేమస్ అయ్యారు. ఈ సినిమాలో అమ్మ కోసం 48 రోజుల పాటు రహస్య జీవితాన్ని గడిపే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు, హీరోగా పిచైక్కారన్- 2 చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్ విజయ్, హరీష్ బెరాడి, వై.జి.మహేంద్రన్, అజయ్ ఘోష్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ ఈ ఏడాది తమిళరసన్, అగ్ని సిరగుగల్, ఖాకీ, కొలై, రథం, మజై పిడిక్కత మనితన్ లాంటి తమిళ ప్రాజెక్టుల్లో నటించనున్నారు. -
సమ్మర్ స్పెషల్‌గా విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు అరడజనుకుపైగానే ఉన్నాయి. అవన్నీ 2023లో వరుసగా తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. కాగా విజయ్ ఆంటోని ఇంతకు ముందు నటించిన పిచ్చైక్కారన్(తెలుగులో బిచ్చగాడు) చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగులోనూ అనువాదమై మంచి పసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పిచ్చైక్కారన్–2 తెరకెక్కుతోంది. చదవండి: ఆస్కార్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్ఆర్ఆర్’ విశేషమేంటంటే ఈ చిత్రం ద్వారా విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్ హక్కులను స్టార్ నెట్ వర్క్ సంస్థ సొంతం చేసుకుంది. 2023లో సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు. #ANTIBIKILI 👺#Pichaikkaran2 #Bichagadu2 #Bhikshuka2 #Bhikshakkaran2 Satellite & Digital rights acquired by Star Network 🔴 Summer 2023 🔥@vijaytelevision @StarMaa @asianet @StarSuvarna @DisneyPlusHS @mrsvijayantony @vijayantonyfilm @DoneChannel1 @gskmedia_pr @gobeatroute pic.twitter.com/w0YPShC1xy — vijayantony (@vijayantony) December 20, 2022 -
విడాకులు తీసుకోబోతున్న బిచ్చగాడు హీరో? మూడో వ్యక్తే కారణమా?
ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పటికే చై-సామ్, ధనుష్-ఐశ్వర్యల విడాకుల అంశం హాట్‌టాపిక్‌గానే ఉంది. తాజాగా మరో కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్ర్కొంన్నట్లు కోలీవుడ్ టాక్. తన భార్య ఫాతిమాతో ఆయనకు విభేదాలు వచ్చాయని, ఈ కారణంగా విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా విజయ్ చేసిన ఓ ట్వీట్ ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. 'కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి అంతేకానీ మధ్యలోకి మూడో వ్యక్తిని రానీయకండి. వారు వచ్చి మీ నాశనాన్ని చూసి ఆనందిస్తారు' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. సాధారణంగా తన సినిమాల గురించి తప్పా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని విజయ్ ఇలాంటి కామెంట్స్ చేయడంపై తమిళనాట పెద్ద చర్చ నడుస్తుంది. ఫాతిమాతో విభేదాల కారణంగానే విజయ్ ఈ పోస్ట్ చేశాడా? త్వరలోనే వీరు కూడా విడాకుల ప్రకటన చేస్తారేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ ఫాతిమాతోనే విజయ్ ప్రేమలో పడ్డాడు. 2006లో వీరికి వివాహం జరిగింది. -
అలాంటి వారితో పనిచేయడం సంతోషంగా ఉంది: విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కొలై. మీనాక్షీ చౌదరి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. బాలాజీ కె.కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం తాజాగా స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. నిర్మాతల్లో ఒకరైన ధనుంజయన్ మాట్లాడుతూ ఈ చిత్రం రూపొందడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ ఆంటోని అని పేర్కొన్నారు. దర్శకుడు బాలాజీ కె.కుమార్ ప్రతిభావంతుడన్నారు. ఆయనకు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి అనుభవం ఉందన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర క్లైమాక్స్‌ను చాలా ఉత్కంఠగా ఉంటుందన్నారు. ఇది తన తొలి తమిళ చిత్రం అని నటి మీనాక్షి చౌదరి పేర్కొన్నారు. ఇందులో నటించడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని మాట్లాడుతూ ఈ చిత్రంలో భాగం కావడం ఘనంగా భావిస్తున్నానన్నారు. ఇది దర్శకుడు బాలాజీ కె. కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. కొలై ప్రపంచస్థాయి ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని తాను ధృఢంగా చెప్పగలనన్నారు. చిత్ర నిర్మాతలు ఎంతో ప్రతిభావంతులని, వారు తమిళ సినిమాకు వరం లాంటి వారని చెప్పారు. అలాంటి వారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని విజయ్ ఆంటోని అన్నారు. దీనికి శివకుమార్ విజయన్ ఛాయాగ్రహణం, గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
విజయ్ ఆంటోని జంటగా ఫరియా, తొలి షూటింగ్ షెడ్యూల్ పూర్తి
సాక్షి, చెన్నై: తన సినీ ప్రస్థానంలో ముఖ్యమైన చిత్రం ‘వళ్లి మయిల్’ అని దర్శకుడు సుశీంద్రన్ అన్నారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. విజయ్ ఆంటోని, భారతీరాజా, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా జాతిరత్నాలు చిత్రం ఫేమ్ ఫరియా అబ్దుల్లా నాయికగా కోలీవుడ్‌కు పరిచయం అవుతుంది. తొలి చిత్రంలోనే టైటిల్ రోల్లో నటించే అవకాశాన్ని ఈ భామ దక్కించుకుంది. నల్లుసామి పిక్చర్స్ పతాకంపై తాయ్ సరవణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. చదవండి: లండన్‌లో ఘనంగా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్ కాగా మంగళవారం చెన్నైలో నిర్వహించిన చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడారు. ఇది పీరియాడికల్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ కథను నాలుగేళ్లుగా రాస్తున్నానని చెప్పారు. విజయ్ ఆంటోని వంటి ప్రముఖ నటులతో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. నటి ఫరియా అబ్దుల్లా టైటిల్ పాత్రలో చాలా చక్కగా నటిస్తున్నారని, ఆమెకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సంగీత దర్శకుడు డి.ఇమాన్ మంచి బాణీలు అందిస్తున్నారన్నారు. దీన్ని తమిళంతో పాటు అనేక భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. -
'జ్వాల'ను రగిల్చిన రానా.. టీజర్ రిలీజ్
‘‘పాత రోమ్ నగరం గుర్తుందా మిత్రుడా! ఇద్దరు గ్లాడియేటర్స్ తలపడతారు, ఓడినవాడు చస్తాడు గెలిచినవాడు మాత్రమే బ్రతుకుతాడు.. బతికుంటే అలాంటి ఒక గెలుపుతో బతికుండాలి. చచ్చినాకూడా అలాంటి వాడి చేతిలో చచ్చాము అనే గర్వంతో చావాలి...’’. ఇటువంటి పవర్ఫుల్ డైలాగ్‌లు ఉన్న ‘జ్వాల’’ చిత్ర టీజర్‌ను శుక్రవారం యంగ్ హీరో రానా దగ్గుబాటి సోషల్ మీడియా ట్విటర్ ద్వారా విడుదల చేశారు. బేస్ వాయిస్‌తో తెరమీద కనిపించే సన్నివేశాలను గురించి విశ్లేషిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ మనిషి కథలా చెప్తూ ఉంటారు. ‘సాహో’ ఫేమ్ అరుణ్ విజయ్, ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని టీజర్లో పోటాపోటీగా నటించారు. అక్షర హాసన్ కీలక పాత్రలో నటించారు. ‘జ్వాల’ పాన్ఇండియా చిత్రాన్ని అమ్మ క్రియేషన్స్ టి.శివ సమర్పిస్తుండగా శర్వాంత్‌రామ్ క్రియేషన్స్ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి మూవీస్ పతాకంపై యం.రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, స్విట్జర్లాండ్, కలకత్తాలతో పాటు అనేక దేశాల్లో షూటింగ్ జరుపుకుంది. అరుణ్‌విజయ్, విజయ్ ఆంటోనీ, అక్షరహాసన్‌ల కెరీర్లోనే తెరకెక్కిన భారీబడ్జెట్ చిత్రం ‘జ్వాల’. ఈ చిత్రాన్ని నవీన్ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌రాజ్, రైమాసేన్, నాజర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా– కె.ఎ.బచ్చ, ఎడిటర్– వెట్రికృష్ణన్, సంగీతం– నటరాజన్ శంకరన్ పీ.ఆర్.వో– శివమల్లాల. -
విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ప్రారంభం
నటుడు విజయ్ ఆంటోనితో జత కట్టడానికి జాతి రత్నాలు చిత్రం నాయకి ఫరియా అబ్దుల్లా సిద్ధమయ్యారు. సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వెల్లి మయిల్ అనే పేరు నిర్ణయించారు. సత్యరాజ్, దర్శకుడు భారతీరాజా తెలుగు నటుడు సునీల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని నల్లుసామి పిక్చర్స్ పతాకంపై తాయ్ శరవణన్ నిర్మిస్తున్నా రు. షూటింగ్ సోమవారం ఉదయం దిండిగల్ సమీపంలోని సూత్తంపూండి గ్రామంలోని శివాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇది 1980 కాలంలో సాగే చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, విజయ్ కె.చక్రవర్తి చాయాగ్రహణం అందిస్తున్నారు. -
కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న 'జాతిరత్నాలు' బ్యూటీ
జాతిరత్నాలు సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. చిట్టి పాత్రలో ఫరియా నటనకు మంచి మార్కులే పడ్డాయి. జాతిరత్నాలు తర్వాత కూడా పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అవేవి పట్టాలెక్కలేదు. రీసెంట్గా బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందేసిన ఫరియా ప్రస్తుతం రవితేజతో రావణాసుర అనే చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకు కోలీవుడ్ నుంచి పిలుపొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. బిచ్చగాడు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ ఆంటోనీ సరసన ఫరియా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫరియా పల్లెటూరి అమ్మాయిగా ఛాలెంజింగ్ రోల్లో కనిపించనుందట. -
సరికొత్త కాన్సెప్ట్‌తో ‘రత్తం’.. డబ్బింగ్ ప్రారంభం
రత్తం చిత్ర డబ్బింగ్ శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. ఆయనకు జంటగా మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యా నంబీశన్ మొదలగు ముగ్గురు నాయికలు నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్ పతాకంపై కమల్ బొహ్రా, లలిత ధనుంజయ్, బి.ప్రదీప్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి.ఎస్.అముదన్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: అప్పుడు చాలా అవమానంగా అనిపించింది: చిరంజీవి) సరికొత్త కాన్సెప్ట్‌తో ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్‌ను ప్రణాళిక ప్రకారం రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇండియాలోని ప్రధాన ప్రాంతాల్లో కొంతభాగం పూర్తి చేసుకుందని, మిగిలిన భాగాన్ని త్వరలో విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు పేర్కొన్నారు. మరోపక్క డబ్బింగ్ పార్ట్‌ను శనివారం ప్రారంభించినట్లు చెప్పారు. దీనికి కన్నన్ సంగీతాన్ని, గోపి అమర్నాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
ఈ హీరో 'బిచ్చగాడి'లా ఎలా మారిపోయాడో చూడండి
Vijay Antony's Bichagadu-2 Theme Song: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ రూపొందుతోంది. ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించడంతోపాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు విజయ్ ఆంటోని. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్. ఈ చిత్రం థీమ్ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. ‘చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు ’ అనే మాటలు థీమ్ సాంగ్‌లో వినిపిస్తాయి. చరిత్రను సంపన్నులు రాశారు. -
ముగ్గురు హీరోయిన్లతో 'బిచ్చగాడు' హీరో రొమాన్స్
Vijay Antony Next With Cs Amudhan Titled Ratham: విజయ్ ఆంటోని ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నారు. సంగీత దర్శకుడి నుంచి కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు విజయ్ ఆంటోని. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రానికి రత్తం అనే టైటిల్‌ను ఆదివారం ఖరారు చేశారు. ఇందులో నటి మహిమ నంబియార్, నందిత శ్వేత, రమ్యానంబీశన్ కథానాయికలుగా నటించడం విశేషం. హాస్యనటుడు జగన్ కృష్ణ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్‌పడం చిత్రం ఫేమ్ సి ఎస్ అముదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, లలితా ధనుంజయన్, బి.ప్రదీప్, పంకజ్ బోరా, ఎస్.విక్రమ్ కుమార్ కలిసి నిర్మిస్తున్నారు. దీనికి గోపి అమర్నాథ్ ఛాయా గ్రహణాన్ని, కన్నన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని, సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
టాలీవుడ్‌కి పరిచయం అవుతున్న పరభాషా హీరోలు
టాలీవుడ్‌ది పెద్ద మనస్సు... ఎంతమంది వచ్చినా ఎస్సు అంటుంది. మామూలుగా పరభాషా నాయికలు, విలన్లు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు పరభాషా హీరోలు ఇక్కడ హీరోలుగా పరిచయం కానున్నారు. అంతేనా... పరభాషలో హీరోలుగా దూసుకెళుతున్నవాళ్లు ఇక్కడ సహాయనటులుగా, విలన్లుగా పరిచయం కానున్నారు. ‘రారండోయ్ పరిచయం చేస్తాం’ అంటూ అందరికీ అవకాశం ఇస్తోంది టాలీవుడ్. ఈ పరిచయాలు పెరగడానికి ఓ కారణం పాన్ ఇండియన్ సినిమాలు. ఏది ఏమైనా ఇతర భాషల్లో లేనంతగా తెలుగులో పరభాషలవారికి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ స్టార్స్ గురించి తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన ‘మాస్టర్’, ‘బిగిల్’, ‘సర్కారు’, ‘మెర్సెల్’ వంటి చిత్రాలు తెలుగులో అనువాదమై, మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. మరో తమిళ స్టార్ ధనుష్ అయితే ఒకేసారి రెండు తెలుగు సినిమాలు కమిట్ కావడం విశేషం. శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో ఆయన సినిమాలు చేయనున్నారు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న ‘సర్’ (తమిళంలో ‘వాతి’) సినిమా షూటింగ్ ఈ నెల 5న ప్రారంభం కానుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ మార్చిలో ఆరంభమవుతుందట. ఇక తమిళంలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుని, హీరోగా మారిన శివకార్తికేయన్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రానికి ఇటీవలే సైన్ చేశారు. ‘జాతిరత్నాలు’ వంటి మంచి హిట్ ఇచ్చిన కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే సంగీతదర్శకుడిగా, ఎడిటర్‌గా నిరూపించుకుని, హీరోగా చేస్తున్న విజయ్ ఆంటోని ఇప్పటివరకూ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించారు. ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకున్నారు. అయితే సోలో హీరోగా కాదు.. మరో హీరోతో కలిసి ‘జ్వాల’లో నటిస్తున్నారు. ఆ మరో నటుడు ఎవరంటే.. ‘బ్రూస్లీ’, ‘సాహో’ చిత్రాల్లో ఓ రోల్ చేసిన అరుణ్ విజయ్ అన్నమాట. ఈ ఇద్దరూ హీరోలుగా ‘జ్వాల’ (తమిళంలో ‘అగ్ని సిరగుగళ్’ టైటిల్) చేస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ దర్శకుడు. అటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. కీర్తీ సురేష్ చేసిన ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో ఆకట్టుకున్నారు దుల్కర్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దుల్కర్‌కు హీరోగా తెలుగులో తొలి చిత్రం. ఇక టాలీవుడ్‌కు హాయ్ చెబుతున్నారు మరో మలయాళ నటుడు దేవ్ మోహన్. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’లో దేవ్ మోహన్ మెయిన్ లీడ్‌గా చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు తెలుగుకి పరిచయం కావడానికి రెడీ అవుతున్నారు. అక్కడ హీరోలు... ఇక్కడ క్యారెక్టర్లు! మాతృభాషలో హీరోలుగా చేస్తూ హీరోలుగానే తెలుగులో పరిచయమవుతున్న వారు కొందరైతే... పరభాష హీరోలు కొందరు ఇక్కడ కీలక పాత్రలు చేస్తుండడం విశేషం. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రంలో నవాజుద్దిన్ సిద్ధిఖీ ఓ పాత్ర చేయనున్నారనే ప్రచారం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ప్రభాస్ హీరోగా చేసిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రధానంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. సో.. ‘ఆదిపురుష్’ సినిమాయే సైఫ్‌కి తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రంలోని లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఓ రోల్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించారు. ఇక జూనియర్ ఆర్టిస్టు నుంచి మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు దునియా విజయ్ టాలీవుడ్‌కు వస్తున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో దునియా విజయ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. మరో కన్నడ యాక్టర్ ధనుంజయ ‘పుష్ప’ చిత్రంతో, వశిష్ట సింహా ‘నయీం డైరీస్’తో వచ్చారు. మరోవైపు ఇటీవల విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో విలన్‌గా చేసి, తెలుగు ప్రేక్షకులకు స్ట్రయిట్‌గా హాయ్ చెప్పారు మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్. వీరితోపాటు మరికొందరు పరభాషా నటులు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో కనిపించిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, వరుణ్ తేజ్ ‘గని’లో సునీల్ శెట్టి, రవితేజ ‘ఖిలాడి’లో ఉన్ని ముకుందన్ తదితరులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. -
న్యాయం కోసం..
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమిళరాసన్’. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు. రెమిసెస్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించారు. పెప్సి శివ సమర్పణలో ఎస్.కౌసల్య రాణి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న తమిళంలో విడుదలవుతోంది. కాగా ఈ చిత్రాన్ని ‘విక్రమ్ రాథోడ్’ పేరుతో రావూరి వెంకటస్వామి అదేరోజు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.కౌసల్య రాణి, రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సత్యం, న్యాయం, ధర్మం కోసం హీరో ఎలా పోరాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. ‘విక్రమ్ రాథోడ్’ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. యస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఆలపించిన ‘కన్నా దిగులవకు.. తొడున్నా నీ కొరకు...’ అనే పాట మా సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది. కె.జె. యేసుదాస్గారు కూడా మా చిత్రంలో పాడడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ఆర్.డి.రాజశేఖర్. -
‘విజయ రాఘవన్’ మూవీ రివ్యూ
టైటిల్ : విజయ రాఘవన్ నటీనటులు : విజయ్ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు నిర్మాతలు : టి.డి.రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ దర్శకత్వం: ఆనంద కృష్ణన్ సంగీతం : నివాస్ కె.ప్రసన్న సినిమాటోగ్రఫీ : ఎన్.ఎస్.ఉదయ్‌కుమార్ ఎడిటింగ్: విజయ్ ఆంటోని విడుదల తేది : సెప్టెంబర్ 17, 2021 ‘నకిలీ, డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈయన హీరోగా.. ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తెరకెక్కించిన చిత్రం ‘విజయ రాఘవన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కోడియిల్ ఒరువన్’ పేరుతో తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకరి ఫిలింస్ బ్యానర్‌పై రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుదల చేశారు. ‘విజయ రాఘవన్’ పేరుతో తెలుగులో సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే? అరకులోని ఓ గ్రామానికి చెందిన విజయ రాఘవన్ (విజయ్ ఆంటోని) తన తల్లి ఆశయం కోసం ఐఏఎస్ కావాలనుకుంటాడు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ వచ్చి ఒక పక్క పిల్లలకు ట్యూషన్ చెబుతూ.. మరో పక్క ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా విజయ్ రాఘవన్ లోకల్ రాజకీయాల్లోకి తలదూర్చాల్సివస్తుంది. దాని వల్ల ఐఏఎస్ ఐఏఎస్ ఇంటర్వ్యూ అడ్డంకులు వస్తాయి. ఒకవైపు తల్లికిచ్చిన మాట మరోవైపు రాజకీయనాయకులు ఒత్తిడి. చివరికి ఆ కాలనీకి కార్పొరేట్ గా ఎన్నికవుతాడు. విజయ రాఘవన్ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన కార్పొరేటర్ గా ఎలా గెలిచాడు ? తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చాడా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. విజయ రాఘవన్ పాత్రలో కనిపించిన విజయ్ ఆంటోని తన హావభావాలతో చక్కగా నటించాడు. తల్లికి ఇచ్చిన మాట కోసం పాడుపడే ఓ మంచి కొడుకుగా తనదైన నటనతో సినిమా భారం మొత్తాన్ని భూజాన వేసుకొని నడిపించాడు. పోరాట సన్నివేశాల్లో విజయ్ చక్కగా నటించాడు. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఎలా ఉందంటే? ‘మెట్రో’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రసంసలు అందుకున్న ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రమే విజయ రాఘవన్. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకునే ఓ యువకుడి కథే ఇది. జీవితంలో ఎన్నో సాధించాలనుకునే హీరో, తన తల్లి కోరికను తీర్చాలనుకుంటాడు. ఆ క్రమంలో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి తనెలా బయటపడతాడు అనేదే ఈ చిత్రం. సమాజంలో మనకు ఎదురయ్యే రాజకీయ పరమైన ఇబ్బందులను ఎలా హ్యాండిల్ చేయాలనే సందేశం కూడా ఇస్తుంది. మారుమూల గ్రామం నుంచి సిటీవరకు జరుగుతున్న రాజకీయ నాయకుల అవినీతి, ప్రభుత్వాధికారుల చేతివాటం, బెదిరింపు రాజకీయాలు వంటి అంశాలన్నీ దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించాడు.ముఖ్యంగాభ్రష్టుపట్టినట్లుగా ఉన్న గవర్నమెంట్ కాలజీని హీరో శుభ్రం చేయడం, అక్కడివారిని చైతన్యవంతుల్ని చేయడం అనే అంశాలు, సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి. అలాగే మదర్ సెంటిమెంట్ సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయి. కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు ఆనంద కృష్ణన్.. కొన్ని సీన్స్‌లో నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, ఆనంద కృష్ణన్ మాత్రం వాటిని సింపుల్ గా నడిపారు. సెకండాఫ్ చాలా వరకు సినిమాటిక్‌గా సాగుతుంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని అనవసరపు సీన్స్ ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టిస్తాయి. నివాస్ కె.ప్రసన్న సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ నేపథ్య సంగీతం అదిరిపోయింది. ఎన్.ఎస్. ఉదయ్‌కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
అమ్మకలను నెరవేర్చే కథ ఇది: విజయ్ ఆంటోనీ
‘‘బిచ్చగాడు’ ఓ అమ్మ కథ అయితే, ‘విజయ రాఘవన్’ ఓ అమ్మ కలను నెరవేర్చే చిత్రం. ఈ సినిమాలో చాలా భావోద్వేగాలున్నాయి. ప్రేక్షకులను మా చిత్రం నిరుత్సాహపరచదు’’ అని విజయ్ ఆంటోని అన్నారు. ఆనంద కృషన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని, ఆత్మిక జంటగా రపొందిన తమిళ చిత్రం ‘కోడియిల్ ఒరువన్’. టీడీ రాజా, డీఆర్ సంజయ్ కువర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి ‘విజయ రాఘవన్’ పేరుతో ఈ నెల 17న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో.. ‘‘ఈ చిత్ర విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి. ‘‘ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకునే ఓ యువకుడి కథే ‘విజయ రాఘవన్’’ అన్నారు ఆనంద కృషన్. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ కమల్, రచయిత భాష్యశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కె.ప్రసన్న తదితరులు మాట్లాడారు. -
హీరో విజయ్ అంథోని హీరోయిన్ ఆత్మికలతో స్పెషల్ చిట్ చాట్
-
బిచ్చగాడు 2 : కొత్త అవతారమెత్తిన విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. తెలుగు నాట సైతం ఎన్నో రికార్డులను సృష్టించింది ఈ చిత్రం. ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో రికార్డులు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. ఇప్పుడు ‘బిచ్చగాడు’చిత్రానికి కొనసాగింపుగా బిచ్చగాడు 2 సినిమా ని విజయ్ ఆంటోనీ తన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా, హీరోగా విజయవంతం అయినా విజయ్ ఆంటోనీ దర్శకుడిగా మెప్పించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థే ఈ చిత్రాన్నీ నిర్మిస్తుంది. ప్రముఖ రచయిత భాష్య శ్రీ ఈ సినిమా కి మాటలు అందిస్తున్నారు. ఇక ఈరోజు విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ చిత్రానికి సంబందించిన లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఆయనను దర్శకుడిగా అనౌన్స్ చేస్తూ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేశాడు. -
‘విజయ రాఘవన్’ రిలీజ్ డేట్ ఫిక్స్
‘బిచ్చగాడు, కిల్లర్’ చిత్రాల ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్’. ఇందులో ఆత్మిక హీరోయిన్గా నటించారు. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో టీడీ రాజా, డీఆర్ సంజయ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ‘విజయ రాఘవన్ ’ చిత్రాన్ని మే 14న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ – ‘‘ఓ మాస్ ఏరియాలో పిల్లలు పక్కదారులు పట్టకుండా చదువు గొప్పతనాన్ని వారికి వివరించి, ఆ పిల్లల ఉన్నతికి పాటుపడే యువకుడి కథే ‘విజయ రాఘవన్ ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 14న తమిళ, తెలుగు భాషల్లో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. -
బిచ్చగాడు 2 డైరెక్ట్ చేసేది ఆయనే: హీరో
‘‘తెలుగు ప్రేక్షకులు కోవిడ్ తర్వాత కూడా సినిమాలను అద్భుతంగా ఆదరిస్తున్నారు. ‘క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు’ సహా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు.. ఈ లిస్ట్‌లో మా ‘విజయ రాఘవన్’ సినిమా కూడా చేరుతుందనే నమ్మకం ఉంది’’ అని విజయ్ ఆంటోని అన్నారు. ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని, ఆత్మిక జంటగా నటించిన చిత్రం ‘విజయ రాఘవన్’. టి.డి. రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. విజయ్ ఆంటోని మాట్లాడుతూ –‘‘మదర్ సెంటిమెంట్, ప్రేమ, రొమాన్స్, యాక్షన్.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో ఆనంద కృష్ణన్ అద్భుతంగా తెరకెక్కించాడు. అందుకే నా తర్వాతి సినిమా ‘బిచ్చగాడు 2’కి ఆయనకే దర్శకత్వ బాధ్యతలను అప్పగించాను’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: కమల్ బోరా, లలితా ధనంజయన్, బి. ప్రదీప్, పంకజ్ బోరా, ఎస్. విక్రమ్ కుమార్. చదవండి: రాజ్‌తరుణ్.. కూర్చుంది చాలులే : సమంత -
విభిన్న రాఘవన్
విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. ఆయన నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్’. ఆత్మిక కథానాయిక. ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమాను టి.డి. రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. యాక్షన్ నిండిన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ‘‘గతంలో విజయ్ ఆంటోనీ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: ఎన్.ఎస్. ఉదయ్ కుమార్, సహ నిర్మాతలు: కమల్ బోరా, లలితా ధనుంజయన్, బి. ప్రదీప్, పంకజ్ బోరా, ఎస్. విక్రమ్ కుమార్. -
థ్రిల్లింగ్ జ్వాల
‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు తమిళ నటుడు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా రూపొందు తోన్న తాజా చిత్రం ‘జ్వాల’. నవీన్.యమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగులో ‘జ్వాల’గా, తమిళ్లో ‘అగ్ని శిరగుగళ్’ పేరుతో తెరకెక్కుతోంది. శర్వంత్‌రామ్ క్రియేషన్స్ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి క్రియేషన్స్ పతాకంపై యమ్. రాజశేఖర్ రెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా యమ్. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్ దేశాలతో పాటు యూరప్‌లోని పలు దేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఆఖరి షెడ్యూల్ కోల్‌కత్తాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. విజయ్ ఆంటోని కెరీర్లోనే దాదాపు 25కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన అక్షరాహాసన్ నటిస్తుండగా, ‘సాహో’ ఫేమ్ అరుణ్ విజయ్, రీమాసేన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: నటరాజన్. -
బిచ్చగాడు2 టైటిల్ లోగో విడుదల
నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని మరోసారి బిచ్చగాడుగా మారడానికి సిద్ధమవుతున్నారు. సౌండ్ ఇంజినీర్‌గా తన సినీ పయనాన్ని ప్రారంభించిన విజయ్‌ఆంటోని ఆ తరువాత 1995లో విజయ్ నటించిన శుక్రన్ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అలా పలు చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఈయన 2016లో విడుదలైన కిళక్కు కరై సాలై చిత్రం ద్వారా నటుడిగా తెరంగేట్రం చేశారు. ఆపై నటుడిగా, సంగీత దర్శకుడిగా రెండు పడవలపై విజయవంతంగా పయనిస్తున్న విజయ్‌ఆంటోని నాన్ చిత్రంతో కథానాయకుడిగా అవతారమెత్తారు. అంతే కాకుండా ఆయన ఆ చిత్రంతో నిర్మాతగానూ మారారు. ఇలా సంగీత దర్శకుడిగా, నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా విజయ్ ఆంటోని రాణిస్తున్నారు. కాగా విజయ్ ఆంటోని నటించిన పిచ్చైక్కారాన్ 2016లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం బిచ్చగాడు పేరుతో తెలుగులో అనువాదమై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా తాజాగా జూలై 24న విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతెేకాకుండా దానికి సంబంధించిన తెలుగు, తమిళ పోస్టర్స్2ను కూడా రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని ఆయన సతీమణి ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి భారం చిత్రంతో ఉత్తమ దర్శకురాలు అవార్డు గెలుచుకున్న ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించనున్నారు. #pichaikkaran2 #Bitchagadu2 pic.twitter.com/hsaEdEURMO — vijayantony (@vijayantony) July 24, 2020 -
బిచ్చగాడు 2
‘బిచ్చగాడు’ సినిమాతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. జాతీయ అవార్డుగ్రహీత ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా, మరోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటోని పుట్టినరోజు జూలై 24 (శుక్రవారం). ఈ సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ‘బిచ్చగాడు 2’ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను విడుదల చే శారు. -
బిచ్చగాడు మళ్లీ వస్తున్నాడు
తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిచ్చైకారన్’. తెలుగులో ‘బిచ్చగాడు’గా అనువాదమై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం కాబోతున్నట్టు ప్రకటించారు విజయ్ ఆంటోని. సీక్వెల్‌కి సంబంధించిన కథను ఆయనే రాస్తున్నారు. ఆల్రెడీ నాలుగు నెలలుగా ఈ కథ మీద పని చేస్తున్నట్టు తెలిపారు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన శశి ఈ సీక్వెల్‌కి దర్శకత్వం చేయరట. ఈ సీక్వెల్‌ను నిర్మించడంతో పాటు సంగీత దర్శకత్వం కూడా వహిస్తారట విజయ్ ఆంటోని. నిజానికి ముందు సంగీతదర్శకుడిగానే ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత హీరోగా మారి, సినిమాలు చేస్తున్నారు. తాను నటించే సినిమాలను దాదాపు తానే నిర్మిస్తున్నారు కూడా. అలా నిర్మాతగా కూడా మారారు. ఇప్పుడు ‘బిచ్చగాడు’కి సీక్వెల్‌కి కథ రాస్తూ, కథారచయితగా కూడా తన ప్రతిభను నిరూపించుకోబోతున్నారు. -
పారితోషికంలో పాతిక కట్
కరోనా మహమ్మారి ప్రభావంతో సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి, రిలీజులు ఆగాయి. ఇప్పటికే సినిమాలు ఆరంభించిన, తమ చిత్రాలను విడుదలకు సిద్ధం చేసిన నిర్మాతలు ఇరకాటంలో పడ్డారు. అందుకే సంగీత దర్శకుడు, హీరో విజయ్ ఆంటోనీ తన పారితోషికంలో పాతిక శాతాన్ని తగ్గించుకుంటున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఆయన ‘తమిళరసన్’, ‘అగ్ని సిరగుగళ్’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలకు సంబంధించి నిర్మాతలకు అండగా ఉండేందుకు తన పారితోషికంలో 25 శాతాన్ని వదులుకున్నారు విజయ్ ఆంటోనీ. ‘‘నిర్మాతల కష్టాలను అర్థం చేసుకుని పారితోషికం తగ్గించుకున్న విజయ్ ఆంటోనీకి ధన్యవాదాలు. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ నిర్మాతలకు అండగా ఉండాల్సిన తరుణమిది. ప్రొడ్యూసర్స్ యాక్టర్‌గా విజయ్ ఆంటోనీ ఒక ఉదాహరణగా నిలిచారు’’ అన్నారు ‘ఖాకీ’ చిత్రనిర్మాత టి. శివ. గత ఏడాది ‘కొలైగారన్’ (తెలుగులో ‘కిల్లర్’)తో సూపర్‌హిట్ సాధించిన విజయ్ ఆంటోనీ 2016లో వచ్చిన ‘పిచ్చైకారన్’ (తెలుగులో ‘బిచ్చగాడు’) సూపర్ సక్సెస్‌తో కోలీవుడ్, టాలీవుడ్లో బాగా పాపులర్ అయ్యారు. -
‘విజయ్‌తో చేయాలనుంది’
దళపతి విజయ్‌కు జంటగా నటించాలనుందని అంటోంది నటి ఆషిమా నార్వల్. ఉత్తరాది బ్యూటీస్ కోలివుడ్లో నటించాలని కోరుకోవడం అన్నది సర్వసాధారణంగా మారింది. అందుకు నటి ఆషిమా నార్వల్ అతీతం కాదు. ఇప్పటికే కొలైక్కారన్ వంటి హిట్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్‌లోనూ సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. మిస్ ఆస్ట్రేలియా కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీని పలకరించగా తాను సినీరంగంలోకి ఎలా ఎంటర్ అయ్యింది, వ్యక్తిగత జీవితం వంటి పలు విషయాల గురించి చెప్పుకొచ్చింది. అవేంటో చూద్దాం. మీ గురించి చెప్పండి? నేను పుట్టింది ఇండియాలోనేనైనా ఉన్నత విద్యను చదివింది మాత్రం ఆస్ట్రేలియాలో. సైన్టిస్ట్ కావాలని కలలు కన్నాను. చిత్రలేఖనం వంటి కళల్లోనూ ఆసక్తి ఉండేది. అయితే నటినవుతానని మాత్రం కలలో కూడా ఊహించలేదు. చదువు పూర్తి అయిన తరువాత ఆస్ట్రేలియాలో ఉద్యోగంలో చేరాను. ఆ సమయంలో అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ పోటీల్లో పాల్గొన్న ఇండియాకు చెందిన ఏకైక వ్యక్తిని నేనే. అలా తొలి ప్రయత్నంలోనే సిడ్నీ ఆస్ట్రేలియా ఎలిగెన్స్ కిరీటాన్ని గెలుచుకున్నాను. ఆ తరువాత ఇండియాలో జరిగిన అందాల పోటీల్లో మిస్ ఇండియా గ్లోబల్ కిరీటాన్ని గెలుచుకున్నాను. అలా అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకోవడంతో బాలీవుడ్లో సినీ అవకాశాలు రావడం మొదలెట్టాయి. అయితే అక్కడ ఆశించిన విధంగా ఆ అవకాశాలు లేకపోవడంతో నిరాకరించాను. అలాంటి సమయంలో తెలుగులో నాటకం అనే చిత్రంలో నటించే అవకాశం రావడంతో కథానాయకిగా పయనం మొదలైంది. ఆ తరువాత జెస్సీ చిత్రంలో నటించాను. ఆ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఆపై కోలీవుడ్‌లో కొలైక్కారన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో విజయ్‌ఆంటోనికి జంటగా నటించాను. నేను నటించిన మూడు చిత్రాలు హిట్ కావడం సంతోషంగా ఉంది. కొలైక్కారన్ చిత్రంలో నటించిన అనుభవం? కొలైక్కారన్ నా కేరీర్లో భారీ చిత్రం. అందులో కథానాయకిగా నా పాత్ర పరిధి తక్కువే అయినా విజయ్‌ఆంటోని, అర్జున్, సీత వంటి ప్రముఖ నటీనటులతో నటించడం మంచి అనుభవం. వారి సినిమా అనుభవం నాకు ఉపకరించిందనే చెప్పాలి. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు? రాజ భీమ చిత్రంలో ఆరవ్‌కు జంటగా నటిస్తున్నాను. ఇది మనిషికీ మృగాలకు మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుంది. ఇందులో ఏనుగు ప్రముఖ పాత్రలో కనిపిస్తుంది. ఏనుగుతో నటించడం సవాల్‌గా అనిపించింది. జంతువుల టైమింగ్‌కు తగ్గట్టుగా నటించడం చాలా కష్టం అనిపించింది. సినిమాల్లో మీరు ఎవరిని పోటీగా భావిస్తున్నారు? పోటీ లేని వృత్తే లేదు. అసలు పోటీ లేకుంటే శ్రమ తగ్గిపోతుంది. ఏ రంగంలోనైనా పోటీ ఉండాలి. పోటీ తత్వం లేకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్లు అనిపిస్తుంది. మీకు నచ్చిన నటుడు? నేను నటుడు విజయ్‌కు వీరా భిమానిని. ఆయన నటించిన తెరి, మెర్శల్, సర్కార్ చిత్రాల ను చూశాను. విజయ్ వంటి మాస్ హీరోకు జంటగా నటిం చాలన్న ఆశ నా లాంటి హీరో యన్లకు ఎందుకు ఉండదు. సరే ఇష్టమైన నటి? సావిత్రి అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు మాత్రం నటి నయనతార అంటే చాలా ఇష్టం. తమిళ సినిమా గురించి? ఇతర భాషా చిత్రాలతో పోల్చి చూస్తే తమిళ చిత్రాల స్థాయి వేరే లెవల్లో ఉండ డం చూడగలుగుతున్నాం ఎలాంటి పాత్రలో నటిం చాలని ఆశ పడుతున్నారు? సినిమాల్లోకి వచ్చిన తరువాత పలాన పాత్రలే చేయాలని చెప్పకూడదు. ఒక నటిగా అన్ని రకాల పాత్రల్లోనూ నటించడానికి నేను రెడీ. -
‘కిల్లర్’ సినిమా సక్సెస్‌మీట్
-
కిల్లర్ రియల్ సక్సెస్
‘‘ఇప్పుడు సినిమాలు హిట్ సాధించడం అరుదైపోయింది. ‘కిల్లర్’ చిత్రం రియల్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు డబ్బుతోపాటు ప్రశంసలు దక్కడం గర్వంగా ఉంది’’ అని అర్జున్ అన్నారు. విజయ్ ఆంటోని, అర్జున్ ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో రూపొందిన తమిళం చిత్రం ‘కొలైగారన్’. ఇందులో ఆషిమా నర్వాల్ కథానాయికగా నటించారు. టి. అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి. నరేష్కుమార్, టి.శ్రీధర్ ఈ చిత్రాన్ని ‘కిల్లర్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ నెల 7న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో విజయ్‌ఆంటోని మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి ‘కిల్లర్’ సినిమాతో నిరూపితమైంది. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమాలో అర్జున్‌గారు నటించడం మా ప్రధానబలం. ఆండ్రూ దర్శకుడిగా పెద్ద స్థాయికి వెళ్లాలి’’ అని అన్నారు. ‘‘దాదాపు 35 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా నన్ను తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణగారికి కృతజ్ఞతలు. ‘కిల్లర్’ చిత్రం బాగా ఆడుతోంది. రెండోవారంలో 60థియేటర్స్ పెరగడం ఈ సినిమా విజయానికి సంకేతం. విజయ్ ఆంటోనీ, ఆండ్రూస్ బాగా చేశారు’’ అన్నారు అర్జున్. ‘‘విజయ్ ఆంటోని వల్లే ఈ అవకాశం వచ్చింది. అర్జున్‌గారు నటించడం హైలైట్. ఈ సినిమా సక్సెస్‌లో మా టీమ్ కీలకం’’ అన్నారు ఆండ్రూ. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అంజయ్య, ప్రదీప్, కథానాయిక ఆషిమా నర్వాల్, నటి భానుశ్రీ, సంగీత దర్శకుడు సైమన్ కింగ్ పాల్గొన్నారు. -
పైరసీని ఎంకరేజ్ చేయకండి : విజయ్ ఆంటోని
‘బిచ్చగాడు’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని.. ఇక్కడ కూడా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అప్పటినుంచి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్‌ను పలకరించినా.. బిచ్చగాడు రేంజ్ సక్సెస్‌ను సాధించలేకపోయారు. అయితే ఈ శుక్రవారం కిల్లర్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ కింగ్ అర్జున్‌తో కలిసి నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ప్రమోషన్ సరిగా లేక కిల్లర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదు గానీ, కోలీవుడ్‌లో ఈ చిత్రం ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతుండగా.. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడండని, పైరసీనీ ఎంకరేజ్ చేయకండని విజయ్ ఆంటోని ప్రేక్షకులను కోరారు. మంచి సినిమాలను ఆదరించాలని చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. -
వంద సినిమాల్లో ఒకటిలా ఉండదు
‘‘కళకు భాషతో సంబంధం లేదని మళ్లీ మళ్లీ నిరూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందర్నీ ఆదరిస్తారు. ఈ సినిమా కూడా బాగుంది.. పెద్ద హిట్ అవుతుంది.. మళ్లీ సక్సెస్ మీట్లో తప్పకుండా కలుద్దాం’’ అన్నారు విజయ్ ఆంటోని. అర్జున్, విజయ్ ఆంటోని హీరోలుగా, ఆషిమా నర్వాల్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘కొలైగారన్’. ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని టి.నరేష్కుమార్–టి.శ్రీధర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులో రేపు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘విజయ్ ఆంటోని, అర్జున్.. తమ నటనతో ఆకట్టుకున్నారు. కథ చాలా బాగుంటుంది. అందుకే తెలుగులో విడుదల చేస్తున్నాం. ఇంట్రెస్టింగ్ అంశాలు, ఉత్కంఠ పరిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో తమిళంలోకి హీరోయిన్గా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎప్పటికైనా సావిత్రిగారంత పెద్ద హీరోయిన్ అవ్వాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు ఆషిమా నర్వాల్. ‘‘ఇది నా మొదటి తెలుగు సినిమా. పాటలకు ఇంత మంచి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సంగీత దర్శకుడు సైమన్ కె. కింగ్. ‘‘వంద సినిమాల్లో ఒక సినిమాలా ‘కిల్లర్’ ఉండదు.. వంద సినిమాలకు ఒక సినిమాలా ఉంటుంది’’ అని చిత్ర రచయిత భాషా శ్రీ అన్నారు. -
హత్యలకు కారణం ఏంటి?
‘‘కొన్ని చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కానీ ప్రస్తుతం నేను సంగీతంపై ఆసక్తిగా లేను. ఫోకస్ అంతా యాక్టింగ్ పైనే పెట్టి మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. తెలుగు బాగా నేర్చుకున్న తర్వాత టాలీవుడ్లో స్ట్రెయిట్ ఫిల్మ్ చేస్తాను’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. విజయ్ ఆంటోనీ, అర్జున్ ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో ప్రదీప్ నిర్మించిన తమిళ చిత్రం ‘కొలైగారన్’. ఇందులో ఆషిమా కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని ‘కిల్లర్’ అనే టైటిల్‌తో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 7న కిల్లర్ చిత్రం విడుదల కానుంది. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘ఇందులో సీరియల్ కిల్లర్ పాత్ర చేశాను. దర్శకుడు ఆండ్రూస్ నా క్లాస్మేట్. ఈ కథ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. సినిమాలో నేను చెడ్డవాడినా? లేక మంచి వాడినా? అసలు హత్యలకు కారణం ఏంటి? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇది పక్కా కమర్షియల్ మూవీ. వేరే బ్యానర్లో నేను చేసిన తొలి చిత్రం ఇదే. ప్రస్తుతం ‘ఖాకి’, ‘జ్వాల’ చిత్రాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. -
విజయ్ ఆంటోని ‘కిల్లర్’ మూవీ స్టిల్స్
-
థ్రిల్లింగ్ కిల్లర్
యాక్షన్ కింగ్ అర్జున్, విజయ్ ఆంటోని నటించిన చిత్రం ‘కొలైగారన్’. దియా మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై ‘కిల్లర్’ పేరుతో టి. నరేశ్ కుమార్, టి.శ్రీధర్ విడుదల చేస్తున్నారు. ఆండ్య్రూ లూయిస్ దర్శకత్వం వహించారు. రంజాన్ పండగ సందర్భంగా జూన్ 7న ‘కిల్లర్’ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అర్జున్, విజయ్ ఆంటోనిలకు ఉన్న క్రేజ్‌తో ఇప్పటికే తెలుగులో మంచి బిజినెస్ జరిగింది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చి్రత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సైమన్ కె. కింగ్ అందించిన పాటలు ఓ హైలైట్’’ అన్నారు. ఆశిమా నర్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, సంపత్‌రాజ్ తదితరులు నటించారు. -
నా పాట నీ నోట పలకాల బాలు
ఇళయరాజా– యస్పీ బాలసుబ్రహ్మణ్యంలది ఎవర్గ్రీన్ కాంబినేషన్. రాజా కంపోజిషన్‌లో బాలు అద్భుతమైన పాటలెన్నో పాడారు. సంగీతప్రియుల మ్యూజిక్ కలెక్షన్లో ఎవర్గ్రీన్ ఆల్బమ్స్‌లో నిలిచిపోయారు. అయితే ఈ మధ్య రాయల్టీ విషయంలో వీరిద్దరి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ‘నేను స్వరపరిచిన పాటలెక్కడ పాడినా నాకు రాయల్టీ చెల్లించాలంటూ’ రాజా కొన్నేళ్లుగా సంచలన స్టేట్మెంట్స్ జారీ చేస్తూ వచ్చారు. దానికి ‘రాజా పాట పాడకుండా నన్నెవ్వరూ ఆపలేరని’ యస్పీబీ కూడా చెప్పారు. అది వీరి మధ్య చిన్న గ్యాప్‌కు కారణం అయింది. ఇటీవలే ఇళయరాజా, యస్పీబీ మళ్లీ కలసిన ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న ‘తమిళరసన్’ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు. ఇందులో ఓ పాటను యస్పీబీ ఆలపించారు. ఇటీవలే ఆ పాటను రికార్డ్ చేయించారు. ఇవాళ చెన్నైలో జరగబోయే ఇళయరాజా కన్సెర్ట్‌లో యస్పీబీ పాడనున్నారని తెలిసింది. ట్యూన్‌కి, టోన్‌కి మళ్లీ నేస్తం కుదిరింది. సో.. మళ్లీ మరెన్నో మ్యూజికల్ హిట్స్ సంగీతాభిమానులకు ఇవ్వడానికి ఈ కాంబినేషన్ నిశ్చయించుకుందని అనుకోవచ్చు. -
ఇళయరాజా సంగీతం.. ఎస్పీబీ గాత్రం
ఇళయరాజా సంగీతంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎన్నో అధ్బుతమైన పాటలను పాడారు. ఆ పాటలన్నీ ఎప్పటికీ నిలిచిపోతాయి. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఇళయరాజా-ఎస్పీబీ ఎంతో స్నేహంగా ఉంటారు. అయితే గతంలో ఇళయరాజా తన పాటలకు రాయల్టి ఇవ్వాలని, అలా అయితేనే తన పాటలను వేదికలపై పాడాలని రచ్చ చేశారు. ఆ వివాదం తరువాత వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. అయితే తాజాగా వీరిద్దరు మళ్లీ కలిశారని, ఒకే వేదికపై కలవనున్నారని అంతేకాకుండా లైవ్ కాన్సెర్ట్‌లో బాలు పాడతారని తెలిపారు. అయితే తాజాగా ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్లో రాబోతోన్న ‘తమిళసరన్’( ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరో) అనే చిత్రంలో బాలు ఓ పాటను కూడా పాడుతున్నారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన కంపోజిషన్ జరుగుతుండగా.. తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
హత్య చేసిందెవరు?
విజయ్ ఆంటోని, అర్జున్ ప్రధాన పాత్రల్లో ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్’. అషిమా కథానాయికగా నటించారు. దియా మూవీస్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి.నరేష్కుమార్–టి.శ్రీధర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా టి.నరేష్ కుమార్–టి.శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘మర్డర్ మిస్టరీ, క్రైౖమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్ నెరేషన్‌తో రక్తి కట్టిస్తుంది. అర్జున్ నటన సినిమాకే హైలైట్. విజయ్ ఆంటోని పాత్ర ఏమిటిన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇటీవల విడుదలైన పాటలకు, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రంజాన్ కానుకగా జూన్ తొలి వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె.కింగ్, కెమెరా: మ్యూక్స్. -
హంతకుడు ఎవరు?
అర్జున్, విజయ్ ఆంటోని, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కిల్లర్’. ‘హంతకుడు’ అన్నది ఉపశీర్షిక. బి.ప్రదీప్ సమర్పణలో దియా మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రం స్నీక్ పీక్ టీజర్‌ను రిలీజ్ చేయగా, బిగ్ సీడీని అర్జున్ విడుదల చేశారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘అర్జున్‌గారితో కలిసి ఈ సినిమా చేయటం నా అదృష్టం. ఆయన యాక్షన్ స్టైల్ కింగ్. ఆండ్రూ నా స్నేహితుడే. ఆషిమా ఈ సినిమాతో ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్‌గా మారుతుంది. ప్రదీప్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశారు. చదలవాడ శ్రీనివాసరావుగారు నాకు గాడ్ ఫాదర్. భాష్యశ్రీ నాకు మరో సోదరుడు. తను లేకుండా నా సినిమా తెలుగులోకి రాదు. హాలీవుడ్ తరహా సాంకేతికత మా సినిమాలో చూస్తారు. మేలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేశా. ఇదొక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. విజయ్ ఆంటోనీ మంచి మనిషి. ఈ చిత్రంలో ‘కిల్లర్’ ఎవరనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అన్నారు అర్జున్. ‘‘నాకు తెలుగు రాకున్నా తెలుగు వారికి నచ్చే సినిమా తీశా. విజయ్ ఆంటోని నా స్నేహితుడు. తన వల్లే ఈ సినిమా చేశాను. అర్జున్‌గారు ఈ సినిమా చేయటమే మా మొదటి సక్సెస్. టెక్నికల్‌గా నెక్ట్స్ లెవెల్ మూవీ అవుతుంది’’ అన్నారు ఆండ్రూ లూయిస్. సంగీత దర్శకుడు సైమన్ కె.కింగ్, పాటల రచయిత భాష్యశ్రీ, అషిమా నర్వాల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మ్యూక్స్. -
సంగీత ఈజ్ బ్యాక్
సినిమా: నటి సంగీత గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. బహుభాషా నటి. కథానాయకిగానే కాకుండా ప్రతినాయకి ఛాయలున్న పాత్రలనైనా సమర్థవంతంగా పోషించి మెప్పించగల సత్తా ఉన్న నటి. అలాంటి నటి గాయకుడు క్రిష్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత నటనను తగ్గించుకుంది. ఆ మధ్య అడపాదడపా నటించినా రెండేళ్ల నుంచి పూర్తిగా సినిమాలకు దూరమైంది. అయితే బుల్లితెర కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతలా పాల్గొంటూ ఆ వర్గ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. తాజాగా మళ్లీ సంగీత బ్యాక్ అంటూ ఒక బ్యాంగ్ పాత్రలో వెండితెరపై కనిపించబోతోంది. అవును నటుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న తిమిళరసన్ చిత్రంలో సంగీత ప్రధాన పాత్రల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఎన్ఎస్.మూవీస్ పతాకంపై కౌసల్యరాణి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో విజయ్‌ఆంటోని సరసన నటి రమ్యానంబీశన్ నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో సురేశ్‌గోపి, రాధారవి, సోనూసూద్, యోగిబాబు, రోబోశంకర్, కస్తూరి, చాయాసింగ్, మధుమిత, వైజీ.మహేంద్రన్, కదిర్, శ్రీలేఖ, శ్రీజా, కేఆర్.సెల్వరాజ్, సెండ్రాయన్, కుంకీ అశ్విన్, మేజర్ గౌతమ్, స్వామినాథన్, మునీశ్కాంత్, రాజ్‌కృష్ణ, రాజేంద్రన్ నటిస్తున్నారు. వీరితో పాటు దర్శకుడు మోహన్‌రాజా కొడుకు మాస్టర్ ప్రణవ్ కీలక పాత్రలో పరిచయం అవుతున్నాడు. ఇందులో ఒక ప్రధాన పాత్రలో నటి సంగీత నటిస్తోంది. రెండేళ్ల క్రితం నెరుప్పుడా చిత్రంలో ప్రతినాయకిగా నటించిన సంగీత ఆ తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ఇదే విషయాన్ని ఈ అమ్మడిని అడగ్గా తనకు తగ్గ పాత్రలు అనిపించకపోవడంతో వచ్చిన చాలా అవకా>శాలను తిరస్కరించినట్లు తెలిపింది. ఇప్పుడు నటించడానికి కారణం తమిళరసన్ చిత్రంలో తన పాత్ర చర్చనీయాంశంగా ఉంటుందని చెప్పింది. అందుకే ఆ పాత్ర చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. ఈ చిత్రంలో తాను ఒక పెద్ద ఆస్పత్రిని నిర్వహించే డాక్టర్‌గా నటిస్తున్నానని చెప్పింది. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని నటి సంగీత పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతజ్ఞాని ఇళయరాజా బాణీలు కట్టడం మరో విశేషం. ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తమిళరసన్ చిత్ర షూటింగ్ చెన్నైలో చిత్రీకరణను జరుపుకుంటోంది. -
ఆట ఆరంభం
‘ఆటగదరా శివ’ చిత్రం ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న ద్వితీయ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విజయ్ ఆంటోనీతో తమిళంలో ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఎన్.వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం. ఐశ్వర్య రాజేష్ కథానాయిక. అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కథా చిత్రమిది. ఆంధ్ర, తెలంగాణతో పాటు విదేశాల్లోనూ షూటింగ్ జరపనున్నాం. ఏప్రిల్‌కి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, కిరణ్, శరత్ మరార్, దర్శకులు చంద్ర సిద్ధార్థ, కరుణాకరన్, కిషోర్ పార్ధసాని (డాలి), జొన్నలగడ్డ శ్రీనివాసరావు, శ్రీరామ్ బాలాజీ, సంగీత దర్శకుడు కోటి, ప్రొఫెసర్ జి. శ్రీరాములు తదితరులు విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కెమెరా: గణేష్ చంద్ర. -
‘జ్వాల’ చిత్రం ప్రారంభం
-
రగిలిన జ్వాల
ఇప్పటి వరకూ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తెలుగులో చేస్తున్న స్ట్రయిట్ మూవీ ‘జ్వాల’. అరుణ్ విజయ్ మరో కథా నాయకుడు. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే కథానాయికగా నటిస్తున్నారు. ఎం. నవీన్ దర్శకత్వంలో టి. శివ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విజయ్ ఆంటోని మాట్లాడుతూ–‘‘తెలుగులో నేను చేస్తున్న స్ట్రయిట్ చిత్రమిది. నవీన్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చింది. నాతో పాటు అరుణ్‌విజయ్, షాలినీ పాండేకి కూడా ఇది చాలెంజింగ్ మూవీ. నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీస్‌గా ఉంటుందని చెప్పగలను. ఈ సినిమాలో కీలక పాత్రలు చేయడానికి అంగీకరించిన ప్రకాశ్‌రాజ్, జగపతిబాబుగార్లకి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘బ్రూస్ లీ, సాహో’ చిత్రాల తర్వాత నేను నటిస్తున్న మూడో స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఇలాంటి యాక్షన్ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు అరుణ్ విజయ్. ‘‘ఈ చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి ఎగై్జటింగ్‌గా ఎదురుచూస్తున్నా’’ అన్నారు షాలినీ పాండే. ఈ సినిమాకు నటరాజన్ సంగీతం అందిస్తున్నారు. -
`రోషగాడు` మూవీ రివ్యూ
టైటిల్ : రోషగాడు జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : విజయ్ ఆంటొని, నివేదా పేతురాజ్, సాయి దీనా సంగీతం : విజయ్ ఆంటొని దర్శకత్వం : గణేషా నిర్మాత : ఫాతిమా కోలీవుడ్‌లో మంచి విజయాలు సాధించిన విజయ్ ఆంటొని బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్లో కూడా ఘనవిజయం సాధించాడు. అయితే తరువాత తన ప్రతీ సినిమాను టాలీవుడ్ లో రిలీజ్ చేసినా మరో సక్సెస్ మాత్రం దక్కలేదు. తాజాగా రోషగాడు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ ఆంటొని. మరి రోషగాడు విజయ్ ఆంటొనికి మరో సక్సెస్ అందించిందా.? కథ : పోలీస్ కానిస్టేబుల్ కుమారస్వామి (విజయ్ ఆంటొని), తన తమ్ముడు రవిని ఎలాగైనా ఇన్స్పెక్టర్ చేయాలని తయారు చేస్తుంటాడు. కానీ అన్న పదే పదే చదువు, ఫిట్‌గా ఉండు అని చెప్పటం టార్చర్ అని ఫీల్ అయిన రవి ఇంట్లో నుంచి పారిపోతాడు. హైదరాబాద్‌లో బాబ్జీ అనే రౌడీ దగ్గర చేరిన రవి హంతకుడిగా మారతాడు. ప్రమోషన్ మీద హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి వచ్చిన కుమారస్వామి ఓ హత్య కేసులో తన తమ్ముడిని ఎన్కౌంటర్ లో చంపేస్తాడు. కానీ తరువాత తన తమ్ముడిలా వేల మంది బాబ్జీ కోసం పనిచేస్తున్నారని తెలుసుకొని అందరిని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. కుర్రాళ్లు రౌడీలను హీరోలుగా భావించటం వల్లే వారి వెనుక తిరుగుతున్నారని.. వారి దృష్టిలో పోలీసులను హీరోలను చేస్తే అందరూ మారిపోతారన్న నమ్మకంతో బాబ్జీని దెబ్బతీయాలనుకుంటాడు. మరి ఈ ప్రయత్నంలో కుమారస్వామి విజయం సాధించాడా..? బాబ్జీ చెర నుంచి కుర్రాళ్లను కాపాడాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తన ప్రతీ సినిమాలో ఓ ఎమోషనల్ పాయింట్ ఉండేలా చూసుకునే విజయ్ ఆంటొని ఈ సినిమా కూడా అదే స్టైల్ లో సెలెక్ట్ చేసుకున్నాడు. తమ్ముడి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాడు విజయ్. కుమారస్వామి పాత్రలలో సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించాడు. హీరోయిన్గా నటించిన నివేదా పేతురాజ్ చలాకీ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. లుక్స్ పరంగాను మంచి మార్కులు సాధించింది. ఇక కీలక మైన విలన్ పాత్రలో నటించిన సాయి దీనా, బాబ్జీ పాత్రకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. మిగతా నటీనటులంతా తమిళ వాళ్లే కావటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేరు. విశ్లేషణ : దర్శకుడు గణేషా.. విజయ్ ఆంటొని ఇమేజ్‌కు తగ్గ కథా కథనాలను రెడీ చేసుకున్నా.. అనుకున్నట్టుగా సినిమాను తెర మీద చూపించటంలో కాస్త తడబడ్డాడు. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినా ఎమోషనల్ సీన్స్‌తో పాటు కామెడీ డైలాగ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లోకథనం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులను విసిగిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఉన్నవి మూడు పాటలే అయినా అవికూడా తెలుగు ప్రేక్షకులను అలరించేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు తగ్గట్టుగా కుదిరింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; విజయ్ ఆంటొని మెయిన్ స్టోరి మైనస్ పాయింట్స్ ; స్లో నేరేషన్ నేటివిటి సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
నేను నటుణ్ణి కాదు
విజయ్ ఆంటోనీ, నివేథా పేతురాజ్ జంటగా గణేశ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రోషగాడు’. ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో పార్వతి మిట్టపల్లి నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ ఎస్పీ టి.వి. హనుమంతరావు మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ స్థాయిలో ఈ సినిమా కూడా విజయం సాధించాలి. పోస్టర్లో విజయ్ను చూస్తుంటే 20ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్లుంది’’ అన్నారు. ‘‘నా సినిమాల్లో నేను హీరో కాదు. కథే హీరో. నేను సౌండ్ ఇంజినీర్ని, సంగీత దర్శకుడిని. నటుణ్ణి కాదు. అందుకే కథే హీరో అనిపించే చిత్రాల్లో నటిస్తుంటాను. గణేశ ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డారు’’ అన్నారు విజయ్ ఆంటోని. ‘‘తమిళంలో నేను దర్శకత్వం వహించిన ‘నంబియార్’ సినిమాకు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని. ఇప్పుడు ఆయన హీరోగా సినిమా చేశాను. రచయిత విజయేంద్రప్రసాద్‌గారికి ఈ కథ చెప్పినప్పుడు విజయ్ ఆంటోని పేరునే సూచించారు’’ అన్నారు గణేశ. ‘‘ఒక శక్తిమంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విజయ్’’ అన్నారు రచయిత భాషా శ్రీ. గణపతి, సానం రామకృష్ణ, విజయ్, విశ్వనాథం, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
‘రొమాన్స్‌లో శిక్షణ పొందాలి’
రొమాన్స్ చేయడంలో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నానని సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ఆంటోని చెప్పారు. తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఈయన కథానాయకుడిగా నటించి, సంగీతాన్ని అందించి నిర్మించిన చిత్రం ‘తిమిరు పుడిచ్చవన్’(తెలుగులో రోషగాడు). నటి నివేదా పేతురాజ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గణేశా తెరకెక్కించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తిమిరు పుడిచ్చవన్ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 6న తెరపైకి రానుంది. శనివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించిన హిజ్రా సింధుజా మాట్లాడుతూ తమిళ సినిమాలో ఒక హిజ్రాకు ముఖ్య పాత్రలో నటించే అవకాశం కల్పించిన విజయ్‌ఆంటోనికి, దర్శకుడు గణేశాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ చిత్రంలో తాను తొలి హిజ్రా ఎస్ఐ ప్రీతిక పాత్రను పోషించానని చెప్పింది. అందరూ భయపడి టచ్ చేయని ఒక విషయాన్ని ఎలాంటి సంకోచం, భయం లేకుండా ఈ చిత్రంలో చూపించారన్నారు. హిజ్రాల జీవితంలోనే తిమిరు పుడిచ్చవన్ ముఖ్యమైన చిత్రంగా ఉంటుందని సింధుజా పేర్కొంది. చిత్ర కథానాయకి నివేదా పేతురాజ్ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పినప్పుడే భయపెట్టారన్నారు. మోటార్‌బైక్ నడపాలి, చేపల బండి తొక్కాలి అంటూ భయపెట్టారని చెప్పారు. ఆయన చెప్పినట్లే మోటార్‌బైక్ నడపడం నేర్చుకుని.. చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పుకున్నానని తెలిపారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు దర్శకుడు తనతో చాలా విషయాలు చేయించినట్లు తెలిసిందన్నారు. నటిగా తన కేరీర్‌లోనే తిమిరు పుడిచ్చవన్ ప్రత్యేకంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని నివేదా పేతురాజ్ వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత, కథానాయకుడు విజయ్‌ఆంటోని మాట్లాడుతూ ఏక వృక్షం.. తోట అవ్వదు అన్నట్లు ఈ చిత్రంలో తన భాగం చాలా తక్కువేనని చెప్పారు. ఈ చిత్రం కోసం దర్శకుడు గణేశా ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. ఏ చిత్రానికైనా హీరో దర్శకుడేనని అన్నారు. తన గత రెండు చిత్రాలు వ్యాపార పరంగా బాగా రాలేదన్నారు. ఆర్థిక సమస్యల మధ్య ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో రొమాన్స్ సన్నివేశాలు ఉండవని, అందువల్ల హీరోయిన్ నివేదా పేతురాజ్‌తో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని చెప్పలేనని అన్నారు. ఈ చిత్రం తరువాత రొమాన్స్ చేయడంలో శిక్షణ తీసుకుని అలాంటి సన్నివేశాల్లో నటిస్తానని అన్నారు. ఇకపోతే చిత్ర నిర్మాణం పూర్తి కావడంతో దర్శకుడు కోరిక మేరకు దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు విజయ్‌ఆంటోని తెలిపారు. -
మాటంటే పడడురా
విజయ్ ఆంటోనీ నటిస్తూ, సంగీతం అందిస్తున్న చిత్రం ‘రోషగాడు’. ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. నివేథా పేతురాజ్ కథానాయిక. ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు గణేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘రోషగాడు రా.. వీడు మాటంటే పడడురా’ అంటూ సాగే థీమ్ సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రిలీజ్ చేశారు. ‘‘కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ పక్కా కమర్షియల్ చిత్రం తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మాటలు–పాటలు: భాష్యశ్రీ. -
‘రోషగాడు’ మూవీ స్టిల్స్
-
‘రోషగాడు’గా బిచ్చగాడు
బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ ఘనవిజయం అందుకున్న కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. వైవిధ్యమైన కథా చిత్రాలకు, రియలిస్టిక్ క్యారక్టరైజేషన్స్‌తో ఆకట్టుకున్నంటున్న విజయ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ఈ హీరో త్వరలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ్లో ‘తిమిరపుడిచవాన్’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాకు తెలుగులో రోషగాడు అన్న టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 5గం.లకు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న రోషగాడు సినిమాలో నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్నారు. గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఫాంతిమా ఆంటోని నిర్మిస్తున్నారు. -
పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో
విభిన్నమైన చిత్రాలతో ఆసక్తికరమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు తమిళ నటుడు విజయ్ ఆంటోని. తమిళంలో విజయ్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా రిలీజై మంచి విజయాలు సాధిస్తున్నాయి. ‘డాక్టర్ సలీమ్, బిచ్చగాడు’ ఇందుకు నిదర్శనం. తాజాగా విజయ్ ఆంటోని హీరోగా గణేష దర్శకత్వంలో తమిళంలో ఓ సినిమా రూపొందుతోంది. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాత. ఇందులో నివేథా పేతురాజ్ కథానాయికగా నటిస్తున్నారు. మంగళవారం విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా తమిళంలో ఈ సినిమాకు ‘తిమిరుపుడిచ్చవన్’ (అంటే పొగరున్నోడు అని అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారు. ‘‘ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో విజయ్ ఆంటోని నటిస్తున్నారు. త్వరలోనే తెలుగు టైటిల్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
హంతకుడులో అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్నారు. కన్నడలో కథానాయకునిగా నటిస్తున్న ఆయన తెలుగు, తమిళ భాష చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగులో ఇటీవల విడుదలైన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో అల్లు అర్జున్‌కి తండ్రి పాత్రలో కనిపించారాయన. తమిళంలో విశాల్ హీరోగా తెరకెక్కిన ‘ఇరుంబు దురై’ సినిమాలోనూ అర్జున్ ఓ ముఖ్య పాత్ర చేశారు. తాజాగా మరో తమిళ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. విజయ్ ఆంటోనీ హీరోగా నూతన దర్శకుడు ఆండ్రు ‘కొలైక్కారన్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. అంటే.. హంతకుడు అని అర్థం. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రకి అర్జున్‌ని సంప్రదించాయట చిత్రవర్గాలు. మరి.. హంతకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. -
‘కాశి’ మూవీ రివ్యూ
టైటిల్ : కాశి జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : విజయ్ ఆంటోని, అంజలి, సునైనా, యోగి బాబు, జయప్రకాష్ సంగీతం : విజయ్ ఆంటోని దర్శకత్వం : కృతిగ ఉదయనిధి నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్‌లోనూ ఘనవిజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్‌తో తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్, తరువాత తను హీరోగా నటించిన ప్రతీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. కానీ బిచ్చగాడు స్థాయిలో విజయం మాత్రం సాధించలేకపోయాడు. అందుకే మరోసారి మదర్ సెంటిమెంట్‌ను నమ్ముకొని కాశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా విజయ్ ఆంటోని టాలీవుడ్లో మరో విజయం సాధించాడా..? కథ ; భరత్ (విజయ్ ఆంటోని) న్యూయార్క్‌లో డాక్టర్. సొంత హాస్పిటల్, హోదా, మంచి కుటుంబం అన్నీ ఉన్నా భరత్‌ను ఏదో పొగొట్టుకున్నా అన్న భావన వెంటాడుతుంటుంది. ఓ చిన్న బాబును ఎద్దు పొడిచినట్టుగా ఓ కల చిన్నతనం నుంచి వస్తుంటుంది. (సాక్షి రివ్యూస్) తన తల్లి కిడ్నీలు ఫెయిల్ అవ్వటంతో భరత్ జీవితం మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు తను అమ్మానాన్నలు అనుకుంటున్న వారు తనను పెంచిన తల్లిదండ్రులు మాత్రమే అని తెలుస్తుంది. దీంతో తనకు రోజు వచ్చే కలకు తన గతానికి ఏదో సంబంధం ఉందన్న నమ్మకంతో తనను కన్న తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు భరత్. అనాథశ్రమంలో తన తల్లిపేరు పార్వతి అని, ఆమె సొంత ఊరు కంచెర్లపాలెం అని తెలుసుకొని ఆ ఊరికి వెళతాడు. ఈ ప్రయత్నంలో భరత్ విజయం సాధించాడా..? తన తల్లిదండ్రులను కనుక్కోగలిగాడా..? అసలు భరత్ వారికి ఎలా దూరమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విజయ్ ఆంటోని, అంతా తానే అయి సినిమాను నడిపించాడు. నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే బలమైన భావోద్వేగాలు చూపించే అవకాశం రాకపోవటంతో నాలుగు పాత్రలు కూడా రొటీన్‌గా సాగిపోతాయి. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన యోగిబాబు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు.(సాక్షి రివ్యూస్) హీరోయిన్ గా నటించిన అంజలిది దాదాపుగా అతిథి పాత్రే. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో నటించిన జయప్రకాష్ తప్ప ఇతర నటీనటులంతా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనివారే. విశ్లేషణ ; బిచ్చగాడు సినిమాలో మదర్ సెంటిమెంట్‌తో సక్సెస్ సాధించిన విజయ్ ఆంటోని మరోసారి అదే సెంటిమెంట్‌ను నమ్ముకొని కాశి సినిమా చేశాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైన కొడుకు తన గతాన్ని వెతుక్కుంటూ చేసే ప్రయాణమే కాశి కథ. అయితే ఈ కథను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో దర్శకురాలు కృతిగ ఉదయనిధి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అసలు కథను పక్కన పెట్టి కథతో సంబంధం లేని పిట్టకథలతో సినిమాను నడిపించారు. (సాక్షి రివ్యూస్)పూర్తిగా తమిళ నటులు, తమిళ నేటివిటీతో తెరకెక్కటం కూడా తెలుగు ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. గత చిత్రాల్లో సూపర్ హిట్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్న విజయ్ ఆంటోని ఈ సారి పాటలతోనూ మెప్పించలేకపోయాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : స్క్రీన్‌ప్లే తమిళ నేటివిటి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
బిచ్చగాడుని మించుతుంది
‘‘తెలుగు నిర్మాతలందరూ నన్ను వారి హీరోగా భావించి ప్రోత్సహిస్తున్నారు. మంచి సినిమాలనే ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తాను. త్వరలోనే తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయాలనుకుంటున్నా’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కాశి’. కృతిక ఉదయనిధి దర్శకురాలు. ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి ఈ సినిమాని ఈ నెల 18న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘నా గత చిత్రాలతో పోల్చితే ‘కాశి’ చాలా వైవిధ్యంగా ఉంటుంది. నా ‘బిచ్చగాడు’ని మించి హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా పాటలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఏ సినిమా పాటలైనా ‘విజయ్ ఆంటోని.కామ్’ నుంచి ఎప్పుడైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘విజయ్‌గారు ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేశారు. ‘కాశి’తో మరో హిట్ సాధిస్తారని భావిస్తున్నా’’ అన్నారు నిర్మాత కిరణ్. ‘‘సినిమా చూశా. చక్కగా ఉంది. ఈ సినిమా తర్వాత విజయ్ తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమా చేస్తారు’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘కాశి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకురాలిగా పరిచయం అవుతున్నాను. విజయ్‌గారు కథ వినగానే నన్ను నమ్మి డైరెక్షన్ అవకాశం ఇచ్చారు’’ అన్నారు కృతిక ఉదయనిధి. నిర్మాతలు ప్రద్యుమ్న, గణేశ్, సునైన, నటుడు మధు, రచయిత భాషా శ్రీ, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, అమృత తదితరులు పాల్గొన్నారు. -
గతాన్ని వెతుక్కుంటూ భరత్...
సాక్షి, హైదరాబాద్: కోలీవుడ్‌లో విజయ్ ఆంటోనీకి విలక్షణ నటుడనే పేరుంది. పిచ్చైకారన్(బిచ్చగాడు) భారీ విజయం తర్వాత తెలుగులోని అతని సినిమాల పట్ల ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవీ బిచ్చగాడు స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. కానీ, తన సినిమాలోని ఆసక్తికర అంశాలతో రిలీజ్‌కు ముందే యూట్యూబ్‌లో కొంత భాగాన్ని విడుదల చేయటం విజయ్ అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో తన తర్వాతి చిత్రం కాళీ(తెలుగులో కాశి) స్నీక్ పీక్ పేరిట సుమారు 9 నిమిషాల వీడియో వదిలాడు. సక్సెస్ ఫుల్ కార్డియాలిస్ట్ అయిన భరత్ అమెరికాలో ఆస్పత్రి పెట్టుకుని తల్లిదండ్రులతో హాయిగా జీవిస్తుంటాడు. అయితే అతని జీవితాన్ని ఓ కల వెంటాడుతుంది. పామును చూసి భయపడ్డ ఓ ఎద్దు అక్కడున్న ఓ చిన్నారిని పొడవటానికి వస్తుంటుంది. అక్కడే ఉన్న ఆ పిల్లాడి తల్లి అతన్ని కాపాడబోతుండగా.. కల చెదిరిపోతుంది. ఇదిలా ఉంటే తన తల్లికి రెండు కిడ్నీలు పాడైపోవటంతో భరత్.. కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమౌతాడు. కానీ, భరత్ తండ్రి అతను తమ సొంత కొడుకు కాదంటూ అతన్ని అడ్డుకుంటాడు. తనను పెంచిన అమ్మ ఆరోగ్యం కోలుకున్నాక.. తన కలకు, గతానికి ఏదో సంబంధం ఉందంటూ భరత్ ఇండియాకు వస్తాడు. తనను పెంపుడు తల్లిదండ్రులకు దత్తత ఇచ్చిన ఆశ్రమం అడ్రస్‌కు వెళ్తాడు. అక్కడి నుంచి కాశి కథ ప్రారంభమౌతుంది. అంజలి, సునైనా, నాజర్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఈ చిత్రానికి కృతిక ఉదయనిధి దర్శకురాలు. తెలుగులో నిర్మాత రామసత్యనారాయణ విడుదల చేయబోతున్నారు. మే 18న కాశి విడుదల కానుంది. -
విజయ్ ఆంటోనీ కాశి స్నీక్ పీక్ వీడియో విడుదల
-
నా రూటే సపరేటు అంటున్న హీరో
ఈ రోజుల్లో సినిమా తీయడమే చాలా కష్టమైన పని అంటే.. విడుదలయ్యే వరకు దాన్ని గోప్యంగా ఉంచడం మరింత కష్టమైపోతుంది. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలో విడుదలకు ముందే ఏవైనా సన్నివేశాలు బయటకు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది దర్శక, నిర్మాతలకు. గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల సినిమా ‘అత్తారింటికి దారేది’ విడుదలకు ముందే తొలి భాగం లీక్ అయ్యి గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఓ హీరో ధైర్యం చేసి తన సినిమాలోని తొలి ఏడు నిమిషాలను తానే స్వయంగా విడుదల చేస్తున్నాడంటే నిజంగానే సాహసం చేస్తున్నాడని అనాలి. ఈ సాహసం చేస్తున్న నటుడు, నిర్మాత విజయ్ ఆంటోని. ఈ తమిళ హీరో త్వరలో విడుదల కాబోయే తన ‘కాశీ’ సినిమా కోసం ఇంత సాహసం చేస్తున్నట్లు సమాచారం. తాను మూస సినిమాలు చేయనని ‘బిచ్చగాడు’ చిత్రంతో నిరూపించుకున్నాడు విజయ్ ఆంటోని. విజయ్ నటించిన సినిమా అంటేనే ఏదో ప్రత్యేకత ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు. అలానే సినిమా ప్రచార కార్యక్రమాలను కూడా వినూత్న రీతిలో చేస్తుంటాడు. అలానే త్వరలో విడుదల కాబోతున్న ‘కాశీ’ సినిమా ప్రచార కార్యక్రమాలను కూడా ఇదే విధంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈసారి ఏకంగా సినిమాలోని మొదటి ఏడు నిమిషాల సన్నివేశాలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఉదయనిధి దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా నటించిన చిత్రం ‘కాశీ’. అంజలి కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. భావోద్వేగాలకు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు ఈ సినిమాలో పెద్దపీట వేసినట్లు విజయ్ ఆంటోని తెలిపారు. -
కాశీ ఏం చేశాడు?
నటుడిగా, సంగీత దర్శకుడిగా తమిళంలో, తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన పంథా ఏర్పరుచుకున్నారు విజయ్ ఆంటోని. సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘కాశి’. అంజలి, సునైన కథానాయికలు. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఈ నెల 18న విడుదలవుతోంది. లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కాశీ ఏం చేశాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడగా, ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నాం. తమిళంలో ఈ నెల 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
బెదిరింపులకు భయపడను
తమిళసినిమా: ఎలాంటి బెదిరింపులు వచ్చినా భయపడనని సీనియర్ దర్శకుడు, నటుడు విజయ్ తండ్రి ఎస్ఏ.చంద్రశేఖరన్ అన్నారు. ఈయన సమాజంలోని అక్రమాలు, అన్యాయాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ట్రాఫిక్ రామస్వామి జీవిత చరిత్రతో ఆయన పేరుతోనే తెరకెక్కుతున్న చిత్రంలో ఆయన పాత్రలో నటిస్తున్నారు. ఎస్ఏ.చంద్రశేఖరన్ శిష్యుడు విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్, టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఏ.చంద్రశేఖరన్ మాట్లాడుతూ తన వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన విక్కీ ఇక రోజు ట్రాఫిక్ రామస్వామి జీవిత కథను స్క్రిప్ట్‌గా తయారు చేసి తనకు ఇచ్చారన్నారు. కథను చదవిన తరువాత ట్రాఫిక్ రామస్వామి తనలాగే సమాజంలో జరిగే అన్యాయాలను చూసి రగిలే మనిషి అని తెలిసిందన్నారు. ఎక్కడ తప్పు జరిగినా ఆగ్రహించే ఆయన మనస్తత్వం తనకు నచ్చిందని పేర్కొన్నారు. ఆయన పోరాటాలు తెలిసి విస్మయం చెందానన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించాలని విక్కీ కోరినప్పుడు కాదనలేకపోయానని చెప్పారు. తాను 45 ఏళ్లలో 69 చిత్రాలకు దర్శకత్వం వహించానని, అలాంటి తానే ఏం సాధించాననడానికి చిహ్నంగా ఈ చిత్రం నిలిచిపోతుందని అన్నారు. ఇందులో తనకు జంటగా రోహిణి నటించగా హీరోలాంటి పాత్రలో ఆర్కే.సురేశ్ నటించారని చెప్పారు. ఇక ఒక్క సన్నివేశంలో నటించడానికి విజయ్ ఆంథోని, కుష్బు, సీమాన్ అంగీకరించారని తెలిపారు. వివాదాస్పదమైన ఈ చిత్రంలో నటించినందుకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా భయపడనని, తన తొలి చిత్రం చట్టం ఒరు ఇరుట్టరై సమయంలోనే చాలా బెదిరింపులు ఎదుర్కొన్నానని ఎస్ఏ.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
మళ్లీ మదర్ సెంటిమెంట్
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘కాశి’. తెలుగమ్మాయి అంజలి, సునయన కథానాయికలు. క్రితిక ఉదయనిధి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు హక్కులను పిక్చర్ బాక్స్ కంపెనీ అధినేత విలియమ్ అలెగ్జాండర్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ‘కాశి’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. విలియమ్అలెగ్జాండర్ మాట్లాడుతూ –‘‘బిచ్చగాడు’ చిత్రం తర్వాత విజయ్ ఆంటోని మదర్ సెంటిమెంట్‌లో మరో కోణం చూపించనున్న చిత్రమిది. ఆయన తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ, చక్కటి సంగీతం అందించారు. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్‌కి తెలుగులో చాలా మంచి క్రేజ్ రావడంతో ట్రేడ్‌లో బిజినెస్ కూడా బాగా పెరిగింది. ఆయన వైవిధ్యమైన కథల్ని ఎంచుకోవడం వల్లే మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ‘బిచ్చగాడు’ కంటే ‘కాశి’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
సరికొత్త ఖాకీని చూస్తారు
తమిళసినిమా: తిమిరుపుడిచవన్ చిత్రంలో సరికొత్త ఖాకీని చూస్తారని దర్శఖుడు గణేశా పేర్కొన్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ, సంగీతం అందిస్తూ, తన విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం తిమిరుపుడిచవన్. గణేశా అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నివేదాపేతురాజ్ కథానాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం చెన్నైలో జరిగాయి. దర్శకుడు గణేశా చిత్ర వివరాలను తెలుపుతూ పోలీస్ కథలతో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. ఈ తిమిరుపుడిచవన్ చిత్రంలో ఇంకా కొత్తగా ఏం చెబుతారులే అని కొందరు అనుకోవచ్చునని, ఒక పోలీస్‌స్టేషన్‌లో జరిగే సంఘటలతో చిత్ర కథ, కథనం చాలా విన్నూత్నంగా ఉంటాయని కచ్చితంగా చెప్పగలనని అన్నారు. ఈ చిత్రం కథను రాసుకున్నప్పుడే ఒక స్టార్ హీరో అయితే బాగుంటుందని భావించానన్నారు. ఐదేళ్ల క్రితమే కథను విజయ్అంటోనికి వినిపించానని అన్నారు. ఇప్పుడాయన తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ ఇమేజ్ను సంసాదించుకున్న నటుడని, అందుకే మళ్లీ ఈ తిమిరుపుడిచవన్ చిత్ర కథను చెప్పానని తెలిపారు. అయితే ఈ సారి ఆయన మరో మాట అనకుండా నటించడానికి పచ్చజెండా ఊపారని చెప్పారు. ఇందులో విజయ్‌ఆంటోనికి జంటగా నటి నివేదాపేతురాజ్ నటిస్తున్నారని తెలిపారు. -
ఖాకీగా విజయ్ ఆంటోని
సాక్షి, చెన్నై : బిచ్చగాడుగా అలరించిన విజయ్ ఆంటోని ద్విభాష చిత్రం రోషగాడులో పోలీస్‌గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తమిళంలో ఈ మూవీ తిమిరుపుదిచవన్గా తెరకెక్కనుంది. నంబియార్ ఫేమ్ గణేష దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఈ మూవీకి విజయ్ ఆంటోనీ స్వయంగా స్వరాలు సమకూర్చనున్నాడు. చిత్ర మేకర్లు ఇటీవలే మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అయితే హీరోయిన్ సహా ప్రధాన తారాగణం వివరాలను ఇంకా చిత్ర బృందం ప్రకటించలేదు. కృతుంగా ఉదయనిధి డైరెక్షన్లో తెరకెక్కిన కాశీ మూవీ షూటింగ్‌ను ఇటీవలే ముగించుకున్న విజయ్ ఆంటోని రోషగాడు సెట్లో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. కాశీ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీలో విజయ్ ఆంటోని సరసన అంజలి, సునయన ఆడిపాడారు. -
ఈ అభిమానం ఇలాగే కొనసాగాలి – విజయ్ ఆంటోనీ
‘‘ఇంద్రసేన’ సినిమాకి తెలుగు ప్రేక్షకుల స్పందన బాగుంది. నా ప్రతి సినిమాకి ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరు కుంటున్నా’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. ఆయన హీరోగా జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ ‘అన్నాదురై’ తెలుగులో ‘ఇంద్రసేన’ పేరుతో ఇటీవల విడుదలైంది. ‘‘నా పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. చాలామంది ప్రత్యేకంగా ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నా’’ అన్నారు కథానాయిక మహిమ. ‘‘ఇంద్రసేన’ విజయం సాధించడం హ్యాపీగా ఉంది. సినిమా చూసిన వారందరూ బాగుందని అభినందిస్తున్నారు’’ అని తెలుగులో చిత్రాన్ని విడుదల చేసిన నీలం కృష్ణారెడ్డి అన్నారు. రచయిత భాషాశ్రీ పాల్గొన్నారు. -
ఏ పార్టీ నుంచి ఆక్షేపణ రాలేదు
తమిళసినిమా: అన్నాదురై చిత్రానికి ఏ రాజకీయ పార్టీ నుంచి ఎలాంటి ఆక్షేపణ రాలేదని ఆ చిత్ర కథానాయకుడు విజయ్‌ఆంటోని తెలిపారు. ఈయనకు జంటగా డయానా సంబిక నటించిన ఈ చిత్రాన్ని నటి రాధికాశరత్‌కుమార్ ఆర్.స్టూడియోస్, ఫాతిమా విజయ్అంటోని, విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థలు కలిసి నిర్మించారు. నవ దర్శకుడు శ్రీనివాసన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పిక్చర్ బాక్స్ కంపెనీ అధినేత అలెగ్జాండర్ తమిళనాడు హక్కులను కొనుగోలు చేసి గురువారం 400 థియేటర్లలో విడుదల చేశారు. విజయ్‌ఆంటోని చిత్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలైన చిత్రం ఇదే అవుతుందని ఆయన గురువారం చెన్నైలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అనంతరం చిత్ర కథానాయకుడు విజయ్‌ఆంటోని మాట్లాడుతూ రాధిక నిర్మాతగా తాను నటుడిగా చిత్రం చేస్తామని ఊహించలేదన్నారు. ఒక మంచి కథా చిత్రానికి పాటలు అవసరం లేదని ఆయన అన్నారు. అదే విధంగా మునుపటి మాదిరి ఇప్పుడు ఆడియోకు ఆదాయం రావడం లేదని పేర్కొన్నారు.అందుకు ఈ చిత్ర పాటలను తన వెబ్సైట్ ద్వారా ఫ్రీగా డౌన్టోడ్ చేసుకోనేలా వసతి కల్పించానని తెలిపారు. అన్నాదురై చాలా పాపులర్ పేరు అని ఆ పేరును చిత్రానికి పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తలేదా?అని అడుగుతున్నారని, ఇందులో తాను ద్విపాత్రాభినయం చేశానని చెప్పారు.అన్న పాత్ర పేరు అన్నాదురై, తమ్ముడి పాత్రపేరు తంబిదురై అని తెలిపారు. అయితే సెన్సార్ సభ్యులు ఈ పేరు గురించి అడిగారని, అందుకు తగిన వివరణ ఇవ్వడంతో వారు సంతృప్తి చెందారని అన్నారు.అయితే ఇప్పటి వరకూ ఏ రాజ కీయ పార్టీ ఈ టైటిల్‌కు ఆక్షేపణ తెలపలేదని విజయ్‌ఆంటోని తెలిపారు. -
‘ఆ టైటిల్‌కు ఏ పార్టీ అభ్యంతరం తెలపలేదు’
సాక్షి, చెన్నై: అన్నాదురై చిత్రానికి ఏ రాజకీయ పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని హీరో విజయ్ ఆంటోని తెలిపారు. డయానా చంపికా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని నటి రాధిక శరత్‌కుమార్ ఆర్.స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థలు కలిసి నిర్మించారు. దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ ఆంటోనీ చిత్రాలలో అత్యధిక థియేటర్లతో విడుదలైన చిత్రం ఇదే అవుతుందని గురువారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఈ చిత్రంపై హీరో విజయ్‌ఆంటోని మాట్లాడుతూ.. రాధిక నిర్మాతగా తాను నటుడిగా చిత్రం చేస్తామని ఊహించలేదన్నారు. ఇందులో తన పాత్రకు న్యాయం చేశానని.. తనకు రాని విషయాల గురించి ప్రయత్నించనని చెప్పారు. ఒక మంచి కథా చిత్రానికి పాటలు అవసరం లేదని అన్నారు. అదే విధంగా గతంలో మాదిరి ఇప్పుడు ఆడియోకు ఆదాయం రావడం లేదని పేర్కొన్నారు. అందుకు ఈ చిత్ర పాటనలు తన వెబ్సైట్ ద్వారా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోనేలా అవకాశం కల్పించానని తెలిపారు. అన్న పాత్ర పేరు అన్నాదురై, తమ్ముడి పాత్రపేరు తంబిదురై అని తెలిపారు. మొదట ఈ చిత్రానికి కులసామి అని పేరు అనుకున్నమని.. అయితే పిచ్చైక్కారన్ చిత్రంలో అరుళ్ పాత్ర మాదిరిగానే అన్నాదురై పాత్ర చాలా మంచిగా ఉండటంతో ఆ పేరును నిర్ణయించామని తెలిపారు. అయితే సెన్సార్ సభ్యులు ఈ పేరు గురించి అడిగారని, అందుకు తగిన వివరణ ఇవ్వడంతో వారు సంతృప్తి చెందారని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ వారు ఈ టైటిల్‌కు అభ్యంతరం తెలపలేదని విజయ్ ఆంటోని తెలిపారు. ఇదే చిత్రం తెలుగులో ఇంద్రసేన పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. -
'ఇంద్రసేన' మూవీ రివ్యూ
టైటిల్ : ఇంద్రసేన జానర్ : ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తారాగణం : విజయ్ ఆంటోని, డయానా చంపికా, మహిమా, జ్యువెల్ మేరి, రాధా రవి, సంగీతం : విజయ్ ఆంటోని దర్శకత్వం : జి. శ్రీనివాసన్ నిర్మాత : రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగు నాట సంచలన విజయం సాధించిన విజయ్ ఆంటోని ఆ తరువాత విడుదలైన సినిమాలతో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మరోసారి తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సెంటిమెంట్ నే నమ్ముకొని ఇంద్రసేన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మరోసారి విజయ్ ఆంటోని మ్యాజిక్ రిపీట్ అయ్యిందా,,.? అమ్మ సెంటిమెంట్ లాగే తమ్ముడు సెంటిమెంట్ కూడా సక్సెస్ సాధించిందా..? కథ : ఇంద్ర సేన (విజయ్ ఆంటోని) తను ప్రేమించిన అమ్మాయి తన కళ్లముందే ప్రమాదంలో చనిపోవటంతో తాగుబోతుగా మారిపోతాడు. ఎప్పుడు తను ప్రేమించిన అమ్మాయి సమాధి మీదే పడుకొని తాగుతూ ఉంటాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడని తల్లిదండ్రులు ప్రయత్నించినా.. తాగుబోతు అన్న ముద్ర పడటంతో ఎవరు అమ్మాయిని ఇచ్చేందుకు ఒప్పకోరు. అదేసమయంలో అచ్చు ఇంద్రసేనలా ఉండే అతని తమ్ముడు రుద్రసేనకు పెళ్లి కుదురుతుంది. (సాక్షి రివ్యూస్) కానీ ఇంద్రసేన చేసిన ఓ చిన్నపోరపాటు వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. హ్యతకేసులో ఇంద్రసేనకు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. రుద్రసేన ఉద్యోగం పోగొట్టుకుంటాడు.. పెళ్లి ఆగిపోతుంది. వాళ్ల వ్యాపారాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఏడేళ్ల తరువాత ఇంద్రసేన జైలు నుంచి బయటకు వచ్చేసరికి పరిస్థితులన్ని మారిపోతాయి. రుద్రసేన రౌడీగా మారతాడు. తన వల్లే తన కుటుంబం ఇలా ఇబ్బందుల్లో పడిందని భావించిన ఇంద్రసేన ఎలాగైన తమ్ముడికి తిరిగి మామూలు జీవితం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఇంద్రసేన ఏం చేశాడు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ ఆంటోని, ఇంద్రసేనగా మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ద్విపాత్రాభినయం చేసిన విజయ్, లుక్ విషయంలో వేరియేషన్ చూపించినా.. నటన పరంగా రెండు క్యారెక్టర్లలో పెద్దగా వేరియేషన్ ఏమీ లేదు. హీరోయిన్ల పాత్రలకు అంతగా ఇంపార్టెన్స్ లేకపోవటం, వారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న తారలు కూడా కాకపోవటంతో పెద్దగా కనెక్ట్ కాలేరు. రాధ రవిలాంటి ఒకరిద్దరు నటులు తప్ప తెలుగు ఆడియన్స్ గుర్తు పట్టగలిగే వారు లేకపోవటంతో డబ్బింగ్ సినిమ ఆచూస్తున్నామన్న భావనే కలుగుతుంది. తన ప్రతీ సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించే విజయ్ ఈ సినిమా విషయంలో కూడా అదే ఫాలో అయ్యాడు. అన్నదమ్ముల కథను ఆకట్టుకునే కథనంతో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. (సాక్షి రివ్యూస్)దర్శకుడు శ్రీనివాసన్ సినిమాను పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలోపెట్టుకొని తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండ్ హాఫ్ యాక్షన్ మోడ్ లో సాగటం ఆకట్టుకుంటుంది. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటాయన్న దాని మీదే సినిమా విజయం ఆదారపడి ఉంటుంది. ప్లస్ పాయింట్స్ : ఎమోషనల్ సీన్స్ సినిమా నిడివి మైనస్ పాయింట్స్ : తమిళ నేటివిటి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ప్రేక్షకులకు నచ్చేది... హిట్టయ్యేదే కమర్షియల్ సినిమా!
‘‘నేను మంచి నటుణ్ణి కాదు. కానీ, మంచి కథలు ఎంచుకుని అందుకు తగ్గట్టు భావోద్వేగాలు పలికిస్తా. నా దృష్టిలో కమర్షియల్ సినిమా అంటూ ప్రత్యేకంగా ఉండదు. ప్రేక్షకులకు నచ్చేది... హిట్టయ్యేదే కమర్షియల్ సినిమా. ‘బిచ్చగాడు’ నచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ ‘అన్నాదొరై’. తెలుగులో ‘ఇంద్రసేన’గా రేపు విడుదలవుతోందీ సినిమా. విజయ్ ఆంటోని చెప్పిన విశేషాలు... ► తమిళనాడు రాజకీయాల నేపథ్యంలో తీసిన సినిమా కాదిది. దర్శకుడు శ్రీనివాసన్‌కు ఓ కవల సోదరుడు ఉండేవాడు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీశాడు. ► అన్నాతమ్ముళ్ల కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇంద్రసేన, రుద్రసేన అన్నదమ్ములు. ప్రేమించిన అమ్మాయిని కోల్పోయిన ఇంద్రసేన వ్యసనాలకు బానిస అవుతాడు. పీఈటీ టీచర్ అయిన రుద్రసేనకు అనుకోని సమస్య వస్తుంది. ఆయా పరిస్థితుల్లో అన్నాతమ్ముళ్లు తీసుకున్న నిర్ణయాలు ఏంటన్నదే కథ. ► అందంగా కట్ చేస్తే... టీజర్ బాగుంటుంది. ప్రేక్షకులను మోసం కూడా చేస్తుంది. అందుకే, పది నిమిషాల సినిమాని చూపించాం. దీని ద్వారా ప్రధాన కథ తెలిసే అవకాశం ఉండదు. కానీ, ప్రేక్షకుల్లో సినిమాపై ఉత్సుకత, క్రేజ్ పెంచొచ్చు. ‘భేతాళుడు’కీ ఇలాగే చేశాం. ► భారతదేశం చాలా పెద్దది. జనాభా కూడా ఎక్కువే. అందువల్ల జీఎస్టీపై అభిప్రాయాన్ని ఒక్కసారి చెప్పలేం. ఏడెనిమిదేళ్లు పడుతుంది. మా సినిమాలో జీఎస్టీపై ఓ పాట ఉంది. అందులో ఎవర్నీ విమర్శించకున్నా సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో జీఎస్టీ పదం వినిపించకుండా చేశాం. ► నేను చేసే ప్రతి పనిని ఓ ప్రేక్షకుడిగా ఆలోచిస్తా. నా పని సిన్సియర్‌గా చేయాలనుకుంటాను. అంతేకానీ, ఇంకా ఇంకా ఏదో కావాలంటూ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను. నా లిమిట్స్ నాకు తెలుసు. బయటి నిర్మాతలైతే ఒత్తిడి ఉంటుందన్నది నా ఆలోచన. అందుకే నా సంస్థలో చేస్తా. ► తెలుగులో కథలు వింటున్నా. త్వరలో డైరెక్ట్ సినిమా చేయబోతున్నా. నాకు యాక్టింగ్ అంటేనే ఇష్టం. దర్శకులు మంచి కథలతో నా వద్దకొస్తున్నారు. నిర్మాణంపైన శ్రద్ధ వహిస్తున్నా. నా చిత్రాలకు సంగీతం కూడా అందిస్తున్నా. ఇతర సినిమాలకు సంగీతం అందించాలనో... డైరెక్టర్ అవ్వాలనో ఆలోచన లేదు. ప్రస్తుతం తమిళ్లో రెండు సినిమాలు చేస్తున్నా. -
మరో నటుడిని ఊహించలేం
సాక్షి సినిమా: అన్నాదురై చిత్రంలో కథానాయకుడిగా విజయ్‌ఆంటోనిని మినహా వేరొకరిని ఊహించలేమని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు శ్రీనివాసన్. విజయ్‌ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం అన్నాదురై. నటి రాధికాశరత్‌కుమార్ ఆర్.స్టూడియోస్, ఫాతిమా విజయ్‌ఆంటోని ఫిలిం కార్పోరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అన్నాదురై. డయానాచంపిక, మహిమ హీరోయిన్లుగా నటించిన ఇందులో రాధారవి, కాళీవెంకట్, నళినికాంత్ ముఖ్యపాత్రలను పోషించారు. విజయ్అంటోని సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ చాలా ఆసక్తిగా, కొంచెం అలజడిగానూ ఉందన్నారు. ఇలాంటి అనుభూతి కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఒక దర్శకుడికి ప్రముఖ కథానాయకుడు, అనుభవజ్ఞులైన నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేంతిక వర్గం లభిస్తే ఆది చిత్రానికి బలం అవుతుందన్నారు. ఇందులో విజయ్‌ఆంటోని పవర్ఫుల్ నటన అదనపు ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. తాను దర్శకుడు వసంతబాలన్ వద్ద క్లాస్, సుశీంద్రన్ వద్ద కమర్షియల్‌ను, భూపతిపాండియన్ వద్ద హ్యూమరస్, ఎళిల్ వద్ద ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని ఎలా పూర్తి చేయాలన్న విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. అన్నాదురై చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం గర్వంగా ఫీలౌతున్నానని శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
నో జీఎస్టీ ప్లీజ్!
సామాన్య ప్రజల రిక్వెస్ట్ కాదిది... సెన్సార్ బోర్డు సినిమా జనాల ముందుకు తెచ్చిన అబ్జక్షన్! సినిమాల్లో ‘జీఎస్టీ’ అనే పదం వినిపించడానికి సెన్సార్ బోర్డు ఒప్పుకోవడం లేదని సమాచారమ్. సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘ఇంద్రసేన’ సినిమాలో ‘జీఎస్టీలా నువ్వే వచ్చి ఎంత పని చేస్తివే...’ అనే పాట ఒకటుంది. ఇటీవలే వీడియోతో సహా ఆ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి పాటకు మంచి స్పందన వస్తోంది. అయితే... సెన్సార్ ముందుకు సినిమాను తీసుకు వెళ్లేసరికి ‘జీఎస్టీ’ పదాన్ని తీసేయమని చెప్పారట! దాంతో ‘జీఎస్టీ’ని ఈఎమ్ఐ’గా మార్చి పాటను మళ్లీ రాసి, సింగర్స్‌తో రికార్డ్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇదంతా తమిళ హీరో విజయ్ ‘మెర్సల్’ ఎఫెక్ట్ ఏమో! తెలుగులో ‘అదిరింది’గా విడుదలైన ‘మెర్సల్’లో జీఎస్టీకి వ్యతిరేకంగా రెండు మూడు డైలాగులున్నాయి. సినిమా విడుదలైన తర్వాత తమిళనాట రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో నిర్మాతలు స్వచ్ఛందంగా జీఎస్టీ డైలాగులను మ్యూట్ చేశారు. తెలుగులో మూడు వారాలు ఆలస్యంగా విడుదలైన ‘అదిరింది’లోనూ జీఎస్టీ డైలాగులు లేవు. ఇకపై, ఏ సినిమాలోనూ ‘జీఎస్టీ’ అనే పదం వినబడదేమో!! -
కథ విని శరత్‌కుమార్‌గారు ఏడ్చారు – రాధిక
‘‘విజయ్ ఆంటోని సినిమాలు చూడలేదు కానీ, ఆయన నటించిన ‘పిచ్చైకారన్’ను తెలుగులో రీమేక్ చేయాలను కుంటుండగానే ‘బిచ్చగాడు’ పేరుతో అనువాదమై, హిట్ అయింది. అప్పుడు ‘మంచి సినిమా వదులుకున్నామే’ అనుకున్నా’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ ప్రధాన పాత్రల్లో జి. శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంద్రసేన’. ఈ చిత్రాన్ని తెలుగులో నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రాజశేఖర్, జీవిత రిలీజ్ చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘నేను మిస్ చేసుకున్న ‘బిచ్చగాడు’ సినిమా చూస్తే ఇంకా బాధపడతానని చూడలేదు. ఆ సినిమాలో అమ్మ పాట నాకు ఎంతో నచ్చుతుంది. దాని కోసమైనా సినిమా చూస్తా. ‘ఇంద్రసేన’ మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. నటి–నిర్మాత రాధిక మాట్లాడుతూ– ‘‘మంచి సినిమా లను ఆదరించే ప్రేక్షకుల్లో మొదటి స్థానం తెలుగు వారిదే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారు. నన్ను ఆదరిస్తున్న తెలుగువారికి రుణపడి ఉంటా. ఈ కథ విని, శరత్‌కుమార్‌గారు ఏడ్చారు. నేను అడగ్గానే సినిమా చేయడానికి ఓకే అన్నారు విజయ్ ఆంటోని. ‘ఇంద్రసేన’ తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేనీ రోజు ఇక్కడ నిలబడటానికి కారణం విజయ్ ఆంటోనిగారు. ఈ అవకాశాన్నిచ్చిన రాధిక, ఫాతిమా ఆంటోనిలకు థ్యాంక్స్’’ అన్నారు జి. శ్రీనివాసన్. ‘‘పదిహేనేళ్ల క్రితం రాధికగారు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశారు. ఇప్పుడు నటించే అవకాశం ఇచ్చినందుకు రాధిక, శరత్‌కుమార్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు విజయ్ ఆంటోని. నటి జీవిత, చిత్రనిర్మాత నీలం కృష్ణారెడ్డి, ‘బిచ్చగాడు’ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, రచయిత భాష్యశ్రీ, సినిమాటోగ్రాఫర్ దిల్‌రాజ్, నిర్మాత సురేశ్ కొండేటి పాల్గొన్నారు. -
రిలీజ్‌కు ముందే చూస్తారా!
సినిమా విడుదలకు పదిహేను రోజుల ముందు అందులో మొదటి పది నిమిషాల వీడియోను ప్రేక్షకులకు చూపించడమంటే సాహసమే. ఈ సాహసానికి ‘సై’ అంటున్నారు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా నటించిన తాజా సిన్మా ‘ఇంద్రసేన’ పాటల్ని ఈరోజు హైదరాబాద్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకలో సిన్మాలోని పది నిమిషాల నిడివి గల వీడియోను, ఓ ఫుల్ వీడియో సాంగును ప్రదర్శించనున్నారు. జి. శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఎన్.కె.ఆర్. ఫిల్మ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే విడుదలైన ‘ఇంద్రసేన’ టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అంచనాలకు తగ్గట్టు ఉంటుందీ సిన్మా. కంటెంట్‌పై నమ్మకంతో పది నిమిషాల వీడియోను విడుదల చేస్తున్నాం. అలాగే, ఫుల్ వీడియో సాంగును రవితేజ విడుదల చేస్తారు. మా సంస్థ నుంచి విడుదలైన గత సినిమాలు ‘ఇంకొక్కడు, జయమ్ము నిశ్చయమ్మురా’ తరహాలో ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది’’ అన్నారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోని స్వరకర్త. -
లోకంపై దండెత్తే ఇంద్రసేన
‘లెఫ్ట్‌కి వెళితే పెద్ద నమ్మకద్రోహం కనిపిస్తుంది. స్ట్రయిట్‌గా వెళ్లి రైట్ తీసుకుంటే ఒక ఓటమి ఎదురవుతుంది. దాన్నుండి ఇంకొంచెం ముందుకెళ్లి యూ టర్న్ తీసుకుంటే నువ్వు తీసుకున్న అప్పు అనే ఒక లోయ కనిపిస్తుంది. ఆ లోయలో పడి ముక్కు, మొహం పగులగొట్టుకుని లేచి ముందుకెళితే మనం మోసపోయామని ఒక సిగ్నల్ పడుతుంది. ఆ సిగ్నల్‌ని కూడా టాప్ గేర్‌లో దాటి వెళితే ఆ తర్వాత వచ్చే ఇల్లే నువ్వు కోరుకున్న విజయం. ఆ విజయాన్ని అందుకుని వెనక్కి తిరిగి చూస్తే యముడు మనకన్నా ముందొచ్చి మనకోసం వేచి ఉంటాడు’ ఇదీ ‘ఇంద్రసేన’ డైలాగ్. లోకంలోని దుర్మార్గాన్ని నిశితంగా అర్థం చేసుకున్నవాడి డైలాగ్. ఈ డైలాగ్ సారంతో రాబోతున్న విజయ్ ఆంటోని సినిమాయే ‘ఇంద్రసేన’. విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమా ముఖ్యపాత్రలు. జి.శ్రీనివాసన్ దర్శకుడు. రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘అన్నాదురై’ ని ‘ఇంద్రసేన’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘ఇది సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ. భాషాశ్రీ అద్భుతమైన డైలాగులు, పాటలు రాశారు. డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత తెలుగులో స్ట్రైట్ ఫిలిం చేయబోతున్నా’’ అన్నారు. ‘‘ఇంద్రసేన’ లోగోని చిరంజీవిగారు రిలీజ్ చేయ డంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మంచి హిట్టవు తుందని నమ్ము తున్నా’’ అన్నారు దర్శకుడు. -
ఇంద్ర చేతుల మీదుగా 'ఇంద్ర సేన' ఫస్ట్ లుక్
బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. ఒక్క సినిమాతో టాలీవుడ్ లోనూ స్టార్ హీరోగా మారిపోయిన విజయ్, తరువాత తన ప్రతీ సినిమానూ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే బిచ్చగాడు స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇంద్రసేన. సి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను టాలీవుడ్ ఇంద్ర మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల పలు చిన్న చిత్రాల ప్రమోషన్ కు ముందుకు వస్తున్న మెగాస్టార్ ఈ తమిళ హీరోకు సాయం చేసేందుకు ఓకె చెప్పారు. ఈ నెల 5న మెగాస్టార్ ఇంద్రసేన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంద్రసేన సినిమా విజయ్ ఆంటోని స్వయంగా రాధిక శరత్ కుమార్ తో కలిసి నిర్మిస్తున్నారు. -
విజయ్‌ఆంటోనికి జతగా సునైనా
తమిళసినిమా: నటి సునైనాకో అవకాశం వచ్చింది. కోలీవుడ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి ఎందుకనో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకోలేకపోతోంది. నీర్‌పార్వై వంటి కొన్ని చిత్రాల్లో సునైనా నటన విమర్శకులను సైతం మెప్పిం చింది. ఈ మధ్య తొండన్ చిత్రంతోనూ విజయాన్ని అందుకున్న సునైనా తాజాగా విజయ్‌ఆంటోనితో జతకట్టడానికి రెడీ అవుతోంది.యమన్ చిత్రం తరువాత విజయ్‌ఆంటోని అన్నాదురై అనే ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనివాసన్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుపుకుంటోంది. ఆయన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కాళీ అనే టైటిల్‌ను నిర్ణయించారు.ఇందులో ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట.అందులో ఒకరుగా సునైనా ఎంపికయ్యారట. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు.కాళీ చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని సునైనా తెలిపారు. త్వరలోనే కాళీ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందట. దీని విజయ్‌ఆంటోని సొంత నిర్మాణ సంస్థ« విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ నిర్మించనుంది.