Ar rahman
-
ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్ మాజీ భార్య
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ తన వివాహ బంధానికి ముగింపు పలికారు. సైరా భానును పెళ్లాడిన ఆయన గతేడాది తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించిన అభిమానులకు షాకిచ్చాడు. దాదాపు 29 సంవత్సరాల వివాహబంధం తర్వాత డివోర్స్ కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తాము పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయంలో దయచేసి ప్రైవసీ ఇవ్వాలని అభిమానులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత వీరిపై కొన్ని ఊహగానాలు రావడంతో సైరా బాను తన భర్త రెహమాన్ చాలా మంచివాడంటూ ఓ నోట్‌ను కూడా విడుదల చేసింది. ఆ తర్వాత రూమర్స్‌కు చెక్ పడింది.అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే ఆసుపత్రిలో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారని సైరా భాను తరఫున ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటనలో.. 'కొన్ని రోజుల క్రితం సైరా భాను మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కఠినమైన సమయంలో త్వరగా కోలుకోవడంపైనే ఆమె దృష్టి ఉంది. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు. మీ అందరి మద్దతు, ప్రేమతో క్షేమంగా తిరిగొస్తా.' అని రాసుకొచ్చారు. ఈ కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చినందుకు లాస్ ఏంజిల్స్‌లోని స్నేహితులు రసుల్ పూకుట్టి, అతని భార్య షాదియా, వందనా షా, మిస్టర్ రెహమాన్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 'అంటూ నోట్ విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vandana Shah (@advocate.vandana) -
'ఛావా'తో భారీ పాపులారిటీ.. ఏకంగా రెహమాన్‌తో కలిసి.. ఎవరీ వైశాలి?
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న చిత్రం 'ఛావా(Chhaava)'. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ మూవీ రూ.200 కోట్ల మార్క్‌ను దాటేందుకు సిద్ధమైంది.ఛావా కోసం కష్టపడ్డ హీరోమరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) ఈ చిత్రాన్ని రూపొందించాడు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య ఏసు భాయి పాత్రలో రష్మిక మందన్నా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ కత్తి సాము నేర్చుకోవడమే కాకుండా 100 కిలోల బరువు పెరిగి మరీ సాహసం చేశాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి విడుదలైన "ఆయా రే తూఫాన్" పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాట పాడిందెవరో తెలుసా?ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పాటే వినిపిస్తోంది. ఈ పాటను పాడింది ఎవరో కాదు మరాఠీ సింగర్ వైశాలి సామంత్ (Vaishali Samant). ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన ఆమె ఆయా రే తుఫాన్ సాంగ్‌తో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించడంతో పాటు ఈ పాటను ఆలపించాడు. ఇర్షాధ్ కమిల్, క్షతిజ్ పట్వర్దన్ రచించారు.మిలియన్ల వ్యూస్ఈ పాట విన్న ఆడియన్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో ఇప్పటివరకు 37 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇదే విషయంపై వైశాలి మాట్లాడుతూ.."ఏ ఆర్ రెహమాన్ తో పాడే అవకాశం వచ్చినందుకు ఎప్పటికీ నేను కృతజ్ఞురాలినై ఉంటాను. ఛావా సినిమాలోని ఈ పాట నా సంగీత ప్రయాణానికి ఎంతో ముఖ్యమైనది. ఆయన నా గానం పై నమ్మకం ఉంచి నాకు అవకాశాన్ని కల్పించారు. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆడియో లాంచ్ సందర్భంగా ఏఆర్ రెహమాన్‌తో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఒక గొప్ప అవకాశం. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను" అని తెలిపింది. చదవండి: కడుపుతో ఉన్న భార్య కోసం ఆరాటం.. జైల్లో ఉండగా నటుడు ఏం చేశాడంటే? -
‘చావా’ మూవీ ప్రీమీయర్ షోలో రష్మిక సందడి (ఫొటోలు)
-
పాప్ సింగర్ ఎడ్ షీరన్తో హిట్ సాంగ్ రీమిక్స్ చేసిన ఏఆర్ రెహమాన్
లండ్‌నుకు చెందిన పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్ చెన్నైలో తన పాటలతో మెప్పించారు. చెన్నై నందనం YMCA మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో తన పాటలతో అభిమానులను మెప్పించారు. సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్‌తో 'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాటతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. పదకొండేళ్ల వయసు నుంచే పాటలు రాయడంతో పాటు పాడటం కూడా ఆయన ప్రారంభించాడు. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఆయన సాంగ్స్‌కు దక్కుతుంటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆయన అభిమానులు ఉన్నారు.చెన్నైలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా అభిమానులు పాల్గొన్నారు. ఈ సంగీత కచేరిలో ఎడ్ షీరాన్ కు సంబంధించిన టాప్ సాంగ్స్ ఆలపించారు. తనకు ప్రపంచ ప్రసిద్ధ గ్రామీ అవార్డు తెచ్చిపెట్టిన 'షేప్ ఆఫ్ యు' పాటను పాడుతూ ఉండగ సడెన్‌గా వేదికపైకి ఏఆర్ రెహమాన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. 1994లో విడుదలైన ప్రేమికుడు చిత్రం నుంచి 'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాట పాడుతూ వేదికపైకి రెహమాన్ చేరుకున్నారు. అభిమానుల కేరింతల మధ్య ఆ సమయంలో ఎడ్ షీరాన్ కూడా ఆ పాటకు తన గొంతు కలిపారు. దీన్ని ఊహించని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీరిద్దరూ కొత్త తరహా రీమిక్స్ సంగీతాన్ని ప్రజలకు అందించారు. ఈ రీమిక్స్ సంగీతాన్ని నెటిజన్లు మరికొన్ని రోజులు ఉపయోగించనున్నారు. Thank you, @edsheeran! Hope to see you perform more in Chennai—our city needs more international concerts and collaborations like yours! 🎶🔥 #ChennaiLovesEd https://t.co/uPuUHef7xE— A.R.Rahman (@arrahman) February 6, 2025 -
ఏఆర్ రెహమాన్‌కు సమయపాలన లేదు.. సింగర్ ఫైర్
దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman)కు సమయపాలన లేదంటున్నాడు సింగర్ అభిజీత్ భట్టాచార్య. చెప్పిన సమయానికి పని పూర్తి చేయడంటూ అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా అభిజీత్ భట్టాచార్య (Abhijeet Bhattacharya) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కెరీర్ ఊపందుకున్న సమయంలో ఏ నజ్నీన్ (Ae Nazneen Suno Na..) పాట ఆఫర్ ఇచ్చారు. చెప్పిన సమయానికి వెళ్లాను. కానీ అక్కడ నన్ను గంటలకొద్దీ వెయిట్ చేయించారు. తీరా రెహమాన్ వెళ్లిపోవడంతో నన్ను రాత్రికి అదే హోటల్లో ఉండిపోమన్నారు. మరుసటి రోజు సాంగ్ రికార్డ్ ఉంటుందని చెప్పారు. సరేలేనని నేను నిద్రకుపక్రమించాను. ఇంతలో అర్ధరాత్రి రెండు గంటలకు స్టూడియో నుంచి ఫోన్ వచ్చింది.నిద్రపోతున్న సమయంలో..త్వరగా వచ్చి పాట పాడమని అడిగారు. ఉదయం రెండు గంటలకు సాంగ్ రికార్డింగ్ ఏంటని ఒప్పుకోలేదు. నేను ఇప్పుడే నిద్రపోతున్నాను.. ఈ సమయంలో ఎలా కుదురుతుందని చెప్పి.. తెల్లారాక స్టూడియోకు వస్తానన్నాను. తీరా వెళ్లేసరికి రెహమాన్ అక్కడ లేడు. అతడి అసిస్టెంట్ ఉన్నాడు. వాళ్లు ఓ పద్ధతి ప్రకారం పని చేయరు. ఎప్పుడు పడితే అప్పుడే పని చేస్తున్నారు. నేనేమో ఏదైనా పద్ధతి ప్రకారం ఉండాలనుకుంటాను. సమయపాలన పాటిస్తాను. క్రియేటివిటీ పేరు చెప్పి ఉదయం మూడున్నర గంటలకు సాంగ్ పాడమనడమేంటో నాకిప్పటికీ అర్థం కాదు.(చదవండి: నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు)సినిమా ఫ్లాప్.. సాంగ్స్ హిట్ఆ రోజు స్టూడియోలో ఏసీ ఎక్కువ పెట్టడం వల్ల నాకు జలుబైంది. ఆ విషయం చెప్పినా సరే వాళ్లు వినిపించుకోలేదు. ఏం పర్లేదని పాడమన్నారు. పాట పాడటం పూర్తయ్యాక రెహమాన్ గురించి అడిగితే సరైన స్పందనే లేదు. అలా ఆయన్ను కలవకుండానే అక్కడి నుంచి వెనుదిరిగాను. నేను ఎన్నో సూపర్ డూపర్ ఫ్లాప్ సినిమాలకు హిట్ సాంగ్స్ పాడాను. అందులో ఒకటే ఇది కూడా! ఈ సినిమా ఎవరూ చూడలేదు. కానీ పాటలు మాత్రం వైరలయ్యాయి. దానికి క్రెడిట్ అంతా రెహమాన్‌కే వచ్చింది. ఎన్నో సార్లు రెహమాన్‌ను కలవాలని ప్రయత్నించాను. కానీ నాకు అవతలివైపు నుంచి సరైన స్పందన రాలేదు. ఇలా ఒకరిని వెయిట్ చేయించడం వల్ల ఎవరూ గొప్పోళ్లు అయిపోరు.సినిమా..199లో వచ్చిన దిల్ హై దిల్ మే సినిమా (Dil Hi Dil Mein)లో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఏ నజ్నీన్ సునో నా.. పాటను అభిజీత్ ఆలపించాడు. తర్వాత రెహమాన్‌తో ఎన్నడూ అభిజీత్ జత కట్టలేదు. దిల్ హై దిల్ మే సినిమా విషయానికి వస్తే ఇందులో కునాల్ సింగ్ హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్గా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది కానీ అభిజీత్ పాడిన పాట మాత్రం బాగా హిట్టయింది. పర్సనల్ లైఫ్ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ గతేడాది తన భార్యతో విడిపోయాడు. 29 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్న రెహమాన్-సైరా భాను జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీరిద్దరికీ 1995లో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అని ముగ్గురు సంతానం. గతేడాది నవంబర్‌లో రెహమాన్, సైరా.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.చదవండి: మరోసారి వివాదంలో నయనతార.. చంద్రముఖి నిర్మాతల నోటీసులు -
ఏఆర్ రెహమాన్, సైరా మళ్లీ కలిసిపోయే ఛాన్స్!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారం అభిమానులను షాక్‌కు గురి చేసింది. 29 ఏళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి సిద్ధపడటాన్ని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో వీరి విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ వందన షా.. వీళ్లు మళ్లీ కలిసిపోయే ఛాన్స్ ఉందంటూ హింటిచ్చారు. సుదీర్ఘ జర్నీ.. మళ్లీ కలిసే ఛాన్స్తాజాగా ఓ ఇంటర్వ్యూలో వందన మాట్లాడుతూ.. వాళ్లది సుదీర్ఘ వైవాహిక జర్నీ.. ఎంతో ఆలోచించుకున్నాకే విడిపోవడానికి సిద్ధపడుంటారు. పిల్లల కస్టడీ ఇంకా నిర్ణయించలేదు. తల్లిదండ్రుల్లో ఎవరితో ఉండాలని డిసైడ్ చేసుకున్న హక్కు పిల్లలకు ఉంది. అయినా ఈ దంపతుల మధ్య సయోధ్య కుదిరే అవకాశమే లేదని నేను ఎక్కడా కొట్టిపారేయలేదు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రెహమాన్ దంపతులు మళ్లీ కలిసుండే అవకాశం ఉందని పలువురూ అభిప్రాయపడుతున్నారు.కాగా ఏఆర్ రెహమాన్, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ అని ముగ్గురు సంతానం. ఈ నెల ప్రారంభంలో రెహమాన్, సైరా.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.చదవండి: బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్ ఏంటో అర్థం కాలే! -
రెహమాన్ నాకు తండ్రి లాంటి వ్యక్తి: మోహినిదే
ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్, సైరా బాను దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత చాలా వార్తలు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే రెహమాన్ టీమ్‌లో పనిచేస్తున్న మోహినిదే అనే యువతి కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్ నిర్ణయానికి లింక్ పెడుతూ రకరకాల వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ రెండు జంటల విడాకులకు ఏమైనా రిలేషన్ ఉందా అంటూ కోలీవుడ్‌లో భారీగా కథనాలు వచ్చాయి.రెహమాన్ గురించి ఎక్కువగా చెడు ప్రచారం జరుగుతున్న సమయంలో రెండు రోజుల క్రితం సైరా బాను రియాక్ట్ అయింది. రెహమాన్ చాలామంచి వ్యక్తి అంటూ ఎవరూ తప్పుగా ప్రచారం చేయకండి అని ఆమె కోరింది. ఈ క్రమంలో తాజాగా మోహినిదే కూడా మరోసారి స్పందించారు. ఆ రూమర్స్‌ను ఖండిస్తూనే రెహమాన్ గోప్యతను గౌరవించాలని కోరింది.మోహినిదే ఒక వీడియో సందేశాన్ని ఇలా పంపింది. 'నేను కొన్ని విషయాలను అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా జీవితంలో నాకు తండ్రితో పాటు చాలామంది రోల్ మోడల్స్ ఉన్నారు. నా కెరీర్ అభివృద్ధిలో వారందరూ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ఆ విధంగా ఏఆర్ రెహమాన్ నాకు తండ్రిలాంటివారు. ఇంకా చెప్పాలంటే ఏఆర్ రెహమాన్ మా నాన్న కంటే చిన్నవాడు. అతని కూతురు నా వయసు దాదాపు సమానంగానే ఉంటుంది. ఏఆర్ రెహమాన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను ఆయన టీమ్‌లో 8 సంవత్సరాలకు పైగా పనిచేశాను. అయితే, గత 5 సంవత్సరాల నుంచి అమెరికాలో ఒక పాప్ సంగీత కళాకారుడితో కలిసి పని చేస్తున్నాను. నాకు నా స్వంత బ్యాండ్ ఉంది. విడాకుల విషయంలో ఏఆర్ రెహమాన్‌పై వస్తున్న పుకార్లు చాలా బాధాకరం. ఆయన గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నాను.' అని ఆమె పేర్కొన్నారు.#ARRahman is like my father❤️🔥- #MohiniDey 👍🏻pic.twitter.com/RtuYXF2lwi— Tharani ᖇᵗк (@iam_Tharani) November 26, 2024 -
ప్రపంచంలోనే ఏఆర్ అత్యుత్తమ వ్యక్తి: సైరా భాను
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారంపై రకరకాల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 29 ఏళ్లు అన్యోన్యంగా సంసార జీవితాన్ని సాగించిన ఈ జంట విడిపోవాలనుకోవడానికి గల కారణాలను నెటిజన్లు పెద్ద ఎత్తున వెతుకుతున్నారు. ఏఆర్ రెహమాన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న గిటారిస్ట్ మోనికా దేను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు.దీంతో తన గురించి అసత్య ప్రచారాన్ని చేస్తున్న సామాజిక మాధ్యమాలకు రెహమాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. ఆదివారం సైరా భాను ‘నేను సైరా రెహమాన్ మాట్లాడుతున్నా’ అంటూ ఓ వీడియో వాయిస్‌ను విడుదల చేశారు. అందులో ‘‘ఏఆర్ గురించి దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి ఆయన. అలాంటి అద్భుతమైన మనిషిని చూడలేం. నా శారీరక అనారోగ్యం కారణంగా కొన్ని నెలలుగా ముంబైలో ఉంటూ, చికిత్స పొందుతున్నాను.అందువల్లే ఏఆర్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలనుకున్నా. విడిపోవాలనుకోవడానికి కారణం నా అనారోగ్యమే. ఏఆర్ రెహమాన్ ఎంతో బిజీగా ఉన్న పరిస్థితుల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నా పిల్లలనూ ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. ఏఆర్పై నాకున్న నమ్మకం నా జీవితానికంటే పెద్దది. నేను ఆయన్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. నన్ను కూడా ఆయన అంతే ప్రేమించారు. ఇంకా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మా స్వేచ్ఛను గౌరవించండి. చికిత్స పూర్తయ్యాక త్వరలోనే చెన్నైకి తిరిగి వస్తాను. ఏఆర్ రెహమాన్ పేరుకు దయచేసి కళంకం ఆపాదించకండి’’ అని సైరా భాను కోరారు. – సాక్షి చెన్నై, తమిళ సినిమా -
రెహమాన్‌కు దూరంగా ఉండటానికి కారణం ఇదే: సైరా బాను
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, భార్య సైరా బాను విడిపోయిన తర్వాత సోషల్‌మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రెహమాన్‌ను తప్పుపడుతూ తమిళ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ వారు పలు కథనాలు ప్రసారం చేయడంతో తాజాగా సైరా బాను రియాక్ట్ అయ్యారు.'రెహమాన్ చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి తెలియకుండా తప్పుగా ప్రచారం చేయడం బాధగా ఉంది. పలు అనారోగ్య కారణాలతో నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను. కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను. ఈ కారణం వల్లే ఆయనకు దూరంగా ఉండాలని నేనే కోరుకున్నా. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. మీడియాతో పాటు యూట్యూబ్ వారికి నా విన్నపం. దయచేసి ఆయన గురించి చెడుగా ప్రచారం చేయకండి. ప్రపంచంలో ఆయనకు ఉన్న మంచి గుర్తింపును చెడగొట్టకండి. ఇప్పటికీ ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాపై కూడా ఆయనకు ఎనలేని ప్రేమ ఉంది. ఇకనైనా తప్పుడు కథనాలకు ఫుల్స్టాప్ పెడుతారని అనుకుంటున్నాను. మేమిద్దరం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి ఇబ్బందికరమైన సమయంలో మా గోప్యతను కాపాడండి. కొద్దిరోజుల్లో నేను చెన్నై వస్తాను.' అని ఆమె తెలిపారు. -
విడాకుల గోల.. వాళ్లందరికీ రెహమాన్ నోటీసులు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆరె రెహమాన్.. రీసెంట్గా విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇతడి భార్య సైరా భాను లాయర్ బయటపెట్టాడు. ఇద్దరు ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరారు. కానీ రెహమాన్ విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే ఈయన దగ్గర పనిచేస్తున్న మోహిని దే అనే అమ్మాయి కూడా భర్తకు డివోర్స్ ఇచ్చింది. దీంతో రుమార్స్ మొదలయ్యాయి.(ఇదీ చదవండి: నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్)రెహమాన్-మోహిని దే మధ్య రిలేషన్ ఉన్నట్లు పలువురు ఆర్టికల్స్ రాశారు. యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేశారు. అయితే ఇవన్నీ అవాస్తవాలని, ఇలాంటివి ప్రచారం చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తప్పవని ఏఆర్ రెహమాన్ టీమ్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రకటన రిలీజ్ చేసింది.తన గురించి సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని రెహమాన్ సూచించినట్టు టీమ్ పేర్కొంది. ఇప్పటికే పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్‌ను 24 గంటల్లోపు తొలగించాలని, లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రెహమాన్.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తీస్తున్న సినిమా కోసం పనిచేస్తున్నారు. (ఇదీ చదవండి: ప్రభుత్వం ఉద్యోగం సాధించిన సుకుమార్ ఇంట్లో పనిమనిషి)Notice to all slanderers from ARR's Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x— A.R.Rahman (@arrahman) November 23, 2024 -
నెరుస్తున్న బంధాలు
పెళ్లయిన కొత్త... పడలేదు..విడిపోయారు...పెళ్లయ్యి పదేళ్లు... విడిపోయారు... ఇవి అందరికీ తెలిసినవే.కాని పెళ్లయ్యి ముప్పై, నలబై ఏళ్లు అయ్యాక కూడా విడిపోవాలా?వీటిని ‘గ్రే డివోర్స్’లని ‘సిల్వర్ స్పిల్టింగ్’ అంటున్నారు.నటుడు ఆశీష్ విద్యార్థి తన 60వ ఏట విడాకులు తీసుకుంటే ఇప్పుడు రెహమాన్ జంట కేసు కూడా గ్రే డివోర్స్ను చర్చాంశం చేసింది. సైకాలజిస్ట్‌లు మాత్రం జట్టు తెల్లబడేకొద్దీ వైవాహిక జీవితం గట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఆశీష్ విద్యార్థి కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. అతని గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆశీష్ తన భార్య రాజోషి బారువాతో వెళ్లాడు. కాని వారు మరోసారి అలా కలిసి వెళ్లలేని విధంగా 2022లో విడిపోయారు. ‘మా సొంత ఇష్టాలు, ఆసక్తులు నెరవేర్చుకునే సమయం ఇది అనిపించింది’ అన్నారు వారు. ‘తండ్రిగా ఆషిష్లో ఏ వంకా వెతకలేము. భార్యగా నాకుండే కంప్లయింట్లు ఉంటాయి’ అని విడిపోయాక అతని గురించి రాజోషి అంది. వారు ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూనే విడిపోయారు. కాని సైకాలజిస్టులు ఏమంటారంటే ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూ కలిసి ఉండొచ్చుగా?హృదయాలు ఎందుకు పగలాలి?ఏ.ఆర్.రెహమాన్ 57 ఏళ్ల వయసులో అతని భార్య సైరా బాను 57 సంవత్సరాల వయసులో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అలాగే ఉంది. కాని హృదయాలు పగిలేంతగా అగాథాలు వచ్చాయి’ అని వారిద్దరూ తెలిపారు. అయితే అగాథాలు ఒక్కరోజే వచ్చిపడవు. పగుళ్లు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి సరి చేసుకునేందుకు ప్రయత్నించాలి. 99 సార్లు ప్రయత్నం చేసి నూరవసారి ఈ తీవ్ర నిర్ణయానికి రావచ్చు.జాగ్రత్త పడాల్సింది ఇప్పుడేఅమెరికాలో గ్రే డివోర్సులు గత పదేళ్లలో పెరిగాయి. ఆశ్చర్యం ఏమంటే 50 ఏళ్ల వయసులో డివోర్స్ తీసుకునే వారు 13 శాతం ఉంటే 65 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకునేవారు 29 శాతం ఉన్నారు. భారత దేశంలో విడాకుల వరకూ వెళ్లే వారి సంఖ్య తక్కువే అయినా ఏళ్ల తరబడి భర్త ఒక సంతానం దగ్గర, భార్య ఒక సంతానం దగ్గర, లేదంటే ఒకే చూరు కింద అపరిచితుల్లా ఉన్నవారు అనేకమంది ఉన్నారు. పెళ్లినాటి నుంచే మొదలయ్యే బంధాల నిర్వహణాలోపం కాలక్రమంలో ఇక్కడిదాకా తెస్తుంది. ఇక్కడ దాకా వచ్చాక విడిపోవడంలో సౌలభ్యం ఉందని చెప్పినా కొత్త జీవితంలో కూడా అంతే సౌలభ్యం పొందగలరా అనేది ప్రశ్నార్థకం. అందులో ఎదురయ్యే సవాళ్లు అల్రెడీ ఉన్న సంసారిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ల కంటే గట్టివైతే ఏమిటి చేయడం?గ్రే డివోర్సులకు కారణాలు– నివారణ→ ఖాళీ ఇల్లు: పిల్లలు పెద్దవారయ్యే వెళ్లిపోయాక అంత వరకూ తల్లిదండ్రులుగా ఉన్నవారు తాము భార్యాభర్తలుగా ఉండటం మర్చిపోయామని గ్రహిస్తారు. భార్యాభర్తలుగా ఉండటం కొత్తగా మొదలెట్టాక సమస్యలు మొదలవుతున్నాయి. అంటే పిల్లలతో పాటుగా కుటుంబంగా ఉండటం సాధన చేస్తే ఈ ‘ఖాళీ’ రాదు. పిల్లలు లేని ఏకాంతం భార్యాభర్తల్లో మరింత ఇష్టాన్ని, విహారాన్ని, కబుర్లని ఇవ్వాలిగాని తగూలాటను కాదు. సమస్యను దాచి పిల్లల ముందు వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఆ సమస్య విడాకులు కోరుతోంది. → మరింత అధికారం: భార్యాభర్తల మధ్య పొజెసివ్‌నెస్ ఉంటుంది. నాకే చెందాలి అని. ఉద్యోగాల్లో ఉండగా పట్టిపట్టి చూడటం కుదరుదు. ఈ రిటైర్మెంట్ తర్వాత భర్త తరచూ క్లబ్లో కూచుంటున్నా భార్య తరచూ బంధువులతో గంటల ఫోన్లలో ఉన్నా చిరాకులు తలెత్తుతాయి. ఏం చేసినా వీలైనంత వరకూ ఉమ్మడి అనుబంధాలలో గడపడం ఈ వయసులో చాలా ముఖ్యం. అంటే కామన్ ఫ్రెండ్సే, కామన్ ఆసక్తులే బంధాలను నిలుపుతాయి. ఇక అనుమానాలకు చోటిచ్చే ఇతర ఏ ఆకర్షణవైపుకు వెళ్లకపోవడమే ఉత్తమం.→ రూపాయి తగాదా: డబ్బు నీది, నాది అంటూ కాపురం సాగి ఉంటే ఆ రూపాయి భూతంలా మారే సందర్భం ఇదే. నా డబ్బు నేను ఇచ్చుకుంటాను, నా ఆస్తి నేను పంచుకుంటాను అని భార్య/భర్త ఎప్పుడైతే అనుకుంటారో అగాధాలు మొదలవుతాయి. డబ్బు ఒకరికి తెలియకుండా మరొకరు దాచకుండా ముందు నుంచి సంసారం సాగాలి. ఆర్థిక నిర్ణయాలు పరస్పర అంగీకారంతో జరగాలి. రిటైర్మెంట్ తర్వాత ఎలా ఆర్థికంగా ఉండబోతున్నారో ఆస్తులు ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారో పదే పదే చర్చించుకుని సంతృప్తి పడితే సమస్య రాదు. → అనారోగ్య సమయాలు: అనారోగ్యాలు ఎదురయ్యే ఈ సమయంలో భార్య/భర్త దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉంటే ఓదార్పు కోసం కొత్త స్నేహానుబంధాల్లోకి వెళ్లడం విడాకులకు మరో కారణం. ఈ సమయంలో ఉండే అభద్రతను దృష్టిలో ఉంచుకుని జీవిత భాగస్వామి మరింత బాధ్యతగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో విడిపోయే దాకా రావడం భార్యాభర్తల కంటే పిల్లలకు పెద్ద విఘాతం కాగలదు. కలిసి ఉంటే కలదు సుఖముపెళ్లయిన నాటి నుంచి తగాదాల కాపురం అయితే అందులో ఒక సమర్థింపు ఉండొచ్చుగాని హఠాత్తుగా ముప్పయి నలబై ఏళ్ల తర్వాత విడాకులంటే ఏదో నిర్లక్ష్యం భార్యాభర్తల్లో ఉన్నట్టే. జవాబుదారీతనం లేదులే అనుకోవచ్చుగాని విడిపోవడం అంత సులువు కాదు. పైగా అది ఒకరు గట్టిగా తీసుకొంటే మరొకరి పెనుఘాతం కావచ్చు. ఇష్టంతో, గౌరవంతో విడిపోయినా మళ్లీ ‘సాధారణస్థితి’కి రావడానికి చాలా కాలం పడుతుంది. కలిసి జీవించి పిల్లలకు జన్మనిచ్చి వారితో సంతోషంగా కాలం గడపాల్సిన ఈ వేళలో మరింత శ్రద్ధ. ప్రేమలను అనుబంధంలో పెంచడమే భార్యాభర్తలు చేయాల్సింది. -
ఆమె కారణంగానే రెహమాన్ విడాకులు.. స్పందించిన మోహినిదే
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్-సైరాబాను దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పర్పస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు న్యాయవాది వందనా షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు రెహమాన్ విడాకుల విషయం బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన బృందంలోని సభ్యురాలు మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్ విడాకులకు మోహినిదే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు రెహమాన్-మోహినిదే మధ్య ఏదో సంబంధం ఉందన్నట్లు పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై మోహినిదే సోషల్ మీడియా వేదికగా స్పదించారు. తనపై వస్తున్న రూమర్స్‌ని తీవ్రంగా ఖండించారు.‘నా విడాకుల ప్రకటన వెల్లడించిన తర్వాత వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూ ఇవ్వమని చాలా మంది అడుగుతున్నారు. వారంతా ఎందుకు నా ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నారో నాకు తెలుసు. వారి అభ్యర్థనను నేను గౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి నా విలువైన సమయాన్ని వృధా చేసుకోలేను. దయచేసి నా గోప్యతను గౌరవించండి’అని మోహినిదే తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.కాగా, ఇదే ఇష్యూపై రెహమాన్ కొడుకు అమీన్ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించాడు. ‘మా నాన్న ఓ లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు. -
మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా భాను పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వారి ప్రకటన అనంతరం వస్తున్న వార్తలపై వారి తనయుడు అమీన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మా నాన్న ఓ లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి.దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ కుమార్తె రహీమా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘మనల్ని ద్వేషించే వాళ్లే వదంతులు సృష్టిస్తారు. తెలివితక్కువ వాళ్లు వాటిని వ్యాప్తి చేస్తారు. పనికి రానివాళ్లు వాటిని అంగీకరిస్తారు. దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి’’ అంటూ పోస్ట్ చేశారామె.ఇక ఈ నెల 19న ఏఆర్ రెహమాన్, సైరాల విడాకుల ప్రకటన వచ్చిన అనంతరం రెహమాన్ బృందంలోని మోహినీ దే అనే అమ్మాయి కూడా తన భర్త, తాను విడిపోతున్నట్లు ప్రకటించారు. దాంతో రెహమాన్, మోహినీ ఒకేసారి విడాకుల గురించి ప్రస్తావించడం వెనక ఏదో కారణం ఉందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఉద్దేశించే అమీన్, రహీమా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా స్పందించి ఉంటారని ఊహించవచ్చు. -
కోలీవుడ్‌లో పెరుగుతున్న డైవోర్స్ కేసులు..
-
శ్రీమంతుల పాలిట విడాకుల ఎక్స్పర్ట్ ఈమె!
ఆస్తిపాస్తులు కనీసం పదివేల కోట్లు ఉన్నవారు.. విడాకుల కోసం వెళ్లాలంటే వందనా షాను కలుస్తారు. దేశంలో హైప్రోఫైల్ డివోర్స్ కేసులు చూసే మహిళా లాయర్‌గా వందనా షా పేరు గడించారు. ఏ.ఆర్.రెహమాన్, సాయిరా బానుల విడాకులతో ఆమె మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ‘విడాకులు ఇప్పించడం మీకు సంతోషమా?’ అనడిగితే ‘నేను స్వేచ్ఛను ఇప్పిస్తున్నాను’ అంటారామె. స్వయంగా డివోర్సీ అయిన వందనా ఆ తర్వాతే లా ప్రాక్టీసు మొదలెట్టారు. వందన పరిచయం, రెహమాన్ విడాకుల పూర్వాపరాలు... 1995లో ఏ.ఆర్. రెహమాన్ పెళ్లయ్యింది. అదే సంవత్సరం అతను సంగీతం చేసిన ‘బొంబాయి’ విడుదలైంది. ‘బొంబాయి’లో హీరోయిన్ పేరు సాయిరా బాను. రెహమాన్ జీవిత భాగస్వామి పేరు కూడా అదే. వచ్చే సంవత్సరం ‘బొంబాయి’ సినిమా, రెహమాన్ వైవాహిక జీవితం 30 ఏళ్ల ఉత్సవం జరుపుకోవాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రమే జరుగుతుంది. ఒకటి జరగదు. సంగీత మాంత్రికుడి జీవితంలో అపశ్రుతి వస్తుందని ఎవరూ ఊహించలేదు. వీరి విడాకుల వ్యవహారాన్ని అడ్వకేట్ వందనా షా చూశారు. అధికారికంగా ఆమే ప్రకటించారు.గుజరాత్ మూలాలు1973లో జన్మించిన సాయిరా బాను మూలాలు కచ్‌లో ఉన్నాయి. వారిది గుజరాతి ముస్లిం కుటుంబం. మదురైలో స్థిరపడ్డ ఈ కుటుంబం నుంచి ఒక కుమార్తెను మలయాళ నటుడు రెహమాన్ (రఘు) వివాహం చేసుకుంటే మరో అమ్మాయిని ఏ.ఆర్.రెహమాన్ చేసుకున్నాడు. పెళ్లయ్యాక సాయిరా బాను రెహమాన్‌కు పేరు వచ్చేకొద్దీ ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి మిత్రురాలైందని అంటారు. సాయిరా, నీతా మధ్య మంచి స్నేహం ఉందని కథనం. ఇటీవల అంబానీ కుమారుడి పెళ్లిలో రెహమాన్ ప్రత్యేకమైన షో కూడా ఇచ్చాడు. ఇప్పుడు విడాకుల కేసును చూసిన వందనా షా కూడా గుజరాత్‌కు చెందిన అడ్వకేటే. అయితే ఆమె ప్రాక్టీసు ముంబై, పూణెలలో ఉంది.తల్లి తెచ్చిన కోడలురెహమాన్ తల్లి నిర్ణయానికి ఎంతో విలువనిచ్చేవాడు. ‘నాకు సమయం లేదు. నేను పెళ్లిచూపులకు తిరగలేను. చదువుకుని, సంగీతం అంటే ఇష్టపడుతూ, వినమ్రతతో ఉండే అమ్మాయిని చూడు’ అని మాత్రమే తల్లిని అతడు కోరాడు. తల్లే ఈ సంబంధం తెచ్చింది. పెళ్లయ్యాక రెహమాన్, సాయిరా పరస్పరం ఎంతో గౌరవించుకునేవారు. ‘నేను అతని స్వరానికి ఫ్యాన్‌ని’ అని సాయిరా రెహమాన్ గురించి వేదికమీద చెప్పింది. రెహమాన్ కూడా ఆమెను వెంటబెట్టుకునే సంగీత యాత్రలు చేసేవాడు. వీరికి ముగ్గురు పిల్లలు. రెహమాన్ రెండు వారాల క్రితమే ఆస్ట్రేలియాలో, అబూదాబీలో లైవ్ షోలు చేశాడు. అతని ఫేస్బుక్ పేజ్‌లో ఇంకా భార్యతో ఉన్న ఫోటోనే కవర్ ఫొటోగా ఉంది. వందనా షాకు పరస్పర ఆమోదయోగ్యంగా విడుపెయేలా కేసులను గట్టెక్కిస్తుందనే పేరు ఉంది. అందుకే రెహమాన్గానీ, సాయిరాగాని మీడియాకు ఎక్కలేదు. వారిద్దరి నడుమా ఎంతో ప్రేమ ఉన్నా వెనక్కు రాలేనంతగా అగాథాలు ఏర్పడటమే’ విడాకులకు కారణం అంటారు వందనా షా.శ్రీమంతుల విడాకులువందనా షా శ్రీమంతుల విడాకుల ఎక్స్పర్ట్. ‘ఆమె విడాకులు ఎక్కువగా ఇప్పిస్తోంది. పెళ్ళిళ్లకు పిలవకండి’ అనేవారూ ఉన్నారు. కాని పాలిహిల్స్ (ముంబై)లో ఉండే జంటల విడాకుల కారణాలు అనూహ్యంగా ఉంటాయని అంటారు వందనా షా. ‘బోర్డమ్’, ‘బిగ్గర్ బెటర్ డీల్’ వల్ల విడి΄ోయే జంటలు ఎక్కువ అని ఆమె అంటారు. శ్రీమంతుల ఇళ్లలో భార్యాభర్తల మధ్య డబ్బు పంపకం, పిల్లల బాధ్యత ఇవే ప్రధాన సమస్యలనీ, ‘ఇగో’, ‘వివాహేతర సంబంధాలు’ తర్వాతి స్థానం అని అంటారామె. ‘బాగా డబ్బున్న వారు పెళ్లికి ముందే అగ్రిమెంట్ చేసుకోవడం మంచిది. ఒకవేళ విడిపోతే ఎవరికి ఎంత, పిల్లలకు ఎంత.. ఇవి మాట్లాడుకుంటే అసలు వైవాహిక జీవితంలో గొడవలే రావు’ అంటుందామె. ఇక మధ్యతరగతి విడాకులలో ‘పిల్లలు ఎదిగొచ్చిన స్త్రీకి ఇక తానేమిటి, తన ఉనికి ఏమిటి అనే సమస్య మొదలయ్యి తన జీవితానికి ప్రాధాన్యత లేదా అనే అసంతృప్తి నుంచి విడాకులు అవుతాయి’ అని తెలిపింది వందనా షా. ‘పరస్పరం హింసించుకునే పెళ్లి కంటే విడాకులే నయం’ అంటుందామె. అయితే పెళ్లితో బాధలు పడుతున్న పురుషుల గురించి కూడా ఆమె మాట్లాడుతుంది. ‘బాగా సంపాదించే భార్య తన భర్తను ఇంటిపట్టున ఉండమని కోరడం, అతనిపై ఆధిపత్యం చెలాయించడం చూస్తున్నాం. మగాళ్లు హౌస్ హజ్బెండ్లుగా ఉండటాన్ని ఇష్టపడుతున్నా ఆధిపత్యం, అవమానం భరించలేక విడాకులు కోరుతున్నారు’ అని తెలిపిందామె. మధ్యతరగతి ఇళ్లలో తల్లిని, భార్యను ఎదురుబొదురు కూచోబెట్టి వారి సమస్యను నేరుగా పరిష్కరించక తప్పించుకు తిరిగే మగవాడు అంతిమంగా విడాకుల దగ్గర తేలుతాడని కూడా ఆమె హెచ్చరిస్తోంది. బహుపరాక్. (చదవండి: లైఫ్ అంటే... పెళ్లి మాత్రమేనా?! ) -
గురువు దారిలోనే శిష్యురాలు.. భర్తకు విడాకులు
దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్నాడు. ఇతడి భార్య సైరా భాను.. తన లాయర్ల ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టింది. మంగళవారం సాయంత్రం ఇదంతా జరిగింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రెహమాన్ దగ్గర పనిచేస్తున్న శిష్యురాలు కూడా భర్తకు విడాకులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)29ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన సైరా భాను.. భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఇబ్బందులు.. పెద్ద అంతరాన్ని సృష్టించాయని ఆమె లాయర్ వందనా షా పేర్కొన్నారు. రెహమాన్- సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమార్తెలు, ఖతీజా, రహీమా, అమీన్ రెహమాన్ కొడుకు ఉన్నాడు.ఇకపోతే రెహమాన్ దగ్గర బాసిస్ట్‌గా పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ మోహిని డే కూడా మంగళవారం సాయంత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. విడిపోయినప్పటికీ భర్తతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తానని మోహిని క్లారిటీ ఇచ్చింది. అయితే గంటల వ్యవధిలో ఏఆర్ రెహమాన్, అతడి సహాయకురాలు విడాకులు (వేర్వేరుగా) తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రెండు విడాకుల అంశాలకు ఏమైనా సంబంధముందా అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఏఆర్ రెహమాన్ విడాకులకు కారణం తెలిపిన అడ్వకేట్.. పిల్లల కామెంట్స్
మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, భార్య సైరా బాను విడిపోయారు. వారిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? అనే ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. 1995లో వారు పెళ్లి చేసుకున్నారు. సుమారు 29 ఏళ్లు కలిసి జీవించిన వారు ఇలా విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయంపై వారి పిల్లలు కూడా సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.ఎందుకు విడిపోయారంటే..ఏఆర్ రెహమాన్, సైరా బాను విడిపోవడానికి ఉన్న కారణాలను వారి అడ్వకేట్ వందనా షా ఇలా చెప్పారు. 'భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగానే వారు విడిపోయారు. దంపతుల మధ్య సంబంధాల సమస్యలే ఈ నిర్ణయానికి దారితీశాయి. ఇరువురి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఈ జంట తమ మధ్య వచ్చే చిన్నచిన్న విభేదాలు, పోరాటాల విషయంలో పరిష్కరించుకోలేకపోయారు. అవి వారి మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయ. శ్రీమతి సైరా చాలా బాధ, వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ గోప్యతను, గౌరవాన్ని ప్రజలు కాపాడాలని వారిద్దరూ కోరారు.' అని న్యాయవాది తెలిపారు.విడాకులపై పిల్లల కామెంట్స్29 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సంతోషంగా కనిపించే ఈ జంట తమ వివాహ బంధాన్ని ముగించుకున్నారని తెలుసుకున్న అభిమానులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. రెహమాన్, సైరా ఇద్దరూ కలిసే బాలీవుడ్ పార్టీలు, అవార్డులు, సెలబ్రిటీల వివాహాలకు హాజరవుతారు. ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో వారు చివరిసారిగా కలిసి కనిపించారు.విడాకుల విషయంపై వారి పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ స్పందిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. 'మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో మీరందరూ గోప్యత పాటించి గౌరవంగా వ్యవహరించారు. అందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు' అంటూ రహీమా పోస్ట్ చేయగా..ఖతీజా ఇలా తెలిపింది. ' ఇలాంటి కష్ట సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని అందరినీ వేడుకుంటున్నాం. మా బాధను అర్థం చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు.' అని తెలిపింది. -
ఏఆర్ రెహ్మాన్ జంట విడాకులు
-
29 ఏళ్ల బంధానికి ముగింపు.. రెహమాన్-సైరా విడాకులు (చిత్రాలు)
-
ఏఆర్ రెహమాన్‌కి విడాకులు ఇచ్చేసిన భార్య
సంగీత సామ్రాట్, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ దంపతులు తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ విషయాన్ని రహమాన్ దంపతుల తరఫున ప్రముఖ విడాకుల లాయర్ వందనా షా ఒక సంయుక్త ప్రకటన మంగళవారం విడుదలచేశారు. ‘‘పెళ్లయిన చాన్నాళ్ల తర్వాత విడిపోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చారు. కొరవడిన భావోద్వేగాలే బంధం బీటలు పడటానికి కారణం. ఒకరిపై ఇంకొకరికి అమితమైన ప్రేమానురాగాలు ఉన్నాసరే అనూహ్య పరిస్థితులు వీళ్లిద్దరి మధ్య పూడ్చలేని అగాథాన్ని సృష్టించాయి. బాధను దిగమింగి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కష్టకాలంలో వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ప్రజలు సైతం ఈ విషయాన్ని అర్థంచేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ కష్టమైన దశను వీళ్లిద్దరూ దాటగలరని భావిస్తున్నా’ అని లాయర్ వందనా షా ఆ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ మా కుటుంబ ప్రైవసీని గౌరవించండి’ అని రెహమాన్ కుమారుడు అమీన్ సైతం ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. రహమాన్, సైరా బానూ వివాహం 1995 మార్చిలో చెన్నైలో జరిగింది. వీళ్లకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. -
అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?
మెగాహీరో రామ్ చరణ్ సోమవారం రాత్రి కడప వెళ్లారు. పెద్ద దర్గాను సందర్శించుకున్నారు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ప్రస్తుతం చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. అయినా సరే పెద్ద దర్గాను దర్శించుకోవడం వెనక ఓ కారణముంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇలా చేసినట్లు స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ప్రస్తుతం మ్యూజిక్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈయన మూడు నెలల క్రితం రామ్ చరణ్‌ని పెద్ద దర్గాను సందర్శించాలని కోరారు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నా సరే చరణ్.. రెహమాన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది)కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ జరిగింది. ఈ దర్గాకు రెహమాన్.. ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటారు. ఈ సంవత్సరం జరిగే ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ని తీసుకొస్తానని అక్కడి వాళ్లకు మాటిచ్చారట. అలా ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఓ వైపు బిజీ షెడ్యూల్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. 'ఏఆర్ రెహమాన్.. ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని మూడు నెలల ముందే చెప్పారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్‌తోపాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు)#ARRahman గారు ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ మూడు నెలల ముందే ఆహ్వానించారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను. - @AlwaysRamCharan pic.twitter.com/4l7CSysAtq— Rajesh Manne (@rajeshmanne1) November 18, 2024 -
ఘనంగా ఉరుసు ఉత్సవాలు.. కడప పెద్ద దర్గాలో ఏఆర్ రెహమాన్ (ఫొటోలు)
-
కమలా హారిస్‌కు మద్దతుగా ఏఆర్ రెహమాన్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌లు తమ ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులూ ప్రచార సభల్లో పాల్గొంటూ, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ఓ సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా జరగబోయే ఒక ప్రచార సభలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ ఇవ్వనున్నారని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) అనే నిధుల సేకరణ బృందం ప్రకటించింది. కాగా ఈ కార్యక్రమ తేదీ, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఏఏపీఐ తెలిపింది. ఈ విషయమై ఏఆర్ రెహమాన్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించే తేదీ నిర్ణయించిన తరువాత రెహమాన్ నుండి ప్రకటన రావచ్చని అంటున్నారు. కమలా హారిస్‌కు మద్దతుగా రెహమాన్ సంగీత కార్యక్రమం జరగబోతున్నదనే వార్త వెలువడగానే ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంతో కమలా హారిస్ ఓటర్ల నుంచి మరింత ఆదరణ పొందగలరని పలువురు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస -
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్‌లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్‌ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్‌ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్‌గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్‌కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్‌కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు. -
ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు
సెలబ్రిటీల పిల్లలని చూస్తే.. వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ అని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా కష్టాలు ఉంటాయి. కాకపోతే అవి విచిత్రమైన కష్టాలు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూతురు కూడా తన గురించి, తండ్రి గురించి ఇంట్రెస్టింగ్ సంగతులు బయటపెట్టింది. 'మిన్ మినీ' అనే తమిళ సినిమాతో రీసెంట్గా సంగీత దర్శకురాలిగా పరిచయమైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకుంది.ఏఆర్ రెహమన్ కూతురు కావడంతోనే మీతో మాట్లాడుతున్నారా? లేదంటే నిజంగానే మీతో స్నేహం చేస్తున్నారా అనే ప్రశ్నకు బదులిచ్చిన ఖతీజా రెహమాన్.. చిన్నప్పటి నుంచి చాలామంది తనతో మాట్లాడేవారని, కొందరు మాత్రం ఏఆర్.రెహమన్ కూతురిననే పరిచయం పెంచుకునేవారని, ఆ తర్వాత వారి అవసరాల గురించి చెప్పేవారని, అదే తనకు చాలా కష్టంగా ఉండేదని చెప్పింది.(ఇదీ చదవండి: తప్పు చేశా నాన్న.. ఏడ్చేసిన ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్)ఇక రెహమాన్ ఫ్యామిలీ విషయానికొస్తే.. ఏఆర్ రెహమాన్ తండ్రి సంగీత కళాకారుడు. ఆయన స్ఫూర్తితోనే రెహమాన్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదట్లో పియానిస్ట్‌గా పనిచేశాడు. 'రోజా' మూవీతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆస్కార్ కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇకపోతే రెహమాన్ సోదరి రెహానా కూడా సంగీత దర్శకురాలే. రెహమాన్ కొడుకు ఏఆర్ అమీన్, సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కూతురు ఖతీజా సంగీత దర్శకురాలి అయిపోయింది. మిన్మినీ చిత్రానికి ఖతీజా సంగీతమందించింది. తాజాగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా, ఈమె పనితనాన్ని బాగానే మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి) -
2024 T20 World Cup: ‘టీమిండియా హై హమ్’ రెహమాన్ స్పెషల్ సాంగ్ వైరల్
హోరాహోరీగా జరిగిన పోరులో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. 17 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను దక్కించుకోవడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. ఈ అపురూపమైన సందర్భాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ కూడా సంబరంగా జరుపుకున్నారు. అంతేకాదు మెన్ ఇన్ బ్లూకి ఒక అధ్బుతమైన గిఫ్ట్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఏఆర్ రెహమాన్ బ్లూ ఇన్ మెన్‌కి అభినందనలుత తెలుపుతూ 'టీమ్ ఇండియా హై హమ్' పేరుతో ప్రత్యేక గీతాన్ని బహుమతిగా అందించారు. ఈ మ్యూజిక్ వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సాంగ్‌ను తొలుత అజయ్ దేవగన్ 'మైదాన్' కోసం కంపోజ్ చేశారట. భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా అజయ్ దేవగన్ హీరోగా 'మైదాన్' మూవీకోసం 'టీమ్ ఇండియా హై హమ్'ఒరిజినల్ సాంగ్‌ను ఏఆర్ రెహమాన్ , నకుల్ అభ్యంకర్ పాడారు.కాగా జూన్29న ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చి, బాణా సంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నసంగతి తెలిసిందే. -
పాటే మంత్రము.... గానం బంధము...
సాక్షి, హైదరాబాద్: : ఆమె పాట... స్వరాల ఊయలలూగించింది... అనుభూతుల లోకంలో ముంచింది. ప్రముఖ నేపథ్య గాయని సుమధుర గాత్రంతో సంగీత సంచలనం ఎఆర్ రెహమాన్‌ను సైతం తన అభిమానిగా మార్చుకున్న రోంకిణి గుప్తా... నగరవాసుల్ని పాటల లోకంలో విహరింపజేశారు. తెలంగాణ పర్యాటక శాఖ, సురమండల్ సంస్థల ఆధ్వర్యంలో నగరంలోని మాసబ్ ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆవరణలో నిర్వహించిన సంగీత ప్రదర్శనలో ఈ సంప్రదాయ సంగీత కళాకారిణి...హిందూస్థానీ క్లాసికల్ రాగాలాపనతో ప్రారంభించి తన ప్రాచుర్యం పొందిన పాటల్ని ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఆమెకు తోడుగా తబలా విద్వాంసులు అశిష్ రగ్వానీ, హార్మోనియం విద్వాంసులు దీపక్ మరాతెలు తమ స్వరాలతో సంగీతాభిమానులను ఓలలాడించారు. ఇద్దరు స్థానిక టంపోరా కళాకారులు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. -
నేడు రోంకిణి గుప్తా సంగీత ప్రదర్శన
మ్యాస్ట్రో ఎ.ఆర్.రెహ్మాన్ అభిమాన గాయకురాలిగా గుర్తింపు పొందిన ప్రముఖ నేపథ్య గాయని రోంకిణి గుప్తా నగరంలో తన సంగీత ప్రదర్శన శనివారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ టూరిజంతో కలిసి సాయంత్రం 6.30 గంటలకు మాసబ్ ట్యాంక్ సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జెఎన్ఎఎఫ్ఎయు) ఆడిటోరియంలో రోంకిణి గుప్తా హిందుస్థానీ క్లాసికల్ సంగీతాన్ని సుర్మండల్ పేరిట అందించనున్నారు. మూడు సార్లు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా నామినేట్ అయిన రోంకిణి గుప్తా ఇటీవల స్వర కోకిల లతా మంగేష్కర్ అవార్డును సైతం అందుకున్నారు. -
Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
దిల్లీకి చెందిన పవిత్రాచారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... మల్టీ–టాలెంటెడ్ ఆర్టిస్ట్. ప్లేబ్యాక్ సింగర్, సాంగ్ రైటర్, వోకలిస్ట్, కంపోజర్‌గా రాణిస్తోంది. ‘కళ కళ కోసం కాదు. సమాజం కోసం’ అని నమ్మిన పవిత్ర తన ‘కళ’తో వివిధ స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తాజాగా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్టైన్మెంట్’ విభాగంలో చోటు సాధించింది... దశాబ్దకాలం పాటు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఏఆర్ రెహమాన్‌లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ప్రతి దిగ్గజం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటుంది పవిత్ర. ‘శూన్యం నుంచి కూడా రెహమాన్ సంగీతం సృష్టించగలరు’ అంటుంది. 65వ గ్రామీ అవార్డ్‌లలో పవిత్ర పాట ‘దువా’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీకి నామినేట్ అయింది. హెచ్‌సీఎల్, ఇండిగో ఎయిర్లైన్స్లాంటి ప్రముఖ కంపెనీల యాడ్స్‌లో నటించింది. ‘అనిరుథ్ వర్మ కలెక్టివ్’లో భాగంగా యూఎస్‌లో ఎన్నో ప్రాంతాలలో తన సంగీతాన్ని వినిపించింది. ‘చిత్రహార్ లైవ్’ టైటిల్‌తో చేసిన ఇన్స్టాగ్రామ్ సిరీస్‌కు మంచి పేరు వచ్చింది, ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా సంగీతానికి సంబంధించిన నాస్టాల్జియాను హైలైట్ చేశాను. వ్యక్తిగతంగా, ఆన్లైన్లో ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో స్పందన వచ్చింది’ అంటుంది పవిత్ర.గత సంవత్సరం కొన్ని అద్భుతమైన వోటీటీ ప్రాజెక్ట్‌లలో భాగమైన పవిత్ర ఆ ప్రాజెక్ట్‌ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, తన ప్రతిభతో వాటికి కొత్తదనాన్ని తెచ్చింది. ‘దిల్లీ అమ్మాయి’గా పాపులర్ అయినప్పటికీ పవిత్ర మూలాలు చెన్నైలో ఉన్నాయి. తన సంగీతయాత్రలో భాగంగా దిల్లీ, చెన్నై, ముంబై నగరాల మధ్య తిరుగుతుంటుంది. ఇప్పుడు చెన్నైలో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రాధాన్యత ఇస్తోంది. హిందీ పాటలే కాదు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలాంటి భాషల్లోనూ పాడుతోంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో భాగం కావడమే కాదు వాటిపై తనదైన ముద్ర వేయడంలో ప్రత్యేకత సాధించింది పవిత్ర.‘ఒకేదగ్గర ఉండిపోవడం కంటే నిరంతర అన్వేషణతో కొత్త దారులు వెదుక్కోవడం నాకు ఇష్టం. ప్రతి దారిలో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడం అంటే ఇష్టం. కొత్త ఆసక్తి అన్వేషణకు కారణం అవుతుంది. ఆ అన్వేషణలో భాగంగా కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో గుర్తింపు తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది పవిత్ర. సంగీతం, సామాజికం అనేవి రెండు వేరు వేరు ప్రపంచాలని ఎప్పుడూ అనుకోలేదు పవిత్ర. ఆర్ట్స్–బేస్డ్ థెరపిస్ట్‌గా ఎంతోమందికి సాంత్వన చేకూర్చింది. వారి నడకకు కొత్త బలాన్ని ఇచ్చింది.‘లైఫ్‌స్కిల్స్ ఎడ్యుకేషన్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్‌తో వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కోసం సంగీత కచేరీల ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పాటే కాదు పరిశోధన కూడా.. పవిత్రకు సంగీతప్రపంచం అంటే ఎంత ఇష్టమో, సంగీత ధోరణులకు సంబంధించిన పరిశోధన అంటే కూడా అంతే ఇష్టం. ప్రఖ్యాత గాయని శుభాముద్గల్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్న పవిత్ర ‘ఖాయాల్’పై ఆసక్తి పెంచుకోంది. ఈ సంగీత ప్రపంచంలోని స్త్రీవాద ధోరణుల గురించి లోతైన పరిశోధన చేసింది. భారత ఉపఖండంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రధాన రూపం... ఖాయాల్. అరబిక్ నుంచి వచ్చిన ఈ మాటకు అర్థం... ఊహ. ‘హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్యార్థిగా ఖాయాల్ సంగీతంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. పరిశోధన ఫలితంగా కొత్త విషయాల పట్ల అవగాహన ఒక కోణం అయితే నా గానాన్ని స్వీయ విశ్లేషణ చేసుకోవడం మరో కోణం’ అంటున్న పవిత్ర ఖాయాల్ సంగీతానికి సంబంధించి రిసోర్స్ బ్యాంక్‌ను తయారు చేసింది. దీనికి ముందు ఖాయాల్ రచనలు, వాటి మూలం, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులతో మాట్లాడింది. -
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘రాయన్’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రాయన్ నుంచి తాజాగా మొదటి సాంగ్ విడుదలైంది.ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఎంతో క్రేజీగా సాగిని ఈ సాంగ్‌కు ధనుష్‌తో పాటు ఏఆర్ రెహమాన్ గాత్రం కలిపారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జూన్ 13న రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుంది. -
అమితాబ్.. రెహమాన్‌లకు లతా మంగేష్కర్ అవార్డు
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ 2022న ఫిబ్రవరి 6న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు, సమాజానికి సేవలందిస్తున్న వారికి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తొలుత ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే ఈ పురస్కారం అందుకున్నారు. 2024కి గాను అమితాబ్ బచ్చన్‌కి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అదే విధంగా భారతీయ సంగీతానికి చేసిన కృషికిగానూ ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకుంటారు. అలాగే సామాజిక సేవా రంగంలో ‘దీప్‌స్తంభ్ ఫౌండేషన్’ మనోబల్‌కు కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఈ నెల 24న లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి. అదే రోజు ఈ పురస్కారాల పంపిణీ ఉంటుంది. -
25 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్
-
25 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్
తమిళసినిమా: కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఆసక్తిని క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ నటుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవా, ఆస్కార్ నాయకుడు ఏఆర్.రెహ్మాన్‌లది. ఇంతకుముందు 1990 ప్రాంతంలో వీరి కాంబినేషన్లో కాదలన్, మిస్టర్ రోమియో, లవ్‌బర్డ్స్ చిత్రాలు రూపొందాయి. కాగా ప్రభుదేవా, ఏఆర్.రెహమాన్ కలిసి చివరిగా 1997లో మిన్సార కనవు చిత్రం చేశారు. ఇప్పుడు అంటే 25 ఏళ్ల తరువాత ఈ క్రేజీ కాంబోలో చిత్రం రూపొందబోతోందన్నది తాజా సమాచారం. బిహైండ్ వుడ్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఈ క్రేజీ కాంబోలో చిత్రాన్ని నిర్మించనుంది. దీని గురించి శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. దీనికి ఈ సంస్థ వ్యస్థాపకుడు మనోజ్.ఎన్ఎస్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రక్తపాతం, హింసాత్మక సంఘటనలు వంటివి ఉండవని, వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కించనున్న ఈ చిత్రం తమిళ సినీ చరిత్రలో గుర్తిండిపోతుందని దర్శకుడు మనోజ్ పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను మే నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుదేవా హీరోగా నటించిన చివరి చిత్రం భగీరా. ప్రస్తుతం ఆయన నటుడు విజయ్ హీరోగా నటిస్తున్నది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారన్నది గమనార్హం. దీని తరువాత మనోజ్ దర్శకత్వంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Prabhudeva (@prabhudevaofficial) -
IPL 2024 Opening Ceremony: అట్టహాసంగా ఆరంభం
IPL 2024 Opening Ceremony: ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ డ్యాన్స్‌తో దుమ్ములేపారు. జోష్‌గా స్టెప్పులేస్తూ చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించారు. 𝗣𝗼𝘄𝗲𝗿𝗵𝗼𝘂𝘀𝗲 💥@iTIGERSHROFF starts the #TATAIPL Opening Ceremony with his energetic performance 😍👏 pic.twitter.com/8HsssiKNPO — IndianPremierLeague (@IPL) March 22, 2024 𝙀𝙡𝙚𝙘𝙩𝙧𝙞𝙛𝙮𝙞𝙣𝙜 ⚡️⚡️ Chennai erupts in joy as @akshaykumar leaves his mark at the #TATAIPL Opening Ceremony 🥳 pic.twitter.com/TMuedfuvyU — IndianPremierLeague (@IPL) March 22, 2024 💃🕺 Chennai grooves to the melodies of Sonu Nigam during the Opening Ceremony#TATAIPL pic.twitter.com/jVnlskQKQj — IndianPremierLeague (@IPL) March 22, 2024 అనంతరం సోనూ నిగమ్ మధుర గాత్రంతో వందేమాతరం ఆలాపనతో ప్రేక్షకుల్లోని దేశభక్తిని తట్టిలేపగా... ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మా తుజే సలాంతో గూప్‌బంప్స్ తెప్పించాడు. ఆ తర్వాత మోహిత్ చౌహాన్ కూడా ఈ స్వర తరంగానికి తోడయ్యాడు. భల్లే లక్కా, మసక్కలి, ఛయ్య ఛయ్య పాటలతో దుమ్ములేపాడు. అనంతరం లేడీ సింగర్లు నీతి మోహన్ బర్సోరే సాంగ్‌తో శ్రోతల చెవుల్లో స్వాతి చినుకుల వర్షం కురిపించింది. 𝙰 𝙼𝚞𝚜𝚒𝚌𝚊𝚕 𝙼𝚊𝚜𝚝𝚎𝚛𝚢 🎶@arrahman has left everyone in awe of his brilliance at the #TATAIPL Opening Ceremony 😍 🙌 pic.twitter.com/tbiiROXdog — IndianPremierLeague (@IPL) March 22, 2024 బీసీసీఐ బాస్‌లు, కెప్టెన్ల ఆగమనం వినోద కార్యక్రమాలు ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా మిగతా ఆఫీస్ బేరర్లు వేదిక మీదకు విచ్చేశారు. ఆ తర్వాత ఢిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్-2024 ట్రోఫీని స్టేజీ మీదకు తీసుకువచ్చాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా వేదిక మీదకు చేరుకున్నాడు. అంతా కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చారు. అనంతరం ఆరంభ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. -
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయబోయేది వీరే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్ ప్రారంభమవుతుంది. AR Rahman, Sonu Nigam, Akshay Kumar and Tiger Shroff will perform at the IPL opening ceremony. pic.twitter.com/9kR2dpyOOV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024 సీజన్ తొలి మ్యాచ్ కావడంతో మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ అరేంంజ్ చేశారు నిర్వహకులు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు (6:30 గంటలకు) జరుగనుంది. ఈ ఈవెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. జియో సినిమాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, సీఎస్కే-ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఈ మైదానంలో సీఎస్కే ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. -
ప్రేమించటానికి సమయం లేదు!
‘ప్రేమించటానికి సమయం లేదు’ అంటూ పాట రూపంలో చెబుతున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఈ బ్యూటీ నటి మాత్రమే కాదు.. మంచి గాయని అనే సంగతి కూడా తెలిసిందే. తండ్రి కమల్‌హాసన్ నటించిన ‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలో ‘పోట్రి పాడడి పెన్నే..’ అనే పాట పాడే తొలి అవకాశం శ్రుతికి ఇచ్చారు సంగీత దర్శకుడు ఇళయరాజా. ఆ తర్వాత ఆమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. కమల్‌హాసన్ నటించిన ‘ఉన్నైపోల ఒరువన్’ సినిమాకి సంగీతం అందించారు శ్రుతీహాసన్. అలాగే ‘ఈనాడు’ సినిమాలో ‘నింగికి హద్దు..’, ‘ఓ మై ఫ్రెండ్’లో ‘శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్‌లో..’, ‘ఆగడు’లో ‘అరె జంక్షన్లో..’, ‘రేసు గుర్రం’ మూవీలో ‘డౌన్ డౌన్...’ ఇలా పలు సినిమాల్లో చాలా పాటలు పాడారామె. తాజాగా మరోసారి గాయనిగా మారారు శ్రుతీహాసన్. ‘జయం’ రవి, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఓ తమిళ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ‘కాదలిక్క నేరమిల్లై..’ (ప్రేమించటానికి సమయం లేదు) పాటని శ్రుతి పాడనున్నారు. -
హీరోయిన్ శ్రుతిహాసన్.. మళ్లీ ఒకప్పటి ప్రొఫెషన్లోకి
శృతిహాసన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. గతేడాది చిరు, బాలయ్యతో మొదలుపెట్టి.. చివర్లో ప్రభాస్ 'సలార్'తో హిట్ కొట్టి 2023ని ముగించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అలా అని ఖాళీగా లేదని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో పక్కనబెట్టేసిన పాత ప్రొఫెషన్ని తిరిగి ఇప్పుడు మొదలుపెట్టేసింది. (ఇదీ చదవండి: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్) విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా శ్రుతిహాసన్ చాలామందికి తెలుసు. గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. హీరోయిన్ కాకముందు పలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేసింది. తండ్రి కమల్ 'ఉన్నైపోల ఒరువన్' సినిమాతో సంగీత దర్శకురాలు అయింది. ఆ తర్వాత నటిగా మారడంతో పాడటాన్ని పక్కనబెట్టేసింది. తాజాగా ఇప్పుడు మరోసారి తనలోని సింగర్‌ని శ్రుతిహాసన్ బయటకు తీయబోతుంది. జయం రవి, నిత్యామేనన్ నటిస్తున్న ఓ తమిళ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఇందులో 'కాదలిక్క నేరమిల్లై' అనే పాటని శ్రుతిహాసన్ పాడనుంది. అలా యాక్టింగ్ పరంగా ఛాన్సులు రాకపోతేనేం.. మళ్లీ సింగర్‌గా బిజీ అయిపోతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
గ్రామీ అవార్డ్స్: ‘శక్తి’ బ్యాండ్ సత్తా, దిగ్గజాల సెల్ఫీ వైరల్
#AR Rahmancelebrates 'Raining Grammys'ప్రతిష్టాత్మక 66వ వార్షిక గ్రామీ అవార్డులు 2024లో భారత్ సత్తా చాటింది. ఫ్యూజన్ బ్యాండ్ 'శక్తి'కి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది. అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ దిగ్గజ సంగీత విద్వాంసులు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ , సెల్వగణేష్ వయోలిన్ విద్వాంసుడు గణేష్ రాజగోపాలన్‌తో కూడిన సూపర్ గ్రూప్ ‘శక్తి’ బ్యాండ్ అవార్డును దక్కించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ బృందంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఆల్బమ్ ద్వారా నలుగురు గొప్ప భారతీయ సంగీతకారులకు ప్రపంచఖ్యాతి దక్కడం విశేషం శక్తి బ్యాండ్ ఆవిర్భావం మహావిష్ణు ఆర్కెస్ట్రా రద్దు తరువాత 1973లో ఫ్యూజన్ బ్యాండ్, శక్తి బ్యాండ్ ఏర్పడింది. ఇందులో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(తబ్లా) ప్రముఖ సింగర్ శంకర్ హదేవన్,గిటారిస్ట్ జాన్ మెక్లాఫ్లిన్, వి సెల్వగణేష్ , వయోలనిస్ట్ గణేష్ రాజగోపాలన్ వంటి ప్రఖ్యాత కళాకారులున్నారు. చాలా ఏళ్ల తరువాత 2020లో దీన్ని సంస్కరించారు. అలాగే మూడేళ్ల తరువాత తొలి ఆల్బమ్ ‘దిస్ మూమెంట్’జూన్ 23, 2023లో రిలీజ్ అయింది. తాజా ఆల్బమ్‌లో శ్రీనిస్ డ్రీమ్, బెండింగ్ ద రూల్స్, కరుణ, గిరిరాజ్ సుధ, మోహనం, లాస్ పాల్మాస్‌తో సహా 8 ట్రాక్‌లు ఉన్నాయి. గ్రామీ అవార్డుపై శుభాకాంక్షలు తెలిపిన అస్కార్ విన్నర్ మ్యూజిక్ మాస్ట్రో ఏర్ రెహమాన్ ఇండియాకు గ్రామీ అవార్డుల వర్షం కురుస్తోందంటూ ఇన్‌స్టాలో ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. మాజీ గ్రామీ విజేత కూడా అయిన రెహ్మాన్, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ ,వితో కలిసి ఉన్న సెల్ఫీని షేర్ చేశారు. అటు గ్రామీ అవార్డును గెలుచుకున్న సందర్భంగా శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సంగీత కుటుంబానికి, ఫ్యాన్స్‌తోపాటు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. View this post on Instagram A post shared by ARR (@arrahman) మరోవైపు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారిని అభినందనల్లో ముంచెత్తారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఘనాపాటీ ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాతో కలిసి రెండవ గ్రామీని గెలుచుకున్నారని పేర్కొన్నారు .దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. SHAKTI wins a #GRAMMYs #GRAMMYs2024 !!! Through this album 4 brilliant Indian musicians win Grammys!! Just amazing. India is shining in every direction. Shankar Mahadevan, Selvaganesh Vinayakram, Ganesh Rajagopalan, Ustad Zakhir Hussain. Ustad Zakhir Hussain won a second Grammy… pic.twitter.com/dJDUT6vRso — Ricky Kej (@rickykej) February 4, 2024 లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో శక్తి బ్యాండ్‌కు చెందిన పాష్టో పాట ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్‌గా గౌరవనీయమైన గ్రామీ అవార్డును సొంతం చేసుకుంది. పాష్టోకు చెందిన యాస్ వి స్పీక్ ఉత్తమ సమకాలీన వాయిద్య ఆల్బమ్ అవార్డు కూడా గెలుచుకుంది. అంతేకాదు మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
రెహమాన్, ఇళయరాజాలకు అవార్డులు.. ఆ సినిమాలకే
గత 14 ఏళ్ల నుంచి నార్వే చిత్రోత్సవారాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తమిళంలో ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసి ప్రతి ఏడాది అవార్డులు ఇస్తుంటారు. అలా ఈ సారి కూడా 20 చిత్రాలకు చెందిన యాక్టర్స్, టెక్నీషియన్స్‌కి పురస్కారాలు అందజేయనున్నారు. అయితే వీరిలో దిగ్గజ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ కూడా ఉండటం విశేషం. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రానున్న 21 సినిమాలు) జనవరి 25న 15వ నార్వే చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉత్తమ చిత్రం 'చిత్తా' (నిర్మాత సిద్ధార్థ్), ఉత్తమ నటుడు సూరి (విడుదలై –1), ఉత్తమ నటి ప్రీతి అస్రాని (అయోతి), ఉత్తమ దర్శకుడు మారి సెల్వరాజ్ (మామన్నన్), ఉత్తమ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (మామన్నన్, పొన్నియిన్ సెల్వన్–2), ఉత్తమ నిర్మాణ సంస్థ కేజే గణేష్ (చిత్రం యాత్తిసై ), ఉత్తమ ప్రతినాయకుడు ఫాహద్ ఫాజిల్ (మామన్నన్), ఉత్తమ సహాయ నటుడు (లేట్) పూరాము (చిత్రం కిడా), ఉత్తమ సహాయ నటి అబర్ణతి (ఇరుగపట్రు), ఉత్తమ గాయకుడు ఇళయరాజా (విడుదలై –1) ఉత్తమ గాయని శ్వేతామోహన్ (వాత్తి) అవార్డులు గెలుచుకున్నారు. (ఇదీ చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది) -
Birthday Special: మ్యూజిక్ ఇతడి చేతుల్లో మేజిక్.. ఏఆర్ రెహమాన్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
మహారాణి బయోపిక్.. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నిర్మాత కూతురు!
బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన భారతదేశ మొట్టమొదటి రాణి వీరమంగై వేలు నాచ్చియార్ జీవిత చరిత్ర సినిమాగా రానుంది. వేలు నాచ్చియార్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ పతాకంపై జేఎం.బషీర్ నిర్మిస్తున్నారు. ఆర్.అరవింద్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో టైటిల్ పాత్రను నటి ఆయిషా పోషిస్తున్నారు. ఈమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. దీనికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించడం విశేషం. కాగా ఇందులో పెరియమరుద అనే ముఖ్య పాత్రను ఈ చిత్ర నిర్మాత, నటుడు జేఎం.బషీర్ పోషిస్తున్నారు. ఈ చిత్ర పరిచయ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక టీ.నగర్‌లోని దేవర్ మహల్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జేఎం.బషీర్ మాట్లాడుతూ.. వేలు నాచ్చియార్ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడం గర్వంగా ఉందన్నారు. ఇందులో టైటిల్ పాత్రను తన కుమార్తె ఆయిషా పోషించడం ఇంకా సంతోషంగా ఉందన్నారు. మన దేశం కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడిన తొలి మహిళారాణి గురించి ఈ తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్న సదుద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. తాను నటించిన దేశీయ తలైవర్ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని, ఆ తరువాత వేలు నాచ్చియార్ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి జె.శ్రీధర్ చాయాగ్రహణం అందించనున్నారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జేఎం.బషీర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: ప్రభాస్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అలా జరగడంతో! -
రెహమాన్ పాత ట్యూన్స్ కొత్త సినిమాలో వాడితే.. హిట్ పక్కా
-
రజనీకాంత్ 'లాల్ సలామ్'లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం చిత్రం 'లాల్ సలామ్'. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కానుంది. రజనీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రత్యేక పాత్రలో కపిల్ దేవ్: క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా నటించాడు. ఇందులో కపిల్ దేవ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా కపిల్ దేవ్ తన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. లాల్ సలామ్‌లో జీవిత రాజశేఖర్ పాత్ర ఇదే డబ్బింగ్ స్టూడియోలో ఉన్న కపిల్ ఫొటోలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేసింది.. లెజెండరీ స్పోర్ట్స్ మ్యాన్ మా సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌తో పాటు జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు. ఇందులో రజనీకాంత్ సోదరిగా ఆమె కనిపించనున్నారు. నిరోషా, తంబి రామయ్య, సెంథిల్, తంగదురై సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ గాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పలు భాషల్లో జనవరి 2024లో విడుదల కానుంది. రజనీకాంత్ కూడా గతంలో కపిల్ గురించి ఇలా చెప్పారు. 'భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ కెప్టెన్ (విజేత) కపిల్ దేవ్ ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషం. క్రికెట్ లెజెండ్‌తో కలిసి పనిచేయడం నాకు గౌరవప్రదమైన క్షణం. కపిల్ దేవ్ అతని చారిత్రాత్మక విజయాలను ఎప్పటికీ మరిచిపోలేం.' అని రజనీ అన్నారు. దీంతో కపిల్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్‌తో కలిసి దిగిన ఫొటోను కపిల్ కూడా పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్ చివరిగా జైలర్ సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా 'లాల్ సలామ్' టీజర్ విడుదలై అభిమానుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. మొయిదీన్ భాయ్ పాత్రలో ప్రముఖ నటుడు కనిపించారు. -
వివాదంలో ఏఆర్ రెహ్మాన్
కోల్‌కతా: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహా్మన్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రఖ్యాత బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం రచించిన ప్రఖ్యాత స్వాతంత్య్రోద్యమ గీతం ‘కరార్ ఓయ్ లౌహో కొపట్’ను తాజాగా విడుదలైన బాలీవుడ్ సినిమా పిప్పాలో వాడుకున్నారాయన. దాని ట్యూన్ మార్చడం ద్వారా తమతో పాటు అసంఖ్యాకులైన అభిమానుల మనోభావాలను రెహా్మన్ దెబ్బ తీశారంటూ నజ్రుల్ కుటుంబసభ్యులు శనివారం దుయ్యబట్టారు. ‘‘రెహా్మన్ కోరిన మీదట ఆ గీతాన్ని వాడుకునేందుకు అనుమతించాం. కానీ దాని ట్యూన్, లయ పూర్తిగా మార్చేయడం చూసి షాకయ్యాం’’ అంటూ నజ్రుల్ మనవడు, మనవరాలు తదితరులు మండిపడ్డారు. ‘‘ఈ వక్రీకరణను అనుమతించేది లేదు. తక్షణం ఆ గీతాన్ని సినిమా నుంచి తొలగించాలి. పబ్లిక్ డొమైన్లో కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలి’’ అని వారు డిమాండ్ చేశారు. ట్యూన్ మార్పును నిరసిస్తూ బెంగాలీ గాయకులు, కళాకారులతో కలిసి నిరసనకు దిగుతామని ప్రకటించారు. బెంగాలీలు కూడా దీనిపై భగ్గుమంటున్నారు. రెహా్మన్ వంటి సంగీత దర్శకుడి నుంచి ఇది ఊహించలేదంటూ బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ తదితరులు విమర్శించారు. రెహా్మన్ తీరుపై ఇంటర్నెట్లో కూడా విమర్శల వర్షం కురుస్తోంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో నజ్రుల్ ఇస్లాం గీతాలు, పద్యాలు బెంగాల్లోనే దేశమంతటా మారుమోగాయి. టాగూర్ గీతాల తర్వాత అత్యంత ప్రసిద్ధి పొందాయి. -
లతా మంగేష్కర్‌కు ఆ విధంగా నివాళి అర్పించిన రెహమాన్ కుమార్తె
వారంతా స్త్రీలే. 26 దేశాల మహిళలు కలిసి దుబయ్‌లో ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’గా ఏర్పడ్డారు. తమ ప్రదర్శనలతో అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా లతా మంగేష్కర్‌కు నివాళిగా ఆమె పాడిన ఐదు పాటలను ‘కుహు కుహు’ పేరుతో ఆల్బమ్‌గా విడుదల చేశారు. ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతిజా రెహమాన్ ఈ ఐదు పాటలు పాడింది. ‘లతా ఒక శక్తి. మేమందరం ఈ ఆల్బమ్ ద్వారా స్త్రీ శక్తిని చాటాం’ అని తెలిపింది ఖతిజా.శ్రోతలకు ఇదో శ్రావ్యమైన కానుక. ‘ఆర్కెస్ట్రా అనగానే రికార్డింగ్ స్టుడియోలో, స్టేజ్ మీద మగవారు నిండిపోయి ఉంటారు. కండక్టర్‌గా ఎప్పుడూ సూట్ వేసుకున్న మగవాడే కనిపిస్తాడు. ఈ స్టీరియోటైప్ మారాలి. ప్రపంచంలో ఉత్తమమైన మ్యుజీషియన్స్‌గా స్త్రీలు ఉన్నారు. వారంతా తమ ప్రతిభను చూపాలి. మేమంతా అందుకే ఒక వేదిక మీదకు వచ్చి పెర్ఫామ్ చేస్తున్నాం’ అంటారు దుబయ్‌లోని ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’ సభ్యులు. 26 దేశాల నుంచి 51 మంది మహిళా సంగీతకారులు ఇక్కడ తమ సంగీతాన్ని వినిపిస్తున్నారు. ప్రోగ్రామ్‌లు ఇస్తున్నారు. వీరికి ఇక్కడ రికార్డింగ్ స్టుడియో ఉంది. ఇందులో సినిమాలకూ పని చేస్తున్నారు. ఎమిరేట్స్ మహిళా మంత్రి రీమ్ అల్ హష్మి ఏ.ఆర్.రెహమాన్‌ను మహిళలను ప్రోత్సహించే ఆర్కెస్ట్రాను దుబాయ్‌లో ఏర్పాటు చేయమని కోరారు. రెహమాన్ ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయడంలో సాయపడి పర్యవేక్షిస్తున్నారు. వారితో రికార్డింగ్స్ కూడా చేస్తున్నారు. పొన్నియన్ సెల్వమ్ 2’ రీ రికార్డింగ్ ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలే చేశారు. అరెబిక్ సౌందర్యం ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలో వివిధ దేశాల మహిళా సంగీతకారులు పని చేస్తున్నా ఈ ఆర్కెస్ట్రా ముఖ్య ఉద్దేశం అరబిక్ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేసి కొత్త అందాన్ని తీసుకురావడమే. ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా లో తమతమ దేశాలకు చెందిన నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు అరేబియాలో ఉపయోగించే సంగీత పరికరాలు కూడా వాడి గొప్ప మిళిత సంగీతాన్ని సృష్టిస్తున్నారు. ‘మేమంతా వేరువేరు జీవితాలు, వేరు వేరు సంగీత ధోరణుల నుంచి వచ్చాం. కాని రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టి ఒక్కటిగా మారి సమష్టిగా సంగీతాన్ని సృష్టిస్తాం. ఈ అనుభూతి అద్భుతంగా ఉంటుంది’ అంటారు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా సభ్యులు. వీరికి కండెక్టర్‌గా మోనికా ఉమ్మెన్ అనే మహిళ పని చేస్తోంది. లతాకు నివాళి తండ్రి పర్యవేక్షణలో సాగుతున్న ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చింది ఖతిజా రెహమాన్. ‘నేను వారితో పని చేసినప్పుడు వారు చూపిన ప్రేమ చాలా నచ్చింది’ అంటుందామె. గాయని అయిన ఖతిజా ఇటీవల తమిళ సినిమాలకు సంగీతం కూడా అందిస్తోంది. లతా మంగేష్కర్‌కు నివాళిగా ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి ‘కుహు కుహు’ ఆల్బమ్ తయారు చేసింది. ‘మేమందరం లతా పాటలను పునఃసృష్టించాలనుకున్నాం’ అంది ఖతీజా. లతా పాడిన ఐదు పాటలను ఎంపిక చేసుకుని ఖతీజా ఈ ఆల్బమ్‌లో పాడింది. అవి 1. పియా తోసే నైనా లాగేరే (గైడ్), 2.ఆప్ కీ నజరోనే సంఝా (అన్పడ్), 3. ఓ సజ్నా బర్ఖా బహార్ ఆయీ (పరఖ్), 4. కుహు కుహు బోలే కోయలియా (సువర్ణ సుందరి), 5. బేకస్ పె కరమ్ కీజియే (మొఘల్ ఏ ఆజమ్). ఈ ఐదు పాటలకు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలు సంగీతం అందించారు. బాణీలు యధాతథంగా ఉన్నా ఆర్కెస్ట్రయిజేషన్లో తమ సృజనను ప్రదర్శించారు. సాధారణంగా పాత పాటలు కొత్త తరహాగా పాడితే నచ్చవు. కాని ఖతీజా గళం, ఫిర్దౌస్ సంగీతం శ్రోతలకు శ్రావ్యమైన అనుభూతిని ఇచ్చాయి. గొప్ప గాయని లతా మంగేష్కర్‌కు ఇది ఒక మంచి నివాళిగా నిలిచిపోతుంది. -
పదివేలకు పైగా పాటలు.. నేషనల్ అవార్డ్.. కానీ 37 ఏళ్లకే!
సినీ ఇండస్ట్రీలో సింగర్లకు ప్రత్యేకస్థానం ఉంటుంది. రచయిత రాసిన పాటను మధురమైన స్వరాలను అందించండం వారికి మాత్రమే సొంతం. అలా సినీరంగంలో ఎంతోమంది ప్రముఖ గాయకులు ఉన్నారు. చిన్న వయస్సులోనే విజయం సాధించి ఈ రంగంలో కీర్తిని పొందినవారిని ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. తమ టాలెంట్‌తో సినీ ప్రేక్షకులను మైమరపించిన ఎందరో తారలు ఈ కాలగర్భంలో కలిసిపోయారు. అలాంటివారిలో ముఖ్యంగా దివ్యభారతి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియాఖాన్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరిలాగే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ స్వర్ణలత సైతం చిన్న వయసులోనే మరణించారు. ఈ స్టోరీలో ఆమె గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: ‘లియో’ వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ) స్వర్ణలత.. ఈ పేరు హిందీతో పాటు సౌత్ ఇండియా ఇండస్ట్రీలో సుపరిచితం. 1973లో కేరళలో జన్మించిన ఆమె సెప్టెంబర్ 12, 2010న ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఆమె తన కెరీర్లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీతో సహా దాదాపు 10 భాషలలో ఏకంగా పదివేల పాటలకు పైగా ఆలపించింది. ముఖ్యంగా స్వర్ణలత దక్షిణాది చిత్రాలకు చాలా పాటలు పాడినప్పటికీ.. ఆమె హిందీలోనూ గుర్తింపు తెచ్చుకుంది. నీతిక్కు తందానైలో కేజే యేసుదాస్‌తో కలిసి 'చిన్నచిరు కిలియే' అనే పాట పాడిన తర్వాత స్వర్ణలత అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత భారతీయ సంగీత పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో విజయం సాధించింది. కరుత్తమ్మ చిత్రంలోని "పోరాలే పొన్నుతాయి" పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ పాటను ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచారు. ఆయన సంగీతంలో జాతీయ అవార్డును అందుకున్న మొదటి మహిళా నేపథ్య గాయని కూడా స్వర్ణలతనే. స్వర్ణలత తన ఫేవరెట్ సింగర్ అని గతంలోనే ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఎప్పుడో చెప్పారు. కేరళలోనే పుట్టి పెరిగిన ఆమె 37 సంవత్సరాల వయసులో చెన్నైలోని మలార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మరణించారు. (ఇది చదవండి: దేశంలో రిచెస్ట్ సింగర్.. వందల కోట్ల ఆస్తి.. ఈమె ఎవరో తెలుసా?) -
ఏఆర్ రెహమాన్ సూపర్ కారు - ధర తెలిస్తే షాకవుతారు!
ఏఆర్ రెహమాన్ (AR Rahman) గురించి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో చాలామందికి తెలుసు. సింగర్, సాంగ్స్ రైటర్, రికార్డ్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ కంపోజర్‌గా మాత్రమే చాలామందికి తెలిసిన ఇతనికి కార్లంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగానే ఇటీవల ఇటలీ బ్రాండ్ కారు కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏఆర్ రెహమాన్ ఇటీవల 'లంబోర్ఘిని ఉరుస్ ఎస్' సూపర్ కారుని కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ. 4.18 కోట్లు అని తెలుస్తోంది. తెలుపు రంగులో కనిపించే ఈ కారు చెన్నైలోని డిటైలింగ్ స్టూడియో వద్ద కనిపించింది. అయితే ఈ కారు ఎప్పుడు కొన్నారని విషయం మాత్రం స్పష్టంగా వెల్లడికాలేదు. లంబోర్ఘిని ఉరుస్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ అనేది బ్రాండ్ లైనప్‌లో రెండవ మోడల్. మొదటిది ఉరస్ పెర్ఫార్మంటే. ఉరుస్ ఎస్ సబ్బియా, నెవ్, టెర్రా అనే మూడు మోడ్లతో లభిస్తుంది. పెర్ఫార్మంటే మాత్రం ఆఫ్-రోడ్ మోడ్ పొందుతుంది. లంబోర్ఘిని ఉరుస్ ఎస్ 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌తో 666 బిహెచ్పి పవర్ & 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇదీ చదవండి: భారత్ - కెనడా వివాదం: ఐటీ కంపెనీలకు గండమేనా! టెకీల పరిస్థితేంటి? లంబోర్ఘిని ఉరస్ ఎస్ కలిగిన సెలబ్రిటీల జాబితాలో ఏఆర్ రెహమాన్ మాత్రమే కాకుండా సచిన్ టెండూల్కర్, రోహిత్ శెట్టి, బాద్షా, రణవీర్ సింగ్, రోహిత్ శర్మ, రజనీకాంత్, కార్తీక్ ఆర్యన్, ఆకాష్ అంబానీ, జూనియర్ ఎన్టీఆర్, జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ కూడా ఉన్నారు. -
ఆ వార్తల్లో నిజం లేదు.. పరువు నష్టం దావా వేస్తా: విజయ్ ఆంటోని
తమిళసినిమా: సంగీత దర్శకుడు నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రత్తం. తమిళ్ పడమ్ చిత్రం ఫేమ్ సిఎస్ అముదమ్ దర్శకత్వంలో ఇన్ఫినిటీ ఫిలిమ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, జి. ధనుంజయన్, ప్రదీప్ బి. పంకజ్ బోరా కలిసి నిర్మిస్తున్నారు. నటి రమ్య నంబీశన్, మహిమ నబియార్, నందిత శ్వేత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్ నారాయణన్ సంగీతాన్ని, గోపీ అమర్నాథ్ అందిస్తున్నారు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రత్తం అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చైన్నెలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సీఎస్ అముదమ్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని తాను చదువుకున్న రోజుల్లోనే మిత్రులందరికీ, ఓకే కళాశాలలో చదువుకున్నామని చెప్పారు. ఆయన హీరోగా ఓ చిత్రం చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నానని ఈ రత్తంతో అది కుదిరిందని చెప్పారు. ఇది మీడియా నేపథ్యంలో సాగే కథా చిత్రం అని తెలిపారు. చిత్రంలో మత రాజకీయాలు కూడా ఉంటాయని, అయితే ఇందులో ఇంతకుముందు వచ్చిన ఏ చిత్ర ఛాయలు ఉండవని చెప్పారు. దర్శకుడు అముదమ్ చెప్పిన కథ కొత్తగా ఉండటంతో ఇందులో నటించడానికి అంగీకరించినట్లు విజయ్ ఆంటోని చెప్పారు. కాగా ఇటీవల ఏఆర్ రెహమాన్ నిర్వహించిన సంగీత కచేరీ వ్యవహారంలో నటుడు విజయ్ ఆంటోని హస్తం ఉన్నట్లు ఒక యూట్యూబ్‌లో ఛానల్లో ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన విజయ్ ఆంటోని ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, తాను ఆ యూట్యూబ్ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఇప్పటికే ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిపారు. -
ఇద్దరు మహిళా ఐపీఎస్‌లపై వేటు
సాక్షి, చైన్నె: ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ర్యాలీ, మరోవైపు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి కారణంగా దురైన ట్రాఫిక్ కష్టాలు ఇద్దరు మహిళా ఐపీఎస్‌లకు కష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో ఆ ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ కంపల్సరీ వెయిటింగ్లో ఉంచారు. ఈ మేరకు మంగళవారం హోంశాఖ కార్యదర్శి పి. అముదా ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. బీజేపీ నేతృత్వంలో సోమవారం సాయంత్రం చైన్నెలో సనాత ధర్మానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. నుంగంబాక్కంలోని హిందూ దేవదాయ శాఖ కార్యాలయం వైపుగా బీజేపీ శ్రేణులు చొచ్చుకెళ్తున్నా పోలీసులు కొంత దూరం వరకు అడ్డుకోలేదు. ఈ పరిణామాలతో నుంగంబాక్కం పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. ఫలితంగా వాహనదారుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. అంతకు ముందు ఆదివారం రాత్రి పనయూరు సమీపంలో జరిగిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి రూపంలో ట్రాఫిక్ కష్టాలు తీవ్రమయ్యాయి. ఈ సెగ ఏకంగా సీఎం స్టాలిన్‌కు కూడా తగిలింది. ఆయన కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఈ రెండు ఘటనల పరిణామాలతో ఇద్దరు మహిళా ఐపీఎస్‌లపై పోలీసు బాసులు కన్నెర్ర చేశారు. అన్నామలై ర్యాలీ పుణ్యమా గ్రేటర్ చైన్నె పోలీసు(తూర్పు) లా అండ్ ఆర్డర్ డీఐజీ, జాయింట్ కమిషనర్ దిశా మిట్టల్, ఏఆర్ రెహ్మాన్ కారణంగా తాంబరం కమిషనరేట్ పరిధిలోని పల్లికరణై డిప్యూటీ కమిషనర్ దీపా సత్యన్‌ను బదిలీ చేశారు. ఈ ఇద్దర్నీ కంపల్సరీ వెయిటింగ్లో ఉంచారు. అలాగే, చైన్నె ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ ఎన్ఫోర్సుమెంట్ సెల్ ఎస్పీగా ఉన్న ఆదర్శ్ పచిరాను తిరునల్వేలి తూర్పు డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. రచ్చకెక్కిన మరక్కుమా..నెంజం! -
రచ్చకెక్కిన మరక్కుమా..నెంజం!
సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ బృందం నిర్వహించిన ‘మరక్కుమా..నెంజం’ సంగీత వేడుక రచ్చకెక్కింది. 20 వేల సీట్లు ఉన్న చోట 40 వేలకు పైగా టికెట్లను నిర్వాహకులు విక్రయించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. తమ అభిమాన సంగీత దర్శకుడు, గాయకుడి స్వరాన్ని ప్రత్యక్షంగా వినేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయక పోవడంతో ఆ మార్గంలో సీఎం స్టాలిన్ కాన్వాయ్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఈ ఘటనపై విచారణకు డీజీపీ శంకర్ జివ్వాల్ ఆదేశాలు జారీ చేశారు. తాంబరం కమిషనర్ అమల్ రాజ్ నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. సాక్షి, చైన్నె: సంగీత మాంత్రికుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అంటే పడిచచ్చి పోయే అభిమానులు దేశ విదేశాల్లో భారీ సంఖ్యలో ఉన్నారు. ఆయన నేతృత్వంలో మ్యూజికల్ నైట్స్, సంగీత వేడుక ఎక్కడైనా జరుగుతుందంటే చాలు జిల్లాలు, రాష్ట్రాలు దాటి వచ్చి మరీ వీక్షించే అభిమానులు ఉన్నారు. ఆ దిశగా గత నెల ఓ ప్రైవేటు సంస్థ నేతృత్వంలో చైన్నె శివార్లలోని పనయూరులో ఏర్పాట్లు చేశారు. చివరి క్షణంలో వర్షం పడడంతో మరో తేదీకి వేడుకను మార్చారు. ఆ మేరకు సంగీతోత్సవం ఆదివారం అర్ధరాత్రి వరకు సాగింది. టికెట్ల రూపంలో రచ్చ.. 20 వేల మంది కూర్చుని చూసేందుకు పనయూరులో ఏర్పాట్లు ఉన్నాయి. అయితే నిర్వాహకులు మాత్రం 40 వేలకు పైగా టికెట్లను విక్రయించారు. వివిధ కేటగిరీలలో ఒక్కో టికెట్టు ధర రూ. 10 వేలు, రూ. 25 వేలకు పైగా పలికాయి. సరైన సలహాలు ఇచ్చే వారు లేక పోవడంతో అభిమానులకు కష్టాలు తప్పలేదు. అలాగే పార్కింగ్ ఏర్పాట్లు సరిగ్గా లేక పోవడంతో వచ్చిన అభిమానులు రోడ్డు పక్కగా వాహనాలను ఆపేశారు. సంగీతోత్సవ వేదిక నిండి పోవడంతో లోనికి వేలాది మంది వెళ్ల లేకపోయారు. తమ వద్ద టికెట్లు ఉన్నా, అనుమతించక పోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. నిర్వహకుల నుంచి సరైన సమాధానం రాక పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న టికెట్లును చించి పడేసి ఏఆర్ రెహ్మాన్ స్పందించాలంటూ నినాదాలు చేశారు. ట్రాఫిక్‌లో సీఎం కాన్వాయ్.. సీఎం స్టాలిన్ కాన్వాయ్ పనయూరు మార్గంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కింది. మామండూరులో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై రాత్రి తిరుగు పయనంలో సీఎం స్టాలిన్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. చివరికి అర్ధరాత్రి వేళ పోలీసు బాసులు పరుగులు తీయాల్సి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలతో పాటు సంగీతోత్సవంలో అభిమానులకు ఎదురైన అనుభవనాలు, అధిక టికెట్ల విక్రయాల వ్యవహారం చివరకు సోమవరం ఉదయం పోలీసుల దృష్టికి చేరింది. అలాగే, సామాజిక మాధ్యమాల్లో నిర్వాహకులు, ఏఆర్‌కు వ్యతిరేకంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో డీజీపీ శంకర్ జివ్వాల్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాంబరం పోలీసు కమిషనర్ అమల్‌రాజ్ నేతృత్వంలోని బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందంలోని సభ్యులు నిర్వహకులను వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అభిమానులకు నిర్వాహకులు క్షమాపణ చెప్పారు. ఇక, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ స్పందిస్తూ, టికెట్లు ఉన్నా, తన కార్యక్రమాన్ని వీక్షించ లేక పోయిన అభిమానులు, ఆ ఫొటోలను తన మెయిల్‌కు పంపించాలని, తన బృందంలోని వారు అభిమానులను సంప్రదిస్తారని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే తాను ఎవరో చేసే తప్పులకు తాను బలిపశువు అవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏఆర్ రెహమాన్ తెలుగు సినిమాకు ఎందుకు పని చేయలేదు..?
-
Maamannan: ఉదయనిధి స్టాలిన్ ‘మామన్నన్’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
ఈ సినిమానే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది, జీవితంలో మర్చిపోలేను: వడివేలు
నటుడు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించి, తన రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం మామన్నన్. వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తి సురేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. మారి సెల్వరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ సినిమా గత జూన్ 29వ తేదీన విడుదలవగా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న మామన్నన్ 50 రోజులు పూర్తి చేసుకుంది. మంచి అనుభవాన్ని ఇచ్చింది: కీర్తి సురేశ్ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చెన్నైలోని ఓ హోటల్లో మామన్నన్ చిత్ర అర్ధ శత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హీరోయిన్ కీర్తి సురేశ్ మాట్లాడుతూ మామన్నన్ తనకు మంచి అనుభవంగా మిగిలిపోయిందని పేర్కొంది. ఏఆర్ రెహమాన్ సంగీతం చిత్ర విజయానికి ముఖ్య కారణమని తెలిపింది. వడివేలు మాట్లాడుతూ.. ప్రతి సన్నివేశంలోనూ జీవం ఉట్టిపడేలా దర్శకుడు మారి సెల్వరాజ్ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని పేర్కొన్నారు. తాను ఇంత వరకూ చేసిన హాస్య పాత్రలన్నింటికంటే ఈ చిత్రమే ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందని, దీన్ని తాను జీవితాంతం మరిచిపోలేనని అన్నారు. ఈ విజయం దర్శకుడిదే: ఉదయనిధి స్టాలిన్ సినిమా అనేది నాలుగు రోజుల్లో ముగిసి పోయేది కాదని, ఏళ్ల తరబడి మాట్లాడుకునేదనీ దర్శకుడు మారి సెల్వరాజ్ పేర్కొన్నారు. అందుకే తాను నిజాలను వినే చెవుల కోసం అన్వేషిస్తూనే ఉంటానన్నారు. ఈ విజయం దర్శకుడు మారి సెల్వరాజ్దని నటుడు ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. కథ విన్నప్పుడే మామన్నన్ విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగించిందన్నారు. ఈ చిత్రం కోసం యూనిట్ అంతా శ్రమించారన్నారు. నాలోని అంతర్మధనమే మామన్నన్: ఏఆర్ రెహమాన్ తన తొలి చిత్రం ఆరుకల్ ఒరు కన్నాడీ మంచి విజయాన్ని సాధించిందనీ, చివరి చిత్రమైన మామన్నన్ కూడా విజయం సాధించడం సంతోషంగా ఉందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. గత 20, 30 ఏళ్లుగా తనలోని మదనమే మామన్నన్ చిత్రమని ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు. మామన్నన్ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌తో వడివేలు బైక్‌లో వెళ్లే సన్నివేశాన్ని చూసిన తరువాత మంచి సంగీతాన్ని అందించాలనే నిర్ణయానికి వచ్చానని ఆయన పేర్కొన్నారు. చదవండి: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం షారుక్ కోసం ఆ పని చేసేందుకు సిద్ధమైన నయనతార.. రూల్ పక్కన పెట్టేసి మరీ.. -
ప్రతి ఒక్కరి గుండెల్ని తాకే దేశభక్తి పాటలు ఇవే
భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 15)న జరుపుకుంటుంది. భారతదేశం బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 76 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వైభవంగా జరుపుకుంటున్నారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బ్రిటీష్ వారి నుంచి విముక్తిని సాధించిపెట్టిన నాయకులు, ఇందుకు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకుంటున్నారు. అలా కొన్ని పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 'తేరి మిట్టీ' -కేసరి కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి. ఈ పాట విన్నప్పుడల్లా మనస్సు ఉప్పొంగుతుంది. గీత రచయిత మనోజ్ ముంతాషిర్ ఎంతో గొప్పగా రచించారు. ఈ పాట విన్న తర్వాత అందరిలో దేశభక్తి భావం రాకుండా ఉండదు. ఈ పాటను 1బిలియన్కు పైగా వీక్షించారు. 'మేమే ఇండియన్స్' - ఖడ్గం కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దేశభక్తి మూవీ 'ఖడ్గం'. నేటి తరానికి దేశ భక్తి అంటే ఏంటో తెరపై చూపించిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన 'మేమే ఇండియన్స్' పాట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని సింగర్ హనీ ఆలపించారు. 'ఎత్తరా జెండా' - RRR విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ పడే సమయంలో 'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అనే పాట వస్తుంది. దేశభక్తిని చాటిచెప్పే ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్‌లో కనిపిస్తారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ సెలబ్రేషన్ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. 'దేశం మనదే తేజం మనదే' - జై తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం 'జై'. ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన 'దేశం మనదే తేజం మనదే' సాంగ్ ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచింది. బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్ కలిసి పాడిన ఈ పాటకు కులశేఖర్ సాహిత్యం సమకూర్చారు. 'పాడవోయి భారతీయుడా' -వెలుగు నీడలు 'పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా' అంటూ మహాకవి శ్రీ శ్రీ రాసిన దేశభక్తి గీతం ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున మార్మోగుతూనే ఉంది. ఈ పాట వచ్చిన 13 ఏళ్ల తరువాత అక్కినేని నాగేశ్వరరావు 'వెలుగు నీడలు' చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటను పి.సుశీల , ఘంటసాల పాడారు. ఈ పాట వచ్చి 60 సంవత్సరాలు గడిచినా నేటికీ క్లాసిక్ దేశభక్తి గీతాల్లో ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది. 'పుణ్యభూమి నాదేశం' -మేజర్ చంద్రకాంత్ ఇక ఎన్టీఆర్ క్లాసిక్ హిట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట. మేజర్ చంద్రకాంత్ మూవీలోని 'పుణ్యభూమి నాదేశం నమో నమామి'. దేశం కోసం ప్రాణం అర్పించిన ఎందరో మహానుభావున త్యాగాలను గుర్తు చేస్తూ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈపాటకు కీరవాణి స్వరాలను సమకూర్చారు. 'వినరా.. వినరా' రోజా ఏ.ఆర్ రెహమాన్ దేశభక్తి గీతాలు యూత్‌లో దేశభక్తిని రగిల్చాయి. రోజా చిత్రంలో వినరా.. వినరా.. దేశం మనదేరా అంటూ రాజశ్రీ రాసిన పాటతోపాటు.. మా తేఝే సలాం వందేమాతరం అంటూ రెహమాన్ పాడిన పాట సంచలనం అయ్యింది. -
ఈమె ర్యాప్కి విదేశాల్లో కూడా రీసౌండ్.. తొలి సినిమాకే రెహమాన్‌తో
ప్యాషన్నే ప్రొఫెషన్‌గా మలుచుకుంటే అంతకు మించిన ఘన విజయం ఏముంటుంది?చిన్నప్పుడు సరదాగా కవిత్వం రాసిన, మన పాటలను ర్యాప్లోకి మార్చి సరదాగా పాడిన కలైవాణి నాగరాజ్ అలియాస్ లేడి కాష్ తొలి తమిళ్–ఇంగ్లీష్ ఫిమేల్ ర్యాపర్‌గా తనదైన గుర్తింపు సాధింంది. ఏఆర్ రెహమాన్ ఆమెకు పెట్టిన పేరు మినీ డైనమెట్. కాష్ తండ్రి ప్రొఫెషనల్ డ్యాన్సర్. తల్లికి చిత్రకళ ఆసక్తికరమైన సబ్జెక్ట్. ఇంతకు మించి కష్కు కళానేపథ్యం లేదు. ఇక సంగీతం తెలిసిన వారు ఎవరూ లేరు. కథలు చెప్పడం, కవిత్వం పోటీలలో చురుగ్గా పాల్గొనేది. రేడియోలో పాటలు వినడం ద్వారా, మ్యూజిక్ చానల్స్ చూడడం ద్వారా సంగీతంపై ఆసక్తి మొదలైంది. ‘మ్యూజికే నా కెరీర్’ అని కాష్ అన్నప్పుడు తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టకపోగా చాలా ప్రోత్సహించారు. తాను విన్న పాటలను ర్యాప్ సాంగ్ స్టైల్లో పాడడం కాష్‌కు ఒక సరదా. కవిత్వం రాయడం మరో సరదా. అయితే ఈ సరదాలేవి వృథా పోలేదు. తన కెరీర్‌కు గట్టి పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. భాషపై పట్టు కోసం లైబ్రరీ నుంచి ఇంగ్లీష్, తమిళ భాషల్లోని పుస్తకాలను తెచ్చుకొని చదివేది. ర్యాప్‌లో తనదైన టాలెంట్ చూపుతున్న కాష్‌కు ‘రోబో’ సినిమా సౌండ్‌ట్రాక్ కోసం ఏఆర్ రెహమాన్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. ఇది తనకు మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగపడింది. ‘ఆ సౌండ్‌ట్రాక్ అనేది నా కెరీర్లో మైలుస్టోన్ మాత్రమే కాదు ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ల్యాండ్‌మార్క్‌గా నిలింది. యూఎస్, యూకే ఐట్యూన్ చార్ట్స్‌లో టాప్‌లో నిలింది. గతంలో ఏ ఆల్బమ్ ఇలాంటి ఘనతను సాధించలేదు. ఇదొక అద్భుతమైన, ఆనందకరమైన అనుభవం. మ్యూజిక్‌లో ఉండే పవర్ ఏమిటో తెలిసొచ్చింది. సంగీతం బాగుంటే సరిహద్దులు చెరిగిపోతాయి. అన్ని దేశాలు ఆ సంగీతాన్ని స్వంతం చేసుకుంటాయి’ అంటుంది లేడీ కాష్. -
ఆస్కార్ మ్యూజియమ్‌లో మెమోరీస్ గుర్తు చేసుకున్న ఇండియన్ స్టార్స్
లాస్ ఏంజిల్స్‌లోని ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించారు నటుడు–దర్శక–నిర్మాత కమల్‌హాసన్, సంగీత దర్శకుడు–గాయకుడు–నిర్మాత ఏఆర్ రెహమాన్. ఆ మ్యూజియమ్లోనే హాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ ‘ది గాడ్‌ఫాదర్’ (1972) సినిమాను వీక్షించారు కమల్, రెహమాన్. 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ (2008) సినిమాకుగాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డ్స్‌ను సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. నాటి విశేషాలను కూడా కమల్‌తో కలిసి ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ గుర్తు చేసుకున్నారు. అలాగే కమల్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించిన ఫొటోలను రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా, కమల్‌హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గ్లింప్స్ వీడియో లాంచ్ ఇటీవల అమెరికాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం అమెరికా వెళ్లిన కమల్‌హాసన్ ఇంకా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే తన సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా చేసిన మైఖేల్ వెస్ట్మోర్ను కలిసిన కమల్‌హాసన్ తాజాగా ఏఆర్ రెహమాన్‌తో కలిసి ఆస్కార్ మ్యూజియమ్‌ని సందర్శించారు. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తాను హీరోగా నటించాల్సిన సినిమా షూటింగ్లో కమల్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు. -
సినిమా ఒప్పుకునేముందు ఆ మూడు చూస్తాను: ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్ దాదాపు 150 చిత్రాలకు పాటలు స్వర పరిచారు. ఆస్కార్ అవార్డు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అయితే ‘‘నేనింకా నేర్చుకునే దశలో ఉన్నాను. నా కెరీర్ ఇప్పుడే మొదలైనట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతీ పదేళ్లకు సంగీతంలో మార్పులొస్తున్నాయి’’ అన్నారు రెహమాన్. ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన తమిళ ‘మామన్నన్’కి రెహమాన్ సంగీతం అందించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ... ► ఇటీవల పొన్నియిన్ సెల్వన్’లాంటి పీరియాడికల్ ఫిల్మ్‌కి సంగీతం అందించిన మీకు ‘నాయకుడు’లాంటి రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేయడం ఎలా అనిపిస్తుంటుంది? ‘నాయకుడు’ రాజకీయ నేపథ్యంలో రూపొందించిన సినిమా. సమాజంలోని అసమానతలతో పాటు చాలా విషయాల గురించి చర్చించారు. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం సవాల్ అని చెప్పలేను కానీ ఓ కొత్త అనుభూతి మాత్రం దక్కుతుంది. చాలా రోజుల తర్వాత నేను జానపద తరహా పాటలు ఇచ్చిన చిత్రమిది. ► మీరు ఒక సినిమా ఒప్పుకోడానికి కథ, హీరో, దర్శకుడు.. ఈ మూడింటిలో ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారు? మూడూ ముఖ్యమే. మంచి కథ ఉంటే మంచి పాటలు ఇవ్వగలం. ఆ పాటలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాలి. హీరో చేసే మంచి పెర్ఫార్మెన్స్ని బట్టి ఆ పాట హైలైట్ అవుతుంది. ఇప్పుడు ‘నాయకుడు’ విషయానికి వస్తే.. హీరో ఉదయనిధి స్టాలిన్ ముందు నన్ను సంప్రదించారు. సంగీతం అందించాలని అడిగారు. ఆ తర్వాత నేను కథ విన్నాను.. ఆసక్తిగా అనిపించింది. దర్శకుడు మారీ సెల్వరాజ్ ఇప్పటివరకూ తీసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రకథ ఉంది. మారి ఈ కథకు చాలా మాస్ అప్పీల్ ఇచ్చారు. అందుకు తగ్గట్టు పాటలు ఇచ్చాను. ఈ సినిమాలో ప్రతి పాట కథను ముందుకు తీసుకుని వెళుతుంది. అందుకే మ్యూజిక్ ఇవ్వడాన్ని ఎంజాయ్ చేశా. ► అందుకేనా ఈ సినిమా ఫంక్షన్‌కి సంబంధించిన వేదికపై ‘జివ్వు జివ్వు...’ పాటకు డ్యాన్స్ కూడా చేశారు.. ఈ సాంగ్ సిట్యువేషన్ చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. అది మైండ్‌లో పెట్టుకోవడంతో పాటు ఫన్ టచ్ ఇవ్వాలనుకుని ట్యూన్ చేశా. ఫన్ కోసమే స్టేజి మీద డ్యాన్స్ కూడా చేశాను. ► సంగీతంలో మార్పులు వస్తున్నట్లే మీ ఆలోచనా విధానం కూడా మారుతోందా? ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ మారదు. లిరిక్ కూడా మారదు.. 30, 40 ఏళ్లుగా అదే. అయితే వైబ్రేషన్ కొంచెం మారుతుంది... బీట్ మారుతుంది. ‘రోజా’ నుంచి నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే. అదేంటంటే నా పాట సింపుల్‌గా, క్యాచీగా ఉండాలి. ప్రేక్షకుల్లో, సమాజంలో వచ్చిన మార్పు తాలూకు ప్రభావం సంగీతంపై ఉంటుంది. ఇప్పుడు సంగీతానికి ఇంకా స్కోప్ పెరిగింది. ► తెలుగులో బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్‌చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రం గురించి? ఇది చాలా ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇప్పుడే రివీల్ చేయలేను. ► మీ అమ్మాయి ఖతీజా తమిళ చిత్రం ‘మిన్మిని’తో సంగీత దర్శకురాలిగా పరిచయం కానున్నారు... ఓ ఫాదర్‌గా మీ ఫీలింగ్? మహిళలు తాము అనుకున్నది సాధించాలనుకునే మైండ్ సెట్ నాది. మా ఇంట్లో మా అమ్మగారు, నా వైఫ్ వెరీ స్ట్రాంగ్. నా కూతురు ఖతీజా కూడా అంతే. ఏ మాత్రం టెన్షన్ పడటంలేదు. ట్యూన్స్ ఎలా ఇవ్వాలనే విషయంలో తనకు మెచ్యూర్టీ ఉంది. ఓ ఫాదర్‌గా ఐయామ్ హ్యాపీ. ► ‘గాంధీ టాక్స్’ అనే సైలెంట్ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడంపై మీ అనుభూతి గురించి? గతంలో ‘పుష్పక విమానం’లాంటి సైలెంట్ సినిమాలను అద్భుతంగా చేశారు. ఇప్పుడు నాకలాంటి మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి సినిమాలు సవాల్ అనాలి. అందుకే ఈ సినిమా డైరెక్టర్ కిశోర్‌తో ‘ఐ హేట్ యు.. లవ్ యు’ అని సరదాగా అన్నాను. డైలాగ్స్ లేకుండా సాగే ఈ సినిమాలోని సందర్భాలకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం అనేది నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. -
పాట పాడటమే కాదు డ్యాన్స్ కూడా చేసిన ఏఆర్ రెహమాన్!
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతానికి సినీ ప్రేక్షకులు మైమరచిపోతుంటారు. అలాంటిది ఆయన వెండితెరపై ఆడి పాడారంటే ఇంకెంతగా విస్మయంతో చూస్తారో ఆలోచించండి. ఏ ఆర్ రెహమాన్ ఏంటి? డాన్స్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఆయన డాన్స్ చేశారన్నది మాత్రం కచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఈ అరుదైన దృశ్యాన్ని మామన్నన్ చిత్రంలో చూడబోతున్నారు. ఉదయ నిధి స్టాలిన్, కీర్తిసురేష్ జంటగా నటించిన చిత్రం మామన్నన్. రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మారిసెల్వరాజ్ దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 29న విడుదలైంది. వడివేలు ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాదు చాలా గ్యాప్ తరువాత ఆయన ఈ చిత్రంలో ఒక పాట పాడడం విశేషం. రెహమాన్ స్పందిస్తూ తాను చిన్నతనం నుంచి కీబోర్డుతో గడిపానని ఆ తరువాత ఎన్నో స్టేజీలపై పాటలు పాడానని, ఇక ఇలాగే తన జీవితం గడచిపోతుంది అనుకుంటున్న సమయంలో మారిసెల్వరాజ్ మామన్నన్ చిత్రంలో తనను ఒక పాటలో మెరిసేలా చేశారని పేర్కొన్నారు. అయితే తనతో డాన్స్ చేయించిన ఘనత డ్యాన్స్ మాస్టర్ శాండీకే దక్కుతుందని అన్నారు. ఈ పాటను ఉదయనిధి స్టాలిన్‌కు చూపించగా ఆయన ఆశ్చర్యపోయారని దర్శకుడు మారిసెల్వరాజ్ పేర్కొన్నారు. చదవండి: అతడిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా? -
ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?
ఓ సినిమా హిట్ కావాలంటే ఏమేం ఉండాలి? అని అడగ్గానే.. హీరో, హీరోయిన్, మంచి కథ ఇలా చాలా చెబుతారు. వీటన్నింటితో పాటు మరో ముఖ్యమైనది ఒకటుంది. అదే సంగీతం. సినిమా ఎంత యావరేజ్ గా ఉన్నా ఓ హిట్ సాంగ్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పడితే చాలు ఆ మూవీ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ సింగర్స్ కి ఇచ్చే రెమ్యునరేషన్ మాత్రం తక్కువే. అయితే మన దేశంలోనే ఓ సింగర్, ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు తీసుకుంటున్నాడని మీలో ఎంతమందికి తెలుసు! దక్షిణాదిలో ఇచ్చేది తక్కువే! ఏ సినిమా తీసుకున్నా సరే సినిమాలో పాటలు కీ రోల్ ప్లే చేస్తాయి. ఒకవేళ అవి లేకపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయినా కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ సింగర్ అయిన సిద్ శ్రీరామ్.. ఒక్కో పాట కోసం రూ.4 లక్షల వరకు తీసుకుంటాడట. మిగతా సింగర్స్ చాలావరకు రూ.లక్ష లోపే రెమ్యురనేషన్ తీసుకుంటుంటారు. సౌత్ లో ఏమో గానీ బాలీవుడ్ లో మాత్రం సింగర్స్ కి లక్షల్లో ఇస్తుంటారు. ఈ జాబితా కూడా చాలా పెద్దదే. (ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? అప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇప్పుడేమో ఆశ్రమంలో!) పాటకు రూ.3 కోట్లు! ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సింగర్స్ లో ఏఆర్ రెహమాన్ కచ్చితంగా టాప్ లో ఉంటాడు. స్వతహాగా సంగీత దర్శకుడు అయినప్పటికీ.. అప్పుడప్పుడు సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాడు. అలా రెహమాన్ ఒక్కో పాట కోసం రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడట. కొన్నిసార్లు ఆ మొత్తం రూ.5 కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సింగర్స్ కూడా కాస్ట్లీ! ఏఆర్ రెహమాన్ తర్వాత చూసుకుంటే.. స్టార్ ఫిమేల్ సింగర్ శ్రేయా ఘోషల్ ఓ పాట కోసం రూ.25 లక్షల వరకు తీసుకుంటుందట. సునిధి చౌహాన్, అర్జిత్ సింగ్.. రూ.20-22 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. సోనూ నిగమ్, బాద్ షా అయితే రూ.18-20 లక్షల వరకు అందుకుంటారని టాక్. మిగతా వారిలో షాన్, నేహా కక్కర్, మికా సింగ్, హనీ సింగ్ తదితరులు రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: సినిమాల్లో స్టార్ కాంబోలు సరే.. మరి సక్సెస్ రేట్?) -
20 ఏళ్ల తర్వాత ఇళయరాజా ఎలాంటివారో రివీల్ చేసిన సింగర్
చిన్న చిన్న ఆశ- ఈ ఒక్క పాట చాలు మిన్మిని గుర్తుపెట్టుకోవడానికి. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1992లో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా 'రోజా' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అతనికి మొదటి సినిమా అయినా కూడా సుశీల, జానకి, చిత్ర వంటి సీనియర్లను పక్కనపెట్టి ‘చిన్ని చిన్న ఆశ’ పాటను కొత్త గాయని 'మిన్మిని'ని ఎంచుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకు మిన్మినియే పాడింది. ‘జాబిలిని తాకి ముద్దులిడ ఆశ... వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’... అంటూ సాగిన ఆ పాట ఆ సినిమాకే ఊపిరి పోసింది. కానీ ఆ పాట తర్వాత మిన్మికి మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు. 1991 నుంచి 1994 వరకు పలు సూపర్ హిట్ పాటలు పాడిన తన కెరీర్ ఎందుకు ముగిసిందో తాజాగా మిన్మిని వెల్లడించింది. (ఇదీ చదవండి: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్) రోజా సినిమాలోని పాట పాడక ముందే తను మాస్ట్రో ఇళయరాజా టీమ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా కొనసాగేదట. ఎప్పుడైతే తను ఏఆర్ రెహమాన్ మొదటి సినిమాలో పాట పాడినట్లు ఇళయరాజాకు తెలియగానే వేరేచోట ఎందుకు పాడుతున్నారు? తన దగ్గరే పాడాలని ఇళయ రాజా అన్నట్లుగా గుర్తు చేసుకుంది. దీంతో తాను ఏడ్చానని.. ఇదంతా ఒక రికార్డింగ్ స్టూడియోలో ఉండగానే జరగడంతో అక్కడున్న వారంతా తన ఏడుపును విన్నట్లు చెప్పింది. అప్పుడు సింగర్ మనో తనను ఓదార్చారని తెలిపింది (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి) ఆ సంఘటన తర్వాత పాటలు పాడేందుకు ఇళయ రాజా పిలవలేదని మిన్మిని చెప్పుకొచ్చింది . ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయన గురించి ఎవరూ నెగెటివ్‌గా ఆలోచించకూడదనే ఇన్నాళ్లు ఈ విషయాన్ని రివీల్ చేయలేదని వెల్లడించింది. మరోవైపు కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈ ఒక్క కారణంతో అవకాశాలు కోల్పోయానని మిన్మిని పేర్కొంది..అయితే లక్కీగా 2015లో మళ్లీ ఏఆర్ రెహమాన్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు తెలిపింది. కానీ అప్పటికే తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. -
స్టార్ హీరో చివరి సినిమాలో పాట పాడనున్న కమెడియన్
నటుడు ఉదయనిధి స్టాలిన్, నటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం మామన్నన్. రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో నటుడు ఫాహత్ ఫాజిల్, వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఇప్పటివరకు హాస్య పాత్రల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వడివేలు మామన్నన్ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌కు తండ్రిగా సీరియస్ పాత్రలో నటించడం విశేషం. ఇటీవల ఉదయనిధి స్టాలిన్, వడివేలు కలిసున్న ఫొటోతో కూడిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇకపోతే ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ బాణీలు కట్టిన ఒక పాటను నటుడు వడివేలుతో పాడించినట్లు సమాచారం. ఈ పాట రికార్డింగ్ సమయంలో వడివేలు, చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ తదితరులు ఏఆర్ రెహమాన్‌తో కూర్చుని ఉన్న ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా ప్రస్తుతం తమిళనాడులో మంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం కావడంతో మామన్నన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చదవండి: నా జీవితంలో సామ్‌తో ఉన్న దశపై ఎంతో గౌరవం : చై -
ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌ను ఆపేసిన పోలీసులు.. వీడియో వైరల్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. పూణెలో నిర్వహించిన మ్యూజిక్షోను అర్ధాంతంరగా అడ్డుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం రాత్రి పుణెలో ఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సర్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక రెహమాన్ తన బృందంతో కలిసి హుషారైన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చదవండి: (బ్రేకప్ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి) ఎంతో ఉత్సాహాంగా ఈవెంట్ జరుగుతుండగా పోలీసులు స్టేజ్‌పైకి వెళ్లి ప్రోగ్రాంను మధ్యలోనే ఆపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి 10గంటల వరకే షోకు అనుమతి ఉందని, సమయం మించిపోవడంతో ప్రోగ్రాంను ఆపేయాలంటూ రెహమాన్ టీంను కోరారు. రెహమాన్ చివరిగా ఓ పాట పాడి కార్యక్రమాన్ని ముగించారు. కాగా ఈ విషయంపై పూణె పోలీసులు వివరణ ఇస్తూ.. రెహమాన్ మేం వెళ్లే సమయానికి చివరి పాట పాడుతున్నారు. డెడ్‌లైన్ ముగియడంతో షోను ఆపేయాలను కోరాం. ఆయన కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు అంటూ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై రెహమాన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం షోను ఆపేయాలంటే నిర్వాహకులతో మాట్లాడాలి.. అంతేకానీ ఇలా స్టేజ్‌పైకి ఎక్కి అవమానించకూడదు అంటూ కామెంట్స చేస్తున్నారు. చదవండి: (రజనీకాంత్ సినిమాకు ఆ కండీషన్ పెట్టిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్) Pune! Thank you for all the love and euphoria last night! Was such a roller coaster concert! No wonder Pune is home to so much classical music! We shall be back soon to sing with you all again! #2BHKDinerKeyClub @heramb_shelke @btosproductions EPI pic.twitter.com/UkBn09FwLj — A.R.Rahman (@arrahman) May 1, 2023 Extremely disappointing of #PunePolice to shut down #ARRahman ‘s concert in #Pune at 10.14PM. While the rule of 10pm cutoff is understood, this is nt how a visiting artist of his stature should hav been treated. He was almost on his finale song when this happened👇🏻cc @CPPuneCity pic.twitter.com/HYEor4wiYX — Irfan (@IrfanmSayed) April 30, 2023 Pune police stop AR Rahman concert midway citing court-mandated 10 pm deadline Read More: https://t.co/syWW1efdqq pic.twitter.com/jSZYm7chZt — Express PUNE (@ExpressPune) May 1, 2023 -
ఏడేళ్ల తర్వాత తెలుగు సినిమాకు ఏఆర్ రెహమాన్!
రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను సెప్టెంబరులో ప్రారంభించాలని యూనిట్ సన్నాహాలు చేస్తోంది. హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, జాన్వీకపూర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ పేరు తాజాగా వినిపిస్తోంది. గతంలో తెలుగులో ‘సూపర్ పోలీస్’,‘నాని’, ‘ఏమాయ చేసావె’ ‘కొమురం పులి’ ‘సాహసం శ్వాసగా సాగిపో’(2016) సినిమాలకు సంగీతం అందించారాయన. ఏడేళ్ల తర్వాత ఏఆర్ రెహమాన్ మరోసారి తెలుగు సినిమాకు సంగీతం అందించనున్నారని టాక్. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. -
స్వరరాగ మధుర తరంగాలు
‘సాధన చేయుమురా నరుడా.... సాధ్యం కానిది లేదురా!’ అన్నది పెద్దల మాట ఇంగ్లీష్ పాట విషయంలో కూడా ఆ విలువైన మాటను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో పుట్టిన వారు, ప్రవాసభారతీయులు మాత్రమే ఇంగ్లీష్ పాటను బాగా పాడగలరా? ‘సాధన చేస్తే ఎవరైనా పాడగలరు’ అని నిరూపించింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్... గోవాలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో యువగళాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఎవరు వీరు?’ అని ఆరా తీసేలా చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలు, భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన వారు, ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని స్టూడియోలు, స్టేజ్‌ల చుట్టూ చక్కర్లు కొట్టిన గాయకులు కూడా ఇందులో ఉన్నారు. అలాంటి వారు తమ టాలెంట్‌ను ఈ మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శించే అవకాశం రావడానికి ప్రధాన కారణం నెక్సా మ్యూజిక్ ల్యాబ్. నేషనల్వైడ్ టాలెంట్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ మారుమూల ప్రాంతాల నుంచి మహా పట్టణాల వరకు మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో మెరిపిస్తోంది. ఈ పోటీలో పాల్గొనదలచినవారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఒరిజినల్ ఇంగ్లీష్ మ్యూజిక్ కంపోజిషన్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాప్, జాజ్, ఫ్యూజన్...మ్యూజిక్ జానర్ ఏదైనా ఫరవాలేదు. దీంతో పాటు నెక్సా మ్యూజిక్ అడిషన్లో కూడా పాల్గొనవలసి ఉంటుంది. ఎంట్రీలకు మినీమం ఏజ్ లిమిట్...పద్దెనిమిది సంవత్సరాలు. సబ్మిట్ చేసిన ఎంట్రీలు నియమ, నిబంధనలకు తగినట్లుగా లేకపోతే నెక్సా గ్యాలరీలో కనిపించవు. అయినా నిరాశ చెందనక్కర్లేదు. తప్పులు సవరించుకొని ఫ్రెష్‌గా పంపవచ్చు. వ్యక్తిగత స్థాయిలోనూ, మ్యూజిక్ బ్యాండ్‌లో ఒకరిగా కూడా పాల్గొనవచ్చు. ఏఆర్ రెహమాన్ నేతృత్వంలోని జ్యూరీ 24 మందిని ఎంపిక చేస్తుంది. వీరికి నెక్సా మ్యూజిక్ సీజన్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ఇరవైనాలుగు మంది నుంచి ఫైనల్‌గా నలుగురిని ఎంపిక చేసి, వారి చేత పాడించిన ఆల్బమ్‌లను అంతర్జాతీయంగా విడుదల చేస్తారు. దిల్లీకి చెందిన నిశా నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన యువ మ్యూజిక్ బ్యాండ్ ‘హీట్ సింక్’ వరకు ఎంతోమందిలో కొత్త వెలుగు తీసుకువచ్చింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్. బహుముఖ ప్రతిభ నెక్సా సీజన్ 1 విజేతగా నిలిచిన దిల్లీకి చెందిన నిశా శెట్టి సింగర్, సాంగ్‌రైటర్, వాయిస్ ఒవర్ ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది. చిన్నప్పటి నుంచి నాటకాలు, వాటికి సంబంధించిన వర్క్‌షాప్‌లను చూస్తూ పెరిగింది. కథక్, కూచిపూడి, హిందుస్థానీ శాస్త్రీయసంగీతం నేర్చుకుంది. చిన్న చిన్న షోలలో పాల్గొనే నిశాకు ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. ‘ఎంపికైన విజేతలలో మీరు ఒకరు’ అంటూ నిర్వాహకుల నుంచి వచ్చిన మెయిల్ నేహాకు ఎప్పుడూ గుర్తుండే తియ్యటి జ్ఞాపకం. ‘కలలు కనడం వరకు మాత్రమే పరిమితం కాకూడదు. కల సాకారం చేసుకునే శక్తి కోసం ఎక్కడెక్కడో వెదకనక్కర్లేదు. అది మన దగ్గరే ఉంది’ అంటుంది నిశా శెట్టి. -
‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అర్హత లేని సినిమాలు ఆస్కార్‌కు పంపుతున్నారు: రెహమాన్
ఇన్నాళ్లకు తెలుగు చిత్రపరిశ్రమకు అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్‌ను అమాంతం పట్టుకొచ్చేశాడు కీరవాణి. రాజమౌళి దర్శకత్వం వహించిన రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్ఆర్ఆర్) సినిమాలోని నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ పాటగా అకాడమీ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమాను కూడా నామినేషన్‌కు పంపిస్తారనుకుంటే గుజరాతీ చిత్రం చెల్లో షోను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపించారు. కానీ అది ఫైనల్ నామినేషన్స్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయింది. దీనిపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్కార్‌ను సాధించే సత్తా ఉన్న ఆర్ఆర్ఆర్ను పంపించి ఉండాల్సిందని పలువురూ అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు, రెండుసార్లు ఆస్కార్ అందుకున్న ఏఆర్ రెహమాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన యూట్యూబ్ ఛానల్లో మ్యూజిక్ లెజెండ్ ఎల్ సుబ్రహ్మణ్యంతో మాటామంతీ నిర్వహించాడు రెహమాన్. వీరిద్దరూ సంగీతం గురించి, మారుతున్న టెక్నాలజీ గురించి చర్చించారు. ఇంతలో రెహమాన్ మాట్లాడుతూ.. 'కొన్నిసార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయి. అర్హత లేని సినిమాలను ఆస్కార్‌కు పంపుతున్నారనిపిస్తుంది. కానీ జస్ట్ చూస్తూ ఉండటం తప్ప మనం ఏం చేయలేం' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అర్హత ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్‌కు పంపించకపోవడం గురించే ఆయన ఇన్‌డైరెక్ట్‌గా ఈ వ్యాఖ్యలు చేశాడంటున్నారు నెటిజన్లు. (చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) -
ఏఆర్ రెహమాన్ భార్యను ఎప్పుడైనా చూశారా?
ఏఆర్ రెహమాన్.. ఈ పేరే ఒక బ్రాండ్. సుమారు 30 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేశంలోనే అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగారు. తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం సహా అనేక భాషల్లో ఆయన బాణీలు అందించారు. ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులను సాధించిన ఘనత ఈయనది. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారంటే ఆ చిత్రం కచ్చితంగా మ్యూజికల్ హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల ఈయన సంగీతాన్ని అందించిన పొన్నియిన్ సెల్వన్, వెందు తనిందది కాడు చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం పత్తుతల, పొన్నియిన్ సెల్వన్ 2, మామన్నన్, లాల్ సలాం, ఆడుజీవితం వంటి పలు చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి. వీటిలో శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రం ఈ నెల 30వ తేదీ తెరపైకి రానుంది. అదే విధంగా ఏప్రిల్ 28వ తేదీ పొన్నియిన్ సెల్వన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తరువాత మామన్నన్ చిత్రం రెడీ అవుతోంది. ఇలా ఈ ఏడాది.. నెలకో చిత్రంతో ఏఆర్ రెహమాన్ తన అభిమానులను అలరించనున్నారు. కాకపోతే ఏఆర్ రెహమాన్ సతీమణి గురించి చాలా తక్కువ మందికి తెలిసుంటుంది. ఈయన 1995 మార్చి 12వ తేదీ సైరా భానును వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితం 28 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ తన సతీమణితో కలిసి ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. దీంతో పలువురు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ దంపతులకు ఖతీజా రెహమాన్, రహీమ రెహమాన్ అనే ఇద్దరు కుమార్తెలు, ఒమీన్ అనే కొడుకు ఉన్నారు. View this post on Instagram A post shared by ARR (@arrahman) -
ఆస్కార్.. ఇప్పటి వరకు గెలిచిన ఇండియన్స్ వీరే
ప్రస్తుతం అందరినోటా వినిపిస్తున్న మాటా ఒక్కటే. అదేమిటంటే తొలిసారి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటే సమయమిది. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో డాల్బీ థియేటర్లో జరుగనున్న 95 ఆస్కార్ వేడుకలపై అందరి దృష్టి పడింది. ఈ సారి మన టాలీవుడ్ దర్శకధీరుడు తెరకెక్కించిన వన్ అండ్ ఓన్లీ సెన్సేషనల్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవేదికపై మెరవనుంది. అందుకే ఈ ఏడాది ఆస్కార్ తెలుగు వారికి కూడా వెరీ వెరీ స్పెషల్. కానీ ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులను ఈ అవార్డ్ వరించింది. ప్రపంచ ఆస్కార్ సందడి వేళ ఇప్పటి దాకా ఆస్కార్ నెగ్గిన వారెవరో ఓ లుక్కేద్దాం. తొలి ఆస్కార్ విన్నర్ భాను అథైయా భాను అథైయా తొలి భారత ఆస్కార్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. 1983లో విడుదలైన గాంధీ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమెకు అరుదైన ఘనత దక్కింది. 55వ ఆస్కార్ వేడుకల్లో ఆమె అవార్డు అందుకున్నారు. మహాత్మా గాంధీ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కించారు. సత్యజిత్ రే భారతీయ సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకొచ్చిన సత్యజిత్ రే ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన ఆస్కార్స్ 1992లో సత్యజిత్‌రేకు హానరరి అవార్డును ప్రకటించింది. అయితే సత్యజిత్‌రే అనారోగ్యం కారణాలతో వేడుకలకు పాల్గొనలేదు. దీంతో అకాడమీ స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆస్కార్ అందజేసింది. రెండు అవార్డులు గెలిచిన ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు సాధించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ అవార్డులు దక్కించుకున్నారు. రెండు ఆస్కార్ అవార్డులు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. రసూల్ పూకుట్టి స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ సొంతం చేసుకున్నారు. గుల్జర్ దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన గుల్జర్ 81వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకన్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు ఉత్తమ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆయన్ను ఆస్కార్ వరించింది. గునీత్ మోన్గా ఢిల్లీకి చెందిక ప్రముఖ నిర్మాత గునీత్ మోన్గాఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగ్‌గా పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్‌కు గునీత్ ఆస్కార్ గెలుచుకుంది. తాజాగా అమెరికాలో లాస్ఎంజిల్స్ జరగనున్న 95వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి ఆల్ దట్ బ్రెత్స్( బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం), ది ఎలిఫెంట్ విస్ఫరర్స్(బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం), నాటు నాటు(బెస్ట్ ఒరిజినల్ సాంగ్) విభాగాలలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందరి చూపులు ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్‌పైనే ఉన్నాయి. కచ్చితంగా ఆస్కార్ వరిస్తుందని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ వేడుకల కోసం ఆర్ఆర్ఆర్ బృందం అమెరికా చేరుకుంది. -
భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏఆర్ రెహమాన్ కొడుకు
ప్రముఖ సంగీత దర్శకుడు,ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్‌కు భారీ ప్రమాదం తప్పింది. తమిళనాడులో జరిగిన ఓ ప్రమాదంలో అమీన్ తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఘటన జరిగి మూడు రోజులైనా ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేపోతున్నట్లు ఆమీన్ తెలిపాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ''నా టీంతో కలిసి ఓ మ్యూజిక్ వీడియో షూట్ చేస్తుండగా క్రేన్‌కు ఏర్పాటు చేసిన కొన్ని వస్తువులు.. భారీ లైట్లు కింద పడ్డాయి.ఈ ప్రమాదం జరిగిన సమయంలో నేను వాటికి కొద్ది దూరంలోనే ఉన్నాను. పైనుంచి కిందపడిన వాటిలో ఓ భారీ షాండిలియర్ కూడా ఉంది. ఏమాత్రం కాస్త అటుఇటు అయినా అవి మా తలపై పడేవి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో మా టీం అంతా షాక్‌కి గురయ్యాం. ఇప్పటికీ దాన్నుంచి తేరుకోలేకపోతున్నా. ఆ భగవంతుడు, తల్లిదండ్రులు, అభిమానుల ఆశీర్వాదం వల్లే ఆరోజు నేను ప్రమాదం నుంచి బయటపడగలిగాను. లేదంటే చాలా ఘోరం జరిగి ఉండేది'' అంటూ ఘటనకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్చేశాడు అమీన్. View this post on Instagram A post shared by “A.R.Ameen” (@arrameen) -
సానియా మీర్జా ఫేర్వెల్ ఈవెంట్ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
విడుదల తేదీలో మార్పులేదు
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం పాతికేళ్ల కలను సాకారం చేసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. లైకా ప్రొడక్షన్‌తో కలిసి ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. నటుడు విక్రమ్, జయంరవి, కార్తీ, శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, పార్థిబన్, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యరాయ్, త్రిష వంటి ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా రెండు భాగాలుగా రూపొందించిన ఈ చిత్రం తొలిభాగం గత ఏడాది విడుదలై విశేష ప్రేక్షక ఆదరణ పొందిన విషయం తెలిసిందే. దీంతో రెండవ భాగంపై మరింత అంచనాలు నెలకొన్నాయి. రెండవ భాగం 2023 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు తొలిభాగం విడుదల సమయంలోనే ప్రకటించారు. అయితే తాజాగా గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీంతో చిత్ర విడదలపై క్లారిటీ ఇచ్చేవిధంగా చిత్రం మేకింగ్ వీడియోలు చిత్ర వర్గాలు విడుదల చేశారు. అందులో పొన్నియిన్ సెల్వన్–2 చిత్రం ముందుగా ప్రకటించిన విధంగానే ఏప్రిల్ 28న విడుదలవుతుందని స్పష్టం చేశారు. చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఈనెల, 30 లేదా ఏప్రిల్ 5న స్థానిక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పొన్నియిన్ సెల్వన్–2లో ఆరుపాటలు ఉంటాయని, ఇందులో ఆదిత్యా కరికాలన్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన శత్రు వర్గాలు కుట్రపన్ని ఆయన్ని ఘోరంగా చంపే సన్నివేశాలు, ఐశ్వర్యారాయ్ రహస్య సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని పేర్కొన్నారు. తొలిభాగం కంటే రెండవ భాగం మరింత ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని అంటున్నారు. -
తనయుడితో ఏఆర్ రెహమాన్ స్టెప్స్!
తమిళసినిమా: నటులు తమ వారసులతో కలిసి ఆడి పాడటం కొత్తేమీ కాదు. అయితే ఓ దిగ్గజ సంగీత దర్శకుడు తన వారసుడితో కలిసి స్టెప్స్ వేయడమే విశేషం. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మమన్ తన తనయుడితో కలిసి ఒక ప్రమోషన్ సాంగ్‌లో స్టెప్స్ వేయడం ఇంకా విశేషం. ఈయన గతంలో విజయ్ హీరోగా నటించిన బిగిల్ చిత్రం ప్రమోషన్ కోసం సింగ పెన్నే అనే పాటలో నటించడంతో పాటు పలు ప్రైవేట్ ఆల్బంలలో నటించిన విషయం తెలిసిందే. అంతే కాదు సంగీత దర్శకుడు, గీత రచయిత అయిన ఈయన నిర్మాత కూడా. అంతేకాదు త్వరలో దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈయన వారసుడు అమీన్ కూడా ఇప్పుడు సంగీత దర్శకుడిగా తండ్రి బాటలో పయనిస్తున్నాడు. ప్రస్తుతం ప్రైవేట్ ఆల్బంలకు సంగీతాన్ని అందిస్తున్న అమీన్ త్వరలోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవబోతున్నట్లు సమాచారం. ఇకపోతే సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న ఏఆర్.రెహ్మమన్ ప్రస్తుతం తన తనయుడు అమీన్‌తో కలిసి ఒక ప్రమోషన్ సాంగ్‌లో నటించనున్నాడట. ఇందులో తనయుడితో కలిసి స్టెప్స్ వేసే పనిలో ఉన్నారని టాక్. నటుడు శింబు, గౌతమ్ కార్తీక్ కలిసి నటిస్తున్న చిత్రం పత్తు తల. చిల్లన్ను ఒరు కాదల్ చిత్రం ఫేమ్ కృష్ణ చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 30వ తేదీ విడుదలకు ముస్తాబవుతున్నట్లు సమాచారం. దీనికి ఏఆర్.రెహ్మమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రమోషన్ సాంగ్‌ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఏఆర్.రెహ్మమన్తో కలిసి ఆయన తనయుడు అమీన్ నటిస్తున్నారు. ఈ ప్రమోషన్ సాంగ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. -
నెట్టింట వైరల్‌గా మారిన శింబు లేటెస్ట్ సాంగ్..
సంచలనానికి మారుపేరు నటుడు శింబు. ఈయన ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా అభిమానులు మాత్రం తలకెక్కించుకుంటారు. ఇకపోతే శింబు ఇటీవల వరుస విజయాలతో మంచి జోరులో ఉన్నారు. మహానాడు, వెందు తనిందది కాడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా పత్తు తల చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నటి ప్రియా భవాని శంకర్ కథానాయకి. గౌతమ్ కార్తీక్ ముఖ్య పాత్ర పోషించారు. స్టూడియో గ్రీన్, పెన్ స్టూడియో సంస్థలు నిర్మిస్తున్న చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా తాజాగా శింబు 40వ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానుల్లో పండగ వాతావరణమే నెలకొంది. శింబు ఫొటోలతో ఎస్టేక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పొత్తుల చిత్రంలోని నమ్మి సత్తం అనే లిరికల్ వీడియోను ఏఆర్ రెహా్మన్ ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అభిమానులను ఖుషీ చేస్తోంది. -
ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం, టెక్నీషియన్ మృతి
స్వర మాంత్రికుడు, లెజెండరి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టెక్నీషియన్ మృతి చెందినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. వివరాలు.. చెన్నైలోని రెహమాన్ పంచతాన్ రికార్డింగ్ స్టూడియోలో ఇటీవల ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా లైట్ మెన్ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. లైట్ బిగిస్తుండగా ఆయనకు షాక్ తగలడంతో కిందపడి మృతి చెందినట్లు పలు తమిళ వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి. చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ స్టూడియో ద్వారా రెహమాన్ లైవ్ షోలు, కన్సర్ట్లు చేస్తారు. చెన్నైలో తన ఇంటిలోనే ఈ స్టూడియోను నిర్వహిస్తున్నారు. కాగా చాలా గ్యాప్ తర్వాత రెహమాన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది వచ్చిన విక్రమ్ కోబ్రా, లైఫ్ ఆఫ్ ముత్తు, పొన్నియన్ సెల్వన్ పార్ట్-1కు సంగీతం అందించారు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్-2తో పాటు తమిళంలో పలు చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చదవండి: శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడంపై వివరణ ఇచ్చిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని -
పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది.. ఆ కుటుంబం విషయంలో ఇది అక్షరసత్యం
పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది అనేది సామెత కావొచ్చు. ఏఆర్.రెహ్మాన్ కుటుంబం విషయంలో ఇది అక్షరసత్యం. ఆ కుటుంబానికి సంగీతం ఒక వరం. ఏఆర్.రెహ్మాన్ తండ్రి శేఖర్ సంగీత కళాకారుడు. దీంతో ఆయన కుటుంబం సంగీత ఆనందనిలయంగా మారింది. ఏఆర్.రెహ్మాన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. భరతమాత ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన ఆస్కార్ నాయకుడు ఆయన. రెహ్మాన్ సోదరీమణులు, పిల్లలు సంగీత సేవకులే. ఏఆర్.రెహ్మాన్ రూపొందించిన వందేమాతరం ఆల్బమ్ జాతీయ గీతంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోదరి ఇశ్రత్ కాత్రి కూడా ఆయన అడుగు జాడల్లోనే సంగీత పయనం చేస్తున్నారు. అన్నయ్య సంగీత దర్శకత్వంలో ఇప్పటికే పాడుతున్న ఇశ్రత్ కాత్రి సంగీత దర్శకులుగానూ అవతారం ఎత్తారు. చిత్రాలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్‌లకు సంగీతాన్ని అందిస్తున్నారు. అలా తాజాగా ఎందయుమ్ చారుమతి మగిళ్ందు కులావి అనే కవి భారతీయార్ కవితా పదాలతో వందేమాతరం అనే ఆల్బమ్‌ను తనదైన శైలిలో రూపొందించారు. ఈ పాటకు స్వరాలు సమకూర్చడమే కాకుండా పాడి, నటించి స్వయంగా రూపొందించడం విశేషం. ఇది మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భారతదేశం ఖ్యాతిని కీర్తించే ఆల్బమ్‌గా ఉంటుందని ఇశ్రత్ కాత్రి తెలిపారు. ప్రముఖ దర్శకుడు మాదేశ్ దర్శకత్వం వహించిన ఈ ఆల్బమ్‌కు గురుదేవ్ చాయాగ్రహణం, దినేష్ పొన్రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. దీన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆల్బమ్‌ను దేశానికి అందించడం తన కృతజ్ఞతతో కూడిన బాధ్యత అని సంగీత దర్శకులు ఇశ్రత్ కాత్రి పేర్కొన్నారు. -
ఇది చారిత్రాత్మక విజయం: ఆర్ఆర్ఆర్ టీంకి మెగాస్టార్ విషెస్
అంతర్జాయతీయ స్థాయిలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్. అయితే తర్వాత స్థానంలో ఉండే మరో ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు. ఈ రెండు అవార్డులను చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రధానం చేస్తుంటారు. కేవలం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీలలోని బెస్ట్ సెలబ్రెటీలను ఎంపిక చేసి ఈ అవార్డులను అందచేస్తారు. And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie pic.twitter.com/CGnzbRfEPk — RRR Movie (@RRRMovie) January 11, 2023 తాజాగా ఈ గోల్డెన్ గోబ్ అవార్డు మన ఇండియన్ సినిమా గెలుచుకోవం విశేషం. కాగా ఈ అవార్డును గెలిచిన తొలి ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కింద గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఈ అవార్డును ఎమ్ఎమ్ కీరవాణి అందుకున్నారు. అంతర్జాతీయ స్టేజ్‌పై ఈ అవార్డు ప్రకటించగా ఆర్ఆర్ఆర్ టీం అంత పట్టనంత ఆనందంలో తేలిపోయింది. ఇక ఈ అవార్డును అందుకున్న కీరవాణికి, ఆర్ఆర్ఆర్ టీంకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ఎంత అద్భుతం. ఇదో చారిత్రాత్మక విజయం. What a Phenomenal, Historic Achievement !!!! 👏👏👏👏 Golden Globes Best Original Song - Motion Picture Award to @mmkeeravaani garu !! Take a Bow!🙏 Heartiest Congratulations Team @RRRMovie & @ssrajamouli !! India is proud of you! 🎉🎉 #NaatuNaatu 🕺🕺 pic.twitter.com/gl7QjMkJtZ — Chiranjeevi Konidela (@KChiruTweets) January 11, 2023 బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటకు గానూ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఎమ్ఎమ్ కీరవాణిగారికి శతకోటి వందనాలు. అత్యున్నత చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ టీం, రాజమౌళికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాటు నాటు పాటను చూసి ఇండియా గర్వపడుతుంది’ అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. అలాగే ఆస్కార్ ఆవార్డు గ్రహిత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా ఆర్ఆర్ఆర్ టీంకు శభాకాంక్షలు తెలిపారు. ఇదో అద్భతం.. నమ్మశక్యం కానిది.. ఇండియా తరుపున.. ఇండియన్ అభిమానుల తరుపున కీరవాణి గారికి శుభకాంక్షలు. అలాగే రాజమౌళి గారికి, ఆర్ఆర్ఆర్ టీంకు కూడా కంగ్రాట్స్’ ట్వీట్ చేశారు. Incredible ..Paradigm shift🔥👍😊👌🏻 Congrats Keeravani Garu 💜from all Indians and your fans! Congrats @ssrajamouli Garu and the whole RRR team! https://t.co/4IoNe1FSLP — A.R.Rahman (@arrahman) January 11, 2023 -
దర్గాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పూజలు
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇవాళ ఏపీలో పర్యటించారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయంలో జరిగిన సుప్రభాత సేవలో పెద్ద కుమార్తె ఐశ్వర్యతో కలిసి వచ్చారు. అనంతరం తలైవా అమీన్ పీర్ దర్గాలో కూడా ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు ఆస్కార్ అవార్డు పొందిన సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ కూడా దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రజనీకాంత్ ప్రత్యేక తలపాగాతో తెల్లటి కుర్తా ధరించి కనిపించారు. రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబర్ 12న తన 72వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ అతిథి పాత్రలో లాల్ సలామ్ అనే ప్రాజెక్ట్‌లో కూతురితో కలిసి నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి విషు విశాల్, విక్రాంత్‌లు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ తన కూతురుతో కలిసి నటించడం ఇదే తొలిసారి. మరోవైపు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్‌తో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, వసంత్ రవి, యోగి బాబు, రమ్య కృష్ణన్, వినాయకన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్.. ఆ తర్వాత దర్గాకు కూడా..
సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌తో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయం వెలుపలు రజనీకాంత్‌ను చూడటానికి భక్తులు ఉత్సాహం చూపారు. తిరుమల శ్రీవారిని దర్శనం అనంతరం నేరుగా రజనీకాంత్ కడపకు వెళ్లారు. అక్కడ కొలువైన అమీన్‌పీర్ దర్గాను ఆయన దర్శించుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్‌తో పాటు రజనీ దర్గాను సందర్శించారు. -
ఏఆర్ రెహమాన్ సంగీత బాణీలకు సలామ్ చేసిన ఐశ్వర్య
తమిళసినిమా: ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇటీవల విడుదల అయిన పొన్నియిన్ సెల్వన్ త్రంతో తనకు తానే సాటి అని మరోసారి నిరపించుకున్నారు. చేతిలో పలు చిత్రాలతో బిజీగా ఉన్న రెహమాన్ ప్రస్తుతం లాల్ సలాం సినిమాకి సంగీతం అందించడంలో నిమగ్నమయ్యారు. సపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించనున్న చిత్రం ఇది. ఆయన పెద్ద కతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈమె 2012లో ధనుష్, శృతిహాసన్ జంటగా నటింన 3 త్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆ తరువాత గౌతమ్ కార్తీక్ హీరోగా వై రాజా వై చిత్రం చేశారు. మళ్లీ తాజాగా లాల్ సలాం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించనున్నారు. ఈ చిత్రం ఈనెల 5వ తేదీన పూజా కార్యక్రవలతో ప్రారంభమైంది. ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఏఆర్.రెహమాన్ సంగీత బాణీలకు దర్శకురాలు ఐశ్వర్య మైమర పోతూ సలామ్ చేశారు. ఆ వీడియోను ఏఆర్ రెహవన్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా లాల్ సలాం చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. లైకా ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. Jamming with the most promising female Director @ash_rajinikanth for #lalsalaam in mumbai.#தமிழ் pic.twitter.com/Qg83tefxxv — A.R.Rahman (@arrahman) November 25, 2022 -
విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' నుంచి లిరికల్ సాంగ్ అవుట్
విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్స్ డ్రామా మట్టి కుస్తీ. హీరో రవితేజ, విష్ణు విశాల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి చల్ చక్కని చిలక.. చిరునవ్వుల చక్కెర గుళిక.. అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరణ్ స్వరపరచిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా హేమచంద్ర పాడారు.