chennaii
-
ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం, టెక్నీషియన్ మృతి
స్వర మాంత్రికుడు, లెజెండరి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టెక్నీషియన్ మృతి చెందినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. వివరాలు.. చెన్నైలోని రెహమాన్ పంచతాన్ రికార్డింగ్ స్టూడియోలో ఇటీవల ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా లైట్ మెన్ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. లైట్ బిగిస్తుండగా ఆయనకు షాక్ తగలడంతో కిందపడి మృతి చెందినట్లు పలు తమిళ వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి. చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ స్టూడియో ద్వారా రెహమాన్ లైవ్ షోలు, కన్సర్ట్లు చేస్తారు. చెన్నైలో తన ఇంటిలోనే ఈ స్టూడియోను నిర్వహిస్తున్నారు. కాగా చాలా గ్యాప్ తర్వాత రెహమాన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది వచ్చిన విక్రమ్ కోబ్రా, లైఫ్ ఆఫ్ ముత్తు, పొన్నియన్ సెల్వన్ పార్ట్-1కు సంగీతం అందించారు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్-2తో పాటు తమిళంలో పలు చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చదవండి: శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడంపై వివరణ ఇచ్చిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని -
'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమం?
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తమిళ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ పళ్లు విరిగిపోయాయని, దవడ ఎముక సైతం విరిగినట్లు తెలుస్తోంది. ముఖానికి కూడా బలంగా దెబ్బలు తగిలియని సమాచారం. ప్రస్తుతం ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని, కండిషన్ సీరియస్‌గా ఉండటంతో విజయ్ కుటుంబసభ్యులు ఇప్పటికే మలేషియాకు చేరుకోగా, అక్కడినుంచి చెన్నైకి తరలించినట్లు ఆమె భార్య ఫాతిమా తెలిపారు. కాగా మలేషియాలో ప్రస్తుతం బిచ్చగాడు-2 షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీన్స్ చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకంటున్నారు. ప్రస్తుతానికి బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లే. మరోవైపు విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు. -
ప్రయాణికుడు చేసిన తప్పిదం..విమానం టేకాఫ్‌కు ముందే..
గత కొద్దిరోజులుగా విమానంలో ప్రయాణికుల వరుస అనుచిత ప్రవర్తనల ఘటనలు గురించి వింటునే ఉన్నాం. అదే తరహాలో ఒక ప్రయాణికుడు ఒక పొరపాటు చేశాడు. ఏకంగా విమానం బయలుదేరే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట డోర్‌ని ఓపెన్ చేశాడు. ఐతే ఆ తప్పిదాన్ని ఎయిర్‌లైన్స్ సకాలంలో గుర్తించింది కాబట్టి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్త లేదు. ఈ ఘటన గతేడాది డిసెంబర్ 10న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజీసీఏ) అధికారికంగా వెల్లడించింది. అంతేగాదు ఈ ఘటనపై సత్వరమే విచారణకు ఆదేశించడంతో ఫ్లైట్ రెగ్యులేటర్ స్పష్టమైన నివేదిక ఇచ్చినట్లు కూడా పేర్కొంది.ఆ విమానం చెన్నై నుంచి త్రివేండ్రమ్ వెళ్లున్నప్పుడూ ఈ ఘటన జరిగినట్లు డీజీసీఏ పేర్కొంది. ప్రయాణికులను దించేసిన అనంతరం ఆ విమానం తిరుచిరాపల్లికి బయలుదేరినట్లు కూడ తెలిపింది. అయితే ఈ ఘటన గురించి సదరు ఎయిర్ లైన్స్ డీజీసీఏకి వివరణ ఇస్తూ.. "ఆ రోజు ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు పొరపాటున ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరును తెరిచాడు.ఐతే తాము విమానం టేకాఫ్‌కు ముందే ఆ విషయాన్ని గమనించాం. తాము వెంటనే డోర్‌ని మళ్లీ ఇన్స్టాల్ చేసి, విమానంలో గాలి ఒత్తిడి ఎంత మేర ఉందో తనఖీ చేశాం. అంతేగాదు సేఫ్టీ ప్రోటోకాల్స్ విషయంలో రాజీపడకుండా తనిఖీలు నిర్వహించాం. అందువల్లే ఎలాంటి అవాంఛీనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు." అని ఎయిర్‌లైన్స్ స్పష్టంగా వివరణ ఇచ్చిందని డీజీసీఏ అధికారులు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. (చదవండి: పట్టపగలే దారుణం..వృద్ధుడిని బైక్‌తో ఈడ్చుకెళ్లి..) -
హిందీ మేం నహీ బోల్తా హై
ఎన్నికల వేళ ఓటు కోసం కోటి ట్రిక్కులుంటాయి. రాజకీయ పార్టీలు ఒక్క ఓటు కోసం ఏందాకైనా వెళ్తాయి. తమిళనాడులో డీఎంకే రాజకీయానికి ఆధారమే హిందీ వ్యతిరేకత. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తూ డీఎంకే పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. చివరికి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దక్షిణాదిపై హిందీ రుద్దబోమని స్పష్టం చేయాల్సి వచ్చింది. కానీ అదే డీఎంకే ఇప్పుడు ఏకంగా హిందీ భాషలో ఎన్నికల పోస్టర్లు తయారు చేసి, సెంట్రల్ చెన్నై నియోజకవర్గం అంతటా అతికించింది. దీనికి కారణం ఏమిటంటే సెంట్రల్ చెన్నై లోని సౌకార్ పేట్ (షావుకార్ల పేట) ప్రాంతంలో దాదాపు లక్షన్నర మంది మార్వాడీలు ఉన్నారు. వీరి ఓట్లు కావాలంటే వారి భాషలోనే అడగాలి. కాబట్టే హిందీ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తమాషా ఏమిటంటే ఆ నియోజవర్గం నుంచి కరుణానిధి బంధువు దయానిధి మారన్ ఎన్నికల బరిలో ఉన్నారు. అందుకే ఎన్నికలు రాగానే ఎంతవారైన దారికి రాక తప్పదంటారు.