Accident In AR Rahman Panchathan Film Studio Light Man Died After Falling From 40 Feets - Sakshi
Sakshi News home page

AR Rahman: ఏఆర్‌ రెహమాన్‌ స్టూడియోలో ప్రమాదం, టెక్నీషియన్‌ మృతి

Published Thu, Jan 19 2023 1:08 PM | Last Updated on Thu, Jan 19 2023 1:46 PM

Accident in AR Rahman Studio Light Man Died - Sakshi

స్వర మాంత్రికుడు, లెజెండరి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ స్టూడియోలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టెక్నీషియన్‌ మృతి చెందినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. వివరాలు.. చెన్నైలోని రెహమాన్‌ పంచతాన్ రికార్డింగ్ స్టూడియోలో ఇటీవల ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా లైట్‌ మెన్‌ కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. లైట్‌ బిగిస్తుండగా ఆయనకు షాక్‌ తగలడంతో కిందపడి మృతి చెందినట్లు పలు తమిళ వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి.

చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి

అ‍యితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ స్టూడియో ద్వారా రెహమాన్‌ లైవ్‌ షోలు, కన్‌సర్ట్‌లు చేస్తారు. చెన్నైలో తన ఇంటిలోనే ఈ స్టూడియోను నిర్వహిస్తున్నారు. కాగా చాలా గ్యాప్‌ తర్వాత రెహమాన్‌ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది వచ్చిన విక్రమ్‌ కోబ్రా, లైఫ్‌ ఆఫ్‌ ముత్తు, పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌-1కు సంగీతం అందించారు. ప్రస్తుతం పొన్నియన్‌ సెల్వన్‌-2తో పాటు తమిళంలో పలు చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. 

చదవండి: శృతి హాసన్‌కు ఐ లవ్‌ యూ చెప్పడంపై వివరణ ఇచ్చిన డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement