
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తమిళ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ పళ్లు విరిగిపోయాయని, దవడ ఎముక సైతం విరిగినట్లు తెలుస్తోంది. ముఖానికి కూడా బలంగా దెబ్బలు తగిలియని సమాచారం. ప్రస్తుతం ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని, కండిషన్ సీరియస్‌గా ఉండటంతో విజయ్ కుటుంబసభ్యులు ఇప్పటికే మలేషియాకు చేరుకోగా, అక్కడినుంచి చెన్నైకి తరలించినట్లు ఆమె భార్య ఫాతిమా తెలిపారు.
కాగా మలేషియాలో ప్రస్తుతం బిచ్చగాడు-2 షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీన్స్ చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకంటున్నారు.
ప్రస్తుతానికి బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లే. మరోవైపు విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment